టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ కరుణ్ నాయర్. అయితే కరుణ్‌కు సరైన అవకాశాలు రాక కొంత కాలంలోనే కనుమరుగై పోయాడు. తాజాగా అతను భీకర ఫామ్‌ను ప్రదర్శిస్తూ మరోసారి టీమిండియాలో చోటే తన లక్ష్యమని అంటున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లో డబుల్ సెంచరీ చేసిన కరుణ్.. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ఓ లోకల్ టోర్నీలో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు.
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో కరుణ్ వరుసగా విధ్వంసాలు సృష్టిస్తున్నాడు. రెండ్రోజుల కిందట మెరుపు సెంచరీతో కదంతొక్కిన కరుణ్.. నిన్న హుబ్లి టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో కరుణ్.. ఓ సెంచరీ, మూడో హాఫ్ సెంచరీల సాయంతో 354 పరుగులు చేశాడు.
హుబ్లి టైగర్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద శతకం (36 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదడంతో 165 పరుగులు చేసింది. అనంతరం జగదీశ సుచిత్ (4-0-14-4) చెలరేగడంతో హుబ్లీ టైగర్స్ 109 పరుగులకే ఆలౌటై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment