international cricket
-
నాలుగు వరల్డ్‌కప్‌లు.. ఓ ఆసియాకప్! కట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్
అఫ్గానిస్తాన్ వెటరన్ పేసర్ షాపూర్ జద్రాన్( Shapoor Zadran) కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. 37 ఏళ్ల జద్రాన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. "ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి. కానీ ప్రతీ ఒక్క క్రికెటర్ ఏదో ఒకరోజు తన కెరీర్‌ను ముగించక తప్పదు. క్రికెట్‌ను నేను ఎప్పుడూ గేమ్‌గా చూడలేదు, నా జీవితంలో భాగంగానే భావించాను. ఈ గేమే నాకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చింది. అటువంటి గేమ్‌ను వదిలేయడం నిజంగా చాలా బాధకారం. నాకు మద్దతుగా నిలిచిన అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు, నా సహచరులు, అభిమానులందరికి ధన్యవాదాలు" అని షాపూర్ ఫేస్బుక్లో రాసుకొచ్చాడు.కాగా 2009లో అఫ్గానిస్తాన్ తరపున అంతర్జాతీయ అరగేట్రం చేసిన షాపూర్.. దాదాపు పదేళ్ల పాటు తన దేశానికి సేవలు అందించాడు. అఫ్గాన్ క్రికెట్ ఎదుగుదలలో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ప్రధాన పాత్ర పోషించాడనే చెప్పాలి. జద్రాన్ 2020లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.షాపూర్ జద్రాన్ తన కెరీర్లో 44 వన్డేలు, 36 టీ20ల్లో అఫ్గాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 80 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా మూడు టీ20 ప్రపంచకప్‌ల(2010, 2012, 2016)లో అఫ్గాన్ తరపున జద్రాన్ ఆడాడు. 2014 ఆసియాకప్‌లో కూడా జద్రాన్ ఆడాడు. ఈ మూడు వరల్డ్‌కప్‌లలో 9 వికెట్లను జద్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా జద్రాన్ 2014, 2016 ఆసియాకప్‌లలో కూడా భాగమయ్యాడు.Shapoor Zadran Calls Time on his International Career 🚨Afghanistan’s big tall left-arm fast bowler Shapoor Zadran, a key figure in the rise of cricket in Afghanistan, announced his retirement from International cricket. He represented Afghanistan in 80 international matches… pic.twitter.com/46W3B4msHH— Afghanistan Cricket Board (@ACBofficials) January 30, 2025 ఇక 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై అఫ్గానిస్తాన్ విజయం సాధించడంలో జద్రాన్ది కీలక పాత్ర. అఫ్గాన్‌కు వరల్డ్‌కప్‌లో అదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో జద్రాన్ తన పది ఓవర్ల కోటాలో కేవలం 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జద్రాన్ మొత్తంగా తన కెరీర్లో నాలుగు వరల్డ్‌కప్‌లలో ఆడాడు.చదవండి: టీ20 ప్రపంచకప్-2025: ఆసీస్‌ను చిత్తు చేసి ఫైనల్లో సౌతాఫ్రికా -
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు (ఫొటోలు)
-
అశ్విన్ అల్విదా
భారత టెస్టు క్రికెట్ ఘనాపాఠిల్లో మరో శిఖరం తన ఆటను ముగించింది. తన పదునైన ఆఫ్‌స్పిన్ బంతులతో పాటు తనకే సాధ్యమైన వ్యూహాలు, తెలివితేటలతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఇంజినీరింగ్ బుర్ర ఇక అంతర్జాతీయ క్రికెట్ చాలంటూ తప్పుకుంది. సుదీర్ఘ కెరీర్ తర్వాత మదరాసీ ముద్దు బిడ్డ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడేసినట్లు ప్రకటించాడు. ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతల తర్వాత భారత్ తరఫున తన ప్రస్థానాన్ని ముగిస్తున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. లెక్కపెట్టలేనన్ని మేటి గణాంకాలకు చిరునామాగా నిలిచిన ఈ దిగ్గజం తుది జట్టులో తన స్థానంపై సందేహం రాగానే ఇక చాలంటూ చివరి నిర్ణయం తీసుకున్నాడు. తన అవసరం లేని జట్టుతో ఇంకా కొనసాగడం అనవసరం అంటూ ఆ్రస్టేలియాతో సిరీస్ మధ్యలోనే గుడ్‌బై చెప్పేసి నిష్క్రమించాడు. బ్రిస్బేన్: భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియా క్రికెటర్‌గా ఇదే తన చివరి రోజు అంటూ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన డే అండ్ నైట్ టెస్టు అశ్విన్ కెరీర్లో చివరిదిగా ముగిసింది. తొలి, మూడో టెస్టుల్లో తుది జట్టులో అతనికి స్థానం లభించలేదు. ‘గాబా’లో టెస్టు ముగిసిన తర్వాత కెపె్టన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశానికి హాజరైన అశ్విన్... తన నిర్ణయం గురించి స్పష్టంగా వివరించి వెనుదిరిగాడు. సిరీస్‌లో మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నా... ముందే రిటైర్మెంట్ ప్రకటించిన అతను నేడు స్వదేశానికి బయలుదేరి వెళుతున్నాడు. 2011లో భారత్ తరఫున తొలి టెస్టు మ్యాచ్ ఆడిన అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టాడు. 2010లో వన్డేలు, టి20ల్లో అశ్విన్ అరంగేట్రం జరిగింది. ఈ రెండు ఫార్మాట్లలో చాలా కాలం క్రితమే అతను జట్టుకు దూరమైనా... అనూహ్యంగా వచ్చిన అవకాశాలు మళ్లీ వరల్డ్ కప్‌లు ఆడేలా చేశాయి. గత ఏడాది సొంత మైదానంలో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆడిన వరల్డ్ కప్ మ్యాచ్ అతని ఆఖరి వన్డే కాగా... 2022 టి20 వరల్డ్ కప్‌లో భాగంగా అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో ఆడిన పోరు అతని ఆఖరి అంతర్జాతీయ టి20 మ్యాచ్. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 వన్డే చాంపియన్స్ ట్రోఫీల్లో విజేతగా నిలిచిన భారత జట్టులో అశ్విన్ సభ్యుడు. అయితే గత కొన్నేళ్లుగా అతను ‘టెస్టు స్పెషలిస్ట్’గానే జట్టుతో కొనసాగుతున్నాడు. ప్రధాన స్పిన్నర్‌గా స్వదేశంలో భారత్ సిరీస్ విజయాల్లో అశ్విన్‌దే కీలక పాత్ర. జట్టులో అవకాశాలు రాకపోవడంతో... ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ మధ్యలో తప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపించినా అశ్విన్ తీసుకున్న నిర్ణయం మరీ అనూహ్యమేమీ కాదు. ఈ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో 3 టెస్టుల్లో అతను 41.22 సగటుతో కేవలం 9 వికెట్లు తీశాడు. స్వదేశంలో అతని స్థాయి ప్రదర్శనతో పోలిస్తే ఇది చాలా పేలవం. ఆ్రస్టేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో అతడిని కాదని యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పించడం అశ్విన్‌కు తీవ్ర నిరాశ కలిగించింది. సాధారణంగా టీమిండియా విదేశీ గడ్డపై ఒక స్పిన్నర్‌ను ఆడిస్తే అతని బ్యాటింగ్ బలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. మూడో టెస్టులో రవీంద్ర జడేజా ఆడాడు. బుధవారం కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే దీనిపై మరింత స్పష్టత వచ్చింది. తొలి టెస్టులో అతడిని తప్పించే నిర్ణయం కోచ్ గంభీర్ తీసుకోగా... రెండో టెస్టు కోసం అశ్విన్‌ను రోహిత్ ఒప్పించాడు. ‘పెర్త్ టెస్టు సమయంలోనే అతను రిటైర్మెంట్ గురించి చర్చించాడు. అప్పటికే అతని మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. అడిలైడ్ తర్వాత బ్రిస్బేన్‌లో కూడా పలు కారణాలతో తుది జట్టులో అతను లేడు. మెల్బోర్న్ గురించి ఇప్పుడే చెప్పలేను. అపార అనుభవం ఉండి డ్రెస్సింగ్ రూమ్‌లో పరిణామాల గురించి ఎంతో తెలిసిన అశ్విన్ ఇలాంటి విషయాలు అర్థం చేసుకోగలడు. సిరీస్‌లో తన అవసరం లేకపోతే ఇంకా ఎందుకని అతను భావించాడు. అయితే అతని స్థాయి ప్లేయర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మనం గౌరవించాలి’ అని రోహిత్ శర్మ అన్నాడు. నిజానికి స్పిన్‌కు అనుకూలించే సిడ్నీలో జరిగే చివరి టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో ఆడితే అశ్విన్ పేరును కూడా పరిశీలించే అవకాశం ఉండేది. అయితే దీనిపై కూడా అతనికి బహుశా నమ్మకం లేకపోవచ్చు. జడేజా, సుందర్‌లనే ఆడిస్తారని అతను అనుకొని ఉంటాడు. అందుకే సిరీస్ ముగిసేవరకు అతను ఆగలేదు. భారత్ తమ తర్వాతి సిరీస్ వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ గడ్డపై ఆడుతుంది కాబట్టి అక్కడా అతనికి తుది జట్టులో స్థానంపై సందేహమే.టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించినా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. దాదాపు ఏడాది వరకు స్వదేశంలో టెస్టులు లేవు. ఈ నేపథ్యంలో తప్పుకోవడమే మంచిదని అశ్విన్ భావించాడు. ఐపీఎల్ బరిలో... ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఇటీవల జరిగిన వేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.9 కోట్ల 75 లక్షలకు తీసుకుంది. కాబట్టి వచ్చే సీజన్లో అతను ఐపీఎల్ ఆడటం ఖాయం కాగా, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా ప్లేయర్ కమ్ కోచ్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.అంకెల్లో అశ్విన్ ఘనతపదమూడేళ్ల ఘనమైన టెస్టు కెరీర్లో అశ్విన్ ఎన్నో కొత్త రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. గతంలో ఎవరికీ సాధ్యం కాని అసాధారణ గణాంకాలకు అతను అడ్రస్‌గా మారాడు. కొన్ని అంకెలు చూస్తే జట్టులో అతని విలువేమిటో, చిరస్మరణీయ విజయాల్లో అశ్విన్ పాత్ర ఏమిటో అర్థమవుతుంది. 537టెస్టుల్లో అశ్విన్ వికెట్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో స్థానంతో అశ్విన్ ముగించాడు. ఓవరాల్‌గా అతనిది ఏడో స్థానం. మురళీధరన్ (800), వార్న్ (708), అండర్సన్ (704), కుంబ్లే (619), బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563) అతనికంటే ముందున్నారు. 37టెస్టుల్లో 37సార్లు అశ్విన్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ముత్తయ్య మురళీధరన్ (67) తర్వాత షేన్ వార్న్ (37)తో రెండో స్థానంలో అతను సమంగా నిలిచాడు.268అశ్విన్ అవుట్ చేసిన ఎడంచేతి వాటం బ్యాటర్లు. ఈ జాబితాలో అందరికంటే ముందున్న అతను అత్యధికంగా బెన్ స్టోక్స్ (13)ను పెవిలియన్ పంపించాడు.65అశ్విన్ అరంగేట్రం చేసిన నాటినుంచి ఇప్పటి వరకు భారత్ సొంతగడ్డపై 65 టెస్టులు ఆడింది. వీటన్నింటిలో అతను బరిలోకి దిగడం విశేషం. ఈ మ్యాచ్‌లలో 383 వికెట్లు పడగొట్టిన అతను జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మధ్య కాలంలో భారత్ స్వదేశంలో అశ్విన్ విఫలమైన 2 సిరీస్‌లలోనే ఓడి రికార్డు స్థాయిలో 18 సిరీస్‌లు గెలిచింది. 2012లో ఇంగ్లండ్‌పై 4 టెస్టుల్లో 52.64 సగటుతో 14 వికెట్లు... 2024లో న్యూజిలాండ్‌పై 3 టెస్టుల్లో 41.22 సగటుతో 9 వికెట్లతో అతను విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్‌లను ఇండియా చేజార్చుకోవడం అతని పాత్రను చూపిస్తోంది.11 అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ల సంఖ్య. ఈ జాబితాలో మురళీధరన్‌తో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు.4 టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ కూడా చేసిన ఘనతను అశ్విన్ నాలుగు సార్లు నమోదు చేశాడు.14 ఏళ్లుగా కలిసి ఆడాం. నువ్వు ఈ మాట చెప్పినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యా. మన జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదిలాయి. ఈ ప్రయాణంలో ప్రతీ క్షణం ఆస్వాదించాను. నీలా మ్యాచ్‌లు గెలిపించడం ఎవరికీ సాధ్యం కాదు. భారత క్రికెట్లో నువ్వు ఒక దిగ్గజానివి. రిటైర్మెంట్ తర్వాతి జీవితం కూడా గొప్పగా సాగాలి. – కోహ్లి‘మనసా... వాచ ఆటపై నీవు కనబరిచే కచ్చితమైన దృక్పథం నన్ను ఎల్లప్పుడు అబ్బురపరుస్తుంది. నువ్వు సంధించే క్యారమ్ బాల్ నుంచి జట్టుకు అవసరమైన పరుగుల్ని రాబట్టే క్రమందాకా జట్టు విజయానికి వేసే బాట అద్భుతం. నువ్వో మ్యాచ్ విన్నర్‌వి. నీ గొప్పతనం ఏంటో నీ ప్రయాణమే చెబుతుంది. నీ పట్టుదల ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది. ఇక నీ రెండో ఇన్నింగ్స్‌కు నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ అశ్విన్. –సచిన్ టెండూల్కర్ అద్భుత కెరీర్ ముగించిన నీకు నా అభినందనలు. నేను కోచ్‌గా ఉన్న సమయంలో నువ్వొక విలువైన ఆస్తివి. నీ నైపుణ్యంతో ఆటకు వన్నె తెచ్చావు. – రవిశాస్త్రిఘనమైన కెరీర్ సాగించిన నీకు శుభాకాంక్షలు. దశాబ్ద కాలం పాటు భారత స్పిన్‌కు పతాకధారిగా నిలబడిన నీ ఘనతల పట్ల గర్వంగా ఉన్నాం. – హర్భజన్ సింగ్నీ ప్రయాణం అసాధారణం. 700కు పైగా అంతర్జాతీయ వికెట్లతో ఆటను సుసంపన్నం చేశావు. మైదానం బయట కెరీర్ అద్భుతంగా ఉండాలి. – అనిల్ కుంబ్లే కుర్రాడిగా మొదలు పెట్టి దిగ్గజంగా ఎదిగే వరకు నిన్ను చూశాను. అశ్విన్‌ను చూసి బౌలర్‌గా మారామని ఒక తరం బౌలర్లంతా చెప్పుకుంటారు. ఆటలో నీ లోటు పూడ్చలేనిది. – గౌతమ్ గంభీర్నీ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం అంత ఉత్సాహవంతమైన పని మరొకటి లేదు. ప్రతీ బంతికి క్యాచ్ అవకాశం వచ్చినట్లే అనిపించేది. – అజింక్య రహానేక్రికెట్లో నీ రాక మా అదృష్టం. అద్భుత ఆటతో అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలం కొనసాగావు. నువ్వు వినోదం పంచడమే కాదు ఎంతో నేర్పించావు కూడా. – ఇయాన్ బిషప్ అశ్విన్ కెరీర్ గణాంకాలుఆడిన టెస్టులు: 106 తీసిన వికెట్లు: 537 చేసిన పరుగులు: 3503 అత్యధిక స్కోరు: 124 సెంచరీలు: 6 అర్ధ సెంచరీలు: 14 ఇన్నింగ్స్‌లో ఉత్తమ బౌలింగ్: 7/59 ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు: 37 సార్లు మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు: 8ఆడిన వన్డేలు: 116 తీసిన వికెట్లు: 156 చేసిన పరుగులు: 707 అత్యధిక స్కోరు: 65 ఉత్తమ బౌలింగ్: 4/25ఆడిన టి20లు: 65 తీసిన వికెట్లు: 72 చేసిన పరుగులు: 184 అత్యధిక స్కోరు: 31 ఉత్తమ బౌలింగ్: 4/814 భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 14వ ప్లేయర్‌గా అశ్విన్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సచిన్, ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గావస్కర్, విరాట్ కోహ్లి, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, ఇషాంత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, చతేశ్వర్ పుజారా కూడా ఉన్నారు. -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ రిటైర్ మెంట్
-
అంతర్జాతీయ క్రికెట్ లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ
-
ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న BCCI నెట్ వర్త్ ఎన్ని కోట్లో తెలుసా!
-
బోర్డర్లు చెరిపేసిన బామ్మ: క్రికెట్ అరంగేట్రంలోనే రికార్డు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పసిపిల్లల నుంచి పండుముసలాళ్ల దాకా క్రికెట్ ఆటకున్న క్రేజే వేరు. గత కొన్ని రోజులుగా సందడి ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఫైనల్‌పోరు కోలకత్తా నైట్ రైడర్స్ సునాయాసంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది టైటిట్‌ను కైవసం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే లండన్‌కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) విశేషంగా నిలుస్తోంది. ఈ కథా కమామిష్షు ఏంటో చూద్దాం రండి! ముగ్గురు మనువరాళ్లున్న ఈ అమ్మమ్మ క్రికెట్ అరంగేట్రం చేసిన రికార్డులు బద్దలు కొట్టింది గత నెలలో యూరోపా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎస్టోనియాతో జరిగిన 3-మ్యాచ్‌ల మహిళల T20 సిరీస్‌లో గిబ్రాల్టర్ తరపున అరంగేట్రం చేసింది సాలీ బార్టన్. తద్వారా 66 ఏళ్ల 334 రోజుల వయసులో అత్యంత వృద్ధ అంతర్జాతీయ క్రికెటర్‌గా కూడా అవతరించింది. ఆ మాటలు విన్నవాళ్లంతా ‘బామ్మ నీ సంకల్పానికి జోహార్’. ‘నువ్వు నిజంగా సూపర్’ అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఏజ్ అనేది ఒక నంబరు మాత్రమేబీబీసీ స్పోర్ట్ కథనం ప్రకారం ‘‘అరవైల్లోకి వచ్చాక నేను క్రికెట్ ఆడుతానని అస్సలే ఉహించలేదు ‘నా డిక్షనరీలో ‘అతి పెద్ద వయస్కురాలు’ అనే పదమే లేదు. అందుకే 66 ఏళ్ల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేశాను’’ అని బార్టన్ తెలిపింది. 2012లో పోర్చుగల్‌కు చెందిన అక్బర్ సయ్యద్ (Akbar Saiyed) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. అక్బర్ 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.అయితే ఈ సిరీస్‌లో వికెట్ కీపర్ అయిన బార్టన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతేకాదు ఏ ఒక్కరిని ఔట్ చేయలేకపోయింది. కానీ ఈ మ్యాచ్‌లో గిబ్రాల్టర్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. బార్టన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గణితంలో లెక్చరర్‌గా రిటైర్ అయ్యారు సాలీ. అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టి సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం. -
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ విధ్వంంసకర ఓపెనర్ కోలిన్ మున్రో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2024 కివీస్ జట్టులో చోటు ఆశించిన మున్రోకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో జట్టులో చోటు దక్కకపోవడంతోనే మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. "అత్యున్నత స్ధాయిలో న్యూజిలాండ్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ బ్లాక్ క్యాప్స్ జెర్సీని నేను ధరించాను. అది నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం. మళ్లీ న్యూజిలాండ్ తరపున ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో జట్టులో నా పేరు లేదు. కాబట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని మున్రో పేర్కొన్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.న్యూజిలాండ్ క్రికెట్లో మున్రోకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్ననేషనల్ క్రికెట్లో మున్రో కివీస్ తరపున 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ జట్టులో మున్రో భాగమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడు పైగా సెంచరీలు చేసిన ఏడు మంది ఆటగాళ్లలో మున్రో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2012 లో అంతర్జాతీయ క్రికెటలో అడుగుపెట్టిన మున్రో. . తన కెరీర్లో 57 వన్డేలు, 65 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 1271 పరుగులు, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. అదే విధంగా ఎకైక టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘనత సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మున్రో.. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగననున్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్‌కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్‌లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై
ఆఫ్గానిస్తాన్ వెటరన్ ఆటగాడు నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నూర్ అలీ తన నిర్ణయాన్ని గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 35 ఏళ్ల జద్రాన్.. 2019లో స్కాట్లాండ్తో జరిగిన వన్డేతో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. జద్రాన్ అఫ్గానిస్తాన్ తరపున 51 వన్డేలు, 23 టీ20లు, 2 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. తన 15 ఏళ్ల కెరీర్లో జద్రాన్ ఓవరాల్‌గా 1902 పరుగులు అలీ సాధించాడు. అందులో 1216 పరుగులు వన్డే ఫార్మాట్లో సాధించినివే కావడం గమనార్హం. టీ20ల్లో 597 పరుగులు చేశాడు. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లోనూ జద్రాన్ అఫ్గాన్ జట్టులో భాగమయ్యాడు. ఈ ఈవెంట్లో శ్రీలంక, పాకిస్తాన్‌లపై హాఫ్ సెంచరీలతో జద్రాన్ చెలరేగాడు. అతడు చివరగా అఫ్గాన్ తరపున ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. అదే విధంగా జద్రాన్ 2010 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీతో మెరిశాడు. -
నలభయ్యారు రోజుల పండుగ!
నలభై ఆరు రోజులు... 48 మ్యాచ్‌లు... దేశంలోని 10 వేర్వేరు నగరాలు... 10 అంతర్జాతీయ క్రికెట్ జట్లు. ఒక క్రీడా సంరంభానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? అక్టోబర్ 5న ఆరంభమైన ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్–2023 కచ్చితంగా మరో పెద్ద ఆటల పండుగ. ఒక పక్కన చైనాలో ఆసియా క్రీడోత్సవాల హంగామా సాగుతుండగానే మన గడ్డపై మరో సందడి మొదలైపోయింది. నాలుగేళ్ళకు ఓసారి సాగే అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ షురూ అయింది. నిరుటి ఛాంపియన్ ఇంగ్లండ్ ఈసారీ బలమైన జట్టుగా ముందుకు వస్తుంటే, సొంతగడ్డపై సాగుతున్న పోటీలో కప్పు కొట్టాలనే ఒత్తిడి భారత జట్టుపై ఉంటుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సైతం బలమైన పోటీదార్లుగా నిలుస్తుంటే, ఆఖరు నిమిషంలో తడబడతారనే పేరున్న దక్షిణాఫ్రికా జట్టు ‘అనూహ్యమైన గెలుపుగుర్రం’ కావచ్చని ఓ అంచనా. గత వరల్డ్ కప్‌లో లానే పోటీలో పాల్గొనే పది జట్లూ లీగ్ దశలో పరస్పరం తలపడే ఈ ప్రపంచపోటీ రానున్న నెలన్నర కాలంలో విస్తృత చర్చనీయాంశం కానుంది. యాభై ఓవర్ల ఈ వన్డే మ్యాచ్‌ల వరల్డ్ కప్‌కు గతంలో 1987, 1996, 2011ల్లో భారత్ ఆతిథ్యమిచ్చింది. అయితే, అప్పుడు ఉపఖండంలోని ఇతర దేశాల సహ ఆతిథ్యంలో అవి సాగాయి. కానీ, ఈసారి పూర్తిగా మనమే ఆతిథ్యమిస్తున్నాం. సరిగ్గా దసరా, దీపావళి పండుగ సీజన్లోనే వరల్డ్ కప్ రావడంతో తమకు కలిసొస్తుందని ప్రకటనకర్తలు భావిస్తున్నారు. తమ ఉత్పత్తుల కొనుగోళ్ళు పెరుగుతాయని బ్రాండ్లన్నీ ఉత్సాహపడుతున్నాయి. దానికి తోడు ఆతిథ్య దేశం భారత్ కావడంతో ఉత్పత్తుల ప్రచారం మరింతగా జనంలోకి చొచ్చుకుపోతుందని భావిస్తున్నాయి. ఈ వాణిజ్య ప్రకటనల ఆదాయంలో సింహభాగం తాజా వరల్డ్ కప్‌కు అధికారిక మీడియా హక్కులున్న డిస్నీ స్టార్‌కు చేరుతుంది. పలు బ్రాండ్లు టీవీ, డిజిటల్ వేదికల్లో స్పాన్సర్షిప్ కోసం డిస్నీస్టార్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నాకౌట్ మ్యాచ్‌ల వేళ టీవీలో 10 సెకన్ల ప్రకటన ఇప్పుడు రూ. 30 లక్షల పైనే అని వార్త. ఈ వరల్డ్ కప్‌తో ప్రయాణ, పర్యాటక, ఆతిథ్య, ఆహార రంగాలు ప్రధానంగా లబ్ధి పొందుతాయని నిపుణుల విశ్లేషణ. మ్యాచ్‌ల పుణ్యమా అని ఇప్పటికే విమాన టికెట్ల రేట్లు, హోటల్ బస రేట్లు భారీగా పెరిగాయి. దేశ స్టాక్ మార్కెట్‌పైనా గణనీయమైన ప్రభావం ఉంటుందని అంచనా. సినిమా, క్రికెట్‌లంటే ప్రాణాలిచ్చే భారత్‌లో మామూలుగా అయితే, వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అంటే చంద్రమండల యాత్ర అంత సంబరం ఉండాలి. విచిత్రంగా ఈసారి ఎందుకనో ఆ క్రేజు వ్యాపారంలోనే తప్ప వ్యవహారంలో కనిపించట్లేదు. మన దేశమే పూర్తిగా ఆతిథ్యమిస్తున్నప్పటికీ, తాజా కప్‌కు ముందస్తు హంగామా అంతగా లేదు. దాదాపు లక్షా 30 వేల మంది కూర్చొనే సౌకర్యంతో ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ స్టేడియమ్గా పేరొందిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియమ్లో గురువారం అంతా కలిపి 20 వేల మంది కూడా లేరు. ఆది నుంచీ ఆన్లైన్లో కొనడానికి టికెట్లు దొరకలేదు గానీ, తీరా మ్యాచ్ రోజున మైదానమంతా ఖాళీగా ఉంది. లార్డ్స్‌లో గత 2019 వరల్డ్ కప్ ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డ న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ తాజా ప్రపంచ కప్‌ను ప్రారంభించారు. కానీ లాభం లేకపోయింది. భారత జట్టుతో తొలి మ్యాచ్ మొదలుపెడితే ఊపు వచ్చేదేమో! నిజానికి, 1999 నుంచి ఐసీసీ వరల్డ్ కప్‌గా పేరుబడ్డ ఈ పోటీల్లో ఆతిథ్యదేశం ఆరంభమ్యాచ్‌లో పాల్గొనడం ఆనవాయితీ. అదెందుకు మార్చారో తెలియదు. ఈసారి మ్యాచ్ టికెట్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఆఖరి నిమిషంలో మ్యాచ్‌ల తేదీలు, వేదికలు మారిపోయాయి. ఇవి చాలదన్నట్టు 2000లల్లో టీ20 మ్యాచ్‌లకు అలవాటు పడ్డ కొత్త తరానికి ఐపీఎల్ సరికొత్త నంబర్ వన్ టోర్నమెంట్‌గా అవతరించింది. వెరసి, 2011లో భారత్ ఆతిథ్యమిచ్చినప్పటితో పోలిస్తే పన్నెండేళ్ళ తర్వాతి ఈ వరల్డ్ కప్ ఆ స్థాయి హడావిడి సృష్టించట్లేదు. అలాగే, గతంలో వరల్డ్ థీమ్సాంగ్ ప్రతి ఛానల్లో మోత మోగేది. ఈసారి రణ్‌బీర్ సింగ్‌తో చేసిన ‘దిల్ జష్న్ బోలే...’ పాట విఫలమైంది. ఇక, మైదానం వెలుపల అవలక్షణాలకు కొదవ లేదు. ఐసీసీ వార్షిక ఆదాయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) వాటా 72 శాతానికి పెరిగింది. మిగతా దేశాల క్రికెట్ బోర్డులు బాగా వెనకబడ్డాయి. దాంతో, ఎప్పటిలానే బీసీసీఐ తన హజం చూపిస్తోంది. బీసీసీఐ అక్రమాలకు నెలవంటూ సుప్రీమ్ కోర్ట్ వేసిన ముగ్గురు సభ్యుల సంఘం నివేదిక లోపాలెత్తిచూపినా అది తన పంథా మార్చుకోలేదు. చిత్రంగా అధికారిక అమ్మకాలు మొదలైనా కాక ముందే టికెట్లు ‘అమ్ముడైపోయాయి’ అని బోర్డులు వెలిశాయి. మచ్చుకు, అహ్మదాబాద్‌లోని అదే భారీ స్టేడియమ్లో జరిగే భారత – పాకిస్తాన్ మ్యాచ్‌కు 8500 టికెట్లే అమ్మకానికి పెట్టారంటే ఏమనాలి? భారీ క్రికెట్ వేదికలైన ముంబయ్, కోలకతాలను వెనక్కినెట్టి, ఈసారి అహ్మదాబాద్ ముందుకు రావడంలోనూ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఆటకు సంబంధం లేని ఇతర ప్రయోజనాలను పక్కనపెట్టి, భారత్ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి ఇది మరో అవకాశం. జీ20 సదస్సు నిర్వహణ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరోసారి మన పేరు మోగడానికి మంచి సందర్భం. దాన్ని చేజార్చుకోకూడదు. 1975లో మొదలైనప్పటి నుంచి ఆతిథ్య దేశాలేవీ కప్ గెల్చుకోలేదన్న వాదనను 2011 ఏప్రిల్‌లో మన ధోనీ సేన సమర్థంగా తిప్పికొట్టింది. తర్వాత 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్‌లు అదే బాటలో నడిచాయి. కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా లాంటి బ్యాట్స్మన్లు, బుమ్రా, షమీ, షిరాజ్ లాంటి పేసర్లు, అశ్విన్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లతో పటిష్ఠమైన రోహిత్ సేన ఆ కథ పునరావృతం చేయాలని ఆశ. రాజకీయాల కన్నా ఆట, వ్యక్తిగత రికార్డుల కన్నా దేశం గొప్పదని గ్రహిస్తే, నిర్వాహకులైనా, ఆటగాళ్ళైనా అద్భుతాలు చేయడం అసాధ్యమేమీ కాదు! -
రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్..
పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోహైల్ ఖాన్ తన నిర్ణయాన్ని ఆదివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ డొమాస్టిక్ వైట్‌బాల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని సోహైల్ సృష్టం చేశాడు. తన 15 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అభిమానలకు, సహచర ఆటగాళ్లకు సోహైల్ ధన్యవాదాలు తెలిపాడు. సోహైల్ ఖాన్ 2008 జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అతడు చివరగా 2016 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ తరపున ఆడాడు. తన కెరీర్లో సోహైల్ 9 టెస్టు, 13 వన్డేలు, 5 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో సోహైల్‌కు మంచి రికార్డు ఉంది. 9 మ్యాచ్‌ల్లో 3.69 ఏకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వన్డేల్లో 19 వికెట్లు, టీ20ల్లో 5 వికెట్లు సాధించాడు. భారత్‌పై 5 వికెట్లు.. ముఖ్యంగా సోహైల్ ఖాన్ కంటే గుర్తు వచ్చేది 2015 వన్డే ప్రపంచకప్. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 5 వికెట్లు పడగొట్టి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అప్పటిలో అతడి పేరు మారుమ్రోగిపోయింది. కానీ ఆతర్వాత ఏడాదికే జట్టులో అతడు చోటు కోల్పోయాడు. చదవండి: Asia Cup 2023: ఇదెక్కడి దరిద్రం రా బాబు.. సిక్స్ కొట్టినా ఔటైపోయాడు! వీడియో చూడాల్సిందే -
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్‌జెండర్
అంతర్జాతీయ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్ రంగప్రవేశానికి ఐసీసీ ఓకే చెప్పింది. ఆస్ట్రేలియాలో జన్మించిన డేనియల్ మెక్‌గాహె అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించనుంది. మెక్‌గాహె అంతర్జాతీయ మహిళల టీ20 మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ నిర్ధేశించిన అన్ని అర్హత ప్రమాణాలను క్లియర్ చేసింది. మెక్‌గాహె 2024 మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ పోటీల కోసం ఎంపిక చేసిన కెనడా జట్టులో చోటు దక్కించుకుంది. 2020లో ఆస్ట్రేలియా నుంచి కెనడాకు వలస వెళ్లిన మెక్‌గాహె.. అదే ఏడాది లింగమార్పిడి చేయించుకని మహిళగా మారి, త్వరలో అదే దేశానికి ప్రాతినిథ్యం వహించనుంది. ఐసీసీ నుంచి క్లియెరెన్స్ లభించాక మెక్‌గాహె స్పందిస్తూ.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించనున్న మొట్టమొదటి వ్యక్తిని అయినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని అంది. కాగా, పురుషుడి నుంచి మహిళగా మారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే, సదరు వ్యక్తి పలు మెడికల్ టెస్ట్‌లు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారు పలు రాతపూర్వక హామీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. -
15 ఏళ్ల కెరీర్లో విరాట్ కోహ్లి ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాడో తెలుసా..?
అంతర్జాతీయ క్రికెట్లో రన్ మెషీన్ విరాట్ కోహ్లి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా (2023 ఆగస్ట్ 18) ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. కోహ్లి తన 15 ఏళ్ల కెరీర్లో పరుగులు (బౌండరీలు, సిక్సర్లు కాకుంగా) సాధించే క్రమంలో ఏకంగా 500 కిలోమీటర్లుపైగా పరిగెట్టాడని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. ఇందులో కోహ్లి తాను చేసిన పరుగుల కోసం 277 కిలోమీటర్లు.. సహచర బ్యాటర్ల పరుగుల కోసం మరో 233 కిలీమీటర్లు పరిగెట్టాడని సదరు వెబ్సైట్ ప్రకటించింది. మొత్తంగా కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్లో 510 కిలోమీటర్లు పరిగెట్టాడని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డేటా లేనప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్లో బహుశా ఏ క్రికెటర్ కూడా వికెట్ల మధ్య ఇన్ని కిలోమీటర్లు పరిగెట్టి ఉండడని తెలుస్తుంది. ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే కోహ్లికి మాత్రమే ఇది సాధ్యపడుతుందని అతని అభిమానులు అంటున్నారు. అంతర్జాతీయ వేదికలపై ప్రొఫెషనల్ అథ్లెట్లకు కూడా సాధ్యపడని ఈ ఫీట్‌ను కింగ్ కోహ్లి మాత్రమే సాధించాడని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి తాను పరుగులు సాధించి, సహచరులు పరుగులు సాధించడంలోనూ భాగం కావడంతో పాటు ప్రత్యర్ధులను సైతం పరుగులు పెట్టించాడని (ఫీల్డింగ్), ఈ లెక్కన కోహ్లి ప్రమేయంతో అంతర్జాతీయ క్రికెట్లో ఆయా క్రికెటర్లు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తారో లెక్కిస్తే 1000 కిలోమీటర్ల మార్కు ఈజీగా దాటుతుందని అంటున్నారు. 2013లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో కోహ్లి విశ్వరూపాన్ని (పరుగుల మధ్య పరిగెట్టడంతో) చూసామని, ఆ మ్యాచ్‌లో కోహ్లి బౌండరీ సాధించకుండా తీసిన నాలుగు పరుగులను సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరచిపోలేడని అంటున్నారు. వికెట్ల మధ్య పరిగెట్టే సమయంలో కోహ్లిలోని వేగం, చురుకుదనం ఏ క్రికెటర్‌కు ఉండవని.. కోహ్లి క్రికెటర్ కాకపోయుంటే కచ్చితంగా సక్సెస్‌పుల్ అథ్లెట్ అయ్యేవాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అతను గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కాలక్రమంలో కోహ్లి ఏరకంగా రాటుదేలాడో.. ఎన్ని పరుగులు, రికార్డులు,సెంచరీలు చేశాడో విశ్వం మొత్తం చూసింది. -
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై
పాకిస్తాన్ మహిళా స్టార్ క్రికెటర్ ఆయేషా నసీమ్ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆయేషా నసీమ్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించింది. 18 ఏళ్లకే ఆమె క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇస్లాం మతంకు అనుగుణంగా మరింత పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆమె తన నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేసింది. ఆయేషా నసీమ్ 2020లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. తన కెరీర్లో 33 టీ20లు, 3 వన్డేలు ఆడిన నసీమ్.. వరుసగా 369,33 పరుగులు సాధించింది. ఆయేషా నసీమ్ చివరగా పాకిస్తాన్ తరపున ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐర్లాండ్‌పై ఆడింది. అదే విధంగా ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుపై నసీమ్ 45 పరుగులు సాధించింది. ఆమె టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆయేషా నసీమ్ హిట్టింగ్ చేసే సత్తా కూడా ఉంది. అటువంటి ఆయేషా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. చదవండి: ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్ -
పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
పాకిస్తాన్ స్టార్ మహిళా క్రికెటర్ నహిదా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు నహిదా ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించింది. 2009లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నహిదా ఖాన్ 100కి పైగా మ్యాచ్‌లు ఆడింది. అదే విధంగా అంతర్జాతీయ వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు నహిదా ఖాన్ పేరిటే ఉంది. 2018లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నహిదా ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకుంది. పాకిస్తాన్ తరపున 66 వన్డేలు, 54 టీ20లు ఆడిన నహిదా.. వరుసగా 1410, 604 పరుగులు చేసింది. 36 ఏళ్ల నహిదా మూడు వన్డే ప్రపంచకప్‌లు(2013, 2017, 2022), నాలుగు టీ20 ప్రపంచకప్‌లలో (2012, 2014, 2016 ,2018) పాకిస్తాన్ తరపున ఆడింది. ఇక 14 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, పాక్ క్రికెట్ బోర్డుకు నహిదా ధన్యవాదాలు తెలిపింది. ఇక నహిదా ఖాన్ నిర్ణయంపై పాకిస్తాన్ ఉమెన్స్ క్రికెట్ హెడ్ తానియా మల్లిక్ స్పందించింది. పాకిస్తాన్ క్రికెట్‌కు నహిదా ఖాన్ అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనవి అని తానియా పేర్కొంది. ఎంతో మంది యువ క్రికెటర్లకు నహిదా ఆదర్శంగా నిలిచిందని ఆమె తెలిపింది. చదవండి: #DevonConway: 'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం' -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. మూడో భారత ఓపెనర్‌గా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్‌మ్యాన్ .. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు ఓపెనర్‌గా ఆన్ని ఫార్మాట్లు కలిపి 295 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 13031 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఓపెనర్‌గా 38 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(15758), ఆ తర్వాత స్ధానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్( 15335) ఉన్నాడు. ఇక ఈ ఫైనల్ పోరులో టీమిండియా పోరాడతోంది. భారత జట్టు విజయం సాధించాలంటే ఆఖరి రోజు 280 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి(44), రహానే(20) పరుగులతో ఉన్నారు. అయితే వీరిద్దరికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి చివరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమేమీ కాదు. దానికి తోడు పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. ఇక టీమిండియా స్ఫూర్తి పొందేందుకు ఆ్రస్టేలియాపై ఆఖరి రోజు 325 పరుగులు సాధించి మరీ గెలిచిన ‘గాబా’ను గుర్తు చేసుకుంటే చాలు. చదవండి: WTC FINAL: వంద శాతం విజయం మాదే.. నేను కూడా బ్యాటింగ్ చేస్తా: షమీ View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం
అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో సరికొత్త శకం మొదలైంది. తొలిసారి ఒక మెన్స్ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఒక మహిళ ఫీల్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌కు చెందిన మహిళా అంపైర్ కిమ్ కాటన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన రెండో టి20లో కిమ్ కాటన్.. మరో అంపైర్ వేన్ నైట్స్‌తో కలిసి ఫీల్డ్ అంపైరింగ్ చేసింది. అయితే కిమ్ కాటన్ గతంలో న్యూజిలాండ్, భారత్‌ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు థర్డ్ అంపైర్ పాత్ర పోషించింది. తాజాగా మాత్రం పురుషుల క్రికెట్లో తొలిసారి ఫీల్డ్ అంపైరింగ్ చేసిన కిమ్ కాటన్ తన పేరును క్రికెట్ పుస్తకాల్లో లిఖించుకుంది. కాగా మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ పేరిట చాలా రికార్డులున్నాయి. 2020లో మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ వుమెన్స్ టి20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళా అంపైర్‌గా కిమ్ కాటన్ నిలిచింది. అంతేకాదు మూడు మహిళల టి20 వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే వరల్డ్‌కప్‌లోనూ అంపైర్‌గా పనిచేసింది. ఇక 2020, 2022, 2023 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించి ఎవరికి దక్కని రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక ఓవరాల్‌గా 2018 నుంచి కిమ్ కాటన్ 54 టి20 మ్యాచ్‌లతో పాటు 24 వన్డేల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించింది. ఇక రెండో టి20 విషయానికి వస్తే న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఏప్రిల్ 8న క్వీన్స్ టౌన్లో జరుగనుంది. కాగా, సిరీస్‌లో భాగంగా రసవత్తరంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కివీస్.. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే (4-0-26-5) నిప్పులు చెరగడంతో శ్రీలంకను 19 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం 142 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ (43 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోవడంతో అలవోకగా విజయం సాధించింది. History today for umpire Kim Cotton who becomes the first female umpire to stand in a men’s international match between two @ICC full member countries 🤝#NZvSL #CricketNation pic.twitter.com/EI8C1RJt4d — BLACKCAPS (@BLACKCAPS) April 5, 2023 చదవండి: NZ VS SL 2nd T20: సీఫర్ట్ విధ్వంసం.. నిప్పులు చెరిగిన మిల్నే -
అఫ్గన్ చేతిలో పాక్ చిత్తు
షార్జా: అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన పుష్కరకాలం తర్వాత అఫ్గనిస్తాన్‌కు ఆ జట్టుపై మొదటి విజయం దక్కింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో అఫ్గన్ 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అనంతరం అఫ్గనిస్తాన్ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అఫ్గన్‌ను గెలిపించాడు. -
దక్షిణాఫ్రికాకు గుడ్ న్యూస్.. మూడేళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. మళ్లీ జాతీయ జట్టు తరుపున ఆడేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. 2021లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన డుప్లెసిస్.. ప్రోటీస్ వైట్ బాల్ జట్టు తరుపున ఆడేందుకు ఉత్సుకత చూపిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి డుప్లెసిస్ తప్పుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. డుప్లెసిస్ చివరిసారిగా 2020లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రోటీస్ తరపున ఆడాడు. ప్రోటీస్ వార్తాపత్రిక ర్యాప్పోర్ట్ నివేదిక ప్రకారం.. డుప్లెసిస్ ఇప్పటికే దక్షిణాఫ్రికా కొత్త వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్ కలిసినట్లు సమాచారం. స్వదేశంలో విండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో డుప్లెసిస్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. కాగా డుప్లెసిస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టీ20లీగ్‌లో ఫాప్ అదరగొట్టాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించిన డుప్లెసిస్ 369 పరుగులు సాధించాడు. ఇక విండీస్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ సోమవారం ప్రకటించనుంది. మార్చి16న ఈస్ట్ లండన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ప్రోటీస్-విండీస్ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: WPL 2023: లేడీ సెహ్వాగ్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో వైరల్ -
వార్నర్ రిటైర్మెంట్.. ఎప్పుడంటే? హింట్ ఇచ్చిన డేవిడ్ భాయ్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన వాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. తాజాగా స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ భాయ్ తన రిటైర్మెంట్కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. వార్నర్ మాట్లాడుతూ.. "వచ్చే ఏడాది నా అంతర్జాతీయ కెరీర్లో ఆఖరిది కావచ్చు. 2024లో అమెరికా, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతాను. అక్కడ అద్భుతంగా రాణించి మా జట్టుకు టైటిల్‌ను అందించడమే నా లక్ష్యం. అప్పుడు గర్వంగా క్రికెట్ నుంచి తప్పుకుంటాను. నేను రెండేళ్ల పాటు బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాను. కాబట్టి అక్కడ కూడా మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నాను. ఇక ప్రస్తుతం మాకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు పెద్దగా లేవు. కాబట్టి నేను టెస్టులు, వన్డే క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి భావిస్తున్నాను. అదే విధంగా వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాకు చాలా కీలకం" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: -
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్
దక్షిణాఫ్రికా మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిగ్నాన్ డు ప్రీజ్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు విడ్కోలు పలికింది. ఇప్పటికే వన్డేలు, టెస్టులకు గుడ్ బై చెప్పిన మిగ్నాన్.. తాజగా టీ20ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డు ప్రీజ్.. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం ఆడనుంది. ఈ ఏడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో డు ప్రీజ్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడింది. తన టీ20 అంతర్జాతీయ కెరీర్లో 114 టీ20లు ఆడిన డు ప్రీజ్ 1805 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లలో 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆమె వన్డే, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా 2007 లో అంతర్జాతీయ క్రికెట్లో మిగ్నాన్ డు ప్రీజ్ అరంగేట్రం చేసింది. 2011 నుంచి 2016 వరకు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కూడా డు ప్రీజ్ బాధ్యతలు నిర్వహించింది. దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్ కూడా డు ప్రీజ్ కావడం విశేషం. ఆమె తన వన్డే కెరీర్లో 154 మ్యాచ్‌లు ఆడిన డు ప్రీజ్.. 3760 పరుగులు సాధించింది. తన కెరీర్లో 18 అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. చదవండి: WTC 2021-23: విండీస్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియా భారీ స్కోరు! ఫైనల్ చేరే క్రమంలో.. -
దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్
Dinesh Karthik Shares Emotional Video: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తర్వలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు, తన అభిమానులకు కార్తీక్ కృతజ్ఞతలు తెలపడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. డీకే భావోద్వేగం ఇన్స్టాగ్రామ్ వేదికగా కార్తీక్ భావోద్వేగ వీడియో ఇందుకు కారణమైంది. "టీమిండియా తరపున టీ20 ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో మేము విజయం సాధించకపోవచ్చు.. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ డీకే ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో కార్తీక్ వీడియోపై స్పందించిన అభిమానులు.. ‘‘ప్లీజ్ డీకే.. వద్దు.. ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకు.. మేము దానికి ఇంకా సిద్ధంగా లేము’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు.. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు డీకే సంకేతాలు ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో అదరగొట్టి.. రీ ఎంట్రీ ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అదరగొట్టిన కార్తీక్.. ఫినిషర్‌గా భారత జట్టులో పునరాగమనం చేశాడు. అయితే ఫినిషర్‌గా టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు. కీలక మ్యాచ్‌లలో పంత్‌ను కాదని డికేకు అవకాశం ఇచ్చినప్పటికీ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా భారత్ ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాబట్టి కార్తీక్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు కార్తీక్ కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Shikhar Dhawan: కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం! అంత మాత్రానికి.. View this post on Instagram A post shared by Dinesh Karthik (@dk00019) -
జులన్... ఐదో ర్యాంక్‌తో ముగింపు
గతవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన కెరీర్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో 39 ఏళ్ల జులన్ బౌలర్ల విభాగంలో 698 పాయింట్లతో తన ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదో ర్యాంక్‌లో... స్మృతి మంధాన ఆరో ర్యాంక్‌లో నిలిచారు. -
అంతర్జాతీయ క్రికెట్లో 100వ టీ ట్వంటీ ఆడనున్న విరాట్
-
దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఓపెనర్ గుడ్ బై..!
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ లిజెల్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. లిజెల్ లీ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ప్రకటించింది. ఈ విధ్వంసకర ఓపెనర్ 184 అంతర్జాతీయ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించింది. లీ తన కెరీర్లో నాలుగు నాలుగు సెంచరీలతో సహా 5253 పరుగులు సాధించింది. ఇక ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ప్రోటీస్ జట్టులో లీ భాగంగా ఉంది. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరడంలో లీ కీలక పాత్ర పోషించింది. "ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. నాకు చిన్నతనం నుంచి క్రికెట్ నా జీవితంలో భాగమైంది. ముఖ్యంగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వంగా ఉంది. గత 8 ఏళ్లుగా దక్షిణాఫ్రికా క్రికెట్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ప్రోటీస్ జట్టు నా వంతు సహకారం అందించాని భావిస్తున్నాను" అని లీ పేర్కొంది. చదవండి: Bhuvneshwar Kumar Inswinger: భువీ ఇన్‌స్వింగర్.. బట్లర్ బౌల్డ్.. వీడియో వైరల్ pic.twitter.com/H0p6bok1YY — Lizelle Lee (@zella15j) July 8, 2022 -
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..!
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు బ్రిటిష్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గార్డియన్ నివేదిక ప్రకారం.. జూలై తొలి వారంలో అంతర్జాతీయ క్రికెట్‌కు మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక మోర్గాన్ సారథ్యంలోనే 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. కాగా తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన మెర్గాన్ కేవలం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మెర్గాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. గాయం కారణంగా అఖరి వన్డేకు మోర్గాన్ దూరమ్యాడు. మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఒక వేళ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే అతడి స్థానంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే విధంగా 2015 నుంచి ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా బట్లర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్-భారత మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జూలై 7 న ప్రారంభం కానుంది. చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను' -
15 ఏళ్ల కెరీర్ పూర్తి.. రోహిత్ శర్మ ఎమోషనల్
23 జూన్.. ఈ తేదీ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం. ఇదే రోజున టీమిండియా ధోని సారధ్యంలో 2013లో ఇంగ్లండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెలుచుకుంది. అయితే ఇదే రోజుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోజు కూడా ఇదే. 2007, జూన్ 23న బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తాజాగా నేటితో 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ పూర్తి చేసుకున్న రోహిత్ ఈ విషయాన్ని ట్విటర్లో పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''ఈ రోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్నా. ఇన్నేళ్ల నా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధురానుభూతులు.. ఒడిదుడుకులు, చీకటి రోజులు ఉంటాయి. కానీ వాటిన్నింటిని అదిగమిస్తూ ఈస్థాయికి చేరుకున్నానంటే దానికి మీ అందరి సపోర్ట్ ఒక కారణం. అందుకే నా ప్రయాణంలో మద్దుతగా నిలిచిన క్రికెట్ లవర్స్, అభిమానులు, విమర్శలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.'' అంటూ ముగించాడు. 𝟭𝟱 𝘆𝗲𝗮𝗿𝘀 in my favourite jersey 👕 pic.twitter.com/ctT3ZJzbPc — Rohit Sharma (@ImRo45) June 23, 2022 క్రికెట్లో రోహిత్ శర్మ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ సరైన ఫామ్ కనబరచలేక జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. సెహ్వాగ్, సచిన్‌ల రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వన్డేల్లో భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుగా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది. 2014, నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు బాదాడు. ఆ తర్వాత 2019 అక్టోబర్ 5న సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలగడంతో సారధ్య బాధ్యతలు ఎత్తుకున్న రోహిత్‌కు ఇంగ్లండ్ పర్యటన ఒక సవాల్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విదేశాల్లో ఇదే తొలి సిరీస్ అని చెప్పొచ్చు. ఇక రోహిత్ శర్మ టీమిండియా తరపున 228 వన్డేల్లో 9283 పరుగులు.. 44 టెస్టుల్లో 3076 పరుగులు, 124 టి20ల్లో 3,308 పరుగులు సాధించాడు. రోహిత్ ఖాతాలో వన్డేల్లో 29 సెంచరీలు, 8 టెస్టు సెంచరీలు, 4 టి20 సెంచరీలు ఉన్నాయి. చదవండి: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు -
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్ బై
టీమిండియా మహిళా క్రికెట్లో మరో శకం ముగిసింది. మహిళా సీనియర్ ఆల్‌రౌండర్ రుమేలీ ధార్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2005 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన టీమిండియా జట్టులో రుమేలీ ధార్ సభ్యురాలు. ఈ విషయాన్ని రుమేలీ ధార్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ''23 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని శ్యామ్నగర్లో ప్రారంభమైన నా క్రికెట్ కెరీర్ నేటితో ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఇక 2005 నా కెరీర్లో మరిచిపోలేని సంవత్సరం. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ చేరడం.. అందులో నేను భాగస్వామ్యం అవడం ఎప్పటికి మరిచిపోలేను. మెన్ ఇన్ బ్లూ డ్రెస్‌లో కప్ కొట్టలేదన్న వెలితి తప్ప మిగతా అంతా సంతోషంగానే అనిపించింది. ఆ తర్వాత గాయాలు తరచూ వేధించినప్పటికి తిరిగి ఫుంజుకొని టీమిండియాకు ఆడాను. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందుకే రిటైర్మెంట్కు ఇదే కరెక్ట్ అని భావించాను. ఇంతకాలం నాకు సహకరించిన కుటుంబసభ్యులకు, బీసీసీఐ, నా స్నేహితులకు కృతజ్ఞతలు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నేను ప్రాతినిధ్యం వహించిన అన్ని జట్లకు నా తరపున మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.'' అంటూ ముగించింది. 2003లో ఇంగ్లండ్ పర్యటనలో రుమేలీ ధార్ టీమిండియా తరపున మహిళల క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. రుమేలీ ధార్ చివరిసారి 2018లో టీమిండియా తరపున ఆడింది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ట్రై సిరీస్ ఆమెకు ఆఖరుది. 19 ఏళ్ల కెరీర్లో టీమిండియా తరపున 78 వన్డేల్లో 961 పరుగులతో పాటు 63 వికెట్లు పడగొట్టింది. ఇక నాలుగు టెస్టుల్లో 236 పరుగులతో పాటు వికెట్లు తీసింది. 18 టి20ల్లో 131 పరుగులు చేసిన రుమేలీ ధార్ బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టింది. 2005లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మహిళల జట్టు ఫైనల్ చేరడంలో రుమేలీ ధార్ పాత్ర కూడా ఉంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 98 పరుగుల తేడాతో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2009 టి20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన రుమేలీ ధార్.. ఒక పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రుమేలీ ధార్ మరో బౌలర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచింది. View this post on Instagram A post shared by Rumeli Dhar (@rumelidhar54) చదవండి: ఐసీయూలో వెంటిలేటర్‌పై పాక్ దిగ్గజ క్రికెటర్ -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. నెదర్లాండ్స్ కెప్టెన్ సంచలన నిర్ణయం..!
నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు సీలార్ ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. వెన్ను గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ ఉన్నాడు. అయితే గాయం కారణంగా ఆదివారం జరిగిన రెండో వన్డేకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా పీటర్ బోరెన్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సీలార్ నెదర్లాండ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2006 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సీలార్ దాదాపు 16 ఏళ్ల పాటు నెదర్లాండ్స్ క్రికెట్‌కు సేవలు అందించాడు. "2020 ఏడాది తర్వాత నా వెన్నునొప్పి మరింత తీవ్రమైంది. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించకున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతుగా నిలిచిన అభిమానులకు,నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డ్‌కు ధన్యవాదాలు" అని సీలార్ పేర్కొన్నాడు. చదవండి: Wriddhiman Saha: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..! -
అతనొక్కడే.. 11 మంది కెప్టెన్లు.. భారత వెటరన్ ఖాతాలో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2022లో సత్తా చాటడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ దాదాపుగా ముగిసిపోయిందన్న దశలో తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించిన డీకే.. తన అంతర్జాతీయ కెరీర్లో ఏకంగా 10 మంది భారత కెప్టెన్ల కింద ఆడి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ స్థాయిలో ఓ ఆటగాడు ఇంత మంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు. ఐసీసీ ఈవెంట్లతో కలుపుకుంటే డీకే కెప్టెన్ల సంఖ్య 11కు చేరుతుంది. కార్తీక్ పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిది నాయకత్వంలో ఐసీసీ ఎలెవెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టిన కార్తీక్ త్వరలో అంతర్జాతీయ స్థాయిలో తన కెప్టెన్ల సంఖ్యను 12కు పెంచబోతున్నాడు. కార్తీక్.. త్వరలో ప్రారంభంకానున్న ఐర్లాండ్ పర్యటనలో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. 18 ఏళ్ల క్రితం 2004లో తొలిసారి టీమిండియా తరఫున ఆడిన కార్తీక్.. తన అరంగేట్రం మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎమ్మెస్ ధోని, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌ల కెప్టెన్సీల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..? -
అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్ బై (ఫొటోలు)
-
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అమీ సాటర్త్‌వైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సాటర్త్‌వైట్ గురువారం ప్రకటన చేసింది. కాగా తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను న్యూజిలాండ్ క్రికెట్ రద్దు చేయండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాటర్త్‌వైట్ తెలిపింది. "నేను కాంట్రాక్ట్‌ను పొందనందుకు చాలా నిరాశ చెందాను. నేను మరికొంత కాలం న్యూజిలాండ్ క్రికెట్లో కొనసాగాలని భావించాను. అయితే న్యూజిలాండ్ క్రికెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. రాబోయే రోజుల్లో జట్టు మరింత రాణించాలని కోరుకుంటున్నాను. న్యూజిలాండ్ జట్టుకు ఇన్నాళ్లు ప్రాతినిద్యం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపై నా కుటంబంతో గడపాలని నిర్ణయించకున్నాను" అని సాటర్త్‌వైట్ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక 2007 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాటర్త్‌వైట్ న్యూజిలాండ్ మహిళా క్రికెట్లో తనదైన ముద్ర వేసుకుంది. 2018 నుంచి 2109 వరకు న్యూజిలాండ్ కెప్టెన్‌గా సాటర్త్‌వైట్ పనిచేసింది. ఇక న్యూజిలాండ్ తరపున 145 వన్డేలు ,111 టీ20 మ్యాచ్‌లు ఆడిన సాటర్త్‌వైట్ .. వరుసగా 4639, 1784 పరుగులు సాధించింది. అదే విధంగా తన అంతర్జాతీయ కెరీర్లో 76 వికెట్లు పడగొట్టింది. కాగా 2007లో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 6 వికెట్లు పడగొట్టి సాటర్త్‌వైట్ సంచలనం సృష్టించింది. చదవండి: IPL 2022: కార్తీక్ క్యాచ్‌ను విడిచి పెట్టిన రాహుల్.. గంభీర్ రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్..! -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్
VR Vanitha Announces Retirement: టీమిండియా మహిళా క్రికెటర్ వి ఆర్ వనిత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు 31 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ ప్రకటించింది. టీమిండియాతో తన 12 ఏళ్ల ప్రయాణాన్ని వనిత తన ట్వీట్లో వివరించింది. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యావాదాలు తెలిపింది. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక, బెంగాల్ జట్లకు ఆడిన వనిత.. 2014 జనవరిలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడిన ఆమె.. ఓవరాల్‌గా 300కు పైగా పరుగులు సాధించింది. And this lovely innings comes to an END ! pic.twitter.com/ZJw9ieXHSO — Vanitha VR || ವನಿತಾ.ವಿ.ಆರ್ (@ImVanithaVR) February 21, 2022 చదవండి: ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్సెన్కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు -
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్‌బై..
శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ దిల్రువాన్ పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పెరీరా రిటైర్మెంట్ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ద్రువీకరించింది. "శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్రువాన్ పెరీరా, అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు" అని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన పెరీరా.. దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నాడు. ఇప్పటి వరకు శ్రీలంక తరుపున 43 టెస్టు మ్యాచ్‌లు ఆడిన దిల్రువాన్ పెరీరా 161 వికెట్లు తీశాడు. కాగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు, హాఫ్ సెంచరీ చేసిన ఏకైక శ్రీలంక ఆటగాడిగా దిల్రువాన్ పెరీరా అరుదైన ఘనత సాధించాడు. అదే విధంగా 13 వన్డేలు, 3 టీ20లు ఆడిన దిల్రువాన్.. వరుసగా 13, 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే 200కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 800 వికెట్లు తీశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరుపున దిల్రువాన్ ఆరంగట్రేం చేశాడు. చదవండి: IPL 2022: 'ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్' -
అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
Harbhajan Singh Announces Retirement: వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. శుక్రవారం అన్ని రకాల ఫార్మాట్లకు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కలిపి 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భజ్జీ బంతులు వికెట్లను పడగొట్టడమే కాదు... మ్యాచ్‌లనూ మలుపు తిప్పాయి. 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 41 ఏళ్ల ఈ పంజాబీ స్టార్ సంప్రదాయ ఫార్మాట్లో 103 టెస్టులు ఆడి 417 వికెట్లు పడగొట్టాడు. 2 సెంచరీ లతో కలిపి 2,224 పరుగులు కూడా చేశాడు. ఇటు 236 వన్డేల్లో 269 వికెట్లను చేజిక్కించుకొని 1,237 పరుగులు సాధించాడు. 28 టి20 మ్యాచ్‌ల్లో 25 వికెట్లను తీశాడు. ‘మంచి విషయాలకు ముగింపు ఉంటుంది. నా జీవితంలో భాగమైన క్రికెట్‌కు, నాపై ఎంతగానో ప్రభావం చూపిన ఆటకు నేను గుడ్‌బై చెబుతున్నాను. నా 23 ఏళ్ల చిరస్మరణీయ కెరీర్‌కు అండదండలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని హర్భజన్ తన రిటైర్మెంట్ సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అందరి క్రికెటర్లలాగే నేను కూడా భారత జెర్సీతోనే ఆటకు వీడ్కోలు పలకాలని ఆశించాను. కానీ విధి నాతో మరోలా చేయించింది’ అని తెలిపాడు. 2016లో ఢాకాలో యూఏఈతో చివరిసారిగా అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన భజ్జీ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోలేదు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన తొలి అంచె ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. కానీ రెండో అంచె ఐపీఎల్ కోసం వేదిక యూఏఈకి మారాక హర్భజన్ బరిలోకి దిగలేదు. All good things come to an end and today as I bid adieu to the game that has given me everything in life, I would like to thank everyone who made this 23-year-long journey beautiful and memorable. My heartfelt thank you 🙏 Grateful .https://t.co/iD6WHU46MU — Harbhajan Turbanator (@harbhajan_singh) December 24, 2021 చదవండి: భారత్‌లో బెట్టింగ్.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు -
త్వరలో కీలక ప్రకటన చేయనున్న కేకేఆర్ స్టార్ బౌలర్..
Harbhajan Singh Set To Join Support Staff Of IPL Franchise: టీమిండియా వెటరన్ స్పిన్నర్, కేకేఆర్ స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ త్వరలో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌తో పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాలని అతను నిర్ణయించుకున్నట్లు సమాచారం. భజ్జీ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత ఐపీఎల్లో ప్రముఖ ఫ్రాంఛైజీ బౌలింగ్ కోచ్‌గా లేదా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్-2022కు జరుగబోయే వేలంలో భజ్జీ.. సదరు ఫ్రాంఛైజీ తరఫున కీలకంగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. భజ్జీకి కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు భారీ అఫర్లు ప్రకటించినట్లు సమాచారం. ఈ రెండు జట్లలో ఏదైనా ఓ జట్టును ఎంచుకుని భజ్జీ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. భారత్ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ సీజన్ తొలి అంచెలో భజ్జీ చివరిసారిగా మైదానంలో కనిపించాడు. దుబాయ్ వేదికగా జరిగిన సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌లలో తుది జట్టులో ఆడనప్పటికీ.. జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. 41 ఏళ్ల భజ్జీ.. 1998లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేశాడు. టీమిండియా తరఫున 103 టెస్టుల్లో 417 వికెట్లు.. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టీ20ల్లో 25 వికెట్లు తీసిన భజ్జీ.. ఓవరాల్‌గా 711 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. హర్భజన్ ఖాతాలో రెండు టెస్ట్ సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో మొత్తంలో 163 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్ 150 వికెట్లు తీసి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్‌గా నిలిచాడు. చదవండి: కోహ్లి అశ్విన్‌ను ఆడించకపోవచ్చు.. ఇంగ్లండ్ మాజీ బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
అంతర్జాతీయ క్రికెట్‌కు డ్వయాన్ బ్రావో గుడ్‌బై
-
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన క్రికెటర్
Zimbabwe's Brendan Taylor Announces Retirement: జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐర్లాండ్‌తో నేడు(సెప్టెంబరు 13) జరిగే మూడో వన్డే తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని పేర్కొన్నాడు. 17 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని, అరంగేట్రం చేసిన నాటి నుంచి జట్టును మెరుగైన స్థితిలో ఉంచేందుకు తన వంతు కృషి చేశానని పేర్కొన్నాడు. బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నానంటూ ట్విటర్ వేదికగా టేలర్ ఓ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. తన ఎదుగుదలకు తోడ్పడిన జింబాబ్వే క్రికెట్ మేనేజ్మెంట్, కోచ్‌లు, అభిమానులు, సహచర ఆటగాళ్లు, తన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. 2004లో అడుగుపెట్టి.. బ్రెండన్ టేలర్ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 34 టెస్టులాడిన అతడు... 2320 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే... 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన టేలర్.. 118.22 స్ట్రైక్‌రేటుతో 934 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ద శతకాలు ఉన్నాయి. ఇక తనెంతగానో ఇష్టపడే వన్డే క్రికెట్లో 204 మ్యాచ్‌లు ఆడి.. 6677 పరుగులతో సత్తా చాటిన టేలర్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(11) చేసిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. 2011-15 మధ్య జింబాబ్వే టీం కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన టేలర్.. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అతడు నిష్క్రమించనున్నాడు. చదవండి: IPL 2021 Second Phase: ఇంగ్లీష్ క్రికెటర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ క్రికెటర్ Forever grateful for the journey. Thank you 🙏 pic.twitter.com/tOsYzoE5eH — Brendan Taylor (@BrendanTaylor86) September 12, 2021 -
క్రికెట్లోకి రీ ఎంట్రీ అన్నాడు.. అంతలోనే?
లాహోర్: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే అమీర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఇస్లామాబాద్ బ్యాట్స్‌మెన్ ఇఫ్తికార్ అహ్మద్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. నువ్వెంతా? అంటే నువ్వెంతా అని కయ్యానికి కాలు దువ్వారు. చివరకు అంపైర్లు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Source: Sony Sports Network #PSL6 #PSL #PSL2021 #MohammadAmir #KKvsIU pic.twitter.com/61d7xKsBC5 — Cricket (@ZombieCricketer) June 14, 2021 కాగా, 29 ఏళ్ల అమీర్.. పాక్ జట్టు మేనేజ్మెంట్ మానసిక వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ గతేడాది పాక్ క్రికెట్‌తో సంబంధాలు తెంచుకుని ఇంగ్లండ్‌కి వెళ్లి సెటిలయ్యాడు. అనంతరం బ్రిటీష్ సిటిజన్‌షిప్ పొందాక ఐపీఎల్లో ఆడేందుకు ప్రయత్నాలు ఆరంభించాడు. ఈ విషయమై సమాచారం అందుకున్న పీసీబీ చీఫ్ వసీమ్ ఖాన్.. పీఎస్ఎల్ ఆడేందుకు పాక్‌కు వచ్చిన అమీర్‌తో చర్చలు ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని ఇంటికి స్వయంగా వెళ్లి.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 2010లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా మహ్మద్ అమీర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. చదవండి: జడేజాపై మరోసారి అక్కసు వెల్లగక్కిన ప్రముఖ వ్యాఖ్యాత.. -
రిటైర్మెంటే ఫైనల్: ఏబీ డివిలియర్స్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. రిటైర్మెంట్పై తన నిర్ణయం మార్చుకునేది లేదని తేల్చి చెప్పాడు. భారత్ వేదికగా అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఈ మిస్టర్ 360 ఆటగాడి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉండింది. అయితే అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ స్పష్టతనిచ్చాడు. 2018లో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తరువాత చాలా సందర్భాల్లో ఏబీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని పుకార్లు షికార్లు చేశాయి. ఇదే అంశంపై ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ఏబీని సంప్రదించగా, ఐపీఎల్ ముగిసాక తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడంతో అభిమానుల ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ.. తన రిటైర్మెంట్ నిర్ణయంపై తగ్గేదే లేదంటూ కుండబద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన ఏబీ.. అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసి మరింతగా అలరిస్తాడని భావించిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. భారత్‌లో కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ అర్ధంతరంగా రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లిన ఏబీడిని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సంప్రదించినప్పటికీ, తన నిర్ణయంలో ఏ మార్పు లేదని, ఉండదని తేల్చేశాడు. దీంతో అతనిపైనే గంపెడాశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో నైరాశ్యం ఆవహించింది. చదవండి: నేను రెడీగా ఉన్నా, కాల్ రావడమే ఆలస్యం: నితీష్ రాణా -
తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి
లక్నో: ఏడాది విరామం తర్వాత తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన భారత మహిళల జట్టుకు ఓటమి పలకరించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్లతో ఓడింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (85 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్) కెరీర్లో 54వ అర్ధ సెంచరీ సాధించగా... తన కెరీర్లో 100వ వన్డే ఆడుతోన్న హర్మన్‌ప్రీత్ కౌర్ (41 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించింది. అనంతరం దక్షిణాఫ్రికా 40.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 178 పరుగులు చేసి గెలిచింది. లిజెల్లె లీ (83 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), లారా వోల్వార్డ్ (80; 12 ఫోర్లు) జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. -
‘సన్నీ 50’కి ఘనమైన సత్కారం
అహ్మదాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అంతర్జాతీయ క్రికెట్లో జేగంట మోగించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆయనను ఘనంగా సన్మానించింది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఆఖరి టెస్టు మూడో రోజు భోజన విరామంలో గావస్కర్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన బోర్డు... సన్నీ సేవల్ని కొనియాడింది. తన 16 ఏళ్ల కెరీర్లో గావస్కర్ 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు. 1987 మార్చి 7న అహ్మదాబాద్ స్టేడియంలోనే గావస్కర్ టెస్టు క్రికెట్లో 10వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందారు. 71 ఏళ్ల సన్నీ సరిగ్గా అర్ధ శతాబ్దం క్రితం 1971లో జరిగిన వెస్టిండీస్ పర్యటనలో మార్చి 6న అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ శతకాలు బాదిన తర్వాత 1987దాకా 16 ఏళ్లపాటు భారత క్రికెట్‌కు ఎన లేని సేవలందించి... దిగ్గజంగా ఎదిగారు. -
పీసీబీ వేధింపులే కారణమన్న పేసర్
కరాచీ: పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు 29 ఏళ్ల బౌలర్ ఓ వీడియో మెసేజ్‌లో వెల్లడించాడు. ‘ఇప్పుడున్న పీసీబీ మేనేజ్మెంట్ వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఆడలేను. నేను తప్పు (స్పాట్ ఫిక్సింగ్) చేశాను. దానికి శిక్ష కూడా అనుభవించాను. అయినా సరే బోర్డు నన్ను గత అనుభవాలతోనే చిన్నచూపు చూస్తోంది. నిషేధం అనంతరం తిరిగి క్రికెట్ ఆడేందుకు మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, మాజీ పీసీబీ చీఫ్ నజమ్ సేథీ నాకు వెన్నుదన్నుగా నిలిచారు. వాళ్ల అండదండలతోనే నేను మళ్లీ ఆడగలిగాను’ అని ఆ వీడియోలో వివరించాడు. అతని వీడియో సందేశం వైరల్ కావడంతో పీసీబీ స్పందించింది. ఆమిర్ నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని, అలాగే అతని ఆరోపణలపై తక్షణం స్పందించడం తగదని ఒక ప్రకటనలో తెలిపింది. ‘స్పాట్’ చిచ్చు నాణ్యమైన పేసర్‌గా కెరీర్ తొలినాళ్లలోనే కితాబు అందుకున్న ఈ క్రికెటర్ ప్రతిభాపాఠవాలను ‘స్పాట్ ఫిక్సింగ్’ మసకబార్చింది. 2010లో ఇంగ్లండ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడటంతో ఐదేళ్ల నిషేధానికి (2010–2015)కు గురయ్యాడు. అంతర్జాతీయ కెరీర్లో 36 టెస్టులాడి 119 వికెట్లు తీశాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లను పడగొట్టాడు. 2009లో టి20 ప్రపంచకప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టు సభ్యుడు. నిషేధం తర్వాత 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ ఆమిర్ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై పాక్ గెలిచింది. -
అహ్మదాబాద్‌లో డే–నైట్ టెస్టు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో లభించిన సుదీర్ఘ విరామం తర్వాత వచ్చే ఏడాది భారత్‌లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మొదలుకానుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటించనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం విడుదల చేసింది. ► ఫిబ్రవరి 5 నుంచి మార్చి 28 వరకు జరిగే ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్టులు, ఐదు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు జరుగుతాయి. ► కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్‌ను నిర్వహిస్తారు. చెన్నై, అహ్మదాబాద్, పుణేలలో మ్యాచ్‌లు జరుగుతాయి. రొటేషన్ పాలసీలో భాగంగా చెన్నై, పుణే వేదికలను ఎంపిక చేశారు. ► ఈ సిరీస్ సందర్భంగా భారత్ సొంతగడ్డపై రెండో డే–నైట్ టెస్టు (ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు) ఆడనుంది. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం (ప్రేక్షకుల సామర్థ్యం 1,10,000) అయిన అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ మొతేరా స్టేడియంలో ఈ డే–నైట్ టెస్టును నిర్వహిస్తారు. గత ఏడాది కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో భారత్ తొలిసారి డే–నైట్ టెస్టు ఆడింది. కొత్తగా నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో డే–నైట్ టెస్టుతోపాటు మరో టెస్టు కూడా జరుగుతుంది. తొలి రెండు టెస్టులకు చెన్నై వేదిక కానుంది. తర్వాతి రెండు టెస్టులను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. టెస్టు సిరీస్ ముగిశాక అహ్మదాబాద్‌లోనే ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం పుణేలో మూడు వన్డేలతో పర్యటన ముగుస్తుంది. ► శ్రీలంకతో రెండు టెస్టులు (జనవరి 14–18; జనవరి 22–26) ఆడాక ఇంగ్లండ్ జట్టు జనవరి 27న కొలంబో నుంచి చెన్నైకు చేరుకుంటుంది. అక్కడే వారంరోజులపాటు క్వారంటైన్లో ఉంటుంది. మరోవైపు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన జనవరి 19న ముగుస్తుంది. ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి చేరుకున్నాక భారత క్రికెటర్లకు వారం రోజులపాటు విశ్రాంతి ఇవ్వనున్నారు. అనంతరం కరోనా వైరస్ నిర్ధారణ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేశాక వారిని చెన్నైలోని బయో బబుల్‌లోకి పంపిస్తారు. భారత్–ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ ► తొలి టెస్టు: ఫిబ్రవరి 5–9 (చెన్నై) ► రెండో టెస్టు: ఫిబ్రవరి 13–17 (చెన్నై) ► మూడో టెస్టు: ఫిబ్రవరి 24–28 అహ్మదాబాద్ (డే/నైట్) ► నాలుగో టెస్టు: మార్చి 4–8 (అహ్మదాబాద్) ► తొలి టి20: మార్చి 12 (అహ్మదాబాద్) ► రెండో టి20: మార్చి 14 (అహ్మదాబాద్) ► మూడో టి20: మార్చి 16 (అహ్మదాబాద్) ► నాలుగో టి20: మార్చి 18 (అహ్మదాబాద్) ► ఐదో టి20: మార్చి 20 (అహ్మదాబాద్) ► తొలి వన్డే: మార్చి 23 (పుణే) ► రెండో వన్డే: మార్చి 26 (పుణే) ► మూడో వన్డే: మార్చి 28 (పుణే) -
ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్
ముంబై : టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు బుధవారం తెలిపాడు. 35 ఏళ్ల పార్థివ్ టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు కలిపి 1706 పరుగులు.. 93 క్యాచ్‌లు, 19 స్టంపింగ్స్ చేశాడు.ఇక దేశవాలి క్రికెట్లో గుజరాత్ తరపున 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ద్వారా పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టెస్టు క్రికెట్లో అత్యంత పిన్న వయసులో( 17 సంవత్సరాల 153 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా పార్థివ్ అప్పట్లో రికార్డు సృష్టించాడు. ఆరంభంలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అదే ప్రదర్శను చూపించలేకపోయాడు. అదే సమయంలో దినేష్ కార్తిక్, ఎంఎస్ ధోనిలు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టడంతో పార్థివ్ కెరీర్ డౌన్‌ఫాల్ మొదలైంది. ముఖ్యంగా ధోని అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్ వికెట్ కీపర్‌గా మారిన తర్వాత పార్థివ్‌కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక పార్థివ్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్లో పార్థివ్ పటేల్ చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, డెక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. Parthiv Patel announces his retirement from all cricket. 👕 25 Tests, 38 ODIs, two T20Is 🏏 1706 runs 🧤 93 catches, 19 stumpings He remains the youngest wicket-keeper to play Test cricket, having made his debut at 17 years and 152 days ⭐ pic.twitter.com/O5i8FeRUiW — ICC (@ICC) December 9, 2020 -
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
క్రైస్ట్‌చర్చ్: ఒకవైపు తరచూ గాయాల బారిన పడుతుండటం... మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడం... వెరసి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని... క్లబ్ క్రికెట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో అండర్సన్ మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ‘ఈ నిర్ణయాన్ని సులువుగా తీసుకోలేదు. రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నా కాబోయే భార్య మేరీ మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ రూపంలో అమెరికాలో ఉండేందుకు, వీలైతే అక్కడే స్థిరపడేందుకు నాకు అవకాశం లభించింది. దాంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని 29 ఏళ్ల అండర్సన్ తెలిపాడు. 2014 జనవరి 1న విండీస్‌పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్‌పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు. -
ప్రియురాలి కోరిక.. సొంత దేశానికి రిటైర్మెంట్
ఆక్లాండ్ : న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా అండర్సన్ వెల్లడించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా(మొదటి స్థానంలో ఏబి డివిలియర్స్) అండర్సన్ రికార్డు సాధించాడు. 2014లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన అండర్సన్ అప్పటివరకు షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. అయితే సరిగ్గా ఏడాది తర్వాత 2015లో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబి డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ సాధించి ఆ రికార్డును తిరగరాశాడు. తనకు కాబోయే భార్య కోరిక మేరకు కివీస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి యూఎస్ఏ మేజర్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నట్లు అండర్సన్ తెలిపాడు. (చదవండి : '11 ఏళ్లయినా తక్కువ అంచనా వేస్తున్నారు') 'ఇంతకాలం కివీస్ క్రికెటర్‌గా కొనసాగినందుకు గర్వంగా ఫీలవుతున్నా. కివీస్ జట్టుకు సేవలందించినందుకు సంతోషంగా ఉన్నా. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అదే సరైన సమయమని భావించాలి. నా ప్రియురాలు.. కాబోయే భార్య మేరీ మార్గరేట్ అమెరికాలో ఉంటుంది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను. అమెరికాలోని యూఎస్ మేజర్ క్రికెట్ లీగ్ ఆడాలని మార్గరేట్ కోరడంతో కాదనలేకపోయా. అందుకే కివీస్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఇన్నిరోజులు నాకు అండగా నిలిచిన కివీస్ బోర్డుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.' అంటూ అండర్స్‌న్ చెప్పుకొచ్చాడు.(చదవండి : 'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు') 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా 29 ఏళ్ల కోరె అండర్సన్ కివీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరున్న అండర్సన్ భారీ షాట్లకు పెట్టింది పేరు. తన కెరీర్లో 13 టెస్టుల్లో 683 పరుగులు, 49 వన్డేల్లో 1,109 పరుగులు, 31 టీ20ల్లో 485 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 16, వన్డేల్లో 60, టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. అండర్సన్ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎక్కువభాగం గాయాలతో సతమతమయ్యాడు. అతను కివీస్ తరపున చివరిసారిగా 2018లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. అప్పటినుంచి కివీస్ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాగా అండర్సన్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ , ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. (చదవండి : కోహ్లికి మాత్రం రూల్స్ వర్తించవా?) -
ప్రమాదంలో దక్షిణాఫ్రికా క్రికెట్!
కేప్‌టౌన్: బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలతో కుదేలైన దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) మరో ప్రమాదంలో పడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొనకుండా దక్షిణాఫ్రికా క్రికెట్‌పై నిషేధం విధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు క్రీడా మంత్రి నాతి మెథ్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడంలో సీఎస్ఏకు సహకరించేందుకు పలుమార్లు సమావేశమైనప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదని మెథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సీఎస్ఏ పాలనలో స్థిరత్వం తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం. కానీ వారి నుంచి సహకారం అందలేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇక వారితో ఎటువంటి సంప్రదింపులు చేయదల్చుకోలేదు’ అని ఆయన అన్నారు. తాను ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలిపేలా తమ వాదనలు వినిపించాలని క్రికెట్ అధికారులకు మెథ్వీ అక్టోబర్ 27 వరకు గడువునిచ్చారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా
-
అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్ ధోని గుడ్‌బై
-
రాముడి బాటలో లక్ష్మణుడు...
చెన్నై: భారత క్రికెట్లో ధోని, సురేశ్ రైనాలది ప్రత్యేక అనుబంధం...కెరీర్ ఆరంభంనుంచి రైనాకు ధోని అండగా నిలవగా, వారిద్దరి మధ్య ఆత్మీయతకు క్రికెట్ వర్గాలు రామలక్ష్మణులుగా పేరు పెట్టాయి. ఇప్పుడు రైనా కూడా ఆటకు వీడ్కోలు పలికే విషయంలో అన్ననే అనుసరించాడు. నేనూ నీకు తోడుగా వస్తానంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని గుడ్‌బై చెప్పిన కొద్ది సేపటికే అతని సహచరుడు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘నీతో కలిసి ఆడినంత కాలం ఆప్యాయంగా అనిపించింది ధోని... అభిమానం నిండిన హృదయంతో చెబుతున్నా... నేనూ నీ ప్రయాణంలో భాగం కావాలని నిర్ణయించుకున్నా. థ్యాంక్యూ ఇండియా. జైహింద్’ అని సురేశ్ రైనా తన రిటైర్మెంట్ సందేశాన్ని ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వచ్చే నెలలో యూఏఈలో జరిగే ఐపీఎల్ టి20 టోర్నీలో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున రైనా ఆడనున్నాడు. ♦ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల రైనా 2005 జూలై 30న దంబుల్లాలో శ్రీలంకపై తొలి వన్డే ఆడాడు. 2018 జూలై 17న లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై రైనా చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ♦ తన 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో కలిపి 768 పరుగులు... వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో కలిపి 5,615 పరుగులు... టి20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో కలిపి 1,605 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా ఘనత వహించాడు. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా తన కెరీర్ మొత్తంలో 167 క్యాచ్‌లు (టెస్టుల్లో 23+వన్డేల్లో 102+టి20ల్లో 42) తీసుకున్నాడు. ♦ ధోని మాదిరిగానే రైనా కూడా తన అరంగేట్రం వన్డేలో ‘డకౌట్’ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని చక్కని ఇన్నింగ్స్ ఆడి జట్టులో నిలదొక్కుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో రైనా సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో (28 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్); పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో (39 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు) రైనా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ♦ తన అంతర్జాతీయ కెరీర్లో రైనా వన్డేల్లో రెండుసార్లు (2013లో ఇంగ్లండ్‌పై; 2014లో ఇంగ్లండ్‌పై)... టి20ల్లో ఒకసారి (2010లో జింబా బ్వేపై) ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చు కున్నాడు. వన్డేల్లో 12 సార్లు... టి20ల్లో మూడు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారాలు అందుకున్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన మిస్టర్ కూల్..
‘మిస్టర్ కూల్’ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించడు... భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి చేర్చిన నాయకుడిని ఇక అంతర్జాతీయ ఆటలో చూసే అవకాశం మళ్లీ రాదు... అద్భుత విజయాలు సాధించినా, పరాజయపు అవమానాలు ఎదుర్కొన్నా ఒకే తరహాలో స్థితప్రజ్ఞత చూపించిన మహేంద్ర సింగ్ ధోని తన ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ధోని తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఏడాది కాలంగా అతను జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడలేదు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ ఆడవచ్చని ఇటీవలి వరకు వినిపించినా...కరోనా కారణంగా ఈ టోర్నీ ఏడాది పాటు వాయిదా పడటంతో ఇక తప్పుకునేందుకు సరైన సమయంగా ఎమ్మెస్ భావించాడు. ఇప్పుడు ఐపీఎల్ మాత్రం మహి మెరుపులు చూసేందుకు అవకాశం ఉంది. 350 వన్డేల్లో ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 98 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో 37.60 సగటుతో అతను 1,617 పరుగులు చేశాడు. 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో వన్డే చాంపియన్స్ ట్రోఫీని గెలిపించిన ధోని మూడు ఐసీసీ టోర్నీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలవడం విశేషం. ధోని 2014 డిసెంబర్లోనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఏడాది విరామమిచ్చి... గత సంవత్సర కాలంలో ధోని రిటైర్మెంట్పై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వన్డే ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత అతను మళ్లీ క్లబ్ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకోవడంపై తన వైపు నుంచి ఎలాంటి స్పష్టత లేకపోగా సెలక్టర్లు కూడా నేరుగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంబించారు. ఆ సమయంలో పరిస్థితి చూస్తే అతను కచ్చితంగా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్ ఆడతాడని అనిపించింది. కెప్టెన్ కోహ్లి మాటలు వింటున్నప్పుడు కూడా వరల్డ్ కప్‌లో ధోని అనుభవం అక్కరకు వస్తుందనే భావం కనిపించింది. అయితే కరోనా వచ్చి అంతా మార్చేసింది. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో యూఏఈలో ఐపీఎల్ జరుగుతున్నా... దాని వల్ల ధోనికి వ్యక్తిగతంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. టి20 వరల్డ్ కప్ 2021 నవంబర్‌కు వాయిదా పడింది. అప్పటి వరకు అంటే సంవత్సర కాలం పాటు ఆటను, ఫిట్నెస్ను కాపాడుకోవడంతో పాటు టీమిండియా సభ్యుడిగా ఉండే ఒత్తిడిని ఎలాగూ భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆటగాడిగా ధోని కొత్తగా సాధించాల్సిన విజయాలు, అందుకోవాల్సిన లక్ష్యాలులాంటివి ఏమీ లేవు. సరిగ్గా చూస్తే గత సంవత్సర కాలంలో ఎప్పుడైనా ధోని రిటైర్ కావచ్చని వినిపించింది. కానీ అతను మాత్రం తనదైన శైలిలో చివరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లినట్లుగా ఇప్పుడు అధికారికంగా రిటైర్మెంట్ను ప్రకటించాడు. రనౌట్‌తో మొదలై రనౌట్‌తో ముగించి... చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ధోని ఒకే ఒక బంతిని ఎదుర్కొని ‘సున్నా’కే రనౌట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌తో ఆడిన ఆఖరి వన్డేలో కూడా 50 పరుగులు చేసిన అనంతరం గప్టిల్ అద్భుత త్రోకు అతను రనౌట్ అయ్యాడు. -
షాకింగ్: అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఇన్నేళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. ధోని సారథ్యంలో టీమిండియా వన్డే, టీ-20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి సాధించింది. గతంలోనే టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగిన ధోని, టీ-20 వన్డే, జట్లలో ఆటగాడిగా కొనసాగాడు. ధోని అనూహ్య నిర్ణయంతో యావత్ క్రీడా లోకం ఆశ్చర్యంలో మునిగింది. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే. (అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా గుడ్‌బై) View this post on Instagram Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired A post shared by M S Dhoni (@mahi7781) on Aug 15, 2020 at 7:01am PDT టీమిండియాకు ఎనలేని కృషి 39 ఏళ్ల మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో పలు సంచలన రికార్డులు నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్లో టీమిండియాను నెంబర్ 1 స్థానానికి చేర్చడంలో రాంచీ డైనమెట్ కీలక పాత్ర పోషించాడు. బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, కెప్టెన్‌గా ధోనీ టీమిండియాకు ఎనలేని కృషి చేశాడు. 2004, డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌లో టీమిండియా జట్టులోకి ధోని అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోని పరుగులేమీ చేయకుండా రనౌట్ కావడం విశేషం. ఇక 2005లో శ్రీలంకతో మ్యాచ్‌లో ధోని తొలి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ధోని చివరి సారిగా 2019, జులై 19న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ కెరీర్లో ధోని 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ 20 మ్యాచ్‌లలో 1600 పరుగుల సాధించాడు. (ఎక్కడైనా ధోనియే నెంబర్ వన్) -
వరుణుడే ఆడుకున్నాడు
వెస్టిండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ రౌండ్ ద వికెట్‌గా వచ్చి తొలి బంతిని వేయగా ఇంగ్లండ్ ఎడంచేతి వాటం ఓపెనర్ రోరీ బర్న్స్ దానిని సమర్థంగా డిఫెన్స్ ఆడాడు... దాదాపు నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఇలా మళ్లీ మొదలైంది. ప్రేక్షకుల చప్పట్లు, ఉత్సాహపు హోరు ఏమీ కనిపించకుండా ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తమ ఆటను మొదలు పెట్టేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన క్రికెట్‌ను వరుణుడు మాత్రం కరుణించలేదు. భయపడినట్లుగానే తొలి రోజు ఆటలో చాలా భాగం వర్షం బారిన పడింది. తొలి రోజు సంఘీభావం, సంతాపం మినహా రోజ్ బౌల్లో ఎలాంటి విశేషాలు లేకుండానే క్రికెట్ సాగింది. సౌతాంప్టన్: సీజన్‌కు తగినట్లుగానే ఇంగ్లండ్‌లో వాన తన ప్రతాపం చూపించడంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నిరాశాజనకంగా మొదలైంది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది. రెండో ఓవర్లోనే... సుమారు పది నెలల తర్వాత వెస్టిండీస్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న పేసర్ షెనాన్ గాబ్రియెల్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. అతను వేసిన నాలుగో బంతిని ఆడకుండా చేతులెత్తేసిన సిబ్లీ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత పదే పదే వచ్చిన అంతరాయాల మధ్య బర్న్స్, డెన్లీ జట్టు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత ఆగిన ఆట మళ్లీ మొదలు కాలేదు. మళ్లీ మళ్లీ... తొలి టెస్టు ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు. బ్రాడ్ అవుట్... ఇంగ్లండ్ తుది జట్టులో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు దక్కలేదు. సొంతగడ్డపై జరిగిన ఒక టెస్టులో బ్రాడ్ ఆడకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మోకాళ్లపై కూర్చోని... అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు. రూట్‌కు రెండో అబ్బాయి... ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్‌కు మరో బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా రూట్ అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య ప్రసవం కారణంగానే రూట్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ‘ఇంగ్లండ్ జట్టుకు బెస్టాఫ్ లక్. మేం మ్యాచ్ చూస్తూ మీకు మద్దతునిస్తాం’ అంటూ కొత్తగా పుట్టిన అబ్బాయి, తన పెద్ద కొడుకు ఆల్ఫ్రెడ్ విలియమ్‌తో కలిసి ఉన్న ఫోటోను అతను పోస్ట్ చేశాడు. విరామం అనంతరం రూట్ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టు కోసం అతను మాంచెస్టర్‌లో జట్టుతో కలుస్తాడు. రూట్ గైర్హాజరు కారణంగా తొలి టెస్టులో జట్టుకు స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున 81వ కెప్టెన్‌గా స్టోక్స్ నిలిచాడు. -
నాకేం తక్కువ: భజ్జీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా తనలో ఇంకా వుందని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వూ్యలో మాట్లాడుతూ ‘నేను ఆడేందుకు సిద్ధం. ఒక వేళ నేను ఐపీఎల్లో బాగా బౌలింగ్ చేస్తే... అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే చేస్తాగా! బౌలర్లకు ఐపీఎల్ క్లిష్టమైన టోర్నమెంట్. ఎందుకంటే బౌండరీ దూరం తక్కువుండే ఈ టోర్నీల్లో ప్రపంచ మేటి ఆటగాళ్లంతా ఆడతారు. అలాంటి వారికి పవర్ ప్లే, మధ్య ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టిన నాకు అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా లేదంటారా చెప్పండి’ అని అన్నాడు. ప్రపంచ క్రికెట్లో అన్ని జట్లు బలమైనవి కావని... అదే ఐపీఎల్లో అయితే అత్యుత్తమ ఆటగాళ్లంతా కలసి ఆడటం వల్ల అన్ని జట్లు పటిష్టమైనవని భజ్జీ విశ్లేషించాడు. ‘ఈ లీగ్‌లో బెయిర్ స్టో (ఇంగ్లండ్), డేవిడ్ వార్నర్ (ఆసీస్) వికెట్లను తీయగలిగే నేను అంతర్జాతీయ క్రికెట్లో తీయలేనా? అయితే తిరిగి భారత్‌కు ఆడే అంశం నా చేతిలో లేదు. సెలక్షన్ కమిటీ చూడాలి’ అని ముక్తాయించాడు. -
నెల రోజుల ప్రాక్టీస్ ఉండాల్సిందే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయి క్రికెట్ టోర్నీల్లో పాల్గొనే ముందు క్రికెటర్లకు కనీసం నెల రోజుల ప్రాక్టీస్ అవసరమని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే ఆటల్ని పునఃప్రారంభించాలని సూచించాడు. బుధవారం ఎల్సా కార్ప్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడైన రహానే మాట్లాడుతూ... ఇకనుంచి మైదానంలో ఆటగాళ్లు ముందులా సంబరాలు చేసుకునే అవకాశం ఉండబోదని చెప్పాడు. ‘ఏ స్థాయి క్రికెట్ ఆడాలన్నా క్రికెటర్లకు 3 నుంచి 4 వారాల కఠిన ప్రాక్టీస్ అవసరం. నావరకైతే ఆటను చాలా మిస్ అవుతున్నా. కానీ వ్యాక్సిన్ వచ్చాకే టోర్నీలు ప్రారంభిస్తే మంచిది. కరోనా కట్టడి అయ్యాక కూడా మనం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదు. అభిమానులు, ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతా సద్దుమణిగాక కూడా మైదానంలో మా సంబరాలు మునుపటిలా ఉండకపోవచ్చు. ప్రయాణాల్లో, వికెట్ తీసినప్పుడు మేం చప్పట్లు, నమస్కారాలతో సరిపెట్టుకుంటామేమో. ఇక బంతిని మెరిపించేందుకు లాలాజలం వాడాలా? వద్దా? అనే అంశంపై ఆట ప్రారంభమయ్యాకే స్పష్టత వస్తుందని’ రహానే చెప్పాడు. -
లీగ్‌ల కన్నా అంతర్జాతీయ క్రికెట్‌కే నా ఓటు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చాక లీగ్ క్రికెట్ స్థానంలో అంతర్జాతీయ క్రికెట్‌కే అధిక ప్రాధాన్యమివ్వాలని భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సంప్రదాయిక టెస్టు క్రికెట్ ఫార్మాట్లో ఎటువంటి మార్పులు చేయకుండా ఐదు రోజుల మ్యాచ్‌లనే నిర్వహించాలని కోరాడు. ‘కరోనా మహమ్మారి కట్టడి తర్వాత అందరూ లీగ్ క్రికెట్ వైపు మొగ్గుచూపుతారేమో! అలా జరుగకూడదు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ లీగ్‌లకు కేటాయించొద్దు. ప్రపంచ క్రికెట్ గాడిలో పడేందుకు అందరూ అనుకుంటున్న దానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. సమీప భవిష్యత్‌లో ఏం జరుగనుందో ఎవరూ ఊహించలేరు’ అని అశ్విన్ పేర్కొన్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా 350 వికెట్లు దక్కించుకున్న బౌలర్‌గా ఘనత సాధించిన అశ్విన్... టెస్టుల్ని నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదన తనకు నచ్చలేదని చెప్పాడు. ‘సుదీర్ఘ ఫార్మాట్లో నేను సాధించాల్సింది ఇంకా ఉంది. నా శరీరం సహకరిస్తే మరిన్ని ఘనతల్ని అందుకోగలను. ఐసీసీ చెబుతోన్న నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనతో నేనైతే ఆనందంగా లేను. ఈ ఆలోచన మంచిదో, చెడ్డదో విశ్లేషించను గానీ ఒకరోజు ఆటపై కోత వేయడమంటే టెస్టు క్రికెట్ మజాను తగ్గించినట్లే అని నా ఉద్దేశం’ అని అశ్విన్ వివరించాడు. -
అజహర్... తీన్మార్
ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతూ సెంచరీ సాధించడం అంటే గొప్ప ప్రదర్శనగా గుర్తించవచ్చు. ఎందుకంటే 143 ఏళ్ల టెస్టు చరిత్రలో 2,384 మ్యాచ్‌లు జరిగితే 108 మందికే ఇది సాధ్యమైంది. అదే జోరు కొనసాగించి రెండో టెస్టులోనూ శతకం బాదితే అద్భుతమని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 9 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇక అంతటితో ఆగకుండా మూడో టెస్టు మ్యాచ్‌లోనూ వందతో చెలరేగిపోతే ఆ సంచలనాన్ని మొహమ్మద్ అజహరుద్దీన్ అనవచ్చు. ఎందుకంటే తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన ఈ మాజీ కెప్టెన్ రికార్డును ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ అజహర్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 1984–85 సీజన్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. భారత జట్టుకు సునీల్ గావస్కర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌కు అజహర్ ఎంపికయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే మూడో టెస్టులో సందీప్ పాటిల్ స్థానంలో అజ్జూను తీసుకున్నారు. 1984 డిసెంబర్ 31న మొదలైన ఈ టెస్టుతో అజ్జూ చరిత్ర సృష్టించాడు. తొలి సెంచరీ (కోల్‌కతా) ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ టెస్టులో అజహర్ ఐదో స్థానంలో వచ్చాడు. 322 బంతుల్లో 10 ఫోర్లతో 110 పరుగులు చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. అద్భుతంగా కెరీర్‌ను ఆరంభించిన అజహర్‌పై అందరి దృష్టీ పడింది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 437 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 276 పరుగులకే ఆలౌటైంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కు ఇబ్బంది కలగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అజహర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తుదకు ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. రెండో సెంచరీ (మద్రాస్) చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. అజహరుద్దీన్ 90 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. అనంతరం మైక్ గ్యాటింగ్ (207; 20 ఫోర్లు; 3 సిక్స్‌లు), గ్రేమ్ ఫ్లవర్ (201; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఇంగ్లండ్ 7 వికెట్లకు 652 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 380 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరకు 412 పరుగులు చేసి ఆలౌటై ఇంగ్లండ్ ముందు 33 పరుగుల విజయలక్ష్యాన్ని పెట్టింది. తీవ్ర ఒత్తిడిలో పోరాడుతూ ఇక్కడ సాధించిన మరో శతకం అజహర్ అసలు సత్తాను చూపించింది. 218 బంతుల్లో అజహర్ 18 ఫోర్లతో 105 పరుగులు సాధించాడు. భారత్ 9 వికెట్లతో ఈ మ్యాచ్ ఓడినా... మన హైదరాబాదీ ప్రదర్శించిన బ్యాటింగ్ సొగసు, అతని మణికట్టు మాయాజాలం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది. వరుసగా రెండో సెంచరీతో అజ్జూ తళుక్కుమన్నాడు. మూడో సెంచరీ ( కాన్పూర్) అజహర్‌కు ముందు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కు మాత్రమే తమ అరంగేట్రం తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన గుర్తింపు ఉంది. తాజా ప్రదర్శనతో భారత అభిమానుల దృష్టి అజహర్‌పై నిలిచింది. అతను మూడో మ్యాచ్‌లోనూ శతకాన్ని అందుకోగలడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అజహర్ అభిమానుల అంచనాలు వమ్ము చేయలేదు. చురుకైన బ్యాటింగ్‌తో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అజ్జూ 270 బంతుల్లో 16 ఫోర్లతో 122 పరుగులు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత్ 8 వికెట్లకు 553 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 417 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఫలితం ‘డ్రా’గా ఖాయమైన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన అజహర్ 43 బంతుల్లోనే 5 ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా అతని వరుసగా మూడు సెంచరీల ప్రదర్శన క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. మొత్తంగా 3 టెస్టుల్లో కలిపి అజహర్ 439 పరుగులు సాధించాడు. మూడో టెస్టులో వేటుపడ్డాక సందీప్ పాటిల్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. తన స్థానంలో వచ్చిన అజహర్ పాతుకుపోవడంతో పాటిల్ కెరీర్ అక్కడే ముగిసిపోయింది. భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్‌తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం -
పాక్ మహిళా స్టార్ క్రికెటర్ సనా మీర్ వీడ్కోలు
కరాచీ: పాకిస్తాన్ మహిళల క్రికెట్లో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంది. తన 15 ఏళ్ల కెరీర్లో 34 ఏళ్ల సనా మీర్ పాకిస్తాన్ తరఫున 120 వన్డేలు, 106 టి20 మ్యాచ్‌లు ఆడింది. 2009 నుంచి 2017 మధ్య 137 మ్యాచ్‌ల్లో ఆమె పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ‘రిటైర్మెంట్కు ఇదే సరైన సమయంగా నేనే భావిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన జట్టు సభ్యులకు, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’ అని సనా తెలిపింది. వన్డేల్లో 1,630 పరుగులు చేసిన ఆమె 151 వికెట్లు కూడా తీసింది. తద్వారా పాక్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఇక టి20 ఫార్మాట్లో 802 పరుగులు సాధించిన ఆమె 89 వికెట్లు పడగొట్టింది. -
ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు
ముంబై: ఒకానొక దశలో భారత క్రికెట్లో కపిల్‌దేవ్ తర్వాత నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా కనిపించిన ఇర్ఫాన్ పఠాన్ అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు శనివారం ప్రకటించాడు. 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్ ఆరంభంలో ఓ వెలుగు వెలిగాడు. ముఖ్యంగా గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో మేటి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న ఈ బరోడా క్రికెటర్ ఆ తర్వాత అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. తొలుత బౌలింగ్‌లో గతి తప్పి... ఆ తర్వాత బ్యాటింగ్‌లో తడబడి... కొన్నాళ్లకు ఫిట్నెస్ కోల్పోయి... ఆఖరికి జట్టులోనే స్థానం కోల్పోయాడు. 2003లో ఆ్రస్టేలియాపై అడిలైడ్ టెస్టులో అరంగేట్రం చేసిన ఇర్ఫాన్ ఆ సిరీస్‌లో తన స్వింగ్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. 2012లో తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఇర్ఫాన్... గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నీలో జమ్మూ కాశ్మీర్ తరఫున చివరిసారిగా దేశవాళీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ప్రస్తుతం ఇర్ఫాన్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. తన తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఇర్ఫాన్ కొన్ని చిరస్మరణీయ ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా 2006 పాకిస్తాన్ పర్యటనలో కరాచీ టెస్టులో మ్యాచ్ తొలి రోజు తొలి ఓవర్లోనే వరుసగా మూడు బంతుల్లో సల్మాన్ బట్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్‌లను అవుట్ చేశాడు. హర్భజన్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా ఇర్ఫాన్ గుర్తింపు పొందాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 వరల్డ్ కప్‌లో భారత్ విశ్వవిజేతగా అవతరించడంలో ఇర్ఫాన్ కూడా కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఇర్ఫాన్ 4 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు (షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, యాసిర్ అరాఫత్) తీశాడు. ఈ ప్రదర్శనకుగాను ఇర్ఫాన్ ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డును గెల్చుకున్నాడు. -
సిడిల్ గుడ్‌బై
మెల్బోర్న్: ఆ్రస్టేలియా పేస్ బౌలర్ పీటర్ సిడిల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్టు కోసం అతడిని ఎంపిక చేసినా... తుది జట్టులో స్థానం దక్కలేదు. 11 ఏళ్ల కెరీర్లో 20 వన్డేలు, 2 టి20లు ఆడినా సిడిల్‌కు టెస్టు స్పెషలిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు దక్కింది. 67 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన 35 ఏళ్ల సిడిల్ 30.66 సగటుతో 221 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 8 సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. కంగారూల తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 13వ స్థానంతో సిడిల్ తన కెరీర్ ముగించాడు. 2008లో మొహాలిలో తన తొలి టెస్టు ఆడిన సిడిల్ కెరీర్లో సచిన్ టెండూల్కర్ వికెట్ మొదటిది. తర్వాతి ఏడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్‌గా కూడా అవార్డు అందుకున్న అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే వరుస గాయాలతో అతని కెరీర్ సక్రమంగా సాగలేదు. అనేక సార్లు ఆసీస్ తరఫున ఆడి జట్టుకు దూరం కావడం, మళ్లీ పునరాగమనం చేయడం తరచుగా జరిగింది. -
క్రికెట్‌కు సిడెల్ గుడ్ బై
మెల్బోర్న్: ఆసీస్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడెల్ తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆసీస్ తరఫున 11 ఏళ్లు క్రికెట్ ఆడిన 35 ఏళ్ల సిడెల్ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. తాను రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే తగిన సమయమని భావించి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు వెల్లడించాడు. ఆసీస్ జట్టుకు ఆడటాన్ని గొప్పగా భావించానని చెప్పుకొచ్చిన సిడెల్.. కాస్త బాధతోనే క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నానని అన్నాడు. ‘ నా చిన్నతనంలో నాలో క్రికెట్ పరంగా సూపర్ టాలెంట ఏమీ లేదు. ఆసీస్‌కు ఆడాలనే ప్రయత్నంలో ఎక్కువగా శ్రమించే లక్ష్యాన్ని చేరుకున్నా. బ్యాగీ గ్రీన్‌ను ధరించడం గొప్పగా భావించా. ఒక్కసారి ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహిస్తే సరిపోతుందని అనుకున్నా. యాషెస్ సిరీస్ వంటి ప్రతిష్టాత్మక సిరీస్ కూడా ఆడా. నేను ఆడుతున్న సమయంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అరంగేట్రం చేశారు. ఆపై వారు క్రికెట్ నుంచి వీడ్కోలు కూడా తీసుకున్నారు. వారు నా కంటే చాలా వయసులో ఉన్నారు. వారి వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. నేను జట్టు నుంచి ఉద్వాసన గురైన ప్రతీసారి నాలో సత్తాను నిరూపించుకుని మళ్లీ జట్టులోకి వచ్చా’ అని సిడెల్ తెలిపాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులు ఆడిన సిడెల్.. 221 వికెట్లు సాధించాగు. అందులో ఐదు వికెట్ల మార్కును ఎనిమిదిసార్లు చేరాడు. ఆసీస్ తరఫున 13వ అత్యధిక వికెట్ టేకర్‌గా సిడెల్ ఉన్నాడు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అది కూడా సిడెల్ 26వ బర్త్ డే రోజున హ్యాట్రిక్ సాధించాడు. ఇక 20 వన్డేలు, రెండు టీ20లు సిడెల్ ఆడాడు. ఆసీస్ తరఫున చివరగా యాషెస్ సిరీస్‌లో సిడెల్ పాల్గొన్నాడు. -
ఫిలాండర్ కూడా...
జొహన్నెస్‌బర్గ్: సీనియర్లు దూరమై ఇప్పటికే దిక్కు తోచని స్థితిలో కనిపిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మరో దెబ్బ తగిలింది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్ దూరమయ్యాక పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న సీనియర్ వెర్నాన్ ఫిలాండర్ కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ తర్వాత అతను రిటైర్ కానున్నాడు. తొలి టి20 ప్రపంచకప్‌తో పాటు 30 వన్డేలు కూడా ఆడినా... టెస్టు స్పెషలిస్ట్‌గానే ఫిలాండర్‌కు ఎక్కువ గుర్తింపు దక్కింది. 12 ఏళ్ల కెరీర్లో ఫిలాండర్ 60 టెస్టుల్లో 22.16 సగటుతో 216 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 13 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. సఫారీ జట్టు చిరస్మరణీయ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్వింగ్ బౌలర్, ఆ దేశం తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇటీవల తరచూ గాయాలబారిన పడుతుండటంతో 34 ఏళ్ల ఫిలాండర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత 18 నెలల్లో ఫిలాండర్ 6 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కొన్నాళ్ల క్రితమే అతని ఫిట్నెస్ను మాజీ కెప్టెన్, ప్రస్తుతం దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రశ్నించడంతో ఫిలాండర్ కెరీర్‌పై చర్చ మొదలైంది. -
ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 15 ఏళ్లు
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2004లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో అరంగేట్రం చేసిన ధోని సోమవారం డిసెంబర్ 23తో 15 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నాడు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ఈ జార్ఖండ్ స్టార్ మూడు ఫార్మాట్లలో కలిపి 17, 266 పరుగులు చేశాడు. 38 ఏళ్ల ఈ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఇప్పటివరకు 350 వన్డేలు, 98 టి20లు, 90 టెస్టులు ఆడాడు. 829 వికెట్ల పతనంలో పాలు పంచుకున్నాడు. అతని సారథ్యంలో భారత్ ఇటు పొట్టి ఫార్మాట్ (2007)లో, అటు వన్డేల్లో (2011) ప్రపంచకప్ విజేతగా నిలిచింది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక భారత సారథిగా ధోనిది ఘనమైన రికార్డు. 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ధోని సేన గెలిచింది. టీమిండియాను ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కూడా అతనిదే. ప్రస్తుతం అతని చుట్టూ రిటైర్మెంట్ వార్తలు వస్తున్నా... ఇప్పటివరకు తను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. జనవరి దాకా తనను ఈ విషయమై అడగొద్దని ఇటీవల మీడియాతో అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత అతను బరిలోకి దిగలేదు. -
మ్యాక్స్ అన్ వెల్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా కీలక ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆశ్చర్యకర రీతిలో క్రికెట్‌కు నిరవధిక విరామం ప్రకటించాడు. మానసికపరమైన సమస్యలతో తాను బాధపడుతున్నట్లు, కొంత కాలం ఆటకు దూరం కావాలని భావిస్తున్నట్లు అతను తన నిర్ణయాన్ని వెలువరించాడు. క్రికెట్ ఆ స్ట్రేలియా (సీఏ) ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్ల మంచి చెడులు చూసుకోవడం మా బాధ్యత. మ్యాక్స్‌వెల్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది. క్రికెట్ ఆస్ట్రేలియా, అతని దేశవాళీ జట్టు విక్టోరియా కలిసి అతని ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకుంటాయి. మ్యాక్సీ మళ్లీ క్రికెట్లోకి అడుగు పెట్టే విధంగా తగిన వాతావరణం కల్పిస్తాం. ఈ సమయంలో మ్యాక్స్‌వెల్ వ్యక్తిగత జీవితాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టరాదని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అతనో ప్రత్యేకమైన ఆటగాడు. ఆస్ట్రేలియా క్రికెట్ కుటుంబంలో భాగమైన గ్లెన్ తొందరగా తిరిగొస్తాడని ఆశిస్తున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ బెన్ ఒలీవర్ ప్రకటన జారీ చేశారు. గత కొంత కాలంగా మ్యాక్స్‌వెల్ మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, దీనిని సరైన సమయంలో గుర్తించిన అతనికి విరామం తప్పనిసరి అని టీమ్ సైకాలజిస్ట్ మైకేల్ లాయిడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి టి20లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగాడు. 28 బంతుల్లోనే 62 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మైదానంలో కూడా చాలా చురుగ్గా కనిపించి ఒక అద్భుతమైన రనౌట్ కూడా చేశాడు. అతని ఉత్సాహాన్ని చూస్తే ఎవరికీ అతని మానసిక స్థితిపై కనీస సందేహం కూడా రాదు. కానీ నాలుగు రోజులు తిరిగే సరికి తాను క్రికెట్ ఆడలేనని, విరామం కోరుకుంటున్నట్లు చెప్పాడు. మానసికంగా తాను తీవ్రమైన ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నట్లు 31 ఏళ్ల మ్యాక్స్‌వెల్ వెల్లడించడం అనూహ్యం. ఏడాది కాలంగా... అడిలైడ్‌లో జరిగిన తొలి టి20 మ్యాచ్‌కు ముందే తన విరామం గురించి కోచ్ లాంగర్‌తో మ్యాక్స్‌వెల్ చర్చించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టి20లో అతను బ్యాటింగ్ చేయలేదు. అయితే మ్యాక్సీ సమస్యల్లో ఉన్నట్లు తాను చాలా కాలం క్రితమే గుర్తించానని టీమ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ‘నా పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. ఆటను ఆస్వాదించలేకపోతున్నాను’ అని తనతో చెప్పినట్లు లాంగర్ స్పష్టం చేశాడు. శ్రీలంకతో సిరీస్ సమయంలో మ్యాచ్ ప్రసారకర్తలతో మ్యాక్స్‌వెల్ సరదాగా మాట్లాడటం కూడా ఒక ‘ముసుగు’ మాత్రమేనని కోచ్ అభిప్రాయ పడ్డాడు. తమ ఆటతో ప్రజలకు ఎంతో వినోదం పంచినా...ఆటగాళ్ల అంతరంగాన్ని ఎవరూ గుర్తించలేరని లాంగర్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది కాలంగా మ్యాక్స్‌వెల్ పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటంతో పాటు సుదీర్ఘ ప్రయాణాలు చేశాడు. స్వదేశంలో సిరీస్‌ల తర్వాత భారత్, యూఏఈ పర్యటన, ఆ తర్వాత ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్, దానికి కొనసాగింపుగా కౌంటీల్లో కూడా అతను ఆడాడు. తాను ఎప్పుడు తిరిగి వస్తాననే విషయంలో మ్యాక్స్‌వెల్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతానికి అతని స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో డి ఆర్సీ షార్ట్‌ను ఎంపిక చేశారు. మనసంతా కలతే..! మార్కస్ ట్రెస్కోథెక్, ఫ్లింటాఫ్, టెయిట్, హోగార్డ్, ట్రాట్, హార్మిసన్, మాడిసన్, హేల్స్, సారా టేలర్... ఒకరా, ఇద్దరా ఈ జాబితా చాలా పెద్దదే! ఎక్కడో ఒక చోట మ్యాచ్ లేదా సిరీస్ ఆడుతుంటారు. అకస్మాత్తుగా మనసులో ఏదో తెలియని నైరాశ్యం అలముకుంటుంది. ఆడింది చాలు, ఇక నా వల్ల కాదు అంటూ అకస్మాత్తుగా ఇంటికి వెళ్లిపోయేందుకు లేదా ఆటకు దూరమయ్యేందుకు సిద్ధపడిపోతారు. ఆ సమయంలో వారికి ఆటగాడిగా తమ ఘనతలు, కీర్తి కనకాదులు ఏవీ గుర్తుకు రావు. పైన చెప్పిన క్రికెటర్లంతా ఏదో ఒక దశలో మానసిక సమస్యలతో బాధపడినవారే. వీరిలో కొందరు విరామం తర్వాత మళ్లీ కోలుకొని బరిలోకి దిగితే... మరికొందరు ఆట ముగించారు. ఇదే సమస్యతో దాదాపు నెల రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన మహిళా క్రికెటర్ సారా టేలర్ వయసు 30 ఏళ్లే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. యాదృచ్ఛికమో, మరే కారణమో గానీ వీరిలో ఎ క్కువ మంది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లే ఉన్నారు. ఆసీస్ కీలక ఆటగాడైన మ్యాక్స్‌వెల్ తాజా నిర్ణయంతో ఈ ‘మానసిక ఆందోళన’ సమస్య మళ్లీ చర్చను రేకెత్తిస్తోంది. డబ్బుకు లోటుండదు, ఎక్కడకు వెళ్లినా దేవుడి స్థాయిలో నీరాజనాలు లభిస్తాయి. అలాంటి క్రికెటర్లకు కూడా మానసిక సమస్యలు, ఒత్తిడి ఉంటాయా అనేది సగటు అభిమానికి సహజంగానే వచ్చే సందేహం. అయితే సాధారణ రోగాలను, గాయాలను ఏదో ఒక పరీక్ష ద్వారా గుర్తించే తరహాలో మానసిక ఆందోళనను కొలిచే పరికరాలు లేవు. ఇది సదరు వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అంతర్జాతీయ క్రికెటర్ కెరీర్ తీవ్ర ఒత్తిడితో కూడుకున్నదనేది వాస్తవం. సుదీర్ఘ కాలం దేశవాళీలో రాణించిన తర్వాత వచ్చే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ విఫలమైతే ఇక ఆట ముగిసిపోతుందనే ఆందోళన కూడా సహజం. ఎంతగా రాణించినా ఇంకా బాగా ఆడాలనే ఒత్తిడి, వారిపై అంచనాలు ఉంటాయి. ఎంత వద్దనుకున్నా కొన్ని సందర్భాల్లో వాణిజ్యపరమైన అంశాలు కూడా ఆటగాళ్లను నడిపిస్తాయి. క్రికెటర్లు జట్టులో స్థిరపడిన తర్వాత కూడా ఇలాంటి మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు. మ్యాక్స్‌వెల్ విషయంలో ఇలాంటి ఒత్తిడే పెరిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థాయికి తగినట్లుగా ఆడలేకపోతున్నానని, ఎంత బాగా ఆడినా టెస్టు జట్టులో స్థానం కోసం తనను పరిగణనలోకి తీసుకోవడం లేదనే నైరాశ్యం అతనిలో ఇటీవల బాగా కనిపించిందని మ్యాక్సీ సన్నిహితులు వెల్లడించారు. టెస్టు జట్టులో స్థానం కోసమే 2019 ఐపీఎల్‌నుంచి తప్పుకొని దేశవాళీ క్రికెట్లో పడిన శ్రమను వారు గుర్తు చేశారు. ప్రస్తుత తరంలో చాలా మంది క్రికెటర్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. వీరిలో కొందరు దీనిని సమర్థంగా ఎదుర్కొంటే, మరికొందరు ఒకసారి బయటపడితే తమ కెరీర్‌పై ఆ ముద్ర ప్రభావం చూపిస్తుందని, కెరీర్ ముగుస్తుందని భయపడుతుంటారని వారు అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో బోర్డునుంచి ఈ తరహా అంశాల్లో సహకారం లభిస్తుంది కాబట్టి వారే స్వేచ్ఛగా బయటపడతారనేది ఒక విశ్లేషణ. 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్ 32.32 సగటు, 123.37 స్ట్రైక్‌రేట్‌తో 2877 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 61 అంతర్జాతీయ టి20ల్లో 35.02 సగటుతో 1576 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్‌రేట్ ఏకంగా 160 ఉండటం విశేషం. ఈ రెండు ఫార్మాట్లలో కలిపి మ్యాక్స్‌వెల్ 76 వికెట్లు తీశాడు. అతను 7 టెస్టులు కూడా ఆడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. -
సారా టేలర్ గుడ్‌బై
లండన్: మహిళల క్రికెట్లో దశాబ్ద కాలానికి పైగా తన ముద్ర చూపించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ సారా టేలర్ (30) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. కొంత కాలంగా భావోద్వేగాలను నియంత్రించుకోలేని ‘మానసిక బెంగ’తో బాధపడుతున్న టేలర్ ఇక ఆట తన వల్ల కాదని ప్రకటించేసింది. 17 ఏళ్ల వయసులోనే ఆమె 2006లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో ఆమె భాగమైంది. తమ జట్టు వన్డే, టి20 ప్రపంచ కప్‌లను గెలవడంలో టేలర్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించింది. మూడు ఫార్మాట్లలో కలిపి టేలర్ 232 వికెట్ల పతనంలో భాగం కావడం మహిళల క్రికెట్లో అత్యుత్తమ ఘనత కావడం విశేషం. తన కెరీర్లో సారా టేలర్ 10 టెస్టులు, 126 వన్డేలు, 90 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 6,533 పరుగులు సాధించింది. -
ఆమ్లా అల్విదా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మూడు రోజుల వ్యవధిలో మరో దిగ్గజ క్రికెటర్ సేవలు కోల్పోయింది. సోమవారం స్టెయిన్ టెస్టుల రిటైర్మెంట్ తర్వాత మరో సీనియర్ బ్యాట్స్‌మన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. దశాబ్దన్నర కాలం పాటు సఫారీ బ్యాటింగ్ మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచిన హషీమ్ మొహమ్మద్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు క్రికెట్లో పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఆమ్లా వన్డేల్లోనూ తన సత్తా చాటాడు. జొహన్నెస్‌బర్గ్: రుషిలాంటి ఏకాగ్రత...వీరుడిలాంటి పోరాటపటిమ... హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్ సందర్భంగా సహచర క్రికెటర్ ఒకరు చేసిన ప్రశంస ఇది. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, గంటల కొద్దీ క్రీజ్‌లో పాతుకుపోయే తత్వం, చూడముచ్చటైన స్ట్రోక్‌లు, వివాదాలు లేని, బ్యాట్‌తోనే తప్ప ఏనాడూ నోటితో సమాధానం చెప్పని తనదైన ప్రత్యేక వ్యక్తిగత జీవన శైలి...ఇవన్నీ హషీం ఆమ్లాను విశేష క్రికెటర్‌గా నిలబెట్టాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లనుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల ఆమ్లా ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆమ్లా కెరీర్లో చివరిది. లంకపైనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమ్లా తన ఆఖరి టెస్టు ఆడాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ సఫారీ స్టార్ చివరకు ఆట ముగించాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు ల్లో గత 29 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన అతను... వన్డే ప్రపంచ కప్‌లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 203 పరుగులే చేయగలిగాడు. అద్భుతమైన ప్రదర్శనలతో... 2002 అండర్–19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమ్లా కోల్‌కతాలో భారత్‌పైనే 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి 3 టెస్టుల్లో కలిపి 62 పరుగులే చేయడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 15 నెలల తర్వాత తిరిగి వచ్చి కివీస్‌పై భారీ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత కూడా కొంత తడబడ్డా 2007లో వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు బాదడంతో అతనికి ఎదురు లేకుండా పోయింది. మరుసటి ఏడాది లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతూ సెంచరీతో తన జట్టును రక్షించడంతో ఆమ్లా పోరాటపటిమ క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 2012 సిరీస్‌లో చేసిన రెండు సెంచరీలు, అంతకు ముందు ఏడాది స్వదేశంలో అదే జట్టుపై సాధించిన రెండు వరుస శతకాలు ఆమ్లా కెరీర్లో చెప్పుకోదగ్గవి. 2012లో ఇంగ్లండ్‌పై ఓవల్ మైదానంలో 13 గంటలకు పైగా క్రీజ్‌లో నిలిచి అజేయంగా సాధించిన 311 పరుగులు అతని కెరీర్లో హైలైట్. 2006నుంచి 2015 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా జట్టు విదేశాల్లో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదంటే అందులో ఆమ్లా పోషించిన పాత్ర అద్భుతం. 14 టెస్టుల్లో సఫారీ జట్టుకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్‌లో సూపర్... ఆమ్లా భారత్‌లో 3 సార్లు పర్యటించాడు. 2004లో విఫలమైన అతను 2008 సిరీస్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 2010 సిరీస్‌లోనైతే ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 253 నాటౌట్, 114, 123 నాటౌట్ పరుగులతో మన బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. 2015లో కెప్టెన్‌గా వచ్చి 0–3తో సిరీస్ చేజార్చుకున్నా...ఢిల్లీ టెస్టులో మ్యాచ్‌ను కాపాడేందుకు 244 బంతుల్లో 25 పరుగులు చేసిన అతని పట్టుదలను ఎవరూ మరచిపోలేరు. వన్డేల్లోనూ దూకుడు... శైలిపరంగా చూస్తే టెస్టు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా అనిపించినా...వన్డేల్లోనూ ఆమ్లాకు అద్భుతమైన రికార్డు ఉంది. 2010లో విండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌లో 402 పరుగులు చేయడంతో అతని వన్డే సత్తా బయటపడింది. ఇదే ఏడాది మొత్తం 15 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 75 సగటు, 104 స్ట్రైక్‌రేట్‌లో 1058 పరుగులు చేయడం విశేషం. ఒక దశలో అతను వేగంలో కోహ్లితో పోటీ పడ్డాడు. కెరీర్లో 2 వేల పరుగుల నుంచి 7 వేల పరుగుల వరకు ప్రతీ వేయి పరుగుల మైలురాయిని అందరికంటే వేగంగా ఆమ్లానే చేరుకోవడం మరో ఘనత. దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (27) సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా నిలిచాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్) సాధించిన ఏకైక క్రికెటర్ ఆమ్లా -
యువరాజ్ గుడ్‌బై
ముంబై: భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న యువరాజ్ సింగ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అతను వెల్లడించాడు. సోమ వారం జరిగిన మీడియా సమావేశంలో తన రిటైర్మెంట్ గురించి ప్రకటన చేసిన 37 ఏళ్ల యువీ... ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్, భవిష్యత్తు తదితర అంశాలపై వివరంగా మాట్లాడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆఖరి సారిగా ప్రాతినిధ్యం వహించిన యువరాజ్... జాతీయ జట్టు తరఫున రెండేళ్ల క్రితం 2017 జూన్‌లో ఆఖరి వన్డే ఆడాడు. 17 ఏళ్ల అంతర్జా తీయ కెరీర్లో యువీ మూడు ఫార్మాట్లలో కలిపి 402 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. భారత జట్టులోకి పునరాగమనం చేసే అవకాశాలు దాదాపుగా లేకపోవడం, ఐపీఎల్లో కూడా అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించకపోవడంతో ఇక తప్పుకోవడమే సరైనదిగా యువీ భావించాడు. 25 ఏళ్ల పాటు 22 గజాల క్రికెట్ పిచ్‌తో అనుబంధం కొనసాగించిన తర్వాత ఆటకు ముగింపు పలికేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు యువరాజ్ చెప్పాడు. అయితే రిటైర్మెంట్ అనంతరం బీసీసీఐ అనుమతిస్తే ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు టి20 లీగ్‌లు ఆడాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను వెల్లడించాడు. మీడియా సమావేశంలో యువరాజ్ వెంట అతని తల్లి షబ్నమ్, భార్య హాజల్ కీచ్ ఉన్నారు. భారత్ తరఫున 400కు పైగా మ్యాచ్‌లు ఆడగలగడం నా అదృష్టం. నా కెరీర్ మొదలు పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుందని ఏనాడూ ఊహించలేదు. పడ్డ ప్రతీసారి పైకి లేవడం ఎలాగో నాకు క్రికెట్ నేర్పించింది. విజయాలకంటే అపజయాలు నన్ను ఎక్కువగా పలకరించినా నేనెప్పుడూ ఓటమిని ఒప్పుకోలేదు. దేశం కోసం ఆడే సమయంలో నేను ఉద్వేగంతో ఉప్పొంగి పోయేవాడిని. జట్టు కోసం నేను చేసిన ప్రతీ పరుగు, తీసిన వికెట్, ఆపిన పరుగులు అన్నీ గొప్పగానే అనిపిస్తాయి. 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమయ్యాను. అంతకు మించి ఇంకేం కావాలి. ఎలా రిటైర్ కావాలనే విషయంలో కొంత సందిగ్ధత నన్ను వెంటాడింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడి టైటిల్ గెలిచాక రిటైర్ అయితే సంతృప్తిగా ఉంటుందని భావించా. అయితే తుది జట్టులో నాకు చోటు దక్కలేదు. జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవు. సంవత్సరం క్రితమే ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇక ఆడింది చాలు అనిపించిన సమయం వచ్చేసింది. రిటైర్ అవడానికి ముందు సచిన్ సలహా తీసుకోవడంతో పాటు సహచరులు జహీర్, భజ్జీ, వీరూలకు చెప్పా. చాలా కాలం తర్వాత నాన్నతో కూడా సుదీర్ఘంగా మాట్లాడి నా నిర్ణయాన్ని చెప్పాను. ఇకపై ఆటను ఆస్వాదించేందుకే బయటి లీగ్‌లలో పాల్గొనాలనుకుంటున్నా. –యువరాజ్ ► 10 వేల పరుగులు పూర్తి చేయలేదనే బాధ ఏమాత్రం లేదు. దాని గురించి అసలు ఎప్పుడూ ఆలోచించనే లేదు. నాకు ప్రపంచ కప్ గెలవడం అనేది కల. నా దృష్టిలో 10 వేలకంటే ప్రపంచ కప్ గెలుపే మిన్న. ► నాలుగు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్ గెలవడం... నిస్సందేహంగా ఇంతకంటే మధుర క్షణం నా కెరీర్లోనే లేదు. శ్రీలంకపై 2014 టి20 ప్రపంచ కప్ ఫైనల్ అత్యంత బాధాకర సమయం. నా కెరీర్ అప్పుడే ముగిసిపోయిందని భావించా. నా పనైపోయిందని అందరూ నన్ను తేలిగ్గా తీసిపారేసిన క్షణమది. ► టెస్టుల్లో రాణించలేకపోయాననే నిరాశ మాత్రం ఉంది. నాటి దిగ్గజాల వరుసలో నాకు జట్టులో స్థానం దక్కడమే కష్టంగా ఉండేది. ఒక్క మ్యాచ్ ఆడి విఫలం కాగానే చోటు పోయేది. నేను చేయగలిగినదంతా చేశాను. మరో 40 టెస్టులైనా ఆడగలిగితే బాగుండేదేమో. టెస్టుల్లో సగటు కూడా కనీసం 40 ఉండాలని కోరుకున్నా సాధ్యం కాలేదు. ► నా తొలి కెప్టెన్ గంగూలీ చాలా అండగా నిలిచాడు. తన ఆటగాళ్ల కోసం అతను ఎప్పుడూ పోరాడేందుకు సిద్ధంగా ఉంటాడు. ధోనితో కలిసి ఎన్నో విజయాలు సాధించాం కాబట్టి అతని ప్రభావం కూడా నాపై చాలా ఉంది. ► ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్‌ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో నేను ఎక్కువగా ఇబ్బంది పడ్డాను. విదేశీ ఆటగాళ్లలో బ్యాట్స్‌మన్‌గా పాంటింగ్‌ను అభిమానిస్తా. ► వివాదాస్పద అంశాల గురించి మాట్లాడేందుకు మున్ముందు చాలా సమయం ఉంది. ఇప్పుడు మన ఆటగాళ్లు ప్రపంచకప్ ఆడుతున్న సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. ‘ఫేర్వెల్ మ్యాచ్ వద్దన్నా’... నాకు ఆఖరిసారిగా ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వమని బీసీసీఐలో ఎవరినీ అడగలేదు. ఆఖరి మ్యాచ్ అంటూ క్రికెట్ ఆడటం నాకు నచ్చదు. గతంలో ఒకసారి నేను యో యో టెస్టులో విఫలమైతే రిటైర్మెంట్ మ్యాచ్ ఏర్పాటు చేస్తామని నాతో చెప్పారు. అయితే నాకు అవసరం లేదన్నాను. యో యో టెస్టులో విఫలమైతే నేరుగా ఇంటికే వెళ్లిపోతానని చెప్పా. ఆ తర్వాత యో యో టెస్టు పాస్ అయి మిగతా విషయాలు వారికే వదిలేశా. -
మైదానంలో ‘మహరాజు’
సాక్షి క్రీడా విభాగం: 2000 సంవత్సరం... మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో మసకబారిన భారత క్రికెట్ ప్రతిష్టను మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సమయం. కొత్త మిలీనియంలో కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ కొందరు సీనియర్లతో పాటు యువరక్తం నిండిన ఆటగాళ్లతో కలిసి టీమిండియాకు నవ్య దిశ చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. అలాంటి సమయంలో అతనికి లభించిన ఒక మెరుపు యువరాజ్ సింగ్. కొన్నాళ్ల క్రితమే జరిగిన అండర్–19 ప్రపంచకప్‌లో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన ఆ కుర్రాడిని భారత సెలక్టర్లు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. తన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాని యువీ... పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన తర్వాతి పోరులో 80 బంతుల్లోనే 84 పరుగులతో జట్టును గెలిపించి తన రాకను ఘనంగా చాటాడు. అది మొదలు తర్వాతి 17 ఏళ్ల పాటు యువరాజ్ బ్యాట్ గర్జించింది. వన్డేల్లో అనేకానేక అద్భుతాలు చేయడమే కాదు... అప్పుడప్పుడే అడుగులు నేర్చుకుంటున్న టి20 క్రికెట్లో కూడా బలమైన ముద్ర వేసింది. ఒకటా...రెండా... భారత జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో యువీ పోషించిన పాత్ర అసమానం. భారత్ తరఫున ఒకే ఒక టెస్టు ఆడిన తండ్రి యోగ్రాజ్ సింగ్ తాను సాధించని ఘనతను కొడుకు ద్వారా అందుకోవాలని కల కన్నాడు. అందుకే జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్‌లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత యువీ అందుకున్న పతకాన్ని బయటకు విసిరేసి క్రికెట్ మాత్రమే ఆడాలని హెచ్చరించాడు. నాడు తండ్రి ఆంతర్యం సరిగా అర్థం చేసుకోలేకపోయినా తర్వాత ఆటపై పెంచుకున్న మమకారం అతడితో చిన్న వయసు నుంచే అద్భుతాలు చేయించింది. అండర్–15 నుంచి ఏ వయసులో ఆడినా పరుగుల వరద పారించడం అలవాటుగా మారిపోయింది. బిహార్‌తో జరిగిన అండర్–19 కూచ్‌బెహర్ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్ తరఫున చెలరేగి చేసిన 358 పరుగుల ఇన్నింగ్స్‌తో యువరాజ్ పేరు దేశవాళీ క్రికెట్లో మారుమోగిపోయింది. ఆ తర్వాత యువీ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. తారాజువ్వలా.... టీమిండియాకు ఎంపికైన తర్వాత కొంత కాలం తన ముద్ర చూపిన యువీ రెండేళ్ల తర్వాత వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే పునరాగమనం తర్వాత 2002 నాట్‌వెస్ట్ టోర్నీ అతని కెరీర్‌ను తారాజువ్వలా పైకి లేపింది. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌కు తోడుగా అర్ధసెంచరీ చేసిన అతను... తన 71వ వన్డేలో గానీ మొదటి సెంచరీ సాధించలేకపోయాడు. 2004లో సిడ్నీ మైదానంలో ఆసీస్‌పై చెలరేగి 122 బంతుల్లో చేసిన 139 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనల్లో ఒకటి. ఇక 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌లో యువీ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో ఆరు సిక్సర్లే కాదు... ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో 30 బంతుల్లో చేసిన 70 పరుగుల ఇన్నింగ్స్ అతని విలువేమిటో చూపించింది. 2010లో ఫామ్ కోల్పోవడం, క్రమశిక్షణ లోపం, ఫిట్నెస్ సమస్యలతో మళ్లీ అతనిపై వేటు పడినా... తక్కువ వ్యవధిలోనే తిరిగొచ్చాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ప్రదర్శన యువరాజ్ కెరీర్లో కోహినూర్ వజ్రంగా నిలిచిపోయింది. బ్యాటింగ్‌కు తోడు అతని లెఫ్టార్మ్ స్పిన్ కూడా భారత్‌కు కీలక సమయాల్లో విజయాలు అందించింది. క్యాన్సర్‌తో పోరాడి... ప్రపంచ కప్ గెలిచిన కొన్నాళ్లకే యువరాజ్‌కు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. జీవితంలో అతి పెద్ద పోరాటంగా భావిస్తూ చికిత్స పొంది కోలుకున్న అనంతరం యువీ మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగు పెట్టడం ఒక అద్భుతం. అయితే కెరీర్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న సమయంలో వచ్చిన క్యాన్సర్ తర్వాత అతని ఆట అంత గొప్పగా సాగలేదు. పోరాటానికి మారుపేరుగా నిలిచిన యువీ పలు మార్లు జట్టులోకి రావడం, పోవడం తరచుగా జరిగాయి. వన్డేల్లో ఇంగ్లండ్‌పై చేసిన 150 పరుగుల తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు, టి20ల్లో ఆస్ట్రేలియాపై 35 బంతుల్లోనే 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు రాలేదు. ఆ తర్వాత దేశవాళీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త క్రికెటర్ల రాకతో అతను మెల్లగా భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో యువీ రాజసం ఎప్పటికీ చెక్కుచెదరనిది అనడంలో సందేహమే లేదు. మధుర జ్ఞాపకాలు... 7 అక్టోబర్, 2000 (నైరోబీ): ఆసీస్‌తో చాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. యువీ తొలి ఇన్నింగ్స్ ఇదే. 80 బంతుల్లో 12 ఫోర్లతో 84 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. యువీ రాక ప్రపంచానికి తెలిసింది. భారత్ ఈ మ్యాచ్‌లో 20 పరుగులతో నెగ్గింది. 13 జూలై, 2002 (లార్డ్స్): ఇంగ్లండ్‌పై నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో అసాధ్యమైన 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కైఫ్ (87 నాటౌట్)తో కలిసి యువీ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఇది. వీరిద్దరి 121 పరుగుల భాగస్వామ్యంతో సాధించిన ఘన విజయం భారత వన్డే క్రికెట్ రాతను మార్చింది. యువీ 63 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు చేశాడు. 22 జనవరి, 2004 (సిడ్నీ): ఆస్ట్రేలియాపై 122 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో చేసిన 139 పరుగులు చేసిన యువరాజ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ ఆసీస్ గెలిచింది. 19 ఫిబ్రవరి, 2006 (కరాచీ): పాకిస్తాన్ గడ్డపై 4–1తో వన్డే సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఆఖరి వన్డేలో 93 బంతుల్లోనే 14 ఫోర్లతో 107 పరుగులు చేయడంతో భారత్ 8 వికెట్లతో గెలిచింది. 19 జనవరి, 2017 (కటక్): పునరాగమనం తర్వాత యువీ చేసిన అద్భుత శతకం ఇది. ఇంగ్లండ్‌పై 127 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగి 150 పరుగులతో తన అత్యధిక స్కోరు నమోదు చేశాడు. 6 6 6 6 6 6 యువరాజ్ అంటే క్రికెట్ ప్రపంచానికి గుర్తుకొచ్చే మ్యాచ్ ఇది. 2007 తొలి టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో యువరాజ్ చూపించిన విశ్వరూపం ఇది. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువీ కొత్త చరిత్ర సృష్టించాడు. టి20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే అతను చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. కొరుకుడు పడని టెస్టు క్రికెట్... వన్డేలు, టి20ల్లో అద్భుతాలు చేసినా యువరాజ్ వేర్వేరు కారణాలతో ఏనాడూ మంచి టెస్టు బ్యాట్స్‌మన్ కాలేకపోయాడు. అతని కెరీర్లో ఉన్న మూడు సెంచరీలు కూడా పాక్‌పై సాధించినవే కావడం విశేషం. లాహోర్ లో కఠిన పరిస్థితుల్లో చేసిన 129 పరుగులు, కరాచీలో ఓటమి ఖాయమైన టెస్టులో 122 పరుగులు చేసిన యువీ... బెంగళూరులో భారత్ స్కోరు 61/4గా ఉన్నప్పుడు చేసిన 169 పరుగులు అతని మూడో శతకం. సెంచరీ కాకపోయినా... ఇంగ్లండ్‌పై 2008 చెన్నై టెస్టులో సచిన్‌కు సహకారం అందిస్తూ చేసిన (85 నాటౌట్) ఇన్నింగ్స్ కూడా ఎప్పటికీ మరచిపోలేనిది. అద్భుతమైన కెరీర్ నీది. మైదానంలోనూ, బయటా కష్టకాలంలో నువ్వు చూపిన పోరాటం అభినందనీయం. జట్టుకు అవసరమైన ప్రతీసారి చాంపియన్‌లా తిరిగొచ్చావు. –సచిన్ గొప్ప కెరీర్ ముగించిన నీకు అభినందనలు. మాకు ఎన్నో విజయాలు, జ్ఞాపకాలు అందించావు. –కోహ్లి ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు కానీ యువీలాంటి వాళ్లు అరుదు. అటు బౌలర్లను, ఇటు క్యాన్సర్‌ను చితక్కొట్టి మనసులు గెలుచుకున్న అతను ఎందరికో స్ఫూర్తిదాయకం. –సెహ్వాగ్ ప్రిన్స్‌కు అభినందనలు. భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో నువ్వే అత్యుత్తమం. నేనూ నీలాగా బ్యాటింగ్ చేయగలిగితే బాగుండేది. బీసీసీఐ ఇకపై 12 నంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించాలి. –గంభీర్ నా యుద్ధ వీరుడు. ఆటలో, జీవితంలో ఎంతో పోరాడాడు. నీ గురించి అంతా ఎప్పటికీ చెప్పుకుంటారు. –హర్భజన్ నీతో ఆడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ముగిస్తున్నావు. నీ పట్టుదల, పోరాటంతో మాకందరికీ స్ఫూర్తిగా నిలిచావు. –లక్ష్మణ్ రిటైర్మెంట్ను బాగా ఆస్వాదించు. –బ్రాడ్ ‘విశ్వ’ రూపం యువరాజ్ కెరీర్లో 2011 వన్డే ప్రపంచ కప్ విజయం ఎవరెస్ట్‌లాంటిది. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను భారత్ 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు సహా 362 పరుగులు చేసిన అతను... 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచాడు. వ్యక్తిగత జీవితం... తండ్రి యోగ్రాజ్, తల్లి షబ్నమ్ విడాకులు తీసుకొని విడిపోయినా యువరాజ్ వారిద్దరికీ ఎప్పుడూ దూరం కాలేదు. తల్లితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న అతను తండ్రితోనూ సంబంధాలు కొనసాగించాడు. కొన్నిసార్లు యోగ్రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డా... తనకు ఆటలో ఓనమాలు నేర్పిన తండ్రిని గౌరవిస్తూనే వచ్చాడు. 2015 ఐపీఎల్ సీజన్లో యువరాజ్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్లో ఇదే రికార్డుగా ఉంది. 2016లో నటి హాజల్ కీచ్‌తో యువీకి పెళ్ళయింది. బాల నటుడిగా రెండు పంజాబీ చిత్రాల్లో కూడా యువరాజ్ నటించాడు. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’... 2014లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు అందుకున్నాడు. -
విదేశీ టి20లపై యువరాజ్ ఆసక్తి
న్యూఢిల్లీ: భారత జట్టు నుంచి స్థానం కోల్పోయిన వెటరన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ విదేశీ టి20 టోర్నీలపై ఆసక్తి కనబరుస్తున్నాడు. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పి... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతితో విదేశాల్లో జరిగే ప్రైవేట్ టి20 టోర్నీల్లో ఆడాలని భావిస్తున్నాడు. ‘యువరాజ్ బోర్డు నుంచి స్పష్టత కోరుతున్న మాట వాస్తవమే. కెనడాలో జరిగే ‘జి టి20’, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లలో జరిగే ‘యూరో టి20’లలో ఆడాలనుకుంటున్నాడు. అయితే అతను రిటైరైనా కూడా బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత్‌లో రిజిస్టర్ టి20 ప్లేయర్. ఈ నేపథ్యంలో ప్రైవేట్ టి20లో ఆడే వెసులుబాటు ఉందో లేదో ఓసారి చూసుకోవాలి’ అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. కరీబియన్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు భారత జట్టు మాజీ సభ్యుడు ఇర్ఫాన్ పఠాన్‌కు ఇటీవల బోర్డు నిరాకరించింది. -
19 ఏళ్ల ప్రస్థానం ముగించి...
1999 సెప్టెంబర్ 22–26... రంగన హెరాత్ తన తొలి టెస్టు ఆడిన తేదీలు. గత 19 ఏళ్లుగా అతను అలసట లేకుండా అంతర్జాతీయ క్రికెట్లో వేల సంఖ్యలో బంతులు వేస్తూనే ఉన్నాడు. కొత్త మిలీనియం ప్రారంభానికి ముందు అరంగేట్రం చేసి ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ ఆడుతున్నవారిలో హెరాత్ ఆఖరివాడు. ఒకనాడు మురళీధరన్ నీడలోనే ఉండిపోయిన అతను, మురళీధరన్ తప్పుకున్న తర్వాత తనదైన ప్రత్యేకత కనబర్చి శ్రీలంక క్రికెట్లో ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నాడు. నేటి నుంచి గాలేలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు 40 ఏళ్ల హెరాత్ ముదియన్సెలగే రంగన కీర్తి బండార (హెచ్ఎంఆర్కేబీ) హెరాత్‌కు ఆఖరి టెస్టు మ్యాచ్ కానుంది. సాక్షి క్రీడా విభాగం : శ్రీలంక జట్టులో మురళీధరన్ ఉన్నంత వరకు 22 టెస్టులు 37.88 సగటుతో హెరాత్ కేవలం 71 వికెట్లు పడగొట్టాడు. రెండో స్పిన్నర్‌గా జట్టులో కొనసాగుతున్నా, కొన్ని అద్భుత ప్రదర్శనలు ఉన్నా అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కచ్చితత్వంతో సుదీర్ఘ స్పెల్‌ల పాటు బౌలింగ్ చేసి బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెంచడమే అతని పనిగా ఉండేది. ఇలాంటి స్థితిలో టన్నులకొద్దీ వికెట్లు మాత్రం మురళీ ఖాతాలోకి వెళ్లిపోయేవి. అయితే ఏనాడూ తన అసంతృప్తిని ప్రదర్శించని రంగన... మురళీ తప్పుకున్న తర్వాత తనెంత విలువైన ఆటగాడినో చూపిస్తూ చెలరేగిపోయాడు. ఆ తర్వాత ఆడిన 70 టెస్టుల్లో కేవలం 26 సగటుతో ఏకంగా 359 వికెట్లు తీయడం హెరాత్ స్వయంప్రకాశాన్ని చూపిస్తుంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 10వ స్థానంలో (430 వికెట్లు) ఉన్న హెరాత్ ఎడంచేతి వాటం వారిలో అత్యంత విజయవంతమైన బౌలర్ కావడం విశేషం. తొలి పదేళ్లలో 14 టెస్టులు మాత్రమే దక్కడంతో దాదాపు కెరీర్ ముగిసిపోయిన దశలో ఇంగ్లండ్‌లో మైనర్ లీగ్‌లు ఆడుకునేందుకు హెరాత్ వెళ్లిపోయాడు. అలాంటి స్థితిలో 31 ఏళ్ల వయసులో 2009లో అనూహ్యంగా వచ్చిన మరో అవకాశంతో హెరాత్ జట్టులో పాతుకుపోయాడు. తన సత్తాను ప్రదర్శిస్తూ జట్టులో కొనసాగగలిగాడు. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాతే అతను 230 వికెట్లు తీయడం మరో చెప్పుకోదగ్గ విశేషం. ఇతర బౌలర్లతో పోలిస్తే హెరాత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం నాలుగో ఇన్నింగ్స్‌లో అతను తీసిన వికెట్ల సంఖ్య. చివరి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని పడగొట్టి మ్యాచ్‌ను గెలిపించడంలో తనకెవరూ సాటి రారన్నట్లుగా హెరాత్ ఏకంగా 12 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న మురళి 7 సార్లే ఆ ఘనత నమోదు చేయగలిగాడు! దీనిపై స్పందిస్తూ ‘అవన్నీ సొంతగడ్డపై స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లు. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్‌లో బంతి బాగా టర్న్ అవుతుంది. రికార్డులకు పిచ్‌లు కూడా కారణం’ అంటూ చెప్పుకోవడం హెరాత్కే చెల్లింది. శ్రీలంకలోనే కాకుండా 2011లో డర్బన్‌లో అద్భుత బౌలింగ్‌తో 9 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గడ్డపై లంక తొలి టెస్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడం అతని కెరీర్లో చిరస్మరణీయ జ్ఞాపకం. ఘనతలపరంగా చూస్తే కావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకపోయినా, స్టార్ బౌలర్‌గా గుర్తింపు లేకపోయినా తన పనేంటో తాను చేసుకుంటూ పోయిన హెరాత్ వివాదాలకు దూరంగా ఆటకు గుడ్‌బై చెబుతున్నాడు. తాను తొలి టెస్టు ఆడిన, బాగా అచ్చొచ్చిన గాలే మైదానంలో (99 వికెట్లు) చివరి టెస్టులో హెరాత్ మరో ఐదు వికెట్లు తీస్తే హ్యాడ్లీ, బ్రాడ్, కపిల్‌లను దాటి ఏడో స్థానంతో కెరీర్ ముగిస్తాడు. శ్రీలంక గీ ఇంగ్లండ్; తొలి టెస్టు (గాలే) ఉదయం గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
బ్రేవో వీడ్కోలు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టి20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు చిర పరిచితమైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అయితే, టి20 లీగ్‌లు మాత్రం ఆడతానని తెలిపాడు. 35 ఏళ్ల బ్రావో... 2004లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టు ద్వారా వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌పై జార్జిటౌన్లో తొలి వన్డే ఆడాడు. 40 టెస్టుల్లో 2,200 పరుగులు చేసి, 86 వికెట్లు పడగొట్టాడు. 164 వన్డేల్లో 2,968 పరుగులు, 199 వికెట్లు తీశాడు. టి20ల్లో మరింత ప్రభావవంతుడైన ఈ ఆల్‌రౌండర్ 2012, 2016 టి 20 ప్రపంచ కప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడు. ఈ ఫార్మాట్లో 66 మ్యాచ్‌ల్లో 1,142 పరుగులు చేసి, 52 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. కెరీర్ అలా ముగిసింది: బ్రావో టెస్టు కెరీర్ 2010లోనే ముగిసింది. 2014లో భారత్‌లో పర్యటించిన విండీస్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రావోకు ఆ సిరీసే చివరిదైంది. బోర్డుతో వివాదాల నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ధర్మశాలలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ వేసేందుకు జట్టంతటినీ మైదానంలోకి తీసుకొచ్చి సంచలనం రేపాడు. తర్వాత విండీస్ జట్టు చివరిదైన ఐదో వన్డే, ఏకైక టి20, మూడు టెస్టులు ఆడకుండానే స్వదేశం వెళ్లిపోయింది. దీంతో ధర్మశాల మ్యాచ్‌తోనే ఆల్‌రౌండర్ వన్డే కెరీర్ ముగిసినట్లైంది. 2016లో అబుదాబిలో పాకిస్తాన్‌తో చివరి టి20 ఆడిన బ్రావో... ప్రస్తుతం విండీస్ దీవులతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్లలో నిర్వహించే టి20 లీగ్‌లలో పాల్గొంటున్నాడు. మారిన పరిణామాలతో దేశం తరఫున 2019 వన్డే ప్రపంచ కప్ ఆడతాడని భావించారు. కానీ, అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. -
కోహ్లి ఆడకపోతే ఎలా?
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్థాయి ఏంటో కొత్తగా చెప్పనవసరంలేదు. మ్యాచ్ ఫలితాలు ఎలా ఉన్నా అతను ఆడుతుంటే దేశం మొత్తం మ్యాచ్ చూడటం మాత్రం ఖాయం. ఇప్పుడతను సుదీర్ఘ షెడ్యూల్ నుంచి విశ్రాంతి కోరుకుంటూ ఆసియా కప్‌కు దూరమయ్యాడు. దాంతో ప్రసారకర్తలైన స్టార్ స్పోర్ట్స్ గుండెల్లో రాయి పడింది! అసలే అంతంత మాత్రం ఆదరణ ఉండే ఆసియా కప్‌లో కోహ్లిలాంటి స్టార్ కూడా లేకపోతే సహజంగానే రేటింగ్‌లపై ప్రభావం పడుతుందని స్టార్ భావిస్తోంది. ఇదే విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి స్టార్ సంస్థ లేఖ రాసినట్లు సమాచారం. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగితే భారత్ మాత్రం కోహ్లిని పక్కన పెట్టిందని... ఏసీసీతో తాము చేసుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమేనని ఆరోపించింది. గతంలో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అద్భుతమైన రేటింగ్‌లు రావడం, అతను ఔట్ కాగానే పడిపోయిన విషయాన్ని కూడా స్టార్ గుర్తు చేసింది. భారీ మొత్తం చెల్లించి ఏసీసీతో ఎనిమిదేళ్ల కాలానికి స్టార్ ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్‌కు విశ్రాంతినివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమతో పాటు టోర్నీతో సంబంధం ఉన్న అనేక సంస్థలకు వాణిజ్యపరంగా నష్టదాయకమని పేర్కొంది. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ‘బీసీసీఐ అంతర్గత వ్యవహారాలతో స్టార్‌కు ఎలాంటి సంబంధం లేదు. మా సెలక్షన్ ప్రక్రియ విషయంలో వారి జోక్యం అనవసరం’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో మంగళవారం హాంకాంగ్‌తో, ఆ తర్వాత బుధవారం పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
అలిస్టర్ కుక్ అల్విదా
లండన్: టెస్టు క్రికెట్లో అసాధారణ ఘనతలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. భారత్‌తో శుక్రవారం నుంచి ఓవల్ మైదానంలో జరిగే టెస్టు తర్వాత రిటైర్ అవుతున్నట్లు అతను ప్రకటించాడు. గత కొంత కాలంగా ఘోరంగా విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలైన కుక్ ఇక ఆడలేనంటూ తప్పుకున్నాడు. వయసు 33 ఏళ్లే అయినా, అతని తాజా ఫామ్ చూస్తే రిటైర్మెంట్ ప్రకటన ఆశ్చర్యం కలిగించలేదు. కెరీర్ మొత్తంగా చూస్తే అద్భుత రికార్డు ఉన్న కుక్ బ్యాటింగ్ 2018లో పేలవంగా సాగింది. 9 టెస్టుల్లో 16 ఇన్నింగ్స్‌లు ఆడిన కుక్ కేవలం 18.62 సగటుతో 298 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత ఎనిమిదేళ్ల కాలంలో తొలిసారి అతని సగటు 45కంటే తక్కువగా పడిపోగా... ఆటలో ప్రాథమిక స్థాయి బలహీనతలు కూడా ఇటీవల తరచుగా కనిపించాయి. ఇవన్నీ కుక్ రిటైర్మెంట్కు కారణమయ్యాయి. టెస్టుల నుంచి రిటైర్ అయినా కౌంటీల్లో ఎసెక్స్ తరఫున దేశవాళీ క్రికెట్‌ను కొనసాగిస్తానని అతను చెప్పాడు. పుష్కర కాలపు కెరీర్లో ఇంగ్లండ్ తరఫున పలు చిరస్మరణీయ టెస్టు విజయాలతో పాటు అనేక పరాభవాల్లో కూడా భాగంగా ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఘనత వహించిన కుక్, ఓవరాల్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. దాదాపు రెండేళ్ల క్రితం భవిష్యత్‌లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును కూడా అధిగమించగలడని కుక్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వరుస వైఫల్యాలతో ఆ స్వప్నానికి కుక్ సుదూరంగా నిలిచిపోయాడు. టెస్టులకంటే ముందే వన్డేల్లో అరంగేట్రం చేసినా... మారుతున్న శైలిని అందుకోలేక విఫలమైన కుక్ వన్డే కెరీర్ 2014 డిసెంబర్లోనే ముగిసింది. 92 వన్డేల్లో అతను 36.40 సగటుతో 3204 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతను 4 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడటం విశేషం. గత కొద్ది నెలలుగా దీని గురించి తీవ్రంగా ఆలోచించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు ఇది బాధాకరమైన రోజే అయినా నా శక్తి మేరా జట్టుకు ఉపయోగపడ్డానని, ఇక నాలో సత్తా కరిగిపోయిందని తెలుసు కాబట్టి సంతోషంగానే ఉన్నాను. నేను ఊహించినదానికంటే చాలా ఎక్కువగా సాధించాను. దేశం తరఫున ఇన్నేళ్లు ఆడగలగడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రిటైర్ అయ్యేందుకు ఇది సరైన సమయం. నా కెరీర్లో ఎంతో మంది అండగా నిలచినా... నన్ను ఈ స్థాయికి చేరేలా తీర్చిదిద్దిన గ్రాహం గూచ్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. –అలిస్టర్ కుక్ కుక్ టెస్టు కెరీర్ టెస్టులు 160 ఇన్నింగ్స్ 289 పరుగులు 12,254 అత్యధిక స్కోరు 294 సగటు 44.88 సెంచరీలు 32 అర్ధసెంచరీలు 56 క్యాచ్‌లు 173 -
సిక్సర్ల రికార్డు సమం
బాసెటెర్ (వెస్టిండీస్): వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో గేల్(73; 66 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఐదో సిక్సర్‌ను సాధిండం ద్వారా గేల్ తన కెరీర్లో 476వ సిక్సర్‌ను నమోదు చేశాడు. ఫలితంగా ఆఫ్రిది(476 సిక్సర్లు) అత్యధిక సిక్సర్ల రికార్డును గేల్ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఆఫ్రిది, గేల్ తర్వాత బ్రెండన్ మెకల్లమ్(398), సనత్ జయసూర్య(352), ఎంఎస్ ధోని(342), ఏబీ డివిలియర్స్(328), రోహిత్ శర్మ(291), మార్టిన్ గప్టిల్(274), సచిన్ టెండూల్కర్(264)లు ఉన్నారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా తొమ్మిదేళ్ల తర్వాత వెస్టిండీస్ గడ్డపై బంగ్లాదేశ్ సిరీస్ గెలుచుకుంది. -
మరో రికార్డు చేరువలో ధోని..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం ధోని మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. వారిద్దరి సరసన ధోని కూడా చేరనున్నాడు. ఆ రికార్డు ఏంటంటే.. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లో కలిపి 500లు, ఆపైన మ్యాచ్‌లు ఆడటం. ప్రస్తుతం ధోని 497(టెస్టులు-90, వన్డేలు-318, టీ20-89) మ్యాచ్‌లతో పదో స్థానంలో ఉన్నాడు. ధోని బ్రిస్టల్‌లో జూలై 8వ తేదీన ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టీ20 మ్యాచ్‌తో 500 మ్యాచ్‌ల క్లబ్లో చేరనున్నాడు. ప్రస్తుతం ధోని ఐర్లాండ్‌తో బుధవారం, శుక్రవారం రెండు టీ20లు మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. ధోని ఈ ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే అతను ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 505కు చేరనుంది. ఈ రికార్డులో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 664 మ్యాచ్‌లతో(టెస్టులు-200, వన్డేలు-463, టీ20-1) మొదటి స్థానంలో ఉన్నాడు. సచిన్ తర్వాత ఇండియా తరఫున ఈ రికార్డును రాహుల్ ద్రవిడ్ సాధించాడు. ద్రవిడ్ 509మ్యాచ్‌లతో(టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1) రెండో స్థానంలో ఉన్నాడు. అతి తర్వలో ధోని భారత్ తరఫున 500 మ్యాచ్‌లు ఆడిన మూడో ప్లేయర్‌గా రికార్డును నెలకొల్పనున్నాడు. అన్ని దేశాల ప్లేయర్స్‌తో పోలిస్తే సచిన్‌దే అగ్రస్థానం. శ్రీలంక ఆటగాడు మహేల జయవర్దనే రెండో స్థానం, కూమార సంగాక్కర మూడో స్థానంలో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని 497 మ్యాచ్‌లతో పదో స్థానంలో ఉన్నాడు. టాప్-10: అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వ్యక్తుల జాబితా.. 1. సచిన్ టెండూల్కర్ - 594(టెస్టులు-200, వన్డేలు-463, టీ20-1)- ఇండియా 2. మహేళ జయవర్ధనే- 652(టెస్టులు-149, వన్డేలు-448, టీ20-55)-శ్రీలంక 3. కుమార సంగాక్కర -594(టెస్టులు-134, వన్డేలు-404, టీ20-56)-శ్రీలంక 4. జయసూర్య- 586 (టెస్టులు110, వన్డేలు445, టీ2031)-శ్రీలంక 5. రికీ పాంటింగ్- 560 (టెస్టులు-168, వన్డేలు-375, టీ20-17)-ఆస్ట్రేలియా 6. షాహిద్ అఫ్రిది- 524 (టెస్టులు-27,వన్డేలు-398, టీ20-99) -పాకిస్తాన్ 7. కలిస్- 519 (టెస్టులు-166, వన్డేలు-328,టీ20- 25)-దక్షిణాఫ్రికా 8. రాహుల్ ద్రవిడ్- 509(టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1)- ఇండియా 9. ఇంజమామ్-ఉల్-హక్-499(టెస్టులు-120, వన్డేలు-378, టీ20-1)పాకిస్తాన్ 10. మహేంద్ర సింగ్ ధోని 497(టెస్టులు-90, వన్డేలు-318, టీ20-89)ఇండియా -
అంతర్జాతీయ క్రికెట్లో మూడో ఆల్‌రౌండర్‌గా..
డెహ్రాడూన్: అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇక్కడ జరిగిన చివరి టీ20లో బంగ్లాదేశ్ ఓడిపోవడంతో సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యింది. కాగా, బంగ్లా ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20లో నజీబుల్లా జద్రాన్ వికెట్ తీసిన షకీబుల్.. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అన్ని అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు, 500 వికెట్లు పడగొట్టిన మూడో ఆల్‌రౌండర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ జాక్వస్ కల్లిస్, పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిలు మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు. ఈ ఇద్దరి కంటే వేగంగా షకిబుల్ ఈ క్లబ్ చేరడం విశేషం. దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక పాత్ర పోషించిన కలిస్.. 519 మ్యాచ్‌ల్లో 25, 534 పరుగులు, 577 వికెట్లు సాధించాడు. తర్వాతి స్థానంలో ఉన్న షాహిద్ అఫ్రిది 524 మ్యాచ్‌ల్లో 11,196 పరుగులతో పాటు 541 వికెట్లను సొంతం చేసుకున్నాడు. షకీబుల్ హసన్ 302 మ్యాచ్‌ల్లోనే 10,102 పరుగులు చేయడతోపాటు 500 వికెట్ల మార్కును అందుకున్నాడు. కాగా, భారత్ తరపున కపిల్ దేవ్ మాత్రమే ఈ రికార్డుకు చేరువగా వచ్చాడు. టీమిండియా చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కపిల్ దేవ్... 356 మ్యాచ్‌ల్లో 9,031 పరుగులు చేయడంతోపాటు 687 వికెట్లు పడగొట్టాడు. -
పిన్న వయసు కెప్టెన్‌గా...
హరారే: అఫ్గానిస్తాన్ యువ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అత్యంత చిన్న వయసు (19 ఏళ్ల 160 రోజులు)లోనే అంతర్జాతీయ జట్టుకు సారథ్యం వహించిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ అస్గర్ స్టాన్జాయ్ కడుపునొప్పి కారణంగా ఆస్పత్రి పాలవడంతో రషీద్‌కు తమ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం దక్కింది. అఫ్గాన్ మార్చి 4న స్కాట్లాండ్తో ప్రపంచకప్ అర్హత మ్యాచ్ ఆడనుంది. దీనికి రషీద్ సారథ్యం వహిస్తాడని అఫ్గాన్ బోర్డు ట్విట్టర్లో ప్రకటించింది. ఇప్పటివరకు ఈ రికార్డు రాజిన్ సలే (బంగ్లాదేశ్–20 ఏళ్ల 297 రోజులు; దక్షిణాఫ్రికాపై 2004లో) పేరిట ఉంది. ఇటీవల ప్రకటించిన ఐసీసీ వన్డే, టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రషీద్ నంబర్‌వన్‌గా నిలిచి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడయ్యాడు. రషీద్ 37 వన్డేల్లో 86 వికెట్లు, 29 టి20ల్లో 47 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతడిని ‘రైట్ టు మ్యాచ్’ కార్డు ద్వారా రూ.9 కోట్లకు దక్కించుకుంది. -
అఫ్ఘానిస్తాన్ అద్భుతం
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్లో అఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొలిసారి ఆసియా కప్ అండర్–19 టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టైటిల్ ఫేవరెట్ పాకిస్తాన్‌పై అఫ్ఘానిస్తాన్ ఏకంగా 185 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట అఫ్ఘాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఇక్రామ్ ఫైజీ (107; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా, రహ్మాన్ గుల్ 40 పరుగులు చేశాడు. మూసా 3, షాహిన్ 2 వికెట్లు తీశారు. తర్వాత పాక్ 22.1 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. తాహ (19) టాప్‌స్కోరర్ కాగా, అఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ 5, ఖైస్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు.