
జైపూర్ : టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి సనయ టాంకరివాలాతో కరుణ్ వివాహం ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం రాత్రి వివాహబంధంతో ఒకటైయ్యారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను కరుణ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ నూతన జంటకు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యార్, అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ ఆరోన్ వీరి విహహానికి హాజరయ్యాడు. కాగా కెరీర్‌లో కేవలం ఆరు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చిన కరుణ్.. ట్రిపుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఫాం కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా తన ప్రేయసిని వివాహం చేసుకుని రెండో ఇన్సింగ్స్‌ను ప్రారంభించాడు.
Comments
Please login to add a commentAdd a comment