రషీద్ ఖాన్
హరారే: అఫ్గానిస్తాన్ యువ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యంత చిన్న వయసు (19 ఏళ్ల 160 రోజులు)లోనే అంతర్జాతీయ జట్టుకు సారథ్యం వహించిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ అస్గర్ స్టాన్‌జాయ్ కడుపునొప్పి కారణంగా ఆస్పత్రి పాలవడంతో రషీద్‌కు తమ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం దక్కింది. అఫ్గాన్ మార్చి 4న స్కాట్లాండ్‌తో ప్రపంచకప్ అర్హత మ్యాచ్ ఆడనుంది. దీనికి రషీద్ సారథ్యం వహిస్తాడని అఫ్గాన్ బోర్డు ట్విట్టర్‌లో ప్రకటించింది.
ఇప్పటివరకు ఈ రికార్డు రాజిన్ సలే (బంగ్లాదేశ్–20 ఏళ్ల 297 రోజులు; దక్షిణాఫ్రికాపై 2004లో) పేరిట ఉంది. ఇటీవల ప్రకటించిన ఐసీసీ వన్డే, టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రషీద్ నంబర్‌వన్‌గా నిలిచి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడయ్యాడు. రషీద్ 37 వన్డేల్లో 86 వికెట్లు, 29 టి20ల్లో 47 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతడిని ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా రూ.9 కోట్లకు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment