
సాక్షి, బెంగళూరు: త్వరలో ప్రారంభం కాబోయే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో కర్ణాటక కెప్టెన్‌గా ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆర్ సమర్ధ్ వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల సమర్ధ్.. ఫామ్ లేమితో బాధపడుతున్న కరుణ్ నాయర్ నుంచి సారధ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఫజల్ ఖలీల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం సమావేశమై 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
కాగా, తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సమర్ధ్‌కు జట్టులో స్ధానం దక్కకపోవడం విశేషం. ఈ టోర్నీలో కర్ణాటక జట్టు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. తాజాగా ప్రకటించిన కర్ణాటక జట్టులో ఇటీవలి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాణించిన దేవ్‌దత్ పడిక్కల్ కీలక సభ్యుడిగా ఉండగా, గాయం కారణంగా సీనియర్ ఆటగాడు మనీష్ పాండే టోర్నీకి దూరమయ్యాడు.
