
అందమైన ఫొటోలు షేర్ చేసిన హార్దిక్ పాండ్యా (PC: Hardik Pandya Twitter)
Hardik Pandya Natasa Stankovic Viral Pics: అందమైన ఫొటోలతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ‘‘పెయింటెడ్ ఇన్’’ లవ్ అంటూ భార్య, కుమారుడితో ఉన్న దృశ్యాలు పంచుకున్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టు.. వాలంటైన్స్ డే సందర్భంగా సతీమణి నటాషా స్టాంకోవిక్‌కు మర్చిపోలేని బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో మరోసారి భార్యను వివాహమాడాడు హార్దిక్. తమ మూడేళ్ల కుమారుడు అగస్త్య సహా బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆమెతో మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివాడు.
ఈ క్రమంలో ఇప్పటికే వైట్‌వెడ్డింగ్ థీమ్ సహా నటాషాతో కలిసి ఏడడుగులు నడిచిన ఫొటోలను పంచుకున్నాడు ఈ స్టార్ ఆల్‌రౌండర్. తాజాగా మెహందీ, హల్దీ(పసుపు) ఫంక్షన్ ఫొటోలు షేర్ చేయగా అవి కూడా వైరల్ అవుతున్నాయి.
గులాబీ, తెలుపు రంగుల మేళవింపుతో కూడిన కుర్తా పైజామాలో హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్యతో కలిసి ట్విన్నింగ్ చేయగా.. నటాషా పసుపు వర్ణం ప్రధానంగా ఉన్న మల్టీకలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ ఫొటోలకు గంటలోపే మిలియన్‌కు పైగా లైకులు వచ్చాయి.
అందమైన జంట అంటూ తోటి క్రీడాకారులు, అభిమానులు హార్దిక్ పాండ్యా దంపతులను మరోసారి విష్ చేస్తున్నారు. అమ్మానాన్నలతో క్యూట్ అగస్త్య.. కలకాలం వర్థిల్లు అంటూ వీరి కుమారుడిని ఆశీర్వదిస్తున్నారు. ముచ్చటైన కుటుంబం అని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
కాగా సెర్బియా మోడల్, నటి నటాషాను ప్రేమించిన హార్దిక్ పాండ్యా 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు జన్మించాడు. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా వీరి వివాహం జరగడంతో మూడేళ్ల తర్వాత ఇలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు హార్దిక్.
గతేడాది కెరీర్‌లో ఉన్నత స్థితికి చేరుకున్న ఈ ఆల్‌రౌండర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా తన భార్య కలను నెరవేర్చాడు. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో తిరిగి జట్టుతో కలవనున్న హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ఐపీఎల్-2023తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా మరింత బిజీ కానున్నాడు.
చదవండి: ind Vs Aus: స్వదేశానికి పయనం.. అవమానించారు కాబట్టే అంటున్న గిల్‌క్రిస్ట్!!
Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment