ఆఫ్ఘనిస్తాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్‌ఖాన్
స్పిన్ మిస్సైల్‌గా పిలుచుకునే ఆఫ్ఘనిస్తాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్‌ఖాన్ మరో రికార్డు సృష్టించాడు. అతి చిన్న వయస్సులోనే కెపెన్టీ బాధ్యతలు చేపట్టి అరుదైన రికార్డును అందుకున్నాడు. అప్ఘనిస్తాన్ కెప్టెన్ అస్గర్‌కు శస్త్ర చికిత్స జరగడంతో అతని స్ధానంలో రషీద్‌కు తాత్కాలిక సారథిగా భాద్యతలు అప్పగిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో 19 ఏళ్ల 159 రోజులకే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన పిన్నవయస‍్కుడిగా రషీద్ ఘనత సాధించాడు. రషీద్ కంటే ముందు బంగ్లాదేశ్ క్రికెటర్ రాజిన్ సలేహ్ తక్కువ వయస్సులో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వారిలో టాప్‌లో కొనసాగాడు. తాజాగా అతని రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు. మరోవైపు మహిళ క్రికెట్‌లోనూ రషీద్ కంటే చిన్న వయస్సులో కెప్టెన్సీ చేపట్టిన వారు లేరు.
ఇటీవల (ఫిబ్రవరి 20న) ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ జాబితాలో కూడా రషీద్ అతి పిన్న వయసులో బౌలింగ్ విభాగంలో అగ్రస్థానానికి చేరి రికార్డ్ సృష్టించాడు. 19 ఏళ్ల 153 రోజుల వయసున్న రషీద్ ఖాన్ వన్డే క్రికెట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన అత్యంత పిన్న వయసున్న క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సైక్లెన్ ముస్తాక్ 21 సంవత్సరాల 13రోజులకు నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ వయస్సులో సారథి బాధ్యతలు చేపట్టిన వారు:
రషీద్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్)- 19 ఏళ్ల 159 రోజులు
రాజిన్ సలేహ్(బంగ్లాదేశ్)- 20 ఏళ్ల 297 రోజులు
రోడ్నీ ట్రోట్(బెర్ముడా)- 20 ఏళ్ల 332 రోజులు
తాటెండా తైబు(జింబాబ్వే)-20 ఏళ్ల 342 రోజులు
నవాబ్ పటౌడీ(భారత్)-21 ఏళ్ల 77 రోజులు
Comments
Please login to add a commentAdd a comment