
కిర్‌స్టెన్‌ను తొలగించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తమ చీఫ్ కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టెన్‌ను తొలగించింది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తమ చీఫ్ కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టెన్‌ను తొలగించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న గ్యారీ.. ఐపీఎల్‌లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 2011 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ఆయనదే కీలక పాత్ర అయినా టి20 ఫార్మాట్‌లో తన వ్యూహాలు పనిచేయలేదు. రెండు సీజన్లపాటు ఢిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్నా చివరి నుంచి రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది.