
ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసే భారత జట్టుకు దేశవాలీ స్టార్ క్రికెటర్ కరుణ్ నాయర్ (భారత జట్టుకు) ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. కరుణ్‌ను నేరుగా భారత జట్టులోకి కాకుండా తొలుత భారత్-ఏ జట్టుకు ఎంపిక చేస్తారని సమాచారం. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్-ఏ ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడుతుంది.
ఈ రెండు మ్యాచ్‌లకు కరుణ్‌ను ఎంపిక చేసి, ఇక్కడ సత్తా చాటితే టీమిండియాకు ఎంపిక చేయాలని భారత్ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనకు, దానికి ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లకు భారత జట్ల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. కరుణ్ విషయంలో సెలెక్టర్లు సానుకూలంగా ఉన్నారని టాక్ నడుస్తుంది.
మరోవైపు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. రోహిత్ న్యూజిలాండ్, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ జట్టు నుంచి రోహిత్‌ను తప్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తాజాగా వెలువడిన రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. తాజాగా జరిగిన సెలెక్టర్ల సమావేశంలో రోహిత్‌నే ఇంగ్లండ్ టూర్‌కు కెప్టెన్‌గా కొనసాగించాలని డిసైడ్ చేశారట.
కాగా, ఐపీఎల్ 2025 తర్వాత భారత క్రికెట్ జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జూన్ 20న జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌ను ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగుతాయి. ఇంగ్లండ్ లయన్స్, ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ల కోసం మే చివరి వారంలో భారత జట్లను ప్రకటించే అవకాశం ఉంది.
అరివీర భయంకర ఫామ్‌లో కరుణ్
కరుణ్ నాయర్ దేశవాలీ సీజన్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ముగిసిన రంజీ సీజన్‌లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి కరుణ్.. విదర్భ జట్టు చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుమందు కరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన కరుణ్ 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. కరుణ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు.