Karun Nair
-
Ranji Trophy Semis-2 Day 1: రాణించిన విదర్భ బ్యాటర్లు
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఘనాపాఠి జట్టయిన ముంబైకి రెండో సెమీఫైనల్లో తొలిరోజే విదర్భ బ్యాటర్లు గట్టి సవాల్ విసిరారు. ముంబై బౌలర్లు సగం (5) వికెట్లు పడగొట్టినప్పటికీ ఒకే రోజు విదర్భ 300 పైచిలుకు స్కోరు చేసింది. టాపార్డర్‌లో ధ్రువ్ షోరే (109 బంతుల్లో 74; 9 ఫోర్లు), మిడిలార్డర్లో దానిశ్ మాలేవర్ (157 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (70 బంతుల్లో 45; 6 ఫోర్లు), యశ్ రాథోడ్ (86 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) సమష్టిగా కదంతొక్కారు. టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగిన విదర్భకు మంచి ఆరంభమైతే దక్కలేదు.అథర్వ (4) వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ ధ్రువ్ షోరే, పార్థ్ రేఖడే (23; 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. వన్డేలాగే ఆడిన ధ్రువ్ 67 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వందకు సమీపించింది. ఈ దశలో 93 పరుగుల వద్ద పార్థ్‌ను శివమ్ దూబే అవుట్ చేశాడు. దానిష్ క్రీజులోకి రాగా... తొలి సెషన్లోనే జట్టుస్కోరు వంద దాటింది. ధ్రువ్, దానిశ్ విదర్భ ఇన్నింగ్స్‌లో మరో 50 పైచిలుకు భాగస్వామ్యాన్ని జోడించింది.జట్టు స్కోరు 144 పరుగుల వద్ద ధ్రువ్ షోరేను షమ్స్ ములానీ పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చి కరుణ్ నాయర్, యశ్ రాథోడ్‌లు కూడా ముంబై బౌలర్లను చక్కగా ఎదుర్కోవడంతో భారీస్కోరుకు బాట పడింది. ఆట నిలిచే సమయానికి యశ్, కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరు కలిసి అబేధ్యమైన ఆరో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, షమ్స్ ములానీ చెరో 2 వికెట్లు తీశారు.స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) ఆనంద్ (బి) రాయ్స్టన్ డయస్ 4; ధ్రువ్ షోరే (సి) రహానే (బి) ములానీ 74; పార్థ్ రేఖడే (సి) సూర్యకుమార్ (బి) దూబే 23; దానిశ్ (సి) ఆనంద్ (బి) ములానీ 79; కరుణ్ నాయర్ (సి) ఆనంద్ (బి) దూబే 45; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 47; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 13; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (88 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 308. వికెట్ల పతనం: 1–39, 2–93, 3–144, 4–222, 5–261. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 14–0–57–0, మోహిత్ 14–2–61–0, రాయ్స్టన్ డయస్ 11–2–26–1, తనుశ్ కొటియాన్ 22–0–78–0, శివమ్ దూబే 9–1–35–2, షమ్స్ ములానీ 18–3–44–2. -
కరుణ్ నాయర్ సెంచరీ, దూబే మెరుపులు.. సెమీ ఫైనల్లో విదర్భ
రంజీ ట్రోఫీ 2024-25(Ranji Trophy)లో విదర్భ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్-2లో తమిళనాడుతో తలపడ్డ విదర్భ భారీ విజయం సాధించింది. నాగ్‌పూర్‌లో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ఏకంగా 198 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.కరుణ్ నాయర్ శతకంకాగా సొంత మైదానం విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో శనివారం టాస్ గెలిచిన అక్షయ్ వాడ్కర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అథర్వ టైడే(0), ధ్రువ్ షోరే(26)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య ఠాక్రే(5) ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మిడిలార్డర్లో డానిశ్ మాలేవర్(75) అర్ధ శతకంతో రాణించగా.. కరుణ్ నాయర్(Karun Nair) శతక్కొట్టాడు.హర్ష్ దూబే హాఫ్ సెంచరీమొత్తంగా 243 బంతులు ఎదుర్కొన్న కరుణ్ 122 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే(Harsh Dube) హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. ఈ క్రమంలో విదర్భ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. మొహమ్మద్ రెండు, అజిత్ రామ్, మొహమద్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తమిళనాడు బ్యాటర్లు విఫలంఅనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మొహమద్ అలీ(4), నారాయణ్ జగదీశన్(22)తో పాటు.. సాయి సుదర్శన్(7), బూపతి కుమార్(0) విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆండ్రీ సిద్దార్థ్(65) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హర్ష్ దూబే అతడిని పెవిలియన్‌కు పంపాడు.మిగతావాళ్లలో ప్రదోష్ పాల్(48), సోనూ యాదవ్(32) మాత్రం ఫర్వాలేదనిపించగా.. తమిళనాడు 225 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్, నచికేత్ భూటే రెండేసి వికెట్లు, హర్ష్ దూబే ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కెప్టెన్ రాణించినా..ఈ క్రమంలో 128 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విదర్భ 272 పరుగులకు ఆలౌట్ అయింది. ఈసారి యశ్ రాథోడ్(112) శతకంతో చెలరేగగా.. హర్ష్ దూబే మరోసారి హాఫ్ సెంచరీ(64) సాధించాడు. ఇక తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయి కిషోర్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం 401 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు.. మంగళవారం నాటి ఆటలో భాగంగా 202 పరుగులకే కుప్పకూలింది. ప్రదోష్ పాల్(53), సోనూ యాదవ్(57) అర్ధ శతకాలతో రాణించగా.. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే, నచికేత్ భూటే మూడేసి వికెట్లతో చెలరేగి తమిళనాడు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. మరోవైపు ఆదిత్య ఠాక్రే, అక్షయ్ వాఖరే చెరో వికెట్ తీశారు.సెమీస్ పోరులో ముంబైతోఈ నేపథ్యంలో 198 పరుగులతో తమిళనాడును చిత్తుచేసిన విదర్భ సెమీస్ చేరుకుంది. శతక వీరుడు కరుణ్ నాయర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సీజన్లో విదర్భ ఇప్పటికి ఎనిమిదింట ఏడు విజయాలు సాధించడం విశేషం. ఇక విదర్భ ఫైనల్ బెర్తు కోసం ముంబైతో తలపడుతుంది. మరోవైపు.. సౌరాష్ట్రపై గెలుపొందిన గుజరాత్ కూడా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. జమ్మూ కశ్మీర్- కేరళ జట్ల మధ్య మ్యాచ్‌లో విజేతతో గుజరాత్ అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్‌లో ముంబై119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
మళ్లీ శతక్కొట్టిన కరుణ్ నాయర్.. ఈసారి..!
దేశవాలీ క్రికెట్లో విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో (VHT) ఆకాశమే హద్దుగా చెలరేగిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ (Ranji Trophy) అదే స్థాయిలో రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేసిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై బాధ్యతాయుతమైన సెంచరీతో (122) మెరిశాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్ శతక్కొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 353 పరుగులకు ఆలౌటైంది. జట్టు కష్టాల్లో (44/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన కరుణ్.. దనిశ్ మలేవార్ (75), హర్ష్ దూబేతో (69) కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విదర్భ ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురూ మినహా ఎవరూ రాణించలేదు. అథర్వ తైడే 0, ధృవ్ షోరే 26, ఆధిత్య థాకరే 5, యశ్ రాథోడ్ 13, అక్షయ్ వాద్కర్ 24, భూటే 2, యశ్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ 2, అజిత్ రామ్, మొహమ్మద్ అలీ ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు మూడో రోజు తొలి సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ప్రదోశ్ రంజన్పాల్ (51), సోనూ యాదవ్ (24) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ అలీ 4, ఎన్ జగదీశన్ 22, సాయి సుదర్శన్ 7, భూపతి కుమార్ 0, విజయ్ శంకర్ 22, ఆండ్రీ సిద్దార్థ్ 65, సాయికిషోర్ 7, మొహమ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు. విదర్భ బౌలర్లలో ఆధిత్య ఠాకరే 4 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ 2, నిచికేత్ భూటే, హర్ష్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 133 పరుగులు వెనుకపడి ఉంది.గతేడాది మొత్తం కొనసాగిన కరుణ్ హవాకరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ సీజన్లోనూ రెచ్చిపోయి ఆడాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ చెలరేగి ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఫామ్ పతాకస్థాయికి చేరింది. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేశాడు. -
Karun Nair: ఇంత గొప్పగా ఆడినా టీమిండియాలో చోటివ్వరా..? మతి పోయే గణాంకాలు..!
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బారత జట్లను కొద్ది రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్ల ప్రకటనకు ముందు భారత క్రికెట్ సర్కిల్స్‌లో ఓ పేరు బలంగా వినపడింది. అదే కరుణ్ నాయర్. ఈ విదర్భ ఆటగాడు తాజాగా ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో నమ్మశక్యం కాని రీతిలో పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్‌రేట్‌తో 779 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇంత గొప్ప ప్రదర్శన తర్వాత ఏ ఆటగాడైనా జాతీయ జట్టులో చోటు ఆశించడం సహజం. అయితే భారత సెలెక్టర్లు కరుణ్ అద్భుత ప్రదర్శనను పక్కకు పెట్టి ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి కానీ అతన్ని ఎంపిక చేయలేదు.కరుణ్ కేవలం విజయ్ హజారే ట్రోఫీ ప్రదర్శనలతోనే భారత జట్టులో చోటు ఆశించాడనుకుంటే పొరబడినట్లే. కరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్ గత సీజన్ రంజీ ట్రోఫీలోనూ రెచ్చిపోయి ఆడాడు. గడిచిన ఎడిషన్‌లో కరుణ్ 17 ఇన్నింగ్స్‌ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ విశేషంగా రాణించాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.గతేడాది ఇంత ఘన ప్రదర్శనలు చేసిన కరుణ్ భారత జట్టులో చోటు ఆశించడం సహజమే. అయితే కరుణ్ కలలు కన్నట్లు భారత జట్టులో చోటు లభించకపోగా ఎలాంటి ముందస్తు హామీ కూడా లభించలేదు. ఇప్పుడు కాకపోతే త్వరలోనైనా సెలెక్టర్లు అతన్ని కరుణిస్తారా అంటే అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి జాతీయ జట్టుకు ఎంపిక కాని క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది కరుణ్ నాయరే అని చెప్పాలి. టీమిండియాకు ఆడిన అనుభవం లేక అతన్ని పరిగణలోని తీసుకోవడం లేదా అంటే అలాంటదేమీ లేదు. కరుణ్ ఎనిమిదేళ్ల కిందట టీమిండియా తరఫున ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, కరుణ్ మాత్రమే ట్రిపుల్ సాధించారు. ఇంత టాలెంట్ కలిగి ఉండి కూడా కరుణ్ జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడం నిజంగా చింతించాల్సిన విషయమే. -
మళ్ళీ పాత పాటే పాడిన బీసీసీఐ సెలక్టర్లు
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్, దుబాయ్-పాకిస్తాన్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత భారత్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగడం, విదేశీ పర్యటనలో కొంతమంది స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం తర్వాత భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం పది మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో దేశవాళీ పోటీల్లో అందరూ తప్పనిసరిగా ఆడాలని సిఫార్సు చేసింది. భారత్ జట్టు ఎంపిక దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల తర్వాత జరిగిన భారత్ జట్టు ఎంపిక విషయంలో ఈ నిబంధనలేవీ పాటించినట్లు కనిపించలేదు. కంటితుడుపు ప్రకటనలు తప్ప దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కి మరో మరు మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు.కరుణ్ నాయర్‌కు మొండిచేయి33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతూ ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 752 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్లో నాయర్ బ్యాటింగ్ సగటు 752.00. నాయర్ ఏడు ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. విదర్భకు సారధి అయిన నాయర్ జట్టు ఫైనల్ కి చేరడంలో కీలక భూమిక వహించాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ దేశవాళీ పోటీల్లో వన్డే ఫార్మాట్ లో జరుగుతుండటం ఇక్కడ గమమనించాల్సిన మరో ముఖ్యాంశం.నాయర్ పై సచిన్ ప్రశంసల జల్లుజట్టు ఎంపికకు కొద్ది గంటల ముందు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ లో నాయర్ ప్రదర్శన పై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. " 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయి లో రాణించాలంటే అపారమైన కృషి, పట్టుదల అవసరం. ఇదే రీతిలో ఆడి మరిన్ని ఘన విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నా!, అని సచిన్ స్వయంగా కరుణ్ నాయర్ కి ట్వీట్ చేసాడు. అయితే భారత్ జట్టు ఎంపిక సమయంలో ఇవేమి లెక్కలోకి రాలేదు.అగార్కర్ కంటి తుడుపు మాటలు జట్టు ఎంపిక అనంతరం భారత్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాయర్ ప్రస్తుత అద్భుతమైన ఫామ్ ను, అత్యుత్తమ గణాంకాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుందని చెబుతూనే, జట్టు సెలక్షన్ కమిటీ చాలా కఠినమైన పరీక్షను ఎదుర్కొందని వివరించాడు. “ 750-ప్లస్ సగటు తో పరుగులు సాధించడం మామూలు విషయం కాదు. అయితే మేము 15 మందితో కూడిన జట్టు ను మాత్రమే ఎంపిక చేయాలి. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు," అని తేల్చి చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, అయితే జట్టు సమతౌల్యం విషయాన్ని కూడా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివరించాడు. అంతర్జాతీయ అనుభవం మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న టోర్నమెంట్లో ఆడే క్రికెటర్ల పై ఎంతో ఒత్తిడి ఉండనుందని. ఈ కారణంగా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చామని వివరించాడు.రోహిత్, కోహ్లీలకు ఢోకా లేదుఊహించిన విధంగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ లను ఇంగ్లాండ్ సీరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా పిచ్ ల పై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ ల పై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసింది. అయితే అపార అనుభవం కారణంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వీరిద్దరి కి స్థానం కల్పించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అంతగా రాణించలేకపోయిన ఓపెనర్ శుభమన్ గిల్ మళ్ళీ జట్టులో స్థానము కల్పించడమే కాకా, వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. “గిల్ గతంలో శ్రీలంకలో జరిగిన సీరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల వ్యవహారశైలిని కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. జట్టుకి నాయకత్వం వహించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల పై ఎప్పుడూ ద్రుష్టి పెట్టాల్సిందే, ”అని అగార్కర్ చెప్పాడు.ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత్ జట్టు ఎంపిక అయితే పూర్తయింది. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. -
కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్
విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ములేపుతున్న కరుణ్ నాయర్(Karun Nair)ను టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు. దేశవాళీ వన్డే టోర్నమెంట్లో సత్తా చాటుతున్నప్పటికీ అతడిని కనికరించలేదు. కాగా విదర్భ కెప్టెన్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు శతకాల సాయంతో కరుణ్ నాయర్ ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇదొక అసాధారణ ప్రదర్శన అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(sachin Tendulkar) కూడా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.ఇక స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఓ అడుగు ముందుకేసి అతడికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాటు... చాంపియన్స్ ట్రోఫీ జట్టు(Champions Trophy Squad)లోనూ చోటివ్వాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రకటించిన జట్టులో కరుణ్ నాయర్‌కు మాత్రం చోటు దక్కలేదు.కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?ఈ విషయం గురించి అగార్కర్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. నిజంగానే అదొక ప్రత్యేకమైన, అద్భుతమైన ప్రదర్శన. దాని గురించి మా మధ్య చర్చ జరిగింది.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి జట్టులో చోటు ఇవ్వడం కష్టం. నలభైలకు దగ్గరపడుతున్న వాళ్లను మళ్లీ తీసుకోలేం. అయినా.. జట్టులో పదిహేను మంది సభ్యులకు మాత్రమే చోటు ఉంది. అలాంటపుడు ప్రతి ఒక్కరిని ఇందులో ఇరికించలేము.అయితే, అలాంటి ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సదరు ఆటగాడి గురించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఫామ్‌లేమి, గాయాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారతారు’’ అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. కాగా 33 ఏళ్ల కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఇంత వరకు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు.ఇక రాజస్తాన్‌లో జన్మించిన కరుణ్ నాయర్.. దేశవాళీ క్రికెట్లో గతంలో కర్ణాటకకు ఆడాడు. గతేడాది నుంచి విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సారథిగా, బ్యాటర్‌గా ఆకట్టుకుంటూ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తొలిసారి ఫైనల్‌కు చేరేలా చేశాడు. అందుకే వాళ్లకు వైస్ కెప్టెన్లుగా అవకాశంఇంగ్లండ్తో టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్, వన్డే సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయంపై శనివారం అగార్కర్ స్పందిస్తూ.. ‘‘డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. అయినా ప్రతి ఒక్కరూ కెప్టెన్ లేదంటే వైస్ కెప్టెన్ ఆప్షన్ కాబోరు. కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారిపైనే మేము దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఐదు టీ20, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం.. చాంపియన్స్ ట్రోఫీతో టీమిండియా బిజీ కానుంది. పాకిస్తాన్- యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
ఏడు ఇన్నింగ్స్‌లో 752 రన్స్.. అసాధారణం: సచిన్ టెండుల్కర్
భారత క్రికెటర్ కరుణ్ నాయర్(Karun Nair)పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ప్రశంసల వర్షం కురిపించాడు. ఏడు ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదడం గాలివాటం కాదని.. కఠోర శ్రమ, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాడు. కరుణ్ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని సచిన్ ఆకాంక్షించాడు.ఐదు సెంచరీల సాయంతోకాగా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో చాలా కాలం పాటు కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2023-24 సీజన్ నుంచి అతడు విదర్భకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy) సీజన్లో 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.యాభై ఓవర్ల ఫార్మాట్లో కరుణ్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా 752 పరుగులు రాబట్టాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. ఏడు ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా నిలవడం మరో విశేషం. ఇక కెప్టెన్‌గానూ కరుణ్ నాయర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. బ్యాటర్‌గా ఆకట్టుకుంటూనే సారథిగానూ సరైన వ్యూహాలతో విదర్భను తొలిసారి ఈ వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేర్చాడు.ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు టీమిండియా సెలక్టర్లు పిలుపునివ్వాలని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అతడిని ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ సైతం కరుణ్ నాయర్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో‘‘కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాల సాయంతో 752 పరుగులు.. ఇది అసాధారణ విషయం కరుణ్ నాయర్!.. ఇలాంటి ప్రదర్శనలు కేవలం ఒక్కరోజులోనే సాధ్యం కావు. ఇందుకు ఆట పట్ల అంకిత భావం, దృష్టి ఉండాలి. కఠిన శ్రమతోనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇదే తీరుగా ధైర్యంగా ముందుకు వెళ్లు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో’’ అని సచిన్ టెండ్కులర్ ‘ఎక్స్’ వేదికగా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం జట్టును ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టు వివరాలను వెల్లడించనున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీ ఆడతాడా? లేదా? అన్నది ఈ సందర్భంగా తేలనుంది.నా అంతిమ లక్ష్యం అదేఇక చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వాలంటూ టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బలంగా తన గొంతును వినిపించాడు. అయితే, మరో భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మాత్రం కరుణ్‌ను మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేదంటూ కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే.. పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ మాత్రం తనకు మరోసారి భారత్ తరఫున ఆడాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.‘‘దేశం తరఫున ఆడాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. నా కల కూడా ఇంకా సజీవంగానే ఉంది. అందుకే నేను ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నాను. ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియాలో అడుగుపెడతా. నా ఏకైక, అంతిమ లక్ష్యం అదే’’ అని కరుణ్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎనిమిదేళ్ల క్రితంకాగా 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ చివరగా 2017లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్ తరఫున ఆరు టెస్టులు ఆడిన కరుణ్ నాయర్ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి, ఇందులో త్రిబుల్ సెంచరీ(303) ఉంది. ఇక రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ కేవలం 46 పరుగులకే పరిమితమయ్యాడు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
ఫామ్‌లో ఉన్నంత మాత్రాన కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు: డీకే
విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్(Karun Nair) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. ఏడు ఇన్నింగ్స్‌లో అతడు నాటౌట్‌గా నిలవడం విశేషం.బ్యాటర్‌గా దుమ్ములేపుతూనే.. కెప్టెన్‌గానూ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో విదర్భను విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు చేర్చాడు. దేశీ వన్డే టోర్నీలో విదర్భ ఇలా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.అతడిని ఎంపిక చేయాలిఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో.. కరుణ్ నాయర్‌ను ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ క్రమంలో మరో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) మాత్రం భిన్నంగా స్పందించాడు. కరుణ్ నాయర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నా.. అతడిని ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేయడం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ కరుణ్ నాయర్ ఆడుతున్న తీరు అమోఘం. అతడు ఊహకు అందని రీతిలో పరుగుల వరద పారిస్తున్నాడు.ఫామ్‌లో ఉన్నంత మాత్రాన సెలక్ట్ చేయరుఅందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు అతడి గురించే చర్చిస్తున్నారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కరుణ్ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఎందుకంటే.. సెలక్టర్లు ఇప్పటికే టీమ్ గురించి తుది నిర్ణయానికి వచ్చి ఉంటారు.ఏదేమైనా కరుణ్ నాయర్ గొప్ప ఆటగాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలిగే ఇన్ ఫామ్ బ్యాటర్‌ను ఎవరు మాత్రం కాదనుకుంటారు. అతడు గనుక తిరిగి జట్టులోకి వస్తే నాకూ సంతోషమే’’ అని డీకే పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా కరుణ్ నాయర్ ఎంపికయ్యే అవకాశం లేదని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో జైసూ ఆడటం ఖాయం‘‘ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు జైస్వాల్‌కు విశ్రాంతినిచ్చారు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన అనంతరం ఈ యువ ఆటగాడికి తగినంత రెస్ట్ అవసరం.ఈ విషయంలో సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వందకు వంద శాతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడిస్తారు. వన్డేల్లో అరంగేట్రం కదా అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేయగలడు. ఇంగ్లండ్‌తో టీ20లలో ఆడనంత మాత్రాన అతడికి వచ్చే నష్టమేమీ లేదు’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో, టీ20లలో అదరగొడుతున్న జైస్వాల్ ఇంత వరకు వన్డేల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
కనికరం లేని కరుణ్ నాయర్.. విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ
వడోదర: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిన విదర్భ తుది పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో విదర్భ 69 పరుగుల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశ్ రాథోడ్ (101 బంతుల్లో 116; 14 ఫోర్లు, 1 సిక్స్), ధ్రువ్ షోరే (120 బంతుల్లో 114; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 34.4 ఓవర్లలో 224 పరుగులు జోడించారు. అనంతరం అత్యద్భుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణ్ నాయర్ (44 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మరో దూకుడైన ఇన్నింగ్స్‌తో చెలరేగగా... జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. 40 ఓవర్లు ముగిసేసరికి విదర్భ స్కోరు 254 కాగా... చివరి 10 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 126 పరుగులు సాధించింది! ముఖ్యంగా ముకేశ్ వేసిన 47వ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ కొట్టిన కరుణ్ నాయర్... రజనీశ్ గుర్బానీ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 4, 0, 6, 4, 4, 6 బాదాడు. ఒకదశలో 35 బంతుల్లో 51 వద్ద ఉన్న కరుణ్ తర్వాతి 9 బంతుల్లో 37 పరుగులు రాబట్టాడు. అనంతరం మహారాష్ట్ర కొంత పోరాడగలిగినా చివరకు ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో మహారాష్ట్ర 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి (101 బంతుల్లో 90; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకోగా... అంకిత్ బావ్నే (49 బంతుల్లో 50; 5 ఫోర్లు), నిఖిల్ నాయక్ (26 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. దర్శన్ నల్కండే, నచికేత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కర్ణాటక జట్టు ఇప్పటికే నాలుగుసార్లు విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. ఈ నాలుగు సందర్భాల్లోనూ కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఫైనల్లో ప్రత్యర్థి జట్టు విదర్భ కెప్టెన్‌గా తన పాత జట్టుపై సమరానికి సిద్ధమయ్యాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 1 అర్ధ సెంచరీతో ఏకంగా 752 పరుగులు సాధించిన నాయర్ తన టీమ్‌ను విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరం! -
CT 2025: కరుణ్ నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు సమయం ఆసన్నమవుతోంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే, ఈ ఐసీసీ టోర్నీకి భారత జట్టు ఎంపిక చేసే విషయంలో అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే టోర్నమెంట్ ముగిసే వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు సీనియర్ బ్యాట్స్‌మన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇద్దరూ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక చర్చనీయంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్ తన పరుగుల ప్రవాహం తో సెలెక్టర్ల పై ఒత్తిడి పెంచాడు. తాజాగా 24 ఏళ్ళ ఎడమచేతి వాటం కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ జాబితా లో చేరాడు. బుధవారం విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో హర్యానాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన నిలకడైన బ్యాటింగ్ తో పడిక్కల్ కర్ణాటక జట్టుకి ఫైనల్ బెర్త్ ని ఖాయం చేసాడు. పడిక్కల్ లిస్ట్-‘ఎ’ ఫార్మాట్ లో వరుసగా తన ఏడో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.కాగా హర్యానాతో 238 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక మొదటి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వికెట్‌ని కోల్పోయింది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన నుండి తిరిగి వచ్చిన పడిక్కల్ 86 పరుగులు సాధించడమే కాక స్మరణ్ రవిచంద్రన్ (76 పరుగులు )తో కలిసి మూడో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కర్ణాటక ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.కోహ్లీ రికార్డుని అధిగమించిన పడిక్కల్ఈ ఇన్నింగ్స్ లో భాగంగా పడిక్కల్ లిస్ట్ ఎ క్రికెట్లో 2000 పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. పడిక్కల్ 82.38 సగటుతో ఈ ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్లో కనీసం 2000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇదే అత్యధికం. మరో భారత్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (58.16), ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బ్యాటర్ మైఖేల్ బెవాన్ (57.86), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (57.05), దక్షిణాఫ్రికాకి చెందిన ఎబి డివిలియర్స్ (53.47) వంటి టాప్ బ్యాటర్‌ని పడిక్కల్ అధిగమించడం విశేషం.రోహిత్, కోహ్లీలకు మరో ఛాన్స్? ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ఎంపిక చేయడం ఖాయంగా కనబడుతోంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ లపై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో పరాజయం చవిచూడటమే కాక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుండి కూడా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పై భారత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దుబాయ్ పిచ్‌లు భారత్ బ్యాటర్లకి అనుకూలంగా ఉండే కారణంగా, ఎంతో అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ లను ఛాంపియన్స్ ట్రోఫీ కి తప్పనిసరిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లో వీరి ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తునడంలో సందేహం లేదు. చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
కరుణ్ నాయర్ ఐపీఎల్ ఆడుతున్నాడా..?
దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో పరుగుల వరద పారిస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఏ ఇద్దరు భారత క్రికెట్ అభిమానులు కలిసినా కరుణ్ నాయర్ గురించిన చర్చే నడుస్తుంది. 2022 డిసెంబర్లో డియర్ క్రికెట్.. మరో ఛాన్స్ ఇవ్వు అని ప్రాధేయ పడిన కరుణ్, ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ గణాంకాలు చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ టోర్నీలో కరుణ్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ చూసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు ఇతని గురించి లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతటి విధ్వంసకర బ్యాటర్ అయిన కరుణ్ అసలు ఐపీఎల్ ఆడుతున్నాడా లేదా అని గూగుల్ చేస్తున్నారు. ఆసక్తికరంగా కరుణ్‌ను ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో డీసీ కరుణ్‌ను 50 లక్షలకు సొంతం చేసుకుంది. కరుణ్ గతంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. కరుణ్‌కు 2013-22 వరకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఈ మధ్యకాలంలో అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 76 మ్యాచ్‌లు ఆడి 10 అర్ద సెంచరీల సాయంతో 1496 పరుగులు చేశాడు.వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ అయిన కరుణ్ కేవలం కొంతకాలం మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగాడు. తన మూడో మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తిరిగి ఏడేళ్ల తర్వాత కరుణ్ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్‌కు అవకాశాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కరుణ్ ఉన్న ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలో భారత జట్టులో పాగా వేయడం ఖాయం. కరుణ్ 2016-17 మధ్యలో భారత్ తరఫున 6 టెస్ట్‌లు, రెండు వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ మినహాయించి కరుణ్‌కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.కాగా, విజయ్ హజారే ట్రోఫీలో ఇవాళ (జనవరి 16) జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు. మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్.మహారాష్ట్రతో మ్యాచ్‌లో కరుణ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. విదర్భ ఓపెనర్లు దృవ్ షోరే (120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు), యశ్ రాథోడ్ (101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 116 పరుగులు) సెంచరీలు చేశారు. దృవ్, యశ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. తదనంతరం కరుణ్ నాయర్‌తో పాటు జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. -
మరోసారి రెచ్చిపోయిన కరుణ్ నాయర్.. ఈసారి..!
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో రికార్డు స్థాయిలో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.పేట్రేగిపోయిన కరుణ్మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్.ఓపెనర్ల శతకాలుఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర టాస్ గెలిచి విదర్భను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మహారాష్ట్ర ప్రత్యర్దిని బ్యాటింగ్ ఆహ్వానించి ఎంత తప్పు చేసిందో కొద్ది సేపటికే గ్రహించింది. విదర్భ ఓపెనర్లు మహారాష్ట్ర బౌలర్లను నింపాదిగా ఎదుర్కొంటూ సెంచరీలు చేశారు. దృవ్ షోరే 120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు.. యశ్ రాథోడ్ 101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 116 పరుగులు చేశారు. దృవ్, యశ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. యశ్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఆదిలో నిదానంగా బ్యాటింగ్ చేశాడు.45 ఓవర్ తర్వాత కరుణ్.. జితేశ్ శర్మతో కలిసి గేర్ మార్చాడు. వీరిద్దరూ చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 97 పరుగులు పిండుకున్నారు. జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక కరుణ్ మహోగ్రరూపం దాల్చాడు. తానెదుర్కొన్న చివరి 9 బంతుల్లో కరుణ్ 4 సిక్సర్లు, 3 బౌండరీలు బాదాడు. అంతకుముందు కరుణ్ 47వ ఓవర్లోనూ చెలరేగి ఆడాడు. ముకేశ్ చౌదరీ వేసిన ఈ ఓవర్లో కరుణ్ మూడు బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. మొత్తానికి విదర్భ బ్యాటర్ల ధాటికి మహారాష్ట్ర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముకేశ్ చౌదరీ 9 ఓవర్లు వేసి ఏకంగా 80 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు పడగొట్టాడు. సత్యజిత్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు. -
అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన టీమిండియాపై క్రికెట్ అభిమానుల విమర్శలు కొనసాగుతున్నాయి. జట్టు ఎంపికలో లోపాలు, ప్రధాన బ్యాటర్ల వైఫల్యం కారణంగానే 3-1తో ఓటమి ఎదురైందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకైనా సరైన జట్టును ఎంపిక చేయాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు.ఐదు శతకాలు.. కరుణ్ నాయర్ రికార్డుల మోతదేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఆరు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాలు బాదిన ౩౩ ఏళ్ళ ఈ ఆటగాడు సంచలనాత్మక ఫామ్‌తో దుమ్మురేపుతున్నాడు. తన కెరీర్ లోనే అద్భుతమైన ఫామ్‌తో టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) టోర్నమెంట్లో అతడిని ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.కాగా కరుణ్ నాయర్ చివరగా ఏడేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. ఇక విజయ్ హజారే టోర్నమెంట్ లో తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో 122*, 112, 111, 163*, 44* మరియు 112* స్కోర్లతో అతడు ఇటీవల రికార్డు నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులకు అవుట్ కావడానికి ముందు, నాయర్ వరుసగా ఆరు ఇన్నింగ్స్ లో అజేయంగా నిలిచి 542 పరుగులు సాధించి 'లిస్ట్ ఎ' టోర్నమెంట్లలో రికార్డును సృష్టించాడు.న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సాధించిన 527 పరుగుల నాటౌట్ రికార్డును నాయర్ తిరగ రాశాడు. కెప్టెన్ నాయర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో విదర్భ సెమీఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.నాయర్ అద్భుతమైన ప్రదర్శన మరోసారి అతని పేరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాయర్‌ను మళ్ళీ భారత్ జట్టులోకి తీసుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.ఇందులో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉండడం గమనార్హం. ఇంగ్లండ్‌తో 2016లో చెన్నై లో జరిగిన టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత నాయర్.. మరో మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. “నేను నాయర్ గణాంకాలను పరిశీలిస్తున్నాను. 2024-25లో అతడు ఆరు ఇన్నింగ్స్‌లు ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా నిలిచాడు, 120 స్ట్రైక్ రేట్‌తో 664 పరుగులు చేశాడు. అయినా నాయర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయడం లేదు. ఇది అన్యాయం” అని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించాడు. కాగా 2024లో నాయర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా రాణించాడు. 44.42 సగటుతో 1,466 పరుగులు సాధించాడు. అందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి, వీటిలో 202* అత్యధిక స్కోరు ఉంది. ఇది కాక నాయర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నార్తాంప్టన్‌షైర్‌తో ఆడి ఏడు మ్యాచ్‌ల్లో 48.70 సగటుతో 487 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్, కోహ్లీలను రంజీలు ఆడమంటున్నారు.. కానీ"చాలా మందిని కేవలం రెండు ఇన్నింగ్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరికొందరిని ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ జట్టు ఎంపికలో నాయర్ విషయంలో నియమాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? రోహిత్(Rohit Sharma), కోహ్లీ ఫామ్‌లో లేని విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇందుకోసం వారిద్దరూ మళ్ళీ రంజీ ఆడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ రంజీ ఆడుతూ పరుగులు చేస్తున్న వారిని ఎందుకు (సెలెక్టర్లు) విస్మరిస్తున్నారు?ట్రిపుల్ సెంచరీ తర్వాత నాయర్ ని ఎలా తొలగించారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. అతనిలాంటి ఆటగాళ్ల గురించి ఎవరూ మాట్లాడకపోవడం బాధాకరం. ఒకొక్క ఆటగాడికి ఒక్కొక్క నియమాలు" ఉన్నాయని హర్భజన్ వ్యాఖ్యానించాడు. "నాయర్ భారత్ జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్ళాడు కానీ అతనికి తుది జట్టులో చోటు దొరకలేదు. అందుకే మీరు అతడిని పక్కన పెడుతున్నారా?ఐదవ టెస్ట్ కోసం టీం మేనేజిమెంట్ వాస్తవానికి భారత్ నుండి ఒక ఆటగాడిని పిలిపించింది. బహుశా అతను హనుమ విహారి అని అనుకుంటున్నాను. అతను నాయర్‌కు బదులుగా టెస్ట్ ఆడాడు. దీనికి కారణం నాకు చెప్పండి. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు నియమాలు... అలా ఉండకూడదు. ఎవరు పరుగులు చేస్తే మీరు అతన్ని ఆడించాలి. అతని (నాయర్)కి టాటూలు లేవు, ఫ్యాన్సీ బట్టలు వేసుకోడు. అందుకే మీరు అతన్ని ఎంచుకోలేదా? మరి అతను కష్టపడి పరుగులు సాధించడంలేదా?" అని హర్భజన్ ప్రశ్నించాడు. కాగా ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-౩ తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. మరోపక్క పేలవమైన ఫామ్‌తో ఈ పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై రంజీ మ్యాచ్ సన్నాహక క్యాంపు కి హాజరయ్యాడు. అయితే, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఢిల్లీ తరఫున రంజీల్లో బరిలోకి దిగే అంశంపై నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో భజ్జీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ఇదెక్కడి ఫామ్ రా సామీ.. 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటిస్తారా..?
విజయ్ హజారే ట్రోఫీ-2025లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సాయంతో 664 పరుగులు చేశాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఒంటిచేత్తో తన జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనల అనంతరం కరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు ఆశిస్తున్నాడు. కరుణ్ ఫామ్ చూస్తే అతన్ని తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు కరున్ ఇటీవలి కాలంలో చాలా చేశాడు. కరుణ్ ఫార్మాట్లకతీతంగా ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీ ట్రోఫీల్లో, కౌంటీ క్రికెట్లోనూ కరుణ్ అద్బుత ప్రదర్శనలు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత కూడా భారత సెలెక్టర్లు కరుణ్‌ను పట్టించుకోకపోతే పెద్ద అపరాధమే అవుతుంది. మిడిలార్డర్లో కరుణ్ చాలా ఉపయోగకరమైన బ్యాటర్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కరుణ్.. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ ముగ్గురిలో ఫిల్టర్ చేయడం సెలెక్టర్లకు కత్తి మీద సామే అవుతుంది. కరుణ్ ప్రదర్శనలు చూస్తే తప్పక ఎంపిక చేయాల్సిందే అన్నట్లుగా ఉన్నాయి. రాహుల్, శ్రేయస్‌లను పక్కకు పెట్టే సాహసాన్ని టీమిండియా సెలెక్టర్లు చేయలేరు. సెలెక్టర్లు ఏం చేయనున్నారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టును జనవరి 19వ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. కరుణ్‌తో పాటు మరో ఆటగాడు కూడా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. కర్ణాటక సారధి మయాంక్ అగర్వాల్ కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఇంచుమించు కరుణ్ ఉన్న ఫామ్‌లోనే ఉన్నాడు. వీహెచ్‌టీలో మయాంక్ 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీల సాయంతో 619 పరుగులు చేశాడు. మయాంక్ ఓపెనర్ స్థానం కోసం అంతగా ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్‌తో పోటీ పడతాడు. భారత సెలెక్టర్లు కరణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరుణ్ విషయానికొస్తే.. వీహెచ్‌టీ-2025లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా (112*, 44*, 163*, 111*, 112*, 122*) నిలిచి ఐదు శతకాలు బాదాడు. ఈ టోర్నీలో కరుణ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వీహెచ్‌టీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు స్కోర్ చేశాడు.లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు స్కోర్ చేసిన రికార్డును కరుణ్ తన ఖాతాలో వేసుకున్నాడు.వీహెచ్‌టీ సింగిల్ ఎడిషన్‌లో తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్ తర్వాత ఐదు సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ తన అరివీర భయంక ఫామ్‌తో టీమిండియాలో పాగా వేయాలని భావిస్తున్నాడు. కరుణ్ విదర్భ జట్టుకు రాక ముందు గడ్డు రోజులు ఎదుర్కొన్నాడు. అతనికి తన సొంత రాష్ట్రం తరఫున ఆడే అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డాడు. 33 ఏళ్ల కరుణ్ ఎనిమిదేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. కరుణ్.. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కరుణ్ తన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీ చేశాక కరుణ్ కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తాజా ప్రదర్శన తర్వాత కరుణ్ మళ్లీ ఫ్రేమ్‌లోకి వచ్చాడు. కరుణ్ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. -
వారెవ్వా!.. కరుణ్ నాయర్ ఐదో సెంచరీ.. సెమీస్‌లో విదర్భ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో హరియాణా, విదర్భ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించగా... హరియాణా జట్టు 2 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును ఓడించింది.విదర్భతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (62; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్ గర్వాల్ (59; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించగా... దీపక్ హుడా (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ చహర్ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (32) తలా కొన్ని పరుగులు చేశారు.విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ (82 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ముందు రాజస్తాన్ స్కోరు సరిపోలేదు. ‘శత’క్కొట్టిన ధ్రువ్ షోరేఈ సీజన్లో వరుస సెంచరీలతో రికార్డులు తిరగరాస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ రాజస్తాన్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. అతడితో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షోరే(Dhruv Shorey- 131 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో విదర్భ జట్టు 43.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 292 పరుగులు చేసి గెలిచింది.కరుణ్ నాయర్ ఐదో సెంచరీటీమిండియా ప్లేయర్లు దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా(Deepak Hooda) బౌలింగ్‌లో ధ్రువ్, కరుణ్ జంట పరుగుల వరద పారించింది. యశ్ రాథోడ్ (39) త్వరగానే అవుటవ్వగా... ధ్రువ్, కరుణ్ అబేధ్యమైన రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. తాజా సీజన్లో వరుసగా నాలుగు (ఓవరాల్‌గా 5) శతకాలు బాదిన కరుణ్ నాయర్... విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నారాయణ్ జగదీశన్ (5 శతకాలు; 2022–23లో) సరసన చేరాడు.ఈ టోర్నీలో ఇప్పటి వరకు 664 పరుగులు చేసిన 33 ఏళ్ల కరుణ్ నాయర్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రతో విదర్భ తలపడుతుంది. హరియాణా ఆల్‌రౌండ్ షో గుజరాత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా... చింతన్ గాజా (32; 4 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆర్య దేశాయ్ (23; 5 ఫోర్లు), సౌరవ్ చౌహాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.కెప్టెన్ అక్షర్ పటేల్ (3) విఫలమయ్యాడు. హరియాణా బౌలర్లలో అనూజ్ ఠక్రాల్, నిశాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హరియాణా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. హిమాన్షు రాణా (66; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అనూజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో కర్ణాటకతో హరియాణా జట్టు తలపడనుంది. చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్Karun Nair is the No 3 India deserves in ODI cricketThis was the reason Kohli never promoted him in cricket. pic.twitter.com/L9hmVtHGAE— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 12, 2025 -
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్.. ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్, విదర్భ జట్టు సారధి కరుణ్ నాయర్ (Karun Nair) విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ చేసిన కరుణ్ (101 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) లిస్ట్-ఏ (50 ఓవర్ల ఫార్మాట్) క్రికెట్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. కరుణ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా 541 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ పేరిట ఉండేది. ఫ్రాంక్లిన్ లిస్ట్-ఏ క్రికెట్లో ఔట్ కాకుండా 527 పరుగులు చేశాడు. కరుణ్, ఫ్రాంక్లిన్ తర్వాత ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వాన్ హీర్డెన్ (512) ఉన్నాడు.ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు..యూపీతో మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన కరుణ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు చేశాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అజేయ సెంచరీ (112) చేసిన కరుణ్.. ఆతర్వాత చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఆతర్వాత కరుణ్ వరుసగా చంఢీఘడ్ (163 నాటౌట్), తమిళనాడు (111 నాటౌట్), ఉత్తర్‌ప్రదేశ్‌లపై (112) హ్యాట్రిక్ సెంచరీలు చేశాడు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కరుణ్ 5 ఇన్నింగ్స్‌ల్లో 542 సగటున 542 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ 115.07 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.కరుణ్ సూపర్ సెంచరీతో మెరవడంతో యూపీపై విదర్భ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో విదర్భకు ఇది వరుసగా ఐదో విజయం. విదర్భతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. సమీర్ రిజ్వి (82 బంతుల్లో 105; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు శతకం బాదాడు. కెప్టెన్ రింకూ సింగ్ (6) విఫలమయ్యాడు. విదర్భ బౌలర్లలో నచికేత్ భూటే నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బరిలోకి దిగిన విదర్భ 47.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరుణ్ నాయర్‌తో పాటు యశ్ రాథోడ్ సెంచరీ చేశాడు. యశ్ 140 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యూపీ బౌలర్లలో రింకూ సింగ్, బిహారీ రాయ్ తలో వికెట్ పడగొట్టారు. -
కరుణ్ నాయర్ 430 నాటౌట్
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో విదర్భ కెప్టెన్, టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ (టెస్ట్‌ల్లో) కరుణ్ నాయర్ (Karun Nair) అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీల సాయంతో 430 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఔట్ కాకపోవడం విశేషం. ప్రస్తుతం కరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే ఈ టోర్నీలో అత్యధిక బౌండరీలు (56) బాదిన ఘనత కూడా కరుణ్‌కే దక్కుతుంది. కరుణ్ ఈ సీజన్లో విదర్భను ప్రతి మ్యాచ్‌లో (4) గెలిపించాడు. విదర్భ ఈ సీజన్లో ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచి గ్రూప్-డి టాపర్‌గా కొనసాగుతుంది.ఈ సీజన్లో కరుణ్ నాయర్ స్కోర్లు.. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో కరుణ్ 108 బంతుల్లో 17 బౌండరీల సాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విదర్భను విజయతీరాలకు చేర్చిన కరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.చత్తీస్‌ఘడ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కరుణ్ 52 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ 8 వికెట్ల తేడాతో చత్తీస్‌ఘడ్‌ను చిత్తు చేసింది.చండీఘడ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కరుణ్ 107 బంతుల్లో 20 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 163 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విదర్భను విజయతీరలకు చేర్చిన కరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.ఇవాళ (డిసెంబర్ 31) తమిళనాడుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో కరుణ్ మరోసారి శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 103 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 111 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ సీజన్లో కరుణ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కూడా గెలుచుకున్నాడు.తమిళనాడు-విదర్భ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. దర్శన్ నల్కండే (6/55) విజృంభించడంతో 48.4 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే 2, యశ్ ఠాకూర్, భూటే తలో వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో తుషార్ రహేజా (75) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ అలీ (48), ఆండ్రే సిద్దార్థ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన విదర్భ.. కరుణ్ శతక్కొట్టడంతో 43.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే 31, యశ్ రాథోడ్ 14, యశ్ కడెం 31, జితేశ్ శర్మ 23, శుభమ్ దూబే 39 (నాటౌట్) పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్ 2, వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ తలో వికెట్ పడగొట్టారు. -
డిసెంబర్ 19.. భారత క్రికెట్లో ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా..?
డిసెంబర్ 19.. భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. టెస్ట్ క్రికెట్లో ఇవాల్టి దినాన టీమిండియా రెండు భిన్నమైన రికార్డులు నమోదు చేసింది. 2016లో ఈ రోజున భారత్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత (2020లో) మళ్లీ ఇదే రోజున భారత్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.2016, డిసెంబర్ 19న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌పై 7 వికెట్ల నష్టానికి 759 పరుగులు స్కోర్ చేసింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేటికీ ఇదే అత్యధిక స్కోర్. చెన్నై వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో కరుణ్ నాయర్ అజేయమైన ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. నాటి మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2020, డిసెంబర్ 19న భారత్ టెస్ట్‌ల్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 36 పరుగులకే ఆలౌటైంది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. నాటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే టాప్ స్కోర్‌గా ఉంది. టెస్ట్‌ల్లో భారత అత్యధిక స్కోర్, అత్యల్ప స్కోర్ విరాట్ కోహ్లి నేతృత్వంలో వచ్చినవే కావడం విశేషం. -
శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
రంజీ ట్రోఫీ 2024-25 విదర్భ ఆటగాడు, టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ కరుణ్ నాయర్ సెంచరీతో కదంతొక్కాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాయర్ 237 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు. నాయర్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 20వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో నాయర్‌తో పాటు దనిష్ మలేవార్ (115), అక్షయ్ వాద్కర్ (104 నాటౌట్) కూడా సెంచరీలతో రాణించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 512 పరుగులు చేసింది. అక్షయ్ వాద్కర్‌తో పాటు ప్రఫుల్ హింగే (26) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో తేజస్ పటేల్ 3, సిద్దార్థ్ దేశాయ్ 2, అర్జన్ సగ్వస్వల్లా, చింతన్ గజా, విశాల్ జేస్వాల్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం విదర్భ గుజరాత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 169 పరుగుల ఆధిక్యంలో ఉంది.అంతకుముందు గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగులకు ఆలౌటైంది. విశాల్ జేస్వాల్ (112) సెంచరీతో కదంతొక్కగా.. ప్రియాంక్ పంచల్ (88), చింతన్ గజా (86 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. విదర్భ బౌలర్లలో ప్రఫుల్ హింగే, ఆదిత్య ఠాకరే, భూటే తలో మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దూబే ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, తన కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్‌ను అంతా మరిచిపోయారు. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసి సంచలన సృష్టించాడు. అయితే ట్రిపుల్ సెంచరీ అనంతరం మూడు మ్యాచ్‌ల్లోనే కరుణ్ కెరీర్ ముగియడం విశేషం. ఆరేళ్లుగా అతనికి జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. గత రెండేళ్లలో కరుణ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటుతున్నా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం లేదు. ఇటీవల ముగిసిన మహారాజా టీ20 టోర్నీలోనూ కరుణ్ సెంచరీ చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో కరుణ్‌కు ఇది తొలి శతకం. -
Ind Vs NZ: రెండో టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్!?
న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కచ్చితంగా ఆడతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కరుణ్ నాయర్ మాదిరి అతడిని దురదృష్టం వెంటాడబోదని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముంబైకర్ తుదిజట్టులో ఉండటం అత్యవసరమని పేర్కొన్నాడు.కాగా కివీస్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పరాజయంతో ఆరంభించింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై దారుణంగా విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు భారీ స్కోరు సాధించింది.ఇందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. తన కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన ఈ ముంబై బ్యాటర్ జట్టు కష్టాల్లో ఉన్న వేళ 150 పరుగులతో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 12 పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు తుదిజట్టులో చోటు దక్కడానికి కారణం శుబ్‌మన్ గిల్ గైర్హాజరీ. ఫిట్నెస్ లేమి కారణంగా గిల్ దూరం కావడంతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో రాగా.. సర్ఫరాజ్ నాలుగో నంబర్ బ్యాటర్‌గా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్‌తో సర్ఫరాజ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.గిల్ తిరిగి వస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటుపడకతప్పదు. తాజా ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్మెంట్ సర్ఫరాజ్వైపే మొగ్గుచూపి.. రాహుల్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కరుణ్ నాయర్ సంగతిని గుర్తుచేస్తూ సర్ఫరాజ్‌ను కూడా బ్యాడ్‌లక్ వెంటాడవచ్చునని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘అవును.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ(300) చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్‌లోనే అతడిని తప్పించారు. అజింక్య రహానే తిరిగి రావడంతో కరుణ్‌ను డ్రాప్ చేశారు. టెస్టు కెరీర్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కరుణ్ నిలకడలేమి ఫామ్ వల్లే అలా జరిగి ఉండవచ్చు.ఒకవేళ కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, నాకు మాత్రం అతడు పుణె మ్యాచ్‌లో కచ్చితంగా ఆడతాడనే అనిపిస్తోంది. రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అంతేకాదు.. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, డ్రెసింగ్ రూం వాతావరణం చూస్తుంటే సర్ఫరాజ్ పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడనే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్18తో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. కాగా కరుణ్ నాయర్ 2017లో ఇంగ్లండ్‌తో టెస్టులో త్రిశతకం బాదినా.. ఆ మరుసటి మ్యాచ్‌లో అతడికి చోటు దక్కలేదు. -
దంచికొట్టిన కరుణ్ నాయర్.. మహరాజా ట్రోఫీ మైసూర్దే!
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్ వారియర్స్ చాంపియన్‌గా నిలిచింది. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన ఫైనల్లో 45 పరుగుల తేడాతో గెలుపొంది.. ట్రోఫీని ముద్దాడింది. ఈ టీ20 టోర్నీ ఆద్యంతం బ్యాటింగ్‌తో అదరగొట్టిన మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 12 మ్యాచ్‌లలో కలిపి 560 పరుగులు సాధించి సూపర్ ఫామ్ కొనసాగించాడు.పోటీలో ఆరు జట్లుకాగా బెంగళూరు వేదికగా ఆగష్టు 15న మొదలైన మహరాజా ట్రోఫీ తాజా ఎడిషన్‌లో గుల్బర్గా మిస్టిక్స్, బెంగళూరు బ్లాస్టర్స్, మైసూర్ వారియర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, హుబ్లి టైగర్స్ జట్లు పాల్గొన్నాయి. వీటిలో గుల్బర్గ, బెంగళూరు, మైసూర్, హుబ్లి సెమీ ఫైనల్ చేరుకున్నాయి.ఫైనల్‌కు చేరుకున్న మైసూర్, బెంగళూరు జట్లుఅయితే, మొదటి సెమీస్ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ గుల్బర్గాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో హుబ్లి టైగర్స్‌పై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి మైసూర్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బెంగళూరు- మైసూరు మధ్య ఆదివారం రాత్రి టైటిల్ కోసం పోటీ జరిగింది.మనోజ్ భండాగే పరుగుల విధ్వంసంబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బ్లాస్టర్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ కార్తిక్ 71, కెప్టెన్ కరుణ్ నాయర్ 66 అర్ధ శతకాలతో మెరవగా.. మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ భండాగే 13 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 338.46 కావడం గమనార్హం.ఫలితంగా మైసూర్ 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 207 పరుగులు స్కోరు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాటర్లు.. మైసూర్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 45 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించిన మైసూర్ వారియర్స్ ఈ ఏడాది టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ జట్టులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. అయితే, ఫైనల్లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. Mysuru hold out Bengaluru; clinch the TITLE!A Karun Nair-led #MysuruWarriors do it in style against #BengaluruBlasters in the Maharaja Trophy final 🏆🙌#MaharajaTrophy | #KarunNair | #MWvBB | #Final2024 pic.twitter.com/GbuDDJyHeV— Star Sports (@StarSportsIndia) September 1, 2024 -
భీకర ఫామ్‌లో కరుణ్ నాయర్.. మరో మెరుపు ఇన్నింగ్స్
బెంగళూరు వేదికగా జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ సారథి కరుణ్ నాయర్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో నాయర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 426 పరుగులు చేశాడు. తాజాగా హుబ్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. కరుణ్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కొదండ కార్తీక్ (30), కార్తీక్ (29), సుచిత్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టైగర్స్ బౌలర్లలో ఎల్ఆర్ కుమార్, మాధవ్ ప్రకాశ్ బజాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరియప్ప, రిషి బొపన్న చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. వారియర్స్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 18.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. శ్రీవత్సవ. సుచిత్. ధనుశ్ గౌడ, మనోజ్ భాంగడే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్, దీపక్ దేవడిగ చెరో వికెట్ దక్కించుకున్నారు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ తాహా (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మనీశ్ పాండే (14), శ్రీజిత్ (13), అనీశ్వర్ గౌతమ్ (11), కరియప్ప (11), ఎల్ఆర్ కుమార్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
మరో మెరుపు అర్ద శతకం.. కరుణ్ నాయర్‌కు టీమిండియాలో ప్లేస్?
టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ కరుణ్ నాయర్. అయితే కరుణ్‌కు సరైన అవకాశాలు రాక కొంత కాలంలోనే కనుమరుగై పోయాడు. తాజాగా అతను భీకర ఫామ్‌ను ప్రదర్శిస్తూ మరోసారి టీమిండియాలో చోటే తన లక్ష్యమని అంటున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లో డబుల్ సెంచరీ చేసిన కరుణ్.. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ఓ లోకల్ టోర్నీలో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో కరుణ్ వరుసగా విధ్వంసాలు సృష్టిస్తున్నాడు. రెండ్రోజుల కిందట మెరుపు సెంచరీతో కదంతొక్కిన కరుణ్.. నిన్న హుబ్లి టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో కరుణ్.. ఓ సెంచరీ, మూడో హాఫ్ సెంచరీల సాయంతో 354 పరుగులు చేశాడు.హుబ్లి టైగర్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద శతకం (36 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదడంతో 165 పరుగులు చేసింది. అనంతరం జగదీశ సుచిత్ (4-0-14-4) చెలరేగడంతో హుబ్లీ టైగర్స్ 109 పరుగులకే ఆలౌటై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో భాగంగా మంగళూరు డ్రాగన్స్‌తో నిన్న (ఆగస్ట్ 19) జరిగిన మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్ కెప్టెన్, టీమిండియా ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కరుణ్ తన శతకాన్ని కేవలం 43 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో పూర్తి చేశాడు. KARUN NAIR SMASHED 124* (48). 🤯- A swashbuckling century in the Maharaja Trophy by Nair. A quality knock at the Chinnaswamy Stadium. 👌pic.twitter.com/cnXYiAZutv— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2024ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న కరుణ్.. 13 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కరుణ్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ 16, అజిత్ కార్తీక్ 11, కార్తీక్ 23, సుమిత్ కుమార్ 15 పరుగులు చేశారు. అఖర్లో బ్యాటింగ్‌కు దిగిన మనోజ్ భాంగడే 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డ్రాగన్స్ బౌలర్లలో అభిలాష్ షెట్టి 2 వికెట్లు పడగొట్టగా.. నిశ్చిత్ రావు, డర్శన్ తలో వికెట్ దక్కించుకున్నారు. వారియర్స్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం మొదలు కావడంతో వీజేడీ పద్దతిన డ్రాగన్స్ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 166 పరుగులుగా నిర్దారించారు.చేతులెత్తేసిన డ్రాగన్స్14 ఓవర్లలో 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డ్రాగన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. ఆ జట్టు ఆటగాళ్లలో నికిన్ జోస్ (32), కృష్ణమూర్తి సిద్ధార్థ్ (50), రోహన్ పాటిల్ (12), దర్శన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫలితంగా ఆ జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అజిత్ కార్తీక్, జగదీశ సుచిత్ తలో రెండు వికెట్లు తీసి డ్రాగన్స్‌ను దెబ్బకొట్టారు. -
స్మరన్ సూపర్ సెంచరీ
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్ 18) జరిగిన మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. సెంచరీ హీరో స్మరన్ (60 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది మిస్టిక్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.వారియర్స్ తరఫున కెప్టెన్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీశ్ సుచిత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (12 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. మిస్టిక్ బౌలర్లలో మోనిశ్ రెడ్డి, పృథ్వీ రాజ్ షెకావత్, యశోవర్దన్ తలో రెండు వికెట్లు.. విజయ్‌కుమార్, శరణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు.197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిస్టిక్స్.. 7 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్మరన్.. అనీశ్ (24), ఫైజాన్ ఖాన్ (18), ప్రవీణ్ దూబే (37) సహకారంతో మిస్టిక్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీ.. రాణించిన ద్రవిడ్ కొడుకు
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీశ్ సుచిత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (12 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకోగా.. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కార్తీక్ 5, అజిత్ కార్తీక్ 9, సుమిత్ కుమార్ 19, మనోజ్ భంగడే 0, కృష్ణప్ప గౌతమ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. మిస్టిక్ బౌలర్లలో మోనిశ్ రెడ్డి, పృథ్వీ రాజ్ షెకావత్, యశోవర్దన్ తలో రెండు వికెట్లు.. విజయ్‌కుమార్, శరణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. -
శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
టీమిండియా తరఫున ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి, భారత్ తరఫున సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ప్రసిద్ధి చెంది, ఆతర్వాత మరో 4 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి కనుమరుగైపోయిన కరుణ్ నాయర్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 పోటీల్లో ఇరగదీస్తున్నాడు. భారత దేశవాలీ క్రికెట్లో సొంత జట్టు కర్ణాటక కాదనుకుంటే విదర్భకు వలస వెళ్లి, అక్కడ కెరీర్ పునఃప్రారంభించిన నాయర్.. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని తనను కాదనుకున్న వారికి బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. HUNDRED FOR KARUN NAIR....!!! Northamptonshire under big trouble with 151 for 6, against an attack led by Roach - Karun smashed a brilliant hundred in his 2nd match of the season. pic.twitter.com/JcJKDxu9bb — Johns. (@CricCrazyJohns) September 20, 2023 ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న నాయర్.. తానాడిన తొలి మ్యాచ్‌లో (వార్విక్షైర్) అర్ధసెంచరీ (78), రెండో మ్యాచ్‌లో ఏకంగా అజేయ సెంచరీ (144 నాటౌట్; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ ప్రదర్శనతో అయినా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న నాయర్.. తన మనసులోని మాటను ఇటీవలే ట్విటర్ వేదికగా బహిర్గతం చేశాడు. డియర్ క్రికెట్.. నాకు మరో ఛాన్స్ ఇవ్వు అంటూ నాయర్ తనలోని అంతర్మథనానికి వెల్లగక్కాడు. ప్రస్తుత కౌంటీ సీజన్లో నార్తంప్టన్‌షైర్ తరఫున కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్న నాయర్.. తాజాగా ప్రదర్శనతో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. A fantastic century by Karun Nair in the County Championship. pic.twitter.com/JwtbAkSOHX — Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023 టెస్ట్‌ల్లో టీమిండియాను మిడిలార్డర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో సెలెక్టర్లు నాయర్ ప్రదర్శనను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారో వేచి చూడాలి. నాయర్.. సుదీర్ఘ ఫార్మాట్‌తో పాటు పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇటీవల ముగిసిన కర్ణాటక టీ20 టోర్నీలో (మహారాజా ట్రోఫీ) అతను 12 మ్యాచ్‌ల్లో 162.69 స్ట్రయిక్‌రేట్‌తో ఏకంగా 532 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. గుల్భర్గా మిస్టిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో అతను చేసిన సెంచరీ టోర్నీ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. భారత్ తరఫున 6 టెస్ట్‌లు, 2 వన్డేలు ఆడిన నాయర్.. మొత్తంగా 420 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. 31 ఏళ్ల నాయర్ తన అంతర్జాతీయ కెరీర్లో చేసిన ఏకైక సెంచరీ ట్రిపుల్ సెంచరీ (303 నాటౌట్) కావడం విశేషం. -
భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి కీలక నిర్ణయం.. ఇకపై ఇంగ్లండ్‌లో
టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో నార్తాంప్టన్‌షైర్‌కు కరుణ్ నాయర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ వైట్మన్ స్థానంలో కరుణ్ నాయర్ నార్తాంప్టన్‌షైర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే సెప్టెంబర్ 8న నార్తాంప్టన్‌షైర్ జట్టుతో నాయర్ చేరాడు. ఆదివారం వార్విక్షైర్తో జరిగే మ్యాచ్‌తో నాయర్ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి.. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన నాయర్.. అరంగేట్ర సిరీస్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. నాయర్ 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు -
విజృంభించిన మనీశ్ పాండే.. రాణించిన కరుణ్ నాయర్
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహారాజా టీ20 ట్రోఫీ-2023ని హుబ్లీ టైగర్స్ గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 29) జరిగిన ఫైనల్స్‌లో టైగర్స్ టీమ్.. మైసూర్ వారియర్స్‌ను 8 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్.. మొహమ్మద్ తాహా (40 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (23 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో తాహా, మనీశ్‌లతో పాటు కృష్ణణ్ శ్రీజిత్ (31 బంతుల్లో 38; 5 ఫోర్లు), మాన్వంత్ కుమార్ (5 బంతుల్లో 14; 2 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మైసూర్ వారియర్స్ బౌలర్లలో కార్తీక్ 2, మోనిస్ రెడ్డి, సుచిత్, కుషాల్ వధ్వాని తలో వికెట్ పడగొట్టారు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మైసూర్ వారియర్స్.. ఇన్నింగ్స్ ఆరంభంలో రవికుమార్ సమర్థ్ (35 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కరుణ్ నాయర్ (20 బంతుల్లో 37; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు. అయితే ఆఖర్లో హుబ్లీ టైగర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మైసూర్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 195 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. హుబ్లీ బౌలర్లలో మాన్వంత్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప 2, మిత్రకాంత్, కరియప్ప చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
40 బంతుల్లో శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్న నాయర్.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 40 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. నాయర్‌కు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim — CricTracker (@Cricketracker) August 28, 2023 నాయర్ విధ్వంసం ధాటికి గుల్భర్గా బౌలర్లు అభిలాష్ షెట్టి (4-0-63-1), విజయ్‌కుమార్ వైశాక్ (4-0-45-0), అవినాశ్ (3.4-0-44-1), నొరోన్హా (2-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 249 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుల్భర్గా.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గుల్భర్గా ఇన్నింగ్స్‌లో చేతన్ 28, ఆనీశ్ 23, నొరోన్హా 39 నాటౌట్, స్మరణ్ 0, అమిత్ వర్మ 11, హసన్ ఖలీద్ 4 నాటౌట్ పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి, గౌతమ్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, టెస్ట్‌ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్‌పై తన తొలి ట్రిపుల్ సెంచరీని (309) (భారత్ తరఫున మొట్టమొదటిది), 2008లో సౌతాఫ్రికాపై తన రెండో ట్రిపుల్ హండ్రెడ్ను (319) బాదాడు. ఆ తర్వాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్‌ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై!
టీమిడియా వెటరన్ ఆటగాడు, కర్ణాటక స్టార్ కరుణ్ నాయర్ క్రికెటర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు నాయర్ గుడ్ బై చెప్పాడు. ఇకపై విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడాలని కరుణ్ నాయర్ నిర్ణయించుకున్నాడు. ఈ మెరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కి వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. "కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌తో గత రెండు దశాబ్దాలగా ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన కేఎస్సీఈకు ధన్యవాదాలు. అదే విధంగా నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన కోచింగ్ స్టాప్, కెప్టెన్లకు, సహచర ఆటగాళ్లకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎక్స్(ట్విటర్)లో నాయర్ పేర్కొన్నాడు. కాగా 2013లో కర్ణాటక తరపున కరుణ్ నాయర్ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. కర్ణాటక క్రికెట్‌తో దాదాపు రెండు దశాబ్దాల పాటు నాయర్ ప్రయాణం సాగింది. ఇప్పటివరకు కర్ణాటక తరపున 85 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నాయర్.. 48.94 సగటుతో 5922 పరుగులు సాధించాడు. అందులో 15 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తమిళనాడుతో జరిగిన 2014-15 రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం అతడికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వీవీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత అంతగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు ఆఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు -
అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ఖతం!
After Virender Sehwag Only Other Indian To Score Triple Century: అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన బ్యాటర్లు కోకొల్లలు. అదే ట్రిపుల్ సెంచరీ సాధించిన వాళ్లు మాత్రం అరుదు. ఆ జాబితాలో ఉన్న వాళ్లెవరనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఈ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ 2004లో తొలిసారి ఈ ఫీట్ అందుకున్నాడు. అది కూడా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ గడ్డపై 309 పరుగులు సాధించి ముల్తాన్ కింగ్‌గా నీరజనాలు అందుకున్నాడు. 2008లో స్వదేశంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో చెన్నైలో 319 పరుగులతో మెరిశాడు. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి మరి వీరూతో పాటుగా ఈ త్రిశతక లిస్టులో ఉన్న మరో భారత క్రికెటర్ గురించి తెలుసా? దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించే రాజస్తాన్ బ్యాటర్ కరుణ్ నాయర్. 2013-14 సీజన్లో రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఫైనల్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 328 పరుగులతో రాణించి కర్ణాటకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి రంజీ సీజన్లో రెండు శతకాలు బాదడంతో పాటుగా మరో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇలా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 4 పరుగుల వద్ద రనౌట్.. తర్వాత ఎల్బీగా.. జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతడు.. అదే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొహాలీలో మూడో టెస్టు సందర్భంగా తన తొలి మ్యాచ్ ఆడిన కరుణ్ నాయర్.. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాట్ ఝులిపించి.. ట్రిపుల్ సెంచరీ బాది తదుపరి ముంబై మ్యాచ్‌లోనూ 13 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న కరుణ్.. ఐదో టెస్టులో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే ఏకంగా త్రిశతకం బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఇన్నింగ్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలవగా.. కరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెహ్వాగ్ తర్వాత రెండో భారత క్రికెటర్‌గా.. అలా ప్రపంచంలో నంబర్ 1 ఇక ఈ మ్యాచ్ సందర్భంగా.. ట్రిపుల్ సెంచరీతో మెరిసి ప్రపంచంలో ఈ ఘనత సాధించి మూడో క్రికెటర్‌గా కరుణ్ నాయర్ రికార్డులకెక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఏడాదిలోనే ముగిసిన కెరీర్ అదే విధంగా.. తక్కువ మ్యాచ్‌లు ఆడి టెస్టుల్లో త్రిశతకం నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత మెరుగ్గా రాణించలేకపోయిన కరుణ్ నాయర్ కెరీర్ మరుసటి ఏడాదే ముగిసింది. 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తంగా టీమిండియా తరఫున 6 టెస్టులు, రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ వరుసగా ఆయా ఫార్మాట్లలో మొత్తంగా 374, 39 పరుగులు చేయగలిగాడు. ఇక 2013 నుంచే ఐపీఎల్ ఆడుతున్న కరుణ్ ఆర్సీబీతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎక్కడ? డానియల్ వెటోరీ, విరాట్ కోహ్లి సారథ్యంలో బెంగళూరు జట్టుకు ఆడిన అతడు.. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు కూడా ప్రాతినిథ్య వహించాడు. ఇక 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానాన్ని 31 ఏళ్ల కరుణ్ నాయర్‌తో భర్తీ చేసింది మేనేజ్మెంట్. ఇక కరుణ్ సనయ తంకరివాలాను వివాహమాడగా.. వారికి కుమారుడు జన్మించాడు. చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్‌కు కూడా..! ఏదో క్లబ్‌గేమ్ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్ అన్నట్లు! తిలక్ అలా.. -
IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్
IPL 2023- LSG- KL Rahul: భారత క్రికెటర్, ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయం కారణంగా రాబోయే కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023తో పాటు వచ్చే నెలలో లండన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నుంచి కూడా రాహుల్ తప్పుకున్నాడు. దేశం తరఫున ఆడటమే నా మొదటి ప్రాధాన్యత ఈ విషయాన్ని స్వయంగా అతనే నిర్ధారించాడు. సోమవారం లక్నోలో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ గాయపడ్డాడు. ‘భారత జట్టుకు అందుబాటులో లేకపోవడం చాలా నిరాశగా ఉంది. దేశం తరఫున ఆడటమే నా మొదటి ప్రాధాన్యత. నా గాయానికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. 2021లో కేకేఆర్‌కు ఆడిన కరుణ్ నాయర్ (PC: IPL) రీప్లేస్మెంట్ అతడే వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తా. బాధగా ఉన్నా ఆటకు దూరం కావడం తప్పడం లేదు’ అని రాహుల్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌కు దూరమైన రాహుల్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కర్నాటక బ్యాటర్ కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకుంది. రూ. 50 లక్షల ధరకు అతడిని తీసుకుంది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్... రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆయా జట్ల తరఫున మొత్తంగా 76 మ్యాచ్‌లు ఆడిన నాయర్ 1496 పరుగులు చేశాడు. చదవండి: ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు.. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ అట..! క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను.. హీరోయిన్ను పెళ్లాడతాను..! -
'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ప్లీజ్'.. భారత క్రికెటర్ భావోద్వేగం
కరుణ్ నాయర్.. ఈ పేరు చాలా మందికి గుర్తుండకపోవచ్చు. అతడు మన భారత క్రికెటరే. సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత టెస్టు క్రికెట్లో ఒక యువ సంచలనం. తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. అయితే అరంగేట్రం చేసిన ఐదు నెలలకే బీసీసీఐ అతడిని పక్కన పెట్టింది. కరుణ్ నాయర్ అనే క్రికెటర్ ఉన్నాడన్న విషయాన్నే భారత సెలక్టర్లు మార్చిపోయారు. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. భారత జట్టు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు. కానీ మళ్లీ భారత జెర్సీ ధరించేందుకు కరుణ్ నాయర్ మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా..త్వరలో జరగనున్న రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో కరుణ్ నాయర్‌కు చోటు దక్కలేదు. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించిన కర్ణాటక క్రికెట్ బోర్డు.. అతడికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ చేసిన ఓ పోస్టు అభిమానుల హృదయాలను తాకుతుంది. "డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు అంటూ" ట్విటర్ వేదికగా భావోద్వోగానికి లోనయ్యాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. "నీ లాంటి టాలెంట్ ఉన్న ఎంతో మంది ఆటగాళ్లను తొక్కేసారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ భారత జట్టులో తిరిగి నిన్ను చూడాలి అనుకుంటున్నాము భయ్యా అంటా పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ కరుణ్ నాయర్ 2016 నవంబర్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. Dear cricket, give me one more chance.🤞🏽 — Karun Nair (@karun126) December 10, 2022 Revisit Karun Nair triple century scoring moment.pic.twitter.com/MV1ERnUwFY — Cricket Master (@Master__Cricket) December 10, 2022 చదవండి: FIFA WC: పోర్చుగల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన రోనాల్డో! వీడియో వైరల్ -
ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురి బర్త్‌డే కూడా ఈరోజే.. ఈ విశేషాలు తెలుసా?
December 6- Top 6 Cricketers Birthday: టీమిండియా స్టార్స్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్.. ఈ ముగ్గురూ ఒకేరోజు జన్మించారు తెలుసా! వీళ్ల ముగ్గురి బర్త్‌డే డిసెంబరు 6నే! భారత ఆల్‌రౌండర్ జడ్డూ 1988లో జన్మించగా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1993లో, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 1994లో జన్మించారు. ఇక వీరితో పాటు మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఇదే రోజు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. భారత మాజీ లెఫ్టార్మ్ మీడియం పేసర్ రుద్రప్రతాప్ సింగ్, కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా డిసెంబరు 6నే పుట్టారు. వీళ్లందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరుగురి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు 1.జస్ప్రీత్ బుమ్రా- గుజరాత్ ►అహ్మదాబాద్‌లో జననం ►ప్రస్తుత టీమిండియా ప్రధాన పేసర్. ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం. ►టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్ల జాబితాలో చోటు ►కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 162 అంతర్జాతీయ మ్యాచ్‌లు ►పడగొట్టిన వికెట్లు: 319. 2. రవీంద్ర జడేజా- గుజరాత్ ►నవగామ్‌లో జననం ►స్పిన్ ఆల్‌రౌండర్ ►టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ ప్రఖ్యాతి ►ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరుగులు: 5427 ►పడగొట్టిన వికెట్లు: 482 ►ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. శ్రేయస్ అయ్యర్- మహారాష్ట్ర ►ముంబైలో జననం ►ఐపీఎల్లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు టెస్టులు 5, వన్డేలు 37, టీ20లు 49. ►పరిమిత ఓవర్ల క్రికెట్లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు ఆర్పీ సింగ్- ఉత్తరప్రదేశ్ ►1985లో రాయ్ బరేలీలో జననం ►లెఫ్టార్మ్ మీడియం పేసర్ ►అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఆడిన ఆర్పీ సింగ్ ►అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ►2018లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటన కరుణ్ నాయర్ ►1991లో జననం ►దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాటర్ ►టీమిండియా తరఫున ఇప్పటి వరకు 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ►లంకషైర్లో 1977లో జననం ►1998లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం ►ఇంగ్లండ్ కెప్టెన్‌గా పనిచేసిన ఆల్‌రౌండర్ ►ఫాస్ట్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలు ►2010లో ఆటకు వీడ్కోలు.. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న ఫ్లింటాఫ్. చదవండి: Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
IPL 2022: కరుణ్ అవుట్.. యశస్వి ఇన్: సంజూ శాంసన్
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్- 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక శనివారం(మే 7) నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు మేం టాస్ ఓడిపోయాం. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. అయినా మాది సమతుల్యమైన జట్టు. డే మ్యాచ్ కాబట్టి స్పిన్నర్లకు అనుకూలించవచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇక కరుణ్ నాయర్ స్థానంలో యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. కాగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా పంజాబ్, రాజస్తాన్ తలపడుతున్నాయి. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్‌లలో ఆరు గెలిచిన సంజూ శాంసన్ బృందం 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. పదింట 5 విజయాలతో మయాంక్ బృందం 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, యజువేంద్ర చహల్, కుల్దీప్ సేన్. పంజాబ్ కింగ్స్ జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భనుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ. చదవండి👉🏾Kieron Pollard: పొలార్డ్‌పై వేటు తప్పదు.. ఇకపై అతడికి అవకాశం ఉండదు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నాయర్ నుంచి సారధ్య బాధ్యతలు చేజిక్కించుకున్న సమర్ధ్
సాక్షి, బెంగళూరు: త్వరలో ప్రారంభం కాబోయే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక కెప్టెన్‌గా ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆర్ సమర్ధ్ వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల సమర్ధ్.. ఫామ్ లేమితో బాధపడుతున్న కరుణ్ నాయర్ నుంచి సారధ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఫజల్ ఖలీల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం సమావేశమై 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా, తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సమర్ధ్‌కు జట్టులో స్ధానం దక్కకపోవడం విశేషం. ఈ టోర్నీలో కర్ణాటక జట్టు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. తాజాగా ప్రకటించిన కర్ణాటక జట్టులో ఇటీవలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాణించిన దేవ్‌దత్ పడిక్కల్ కీలక సభ్యుడిగా ఉండగా, గాయం కారణంగా సీనియర్ ఆటగాడు మనీష్ పాండే టోర్నీకి దూరమయ్యాడు. -
ధోనికి నెగెటివ్
రాంచీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చేసిన కోవిడ్–19 పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఐపీఎల్ తాజా నిబంధనల్లో భాగంగా అతనికి పరీక్ష చేశారు. ఇక్కడి గురునానక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు నగర శివార్లలో ఉన్న ధోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి అతని శాంపిల్స్ సేకరించారు. గురువారం రాత్రికి ఫలితాలు వచ్చాయి. ధోనితో పాటే చెన్నై జట్టులోని సభ్యుడైన మోనూ కుమార్ కూడా కరోనా పరీక్షకు హాజరయ్యాడు. ఫలితాల్లో నెగెటివ్‌గా రావడంతో ధోని నేడు చెన్నైకి వెళ్లి శిక్షణా శిబిరంలో పాల్గొంటాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్ వస్తేనే యూఏఈ విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు. కుటుంబ సభ్యులు లేకుండా... ఈ నెల 22న సూపర్ కింగ్స్ టీమ్ యూఏఈకి బయల్దేరనుంది. అయితే ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులెవరినీ తీసుకు వెళ్లరాదని ఫ్రాంచైజీ నిర్ణయించింది. ‘ప్రస్తుతం టీమ్ సభ్యులు, సహాయక సిబ్బంది మినహా ఎవరూ రారు. లీగ్ సాగుతున్న కొద్దీ మున్ముందు ఏదైనా దశలో దీనిపై పునరాలోచిస్తాం. అవకాశాన్ని బట్టి అప్పుడు కుటుంబ సభ్యులను అనుమతించే విషయం పరిశీలిస్తాం’ అని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. నాయర్ కోలుకున్నాడు కర్ణాటక బ్యాట్స్‌మన్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరుణ్ నాయర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. గత నెలలో కోవిడ్–19 బారిన పడిన అతను 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందాడు. చికిత్స అనంతరం ఈ నెల 8న అతనికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా ‘నెగెటివ్’గా తేలాడు. దాంతో నాయర్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్లు తెలిసింది. అయితే ఈ ఫలితంతో అతను యూఏఈ వెళ్లేందుకు అవకాశం లేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోని ఇతర ఆటగాళ్లలాగే కరుణ్ కూడా మళ్లీ మూడు సార్లు కరోనా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందిన కరుణ్ నాయర్... మూడేళ్ల క్రితం చివరి సారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
‘ట్రిపుల్ సెంచరీ’ హీరోకు కరోనా!
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు వారాల క్రితం కరుణ్ నాయర్.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్ నాయర్ సెల్ఫ్ హెమ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉన్న నాయర్‌కు నాలుగు రోజుల క్రితం జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో కోలుకున్నట్లు సమాచారం. గత నెల్లో చేతన్ చౌహాన్ కరోనా బారిన పడగా, ఆపై కరోనా వైరస్ సోకిన క్రికెటర్ కరుణ్ నాయర్ కావడం గమనార్హం.(ఒకటో నంబర్ హెచ్చరిక...) ఐపీఎల్-13వ సీజన్లో భాగంగా కరుణ్ నాయర్ కింగ్స్ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మళ్లీ భారత జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నాయర్.. ఐపీఎల్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. వచ్చే నెల 19వ తేదీ నుంచి జరుగనున్న ఐపీఎల్ జరగడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ రాగా, ఈ నెల 20వ తేదీ తర్వాత అన్ని ఫ్రాంచైజీలు యూఏఈకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ తరుణంలో కరోనా కేసులు వెలుగు చూడటం సవాల్ మారింది. మొత్తం బయో సెక్యూర్ పద్ధతిలో జరిగే ఐపీఎల్-2020.. ముందుగా క్రికెటర్లకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ధోని కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్లు వచ్చిన తర్వాత యూఏఈకి బయల్దేరనున్నాడు. కాగా, కరుణ్ నాయర్‌కి ముందుగా కరోనా వచ్చి తగ్గిపోవడం కాస్త ఊరట కల్గించే అంశమే. కరుణ్ నాయర్‌కు కరోనా సోకిన విషయాన్ని గోప్యంగా ఉంచడంతో అది వెలుగులోకి రాలేదు. కాగా, 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తర్వాత భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నాయర్ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కరుణ్ తన మూడో టెస్టులోనే రికార్డు నెలకొల్పడం విశేషం. అదే సమయంలో తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చిన ఏకైక భారత ఆటగాడిగా గుర్తింపు పొందడం విశేషం.(ఈసారి హెలికాప్టర్ షాట్లతో పాపులర్..!) -
ప్రేయసిని వివాహమాడిన టీమిండియా క్రికెటర్
జైపూర్ : టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి సనయ టాంకరివాలాతో కరుణ్ వివాహం ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం రాత్రి వివాహబంధంతో ఒకటైయ్యారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను కరుణ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ నూతన జంటకు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యార్, అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ ఆరోన్ వీరి విహహానికి హాజరయ్యాడు. కాగా కెరీర్లో కేవలం ఆరు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చిన కరుణ్.. ట్రిపుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఫాం కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా తన ప్రేయసిని వివాహం చేసుకుని రెండో ఇన్సింగ్స్‌ను ప్రారంభించాడు. -
శుబ్‌మన్ మళ్లీ శతకం మిస్
మైసూర్: యువ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ (137 బంతుల్లో 92; 12 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో అతడు శతకానికి 8 పరుగుల దూరంలో ఔటయ్యాడు. తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్ 90 పరుగులు చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో అతడికి తోడు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) రాణించడంతో భారత్ ‘ఎ’ తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (5), ప్రియాంక్ పాంచల్ (6) త్వరగానే వెనుదిరిగినా... శుబ్‌మన్, నాయర్ మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సభ్యులైన పేసర్లు ఫిలాండర్, ఇన్‌గిడి, స్పిన్నర్ ముతుస్వామిలను దీటుగా ఎదుర్కొన్నారు. సిపామ్లా బౌలింగ్‌లో గిల్ పెవిలియన్ చేరాక... కరుణ్‌కు కెపె్టన్ వృద్ధిమాన్ సాహా (86 బంతుల్లో 36; 5 ఫోర్లు) సహకారం అందించాడు. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు వీరు 67 పరుగులు జోడించారు. వెలుతురు సరిగా లేని కారణంగా మంగళవారం 74 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. -
కరుణ్‌తో నేను స్వయంగా మాట్లాడా!
ముంబై: వరుసగా ఆరు టెస్టుల్లో భారత జట్టుతో పాటు ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకుండానే వేటు పడిన బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ఎంపికపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇంగ్లండ్‌తో తనను ఎందుకు ఆడించలేదనే విషయం తనకు తెలీదని, ఈ విషయంపై సెలక్టర్లు తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని కరుణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెస్కే స్పందించారు. ‘వెస్టిండీస్‌తో సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన తర్వాత నేనే స్వయంగా కరుణ్‌తో మాట్లాడాను. జట్టులోకి ఎలా అతను తిరిగి రావచ్చో కూడా చెప్పాను. ఆటగాళ్లతో మాట్లాడే విషయంలో సెలక్షన్ కమిటీకి చాలా స్పష్టత ఉంది. క్రికెటర్లకు సమాచారం అందించడం గురించి మా కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఆటగాళ్లు మాతో విభేదించినా సరే అతడిని తప్పించేందుకు సరైన కారణం చెప్పగలగాలి. రంజీ ట్రోఫీలో, భారత్ ‘ఎ’ తరఫున కరుణ్ మరిన్ని పరుగులు సాధించాలి. టెస్టుల్లో అతని పేరు పరిశీలనలోనే ఉంది. అందుకే దేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు చేయమని నేను సలహా ఇచ్చా’ అని ప్రసాద్ వివరించారు. మరో వైపు ఇంగ్లండ్‌లో కూడా తుది జట్టులో స్థానం దక్కకపోవడంపై నాయర్‌తో తన సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ మాట్లాడారని కూడా ఎమ్మెస్కే చెప్పారు. ‘ఇంగ్లండ్ పర్యటనలో కూడా నాయర్లో స్ఫూర్తి నింపేందుకు దేవాంగ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో సుదీర్ఘంగా అతనితో మాట్లాడారు. త్వరలోనే అవకాశం దక్కుతుందని, దాని కోసం వేచి చూడాలని చెప్పారు’ అని చీఫ్ సెలక్టర్ వెల్లడించారు. వెస్టిండీస్‌తో సిరీస్ కోసం జట్టును ప్రకటించడానికి ముందు నాయర్ తాజా వ్యాఖ్యలు చేశాడు. -
బ్యాట్‌తోనే సమాధానం చెబుతా: కరుణ్ నాయర్
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో చోటు కోల్పోయిన కరుణ్ నాయర్ జాతీయ జట్టులో పునరాగమనంపై దీటుగా స్పందించాడు. ‘జట్టుకు దూరమవడం అనేది సహజంగా ఎవరికైనా బాధ కల్గిస్తుంది. దీన్ని అధిగమించడం కష్టం కావచ్చు. ఇక్కడ నన్ను పక్కకు పెట్టడానికి సెలక్టర్లు, మిగతా వారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి. ఓ క్రికెటర్‌గా వారి నిర్ణయానికి తలొగ్గడం తప్పా..ఏమి చేయలేని పరిస్థితి. రానున్న రోజుల్లో బ్యాట్‌తోనే సమాధానం చెబుతా’అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు. త్వరలో టీమిండియా జట్టులో చోటు దక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు కరుణ్ నాయర్. మరొకసారి భారీ స్కోరు సాధించి తన సత్తా చూపించాలనుకుంటున్నానని తెలిపాడు. ఇందుకోసం చాలా ఆతృతగా ఉన్నానని, భారత్ తరపున ట్రిపుల్ సెంచరీలు చేసిన ఇద్దరు ఆటగాళ్లలో తాను ఒకడిని కావడం గర్వంగా ఉందన్నాడు. ఇక్కడ తాను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదనే అభిప్రాయాన్ని నాయర్ వ్యక్తం చేశాడు. తాను మాట్లాడటానికి ఏమీ లేదన్న నాయర్.. ఇందుకు తన బ్యాటే సమాధానం చెబుతుందన్నాడు. అదే సమయంలో ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ బసుతో అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఫిట్నెస్ ట్రైనర్ శంకర్ సార్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ బంగర్‌తో చాలా సమయం గడిపేవాడిని. నెట్ ప్రాక్టీస్‌లో త్రోడౌన్స్ ఆడేవాన్ని. కానీ ఎక్కువలో ఎక్కువగా బసుతో ఉండేవాడిని. ప్రస్తుత భారత జట్టులో నువ్వో అత్యుత్తమ ఫిట్నెస్ కల్గిన ఆటగాడివని సర్ అంటుండేవాడు. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. భవిష్యత్తులో ఇంతే ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను' అని కరుణ్ అన్నాడు. -
నేనిప్పుడు బాగా మెరుగయ్యా: నాయర్
బెంగళూరు: రెండేళ్లక్రితం ఉన్నట్లు ఇప్పుడు లేనని, ఫిట్నెస్ పరంగా, ఆటపరంగా చాలా మెరుగయ్యానని భారత క్రికెటర్ కరుణ్ నాయర్ చెప్పాడు. అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టులో పాల్గొనే భారత జట్టులో సభ్యుడిగా ఉన్న కరుణ్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడాడు. ‘గత ఏడాదిన్నర కాలంగా జట్టుకు దూరమయ్యాను. దీంతో ఆటలో నైపుణ్యం, ఫిట్నెస్ పెంచుకునే పనిలో నిమగ్నమయ్యా. దేశవాళీ క్రికెట్లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేశాను. గతంలోకంటే ఇప్పుడు చాలా పరిణతి సాధించానని నాకు అనిపిస్తుంది’ అని నాయర్ చెప్పాడు. చివరిసారిగా గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టు ఆడిన కరుణ్... ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో జరగనున్న చారిత్రక టెస్టు కోసం తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అలాగే ఇంగ్లండ్‌లో పర్యటించే భారత ‘ఎ’ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తన దృష్టి మాత్రం ప్రస్తుత టెస్టుపైనే ఉందన్నాడు. స్పిన్ ట్రాక్ భారత్ కంటే తమకే అనుకూలమన్న అఫ్గాన్ కెప్టెన్ అస్గర్ స్తానిక్జాయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘అది ఏమాత్రం తగని వ్యాఖ్య. ఎందుకంటే ఇంకా ఒక్క టెస్టు కూడా ఆడని జట్టు కెప్టెన్ అలా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. టెస్టుల్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అఫ్గాన్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ జద్రాన్ ప్రతిభావంతులే అయినప్పటికీ రెడ్ బాల్ (టెస్టులాడే బంతి)తో ఆడటం ఇదే తొలిసారి. పరిమిత ఓవర్ల ఆట వేరు. సంప్రదాయక టెస్టులు వేరన్న సంగతి గుర్తుంచుకోవాలి. టెస్టులు ఐపీఎల్ ఆడినంత ఈజీ కాదు. చాలా భిన్నమైనవి’ అని కరుణ్ నాయర్ అన్నాడు. ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించినప్పటికీ జట్టులో స్థానం కోల్పోవడంపై మాట్లాడుతూ ‘అది రెండేళ్లక్రితం సంగతి. ఇప్పుడు మళ్లీ చేస్తే తప్పకుండా విషయం అవుతుంది. అయితే డబుల్, ట్రిపుల్ కంటే జట్టు గెలవడమే ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. -
కరుణ్ నాయర్‌కు మళ్లీ అవకాశం
బెంగళూరు: ఊహించినట్లుగానే అఫ్గానిస్తాన్‌తో భారత్ ఆడాల్సిన ఏకైక టెస్టుకు బీసీసీఐ దృష్టిలో తగిన ప్రాధాన్యత లభించలేదు. పూర్తిగా ద్వితీయ శ్రేణి జట్టు కాకపోయినా... నలుగురు ప్రధాన ఆటగాళ్లను పక్కన పెట్టి ఈ మ్యాచ్ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించారు. కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపించిన విరాట్ కోహ్లి ఈ టెస్టుకు దూరం కావడం ముందే ఖరారైంది. అతనితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు బోర్డు విశ్రాంతినిచ్చింది. బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో ‘ఎ’ ప్లస్ కేటగిరీలో ఉన్న ఈ నలుగురికి కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరామం కల్పించగా... ఇదే జాబితాలో ఉన్న శిఖర్ ధావన్ మాత్రం టెస్టు ఆడబోతున్నాడు. కోహ్లి గైర్హాజరులో అజింక్య రహానే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. ఏడాది క్రితం కోహ్లి గాయపడినప్పుడు ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో కూడా రహానే సారథిగా వ్యవహరించాడు. ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ ఈ టెస్టు కోసం తిరిగి రానున్నారు. దక్షిణాఫ్రికాలో గాయంతో రెండు టెస్టులకు దూరమైన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పునరాగమనం చేయగా... అతని స్థానంలో ఆడిన పార్థివ్, ప్రత్యామ్నాయంగా దక్షిణాఫ్రికాకు వెళ్లిన దినేశ్ కార్తీక్‌లలో ఎవరికీ చోటు దక్కలేదు. కుల్దీప్, శార్దుల్ కూడా... దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పాల్గొన్న భారత టెస్టు జట్టుతో పోలిస్తే ముగ్గురికి కొత్తగా అవకాశం లభించింది. భారత్ తరఫున ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌కు మళ్లీ స్థానం లభించింది. అతను ఇప్పటి వరకు భారత్ తరఫున 6 టెస్టులు ఆడాడు. చెన్నైలో ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక (303 నాటౌట్) ఇన్నింగ్స్ తర్వాత కరుణ్ వరుసగా 26, 0, 23, 5 స్కోర్లు చేశాడు. అయితే రంజీ ట్రోఫీలో మెరుగ్గా రాణించడంతో అతనికి మరో అవకాశం దక్కింది. అయితే కేఎల్ రాహుల్ నుంచి నాలుగో స్థానానికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో నాయర్‌కు తుది జట్టులో చోటు కష్టమే. మరోవైపు పేసర్ శార్దుల్ ఠాకూర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌లను కూడా ఈ టెస్టుకు ఎంపిక చేశారు. కుల్దీప్ 2 టెస్టులు ఆడగా... శార్దుల్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. జూన్ 14 నుంచి 18 వరకు బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ టెస్టు జరుగుతుంది. అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పుజారా, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, షమీ, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, శార్దుల్ ఠాకూర్. -
అదిరే ఫీల్డింగ్..కళ్లు చేదిరే క్యాచ్‌లు
-
అతనో వినూత్నమైన కెప్టెన్: నాయర్
సాక్షి, స్పోర్ట్స్ : ఈ సీజన్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్న రవిచంద్రన్ అశ్విన్‌పై ఆ జట్టు ఆటగాడు కరుణ్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. ‘అశ్విన్ చాలా మంచి వ్యక్తి. వినూత్నమైన విధానాలతో జట్టును ముందుకు నడిపిస్తాడు. అతని నాయకత్వంలో ఆడటానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని’ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ఆడటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు దోహదపడుతుందని కరుణ్ నాయర్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెటర్‌గా ఉన్న తనకు ఐపీఎల్లో ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో కూడా మెరుగ్గా రాణించగలననే నమ్మకం వచ్చిందని పేర్కొన్నాడు. సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన ఈ కర్ణాటక ఆటగాడు ఇప్పుడు అతనితో కలిసి ప్రయాణించబోతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ 11వ సీజన్లో పంజాబ్ జట్టు.. కరుణ్ నాయర్‌తో పాటు కర్ణాటక యువ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లను కొనుగోలు చేయడం ద్వారా టైటిల్ వేటలో దూసుకుపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కరుణ్‌ను ఈ సీజన్‌లోని పంజాబ్ జట్టు యాజమాన్యం రూ. 5.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. -
కరుణ్ నాయర్ మెరుపు సెంచరీ
కోల్‌కతా: కరుణ్ నాయర్ (52 బంతుల్లో 100; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సూపర్ లీగ్‌లో బుధవారం కర్ణాటక 123 పరుగులతో జార్ఖండ్‌పై గెలుపొందింది. తొలుత కర్ణాటక 201 పరుగులు చేయగా జార్ఖండ్ 78 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడుపై బెంగాల్; ముంబైపై రాజస్తాన్; బరోడాపై యూపీ గెలుపొందాయి. -
48 బంతుల్లో సెంచరీ
విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ విశ్వరూపం ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడిన నాయర్ 48 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో చెలరేగిన నాయర్ 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అంతకముందు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. 42 బంతుల్లో 77 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఊపును తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కూడా కొనసాగించిన నాయర్ శతకంతో మెరిశాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన తమిళనాడు 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటై పరాజయాన్ని మూటగట్టుకుంది. -
నేను చాలా నిరాశ చెందా: కరుణ్ నాయర్
న్యూఢిల్లీ:వచ్చే నెల్లో దక్షిణాఫ్రికాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌కు ఎంపిక కాకపోవడం చాలా నిరాశకు గురిచేసిందని భారత తరపున కొద్ది మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కరుణ్ నాయర్ తెలిపాడు. జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై భారత్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఇప్పటికే జట్లను భారత సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టెస్టు జట్టులో చోటు ఆశించిన కరుణ్ నాయర్‌కి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. రెండు రోజుల క్రితం ప్రకటించిన వన్డే జట్టులోనూ చోటివ్వలేదు. దీనిలో భాగంగా మాట్లాడిన కరుణ్ నాయర్..'దక్షిణాఫ్రికా పర్యటనకి నన్ను ఎంపిక చేయకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. గత ఏడాది ట్రిఫుల్ సెంచరీ చేశాను. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో కూడా కొన్ని శతకాలు సాధించాను. ఈ బ్యాటింగ్ ప్రదర్శనతో నన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటారని ఆశించాను. కానీ ఎంపిక కాలేదు. ఆ ప్రభావం నా ఆటపై కూడా పడింది. రంజీల్లో ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నన్ను సఫారీ ఎంపిక చేయని ప్రభావం కనబడింది' అని కరుణ్ నాయర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్ తరపున సెహ్వాగ్ తరువాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా నాయర్ నిలిచాడు. -
సెహ్వాగ్ ఒకే.. యువ సంచలనాన్ని ఎలా మరిచారు?
సాక్షి, స్పోర్ట్స్ : భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఇక్కడ జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే డీడీసీఏ చేసిన పెద్ద తప్పిదంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో చాలా రికార్డులు సాధించాడంటూ కొన్ని ఘనతలపై ఏర్పాడు చేసిన బోర్డులో డీడీసీఏ పెద్ద తప్పిదం చేసింది. 'భారత్ తరఫున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యామ్స్ మెన్ సెహ్వాగ్' అంటూ రాశారు. కానీ కరుణ్ నాయర్ ను డీడీసీఏ మరిచిపోవడం దుమారం రేపింది. భారత్ నుంచి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించింది ఇద్దరు క్రికెటర్లు కాగా, తొలి ఆటగాడు సెహ్వాగ్, రెండో ఆటగాడు కరుణ్ నాయర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందులోనూ ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కూడా ఐపీఎల్ లో ఢిల్లీ (ఢిల్లీ డేర్ డెవిల్స్) జట్టుకే ప్రాతినిధ్యం వహించినా అతడ్ని డీడీసీఏ ఎలా మరిచిపోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. టెస్టుల్లో రెండు సార్లు సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. యువ సంచలనం కరుణ్ నాయర్ 2016లో చెన్నైలోని చిదంబరం స్డేడియంలో ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టెస్టులో 303 పరుగులు చేసిన విషయాన్ని యావత్ భారత దేశ క్రికెట్ ప్రేమికులు గుర్తించుకోగా.. డీడీసీఏకు మాత్రం ఈ విషయం లెక్కలోకి రాదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చురకలంటించారు. DDCA honours @virendersehwag , forgets @karun126’s triple hundred. On Gate No 2, “ only Indian to score 300 in Tests”. New board maybe pic.twitter.com/jrFlTLguUM — Sahil Malhotra (@Sahil_Malhotra1) 31 October 2017 -
ఇక బ్యాట్స్‌మెన్‌పైనే భారం
షిమోగా (కర్ణాటక): రంజీ ట్రోఫీలో తొలి విజయాన్ని సాధించాలని బరిలోకి దిగిన హైదరాబాద్ అసాధారణ రీతిలో పోరాడాల్సి ఉంది. కర్ణాటకతో జరుగుతోన్న మ్యాచ్‌లో విజయం సాధించాలంటే రాయుడు సేన శుక్రవారం మరో 288 పరుగులు సాధించాలి. గురువారం తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ జట్టు ఆట ముగిసే సమయానికి 32 ఓవర్లలో 2 వికెట్లకు 92 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (15), కొల్లా సుమంత్ (9) అవుటయ్యారు. ప్రస్తుతం తన్మయ్ అగర్వాల్ (43 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ అంబటి రాయుడు (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 128/4తో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కర్ణాటక 105.4 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఓవరాల్‌గా హైదరాబాద్‌కు 380 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధాన బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (229 బంతుల్లో 134; 17 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, స్టువర్ట్ బిన్నీ (72; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్ 5 వికెట్లు దక్కించుకోగా, ఆకాశ్ భండారి 3, ప్రజ్ఞాన్ ఓజా, రవి కిరణ్ చెరో వికెట్ తీశారు. శుక్రవారం ఆటకు చివరిరోజు. -
భారత్ ‘ఎ’ ఘనవిజయం
దక్షిణాఫ్రికా ‘ఎ’తో నాలుగు రోజుల మ్యాచ్ పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి రోజు మంగళవారం ఆటలో అంకిత్ రాజ్‌పుత్ (3/15), షాబాజ్ నదీమ్ (3/47) తమ బౌలింగ్‌తో బెంబేలెత్తించగా ఆతిథ్య జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 65.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. వీరి ధాటికి 138/4 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ప్రొటీస్ కేవలం 39 పరుగులకే మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టుకు 223 పరుగుల ఆధిక్యం లభించింది. స్టీఫెన్ కుక్ (196 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. గౌతమ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 224 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 62.3 ఓవర్లలో 4 వికెట్లకు 226 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్ కరుణ్ నాయర్ (144 బంతుల్లో 90; 13 ఫోర్లు), ఓపెనర్ సమర్థ్ (90 బంతుల్లో 55; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో రాణించారు. -
రోహిత్ శర్మ పునరాగమనం
ముంబై: శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం సెలక్టర్లు ఆదివారం 16 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ టెస్టుల్లోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో ఇం డోర్లో ఆఖరి సారిగా టెస్టు మ్యాచ్ ఆడిన అతను... ఆ తర్వాత గాయం కారణంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో సీనియర్ టీమ్ నుంచి కరుణ్ నాయర్ దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి గాలేలో తొలి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రోహిత్, అశ్విన్, జడేజా, సాహా, ఇషాంత్, ఉమేశ్, పాండ్యా, భువనేశ్వర్, షమీ, కుల్దీప్, ముకుంద్. -
కెప్టెన్లుగా నాయర్, మనీష్
న్యూఢిల్లీ: త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్ 'ఎ' జట్లకు కెప్టెన్లుగా సీనియర్ జట్టు ఆటగాళ్లైన కరుణ్ నాయర్, మనీష్ పాండేలు ఎంపికయ్యారు. ఆతిథ్య దక్షిణాఫ్రికా 'ఎ' రెండు అనధికార టెస్టులకు కరుణ్ నాయర్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించగా, వన్డే జట్టు కెప్టెన్ గా మనీష్ పాండే వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ 'ఎ' జట్టుతో పాటు ఆస్ట్రేలియా 'ఎ' జట్టుకు పాల్గొననుంది. జూలై 26వ తేదీన ఆస్ట్రేలియా 'ఎ' జట్టుతో భారత్ జట్టు తలపడే మ్యాచ్ తో ముక్కోణపు వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు దేశాల ట్రయంగులర్ వన్డే సిరీస్ఆగస్టు 8వ తేదీ వరకూ జరుగుతుండగా, ఆపై దక్షిణాఫ్రికాతో రెండు అనధికార నాలుగు రోజుల టెస్టులను భారత్ ఆడనుంది. ఆగస్టు 12 నుంచి 15 వరకూ బెనోనిలో తొలి నాలుగు రోజుల మ్యాచ్ జరుగనుండగా, ఆగస్టు 19 నుంచి 22 వరకూ సెన్స్వే పార్క్‌లో రెండో మ్యాచ్ జరుగనుంది. వన్డే జట్టు.. మనీష్ పాండే(కెప్టెన్), మన్ దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కృణాల్ పాండ్యా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), విజయ్ శంకర్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, జయంత్ యాదవ్, బాసిల్ తంపి, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్ద్ కౌల్ అనధికార టెస్టు మ్యాచ్‌లు జట్టు.. కరుణ్ నాయర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), ప్రియంక్ పాంచల్, అభినవ్ ముకుంద్, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, సుదీప్ ఛటర్జీ, హనుమ విహారి, జయంత్ యాదవ్, నదీమ్, నవదీప్ సైనీ, సిరాజ్ శార్దూల్ ఠాకూర్, అంకిత్ చౌదరి, అనికిత్ చౌదరి, అంకిత్ రాజ్ పుత్ -
యువరాజ్ క్యాచ్ పట్టి ఉంటే..
న్యూఢిల్లీ: వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై ఝూలువిదిలిచ్చింది. పటిష్ట సన్ రైజర్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై టీమిండియా క్రికెటర్, ఢిల్లీ తాత్కాలిక కెప్టెన్ కరుణ్ నాయర్ హర్షం వ్యక్తంచేశాడు. జట్టులో యువకులు ఉన్నారని, ఎలాంటి భయం లేకుండా ఆడటమే సన్ రైజర్స్పై విజయానికి కారణమన్నాడు. 'బౌలర్లు శ్రమించినా సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది. యువరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను మా వాళ్లు వదిలేయడంతో వారికి కలిసొచ్చింది. లైఫ్ రావడంతో యువరాజ్ విజృంభించి ఆడాడు. లేకపోతే మాకు విజయం సులువుగా సాధ్యమయ్యేది' అని కరుణ్ నాయర్ అభిప్రాయపడ్డాడు. 'డేర్ డేవిల్స్ పోరాటపటిమతో ఆకట్టుకుంది. 186 పరుగుల లక్ష్యం ఛేదించడం కష్టమని భావించాం. కానీ ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షాలో అద్బుతం చేసింది' అని మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. గాయం కారణంతో ఢిల్లీ పర్మనెంట్ కెప్టెన్ జహీర్ ఖాన్ దూరం కావడంతో బాధ్యతలు తీసుకున్న కరుణ్ నాయర్ జట్టుకు విజయాన్ని అందించాడు. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి మూడో విజయాన్ని నమోదు చేసింది. -
విజయ్ అవుట్.. ముకుంద్, నాయర్ ఇన్
-
విజయ్ అవుట్.. ముకుంద్, నాయర్ ఇన్
బెంగళూరు: తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌కు దాదాపు ఐదున్నరేళ్ల విరామం తర్వాత భారత టెస్టు జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేశారు. తొలిటెస్టులో గాయపడ్డ ఓపెనర్ మురళీ విజయ్ను పక్కనబెట్టి, అతని స్థానంలో ముకుంద్‌ను తీసుకున్నారు. ఇక జయంత్ యాదవ్‌ను తప్పించి ఎక్స్ట్రా బ్యాట్స్‌మన్‌గా ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్‌కు తుది జట్టులో స్థానం కల్పించారు. ఈ రెండు మార్పులు మినహా తొలి టెస్టులో ఆడిన ఆటగాళ్లు రెండో టెస్టులో బరిలో దిగారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోన్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లోకేష్ రాహుల్, ముకుంద్ బ్యాటింగ్‌కు దిగారు. పుణెలో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేన ఘోరపరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పుంజుకుని విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. -
వారితో నాకు పోటీ లేదు: రోహిత్ శర్మ
ముంబై: తొడ కండరాల గాయం కారణంగా నాలుగు నెలలుగా ఆటకు దూరమై తిరిగి కోలుకున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో ముంబై తరపున రోహిత్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడటానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రోహిత్.. .త్వరలో భారత్ జట్టులో చోటు సంపాదిస్తాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకు ఎవరితోనూ పోటీ కాదని విషయాన్ని ఈ సందర్భంగా రోహిత్ స్పష్టం చేశాడు. మరో ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లు అజింక్యా రహానే, కరుణ్ నాయర్ల నుంచి ఏమైనా పోటీని ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు రోహిత్ కాదనే సమాధానం ఇచ్చాడు. ఆ ఇద్దరితో తనకు ఎటువంటి పోటీ లేదని రోహిత్ తెలిపాడు. ' నా కెరీర్ ఆశాజనకంగానే ఉంది. నేనెప్పుడూ జట్టులో పోటీ గురించి ఆలోచించ లేదు. నీవు ఆటగాడి మెరుగుపడని పక్షంలో మాత్రమే పోటీ గురించి ఆలోచిస్తాం. నాకు అటువంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. నాకు నేనే పోటీ. ఇలా అనవసరపు విషయాలు గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోదలుచుకోలేదు. భారత్ జట్టు తరపున ప్రతీ మ్యాచ్ ఆడాలనే కోరుకుంటా'అని రోహిత్ పేర్కొన్నాడు. -
‘ఇది నా వాలెంటైన్ ’
భారత క్రికెటర్ కరుణ్ నాయర్ కొత్త కారు కొన్నాడు.. కొంటే కొన్నాడు ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు విషయం. భారత టెస్టు చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ అనంతరం ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఈ కర్ణాటక స్టార్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతడు చేసిన పరుగులు 303. సరిగ్గా ఇదే నంబర్‌ను తను ముచ్చటగా కొనుకు్కన్న ఫోర్డ్ మస్టాంగ్ కారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతేకాదండోయ్.. మీరు సరిగ్గా గమనిస్తే ఇందులో కనిపించే ఇంగ్లిష్ అక్షరాలో్లనూ విషయం ఉంది. కేఏ అంటే కర్నాటక మాత్రమే కాదు.. కరుణ్ పేరులో మొదటి రెండక్షరాలు కూడా.. ఇక జిల్లా కోడ్‌కు సంబంధించిన దాంట్లో ఎన్ ఏ అక్షరాలున్నాయి. అంటే నాయర్లో తొలి రెండు అక్షరాలు కలిసివస్తున్నాయి. ఇలా తను సాధించిన అత్యదు్భత ఇన్నింగ్స్‌కు గుర్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ కారు ఫొటోను ట్వీట్ చేసిన కరుణ్ ‘ఇది నా వాలెంటైన్ ’ అని చెప్పడం విశేషం. -
పాపం నాయర్...
అద్భుతమైన ఆటతో గత టెస్టులో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసినా కరుణ్ నాయర్‌కు తర్వాతి మ్యాచ్‌లో మాత్రం జట్టులో చోటే దక్కలేదు. ముందునుంచీ కోచ్, కెప్టెన్ చెబుతూ వచ్చినట్లు గాయం నుంచి కోలుకొని వచ్చిన రహానేపైనే మేనేజ్మెంట్ నమ్మకముంచింది. దాంతో నాయర్ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. వేర్వేరు కారణాలతో ఇలా ‘ట్రిపుల్ సెంచరీ’ చేశాక తమ జట్టు ఆడిన తర్వాతి మ్యాచ్‌లో చోటు దక్కని నాలుగో ఆటగాడు కరుణ్. గతంలో ఆండీ సాన్దమ్, లెన్ హటన్, ఇంజమామ్ ఈ దురదృష్టవంతుల జాబితాలో ఉన్నారు. -
ట్రిపుల్ సెంచరీ వీరుడికి నిరాశే!
హైదరాబాద్: టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీలు సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేపై నమ్మకం ఉంచారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు నుంచి రహానే గాయం కారణంగా వైదొలగడంతో అతడి స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు. ఆ టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. కానీ అందరూ ఊహించినట్లుగా జరగలేదు. రేపు (గురువారం) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టెస్టులో ట్రిపుల్ వీరుడు కరుణ్కి చోటు దక్కలేదు. గాయం నుంచి రహానే కోలుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత రెండేళ్లుగా రహానే జట్టుకు అందించిన సేవలను కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనియాడాడు. టెస్టు ఫార్మాట్లో భారత్ తరఫున రహానే అత్యుత్తమ ఆటగాడని, కొన్ని సందర్భాల్లో విఫలమైనంత మాత్రానా పక్కనపెట్టడం సబబు కాదని పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా జట్టులో కొనసాగుతున్న రహానే మద్థతుగా నిలవాల్సిన సమయం ఇదేనని, యాథావిధంగా రహానే జట్టులోకి వస్తున్నాడని చెప్పాడు. ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయకూడదని, న్యూజిలాండ్ లో వారి ఆటతీరును గుర్తుంచుకోవాలని సహచరులకు కెప్టెన్ కోహ్లీ సూచించాడు. -
నాయర్ లేదా రహానే?
తుది జట్టు ఎంపిక ఆసక్తికరం జోరు కొనసాగిస్తామన్న కుంబ్లే రెండో రోజూ భారత్ ప్రాక్టీస్ సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుతమైన ‘ట్రిపుల్ సెంచరీ’తో కరుణ్ నాయర్ సత్తా చాటాడు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో మరో సందేహం లేకుండా అతను తుది జట్టులో ఉండాలి. కానీ భారత కోచ్ అనిల్ కుంబ్లే మాత్రం అది తప్పనిసరి కాదని పరోక్షంగా సూచనలు ఇచ్చారు. నాయర్‌కు ముందు అజింక్య రహానే ఆడిన మ్యాచ్‌లను మరచిపోవద్దని ఆయన అన్నారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల తర్వాత రహానే గాయపడటంతో నాయర్‌కు అవకాశం లభించగా, దానిని అతను పూర్తిగా సద్వినియోగ పరుచుకున్నాడు. ‘తనకు ఇచ్చిన అవకాశాన్ని నాయర్ ఉపయోగించుకోవడం మంచి పరిణామం. ఒక కుర్రాడు ట్రిపుల్ సెంచరీ సాధించడం అభినందించాల్సిన అంశమే. అలాంటి వాళ్లు ఉండటం వల్ల జట్టు బలం ఏమిటో తెలిసింది. అయితే రహానే జట్టుకు ఏం చేశాడో అందరికీ తెలుసు. అన్ని రకాల పరిస్థితుల్లో రహానే అద్భుత ప్రదర్శన కనబర్చాడు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితుల మధ్య వీరిద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారో చూడాలి. గురువారం నుంచి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కుంబ్లే మీడియాతో మాట్లాడారు. సొంతగడ్డపై తమ జోరును ఈ టెస్టులోనూ కొనసాగిస్తామని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఇప్పటి వరకు మేం చాలా బాగా ఆడాం. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతాం. బంగ్లాదేశ్‌తో టెస్టు కోసం మేం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. మా వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయి. దాని ప్రకారం వెళితే కచ్చితంగా విజయం దక్కుతుంది’ అని కుంబ్లే అన్నారు. గతంతో పోలిస్తే బంగ్లాదేశ్ ఎంతో మెరుగైందని, దానిని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. ఓపెనర్లుగా విజయ్, రాహుల్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవని, ముందు జాగ్రత్త కోసమే ముకుంద్‌ను తీసుకున్నట్లు కుంబ్లే వెల్లడించారు. ఈ సీజన్లో స్పిన్నర్లతో పాటు మన పేసర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచారన్న కోచ్... అశ్విన్, జడేజాలపై ప్రశంసలు కురిపించారు. టెస్టు ఫార్మాట్లో కూడా మంచి ఆల్‌రౌండర్ అయ్యే లక్షణాలు హార్దిక్ పాండ్యాలో ఉన్నాయని, మున్ముందు అతడిని కూడా పరీక్షించే అవకాశం ఉందని కుంబ్లే వెల్లడించారు. వరుసగా రెండో రోజు కూడా భారత జట్టు ఉప్పల్ స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు సాధన చేసింది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో పాటు ప్రధాన మైదానంలో ఆటగాళ్ళంతా ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. బంగ్లాదేశ్ జట్టు మాత్రం మంగళవారం విశ్రాంతి తీసుకుంది. ‘మళ్లీ జరగొచ్చు... జరగకపోవచ్చు’ సరిగ్గా 18 ఏళ్ల క్రితం అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. దానిని గుర్తు చేసుకుంటూ కుంబ్లే తన ఆనందం వ్యక్తం చేశారు. ‘అభిమానులు ఇలా వార్షికోత్సవాలు కూడా గుర్తుంచుకోవడం, మేం కూడా వేడుకగా జరుపుకోవడం చాలా బాగుంటుంది. అప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని 10 వికెట్లు తీస్తానని నేను అసలు ఊహించలేదు. అది అలా జరిగిపోయిందంతే. నాకు రాసి పెట్టి ఉంది. అదో అరుదైన సందర్భం. అయితే భవిష్యత్తులో అలాంటిది మళ్లీ సాధ్యం కావచ్చు లేదా ఎప్పటికీ కాకపోవచ్చు’ అని కుంబ్లే వ్యాఖ్యానించారు. అశ్విన్‌కు అచ్చొచ్చిన మైదానం... భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉప్పల్ స్టేడియంలో మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మైదానంలో ఆడిన 2 టెస్టులలో కలిపి అశ్విన్ 18 వికెట్లు పడగొట్టాడు. అతను తన కెరీర్లో తొలిసారి మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టింది ఇక్కడే. పైగా తన శైలికి ఇది సరిగ్గా సరిపోతుందని అతను చెబుతున్నాడు. ‘నేను ఈ స్టేడియాన్ని ఇష్టపడేందుకు ఇక్కడి మంచి రికార్డు ఉండటం ఒక్కటే కారణం కాదు. మొత్తం సౌకర్యాలన్నీ బాగుంటాయి. మంచి పచ్చికతో అవుట్‌ఫీల్డ్ ఆకట్టుకుంటుంది. స్పిన్నర్ల కోణంలో ఇది చాలా పెద్ద మైదానం. బంతిని గాల్లో ఎక్కువ సేపు ఉంచుతూ బౌలింగ్ చేయవచ్చు. వికెట్లో ఉండే బౌన్స్ వల్ల కొత్తగా ప్రయత్నించేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ బౌలింగ్ చేయడాన్ని నేను ఇష్టపడతాను’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. పరిశీలకుడిగా రత్నాకర్ శెట్టి... భారత్, బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు బీసీసీఐ జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్మెంట్) రత్నాకర్ శెట్టిని పరిశీలకుడిగా బోర్డు నియమించింది. హెచ్‌సీఏలో గుర్తింపు పొందిన కార్యవర్గం లేకపోవడంతో హైకోర్టు చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శెట్టికి తోడుగా బోర్డు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ రంగ్నేకర్ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. కాచుకో బంగ్లాదేశ్... అద్భుతమైన ఆటతో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లి గతంలో బంగ్లాదేశ్‌తో ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ధోని రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత కోహ్లికి అదే తొలి టెస్టు కావడం విశేషం. 2015 జూన్‌లో ఫతుల్లాలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఆధిక్యం ప్రదర్శించినా, వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిసింది. విజయ్, ధావన్ శతకాలు బాదిన ఆ మ్యాచ్‌లో కోహ్లి 14 పరుగులు చేసి బౌల్డయ్యాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్ హోదాలో బంగ్లాను విరాట్ ఎదుర్కోబోతున్నాడు. అతని తాజా ఫామ్ నేపథ్యంలో కోహ్లిని బంగ్లా బౌలర్లు అసలు ఆపగలరా! -
ఏదైనా జరగొచ్చు: కరుణ్ నాయర్
ముంబై:ఇటీవల ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించి, భారత్ తరపున ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దాంతో ఇంగ్లండ్ తో వన్డే, ట్వంటీ 20 సిరీస్‌ల్లో ఆ యువ క్రికెటర్ కు స్థానం దక్కుతుందని భావించారు. అయితే ఇంగ్లండ్ తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ కు నాయర్ ఎంపిక కాలేదు. ఇదిలా ఉంచితే త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు నాయర్‌కు ప్రాబబుల్స్ లో చోటు దక్కినా, తుది జట్టులో ఉంటాడా?లేదా?అనేది మాత్రం ప్రశ్నార్థకమే. అజింక్యా రహానే ఫిట్ నెస్ నిరూపించుకుని జట్టులోకి వచ్చిన నేపథ్యంలో నాయర్ స్థానంపై పూర్తిస్థాయి భరోసా లేకుండా పో్యింది. ట్రిపుల్ సెంచరీతో ఆకట్టుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఏమిటని అడిగిన ప్రశ్నకు నాయర్ తనదైన శైలిలో స్పందించాడు. 'నా స్థానం గురించి పదే పదే ఆలోచించి ఆందోళన చెందడం అనవసరం. నాకు ఎప్పుడైతై అవకాశం వస్తుందో అప్పుడే నన్ను నిరూపించుకుంటా. ప్రస్తుతం నా ఆటపరంగా నాకు ఎటువంటి ఇబ్బందీలేదు. వచ్చే సిరీస్ ల్లో తుది జట్టులో ఉంటానా?లేదా?అనే దానిపై అస్సలు ఆలోచించడం లేదు. క్రికెట్లో ఏదైనా జరగొచ్చు' అని నాయర్ తెలిపాడు. 'వచ్చే గురువారం బంగ్లాదేశ్ తో హైదరాబాద్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ను భారత్ గెలుచుకుంటుందని నాయర్ ధీమా వ్యక్తం చేశాడు. పూర్తి ఫామ్‌లో ఉన్న తమ జట్టు బంగ్లాపై విజయం సాధించడం ఖాయమన్నాడు. -
కరుణ్ నాయర్ 'ట్రిపుల్' సరిపోలేదా?
ముంబై:ఇంగ్లండ్ తో చివరిదైన ఐదో టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆద్యంతం ఆకట్టుకున్న నాయర్(303 నాటౌట్;381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) అజేయంగా ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇదే క్రమంలో తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చిన ఏకైక భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దాంతో ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో నాయర్‌కు ఛాన్స్ ఖాయంగా కనబడింది. యువ క్రికెటర్లకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్టర్లు నాయర్‌కు అవకాశం ఇస్తారనే అంతా భావించారు. అయితే చెన్నై టెస్టులో విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆ మళయ మారుతానికి అవకాశం దక్కలేదు. ఇక్కడ ఇద్దరు వెటరన్ క్రికెటర్లను ఎంపిక చేసిన సెలక్టర్లు.. నాయర్‌ను పక్కన పెట్టేశారు. ధోని కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తరువాత యువరాజ్ జట్టులోకి రాగా, అనూహ్యంగా ఆశిష్ నెహ్రాకు కూడా ఇంగ్లండ్ తో తదుపరి సిరీస్‌లో చోటు కల్పించారు. వచ్చే వరల్డ్ కప్‌కు బీసీసీఐ ఓ వ్యూహంతో వెళుతుందని భావించి సరిపెట్టుకున్నా, మరొక అంశాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ఇంగ్లండ్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా భారత్-ఎ జట్టులో కూడా నాయర్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. భారత్ ఆడబోయే రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. అంటే కనీసం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడటానికి కూడా నాయర్ సరిపోడా అనే ప్రశ్న తలెత్తుంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వగా, నాయర్‌ను మాత్రం పట్టించుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌లో లేని సంజూ శాంసన్, అంబటి రాయుడులకు ప్రాక్టీస్ మ్యాచ్‌లో చోటు కల్పించిన సెలక్టర్లు.. ట్రిపుల్ కొట్టిన వీరుడ్ని పక్కన పెట్టేశారు. అతని ప్రతిభ సెలక్టర్ల దృష్టిలో పడలేదా?లేక ఆ ట్రిపుల్ ఏదో యాధృచ్ఛికంగా చేసింది మాత్రమేనని సెలక్టర్లు భావించారా? అనేది మాత్రం వారి విజ్ఞానానికే వదిలేయాలి. నెహ్రా అవసరం ఉందా? సగటు క్రీడా అభిమానికి తలెత్తి ఒకే ఒక్క ప్రశ్న భారత వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఎంపిక. ఇంగ్లండ్ తో మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో నెహ్రాను ఎంపిక చేసిన సెలక్టర్ల నిర్ణయం ఆశ్చర్యపరిచేదే. దాదాపు పది నెలల తరువాత టీ 20 జట్టులోకి వచ్చిన నెహ్రా ఎంత వరకూ రాణిస్తాడు అనేది మాత్రం ప్రశ్నార్థకం. వరల్డ్ టీ 20లో భాగంగా మార్చినెలలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నెహ్రా చివరిసారి పాల్గొన్నాడు. ఆ మ్యాచ్‌లో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన నెహ్రా ఆశించిన ప్రదర్శన కూడా ఏమీ చేయలేదు. ఆ తరువాత నుంచి ఇంటికే పరిమితమైన నెహ్రాను అనూహ్యంగా జట్టులోకి తీసుకున్నారు. వచ్చే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసే సెలక్టర్లు నెహ్రాను ఎందుకు ఎంపిక చేసినట్లు. ప్రస్తుతం 38వ ఒడిలో ఉన్న నెహ్రా.. ఆ వరల్డ్ కప్ నాటికి పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉంటాడా?అనేది సెలక్టర్లకే తెలియాలి. ఇప్పటికే ఫిట్నెస్ పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న నెహ్రా.. వచ్చే ట్వంటీ 20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కించుకోవడం కష్టం కూడా. 2019లో ఆడబోయే వన్డే వరల్డ్ కప్‌కే యువ క్రికెటర్లకు చోటు కల్పించాలనే దిశగా బీసీసీఐ పయనిస్తోంది. ఆ క్రమంలోనే ధోని కూడా తన పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనేది అందరికీ విదితమే. ఇక్కడ ఎంతో మంది యువ బౌలర్లు ఉండగా, నెహ్రాకు ఎందుకు చోటు కల్పించినట్లు. ఒకవైపు యువ క్రికెటరైన నాయర్ కు చోటు ఇవ్వని సెలక్టర్లు.. వెటరన్ బౌలర్ అయిన నెహ్రాకు ఏ ఉద్దేశంతో అవకాశం ఇచ్చారనేది మింగుడు పడని ప్రశ్నే. -
కరుణ్, జయంత్ రాణించడం వారి చలవే
రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: కరుణ్ నాయర్, జయంత్ యాదవ్‌ల ప్రదర్శనకు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లేలే కారణమని రాహుల్ ద్రవిడ్ అన్నారు. యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తున్న ఈ భారత యువ జట్ల కోచ్... కుర్రాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు వాళ్లిద్దరు చక్కని వాతావరణాన్ని కల్పిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ‘బీసీసీఐ.టీవీ’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ద్రవిడ్ మాట్లాడుతూ దేశవాళీ టోర్నీల్లో కుర్రాళ్లు బాగా ఆడుతున్నారని కితాబిచ్చాడు. ‘తొలి టెస్టు సిరీస్‌లో సాధించిన సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మలచుకోవడం గొప్ప విషయం. కేవలం అతని సత్తావల్లే ఇది సాధ్యమైందనుకోవడం లేదు. సాధించాలన్న తపన, నిరూపించుకోవాలన్న కసి వల్లే ఈ చారిత్రక ఇన్నింగ్స్ వచ్చింది. కుర్రాళ్లు ఒకరి తర్వాత ఒకరు రాణించడం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. భవిష్యత్ జట్టుకు మంచి పునాది పడుతుందనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది’ అని ద్రవిడ్ అన్నాడు. కరుణ్, జయంత్‌లతో పాటు హార్దిక్ పాండ్యా, కె.ఎల్.రాహుల్‌లు భారత్ ‘ఎ’ జట్టు నుంచే వచ్చారు. వీరందరికి ద్రవిడే మార్గదర్శనం చేశారు. ఎప్పటికప్పుడు జాతీయ జట్టును సంప్రదిస్తూనే ఉన్నామని వారికి అవసరమైన నైపుణ్యమున్న ఆటగాళ్లను తయారు చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్లు కావాలంటే వారిపైనే దృష్టిపెడతామని ద్రవిడ్ వివరించాడు. -
కరుణ్ నాయర్.. టీ అమ్మడానికి వస్తున్నాడా?
చెన్నై:కరుణ్ నాయర్.. ఇప్పుడు భారత్ క్రికెట్ నుంచి ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. దాంతో పాటు తొలి సెంచరీని ట్రిపుల్ గా మార్చిన ఏకైక భారత క్రికెటర్, ప్రపంచ మూడో బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. ఇటీవల చెన్నైలో ఇంగ్లండ్ తో జరిగిన చివరిదైన ఐదో టెస్టులో నాయర్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిపోయి ట్రిపుల్ నమోదు చేశాడు. అయితే చెన్నై టెస్టుకు ముందు నాయర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆ టెస్టు మ్యాచ్‌కు ముందు నాయర్ టీ అమ్మడానికి చెన్నై వస్తున్నాడంటూ తమిళనాడులో సెటైర్లు వెలుగుచూశాయి. సోషల్ మీడియాలో నాయర్ పై జోక్ వేస్తూ పలువురు తమిళనాడు నెటిజన్లు ఎంజాయ్ చేశారు. 'నాయర్ కేవలం టీ అమ్మడానికి చెన్నై వస్తున్నాడా?, టీ షాపు అతనికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది' అంటూ నెటిజన్లు జోక్స్ వేసుకున్నారు. అయితే ఆ విమర్శలకు నాయర్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. అతను ఆడిన తొలి రెండు టెస్టుల్లో వైఫల్యం చెందడమే నాయర్ పై జోక్‌లకు బీజం వేసింది. అయితే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నాయర్ ఏకంగా ట్రిపుల్ కొట్టి మరీ సెటైర్లను తిప్పికొట్టాడు. నాయర్‌పై జోక్స్ వేసుకోవడంపై అతని కోచ్ బి శివానందా అసంతృప్తి వ్య్తక్తం చేశాడు. ఎక్కడైనా వైఫల్యం అనేది ఉంటుందనేది గ్రహిస్తే మంచిదంటూ చురకలు వేశాడు. ఈ తరహా కామెంట్లు ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించాడు. ఇలా జోక్స్ వేసుకోవడం వల్ల ఆయా ప్రజల మైండ్ సెట్‌ను బయటపెడుతుందే తప్ప ఇంకేమి కలిసిరాదన్నాడు. -
మున్నూరు టాపులు
-
జడేజా చెప్పాక ట్రిపుల్ గురించి ఆలోచించా
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో చెన్నై టెస్టులో అజేయ ట్రిపుల్ సెంచరీ చేశాక టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ స్టార్ క్రికెటర్ అయ్యాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కరుణ్ తన మూడో టెస్టులోనే రికార్డు నెలకొల్పడం విశేషం. తద్వారా టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ముందడుగు వేశాడు. అందరూ దీని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టిన తర్వాత తన ట్రిపుల్ సెంచరీ విలువ అర్థమైందని కరుణ్ చెబుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అతను పలు విషయాలు వెల్లడించాడు. ‘కుటుంబ సభ్యులు, టీమ్ మేనేజ్మెంట్ ఎంతో మద్దతుగా నిలిచారు. ట్రిపుల్ సెంచరీ చేశాక ఎంతో మంది అభినందించారు. గతంతో పోలిస్తే ప్రత్యేకంగా చూస్తున్నారు. అభినందిస్తూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఈ సంతోష క్షణాలను ఆస్వాదించాను. అభినందనలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. మ్యాచ్ లో సెంచరీ చేశాక ఒత్తిడి నుంచి బయటపడ్డాను. జట్టుకు ఆధిక్యం లభించాక స్వేచ్ఛగా ఆడాల్సిందిగా నాకు సూచనలు వచ్చాయి. ట్రిపుల్ సెంచరీ చేయడానికి జట్టు సూచనలు ఉపయోగపడ్డాయి. నా శైలిలో స్వేచ్ఛగా షాట్లు ఆడా. నేను 280 పరుగులు చేశాక ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశముందని బ్యాటింగ్ పార్టనర్ రవీంద్ర జడేజా చెప్పాడు. దీంతో చేయగలననే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ట్రిపుల్ కోసం ఆడాను. ట్రిపుల్ సెంచరీ చేశాక డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ సంతోషంగా స్వాగతం పలికారు. ట్రిపుల్ సెంచరీ చేసిన రోజు సంబరాలు చేసుకోలేదు. మరుసటి రోజు మ్యాచ్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్నాం. అనిల్ కుంబ్లే పిలవడం వల్ల మా తల్లిదండ్రులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి వచ్చారు. అమ్మనాన్నలు ట్రిపుల్ సెంచరీని ప్రత్యక్షంగా చూసినందుకు సంతోషంగా ఉంది’ అని నాయర్ చెప్పాడు. -
టెస్ట్ సిరీస్: ఈ భారీ రికార్డులు మీకు తెలుసా?
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో విరాట్ సేన అసమాన పోరాటపటిమ కనబరిచి.. 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఎన్నో మెరుపులు, మరెన్నో రికార్డులో కోహ్లి సేన సొంతం చేసుకుంది. అవి.. టెస్టుల్లో భారత్ తన అత్యధిక స్కోరును ఈ సిరీస్‌లోనే సాధించింది. చెన్నైలో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 759/7 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సొంతం చేసుకుంది. కరుణ్ నాయర్ చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. అతని అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా టెస్టుల్లో తన అత్యధిక స్కోరు రికార్డును సాధించగలిగింది. ఒకే సంవత్సరం మూడు డబుల్ సెంచరీలు సాధించిన మొదటి టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి 235 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన వ్యక్తిగత పరుగులు 655. ఒక టెస్టు సిరీస్‌లో 600కుపైగా పరుగులు కోహ్లికి ఇది రెండోసారి. సునీల్ గవస్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డు పుటల్లోకి ఎక్కాడు. రవిచంద్రన్ అశ్విన్ ఈ సిరీస్‌లో 25 వికెట్లు, 250కిపైగా పరుగులు చేయడం ద్వారా.. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా చరిత్ర సృష్టించాడు. అతను ఈ సిరీస్‌లో 306 పరుగులు చేయడమే కాదు, 28 వికెట్లు పడగొట్టాడు. వందేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లు 20కిపైగా వికెట్లు పడగొట్టడం, రెండు అంతకుమించి అర్ధసెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్లుగా అశ్విన్, రవీంద్ర జడేజా నిలిచారు. టెస్టు క్రికెట్లో మూడువేల పరుగులు మైలురాయిని దాటిన 20వ క్రికెటర్‌గా చటేశ్వర్ పూజారా, 21వ క్రికెటర్‌గా మురళీవిజయ్ నిలిచారు. టెస్టుల్లో 4000వేల పరుగుల మైలురాయిని దాటిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఇంగ్లండ్ జట్టుపై భారత్‌కు ఇదే అతిపెద్ద సిరీస్ విజయం. 1993లో అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ ఎదుర్కొంది. 2008 తర్వాత ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన తొలి టెస్టు సిరీస్ విజయం కూడా ఇదే. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టు సిరీస్‌లలోనూ భారత్ ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. 140 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 55 బంతుల్లో 51 పరుగులు చేసి, పది వికెట్లు తీసుకొని, నాలుగు క్యాచ్‌లు అందుకున్నతొలి క్రికెటర్‌గా జడేజా అద్భుతమైన రికార్డు సాధించాడు. -
రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసలు
న్యూఢిల్లీ:ఇంగ్లండ్ తో చివరిదైన ఐదో టెస్టులో భారత ఆటగాడు కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయడాన్ని ప్రత్యేకంగా అభినందించిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్.. దిగ్గజ ఆటగాడు, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కరుణ్ నాయర్ ట్రిపుల్ చేయడం వెనుక రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందని కొనియాడాడు. యువ క్రికెటర్లకు అమూల్యమైన టెక్నిక్స్‌ను నేర్పుతూ వారు రాణించడానికి ద్రవిడ్ పరోక్షంగా కారణమవుతున్నాడన్నాడు. 'భారత జట్టు అసాధారణ ప్రదర్శనను అభినందిస్తున్నా. మూడో ఇన్నింగ్స్ లోనే కరుణ్ నాయర్ ఆకట్టుకోవడం అతనిలో సత్తాకు నిదర్శనం. 25 ఏళ్లకే ట్రిపుల్‌ను సాధించడమంటే అది నిజంగానే గొప్ప ఘనత.అ తనికి ప్రత్యేక అభినందనలు. ప్రధానంగా అండర్19, భారత్-ఎ సైడ్లు ప్లాట్‌ఫాం పటిష్టంగా ఉండటంతోనే భారత జాతీయ జట్టు బలంగా కూడా పెరుగుతుంది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో కుర్రాళ్లు రాటుదేలుతున్నారు. అతని ఇచ్చే సూచనలు, అనుభవం యువ క్రికెటర్లకు వరంలా మారుతుంది'అని అనురాగ్ ఠాకూర్ ప్రశంసించాడు.ఇంగ్లండ్ తో చివరి టెస్టులో కరుణ్ నాయర్ అజేయ ట్రిపుల్ సాధించిన సంగతి తెలిసిందే. -
ముప్పైని మూడొందలుగా మార్చాడు!
చెన్నై: కరుణ్ నాయర్... ఆడుతున్న మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్న క్రికెటర్. భారత్ నుంచి కేవలం వీరేంద్ర సెహ్వాగ్‌కు మాత్రమే సాధ్యమైన ఆ అరుదైన ఘనతను సాధించిన ఆటగాడు. దాంతో పాటు తొలి సెంచరీని డబుల్‌గా మార్చిన మూడో భారత క్రికెటర్‌గా, మొదటి శతకాన్ని ట్రిపుల్ గా మార్చిన ప్రపంచ మూడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఇక్కడ కరుణ్ నాయర్‌కు అదృష్టం రెండు విధాల కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌కు ముందు నాయర్ స్థానంలో మరో భారత ఆటగాడు మనీష్ పాండే తుది జట్టులో ఆడే అవకాశం ఉందనే వాదన వినిపించింది. అందుకు కారణం అంతకుముందు నాయర్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలం కావడమే. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ టెస్టుల ద్వారా అరంగేట్రం చేసిన నాయర్.. ఆ తరువాత ముంబైలో టెస్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఆ రెండు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడిన నాయర్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నాయర్ స్థానంలో మనీష్ కు అవకాశం కల్పించాలనే అనుకున్నారు. ఇది భారత్ కు నామ మాత్రపు టెస్టే కావడంతో ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తారనే అంతా భావించారు. అయితే ఈ కర్ణాటక కుర్రాడిపై నమ్మకం ఉంచిన అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లిలు మళ్లీ మరొక అవకాశం ఇచ్చి చూశారు. దాన్ని చక్కగా వినియోగించుకున్న నాయర్ ఇప్పుడు రికార్డుల ధీరుడిగా మారిపోయాడు. కాగా, నాయర్ కు మరొక అదృష్టం కలిసొచ్చింది. భారత తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో నాయర్ 34 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 85.0 ఓవర్లో ఇంగ్లిష్ బౌలర్ బాల్ వేసిన బంతికి నాయర్ కాస్త తడబడ్డాడు. కొద్దిగా స్వింగ్ అవుతూ వచ్చిన బంతిని నాయర్ గట్టిగా కొట్టాడు. ఆ క్రమంలోనే బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కుక్ చేతుల్లోంచి దాటుకుని బౌండరీకి తరలిపోయింది. ఈ క్షణంలో కాస్త అప్రమత్తంగా ఉండి ఉంటే క్యాచ్ ను పట్టుకోవడం కూడా కష్టం కాదనే అనిపించింది. ఒకవేళ కుక్ ఆ క్యాచ్ ను పట్టివుంటే నాయర్ ఇన్నింగ్స్ అప్పుడే ముగిసేది. కాకపోతే క్రికెట్లో క్యాచ్‌లను వదిలివేయడం సాధారణంగా జరిగే పరిణామమే అయినప్పటికీ నాయర్ కు అదృష్టం ఇలా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆ తరువాత ఎటువంటి అవకాశం ఇవ్వని నాయర్ ట్రిపుల్ తో చెలరేగిపోయాడు. ఆ క్రమంలోనే భారత అభిమానులకు పండుగ చేశాడు. -
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్
-
నాయర్‌పై ప్రశంసల జల్లు
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో త్రిశతకం సాధించిన కరుణ్ నాయర్‌పై ప్రధాని మోదీతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ►‘చారిత్రక ట్రిపుల్ సెంచరీ సాధించినందుకు కరుణ్ నాయర్‌కు అభినందనలు. నీ ఘనతపై మేమంతా గర్వంగా ఫీలవుతున్నాం’. – ప్రధాని మోదీ ►‘కరుణ్ ట్రిపుల్ సెంచరీ సాధించిన క్షణాలు భారత క్రికెట్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. దేశానికి మరింత పేరు తేవాలి’. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు) ► ‘నాయర్ సాధించిన ఫీట్‌పై స్పందించేందుకు మాటలు రావడం లేదు. అతడి బ్యాటింగ్ తీరు అద్భుతం’. – కపిల్ దేవ్ ►‘కరుణ్, కేఎల్ రాహుల్ ఆట అసాధారణం. వీరిని చూస్తే గతంలో కర్ణాటక నుంచే వచ్చిన విశ్వనాథ్, ద్రవిడ్ బ్యాటింగ్ గుర్తుకువస్తోంది’. – గావస్కర్ ►‘300 క్లబ్‌లోకి స్వాగతం. 12 ఏళ్ల ఎనిమిది నెలల నుంచి ఇందులో నేనొక్కడినే ఉంటూ బోర్‌గా ఫీలవుతున్నాను. మరోసారి ఈ ఫీట్ సాధిస్తావనుకుంటున్నాను’. – సెహ్వాగ్ -
‘మలయాళ’ మారుతం
నెలలు నిండకుండానే జన్మించిన బిడ్డ కరుణ్ నాయర్...బలహీనమైన ఊపిరితిత్తులతో పుట్టి సరిగా కూర్చోలేక పదే పదే కింద పడిపోయేవాడు. వయసు ఎదుగుతున్నా పసివాడిలాగే ఏడుపు ఉండేది. ఒక దశలో అతను ఎలా బతకగలడో అన్న ఆందోళన కూడా వారితల్లిదండ్రుల్లో ఉండేది. ఎక్కువగా మాట్లాడని ఆ కుర్రాడికి పసితనమంతా‘ప్లే స్టేషన్’తోనే గడిచింది.దాదాపు ఆరు నెలల క్రితం భారత్ తరఫున తొలి వన్డే మ్యాచ్ ఆడిన తర్వాత కరుణ్ మొక్కు తీర్చుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి అలెప్పీకి వెళ్లాడు. అయితే వీరు ప్రయాణిస్తున్న బోటు పంపా నదిలో తిరగబడటంతో అతని సన్నిహితుల్లో ఇద్దరు చనిపోగా, ఈత రాక మునిగిపోతున్న నాయర్‌ను స్థానికులు కాపాడారు.ఈ రెండు ఘటనల మధ్య పాతికేళ్ల వ్యవధి ఉంది. అప్పుడు అతని జీవితం గురించి కన్నవారు బెంగ పడ్డారు. ఇప్పుడు తనకు లభించిన కొత్త జీవితంతో ఏదైనా సాధించాలని అతను గట్టిగా తనకు తాను చెప్పుకున్నాడు. సరిగ్గా ఆరు నెలల తర్వాత కరుణ్ నాయర్ కొత్త చరిత్రను సృష్టించాడు. భారత క్రికెట్‌ను సుసంపన్నం చేసిన మహామహులకే సాధ్యం కాని రీతిలో ట్రిపుల్ సెంచరీతో టెస్టు ప్రపంచంలో తనదైన పేరును సగర్వంగా లిఖించుకున్నాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన తండ్రి కళాధరన్ ఉద్యోగరీత్యా జోధ్‌పూర్‌లో ఉన్నప్పుడు కరుణ్ పుట్టాడు. ఈ మలయాళీ కుటుంబం చివరకు బెంగళూరులో స్థిరపడింది. ప్రాథమిక స్థాయిలో రాణించిన తర్వాత మంగళూరు యునైటెడ్ క్లబ్ అతడికి మంచి అవకాశాలు కల్పించింది. అక్కడ రాటుదేలి 15 ఏళ్ల వయసులోనే కర్ణాటక అండర్–19 జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత కరుణ్ వెనుదిరిగి చూడలేదు. రంజీ ట్రోఫీలో కూడా తొలి సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చి కర్ణాటక టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన అతను... తర్వాతి సీజన్లో జట్టు దానిని నిలబెట్టుకోవడంలో కూడా ప్రధాన భాగమయ్యాడు. ముఖ్యంగా తమిళనాడుతో జరిగిన ఫైనల్లో చేసిన 328 పరుగుల స్కోరు నాయర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2014 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 75 లక్షలకు తీసుకోగా, జట్టులో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. అయితే 2016 ఐపీఎల్లో అతను రూ.10 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉండగా, 40 రెట్లు ఎక్కువగా చెల్లించి ఢిల్లీ సొంతం చేసుకుంది. డేర్ డెవిల్స్ కోచ్‌గా, ఆ తర్వాత భారత ‘ఎ’ జట్టు కోచ్‌గా కూడా రాహుల్ ద్రవిడ్ సూచనలు అతడిని తీర్చిదిద్దాయి. దేశవాళీలో 50కి పైగా సగటుతో మూడేళ్ల పాటు పరుగుల వరద పారించిన కరుణ్, గత సంవత్సరం శ్రీలంకతో సిరీస్‌కు గాయపడిన విజయ్ స్థానంలో ఎంపికైనా మ్యాచ్ అవకాశం రాలేదు. ఈ ఏడాది ధోని నాయకత్వంలో జింబాబ్వే పర్యటించిన జట్టులో సభ్యుడిగా అతను రెండు వన్డేలు ఆడాడు. ఈ సీజన్లో కూడా ఇంగ్లండ్ టెస్టుకు ఎంపిక కాక ముందు ఆడిన 4 రంజీ ఇన్నిం గ్స్లలో 74, 54, 53, 145 పరుగులు చేశాడు. మొహాలీలో సహచరుడు రాహుల్ గాయంతో తొలి టెస్టు ఆడే అవకాశం దక్కి దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. ముంబై టెస్టులో రహానే గాయంతో లక్కీగా చేరి 13 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో రాణించకపోతే బహుశా అతను మరో అవకాశం కోసం సుదీర్ఘకాలం వేచి ఉం డాల్సి వచ్చేదేమో. కానీ తన క్లాస్, మాస్ ఆటను మొత్తం కలగలిపి అతను కొట్టిన ‘తీన్మార్’ దెబ్బ నేరుగా సెలక్టర్లకే తగిలింది. ‘నా జీవితంలో ఇదో అత్యుత్తమ క్షణం. కలలా అనిపిస్తున్న దీనిని నమ్మేందుకు మరో రెండు రోజులు పడుతుందేమో. సెంచరీ చేయగానే నాపై ఒత్తిడి పోయింది. ట్రిపుల్ గురించి అసలు ఆలోచన లేదు. 250 వద్ద డిక్లరేషన్‌కు సిద్ధమైనా, నా కోసం ఆగిన జట్టుకు కృతజ్ఞతలు. అమ్మా నాన్న ముందు దీనిని సాధించడం అమితానందంగా ఉంది. ట్రిపుల్ సెంచరీ సమయంలో నా మనసులో చాలా భావాలు చెలరేగుతున్నాయి. అందుకే ఆ ఘనతను సాధించిన సమయంలో ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించలేకపోయాను’. -
కరుణ్ ది గ్రేట్
►ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ ► అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు ► తొలి ఇన్నింగ్స్‌లో 759/7 డిక్లేర్డ్ ► టెస్టుల్లో భారత్‌కిదే అత్యధిక స్కోరు ► ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 12/0 బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కే సాధ్యం కాని ఫీట్ అది.. ఇప్పటి దాకా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్కరంటే ఒక్కరే సాధించిన రికార్డు.. ఎంతో మంది మేటి బ్యాట్స్‌మెన్ కలలు కన్నా అందుకోలేని విన్యాసమది.. అలాంటి అరుదైన ట్రిపుల్ సెంచరీని యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ సాధించాడు. అదీ ఆడుతున్న మూడో టెస్టులోనే కావడం విశేషం. అంతేకాదు తన తొలి సెంచరీనే ట్రిపుల్‌గా మలుచుకున్న తొలి భారత ఆటగాడయ్యాడు. ఈ సిరీస్‌లో ఈ మ్యాచ్‌కు ముందు అతడు చేసిన స్కోర్లు 4, 13 మాత్రమే.. ఈ స్థితిలో ఎవరైనా ఈ ఆటగాడి గురించి ఎక్కువగా ఊహిస్తారా? కానీ ఎవరి అంచనాలకు అందకుండా ఈ కర్ణాటక స్టార్ అనూహ్య రీతిలో సాగించిన విజృంభణక్రికెట్ పండితులనే ఆశ్చర్యపరిచింది. కుటుంబసభ్యుల సమక్షంలో అసమాన ఆటను ప్రదర్శించి ఈ టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. మరోవైపు ఈ మరపురాని ఆటతీరుకు తోడు అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు సాధించడంతో భారత జట్టు తమ టెస్టు చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డునూ తమ ఖాతాలో వేసుకుంది.. చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత జట్టు రికార్డుల మోత మోగించింది. తన అరంగేట్ర సిరీస్‌లోనే కరుణ్ నాయర్ (381 బంతుల్లో 303 నాటౌట్; 32 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ అజేయంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఎప్పటిలాగే భారత టెయిలెండర్లు అశ్విన్ (149 బంతుల్లో 67; 6 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (55 బంతుల్లో 51; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగైన ఆటతో ఆకట్టుకోవడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 190.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 759 పరుగులకు డిక్లేర్ చేసింది. తమ టెస్టు చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. ద్విశతకం పూర్తి చేసుకున్న అనంతరం వన్డే తరహాలో రెచ్చిపోయిన నాయర్ 75 బంతుల్లోనే తన చివరి 103 పరుగులను సాధించడం విశేషం. అంతేకాకుండా సోమవారం ఒక్కరోజే తను 245 బంతుల్లోనే 232 పరుగులు సాధించడం అతని జోరును సూచిస్తోంది. జడేజా కూడా ఇదే స్థాయి జోరు చూపడంతో భారత ఇన్నింగ్స్‌లో పరుగులు వేగంగా వచ్చాయి. అలాగే అశ్విన్‌తో కలిసి నాయర్ ఆరో వికెట్‌కు 181 పరుగులు జత చేయగా, జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 138 పరుగులు అందించాడు. బ్రాడ్, డాసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 282 పరుగులు వెనకబడిన దశలో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో కుక్ (3 బ్యాటింగ్), జెన్నింగ్స్ (9 బ్యాటింగ్) ఉన్నారు. సెషన్ – 1 తొలి సెంచరీ పూర్తి 391/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జోరును కనబరిచింది. చక్కటి నిలకడను ప్రదర్శిస్తూ కరుణ్, విజయ్ ఆటతీరు సాగింది. డాసన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదిన కరుణ్.. స్టోక్స్ బౌలింగ్‌లో మరో చక్కటి బౌండరీతో 185 బంతుల్లో కెరీర్‌తో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లోనే విజయ్ (76 బంతుల్లో 29; 4 ఫోర్లు) డాసన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. విజయ్ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 63 పరుగులు జత చేరాయి. అనంతరం నాయర్‌కు ఫామ్‌లో ఉన్న అశ్విన్ జత కలవడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చిన అశ్విన్ పరుగుల ఖాతా తెరిచేందుకు 20 బంతులు తీసుకున్నాడు. ఓవర్లు: 27, పరుగులు: 72, వికెట్లు: 1 సెషన్ – 2 నాయర్, అశ్విన్ జోరు లంచ్ విరామం అనంతరం భారత బ్యాటింగ్‌లో జోరు కనిపించింది. మూడో ఓవర్లో కరుణ్ ఫోర్ బాదగా ఐదో ఓవర్లో అశ్విన్ సిక్సర్‌తో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి ఓవర్లలోనూ ఇద్దరు బౌండరీల వర్షం కురిపిస్తూ సాగారు. రషీద్ వేసిన 155వ ఓవర్లో నాయర్ రివర్స్ స్వీప్ ఆడగా ఇంగ్లండ్ క్యాచ్ అప్పీల్‌కు వెళ్లింది. అయితే థర్డ్ అంపైర్ తిరస్కరించడంతో వారికి నిరాశే మిగిలింది. 115 బంతుల్లో అశ్విన్ సిరీస్‌లో నాలుగో అర్ధ సెంచరీని సాధించాడు. టీ బ్రేక్‌కు ముందు ఓవర్లో జెన్నింగ్స్ ఎల్బీ అవుట్ నిర్ణయాన్ని అశ్విన్ సవాల్ చేయగా రివ్యూలో అనుకూలంగా వచ్చింది. ఈ సెషన్‌ను వీరిద్దరు ఆటగాళ్లు ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున సాధించారు. ఓవర్లు: 30, పరుగులు: 119, వికెట్లు: 0 సెషన్ – 3 నాయర్ తుఫాన్ ఇన్నింగ్స్ టీ బ్రేక్ అయిన రెండో ఓవర్లో మరోసారి ఫోర్‌తో నాయర్ తన సెంచరీని డబుల్‌గా మార్చాడు. అయితే కొద్దిసేపటికే అశ్విన్.. బ్రాడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరుసటి ఓవర్లో నాయర్ ఇచ్చిన క్యాచ్‌ను రూట్ వదిలేసాడు. ఇక జడేజా వచ్చీ రాగానే బ్యాట్‌కు పనిచెప్పాడు. బాల్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అటు నాయర్ కూడా మేనేజిమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇన్నింగ్స్‌లో దూకుడు చూపించాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 185వ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత జడేజా సిక్సర్‌తో భారత్ టెస్టుల్లో అత్యధిక స్కోరును అందుకుంది. 52 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం డాసన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాతే నాయర్ బౌండరీతో అరుదైన ట్రిపుల్ సాధించడంతో కెప్టెన్ కోహ్లి తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసింది. భారత్ ఓవర్లు: 25.4, పరుగులు: 177, వికెట్లు: 2 ఇంగ్లండ్: 5, పరుగులు 12, వికెట్లు 0 వికెట్ కోల్పోకుండా) 12. ఫోర్.. ఫోర్.. ఫోర్ కరుణ్ నాయర్ అద్భుత బ్యాటింగ్‌లో మరో అరుదైన ఫీట్ నమోదైంది. మామూలుగా ఏ ఆటగాడైనా సెంచరీకి అతి సమీపంలో ఉన్నప్పుడు సింగిల్ తీసేందుకు ప్రాధాన్యమిస్తాడే కానీ బౌండరీ కొట్టాలని ఏమాత్రం ప్రయత్నించడు. అయితే కరుణ్ ఒక్కసారి కాదు తన ‘మూడు’ సెంచరీలను ఇలాగే చేయడం విశేషం. 99 పరుగుల వద్ద ఫుల్ డెలివరీని ఆఫ్ సైడ్‌లో, 197 పరుగుల వద్ద కవర్స్ వైపు, 299 వద్ద పాయింట్ వైపు బౌండరీ కొట్టి అజేయంగా తన రికార్డు ఇన్నింగ్స్‌ను అందుకున్నాడు. 1 కెరీర్ మొదలయ్యాక తక్కువ ఇన్నింగ్స్ (3)లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2 భారత్ నుంచి ట్రిపుల్ సెంచరీలు సాధించిన రెండో ఆటగాడు కరుణ్. గతంలో సెహ్వాగ్ రెండు సార్లు ట్రిపుల్ సాధించాడు. 3 ప్రపంచ టెస్టు క్రికెట్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన మూడో బ్యాట్స్‌మన్ నాయర్ కరుణ్‌ను అభినందిస్తున్న కోహ్లి ఇతర సభ్యులు -
కరుణ్ నాయర్ గురించి ఈ విషయాలు తెలుసా?
టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలివి.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మలయాళీ దంపతులకు డిసెంబర్ 6, 1991న కరుణ్ నాయర్ జన్మించాడు. మొదట అతను కర్ణాటక తరఫున అండర్-15 క్రికెట్ ఆడాడు. అనంతరం కర్ణాటక నుంచే అండర్ 19 జట్టులో చోటు సాధించాడు. ఈ రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ 2012లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం ద్వారా సీనియర్ దేశీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2013లో రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడాడు. 2014-15 రంజీ ట్రోపీ సీజన్లో నాయర్ 47.26 సగటుతో 700 పరుగులు చేసి.. కర్ణాటక మరోసారి రంజీ ట్రోపీ నిలబెట్టుకోవడంలో తోడ్పడ్డాడు. ఈ టోర్నీలో రాబిన్ ఉతప్ప, కేఎల్ రాహుల్ తర్వాత కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు చేసింది బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2016లో ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున ఆడిన కరుణ్ నాయర్ సత్తా చాటాడు. ఢిల్లీ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2016లో జింబాబ్వేతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో కరుణ్ అడుగుపెట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడటం ద్వారా అతను టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన తొలి భారతీయ ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు. -
ట్రిపుల్ గురించి నాయర్ ఏమన్నాడంటే..
-
ట్రిపుల్ గురించి నాయర్ ఏమన్నాడంటే..
చెన్నై: ఇంగ్లండ్‌తో చేసిన ట్రిపుల్ సెంచరీయే తన జీవితంలో బెస్ట్ ఇన్నింగ్స్ అని టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ అన్నాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో నాయర్ (303 నాటౌట్; 381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) అద్భుతంగా రాణించి, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసిన తర్వాత నాయర్ మాట్లాడుతూ.. సెంచరీ చేశాక ఒత్తిడిగా భావించలేదని చెప్పాడు. ‘సెంచరీ అయ్యాక నా శైలిలో షాట్లు ఆడా. నా మ్యాచ్‌లను చాలా వరకు నాన్న చూస్తారు. నాపై అదనపు ఒత్తిడి ఉండదు. నా ఆట చూశాక అమ్మానాన్న గర్వపడి ఉంటారు. నా జీవితంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. ట్రిపుల్ సెంచరీ చేసే క్రమంలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజాలతో కలసి ఆడాను. నేను క్రీజులో పాతుకుపోవడానికి వారు సహకరించారు. వారికి ధన్యవాదాలు’ అని నాయర్ అన్నాడు. -
మా వాడు ‘ట్రిపుల్’ చేశాక స్వర్గంలో ఉన్నట్టుంది