captain
-
నాడు చెత్తకుండీలో... నేడు క్రికెట్ దిగ్గజం!
‘జీవిత వాస్తవాలు ఫిక్షన్ కంటే వింతగా ఉంటాయి’అంటారు. దీనికి బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పుణెలోని ఒక చెత్తకుండీలో దయనీయమైన స్థితిలో కనిపించిన ఆ పాపను విధి ఆస్ట్రేలియాకు చేర్చింది. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా లిసా సత్తా చాటింది. వరల్డ్ కప్ గెలుచుకుంది.మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపను అనాథాశ్రమం ముందు ఉన్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు. ఆ ఆశ్రమ నిర్వాహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు ‘లైలా’ అనే పేరు పెట్టాడు. ఆ రోజుల్లో స్యూ, హరేన్ అనే అమెరికన్ దంపతులు మన దేశానికి వచ్చారు. వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకి వచ్చారు.‘మాకు అందమైన అబ్బాయి కావాలి’ అంటూ ఆ దంపతులు ఆశ్రమానికి వచ్చారు. కోరుకున్న అబ్బాయి వారికి కనిపించలేదు. అయితే స్యూ కళ్లు లైలా మీద పడ్డాయి. లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్లు, అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుంది స్యూ. ఆ తరువాత లైలాను దత్తత తీసుకున్నారు. (Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట)దత్తత తరువాత ‘లైలా’ పేరు ‘లిసా’గా మారింది. మొదట్లో యూఎస్‌లో ఉన్న ఆ దంపతులు ఆ తరువాత సిడ్నీలో శాశ్వతంగా స్థిరపడ్డారు. కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు. ఆ ఆటే లిసా జీవితాన్ని మార్చేసింది. మొదట లిసా మాట్లాడింది. ఆ తరువాత ఆమె బ్యాట్ మాట్లాడింది. ఆ తరువాత ఆమె రికార్డ్‌లు మాట్లాడడం మొదలైంది! (నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్)ఐసీసీ ర్యాంకింగ్ విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా ఉంది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సత్తా చాటిన లిసా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. -
మూడు యుద్ధాల వీరుడు.. నాలుగు భాషల నిపుణుడు.. 107లోనూ ఫిట్‌గా ఉంటూ..
కొందరిని చూస్తుంటే వారేవా అని అనకుండా ఉండలేం. దానికి వారిలోని గొప్పదనం, వారు చేసే పనులు కారణమై ఉంటాయి. దీనికితోడు వారి క్రమశిక్షణ, దైనందిన జీవితం కూడా తోడయివుంటుంది. 107 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ, అందరికీ స్ఫూర్తినిస్తున్న రోమెల్ సింగ్ పఠానియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దేశంలో సైనికరంగం ఏర్పడక ముందే ఆజాద్ హింద్ ఫౌజ్(Azad Hind Fauj)లో సభ్యునిగా చేరి, దేశం కోసం మూడు యుద్ధాలు చేసిన కెప్టెన్ రోమెల్ సింగ్ పఠానీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వయసులో కూడా కళ్లద్దాలు పెట్టుకోకుండా న్యూస్ పేపర్లు చదివే సామర్థ్యం కలిగిన రోమెల్ సింగ్ పఠానియా ఎవరి సాయం లేకుండా తానే స్వయంగా స్కూటర్ నడుపుతుంటారు. కెప్టెన్ పఠానియా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన ఫతేపూర్‌లోని బరోహ్ గ్రామ నివాసి.ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సభ్యుడైన రోమెల్ సింగ్ పఠానియా(Romel Singh Pathania) 1939-45లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటీష్ పాలనలో పఠానియా 1945లో బజిరెస్తాన్ యుద్ధంలో కూడా భాగస్వామ్యం వహించారు. దేశ విభజన సమయంలో పలువురి ప్రాణాలు కాపాడారు. 1962 నాటి చైనా యుద్ధం, 1965, 1971లలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొని దేశ సేవ చేశారు. తాను భారత సైన్యంలోని 16వ డోగ్రా రెజిమెంట్‌లో సుమారు 31 ఏళ్లపాటు పనిచేశానని రోమెల్ సింగ్ పఠానియా తెలిపారు.పాష్టో, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తనకు పూర్తి పరిజ్ఞానం ఉందని రోమెల్ సింగ్ మీడియాకు చెప్పారు. తాను శాకాహారం మాత్రమే తీసుకుంటానని, తన జీవితంలో ఏనాడూ బీడీ, సిగరెట్, మద్యం, మాంసం, చేపలు ముట్టలేదని పేర్కొన్నారు. శారీరకంగా తాను ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నానని, మోకాళ్ల నొప్పులు కూడా లేవని తెలిపారు.కంటి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోలేదని చెప్పారు. ఉదయం 4 గంటలకే నిద్ర నుంచి లేస్తానని, భగవంతుని ప్రార్థనతో తనకు రోజు ప్రారంభమవుతుందన్నారు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న రోమెల్ సింగ్ పఠానియాకు శుభాకాంక్షలు(Greetings) చెబుతూ, మీ వయస్సు ఎంత అని మీడియా అడిగిప్పుడు నవ్వుతూ తనకు ఏడేళ్లు అని చెప్పారు. తరువాత తన వయసు 107 అని తెలిపారు. ఇది కూడా చదవండి: మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక -
అమెరికా అండర్–19 క్రికెట్ జట్టు కెప్టెన్ అనిక రెడ్డి
బ్రూమ్‌ఫీల్డ్ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్–19 ప్రపంచకప్ టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. తెలుగు సంతతికి చెందిన పగిడ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేసియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లకు గ్రూప్ ‘ఎ’లో చోటు కల్పించారు. గ్రూప్ ‘బి’లో అమెరికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా... గ్రూప్ ‘డి’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్ జట్లున్నాయి. అమెరికా అండర్–19 జట్టు: కొలన్ అనిక రెడ్డి (కెప్టెన్), అదితిబా చుదసమ (వైస్ కెప్టెన్), పగిడ్యాల చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశ ఢింగ్రా, ఇసాని మహేశ్ వాఘేలా, లేఖ హనుమంత్ శెట్టి, మాహి మాధవన్, నిఖర్ పింకూ దోషి, పూజా గణేశ్, పూజా షా, రీతూప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని, సుహాని థదాని. -
సియాచిన్ పైకి మహిళా సేనాని!
‘‘సియాచిన్ మాది’’ అంటోంది పాకిస్థాన్. ‘‘కాదు, మాది’’ అంటోంది భారత్. ప్రపంచంలోనే అతి ఎత్తైయిన ఈ యుద్ధక్రేత్రంలో రెండు దేశాల సైన్యాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతూనే ఉన్నాయి. భారత్ నలభై ఏళ్ల క్రితమే ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో సైనిక చర్య జరిపి సియాచిన్‌పై నియంత్రణ సాధించినా..పాక్ తన పట్టు వీడటం లేదు. ఈ పరిస్థితిని ‘‘చక్కబరచటానికి’’ భారత సైన్యం ఇటీవలే సియాచిన్ డ్యూటీకి ప్రత్యేకంగా ఒక ఆర్మీ ఆఫీసర్నుపంపింది. ఆ ఆఫీసరే.. సుప్రీత. కెప్టెన్ సుప్రీత. సియాచిన్‌పైకి వెళ్లిన తొలి మహిళా సేనాని!భారత సైన్యంలో 40 విభాగాలు ఉంటాయి. 14 ప్రధాన ఉప–విభాగాలు ఉంటాయి. ఈ ఉప విభాగాలను ‘కోర్స్’ అంటారు. వాటిల్లో ఒకటి ‘కోర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’. అందులో సైనికాధికారిగా విధులు నిర్వర్తిస్తుంటారు కెప్టెన్ సుప్రీత. సముద్ర మట్టానికి 18,875 అడుగుల ఎత్తున, హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంటుంది సియాచిన్ గ్లేసియర్. నది గడ్డ కట్టినట్లుగా ఉండే ఆ ్ర΄ాంతంలో కెప్టెన్ సుప్రీతకు డ్యూటీ పడింది! ఈ నెల 18నే.. వెళ్లి చేరారు. సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వర్తిస్తున్న తొలి ఉమన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో.. ఒక అరుదైన విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది. కొత్తగా పెళ్లయిన ఒక యువ జంటలో – భర్త ఒక సైనిక దళానికి, భార్య మరొక దళానికి నేతృత్వం వహించారు! భర్తది తమిళనాడు. భార్యది కర్ణాటక. అనుకోకుండా ఇద్దరికీ ఢిల్లీ వేడుకల్లో దళాలను పరేడ్ చేయించే అవకాశం వచ్చింది. ఆ భర్త.. మేజర్ జెర్రీ బ్లైజ్. ఆ భార్య.. కెప్టెన్ సుప్రీత. అసలు మహిళలు ఆర్మీలోకి రావటమే గొప్ప సంగతైతే, సుప్రీత అక్కడి నుంచి సియాచిన్ వరకు ‘ఎదగటం’ చెప్పుకోదగ్గ విశేషం. భారత సైన్యంలో ఆమె కెరీర్ 2021లో లెఫ్ట్‌నెంట్‌గా మొదలైంది. చెన్నైలోని ‘ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒ.టి.ఎ.)లో ఆమె శిక్షణ ΄పోందారు. కాలేజ్‌లో ఎస్సీసీతో మొదలైన ఆమె దేశ రక్షణ దళ ప్రయాణం.. ముందు వరుస యుద్ధక్షేత్రం వరకు దృఢచిత్తంతో ముందుకు సాగింది.సుప్రీత మైసూర్ అమ్మాయి. అక్కడి కృష్ణరాజనగరంలోని సెయిట్ జోసెఫ్ స్కూల్లో చదివారు. మైసూరులోనే మరిమల్లప్ప ప్రీ–యూనివర్శిటీ కాలేజ్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవటానికి ముందు, జె.ఎస్.ఎస్. లా కాలేజ్‌లో డిగ్రీ చేశారు. ఆమె తండ్రి తిరుమల్లేశ్ మైసూరు దగ్గరి తలాకాడులోపోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. తల్లి నిర్మల గృహిణి. ఆర్మీపై తనకున్న ఇష్టాన్ని గౌరవించిన తన తల్లిదండ్రుల ్ర΄ోత్సాహంతో సుప్రీత ఎన్సీసీలో ఎయిర్ వింగ్ ‘సి’ సర్టిఫికెట్ సాధించారు. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ (రాజ్‌పథ్)లో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కర్ణాటక–గోవా నడిపించారు. 2016లో ఆలిండియా వాయు సైనిక్ క్యాంప్‌లో కర్ణాటకకు ్ర΄ాతినిధ్యం వహించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ అయ్యాక సియాచిన్‌ను అధిరోహించటానికి మళ్లీ ఓ.టి.ఎ.లో చేరారు. శిక్షణలో భాగంగా ఆమెను వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన అనంత్‌నాగ్, జబల్పూర్, లేహ్ ్ర΄ాంతాలకు పంపించారు. ఆ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు సుప్రీత. సుప్రీత, బ్లేజ్‌ల వివాహం గత ఏడాదే జరిగింది. సుప్రీత మామ గారు రిటైర్డ్ కల్నల్ రిచర్డ్ బ్లెయిజ్. సుప్రీత అత్తగారు లెఫ్ట్‌నెంట్ కల్నల్ విజయలక్ష్మి. పుట్టినింటి, మెట్టినింటి రెండూ ్ర΄ోత్సాహాలు సుప్రీత కెరీర్‌కు కలిసి వచ్చాయనే అనుకోవాలి. అంతకంటే కూడా ఆమె దీక్ష, పట్టుదల. -
పరిహారం తల్లిదండ్రులకే ఇవ్వాలి: కెప్టెన్ అన్షుమన్ పేరెంట్స్
లక్నో: సైన్యంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి డిపెండెంట్లు(నెక్స్ట్ ఆఫ్ కిన్) ఎవరనే విషయమై స్పష్టమైన మార్గదర్శాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇటీవల కీర్తి చక్ర పతకం పొందిన దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్, మంజు సింగ్ అన్నారు. ఈ విషయమై ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ మాట్లాడామన్నారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని తమకు హామీ ఇచ్చారని చెప్పారు. Shocking words.. pic.twitter.com/UeiF0Ef4Mf— Gems of Politics (@GemsOf_Politics) July 11, 2024 ‘సైన్యంలో వీర మరణం పొందిన వారికి సంబంధించిన పరిహారం ఎవరికి దక్కాలనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న నెక్ట్స్ ఆఫ్ కిన్(ఎన్‌ఓకే) మార్గదర్శకాలు సరిగా లేవు. ఈ విషయమై రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇప్పటికే మేం మాట్లాడాం. నా కుమారుడు అన్షుమన్సింగ్కు పెళ్లి జరిగి కేవలం అయిదు నెలలు మాత్రమే అయింది. నా కొడుక్కి పిల్లలు లేరు. అయినా మా కొడుకుకు వచ్చిన కీర్తి చక్ర పతాకం, ఇతర అన్ని పరిహారాలు కోడలికే దక్కాయి. ఆమె అన్ని అధికారిక డాక్యుమెంట్లలో తన చిరునామా మార్చుకుని వెళ్లిపోయింది.ఇందుకే ‘ఎన్‌ఓకే’ను మళ్లీ పునర్నిర్వచించాలని కోరుతున్నాం. కోడలి కంటే తల్లిదండ్రులే కొడుకుపై ఎక్కువగా ఆధారపడతారు. మేము బాధపడుతున్నట్లుగా ఇతర తల్లిదండ్రులెవరూ భవిష్యత్తులో బాధపడకూడదు’అని అన్షుమన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్‌సింగ్,మంజుసింగ్ అన్నారు.గత ఏడాది జులైలో సియాచిన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో కెప్టెన్ అన్షుమన్‌సింగ్ మృతి చెందారు. ఆ ప్రమాదంలో తన సహచరులను కాపాడి అన్షుమన్ మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలారు.అన్షుమన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకుగాను భారత ప్రభుత్వం ఆయనకు కీర్తిచక్ర పతాకాన్ని ప్రకటించింది. ఈ పతకాన్ని జులై 5న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో అన్షుమన్ భార్య స్మృతి, మాతృమూర్తిలకు ఈ పతకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహుకరించారు. ప్రస్తుత రూల్స్ ప్రకారం ‘ఎన్‌ఓకే’ ఎవరు..సైన్యంలో ఒక వ్యక్తి చేరినపుడు తల్లిదండ్రులను నెక్ట్స్ ఆఫ్ కిన్గా పేర్కొంటారు. అయితే ఆ వ్యక్తికి వివాహం అయిన తర్వాత మాత్రం నెక్ట్స్ ఆఫ్ కిన్గా తల్లిదండ్రుల పేర్ల స్థానంలో జీవిత భాగస్వామి పేరు రికార్డుల్లోకి ఎక్కిస్తారు. -
75వ వసంతంలోకి టీమిండియా దిగ్గజం.. హ్యాపీ బర్త్‌డే సన్నీ! (ఫొటోలు)
-
కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ సింగ్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్... వైస్ కెప్టెన్‌గా హార్దిక్ సింగ్ వ్యవహరిస్తారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా జట్లున్నాయి. గోల్‌కీపర్ శ్రీజేశ్, మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ వరుసగా నాలుగో ఒలింపిక్స్ ఆడనున్నారు. భారత హాకీ జట్టు: హర్మన్‌ప్రీత్ సింగ్ (కెపె్టన్), హార్దిక్ సింగ్ (వైస్ కెపె్టన్), శ్రీజేశ్ (గోల్ కీపర్), జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్, రాజ్‌కుమార్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ ప్రసాద్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, క్రెయిగ్ ఫుల్టన్ (హెడ్ కోచ్). -
పాక్‌పై విజయం: ‘వన్ విత్ నేచర్’ అంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (ఫొటోలు)
-
బాబర్ ఆజమ్‌కు మళ్లీ పాక్ జట్టు పగ్గాలు
మరో రెండు నెలల్లో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... పాకిస్తాన్ క్రికెట్ జట్టు వన్డే, టి20 జట్లకు కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజమ్‌ను నియమించారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో పాక్ జట్టు విఫలమయ్యాక బాబర్ కెప్టెన్సీ కోల్పోయాడు. టి20 జట్టుకు షాహీన్ అఫ్రిదిని, టెస్టు జట్టుకు షాన్ మసూద్‌ను కెపె్టన్లుగా నియమించారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను పాక్ జట్టు 1–4తో చేజార్చుకుంది. దాంతో సెలెక్టర్లు కెప్టెన్సీ విషయంలో బాబర్ వైపు మొగ్గారు. -
Smriti Mandhana: ఆటలోనే కాదు అందంలోనూ చాంపియన్.. స్మృతి మంధాన (ఫొటోలు)
-
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెగా కమిన్స్
హైదరాబాద్: ఐపీఎల్ 17వ సీజన్లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బరిలోకి దిగనుంది. హైదరాబాద్ ఫ్రాంచైజీకి గత మూడేళ్లలో మారిన నాలుగో కెప్టె కమిన్స్! ఈ మూడేళ్లలో మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), డేవిడ్ వార్నర్ (ఆ్రస్టేలియా)లు సన్‌రైజర్స్‌ను నడిపించారు. 30 ఏళ్ల స్పీడ్‌స్టర్ కమిన్స్ నాయకత్వంలో ఆ్రస్టేలియా 2023 వన్డే ప్రపంచకప్, 2023 ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ టైటిల్స్‌ను సాధించింది. 2021 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టులోనూ కమిన్స్ సభ్యుడిగా ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో కమిన్స్‌పై సన్‌రైజర్స్ రూ. 20 కోట్ల 50 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. తాజాగా మార్క్రమ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి కమిన్స్‌కు సన్‌రైజర్స్ పగ్గాలు అప్పగించింది. గతంలో కమిన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు కానీ... కెప్టెన్‌గా మొదటిసారి ఐపీఎల్లో జట్టును నడిపించబోతున్నాడు. గత సీజన్లో మార్క్రమ్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లు ఆడి నాలుగే మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. -
అంధుల భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దుర్గారావు
వంగర: విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన టొంపాకి దుర్గారావు (26)ను భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (కేబీ) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ చైర్మన్ కె.మహేంతేష్ గురువారం ఢిల్లీలో ప్రకటించారు. దుర్గారావు నేపథ్యమిదీ నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గారావు చిన్నతనంలోనే తండ్రి దాలయ్య మరణించారు. తల్లి సుందరమ్మ రెక్కల కష్టంతో దుర్గారావును పెంచి పెద్దచేశారు. విజయనగరం జిల్లా మెట్టవలస అంధుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఇంటర్ సికింద్రాబాద్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లోని కాలేజీల్లో పూర్తిచేశాడు. అంధుల క్రికెట్లో భారత్ తరఫున రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండుసార్లు అంధుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్, మూడుసార్లు అంధుల టీ–20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంలో దుర్గారావు కీలక పాత్ర పోషించాడు. 2014 భారత అంధుల క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్‌గా ఆరంగేట్రం చేశాడు. 2014 నవంబర్ 7 నుంచి డిసెంబర్ 25 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2016 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు భారత్‌లో జరిగిన టీ–20 జట్టులో స్థానం లభించింది. 2018 జనవరిలో దుబాయ్‌లో జరిగిన అంధుల వరల్డ్ కప్‌లో కూడా ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటాడు. 2019లో వెస్టిండీస్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో సత్తాచాటి భారత్‌కు విజయాన్ని అందించాడు. 2022 భారత్‌లో జరిగిన వరల్డ్ కప్ విజయంలోనూ, ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఇప్సా) లండన్‌లో జరిగిన క్రికెట్ టోర్నీలో ద్వితీయ స్థానం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 21నుంచి 26 వరకు దుబాయ్‌లో జరిగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాల ముక్కోణపు టోర్నీకి భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనున్నాడు. నా ఆశయానికి అమ్మే తోడు నేను మంచి క్రికెటర్‌గా ఎదగాలని ఆకాక్షించాను. కష్టపడి సాధన చేశాను. నా ఆశయానికి మా అమ్మ సుందరమ్మ సహకారం తోడైంది. పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయులు, స్నేహితులు ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నివ్వడంతో భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాను. కష్టపడితే ఎంతటి విజయమైనా సిద్ధిస్తుందని నమ్ముతాను. ఇదే నా విజయ రహస్యం – టొంపాకి దుర్గారావు, కెప్టెన్ భారత అంధుల జట్టు -
ధనుష్, శివకార్తికేయన్, విజయ్ లో సంక్రాంతి విన్నర్ ఎవరంటే...?
-
Video: విమానం ఆలస్యంపై ప్రకటన.. కెప్టెన్‌పై ప్రయాణికుని దాడి
ఢిల్లీ: ప్రయాణాల ఆలస్యం వివాదంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఈ క్రమంలోనే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. విమానం ఆలస్యం గురించి ప్రకటిస్తున్న నేపథ్యంలో ఓ ప్రయాణికుడు కెప్టెన్‌పై దాడికి యత్నంచాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. A passenger punched an Indigo capt in the aircraft as he was making delay announcement. The guy ran up from the last row and punched the new Capt who replaced the previous crew who crossed FDTL. Unbelievable ! @DGCAIndia @MoCA_GoI pic.twitter.com/SkdlpWbaDd — Capt_Ck (@Capt_Ck) January 14, 2024 వీడియోలో చూపిన విధంగా ఢిల్లీ విమానాశ్రయంలో 6E-2175 విమానాన్ని నిలిపి ఉంచారు. గోవా వెళ్లాల్సిన ఆ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందా? అన్నట్లు ప్రయాణికులంతా ఎదురుచూస్తున్నారు. ఇంతలో కెప్టెన్ లోనికి వచ్చాడు. పొగమంచు కారణంగా దాదాపు 13 గంటలు విమానం ఆలస్యం అవుతుందని ప్రకటిస్తున్నాడు. ఇంతలో పసుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి ముందుకు దూసుకొచ్చాడు. కెప్టెన్ చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియోను నటి రాధికా ఆప్టే ఎక్స్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. నిందితున్ని సాహిల్ కటారియాగా గుర్తించారు. అతనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ సహా ఉత్తరాదిలో ఇటీవల తీవ్ర పొగమంచు వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైళ్లు సహా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా ఢిల్లీలో శనివారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అటు 79 విమాన ప్రయాణాల్ని రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: Makar Sankranti: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? -
Actor Surya : బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి (ఫొటోలు)
-
హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ గా తిలక్ వర్మ
దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. భారత జట్టు సభ్యుడు ఠాకూర్ తిలక్ వర్మ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. రాహుల్ సింగ్ గహ్లోత్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. గత రంజీ ట్రోఫీ సీజన్లో ఎలైట్ డివిజన్లో పోటీపడ్డ హైదరాబాద్ తమ గ్రూప్‌లో చివరిస్థానంలో నిలవడంతో ఈసారి ‘ప్లేట్’ డివిజన్లో పోటీ పడనుంది. ‘ప్లేట్’ డివిజన్లో హైదరాబాద్‌తోపాటు సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ జట్లున్నాయి. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 5 నుంచి నాగాలాండ్‌తో, రెండో మ్యాచ్‌ను జనవరి 12 నుంచి మేఘాలయతో ఆడుతుంది. హైదరాబాద్ రంజీ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్ ), రాహుల్ సింగ్ గహ్లోత్ (వైస్ కెప్టెన్ ), తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు, టి.రవితేజ, తనయ్ త్యాగరాజన్, చందన్ సహని, కార్తికేయ కక్, నితేశ్ కన్నల, సాయిప్రజ్ఞయ్ రెడ్డి, సాకేత్ సాయిరామ్, అభిరత్ రెడ్డి, సాగర్ చౌరాసియా, ఇ.సంకేత్. స్టాండ్‌బైస్: రాహుల్ బుద్ధి, జావీద్ అలీ, యశ్ గుప్తా, రిషబ్ బస్లాస్, టీపీ అనిరుధ్, గణేశ్. డీబీ రవితేజ (హెడ్ కోచ్), పవన్ కుమార్ (అసిస్టెంట్ కోచ్), రొనాల్డ్ రోడ్రిగ్స్ (ఫీల్డింగ్ కోచ్), రియాజ్ ఖురేషి (టీమ్ మేనేజర్), సుభాశ్ పాత్రో (స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్), సంతోష్ (ఫిజియో), కృష్ణా రెడ్డి (వీడియో ఎనలిస్ట్), సాజిద్ హుస్సేన్ (మసాజర్). -
Vijayakanth: విజయ్‌కాంత్ కన్నుమూత
దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్(71) కన్నుమూశారు. చెన్నై మియోట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అటు ఆస్పత్రి వర్గాలు.. ఇటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్ మృతిపై అధికారిక ప్రకటన చేశారు. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. మధురైలో 1952 ఆగష్టు 25న జన్మించారు. విజయకాంత్‌గా పేరు మార్చుకుని 27 ఏళ్ల వయసులో.. ‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంలో ఆయన ప్రతినాయకుడి(విలన్)రోల్ చేశారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్‌కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. సోలో హీరోగా విరుధగిరి(2010) ఆయన చివరిచిత్రం. తనయుడు షణ్ముగ పాండియన్ హీరోగా నటించిన సగప్తం(2015)లో చివరిసారిగా ఓ అతిథి పాత్రలో తెరపై విజయ్‌కాంత్ కనిపించారు. Official medical bulletin from Chennai MIOT hospital announcing the passing away of Captain #Vijayakanth #RIPCaptain pic.twitter.com/yLynSrBj9I — Ramesh Bala (@rameshlaus) December 28, 2023 విజయకాంత్ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. ఇక, విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోనూ సత్తా చాటినా ఆయన.. తమిళనాడు రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 👉: కెప్టెన్ ఓ సెన్సేషన్.. విజయకాంత్ అరుదైన చిత్రాలు -
IPL 2024 MI New Captain: రోహిత్ అవుట్
ముంబై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన, ఆకర్షణీయమైన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2024 సీజన్ ఆరంభానికి చాలా ముందే ఆ జట్టులో సారథ్య మార్పు జరిగింది. 11 సీజన్ల పాటు టీమ్‌కు అద్భుత విజయాలు అందించి ముంబై ఇండియన్స్ ముఖచిత్రంగా మారిన కెప్టెన్ రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు టీమ్ యాజమాన్యం ప్రకటించింది. రోహిత్ స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టు కెప్టెన్‌గా నియమించింది. గత నెల 26న గుజరాత్ జెయింట్స్ టీమ్ నుంచి హార్దిక్‌ను ముంబై తీసుకున్నప్పటి నుంచే భవిష్యత్తులో అతనికి కెపె్టన్సీ అప్పగించే అవకాశం ఉందని వినిపించింది. అయితే అది ఇంత తొందరగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ సీజన్ వరకు రోహిత్ నాయకత్వంలో ఆడి వచ్చే ఏడాది నుంచి అతను పగ్గాలు చేపట్టవచ్చని భావించగా... ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం వేగంగా నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు ముంబైని ఐపీఎల్లో విజేతగా నిలిపిన సారథి రోహిత్ ఇప్పుడు ‘మాజీ’గా మారిపోయాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గతంలోనే బెంగళూరు కెపె్టన్సీ నుంచి తప్పుకోగా, 2008 నుంచి చెన్నైకి సారథిగా ఉన్న ధోని ఇంకా కెపె్టన్‌గా కొనసాగుతున్నాడు. అందుకే మార్పు... 2024 సీజన్ నుంచే హార్దిక్‌కు కెపె్టన్సీ అప్పగించాలని తాము భావించినట్లు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మహేలా జయవర్ధనే అన్నాడు. ‘ఎప్పుడైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ముంబై ఇండియన్స్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది కూడా అందులో భాగమే. రోహిత్‌తో పాటు గతంలోనూ సచిన్, హర్భజన్, పాంటింగ్ కెపె్టన్లుగా జట్టును సమర్థంగా నడిపించడంతో పాటు ముందు చూపుతోనూ వ్యవహరించారు. వచ్చే సీజన్ నుంచే హార్దిక్ కెపె్టన్‌గా బాధ్యతలు చేపడతాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై టీమ్ అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అతని నాయకత్వ పటిమకు మా అభినందనలు. ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా రోహిత్ అనుభవం మైదానంలోనూ, మైదానం బయటా జట్టుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని అతను చెప్పాడు. 2015–2021 మధ్య ముంబైతో ఉన్న హార్దిక్ పాండ్యా 92 మ్యాచ్‌లు ఆడి నాలుగు టైటిల్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గత రెండు సీజన్లలో గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చిన అతను ఒకసారి ట్రోఫీ అందించాడు. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు... ఐపీఎల్లో ముంబై కెపె్టన్‌గా రోహిత్ ముద్ర అసామాన్యం. 2013 సీజన్లో తొలి ఆరు మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్ అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ఏడో మ్యాచ్ నుంచి సారథిగా వ్యవహరించిన రోహిత్ ఆ ఏడాది జట్టును విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020లలో కూడా ముంబై ఐపీఎల్ గెలుచుకుంది. 2013 చాంపియన్స్ ట్రోఫీ కూడా రోహిత్ నాయకత్వంలోనే వచ్చింది. రోహిత్ సారథ్యంలో జట్టు మొత్తం 158 మ్యాచ్‌లు ఆడగా... అందులో 87 విజయాలు, 67 పరాజయాలు ఉన్నాయి. 4 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. అయితే 2021, 2022 సీజన్లలో ‘ప్లే ఆఫ్స్’కు చేరడంలో ముంబై విఫలం కాగా... 2023లో రెండో క్వాలిఫయర్‌లో ఓడి మూడో స్థానంతో ముగించింది. -
సియాచిన్‌లో ‘నారీ పర్వం’
లేహ్/జమ్మూ: ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో ప్రప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీమ్ రికార్డు సృష్టించనున్నారు. మొదటిసారిగా ఆపరేషనల్ పోస్టులో భారత ఆర్మీ ఈమెను నియమించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని సియాచిన్‌లో బాధ్యతలు చేపట్టనున్న రెండో వైద్యాధికారి ఫాతిమా అని భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యురీ కార్ప్స్ మంగళవారం తెలిపింది. సైన్యంలో లింగసమానత్వం పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో కెప్టెన్ ఫాతిమా నియామకం ఒకటని తెలిపింది. సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో కఠోర శిక్షణ పొందిన ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ పోస్టులో బాధ్యతలు చేపడతారని వివరించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఈమె బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కెప్టెన్ గీతికా కౌల్‌ను సియాచిన్‌లో మొదటి మహిళా వైద్యాధికారిగా నియమించినట్లు ఈ నెల మొదటి వారంలో ఆర్మీ ప్రకటించింది. -
కొండంత ధైర్యంతో...
సియాచిన్ పేరు వినబడగానే ఒంట్లో చలితోపాటు మృత్యుభయం కూడా దూరుతుంది. శత్రువుల జాడను కనిపెట్టడం ఒక ఎత్తయితే, ప్రకృతే శత్రువుగా మారి ప్రాణాలు కబళించే ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడడం మరో ఎత్తు. దేశం కోసం కొండంత ధైర్యంతో సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహించబోతున్న ఫస్ట్ ఉమన్ మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ఫాతిమా వసీమ్ చరిత్ర సృష్టించింది... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. గడ్డకట్టే చలిలో మన సైనికుల సాహసం, అంకితభావం మాటలకు అందనివి. సముద్ర మట్టానికి 17,720 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌లో శీతాకాలంలో పగలు ఏడు గంటలు మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడంతో సైనికులు ఎక్కువ సమయం నిద్ర పోవడానికి వీలుకాదు. షేవింగ్ చేసుకోవాలన్నా కష్టమే. ఒకవేళ చర్మం తెగితే గాయం మానడానికి చాలా సమయం పడుతుంటుంది. స్నానం చేయాలన్న కష్టమే. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి చేరుకోగలవు. ఇక్కడ మూడు వేలమంది వరకు సైనికులు పనిచేస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ విధులు నిర్వహిస్తుంది. మంచుకొండ చరియలు విరిగి పడడం ద్వారా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రతికూలత’ గురించి తప్ప ‘అనుకూలత’ గురించి ఒక్క మాట కూడా వినిపించని మృత్యుక్షేత్రంలోకి మెడికల్ ఆఫీసర్‌గా అడుగు పెట్టనుంది కెప్టెన్ ఫాతిమా వసీమ్. ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ పొందింది ఫాతిమా. ‘సియాచిన్ గ్లేసియర్‌పై ఆపరేషనల్ పోస్ట్‌లో విధులు నిర్వహించబోతున్న తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీమ్ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ఇది చారిత్రక సందర్భం. కెప్టెన్ ఫాతిమా వసీమ్ ధైర్యసాహసాలు, అంకితభావాలకు అద్దం పట్టిన సందర్భం’ అంటూ ‘ఎక్స్’లో ఇండియన్ ఆర్మీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘ఐసే జాగోరే సాథియో... దునియా సే జాకో బోలుదో’ అనే పాట వినిపిస్తుండగా ‘మీట్ కెప్టెన్ ఫాతిమా, ఏ సియాచిన్ వారియర్. ఉయ్ సెల్యూట్ హర్’ అంటూ వీడియో మొదలవుతుంది. ఈ వీడియోలో ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఫాతిమా వసీమ్ శిక్షణ తీసుకుంటున్న, సైనికులకు వైద్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ∙కెప్టెన్ ఫాతిమా వసీమ్∙శిక్షణలో... ∙వైద్య సేవలు అందిస్తూ -
వన్డే కెప్టెన్‌గా మార్క్రమ్
జొహన్నెస్‌బర్గ్: భారత్‌తో సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో జరిగే సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌లో సఫారీ టీమ్‌కు సారథిగా వ్యవహరించిన తెంబా బవుమా, పేసర్ కగిసో రబాడలకు వన్డే, టి20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి కలి్పంచింది. దాంతో ప్రస్తుతం టి20 టీమ్ కెప్టెన్‌గా ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడు. తొలి రెండు టి20లకు మాత్రమే అందుబాటులో ఉండే కొయెట్జీ, జాన్సెన్, ఎన్గిడిలతో పాటు బవుమా, రబాడ టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సఫారీ బోర్డు వెల్లడించింది. డేవిడ్ బెడింగమ్, ట్రిస్టన్ స్టబ్స్, నాండ్ర్ బర్జర్కు తొలిసారి టెస్టు జట్టులో స్థానం లభించగా... కీపర్ కైల్ వెరీన్, పేసర్ ఎన్గిడి టెస్టుల్లో పునరాగమనం చేశారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే మొదటి సిరీస్ కానుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. దక్షిణాఫ్రికా జట్లు: టి20: మార్క్రమ్ (కెప్టెన్), హెన్డ్రిక్స్, బ్రీజ్కే, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, బర్జర్, జాన్సెన్, కొయెట్జీ, ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, షమ్సీ, విలియమ్స్, బార్త్‌మన్, ఎన్గిడి. వన్డే: మార్క్రమ్ (కెప్టెన్), జోర్జి, హెన్డ్రిక్స్, వాన్‌డర్ డసెన్, వెరీన్, క్లాసెన్, మిల్లర్, బర్జర్, ముల్డర్, ఎంపొంగ్వానా, ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, షమ్సీ, విలియమ్స్, బార్త్‌మన్. టెస్టు: బవుమా (కెప్టెన్), బెడింగమ్, బర్జర్, కొయెట్జీ, జోర్జి, ఎల్గర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, ముల్డర్, ఎన్గిడి, పీటర్సన్, రబాడ, స్టబ్స్, వెరీన్. -
రాహుల్‌కు వన్డే పగ్గాలు
న్యూఢిల్లీ: వచ్చే నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడే మూడు ఫార్మాట్లకు భారత జట్లను ఎంపిక చేశారు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను సఫారీలోనూ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారు. ఈ పొట్టి ఫార్మాట్లో జడేజాకు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పారు. వన్డే జట్టుకు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ రెండు జట్లకూ భారత టాప్‌స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లిలు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో వన్డేల్లో ఇద్దరు కొత్త ముఖాలు బి. సాయి సుదర్శన్, రింకూ సింగ్‌లకు టీమిండియాకు ఆడే అవకాశమిచ్చారు. మిడిలార్డర్లో డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్, స్పిన్నర్ చహల్‌లకు వన్డే జట్టులో తిరిగి చోటు లభించగా, రుతురాజ్ గైక్వాడ్ లక్కీఛాన్స్ కొట్టేశాడు. పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లకూ ఎంపికయ్యాడు. సీమర్ ముకేశ్కూ ఇలాంటి అవకాశమే లభించింది. హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌ను టి20, టెస్టులకు ఎంపిక చేసినప్పటికీ వన్డేల నుంచి తప్పించారు. సఫారీలో ముందుగా భారత్ డిసెంబర్ 10, 12, 14తేదీల్లో మూడు టి20లు... 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. చివరగా 26 నుంచి 30 వరకు తొలిటెస్టు, జనవరి 3 నుంచి 7వరకు జరిగే రెండో టెస్టుతో పర్యటన ముగుస్తుంది. -
IPL 2024: గుజరాత్ కెప్టెన్‌గా గిల్
న్యూఢిల్లీ: భారత ఓపెనర్, కెరీర్లో మంచి ఫామ్‌తో దూసుకుపోతున్న శుబ్‌మన్ గిల్‌కు మరో మంచి అవకాశం లభించింది. ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్‌కు అతను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో అతని స్థానంలో గిల్‌ను సారథిగా నియమిస్తున్నట్లు టైటాన్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ‘గిల్ తన కెరీర్లో మంచి ఎదుగుదలను చూపించాడు. గత రెండేళ్లుగా అతను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అతనిలో మంచి నాయకత్వ లక్షణాలను కూడా టీమ్ మేనేజ్మెంట్ చూసింది. గిల్ నాయకత్వంలో మా జట్టు మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని గుజరాత్ టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి వెల్లడించారు. 24 ఏళ్ల గిల్ ఐపీఎల్ కెరీర్ 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మొదలైంది. నాలుగేళ్లు ఆడిన తర్వాత ఆ జట్టు గిల్‌ను వదులుకుంది. 2022 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో గుజరాత్ టైటాన్స్ గిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో 16 మ్యాచ్‌లలో 483 పరుగులు చేసిన అతను ఫైనల్లో కీలకమైన 45 పరుగులు సాధించి జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. అయితే తర్వాతి సీజన్లో గిల్ చెలరేగిపోయాడు. 3 సెంచరీలు సహా ఏకంగా 893 పరుగులు సాధించాడు. గత ఐదేళ్ల ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ టాప్–5లో ఉన్నాడు. విలియమ్సన్, రషీద్, మిల్లర్, వేడ్, షమీలాంటి అనుభవజు్ఞలైన ఆటగాళ్లతో కూడిన జట్టును గిల్ నడిపించాల్సి ఉంది. గతంలో దేశవాళీ క్రికెట్లో దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీలలో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం గిల్‌కు ఉంది. మరో వైపు హార్దిక్ పాండ్యా 2015 వేలం సమయంలో తొలిసారి తన పేరు వచి్చనప్పుడు, ముంబై ఇండియన్స్ తనను రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న వీడియోను పోస్ట్ చేస్తూ ‘ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలు కదలాడుతున్నాయి. ముంబై..వాంఖెడే..పల్టన్...చాలా బాగుంది. సొంతింటికి తిరిగి వచి్చనట్లుగా ఉంది’ అని వ్యాఖ్య జోడించాడు. -
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
భారత టి20 జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్
ముంబై: ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ తొలిసారి నాయకత్వం వహిస్తాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడు. వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన భారత జట్టు నుంచి సూర్యకుమార్, ఇషాన్ కిషన్, ప్రసిధ్ కృష్ణ, శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా సభ్యులందరికీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈనెల 23న విశాఖపట్నంలో జరుగుతుంది. అనంతరం 26న తిరువనంతపురంలో రెండో మ్యాచ్... 28న గువాహటిలో మూడో మ్యాచ్... డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో నాలుగో మ్యాచ్... డిసెంబర్ 3న బెంగళూరులో చివరిదైన ఐదో మ్యాచ్ జరుగుతాయి. తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్న శ్రేయస్ అయ్యర్... చివరి రెండు మ్యాచ్‌లకు జట్టులోకి వైస్ కెప్టెన్ హోదాలో వస్తాడు. తొలి మూడు మ్యాచ్‌లకు రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ముంబైకి చెందిన 33 ఏళ్ల సూర్యకుమార్ ఇప్పటి వరకు 53 టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 3 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 1,841 పరుగులు చేశాడు. భారత టి20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్న 13వ ప్లేయర్‌గా సూర్యకుమార్ గుర్తింపు పొందనున్నాడు. భారత టి20 జట్టు: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్‡్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా ప్రీతి
ఈనెల 29 నుంచి డిసెంబర్ 10 వరకు చిలీలో జరిగే జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హరియాణాకు చెందిన ప్రీతి కెపె్టన్‌గా వ్యవహరించనుంది. భారత జట్టు: ప్రీతి (కెప్టెన్), రుతుజా (వైస్ కెప్టెన్), ఖుష్బూ, మాధురి కిండో (గోల్‌కీపర్లు), నీలమ్, జ్యోతి, రోప్ని కుమారి, మహిమా టెటె, మంజూ చోర్సియా, జ్యోతి ఛత్రి, హీనా బానో, సుజాత కుజుర్, సాక్షి రాణా, ముంతాజ్ ఖాన్, అన్ను, దీపిక సోరెంగ్, మోనిక టొప్పో, సునెలితా. రిజర్వ్: నిరూపమా దేవి, ఈదుల జ్యోతి. -
టీమిండియా స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీకి కుటుంబ సభ్యుల నివాళులు
-
పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్
ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్‌బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్‌బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరిదశకు చేరింది. బిగ్‌బాస్ మారథాన్‌లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. (ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!) కాగా.. ఈ వారం బిగ్‌బాస్ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్‌కు వ్యతిరేకంగా అమర్దీప్ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమిషన్ కోసం మొదట అమర్దీప్ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్దీప్ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్‌ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీవు ఇప్పటికే కెప్టెన్ అయ్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్‌లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్‌ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్‌కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్‌లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది. మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్‌గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! -
కెప్టెన్సీ మాకొద్దు అంటూ అభిమానుల ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి
-
తదుపరి కెప్టెన్ రహానే
-
తదుపరి కెప్టెన్ రహానే..!
-
వారి నిర్లక్ష్యంతోనే నా భార్య మృతి.. రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఎన్ఆర్ఐ దావా
తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు. శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్లో పారాసైలింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్‌ను బోట్‌కి అనుసంధానించే టౌలైన్‌ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్‌ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
కొత్త అవతారం లో హీరో ధనుష్ దాని కొససామేనా..!
-
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
హోమ్ గ్రౌండ్లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్
-
KL రాహుల్ అవుట్.. LSG లోకి కొత్త ప్లేయర్
-
రెండేళ్ల తరువాత రోహిత్ శర్మ విధ్వంసం..
-
గెలవాల్సిన మ్యాచ్ ఓడిన ఆర్ సీబీ కి మరో దెబ్బ
-
KKR పరిస్థితి ఏంటో...పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్
-
IPL 2023: కేకేఆర్ సంచలన ప్రకటన.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని కొత్త పేరు
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ సంచలన ప్రకటన చేసింది. గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో కెప్టెన్‌గా ఎవరూ ఊహించని కొత్త వ్యక్తి పేరు తెరపైకి తెచ్చింది. కేకేఆర్ తమ తాత్కాలిక కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడు నితీశ్ రాణా పేరును ప్రకటించింది. వెన్ను సమస్య కారణంగా అయ్యర్ 2023 సీజన్ తొలి అర్ధ భాగం మ్యాచ్‌లకు దూరం కానున్న నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా, కేకేఆర్ యాజమాన్యం నితీశ్ రాణావైపు మొగ్గుచూపింది. Official statement. @NitishRana_27 #AmiKKR #KKR #Nitish #NitishRana pic.twitter.com/SeGP5tBoql — KolkataKnightRiders (@KKRiders) March 27, 2023 పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఢిల్లీ కెప్టెన్‌గా పని చేసిన అనుభవాన్ని, 2018 నుంచి కేకేఆర్‌తో ఉన్న అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని రాణాను ఎంపిక చేసినట్లు కేకేఆర్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ బృందమంతా నితీశ్‌కు సహరిస్తుందని మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నితీశ్ రాణాను ఆల్ ద బెస్ట్ చెప్పిన కేకేఆర్ యాజమాన్యం.. శ్రేయస్ అయ్యర్ త్వరగా గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించింది. కాగా, అయ్యర్ గాయం ప్రకటన వెలువడ్డాక కేకేఆర్ కెప్టెన్సీ రేసులో చాలా మంది పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. కొందరు సునీల్ నరైన్ అంటే మరికొందరు సౌథీ, రసెల్, శార్దూల్ ఠాకూర్ పేర్లు తెరపైకి తెచ్చారు. అయితే మేనేజ్మెంట్ అనూహ్యంగా నితీశ్ పేరును కెప్టెన్‌గా ఓకే చేసి అందరి అంచనాలకు పటాపంచలు చేసింది. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాణా.. ఇప్పటివరకు 91 మ్యాచ్‌లు ఆడి 2181 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016 నుంచి 2018 వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాణా.. అప్పటి నుంచి వరుసగా 6 సీజన్ల పాటు (2023 కలుపుకుని) కేకేఆర్కే ఆడుతున్నాడు. గత సీజన్ వేలంలో రాణాను కేకేఆర్ 8 కోట్లకు సొంతం చేసుకుంది. -
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ నూతన కెప్టెన్‌గా ఎంబాపె
France Foot Ball Team Captain: ఫ్రాన్స్ పుట్‌బాల్ జట్టు నూతన కెప్టెన్‌గా పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్ ఫార్వర్డ్ ఆటగాడు కైలియన్ ఎంబాపె ఎంపికయ్యాడు. వ్యక్తిగత కోచ్ డిడియర్ డెష్చాంప్స్తో సంప్రదింపుల తర్వాత ఎంబపే ఫ్రెంచ్ ఫుట్‌బాల్ టీమ్ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ దినపత్రిక ఇవాళ (మార్చి 21) వెల్లడించింది. దశాబ్దానికి పైగా ఫ్రాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన లోరిస్ 2022 వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. లోరిస్ ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండింది. తాజాగా ఎంబపే కెప్టెన్సీ చేపట్టేందుకు అంగీకరించడంతో చాలా రోజుల నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మరోవైపు ఫ్రాన్స్ జట్టుకు వైస్ కెప్టెన్ ఎంపిక కూడా జరిగింది. సెంటర్ బ్యాక్ ప్లేయర్ రాఫేల్ వరేన్ స్థానంలో అటాకర్ ఆంటోనియో గ్రెజిమెన్ ఫ్రాన్స్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి నేపథ్యంలోనే రాఫేల్ వరేన్ కూడా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కాగా, 66 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల ఎంబాపె.. గత వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఫ్రాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనే రెచ్చిపోయిన ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ సాధించినప్పటికీ ఫ్రాన్స్ గెలవలేకపోయింది. ఫ్రాన్స్ 2018 వరల్డ్‌కప్ సాధించడంలోనూ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఎంబాపె కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ను యూరో 2024 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ ప్రత్యర్ధిగా ఆడతాడు. -
శ్రీలంక కెప్టెన్ సంచలన నిర్ణయం
శ్రీలంక టెస్ట్ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 28 మధ్యలో 2 టెస్ట్‌లు) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇవాళ (మార్చి 20) ప్రకటించాడు. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు కూడా తెలియజేసినట్లు వెల్లడించాడు. కరుణరత్నే నిర్ణయంపై ఎస్ఎల్సీ స్పందించాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన నిమిషాల వ్యవధిలోనే కరుణరత్నే రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేసిన కరుణరత్నే.. కొత్త టెస్ట్ సైకిల్‌కు (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25) కొత్త కెప్టెన్‌ని నియమించడం మంచిదని సెలెక్టర్లకు తెలిపినట్లు పేర్కొన్నాడు. 2019లో తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టిన కరుణరత్నే.. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే (సౌతాఫ్రికాపై) చారిత్రక సిరీస్ సాధించాడు. 26 టెస్ట్‌ల్లో లంక జట్టు సారధిగా వ్యవహరించిన కరుణరత్నే.. 10 విజయాలు, 7 డ్రాలు, 9 పరాజయాలను ఎదుర్కొన్నాడు. టెస్ట్ కెరీర్లో 84 మ్యాచ్‌లు ఆడిన కరుణరత్నే.. 39.94 సగటున డబుల్‌సెంచరీ, 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో 6230 పరుగులు చేశాడు. లంక తరఫున 34 వన్డేలు ఆడిన కరుణరత్నే.. 6 అర్ధశతకాల సాయంతో 767 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌తో డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ ముగియగా.. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఐదో స్థానంలో, న్యూజిలాండ్ ఆరో స్థానంలో నిలిచాయి. -
గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా బెత్ మూనీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో పాల్గొనే గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ కెపె్టన్‌గా... భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో తొలి డబ్ల్యూపీఎల్ జరగనుంది. 29 ఏళ్ల మూనీ ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2,380 పరుగులు చేసింది. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వార్నర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. భారత జట్టు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడి ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో పంత్ స్థానంలో వార్నర్‌ను సారథిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. గతంలో వార్నర్ నాలుగున్నర సీజన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వార్నర్ సారథ్యంలో 2016లో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. -
ఆర్సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధాన
వచ్చే నెలలో ముంబైలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధానను నియమించారు. భారత జట్టు వైస్ కెప్టెన్ అయిన స్మృతిపై ఇటీవల జరిగిన వేలం కార్యక్రమంలో ఆర్సీబీ రూ. 3 కోట్ల 40 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. స్మృతికి ఆర్సీబీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పురుషుల ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న డు ప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లి ట్విటర్లో ప్రకటించడం విశేషం. -
Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్ శివ చౌహాన్ ఈపోస్ట్ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్‌ను పూర్తి చేశారు. శివ చౌహాన్ వివరాలు. గతంలో సియాచిన్‌కు విధి నిర్వహణకు పంపే సైనికులతో అధికారులు ‘మీరు ముగ్గురు వెళితే ఇద్దరే తిరిగి వస్తారు’ అని హెచ్చరించి పంపేవారు. ‘ఇద్దరే తిరిగి వచ్చినా దేశం కోసంపోరాడతాం’ అని సైనికులు సమరోత్సాహంతో వెళ్లేవారు. అయితే వారి ప్రథమ శత్రువు పాకిస్తాన్ కాదు. ప్రతికూలమైన ప్రకృతే. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తీవ్రమైన చలి గాలులు, హిమపాతం, కాలు జారితే ఆచూకీ తెలియని మంచులోయలు... సియాచిన్‌లో 35 అడుగుల ఎత్తు మేరకు కూడా మంచు పడుతుందంటే ఊహించండి. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధస్థావరమైన సియాచిన్ అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి రక్షణ ΄పొందడానికి ఉపయోగపడే కీలక్రపాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారే విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ అడుగు పెట్టింది ఆమె పేరే శివ చౌహాన్. 1984 నుంచి దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలు లేని సియాచిన్ ్రపాంతాన్ని అటు పాకిస్తాన్ కాని ఇటు ఇండియాగాని పట్టించుకోలేదు. కాని 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్ సియాచిన్ అధీనం కోసం హుటాహుటిన రంగంలో దిగి ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్ మీద భారత్ గాని, పాకిస్తాన్‌గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ ఇరువైపులా అక్కడ 2000 మంది సైనికులు మరణించారని అంచనా. వారిలో ఎక్కువ మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మరణించారు. సైనిక కాల్పుల్లో కాదు. అడుగు పెట్టిన ఆఫీసర్ సంప్రదాయిక విధానాలతోనే నడిచే ఇండియన్ ఆర్మీ మహిళల ప్రవేశాన్ని అన్నిచోట్ల అంగీకరించరు. ఇంతవరకూ 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ వరకే మహిళా ఆఫీసర్లను అనుమతించింది ఆర్మీ. కాని 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్ బంకర్) ఎత్తు వరకూ సియాచిన్‌లో వివిధ స్థానాలలో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీసర్లను పంపలేదు. మొదటిసారిగా శివ చౌహాన్‌కు ఆర్మీ సియాచిన్ హెడ్క్వార్టర్స్లోపోస్టింగ్ ఇచ్చింది. రాజస్థాన్ సాహసి శివ చౌహాన్‌ది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. 11వ ఏట తండ్రి మరణిస్తే గృహిణి అయిన తల్లి శివ చౌహాన్‌ను పెంచింది. ‘మా అమ్మే నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద ఆసక్తి కలిగించింది’ అంటుంది శివ. ఉదయ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాసి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించింది. చెన్నైలో ట్రైనింగ్ అయ్యాక 2021లో లెఫ్టినెంట్‌గా ఇంజనీర్ రెజిమెంట్‌లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్ హోదా ΄పొందింది. 2022 కార్గిల్ దివస్ సందర్భంగా సియాచిన్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508 కిలోమీటర్ల సైకిల్ యాత్రను శివ చౌహాన్ తన నాయకత్వంలో పూర్తి చేయడంతో ఆమె అధికారుల దృష్టిలో పడింది. దాంతో ఆమెను సియాచిన్‌లో టీమ్ లీడర్గాపోస్ట్ వరించింది. త్రివిధ దళాలలో చరిత్ర సృష్టిస్తున్న స్త్రీల సరసన ఇప్పుడు శివ చౌహాన్ నిలిచింది. కఠిన శిక్షణ సియాచిన్‌లో ఏ స్థావరంలో విధులు నిర్వహించాలన్నా సియాచిన్ హెడ్‌క్వార్టర్స్‌లోని బేటిల్ స్కూల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేయాలి. మిగిలిన మగ ఆఫీసర్లతో పాటు శివ ఈ శిక్షణను పూర్తి చేసింది. ఇందులో కఠినమైన మంచు గోడలను అధిరోహించడం, మంచులోయల్లో పడినవారిని రక్షించడం, శారీరక ఆరోగ్యం కోసం డ్రిల్ పూర్తి చేయగలగడం వంటి అనేక ట్రయినింగ్లు ఉంటాయి. ‘ఆమె శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. మూసను బద్దలు కొట్టింది’ అని ఆర్మీ అధికారులు అన్నారు. -
Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్‌లు..!
Anil Kumble: టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో టీమిండియా సక్సెస్ సాధించేందుకు తోడ్పడే కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఫాలో అవుతున్న.. '3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు' అనే ఫార్ములాను టీమిండియా కూడా ఫాలో అవ్వాలని సూచించాడు. 2021లో ఆసీస్.. తాజాగా ముగిసిన వరల్డ్‌కప్ (2022)లో ఇంగ్లండ్ సక్సెస్ మంత్ర ఇదేనని పేర్కొన్నాడు. టెస్ట్‌ల్లో , పరిమిత ఓవర్ల క్రికెట్లో వేర్వేరు కోచ్‌లు, వేర్వేరు కెప్టెన్లతో ఇంగ్లండ్ జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చపై కుంబ్లే తన అభిప్రాయాన్ని ఈమేరకు వెల్లడించాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు, ముగ్గురు కోచ్‌లు ఉండాలని కచ్చితంగా చెప్పలేను కానీ, జట్టు మాత్రం డిఫరెంట్‌గా (ఆయా ఫార్మాట్లలో స్పెషలిస్ట్‌లతో కూడిన జట్టు) ఉంటే తప్పక సత్ఫలితాలు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ముఖ్యంగా టీ20లకు ప్రత్యేక జట్టు చాలా అవసరమని, ఈ ఫార్మాట్లో హార్డ్ హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, టీ20 స్పెషలిస్ట్‌ల పాత్ర చాలా కీలకమని, 2021 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, తాజాగా ముగిసిన వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఈ ఫార్ములా అమలు చేసే విజయాలు సాధించాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టులో లివింగ్‌స్టోన్, ఆసీస్ టీమ్‌లో స్టొయినిస్ లాంటి ఆటగాళ్లు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నారంటే, ఆయా జట్ల కూర్పు ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుందని ఉదహరించాడు. కుంబ్లే చేసిన ఈ ప్రతిపాదనకు ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ కూడా మద్దతు పలికాడు. అన్ని జట్లు ఈ విషయం గురించి సీరియస్‌గా ఆలోచించాలని సూచించాడు. కాగా, విశ్వవిజేత ఇంగ్లండ్ జట్టుకు టెస్ట్‌ల్లో, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వేర్వేరు కోచ్‌లు, కెప్టెన్లు, జట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టుకు టెస్ట్‌ల్లో బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్‌గా, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాథ్యూ మాట్ కోచ్‌గా, జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20ల్లో మాజీ ఛాంపియన్ అయిన ఆసీస్‌కు టెస్ట్‌ల్లో, లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో వేర్వేరు కోచ్‌లు లేనప్పటికీ.. కెప్టెన్లు (కమిన్స్, ఫించ్), జట్టు పూర్తిగా వేరుగా ఉంది. టీమిండియా విషయానికొస్తే.. మన జట్టు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ (రోహిత్ శర్మ), ఒకే కోచ్ (ద్రవిడ్), ఇంచుమించు ఒకే జట్టు కలిగి ఉంది. అప్పుడప్పుడు అంతగా ప్రాధాన్యత లేని సిరీస్‌లకు రెస్ట్ పేరుతో కెప్టెన్‌కు, కోచ్‌కు రెస్ట్ ఇస్తుంది. ఆ సమయంలో కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తుంటాడు. కెప్టెన్ల మాట చెప్పనక్కర్లేదు. రోహిత్ గైర్హాజరీలో ఒక్కో సిరీస్‌కు ఒక్కో ఆటగాడు కెప్టెన్‌గా పని చేశాడు. గత ఏడాది కాలంలో భారత్ ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది. చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..! -
3 వారాలకే ఓటీటీకి కెప్టెన్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ హీరో ఆర్య హీరోగా ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్’. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత టి. కిషోర్ తో కలిసి ఆర్య కూడా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైంది. చదవంండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ విడుదలైన మూడు వారాలకే కెప్టెన్ ఓటీటీకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ‘జీ5’లో కెప్టెన్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. తాజా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్పించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించగా... సీనియర్ నటి సిమ్రాన్ మహిళా ఆర్మీ అధికారినిగా స్పెషల్ రోల్ పోషించింది. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. #Captain OTT RELEASE September 30 @ZEE5India pic.twitter.com/lnHBo9cSQZ — OTTGURU (@OTTGURU1) September 21, 2022 -
‘కెప్టెన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కెప్టెన్ నటీనటులు : ఆర్య, ఐశ్యర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీశ్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్ దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్ సంగీతం : డి ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఎస్ యువ విడుదల తేది: సెప్టెంబర్8,2022 కథేంటంటే.. భారత్‌లోని ఈశాన్య అటవీ ప్రాంంతంలో, సెక్టార్ 42కి చెందిన అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా పౌర, సైనిక కార్యకలాపాలు లేవు. ఆ ప్రదేశానికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. వారికి వారే షూట్ చేసుకొని చనిపోతున్నారు. దీంతో ఈ మిస్టరీని తెలుసుకోవడానికి భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) బ్యాచ్‌ని రంగంతోకి దించుతుంది. కెప్టెన్ విజయ్‌కి ఏ ఆపరేషన్ అయినా విజయవంతంగా పూర్తి చేస్తాడనే పేరుంది. తన టీమ్‌తో కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతుంటాడు. అందుకే ఈ డేంజరస్ ఆపరేషన్ని కెప్టెన్ విజయ్‌కి అప్పగిస్తుంది ప్రభుత్వం. విజయ్ తన బృందంతో కలిసి సెక్టార్ 42 ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మినటార్స్(వింత జీవులు) ఉన్నాయని, వాటివల్లే అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిగిరి రావడంలేదని విజయ్ గుర్తిస్తాడు. మరి విజయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వింత జీవులు ఏంటి? సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా మినటార్స్ ఏం చేస్తున్నాయి? సైంటిస్ట్ కీర్తి(సిమ్రాన్) చేసే పరిశోధన ఏంటి? చివరకు కెప్టెన్ విజయ్ మినటార్స్ని అంతం చేశాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కెప్టెన్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అసక్తి పెరిగింది. వింత జీవులతో ఇండియన్ ఆర్మీ ఫైట్ చేయడం అనే కొత్త పాయింట్‌తో సినిమా తెరకెక్కడంతో అందరికి దృష్టి ‘కెప్టెన్’పై పడింది. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దానికి తగ్గ కథ, కథనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ హాలీవుడ్ చిత్రాలను చూసి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్ వర్సస్ క్రియేచర్ జానర్లో ఈ సినిమా సాగుతుంది. అందులో అయినా ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సెక్టార్ 42లో వింత జీవులు ఉంటాయి వాటితో కెప్టెన్ విజయ్ యుద్దం చేయాలి అనేది ఫస్టాఫ్ పాయింట్ అయితే.. ఎలా చేశాడనేది సెకండాఫ్. దీనికి కథను అల్లడానికి ఫస్టాఫ్‌లో అసవరమైన సీన్స్ అన్ని బలవంతంగా చొప్పించాడు దర్శకుడు. ఆ సీన్స్ కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందా అంటే అదీ లేదు. ఇక సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉంటాయి. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన సైనికులకు ఏమి కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం.. గన్‌తో షూట్ చేసే మినటార్స్ మరణించడం లేదని తెలిసినా.. మళ్లీ మళ్లీ సైనికులు గన్స్ పట్టుకొనే ఆ ప్రదేశానికి వెళ్లడం.. సైంటిస్ట్ కీర్తికి కెప్టెన్ జవాన్ సైన్స్ గురించి చెప్పడం.. ఆమె ఆశ్యర్యంగా చూడడం..ఇలా చాలా సన్నివేశాల్లో లాజిక్ మిస్సవుతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఎందుకు స్పృహ కోల్పోవడం లేదనడానికి మాత్రం సరైన కారణం చెప్పాడు. వీఎఫ్ఎక్స్ అంతగా ఆకట్టుకోలేదు. కథకు కీలకమైన క్రీచర్ని కూడా సరిగా చూపించలేకపోయారు. మినటార్స్తో వచ్చే ఫైట్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ఆ చిత్రాలను చూడని ప్రేక్షకులకు ‘కెప్టెన్’ కాస్త కొత్తగా కనిపిస్తాడు. ఎవరెలా చేశారంటే.. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రకు ఆర్య న్యాయం చేశాడు. ఉన్నంతలో యాక్షన్స్ సీన్స్‌ని కూడా అదరగొట్టేశాడు. అతని టీమ్‌లోని సభ్యులు కూడా చక్కటి నటనను కనబరిచారు. ఐశ్వర్య లక్ష్మి రెండు సీన్స్, ఓ పాటలో కనిపిస్తుంది అంతే. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సైంటిస్ట్ కీర్తిగా సిమ్రాన్ పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఎస్ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇమాన్ నేపథ్య సంగీతం ఆట్టుకునేలా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోతాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
హీరో ఆర్య 'కెప్టెన్' మూవీ స్టిల్స్
-
నితిన్ నాకు మంచి స్నేహితుడు: ఆర్య
‘‘ప్రేక్షకుల అభిరుచులు మారాయి. కొత్తదనం ఉంటేనే థియేటర్స్‌కు వస్తునారు. ఓటీటీ, శాటిలైట్ రైట్స్లతో నిర్మాతలకు కాస్త డబ్బులు వస్తునప్పటికీ, ఓ సినిమా థియేటర్స్‌లో విడుదలై హిట్ సాధించినప్పుడు లభించేదే నిజమైన సక్సెస్ అని నా ఫీలింగ్’’ అనారు హీరో ఆర్య. ‘టెడ్డీ’ సినిమా తర్వాత హీరో ఆర్య, దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘కెప్టెన్ ’. ఆర్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తునారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆర్య చెప్పిన విశేషాలు... ► ‘టెడ్డీ’ తర్వాత శక్తి సౌందర్ రాజన్ నాకు ‘కెప్టెన్ ’ కథ చెప్పారు. మరో దర్శకుడు అయితే ‘కెప్టెన్ ’కు నో చెప్పేవాడినేమో. కానీ శక్తి సౌందర్ రాజన్ తో నాకు పని చేసిన అనుభవం ఉంది. ఆయనకు సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్)పై ఎంత పట్టు ఉందో నాకు అవగాహన ఉంది. అందుకే ‘కెప్టెన్ ’ సినిమాకు ఓకే చెప్పాను. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ► ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ విజయ్ కుమార్ పాత్ర చేశాను. ఓ వింత జీవితో పోరాటం చేయడమే ‘కెప్టె’ కథ. విజయ్ కుమార్, అతని బృందం ఈ వింత జీవితో ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? ఈ వింత జీవి వల్ల మానవాళికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? అనే అంశాల సమాహారమే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో ఆర్మీ బ్యాక్‌డ్రాప్ ఉంది కాబట్టి ప్రతి అంశాని చాలా జాగ్రత్తగా డీల్ చేశాం. మాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే అది ఆర్మీ వారిని తక్కువ చేసినట్లుగా ఉండకూడదనుకుని సెట్లో ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ను నియమించుకునాం. ► ఈ సినిమాలోని క్లైమాక్స్ సనివేశాల చిత్రీకరణ నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో కొని సనివేశాలను చిత్రీకరించాం. ట్రైలర్, టీజర్స్‌లో కనిపించినట్లుగా వింత జీవి నా ముందు ఉండదు. ఉందని ఊహించుకుని యాక్ట్ చేయాలి. ఇది చాలా కష్టంగా అనిపించింది. ఇక వింత జీవి అనేది గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే. ► ‘టెడ్డీ’, ‘సారపట్టై’.. ఇప్పుడు ‘కెప్టెన్ ’...ఇలా వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తునాను అంటే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటానని కాదు. సాధారణంగా నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటుంటాను. రిస్కీ స్క్రిప్ట్స్ ఉన దర్శకులు వేరే హీరోలు ఎవరూ చేయకపోతే నా దగ్గరకు వస్తారు. నేనైతే ప్రొడ్యూస్ కూడా చేస్తానని నాతో చాన్ ్స కూడా తీసుకుంటుంటారు. ‘కెప్టెన్ ’ సినిమాకు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. అయితే ఈ సినిమా విజయంపై మాత్రమే అది ఆధారపడి ఉంది. ► నితిన్ నాకు మంచి స్నేహితుడు. కమల్‌హాసన్ గారి ‘విక్రమ్’ సినిమా శ్రేష్ఠ్ మూవీస్ ద్వారానే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ లిస్ట్‌లో ఇప్పుడు ‘కెప్టెన్ ’ సినిమా కూడా చేరుతుందనే నమ్మకం ఉంది. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తాను. అలాగే కథ నచ్చితే నా భార్య సాయేషాతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉనాను. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. గతవారం కోబ్రా మినహా అన్ని చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. వాటిలో ఒకటి రెండు చిత్రాలు మంచి టాక్ని సంపాదించుకోగా..మరికొన్ని బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ వారం కూడా పలు చిన్న చిత్రాలు అటు థియేటర్స్‌లో ఇటు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. కెప్టెన్ తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. బ్రహ్మాస్త్రం రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదలవుతోంది. ఒకే ఒక జీవితం శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. శ్రీరంగాపురం వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవీ సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగాపురం’.ఎమ్ఎస్. వాసు దర్శకత్వంలో చిందనూరు నాగరాజు నిర్మించిన ఈ సినిమా సెస్టెంబర్ 9న విడుదల కానుంది. కొత్తకొత్తగా అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బిజి గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(సెప్టెంబర్9) విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు డిస్నీ+హాట్‌స్టార్ థోర్ లవ్ అండ్ థండ్(తెలుగు), సెప్టెంబర్ 8 గ్రోయింగ్ అప్(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 8 హైడోస్.. సెప్టెంబర్ 8 పినాచో.. సెప్టెంబర్ 8 కార్స్ ఆన్ ది రోడ్(హాలీవుడ్).. సెప్టెబర్ 8 వెడ్డింగ్ సీజన్(హాలీవుడ్) సెప్టెంబర్ 8 నెట్‌ఫ్లిక్స్ వన్స్ అపాన్ ఏ స్మాల్ టౌన్(సిరీస్), సెప్టెంబర్ 5 రిక్ అండ్ మార్టీ:సీజన్-6: ఎపిసోడ్-1(వెబ్ సిరీస్).. సెప్టెంబర్ 5 అన్‌టోల్డ్: ది రేస్ ఆఫ్ సెంచరీ(హాలీవుడ్) సెప్టెంబర్6 ఇండియన్ ప్రేడేటర్: ది డైరీ ఆఫ్ ఏ సీరియల్ కిల్లర్(డాక్యమెంటరీ) సెప్టెంబర్ 7 చెప్స్ టేబుల్: పిజ్జా ఏ క్వైట్ ప్లేస్(డాక్యుమెంటరీ) సెప్టెంబర్ 7 ది అంత్రాక్స్ అటాక్స్(హాలీవుడ్) సెప్టెంబర్ 8 ఏక్ విలన్ రిటర్న్స్ (బాలీవుడ్) సెప్టెంబర్ 9 కోబ్రా కాయ్: సీజన్-5(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 9 మోర్టల్ కాంబ్యాట్(హాలీవుడ్) సెప్టెంబర్ 11 అమెజాన్ ప్రైమ్ స్టూడియో 666.. సెప్టెంబర్ 5 హీ ఈజ్ సైకోమెట్రిక్- సెప్టెంబర్ 7 రిప్లై 1994- సెప్టెంబర్ 7 ప్రిజన్ ప్లే బుక్- సెప్టెంబర్ 7 ఎలీన్(Aline)-సెప్టెంబర్ 9 (వీటితో పాటు మరికొన్ని వెబ్ సిరీస్, టాక్ షోలు ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్నాయి) ఆహా డ్యాన్స్ ఐకాన్(రియాల్టీ షో) సెప్టెంబర్ 11 జీ5 పాపన్(మూవీ) సెప్టెంబర్ 7 ఎంఎక్స్ ప్లేయర్ యునికి యారీ(బాలీవుడ్), సెప్టెంబర్ 9 -
ఏలియన్‌తో హీరో ఆర్య పోరాటం.. ఆసక్తిగా ‘కెప్టెన్’ ట్రైలర్
తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది, ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం తాజాగా మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ, ఏలియన్లతో చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆసక్తిగా మలిచారు. చదవండి: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే ఆర్మీ అధికారులు ఓ గ్రహాంతరవాసితో తలపడే యాక్షన్ సీన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్, ఆర్మీ ఆఫీసర్ల అధికారిగా నటి సిమ్రాన్ ఇచ్చే సూచనలు, గ్రహాంతవాసులను ఎదుర్కొనేందుకు ఆర్య వేసే ఎత్తుగడలను వివరిస్తూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. -
జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
ముంబై: జింబాబ్వేలో పర్యటించనున్న భారత వన్డే జట్టు నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించగా... ఇప్పుడు అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేశారు. జులై 30న ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టుకు ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కోవిడ్‌నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో రాహుల్‌ను ఈ సిరీస్‌ను ఎంపిక చేయలేదు. అయితే ఇప్పుడు రాహుల్ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షించిందని, అన్నీ చక్కబడటంతో అతడిని జట్టులోకి తీసుకున్నామన్న బీసీసీఐ...కెప్టెన్‌గానూ నియమించింది. దాంతో శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్సీకి మారాడు. రాహుల్‌ను జట్టులోకి తీసుకున్నా, ఎవరినీ తప్పించకుండా 16 మందితో టీమ్‌ను బోర్డు ప్రకటించింది. భారత్, జింబాబ్వే మధ్య ఈ నెల 18, 20, 22 తేదీల్లో హరారేలో 3 వన్డేలు జరుగుతాయి. జట్టు వివరాల: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, మొహమ్మద్ సిరాజ్. చదవండి: ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్! -
IPL 2022: ‘ప్రపంచకప్ అందుకోవడమే లక్ష్యం’
అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా నాలుగుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఐదోసారి ట్రోఫీని అందుకున్న అతనికి ఇది మరింత ప్రత్యేకం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా నాయకుడిగా మరో మెట్టెక్కాడు. కెప్టెన్ కావడం తన బాధ్యతను పెంచిందని, నాయకత్వాన్ని ప్రతీ క్షణం ఆస్వాదించానని అతను వ్యాఖ్యానించాడు. ‘అదనపు బాధ్యత తీసుకునేందుకు నేనెప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎప్పుడు అవకాశం లభించినా మిగతా వారిలో స్ఫూర్తి నింపేలా జట్టును ముందుండి నడిపించాలని భావించేవాడిని. నా జట్టు సహచరుల నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నానో వారికంటే ముందు నేను చేసి చూపించాలి. అలా చేస్తేనే దాని ప్రభావం ఉంటుంది. ఐపీఎల్లో నేను అలాగే చేశానని నమ్ముతున్నా’ అని పాండ్యా అన్నాడు. కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే సాధించిన ఐపీఎల్ ట్రోఫీకి తన దృష్టిలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అతను చెప్పాడు. ‘గతంలో నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నాను. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఈసారి నా కెప్టెన్సీలో టైటిల్ గెలిచాం కాబట్టి సహజంగానే ఇది మరింతగా ఇష్టం. ఈ గెలుపు రాబోయే రోజుల్లో ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. ఫైనల్‌కు వెళ్లిన ఐదుసార్లూ కప్‌ను అందుకోగలిగిన నేను చాలా అదృష్టవంతుడిని. ఈ రోజు నాది. పైగా లక్షకు పైగా అభిమానులు మాకు అండగా నిలిచారు. మా కష్టానికి దక్కిన ప్రతిఫలమిది’ అని ఈ ఆల్‌రౌండర్ విశ్లేషించాడు. టి20లు బ్యాటర్ల ఆట మాత్రమే అని చాలా మంది అనుకుంటారని, అయితే ఈ ఫార్మాట్లో బౌలర్లే మ్యాచ్ గెలిపించగలరని హార్దిక్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో తగినంత స్కోరు లేని సమయంలోనూ మంచి బౌలర్లు ఉంటే మ్యాచ్‌ను మలుపు తిప్పగలరని అతను అన్నాడు. హార్దిక్ పాండ్యా తన తదుపరి లక్ష్యం ప్రపంచకప్ గెలుచుకోవడమే అని ప్రకటించాడు. టీమిండియా తరఫున మూడు ఐసీసీ టోర్నీలలో భాగంగా ఉన్నా... ఒక్కసారి కూడా అతనికి విజయానందం దక్కలేదు. ‘ఎవరికైనా భారత జట్టు తరఫున ఆడటమనేది ఒక కల. నేను ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి మనోళ్ల అభిమానాన్ని చూరగలిగాను. ఇక టీమిండియా సభ్యుడిగా వరల్డ్‌కప్ గెలుపులో భాగం కావడమనేదే నా లక్ష్యం. అందుకోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. నేను ఏ రకంగా జట్టుకు ఉపయోగపడినా చాలు’ అని హార్దిక్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ వేదికలకు నజరానా ఈ ఐపీఎల్ సీజన్లో జరిగిన 74 మ్యాచ్‌లను సమర్థంగా నిర్వహించడంతో పాటు చక్కటి పిచ్‌లను రూపొందించిన ఆరు వేదికలకు బీసీసీఐ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ముంబైలోని వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పుణేలోని ఎంసీఏ మైదానంలో లీగ్ దశ మ్యాచ్‌లు జరగగా... కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాలు ప్లే ఆఫ్స్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. లీగ్ మ్యాచ్‌లు జరిగిన స్టేడియాలు ఒక్కో దానికి రూ.25 లక్షలు, ప్లే ఆఫ్స్ నిర్వహించిన మైదానాలకు ఒక్కోదానికి రూ. 12.5 లక్షల చొప్పున బహుమతిని బోర్డు ప్రకటించింది. -
భారత మహిళల హాకీ ఫైవ్స్ జట్టు కెప్టెన్‌గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీ జూన్ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరుగుతుంది. -
మహిళల హాకీ మాజీ కెప్టెన్ ఎల్వెరా బ్రిటో కన్నుమూత
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్, పాతతరం క్రీడాకారిణి ఎల్వెరా బ్రిటో కన్ను మూశారు. 81 ఏళ్ల ఎల్వెరా బ్రిటో వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ‘బ్రిటో సిస్టర్స్’గా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎల్వెరా, రీటా, మయె భారత మహిళల హాకీ జట్టుకు చిరపరిచితులు. జాతీయ టోర్నీలో 1960 నుంచి 1967 వరకు కర్ణాటక జట్టుకు ఏడు టైటిళ్లు అందించిన ఘనత బ్రిటో సిస్టర్స్‌ది! ఎల్వెరా బ్రిటో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు 1965లో ‘అర్జున అవారు’్డను అందజేసింది. -
కమలా హారిస్ రక్షణ సలహాదారుగా శాంతి సేథి
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రక్షణ సలహాదారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శాంతి సేథి నియమితులయ్యారు. జాతీయ భద్రతా సలహాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆమె సమన్వయం చేయనున్నారు. శాంతి 1993లో యూఎస్ నేవీలో చేరారు. యూఎస్ నౌకాదళంలో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ డికేటర్ నౌక ఇన్చార్జ్గా పనిచేశారు. యూఎస్ యుద్ధ నౌక కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇండో అమెరికన్ ఆమే. భారత్‌కు వచ్చిన యూఎస్ నౌకకు తొలి మహిళా కమాండర్ కూడా. చదవండి: (ఏడాది కాలంలో దాదాపు 8 లక్షల వీసాల జారీ: డొనాల్డ్ హెఫ్లిన్) -
ఫస్ట్‌లుక్ పోస్టర్ కోసం ఏడాదిన్నర సమయం పట్టిందట!
తమిళసినిమా: కెప్టెన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. టెడీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆర్య దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ల కాంబినేషన్లో రూపొందుతోంది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థింక్ స్టూడియోస్, ది షో పీపుల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ట్రెండీగా మారింది. విశేషం ఏమిటంటే ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ కోసం చిత్ర యూనిట్ ఏడాదిన్నరగా శ్రమించారట. కారణం ప్రేక్షకులకు ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి వినూత్న అనుభూతిని కల్పించాలన్నదే అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఒక థ్రిల్లర్ పయనంగా ఉంటుందన్నారు. చిత్రం కోసం ఆర్య చూపించిన అంకితభావం, శ్రమ మాటల్లో చెప్పలేదని నిర్మాతలు పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువ ఛాయాగ్రహణం, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: Palasa 1978 Movie: 'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్‌కు ఎంపిక -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్!
ఐపీఎల్ మెగావేలం ముగిసింది. మెగావేలంలో తమకు ఇష్టమైన ఆటగాళ్లను దక్కించుకున్న ఫ్రాంచైజీలు ఇక కెప్టెన్ల వేట మొదలుపెట్టనున్నాయి. కాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను ఎంపికచేయనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ ప్రకటించనుంది. కాగా వేలంలో ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది. ''జట్టు కెప్టెన్‌గా ధావన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్న ధావన్ పంజాబ్ కెప్టెన్‌గా జట్టును తన భుజాలపై మోస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో పాటు కోచ్ కూడా ధావన్‌వైపు మొగ్గుచూపుతున్నారు. తొందర్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుంది.'' అంటూ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఒక కీలక వ్యక్తి తెలిపారు. చదవండి: IPL 2022 Auction: ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం కాగా 12 కోట్లతో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే సీనియారిటీ ప్రకారం ధావన్ కెప్టెన్ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో కెప్టెన్ ఎవరనే దానిపై క్లారిటీ రానుంది. ఇక ఈసారి కచ్చితంగా కప్ సాధించాలాని అనుకుంటున్న పంజాబ్ వేలంలో నిఖార్సైన ఆటగాళ్లను దక్కించుకుంది. లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబాడ, ఓడియన్ స్మిత్, షారుక్ ఖాన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లు వేలంలో కొనుగోలు చేసింది. మరి ఈసారైనా పంజాబ్ రాత మారుతుందో లేదో చూడాలి. ఇక పంజాబ్ కింగ్స్ మొత్తం ఆటగాళ్ల సంఖ్య 25 కాగా.. అందులో భారత క్రికెటర్లు 18 మంది ఉండగా.. ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఆటగాళ్లపై పంజాబ్ రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది. చదవండి: IPL 2022 Auction: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు -
‘ఆటగాడిగా ఎంతో చేయగలను’ కెప్టెన్సీ లేకపోవడంపై కోహ్లి వ్యాఖ్య
న్యూఢిల్లీ: అధికారికంగా తనకు కెప్టెన్ హోదా లేకపోయినా... జట్టు కోసం పని చేసేందుకు దాని అవసరం లేదని మాజీ సారథి విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ కాకపోయినా ఒక బ్యాటర్ గా, సీనియర్ ప్లేయర్‌గా తాను కీలక బాధ్యత పోషిస్తానని అన్నాడు. ఇకపై బ్యాటర్‌గా తాను మరిన్ని గొప్ప ప్రదర్శనలతో టీమిండియాకు విజయాలు అందిస్తానని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘కెప్టెన్సీ గురించి నేను ఇలా చేశానేమిటి అని చాలా మంది అనుకొని ఉండవచ్చు. అయితే నా దృష్టిలో ప్రతీదానికి సమయం ఉంటుంది. దాని గురించి మనకు తెలిసుండాలి. ఇక్కడి వరకు మన బాధ్యత పూర్తయినట్లుగా భావించి ముందుకు వెళ్లాలి. ఇకపై ఒక బ్యాటర్‌గా నేను జట్టుకు ఇంకా చాలా చేస్తానేమో. నాయకుడిలాగే ముందుండి నడిపించాలంటే కెప్టెనే కానవసరం లేదు’ అని ఈ స్టార్ బ్యాటర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎమ్మెస్ ధోని కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాడని... అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా అలాంటి భావన ఏమీ రాకుండా అన్ని అంశాల్లో భాగమవుతూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవాడని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ‘అతడి నుంచి నేను కెప్టెన్సీ తీసుకోవడమనేది సహజ పరిణామమని, ఇది భారత జట్టుకు భవిష్యత్తులో మేలు చేస్తుందని ధోని భావించాడు. పరిస్థితులను అర్థం చేసుకొని సరైన సమయంలో తప్పుకోవడం కూడా నాయకత్వ లక్షణమే. అప్పటి వరకు ఒకేలా ఉన్న వాతావరణంలో కొంత మార్పు జరిగితే మంచిదే కదా. కొత్త తరహా ఆలోచనలతో కొత్తగా ఏదైనా చేయవచ్చు కూడా. ఎలాంటి బాధ్యతలకైనా సిద్ధంగా ఉండాలి’ అని కోహ్లి అన్నాడు. -
మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ
న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ వద్ద డిసెంబర్ 8న చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్ సింగ్ ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ సింగ్ రెండు నెలల క్రితం అనగా సెప్టెంబర్ 21, 2021న తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు రాసిన ఓ లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. చండి టెంపుల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వరుణ్ సింగ్ చదువుకున్నారు. చదవులో సామాన్య ప్రతిభ కనబరిచే విద్యార్థులనుద్దేశించి ఈ లేఖ రాశారు వరుణ్ సింగ్. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) ‘‘మీరు చదువులో యావరేజ్ స్టూడెంట్స్ అని ఎప్పుడు బాధపడకండి. చదువులో సామాన్యమైన విద్యార్థిగా ఉండటం తప్పేం కాదు. ప్రతి ఒక్కరు 90 శాతం మార్కులు తెచ్చుకోలేరు. ఒకవేళ మీరు మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు అయితే మీకు నా అభినందనలు. ఒకవేళ మీరు ర్యాంకర్ కాకపోయినా బాధపడకండి. చదువులో సామాన్య విద్యార్థి అయినందున మీ జీవితం కూడా అలానే ఉంటుంది అని భావించకండి’’ అని వరుణ్ సింగ్ సూచించారు. ‘‘మీకు దేని మీద ఆసక్తో దాన్ని గుర్తించండి. సంగీతం, నటన, రచన ఏది అయినా కావచ్చు. దానిలో రాణించేందుకు శ్రమించండి. చదువులో నేనూ యావరేజ్ స్టూడెంట్‌నే. ఎప్పుడు టాప్ మార్కులు రాలేదు. ఇక తొలిసారి నన్ను స్క్వాడ్రన్‌లో యువ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించిన్పుడు చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత నాకు ఓ విషయం అర్థం అయ్యింది. నేను కనుక నా మనసు, బుద్ధిని దీని మీదే కేంద్రీకరిస్తే.. చాలా అద్భుతంగా పని చేయగలనని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి నేను అత్యుత్తమంగా పని చేయడం ప్రారంభించాను’’ అని వరుణ్ సింగ్ రాసుకొచ్చారు. (చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు) ‘‘నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు నేను చదువలో, క్రీడల్లో రాణించలేదు. కానీ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించినప్పుడు నేను దాని మీద మనసు పెట్టాను. ఆ తర్వాత నాకు విమానాల పట్ల మక్కువ పెరిగింది. అలా నేను మెరుగ్గా పని చేస్తూ.. జీవితంలో ఎదిగాను. తొలుత నేను నా వాస్తవ సామర్థ్యాలను విశ్వసించలేదు. ఈ విషయం నాకు అర్థం అయిన తర్వాత నేను వెనుతిరిగి చూడలేదు. మీరు కూడా మీ మీద నమ్మకం పెట్టుకొండి. మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేయండి. మార్కులు మన జీవితానికి కొలమానం కాదు’’ అన్నారు వరుణ్ సింగ్. అంతేకాక తాను శౌర్య చక్ర అవార్డు అందుకోవడానికి ఆర్మీ స్కూలే కారణమని వరుణ్ సింగ్ తన లేఖలో తెలిపారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 'It's ok to be mediocre' Inspiring letter of Group Captain Varun Singh, lone survivor in helicopter crash, to principal of his school with request to share it with teenaged students to motivate them. Sharing the wonderful journey & beautiful thoughts of the braveheart with u. pic.twitter.com/vSpymhMg0p — Arun Bothra 🇮🇳 (@arunbothra) December 9, 2021 చదవండి: ఊరే అతడింటికి కదిలొచ్చింది -
కెప్టెన్‌గా రోహిత్ సరే.. వైస్ కెప్టెన్‌గా రాహుల్, పంత్‌ల కంటే అతనైతేనే బెటర్..!
Virender Sehwag Picks Jasprit Bumrah As Team India Vice Captain: టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా ఎవరుంటారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు, విశ్లేషకులేమో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల పేర్లు ప్రతిపాధిస్తుండగా.. టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరును తెరపైకి తెస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పరిమిత ఓవర్ల జట్టు ఉప సారధిగా రాహుల్, పంత్‌ల కంటే బుమ్రానే బెటర్ ఛాయిస్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు బుమ్రా ఏ టీ20 జట్టుకు నాయకత్వం వహించకపోయినా బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడని, మూడు ఫార్మాట్లలో నిలకగా ఆడే వారినే కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా నియమిస్తారు కాబట్టి బుమ్రా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా ఇప్పటివరకూ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని టీమిండియా వైస్ కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేయాలని డిమాండ్ చేశాడు. కాగా, ఇటీవలే భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా సైతం ఇంచుమించు ఇలాంటి ప్రతిపాదననే చేయగా, సెహ్వాగ్.. నెహ్రా ఛాయిస్‌ను సమర్ధిస్తూ బుమ్రాకు మద్దతు పలికాడు. టీమిండియా కెప్టెన్‌గా బౌలర్ ఉండకూడదని ఏ రూల్ బుక్లోనైనా రాసుందా అంటూ ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లి స్థానాన్ని ఫాస్ట్ బౌలర్‌తో భర్తీ చేయాలని నెహ్రా డిమాండ్ చేశాడు. చదవండి: పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్ -
బాలాకోట్ హీరో అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చిన భారత వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ‘గ్రూప్ కెప్టెన్’ ర్యాంక్ దక్కనుంది. సంబంధిత ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యాక ఆయనకు ఆ ర్యాంక్ ఇవ్వాలని భారత వాయుసేన నిర్ణయించిందని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదుల శిక్షణ శిబిరంపై భారత వాయుసేన విమానాలు మెరుపుదాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 2019 ఫిబ్రవరి 27న భారత దాడి తర్వాతి రోజునే పాకిస్తాన్ తన వాయుసేన దళాలను ప్రతిదాడి కోసం భారత్ వైపునకు పంపింది. వీటిని తిప్పికొట్టేందుకు భారత వాయుసేన బలగాలు గగనతలంలో ముందుకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తాను నడుపుతున్న మిగ్–21 బైసాన్ వాయుసేన యుద్ధవిమానంతో పాక్ ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?) -
శ్రీలంక క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ మృతి..
Sri Lanka First Test Captain Bandula Warnapura Passed Away: శ్రీలంక టెస్ట్ జట్టుకు తొట్ట తొలి సారధిగా వ్యవహరించిన బందుల వర్ణపుర(68) సోమవారం మృతి చెందాడు. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల అతను మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 1982 ఫిబ్రవరిలో కొలొంబొ వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక ఆడిన తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వర్ణపుర.. శ్రీలంక తరఫున తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌గా, తొలి పరుగు చేసిన ఆటగాడిగా.. అలాగే ఓపెనింగ్ బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్ చేసిన తొలి ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కెరీర్ మొత్తంలో 4 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన అతను.. 1975 ప్రపంచకప్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. రిటైర్మెంట్ అనంతరం అతను శ్రీలంక కోచ్‌గా కూడా వ్యవహరించాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బంగ్లా ఆల్‌రౌండర్ -
నేను ఇంకా ఎక్కడికీ వెళ్లడం లేదు: ధోని
ప్రతీ ఫైనల్ ప్రత్యేకమే. ఫైనల్లో ఎక్కువసార్లు ఓడిన జట్టు కూడా మాదే. అయితే పడ్డ ప్రతీసారి కోలుకొని పైకి లేవడం అన్నింటికంటే ముఖ్యం. మేం ఆటగాళ్లను మారుస్తూ వచ్చాం. ప్రతీసారి ఒక మ్యాచ్ విన్నర్ బయటకు వచ్చి అద్భుతాలు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే జట్టు సమావేశాల్లో మేం పెద్దగా మాట్లాడుకోం. ఏమైనా ఉంటే ఒక్కొక్కరితో విడిగా చెప్పడమే. మేం ఎక్కడ ఆడినా మాకు అండగా నిలిచే చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా చెన్నైలో ఆడుతున్నట్లే అనిపించింది. వచ్చేసారి రెండు కొత్త జట్లు వస్తున్నాయి కాబట్టి ఆటగాళ్లను కొనసాగించడం గురించి ఏమీ చెప్పలేను. నేను ఇదే జట్టుతో కొనసాగుతానా లేదా అనేది సమస్య కాదు. ఫ్రాంచైజీ కోసం ఒక పటిష్టమైన జట్టును తయారు చేయడం ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే వచ్చే 10 ఏళ్లు జట్టును నడిపించగల ప్రధాన బృందాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నా వైపు నుంచి గొప్ప ఘనతలు ఇచ్చి వెళుతున్నానని అంటున్నారు. కానీ నేను ఇప్పుడే పోతే కదా. –ఎమ్మెస్ ధోని, (చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్) -
కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతున్నారా...?
-
కోహ్లి నిర్ణయం సరైందే
-
పాక్‌పై బౌల్ అవుట్ విజయానికి 14 ఏళ్లు.. ధోని వ్యూహాలు ఫలించడంతో..
MS Dhoni wins first-ever match as captain: సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని విజయాల పరంపర మొదలైంది. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఘోర వైఫల్యం తరువాత సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి సీనియర్ ఆటగాళ్లు మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో 2007 టీ20 ప్రపంచ కప్‌లో యువ భారత జట్టుకు ధోని నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ స్కాట్లాండ్తో జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో భారత్ తన తొలి మ్యాచ్ దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మెదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 141 పరుగులకే పరిమితమైంది. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ జట్టు, భారత బౌలర్ల ధాటికి 87 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. ఇక భారత్ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో పాక్ బ్యాట్స్‌మెన్ మిస్బా వుల్ హక్ అద్భుతమైన పోరాటంతో టెయిలెండర్లతో కలిసి విజయం అంచుల దాకా తెచ్చాడు. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 12 పరుగులు కావాలి. శ్రీశాంత్ వేసిన చివరి ఓవర్లో మొదటి నాలుగు బంతుల్లోనే రెండు ఫోర్లు రావడంతో 11 పరుగులు వచ్చేశాయి. రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే కావాలి. ఐదో బంతికి పరుగులేమీ లేదు. చివరి బంతికి సింగిల్ తీయబోయిన మిస్బా వుల్... రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చదవండి: బ్లూ కలర్ జెర్సీలో కనిపించనున్న ఆర్సీబీ.. ఎందుకంటే? ఫలితం తేల్చేందుకు అంపైర్లు బౌల్-అవుట్ పద్ధతిని ఎంచుకున్నారు. బౌల్- అవుట్ పద్ధతి అంటే ఇరుజట్లు బౌల్ చేసి 6 బంతుల్లో వికెట్లు పడగొట్టాలి. ఏ జట్టు ఎక్కువ వికెట్లు తీస్తే వారిదే విజయం. ఈ నేపథ్యంలో ధోనీ వ్యూహాలను రచించాడు. కేవలం స్పిన్నర్లతో బౌలింగ్ చేయించేందుకు నిర్ఱయించుకున్నాడు. మొదటి బంతిని అందుకున్న పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ వీరేంద్ర సెహ్వాగ్... క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ నుంచి మీడియం పేసర్ యాసిర్ అరాఫత్ వేసిన బంతి వికెట్లను తాకలేదు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తరువాత రెండో బంతి అందుకున్న హర్భజన్ సింగ్ వికెట్లను పడగొట్టాడు. పాక్ తరుపున ఆ జట్టు స్టార్ బౌలర్ ఉమర్ గుల్ వేసిన బంతి వికెట్లకు చాలా దూరంగా వెళ్లింది. దీంతో టీమిండియా 2-0 లీడ్‌లోకి వెళ్లింది. మూడో బంతి వేసిన రాబిన్ ఊతప్ప కూడా వికెట్ తీశాడు. పాక్ మిగత బంతులు విసరాలి అంటే మూడో బంతికి వికెట్ తీయాల్సిందే. ఆ సమయంలో బాల్ అందుకున్న షాహిదీ ఆఫ్రిదీ వికెట్లను కూల్చడంలో గురి తప్పాడు. దీంతో 3-0 తేడాతో టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. ధోని కెప్టెన్‌గా తన కేరిర్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ ‘బాల్ అవుట్’లో తొలి విజయం ఇదే కావడం విశేషం. అటు తర్వాత ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లను ఓడించిన టీమిండియా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో మరోసారి భారత్ దాయాది పాకిస్తాన్‌తో తలపడింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 2007 టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్ కప్ , 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సైతం టీమిండియా సాధించింది. మూడు ఐసీసీ ట్రోఫీలను అదించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. చదవండి: T20 World Cup 2021: ఇలాగే చేస్తే అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు... -
భారత క్రికెట్ జట్టు (దివ్యాంగుల) కెప్టెన్‌గా వసంతకుమార్
హిందూపురం టౌన్: టీమిండియా దివ్యాంగుల క్రికెట్ టీ-20 జట్టు కెప్టెన్‌గా హిందూపురానికి చెందిన వై.వసంతకుమార్ ఎంపికయ్యాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సమావేశంలో సెప్టెంబర్‌లో దేశంలోని వివిధ స్టేడియాల్లో జరగనున్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్, వన్డే, టీ-20 క్రికెట్ టోరీ్నలకు సంబంధించి జట్లను ప్రకటించారు. మూడు ఫార్మెట్లలోనూ వసంత కుమార్‌కు ప్రాతిని«ధ్యం దక్కింది. అలాగే టీ-20 జట్టు కెపె్టన్‌గా ఎంపికయ్యాడు. -
ఏదీ సులభంగా రాదు: జోయా అగర్వాల్
అమె అతి చిన్న వయసులో బోయింగ్ –777 నడిపింది. తోడుగా నలుగురు మహిళా కెప్టెన్లను తీసుకొని కమాండింగ్ ఆఫీసర్‌గా ఎయిర్ ఇండియా సర్వ మహిళా సిబ్బంది విమానాన్ని 17 గంటల పాటు ఎగరేసి శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరు చేరుకుంది. ఇంతకాలం జోయా అగర్వాల్ ఘనతలు తెలుసు. ఆమె జీవితం తెలియదు. పైలెట్ కావడానికి తాను ఎంత స్ట్రగుల్ చేయాల్సి వచ్చిందో చెప్పి ‘ఎనిమిదేళ్ల వయసులోనే నేను ఈ కలను కని సాధించుకున్నాను’ అందామె. ఆమె స్ఫూర్తి గాథ ఇది. జోయా గురించి ఏం చెప్పాలి? కోవిడ్ మొదలయ్యాక ప్రభుత్వం తలపెట్టిన ‘వందే భారత్ మిషన్’లో ఒక మహిళా పైలెట్‌గా పాల్గొని ఎయిర్ ఇండియా విమానాలను ఎగరేసి 12 దేశాల నుంచి 64 ట్రిప్పులు వేసి దాదాపు 15000 మంది భారతీయులను స్వదేశం చేర్చింది ఆమె. 2021 జనవరి నెలలో మరో నలుగురు మహిళా పైలెట్లతో కలిసి ఎయిర్ ఇండియా విమానం ముఖ్య పైలెట్‌గా శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకూ ఉత్తర ధ్రువం మీదుగా (ఆ సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల వరకూ ఉంటుంది) 17 గంటలు ఏకధాటిగా నడిపి రికార్డు సృష్టించిందామె. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే జోయా అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవిత విశేషాలు పంచుకుంది. ఢిల్లీ ఆకాశంలో ఆకాశంలో ఎగిరే విమానాన్ని అందరూ చూస్తారు. కాని ఆ విమానం వీపున ఎక్కి ప్రపంచాన్ని చుట్టాలని కొందరే కలలు గంటారు. ఢిల్లీకి చెందిన జోయ చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాలు చూసేది. అప్పుడు ఆమెకు 8 ఏళ్ల వయసు. ‘ఆ విమానంలో నేను ఉంటే చుక్కలను చుట్టేద్దును కదా’ అని అనుకునేది. ఆ సమయంలోనే దూరదర్శన్‌లో రాజీవ్ గాంధీ కనిపించేవారు. ఎవరి మాటల్లోనో రాజీవ్ గాంధీ గతంలో పైలెట్‌గా పని చేశారని వింది జోయ. అప్పుడు ఆమెకు అనిపించింది తాను కూడా పైలెట్ కావాలని. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒక్కగానొక్క కూతురు. అలాంటి కుటుంబంలో ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనకూడదని సమాజం అనుకుంటుంది. కాని జోయకు లెక్కలేదు. తానొక కల కంది. దానిని నిరూపించుకుంటుంది అంతే. పది తర్వాత పదోక్లాసు వరకూ ఎలాగో తన మనసులోని కోరికను ఉగ్గపట్టుకున్న జోయ పది రిజల్ట్స్ వచ్చిన వెంటనే తన మనసులోని కోరిక తల్లిదండ్రులకు చెప్పింది. ‘ఓరి దేవుడో... డిగ్రీ చేయించి ఏదో ఒక మంచి ఇంట్లో పెళ్లి చేద్దామంటే ఈ అమ్మాయికి ఇదేం కోరిక’ అని తల్లి ముక్కు చీదడం మొదలెట్టింది. తండ్రి ‘అంత శక్తి మనకెక్కడిదమ్మా’ అని ఆందోళన చెందాడు. జోయ మరో దారిలేక ఇంటర్లో చేరింది. మంచి మార్కులు తెచ్చుకుంది. డిగ్రీ చేస్తూ మరోవైపు ఒక ఇన్స్టిట్యూట్లో ఏవియేషన్ కోర్సు చేసింది. అంటే తల్లిదండ్రుల కోసం డిగ్రీ... తన కోసం ఏవియేషన్. డిగ్రీలో కూడా మంచి మార్కులు వచ్చాక ‘నన్ను ఇప్పటికైనా పైలెట్‌ను కానివ్వండి’ అని తల్లిదండ్రులను కోరింది. తండ్రి అప్పుడు కూడ భయం భయంగానే లోను తెచ్చి ఆమె పైలెట్ కోర్సుకు డబ్బు కట్టాడు. మనసంతా పెట్టి ఆ కోర్సు పూర్తి చేసింది జోయ. 3000 మందితో పోటీ పడి పైలెట్ చదువు పూర్తయ్యాక రెండేళ్లు ఖాళీగా ఉన్న జోయ ఎయిర్ ఇండియాలో 7 పైలెట్ పోస్టులు పడ్డాయని తెలిసి ఎగిరి గంతేసింది. అయితే ఆ 7 పోస్టుల కోసం 3000 మంది దరఖాస్తు చేశారని తెలిసి కంగారుపడినా పట్టుదలగా ప్రయత్నించింది. ముంబైలో వారంలో పరీక్ష అనగా తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినా తండ్రి ప్రోత్సాహంతో పరీక్షకు హాజరై ఇంటర్వ్యూలు దాటి ఆపాయింట్మెంట్ లెటర్ సాధించింది. 2004లో తన మొదటి ఫ్లయిట్‌ను దుబాయ్‌కు నడిపింది. ‘ఆ తర్వాత నేను వెనుదిరిగి చూడలేదు. నాన్న చేసిన అప్పులు తీర్చేశాను. అమ్మకు డైమండ్ కమ్మలు తెచ్చి పెట్టాను’ అంటుంది జోయ. ఆమె బోయింగ్ – 777ను నడిపిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది కూడా. స్త్రీల ప్రపంచం ‘నేను పైలెట్ అయినప్పుడు కోర్సులో చదువు చెప్పేవారు, ఉద్యోగంలో సహ ఉద్యోగులు అందరూ పురుషులే. మహిళా పైలెట్లు వేళ్ల మీద లెక్క పెట్టేంత మందే ఉండేవారు. స్త్రీలు తమ సమర్థతను చాటుకునేందుకు చాలా ఘర్షణ ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాని ప్రయత్నిస్తే ఆ ఘర్షణకు ఆవల విజయం ఉంటుంది. నేను ఎప్పుడూ నా హృదయం చెప్పినట్టే వింటాను. నాకేదైనా సవాలు ఎదురైనప్పుడు 8 ఏళ్ల వయసు లో నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని రుజువైంది కదా... ఇప్పుడు కూడా సరైన నిర్ణయమే తీసుకుంటాను అనుకుని ముందుకు సాగుతాను.’ అంటుంది జోయ. ‘స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలి అనుకునే సమాజం ఇంకా మన దేశంలో ఉంది. కాని స్త్రీలు తమ హృదయం చెప్పినట్టు విని తాము దేనికైతే సమర్థులో ఆ సమర్థత చాటుకోవాలి. వారే కాదు ప్రతి ఒక్కరూ తమదైన కలను కని సాధించుకోవాలి’ అంటుంది జోయ. ఢిల్లీలో డాబా ఎక్కి విమానం చూసిన 8 ఏళ్ల చిన్నారి ఒకనాడు సుదీర్ఘమైన విమానయానం చేసి రికార్డు సృష్టించడాన్ని మించిన స్ఫూర్తిగాథ ఉందా. అలాంటి గాథలకు ఉదాహరణలుగా మనమెందుకు నిలవకూడదు? -
ఆ నౌక నేను నడపలేదు.. నాపై నిందలు వేస్తున్నారు!
పిడుగు ఆకాశంలోంచి ఊడిపడుతుంది. బడబాగ్ని నిప్పుకణంలోంచి జ్వలిస్తుంది. ప్రకంపన పుడమి నుంచి ఉద్భవిస్తుంది. సుడిగుండం సముద్రంలో జనిస్తుంది. కానీ.. మహిళపై నింద ఎక్కడి నుంచి ఊడి పడి, ఎలా జ్వలించి, ప్రకంపించి, సుడిగుండమై ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం మర్వా ఎల్సెల్హదార్ అనే నేవీ కెప్టెన్ అలాంటి ఒక నింద నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఉంది. మర్వా ఎల్సెల్హదార్ ఈజిప్టు నేవీలోని మెరైన్ విభాగంలో తొలి మహిళా కెప్టెన్. 29 ఏళ్ల యువతి. ఐదేళ్ల క్రితమే ఆమె నేవీలో చేరింది. ఇటీవల అక్కడి ‘అరబ్ న్యూస్’లో ఆమె గురించి పెద్ద కథనం వచ్చింది. తెల్ల యూనిఫామ్‌లో ఉన్న మర్వా చక్కటి ఫొటో ఒకటి పెట్టి ఈజిప్టు మెరైన్‌లో తొలి కెప్టెన్‌గా ఆమె సక్సెస్ స్టోరీ రాసింది ఆ పత్రిక. మెరైన్‌లో చేరిన ఐదేళ్ల తర్వాత ఆమెపై ఈ తాజా స్టోరీ రాయడానికి ‘అరబ్ న్యూస్’ చెప్పిన కారణం ఆలోచింపజేసే విధంగా ఉంది. ‘ఒక మహిళా మెరైన్ కెప్టెన్ అవడం గొప్పే. అంతకన్నా గొప్ప.. ఆ మహిళ మెరైన్ కెప్టెన్‌గా కొనసాగడం!’ అనే వాక్యంతో ఆ వార్తా కథనం ముగిసింది. నిజమే. మర్వా మెరైన్‌లో చేరిన తొలిరోజు నుంచీ ప్రతికూల పరిస్థితులను నెగ్గుకుంటూ వస్తోంది. 2015 వరకు ఈజిప్టు నేవీ మెరైన్‌లో మహిళా కెప్టెన్ ఒక్కరూ లేరు. పూర్తిగా పురుష ప్రపంచం అది. ఆ ప్రపంచంలోకి ధైర్యం చేసి వెళ్లింది మర్వా. అరబ్ న్యూస్‌లో మొన్న మార్చి 22న వచ్చిన ఆమె సక్సెస్ స్టోరీ కొన్ని గంటల్లోనే ట్విట్టర్లో, ఫేస్బుక్లో అనేకసార్లు షేర్ అయింది. అయితే రెండు రోజుల తర్వాత అదే ఫొటోతో ఇంటర్నెట్లో ఆమెను నిందిస్తూ ఒక వార్త వైరల్ అయింది! ఆ వార్త మర్వా చేతిలోని ఫోన్ వరకు చేరింది. మధ్యలోని ఆ కొద్ది గంటల్లోనే ఏం జరిగింది? సూయజ్ కెనాన్‌లో మార్చి 23న ‘ఎవర్ గివెన్’ అనే నౌక ‘బ్లాక్’ అయింది. కాలువకు రెండు వైపులా వాహనాల రవాణా స్తంభించిపోయింది. ఆరు రోజులు కష్టపడి నౌకను మళ్లీ దారిలో పెట్టగలిగారు. అయితే ఈ రెండు వారాల్లో తనపై వైరల్ అవుతూ వచ్చిన నిందను ‘క్లియర్’ చేసుకోడానికి నానా అవస్థలు పడుతోంది మర్వా. ఇక ఆమెపై పడిన నింద ఏమిటంటే.. ఎవర్ గివెన్‌ను ఆమే నడుపుతున్నారని, ఆమె సరిగా నడపలేకపోవడం వల్లనే ఆ నౌక.. కెనాల్లో అడ్డం తిరిగి, ప్రపంచ వాణిజ్య రంగానికి లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టిందనీ! ఇది మామూలు నింద కాదు. ఒక దేశం మాత్రమే తట్టుకోగల నింద. వ్యక్తులు భరించలేరు. తన గురించి అలాంటి అబద్ధపు వార్త ఒకటి వైరల్ అవుతున్నట్లు తెలియగానే మర్వా మొదట ఖిన్నురాలైంది. ఏమిటి ఆ నౌకకు, తనకు సంబంధం! తను నేవీలో కెప్టెనే తప్ప, సరకులను చేరవేర్చే ఓడకు కెప్టెన్ కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు! ఆలోచించిన కొద్దీ మర్వా మళ్లీ మళ్లీ నివ్వెరపోతోంది. పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటి నివ్వెరపాట్లు ప్రతి మహిళకూ అనుభవంలోనికి వచ్చేవేనని ఆమెకు తెలియంది కాదు. ఒక మహిళపై వచ్చిన నిందను నమ్మేవారు నమ్ముతారు. కానీ, పుట్టించేవాళ్లు ఎలా పుట్టిస్తారు?! ‘‘నాకొకటి అనిపిస్తోంది. అలవాటు లేని రంగంలోనైనా అరుదైన విజయం సాధించిన మహిళలకు ఇలాంటివి తప్పవు. నాకూ అలాగే జరిగి ఉండొచ్చు’’ అంటోంది మర్వా. సముద్రంపై ఒక మహిళ ఉద్యోగం చేస్తోందంటే ఆమెను వీలైనంత త్వరగా ‘ఒడ్డుకు చేర్చేందుకు’ అక్కడి ప్రతికూలతలు అనుక్షణం అలల్లా నెట్టేస్తుంటాయి. ‘ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్’ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే సముద్ర ఉద్యోగాలు చేస్తున్నారు. మర్వాకు సముద్రం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి ఆమె సోదరుడు ఆమె పేరును ఎ.ఎ.ఎస్.టి.ఎం.టి. (అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్)లో నమోదు చేయించాడు. అరబ్ లీగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాంతీయ విశ్వవిద్యాలయం అది. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యా నగరంలో ఉంది. అయితే పురుష అభ్యర్థులకే ఆ యూనివర్సిటీలో ప్రవేశం. మహిళలెందుకు చేరకూడదు అని మర్వా న్యాయపోరాటం చేసింది. ఆ పోరాటంతో స్త్రీలకూ తొలిసారి నేవీ మెరైన్‌లో ప్రవేశం లభించింది. పట్టు పట్టి చేరాక, నిలదొక్కుకోడానికి మర్వాకు మళ్లీ ఒక పోరాటం చేయడం అవసరమైంది! అదొక పురుష ప్రపంచం. అంతా తనకన్నా వయసులో పెద్దవాళ్లు. మహిళవు, నీకెందుకు ఇవన్నీ అన్నట్లే ఉండేది వారి చూపు, మాట. ట్రైనింగ్ పూర్తయ్యే సరికి మర్వాకు సప్త సముద్రాలలో మనకలేసి వచ్చినంత పనైంది. ‘‘నా మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకునేందుకు నేను చాలా కష్టపడవలసి వచ్చేది’’ అని మర్వా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేసింది. కోర్సులో పట్టభద్రురాలయ్యాక మర్వా ఫస్ట్ మేట్ (ఫస్ట్ ఆఫీసర్) ర్యాంకుకు చేరుకుంది. ‘ఐదా 4’ శిక్షణ నౌకకు కెప్టెన్ అయింది! సూయజ్ కాలువను 2015లో ఆధునీకరించాక అందులో ప్రయాణించిన తొలి నౌక ‘ఐదా’ నే. అప్పుడే మర్వా.. సూయజ్ కెనాల్‌పై అతి చిన్న వయసులో నౌకను నడిపిన ఈజిప్టు మహిళగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపును దెబ్బతీసేలా ఇప్పుడు ఏ మూల నుంచో ఆమెపై నింద వచ్చి పడింది! ‘ఎవర్ గివెన్’ నౌకను నడిపి, కెనాల్ బ్లాక్ అవడానికి కారణం అయిందని!! అయితే అది నిలబడే నింద కాదని, సోషల్ మీడియా వికృత కల్పననేని వెనువెంటనే తేలిపోయింది. ఇటీవల సూయజ్ కెనాల్లో ఇరుక్కుపోయిన ‘ఎవర్’ నౌక; (కాలువలో అడ్డుగా, విడిగా) ఎవర్ గివెన్ నౌక ఆ రోజు సూయజ కెనాల్లో బ్లాక్ అయిన సమయానికి మర్వా అక్కడికి కొన్ని వందల మైళ్ల దూరంలోని అలెగ్జాండ్రియాలో ఐదా 4 నౌకలో ఫస్ట్ మేట్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈజిప్టు సముద్ర భద్రతా సంస్థకు చెందినా ఐదా ఆ రోజు ఎర్ర సముద్రంలోని లైట్ హౌస్‌కు అవసరమైన సామగ్రిని తీసుకువెళుతోంది. అందులో కెప్టెన్‌గా ఉన్న మర్వా ఫొటోను ఎవర్ గివెన్‌కు కెప్టెన్‌గా ఉన్నట్లుగా మార్పులు చేసి నెట్లో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఈజిప్టు నేవీనే స్వయంగా ఖడించడంతో మర్వా కాస్త ఊపిరి పీల్చుకుంది. సోషల్ మీడియాలో కూడా అధిక శాతం మర్వాకు మద్దతుగా నిలబడ్డారు. అయినా మర్వా గురించి ఈజిప్టు నేవీలో గానీ, ఈజిప్టులో గానీ తెలియనివారు లేరు. ధైర్యంగల అమ్మాయి. 2017 మహిళా దినోత్సవం సందర్భంగా నాటి అధ్యక్షుడు అబెల్ ఫతా ఆమెను సత్కరించారు కూడా. వచ్చే నెలలో మర్వా కెప్టెన్ ర్యాంకుకు చివరి పరీక్ష పూర్తవుతుంది. అప్పుడామె రాబోయే యవతరానికి శిక్షణ నిచ్చే కెప్టెన్ కూడా అవుతారు. ‘‘మనం ఒక ఉద్యోగాన్ని ఇష్టపడి చేస్తున్నప్పుడు మన మీద వచ్చే విమర్శలు మన పై, మన పనిపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపలేవు’’ అంటోంది మర్వా. l -
గాయంతో శ్రేయస్ ఔట్.. కెప్టెన్సీ రేసులో ఐదుగురు
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గాయం కావడంతో సిరీస్ మొత్తానికే(మిగిలిన రెండు వన్డేలు) దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్లో సైతం ఆడేది అనుమానంగా మారింది. ఐపీఎల్లో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న అయ్యర్.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో మైదానాన్ని వీడాడు. వైద్య పరీక్షల కోసం అతనిని ఆస్పత్రికి తరలించగా, ఎడమ భుజానికి సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇదే జరిగితే రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం శ్రేయస్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతకడంలో నిమగ్నమైంది. కెప్టెన్సీ రేసులో ఐదుగురు ఆటగాళ్లు(పంత్, అశ్విన్, రహానే, స్టీవ్ స్మిత్, ధవన్) ఉన్నప్పటికీ.. ప్రస్తుత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు తాత్కాలిక సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. లేనిపక్షంలో అనుభవజ్ఞులైన రవిచంద్రన్ అశ్విన్ లేదా అజింక్య రహానేల వైపు మొగ్గుచూపే అవకాశాలున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను ఇటీవల వేలంలో ఢిల్లీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో స్మిత్‌కు కూడా అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. గత సీజన్లో పరుగుల వరద పారించిన ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్‌కు కూడా జట్టును నడిపించే సత్తా ఉంది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు రికీ పాంటింగ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీ తమ తొలి ఐపీఎల్ మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ఆడనుంది. ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ.. చెన్నైతో తలపడనుంది. చదవండి: నాన్నకు ప్రేమతో.. కృనాల్, హార్ధిక్ ఏం చేశారో తెలుసా..? చదవండి: ముగ్గురు కెప్టెన్లకు గాయాలు.. ఆందోళనలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు -
గల్వాన్ ఘటన: ఈ కుర్ర జవాన్ ఎవరో తెలుసా!
ఇంఫాల్: పదో విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశాలకు ముందు చైనా శనివారం కొన్ని వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్ ఘటనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని చైనా ఆరోపించింది. అయితే ఈ వీడియోల్లో ఆవేశంతో చైనా దళాలను హెచ్చరిస్తూ ఓ కుర్ర జవాను భారత సైన్యాన్ని నడిపించినట్లు కనిపించాడు. దీంతో అందరి దృష్టి ఆ కుర్రాడిపై పడింది. ఇంతకీ అతడు ఎవరా అని తెలుసుకునేందుకు అందరూ ఉత్సుకతతో ఉన్నారు. అయితే చైనా ఈ వీడియోలను విడుదల చేసిన తర్వాత కూడా భారత్ అతడి వివరాలను వెల్లడించడంలో గొప్యత పాటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర యువజన వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజీజు ఈ కుర్ర ఆఫీసర్ ఎవరన్నది ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ‘ఇతడు మణిపూర్ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా మనినగ్భా రంగ్నామి. 2018లో సైన్యంలో చేరిన ఈ కుర్ర ఆఫీసరు ప్రస్తుతం 18వ బిహార్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్టు’ ఆయన పేర్కొన్నారు. అలాగే మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ సైతం ట్వీట్ చేసి కెప్టెన్ రంగ్నామీపై ప్రశంసలు కురిపించారు. ‘మీట్ మణిపూర్ సేనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సోయిబా. ఇతడు గల్వాన్ లోయ వద్ద చైనాకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలో భారత దళాన్ని నడిపించాడు. దేశం కోసం నిలబడి అతడు చూపించిన శౌర్యం మనందరినీ గర్వించేలా చేసింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా అతడిని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ గౌరవాన్ని ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. Meet Capt. Soiba Maningba Rangnamei from Senapati District, Manipur of 16 Bihar, leading his men in Galwan during the confrontation against the Chinese PLA. The valour you have shown while standing up for the Nation has made all of us proud. pic.twitter.com/YUuyGzWtaa — N.Biren Singh (@NBirenSingh) February 20, 2021 చదవండి: గల్వాన్ ఘర్షణ: వీడియో విడుదల చేసిన చైనా గల్వాన్ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా ఎట్టకేలకు దిగొచ్చిన చైనా -
ముంబై కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..
ముంబై: ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం కాబోయే విజయ్ హజారే టోర్నీలో ముంబై జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ చేపట్టనున్నాడు. భుజం గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి దూరమైన ఈ టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు.. విజయ్ హజారే టోర్నీలో జట్టుతో చేరి, నాయకత్వ బాధ్యతలను చేపట్టనున్నాడు. టీమిండియా మరో ఆటగాడు పృథ్వీ షా ముంబై జట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించనున్నాడు. జట్టు ఎంపిక నిమిత్తమై బుధవారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ.. 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులో ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఆదిత్య తారే, సీనియర్ బౌలర్ ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే తదితర ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఈ టోర్నీ కోసం భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పవార్‌ను ముంబై ప్రధాన కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. -
నాయర్ నుంచి సారధ్య బాధ్యతలు చేజిక్కించుకున్న సమర్ధ్
సాక్షి, బెంగళూరు: త్వరలో ప్రారంభం కాబోయే విజయ్ హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక కెప్టెన్‌గా ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆర్ సమర్ధ్ వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల సమర్ధ్.. ఫామ్ లేమితో బాధపడుతున్న కరుణ్ నాయర్ నుంచి సారధ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఫజల్ ఖలీల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సోమవారం సమావేశమై 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా, తాజాగా ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సమర్ధ్‌కు జట్టులో స్ధానం దక్కకపోవడం విశేషం. ఈ టోర్నీలో కర్ణాటక జట్టు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. తాజాగా ప్రకటించిన కర్ణాటక జట్టులో ఇటీవలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున రాణించిన దేవ్‌దత్ పడిక్కల్ కీలక సభ్యుడిగా ఉండగా, గాయం కారణంగా సీనియర్ ఆటగాడు మనీష్ పాండే టోర్నీకి దూరమయ్యాడు. -
‘ఎప్పటికీ కోహ్లినే మా టీమ్ కెప్టెన్’
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై అద్భుత సిరీస్ విజయంలో కెప్టెన్‌గా అజింక్య రహానే ఎంతో కీలకపాత్ర పోషించాడు. దాంతో టెస్టులకు విరాట్ కోహ్లి స్థానంలో రహానేను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలంటూ చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన రహానే తన వ్యాఖ్యలతో తాజా చర్చకు ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. భారత జట్టుకు కోహ్లి మాత్రమే నాయకుడని అతను స్పష్టం చేశాడు. ‘ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కోహ్లి కెప్టెన్‌గా, నేను వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాం. ఈ హోదాలు మారడం వల్ల జట్టులో ఎలాంటి మార్పు రాదు. ఎప్పటికీ కోహ్లినే మా టీమ్ కెప్టెన్. నేను అతడికి డిప్యూటీని మాత్రమే. అతను లేనప్పుడు జట్టుకు నాయకత్వం వహించడం, నా అత్యుత్తమ ప్రదర్శనతో టీమ్ గెలిచేలా చేయడమే నా బాధ్యత. నేను అదే పని చేశాను’ అని రహానే వ్యాఖ్యానించాడు. జట్టులో హోదాకంటే అప్పజెప్పిన పనిని ఎంత బాగా చేశామనేదే ముఖ్యమని అతను అభిప్రాయపడ్డాడు. ‘పేరుకు కెప్టెన్ అని ఉంటే సరిపోదు. నాయకుడిగా నువ్వు ఎంత సమర్థంగా వ్యవహరిస్తావనేది కీలకం. ఇప్పటి వరకు నేను మంచి ఫలితాలే సాధించాను. ఇక ముందు కూడా సాధిస్తా. జట్టుకు ఇలాంటి విజయాలు అందించేందుకు ఇంకా ప్రయత్నిస్తా’ అని విశ్లేషించాడు. నాయకత్వం విషయంలో ప్రతీ ఒక్కరికీ భిన్నమైన శైలి ఉంటుందని రహానే గుర్తు చేశాడు. ‘కెప్టెన్సీ విషయంలో ఎవరికి వారు ప్రత్యేకం. సరిగ్గా చెప్పాలంటే జట్టు బాగుంటేనే కెప్టెన్ కూడా గొప్పగా అనిపిస్తాడు. మ్యాచ్‌లు లేదా సిరీస్ గెలవడం అనేది ఏ ఒక్కరివల్లో కాకుండా సమష్టి కృషి ఫలితం. కాబట్టి మీ జట్టు మిమ్మల్ని గొప్ప నాయకుడిగా మారుస్తుంది. తాజా సిరీస్ విజయం నా జట్టు సాధించిందే’ అని రహానే అభిప్రాయం వ్యక్తం చేశాడు. పరస్పర నమ్మకం, గౌరవం కోహ్లితో తన వ్యక్తిగత సంబంధాల విషయంలో ఎప్పుడూ ఎలాంటి ఢోకా లేదని రహానే పునరుద్ఘాటించాడు. ‘నాకూ, కోహ్లికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్నోసార్లు అతను నా బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. ఇద్దరం కలిసి విదేశాల్లో జట్టు కోసం పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాం. అతను నాలుగో స్థానంలో, నేను ఐదో స్థానంలో ఆడటం వల్ల పలు మంచి భాగస్వామ్యాలు నమోదయ్యాయి. ఒకరి ఆటపై మరొకరు పరస్పరం నమ్మకం ఉంచాం. క్రీజ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థి బౌలింగ్‌ను దెబ్బ తీయడంపై చర్చించడం, తప్పుడు షాట్లు ఆడినప్పుడు హెచ్చరించుకోవడం తరచూ జరిగాయి. విరాట్ చురుకైన నాయకుడు. మైదానంలో వేగంగా సరైన నిర్ణయాలు తీసుకోగలడు. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్ చేసేటప్పుడు స్లిప్‌లో నేను చక్కటి క్యాచ్‌లు అందుకోగలనని నన్ను గట్టిగా నమ్ముతాడు. నా నుంచి అతను ఎంతో ఆశిస్తాడు. నేను కూడా సాధ్యమైనంత వరకు కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను’ అని రహానే సుదీర్ఘంగా వివరించాడు. గత కొంత కాలంగా తాను ఫామ్‌లో లేకపోయినా జట్టులో స్థానం కోల్పోతానని ఆందోళన చెందలేదని రహానే గుర్తు చేసుకున్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే నా స్థానానికి ప్రమాదం ఏర్పడినట్లు ఎప్పుడూ అనుకోలేదు. కెప్టెన్, టీమ్ మేనేజ్మెంట్ నాపై నమ్మకముంచింది. ఫామ్ తాత్కాలికం అని నేనూ నమ్ముతాను. కొన్నిసార్లు వరుసగా విఫలం కావడం జరుగుతుంది. దానర్థం అతనేమీ ఆటను మరచిపోయినట్లు కాదు. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావచ్చు. నేను వరుసగా విఫలమవుతున్న సమయంలో కెప్టెన్ నాలో స్థయిర్యాన్ని నింపాడు. మరొకరు మనకు అండగా నిలుస్తున్నారని తెలిస్తే ఆందోళన తగ్గుతుంది. మరో ఆలోచన లేకుండా ఆటపై దృష్టి పెట్టవచ్చు’ అని ఈ ముంబైకర్ వెల్లడించాడు. -
రేపటికల్లా ప్రపంచ రికార్డులను నెలకొల్పి ఉంటాం
బోయింగ్ ట్రిపుల్ సెవన్! భారీ గగన విహంగం. కమర్షియల్ జెట్. లోపల ఉండేవి 238 సీట్లు. అన్నీ ఫుల్ అయ్యాయి. ఆదివారం అమెరికాలో బయల్దేరింది! ఎప్పుడూ వచ్చే మామూలు మార్గంలో కాదు. క్లైమేట్ మూడ్ ఎలా ఉంటుందో ఊహకైనా అందని ఉత్తర ధ్రువం మీదుగా అంతమందినీ మోసుకుంటూ బెంగళూరు బయల్దేరింది. ఇక్కడ దిగే టైమ్ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు. కెంపెగౌడ విమానాశ్రయంలో! ఆ బోయింగ్ కాక్‌పిట్‌లో ఎవరున్నారో తెలుసా? కెప్టెన్ జోయా అగర్వాల్. అతి చిన్న వయసులో బోయింగ్ నడిపిన మహిళా పైలట్! కాక్‌పిట్‌లో ఆమె పక్కన ఎవరున్నారో తెలుసా? కెప్టెన్ తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష, కెప్టెన్ శివాని. అంతా మహిళా పైలట్లే ఉన్న ఈ బోయింగ్ 777 చరిత్రాత్మక ప్రయాణం.. మహిళలు సృష్టించిన ఒక గ‘ఘన’చరిత్ర ఎయిర్ ఇండియా కెప్టెన్ జోయా అగర్వాల్ తన కెరీర్‌ను ఏళ్లలో కాక ‘ఫ్లయింగ్ అవర్స్’లో చెప్పుకోడానికే ఇష్టపడతారు! ఇప్పటివరకు ఎనిమిది వేల గంటలకు పైగా గగనతలంలో విమానాన్ని నడిపారు ఆమె. నేడిక ఆమె కెరీర్‌కు మరో 17 గంటలు తోడవుతాయి. శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు ఉత్తర ధ్రువం మీదుగా 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు పట్టే సమయమే ఈ పదిహేడు గంటలు. గంటకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల వేగంతో సాగే ఈ బోయింగ్ విమానంలోని కాక్‌పిట్‌లో ఉన్నవారంతా మహిళలే కావడం విశేషం. నిజానికి జోయా ఇలాంటి చరిత్రను ఒకదాన్ని సృష్టించేందుకు చాలాకాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. ‘‘రేపటికల్లా మేమంతా అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పి ఉంటాం. ఆ ఆలోచనే నాకెంతో ఉద్వేగాన్ని కలిగిస్తోంది’’ అని శాన్ఫ్రాన్సిస్కో లో టేకాఫ్‌కి కొద్ది గంటల ముందు తనను కలిసిన ఒక జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధితో అన్నారు జోయా అగర్వాల్. అతి చిన్న వయసులో బోయింగ్ విమానాన్ని నడిపిన రికార్డు ఒకటి ఇప్పటికే ఆమె పేరు మీద ఉంది. బోయింగ్ నడపడం తేలికేమీ కాదు. స్కూటీ నడిపే చేతులు మలుపుల దారిలో ఒక పొడవాటి భారీ వాహనాన్ని తిప్పుతూ నడపడమే. నిన్న బయల్దేరిన బోయింగ్ 777 కాక్‌పిట్‌లో జోయాతో పాటు కెప్టెన్ తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష, కెప్టెన్ శివాని ఉన్నారు. వారితోపాటు ఫ్లయిట్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నివేదిత భాసిన్ కూడా. లోపల రెండు వందల మందికి పైగా ప్రయాణికులు. నిజానికి ఈ అరుదైన అవకాశం (జోయా మాటల్లో అద్భుతమైన అవకాశం) గత ఏడాదే వచ్చినా, వాతావరణం అనుకూలించక వాయిదా పడింది! ‘‘మా పైలట్లలో చాలామందికి ఇదొక కల. పైగా తొలిసారి అందరం మహిళలమే ప్రయాణిస్తున్నాం. నాన్–స్టాప్ జర్నీ. మా స్వప్నాలను సాకారం చేసే ‘గాడ్స్పీడ్’ జర్నీ. భరతమాత పుత్రికలం యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీలో పైకి లేచి, ఇండియాలోని సిలికాన్ వ్యాలీలో కిందికి దిగుతున్నాం’’ అని జోయా ఉత్సాహంగా అన్నారు. బోయింగ్‌ల వంటి అల్ట్రా–లాంగ్–హాల్ ఫ్లయిట్స్ ఇప్పటివరకు అట్లాంటిక్ సముద్రం మీదుగా వెళ్లడం, తిరిగి రావడం; పసిఫిక్ మీదుగా ప్రయాణించడం, వెనక్కు వచ్చేయడం.. ఇలా అక్కడక్కడే చక్కర్లు కొట్టినట్లుగా ఉండేది. ఇప్పుడీ జోయా టీమ్ ఉత్తర ధ్రువం మీదుగా వెళుతోంది.‘‘నార్త్ పోల్ మీదుగా ఆ చివర్నుంచి ఈ చివరకు వెళుతూ విమానంలోంచి ధ్రువ శిఖరాగ్రాన్ని చూడ్డానికి ఎంత గొప్ప అదృష్టం పట్టాలి! విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అవుతుంది’’ అని జోయా తన సహ పైలట్లతో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ సిలికాన్ వ్యాలీ శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఈ సిలికాన్ వ్యాలీ బెంగుళూరు చేరేందుకు ఉన్న అతి వేగవంతమైన మార్గంలోనే ఈ బృందం ప్రయాణిస్తున్నది. పదహారు వేల కి.మీ. దూరం. పదిహేడు గంటల సమయం. గ్లోబ్ మీద చూస్తే రెండు ప్రాంతాలూ ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. ఆ దారినే జోయా బృందం ఎంచుకుంది. దారి తిన్నగా ఉన్నప్పటికీ దారిలో వాతావరణం స్థిమితంగా ఉంటుందన్న భరోసా లేదు. అయినా.. అత్యాధునిక విమాన సాంకేతిక పరిజ్ఞానానికి మహిళా పైలట్ల ఆత్మవిశ్వాసమూ తోడైతే ఎంతటి ప్రతికూల గాలులైనా దారివ్వకుండా ఉంటాయా! జోయా నడుపుతున్న 777–200ఎల్ ఆర్ మోడల్ బోయింగ్ ఈ భూగోళం మీది ఏ రెండు ప్రాంతాలనైనా ఒకే ప్రయాణంలో కలపగల సామర్థ్యం కలది. దీనికన్నా ముందు జోయా బి–777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను పదేళ్ల వ్యవధిలో 2,500 ఫ్లయింగ్ అవర్స్ నడిపారు. ‘‘నేను ఎయిర్ ఇండియాలో చేరినప్పుడు అతి తక్కువ మంది మహిళా పైలట్లు ఉండేవారు. ప్రతి ఒక్కరు నన్ను చిన్నపిల్లలా చూసేవారు. అది మగవాళ్ల రాజ్యం అన్నట్లే ఉండేది. లేడీ పైలట్‌ని అని కాదు కానీ, నేను కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. పైలట్ ఉద్యోగమే అంత. అత్యంత బాధ్యతతో కూడి ఉంటుంది’’ అంటారు జోయా. జోయా తను పైలట్ అవుతానని తొలిసారి అన్నప్పుడు అది విని ఆమె తల్లి భయంతో పెద్దగా ఏడ్చారట! 2013లో జోయా ఎయిర్ ఇండియా కెప్టెన్ అయినప్పుడు కూడా ఆమెకు కన్నీళ్లొచ్చాయట. అవి ఆనంద బాష్పాలేనని ప్రత్యేకం చెప్పక్కర్లేదు. ‘‘పైలట్ అవ్వాలని అనుకునే అమ్మాయిలకు మీరు చెప్పేదేమైనా ఉందా?’’ అంటే.. ‘‘కలలు కనండి. సాధించండి. మిమ్మల్ని అడ్డుకునేదేమీ లేదు. సాధ్యం కాని స్వప్నమూ ఉండదు’’ అన్నారు జోయా అగర్వాల్. -
‘సచిన్ ప్రేరణ కలిగించలేదు’
న్యూడిల్లీ: భారత లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో ఆయన ప్రదర్శించిన నైపుణ్యాల పట్ల సంతృప్తికరంగా లేనని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ తెలిపారు. శశిథరూర్ మాట్లాడుతూ టీమ్‌లో ఆటగాడుగా ఉన్న సమయంలో సచిన్ ఫీల్డ్‌లో సహచరులకు ఇచ్చే సలహాలను చూసి అతను గొప్ప కెప్టెన్ అవుతాడని భావించే వాడినని తెలిపాడు. కాగా 1996 సంవత్సరంలో టెండూల్కర్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే 73 వన్డే మ్యాచ్‌లకు టెండూల్కర్ సారథ్యం(కెప్టెన్) వహించగా కేవలం 23మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 43మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యింది. కాగా సచిన్ కాప్టెన్‌గా ఉన్న సమయంలో జుట్టు పటిష్టంగా లేదని, ఆ టైమ్‌లో ఆటగాళ్లకు ప్రేరణ కలిగించలేకపోయానని సచిన్ ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు కెప్టెన్‌గా సరైన విజయాలు రాకపోవడంతో స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి సచిన్ తప్పుకున్నాడు. కొద్ది కాలానికి తిరిగి కెప్టెన్సీని తీసుకోమని మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి వచ్చినా సచిన్ సున్నితంగా తిరస్కరించాడని శశిథరూర్ పేర్కొన్నాడు. (చదవండి: ధోని, సచిన్‌లు నన్ను నిరాశపరిచారు: శశిథరూర్) -
ఇంకా మెరుగ్గా నిర్వర్తించాల్సింది: కుంబ్లే
ముంబై: భారత క్రికెట్(టీమిండియా)లో మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. టీమిండియా జట్టు కెప్టెన్‌గానే కాకుండా ప్రధాన కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు కుంబ్లే. అయితే తాజాగా జింబాంబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి మాంగ్వా నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో తన కోచ్ పదవిపై కుంబ్లే స్పందించారు. ఆయన స్పందిస్తూ.. టీమిండియాకు ప్రధాన కోచ్‌గా తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించానని, కానీ తన కోచ్ పదవిని చివర్లో ఇంకా మెరుగ్గా నిర్వహిస్తే బాగుండేదని తెలిపాడు. తాను కోచ్ పదవిని మెరుగ్గా నిర్వర్తించానని కుంబ్లే అన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో కూడా కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెంటార్‌గా కుంబ్లే వ్యవహరించాడు. కేవలం కెప్టెన్‌గా, కోచ్‌గా మాత్రమే కాకుండా తన బౌలింగ్ నైపుణ్యంతో టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను కుంబ్లే అందించాడు. (చదవండి: అప్పుడు కుంబ్లేను కోహ్లి వద్దన్నాడు.. ఇప్పుడైతే?) -
చదువెందుకు..పెళ్లిచేసేయండి అన్నారు!
సాధించాలనే తపన ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా విజయం సాధించవచ్చు అని నిరూపించింది ముంబైకి చెందిన రితు రథీ తనేజా. వృతిరీత్యా ఆమె పైలట్. అభిరుచికి తగ్గట్లు యూట్యూబర్‌గా మారి ఎంతో మంది ఫాలోవర్లని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లి కూడా. కానీ ఈ విజయాలేవీ అంత సులభంగా ఆమెకు దక్కలేదు. ఓ ఆడపిల్లకు చదువెందుకు దండగా అని నిందించే సమాజాన్ని ఎదుర్కొని, ఆటుపోట్లని అధిగమించింది. విదేశాల్లో ట్రైనింగ్ పూర్తిచేస్తానంటే.. అక్కడ ఏం అగోరించడానికి? అబ్బాయిలతో చెడు తిరుగుళ్లకు అలవాటుపడుతుంది.. పెళ్లి చేశాకే పంపించండి అంటూ బంధువుల సూటిపోటి మాటలన్నా తను సాధించలనుకున్నా లక్ష్యం వైపే పయనించింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధించి తీరాలి అనే తన సంకల్పమే రితుని నేడు స్థాయిలో నిలబెట్టింది. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకొని ఎంతో మందికి స్పూర్తినింపుతోంది. (ఫెయిర్ అండ్ లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలనం ) ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రితూకి పాఠశాల స్థాయిలోనే పైలట్‌గా రాణించాలనే ఆసక్తి కలిగింది. ఈ ఆలోచనే రితు జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత తన లక్ష్యం కోసం నిరంతరం కష్టపడేది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థలో ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకుంది. తన పెళ్లి కోసం దాచిన డబ్బును చదువుకు కోసం ఖర్చుచేయమని తండ్రిని వేడుకుంది. ''విదేశాలకు ఒంటరిగా పంపిస్తే అబ్బాయిలతో చెడుతిరుగుళ్లు తిరుగుతుంది. చదివింది చాలు ఇక పెళ్లి చేయండి అని బంధువులు సూటిపోటి మాటలతో వేధించేవారు. కానీ అమ్మనాన్న మాత్రం నన్ను నమ్మి అమెరికా పంపించారు. ఏడాదిన్నర ట్రైనింగ్ అనంతరం ఇండియా తిరిగొచ్చా. కానీ ఖాళీలు లేక ఉద్యోగం దొరకలేదు. ఇలాంటి అవకాశం కోసమే అన్నట్లు ఎదురుచూసిన బంధువులు మళ్లీ నిందించడం మొదలుపెట్టారు. మేం అప్పుడే చెప్పాం కదా ఇలాంటిదేదో జరుగుతుందన్న దెప్పిపొడిచే మాటలతో మానసికంగా వేధించేవారు. మరోపక్క బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో అమ్మ ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. నాన్న పరిస్థితి చూసి చాలా భాదపడ్డా. ఇంకో వైపు కుటుంబ భారం. దీంతో పార్ట్ టైం జాబ్ చేస్తూ రోజుకి 7 గంటలు చదివేదాన్ని. కొన్నినెలలకే ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా ఉద్యోగం సంపాదించాను. ఇక నా ఆనందానికి అవధుల్లేవు . ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటూ తెగ సంబరపడ్డాను'' అని రితూ పేర్కొంది. పైలట్‌గా నెల రోజుల్లోనే 60 విమానాల్లో ప్రయాణం చేసింది. నాలుగు సంవత్సరాల్లోనే కెప్టెన్‌గా పదోన్నతి పొందింది. నా కూతురు కెప్టెన్ అని నాన్న చెబుతుంటే ఆ ఆనుభూతి మాటల్లో చెప్పలేనిదంటూ రితూ భావోద్వేగానికి గురైంది. ఆమె యూట్యూబ్ ఛానల్‌కి 3 లక్షలకు పైగానే సబ్‌స్కైబర్లు ఉన్నారు. ‘ఏ బంధువులైతే తనని నిందించారో ఇప్పుడు వాళ్లే నన్ను చూసి గర్వపడుతున్నారు. ఇదే కదా అసలైన విజయం’ అంటూ ఇంటర్వ్యూని ముగించింది. (అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే: శివన్ ) -
మరోసారి కెప్టెన్‌గా వార్నర్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నడిపించనున్నాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం వార్నర్‌ను సారథిగా నియమిస్తూ గురువారం ఒక ప్రకటన చేసింది. దాంతో 2018, 2019 సీజన్లలో సారథిగా వ్యవహరించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వచ్చే సీజన్లో ఆటగాడి పాత్రకే పరిమితం కానున్నాడు. ‘సన్ రైజర్స్‌కు మరోసారి సారథిగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో జట్టును గొప్పగా నడిపిన విలియమ్సన్కు కృతజ్ఞతలు. జట్టును నడిపించడానికి మీ సలహాలను తప్పక తీసుకుంటా. నాకీ అవకాశం ఇచ్చిన టీం మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు. రాబోయే సీజన్లో జట్టుకు ట్రోఫీని అందించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపాడు. 2015 నుంచి 2017 సీజన్లలో సన్ రైజర్స్‌కు సారథిగా వ్యవహరించిన వార్నర్... 2016లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే 2018 సీజన్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ ఏడాది నిషేధం ఎదుర్కోవడంతో ఆ ఐపీఎల్ సీజన్లో బరిలో దిగలేదు. ఆ సీజన్లో సారథిగా వ్యవహరించిన విలియమ్సన్ జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. ఇక 2019లో తిరిగి ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన వార్నర్... 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ నిషేధం అనంతరం 2019 ఐపీఎల్ సీజన్లో పునరాగమనం చేసిన వార్నర్‌కు అప్పుడే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని మేనేజ్మెంట్ మొదట్లో అనుకుంది. అయితే ఏడాది విరామం అనంతరం తిరిగి బ్యాట్ పట్టుకున్న వార్నర్ ఫామ్‌పై ఉన్న అనుమానం కావచ్చు, నిషేధం ముగిసిన వెంటనే అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే... అది తప్పుడు సంకేతాలకు కారణం అవుతుందనే అభిప్రాయంతో అతడిని జట్టు కెప్టెన్‌గా నియమించలేదు. కెప్టెన్సీ మార్పుకు కారణం ఇదేనా... ధోనీ తర్వాత మైదానంలో అంత కూల్‌గా కనిపించేది విలియమ్సనే. అటువంటి విలియమ్సన్ కెప్టెన్‌గా ఉన్న సన్ రైజర్స్ 2018లో రన్నరప్‌గా నిలవడంతో పాటు... 2019లో సెమీస్ వరకు వెళ్లింది. 2018లో 17 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 735 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కూడా అందుకున్నాడు. దీనితో పాటు న్యూజిలాండ్‌ను మూడు ఫార్మాట్లలోనూ లీడ్ చేస్తున్నాడు. అయితే 2019లో అతను మాత్రం విఫలమయ్యాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 156 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా వార్నర్, బెయిర్ స్టోలు జట్టును వీడిన తర్వాత జట్టుకు విజయాలను అందించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. గత సీజన్‌ను బేరీజు వేసుకొని చూస్తే మరోసారి వార్నర్–బెయిర్ స్టో ద్వయం ఓపెనింగ్ చేపట్టే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్ విభాగంలో రషీద్ ఖాన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఖాయం. విలియమ్సన్ ఒకవేళ ఈ సీజన్లోనూ సారథిగా ఉన్నట్లయితే అతడిని అన్ని మ్యాచుల్లో ఆడించాల్సి ఉంటుంది. అలా కాకుండా వార్నర్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే... విలియమ్సన్ స్థానంలో జట్టు అవసరాలకు అనుగుణంగా... బౌలర్‌ని లేదా ఆల్‌రౌండర్‌ని తీసుకోవచ్చు. -
ఈ సారథ్యం నాకొద్దు!
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తమ జట్టుకు ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అత్యవసరమని వ్యాఖ్యానిస్తూ టెస్టు, టి20 జట్ల సారథ్యానికి బైబై చెప్పాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో సిరీస్ సమయంలో వన్డే జట్టు నాయకత్వం నుంచి డు ప్లెసిస్ తప్పుకోవడంతో వికెట్ కీపర్ డికాక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మిగిలిన రెండు ఫార్మాట్లకు కూడా అతను పగ్గాలు వదిలేశాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. కానీ... కొత్త తరానికి స్వాగతం పలుకుతున్నా. ఎప్పటిలాగే జట్టుకు పూర్తి నిబద్ధతతో సేవలందిస్తాను. కెప్టెన్ డికాక్, కోచ్ మార్క్ బౌచర్‌లకు పూర్తిగా సహకరిస్తాను. సఫారీ జట్టు పునర్నిర్మాణానికి, జట్టు పటిష్టంగా ఎదిగేందుకు ఆటగాడిగా నా వంతు కృషి చేస్తాను’ అని 35 ఏళ్ల డుప్లెసిస్ తెలిపాడు. ‘మిస్టర్ 360’ డిగ్రీ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ వారసుడిగా 2017 ఆగస్టులో దక్షిణాఫ్రికా పగ్గాలు చేపట్టిన డు ప్లెసిస్‌కు 2019 వన్డే ప్రపంచకప్ పెద్ద గాయమే చేసింది. ఆ మెగా టోర్నీలో సఫారీ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. త్వరలోనే దక్షిణాఫ్రికా జట్టు ఆసీస్‌తో మూడు టి20లు, మరో మూడు వన్డేల సిరీస్‌ల్లో తలపడనుంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి టి20 జరుగనుంది. -
రషీద్‌కు షాక్..ఏసీబీ సంచలన నిర్ణయం
కాబూల్: అప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అప్ఘనిస్తాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అస్గర్ అఫ్గాన్‌ని నూతన సారథిగా నియమించింది. ఏడు నెలల క్రితం కెప్టెన్సీ పదవి కోల్పోయిన అస్గర్ అఫ్గాన్ మళ్లీ అఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు సారథిగా నియమితుడయ్యాడు. ఈ మేరకు అప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. అస్గర్ మూడు ఫార్మాట్ల లోనూ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఏసీబీ తెలిపింది. గత ఏప్రిల్‌లో ఏసీబీ అస్గర్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి... టెస్టుల్లో రహ్మత్ షా, వన్డేల్లో గుల్బదిన్ నైబ్, టి20ల్లో రషీద్ ఖాన్‌లను కెప్టెన్లుగా నియమించింది. అయితే వన్డే ప్రపంచకప్‌లో అప్ఘనిస్తాన్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. అనంతరం రషీద్ ఖాన్‌కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని కట్టబెట్టారు. అయితే ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అన్ని ఫార్మాట్లలో అప్ఘనిస్తాన్ ఓటమి చవిచూసింది. దాంతో ఏసీబీ రషీద్ ఖాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అనుభవజ్ఞుడైన అస్గర్కే పగ్గాలు అప్పగించింది. 32 ఏళ్ల అస్గర్ అప్ఘనిస్తాన్ తరఫున ఇప్పటివరకు 111 వన్డేల్లో, 66 టి20ల్లో బరిలోకి దిగాడు. -
సారథ్యంపై ఎక్కువగా ఆలోచించను: రోహిత్
న్యూఢిల్లీ: సారథ్యం వహించే అవకాశం వచ్చినపుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని... అయితే కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లికి పొట్టి ఫార్మాట్లో విశ్రాంతి ఇవ్వడంతో స్టార్ ఓపెనర్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. బంగ్లాతో టి20ల కోసం పగ్గాలు చేపట్టిన ఈ ఓపెనర్ ఇది ముణ్నాళ్ల ముచ్చటైనా... తనకెలాంటి బాధలేదని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించాలని చాన్నాళ్లుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో తనను లాగొద్దని... జట్టుకు అవసరమైన ప్రతీసారి నాయకత్వం వహించేందుకు సిద్ధమేనన్నాడు. మీడియాతో రోహిత్ మాట్లాడుతూ ‘కెప్టెన్సీ అనేది మన చేతుల్లో ఉండదు. కెప్టెన్‌గా ఒక మ్యాచ్ అయినా వంద మ్యాచ్‌లయినా... అదో గౌరవం. ఆట నేర్చుకునేటపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకుంటాం. నేను కెప్టెన్‌గా ఇంతకుముందు వ్యవహరించాను. ఆ అనుభవాన్ని అస్వాదిస్తున్నాను. ఇది ఎన్నాళ్లుంటుందోనన్న బెంగలేదు. కొన్నాళ్లే అన్న బాధ లేదు’ అని అన్నాడు. -
అబొజర్‌కు తెలుగు టైటాన్స్ పగ్గాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఇరాన్ డిఫెండర్ అబొజర్ మిఘానిని ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. ఈ నెల 20 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్లన్నీ సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. తొలి అంచె పోటీలు ముందుగా హైదరాబాద్‌లోనే జరుగనున్నాయి. ఈ సందర్భంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త సారథిని అధికారికంగా ప్రకటించారు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి లేకపోయినా జట్టుకు ఢోకా లేదని జట్టు యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని తెలిపారు. గతేడాది నిరాశపరిచిన తమ జట్టు ఈ సారి టైటిల్‌పై గురిపెట్టిందని ఆయన చెప్పారు. ఆరంభం నుంచే ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. హైదరాబాద్‌లో మొదలయ్యే ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్ 19న గ్రేటర్ నోయిడాలో జరిగే ఫైనల్‌తో ఏడో సీజన్ ముగుస్తుంది. ఆన్లైన్లో టికెట్లు.... హైదరాబాద్ అంచె ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల టికెట్లు https://www. eventsnow.com వెబ్సైట్లో లభిస్తాయి. టికెట్ల ధరలను రూ. 500; రూ.800; రూ. 3000గా నిర్ణయించారు. మరో రెండు ఫ్రాంచైజీలు కూడా కొత్త కెప్టెన్లను ప్రకటించాయి. యు ముంబా కూడా ఇరానీ ప్లేయర్ ఫజల్‌ని సారథిగా నియమించగా, పుణేరి పల్టన్ జట్టు సుర్జీత్ సింగ్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. -
అఫ్గానిస్తాన్ సంచలన నిర్ణయం
అప్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. యువ సంచలనం, 20 ఏళ్ల రషీద్ ఖాన్‌ను అఫ్గాన్ సారథిగా నియమించింది. ఇప్పటికే అప్గాన్ టీ20 జట్టుకు సారథిగా ఉన్న రషీద్.. ఇక నుంచి మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌లో ఆడిన అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ ఘోర పరాజయాలను ఎదుర్కొంది. దీంతో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన జట్టులో సమూల మార్పులు చేయాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది. ఇక సీనియర్ ఆటగాడు, మాజీ సారథి అస్గర్ అఫ్గాన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు సారథిగా ఉన్న అస్గర్‌ను తప్పించి గుల్బాదిన్ నైబ్కు బాధ్యతలను అప్పగించింది. అయితే నైబ్ సారథ్యంలోని అప్గాన్ జట్టు టోర్నీలో ఒకటిరెండు మినహా మిగతా మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచింది. సారథిగానే కాకుండా ఆటగాడిగా కూడా విఫలమవ్వడంతో నైబ్‌పై వేటువేసింది. అయితే ప్రపంచకప్‌లో రషీద్ తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ అతడిపై బోర్డు నమ్మకం ఉంచింది. ఇక 20 ఏళ్ల రషీద్ ఐపీఎల్‌తో భారతీయులకు సుపరిచితుడే. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన సంచలన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. -
‘భర్తకు దూరంగా ఎలా ఉంటున్నారు’
న్యూఢిల్లీ : మహిళ పైలెట్‌ను వేధింపులకు గురి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఓ సినీయర్ కెప్టెన్‌పై ఎయిర్ ఇండియా యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సదరు సీనియర్ కెప్టెన్ తనను ఇబ్బందికర ప్రశ్నలతో వేధించినట్లు మహిళా పైలెట్ ఫిర్యాదు చేసింది. దాంతో ఆ కెప్టెన్‌పై విచారణకు ఆదేశించాం’ అని తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాలు.. ‘ఈ నెల 5వ తేదీని ట్రెయినింగ్ సెషన్ పూర్తయిన తర్వాత సదరు కెప్టెన్ నన్ను డిన్నర్‌కు ఆహ్వానించాడు. గతంలో నేను అతనితో కలిసి పని చేశాను. ఆ కారణంగా డిన్నర్‌కు వెళ్లేందుకు అంగీకరించాను. తొలుత అతను మర్యాదగానే ప్రవర్తించాడు. తర్వాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లాం’ అన్నారు. ‘అక్కడ నుంచి నన్ను వేధించడం ప్రారంభించాడు. తన వివాహ జీవితంలో చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. అంతటితో ఊరుకోక భర్తకు దూరంగా ఉంటున్నారు.. మీకు ఏం అనిపించడం లేదా అని పలు అభ్యంతరకర ప్రశ్నలు అడుగుతూ నన్ను ఇబ్బంది పెట్టాడు. దాంతో నాకు చిరాకు పుట్టి.. మీతో ఇవన్ని మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను’ అని సదరు మహిళా పైలెట్ తెలిపారు. అతడు నన్ను నైతికంగా అవమానించాడు. ఆ కెప్టెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
లయన్ విమాన ప్రమాదం : కెప్టెన్‌గా ఢిల్లీ వాసి
ఇండోనేషియాలో ఘోర ప్రమాద వార్త విన్న వెంటనే భారతీయులంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ప్రమాదంలో భారతీయులెవరూ ఉండకూదంటూ సోషల్ మీడియాలో చాలామంది ప్రార్థించారు. కానీ వారు భయపడినంతా జరిగింది. ముఖ్యంగా న్యూఢిల్లీకి చెందిన భవ్యే సునేజా (31) ప్రమాదానికి గురైన లయన్ విమానానికి కెప్టెన్ పైలట్‌గా ఉన్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన సునేజా 2009లో పైలట్ లైసెన్స్ పొందారు. ఎమిరేట్స్, కాలిఫోర్నియాలో పైలట్ శిక్షణ పొందారు. 2011లో లయన్ ఎయిర్ సంస్థలో పైలట్‌గా చేరారు. సునేజా భార్య ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మేనేజరుగా పనిచేశారుట. సునేజా జులైలో ఢిల్లీలో పోస్టింగ్ ఇప్పించాలని కోరారు. చాలా అనుభవమున్న పైలట్. నైపుణ్యాలు ఉన్నాయి కాబట్టే అతన్ని ఇండోనేసియా సంస్థలోనే ఉంచాలనుకున్నామని లయన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. తమసంస్థలో పనిచేసే పైలట్లంతా ఉత్తర భారత్‌కు చెందినవారే. సునేజా అభ్యర్ధనను వెంటనే అంగీకరించలేకపోయామంటూ లయన్ ఎయిర్ అధికారులు వెల్లడించారు. కాగా ఇండోనేషియా విమానం బెలిటంగ్ దీవులలోప్రధాన నగరమైన పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్ జెట్పాసింజర్( జేటీ-610 )విమానంలో సముద్రంలో 30-30మీటర్ల లోతులో సోమవారం ఉదయం కూలిపోయింది. ఇద్దరు పైలట్లు, అయిదుగురు సిబ్బంది సహా సుమారు 188 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదలో ఎవరూ బతికి వుండే అవకాశం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఫించ్కే టీ20 పగ్గాలు
సిడ్నీ: ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్‌గా విధ్వంసక ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఎన్నికయ్యాడు. ఈ నెల 24 నుంచి యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఫించ్ సారథ్యం వహించనున్నాడు. తొలి సారి వినూత్నంగా ప్రయత్నించిన సెలక్షన్ కమిటీ ఇద్దరు వైస్ కెప్టెన్లను నియమించింది. దీంతో మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ వైస్ కెప్టెన్లుగా అవకాశం లభించింది. ఇటీవల జింబాబ్వేలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో కెప్టెన్సీతో ఆకట్టుకున్న ఫించ్‌పై పూర్తి నమ్మకం ఉందని కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ‘పొట్టి క్రికెట్లో ఫించ్ అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను జట్టును ముందుండి నడిపించగలడు’ అంటూ ఫించ్‌ను కోచ్ లాంగర్ ప్రశంసలతో ముంచెత్తాడు. గాయాలతో గత సిరీస్‌కు దూరమైన క్రిస్ లిన్, కౌల్టర్‌నైల్ తిరిగి జట్టులోకి రాగా, యువ స్పిన్నర్ ఆడమ్ జంపా, బెన్ మెక్ డెర్మాట్ సైతం చోటు దక్కించుకున్నారు. -
అమెరికా క్రికెట్ కెప్టెన్‌గా ఇబ్రహీం ఖలీల్
వాషింగ్టన్: ఐసీసీ వరల్డ్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకు హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం ఖలీల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెల 19 నుంచి నార్త్ కరోలినాలో జరిగే ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల యూఎస్ఏ జట్టును సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ వెస్టిండీస్ క్రికెటర్ రికార్డో పావెల్ ప్రకటించారు. హైదరాబాద్ తరఫున సుదీర్ఘ కాలం రంజీ ఆడిన అనంతరం యూఎస్ఏ వలస వెళ్లిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఖలీల్ ... గత ఏడాది నుంచి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇంతకుముందు కూడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను, మరోసారి సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టోర్నీలో భాగంగా కెనడా, పనామా, హోండురస్ జట్లతో అమెరికా తలపడుతుంది. ఇబ్రహీం ఖలీల్ ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో క్రిస్ గేల్ కెప్టెన్‌గా ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
టీమిండియా కెప్టెన్ ధోనినే!
హైదరాబాద్: టీమిండియా మూడు మెగా ఐసీసీ టోర్నీలు గెలిచింది మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలోనే. అయితే 2014లో ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతంర టెస్టులకు, 2017 ప్రారంభంలో పూర్తి స్థాయిలో సారథ్య బాధ్యతల నుంచి ఈ జార్ఖండ్ డైనమెట్ తప్పుకున్న విషయం తెలిసిందే. కానీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకారం ఇప్పటికీ టీమిండియా కెప్టెన్ ధోనినే. బీసీసీఐ అధికారిక వెబ్సైట్లో ఆటగాళ్ల సమాచారానికి సంబంధించిన పోర్టల్‌లో ధోనినే కెప్టెన్‌గా ఉంది. దీనిని స్క్రీన్‌షాట్ తీసి అభిమానులు సోషల్‌మీడియలో పోస్ట్ చేశారు. ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్న ఈ ఫోటోపై నెటిజన్లు బీసీసీఐ ఏమరుపాటుతనంపై మండిపడుతున్నారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన బోర్డు అధికారులు చేసిన పొరపాటును సరిదిద్దారు. కానీ అప్పటికే కావాల్సినంత రచ్చ జరిగిపోయింది. ఇంగ్లండ్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఎంఎస్ ధోనిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్ ఆటగాళ్లు, అభిమానులు ఈ ఫినిషర్ జట్టు నుంచి తప్పుకుంటే మంచిదని సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. -
టాప్ సీక్రెట్ చెప్పేసిన ధోని!
టీమిండియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంఎస్ ధోనిది ప్రత్యేక స్థానం. ధోనిలో మంచి నాయకుడితో పాటు మంచి ఆటగాడు కూడా ఉన్నాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో మొదటిది కలుపుగోలు తనం. అదే ఆయనలో ప్రస్పుటంగా కనిపించేది. సీనియర్ క్రికెటర్ల నుంచి ఇప్పటి ఆటగాళ్ల వరకూ అందరి పట్ల ఆయన ఎంతో అభిమానం చూపించడమే కాకుండా, స్నేహభావంతో మెలుగుతారు. ఈ క్రమంలోనే తన కెప్టెన్సీ సక్సెస్ గురించి టాప్ సీక్రెట్ చెప్పేశాడు ధోని. ఇటీవల 37వ బర్త్‌డే జరుపుకున్న ధోని.. టీమిండియా జట్టుతో అనుభవాల గురించి వెల్లడిస్తూ.. ‘ప్రతీ ఒక్కరికీ కామన్ సెన్స్ అనేది ఉంటుంది. దాన్ని సమర్ధంగా ఉపయోగించుకోగలిగే ప్రతిఒక్కరూ నాయకులే. జట్టులో ప్రతి ఒక్కరి మనోభావాలనూ గౌరవించాలి. వారిని ఆటకు సన్నద్ధం చేయడం ఎంత ముఖ్యమో వారి అభిప్రాయాలను, నిర్ణయాలనూ గౌరవించడం కూడా అంతే ముఖ్యం. జట్టులో తమ కెప్టెన్ పట్ల ఏ ఒక్క క్రికెటర్ అసంతృప్తి వ్యక్తం చేసినా కెప్టెన్‌గా విఫలమైనట్లే. మ్యాచ్ సందర్భంలో క్రికెటర్లు వేర్వేరుగా స్పందిస్తుంటారు. వారికి సర్ది చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. నావరకూ అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కామన్ సెన్స్‌తో ఆలోచిస్తా. అదే నా కెప్టెన్సీ రహస్యం’ అని ధోని వివరించాడు. ‘ఏం మాట్లాడుతన్నారీయన..మాకెందుకు చెబుతున్నారు? మాకు ఇది కూడా తెలీదా' అనే మాటలు జట్టులో ఎవరో ఒకరు అంటూనే ఉంటారని నేను విన్నాను. కానీ నా విషయంలో నాకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు' అని ధోని పేర్కొన్నాడు. -
‘వరల్డ్ కప్ సరైన వేదిక కాదు’
కజాన్ : అరబ్ దేశాల చట్టాలు...మరీ ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిన విషయమే. మగ క్రీడాకారులు ఆటలు ఆడే సమయంలో ఆడవారు స్టేడియంలోకి రాకుడదనేది అటువంటి కఠిన చట్టాల్లో ఒకటి. 1979 విప్లవం సందర్భంగా వచ్చిన ఈ చట్టాన్ని ఎత్తివేయాలని ఇరాన్ మహిళలు కొంతకాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇలా అయితే లాభం లేదని, తమ నిరసనను ప్రపంచం మొత్తం తెలియజాలనుకున్నారు. రష్యాలో జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్’ను అందుకు వేదికగా ఎంచుకున్నారు. ఫిఫా షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు(అంటే ఈ రోజే) ఇరాన్, స్పెయిన్‌తో తలపడనుంది. తమ నిరసనను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ఇదే మంచి అవకాశం అని భావించారు ఇరానీ మహిళలు. అందుకే కజాన్ ఎరినాలో ‘ఆడవారిని నిషేధించకూడదు (#NoBan4Women), ‘ఇరానీ మహిళలు స్టేడియంలోకి వచ్చేందుకు మద్దతు తెలపండి’ (Support Iranian women to attend stadiums) అని రాసివున్న ప్లకార్డులను పట్టుకుని జనాల మధ్య నిల్చున్నారు. అయితే ఇరానీ మహిళలు చేస్తున్న నిరసన గురించి ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ మసౌద్ షోజాయి ‘ఇరాన్ మహిళల సమస్యల గురించి చర్చించడానికి ఈ టోర్నమెంట్ సరైన వేదిక కాదు. మనమంతా ఒకే కుటుంబం...మన సమస్యల గురించి మనం మన ఇంటిలోపలో చర్చించుకోవాలి. కానీ మైదానంలో ఉన్నప్పుడు మనమంతా ఒకే దేశం. కాబట్టి ఈ విషయం గురించి మనం తర్వాత చర్చిద్దాం’ అని అన్నారు. 1979 విప్లవం తర్వాత ఇరాన్లో మహిళలను అన్ని క్రీడాకార్యక్రమాలకు హాజరవటాన్ని నిషేధించారు. అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్న వారిలో షౌజాయి కూడా ఉన్నారు. -
అనుష్క శర్మనే నా కెప్టెన్
-
ఆమె నా కెప్టెన్ : కోహ్లి
న్యూఢిల్లీ : టీమిండియాకు సారథ్యం వహించే విరాట్ కోహ్లి మైదానం బయట తన కెప్టెన్ మాత్రం తన ప్రేయసి, సతీమణి అనుష్కా శర్మనే అని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో కోహ్లి నోట వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఆఫ్ ది ఫీల్డ్‌లో మీ కెప్టెన్ ఎవరని అడిగిన ప్రశ్నకు కోహ్లి నవ్వుతూ.. ‘ఇంకెవరు అనుష్క శర్మనే’ అని బుదులిచ్చాడు. అంతేగాకుండా తన జీవితంలో నిర్ణయాలు తీసుకునే అన్ని హక్కులు అనుష్కాకే ఉన్నాయన్నాడు. ఆమె తన బలం, సర్వస్వమని అభిప్రాయపడ్డాడు. జీవితభాగస్వామిగా ఎలా ఉండాలనుకుంటారో అలాంటి వ్యక్తే తనకు భాగస్వామిగా వచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. అనుష్కాకు క్రికెట్ అంటే పిచ్చి అని, ఆటను అర్థం చేసుకోవడమే కాకుండా ఆటగాళ్ల సెంటిమెంట్స్‌ను కూడా అర్థం చేసుకోగలదన్నాడు. ఇది ఆమెలో ఉన్న గొప్ప విషమని చెప్పుకొచ్చాడు. నాలుగేళ్ల ప్రేయాయణం అనంతరం ఈ జంట గతేడాది డిసెంబర్లో పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఐపీఎల్లో అనుష్క విరాట్ జట్టైన బెంగళూరు మ్యాచ్‌లకు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలోని కోహ్లి వ్యాఖ్యలకు వీడియోను జోడిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించి తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. -
సారథిగా అజింక్య రహానే!
బెంగళూరు: కొన్నాళ్లుగా చక్కగా రాణిస్తున్న యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో అవకాశం. వచ్చే నెల 14 నుంచి అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరగనున్న చారిత్రక టెస్టుకు అతడు భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి జూన్ నెల మొత్తం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడనుండటంతో అతని స్థానంలో శ్రేయస్‌కు చోటు దాదాపు ఖాయమైంది. ఈ మేరకు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్టర్లు మంగళవారం బెంగళూరులో జట్టును ఎంపిక చేయనున్నారు. తుది జట్టులో స్థానం దక్కితే శ్రేయస్‌కు ఇదే తొలి టెస్టు అవుతుంది. ఇప్పటివరకు 46 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన అతడు... 53.90 సగటుతో 3,989 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారు. రహానే గతేడాది ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులోనూ కెప్టెన్‌గా చేశాడు. మరోవైపు ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతున్న చటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ సహా మిగతా రెగ్యులర్ ఆటగాళ్లంతా అఫ్గాన్‌తో టెస్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈ మ్యాచ్‌తోనే అఫ్గాన్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయనుండటం విశేషం. రాయుడొస్తున్నాడు! కౌంటీల కారణంగా విరాట్ ఐర్లాండ్‌తో రెండు టి20ల సిరీస్‌కూ దూరంగా ఉండనున్నాడు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపడతాడు. నిదహాస్ ట్రోఫీ గెలిచిన జట్టునే దాదాపుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నా, ఈ ఐపీఎల్లో అదరగొడుతున్న హైదరా బాద్ సీనియర్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు పేరు కూడా చర్చకు రానున్నట్లు సమాచారం. ‘ఎ’ జట్టులో పృథ్వీ, శుబ్‌మన్, మావి యువ సంచలనాలు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్, శివం మావి ఇంగ్లండ్‌లో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత జట్టుకు ఎంపిక కానున్నారు. ఈ సిరీస్‌లో మూడో జట్టుగా వెస్టిండీస్ ‘ఎ’ బరిలో దిగనుంది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తాడు. పర్యటనలో భాగంగా భారత్ ‘ఎ’ జట్టు జులై 16–19 మధ్య ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు)తో నాలుగు రోజుల టెస్టు ఆడనుంది. -
విలియమ్సన్కు సన్‌రైజర్స్ పగ్గాలు
న్యూఢిల్లీ: నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ను నియమించింది. ప్రస్తుతం అతను సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. ‘ఈ సీజన్లో హైదరాబాద్‌కు సారథ్యం వహించనుండటం ఆనందంగా ఉంది. మేటి ఆటగాళ్లతో కూడిన బృందంతో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’నని కేన్ విలియమ్సన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు సన్‌రైజర్స్ ప్రకటించింది. వార్నర్ వైదొలిగిన నేపథ్యంలో శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహాలలో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని భావించినా... గత మూడు ఐపీఎల్ సీజన్లలో సన్‌రైజర్స్ తరఫున కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన విలియమ్సన్‌ను కెప్టెన్‌గా నియమించడం ఆశ్చర్యపరిచింది. ఒకవేళ ధావన్ లేదా సాహాలలో ఒకరిని సారథిగా ఎంపిక చేసి ఉంటే తొలిసారి ఐపీఎల్లో అన్ని జట్లకు భారతీయ ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉండేవారు. -
దినేశ్ కార్తీక్‌కు నైట్‌రైడర్స్ పగ్గాలు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నాడు. ఫ్రాంచైజీ యాజమాన్యం ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు ఆదివారం జట్టు పగ్గాలు అప్పగించింది. రాబిన్ ఉతప్పను వైస్ కెప్టెన్‌గా నియమించింది. కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ జట్టు సమతూకంగా ఉందని దినేశ్ ముందుండి నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ ‘భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్ఫూర్తితో కోల్‌కతాను నడిపిస్తా. మా జట్టులో ముగ్గురు మణికట్టు స్పిన్నర్లున్నారు. సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లాలు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇరుకున పెడతారు. అనుభవజ్ఞులైన హీత్ స్ట్రీక్ (బౌలింగ్ కోచ్), జాక్వెస్ కలిస్ (మెంటార్)లతో కూడిన కోచింగ్ సిబ్బంది అందుబాటులో ఉంది. ఈ సీజన్లో మేం తప్పకుండా రాణిస్తాం’ అని అన్నాడు. పంజాబ్ బౌలింగ్ కోచ్‌గా ప్రసాద్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలింగ్ కోచ్‌గా వెంకటేశ్ ప్రసాద్‌ను నియమించారు. పంజాబ్ యాజమాన్యం నుంచి ఆఫర్ రావడంతో జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి ప్రసాద్ రాజీనామా చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ బ్రాడ్ హాగ్‌ను నియమించినట్లు ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ జట్టు మెంటార్‌గా కొనసాగుతున్నాడు. -
పిన్న వయసు కెప్టెన్‌గా...
హరారే: అఫ్గానిస్తాన్ యువ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యంత చిన్న వయసు (19 ఏళ్ల 160 రోజులు)లోనే అంతర్జాతీయ జట్టుకు సారథ్యం వహించిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ అస్గర్ స్టాన్జాయ్ కడుపునొప్పి కారణంగా ఆస్పత్రి పాలవడంతో రషీద్‌కు తమ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం దక్కింది. అఫ్గాన్ మార్చి 4న స్కాట్లాండ్తో ప్రపంచకప్ అర్హత మ్యాచ్ ఆడనుంది. దీనికి రషీద్ సారథ్యం వహిస్తాడని అఫ్గాన్ బోర్డు ట్విట్టర్లో ప్రకటించింది. ఇప్పటివరకు ఈ రికార్డు రాజిన్ సలే (బంగ్లాదేశ్–20 ఏళ్ల 297 రోజులు; దక్షిణాఫ్రికాపై 2004లో) పేరిట ఉంది. ఇటీవల ప్రకటించిన ఐసీసీ వన్డే, టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రషీద్ నంబర్‌వన్‌గా నిలిచి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడయ్యాడు. రషీద్ 37 వన్డేల్లో 86 వికెట్లు, 29 టి20ల్లో 47 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతడిని ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా రూ.9 కోట్లకు దక్కించుకుంది. -
‘మా జట్టు సిద్ధమైంది..’
పారిస్: ఇన్నాళ్లూ మనం దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ పరుగును, ప్రపంచ రికార్డులను చూశాం. ఇక మీదట అతని సారథ్యాన్ని చూడబోతున్నాం. ఈ జమైకన్ స్ప్రింట్ స్టార్ చిన్నారుల సంక్షేమం కోసం యూనిసెఫ్ సంస్థ నిర్వహిస్తున్న ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టపడే ఉసేన్ బోల్ట్ ‘సాకర్ ఎయిడ్ వరల్డ్ ఎలెవన్’ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడు. అవతలి జట్టు (ఇంగ్లండ్)కు బ్రిటిష్ రాక్‌స్టార్ రాబీ విలియమ్స్ నాయకత్వం వహించనున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జూన్ 10న ఈ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచార వీడియోలో బ్రెజిల్ స్టార్ రొనాల్డినో, రియల్ మాడ్రిడ్ కోచ్ జినెదిన్ జిదాన్, అమెరికన్ కామెడీ యాక్టర్ విల్ ఫెరెల్ నటించారు. తన సాకర్ ముచ్చటపై బోల్ట్ ట్విట్టర్లో ‘సెలబ్రిటీస్, లెజెండ్స్, బ్రాండ్ న్యూ కెప్టెన్‌తో సాకర్ ఎయిడ్ వరల్డ్ ఎలెవన్ జట్టు సిద్ధమైంది’ అని ట్వీట్ చేశాడు. -
స్పిన్ మిస్సైల్ మరో రికార్డు
స్పిన్ మిస్సైల్‌గా పిలుచుకునే ఆఫ్ఘనిస్తాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్‌ఖాన్ మరో రికార్డు సృష్టించాడు. అతి చిన్న వయస్సులోనే కెపెన్టీ బాధ్యతలు చేపట్టి అరుదైన రికార్డును అందుకున్నాడు. అప్ఘనిస్తాన్ కెప్టెన్ అస్గర్‌కు శస్త్ర చికిత్స జరగడంతో అతని స్ధానంలో రషీద్‌కు తాత్కాలిక సారథిగా భాద్యతలు అప్పగిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో 19 ఏళ్ల 159 రోజులకే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన పిన్నవయస్కుడిగా రషీద్ ఘనత సాధించాడు. రషీద్ కంటే ముందు బంగ్లాదేశ్ క్రికెటర్ రాజిన్ సలేహ్ తక్కువ వయస్సులో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వారిలో టాప్‌లో కొనసాగాడు. తాజాగా అతని రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు. మరోవైపు మహిళ క్రికెట్లోనూ రషీద్ కంటే చిన్న వయస్సులో కెప్టెన్సీ చేపట్టిన వారు లేరు. ఇటీవల (ఫిబ్రవరి 20న) ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ జాబితాలో కూడా రషీద్ అతి పిన్న వయసులో బౌలింగ్ విభాగంలో అగ్రస్థానానికి చేరి రికార్డ్ సృష్టించాడు. 19 ఏళ్ల 153 రోజుల వయసున్న రషీద్ ఖాన్ వన్డే క్రికెట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన అత్యంత పిన్న వయసున్న క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సైక్లెన్ ముస్తాక్ 21 సంవత్సరాల 13రోజులకు నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ వయస్సులో సారథి బాధ్యతలు చేపట్టిన వారు: రషీద్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్)- 19 ఏళ్ల 159 రోజులు రాజిన్ సలేహ్(బంగ్లాదేశ్)- 20 ఏళ్ల 297 రోజులు రోడ్నీ ట్రోట్(బెర్ముడా)- 20 ఏళ్ల 332 రోజులు తాటెండా తైబు(జింబాబ్వే)-20 ఏళ్ల 342 రోజులు నవాబ్ పటౌడీ(భారత్)-21 ఏళ్ల 77 రోజులు -
చంపాలా? వద్దా?
కథాసారం అతడు మౌనంగా లోపలికి వచ్చాడు.బుల్లెట్లున్న తోలుపట్టీని, దానికి వేలాడుతున్న తుపాకి సహా తీసి గోడకు వున్న కొక్కానికి తగిలించాడు. తన మిలిటరీ టోపీని కూడా అక్కడే పెట్టాడు. తర్వాత టై ముడి విప్పుతూ, ‘ఈ వేడిమి భయంకరంగా వుంది. నాకు గడ్డం చెయ్’ అని కుర్చీలో కూర్చున్నాడు. క్యాప్టెన్ టోరెస్! అతడిని చూడగానే క్షురకుడికి వణుకు మొదలైంది. భయంతో కూడిన భావోద్వేగాన్ని బయట పడనీయకుండా, తన దగ్గరున్న కత్తుల్లో అన్నిటికన్నా వాడిగా వున్నదాన్ని తోలుపట్టీ మీద పైకీ కిందకూ తిప్పుతూ పదునును మరింత పెంచడానికి ప్రయత్నించాడు. తర్వాత చేతి వేలితో సుతారంగా ఆ పదునును అంచనా వేశాడు. టోరెస్ గడ్డం నాలుగు రోజులదై వుంటుంది! అతడు నాలుగు రోజులుగా దళాలను వెతికే పనిలో ఉన్నాడు. అందువల్ల ముఖం ఎండ వేడిమికి కమిలి ఎర్రబడింది. క్షురకుడు జాగ్రత్తగా సబ్బు నురగ తయారు చేయటం ప్రారంభించాడు. కొన్ని సబ్బుముక్కల్ని ప్లాస్టిక్ కప్పులో పడేసి, కొన్ని వేణ్నీళ్లను అందులో పోసి, బ్రష్‌తో తిప్పటం మొదలెట్టాడు. ‘మా పటాలంలోని మిగిలినవాళ్లక్కూడా ఇంతే గడ్డం పెరిగి వుండాలి’ అన్నాడు టోరెస్. ‘ముఖ్యమైనవాళ్లు మాకు దొరికారు. కొందర్ని చంపేశాం. మరికొందరు ఇంకా బతికేవున్నారు. కానీ త్వరలోనే వాళ్లంతా చనిపోతారు’ అని కూడా అన్నాడు. ‘ఎందర్ని పట్టుకున్నారు మీరు?’ అడిగాడు క్షురకుడు. ‘పద్నాలుగు మందిని. వాళ్ల ఆచూకీ కనుక్కోవటం కోసం మేము అడవిలో చాలా లోపలికి వెళ్లాల్సి వచ్చింది. మిగిలినవాళ్లను కూడా పట్టుకుంటాం. ఒక్కడు... ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు’. క్షురకుడు ఆందోళన చెందాడు. అతడు కూడా రహస్య దళానికి చెందినవాడే! డ్రాయరు సొరుగులోంచి గుడ్డను తీసి టోరెస్ మెడ వెనకాల ముడి వేశాడు. ‘మా చర్య ఈ నగర ప్రజలకు మంచి గుణపాఠాన్ని నేర్పివుండాలి’ అన్నాడు టోరెస్. అతడు బాగా అలసిపోయినట్టుగా కళ్లు మూసుకుని, సబ్బు నురగ తాలూకు చల్లదనాన్నీ, హాయినీ అనుభవించడానికి వేచి వున్నాడు. టోరెస్‌కు అంత సమీపంగా ఎప్పుడూ వెళ్లలేదు క్షురకుడు. నగర ప్రజలందరినీ స్కూలు ప్రాంగణంలో గుమిగూడాలని టోరెస్ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మాత్రం ఒక్క నిమిషం సేపు అతడికి ఎదురుగా నిలిచాడు. అక్కడ నలుగురు విప్లవకారులను చెట్లకు వేలాడదీసి తుపాకులతో కాల్చేస్తుంటే ప్రజలందరూ చూడాలని టోరెస్ కోరిక. గాయాలతో చెదిరిపోయిన ఆ శవాలను చూసి, ఆ చర్యకు ముఖ్యకారకుడైన మిలిటరీ అధికారి ముఖాన్ని అప్పుడు అంత పరీక్షగా చూడలేదు. కానీ ఆ ముఖాన్నే ఇప్పుడు తన చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. టోరెస్ అందవికారంగా ఏం లేడు. ఆ గడ్డం వల్ల వయసు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. అతడు మంచి ఊహాశాలీనత ఉన్నవాడయ్యుండాలి. లేకపోతే విప్లవకారుల్ని నగ్నంగా చెట్లకు వేలాడదీసి, వాళ్ల శరీరాలను టార్గెట్లు చేస్తూ షూట్ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? సబ్బు నురగను అనుభవిస్తూ, కళ్లు మూసుకునే అన్నాడు టోరెస్: ‘నేను ఎంతగా అలసిపోయి వున్నానంటే ఇప్పుడు నేరుగా నిద్రలోకి జారుకోగలను. కానీ ఈ సాయంత్రం నేను చేయాల్సిన పని ఎంతో వుంది’. సబ్బు నురగ పులమటం ఆపి, ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా, ‘మళ్లీ కాల్పులు కొనసాగిస్తారా?’ అడిగాడు క్షురకుడు. ‘అట్లాంటిదే. కానీ అంత తీవ్రమైన చర్య కాదు’. క్షురకుడి చేతులు మళ్లీ వణికాయి. అయినా ఇతర కస్టమర్లకు చేసినట్టుగానే ఇతడికి కూడా ఒక్క చుక్క రక్తం రాకుండా జాగ్రత్తగా గడ్డం తీయాలి. వెంట్రుకల మీద కత్తిని పక్కకు పోనీయకూడదు. అరచేతి వెనుక భాగాన్ని ముఖానికి ఆనించి కదిపితే ఒక్క వెంట్రుక కూడా లేనట్టు తెలియాలి. కత్తి బ్లేడును తెరిచి సైడ్ లాక్ నుండి గీయటం మొదలెట్టాడు. కత్తి మెత్తగా జారుతోంది. టోరెస్ వెంట్రుకలు మందంగా, బిరుసుగా ఉన్నాయి. గీస్తుంటే చిన్నగా చర్మం తేలుతోంది. ‘ఈరోజు ఆరు గంటలకు బడి దగ్గరకు రా’ అన్నాడు టోరెస్. ‘ఆరోజు లాగానే జరగబోతోందా?’ ‘ఇంకా బాగా కూడా వుండొచ్చు’ ‘ఏం చెయ్యాలనుకుంటున్నారు?’ ‘ఇంకా నాకే తెలియదు. కానీ మంచి వినోదం వుండబోతోంది’ ‘అందర్నీ శిక్షించాలని ప్లాను వేసుకున్నారా?’ ధైర్యం చేసి అడిగాడు. ‘అందర్నీ’ అద్దంలో కనబడే వీధిని చూశాడు క్షురకుడు. ముందరిలాగే కిరాణా దుకాణం, అందులో ఇద్దరో ముగ్గురో కస్టమర్లు ఉన్నారు. గడియారం రెండూ ఇరవై సూచిస్తోంది. మెడమీద కత్తిని మెల్లగా కదుపుతున్నాడు. అక్కడ గీసేటప్పుడు చాలా చాకచక్యంగా ఉండాలి. వెంట్రుకలు మందంగా లేకపోయినా చిన్నచిన్న రింగులుగా మెలి తిరిగినయ్. ఆ చర్మరంధ్రాల్లో ఏదైనా ఒకటి తెరుచుకుని రక్తాన్ని స్రవింపజేయగలదు. విప్లవకారుల్లో ఎంతమంది చంపించాడతడు! ఎంతమందిని చిత్రవధల పాలు చేశాడు! తన చేతుల్లో వున్న టోరెస్ ముఖానికి శుభ్రంగా గడ్డం గీసి, భద్రంగా ప్రాణాలతో వదిలేయటం భరించరాని విషయమనిపించింది. నిజానికి అతణ్ని చంపటం ఇప్పుడు ఎంత సులభం! గొంతును సర్రుమని కోసి. ప్రతిఘటించటానికి కూడా సమయం ఇవ్వకుండా. కళ్లు మూసుకుని వున్నాడు కనుక మెరిసే కత్తిని గుర్తించలేడు. మెడలోకి కత్తిని దించితే అందులోంచి రక్తం చిమ్మి గుడ్డనూ, కుర్చీనీ, నేలనూ మొత్తంగా తడిపేయగలదు. వెచ్చని రక్తం నేల మీదుగా పారి వీధిలోకి కూడా ప్రవహిస్తుంది. లోతుగా పెట్టే గాటు పెద్ద నొప్పిని కూడా కలిగించదు. మరి శవాన్ని ఏం చేయాలి? ఎక్కడ దాచాలి? క్యాప్టెన్ టోరెస్‌ను చంపిన హంతకుడు... గడ్డం గీస్తున్నప్పుడు గొంతు కోశాడు పిరికిపంద, అనుకుంటారు జనం. మనందరి వైపు నుండి ప్రతీకారం తీర్చుకున్నాడు, అని కూడా అనుకోవచ్చు! పట్టువస్త్రంలాగా, మెత్తని రబ్బరు ముక్కలాగా అతని చర్మం సులభంగా తెగిపోతుంది. మనిషి చర్మం కన్నా ఎక్కువ మెత్తనైనది మరేదీ లేదేమో! బయటికి చిమ్ముకుని రావడానికి లోపల రక్తం వుండనే వుంటుంది. కానీ నేను హంతకుణ్ని కాదలుచుకోలేదు. నువ్వు గడ్డం గీయించుకోవటం కోసం నా దగ్గరికి వచ్చావు. నేను నా పనిని గౌరవప్రదంగా చేస్తాను. నా చేతులకు రక్తం అంటుకోవడం నాకిష్టం లేదు. కేవలం సబ్బు నురగ చాలు! నున్నగా శుభ్రంగా గడ్డం గీకేశాడు క్షురకుడు. టోరెస్ అద్దంలో చూసుకున్నాడు. అరచేతుల్తో చెంపల్ని ముట్టుకుని, ‘థాంక్స్’ అన్నాడు. కుర్చీలోంచి లేచి, బెల్టు, పిస్తోలు, టోపీ చేతిలోకి తీసుకున్నాడు. ప్యాంటు జేబులోంచి నాణాల్ని బయటికి తీసి ఇచ్చాడు. బయటికి వెళ్లబోతూ, ద్వారం దగ్గర ఆగి– ‘నువ్వు నన్ను చంపుతావని అన్నారు కొందరు. ఆ విషయం తేల్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను. చంపటం అంత సులువైన పనికాదు. నేను చెబుతున్న ఈ వాక్యంలో ఎంతో వాస్తవం ఉంది’ అన్నాడు టోరెస్. క్షురకుడు అక్కడే ఉండిపోయాడు. -
సరిగ్గా మూడేళ్ల క్రితం ధోని..!
న్యూఢిల్లీ:ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ జట్టును ఉన్నత స్థానంలో నిలిపిన నాయకుడు. భారత్‌కు వన్డే వరల్డ్ కప్, టీ 20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలను సాధించి పెట్టిన ఏకైక నాయకుడు. ఈ క్రమంలోనే భారత తరపున మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా కెప్టెన్‌గా ధోని గుర్తింపు సాధించాడు. ఇప్పటికీ టీమిండియా జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న ధోని.. 2014, డిసెంబర్ 30వ తేదీన టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు. తనకు టెస్టు ఫార్మాట్ నుంచి వీడ్కోలు తీసుకునే సమయం ఆసన్నమైందని భావించిన ధోని ఏకంగా ఆ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. మెల్బోర్న్లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ముగిసిన తరువాత ధోని ఈ ఫార్మాట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఆనాడు ధోని తీసుకున్న నిర్ణయంతో విరాట్ కోహ్లి టెస్టు పగ్గాలను స్వీకరించాడు. 2005, డిసెంబర్ 2వ తేదీన చెన్నైలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోఅరంగేట్రం చేసిన ధోని.. 90 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తన టెస్టు కెరీర్లో 38.09 యావరేజ్‌తో 4,876 పరుగుల్ని సాధించాడు. 33 హాఫ్ సెంచరీలను నమోదు చేసిన ధోని.. 6 టెస్టు సెంచరీలను సాధించాడు. కాగా, వికెట్ కీపర్‌గా 294 అవుట్లలో ధోని భాగస్వామ్యమయ్యాడు. ఇందులో 256 క్యాచ్‌లు పట్టడంతో పాటు 38 స్టంపింగ్‌లు చేశాడు. ఫలితంగా టెస్టు ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్లలో ధోని ఐదో స్థానం సాధించాడు. టెస్టులు.. వన్డేలు..టీ20ల్లో కలిపి అత్యధికంగా 331 మ్యాచ్‌ల్లో జట్టుకు నేతృత్వం వహించిన ఏకైక కెప్టెన్. ఇందులో 178 విజయాలను ధోని సారథ్యంలోని భారత్ కైవసం చేసుకుంది. 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. 27 విజయాలను సాధిండాడు. ఇక 199 వన్డేలకు కెప్టెన్‌గా చేసి 110 విజయాలను నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ 20 ఫార్మాట్లో 72 మ్యాచ్‌లకు గాను 41 విజయాలు భారత్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంచితే, 2013లో ఆస్ట్రేలియా జరిగిన టెస్టు సిరీస్‌ను ధోని సారథ్యంలోని భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. తద్వారా 40 ఏళ్లలో ఆసీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు పుస్తకాల్లోకి కెక్కింది. ఆ సిరీస్‌లో ధోని కెరీర్ బెస్ట్ స్కోరును సాధించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోని(224) డబుల్ సెంచరీ సాధించాడు. ఇలా చెప్పుకుంటూ ధోని సాధించిన ఘనతలు ఎన్నో.. నేటికి ధోనికి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అతనికి ఆటపై ఉన్న నిబద్దతే ఉదాహరణ. -
కోహ్లి ఇక వైస్ కెప్టెన్..!
న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గత కొన్ని రోజుల క్రితం ఇటలీలోని టస్కనీలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. దీన్ని పురస్కరించుకుని ఈ సెలబ్రెటీ జోడికి పలువురు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇలా విషెస్ చెప్పిన వారిలో క్రీడా ప్రముఖలతో పాటు, బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారు. అయితే విరుష్కల పెళ్లిపై హీరోయిన్ జెనీలియా భర్త, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తనదైన శుభాకాంక్షలు తెలియజేశారు. ' టీమిండియా కెప్టెన్ ఇకపై వైస్ కెప్టెనే. పెళ్లి తర్వాత అనుష్కకి కెప్టెన్సీ వచ్చింది. కొత్త జంటకు శుభాకాంక్షలు` అని రితేష్ ట్వీట్ చేశాడు. వీరి జీవితం మరింత ఆనందమయం కావాలని రితేష్ ఆకాంక్షించాడు. From now onwards @imVkohli will happily be the vice captain at home ... hail the new captain @AnushkaSharma .... once again wish you a happy married life. pic.twitter.com/F6Eg5wFbtd — Riteish Deshmukh (@Riteishd) 11 December 2017 -
తిసారా పెరీరాకు వన్డే పగ్గాలు
భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంక కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా నియమితుడయ్యాడు. ఉపుల్ తరంగ స్థానంలో పెరీరాను నియమిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డేలతోపాటుగా టి20 జట్టుకూ పెరీరాయే కెప్టెన్‌గా ఉంటాడని వెల్లడించింది. 2009 డిసెంబర్లో అరంగేట్రం చేసిన పెరీరా ఇప్పటి వరకు 125 వన్డేలు ఆడి 108.26 స్ట్రయిక్ రేట్‌తో 1,441 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 32.62 సగటుతో 133 వికెట్లు తీశాడు. తరంగ నాయకత్వంలో శ్రీలంక జట్టు ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల చేతుల్లో వన్డే సిరీస్‌లను కోల్పోయింది. -
ధోని మమ్మల్ని లెక్క చేయలేదు!
⇒ అందుకే కెప్టెన్సీ నుంచి తప్పించాం ⇒ పుణే యజమాని గోయెంకా సంచలన వ్యాఖ్యలు పుణే: ఒక్క సీజన్లో జట్టు ప్రదర్శన బాగా లేకపోయినంత మాత్రాన ధోనిలాంటి దిగ్గజ కెప్టెన్‌ను ఎవరైనా తప్పిస్తారా! పుణే జట్టు అతడిని నాయకత్వ బాధ్యతలనుంచి తొలగించిన దగ్గరినుంచి అభిమానుల మదిలో ఇదే ప్రశ్న. మార్పు కోసమే అంటూ స్మిత్‌ను ఎంపిక చేయడంకంటే దీని వెనక మరో బలమైన కారణం ఉండవచ్చని అందరిలో సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా అనేక విషయాలు వెల్లడించారు. ధోని గురించి ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టు యజమానులైన తమను ధోని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని అర్థమవుతోంది. ఒక బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో గోయెంకా మాట్లాడుతూ...‘ధోని మాకు ఫోన్లో కూడా ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. ఫ్రాంచైజీ కీలక సమావేశాలకు కూడా అతను రాలేదు. అతనితో మాట్లాడాలనుకున్న ప్రతీసారి ఏజెంట్ అరుణ్ పాండే ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. గతేడాది లీగ్ సమయంలో అతను టీమ్ మీటింగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. ఇందులో చర్చించిన ఫీల్డింగ్‌ను ధోని మ్యాచ్‌లో పూర్తిగా మార్చేశాడు. అతను ఆ సమావేశంలో లేకపోవడం వల్ల ఏం జరిగిందో కూడా ధోనీకి తెలీదని ఒక సీనియర్ ఆటగాడు మాకు చెప్పాడు’ అని గోయెంకా కుండబద్దలు కొట్టారు. జట్టు నెట్ ప్రాక్టీస్‌లకు కూడా మహి హాజరు కాలేదని, లెగ్‌స్పిన్నర్ ఆడం జంపాను తుది జట్టులోకి తీసుకోమంటే తాను అతని ఆటను ఎప్పుడూ చూడలేదని చెప్పడం తమకు ఆశ్చర్యం కలిగించిందని పుణే యాజమాన్యం పేర్కొంది. దేశవాళీలో మంచి ప్రదర్శన లేకపోయినా ఫ్రాంచైజీపై ఒత్తిడి తెచ్చి సౌరభ్ తివారిని బలవంతంగా జట్టులోకి తీసుకోవడంతో పాటు టీమ్ జెర్సీ రంగు, డిజైన్‌కు సంబంధించి ధోని ఇచ్చిన సూచనలను యాజమాన్యం పట్టించుకోలేదు. క్రికెటేతర అంశాల్లో కూడా అతను జోక్యం చేసుకొనేంత అధికారం అతని చేతుల్లో ఇవ్వరాదని ఆర్పీజీ టీమ్ భావించింది. దాంతో మార్పు అనివార్యమంటూ జనవరిలోనే ధోనికి సమాచారం ఇవ్వగా, ‘మీరు ఏది సరైందని అనిపిస్తే అది చేయండి. ఇది మీ నిర్ణయం. నేను ఆటగాడిగానే ఉంటాను’ అని ధోని అప్పుడే చెప్పినట్లు తెలిసింది. ‘సామాన్య అభిమానులకు ఈ నిర్ణయం నచ్చదని మాకు తెలుసు. కానీ ఇదే సరైంది. నేను నిజాలను ఎప్పుడైనా మొహం మీదే చెప్పేస్తాను. ఫ్రాంచైజీ మేలు కోసమే ధోనిని తప్పించాం’ అని గోయెంకా స్పష్టం చేశారు. జార్ఖండ్ కెప్టెన్‌గా తొలిసారి.. ఐపీఎల్లో కెప్టెన్సీకి దూరమైన రెండు రోజులకే ధోని తన సొంత రాష్ట్రానికి నాయకుడిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 25నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ధోని జార్ఖండ్ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టును మంగళవారం ప్రకటించారు. భారత్‌కు 331 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, 143 ఐపీఎల్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని జార్ఖండ్‌కు తొలి సారి కెప్టెన్ కావడం విశేషం. గతేడాది కూడా ఈ టోర్నీ ఆడిన ధోని.. వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ఆడాడు. -
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా రూట్
లండన్: ఊహించినట్టుగానే స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఇంగ్లండ్ జట్టు టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో 0–4తో ఓటమి అనంతరం అలిస్టర్ కుక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కొత్త కెప్టెన్‌గా రూట్‌ను, వైస్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ను ఎంపిక చేసింది. ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 53 టెస్టులు ఆడిన రూట్ 11 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 4,594 పరుగులు సాధించాడు. -
సాఫ్ట్‌బాల్ కెప్టెన్‌గా అభిరామ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. బాలుర జట్టుకు అభిరామ్ రెడ్డి, బాలికల జట్టుకు అంజలి కెప్టెన్లుగా ఎంపికయ్యారు. శనివారం నుంచి ఈనెల 11 వరకు ఒడిశాలోని కటక్‌లో జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. జట్ల వివరాలు బాలురు: పి. అభిరామ్ రెడ్డి (కెప్టెన్), తిరుపతి, పి. మణికంఠ, ఆర్. బంతిలాల్, బి.సేవాలాల్, ఆర్. ప్రవీణ్, కె. గోపాల్, జె. కృష్ణారెడ్డి, కె. సురేందర్, ఆర్. హేమంత్, బి. బాలాజీ, బి. తరుణ్, ఎన్. శివప్రసాద్, ఏ. నితీశ్, జి.ధనుశ్, ఏ రాజ్‌కిషోర్, కె. నిఖిల్, బి. గౌత్మ్ కుమార్, ఎం. శ్రీకాంత్, బి. సంతోష్ (కోచ్). బాలికలు: బి. అంజలి (కెప్టెన్), జి. మమత, మయూరి, కె. సంస్కృతి, జి. ప్రమీల, ఎం. ప్రియరచన, వి. సరోజ, పి. అర్చన, జి. వినీల, కె. మౌనిక, పి. భాగ్యశ్రీ, బి. స్రవంతి, ఎస్కే హసియా బేగం, వై. నూతన, ఎం. జానవి, జి. నాగజ్యోతి, ఎం. ఝాన్సీ, ఎల్.అంజలి, ఎన్. కపిల్ వర్మ, రాజ్ కుమార్ (కోచ్). -
కోహ్లి ఎఫెక్ట్: కెప్టెన్‌గా ధోనీకి ఉద్వాసన?
ముంబై: ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో సీనియర్ సెలక్షన్ కమిటీ బాధ్యతలు చేపట్టి.. దాదాపు మూడు నెలలు అవుతోంది. ప్రస్తుతానికి సజావుగా సాగుతున్న సెలక్షన్ కమిటీకి ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఏమిటంటే.. మహేంద్రసింగ్ ధోనీని కెప్టెన్‌గా తప్పించడమే.. ప్రస్తుతం ధోనీ వన్డేలు, టీ-20లకు సారథిగా ఉన్నాడు. మరికొద్ది నెలల్లో ఈ పరిస్థితి మారిపోవచ్చు. ఇటు సారథిగానూ, అటు బ్యాట్స్‌మన్‌గానూ ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా విరాట్ రాణిస్తుండటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ధోనీని తప్పించి.. అన్ని ఫార్మెట్లలో కెప్టెన్సీ బాధ్యతలు విరాట్ కోహ్లికి అప్పగించక తప్పదని క్రికెట్ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండేళ్లుగా టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లి అసాధారణమైన ప్రతిభను చాటుతున్నాడు. నిజానికి కెప్టెన్ అయిన తర్వాతే కోహ్లి మరింత రాటుదేలాడా? అన్న సందేహం కలుగకపోదు అతని ఇటీవలి ఇన్నింగ్స్‌ను చూస్తే.. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ సమయం వచ్చిన ప్రతిసారి తనకు తానే సాటి అని కోహ్లి నిరూపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మరో రెండున్నరేళ్లలో ఇంగ్లండ్‌లో జరగనున్న వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహించాలన్నది కీలక ప్రశ్నగా మారింది. ‘ధోనీ కెప్టెన్‌గా కొనసాగించాలా? లేదా మార్పులు చేయాలా? అన్నది త్వరలోనే తేలిపోయే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌ళో చాంపియన్స్ ట్రోపీ నాటికి ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. అప్పుడే సెలక్టర్లు 2019 వరల్డ్ కప్ వరకు ఎవరు జట్టు సారథిగా ఉండాలో నిర్ణయించే అవకాశముంది’ అని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా సేవలు అందిస్తూ భారత్ క్రికెట్ జట్టును గమనిస్తున్న చోప్రా.. ధోనీ అంతర్జాతీయ కెరీర్ కొనసాగింపుపైనా నిశితమైన విశ్లేషణ చేశారు. ‘ఎంతటి ప్రతిభాశాలి క్రికెటర్ అయినా.. కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడి.. ఆ తర్వాత తెరమరుగై.. మళ్లీ ఆడటం అంటే చాలా కష్టమైన విషయం. ప్రస్తుతం టెస్టులు అధికంగా ఆడుతున్నారు. దీంతో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొన్న ధోనీ సుదీర్ఘకాలం జట్టులో కొనసాగడం కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి సామర్థ్యమున్న క్రికెటర్‌కు అయినా సత్తా చాటడం అంత సులువు కాదు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో టెస్టులకు అత్యున్నత ప్రమాణం ఉంది. క్రికెట్ పరంగా చూసుకుంటే వన్డేల కన్నా టెస్టులదే పైచేయి. ఈ నేపథ్యంలో ధోనీది చాలా క్లిష్టపరిస్థితే’ అని చోప్రా అభిప్రాయపడ్డారు. -
2019 ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా ధోని!
ఇంగ్లండ్‌లో 2019లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు తనలో క్రికెట్ ఆడే సత్తా ఉందని ధోని గతంలో అనేకమార్లు చెప్పాడు. భారత సెలక్టర్లు కూడా దీనితో అంగీకరించినట్లు కనిపిస్తోంది. వచ్చే ప్రపంచకప్ వరకు భారత జట్టు కెప్టెన్‌గా ధోనిని కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లతో సమానంగా ధోని ఫిట్నెస్ ఉంది. ధోని జట్టుతో కొనసాగితే సెలక్టర్ల పని కూడా సులభమవుతుంది. ఎప్పుడు రిటైర్ అవ్వాలో అతనికే బాగా తెలుసు. ఏవైనా గాయాలైతే తప్ప వచ్చే ప్రపంచకప్ వరకూ తను జట్టుతోనే ఉంటాడు’ అని ఒక సెలక్టర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. -
మహిళా టి20 కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళల టి20 కెప్టెన్‌గా మిథాలీ రాజ్ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను నియమించారు. విండీస్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్, ఆసియాకప్ టి20 టోర్నీల కోసం మహిళా జట్లను ప్రకటించారు. వెస్టిండీస్‌తో వచ్చే నెల 18 నుంచి జరిగే టి20 సిరీస్‌తో పాటు నవంబర్ 27 నుంచి థాయ్‌లాండ్‌లో ప్రారంభమయ్యే ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌కు హర్మన్‌ప్రీత్ సారథిగా వ్యవహరిస్తుంది. అయితే వచ్చే నెల 10 నుంచి 16 వరకు వెస్టిండీస్‌తోనే జరిగే మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం మిథాలీ రాజ్ కెప్టెన్‌గా కొనసాగుతుంది. మ్యాచ్‌లన్నీ విజయవాడ సమీపంలోని మూలపాడులో జరుగుతాయి. -
కోహ్లికి ముందు ముగ్గురు!
-
కోహ్లికి ముందు ముగ్గురు!
ఇండోర్: పరుగుల యంత్రాన్ని తలపిస్తూ ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం సాధించిన కోహ్లి..భారత తరపున టెస్టుల్లో అత్యధికంగా సెంచరీలు చేసిన కెప్టెన్లలో నాల్గోవాడిగా నిలిచాడు. 191బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్ లో 13 వ సెంచరీ కాగా, భారత కెప్టెన్ గా ఆరో సెంచరీ. ఈ తాజా సెంచరీతో టైగర్ పటౌడీ ఐదు సెంచరీల కెప్టెన్సీ రికార్డు ను అధిగమించిన కోహ్లి.. మరో ఆరు సెంచరీలు చేస్తే సునీల్ గవాస్కర్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమిస్తాడు. ఇప్పటి వరకూ భారత తరపున కెప్టెన్లగా చేసిన వారిలో గవాస్కర్ 11 శతకాలతో తొలి స్థానంలో ఉండగా, ఆ తరువాత మహ్మద్ అజహరుద్దీన్ 9 సెంచరీలతో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లికి ముందు స్థానంలో సచిన్ టెండూల్కర్ 7 శతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ ముగ్గురు మాజీ కెప్టెన్లలో అధిగమించడానికి కోహ్లి మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చినా , వారి రికార్డును బద్దలు కొట్టడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. గవాస్కర్ తన కెరీర్ లో 47 టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్ గా చేయగా, 74 ఇన్నింగ్స్ ల్లో 11 శతకాలు సాధించాడు. అయితే మహ్మద్ అజహరుద్దీన్ 47 మ్యాచ్ ల్లో 68 ఇన్నింగ్స్ ల్లో 9 సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ 25 టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరించి 43 ఇన్నింగ్స్ ల్లో 7 శతకాలు సాధించాడు. ప్రస్తుతం 17వ టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ గా చేస్తున్న కోహ్లి.. 26 ఇన్నింగ్స్ ల్లో ఆరు సెంచరీలను నమోదు చేయడం విశేషం. ఇదిలా ఉండగా, భారత్ లో కెప్టెన్ గా కోహ్లికిదే తొలి సెంచరీ. మరోవైపు న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో విరాట్ ఖాతాలోనే తొలి సెంచరీ చేరింది. అంతకుముందు ఈ సిరీస్ లో పూజారా చేసిన 87 పరుగులే కోహ్లి సెంచరీ కంటే ముందు అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భాగంగా ఆంటిగ్వా మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కోహ్లి.. ఆ తరువాత మోస్తరుగా రాణించాడు. ఆ డబుల్ సెంచరీ తరువాత కోహ్లి ఏడు ఇన్నింగ్స్ లను పరిశీలిస్తే అతని స్కోర్లు 44,3, 4,9, 18, 9, 45గా ఉన్నాయి. -
టీమిండియాకు బాస్ అతనే: అనిల్ కుంబ్లే
బెంగళూరు: టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఆయన. అంతేకాకుండా కెప్టెన్‌గా, జట్టు సభ్యుడిగా కూడా సేవలందించారు. 18 ఏళ్ల క్రికెట్లో కొనసాగి.. అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరొందిన ఆయనే అనిల్ కుంబ్లే. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా కుంబ్లే సరికొత్త అవతారంలో జట్టుకు సేవలందిస్తున్నారు. కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా టీమిండియాతో కలిసి ఆయన వెస్టిండీస్‌లో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకొని టీమిండియా భారత్ చేసుకున్న నేపథ్యంలో ఆయన ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కోచ్‌గా తన తొలి అసైన్మెంట్ ఫలప్రదంగా ముగిసిందని, వెస్టిండీస్‌లో టీమిండియా చక్కని ప్రదర్శన కనబర్చిందని కుంబ్లే ఆనందం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలతో పోల్చుకుంటే వెస్టిండీస్ పర్యటన అంత కష్టసాధ్యంగా ఉండదని, అయినప్పటికీ వెస్టిండీస్ తన అసైన్మెంట్ తొలి కావడం మంచిదేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఇన్నాళ్ల తన కెరీర్లో చాలామంది కోచ్‌లను చూశానని, అయితే, ఎక్కువకాలం కలిసి పనిచేయడంతో కోచ్‌గా జాన్ రైట్ తనపై ప్రభావం చూపించారని, ఆయన స్ఫూర్తి తనపై ఉండొచ్చునని చెప్పారు. జాన్ రైట్ జట్టు వెనుక ఉండి చెప్పిన విషయాలను ఇప్పుడు తాను కూడా చెప్తున్నట్టు గుర్తుచేసుకున్నారు. టీమిండియాకు సంబంధించినంతవరకు బాసే కెప్టెన్ అని, అతనికి సహకారం అందించడం, నిర్ణయాలు తీసుకునేందుకు, వ్యూహాలు రచించేందుకు అండగా నిలబడటం కోచ్ బాధ్యత అని చెప్పారు. ప్రస్తుత జట్టు ఎంతో నిబద్ధతతో ఆడుతోందని, ఎంతో నైపుణ్యంతో జట్టు సభ్యులు అద్భుతంగా ఆడుతున్నారని, దీంతో కోచ్‌గా తనకు ఎంతో అనువైన వాతావరణం ఉందని వివరించారు. -
హైదరాబాద్ కెప్టెన్‌గా ఆశిష్ రెడ్డి
బుచ్చిబాబు క్రికెట్ టోర్నీకి జట్టు ఎంపిక సాక్షి, హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌కు హైదరాబాద్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు ఆశిష్ రెడ్డి కెప్టెన్‌గా, తన్మయ్ అగర్వాల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. 2016-17 సీజన్లో ఇదే తొలి టోర్నీ. వచ్చే నెల 5 నుంచి 18వ తేదీ వరకు చెన్నైలో ఈ టోర్నీ జరుగుతుంది. ఎంపికైన జట్టు సభ్యులందరూ ఆదివారం ఉదయం 9 గంటలకల్లా ఉప్పల్ స్టేడియంలో కోచ్ అర్జున్ యాదవ్‌కు రిపోర్టు చేయాలి. జట్టు: ఆశిష్ రెడ్డి (కెప్టెన్), అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, బి. సందీప్, కొల్లా సుమంత్, మెహదీ హసన్, విశాల్ శర్మ, ఆకాశ్ భండారి, సి.వి.మిలింద్, రవి కిరణ్, సిరాజ్, డానీ డెరిక్ ప్రిన్స్, బెంజమిన్ థామస్, యతిన్ రెడ్డి, హబీబ్ అహ్మద్; స్టాండ్‌బైస్: ముదస్సిర్ హుస్సేన్, టి. రవితేజ, పి.సాకేత్ సాయిరామ్, రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్, కోచ్: అర్జున్ యాదవ్, అసిస్టెంట్ కోచ్: జకీర్ హుస్సేన్, మేనేజర్: సూర్యప్రకాశ్. -
కెప్టెన్‌గా అంజలిశర్వాణి
కడప స్పోర్ట్స్: కడప నగరంలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన సౌత్‌జోన్ అంతర్ జిల్లాల సీనియర్ మహిళా క్రికెట్ పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారిణులను ఎంపికచేసి సౌత్‌జోన్ జట్టునుశనివారం ప్రకటించారు. 5 (కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం) జిల్లాల జట్ల నుంచి క్రీడాకారిణులను ఎంపికచేయగా కర్నూలు క్రీడాకారిణి అంజలి శర్వాణిని సౌత్‌జోన్ కెప్టెన్‌గా నియమించారు. ఎంపికైన జట్టు రాష్ట్రస్థాయిలో సత్తాచాటాలని సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సౌత్‌జోన్‌జట్టు : కె. అంజలిశర్వాణి (కెప్టెన్) కర్నూలు, డి. ప్రవళ్లిక (వైస్ కెప్టెన్) చిత్తూరు. ఎన్. అనూష, వి. అనూషారాణి (కర్నూలు), కె.మాధురి (నెల్లూరు), పి.పల్లవి (అనంతపురం), ఎన్.రోజా, వికెట్‌కీపర్ (కడప), జి.శరణ్య (కర్నూలు), జి.చంద్రలేఖ (కర్నూలు), ఎస్. నాగమణి (కడప), బి.యామిని (నెల్లూరు), ఎ.శ్రీలక్ష్మి (కడప), జి.శరణ్య (చిత్తూరు), బి. అనూష (అనంతపురం), ఎన్. మౌనిక(కడప), ఇ. పద్మజ (చిత్తూరు). స్టాండ్‌బై : జి. సింధుజ (నెల్లూరు), కె. ఓబులమ్మ (కడప), కె.హంస (చిత్తూరు), సీహెచ్ అనూష (చిత్తూరు), వి.శ్రావణి (కర్నూలు). జట్టు మేనేజర్ కమ్ కోచ్‌గా పద్మావతి వ్యవహరించనున్నారు. -
శల్యసారథ్యం చేయవద్దు!
భారతదేశంలో రాజై ఉండి సారథ్యం చేయవలసిన అవసరం లేనివాళ్లు ఇద్దరే. కృష్ణుడు, శల్యుడు. అయినా వాళ్లిద్దరూ సారథ్యం నేర్చుకున్నారు. అద్భుతంగా రథం నడిపేవారు. కృష్ణుడు సారథ్యం చేసినా పొగడ్తలకు లొంగలేదు. అందుకే పార్థసారథి బిరుదు వహించాడు. పార్థసారథికి దేవాలయం కూడా ఉంది. భారతం కూడా ఏమంటుందంటే యత్ర యోగీశ్వరః కృష్ణో, యత్రపార్థో ధనుర్ధరః తత్రశ్రీ ర్విజయో భూతిర్ ధ్రువా నీతి ర్మతిర్మమ ... ఎక్కడ కృష్ణుడు సారథిగా ఉన్నాడో, ఎక్కడ మనం రథిగా ఉన్నామో అక్కడ విజయం ఉంటుంది - అని. మరి శల్యుడో..! ఆయన కృష్ణుడి కన్నా తక్కువేం కాదు. తక్కెట్లో పెడితే సరి సమానంగా తూగుతారు. సారథ్యంలో అంత గొప్పవాడు శల్యుడు. పైగా పాండవులకు మేనమామ. కురుక్షేత్ర యుద్ధం వస్తున్నదని తెలుసుకుని పాండవులకు సాయం చేద్దామని బయల్దేరాడు. ఆయన రాజ్యం ఇప్పటి ఆప్ఘనిస్థాన్ ప్రాంతంలో ఎక్కడో ఉండేది. దుర్యోధనుడు ఇది గ్రహించాడు. శల్యుడు పొగడ్తలకు లొంగిపోయేవాడని తెలుసు. శల్యుడు వచ్చాడంటే పాండవుల పక్షం వహిస్తాడని-శల్యుడు పరివారంతో సహా వచ్చే మార్గమంతటా వారు సేదదీరడానికి చలువ పందిళ్లు వేయించాడు, పాటలు పెట్టించాడు, మధురాన్నాలు చేయించాడు... ఇలా చాలా ఏర్పాట్లు చేయించాడు. ఇవి ఎవరు చేయిస్తున్నారో శల్యుడికి తెలియదు. పాండవులే చేయిస్తున్నారనుకున్నాడు. ‘‘పాండవులు కనబడరేం’’ అన్నాడు. వెంటనే దుర్యోధనుడు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ’’మీరు మహానుభావులు, మీలాంటి సారథి ఎక్కడ ఉన్నాడు కనుక, విలాస విద్య అంత గొప్పగా నేర్చుకున్నారు, మీలాంటి ఉత్తములు ఎక్కడ దొరుకుతారు. పాండవులకు మేనమామ అయితే నాకు కాదా? ఆ గౌరవంతోనే వచ్చాను. ఇవన్నీ చేయడం నా అదృష్టం’’ అంటూ ఆకాశానికెత్తేసాడు. పొంగిపోయాడు శల్యుడు. పాండవులకు సహాయం చేద్దామని బయల్దేరినవాడు ఈ పొగడ్తలకు లొంగిపోయి, ‘‘నీకేం కావాలో చెప్పు. ఇచ్చేస్తా’’ అన్నాడు. చటుక్కున దుర్యోధనుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, ’’మీరు మా పక్షాన ఉండండి’’ అనడిగాడు. ’’ఓ తప్పకుండా ఉంటాను’’ అన్నాడు. పొగిడాడు కదూ, మత్తు.. పరమ ప్రమాదకరమైన మత్తు. ‘‘తప్పకుండా వస్తా. మీ పక్షంలోనే ఉంటా’’ అని చెప్పాడు. దుర్యోధనుడు వెళ్లిపోయాడు. వెళ్లవలసింది పాండవుల ఇంటికి కదూ, శల్యుడు వెళ్లాడు అక్కడికి. ధర్మరాజు అంత కన్నా తెలివైనవాడు. అమిత వినయంగా ప్రవర్తించాడు. అన్నిటి కన్నా పైస్థానంలో కూర్చోబెట్టాడు. లోకంలో అన్నిటి కంటే ఎక్కువ మత్తెక్కించే మాట ఒకటుంది... ‘‘మీరు చెప్పకపోతే ఎవరు చెపుతారు సార్!’’ దానితో వాడికేం తెలియకపోయినా చెప్పడం మొదలెడతాడు నాలాగా. అందుకే ‘‘మీరు చెప్పండి. మేం వింటాం’’ అన్నారు పాండవులు. శల్యుడు చెప్పడం మొదలెట్టాడు. చాలానే చెప్పాడు. అవన్నీ తెలిసిన విషయాలే అయినా ఏమీ తెలియనివాళ్లలా పాండవులు విన్నారు. పొంగిపోయాడు. ఏం కావాలని అడిగాడు. ‘‘మిమ్మల్ని ఇబ్బందిపెట్టం. మీరు ఇప్పటికే కౌరవుల పక్షం వహిస్తానని చెప్పి మాటిచ్చారు కదా! అందుకే మీరు వారి పక్షంలోనే ఉండండి. కానీ మనసు మామీద పెట్టండి. మీ మేనల్లుడు పాండవుల్లో ఉన్నాడు. మేం గెలిచేటట్లు చూడండి. ఇది గుర్తు పెట్టుకోండి చాలు’’ అన్నారు. ‘‘ఓ తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను’’ అన్నాడు, శల్యుడు. మనసు పాండవుల దగ్గర, మనిషి కౌరవుల దగ్గర. యుద్ధానికి బయల్దేరాడు. నిజంగా మనసుపెట్టి చెయ్యగలడా? కర్ణుడికి సారథ్యం వహించమన్నాడు దుర్యోధనుడు. కోపమొచ్చింది శల్యుడికి. ఏమిటి, కర్ణుడికా, చెయ్యనుపోండి, అన్నాడు. మళ్ళీ పొగిడాడు దుర్యోధనుడు. తప్పకుండా చేస్తానన్నాడు. ఇక సారథ్యం వహిస్తూ ముందుకెడుతున్నాడు. కానీ మనసు పాండవుల మీద ఉంది. కర్ణుడితో ‘నువ్వు కాకివి’ అన్నాడు. పాండవులు హంసలాంటి వారన్నాడు. అర్జునుడితో యుద్ధం చేయడానికి నీకున్న అర్హతలేమిటన్నాడు, అర్జునుడి ముందు నీ శక్తి ఏ పాటిదన్నాడు. ఇలా తిడుతుంటే కర్ణుడు తెలిసిన అస్త్రాలు కూడా మర్చిపోయాడు. ఇదెక్కడి ప్రారబ్ధం, ఇదెక్కడి సారథ్యం అనుకున్నాడు కర్ణుడు. దీనినే శల్య సారథ్యం అంటారు. అంటే అటువంటివాడు మన పక్షంలో ఉన్నా ఎదుటి పక్షానికి ఉపకారం చేసి మన నాశనానికి కారణమౌతాడు. చివరకు కర్ణుడు చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు కూడా ఒకడయ్యాడు. ఎందుకొచ్చిందీ ప్రారబ్ధం శల్యుడికి? దుర్యోధనుడితో ముందే ‘‘నువ్వెన్ని చెప్పు. కావాలంటే నువ్వు చేసిన ఏర్పాట్ల ఖర్చంతా ఇచ్చేస్తాను. నేను ఎందుకు బయల్దేరానో, ఆ పని వదిలిపెట్టి ఇంకో పనిమీద రాను’’ అని తెగేసి చెప్పి ఉండొచ్చు. అలా అనగలిగాడా? పొగడ్తలకు లొంగిపోయాడు. అలా అనలేకపోయాడు. రెండు చోట్ల అదీ వైరిపక్షాల్లో మాటిచ్చాడు. ఏమయిపోయాడు? అందుకే మాటకు నిలబడడం రావాలి. పొగడ్తలను ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి. అంతకన్నా ఎక్కువ పుచ్చుకున్నారనుకోండి. అది అలవాటు చేసుకుంటే పాడైపోతారు. ఇది శీలవైభవం. మీరు ఎక్కడ ఉన్నా శాంతిగా ఉండాలి. మీరు పిల్లలుగా ఉంటే తల్లిదండ్రులు సంతోషపడాలి, మీరు తల్లిగా ఉంటే మీ పిల్లలు ఆనందించాలి, మీరు క్లాస్‌రూమ్‌లో ఉంటే క్లాస్ టీచర్ సంతోషపడాలి, మీరు స్నేహితుడిగా ఉంటే మీ స్నేహితులందరూ సంతోషించాలి, మీరు భార్యగా ఉంటే మీ భర్త మిమ్మల్ని చూసి గర్వపడాలి...ఇలా మీరు ఏ స్థానంలో ఉంటే అది చూసి అవతలివారు పొంగిపోవాలి. అలా శీలవైభవాన్ని అందరూ అలవర్చుకున్ననాడు సమాజం సుభిక్షంగా ఉంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తండ్రి కాబోతున్న క్రికెటర్!
భారత క్రికెటర్ సురేశ్ రైనా ఆనందాల జల్లులో తడిసిముద్దవుతున్నాడు. ఐపీఎల్ లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా అయినప్పటి నుంచి అదృష్ట దేవత రైనా చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజా ఐపీఎల్లో రైనా నాయకత్వం వహిస్తున్న గుజరాత్ జట్టు ఇప్పుడు టాప్ పోజిషన్ లో ఉంది. అదే సమయంలో అతన్ని మరో స్వీట్ న్యూస్ ఊరిస్తోంది. రైనా తండ్రి కాబోతున్నడు. త్వరలోనే రైనా భార్య ప్రియాంక తమ మొదటి బిడ్డను ప్రవవించబోతున్నది. ఈ శుభసందర్భంగా అతను ఐపీఎల్ నుంచి విరామం తీసుకొని తన భార్యను కలిసేందుకు హాలాండ్ కు బయలుదేరాడు. 'హాలాండ్‌కు బయలుదేరాను. రేపు నా భార్యను కలువబోతున్నాను. ఇప్పుడు నాకెంతో ఎక్సైటింగ్‌గా ఉంది' అని రైనా తెలిపాడు. ఆదివారం కోల్‌కతా ఈడెన్స్ గార్డెన్స్‌లో నైట్ రైడర్స్ జట్టును గుజరాత్ టీమ్ చిత్తుగా ఓడించిన తర్వాత కెప్టెన్ రైనా ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు. అదేవిధంగా ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ, భార్య ఫొటోలను పోస్టుచేసి.. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపాడు. #happymothersday ❤️mom❤️and to future mom can't wait to see you both -
రైనా విజయం వెనుక ఎవరున్నారో తెలుసా?
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని చెప్తారు. అదేవిధంగా ఐపీఎల్లో కెప్టెన్‌గా తన విజయం వెనుక ఓ మహిళ ఉందని చెప్తున్నాడు టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా. ఇప్పటివరకు ఐపీఎల్లో మహేంద్రసింగ్ ధోనీ నీడలో ఒదిగిపోయాడు రైనా. గత ఎనిమిది ఐపీఎల్ సరీస్లోనూ సారథి ధోనీ చెప్పిన మాట వింటూ.. జట్టు అవసరాలకు ఆదుకుంటూ, పెద్దగా వెలుగులోకి రాకుండా, పెద్దగా మెరుపులు మెరిపించకుండానే బండి లాక్కొచ్చాడు రైనా. కానీ, తాజా ఐపీఎల్లో రైనాను సరికొత్త బాధ్యతలు వరించాయి. రాజ్‌కోట్‌కు చెందిన కొత్త ఐపీఎల్ జట్టు గుజరాత్ లయన్స్‌కు సారథిగా రైనా పగ్గాలు చేపట్టాడు. కొత్త జట్టు అయినప్పటికీ విజయవంతంగా నడిపిస్తూ వరుస విజయాలు సాధిస్తూ సారథిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు రైనా. ఐపీఎల్ 9వ సీరిస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ నాలుగు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఐపీఎల్ రైనా కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. డ్వేన్ బ్వేవో, న్యూజిల్యాండ్ మాజీ కెప్టెన్ బ్రండన్ మెక్‌కలమ్ రైనా సారథ్యాన్ని కొనియాడారు. 'ఒత్తిడిలోనూ దృఢచిత్తంతో శాంతంగా కనిపిస్తున్నాడు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు' అంటూ మెక్‌కలమ్ రైనాను పొగడ్తల్లో ముంచెత్తాడు. తనలో ఈ మార్పునకు కారణమేమిటంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.. తన భార్య ప్రియాంకకు ఆ క్రెడిట్ కట్టబెడుతున్నాడు రైనా. ఐపీఎల్లో కెప్టెన్‌గా తన విజయం వెనుక తన సతీమణి ఉందని చెప్తున్నాడు. 'నా పెళ్లి తర్వాత నేను చాలా మెరుగయ్యాను. శాంతంగా, బాధ్యతాయుతంగా ఉండటం నేర్చుకున్నాను' అని రైనా ఐపీఎల్‌టీ20.కామ్‌కు తెలిపాడు. గత ఏడాది ఏప్రిల్‌లో తన బాల్య స్నేహితురాలు ప్రియాంకను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు రైనా. ఇప్పటివరకు వరుసగా ఐపీఎల్ సిరీస్‌లన్నింటిలోనూ ఆడుతూ వస్తున్న రైనా ఈసారి కొన్ని మ్యాచ్‌లు మిస్సయ్యే అవకాశముంది. నెదర్లాండ్స్‌లో తన భార్య తమ మొదటి బిడ్డను ప్రసవించనున్న నేపథ్యంలో రైనా అక్కడి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
'నేను కెప్టెన్‌గా ఫిట్ కాను'
మొహాలి:వరల్డ్ ట్వంటీ 20లో ఆస్ట్రేలియాపై ఓటమి అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను అసలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా చేయడానికి అర్హుడిని కానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టుకు సారథ్యం వహించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి లోను కావడమే ఇందుకు కారణమన్నాడు. అయితే పాక్ కు కెప్టెన్ చేయడాన్ని ఎంజాయ్ చేశానన్నాడు. కాగా, ఆసీస్‌తో జరిగిన మ్యాచే తనకు చివరి మ్యాచ్ అంటూ వార్తలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆఫ్రిది స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. పాకిస్తాన్లో దేశ ప్రజల సమక్షంలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. నాలుగైదు రోజుల్లో స్వదేశానికి చేరతామని, ఆ తరువాతే తన రిటైర్మెంట్పై నిర్ణయం వెలువరిస్తానన్నాడు. పాకిస్తాన్ జట్టుకు దేనివల్ల మంచి జరుగుతుందో అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆఫ్రిది స్పష్టం చేశాడు. కోల్ కతాలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌కు పాకిస్తాన్ నుంచి, కశ్మీర్ నుంచి వచ్చి తమ జట్టుకు మద్దతు తెలిపిన వారికి ఆఫ్రిది కృతజ్ఞతలు తెలిపాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 21పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తద్వారా టోర్నీలో మూడో పరాజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ వరల్డ్ టీ 20 నుంచి నిష్క్రమించింది. -
సర్దార్కే సారథ్యం
అజ్లాన్ షా హాకీ టోర్నీకి భారత జట్టు న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) వారికి దశలవారీగా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా ఏప్రిల్ 6 నుంచి 16 వరకు మలేసియాలో జరిగే సుల్తాన్ అజ్లాన్ షా కప్‌లో పాల్గొనే భారత జట్టులో ఏకంగా ఏడుగురు సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. సర్దార్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అజ్లాన్ షా కప్‌లో భారత్‌తోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జపాన్, కెనడా, మలేసియా జట్లు బరిలో ఉన్నాయి. -
బీజేపీ రథసారధి ఎన్నికకు రంగం సిద్ధం
-
టీడీపీ ప్రచార సారథి లోకేష్
-
టీడీపీ ప్రచార సారథి లోకేష్
► 24 నుంచి ‘గ్రేటర్’ఎన్నికల ప్రచారం ► చంద్రబాబు ప్రచారంపై నీలినీడలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రచారకుడిగా ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వ్యవహరించనున్నారు. సెటిలర్లను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా లోకేష్‌తో వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించేలా చంద్రబాబు తెలంగాణ నేతలకు మార్గదర్శనం చేశారు. ‘గ్రేటర్’ ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ 92 సీట్లలో పోటీ చేస్తోంది. ఫిబ్రవరి 2న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమం ఈనెల 31తో ముగుస్తుంది. దీంతో మిగిలిన తొమ్మిది రోజుల్లో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమానికి గాను ఈనెల 24వ తేదీ నుంచి లోకేష్ ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. 31వ తేదీ వరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రూపొందిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం వల్ల తెలంగాణ ఓట్లు రావని బీజేపీ భయపడుతుండడంతో ఆ బాధ్యతలను లోకేష్‌కే అప్పజెప్పనున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 28,29,30 తేదీల్లో చంద్రబాబు రోడ్‌షోలు ఉండాలి. కానీ బీజేపీ అభ్యంతరాలు, తెలంగాణ ఓటర్ల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని బాబు ప్రణాళిక మారే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. కింగ్‌మేకర్ అవుతాం: లోకేష్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీడీపీ అభ్యర్థులతో లోకేష్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రచార సీడీలను కూడా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈనెల 24 నుంచి 31 వరకు తాను ప్రచారంలో పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కింగ్‌మేకర్ అవుతుందన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి విజయం తథ్యమని, ప్రజలు తమ పక్షానే ఉన్నారన్నారు. ప్రజలు సీఎం కేసీఆర్‌ను నమ్మడం లేదని, అందుకే మంత్రి కేటీఆర్‌ను ప్రచారంలో ముందుకు తెచ్చారన్నారు. కేటీఆర్ వంద డివిజన్లు గెలుస్తామని చేసిన సవాల్‌కు రేవంత్‌రెడ్డి స్పందించారని, వంద గెలవకపోతే మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, ఆర్. కృష్ణయ్య, మాజీ మంత్రులు ఉమా మాధవరెడ్డి, పి. రాములు, తెలుగుయువత అధ్యక్షుడు టి. వీరేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'అప్పుడే కెప్టెన్ అయ్యేవాడిని'
న్యూఢిల్లీ: ద్రవిడ్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సమయంలో తాను జట్టులో సభ్యుడిని కాదని, లేదంటే అప్పుడే తాను టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యేవాడినని వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కనీసం రెండేళ్లు తాను కొనసాగేవాడినని అతను గుర్తు చేసుకున్నాడు. భవిష్యత్తులో కోచ్, మెంటార్ లేదా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు వీరూ చెప్పాడు. తాను ఇప్పటికే చాలా డబ్బు సంపాదించానని, ఇకపై కూడా సంపాదించగలను కాబట్టి ఐపీఎల్లో మరో ఆటగాడి అవకాశం దెబ్బ తీయరాదనే తప్పుకున్నట్లు అతను చెప్పాడు. ధోనితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశాడు. -
ఇండియా ‘ఎ’ కెప్టెన్‌గా రాయుడు
దేవధర్ ట్రోఫీ న్యూఢిల్లీ: దేవధర్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘ఎ’ జట్టుకు అంబటి తిరుపతి రాయుడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఇండియా ‘ఎ’తో పాటు ఇండియా ‘బి’, విజయ్ హజారే ట్రోఫీ చాంపియన్ గుజరాత్ జట్లు తలపడుతాయి. ఢిల్లీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ ఇండియా ‘బి’కి సారథ్యం వహించనున్నాడు. ట్రోఫీలో ఐదు రోజుల్లో నాలుగు వన్డేలు జరుగుతాయి. రాయుడు నేతృత్వంలోని ‘ఎ’ జట్టులో మురళీ విజయ్, అమిత్ మిశ్రా, రసూల్, ఓజా, ఆరోన్ తదితరులుండగా... ‘బి’ జట్టులో రంజీ ట్రోఫీ టాప్ రన్ స్కోరర్ శ్రేయాస్ అయ్యర్‌తో పాటు షెల్డన్ జాక్సన్, కరణ్ శర్మ, మయాంక్ అగర్వాల్ లాంటి యువ ఆటగాళ్లు బరిలోకి దిగబోతున్నారు. -
సచిన్ కెప్టెన్సీలో షోయబ్ అక్తర్
-
సచిన్ కెప్టెన్సీలో షోయబ్ అక్తర్
న్యూయార్క్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సచిన్ కెప్టెన్సీలో క్రికిట్ ఆడబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు. అమెరికాలోని న్యూయార్క్, హ్యూస్టన్, లాస్ ఎంజిల్స్లలో జరగనున్న మూడు టీట్వంటీ ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో సచిన్ జట్టులో అక్తర్ ఆడనున్నాడు. టాస్ వేయడం ద్వారా ఆటగాళ్లను సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు పంచుకున్నాయి. ఈ సందర్భంగా అక్తర్‌కు సచిన్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. దీనిపై అక్తర్ మాట్లాడుతూ.. 'థ్యాంక్ గాడ్ సచిన్ జట్టలో క్రికెట్ ఆడబోతున్నాను, అతని కెప్టెన్సీని నేనెప్పుడూ దగ్గరగా చూడలేదు' అని సంతోషం వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల సందర్భంగా గతంలో సచిన్‌కు ప్రత్యర్థిగా బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఆల్ స్టార్స్ టోర్నీలో మ్యాచ్ సందర్భంగా తనకు సచిన్ ఎలాంటి సలహాలు, వ్యూహాలు అందిస్తాడో చూడాలని ఆతృతగా ఉన్నాడు. సచిన్‌కు బౌలింగ్ చేస్తే చూడాలని ప్రజలు కోరుకుంటారని తెలుసు గానీ తనకు మాత్రం అతని కెప్టెన్సీలో ఆడాలని ఉన్నట్లు తెలిపాడు. -
ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు
టీ మిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వాణిజ్య పత్రికలో ఫ్రంట్ పేజి పై ఒక చేత్తో బూటు పట్టుకొని విష్ణు మూర్తి అవతారం లో ఉన్న ధోనీ ఫోటో ముద్రించారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ.. గత ఫిబ్రవరిలో విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ధోనితో పాటు.. పత్రిక ఎడిటర్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తాజాగా.. నవంబర్ 7న ధోనీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే వివాదానికి దారితీసిన ఈ పత్రిక 2013 ఏప్రిల్ లో విడుదల అయ్యింది. ఇక మరో వైపు ఇదే ఫోటో పై కర్ణాటకలోని ఓ సంఘ సేవకుడు జయకుమార్ హిరామత్ సైతం కోర్టులో కేసు వేసాడు. -
కెప్టెన్ వీరరాజారెడ్డి స్మృతికి 12 ఏళ్లు
-
'ఆటగాడిగా ఉన్నా సంతోషమే'
మిర్పూర్: ఆటకైనా, మాటకైనా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునే టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఘోర ఓటమిని చవిచూసి సిరీస్ ను కోల్పోయిన టీమిండియాపై విమర్శలు ఇంకా ఊపందుకోకముందే ధోనీ తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాడు. అవసరమైతే టీమిండియా కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. 'కెప్టెన్సీ నుంచి బయట రావడాన్ని కూడా ఆస్వాదిస్తా. భారత క్రికెట్ టీమ్ లో ఏ విధమైన చెడు జరిగినా అందుకు నేను కూడా ఒక బాధ్యుణ్నే. బోర్డు పెద్దలు నన్ను ఆటగాడిగా పరిమితం చేసినా ఇబ్బందేమీ లేదు' అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమి పాలైన అనంతరం ధోనీ మాట్లాడుతున్న సమయంలో ఊహించని ప్రశ్న ఒకటి ఉక్కిరిబిక్కిరి చేసింది. టీమిండియా కెప్టెన్ గా ఎంతకాలం కొనసాగవచ్చని అనుకుంటున్నారు?అని ధోనీని అడగ్గా.. ప్రస్తుతం అయితే కెప్టెన్ గా ఉన్నా.. భవిష్యత్తులో జరిగే పరిస్థితులైతే తనకు తెలియదన్నాడు. 'నేను క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నా. క్రికెట్ కెప్టెన్ గా ఎంతకాలం ఉంటారని ప్రశ్న ఏదో ఒక రోజు వస్తుందనే విషయం నాకు తెలుసు. నన్ను మీడియా ప్రేమించింది. నా వల్లే టీమిండియా ఓడిపోతుందని మీరు భావించినట్లైయితే.. నేను కెప్టెన్ గా తప్పుకుంటే టీమిండియా క్రికెట్ అభివృద్ది చెందుతుందని మీరు నిర్ణయిస్తే తప్పకుండా ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతా' అని ధోనీ స్పష్టం చేశాడు. జట్టుకు ఎవరు కెప్టెన్ అనేది ఎప్పుడూ సమస్య కానే కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు. ఆటగాడిగానైనా జట్టులో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని ధోనీ తెలియజేశాడు. -
ప్రపంచకప్ ఎలెవన్‌కు కెప్టెన్ మెకల్లమ్
దుబాయ్: ఐసీసీ ప్రపంచకప్ ఎలెవన్ జట్టులో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ జట్టుకు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్ సారథి క్లార్క్ కాకుండా న్యూజిలాండ్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ‘దూకుడైన ఆటతీరే కాకుండా వినూత్న, స్ఫూర్తిదాయక నాయకత్వంతో ఈ మెగా టోర్నీలో మెకల్లమ్ ఆకట్టుకున్నాడు. అందుకే ఈ జట్టుకు అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశాం’ అని ఐసీసీ తెలిపింది. టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో రాణించిన ఆటగాళ్లను పలువురు క్రీడా నిపుణులు కలిసి ఓ జట్టుగా ఎంపిక చేశారు. ప్రపంచకప్ ఎలెవన్ జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), గప్టిల్, స్మిత్, అండర్సన్, వెటోరి, బౌల్ట్, సంగక్కర (వికెట్ కీపర్), డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, స్టార్క్, మోర్కెల్, బ్రెండన్ టేలర్ (12వ ఆటగాడు). -
కెప్టెన్సీ విషయంలో నిరాశ చెందా
తనని ఎక్కువకాలం కొనసాగించలేదన్న సచిన్ న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు కెప్టెన్‌గా మాత్రం చేదు అనుభవాలే ఉన్నాయి. అయితే తనను ఎక్కువ కాలం ఈ బాధ్యతలో కొనసాగించనందుకు తీవ్రంగా నిరాశ చెందానని మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా తన 24 ఏళ్ల కెరీర్లో సచిన్ రెండు సార్లు జట్టు సారథిగా వ్యవహరించినా చెప్పుకోదగ్గ విజయాలు అందించలేకపోయాడు. తొలిసారిగా 1996లో కెప్టెన్ అయినా ఆ మరుసటి ఏడాదే ఉద్వాసనకు గురయ్యాడు. ‘నా దృష్టిలో క్రికెట్ అనేది టీమ్ వర్క్. కెప్టెన్ ఎప్పుడు బరిలోకి దిగాలి.. ఎలాంటి సూచనలు ఇవ్వాలనే కొన్ని దశలు ఉంటాయి. మైదానంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతిమంగా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంతో పాటు బౌలర్లు వికెట్లు తీయాల్సి ఉంటుంది. తొలిసారిగా బాధ్యతలు తీసుకున్న 12-13 నెలల అనంతరం నన్ను తీసేశారు. నన్ను నిరాశకు గురిచేసిన ఘటన అది. ఎందుకంటే కెప్టెన్ అనేవాడు జట్టును ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికి తగిన సమయం అవసరపడుతుంది. అలాకాకుంటే విజయాల రేటు జీరోగానే ఉంటుంది. అలాగే నా కెప్టెన్సీలో కఠినమైన పర్యటనలకు వెళ్లాం. మాకంటే చాలా మెరుగైన జట్లవి. నేను సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా లేకపోవడం మాత్రం చాలా నిరాశపరిచింది. ఇక రిటైర్ అయినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. గతేడాది లార్డ్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడినప్పుడు బాగానే అనిపించింది. మర్నాడు మాత్రం క్రికెట్ నుంచి తప్పుకుని తెలివైన పని చేశావని నా శరీరం చెప్పినట్టనిపించింది’ అని ‘ఇండియా టుడే సదస్సు’లో పాల్గొన్న 41 ఏళ్ల సచిన్ చెప్పాడు. మరోవైపు ప్రస్తుత భారత జట్టు ప్రపంచకప్‌లో చాలా బాగా ఆడుతోందని, అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోందని అన్నాడు. -
ధోని స్థానం భర్తీకి సమయం పడుతుంది: ఆఫ్రిది
కరాచీ: భారత టెస్టు క్రికెట్ నూతన సారథి విరాట్ కోహ్లి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేడని, ఎంఎస్ ధోని వదిలి వెళ్లిన కెప్టెన్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అతడికి కాస్త సమయం పడుతుందని పాకిస్తాన్ డాషింగ్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అన్నాడు. అయితే కోహ్లి క్రికెట్ నైపుణ్యానికి తాను పెద్ద అభిమానినని, అతడు ఇంకా నాయకుడిగా ఎదగాల్సి ఉందని చెప్పాడు. ‘ధోని రిటైర్మెంట్ నిర్ణయం నన్ను నిరాశపరిచింది. అతడో పోరాట యోధుడు. భారత క్రికెట్‌కు గొప్ప సారథిగా నిలిచాడు. చాలాసార్లు ముందుండి జట్టుకు విజయాలు అందించాడు. అసలు భారత క్రికెట్ ముఖ చిత్రాన్నే తాను మార్చాడు. అన్ని ఫార్మాట్లలోనూ చాంపియన్‌గా నిలబెట్టాడు’ అని ఆఫ్రిది కొనియాడాడు. ఇక ప్రపంచకప్ అనంతరం వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనే తన ఆలోచనలో మార్పు ఉండదని ఆఫ్రిది చెప్పాడు. ఆ టోర్నీలో అద్భుతంగా రాణించినా ఇదే నిర్ణయంతో ఉంటానని అన్నాడు. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల రిటైర్మెంట్ బలవంతంగా జరగడం తాను చూశానని, అలాంటి పరిస్థితి తెచ్చుకోనని 389 వన్డేలాడిన ఆఫ్రిది తెలిపాడు. -
సందీప్‌కు జట్టు పగ్గాలు
సీకే నాయుడు ట్రోఫీకి అండర్-23 జట్టు ఎంపిక సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో తలపడే హైదరాబాద్ అండర్-23 జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు బి. సందీప్ కెప్టెన్‌గా, అర్జున్ యాదవ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఎంపికైన జట్టు సభ్యులు గురువారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో కోచ్‌కు రిపోర్టు చేయాలి. గోవాలో వచ్చే నెల 1 నుంచి 4 వరకు జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు... గోవాతో తలపడుతుంది. జట్టు: బి. సందీప్ (కెప్టెన్), ఆకాశ్, కె.సుమంత్, హిమాలయ్ అగర్వాల్, అరుణ్ దేవా, ఆకాశ్ భండారీ, శరత్, చైతన్యకృష్ణ, వంశీవర్ధన్ రెడ్డి, రోహిత్ రాయుడు, అనిరుధ్, రవితేజ, ముజామిల్, సాకేత్ సాయిరామ్, రాజేంద్ర; కోచ్: అర్జున్ యాదవ్, మేనేజర్: నాగరాజు. -
నా ప్రమేయం లేకుండానే... సారథినయ్యా: కుంబ్లే
పనాజీ: టెస్టు జట్టుకు నాయకత్వం వహించేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం వల్లే తనను కెప్టెన్‌గా చేశారని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. ఓవరాల్‌గా తన ప్రమేయం లేకుండానే సారథినయ్యానని చెప్పాడు. ‘భారత్‌కు 17 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కెప్టెన్సీ వచ్చింది. టెస్టు కెప్టెన్సీపై ఎవరూ ఆసక్తి కనబర్చకపోవడంతో ఇది జరిగింది. ద్రవిడ్ అప్పుడే సారథ్యం నుంచి తప్పుకున్నాడు. ధోనికి బాధ్యతలు ఇవ్వడం తొందరపాటు అని భావించారు. సచిన్ అసలు ఇష్టం చూపలేదు. దీంతో అందరూ నా వైపు చూశారు. నేను ఓకే చెప్పాల్సి వచ్చింది’ అని కుంబ్లే వెల్లడించాడు. తాను సారథ్యం స్వీకరించినప్పుడు భారత జట్టు సంధికాలంలో ఉందన్నాడు. దీన్ని సమర్థంగా ఎదుర్కొవాలనే ఉద్దేశంతో తాను బాధ్యతలకు ఒప్పుకున్నానన్నాడు. -
కెప్టెన్‌కు మ్యాచ్‌లోనే చెప్పాలి: సన్నీ
న్యూఢిల్లీ: ఎవరైనా బౌలర్ మ్యాచ్‌లో సందేహాస్పద బౌలింగ్ వేస్తున్నట్టుగా అనుమానిస్తే అంపైర్లు వెంటనే కెప్టెన్‌ను పిలిచి అతడిని తప్పించేలా చూడాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. అలాంటి బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించిన తర్వాత అంపైర్లు రిపోర్ట్ చేస్తే ఫలితం ఉండదని అన్నారు. ‘మ్యాచ్ ముగిశాక బౌలర్ శైలిపై రిపోర్ట్ చేయడం సరికాదు. ఒకవేళ అతడి బౌలింగ్‌పై అసంతృప్తిగా ఉంటే వెంటనే కెప్టెన్‌ను పిలిచి బౌలింగ్ వేయకుండా చూడాలి. ప్రస్తుతానికైతే భారత జట్టులో ఇలాంటి బౌలర్లు లేరు. దేశవాళీల్లో కొందరు తమ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది’ అని గవాస్కర్ చెప్పారు. -
రాత మారుతుందా?
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్: ప్రీతి జింటా, నెస్వాడియా, ఒబెరాయ్ గ్రూప్ కెప్టెన్: జార్జ్ బెయిలీ కోచ్: సంజయ్ బంగర్ ఫీల్డింగ్ కోచ్: ఆర్. శ్రీధర్ (హైదరాబాద్) గత ఉత్తమ ప్రదర్శన: సెమీఫైనల్ (2008) కీలక ఆటగాళ్లు: బెయిలీ, సెహ్వాగ్, మార్ష్, మిషెల్ జాన్సన్, మాక్స్వెల్, మిల్లర్ ఐపీఎల్ తొలి సీజన్లో సెమీస్‌కు చేరిన జట్టు... ఆ తర్వాతి సీజన్లలో కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయిందనే విమర్శలను మూటగట్టుకున్నా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఈసారి భారీ ఆశలే పెట్టుకుంది. వీరేంద్ర సెహ్వాగ్‌లాంటి డాషింగ్ బ్యాట్స్‌మన్‌ను వేలంలో తీసుకోవడంతో కనీసం ఈసారైనా రాత మార్చుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. జట్టులో భారీ హిట్టర్లకు కొదువలేకున్నా... సమష్టిగా ఆడటంలో ఆటగాళ్లు విఫలమవుతున్నారు. దీంతో కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌ల్లోనూ చతికిలపడుతున్నారు. గత ఐదు సీజన్లలో యువరాజ్, జయవర్ధనే, గిల్‌క్రిస్ట్‌లాంటి మేటి ఆటగాళ్లు నాయకత్వం వహించినా... జట్టును విజయపథాన నడిపించలేకపోయారు. అయితే ఈసారి ఆస్ట్రేలియా టి20 జట్టు సారథి జార్జి బెయిలీ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కంగారూల జట్టుకు నాయకత్వం వహించిన అనుభవంతో పాటు బ్యాటింగ్‌లోనూ బెయిలీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), మానన్ వోహ్రాలను రిటైన్ చేసుకున్నా... కీలక ఆటగాళ్ల కోసం పంజాబ్ భారీ మొత్తంలో వెచ్చించింది. జాన్సన్ (రూ. 6.5 కోట్లు), మాక్స్వెల్ (రూ. 6 కోట్లు), బెయిలీ (రూ. 3.25 కోట్లు), సెహ్వాగ్ (రూ. 3.2 కోట్లు)లపైనే జట్టు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. దేశవాళీ ఆల్‌రౌండర్ రిషి ధావన్‌కు రూ. 3 కోట్లు పెట్టడం ఆసక్తికరం. బలాలు.. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆల్‌రౌండర్లు ఉండటం. మాక్స్వెల్, సెహ్వాగ్ ప్రమాదకర బ్యాట్స్‌మెన్. యాషెస్ హీరో మిషెల్ జాన్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇతర బౌలర్లు రాణిస్తే పంజాబ్ విజయాన్ని అడ్డుకోవడం సులువు కాదు. బలహీనతలు... బ్యాటింగ్‌లో నిలకడలేమి. ఒకటి రెండు ఓవర్లలో భారీ పరుగులు చేసినా... ఆ తర్వాత టపటపా వికెట్లు కోల్పోవడం. దేశవాళీ క్రికెటర్లలో హిట్టర్లు లేకపోవడం. విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం బలహీనతలు. ఫీల్డింగ్ లోపాలను సవరించుకోవాల్సి ఉంది. జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: సెహ్వాగ్, పుజారా, సాహా, బాలాజీ, మురళీ కార్తీక్, పర్వీందర్ అవానా. విదేశీ క్రికెటర్లు: బెయిలీ, జాన్సన్, మార్ష్, మాక్స్వెల్ (ఆస్ట్రేలియా), డేవిడ్ మిల్లర్, హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా) , తిసారా పెరీరా (శ్రీలంక). భారత దేశవాళీ క్రికెటర్లు: అనురీత్ సింగ్, రిషి ధావన్, గురుకీరత్ సింగ్, కరణ్వీర్ సింగ్, మన్దీప్ సింగ్, అక్షర్ పటేల్, సందీప్ వర్మ, శివం శర్మ, శార్దుల్ ఠాకూర్, మన్నన్ వోహ్రా. -
కోహ్లియే సరైన వ్యక్తి
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటనలో భారత్‌ను విజయపథంలో నడిపించిన విరాట్ కోహ్లిపై ధోని ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా తన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం అతనికే ఉందన్నాడు. ‘కోహ్లి అద్భుతమైన క్రికెటర్. ఆట గురించి అతనికి మంచి పరిజ్ఞానం ఉంది. కెప్టెన్‌గా కూడా రాణించాడు. అతనిలో అన్ని రకాల నైపుణ్యాలూ ఉన్నాయి. మైదానంలో కూడా తన భావాన్ని చక్కగా వ్యక్తం చేయగలడు’ అని ధోని అభిప్రాయ పడ్డాడు. నవంబర్ చివర్లో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ గురించి ప్రస్తుతానికి ఆలోచించడం లేదని, అంతకు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలపైనే తన దృష్టి ఉందని భారత కెప్టెన్ పేర్కొన్నాడు. అందరినీ గౌరవించాలి మాజీ ఆటగాళ్ల తరహాలో ఆల్‌టైమ్ భారత అత్యుత్తమ జట్టును తాను ఎప్పటికీ ప్రకటించనని ధోని స్పష్టం చేశాడు. అసలు అలాంటి ఆలోచనకే తాను దూరమని అతను చెప్పాడు. ఇటీవలే మాజీ కెప్టెన్లు కపిల్‌దేవ్, గంగూలీ తమ దృష్టిలో భారత అత్యుత్తమ టెస్టు, వన్డే జట్లను ప్రకటించారు. ‘వేర్వేరు తరాల్లో ఆడిన ఆటగాళ్లు, జట్ల మధ్య పోలిక తేవడం, వారందరినీ ఒక చోటికి చేర్చడం చాలా కష్టమైన పని. వ్యక్తిగతంగా మాత్రం నా అత్యుత్తమ జట్టు అంటూ ఒకదానిని నేను ఎప్పుడూ ఎంపిక చేయను. భారత్‌కు ఆడిన ప్రతీ ఆటగాడిని మనం గౌరవించాల్సిందే’ అని ధోని అభిప్రాయ పడ్డాడు -
అండర్-19 ప్రాబబుల్స్‌లో తన్మయ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్లో బరిలోకి దిగనున్న హైదరాబాద్ అండర్-19 ప్రాబబుల్స్ జాబితాను హెచ్‌సీఏ ప్రకటించింది. తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, అరుణ్ దేవా సహా ఈ ప్రాబబుల్స్‌లో మొత్తం 48 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఎంపికైన ఆటగాళ్లంతా ఈ నెల 19న ప్రాక్టీసు కోసం కోచ్‌ను సంప్రదించాలి.ప్రాబబుల్స్ జాబితా: తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, అరుణ్ దేవా, సీవీ మిలింద్, రోషన్ రఘురామ్, సాయిచరణ్ తేజ, శ్రవణ్, జయసూర్య, తరుణ్ యాదవ్, యశ్వంత్ రెడ్డి, నితీశ్ రెడ్డి, ప్రణీత్, లోహిత్, సయ్యద్ మాజుద్దీన్, చంద్రశేఖర్, షాదాబ్ తుంబి, శశాంక్, కృష్ణారెడ్డి, రాహుల్, యుధీశ్, అఫ్జల్ బియబాని, శ్రీధరహాస్ రెడ్డి, అరవింద్, ఫర్హాన్, చైతన్య రెడ్డి, రాహుల్ సింగ్, చైతన్య, మనీశ్, ప్రత్యూష్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, ఆకాశ్ కులకర్ణి, కృష్ణ చైతన్య, విదరత్, నిఖిల్‌దీప్, రాకేశ్, రవితేజ, శశిధర్ రెడ్డి, యశ్‌పురి, క్రిస్టీ విక్టర్, రోహిత్ రెడ్డి, చాంద్ పాషా, వాజిద్, సందీప్ గౌడ్, హైదర్ అలీ, అక్షయ్, చైతన్య, శ్రీచరణ్, సుజయ్.