Delhi Daredevils
-
IPL: ‘ఢిల్లీ క్యాపిటల్స్’ కోసం కోట్లు వదులుకున్న సూపర్‌స్టార్.. అందుకే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల వర్షం. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఈ మెగా క్రికెట్ ఈవెంట్లో భాగమైన ఫ్రాంఛైజీలలో అత్యధికం బడా సంస్థలకు చెందినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఐపీఎల్లో సక్సెస్ అయితే ఎంతటి క్రేజ్ వస్తుందో.. ఏమాత్రం తేడా జరిగినా అదే స్థాయిలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది! ఐపీఎల్ రెండో సీజన్(2009)లో విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ ఆ తర్వాత కనుమరుగైన తీరే ఇందుకు నిదర్శనం. అయితే, అదే ఏడాది.. ఢిల్లీ క్యాపిటల్స్ తాము కూడా చార్జర్స్ మాదిరే చేతులు కాల్చుకోకుండా తీసుకున్న కీలక నిర్ణయం గురించి, దానితో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు ఉన్న సంబంధం గురించి బీసీసీఐ మాజీ జీఎం అమృత్ మాథూర్ సంచలన విషయాలు తాజాగా వెల్లడించాడు. బాలీవుడ్‌తో అనుబంధం ఐపీఎల్‌కు ప్రాచుర్యం కల్పించే క్రమంలో బాలీవుడ్‌ను కూడా ఇందులో మమేకం చేసిన విషయం తెలిసిందే. బీ-టౌన్ బాద్షా షారుక్ ఖాన్, అలనాటి హీరోయిన్ జూహీ చావ్లా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు యజమానులు కాగా.. శిల్పా శెట్టి కుంద్రా రాజస్తాన్ రాయల్స్‌కు, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్‌కు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంఛైజీ ఓనర్లుగానే గాకుండా ప్రమోషన్లలో భాగమైన, భాగమవుతున్న స్టార్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో 2009లో ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్) సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అక్కీతో అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోగా ఆర్థికపరంగా నష్టాలూ చవిచూసింది. అనవసర ఖర్చులు ఎందుకు? అనవసర ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అతడితో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు చట్టపరంగా చిక్కులు ఎదరవుతాయని భావించినా.. అక్షయ్ కుమార్ పెద్ద మనసుతో ఈ సమస్య నుంచి ఫ్రాంఛైజీ తేలికగా బయటపడేలా చేశాడు. ‘‘ప్రమోషనల్ ఫిల్మ్స్, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ల కోసం అక్షయ్ కుమార్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. కోట్లా మైదానంలో విన్యాసాలు మినహా క్యాపిటల్స్‌కు అతడి వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. నిజానికి అతడి సేవలు వినియోగించడంలో యాజమాన్యం విఫలమైంది. నష్టాలు వెంటాడాయి. దీంతో అర్ధంతరంగా అక్కీతో డీల్ ముగించాలని భావించింది. న్యాయపరంగా చిక్కులు.. అయితే న్యాయపరంగా అందుకు అనేక అడ్డంకులు ఉండటంతో అక్షయ్ కుమార్ దయపైనే అంతా ఆధారపడి ఉన్న సందర్భం. అక్కీ లాయర్లతో విషయం గురించి చెప్పాం. ఆ తర్వాత ఓరోజు సినిమా షూటింగ్లో ఉన్నపుడు.. షాట్ ముగిసిన తర్వాత అక్షయ్ వానిటీ వ్యాన్‌లోకి నేను వెళ్లాను. మరేం పర్లేదన్న అక్షయ్ కుమార్ సంశయిస్తూనే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి.. డీల్ రద్దు చేసుకోవాలనుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి వివరించాను. కానీ అక్షయ్ మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు. మరేం ప్రాబ్లం లేదండి! ఒకవేళ ఇదంతా వర్కౌట్ కాదనుకుంటే.. వెంటనే రద్దు చేసేయండి. పర్లేదు అన్నాడు. నేను విన్నది నిజమేనా నేను విన్నది నిజమేనా అన్న సందేహంలో కొట్టుమిట్టాతుండగా.. ‘‘మీరేం ఇబ్బంది పడకండి. ఎలాంటి సమస్య రాకుండా దీనిని ఎలా ముగించాలో మా లాయర్లతో నేను మాట్లాడతా అని మళ్లీ అక్షయ్ క్లారిటీ ఇచ్చాడు’’ అని అమృత్ మాథుర్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఆత్మకథలో నాటి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్‌గా నిలవలేదన్న విషయం తెలిసిందే. తాజా సీజన్లోనూ దారుణ ప్రదర్శనతో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక అక్షయ్ కుమార్ విషయానికొస్తే.. అతడు నటించిన ఓ మై గాడ్ 2 సినియా ఇటీవలే విడుదలైంది. చదవండి: APL 2023: తొలిరోజు మ్యాచ్‌కు శ్రీలీల.. జట్ల వ్యూహాలివే! లక్కీడిప్‌లో ఆ అదృష్టం మీదైతే! -
‘ఉత్తరాది’ రాత మారుతుందా?
ఐపీఎల్లో పదకొండు సీజన్లు ముగిసినా ఒక్కసారి కూడా టైటిల్ ఆనందం దక్కని జట్లలో ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి. లీగ్ తొలి ఏడాది 2008లో టాప్ స్టార్లతో అంచనాలను అందుకుంటూ తమ స్థాయిని ప్రదర్శించి ఈ రెండు టీమ్‌లు సెమీఫైనల్ చేరాయి. ఆ తర్వాత పది ప్రయత్నాల్లో ఎక్కువ సార్లు నిరాశే మిగిలింది. 2014లో రన్నరప్‌గా నిలవడం మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో పంజాబ్ లీగ్ దశకే పరిమితమైంది. మరోవైపు ఢిల్లీ 2009లో సెమీస్, 2012లో ప్లే ఆఫ్స్ దశకు వెళ్లినా... 2013 నుంచి 2018 మధ్య ఆరేళ్లలో మూడుసార్లు చివరి స్థానంలోనే నిలవడం ఆ జట్టు పరిస్థితిని చూపిస్తోంది. ఈసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారడంతో పాటు సహాయక సిబ్బందిని కూడా చాలా వరకు మార్చుకొని కొత్త ఆశలతో బరిలోకి దిగుతుండగా... గతేడాది ఆరంభంలో అద్భుతంగా దూసుకుపోయి ఆ తర్వాత చతికిలపడ్డ∙పంజాబ్ పాఠాలు నేర్చుకొని మైదానంలోకి వస్తోంది. కుర్ర ‘త్రయం’... బలాలు: ఢిల్లీ బ్యాటింగ్ ప్రధానంగా నలుగురు భారత ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంది. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఈసారి జట్టు కొత్తగా తెచ్చుకుంది. ధావన్ రాణించడం జట్టుకు ఎంతో అవసరం. అతనితో పాటు మరో ముగ్గురు యువ ఆటగాళ్లు జట్టు రాతను ప్రభావితం చేయగలరు. విధ్వంసక ఆటతో ఇప్పటికే భారత టీమ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రిషభ్ పంత్ ఆ జట్టు ప్రధాన బలం. పంత్‌తో పోటీ పడుతూ చెలరేగిపోగల శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో ఉన్నాడు. పంత్ గత ఏడాది ఒక సెంచరీతో పాటు ఐదు అర్ధసెంచరీలు సాధించగా, అయ్యర్ నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వీరితో పాటు పృథ్వీ షా స్ట్రోక్ ప్లే కూడా కీలకం కానుంది. ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, బండారు అయ్యప్ప జట్టులో ఉన్నా... వారికి ఎన్ని మ్యాచ్‌లలో అవకాశం లభిస్తుందనేది చూడాలి. విదేశీ ఆటగాళ్లలో భారీ హిట్టర్లయిన ‘కొలిన్ ద్వయం’ మున్రో, ఇంగ్రామ్ చెలరేగి శుభారంభం అందించగలరు. క్రిస్ మోరిస్ ఆల్‌రౌండ్ నైపుణ్యంపై కూడా జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్లు బౌల్ట్, రబడ పేస్ బాధ్యత తీసుకుంటారు. భారత పేసర్లలో అవేశ్ ఖాన్‌కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. ఇషాంత్ శర్మ కూడా ఈసారి సొంత జట్టు తరఫున ఆడుతున్నాడు. నేపాల్ లెగ్‌స్పిన్నర్ సందీప్ లమిచానే అందుబాటులో ఉన్నా... నలుగురు విదేశీయుల పరిమితిలో అతనికి అవకాశం దక్కడం అంత సులువు కాదు. బలహీనతలు: ధావన్ గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ తరఫున గొప్పగా ఏమీ ఆడలేదు. మరోవైపు నుంచి వార్నర్ జోరులో అతని లోపాలు తెలియలేదు. ఫామ్ కోల్పోవడంతోనే రైజర్స్ అతడిని వదిలేసుకుంది. ఇప్పుడు అతను ఎంత ప్రభావం చూపిస్తాడనేది ముఖ్యం. గత ఏడాది ఢిల్లీ తరఫు నుంచే మున్రో ఐదు ఇన్నింగ్స్‌లలో 3 సార్లు డకౌట్ కాగా, భారత్‌లో ఇంగ్రామ్ ఆటపై సందేహాలున్నాయి.నిరంతరాయంగా దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్న రబడ వరల్డ్ కప్‌కు ముందు అన్ని మ్యాచ్‌లలో బరిలోకి దిగే అవకాశం తక్కువ. ప్రధాన స్పిన్నర్లుగా భావిస్తున్న అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా ఇటీవలి ప్రదర్శన అంతంత మాత్రమే. టి20 క్రికెట్లో ఇషాంత్ ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది! మొత్తంగా చూస్తే మెరుపు బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేస్తే క్యాపిటల్స్ విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. రికీ పాంటింగ్ కోచ్‌గా, సౌరవ్ గంగూలీ సలహాదారుడిగా ఉన్న ఈ జట్టుకు వారి మార్గనిర్దేశనం ఎంత వరకు పని చేస్తుందో చూడాలి. లీగ్‌లో ఉన్న ఎనిమిది టీమ్‌లలో ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టు ఇదే. ఢిల్లీ క్యాపిటల్స్ (డేర్‌డెవిల్స్) 2018లో 14 మ్యాచ్‌లు ఆడగా 5 గెలిచి, 9 ఓడింది. జట్టు వివరాలు శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, పృథ్వీ షా, హనుమ విహారి, మన్జోత్ కల్రా, నాథు సింగ్, రాహుల్ తేవటియా, అంకుశ్ బైన్స్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అమిత్ మిశ్రా, జలజ్ సక్సేనా, బండారు అయ్యప్ప (భారత ఆటగాళ్లు), రబడ, మోరిస్, లమిచానే, మున్రో, ఇంగ్రామ్, బౌల్ట్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, కీమో పాల్ (విదేశీ ఆటగాళ్లు). -
గంభీర్‌పై వేటు.. ఫ్యాన్స్ గుస్సా !
న్యూఢిల్లీ : వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు అప్పుడే ఫ్రాంఛైజీలు తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. ఐపీఎల్-2019 కోసం తమ జట్టులోని ఆటగాళ్ల ప్రక్షాళనను మొదలెట్టాయి. అవసరం లేని ఆటగాళ్లను వదులుకుంటూ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులో గుదిబండగా మారిన సీనియర్ ఆటగాళ్లను వదులుకోవడంలో కూడా ప్రాంఛైజీలు ఏ మాత్రం సంశయించడం లేదు. ఇప్పటికే కింగ్స్ పంజాబ్ యువరాజ్‌ను వదులుకోగా.. ఢిల్లీ డేర్ డెవిల్స్.. కెప్టెన్ గౌతం గంభీర్‌నే వదులుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. గంభీర్‌తో సహా 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో భారత ఆటగాళ్లు మహ్మద్ షమీ, సయాన్ గోష్, గురక్రిత్ సింగ్, నమాన్ ఓజా ఉండగా.. విదేశీ ఆటగాళ్లలో జాసన్ రాయ్, జూనియర్ డాలా, లియామ్ ప్లంకెట్, డానియల్ క్రిస్టియన్, గ్లేన్ మాక్స్‌వెల్‌లు ఉన్నారు. పంత్, అయ్యర్, పృథ్వీషాతో సహా 14 మందిని మాత్రమే ఢిల్లీ అట్టిపెట్టుకుంది. ఇక గంభీర్‌ను వదులుకోవడంపై అభిమానులు ఢిల్లీ ఫ్రాంఛైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా కోల్‌కతాకు రెండు సార్లు టైటిల్ అందించిన గంభీర్.. ఢిల్లీ కోసం వస్తే వదులుకుంటారా? అని మండిపడుతున్నారు. గంభీర్ లేని ఢిల్లీ జన్మలో ఐపీఎల్ టైటిల్ నెగ్గదని శాపనార్ధాలు పెడుతున్నారు. ఇదో పిచ్చి నిర్ణయం అంటూ కామెంట్ చేస్తున్నారు. DD officials should use their brains while selecting the squad. Mark my words you can never win ipl without gambhir. I don't understand what u ppl think while selecting squad. — jasdeep (@jsdeepand) November 15, 2018 Only @GautamGambhir could have won you IPL. Another season to lose next year. Waste of team. Stupid of a franchise. You have hurt Delhi ppl over the years. — Bhavnoor (@BhavnoorSB) November 15, 2018 -
శిఖర్ ధావన్... సొంత గూటికి!
ఢిల్లీ: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడటం దాదాపు ఖాయమైంది. తద్వారా 11 ఏళ్ల తర్వాత అతడు సొంత నగరం తరఫున బరిలో దిగనున్నాడు. ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌కు ఆడుతున్న ఈ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ ఈ సారి ఫ్రాంచైజీ మారడానికి కారణం సన్ రైజర్స్ యాజమాన్యం తనకు చెల్లిస్తున్న ధర తక్కువని భావించడమే. 2018 సీజన్ వేలం సందర్భంగా ధావన్‌ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. రూ.5.2 కోట్ల ధరతో వేలంలో ఆర్టీఎం ద్వారా సొంతం చేసుకుంది. ఇది తన స్థాయికి తగని ధరగా భావించిన ధావన్ అసంతృప్తితో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ అతడిని విడుదల చేసింది. బదులుగా డేర్ డెవిల్స్ జట్టు సభ్యులైన విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు), షాబాజ్ నదీమ్ (రూ.3.2 కోట్లు), యువ ఆటగాడు అభిషేక్ శర్మ (రూ.55 లక్షలు)లను తీసుకుంది. ఇందులో ధావన్ ధర మినహా మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో డేర్ డెవిల్స్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ధావన్ తొలి ఐపీఎల్ (2008)లో ఢిల్లీకే ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం రెండేళ్లు ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. 2011 నుంచి హైదరాబాద్ (2011, 12లలో దక్కన్ చార్జర్స్, 2013 నుంచి సన్‌రైజర్స్) జట్టులో భాగంగా ఉన్నాడు. 2016లో ట్రోఫీ నెగ్గడంలో కీలకంగా నిలిచాడు. సన్‌రైజర్స్ తరఫున 91 ఇన్నింగ్స్‌లు ఆడి 125.13 స్ట్రైక్ రేట్‌తో 2,768 పరుగులు చేశాడు. -
మళ్లీ కోచ్‌గా కుంబ్లే రీ-ఎంట్రీ?
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మరోసారి కోచింగ్ బాధ్యతలు స్వీకరించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఈసారి అనిల్ కుంబ్లే బాధ్యతలు నిర్వహించేది టీమిండియాకు కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జట్టు అయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కోచింగ్ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం సైతం స్పందించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్ కోసం టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ ఓనర్లలో ఒకరైన పార్థ్ జిందాల్ వెల్లడించినట్లు అహ్మదాబాద్ మిర్రర్ తన కథనంలో పేర్కొంది. ‘వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించాలని కుంబ్లేను కోరుతున్నాం. దీనిపై కుంబ్లే ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ కుంబ్లే మా జట్టులో కలిస్తే ఎంతో అదృష్టంగా భావిస్తాం’ అని వారు తెలిపారు. కుంబ్లేను మెంటార్‌గా ఎంచుకోవాలని భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీనే ఢిల్లీ యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కుంబ్లే గనుక ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు అందుకుంటే, మరోసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి పని చేసినట్లు అవుతుంది. గతంలో అనిల్ కుంబ్లే-రికీ పాంటింగ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19 వరకు ఐపీఎల్ టోర్నీ జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ కాస్త ముందుగానే నిర్వహించనున్నారు. -
అందుకే చెన్నై గెలిచింది : గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్-11 విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యంపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. సీఎస్కే యాజమాన్యం తమ కెప్టెన్ ధోనీని క్రికెట్ బాస్‌గా భావిస్తుందని.. ఫీల్డ్‌లో అతనికి పూర్తి స్వేచ్చను ఇవ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించి తద్వారా విజయాల్ని తమ ఖాతాలో వేసుకుంటుందని పేర్కొన్నాడు. ఈ కారణంగానే ఆ జట్టు ఏడుసార్లు ఫైనల్‌కు చేరడమే కాకుండా మూడుసార్లు విజేతగా నిలిచిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వంటి టోర్నమెంట్లో ఒక కెప్టెన్‌గా విజయవంతమవ్వాలంటే ఆటగాళ్లతో పాటు యాజమాన్యం సహకారం కూడా ఎంతో ముఖ్యమని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ చాలా ఖరీదైన వ్యాపారమని.. ఫ్రాంచైజీ ఫీజు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది జీతాలు, ప్రయాణ ఖర్చులు అంటూ యాజమాన్యం ఎంతో ఖర్చు పెడుతుందని గంభీర్ ఒక ప్రముఖ పత్రికలో రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. అన్నిటికంటే ఇక్కడ ఇగోకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లోని వివిధ జట్ల యజమానులు అందరు వేర్వేరు వ్యాపారాల్లో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని.. అయితే క్రికెట్‌ను కూడా ఒక వ్యాపారం లాగే భావిస్తారని.. పెట్టుబడికి తగిన లాభం వచ్చిందా లేదా అనే విషయం మీదే వారికి ఎక్కువ శ్రద్ధ ఉంటుందని ఘాటుగా విమర్శించాడు. క్రికెటర్లలాగా వారు కూడా ఓటమిని ద్వేషిస్తారని.. విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఇష్టపడతారే గానీ.. ఒకవేళ వారి సలహాల వల్ల ఓటమి ఎదురైనపుడు అందుకు తగిన కారణాలు చూపితే వారి ఇగో దెబ్బతింటుందని పరోక్షంగా తమ జట్టు యాజమాన్య తీరును ఎండగట్టాడు. ‘కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం నాకు మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. అయితే వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యానని’ గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఈ సీజన్లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
‘నా కెరీర్లోనే అత్యంత చెత్త ఐపీఎల్’
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్లో విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా రాణించాడు టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్. అయితే ఐపీఎల్-11 (ప్రస్తుత) సీజన్ తన కెరీర్లోనే చెత్త ఐపీఎల్ సీజన్ అని ఢిల్లీ డేర్‌డెవిల్స్ మాజీ కెప్టెన్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ ఇంటిముఖం పట్టాక.. కుటుంబంతో కలిసి చండీగఢ్‌లో ఉంటున్న గంభీర్ పేర్కొన్న అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఈ సీజన్లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం నాకు మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యాను. శ్రేయస్ అయ్యర్‌కి కెప్టెన్సీ ఇచ్చారు. చివరికి ఏమైంది. ఢిల్లీ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్సీ నుంచి తప్పించాక నన్ను జట్టులోకి తీసుకోకపోగా.. గంభీర్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని వదంతులు ప్రచారం చేశారు. ఇందులో ఇసుమంతైనా నిజం లేదు. రిటైర్మెంట్ పై నేను ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు వైఫల్యాలతో పాటు నాపై వచ్చిన వదంతులు ఢిల్లీ జట్టులో మళ్లీ అవకాశం రాకుండా చేశాయంటూ’ గంభీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
బై...బై...ముంబై
ముందుకెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. ఢిల్లీ బౌలర్లు సమష్టిగా ముంబైను ముంచారు. ఈ సీజన్లో అందరికంటే ముందే ప్లే ఆఫ్ నుంచి ఔటైన డేర్‌డెవిల్స్ జట్టు వెళ్తూ వెళ్తూ తమ వెంట రోహిత్ సేననీ తీసుకెళ్లింది. న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్ పట్టాల నుంచి తప్పించింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్ 11 పరుగుల తేడాతో రోహిత్ సేనపై గెలిచింది. బ్యాటింగ్‌లో రిషభ్ పంత్ ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తే... బౌలింగ్‌లో స్పిన్నర్లు సందీప్ లమిచానే (3/36), అమిత్ మిశ్రా (3/19), పేసర్ హర్షల్ పటేల్ (3/28) సమష్టిగా దెబ్బ తీశారు. మొదట డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), విజయ్ శంకర్ (30 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. లూయిస్ (31 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. మిశ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రిషభ్ పంతే పెద్దదిక్కయ్యాడు... టాస్ నెగ్గిన ఢిల్లీ మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపిం ది. ఓపెనింగ్ వైఫల్యంతో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (12) రనౌట్‌కాగా, మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్‌తో కలిసి రిషభ్ పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడీ కూడా విఫలమైంది. కెప్టెన్ అయ్యర్ (6) మార్కండే బౌలింగ్‌లో నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్‌తో పంత్ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 13వ ఓవర్లో జట్టు 100 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ 34 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. పదో ఓవర్ తర్వాత బుమ్రా, కటింగ్, హార్దిక్ పాండ్యాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం మందగించింది. ముస్తఫిజుర్ వేసిన 15వ ఓవర్లో పంత్ సిక్సర్, శంకర్ ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చారు. హార్దిక్ తర్వాతి ఓవర్లో పంత్ మరో రెండు సిక్సర్లు బాదేశాడు. జోరు పెరిగిన దశలో రిషభ్ ఇన్నింగ్స్‌కు కృనాల్ పాండ్యా తెరదించాడు. దీంతో 64 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అభిషేక్ జతగా విజయ్ శంకర్ పోరాడే లక్ష్యాన్ని ముంబై ముందుంచగలిగాడు. స్పిన్ ఉచ్చులో బ్యాట్లెత్తారు... ముంబై చావోరేవో తేల్చుకునే లక్ష్యం 175. సులువైంది కాకపోయినా... అసాధ్యమైంది మాత్రం కాదు. కానీ ముంబై బ్యాట్స్‌మెన్ స్పిన్ ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆరంభంలో ఓపెనర్ లూయిస్ ఎదురుదాడికి దిగినట్టు... చివర్లో కటింగ్ (20 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినట్లు మరొక్కరు నిలబడితే గెలిచేది. కానీ ఆ ఒక్కడి పాత్రలో ఏ బ్యాట్స్‌మెన్ నిలబడనీయకుండా లమిచానే, మిశ్రా మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించారు. టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆట కట్టించారు. ఈ సీజన్లో నిలకడ కనబరిచిన సూర్యకుమార్ (12), విధ్వంసకర బ్యాట్స్‌మన్ పొలార్డ్ (7)లను లమిచానే ఔట్ చేస్తే... మధ్యలో ఇషాన్ కిషన్ (5), లూయిస్‌లను మిశ్రా పెవిలియన్ చేర్చాడు. కృనాల్ (4), రోహిత్ (13) పలాయనం చిత్తగించడంతో ముంబై కథ ముగిసింది. హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు బ్యాట్‌ను ఊపేసినా మిశ్రా మాయలో పడేందుకు ఎంతో సేపు పట్టలేదు. 15వ ఓవర్లో అతని నిష్క్రమణతో ఆశలు ఆవిరికాగా... కటింగ్ మెరుపులతో ఏమూలనో మిణుకుమిణుకుమన్న ఆశల్ని చివరి ఓవర్లో హర్షల్ పటేల్ తుడిచేశాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 12; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 22; శ్రేయస్ అయ్యర్ (సి) కృనాల్ (బి) మార్కండే 6; రిషభ్ పంత్ (సి) పొలార్డ్ (బి) కృనాల్ 64; విజయ్ శంకర్ నాటౌట్ 43; అభిషేక్ శర్మ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–30, 2–38, 3–75, 4–139. బౌలింగ్: కృనాల్ 2–0–11–1, బుమ్రా 4–0– 29–1, హార్దిక్ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–34–0, మార్కండే 2–0–21–1, కటింగ్ 4–0–36–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సూర్యకుమార్ (సి) శంకర్ (బి) లమిచానే 12; లూయిస్ (స్టంప్డ్) పంత్ (బి) మిశ్రా 48; ఇషాన్ కిషన్ (సి) శంకర్ (బి) మిశ్రా 5; పొలార్డ్ (సి) బౌల్ట్ (బి) లమిచానే 7; రోహిత్ (సి) బౌల్ట్ (బి) హర్షల్ 13; కృనాల్ (సి) సబ్–తేవటియా (బి) లమిచానే 4; హార్దిక్ (సి) సబ్–తేవటియా (బి) మిశ్రా 27; కటింగ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హర్షల్ 37; మార్కండే (బి) బౌల్ట్ 3; బుమ్రా (సి) బౌల్ట్ (బి) హర్షల్ 0; ముస్తఫిజుర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–12, 2–57, 3–74, 4–74, 5–78, 6–121, 7–122, 8–157, 9–163, 10–163. బౌలింగ్: లమిచానే 4–0–36–3, బౌల్ట్ 4–0–33–1, మ్యాక్స్‌వెల్ 2–0–19–0, హర్షల్ 2.3–0–28–3, ప్లంకెట్ 3–0–27–0, మిశ్రా 4–0–19–3. రిషభ్ పంత్ లమిచానే, మిశ్రా ప్రీతికెంత సంబరమో! కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ముంబై ఓడిందని తెలియగానే తెగ సంబరపడిపోయింది. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని చెప్పింది. ఈ వీడియో క్లిప్ ట్విటర్లో వైరల్ అయింది. అదేం ఆనందమో గానీ... అప్పటికింకా ఆమె జట్టు (పంజాబ్) చెన్నైపై గెలవనేలేదు. ప్లే–ఆఫ్ చేరనేలేదు... ఇంకా చెప్పాలంటే మ్యాచ్ అప్పుడే మొదలైంది. ముంబై ఓటమితో పంజాబ్ ప్లే–ఆఫ్ చేరితే సంబరపడిందంటే అర్థముంది కానీ... తమకు ఏమీ కాని ఫలితంతో ముందుకు ముందే ఈ సంతోషమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. -
కింగ్స్ పంజాబ్ ఇంటికి.. ప్లేఆఫ్‌కు రాయల్స్
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్లో ప్లేఆఫ్‌కు చేరాలన్న కింగ్స్ పంజాబ్ ఆశలు నెరవేరలేదు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఏడు విజయాలతో ఉన్న రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు ప్లేఆఫ్‌కు చేరిన జట్లు కాగా, చివరిగా రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. చెన్నై విజయంలో సురేశ్ రైనా(61 నాటౌట్; 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ చాహర్(39; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు)లు ముఖ్య భూమిక పోషించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్కే అంబటి రాయుడు(1)వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆ తర్వా డుప్లెసిస్(14), శ్యామ్ బిల్లింగ్స్(0)లు వరుస బంతుల్లో ఔట్ కావడంతో చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆపై నాల్గో వికెట్‌కు సురేశ్ రైనాతో కలిసి 31 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత హర్భజన్ సింగ్(19) పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రైనా-దీపక్ చాహర్‌ల జోడి చెన్నై స్కోరు బోర్డును చక్కదిద్దింది. వీరిద్దరూ 56 పరుగుల జోడించిన తర్వాత చాహర్ ఐదో వికెట్‌గా నిష్క్రమించాడు. దాంతో చెన్నై 114 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఇక చివర్లో రైనా-ధోని(16 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)ల జంట మరో వికెట్ పడకుండా ఆడటంతో చెన్నై 19.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. అంతకుముందు కింగ్స్ 19.4 ఓవర్లలో 153 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్ చేసింది. 16 పరుగులకే క్రిస్ గేల్(0), అరోన్ ఫించ్(4), కేఎల్ రాహుల్(7) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో మిల్లర్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత మనోజ్ తివారీ(35) పెవిలియన్ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో డేవిడ్ మిల్లర్(24) సైతం ఔట్ కావడంతో కింగ్స్ పంజాబ్ 80 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. చెన్నై పేసర్ లుంగి ఎంగిడి.. కింగ్స్ పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో 1 మెయిడిన్ సాయంతో 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్, బ్రేవోలు తలో రెండు వికెట్లు తీయగా, జడేజా, చాహర్‌లకు చెరో వికెట్ దక్కింది. -
ఇంటిదారి పట్టీన ముంబైఇండియన్స్
-
లుంగి ఎంగిడి విజృంభణ
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్ చేసింది. 16 పరుగులకే క్రిస్ గేల్(0), అరోన్ ఫించ్(4), కేఎల్ రాహుల్(7) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో మిల్లర్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత మనోజ్ తివారీ(35) పెవిలియన్ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో డేవిడ్ మిల్లర్(24) సైతం ఔట్ కావడంతో కింగ్స్ పంజాబ్ 80 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. అటు తర్వాత స్వల్ప విరామాల్లో కింగ్స్ పంజాబ్ వికెట్లను చేజార్చుకుంది. కాగా, కరుణ్ నాయర్(54; 26 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) ఆదుకున్నాడు. దాంతో కింగ్స్ 19.4 ఓవర్లలో 153 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. చెన్నై పేసర్ లుంగి ఎంగిడి.. కింగ్స్ పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో 1 మెయిడిన్ సాయంతో 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్, బ్రేవోలు తలో రెండు వికెట్లు తీయగా, జడేజా, చాహర్‌లకు చెరో వికెట్ దక్కింది. -
ముంబైను ముంచేసిన ఢిల్లీ
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన అమీతుమీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టు ఢిల్లీ కాగా, తాజాగా ముంబై ఇండియన్స్ ముంచేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ పైచేయి సాధించింది. ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్ లక్ష్యం నెరవేరలేదు. ఢిల్లీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఆదిలోనే సూర్యకుమార్ యాదవ్(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఎవిన్ లూయిస్(48; 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అతనికి అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. ఇషాన్ కిషన్(5), పొలార్డ్(7), రోహిత్ శర్మ(13), కృనాల్ పాండ్యా(4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ముంబై 121 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై హార్దిక్ పాండ్యా(27) కాసేపు మెరుపులు మెరిపించి ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.ఇక చివర్లో బెన్ కట్టింగ్(37) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి వికెట్‌గా బూమ్రా ఔట్ కావడంతో ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లలో లామ్‌చెన్, అమిత్ మిశ్రా, హర్షల్ పటేల్‌లు తలో మూడేసి వికెట్లతో సత్తాచాటగా, ట్రెంట్ బౌల్ట్ వికెట్ దక్కింది. -
మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్లో..
-
ముంబై ఇండియన్స్‌కి మతిపోయేలా...
ఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్ అనిపించాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరోన్ పొలార్డ్ ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, తనను తాను నియంత్రించుకుంటూ గాల్లోనే బంతిని మరో ఫీల్డర్ బౌల్ట్‌కు అందివ్వడం మరో ఎత్తు. ముంబై బౌలర్ లామ్‌చెన్ వేసిన 10వ ఓవర్ తొలి బంతిని లాంగాన్ మీదుగా పొలార్డ్ భారీ షాట్ కొట్టాడు. ఆ సమయంలో బంతి గమనాన్ని అంచనా వేస్తూ పరుగెత్తూకొంటూ వచ్చిన మ్యాక్స్‌వెల్ బంతిని బౌండరీకి స్వల్ప దూరంలో ఒడిసిపట్టుకున్నాడు. కాగా, బౌండరీ లైన్‌పై నియంత్రించుకునే క్రమంలో బంతిని సమీపంలో ఉన్న బౌల్ట్ వైపు విసిరేశాడు. ఆ క్యాచ్‌ను బౌల్ట్ అందుకోవడంతో పొలార్డ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ క్యాచ్‌పై మూడో అంపైర్ సాయం కోరగా, మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్‌కు ముందుగానే బంతిని విసిరినట్లు తేలడంతో పొలార్డ్ భారంగా పెవిలియన్ వీడాల్సి వచ్చింది. అయితే రోహిత్ శర్మ ఔట్ విషయంలో కూడా మ్యాక్స్‌వెల్-బౌల్ట్‌లు ఇదే సీన్ రిపీట్ చేశారు. హర్షల్ పటేల్ వేసిన 14 ఓవర్ ఐదో బంతికి రోహిత్ షాట్ కొట్టాడు. ఆ క్యాచ్‌ను ముందుగా అందుకున్న మ్యాక్స్‌వెల్.. బౌండరీ లైన్‌పై నియంత్రణ కోల్పోతున్నట్లు భావించి బౌల్ట్‌కు విసిరాడు. దాన్ని బౌల్ట్ పట్టుకోవడం, రోహిత్ పెవిలియన్ చేరడం ముంబై ఇండియన్స్‌కు మతిపోయేలా చేసింది. ఈ సీజన్లో కింగ్స్ పంజాబ్-రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే తరహా క్యాచ్‌ను మయాంక్ అగర్వాల్-మనోజ్ తివారీలు అందుకున్న సంగతి తెలిసిందే. -
ముంబై లక్ష్యం 175
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషబ్ పంత్(64;44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్ శంకర్(43 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ల మెరుపులకు తోడు మ్యాక్స్‌వెల్(22) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 38 పరుగులకే ఓపెనర్లు పృథ్వీషా(12), మ్యాక్స్‌వెల్ వికెట్లను కోల్పోయింది. మరో 27 పరుగుల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్(6) కూడా నిష్క్రమించడంతో ఢిల్లీ 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో రిషబ్ పంత్- విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 64 పరుగులు జత చేసిన తర్వాత రిషబ్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత శంకర్-అభిషేక్ శర్మ(15 నాటౌట్;10 బంతుల్లో 1 సిక్స్)లు సమయోచితంగా ఆడటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా, బూమ్రా, మయాంక్ మార్కండేలు తలో వికెట్ తీశారు. -
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డేవిల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగుల చేసిన వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో పంత్ 684 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప 660 (2014 సీజన్లో) పరుగుల ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా పంత్ అధిగమించాడు. కేఎల్ రాహుల్ 652 (2018 సీజన్), జోస్ బట్లర్ 548(2018), దినేశ్ కార్తీక్ 510 (2013), ఆడమ్ గిల్‌క్రిస్ట్ 492 (2009)లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ సీజన్లోనే ముగ్గురు వికెట్ కీపర్లు( పంత్,రాహుల్, బట్లర్) అత్యధిక పరుగులు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో పంత్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
-
ముంబై ప్లే ఆఫ్ చేరేనా?
న్యూఢిల్లీ : ఐపీఎల్-11 సీజన్లో మరో రసవత్తర మ్యాచ్‌కు ఫిరోజ్-షా కోట్ల మైదానం వేదికైంది. ఢిల్లీడేర్‌డెవిల్స్ తో జరుగుతున్న చావోరేవో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముంబై జట్టులో మెక్లిగన్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ రాగా.. ఢిల్లీ జట్టులో అవేశ్‌ఖాన్ స్థానంలో ప్లంకెట్ తుది జట్టులోకి వచ్చాడు. గెలిస్తేనే.. ప్లే ఆఫ్ ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. గెలిస్తే ప్లే ఆఫ్.. లేకుంటే ఇంటికి వెళ్తోంది. ఇక ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా.. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అనూహ్య విజయం అందుకుని ఆశ్చర్యపరిచింది. ఈ విషయమే ముంబై ఇండియన్స్‌ను కలవర పరుస్తోంది. 13 మ్యాచుల్లో 6 మాత్రమే నెగ్గి ఆరో స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్ ఎలాగైన గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబైకే ప్లే ఆఫ్ చేరే అవకాశాలున్నాయి. ఆ జట్టు రన్‌రేట్ రాజస్తాన్, కింగ్స్ పంజాబ్ జట్ల కన్నా మెరుగ్గా ఉంది. ఓడితే మాత్రం రాజస్తాన్, పంజాబ్(చెన్నైతో గెలిస్తే) జట్లలో ఓ జట్టుకు ప్లేఆఫ్ అవకాశం ఉంటుంది. తుదిజట్లు ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, బెన్ కట్టింగ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మయాంక్ మార్కండే, జస్ప్రిత్ బుమ్రా ఢిల్లీ: పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, హర్షపటేల్, అమిత్ మిశ్రా, లియామ్ ప్లంకెట్, సందీప్ లామిచ్చేన్, ట్రెంట్ బౌల్ట్ -
టీ20ల్లో ధోని అరుదైన రికార్డు
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీ20 క్రికెట్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 6వేల పరుగులు క్లబ్లో చేరిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా, తొలి భారత వికెట్ కీపర్‌గా ధోని గుర్తింపు పొందాడు. ఐపీఎల్-11 సీజన్లో భాగంగా శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ధోని 6వేల పరుగులకు 10 పరుగుల దూరంలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో ధోని 17 పరుగులు చేసిన విషయం తెలిసిందే. బౌల్ట్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ధోని వెనుదిరిగాడు. దీంతో అతడు టీ20 క్రికెట్లో 6 వేల పరుగులు సాధించినట్లైంది. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడు ధోని నిలిచాడు. సురేశ్ రైనా(7,708), విరాట్ కోహ్లీ (7,621), రోహిత్ శర్మ(7,303), గౌతమ్ గంభీర్(6,402)... ధోని కంటే ముందున్నారు. ఇక ఓవరాల్‌గా 11,436 పరుగులతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలోఉండగా.. కివీస్ బ్యాట్స్‌మన్ మెక్కల్లమ్ 9,119 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. మరో ఐపీఎల్ రికార్డు చేరువలో.. ధోని కెరీర్లో ఇది 290వ టీ20 మ్యాచ్ కాగా... ఐపీఎల్లో 4వేల పరుగుల క్లబ్‌కు చేరువయ్యాడు. ఇప్పటి వరకు ధోని ఐపీఎల్లో సాధించిన పరుగులు 3,974. మరో 26 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్లో 4వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా చేరుతాడు. -
నవ్వు ఆపుకోలేకపోయిన ధోని..
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మైదానంలో ఉన్న ధోని ఓ సందర్భంలో నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల కెప్టెన్లు ధోని, శ్రేయస్ అయ్యర్లు మైదానంలోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ టాస్ కోసం కాయిన్‌ను ఎగురవేశాడు. ఆ కాయిన్ ఆటగాళ్లకు చాలా దూరంలో పడింది. అంత దూరం కాయిన్ పడటం చూసిన ధోని నవ్వు ఆపుకోలేకపోయాడు. ధోనితో పాటు అక్కడ ఉన్నవారంతా కూడా నవ్వారు. అనంతరం టాస్ గెలిచిన ధోని.. ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్లో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ధోనిని చూసిన ఫ్యాన్స్.. నువ్వు అందుకే మిస్టర్ కూల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంత మైదానం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 163 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది. -
ఢిల్లీ విజయ ఢంకా
ఓడిపోతే ఢిల్లీకి పోయేదేమీ లేదు! గెలిస్తే చెన్నైకు రన్‌రేట్ పెరగడం తప్ప ఒరిగేదేమీ లేదు! అభిమానులకు చూద్దామన్న ఆశ అంతకంటే లేదు...! దీనికి తగినట్లే ఆటలో మెరుపే లేదు...! పరుగులకు ఇబ్బంది పెట్టిన పిచ్‌పై ఆడుతున్నది టి20నా...? వన్డేనా...? అన్నట్లు సాగిన మ్యాచ్‌లో నమోదైంది ఒకే ఒక్క అర్ధ శతకం...! ఢిల్లీనే సాధారణ స్కోరు చేసిందనుకుంటే... చెన్నై అతి సాధారణంగా ఆడి ఓడింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్ (16 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు; 1/23) ఆల్‌రౌండ్ ప్రతిభతో డేర్‌డెవిల్స్‌కు ఊరట విజయం దక్కింది. ఢిల్లీ: అదేంటో మరి... ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు సీజన్ చివర్లో కాని జోష్ రాదనుకుంటా...! వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌కు ఎప్పుడో దూరమై... ప్రేక్షకులకు ఏ కోశానా ఆసక్తి లేకుండా పోయిన వేళ... ఆ జట్టు పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఆశ్చర్యపర్చింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్షల్‌తో పాటు రిషభ్ పంత్ (26 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విజయ్ శంకర్ (28 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో అంబటి తిరుపతి రాయుడు (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగతావారి నుంచి మెరుపులు లేకపోవడంతో చెన్నై ఆరు వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసి 34 పరుగులతో ఓటమి పాలైంది. లెగ్ స్పిన్నర్లు అమిత్ మిశ్రా (2/20), సందీప్ లమిచానే (1/21) ప్రత్యర్థిని కట్టిపడేశారు. అంతా చప్పచప్పగా... పంత్, హర్షల్ మినహా ఏ బ్యాట్స్‌మెన్ స్ట్రయిక్ రేట్ 130 దాటలేదంటేనే డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ సాగిన తీరును చెప్పొచ్చు. ఓపెనర్లలో పృథ్వీ షా (17) పూర్తిగా తడబడుతూ ఆడాడు. చాలా బంతులు అతడి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) బ్యాట్ ఝళిపించలేకపోయాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోరు 39/1. ఆ తర్వాత కూడా రిషభ్, అయ్యర్‌లను చెన్నై బౌలర్లు స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. హర్భజన్ వేసిన 10వ ఓవర్లో పంత్ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో కొంత కదలిక వచ్చింది. కానీ, మరుసటి ఓవర్లోనే ఇన్‌గిడి ఇద్దరినీ అవుట్ చేశాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ... జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు యత్నించి మ్యాక్స్‌వెల్ (5) బౌల్డయ్యాడు. గత మ్యాచ్‌లో గడగడలాడించిన అభిషేక్ శర్మ (2) ఈసారి చేతులెత్తేశాడు. 15 ఓవర్లకు స్కోరు 102/5. విజయ్ శంకర్, హర్షల్ అప్పుడో షాట్ ఇప్పుడో షాట్ కొడుతూ బండి నడిపించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బ్రేవో పనిపట్టారు. హర్షల్ మూడు, శంకర్ ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. దీంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. విశేషమేమంటే బంతితో గిమ్మిక్కులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో పడేస్తాడని పేరున్న బ్రేవో... హర్షల్ ధాటికి భారీగా (0/52) పరుగులిచ్చుకున్నాడు. అతడు కొట్టిన నాలుగు సిక్స్‌లూ బ్రేవో బౌలింగ్‌లోనే కావడం గమనార్హం. చెన్నై ఛేదించలేకపోయింది... లక్ష్యం మరీ పెద్దదేం కాదు. ప్రత్యర్థి బౌలింగ్ ఏమంత భీకరం కాదు. దీంతో ఛేదనను చెన్నై ఊదేస్తుందని అంతా భావించారు. కానీ, వారికీ పరుగులు గగనంగానే వచ్చాయి. 5 ఓవర్లకు స్కోరు 22 మాత్రమే. అయితే, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రాయుడు మూడు సిక్స్‌లు, ఫోర్ సహా 22 పరుగులు రాబట్టడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కానీ, మిశ్రా వస్తూనే వాట్సన్‌ను బుట్టలో వేశాడు. ఓ ఎండ్‌లో తనవంతుగా ఆడుతూ అర్ధ సెంచరీ (28 బంతుల్లో) అందుకున్న రాయుడు ... భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో మ్యాక్స్‌వెల్‌కు చిక్కాడు. అప్పటికీ ధోని (17), రైనా (15) ఉండటంతో గెలుపుపై ఆశలున్నాయి. తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం తప్పించుకుని, ఆసాంతం ఇబ్బందిగా కనిపించిన రైనాను సందీప్ లమిచానే పెవిలియన్‌కు చేర్చాడు. సమీకరణం 41 బంతుల్లో 73గా ఉన్న దశలో బిల్లింగ్స్ (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. జడేజాను మరోసారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లు ధోనికి షాట్లు కొట్టే చాన్సే ఇవ్వలేదు. దీంతో లక్ష్యం అంతకంతకు పెరుగుతూ పోయింది. 18వ ఓవర్లో ధోనిని అవుట్ చేసిన బౌల్ట్ ఐదు పరుగులే ఇచ్చాడు. 12 బంతుల్లో 50 పరుగులు చేయడం జడేజా(27 నాటౌట్), బ్రావో (1) తరం కాలేదు. -
సీఎస్కేపై డేర్‌డెవిల్స్ ప్రతీకారం
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంత మైదానం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 163 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది. సీఎస్కే ఆటగాళ్లలో అంబటి రాయుడు(50;29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జడేజా( 26 నాటౌట్) మినహా ఎవరూ రాణించకపోవడంతో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించిన ఢిల్లీ బౌలింగ్‌లో ఆకట్టుకుని సీఎస్కేను కట్టడి చేసింది. అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. పృథ్వీ షా(17),శ్రేయస్ అయ్యర్(19), మ్యాక్స్‌వెల్(5), అభిషేక్ శర్మ(2)లు నిరాశపరచగా, రిషబ్ పంత్(38) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయ్ శంకర్(36 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షల్ పటేల్(36 నాటౌట్;16 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. -
సీఎస్కే లక్ష్యం 163
ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తడబడుతూనే ఇన్నింగ్స్ ఆరంభించింది. పృథ్వీ షా(17),శ్రేయస్ అయ్యర్(19), మ్యాక్స్‌వెల్(5), అభిషేక్ శర్మ(2)లు నిరాశపరచగా, రిషబ్ పంత్(38) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయ్ శంకర్(36 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షల్ పటేల్(36 నాటౌట్;16 బంతుల్లో 1ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ 26 పరుగులు పిండుకోవడంతో చెన్నై ముందు గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. -
ధోని..నువ్వు అందుకే మిస్టర్ కూల్
-
టాస్ గెలిచిన సీఎస్కే
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో చెన్నై ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకోగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ 12 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే నమోదు చేసి టోర్నీ నుంచి నిష్ర్రమించింది. ఇది ఇరు జట్లకు నామమాత్రపు మ్యాచ్‌గానే చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా నష్టమేమీ ఉండదు. దాంతో ఇరు జట్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. చెన్నై ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా, ఢిల్లీ రెండు మార్పులు చేసింది. డేవిడ్ విల్లే స్థానంలో లుంగి ఎంగిడి చెన్నై తుది జట్టులోకి రాగా, మ్యాక్స్‌వెల్, అవేశ్ ఖాన్లు ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. -
‘టాప్’పై కన్నేసిన సీఎస్కే
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇప్పటికే నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. దాంతో శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రమే కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్‌లో ఉండగా, సీఎస్కే 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రన్‌రేట్ ప్రకారం సీఎస్కే మెరుగైన స్థానంలో ఉండటంతో ఢిల్లీతో గెలిస్తే టాప్ ప్లేస్‌ను ఆక్రమిస్తుంది. దీనిలో భాగంగా ధోని అండ్ గ్యాంగ్ పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్ సీఎస్కే మెరుపు ఆరంభాల్ని ఇస్తుండగా.. మిడిలార్డర్లో సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, బ్రేవో నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లుగా మలుస్తున్నారు. మరొకవైపు ఢిల్లీ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా, జాసన్ రాయ్ మెరుగ్గా ఆడుతుండగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హిట్టింగ్తో ఆకట్టుకుంటున్నారు. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. -
సీఎస్కే గెలిస్తే టాప్‌కే!
-
ఆ వదంతులు నమ్మవద్దు: రిషభ్ పంత్
సాక్షి, న్యూఢిల్లీ: పటిష్టమైన సన్‌రైజర్స్ బౌలింగ్‌లోనే అద్భుత శతకం చేసిన యువ సంచలనం, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు రిషభ్ పంత్ త్వరలోనే భారత జాతీయ జట్టుకు ఆడతాడని మాజీ కెప్టెన సౌరవ్ గంగూలీ ఇటీవల అభిప్రాయపడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో తనను టీమిండియాకు ఎంపిక చేయలేదంటూ పంత్ వ్యాఖ్యానించినట్లు కథనాలు ప్రచారమయ్యాయి. దీంతో తనపై వచ్చిన వదంతులపై ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పంత్ స్పందించాడు. ‘టీమిండియాకు ఎంపిక చేయలేదని నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ నన్ను ఇటీవల ప్రకటించిన భారత జట్టుకు ఎంపిక చేయలేదని వ్యాఖ్యానించినట్లు ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదని వివరణ ఇచ్చుకుంటున్నాను. నేను కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఇలాంటి వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరుతూ’ ట్వీట్ చేశాడు పంత్. ఈ ఐపీఎల్లో అత్యధిక (582) పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా పంత్ ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే, టీ20లకు, ఐర్లాండ్‌తో టీ20లకు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత రహానే లాంటి ఆటగాడిని పక్కన పెట్టడంతో ‘దాదా’ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్ ఆటతీరుతో పాటు నిలకడ ప్రదర్శిస్తే పంత్, ఇషాన్ కిషన్ వంటి యువ కెరటాలు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో దూరంలో లేరన్నాడు. Just to clarify some rumours going around about my statement about not getting selected to play for india I never said anything like that it so just giving out my clarification 🙏.So please stop spreading rumours and let me concentrate on my cricket 😇 — Rishabh Pant (@RishabPant777) 13 May 2018 -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
-
ఆర్సీబీ ఓడితే ఇక ఇంటికే...!
ఢిల్లీ: స్టార్ ఆటగాళ్లు ఉండి కూడా ఈ ఐపీఎల్లో తీవ్రంగా నిరాశపరుస్తున్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడి మూడు విజయాల్ని మాత్రమే సాధించిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఆ జట్టు ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీకి విజయం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆర్సీబీ ఓడితే మాత్రం ఇక ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా రేసు నుంచి నిష్ర్రమించాల్సి ఉంటుంది. దాంతో కోహ్లి అండ్ గ్యాంగ్.. విజయంపై కన్నేసింది. ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్‌కు వెళ్లే దారులు మూసుకుపోయాయి. దాంతో ఆర్సీబీతో మ్యాచ్ ఢిల్లీకి నామమాత్రమే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన కోహ్లి ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీపై ఆర్సీబీ మరోసారి పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరం. తుదిజట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థీవ్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, ఏబీ డివీలియర్స్, మన్దీప్ సింగ్, గ్రాంగ్ హోమ్, మొయిన్ అలీ, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తుదిజట్టు శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, జాసన్ రాయ్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అమిత్ మిశ్రా, సందీప్ లామిచానే, హర్షల్ పటేల్, ట్రెంట్ బౌల్ట్, జూనియర్ డాలా -
సన్‌రైజర్స్ సగర్వంగా..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సగర్వంగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. గత విజయంతో దాదాపు ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకున్న సన్‌రైజర్స్.. గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొంది ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్‌కు చేరింది. ఫలితంగా ఈ సీజన్లో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేసి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ 15 పరుగుల వద్ద అలెక్స్ హేల్స్(14) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో శిఖర్ ధావన్-కేన్ విలియమ్సన్ జోడి ధాటిగా బ్యాటింగ్ చేసింది. ధావన్(92 నాటౌట్; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్(80నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు మరో వికెట్ పడకుండా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఇది సన్‌రైజర్స్‌కు ఓవరాల్‌గా తొమ్మిదో విజయం కాగా, వరుసగా ఆరో గెలుపు. ఇక తాజా ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అంతకముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. రిషబ్ పంత్(128 నాటౌట్;63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సన్‌రైజర్స్ ముందుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకిబుల్ హసన్ వేసిన నాల్గో ఓవర్లో పృథ్వీ షా(9), జాసన్ రాయ్(11)లు వరుస బంతుల్లో నిష్ర్రమించారు. దాంతో 21 పరుగులకే రెండు వికెట్లను నష్టపోయింది ఢిల్లీ. అయితే శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. కాగా, రిషబ్ పంత్ తప్పిదంతో శ్రేయస్ అయ్యర్(3) రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. అటు తర్వాత హర్షల్ పటేల్-రిషబ్ పంత్‌ల భాగస్వామ్యంతో ఢిల్లీ కుదుటపడింది. హర్షల్ పటేల్(24) రనౌట్ కావడంతో ఢిల్లీ 98 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. ఆపై రిషబ్ పంత్ చెలరేగి ఆడాడు. పటిష్టమైన సన్‌రైజర్స్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగిన రిషబ్ పంత్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లను రిషబ్ సాధించడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ పోరాడి లక్ష్యాన్ని ఉంచింది. -
పంత్‌తో ‘పరుగు’ కష్టమే!
-
రిషబ్ రికార్డుల మోత
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు రిషబ్ పంత్ రికార్డుల మోత మోగించాడు. రిషబ్ పంత్(128 నాటౌట్;63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో ఒక భారత బ్యాట్స్‌మన్ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఘనతను రిషబ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2010లో మురళీ విజయ్ 127 పరుగుల రికార్డను రిషబ్ బద్ధలు కొట్టాడు. మరొకవైపు సన్‌రైజర్స్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డును కూడా రిషబ్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు సన్‌రైజర్స్‌పై క్రిస్ గేల్(104 నాటౌట్-ఈ సీజన్ ఐపీఎల్లో) అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును సాధించగా, దాన్ని రిషబ్ సవరించాడు. కాగా, పిన్నవయసులో ఐపీఎల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా రిషబ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. రిషబ్ పంత్ 20 ఏళ్ల 218 రోజుల వయసులో ఐపీఎల్ సెంచరీ నమోదు చేయగా, 2009లో మనీష్ పాండ్ 19 ఏళ్ల 253 రోజుల వయసులో ఐపీఎల్ శతకం సాధించాడు. ఇక ఒక జట్టు చేసిన స్కోరులో అత్యధిక పరుగుల శాతాన్ని నమోదు చేసిన రెండో ఆటగాడిగా రిషబ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ 68.44 శాతం పరుగులు సాధించగా, గతంలో బ్రెండన్ మెకల్లమ్ 71.17 శాతం పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
చితక్కొట్టిన రిషబ్ పంత్
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 188 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. రిషబ్ పంత్(128 నాటౌట్;63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సన్‌రైజర్స్ ముందుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షకిబుల్ హసన్ వేసిన నాల్గో ఓవర్లో పృథ్వీ షా(9), జాసన్ రాయ్(11)లు వరుస బంతుల్లో నిష్ర్రమించారు. దాంతో 21 పరుగులకే రెండు వికెట్లను నష్టపోయింది ఢిల్లీ. అయితే శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. కాగా, రిషబ్ పంత్ తప్పిదంతో శ్రేయస్ అయ్యర్(3) రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. అటు తర్వాత హర్షల్ పటేల్-రిషబ్ పంత్‌ల భాగస్వామ్యంతో ఢిల్లీ కుదుటపడింది. హర్షల్ పటేల్(24) రనౌట్ కావడంతో ఢిల్లీ 98 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. ఆపై రిషబ్ పంత్ చెలరేగి ఆడాడు. పటిష్టమైన సన్‌రైజర్స్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగిన రిషబ్ పంత్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ నమోదు చేశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లను రిషబ్ సాధించడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో షకిబుల్ హసన్ రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్‌కు వికెట్ దక్కింది. -
పంత్‌తో ‘పరుగు’ కష్టమే!
ఢిల్లీ: రిషబ్ పంత్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో కీలక ఆటగాడు. అయితే అతనితో పరుగు తీయాలంటే అవతలి ఎండ్‌లో ఉన్న సహచర ఆటగాడు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ నాలుగుసార్లు రనౌట్‌లో భాగస్వామ్యం అయ్యాడు రిషబ్. ఆ నాలుగుసార్లు సహచర ఆటగాడే నిష్క్రమించడం రిషబ్‌లో చురుకుదనం లేదనడానికి అద్దం పడుతోంది. పరుగు పూర్తి చేసే క్రమంలో తటపటాయిస్తున్న రిషబ్.. అవతలి ఎండ్‌లో ఉన్న ఆటగాళ్ల రనౌట్‌కు కారణమవుతున్నాడు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ఢిల్లీ ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంటుంది. అయితే ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హర్షల్ పటేల్ రనౌట్లలో రిషబ్ పంత్ భాగస్వామ్యం కావడం విమర్శలకు తావిచ్చింది. తొలుత శ్రేయస్ అయ్యర్‌ను రనౌట్ చేసిన రిషబ్.. ఆపై హర్షల్ పటేల్ రనౌట్‌కు కారణమయ్యాడు. పరుగు సూచన ఇచ్చిన రిషబ్ పంత్.. శ్రేయస్ అయ్యర్ సగం పిచ్ దాటే సమయంలో నిర్ణయం మార్చుకున్నాడు. క్రీజ్‌లో అలా నిలబడి ఉండిపోవడంతో శ్రేయస్ అయ్యర్ మళ్లీ తిరిగి నాన్ స్టైకర్ ఎండ్‌లోకి వచ్చే యత్నం చేయడంతో రనౌట్ కావాల్సి వచ్చింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సన్‌రైజర్స్ బౌలర్ వేసిన ఎనిమిదో ఓవర్ నాల్గో బంతికి అయ్యర్‌ను రనౌట్‌గా పెవిలియన్‌కు పంపించాడు. మళ్లీ ఇదే మ్యాచ్ రషీద్ ఖాన్ వేసిన 14 ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్‌ను రనౌట్ చేశాడు రిషబ్. ఈ రెండు సందర్బాల్లో రిషబ్ పంత్ తప్పిదం కొట్టొచ్చినట్లు కనబడటం ఢిల్లీ డేర్‌డెవిల్స్ శిబిరంలో ఆందోళన వ్యక్తమైంది. -
వృద్ధిమాన్ సాహా దూరం
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది విజయాలతో దాదాపు ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకోగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ 10 మ్యాచ్‌లకు గాను మూడు విజయాలతో చివరిస్థానంలో నిలిచింది. ఇక నేటి మ్యాచ్‌లో గెలిచి సగర్వంగా ప్లేఆఫ్‌కు చేరుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తుండగా, సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని డేర్‌డెవిల్స్ ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలుస్తుంది. సన్‌రైజర్స్ జట్టు నుంచి వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలోశ్రీవాత్స్ గోస్వామి తుది జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తుది జట్టు శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జాసన్ రాయ్, పృథ్వీషా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, లియామ్ ప్లంకెట్, హర్షాల్ పటేల్, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు కేన్ విలియమ్సన్(కెప్టెన్), శిఖర్ ధావన్, అలెక్స్ హేల్స్, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, షకీబుల్ హసన్, శ్రీవాత్స్ గోస్వామి, రషీద్‌ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్ -
అతడిని ఆదర్శంగా తీసుకోవాలి
పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవడం గొప్ప విషయం. మ్యాచ్ మ్యాచ్‌కూ సన్‌రైజర్స్ బౌలర్ల ప్రదర్శన మెరుగవుతోంది. కెప్టెన్ విలియమ్సన్ నిలకడగా ఆడుతుండగా... అతనికి సహచరుల నుంచి మద్దతు లభించాల్సిన అవసరం ఉంది. సన్‌రైజర్స్ జట్టులో కొందరు బ్యాట్స్‌మెన్ ఔటవుతున్న తీరు నిరాశ కలిగిస్తోంది. శుభారంభం లభించాక ఎక్కువసేపు క్రీజులో నిలిచి భారీగా పరుగులు చేయడంపై ఆ జట్టు దృష్టి సారించాలి. ఈ విషయంలో విలియమ్సన్‌ను మిగతావారు ఆదర్శంగా తీసుకోవాలి. 20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వాటిని అర్ధ సెంచరీలుగా మార్చేందుకు ప్రయత్నించి జట్టు భారీ స్కోరుకు దోహదపడాలి. మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ ద్వారా శుభారంభాలు లభిస్తున్నాయి. సన్‌రైజర్స్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలని డేర్ డెవిల్స్‌కు తెలుసు. ఢిల్లీ ఎక్కువగా భారత బ్యాట్స్‌మెన్ ఆటతీరుపైనే ఆధారపడుతోంది. స్పిన్నర్ అమిత్ మిశ్రా పొదుపుగా బౌలింగ్ చేయడంతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ గట్టెక్కాలంటే విశేషంగా రాణించాల్సిందే. -
ఎదురులేని సన్‌రైజర్స్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. శనివారం ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది సన్‌రైజర్స్. సీజన్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోయిన సన్‌రైజర్స్.. మరొకసారి వరుసగా నాల్గో గెలుపును అందుకుంది. ఓవరాల్‌గా 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. అదే సమయంలో ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. తాజా మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కు ఢిల్లీ 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించింది. అలెక్స్ హేల్స్(45;31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్(33; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఆరంభాన్నివ్వగా, మిగతా పనిని మనీష్ పాండే(21), కేన్ విలియమ్సన్(32 నాటౌట్), యూసఫ్ పఠాన్(27 నాటౌట్)లు పూర్తి చేశారు. అంతకుముందు ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన మ్యాక్స్‌వెల్(2) రనౌట్ కావడంతో ఢిల్లీ తొమ్మిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పృథ్వీ షా-శ్రేయస్ అయ్యర్ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రధానంగా పృథ్వీ షా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, పృథ్వీ షా(65;36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిద్దార్థ్ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 95 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను నష్టపోయింది. పృథ్వీ షా ఔటైన తర్వాత స్కోరు బోర్డు నెమ్మదించింది. దాంతో స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించి శ్రేయస్ అయ్యర్(44;36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ఔటయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో నమాన్ ఓజా(1), రిషబ్ పంత్(18)లు పెవిలియన్ చేరడంతో ఢిల్లీ స్కోరు మరింత మందగించింది. చివర్లో విజయ్ శంకర్(23 నాటౌట్; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్పర్) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. -
సన్‌రైజర్స్ లక్ష్యం 164
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన మ్యాక్స్‌వెల్(2) రనౌట్ కావడంతో ఢిల్లీ తొమ్మిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పృథ్వీ షా-శ్రేయస్ అయ్యర్ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ప్రధానంగా పృథ్వీ షా చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, పృథ్వీ షా(65;36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిద్దార్థ్ కౌల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 95 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను నష్టపోయింది. పృథ్వీ షా ఔటైన తర్వాత స్కోరు బోర్డు నెమ్మదించింది. దాంతో స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించి శ్రేయస్ అయ్యర్(44;36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ఔటయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో నమాన్ ఓజా(1), రిషబ్ పంత్(18)లు పెవిలియన్ చేరడంతో ఢిల్లీ స్కోరు మరింత మందగించింది. చివర్లో విజయ్ శంకర్(23 నాటౌట్; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్పర్) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు సాధించగా, సిద్ధార్థ్ కౌల్‌కు వికెట్ దక్కింది. -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. సన్‌రైజర్స్ ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించింది. అదే సమయంలో ఢిల్లీ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి మూడు విజయాల్ని మాత్రమే సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సన్‌రైజర్స్ తుది జట్టులోకి భువనేశ్వర్ తిరిగి రాగా, బాసిల్ థంపికి విశ్రాంతి కల్పించారు. మరొకవైపు ఢిల్లీ రెండు మార్పులు చేసింది. నమాన్ ఓజా, డానియల్ క్రిస్టియన్లు జట్టులోకి రాగా, మున్రో, షహబాజ్ నదీమ్‌లను తప్పించారు. తుదిజట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్(కెప్టెన్), అలెక్స్ హేల్స్, శిఖర్ ధావన్, మనీష్ షాండే, షకీబుల్ హాసన్, యుసుఫ్ పఠాన్, వృద్దిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, రషీద్‌ఖాన్, సిద్ధార్థ్‌కౌల్, సందీప్ శర్మ ఢిల్లీ డేర్‌డెవిల్స్ శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, నమాన్ ఓజా, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, డానియల్ క్రిస్టియన్, లియామ్ ప్లంకెట్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ -
పృథ్వీ షా అచ్చం సచినే!
హైదరాబాద్ : అండర్ 19 సూపర్ హీరో, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓపెనర్ పృథ్వీషాపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బుధవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ కెరటం 47(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చని విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో షా ఆడిన కొన్ని షాట్లు సచిన్‌ను తలపిస్తున్నాయని అభిమానులు వాపోతున్నారు. ఇక షా ప్రదర్శన పట్ల సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షా ప్రదర్శనపై అభిమానుల కామెంట్స్ ‘స్ట్రేట్ డ్రైవ్ ఆడితే సచిన్‌లా.. కవర్ డ్రైవ్ ఆడితే కోహ్లిలా’ ఉందని ఒకరంటే.. ‘షా ఆడే షాట్స్‌ను కోహ్లి ఆడటం కూడా చూడలేదు.. ఇక్కడ కోహ్లిని తక్కువ చేయడం నాఉద్దేశం కాదు. 90వ దశకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి షా బ్యాటింగ్ సచిన్‌ను గుర్తుచేస్తోంది’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘ ఈ మ్యాచ్ జరుగుతుంటే మా అమ్మ ఈ చిన్నపిల్లోడు ఎవరని.. షాను చూపిస్తూ అడిగింది. సచిన్‌లానే ఉన్నాడని చెప్పింది.’ అని మరొకరు తన అభిమానాన్ని చాటుకున్నారు. షా.. సచిన్, వినోద్ కాంబ్లీల కలయికగా మరికొందరు అభివర్ణిస్తున్నారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో షా అచ్చం ధోనిలా హెలికాప్టర్ షాట్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పిన్న వయసులోనే పలువురి ప్రశంసల అందుకుంటున్న ఈ అండర్ 19 స్టార్.. టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Prithvi Shaw looks like Sachin Tendulkar when he plays straight drive. Prithvi Shaw looks like Virat Kohli when he plays cover drive. — Sunil- The Cricketer (@1sInto2s) 2 May 2018 I know it's too early but the glimpses of @sachin_rt which I never saw in @imVkohli I am seeing them in @PrithviShaw I am not saying Virat is not a class act but the way Prithvi bats every 90's kid will see God in him — Swapnil S (@swapnilsshinde) 2 May 2018 My mom just asked pointing Prithvi Shaw- who's this short guy with MRF bat! He's reminding me of @sachin_rt 🙏#IPL2018 #DDvRR — Gamora's Daddy (@AB_arpit) 2 May 2018 చదవండి: అచ్చం ధోనిలా.. షా! -
ఐపీఎల్: ఆ రెండు ఢిల్లీకే సొంతం
హైదరాబాద్ : ఐపీఎల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆరేంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌లు ఇప్పుడు ఒకే జట్టుకు సొంతమయ్యాయి. సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌కు ఆరేంజ్క్యాప్.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్‌లు ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత సీజన్లో ఈ రెండిటిని ఒకే జట్టు ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు. బుధవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ పరుగులతో ఈ యువ బ్యాట్స్‌మన్ ఆరేంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు పంత్ 9 మ్యాచ్‌ల్లో 180.28 స్ట్రైక్‌రేట్‌తో 375 పరుగులు సాధించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు(370)ని వెనక్కి నెట్టాడు. ఇదే మ్యాచ్‌లో.. ఢిల్లీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్ 9.17 ఎకానమితో 13 వికెట్లు సాధించి బౌలర్ల జాబితా అగ్రస్థానంలో నిలిచాడు. బౌల్ట్ తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ సిద్దార్ధ్ కౌల్ (9) ఉన్నాడు. -
పంత్, అయ్యర్ వీరవిహారం.. రాజస్తాన్ లక్ష్యం 151
న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ రిషబ్‌పంత్, శ్రేయస్ అయ్యర్ల హాఫ్‌సెంచరీలకు అండర్-19 స్టార్ పృథ్వీషా 47(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) తోడవ్వడంతో భారీ స్కోర్ నమోదైంది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రాజస్తాన్ లక్ష్యాన్ని 12 ఓవర్లకు 151 పరుగులుగా నిర్ణయించారు. ఇక మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 18 ఓవర్లకు కుదించారు. ఇక 17.1 ఓవర్ అనంతరం మరోసారి వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపేశారు. దీంతో మరోసారి ఓవర్లను కుదించి డక్ వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని నిర్ధేశించారు. అండర్-19 హీరో సూపర్ ఇన్నింగ్స్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్ కొలిన్ మున్రో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో అండర్-19 సూపర్ హీరో పృథ్వీషా దాటిగా ఆడాడు. 18, 27 వ్యక్తిగత పరుగుల వద్ద షా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌లను రాజస్తాన్ ఆటగాళ్లు జారవిడిచడంతో మరింత చెలరేగాడు. చిచ్చర పిడుగులా ఆడుతూ అర్ధశతకానికి చేరువైన షా శ్రేయస్ గోపాల్ వేసిన 7.2వ బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పంత్.. అయ్యర్ వీరవిహారం.. పృథ్వీషా వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చిరావడంతోనే దాటిగా ఆడాడు. మరోవైపు అయ్యర్ కూడా రెచ్చిపోవడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో పంత్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. మరికొద్ది సేపటికే అయ్యర్ సైతం 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థసెంచరీ సాధించాడు. ప్రమాదకరంగా మారిన వీరిని ఉనద్కట్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. తొలుత అయ్యర్ 50(35 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లు), ఆ వెంటనే పంత్ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఔట్ అయ్యాడు. మూడో వికెట్‌కు ఈ జోడి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. చివర్లో విజయ్ శంకర్ 17(6 బంతులు,2 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (5)లు దాటిగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరారు. మ్యాక్స్ వికెట్ అనంతరం వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. దీంతో 17.1 ఓవర్లకు ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలింగ్‌లో ఉనద్కత్ మూడు వికెట్లు తీయగా.. కులకర్ణి, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్లు తలో వికెట్ తీశారు. -
ఐపీఎల్: వర్షం ఆటంకం.. ఢిల్లీ స్కోర్ 196/6
న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం మరోసారి ఆటంకంగా మారింది. మ్యాచ్ ఆరంభం ముందు వర్షం రావడంతో అంపైర్లు ఆటను 18 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ రెండోసారి వర్షం వచ్చే సమయానికి 17.1 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ 50(35 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్‌లు), పృథ్వీషా 47(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు చెలరేగడంతో ఢిల్లీ భారీస్కోర్ సాధించింది. -
వర్షం అడ్డంకితో రాజస్తాన్ ఆటగాళ్లు ఏం చేసారంటే!
న్యూఢిల్లీ : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో రాజస్తాన్ ఆటగాళ్లు ఫన్నీ గేమ్స్‌తో సరదాగా గడిపారు. బాటిల్ చాలెంజ్ అంటూ ఒకరిపై ఒకరు పోటిపడ్డారు. ఈ వీడియోను ఐపీఎల్ అధికారిక ట్విటర్లో ‘‘వర్షం మ్యాచ్‌ను అడ్డుకుంది.. అయితే ఈ బాటిల్ చాలెంజ్‌ను చూడండి’’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో డగౌట్లో ఉన్న రాజస్థాన్ ఆటగాళ్లు ఉనద్కట్, అనురిత్ సింగ్, ప్రశాంత్ చోప్రాలు మరికొంత మంది ఓ టేబుల్‌పై బాటిల్‌ను తిప్పుతూ సరదాగా ఒకరికొకరు చాలెంజ్ చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్ : నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయం
న్యూఢిల్లీ: ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారింది. టాస్ అనంతరం ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టె సమయానికి వర్షం అంతరాయం కలిగించడంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. అంతకుముందు టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య సవాయ్ మాన్సింగ్ స్టేడియం (జైపూర్) వేదికగా జరిగిన మ్యాచ్‌కు సైతం వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రాజస్తాన్‌నే విజయం వరించింది. చదవండి: టాస్ గెలిచిన రాజస్తాన్ -
ఐపీఎల్: టాస్ గెలిచిన రాజస్తాన్
న్యూఢిల్లీ : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ అజింక్యా రహానే ఫీల్డింగ్వైపు మొగ్గు చూపాడు. ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ జట్టులో రాహుల్ తెవాటియా స్థానంలో షబాజ్ నదీమ్ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్ జట్టులోకి ఇష్ సోదీ, మహిపాల్ లోమ్రా స్థానంలో డియార్సీ షార్ట్, శ్రేయస్ గోపాల్‌లు వచ్చారు. ఇక ఢిల్లీ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఈ మ్యాచ్‌కు సైతం దూరంగా ఉన్నాడు. ఇక ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. గత మ్యాచ్‌లో చెన్నై విధించిన భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చివరి వరకు పోరాడారు. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో మ్యాచ్ జరగడం ఢిల్లీకి కలిసొచ్చె అంశం. రాజస్తాన్ రాయల్స్ సైతం 7 మ్యాచ్‌లో 3 మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవం చేసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఈ సీజన్లో ఇరు జట్ల ఒకసారి తలపడగా.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం విజయం రాజస్తాన్‌నే వరించింది. ఇక రాజస్తాన్‌కు ఈ సీజన్లో ఇదే తొలి విజయం. తుది జట్లు: ఢిల్లీ: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), లియామ్ ప్లంకెట్, అమిత్ మిశ్రా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కోలిన్ మున్రో, ట్రెంట్ బౌల్ట్, విజయ్ శంకర్, షబాజ్ నదీమ్, అవేశ్ ఖాన్, రిషబ్ పంత్, పృథ్వీ షా రాజస్తాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), డియార్సీ షార్ట్, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, బట్లర్, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ధావల్ కులకర్ణి, జయదేవ్ ఉనాద్కట్ -
స్పిన్‌కు మ్యాక్స్‌వెల్ గజగజ!
హైదరాబాద్ : ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు స్పిన్నర్లు సింహస్వప్నంలా మారారు. సాధారణంగా స్పిన్ బౌలింగ్ అంటేనే తడబడే మ్యాక్స్.. ఈ సీజన్లో సైతం వారిని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. తన బలహీనతను గుర్తించిన ప్రత్యర్థులు.. మ్యాక్స్ క్రీజులోకి రాగానే స్పిన్నర్లను బరిలోకి దించుతున్నారు. దీంతో మ్యాక్స్‌వెల్ పరుగులు చేయలేక వేగంగా ఆడే క్రమంలో వికెట్ చేజార్చుకుంటు తీవ్ర తడబాటుకు గురవుతున్నాడు ఈ సీజన్లో 30 స్పిన్ బంతులను ఎదుర్కున్న ఈ ఆసీస్ ఆటగాడు కేవలం 14.5 స్ట్రైక్ రేట్‌తో నాలుగు సార్లు వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇలా మ్యాక్స్ తడబడటం ఈ ఒక్కసారేం కాదు. అంతర్జాతీయ క్రికెట్లో సైతం ఇబ్బంది పడ్డాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో 651 స్పిన్ బంతులను ఎదుర్కున్న మ్యాక్స్ 27.12 స్ట్రైక్ రేట్‌తో 24 సార్లు ఔటవ్వడం విశేషం. ఈ గణాంకాలే మ్యాక్స్‌ను స్పిన్ బౌలర్లు ఎంత వణికిస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి. ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను ఈ సీజన్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ఆ నిర్ణయం మమ్మల్ని ముంచింది: అయ్యర్
పుణే : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ఓటమిపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..అంపైర్ తప్పుడు నిర్ణయం వల్లె ఓటమి పాలయ్యామని, తొలి బంతికే చెన్నై బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ ఔట్ అయినప్పటికి అంపైర్లు ఇవ్వలేదని ఆరోపించాడు. తనతో పాటు తమ డ్రెసింగ్స్ రూం కూడా వాట్సన్ ఔటేనని భావిస్తుందని తెలిపాడు. ఈ తప్పిదంతో వాట్సన్ చెలరేగాడని దీంతో భారీ లక్ష్యం నమోదైందని.. ఇది తమ జట్టుపై పెద్ద ప్రభావం చూపిందని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారంపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు. మాకు ప్రతి మ్యాచ్ సవాలే.. విజయానికి చేరువగా రావడం శుభపరిణామమని ఈ యువ సారథి ఆనందం వ్యక్తం చేశాడు. ‘ మేం నిజంగా విజయానికి చేరువగా వచ్చాం. ఇది మా తదుపరి మ్యాచ్‌కు ఉపయోగపడుతోంది. టోర్నీలో ఇంకా మేం ఆడాల్సిన ప్రతి మ్యాచ్‌ను ఖచ్చితంగా గెలువాలి. మా తప్పిదాలను గుర్తించి.. వాటి సరిదిద్దుకోని విజయాల కోసం ప్రయత్నిస్తాం. మేం మేనేజ్మెంట్తో సమావేశమై జట్టు కూర్పుపై చర్చిస్తాం. ఇదే విధంగా జట్టుగా ముందుకు కొనసాగుతాం. తదుపరి మ్యాచ్‌లో రాణిస్తామని’ అయ్యర్ తెలిపాడు. చెన్నై ఇన్నింగ్స్.. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి బంతికే వాట్సన్ వికెట్ల ముందు దొరకగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఢిల్లీ రివ్యూ కోరింది. అయితే ధర్డ్ అంపైర్ సైతం బంతి బ్యాట్‌కు తగిలిందని సందేహం వ్యక్తం చేస్తూ బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నాటౌట్ ఇచ్చాడు. అయితే వీడియోలో మాత్రం స్పష్టమైన ఔట్‌గానే కనిపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాట్సన్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగాడంతో 13 పరుగులతో ఢిల్లీ పరాజయం చెందింది. ఈ సీజన్లో అంపైర్లు తప్పిదాలపై అభిమానులు ఇప్పటికే అగ్రహం వ్యక్తంచేశారు. చెన్నై-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో స్పష్టమైన నోబాల్‌ను ఇవ్వకపోవడం, రాజస్తాన్-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఓవర్లో 7 బంతులు వేయించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా సైతం సూచించారు. చెన్నైతో జరిగే మ్యాచ్‌లోనే అంపైర్లు ఇలా తప్పిదాలు చేస్తూ ఆజట్టుకు మద్దతిస్తున్నారని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పోరాడి ఓడిన ఢిల్లీ
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఢిల్లీ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(9) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కోలిన్ మున్రో(26), శ్రేయస్ అయ్యర్(13), గ్లెన్ మ్యాక్స్‌వెల్(6)లు కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 74 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఆ దశలో రిషబ్ పంత్ -విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 88 పరుగులు జోడించి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 79 పరుగులు నమోదు చేసిన తర్వాత రిషబ్ ఔటయ్యాడు. ఇక విజయ్ శంకర్(54 నాటౌట్; 31 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) కడవరకూ పోరాటం సాగించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి బంతి వరకూ పోరాటం సాగించిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఇన్నింగ్స్‌ను షేన్ వాట్సన్, డుప్లెసిస్‌లు ఆరంభించారు. ఒక ఎండ్‌లో డుప్లెసిస్ నిలకడగా ఆడితే, మరో ఎండ్‌లో వాట్సన్ మాత్రం విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించి చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆది నుంచి చెలరేగి ఆడిన వాట్సన్.. 25 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డు ప్లెసిస్(33)తో కలిసి తొలి వికెట్‌కు 102 పరుగులు జత చేశాడు. కాగా, పరుగు వ్యవధిలో చెన్నై రైనా(1) వికెట్‌ను కోల్పోవడంతో వాట్సన్ కాసేపు నెమ్మదించాడు. ఆ తర్వాత అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్మించిన వాట్సన్ మరోసారి బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రధానంగా సొగసైన గ్యాప్ షాట్లతో వాట్సన్ అలరించాడు. అయితే అమిత్ మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన వాట్సన్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో మరోసారి సెంచరీ చేస్తాడనుకున్న చెన్నై అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే వాట్సన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోని దూకుడును కొనసాగించాడు. తనదైన స్టైల్లో ఢిల్లీ బౌలర్లలోపై విరుచుకుపడిన 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో ధోని (51 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. మరొకవైపు రాయుడు(41; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా సమయోచితంగా ఆడటంతో చెన్నై భారీ స్కోరు సాధించింది. -
సురేశ్ రైనా 50వ ‘సారీ’
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా(4,745) అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓవరాల్ ఐపీఎల్లో అత్యధిక సార్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔటైన ఆటగాళ్ల జాబితాలో రైనా రెండో స్థానంలో నిలిచాడు. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైనా.. ఆఫ్ బ్రేక్ బౌలర్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు. ఫలితంగా 50 సార్లు స్పిన్నర్లకే చేతికి చిక్కిన అప్రతిష్టను రైనా మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో రాబిన్ ఉతప్ప తొలి స్థానంలో ఉండగా, రైనా రెండో స్థానంలో నిలిచాడు. ఆఫ్ స్పిన్నర్లు, లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో తలో 19 సార్లు పెవిలియన్‌కు చేరిన రైనా.. స్లో లెఫ్టార్మ్ బౌలింగ్‌లో 11 సార్లు ఔటయ్యాడు. చైనామన్ బౌలింగ్‌లో ఒకసారి పెవిలియన్‌కు చేరాడు. -
వాట్సన్ వీరంగం.. ధోని దూకుడు
పుణె: ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)సీజన్లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై వీరంగం సృష్టించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ను షేన్ వాట్సన్, డుప్లెసిస్‌లు ఆరంభించారు. ఒక ఎండ్‌లో డుప్లెసిస్ నిలకడగా ఆడితే, మరో ఎండ్‌లో వాట్సన్ మాత్రం విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించి చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆది నుంచి చెలరేగి ఆడిన వాట్సన్.. 25 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డు ప్లెసిస్(33)తో కలిసి తొలి వికెట్‌కు 102 పరుగులు జత చేశాడు. కాగా, పరుగు వ్యవధిలో చెన్నై రైనా(1) వికెట్‌ను కోల్పోవడంతో వాట్సన్ కాసేపు నెమ్మదించాడు. ఆ తర్వాత అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్మించిన వాట్సన్ మరోసారి బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రధానంగా సొగసైన గ్యాప్ షాట్లతో వాట్సన్ అలరించాడు. అయితే అమిత్ మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన వాట్సన్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో మరోసారి సెంచరీ చేస్తాడనుకున్న చెన్నై అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే వాట్సన్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోని దూకుడును కొనసాగించాడు. తనదైన స్టైల్లో ఢిల్లీ బౌలర్లలోపై విరుచుకుపడిన 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో ధోని (51 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. మరొకవైపు రాయుడు(41; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా సమయోచితంగా ఆడటంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. -
ఐపీఎల్: మరో ఇద్దరు క్రికెటర్ల అరంగేట్రం
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ సోమవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ చెన్నై ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలవగా, ఢిల్లీ ఏడు మ్యాచ్‌లకు గాను రెండింటిలో మాత్రమే విజయ సాధించింది. కాగా, గత మ్యాచ్‌ల్లో కోల్‌కతాపై ఢిల్లీ విజయం సాధించగా, ముంబై చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ఈ సీజన్లో చెన్నై-ఢిల్లీలకు ఇదే తొలి మ్యాచ్. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్‌లో చెన్నై నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. శామ్ బిల్లింగ్స్, ఇమ్రాన్ తాహీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లకు విశ్రాంతినివ్వగా, వారి స్థానాల్లో లుంగి ఎంగిడి, కేఎమ్ అసిఫ్, కరణ్ శర్మ, డుప్లెసిస్‌లకు తుది జట్టులో చోటు దక్కింది. ఇది ఎంగిడి, కేఎమ్ అసిఫ్‌లకు ఐపీఎల్ అరంగేట్రపు మ్యాచ్. మరొకవైపు ఢిల్లీ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమైంది. తుది జట్లు ఢిల్లీ శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), లియామ్ ప్లంకెట్, అమిత్ మిశ్రా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కోలిన్ మున్రో, ట్రెంట్ బౌల్ట్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, అవేశ్ ఖాన్, రిషబ్ పంత్, పృథ్వీ షా చెన్నై ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, డ్వేన్ బ్రేవో, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, కరణ్ శర్మ, డుప్లెసిస్, ఎంగిడి, కేఎమ్ అసిఫ్, హర్భజన్ సింగ్ -
మళ్లీ గెలుపు బాట పట్టేదెవరు?
ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతుల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎలా కోలుకుంటుందనేది ఆసక్తికరం. శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్ దినేశ్ కార్తీక్ జట్టును విజయం నుంచి దూరం చేసింది. ఛేదనకు అవసరమైన రీతిలో ఆ జట్టుకు ఆరంభమే లభించలేదు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ షార్ట్ బాల్‌కు ఔట్ కావడాన్ని బట్టి చూస్తే రాయల్ చాలెంజర్స్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించవచ్చు. సునీల్ నరైన్ అప్పటి వరకు అన్ని వైపుల షాట్లు కొట్టినా నేరుగా శరీరంపైకి వచ్చిన బంతిని ఆడలేకపోయాడు. షార్ట్ బంతిని మెరుగ్గా ఆడటంలో ఉతప్పకు మంచి నైపుణ్యం ఉంది. అతను బెంగళూరులో సొంత ప్రేక్షకుల సమక్షంలో రాణించాలని కోరుకుంటున్నాడు. మైదానంలో ఏ మూలకైనా సిక్సర్ కొట్టి ప్రత్యర్థిని భయపెట్టగల రసెల్ కూడా జట్టులో ఉన్నాడు. ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ పయనం పడుతూ లేస్తూ సాగుతోంది. నిజానికి వారి భారీ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఎలాంటి పెద్ద లక్ష్యమైనా వారి ముందు చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ నిలకడలేమితో పాటు టాపార్డర్‌లో మంచి ఆరంభాలు లభించకపోవడమే వారికి సమస్యగా మారింది. కలలో కూడా ఊహించలేని తరహా షాట్లు ఆడుతూ డివిలియర్స్ ప్రత్యర్థి ఆటగాళ్లు ఊపిరి ఆగిపోయేలా చేస్తున్నాడు. అయితే డెత్ బౌలింగ్ వారిని బాగా ఇబ్బంది పెడుతోంది. ధోని దూకుడు మీద ఉన్న సమయంలో చివరి ఓవర్లలో అండర్సన్ బౌలింగ్ చేయడం సరైన వ్యూహం అనిపించుకోదు. ఇటీవలే మళ్లీ బౌలింగ్ చేయడం మొదలు పెట్టిన అండర్సన్లో స్లాగ్ ఓవర్లలో బౌలింగ్ చేసే ఆత్మవిశ్వాసం లోపించడం సహజం. ఫలితంగానే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఆ జట్టు చేజార్చుకుంది. గత మ్యాచ్‌లలో భారీ ఓటముల తర్వాత ఇరు జట్లు కూడా మళ్లీ మ్యాచ్ గెలిచి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఇరు జట్లలో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు కాబట్టి మరో హోరాహోరీ పోరు ఖాయం. -
శివం మావి, అవేష్లకు మందలింపు
ఢిల్లీ: ఐపీఎల్ తాజా సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ శివం మావి, ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ అవేశ్ ఖాన్లు మ్యాచ్ రిఫరీ మందలింపుకు గురయ్యారు. వీరిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వికెట్‌ను తీసిన క్రమంలో దురుసుగా ప్రవర్తించారు. ఇది ఐపీఎల్ నిబంధనావళి లెవల్-1కు వ్యతిరేకం కావడంతో వారిద్దర్నీ రిఫరీ హెచ్చరించాడు. వీరు తమ తప్పును ఒప్పుకోవడంతో రిఫరీ మందలింపుతో సరిపెట్టారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే కోల్‌కతా పేసర్ శివం మావి బౌలింగ్‌లో ఢిల్లీ ఓపెనర్ కోలిన్ మున్రో ఔటయ్యాడు. ఆ సమయంలో మావి దూకుడుగా వ్యవహరించడంతో పాటు నిరర్ధకమైన పదమును ఉపయోగించాడు. ఆ తరువాత కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఆండ్రీ రస్సెల్ ఔటైనప్పుడు ఢిల్లీ బౌలర్ అవేశ్ ఖాన్ తనకు నోటి పనిచెప్పాడు. దాంతో పాటు చేతితో ఏవో సంజ్ఞలు చేస్తూ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దాంతో వారిని రిఫరీ పిలిచి మందలించారు. -
అందరి నోట.. అయ్యర్ మాట
న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి నోట.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ నూతన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరే. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని నిరూపిస్తూ.. ఈ యువ సారథి బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించి ఢిల్లీ రాత మార్చాడు. జట్టును ముందుండి నడిపించడం అంటే ఏమిటో తొలి మ్యాచ్‌లోనే చూపించాడు. 10 సిక్సర్లతో 40 బంతుల్లో 93 పరుగుల చేసి డేర్‌డెవిల్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. దీంతో ఈ యువ ఆటగాడిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘కెప్టెన్‌గా గొప్ప ప్రాంభం.. అద్భుత బ్యాటింగ్’ అని కొందరంటే.. ‘హ్యాట్సాఫ్ అయ్యర్.. నీవు కోహ్లికి సరిపడ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్’వి అని ఇంకొందరు కొనియాడుతున్నారు. ‘ఈ విజయం అయ్యర్‌కు కెప్టెన్‌గా గొప్ప ప్రారంభం.. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కడం అతనికి మరిచిపోలేనిదని, ఈ విజయాన్నే సోమవారం చెన్నైతో పునరావృతం చేయాలని’ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఢిల్లీ వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న అయ్యర్ ఢిల్లీకి తొలి మ్యాచ్‌లోనే చిరస్మరణీయ విజయాన్నందించాడు. Hats off to Shreyas Iyer 🙌 He will be perfect partner for Virat Kohli in the middle order.. #DDvKKR #IPL2018 #IPL11 #DDvKKR #delhidaredevil — kunaleo_10 (@kunalpatil04) 27 April 2018 Congratulations @DelhiDaredevils on a comprehensive win - special day for Shreyas Iyer - overall splendid performance - let’s have a repeat on Monday — Parth Jindal (@ParthJindal11) 27 April 2018 -
కెప్టెన్‌గా.. అది గొప్ప ఆనందం: శ్రేయస్ అయ్యర్
న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్ నూతన సారథి శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీని విజయంతో ప్రారంభించాడు. ఫీరోజ్షా కోట్లా మైదానంలో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు సారథ్యం వహించడమే కాదు.. అద్భుతమైన బ్యాటింగ్‌తో పెద్ద విజయాన్ని అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రేయస్ 40 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. శివం మావి వేసిన 20వ ఓవర్లో 29 పరుగులు పిండుకున్న శ్రేయస్ .. మొత్తం తాను ఎదుర్కొన్న 40 బంతుల్లో పది సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా లక్ష్యఛేదనలో చతికిలపడింది. అండ్రూ రస్సెల్, శుభ్‌మన్ గిల్ ఓ మోస్తరుగా రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కోల్‌కతా 55 పరుగుల తేడాతో చిత్తయింది. ఐపీఎల్లో కెప్టెన్సీని విజయంతో ప్రారంభించడం గొప్పగా అనిపిస్తోందని 23 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ ‘ఇది గొప్పగా అనిపిస్తోంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం అద్భుతంగా ఉంది’ అని అన్నాడు. ‘టాస్ గెలిస్తే.. మొదట బౌలింగ్ తీసుకుందామని అనుకున్నాం. కానీ, టాస్ ఓడటం కూడా మంచిదే అయింది’ అని తెలిపాడు. టాస్ ఓడి.. బ్యాటింగ్ తీసుకున్నప్పటికీ ఢిల్లీకి పృథ్వీ షా-కొలిన్ మున్రో జోడీ మంచి శుభారంభాన్నిచ్చింది. ముఖ్యంగా 44 బంతుల్లో 62 పరుగులు చేసిన కుర్రాడు పృథ్వీషాపై శ్రేయస్ ప్రశంసల జల్లు కురిపించాడు. పృథ్వీ ఢిల్లీకి మంచి ఆరంభాన్ని ఇచ్చాడని, ఈ సీజన్ ప్రారంభమైన నాటినుంచి అతను బాగా ఆడుతూ.. జట్టుకు అవసరమైన శుభారంభాలను ఇస్తున్నాడని ప్రశంసించాడు. 18 సంవత్సరాల 169 రోజుల వయస్సున పృథ్వీ షా.. ఐపీఎల్ అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సంజూ శాంసన్‌తో కలిసి రికార్డు పంచుకుంటున్నాడు. అలాగే మున్రో, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియాం ప్లంకెట్పైనా శ్రేయస్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
అయ్యర్ అద్భుతం
జట్టును ముందుండి నడిపించడం అంటే ఏమిటో శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లోనే చూపించాడు. కెప్టెన్‌గా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని నిరూపిస్తూ బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించి ఢిల్లీ రాత మార్చాడు. 10 సిక్సర్లతో విరుచుకుపడి డేర్‌డెవిల్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. కెప్టెన్సీతో పాటు తుది జట్టుకూ దూరమైన సీనియర్ గంభీర్ డగౌట్ నుంచి చూస్తుండగా, యువ అయ్యర్‌తో పాటు మరో సంచలనం పృథ్వీ షా దూకుడైన బ్యాటింగ్ కోట్లాలో అభిమానులకు ఆనందం పంచితే... భారీ స్కోరును ఛేదించలేక కోల్‌కతా చతికిల పడింది న్యూఢిల్లీ: కెప్టెన్సీ మార్పు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అదృష్టం తెచ్చిపెట్టినట్లుంది. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 55 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఈ సీజన్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 10 సిక్సర్లు) భీకర బ్యాటింగ్, పృథ్వీ షా (44 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్‌కు మున్రో (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు కూడా తోడయ్యాయి. ఆ తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. రసెల్ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి 4 ఓవర్లలో 76... పృథ్వీ షా, మున్రో తొలి వికెట్‌కు 42 బంతుల్లో 59 పరుగులు జోడించి ఢిల్లీకి శుభారంభం అందించారు. మున్రోను మావి బౌల్డ్ చేయగా... మరోవైపు 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న షా, ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సంజు శామ్సన్తో సమంగా నిలిచాడు. షాను చావ్లా అవుట్ చేయగా, మరో మూడు బంతులకే పంత్ (0) వెనుదిరిగాడు. ఈ దశలో ఢిల్లీ స్కోరు 129/3 కాగా శ్రేయస్ 33 (23 బంతుల్లో) పరుగుల వద్ద ఆడుతున్నాడు. అయితే ఆపై అయ్యర్ తుఫాన్ వేగంతో దూసుకుపోయాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 17 బంతుల్లో అతను ఏకంగా 60 పరుగులు బాదాడు! వీటిలో 8 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా తన బ్యాటింగ్ పదును చూపించాడు. మావి వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లోనైతే శ్రేయస్ పండుగ చేసుకున్నాడు. ఐదు బంతుల్లో అతను 4 భారీ సిక్సర్లు, ఫోర్ బాదగా వైడ్‌తో కలిపి ఆ ఓవర్లో మొత్తం 29 పరుగులు వచ్చాయి. దాదాపు అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. ఈ దశలో రసెల్, శుబ్‌మన్ గిల్ ఆరో వికెట్‌కు 36 బంతుల్లోనే 64 పరుగులు జోడించినా... నైట్‌రైడర్స్ విజయానికి అది సరిపోలేదు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) చావ్లా 62; మున్రో (బి) మావి 33; శ్రేయస్ అయ్యర్ నాటౌట్ 93; పంత్ (సి) కార్తీక్ (బి) రసెల్ 0; మ్యాక్స్‌వెల్ రనౌట్ 27; విజయ్ శంకర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 219. వికెట్ల పతనం: 1–59, 2–127, 3–129, 4–202 బౌలింగ్: చావ్లా 4–0–33–1, కుల్దీప్ 2–0–22–0, శివమ్ మావి 4–0–58–1, నరైన్ 3–0–35–0, జాన్సన్ 4–0–42–0, రసెల్ 3–0–28–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (బి) మ్యాక్స్‌వెల్ 5; నరైన్ (సి) శ్రేయస్ (బి) బౌల్ట్ 26; ఉతప్ప (సి) పృథ్వీ షా (బి) బౌల్ట్ 1; రాణా (సి అండ్ బి) అవేశ్ ఖాన్ 8; కార్తీక్ (సి) బౌల్ట్ (బి) మిశ్రా 18; శుబ్‌మన్ గిల్ రనౌట్ 37; రసెల్ (బి) అవేశ్ ఖాన్ 44; శివమ్ మావి (బి) మిశ్రా 0; చావ్లా (సి) మున్రో (బి) మ్యాక్స్‌వెల్ 2; జాన్సన్ నాటౌట్ 12; కుల్దీప్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 164. వికెట్ల పతనం: 1–19, 2–20, 3–33, 4–46, 5–77, 6–141, 7–141, 8–144, 9–146. బౌలింగ్: బౌల్ట్ 4–0–44–2, మ్యాక్స్‌వెల్ 2–0–22–2, అవేశ్ ఖాన్ 4–0–29–2, ప్లంకెట్ 4–0–24–0, మిశ్రా 4–1–23–2, శంకర్ 1–0–10–0, తేవటియా 1–0–11–0. -
డేర్‌డెవిల్స్ కసితీరా..
ఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చావుదెబ్బ తిన్న ఢిల్లీడేర్‌డెవిల్స్.. శుక్రవారం సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా గర్జించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఊచకోతకు ఓపెనర్ పృథ్వీ షా సొగసైన షాట్లు తోడవడంతో కోల్‌కతా ఈసారి తోకముడిచింది. ఆది నుంచి కోల్‌కతా బౌలింగ్‌పై విరుచుకుపడిన ఢిల్లీ.. ఆపై కోల్‌కతానూ కోలుకోనీయకుండా చేసి ఘనమైన విజయాన్ని అందుకుంది. కోల్‌కతా ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్(44)కు తోడు శుభ్‌మాన్ గిల్(37), నరైన్(26)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో ఆ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. ఢిల్లీ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. వరుస పరాజయాలతో సతమవుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎట్టకేలకు జూలు విదిల్చింది. అయ్యర్(93 నాటౌట్;40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు), పృథ్వీ షా(62; 44బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)లు వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో పాటు.. బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, అమిత్ మిశ్రా, అవీష్ ఖాన్ తలో రెండు వికెట్లతో చెలరేగడంతో కోల్‌కతాను 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఐపీఎల్లో ఇది ఢిల్లీకి రెండో అత్యుత్తమ స్కోరు. ఢిల్లీకి ఓపెనర్లు కోలిన్ మున్రో-పృథ్వీ షాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత మున్రో(33) ఔటయ్యాడు. ఆపై పృథ్వీషా -శ్రేయస్ అయ్యర్ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే తొలుత 38 బంతుల్లో పృథ్వీషా హాఫ్ సెంచరీ సాధించాడు. అయ్యర్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత పృథ్వీ షారెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 129 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అయితే అయ్యర్-మ్యాక్స్‌వెల్ జోడి మరింత దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి 73 పరుగులు జత చేశాడు. చివర్లో కోల్‌కతా బౌలర్లపై అయ్యర్ విరుచుకుపడటంతో ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది. ప్రధానంగా శివం మావి వేసిన ఆఖరి ఓవర్లో ఢిల్లీ 29 పరుగుల్ని పిండుకుంది. దాంతో ఈ సీజన్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న బౌలర్‌గా మావి చెత్త గణాంకాలు నమోదు చేశాడు. -
ఐపీఎల్ చరిత్రలో నాల్గో కెప్టెన్‌గా..
ఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా గౌతం గంభీర్ వైదొలగడంతో శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ఢిల్లీకి అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే సారథిగా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా వ్యహరించిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన నాల్గో క్రికెటర్‌గా అయ్యర్ నిలిచాడు. అంతకుముందు 2008లో గిల్ క్రిస్ట్(డెక్కన్ చార్జర్స్), 2013లో అరోన్ ఫించ్(పుణె వారియర్స్), 2016లో మురళీ విజయ్(కింగ్స్ పంజాబ్)లు కెప్టెన్లుగా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీలు సాధించిన క్రికెటర్లు. కాగా, కెప్టెన్లుగా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరును అయ్యర్ సాధించడం ఇక్కడ మరో విశేషం. -
చెలరేగిన శ్రేయస్ అయ్యర్ : కేకేఆర్‌కు భారీ లక్ష్యం
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రేయస్ అయ్యర్(93 నాటౌట్;40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు), పృథ్వీ షా(62; 44బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కోలిన్ మున్రో-పృథ్వీ షాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత మున్రో(33) ఔటయ్యాడు. ఆపై పృథ్వీషా -శ్రేయస్ అయ్యర్ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే తొలుత 38 బంతుల్లో పృథ్వీషా హాఫ్ సెంచరీ సాధించాడు. అయ్యర్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత పృథ్వీ షారెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. దాంతో ఢిల్లీ 129 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అయితే అయ్యర్-మ్యాక్స్‌వెల్ జోడి మరింత దూకుడుగా ఆడింది. ఈ క్రమంలోనే అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి 73 పరుగులు జత చేశాడు. చివర్లో కోల్‌కతా బౌలర్లపై అయ్యర్ విరుచుకుపడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. -
ఎక్స్‌ట్రాలు లేకుండా 14 ఓవర్లు..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. బౌలింగ్‌లో ఎంతో నియంత్రణను ప్రదర్శించింది. 14 ఓవర్ల పాటు కనీసం ఒక్క ఎక్స్ట్రా కూడా లేకుండా బౌలింగ్ వేసింది కోల్‌కతా. మిచెల్ జాన్సన్, ఆండ్రీ రస్సెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, శివం మావి, సునీల్ నరైన్‌లు తమ బౌలింగ్‌లో వైడ్లు కానీ, నో బాల్స్ కానీ ఇవ్వకుండా ఆకట్టుకున్నారు. చివరకు 15 ఓవర్ తొలి బంతికి నైట్‌రైడర్స్ వైడ్‌తో ఎక్స్‌ట్రాకు స్వాగతం పలికింది. కోల్‌కతా బౌలర్ ఆండ్రీ రస్సెల్ ఇన్నింగ్స్ తొలి వైడ్‌ను వేశాడు. దాంతో 14 ఓవర్లపాటు అదనపు పరుగు లేకుండా బౌలింగ్ చేసి అరుదైన ఘనతను కేకేఆర్ లిఖించింది. -
ఐపీఎల్: ఆడిన రెండో మ్యాచ్‌లోనే..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు పృథ్వీ షా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో పిన్నవయసులో హాఫ్ సెంచరీ చేసిన జాబితాలో సంజూ శాంసన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 169 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా, శాంసన్ కూడా 18 ఏళ్ల 169 రోజుల వయసులోనే అర్థ శతకం నమోదు చేశాడు. 2013లో శాంసన్ ఈ ఘనత సాధించగా, పృథ్వీ షా ఆడుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఇక పిన్నవయసులో ఐపీఎల్ హాఫ్ సెంచరీలు సాధించిన వారి జాబితాలో రిషబ్ పంత్(18 ఏళ్ల 212 రోజులు), ఇషాన్ కిషన్(18 ఏళ్ల 299 రోజులు), గోస్వామి(19 ఏళ్ల 1 రోజు), మనీష్ పాండే(19 ఏళ్ల 253 రోజులు)లు వరుస స్థానాల్లో ఉన్నారు. -
8 ఏళ్ల తర్వాత గంభీర్..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతం గంభీర్.. 2012, 2014లో జట్టును విజేతగా నిలిపాడు. అయితే తాజా సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గంభీర్‌ను వదులుకోవడంతో సొంత జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు తిరిగొచ్చాడు. అదే సమయంలో కెప్టెన్‌గా కూడా నియమించబడ్డాడు. కాగా, ఢిల్లీ వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల్ని నుంచి తప్పుకున్నాడు గౌతీ. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. దాంతో శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ పోరుకు సిద్ధమైంది. కాగా, తాజా మ్యాచ్‌కు గంభీర్‌ను ఢిల్లీ మేనేజ్మెంట్ పక్కన కూర్చోబెట్టింది. కనీసం తుది జట్టులో కూడా అవకాశం కల్పించలేదు. ఫలితంగా దాదాపు 8 ఏళ్ల తర్వాత గంభీర్ ఒక ఐపీఎల్ మ్యాచ్‌కు తొలిసారి దూరమయ్యాడు. 2010 ఐపీఎల్లో గంభీర్ చివరిసారి తుది జట్టులో చోటు కోల్పోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో గంభీర్ ఆడలేదు. ఇప్పుడు మరొకసారి జట్టుకు దూరమయ్యాడు. -
గౌతం గంభీర్ ఔట్
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్.. ఢిల్లీని ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. ఇప్పటివరకూ ఢిల్లీ ఆరు మ్యాచ్‌లు ఆడితే అందులో ఐదు ఓటముల్ని చవిచూసింది. అందులో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం ఎదుర్కొంది. ఇక కోల్‌కతా ఆరు మ్యాచ్‌లకు గాను మూడు గెలిచింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ సారథ్య బాధ్యతల్ని నుంచి గౌతం గంభీర్ తప్పకోవడంతో అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంచితే, కేకేఆర్‌తో మ్యాచ్‌కు గంభీర్‌ను ఢిల్లీ మేనేజ్మెంట్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. అతని స్థానంలో విజయ్ శంకర్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు ఢిల్లీ శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, కోలిన్ మున్రో, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, రాహుల్ తెహాతియా, ప్లంకెట్, అమిత్ మిశ్రా, అవీష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ కోల్‌కతా దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, శుభ్‌మాన్ గిల్, మిచెల్ జాన్సన్, పీయూష్ చావ్లా, శివం మావి, కుల్దీప్ యాదవ్ -
జూనియర్ డాలాకు పిలుపు
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో వరుస పరాజయాలతో సతమవుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు నుంచి సఫారీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ వైదొలిగిన సంగతి తెలిసిందే. వెన్నునొప్పితో బాధపడుతున్న మోరిస్ టోర్నీ నుంచి అర్దాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అతని స్థానాన్ని దక్షిణాఫ్రికాకే చెందిన పేసర్ జూనియర్ డాలాతో భర్తీ చేసేందుకు ఢిల్లీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్ మేనేజ్మెంట్ నుంచి జూనియర్ డాలాకు పిలుపు అందింది. కాగా, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో డాలా కలిసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతేడాది భారత్‌తో జరిగిన టీ 20 సిరీస్ ద్వారా దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేసిన డాలా.. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఆకట్టుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో డాలా ఏడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 3/35గా ఉంది. -
డేర్‌డెవిల్స్ రాత మారేనా?
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్‌ను భారీ అంచనాల మధ్య ఆరంభించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను వరుస పరాజయాలు కలవరపరుస్తున్నాయి. ఇప్పటివరకూ ఢిల్లీ ఆరు మ్యాచ్‌లు ఆడితే అందులో ఐదు ఓటముల్ని చవిచూడటం ఆ జట్టు సమష్టి వైఫల్యానికి అద్దం పడుతోంది. అందులో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఆ జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీ కెప్టెన్సీ పగ్గాలను గౌతం గంభీర్ వదులుకున్నాడు కూడా. జట్టును గాడిలో పెట్టాలనే ఆలోచనతో తన ఆటపై పూర్తి దృష్టి సారించలేకపోతున్నందుకే సారథ్య బాధ్యతల్ని నుంచి తప్పుకుంటున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు. దాంతో గంభీర్ నిర్ణయాన్ని స్వాగతించిన ఢిల్లీ ఫ్రాంచైజీ.. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించింది. మరి శ్రేయస్ అయ్యర్ రాకతో ఢిల్లీ రాత మారుతుందా అనేది చూడాలి. శుక్రవారం సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆరాట పడుతోంది. అదే క్రమంలో గాడిలో పడేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే మూడు జట్లు పదేసి పాయింట్లతో ప్లే ఆఫ్‌కు దగ్గరవుతుండగా.. ఢిల్లీ మాత్రం ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇక నుంచి ఢిల్లీ ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. బ్యాటింగ్‌లో జాసన్ రాయ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ ఇంతవరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. హిట్టర్లు మాక్స్వెల్.. ఓపెనర్ గంభీర్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఫామ్‌లేమీతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించాలంటే సమష్టి ప్రదర్శన అవసరం. మరొకవైపు దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. -
గంభీర్ నీకిది తగునా..?
ఐపీఎల్ 11 సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. జట్టు వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జట్టు యాజమాన్యం తన కోసం వెచ్చించిన 2.8 కోట్ల రూపాయలని కూడా తీసుకోకూడదని అతడు నిర్ణయించుకున్నాడు. జట్టు చెత్త ప్రదర్శన కారణంగా ఒక కెప్టెన్ ఈ విధంగా జీతం తీసుకోకుండా ఆడడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే గౌతీ నిర్ణయం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్నాడు గనుకే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి మద్దతు తెలిపాను. కానీ ఇప్పుడు అతడు కెప్టెన్‌గా వైదొలగాడు. నేను కూడా డీడీ టీమ్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నాను’ అంటూ బాధను వ్యక్తం చేశాడు గౌతీ అభిమాని. ‘గౌతమ్ గంభీర్ సెల్యూట్... కానీ నీ నిర్ణయం మమ్మల్ని బాధ పెడుతోంది. అయినప్పటికీ నువ్వే బాస్’ అంటూ మరో అభిమాని ట్వీట్ చేశాడు. ‘నేను గంభీర్ వీరాభిమానిని కాదు. కానీ గంభీర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు బాధాకరం. అసలు దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను గంభీర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా’ అంటూ ఓ నెటిజన్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. కాగా 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ 2012, 2014లో జట్టును విజేతగా నిలిపాడు. ప్రస్తుతం సొంత జట్టుకు తిరిగొచ్చిన గౌతీ.. జట్టుకు విజయాలు అందించలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా.. తనకు నాయకత్వ బాధ్యత నిర్వహించేందుకు సామర్థ్యం సరిపోవడం లేదని.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం గంభీర్ స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. I supported #DD this season only because #GautamGambhir choose himself as the captain of the team, but as #gauti stepped down as the captain of team, I too step down as a supporter of Delhi Daredevils!!!#We_will_always_be_with_you_Gauti😓😓 — Ajay Pandey (@MBian01898) April 25, 2018 #GautamGambhir salute.. but this is hurting all gautam fans ..after many years seeing him not doing captaincy.... @GautamGambhir he is the boss .. pic.twitter.com/ucEeb0vwbH — Rahmat Ali (@iam_R_ALI) April 26, 2018 I am not a die Hard Gautam Gambhir fan. But whenever i see this man in Trouble it really hurts. He deserves Better. Didn't understand the logic behind this. But I am totally disagree with Gautam Gambhir's step.#GautamGambhir #delhidaredevils pic.twitter.com/0VIYtPKnFm — •Sudhanshu• (@beingsudhanshu_) April 25, 2018 -
వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. టీమ్ వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. గంభీర్ స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నాయకత్వ బాధ్యత నిర్వహించేందుకు తన సామర్థ్యం సరిపోవడం లేదని గంభీర్ వెల్లడించాడు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమని, మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని అతను స్పష్టం చేశాడు. ‘పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలోనే ప్రమాద ఘంటిక మోగింది. నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయం అనిపించింది. నా ప్రదర్శన కూడా ఏమీ బాగా లేదు. నేను ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాను. బహుశా జట్టు పరిస్థితిని మార్చడం గురించి చాలా ఎక్కువగా ఆలోచించానేమో. ఫ్రాంచైజీ నన్ను తప్పుకోమని కోరలేదు. నా ఇష్ట్రపకారమే కెప్టెన్సీని వదిలేస్తున్నా. జట్టు కంటే ఎవరూ ఎక్కువ కాదు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే గెలిచి ఐదు ఓడింది. పంజాబ్‌తో తొలి మ్యాచ్‌లో 55 పరుగులు చేసిన అనంతరం గంభీర్... తర్వాతి 4 ఇన్నింగ్స్‌లలో వరుసగా 15, 8, 3, 4 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మొత్తం 85 పరుగులను అతను కేవలం 96.59 స్ట్రయిక్ రేట్‌తో చేయడం కూడా జట్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. 36 ఏళ్ల గంభీర్ 2008 నుంచి 2010 వరకు డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను 2012, 2014లలో జట్టును విజేతగా నిలిపాడు. ఈ సీజన్లో మళ్లీ సొంత జట్టుకు తిరిగొచ్చిన అతను... కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి డేర్‌డెవిల్స్ రాత మార్చగలనని నమ్మాడు. అయితే గంభీర్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. 2012 ఐపీఎల్ సీజన్ నుంచి చూస్తే ఆరో స్థానంలో నిలవడమే ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన. అయితే గంభీర్ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపదని, మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లలో రాణించి ముందుకు వెళ్లగల సత్తా తమకుందని కోచ్ పాంటింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. రూ. 2.8 కోట్లు వెనక్కి... టీమ్ పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్‌గా తప్పుకున్న గంభీర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు వేలంలో దక్కిన రూ. 2.8 కోట్లను ఫ్రాంచైజీకి తిరిగి ఇచ్చేయాలని అతను భావిస్తున్నాడు. అదే జరిగితే పేలవ ప్రదర్శనకుగాను ఐపీఎల్లో డబ్బులు వెనక్కి ఇచ్చిన తొలి ఆటగాడు గంభీరే అవుతాడు. ‘ఈ సీజన్లో ఫ్రాంచైజీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని గంభీర్ నిర్ణయించుకున్నాడు. మిగిలిన మ్యాచ్‌లను అతను ఉచితంగానే ఆడతానని చెప్పాడు. అతనికి డబ్బుకంటే పరువు ప్రతిష్టలే ముఖ్యం. ఇది అతని సొంత నిర్ణయం’ అని ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాతే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని కూడా గంభీర్ స్పష్టం చేశాడు. మొదటిసారేమీ కాదు... ఐపీఎల్లో వ్యక్తిగత ప్రదర్శన బాగా లేకపోవడం వల్ల గానీ, జట్టు వైఫల్యాల కారణంగా కానీ లీగ్ మధ్యలో కెప్టెన్లు తప్పుకోవడం ఇది మొదటి సారేమీ కాదు. గతంలోనూ పలువురు సారథులు ఈ తరహాలో సొంత నిర్ణయాలు తీసుకోగా, మరికొందరిని ఫ్రాంచైజీలే మార్చేశాయి. వాటిని చూస్తే... వీవీఎస్ లక్ష్మణ్ స్థానంలో గిల్‌క్రిస్ట్ (దక్కన్ చార్జర్స్–2008) కెవిన్ పీటర్సన్ స్థానంలో అనిల్ కుంబ్లే (బెంగళూరు–2009) వెటోరి స్థానంలో విరాట్ కోహ్లి (బెంగళూరు–2012) సంగక్కర స్థానంలో కామెరాన్ వైట్ (దక్కన్ చార్జర్స్ –2012) పాంటింగ్ స్థానంలో రోహిత్ (ముంబై ఇండియన్స్–2013) శిఖర్ ధావన్ స్థానంలో డారెన్ స్యామీ (సన్‌రైజర్స్–2014) షేన్ వాట్సన్ స్థానంలో స్టీవ్ స్మిత్ (రాజస్తాన్–2015) మిల్లర్ స్థానంలో మురళీ విజయ్ (పంజాబ్–2016) -
గంభీర్‌ను కావాలనే తప్పించారు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్-11వ సీజన్లో కొత్త ఆశలతో, కొత్త టీమ్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అడుగుపెట్టింది. గత ఐపీఎల్‌లలో పెద్దగా రాణించని ఢిల్లీ జట్టు.. ఈసారి కనీసం టాప్-4కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు రెండు పర్యాయాలు నాయకత్వం వహించిన గౌతం గంభీర్‌ను కెప్టెన్‌గా తీసుకుంది. అయినా ఈసారి ఢిల్లీకి పెద్దగా కలిసిరాలేదు. వరుస పరాజయాలు వెంటాడుతుండటంతో వ్యక్తిగతంగా, జట్టుపరంగా నైతిక బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అనూహ్య ప్రకటన చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ అట్టడుగున ఉన్న నేపథ్యంలో పూర్తి బాధ్యత వహిస్తూ తాను సారథ్యం నుంచి తప్పుకుంటున్నానని, ఇది పూర్తిగా తన నిర్ణయమేనని, ఇందులో మేనేజ్మెంట్ ఒత్తిడిగానీ, కోచ్ తరఫు నుంచి ఒత్తిడి గానీ లేదని గంభీర్ స్పష్టం చేశారు. గంభీర్ స్థానంలో కొత్త కుర్రాడు శ్రేయస్ అయ్యర్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. అయితే, గంభీర్ ఆకస్మికంగా చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ఢిల్లీ కెప్టెన్సీ నుంచి గంభీర్ అనూహ్యంగా తప్పుకోవడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జట్టు ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, ఇలాంటి సమయంలో అనుభవజ్ఞుడైన గంభీర్‌ను తప్పించి యువకుడికి పగ్గాలు ఇవ్వడం ఎలా జట్టుకు మేలు చేస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గంభీర్‌ను ఉద్దేశపూర్వకంగా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారని, ఇక నుంచి ఆయనను బెంచ్‌కే పరిమితం చేసే అవకాశముందని కొందరు ట్వీట్ చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టులో కీలక వ్యక్తిగా ఎదిగి.. భారత్ వరల్డ్ కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించిన గంభీర్‌ను ఇలా కెప్టెన్సీ నుంచి తొలగించడం బాధ కలిగిస్తోందని, ఇది షాక్‌కు గురిచేస్తోందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికీ పాంటింగ్ కోచ్‌గా ఉంటే ఢిల్లీ జట్టు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందని తప్పుబడుతున్నారు. Stepping down as captain in the middle of a disastrous season and handing it over to a young kid doesn't make sense to me. #Gambhir — Chennai Bot (@chennaibot) April 25, 2018 #Gambhir steps down as captain of #DD. Coz #iyer could lead the team better? I don’t think so..might have thought he as a player a burden for the team..we might see him getting benched in the next game #IPL2018 #captain #DDoverKKR #regret — Nagaraju Mudundi (@madhu_sayz) April 25, 2018 It really hurt to see Gambhir who was a very important part of Indian Cricket Team when they Won the World Cup is today replaced by him, it's not that he is not capable but somewhere it's wrong! @DelhiDaredevils #Gambhir — Pranjal 💥 (@pranjal2018) April 25, 2018 very bad decisions from DD owner. KKR in 2014 1st 7 matches just 2 wins then consecutive 9 matches win . #Gambhir love u sir. — Ranbir Express (@BaruaSupam) April 25, 2018 But why @GautamGambhir what made u quit as a captain of @DelhiDaredevils ! It's not only the captain's fault 4 a team's defeat each & every person shld contribute to the team's performance ! #Gambhir #IPL2018 #delhidaredevils We want u back as the captain of DD no matter what ! — Srivatsa rao (@srivatsachamp) April 25, 2018 When Ricky Ponting is your coach something like this will happen Gautham Gambhir is a champion And I am damn sure he will bounce back#DilDilli https://t.co/2rJ6LV9Szm — Raijin Antony #MI (@RaijinAntony) April 25, 2018 -
గౌతం గంభీర్ అనూహ్య నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు గంభీర్ ప్రకటించాడు. కాగా, గంభీర్ స్థానంలో కొత్త కుర్రాడు శ్రేయస్ అయ్యర్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో ఢిల్లీ మేనేజ్మెంట్ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. గంభీర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత నిర్ణయం. జట్టుకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాను. జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను. కెప్టెన్‌గా దిగిపోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. శ్రేయస్ అయ్యర్ నూతన కెప్టెన్‌గా ఢిల్లీ డేర్‌డెవిల్స్ బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడికి నా సహకారం ఎప్పటికీ ఉంటుందని’ భావోద్వేగానికి లోనయ్యాడు. గత ఏడేళ్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్.. ఆ జట్టును రెండు పర్యాయాలు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ఢిల్లీ జట్టుతోనే ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన గౌతీ.. ఈ సీజన్లో మళ్లీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడుతున్నాడు. 6 మ్యాచ్‌లాడిన గంభీర్ కేవలం 85 పరుగులే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 96.59 ఉండటం గమనార్హం. ఆటగాడిగా, కెప్టెన్‌గా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ గంభీర్ కెప్టెన్సీ వదులుకున్నాడు. 6 మ్యాచ్‌లాడిన ఢిల్లీ కేవలం ఒక్క గెలుపుతో రెండు పాయింట్లు సాధించి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి (8వ) స్థానంలో నిలిచింది. ముంబై ఖాతాలోనూ రెండే పాయింట్లు ఉండగా మెరుగైన రన్‌రేట్‌తో రోహిత్ సేన ఏడో స్థానంలో కొనసాగుతోంది. -
ఇలా అయితే కష్టమే: గంభీర్
న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోవడం పట్ల ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్వల్ప స్కోరు ఛేదించడంలో తమ బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డాడు. 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్ డెవిల్స్ 4 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ... ‘మొదటి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడం కొంప ముంచింది. మేము త్వరగా వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్థికి మ్యాచ్‌పై పట్టు చిక్కింది. పరుగులు బాగానే చేసినప్పటికీ ఎక్కువ వికెట్లు నష్టపోయాం. మా బౌలర్లు ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ పరుగులకే నియంత్రించారు. కానీ మేము త్వరగా వికెట్లను కోల్పోవడవంతో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయాన్ని అందుకోవడం కష్టమేన’ని అన్నాడు. సానుకూల అంశాల గురించి చెబుతూ.. టాప్ స్కోరర్ శ్రేయస్ అయ్యర్(57)తో పాటు యువ ఆటగాళ్లు పృథ్వీ షా, అవిశ్ ఖాన్ రాణించడం శుభపరిణామమని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ‘అయ్యర్ బాగా ఆడాడు. అవిశ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. పృథ్వీ షాకు మంచి భవిష్యత్తు ఉంద’ని అన్నాడు. పృథ్వీ షా 10 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. అవిశ్ 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. -
కింగ్స్ పంజాబ్ జోరు
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. కింగ్స్ పంజాబ్ తన 144 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని ఢిల్లీపై గెలుపొందింది. తద్వారా వరుసగా నాల్గో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఢిల్లీ ఐదో ఓటమిని చవిచూసింది. కింగ్స్ తో మ్యాచ్‌లో ఢిల్లీ తడబడి ఓటమి పాలైంది. శ్రేయస్ అయ్యర్(57) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. అతనికి జతగా పృథ్వీ షా(22), రాహుల్ తెవాతియా(24) మాత్రమే ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కింగ్స్ బౌలర్లలో అన్కిత్ రాజపుత్, ఆండ్రూ టై, ముజిబ్ ఉర్ రెహ్మాన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ మ్యాచ్ ఆద్యంతం తడబాటుకు గురైంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించకపోవడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్ పంజాబ్ ఓపెనర్ అరోన్ ఫించ్(2) తీవ్రంగా నిరాశపరచగా, కేఎల్ రాహుల్(23), మయాంక్ అగర్వాల్(21)లు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆపై గేల్ స్థానంలో వచ్చిన డేవిడ్ మిల్లర్(26) కూడా విఫలమయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్(34)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఏ దశలోనూ కింగ్స్ పంజాబ్‌ను ఢిల్లీ బౌలర్లు కోలుకోనీయకుండా చేశారు. ప్రధానంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ లియామ్ ప్లంకెట్ అదరగొట్టాడు. కింగ్స్ పంజాబ్ మూడు ప్రధాన వికెట్లను తీయడంతో పాటు మెరుపులాంటి క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇవ్వడం మరో విశేషం. అతనికి జతగా అవీష్ ఖాన్, బౌల్ట్ తలో రెండు వికెట్లు సాధించగా, డానియల్ క్రిస్టియన్ వికెట్ తీశాడు. -
అరంగేట్రం అదిరింది..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ మ్యాచ్ ఆద్యంతం తడబాటుకు గురైంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించకపోవడంతో కింగ్స్ పంజాబ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్ పంజాబ్ ఓపెనర్ అరోన్ ఫించ్(2) తీవ్రంగా నిరాశపరచగా, కేఎల్ రాహుల్(23), మయాంక్ అగర్వాల్(21)లు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆపై గేల్ స్థానంలో వచ్చిన డేవిడ్ మిల్లర్(26) కూడా విఫలమయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్(34)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఏ దశలోనూ కింగ్స్ పంజాబ్‌ను ఢిల్లీ బౌలర్లు కోలుకోనీయకుండా చేశారు. ప్రధానంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ లియామ్ ప్లంకెట్ అదరగొట్టాడు. కింగ్స్ పంజాబ్ మూడు ప్రధాన వికెట్లను తీయడంతో పాటు మెరుపులాంటి క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇవ్వడం మరో విశేషం. అతనికి జతగా అవీష్ ఖాన్, బౌల్ట్ తలో రెండు వికెట్లు సాధించగా, డానియల్ క్రిస్టియన్ వికెట్ తీశాడు. దాంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. -
ఐపీఎల్: వాటే లవ్లీ క్యాచ్
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు అవీష్ ఖాన్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఐదో ఓవర్‌ను ఢిల్లీ బౌలర్ ప్లంకెట్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని రాహుల్ షార్ట్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అవీష్ ఖాన్ క్యాచ్‌ను డైవ్ కొట్టి పట్టాడు. తొలుత బంతి గమనాన్ని అంచనా వేసిన అవీష్.. బంతి నేలను తాకే క్రమంలో చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. దాంతో పంజాబ్ 42 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు అరోన్ ఫించ్(2) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. -
బంతిపైకి దూకేశాడు
-
ఐపీఎల్: జి‘గేల్’రాజా లేడు
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్.. తొలుత కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించగా, ఢిల్లీ ఐదు మ్యాచ్‌లకు గాను ఒక దాంట్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా, కింగ్స్ పంజాబ్ హ్యాట్రిక్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన క్రిస్ గేల్.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతనికి కింగ్స్ పంజాబ్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలోనే గేల్ స్థానంలో డేవిడ్ మిల్లర్ తుది జట్టులో చేరాడు. మరొకవైపు జాసన్ రాయ్, క్రిస్ మోరిస్, నదీమ్, విజయ్ శంకర్, హర్షల్ పటేల్‌లకు విశ్రాంతినిచ్చారు. వారి స్థానాల్లో అవిష్ ఖాన్, పృథ్వీషా, డానియల్ క్రిస్టియన్, ప్లంకెట్, అమిత్ మిశ్రాలు తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ గౌతం గంభీర్(కెప్టెన్) శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రాహుల్ తెవాతియా, ప్లంకెట్, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్, అవిష్ ఖాన్, పృథ్వీషా, డానియల్ క్రిస్టియన్ కింగ్స్ పంజాబ్ అశ్విన్(కెప్టెన్), అరోన్ ఫించ్, కేఎల్ రాహుల్, మయాంక అగర్వాల్, కరుణ్ నాయర్, యువరాజ్ సింగ్, డేవిడ్ మిల్లర్, ఆండ్రూ టై, బరీందర్ శ్రాన్, అన్కిత్ రాజ్‌పుత్, ముజిబ్ ఉర్ రెహ్మాన్ -
డేర్‌డెవిల్స్‌పై ఆర్సీబీ ఘనవిజయం
-
ఏ'బీ'భత్సం
బెంగళూరు: చిన్న చేపను పెద్ద చేప... చిన్న మాయను పెను మాయ మింగేసినట్లు కుర్రాళ్ల వీరవిహారం వెటరన్ స్టార్ సుడిగాలి ఇన్నింగ్స్‌లో కొట్టుకుపోయాయి. ఏబీ డివిలియర్స్ (39 బంతుల్లో 90 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) విలయతాండవం ముందు శ్రేయస్, రిషభ్‌ల మెరుపులు వెలవెలబోయాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి ఐపీఎల్లో రెండో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (48 బంతుల్లో 85; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. చహల్ 2 వికెట్లు తీశాడు. తర్వాత బెంగళూరు 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. ఏబీతో పాటు కోహ్లి (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ఢిల్లీ బౌలర్లు బౌల్ట్, మ్యాక్స్‌వెల్, హర్షల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదుకున్న శ్రేయస్, పంత్... టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్ల వైఫల్యంతో కష్టాల్లో పడింది. గంభీర్ (3), జాసన్ రాయ్ (5) స్పిన్నర్ల ఉచ్చులో పడ్డారు. 23 పరుగులకే కీలక వికెట్లను కోల్పోయిన ఢిల్లీని శ్రేయస్, రిషభ్ పంత్ ఆదుకున్నారు. 34 బంతుల్లో అర్ధసెంచరీ (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తిచేసుకున్న రిషభ్... చహల్, సిరాజ్ బౌలింగ్‌లో చెరో 2 సిక్సర్లు బాదేశాడు. దీంతో 15 ఓవర్లకు 103/3గా ఉన్న స్కోరు కాస్త... 20 ఓవర్లలో 174/5కు చేరింది. చివరి ఓవర్లో పంత్ నిష్క్రమించినప్పటికీ ప్రత్యర్థి ముందు భారీ స్కోరును ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. ధనాధన్... ఢిల్లీలాగే బెంగళూరు ఇన్నింగ్స్ కూడా ఓపెనర్లు మనన్ వోహ్రా (2), డికాక్ (18; ఫోర్, సిక్స్) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లి, డివిలియర్స్‌లిద్దరూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తూ చేయాల్సిన రన్‌రేట్ పెరగకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. డివిలియర్స్ ఇన్నింగ్స్ ఆద్యంతం మెరుపులతోనే సాగింది. జట్టు స్కోరు వందకు చేరుతున్న దశలో కోహ్లి కొట్టిన భారీ షాట్‌ను బౌల్ట్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో 92 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కొరే అండర్సన్ క్రీజ్‌లోకి రాగా... డివిలియర్స్ మరింత రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఎవర్నీ విడిచిపెట్టలేదు. 24 బంతుల్లో (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీని అధిగమించిన డివిలియర్స్ ధనాధన్ సిక్సర్లతో బెంగళూరు ప్రేక్షకుల్ని అలరించాడు. అండర్సన్ (15) నిష్క్రమణతో వచ్చిన మన్దీప్ సింగ్ (17 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కూడా వేగంగానే పరుగులు జత చేయడంతో రాయల్ చాలెంజర్స్ 2 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. -
డివిలియర్స్ గెలిపించాడు..
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఏబీ డివిలియర్స్(90 నాటౌట్; 39 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ఆర్సీబీ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో విరాట్ కోహ్లితో జత కలిసిన ఏబీ సమయోచితంగా ఆడాడు. మంచి బంతుల్ని సమర్దవంతంగా ఎదుర్కొంటూనే చెడ్డ బంతుల్ని మాత్రం బౌండరీ దాటించాడు. బెంగళూరు ఆటగాళ్లలో విరాట్ కోహ్లి(30; 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అంతకుముందు టాస్ ఓడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు తోడు రిషబ్ పంత్ మెరుపులు కూడా జత చేయడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు జాసన్ రాయ్(5), గౌతం గంభీర్(3)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో రిషబ్ పంత్-శ్రేయస్ అయ్యర్ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ మూడో వికెట్ 75 పరుగులు జత చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్(52;31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న రిషబ్ పంత్ బ్యాట్‌కు పని చెప్పాడు. తొలుత 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. ఆపై రెచ్చిపోయి ఆడాడు. చివరి ఓవర్లలో చెలరేగిన రిషబ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే రాహుల్ తెవాతియా(13 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి 65 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే 47 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు సాధించిన రిషబ్.. చివరి ఓవర్ నాల్గో బంతికి భారీ షాట్‌కు యత్నించిన ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కోరీ అండర్సన్లకు తలో వికెట్ దక్కింది. -
చెలరేగిన రిషబ్ పంత్
బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు తోడు రిషబ్ పంత్ మెరుపులు కూడా జత చేయడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు జాసన్ రాయ్(5), గౌతం గంభీర్(3)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో రిషబ్ పంత్-శ్రేయస్ అయ్యర్ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ మూడో వికెట్ 75 పరుగులు జత చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్(52;31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న రిషబ్ పంత్ బ్యాట్‌కు పని చెప్పాడు. తొలుత 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. ఆపై రెచ్చిపోయి ఆడాడు. చివరి ఓవర్లలో చెలరేగిన రిషబ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే రాహుల్ తెవాతియా(13 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి 65 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే 47 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు సాధించిన రిషబ్.. చివరి ఓవర్ నాల్గో బంతికి భారీ షాట్‌కు యత్నించిన ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కోరీ అండర్సన్లకు తలో వికెట్ దక్కింది. -
షమీ అవుట్.. హర్షల్ ఇన్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఢిల్లీ తుది జట్టులో గుజరాత్ మీడియం పేసర్ హర్షల్ పటేల్‌కు చోటు దక్కింది. పేసర్ మహ్మద్ షమీ స్థానంలో హర్షల్‌ను తీసుకున్నారు. ఇక ఆర్సీబీ జట్టులో సర్సరాజ్ ఖాన్‌కు ఉద్వాసన పలికారు. అతని స్థానంలో మనన్ వోహ్రాకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడగా తలో మ్యాచ్‌లో మాత్రమే గెలిచాయి. దాంతో ఈ టోర్నీలో రెండో విజయం నమోదు చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉండగా, ఢిల్లీ ఎనిమిదో స్థానంలో ఉంది. తుది జట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ గౌతం గంభీర్(కెప్టెన్), జాసన్ రాయ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, క్రిస్ మోరిస్, షహబాజ్ నదీమ్, హర్షల్ పటేల్, ట్రెంట్ బౌల్ట్ ఆర్సీబీ విరాట్ కోహ్లి(కెప్టెన్), డీ కాక్, మనన్ వోహ్రా, ఏబీ డివిలియర్స్, మన్దీప్ సింగ్, కోరీ అండర్సన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ వోక్స్, ఉమేశ్ యాదవ్, మొహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్ -
‘అప్పుడే నేను మెరుగ్గా ఆడగలను’
కోల్‌కతా: ఒత్తిడి సమయంలో ఆడటం అంటే తనకు చాలా ఇష్టమని అంటున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రానా. అలా ఒత్తిడి సమయంలో ఆడినప్పుడే తనలోని మెరుగైన క్రీడాకారుడు బయటకు వస్తాడని పేర్కొన్నాడు. ఐపీఎల్లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణా 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సమయంలో రానా మాట్లాడుతూ.. ‘ఒత్తిడిలో నేను మరింత మెరుగ్గా ఆడగలనని గతంలో చెప్పాను. ఒత్తిడిని జయిస్తూ ఆడటాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తా. ఒత్తిడిలో ఆడేటప్పుడు నాలోని మెరుగైన క్రికెటర్ బయటకొస్తాడు. 10 ఓవర్లకే మా జట్టు 3 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ మాకెంతో కీలకం. గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయాం. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలనుకున్నాం. అందుకే జట్టులో అందరూ సమష్టిగా రాణించారు. కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మ్యాక్స్‌వెల్ కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. చివరి వరకూ పోరాడాలన్నది నా గేమ్ ప్లాన్. ఈ ఐపీఎల్ సీజన్లో నేను మొదటి మ్యాచ్ నుంచి ఇదే ఫాలో అవుతున్నా. నేను బ్యాటింగ్ బాగా చేయగలనన్న నమ్మకం నాకు ఉంది. స్పిన్నర్లు ఎప్పుడెప్పుడు బంతులేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటాను. వారి బౌలింగ్‌లో నా పని మరింత సులువుగా మారుతుంది’ అని రానా తెలిపాడు. -
‘గంభీర్ కోల్‌కతా టీమ్‌లో లేడా!’
కోల్‌కతా: ఐపీఎల్ 2018లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో దాదాపు అందరి దృష్టీ గౌతం గంభీర్‌పైనే! కేకేఆర్‌కు ఏడేళ్లపాటు నాయకత్వం వహించి, రెండు సార్లు జట్టును విజేతగా నిలబెట్టిన అతను అనూహ్య పరిణామాల మధ్య ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మారిపోవడం, అసలే ఆవేశపరుడిగా పేరుపొందిన గౌతీ.. ఈ సీజన్లో తొలిసారి ఈడెన్‌కు ప్రత్యర్థిగా రావడాన్ని ఎలా ఫీలై ఉంటాడు? అభిమానుల మనసుల్లో మెదిలిన ఈ ప్రశ్నలనే కామెంటేటర్లు కూడా అడిగారు. అయితే గంభీర్ మాత్రం చాలా కూల్‌గా.. ‘అవును. నిన్నటిదాకా ఇదే(కోల్‌కతాయే) నా ఇల్లు. గతంలో ఈ జట్టు తరఫున నేనేదైనా సాధించానంటే అది విశ్వసనీయులైన కేకేఆర్ అభిమానుల మద్దతుతోనే అన్నది వాస్తవం. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోలేను’ అని సమాధానమిచ్చాడు. ఇదే ప్రశ్న సునీల్ నరైన్‌ను అడిగినప్పుడు కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. సునీల్ నరైన్ అరుదైన రికార్డు: గడిచిన ఏడేళ్లుగా కోల్‌కతా నైట్రైడర్సకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్.. ఐపీఎల్లో అరుదైన రికార్డు సాధించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు పగడొట్టిన అతడు 100 వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. కెరీర్లో 86 మ్యాచ్‌లు ఆడిన నరైన్ 102 వికెట్లను పగడొట్టాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 154 వికెట్లతో లసిత్ మలింగా ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నాడు. గంభీర్ కోల్‌కతాలో లేడా: మ్యాచ్ అనంతరం సునీల్ నరైన్ కామెంటేటర్లతో మాట్లాడాడు. ‘‘ గంభీర్ మా(కోల్‌కతా) జట్టుకాదా, మా ప్రత్యర్థా! ఈ విషయాన్ని జీర్ణించుకోవడం నాకైతే కష్టమైంది. కేకేఆర్ కోసం ఇద్దరం మనసుపెట్టి ఆడేవాళ్లం. గుండెలనిండా జట్టును గెలిపించాలనే కసి. కానీ ఇప్పుడు మా ఇద్దరివీ వేర్వేరు టీమ్‌లు. ఏం చేస్తాం, క్రికెట్లో ఇదంతా సహజమే కదా!’’ అని నరైన్ చెప్పాడు. తాను ఇప్పటికీ నూరుశాతం పరిపూర్ణ స్పిన్నర్‌ను కానని, అయితే మిగతావారికంటే ఎంతో కొంత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తానని, జట్టు అవసరాలకు తగ్గట్టు నడుచుకుంటానని తెలిపాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. -
నైట్‌రైడర్స్ ఆల్‌రౌండ్ షో
-
నైట్‌రైడర్స్ ఆల్‌రౌండ్ షో
-
కోల్‌కతా తడాఖా
సొంతగడ్డపై కోల్‌కతా ‘ఫైట్’ రైడర్స్లా మారింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తుచిత్తుగా చితకబాదింది. మొదట బ్యాటింగ్‌లో సిక్స్‌లతో కొట్టేసింది, బౌలింగ్‌లో స్పిన్తోకట్టేసింది. నితీశ్ రాణా, రస్సెల్ సిక్సర్ల జడివాన కురిపించారు. తర్వాత స్పిన్నర్లు కుల్దీప్, నరైన్ డెవిల్స్ ఆటను 15 ఓవర్లలోపే ముగించారు. దీంతో ఢిల్లీ తొలుత ఆపలేక... తర్వాత ఆడలేక విలవిలలాడింది. కోల్‌కతా: కోల్‌కతా అసాధారణ ప్రదర్శనతో చెలరేగింది. ఆల్‌రౌండ్ షోతో ఢిల్లీని అల్లకల్లోలం చేసింది. ఐపీఎల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన పోరులో నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. నితీశ్ రాణా (35 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రస్సెల్ (12 బంతుల్లో 41; 6 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 14.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కుల్దీప్ యాదవ్, నరైన్ చెరో 3 వికెట్లు తీశారు. నితీశ్ రాణాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రాణా మెరుపులు... టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, కోల్‌కతా ఇన్నింగ్స్‌ను లిన్, నరైన్ ప్రారంభించారు. తమ కెప్టెన్ నిర్ణయం సబబేనన్నట్లు బౌల్ట్ ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి ఓపెనర్లను కట్టడి చేశాడు. నరైన్ (1)ను బౌన్సర్‌తో దెబ్బతీశాడు. తర్వాత కథ కోల్‌కతావైపు మొగ్గింది. లిన్‌కు జతయిన ఉతప్ప ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. దీంతో 3 ఓవర్లకు 12/1గా ఉన్న స్కోరు మరో మూడు ఓవర్లలో 50/1కి చేరింది. నదీమ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఉతప్ప 2 సిక్సర్లు, బౌండరీతో మొత్తం 18 పరుగులు చేశాడు. తర్వాత తేవటియా ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. అయితే నదీమ్ తన మరుసటి ఓవర్లో గుడ్‌లెంగ్త్ డెలివరీతో ఉతప్పను బోల్తా కొట్టించాడు. నితీశ్ రాణా వచ్చిరాగానే సిక్స్‌లు, ఫోర్లతో పరుగుల వేగం పెంచాడు. లిన్ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్)ను షమీ ఔట్ చేయగా, కెప్టెన్ దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) ఉన్న కాసేపు భారీషాట్లపైనే కన్నేశాడు. అతడిని మోరిస్ పెవిలియన్ చేర్చగా... ఈ దశలో వచ్చిన రస్సెల్ సిక్సర్ల మోత మోగించాడు. ఇతని అండతోనే రాణా (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. వీరి మెరుపులతో స్కోరు వేగం ఒక్కసారిగా పుంజుకుంది. రస్సెల్ విధ్వంసం మరింత పెరుగుతున్న దశలో బౌల్ట్ చక్కని డెలివరీతో బౌల్డ్ చేశాడు. దీంతో ఊపిరిపీల్చుకున్న గంభీర్ సేన స్లాగ్ ఓవర్లలో మిగతా బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేయగలిగింది. 20వ ఓవర్ వేసిన తేవటియా కేవలం ఒక పరుగే ఇచ్చి శుభ్‌మన్ గిల్ (6), చావ్లా (0), కరన్ (2)లను ఔట్ చేశాడు. ఫటాఫట్... ధనాధన్... ఢిల్లీ ఇన్నింగ్స్ టపటపా... ధనాధన్... ఫటాఫట్ అన్నట్లు ముగిసింది. టాపార్డర్ వైఫల్యంతో ఆరంభం నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. ఓవర్‌కు ఒకరు చొప్పున తొలి మూడు ఓవర్లలో వరుసగా జాసన్ రాయ్ (1), శ్రేయస్ అయ్యర్ (4), కెప్టెన్ గంభీర్ (8) ఔటయ్యారు. ఈ దశలో రిషభ్ పంత్, మ్యాక్స్‌వెల్ వికెట్ పడకుండా... రన్‌రేట్ తగ్గకుండా వేగంగా పరుగులు జతచేశారు. ఓవర్‌కు పది పరుగుల రన్‌రేట్‌తో ఢిల్లీ స్కోరు 8 ఓవర్లలో 80కి చేరింది. కానీ ఇదంతా ఐదు ఓవర్లకే పరిమితమైంది. కుల్దీప్ ఊరించే బంతులతో రిషభ్, మ్యాక్స్‌వెల్‌ల కథ ముగించడంతో కోల్‌కతా విజయం ఖాయమైంది. సిక్సర్ల మోత... నైట్‌రైడర్స్ స్కోరు 200. ఇందులో బౌండరీని దాటివెళ్లి తెచ్చిన పరుగులు 146. కేవలం సిక్సర్లతోనే 90 పరుగులొచ్చాయి. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఏకంగా 15 సిక్సర్లు బాదేశారు. నితీశ్ రాణా పరిపక్వత చెందిన ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా... రస్సెల్ తనదైన శైలిలో చితగ్గొట్టాడు. అతని ఖాతాలో ఒక్క ఫోరు లేదు. అన్నీ (6) సిక్సర్లే. రాణా (4) కూడా తక్కువేం కాదని బ్యాట్‌తో చాటగా... వన్‌డౌన్‌లో దిగిన రాబిన్ ఉతప్ప మూడు సిక్స్‌లు కొట్టాడు. ఈ సిక్సర్ల జడివానలో ఎక్కువగా బలైంది మాత్రం షమీనే. ఈ ఢిల్లీ సీమర్ ఆరు సిక్సర్లు సమర్పించుకొని 53 పరుగులిచ్చుకున్నాడు. -
గంభీర్ సేనపై కేకేఆర్ భారీ విజయం
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన గంభీర్ గ్యాంగ్ 14. 2 ఓవర్లలో 129 పరుగులకే చాపచుట్టేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో రిషబ్ పంత్(43;26 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్(47; 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే రాణించగా, మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర పరాజయం తప్పలేదు. ఈ సీజన్లో పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం కావడం విశేషం. కేకేఆర్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ తలో మూడో వికెట్లు సాధించగా, పీయూష్ చావ్లా, రస్సెల్, శివం మావి, టామ్ కుర్రాన్‌లు తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. కేకేఆర్ ఆటగాళ్లు నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్ మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు రెండొందల మార్కును చేరింది. రానా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేయగా, రస్సెల్ 12 బంతుల్లో 6 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్(19) ఔటైన తర్వాత వచ్చిన రస్సెల్.. నితీష్ రానాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ బౌండరీలను దాటించడమే లక్ష్యంగా చెలరేగి ఆడటంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ క్రమంలోనే రానా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే రానా అర్థ శతకం సాధించిన తర్వాత రస్సెల్ ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మిగతా కేకేఆర్ ఆటగాళ్లలో క్రిస్ లిన్(31; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప(35; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. -
ఐపీఎల్లో అరుదైన సందర్భం
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తన బౌలింగ్‌ను మెయిడిన్ ఓవర్‌తో ప్రారంభించడమే కాకుండా చివరి ఓవర్‌కు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ముగించింది. ఇదొక అరుదైన సందర్భంగా నిలిచింది. ఢిల్లీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా సంధించి.. ఈ సీజన్ ఐపీఎల్లో తొలి మెయిడిన్ ఓవర్ వేసిన ఘనతను సాధించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో భాగంగా క్రిస్ లిన్-సునీల్ నరైన్‌లు ఆరంభించిన క్రమంలో బౌల్ట్ పరుగులేమీ ఇవ్వకుండా నియంత్రించాడు. స్టార్ ఆటగాడు క్రిస్ లిన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉండగా బౌల్ట్ గుడ్ లెంగ్త్ బంతులతో ఆకట్టుకని తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేశాడు. ఇదిలా ఉంచితే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆఖరి ఓవర్‌ను కూడా కట్టుదిట్టంగా వేయడం ఇక్కడ విశేషం. ఢిల్లీ స్సిన్నర్ రాహుల్ తెహాతియా చివరి ఓవర్‌ను అందుకుని పరుగు మాత్రమే ఇచ్చాడు. 20 ఓవర్లో కేకేఆర్ ఆటగాడు కుర్రాన్ పరుగు తీయగా, రెండో బంతికి శుభ్‌మాన్ గిల్ పెవిలియన్ చేరాడు. ఇక మూడో, నాలుగు బంతులకు పీయూష్ చావ్లా పరుగులేమీ తీయకపోగా, ఐదో బంతికి అవుటయ్యాడు. ఆరో బంతికి కుర్రాన్‌ను అవుట్ కావడంతో మూడో వికెట్‌ను తెహాతియా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఓవర్లో పరుగు మాత్రమే సమర్పించుకున్నాడు. దాంతో తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా, చివరి ఓవర్లో పరుగు మాత్రమే ఇచ్చిన ఘనతను ఢిల్లీ సొంతం చేసుకుంది. -
రానా, రస్సెల్ మెరుపులు
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 201 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్ ఆటగాళ్లు నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్ మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు రెండొందల మార్కును చేరింది. రానా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేయగా, రస్సెల్ 12 బంతుల్లో 6 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్(19) ఔటైన తర్వాత వచ్చిన రస్సెల్.. నితీష్ రానాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ బౌండరీలను దాటించడమే లక్ష్యంగా చెలరేగి ఆడటంతో కేకేఆర్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ క్రమంలోనే రానా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే రానా అర్థ శతకం సాధించిన తర్వాత రస్సెల్ ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మిగతా కేకేఆర్ ఆటగాళ్లలో క్రిస్ లిన్(31; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప(35; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. దాంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు చెరో మ్యాచ్ మాత్రమే గెలిచిన ఇరు జట్లు.. ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలగా ఉన్నాయి. కోల్‌కతా ఫ్రాంచైజీ నుంచి తప్పుకొని ఢిల్లీ తరపున గౌతం గంభీర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
ఐపీఎల్ చరిత్రలో 12వ ఆటగాడిగా..
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేల పరుగుల మార్కును చేరిన 12వ ఆటగాడిగా దినేశ్ కార్తీక్ నిలిచాడు. తాజా మ్యాచ్‌లో కార్తీక్ ఏడు పరుగుల వద్ద ఉండగా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. తన కెరీర్లో 156వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కార్తీక్138 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మైలురాయిని దాటాడు.తద్వారా అజింక్యా రహానే(3,151) తర్వాత స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో సురేశ్ రైనా(4,558) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లి(4,527), రోహిత్ శర్మ(4,251) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నరైన్(1) నిరాశపరచగా, క్రిస్ లిన్(31)ఉతప్ప(35) ఫర్వాలేదనిపించారు. కార్తీక్(19) అనవసరపు షాట్‌కోసం యత్నించి నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. -
ఈ సీజన్ ఐపీఎల్లో తొలిసారి..
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తొలి ఓవర్‌ను మెయిడిన్‌తో ఆరంభించింది. ఢిల్లీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థి జట్టులో స్టార్ ఆటగాడు క్రిస్ లిన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్నప్పటికీ పరుగును కూడా సాధించలేకపోయాడు. స్వింగ్, ఫుల్ లెంగ్త్, ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ లెంగ్త్ బాల్స్‌తో పాటు స్లో బంతులను సంధించడంతో లిన్ కనీసం పరుగు కూడా తీయలేకపోయాడు. దాంతో ఢిల్లీకి మెయిడిన్‌తో శుభారంభం లభించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇదే తొలి మెయిడిన్ ఓవర్‌గా నిలిచింది. మరొకవైపు బౌల్ట్ తొలి పది బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా వికెట్ తీయడం మరో విశేషం. మొదటి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన బౌల్ట్..మూడో ఓవర్లో నాలుగు బంతుల్లో పరుగులు ఇవ్వలేదు. ఆ ఓవర్ నాల్గో బంతికి నరైన్‌ను అవుట్ చేశాడు. ఈ సీజన్లో తన తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయంతో బోణి కొట్టిన కోల్‌కతా జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో మ్యాచ్‌ని చేజార్చుకున్న కోల్‌కతా.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ అదే రీతిలో పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు టోర్నీ ఆరంభంలో పంజాబ్, రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌ల్లో ఓడినా.. ఇటీవల ముంబయి ఇండియన్స్‌పై గెలిచి ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంచితే, ఈ స్టేడియంలో ఇరు జట్లు మధ్య ఏడు మ్యాచ్‌లు జరగ్గా, అందులో ఆరు మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచింది. ఒకదాంట్లో ఢిల్లీని విజయం వరించింది. -
జాన్సన్ అవుట్.. కుర్రాన్ ఇన్
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా సోమవారం ఈడెన్ గార్డెన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు చెరో మ్యాచ్ మాత్రమే గెలిచిన ఇరు జట్లు.. ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలగా ఉన్నాయి. కోల్‌కతా ఫ్రాంచైజీ నుంచి తప్పుకొని ఢిల్లీ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న గౌతం గంభీర్.. తొలిసారి ఈ సీజన్లో కోల్‌కతాలో ఆ జట్టుపై ఎలా ఆడతాడో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ నుంచి కేకేఆర్ పేసర్ మిచెల్ జాన్సన్‌కు విశ్రాంతి కల్పించారు. అతని స్థానంలో టామ్ కుర్రాన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు ఢిల్లీ జట్టులో క్రిస్టియన్ స్థానంలో క్రిస్ మోరిస్‌ను జట్టులోకి తీసుకున్నారు. తుది జట్లు కేకేఆర్ దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, శుభ్‌మాన్ గిల్, శివం మావి, టామ్ కుర్రాన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్ ఢిల్లీ గౌతం గంభీర్(కెప్టెన్), జాసన్ రాయ్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శ్రేయస్ అయ్యర్, విజయ్ శంకర్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాతియా, షెహబాజ్ నదీమ్, మొహ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్ -
‘గౌతం గంభీర్‌తో జాగ్రత్త’
కోల్‌కతా: గతేడాది వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా చేసిన గౌతం గంభీర్.. ఈ ఏడాది సొంత జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో గంభీర్‌ను కేకేఆర్ వదిలేసుకోవడంతో అతన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ తీసుకుంది. అదే సమయంలో గంభీర్ కెప్టెన్ బాధ్యతల్ని సైతం కట్టబెట్టింది. అయితే సోమవారం ఈడెన్ గార్డెన్లో కేకేఆర్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో గంభీర్ హైలైట్‌గా నిలవనున్నాడు. ఒకప్పటి కెప్టెన్ కెప్టెన్ ఇప్పుడు ప్రత్యర్థిగా తలపడటంతో గంభీర్ హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రమంలోనే కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కాటిచ్ మాట్లాడుతూ.. గంభీర్‌పైనే దృష్టి నిలపాలని జట్టు సభ్యులకు సూచించాడు. గంభీర్‌ను టార్గెట్ చేయకపోతే అతను కేకేఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయమని హెచ్చరించాడు. ‘ మా జట్టు(కేకేఆర్) గురించి గంభీర్‌కు బాగా తెలుసు. అందులోనూ ఈడెన్ వికెట్‌పై గంభీర్‌కు మంచి అవగాహనం ఉంది. కేకేఆర్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో గంభీర్‌కు ఆడిన అనుభవం ఉంది. దాంతో అన్ని రకాలుగా కేకేఆర్ లోటుపాట్లు గురించి తెలిసిన గంభీర్ పక్కాప్రణాళికతో మాతో పోరుకు సిద్ధమవుతాడు. గంభీర్‌పై ఏదొక కోణంలో మాత్రమే దృష్టి సారిస్తే మనకే ముప్పు పొంచి ఉంటుంది. గంభీర్ జాగ్రత్త’అని కాటిచ్ హెచ్చరించాడు. -
అయ్యో.. ముంబై!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్లో ముంబై ఇండియన్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్ధానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేనను దురదృష్టం వెంటాడుతోంది. హ్యాట్రిక్ పరాజయాల్ని చవిచూసిన ముంబై ఇండియన్స్.. కడవరకూ చేస్తున్న పోరాటంలో ఆకట్టుకుంటున్నా విజయాల్ని మాత్రం సాధించలేకపోతోంది. అందులోనూ చివరి ఓవర్లో ఓటముల్ని చవిచూడటం ముంబై ఇండియన్స్‌కు మింగుడు పడటం లేదు. వరుస రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి బంతికి పరాజయాల్ని ఎదుర్కోవడం ముంబై శిబిరంలో తీవ్ర నిరాశను మిగిల్చింది. తాజా మ్యాచ్‌లో ఆఖరి బంతిని జాసన్ రాయ్ సింగిల్ కొట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు విజయాన్ని అందించాడు. ఢిల్లీకి ఆఖరి ఓవర్లో 11 పరుగులు కావాల్సిన సమయంలో ముస్తాఫిజుర్ వేసిన తొలి రెండు బంతుల్ని ఫోర్, సిక్సర్లు కొట్టడంతో స్కోరు సమం అయ్యింది. ఆ తర్వాత ముస్తాఫిజుర్ హ్యాట్రిక్ డాట్ బాల్స్ వేయడంతో ఫలితం చివరి బంతి వరకూ వెళ్లింది. అయితే ఆఖరి బంతిని రాయ్ సింగిల్ తీయడంతో ముంబైకు ఓటమి తప్పలేదు. అయితే అంతకుముందు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబైది ఇదే పరిస్థితి. చివరి ఓవర్లో సన్‌రైజర్స్ విజయానికి 11 పరుగులు కావాల్సిన తరుణంలో ముంబై బౌలర్ బెన్ కట్టింగ్ బౌలింగ్ అందుకున్నాడు. క్రీజ్‌లో ఉన్న దీపక్ హుడా తొలి బంతిని సిక్స్ కొట్టగా, ఆ మరుసటి బంతి వైడ్ అయ్యింది. దాంతో రెండో బంతి పడకుండానే మరొక పరుగు సన్‌రైజర్స్ ఖాతాలో చేరింది. ఆపై వేసిన రెండో బంతి పరుగు రాకపోగా, మూడో బంతికి సింగిల్ మాత్రం వచ్చింది. నాల్గో బంతిని స్టాన్ లేక్ సింగిల్ తీయగా, ఐదో బంతిని దీపక్ హుడా సింగిల్ తీశాడు. దాంతో చివరి బంతికి ప్రాధాన్యత పెరిగింది. హైదరాబాద్ ఆటగాడు స్టాన్లేక్ ఆఖరి బంతిని ఫోర్ కొట్టి ముంబైకు విజయాన్ని దూరం చేశాడు. ఇక ఐపీఎల్-11 సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇంకా బంతి ఉండగా ఓటమి పాలు కావడం గమనార్హం. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్ నాలుగు, ఐదు బంతుల్లో కేదర్ జాదవ్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టడంతో చెన్నై విజయం సాధించగా, ముంబై పరాజయం చవిచూసింది. ఇలా మూడు మ్యాచ్‌ల్లో ముంబైకు గెలుపు ఊరించినట్లే ఊరించి దూరం కావడంతో ఆ జట్టు పరిస్థితిని చూస్తున్న సగటు అభిమాని మాత్రం అయ్యో అనుకుంటున్నాడు. -
ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ గెలుపు
-
నమ్మశక్యం కాని రీతిలో పాండ్యా క్యాచ్
-
రాయ్ వచ్చాడు.. గెలిపించాడు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ పైచేయి సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న జాసన్ రాయ్ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చిన రాయ్ కడవరకూ క్రీజ్‌లో ఉండి 53 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 91 పరుగులు సాధించి ఢిల్లీని విజయ తీరాలకు తీర్చాడు. అతనికి జతగా రిషబ్ పంత్(47;25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్(27 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు ధాటిగా ఆడారు. ఈ సీజన్లో ఇది ఢిల్లీకి తొలి గెలుపు కాగా, ముంబైకు హ్యాట్రిక్ ఓటమి. ముంబై నిర్దేశించిన 195 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి తొలి వికెట్‌కు 50 పరుగులు, రెండో వికెట్‌కు 69 పరుగులు సాధించింది. గౌతం గంభీర్(15), గ్లెన్ మ్యాక్స్‌వెల్(13)లు నిరాశపరిచారు. కాగా, రాయ్, పంత్‌లతో పాటు అయ్యర్లు అంచనాలకు అనుగుణంగా రాణించడంతో ఢిల్లీ గెలుపు సునాయాసమైంది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ప్రధానంగా జాసన్ రాయ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 194 పరుగులు సాధించింది. తొలి వికెట్‌కు ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్‌లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి శుభారంభం అందించారు. దాంతో ముంబై తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు. తొలి వికెట్‌గా లూయిస్ అవుటైన స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఏడు పరుగుల వ్యవధిలో అవుటయ్యారు. మరొకవైపు ఇషాన్ కిషన్(44; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. అయితే మిడిల్ ఆర్డర్లో ముంబై విఫలం కావడంతో రెండొందల మార్కును చేరడంలో విఫలమైంది. ముంబై మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లలో కీరోన్ పొలార్డ్ డకౌట్ కాగా, రోహిత్ శర్మ(18), కృనాల్ పాండ్యా(11), హార్దిక్ పాండ్యా(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. పవర్ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్న ఢిల్లీ.. ఆపై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దాంతో తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసిన ముంబై.. మిగతా 14 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, డానియల్ క్రిస్టియన్, రాహుల్ తెవాతియాలు తలో రెండు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీకి వికెట్ దక్కింది. -
ఐపీఎల్: కళ్లు చెదిరే క్యాచ్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భతమైన ఫీల్డింగ్‌తో అదుర్స్ అనిపించాడు. అన్న కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో తమ్ముడు హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచాడు. ఢిల్లీ లక్ష్య ఛేదనలో భాగంగా కృనాల్ వేసిన 14 ఓవర్ రెండో బంతిని మ్యాక్స్‌వెల్ హిట్ చేశాడు. స్కోరును పెంచే క్రమంలో మ్యాక్స్‌వెల్ భారీ షాట్ ఆడగా దాన్ని హార్దిక్ పాండ్యా గాల్లో డైవ్ కొట్టి అందుకున్నాడు. ఆ క్యాచ్‌ను హార్దిక్ నమ్మశక్యం కాని రీతిలో ఒడిసి పట్టుకోవడంతో స్టేడియం హోరెత్తింది. ఇది ఈ సీజన్ అత్యుత్తమ క్యాచ్‌గా నిలిచింది. ముంబై నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఢిల్లీ.. రెండో వికెట్‌కు 69 పరుగుల సాధించింది. -
రాయ్, పంత్‌ల దూకుడు!
ముంబై : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్ ఆటగాళ్లు జాసన్ రాయ్, రిషబ్ పంత్ అర్థ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 ఓవర్లకు వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ దశలో 27 బంతులు ఎదుర్కొన్న రాయ్ 3 ఫోర్లు,4 సిక్సులతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు పంత్ సైతం వరుస సిక్సులు, ఫోర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ దశలో 23 బంతుల్లో 47 పరుగులు చేసిన పంత్‌ను కృనాల్ పాండ్యా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి వికెట్ 50 పరుగుల భాగస్వామ్యం లభించింది. వేగంగా ఆడే క్రమంలో పంత్, మ్యాక్స్ వెల్ (13) వికెట్లు కోల్పోయింది. -
చిన్నారులతో పోటెత్తిన వాంఖేడే
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో నగరంలోని వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఎటు చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. నీలం రంగు జెర్సీలో వేసుకుని ముంబై ఇండియన్స్ జెండాలతో స్డేడియంలో సందడి చేస్తున్నారు. ఏకంగా 21వేల మంది చిన్నారులు గ్యాలరీల్లో కూర్చొని ముంబై ఇండియన్స్ కు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ చిన్నారులే నేటి మ్యాచ్‌కు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చారు. వాస్తవానికి ఈరోజును ఈఎస్ఏ(ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్) డేగా రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ముంబైలోని పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన చిన్నారులను మ్యాచ్ జరుగుతున్న స్టేడియంకు తీసుకొచ్చారు. ముంబయి ఇండియన్స్-రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారందరికీ ఉచితంగా మ్యాచ్ చూసే సదుపాయాన్ని కల్పించారు. మొత్తం 33వేల సామర్థ్యం కలిగి ఉన్న వాంఖడే స్టేడియంలో ఈరోజు ఎటు చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. పిల్లలకు చదువు, క్రీడల్లో సమగ్ర అభివృద్ధితో పాటు సమాన అవకాశాలను ఈఎస్ఏ కల్పిస్తోంది. స్వచ్ఛంద సంస్థలతో కలసి నిరుపేద పిల్లలకు విద్యను అందిస్తోంది. -
గంభీర్ సేనకు భారీ లక్ష్యం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఓపెనర్లు ఎవిన్ లూయిస్(48; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(53;32 బంతుల్లో 7ఫోర్లు 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ సాధించడంతో ముంబై భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్‌లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ముంబై తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు. తొలి వికెట్‌గా లూయిస్ అవుటైన స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఏడు పరుగుల వ్యవధిలో అవుటయ్యారు. మరొకవైపు ఇషాన్ కిషన్(44; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. అయితే మిడిల్ ఆర్డర్లో ముంబై విఫలం కావడంతో రెండొందల మార్కును చేరడంలో విఫలమైంది. ముంబై మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లలో కీరోన్ పొలార్డ్ డకౌట్ కాగా, రోహిత్ శర్మ(18), కృనాల్ పాండ్యా(11), హార్దిక్ పాండ్యా(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. పవర్ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్న ఢిల్లీ.. ఆపై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దాంతో తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసిన ముంబై.. మిగతా 14 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, డానియల్ క్రిస్టియన్, రాహుల్ తెవాతియాలు తలో రెండు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీకి వికెట్ దక్కింది. -
పొలార్డ్ గోల్డెన్ డక్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ఆటగాడు కీరోన్ పొలార్డ్ గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. ఢిల్లీ బౌలర్ డానియల్ క్రిస్టియన్ వేసిన 16 ఓవర్ ఐదో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన పొలార్డ్ ఎదుర్కొన్న తొలి బంతితే బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు బంతికి ఇషాన్ కిషన్ అవుట్ కాగా, ఆ మరుసటి బంతికి పొలార్డ్ పెవిలియన్ చేరాడు. క్రిస్టియన్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన పొలార్డ్ వికెట్‌ను సమర్పించుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు శుభారంభం లభించింది.తొలి వికెట్‌కు ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్‌లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ముంబై తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు. తొలి వికెట్‌గా లూయిస్(48; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అవుట్ కాగా, రెండో వికెట్‌గా సూర్యకుమార్ యాదవ్(53;32 బంతుల్లో 7ఫోర్లు 1 సిక్స్) పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఏడు పరుగుల వ్యవధిలో అవుటయ్యారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్(44; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. నాల్గో స్థానంలో వచ్చిన రోహిత్ శర్మ(18)మరోసారి నిరాశపరిచాడు. -
ముంబై ఓపెనర్ల రికార్డు!
ముంబై : సొంత మైదానంలో ఢిల్లీడేర్ డేవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు చెలరేగారు. దీంతో ముంబై పవర్ ప్లే ముగిసే సరికి 84 పరుగులు చేసింది. పవర్‌ప్లే లో వచ్చిన ఈ పరుగులు ఐపీఎల్ చరిత్రలో ముంబైకి అత్యధికం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన యువఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 53(32 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్‌లు48(28 బంతులు,4 ఫోర్లు, 4 సిక్సులు) తృటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. దీంతో 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ సైతం వికెట్ల ముందు దొరికి పెవిలియన్ చేరాడు. అయితే ఈ సీజన్లో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరు జట్లు ఇంకా బోణీ చేయకపోవడంతో గెలుపుపై దృష్టి సారించాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చేతిలో ముంబై ఇండియన్స్‌కు పరాజయం ఎదురుకాగా, కింగ్స్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై ఢిల్లీ ఓటమి పాలైంది. దాంతో ఇరు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. -
ఐపీఎల్లో టాస్ సెంటిమెంట్!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో టాస్ సెంటిమెంట్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన జట్లు ఎటువంటి ఆలోచనా లేకుండా తొలుత ఫీల్డింగ్ చేయడానికి మొగ్గుచూపుతుండటం ఫ్రాంచైజీల సెంటిమెంట్‌గా చెప్పవచ్చు. మరొకవైపు ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో దాదాపు టాస్ గెలిచిన జట్లనే విజయం వరించడం ఇక్కడ మరో విశేషం. దాంతో టాస్ గెలవడం, ఫీల్డింగ్ చేయడంపైనే అన్ని జట్లు దృష్టి పెట్టాయి. కాకపోతే రాజస్తాన్ రాయల్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం మాత్రం టాస్ గెలిచిన జట్టుకు భిన్నంగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫలితం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 6 ఓవర్లకు నిర్దేశించడంతో ఇక్కడ టాస్కు పెద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇది తొమ్మిదో మ్యాచ్ కాగా, వీటిన్నంటిలోనూ టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ తీసుకోవడం ‘టాస్’ సెంటిమెంట్‌కు అద్దం పడుతోంది. -
జాసన్ రాయ్ వచ్చేశాడు..
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో ఇక్కడ వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ తొలుత ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరు జట్లు ఇంకా బోణీ చేయకపోవడంతో గెలుపుపై దృష్టి సారించాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చేతిలో ముంబై ఇండియన్స్‌కు పరాజయం ఎదురుకాగా, కింగ్స్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ జట్లపై ఢిల్లీ ఓటమి పాలైంది. దాంతో ఇరు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. గత మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన ముంబై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో బెన్ కట్టింగ్ స్థానంలో అకిల దనంజయను జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు కోలిన్ మున్రో, క్రిస్ మోరిస్‌లకు ఢిల్లీ విశ్రాంతినిచ్చింది. వారి స్థానాల్లో జాసన్ రాయ్, డానియల్ క్రిస్టియన్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తుది జట్టులోకి వచ్చారు. గత రెండు మ్యాచ్‌లకు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన స్టార్ ఆటగాడు జాసన్ రాయ్‌పై ఢిల్లీ భారీగానే ఆశలు పెట్టుకుంది. రాయ్ రాకతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని భావించిన ఢిల్లీ.. అతనికి తుది జట్టులో చోటు కల్పించింది. ఇది ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున రాయ్‌కు తొలి మ్యాచ్ కావడం విశేషం. తుది జట్లు ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఎవిన్ లూయిస్, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, మయాంక్ మార్కండే, జస్ప్రిత్ బూమ్రా, ముస్తాఫిజుర్ రహ్మన్, అకిల దనంజయ ఢిల్లీ డేర్‌డెవిల్స్: గౌతం గంభీర్ఖ(కెప్టెన్), జాసన్ రాయ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విజయ్ శంకర్, డానియల్ క్రిస్టియన్, రాహుల్ తెవాతియా, షహబాజ్ నదీమ్, మొహ్మద్ షమీ, ట్రెంట్ బౌల్ట్ -
10 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం
-
రాజస్తాన్ రాయల్స్ బోణీ
జైపూర్: పేలవ ఆటతీరుతో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్తాన్ రాయల్స్... సొంత గడ్డపై వరుణుడి అండతో ఢిల్లీపై 10 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. వర్షం కారణంగా 6 ఓవర్లకు 71 పరుగులుగా కుదించిన లక్ష్యాన్ని డేర్‌డెవిల్స్ అందుకోలేకపోయింది. ఆ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్లకు 60 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్... 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన సమయంలో వాన అంతరాయం కలిగించింది. చాలాసేపటి తర్వాత మ్యాచ్ మొదలుకాగా... డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం డేర్ డెవిల్స్ లక్ష్యాన్ని 6 ఓవర్లకు 71గా నిర్దేశించారు. అయితే... విధ్వంసక ఓపెనర్ మున్రో (0) తొలి బంతికే రనౌట్ కావడం, మ్యాక్స్‌వెల్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడలేకపోవడంతో లక్ష్యానికి ఢిల్లీ మరో 11 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. అంతకుముందు రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో కెప్టె న్ రహానే (40 బంతుల్లో 45, 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంజు శామ్సన్ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాస్ బట్లర్ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిసేపు మెరిపించారు. -
రసవత్తర పోరులో రాజస్తాన్ విజయం
జైపూర్: ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 10 పరుగుల(డక్‌వర్త్ లూయిస్) తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు సంవత్సరాల తర్వాత సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్ గెలుపుతో రాజస్తాన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకముందు వర్షం అంతరాయం కల్గించడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. రాజస్తాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 153/5 వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్‌కు అడ్డంకి ఏర్పడింది. చివరకు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆరు ఓవర్లలో 71పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి నిర్దేశించారు. రాజస్తాన్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడికి చిత్తయిన ఢిల్లీ ఆరు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 60 పరుగుల మాత్రమే చేయగలిగింది. దీంతో రాయల్స్ సొంత మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆదిలోనే డీ ఆర్సీ షార్ట్(6) వికెట్‌ను కోల్పోయింది. ఆపై బెన్ స్టోక్స్(16) కూడా నిరాశపరచడంతో రాజస్తాన్ 23 పరుగులకే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఆ తరుణంలో రహానే-సంజూ శాంసన్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. శాంసన్(37; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో వికెట్‌కు రహానేతో కలిసి 62 పరుగులు జత చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. కాసేపటికి రహానే(45;40 బంతుల్లో 5 ఫోర్లు) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక జాస్ బట్లర్(29;18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో రాజస్తాన్ 150 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది.,, , , -
రోహిత్, కోహ్లిలను దాటిన రహానే
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అజింక్యా రహానే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బుధవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సారథి అజింక్యా రహానే 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 45 పరుగులు సాధించాడు. ఫలితంగా ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రహానే గుర్తింపు సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌లో ఢిల్లీపై రహానే సాధించిన పరుగులు 673. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, కోహ్లిలను రహానే అధిగమించాడు. ఐపీఎల్లో ఢిల్లీపై రోహిత్ శర్మ నమోదు చేసిన పరుగులు 670 కాగా, విరాట్ కోహ్లి 661 పరుగుల్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై సాధించాడు. వీరు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండగా, రాబిన్ ఉతప్ప 551 పరుగులతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సురేశ్ రైనా 491 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
రాజస్తాన్-ఢిల్లీ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా ఇక్కడ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్-ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. రాజస్తాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 153/5 వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆదిలోనే డీ ఆర్సీ షార్ట్(6) వికెట్‌ను కోల్పోయింది. ఆపై బెన్ స్టోక్స్(16) కూడా నిరాశపరచడంతో రాజస్తాన్ 23 పరుగులకే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఆ తరుణంలో రహానే-సంజూ శాంసన్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. శాంసన్(37; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో వికెట్‌కు రహానేతో కలిసి 62 పరుగులు జత చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. కాసేపటికి రహానే(45;40 బంతుల్లో 5 ఫోర్లు) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక జాస్ బట్లర్(29;18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో రాజస్తాన్ 150 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. -
ఐపీఎల్: బోణీ ఎవరిదో?
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బుధవారం ఇక్కడ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్.. ముందుగా రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని ఐపీఎల్‌కు దూరమైన రాజస్థాన్ రాయల్స్ రెండేళ్ళ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే చతికిలపడింది. హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో రాయల్స్ జట్టుగా అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. మరొకవైపు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా ఈ ఐపీఎల్‌ను ఓటమితోనే మొదలుపెట్టింది. మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ గౌతమ్ గంభీర్ మినహా మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. మరోవైపు బౌలర్లూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఢిల్లీ తొలి మ్యాచ్‌ను పరాభవంతో ప్రారంభించాల్సి వచ్చింది. దాంతో ఇరు జట్లు గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ చేసిన జట్లే గెలిచిన సంగతి తెలిసిందే. తుది జట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ గౌతం గంభీర్(కెప్టెన్), గ్లేన్ మ్యాక్స్‌వెల్, రిషబ్ పంత్, క్రిస్ మోరిస్, శ్రేయాస్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్, కోలిన్ మున్రో, మహ్మద్ షమీ, విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, రాహుల్ తెవాటియా రాజస్తాన్ రాయల్స్ అజింక్యా రహానే(కెప్టెన్), శ్రేయాస్ గోపాల్, రాహుల్ త్రిపాఠి, జయదేవ్ ఉనాద్కట్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బెన్ లాప్లిన్, జోస్ బట్లర్, ధావల్ కులకర్ణి, క్రిష్ణప్పన్ గౌతమ్, డి'ఆర్సీ షార్ట్ -
డేర్‌డెవిల్స్‌పై కింగ్స్ విజయం
-
ఐపీఎల్లో ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డు నమోదు
-
డేర్‌డెవిల్స్‌పై కింగ్స్‌దే పైచేయి
-
డేర్‌డెవిల్స్‌పై కింగ్స్‌దే పైచేయి
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ 18.5 ఓవర్లలో ఛేదించింది. కింగ్స్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(51; 16 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వేగవంతమైన ఐపీఎల్ హాఫ్ సెంచరీకి జతగా కరుణ్ నాయర్(50;33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ శతకం సాధించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ప్రధానంగా రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కింగ్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ప్రేక్షకపాత్రకే పరిమితం చేసిన రాహుల్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే 3.2 ఓవర్లలో 58 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్ అగర్వాల్(7) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అయితే 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్.. జట్టు స్కోరు 64 పరుగుల వద్ద రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్(12) నిరాశపరచగా, కరుణ్ నాయర్ అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్(24 నాటౌట్;23 బంతుల్లో 1 ఫోర్), మార్కస్ స్టోనిస్(22 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు) ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే లాంఛనం పూర్తి చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో కెప్టెన్ గౌతం గంభీర్(55;42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, రిషబ్ పంత్(28;13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), క్రిస్ మోరిస్(27 నాటౌట్; 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కోలిన్ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు. జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై శ్రేయస్ అయ్యర్(11), విజయ్ శంకర్(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇది గంభీర్‌కు 36వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. కాగా, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా గంభీర్(55) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనవసరపరుగు కోసం యత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు. అంతకుముందు రిషబ్ పంత్(28) దాటిగా ఆడే క్రమంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మోరిస్ బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. -
ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డు నమోదైంది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ వేగవంతమైన అర్థ శతకాన్ని నమోదు చేశాడు. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగి ఆడి సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్ ఓపెనర్ రాహుల్ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్ బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసి ఇప్పటివరకూ యూసఫ్ పఠాన్, సునీల్ నరైన్ పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బద్ధలు కొట్టాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ ఈ ఫీట్ సాధించగా, 2017లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నరైన్.. పఠాన్ సరసన చేరాడు. దాన్ని తాజాగా రాహుల్ సవరించి కొత్త మైలురాయిని సాధించాడు. అయితే రాహుల్ (51;16 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దాటిగా ఆడే క్రమంలో రెండో వికెట్‌గా ఔటయ్యాడు. -
గౌతం గంభీర్ హాఫ్ సెంచరీ
-
కింగ్స్ పంజాబ్ లక్ష్యం 167
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ గౌతం గంభీర్(55;42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, రిషబ్ పంత్(28;13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), క్రిస్ మోరిస్(27 నాటౌట్; 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కోలిన్ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు. జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై శ్రేయస్ అయ్యర్(11), విజయ్ శంకర్(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇది గంభీర్‌కు 36వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. కాగా, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా గంభీర్(55) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనవసరపరుగు కోసం యత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు. అంతకుముందు రిషబ్ పంత్(28) దాటిగా ఆడే క్రమంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మోరిస్ బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ, ముజీబ్ ఉర్ రహ్మాన్ తలో రెండు వికెట్లు సాధించగా, అశ్విన్, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది. -
మెరిసిన గౌతం గంభీర్
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా ఆదివారం ఇక్కడ కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ మెరిశాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ గంభీర్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేసి అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇది గంభీర్‌కు 36వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును వీడి హోమ్ టీమ్ ఢిల్లీకి వచ్చిన గంభీర్ ఆడుతున్న మొదటి మ్యాచ్‌లోనే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను కోలిన్ మున్రో, గంభీర్‌లు ఆరంభించారు. జట్టు 12 పరుగుల వద్ద ఉండగా మున్రో(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై శ్రేయస్ అయ్యర్(11), విజయ్ శంకర్(13)లు కూడా నిరాశపరిచారు. కాగా, గంభీర్ మాత్రం సమయోచితంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా, జట్టు స్కోరు 123 పరుగుల వద్ద ఉండగా గంభీర్(55) ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనవసరపరుగు కోసం యత్నించి రనౌట్‌గా నిష్క్రమించాడు. అంతకుముందు రిషబ్ పంత్(28) దాటిగా ఆడే క్రమంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. -
ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా..
సాక్షి, స్పోర్ట్స్ (మొహాలీ) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ సరికొత్త రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. 21వ శతాబ్దంలో జన్మించి ఐపీఎల్లో ఆడుతున్న తొలి క్రికెటర్‌గా రహ్మాన్ నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు రహ్మాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అఫ్గానిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తరఫున అతిపిన్న వయసులో అరంగ్రేటం చేసిన ఆటగాడన్న విషయం తెలిసిందే. అతి తక్కువ వయసులో ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్‌గానూ ముజీబ్ ఉర్ రహ్మాన్ రికార్డు నమోదుచేశాడు. ఐపీఎల్ 11లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ తరఫున అరంగ్రేటం చేశాడు. 17 ఏళ్ల 11 రోజుల వయసులో తొలి ఐపీఎల్ ఆడుతున్న బౌలర్ రహ్మాన్ .. బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ రికార్డును చెరిపేశాడు. ఇప్పటివరకూ 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్ పేరిట ఈ రికార్డ్ ఉండేది. పిన్న వయసులో ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన టాప్-5 ఆటగాళ్లు ముజీబ్ ఉర్ రహ్మాన్ 17 ఏళ్ల 11 రోజులు సర్ఫరాజ్ ఖాన్ 17 ఏళ్ల 177 రోజులు ప్రదీప్ సంగ్వాన్ 17 ఏళ్ల 179 రోజులు వాషింగ్టన్ సుందర్ 17 ఏళ్ల 199 రోజులు రాహుల్ చహర్ 17 ఏళ్ల 247 రోజులు -
మ్యాచ్‌కు వెళుతూ కింగ్స్ పంజాబ్ ఇలా.. వైరల్
మొహాలీ: జట్టు పేరుకు తగ్గట్టే స్థానిక సంస్కృతుల్ని ప్రదర్శించడంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ యాజమాన్యం మిగతా ఫ్రాంచైజీలతో పోటీపడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సొంత గడ్డపై తొలి మ్యాచ్ సందర్భంగా ఇటు ఆటగాళ్లు బసచేసిన హోటల్ వద్ద, అటు స్టేడియం వద్ద బ్యాండ్ల సందడి నెలకొంది. ఐపీఎల్ 2018లో భాగంగా ఆదివారం సాయంత్రం కింగ్స్ పంజాబ్-ఢిల్లీ డేర్డెవిల్స జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ ఆడేందుకుగానూ హోటల్ నుంచి స్టేడియంకు బయలుదేరిన ఆటగాళ్లు ఇదిగో ఇలా పంజాబీ బీట్స్‌కు అనుగుణంగా స్టెప్స్ వేశారు. తొలుత యువరాజ్, ఆ తర్వాత మిల్లర్, ఇంకొందరు ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన ఈ ‘బల్లే బల్లే’ వీడియోలను కింగ్స్ అఫీషియల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. -
షమీని ఐపీఎల్లో ఆడించొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేసిన నేపథ్యంలో మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో తన భర్త షమీపై నిషేధం విధించాలని కోరిన హసీన్ జహాన్.. ఎలాగైనా సరే అతడిని ఆడకుండా చేయాలంటోంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువాను షమీ భార్య కలిసింది. అనంతరం జాతీయ మీడియాతో హసీన్ జహాన్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని హేమంత్ దువాని కలిశాను. నా భర్త షమీని ఈ ఐపీఎల్ సీజన్లో ఆడించవద్దని కోరాను. మా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు, షమీపై నమోదైన కేసుల వ్యవహారం తేలేంతవరకు షమీని ఢిల్లీ జట్టుకు దూరం చేయాలని' ఆ ఫ్రాంచైజీ సీఈఓను కోరినట్లు వివరించింది. ఇటీవల డెహ్రడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డ షమీని కలిసేందుకు హసీన్ జహాన్ వెళ్లగా ఆమెను కలిసేందుకు క్రికెటర్ నిరాకరించిన విషయం తెలిసిందే. షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని పలు ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ ఫిర్యాదు చేయగా టీమిండియా పేసర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ యువతి నుంచి డబ్బులు తీసుకుని ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు షమీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. -
ఐపీఎల్: ఆ మ్యాచ్ వేదిక మారింది!
సాక్షి, బెంగళూరు: ఇక్కడి చిన్నస్వామి స్డేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ను వేరే ప్రాంతంలో నిర్వహించనున్నారు. మే 12న కర్ణాటక శాసనసభ ఎన్నికల నిర్వహణ తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ షెడ్యూల్ సమయంలో మే 12న చిన్నస్వామి స్డేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య మ్యాచ్ ఖరారు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అదేరోజు నిర్వహించనున్న నేపథ్యంలో ఆటగాళ్లకు భద్రత కల్పించడం సాధ్యం కాదని పోలీసుశాఖ స్పష్టం చేయగా.. వేదికను మార్చాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో వేరే ప్రాంతంలో మ్యాచ్ నిర్వహించాలని, అందుకు సన్నాహాలను ఐపీఎల్ నిర్వాహకులు ముమ్మరం చేశారు. త్వరలో వేదికను ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. మిగిలిన మ్యాచ్‌లు యాథావిధిగా బెంగళూరులోనే జరుగుతాయని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో షమీకి గాయాలు
డెహ్రాడూన్: భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీకి కారులో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో అతని తలకు గాయాలయ్యాయి. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ‘తలకు దెబ్బ తగలడంతో కుట్లు పడ్డాయి. గాయం చిన్నదే. కంగారు పడాల్సిన పనిలేదు. ఓ రోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది’ అని వైద్యులు తెలిపారు. భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో గత రెండు వారాలుగా వార్తల్లో నిలిచిన షమీ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్–11లో షమీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున బరిలో దిగనున్నాడు. -
షమీ స్థానంలో ఎవరు?
న్యూఢిల్లీ: పలువురి యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా తనపై గృహహింసకు పాల్పడినట్లు భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీమిండియా పేసర్ షమీ.. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన వార్షిక వేతనాల కాంట్రాక్ట్ జాబితాలో కూడా చోటు కోల్పోయాడు. మరొకవైపు అతను ఐపీఎల్లో ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. షమీపై ఐదు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో అతని క్రీడా జీవితం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ఆరంభయ్యే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున షమీ ఆడటం కష్టమనే చెప్పాలి. వివాదంలో చిక్కుకున్న షమీని ఐపీఎల్ క్యాంప్‌లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. సున్నితమైన అంశం కాబట్టి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం సిద్ధంగా లేదు. ఒకవేళ ఐపీఎల్‌కు షమీ దూరమైతే అతని స్థానంలో ఎవరు అనేది చర్చనీయాంశమైంది. దీనిలో భాగంగా నలుగురి బౌలర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విదర్భ పేసర్ రజ్నీస్ గుర్బానీతో పాటు ఇషాంత్ శర్మ, శ్రీనాథ్ అరవింద్, అశోక్ దిండాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకసారి వీరి గురించి పరిశీలిద్దాం. రజ్నీస్ గుర్బానీ.. 2017-18 సీజన్లో విదర్భ జట్టు రంజీ ట్రోఫీ గెలవడంలో గుర్బానీది ప్రధాన పాత్ర. ఆ సీజన్లో 39 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లను సాధించడంతో పాటు మొత్తంగా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని విదర్భ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇక హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు, కేరళతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 5 వికెట్లను, కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్లను గుర్బానీ సాధించాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐపీఎల్ వేలంలో గుర్బానీని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ వేలంలో గుర్బానీ కనీస ధర రూ. 20 లక్షలుండగా అతన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరి ఇప్పుడు షమీకి ప్రత్యామ్నాయంగా గుర్బానీ తొలి స్థానంలో ఉన్నాడు. ఇషాంత్ శర్మ.. గత కొంతకాలంగా వికెట్లు సాధించడంలో విఫలమవుతున్న ఇషాంత్ శర్మను ఐపీఎల్-11సీజన్లో కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. అతని కనీస ధర రూ. 75 లక్షలుండగా ఫ్రాంచైజీల నమ్మకాన్ని మాత్రం గెలవలేకపోయాడు. గతేడాది కూడా ఇషాంత్‌ను తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే చివరి నిమిషంలో మురళీ విజయ్ గాయపడటంతో అతని స్థానంలో ఇషాంత్‌ను కింగ్స్ పంజాబ్ తీసుకుంది. కింగ్స్ పంజాబ్ మెంటార్ సెహ్వాగ్ సలహా మేరకు ఇషాంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఆ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ శర్మ ఒక వికెట్‌ను కూడా తీయలేకపోయాడు. అయితే ఇషాంత్‌కు ఐదు వేర్వేరు ఐపీఎల్ జట్లకు ఆడిన అనుభవం ఉంది. దాంతో పాటు ఢిల్లీ లోకల్ బాయ్ కావడం అతనికి కలిసొచ్చే అంశం. శ్రీనాథ్ అరవింద్.. కర్ణాటకకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్.. 2011 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున విశేషంగా రాణించాడు. ఆ సీజన్లో 21వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఆపై 2016-17 సీజన్లో మరొకసారి మెరిసినప్పటికీ, ఈ సీజన్లో మాత్రం అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌కు 33 ఏళ్ల అరవింద్ గుడ్ బై చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో అతని కనీస ధర రూ. 50 లక్షలు కాగా, అతను అమ్ముడుపోలేదు. పవర్ ప్లేలో కుదురుగా బౌలింగ్ వేసే అరవింద్ పేరు ఢిల్లీ డేర్ డెవిల్స్ పరిశీలనలో ఉంది. అశోక్ దిండా.. 2016 ఐపీఎల్ సీజన్ వేలంలో చివరి నిమిషంలో పుణె జట్టు అశోక్ దిండాని కొనుగోలు చేసింది. ఫైనల్ రౌండ్లో దిండా పుణె జట్టులోకి వచ్చాడు.ఆ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించి పుణె గెలుపులో దిండా కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో మొత్తం 9 గేమ్‌లు ఆడిన దిండా.. 11 వికెట్లను మాత్రమే సాధించాడు. ఆ తర్వాత 2017 సీజన్లో మూడు గేమ్‌లు మాత్రమే ఆడిన ఈ బెంగాల్ పేసర్ దాదాపు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్లో 10 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ దిండాను నిలకడలేమి బాధిస్తోంది. దాంతో ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా దిండాను కొనుగోలు చేసేందుకు అస్సలు ఆసక్తికనబరచలేదు. అతని కనీస ధర రూ. 50 లక్షలు కాగా, దిండాకు నిరాశే ఎదురైంది. -
షమీ ఐపీఎల్లో ఆడటంపై అనుమానాలు
-
ఐపీఎల్‌కు షమీ డౌటే.!
సాక్షి, స్పోర్ట్స్ : ‘మూలిగే నక్కమీద తాటి పండొచ్చి పడ్డట్లుంది’ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వ్యవహారం. ఇప్పటికే పలువురి యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని భార్య హాసిన్ జహాన్ చేసిన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న షమీ.. ఐపీఎల్లో ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఆరోపణలతో వార్షిక వేతనాల కాంట్రాక్టుల్లో బీసీసీఐ షమీకి చోటు కల్పించని విషయం తెలిసిందే. అయితే తాజాగా వివాదంలో చిక్కుకున్న షమీని ఐపీఎల్ క్యాంప్‌లకు అనుమతించాలా? వద్దా అనే సందిగ్ధంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం ఉంది. ఈ విషయంలో బీసీసీఐ న్యాయసలహా తీసుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. ‘ సున్నితమైన ఈ అంశంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తొందరపాటు నిర్ణయం తీసుకోదు. ఇప్పటికే ఈ విషయంలో బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని’ ఓ సీనియర్ ఫ్రాంచైజీ అధికారి మీడియాకు తెలిపారు. మహ్మద్ షమీని వేలంలో ఢిల్లీ రూ. 3 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. షమీ అనేక మంది యువతులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని అతని భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోల్‌కతా పోలీసులు షమీపై గృహ హింసా చట్టం, భార్య జహాన్‌ను వేధించటం.. రేప్ అటెంప్ట్.. హత్యాయత్నం, వివాహేతర సంబంధాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివాదంతో షమీ ఐపీఎల్‌కు దూరమైతే షమీ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారనుంది. -
ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్‌గా గంభీర్
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2018 సీజన్‌కు ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్‌గా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్‌ను ఎంపిక చేశారు. ఢిల్లీ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గంభీర్ కెప్టెన్సీపై నమ్మకం ఉంచడంతో ఈ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాళ్లకు సరైన సారథి గంభీరేనని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సారథిగా అతను ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వలేదని, గత సీజన్లో గంభీర్ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. యువ ఆటగాళ్లకు అనుభవం ఉన్న కెప్టెన్ కావాలని కోరుకున్నామని, గంభీరే సరైన సారథి అని భావించి నిర్ణయం తీసుకున్నామన్నారు. గంభీర్ సారథ్యంలోనే ఢిల్లీ టైటిల్ గెలుస్తోందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక 2011లో కేకేఆర్ పగ్గాలు చేపట్టిన గంభీర్ అటు సారథిగా ఇటు బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణించాడు. కొన్ని సీజన్లలో టాప్ స్కోరర్‌గా సైతం నిలిచాడు. గంభీర్ సారథ్యంలోనే కేకేఆర్ రెండు సార్లు (2012, 2014 సీజన్లలో) టైటిల్ కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా రెండు సార్లు టైటిల్ అందించిన గంభీర్‌ను ఈ సీజన్లో కేకేఆర్ వదులు కోవడంతో ఫ్రాంచైజీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోమ్ టౌన్‌కు ఆడాలనే తన కోరిక మేరకే వదులుకున్నామని కేకేఆర్ ఆ తర్వతా స్పష్టం చేసింది. ఇక ఢిల్లీ రూ.2.80 కోట్లకు గంభీర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గంభీర్ సొంత గూటికి చేరినట్లైంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో గంభీర్ ఢిల్లీకే ప్రాతినిథ్యం వహించాడు. -
గంభీర్ చేజేతులా చేసుకున్నాడు!: కేకేఆర్
సాక్షి, కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే గుర్తొచ్చే ఆటగాళ్లలో గౌతం గంభీర్ కచ్చితంగా ఉంటాడు. అయితే తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిని సొంతజట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్ ( కేకేఆర్) తీసుకోక పోవడంపై తీవ్ర విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండు సీజన్లలో కేకేఆర్‌కు ఐపీఎల్ టైటిల్స్ అందించిన క్రికెటర్‌కు అవమానం జరిగిందంటూ కొందరు కేకేఆర్ ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. అయితే దీనిపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ వివరణ ఇచ్చుకున్నారు. గంభీర్‌కు సారీ చెబుతూ కేకేఆర్ టీమ్ వదులుకోవడానికి ఆ క్రికెటరే కారణమని అది ఎలాగో వివరించాడు. సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. ‘ఈ వేలంలో స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ గంభీర్‌ను తీసుకోవాలని ముందుగానే కేకేఆర్ యాజమాన్యం ప్లాన్ చేసుకుంది. అతడిపై మాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. కానీ వేలానికి ముందు గంభీర్ తమకు కొన్ని విషయాలు చెప్పాడు. తన కోసం వేలంలో ఆసక్తి చూపించవద్దని, ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్) ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించవద్దన్నాడు. గంభీర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో.. అతడు దేని కోసం ఎదురుచూస్తున్నాడో మాకు తెలియదు. దీంతో గౌతీకి ఏ విధంగా సాయం చేయలేకపోయామని, సారీ గంభీర్ అంటూ’ కేకేఆర్‌తో తమ ఏడేళ్ల అనుబంధాన్ని సీఈఓ గుర్తుచేసుకున్నాడు. కేకేఆర్ ఫ్యాన్స్ గంభీర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గౌతీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.2.8 కోట్లతో సొంతం చేసుకుంది. దీంతో గంభీర్ తిరిగి సొంతగూటికి చేరినట్లయింది. -
ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా పాంటింగ్
ముంబై: ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. గతేడాది వరకు ఢిల్లీ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగా వైదొలిగాడు. అతడి స్థానంలో పాంటింగ్‌ను నియమించినట్లు డేర్ డెవిల్స్ సీఈవో హేమంత్ దువా తెలిపాడు. పాంటింగ్ 2015, 2016లలో ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. -
ఢిల్లీ కోచ్ గా రికీ పాంటింగ్?
సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ తిరిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కోచ్ గా పునరాగమనం చేసే అవకాశం కనబడుతోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు పాంటింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ముంబై ఇండియన్స్ కోచ్ గా పని చేసిన అనుభవం పాంటింగ్ కు ఉంది. ఆయన శిక్షణలో ముంబయి 2015లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే రికీ పాంటింగ్ ను కోచ్ గా నియమించేందుకు ఢిల్లీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా పాంటింగ్ తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన మేరకు ఢిల్లీ మెంటర్ గా రాహుల్ ద్రవిడ్ తన పదవిని వదులుకోవడంతో అందుకు పాంటింగే సరైన వ్యక్తిగా ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. తాము పలువురితో కోచ్ పదవికి సంబంధించి చర్చలు జరుపుతున్న విషయాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా స్పష్టం చేశారు. మరొకవైపు రెండేళ్ల తరువాత ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్న రాజస్థాన్ రాయల్స్ నుంచి కూడా పాంటింగ్ కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన టీమిండియా మాజీ పేసర్ టీఏ శేఖర్ ముంబయి ఇండియన్స్ శిబిరంలో చేరుతున్నట్టు సమాచారం. -
ద్రవిడ్ స్థానంలో గిలెస్పీ?
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత అండర్-19 క్రికెట్ జట్టుతో పాటు భారత-ఎ జట్టుకు దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ద్రవిడ్ ను మరో రెండేళ్ల పాటు కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో మాదిరి కాకుండా పూర్తిస్థాయి కోచింగ్ బాధ్యతలను ద్రవిడ్ కు అప్పగించారు. దాంతో ఇక ఏ లీగ్ కు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించకూడదు. ఆ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్ లో ద్రవిడ్ స్థానాన్ని సరైన వ్యక్తితో భర్తీ చేయాలనే యోచనలో ఉంది డేర్ డెవిల్స్ యాజమాన్యం. దానిలో భాగంగా జాసన్ గిలెస్పీన్ని ఢిల్లీ యాజమాన్యం ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన గిలెస్పీ.. బిగ్‌బాష్ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ కు చీఫ్ కోచ్ గా ఉన్నాడు. మరొకవైపు ఇంగ్లిష్ కౌంటీ యార్క్‌షైర్ గిలెస్పీని మరోసారి కోచ్ గా తీసుకునేందుకు మొగ్గుచూపుతోంది. అతని పర్యవేక్షణలోని ఆ జట్టు రెండుసార్టు కౌంటీ చాంపియన్‌షిప్ ను గెలిచింది. ఆసీస్ తరపున గిలెస్పీ 71 టెస్టులు, 97 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 259 వికెట్లు సాధించగా, వన్డేల్లో 142 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. -
విజయంతో ముగించారు
. చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన బెంగళూరు ∙ కోహ్లి అర్ధ సెంచరీ న్యూఢిల్లీ: ఐపీఎల్ పదో సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఊరట విజయంతో ముగించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన 10 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. తమ చివరి ఎనిమిది మ్యాచ్‌ల్లో బెంగళూరుకిదే తొలి విజయం కావడం విశేషం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హర్షల్ పటేల్‌కి దక్కింది. అంతకుముందు టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (45 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... క్రిస్ గేల్ (38 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో రెండో వికెట్‌కు 66 పరుగులు జత చేరాయి. అయితే వీరి ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖరి ఓవర్లో నేగి (5 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు) వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో ఓ మాదిరి స్కోరైనా చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో బంతికే వికెట్ పడినా శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), కరుణ్ నాయర్ (22 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో సరైన భాగస్వామ్యాలు ఏర్పడలేదు. రిషభ్ పంత్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం 17వ ఓవర్లో ముగియగా ఆఖర్లో షమీ (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగినా ఫలితం లేకపోయింది. -
డేర్ డెవిల్స్ విజయలక్ష్యం 162
ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే విష్ణు వినోద్(3) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రిస్ గేల్- విరాట్ కోహ్లిలు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. గేల్ (48;38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో హాఫ్ సెంచరీ మిస్సవ్వగా, విరాట్ కోహ్లి(58;45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి 66 పరుగుల్ని జత చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే గేల్ అవుటైన స్వల్ప వ్యవధిలో ట్రావిస్ హెడ్(2)తో పాటు కోహ్లి కూడా నిష్ర్కమించడంతో బెంగళూరు తడబడింది. ఇక చివర్లో పవన్ నేగీ(13 నాటౌట్;5 బంతుల్లో 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, నదీమ్ లు తలో వికెట్ తీశారు. -
చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో?
-
చివరి లీగ్ లో గెలుపు ఎవరిదో?
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా ఒకే ఒక్క లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా, మరో రెండు రోజుల్లో నాకౌట్ పోరుకు తెరలేవనుంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ లు ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. కింగ్స్ పంజాబ్ తో మ్యాచ్ లో గెలిచిన పుణె చివరిగా నాకౌట్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇదిలా ఉంచితే , ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్-రాయల్ చాలెంజర్స్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రపు మ్యాచ్. అంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఢిల్లీ ఆరు విజయాలు సాధించగా, ఆర్సీబీ మాత్రం రెండు విజయాల్నే తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఈ మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఐపీఎల్ -10లో ఇదే చివరి లీగ్ కావడంతో గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నాయి. మరొకవైపు చివరి లీగ్ లో గెలుపు ఎవరు సాధిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఏడు పరుగులతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం
-
రైజింగ్ పుణేకు షాక్
-
రైజింగ్ పుణేకు షాక్
⇒ ఏడు పరుగులతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం ⇒ మనోజ్ తివారి పోరాటం వృథా లక్ష్యం 169 పరుగులు.. వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీదున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌కు ఇది ఏమంత కష్టసాధ్యమైనదేమీ కాదనే అంతా భావించారు. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు మాత్రం చివరి బంతి వరకు పోరాడి ప్రత్యర్థిని కంగుతినిపించారు. ఈ మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్‌లో దర్జాగా చోటు దక్కించుకుందామనుకున్న స్మిత్ బృందం ఇక తమ చివరి మ్యాచ్ వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. న్యూఢిల్లీ: సూపర్ ఫామ్‌లో ఉన్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ జోరును ఢిల్లీ డేర్‌డెవిల్స్ అడ్డుకుంది. లక్ష్యం భారీగా లేకపోయినా పేసర్లు జహీర్ ఖాన్ (2/25), మొహమ్మద్ షమీ (2/37) అద్భుత బౌలింగ్ కారణంగా పుణే వణికింది. అంతకుముందు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్ (45 బంతుల్లో 64; 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్లన్ శామ్యూల్స్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. ఉనాద్కట్, స్టోక్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసి ఓడింది. మనోజ్ తివారి (45 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతి వరకు పోరాడాడు. స్మిత్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. కరుణ్ ఒక్కడే... టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆద్యంతం ఓపెనర్ కరుణ్ నాయర్ నడిపించాడు. తొలి మూడు ఓవర్లలోనే సంజూ సామ్సన్ (2), ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (3) అవుట్ కావడంతో 9 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కరుణ్, రిషబ్ పంత్ జోరుతో పరుగుల వేగం పెరిగింది. నాలుగో ఓవర్లో కరుణ్ రెండు ఫోర్లు, రిషబ్ ఓ సిక్స్ బాదగా.. ఐదో ఓవర్లో కరుణ్, ఆరో ఓవర్లో పంత్ మూడేసి ఫోర్లతో రెచ్చిపోవడంతో ఈ రెండు ఓవర్లలోనే 28 పరుగులు వచ్చాయి. అయితే తొమ్మిదో ఓవర్లో జంపా ఈ జోడిని విడదీశాడు. అప్పటికే ఆ ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ కొట్టిన పంత్‌ను తను అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మార్లన్ శామ్యూల్స్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 37 బంతుల్లో కరుణ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా అటు వరుస ఓవర్లలో అండర్సన్ (3), కమిన్స్ (11) పెవిలియన్‌కు చేరడంతో జట్టు స్కోరు నెమ్మదించింది. అయితే 18వ ఓవర్లో నాయర్ రెండు ఫోర్లు, మిశ్రా ఓ సిక్స్ బాదడంతో 19 పరుగులు రాగా పుంజుకుంది. ఆ తర్వాత ఓవర్లో నాయర్‌ను స్టోక్స్ అవుట్ చేశాడు. ఇక చివరి ఓవర్లో షమీ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర స్టోక్స్ అద్భుత రీతిలో అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. డీప్ మిడ్వికెట్లో తను బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో బౌండరీ లైన్ దాటేస్తానని భావించి మెరుపువేగంతో బంతిని తిరిగి మైదానంలోకి విసిరాడు. అయితే అది కిందపడేలోపే తను మరోసారి లోనికి వచ్చి అందుకున్నాడు. తివారి ఒంటరి పోరు లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణేకు ప్రారంభంలోనే జహీర్ ఖాన్ షాక్ ఇచ్చాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయని తను ఈసారి తొలి బంతికే రహానేను డకౌట్ చేశాడు. అలాగే దీంతో ఐపీఎల్లో వంద వికెట్లను పూర్తిచేసుకున్నాడు. అయితే నాలుగో ఓవర్లో కెప్టెన్ స్మిత్ 4,6,4తో చెలరేగి 14 పరుగులు రాబట్టాడు. ఐదో ఓవర్లో జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జహీర్ తన మూడో ఓవర్లో రాహుల్ త్రిపాఠి (7)ని అవుట్ చేశాడు. ఈ సమయంలో స్మిత్‌కు జతగా మనోజ్ తివారి నిలిచాడు. తివారి వరుసగా రెండు ఫోర్లతో పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ జోరు మీదున్న స్మిత్‌ను తొమ్మిదో ఓవర్లో చక్కని లైన్ అండ్ లెంగ్త్ బంతితో ఎల్బీగా అవుట్ చేశాడు. మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు పరుగులకు కట్టడి చేయగలిగారు. అయితే ఫీల్డర్ల వైఫల్యంతో తివారి వరుసగా రెండు ఓవర్లలో ఇచ్చిన క్యాచ్‌లు మిస్ అయ్యాయి. 16వ ఓవర్లో స్టోక్స్‌ను షమీ అవుట్ చేయగా నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో ధోని (5) షమీ సూపర్ త్రోకు రనౌట్ కాగా క్రిస్టియాన్ (3) ఎల్బీగా అవుట్ అయి ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఓవర్లో 25 పరుగులు రావాల్సి ఉండగా తివారి వరుసగా రెండు సిక్సర్లు, ఆ తర్వాత ఓ ఫోర్ బాదినా ఫలితం లేకపోయింది. -
పుణే దూకుడు కొనసాగేనా?
⇒ నేడు ఢిల్లీతో తలపడనున్న సూపర్‌జెయింట్ ⇒ పటిష్టంగా పుణే ⇒ డేర్‌డెవిల్స్ అస్థిర ప్రదర్శన న్యూఢిల్లీ :వరుస విజయాలతో జోరుమీదున్న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపుమీదున్న పుణే.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు చివరిమ్యాచ్‌లో కోల్‌కతాపై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ తన విజయమంత్రాన్ని కొనసాగించాలని భావిస్తోంది. జోరుమీదున్న పుణే.. గతేడాది ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ చెత్త ఆటతీరుతో ఆ సీజన్లో అట్టడుగున ఏడోస్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్లో పుణే దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా చివరగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు నమోదు చేయడం విశేషం. ఓవరాల్‌గా 16 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో 148 పరుగుల ఓ మాదిరి స్కోరునే చేసినా.. బౌలర్లు ఆకట్టుకోవడంతో అద్భుతవిజయం సాధించింది. ముఖ్యంగా జయదేవ్ ఉనాద్కట్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. హ్యాట్రిక్‌తో సన్‌రైజర్స్‌ను కకావికలం చేశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లోనూ తను ఇదే విధంగా రాణించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 367 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు నమోదు చేశాడు. మరోవైపు ఈ సీజన్లో అరంగేట్రం చేసిన కుర్ర సంచలనం రాహుల్ త్రిపాఠి ఆకట్టుకుంటున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 353 పరగులు చేశాడు. బెన్ స్టోక్స్ (283 పరుగులు), అజింక్య రహానే (248), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (235 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. మనోజ్ తివారీ, డాన్ క్రిస్టియన్ తమ బ్యాట్లకు పదును పెట్టాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అంచనాలకు మించి రాణించాడు. మొత్తం 12 మ్యాచ్‌లాడిన తాహిర్ 18 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఉనాద్కట్ (17 వికెట్లు), బెన్ స్టోక్స్ (10) ఆకట్టుకుంటున్నారు. డాన్ క్రిస్టియాన్, శార్ధుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ సత్తాచాటాల్సి ఉంది. మరోవైపు గత సీజన్లో ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగగా అందులో పుణేనే విజయం సాధించింది. అయితే ఈ సీజన్లో ఇరుజట్లు పరస్పరం తలపడగా.. 97 పరుగులతో పుణే ఘనవిజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పుణే భావిస్తోంది. జట్టు ఆటతీరు చూస్తే ఈ మ్యాచ్‌లో పుణేనే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఢిల్లీ పడుతూ లేస్తూ..: ఈ సీజన్లో అత్యంత అస్థిరప్రదర్శన కనబర్చే జట్టు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ డేర్‌డెవిల్స్ అనడంలో సందేహం లేదు. ఒక మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ మరోమ్యాచ్‌లో 66 పరుగులకే కుప్పకూలడం ఢిల్లీ విషయంలో మాత్రమే సాధ్యమవుతోంది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 5 విజయాలు, 7 పరాజయాలు నమోదు చేసింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ లయన్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని అద్భుత రీతిలో ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే సంజూ శామ్సన్, కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, కోరీ అండర్సన్, కార్లోస్ బ్రాత్వైట్లాంటి ఆటగాళ్లున్నా.. సమష్టిగా రాణించడం లేదు. ఒక మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్ విజయవంతమైతే మరో మ్యాచ్‌లో ఇంకో బ్యాట్స్‌మెన్ సత్తాచాటుతున్నాడు. జట్టుగా మాత్రం రాణించలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే సంజూ సామ్సన్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా 12 మ్యాచ్‌ల్లో 384 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తను ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ.. ఫామ్‌లోకొస్తే విధ్వంసక ఇన్నింగ్స్ ఆటగలడు. ఈ సీజన్లో ఓ సెంచరీ కూడా నమోదు చేశాడు. అది పుణేపైనే కావడం విశేషం. శుక్రవారం మ్యాచ్‌లో తను మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి ఇది తోడ్పడుతుంది. శ్రేయస్ అయ్యర్ (303 పరుగులు), రిషభ్ పంత్ (285), కరుణ్ నాయర్ (191) ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీ కారణంగా క్రిస్ మోరిస్, కగిసో రబడ జట్టు నుంచి దూరమవడం ఢిల్లీకి ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ప్యాట్ కమిన్స్ ఆకట్టుకుంఉటున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. క్రిస్ మోరిస్ కూడా 12 వికెట్లు తీయడం విశేషం. అమిత్ మిశ్రా (10 వికెట్లు), జహీర్ ఖాన్ (7) ఫర్వాలేదనిపిస్తున్నారు. లీగ్ తొలిదశలో పుణేపై భారీ విజయం సాధించిన ఢిల్లీ మరోసారి అదే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు గుజరాత్తోమ్యాచ్లో గాడిన పడిన ఢిల్లీ ఆ మ్యాచ్‌లోలాగే మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. -
డెవిల్స్ విన్
-
శభాష్ శ్రేయస్
-
శభాష్ శ్రేయస్
►ఢిల్లీని గెలిపించిన అయ్యర్ ►కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ►లయన్స్ ఖాతాలో మరో ఓటమి లయన్స్ గర్జించినా... డెవిల్స్ ముందు తోకముడవక తప్పలేదు. ఆఖరి ఓవర్లో డ్రామా నడిచినా ఢిల్లీదే పైచేయి అయ్యింది. శ్రేయస్ అయ్యర్, కమిన్స్ ఏడో వికెట్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఢిల్లీపై భారీ స్కోరు చేసినా... గుజరాత్‌కు పరాజయం తప్పలేదు. కాన్పూర్: గుజరాత్ లయన్స్‌పై 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ... ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులకే ఆలౌటైంది. అదే ఢిల్లీ మళ్లీ గుజరాత్‌పై రెచ్చిపోయింది. ప్రతీకారానికి అవకాశమివ్వకుండా ఘనవిజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 2 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (39 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 96; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కమిన్స్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) తోడ్పాటునందించాడు. శ్రేయస్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. విరుచుకుపడిన ఫించ్... గుజరాత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన స్మిత్ (8), వన్‌డౌన్‌లో వచ్చిన సురేశ్ రైనా (6) విఫలమయ్యారు. ఈ దశలో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్‌లు భారం తమ భుజాన వేసుకున్నారు. ధాటిగా ఆడుతున్న కిషన్‌ను మిశ్రా బోల్తా కొట్టించాడు. అపుడు జట్టు స్కోరు 56 పరుగులే. దీంతో కార్తీక్‌కు అరోన్ ఫించ్ జతయ్యాడు. వీళ్లిద్దరూ వికెట్ పడకుండా ధాటిని కొనసాగించారు. అమిత్ మిశ్రా వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఫించ్ రెండు వరుస సిక్సర్లు బాదాడు. అదుపు తప్పిన బంతినల్లా బౌండరీకి తరలిస్తూ జట్టు స్కోరును పెంచాడు. ఇదే జోరుతో ఫించ్ అర్ధసెంచరీకి సమీపించాడు. నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించాక బ్రాత్‌వైట్ ఈ జోడీని విడగొట్టాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన దినేశ్ కార్తీక్... అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ మరుసటి బంతిని సిక్సర్‌గా మలిచిన ఫించ్ 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వేగం పెంచిన అతను షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన రవీంద్ర జడేజా 13, ఫాల్క్‌నర్ 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లు షమీ, కమిన్స్ బ్రాత్‌వైట్, మిశ్రా తలా ఒక వికెట్ తీశారు. అయ్యర్ సూపర్... భారీ లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ ఆరంభంలో తడబడింది. 11 పరుగుల వద్ద సామ్సన్ (10)ను, 15 పరుగుల వద్ద రిషభ్ పంత్ (4) వికెట్లను కోల్పోయింది. కీలక వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఢిల్లీకి లక్ష్యఛేదన తలకు మించిన భారమైంది. అయితే శ్రేయస్ పాలుపంచుకున్న రెండు భాగస్వామ్యాలు మ్యాచ్‌లో ఢిల్లీని నడిపించాయి. మొదట మూడో వికెట్‌కు కరుణ్ నాయర్ (15 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ కలిసి 57 పరుగులు జోడించారు. తర్వాత శామ్యూల్స్ (1), అండర్సన్ (6)ల రనౌట్‌తో ఢిల్లీ కష్టాలు మొదటికొచ్చాయి. ఈ దశలో శ్రేయస్, కమిన్స్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. వీళ్లిద్దరూ ఏడో వికెట్‌కు కేవలం 27 బంతుల్లోనే వేగంగా 61 పరుగులు జతచేశారు. 19వ ఓవర్లో కమిన్స్, చివరి ఓవర్లో శ్రేయస్ ఔట్ కావడంతో ఢిల్లీ శిబిరంలో ఆందోళన పెరిగింది. కానీ బాసిల్ థంపి వేసిన ఆఖరి ఓవర్లో అమిత్ మిశ్రా (2 బంతుల్లో 8 నాటౌట్; 2 ఫోర్లు) రెండు వరుస బౌండరీలతో జట్టును గెలిపించాడు. ఎల్బీకి అప్పీల్ చేస్తే... రిషభ్ పంత్ నిర్లక్ష్యమో, సోమరితనమో గానీ గుజరాత్‌కు వికెట్ మాత్రం అప్పనంగా దొరికింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్‌లో తానాడిన తొలి బంతికే ఫోర్ కొట్టిన రిషభ్ ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. సాంగ్వాన్ సహా ఫీల్డర్లంతా ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా... రిషభ్ బంతిని ఏమాత్రం గమనించకుండా క్రీజు బయటే తాపీగా నిల్చున్నాడు. స్లిప్‌లో నిల్చున్న రైనా వెంటనే బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. దీంతో రిషభ్ అనూహ్యంగా రనౌటయ్యాడు. -
పరువు కోసం..
►నేడు గుజరాత్‌తో ఢిల్లీ ఢీ ►ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి ఇరు జట్లు ఔట్ ►పట్టికలో మెరుగైన స్థానం కోసం పోరు కాన్పూర్: నాకౌట్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్ జట్లు పరువు కోసం బుధవారం తలపడనున్నాయి. పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన గుజరాత్ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ముంబై చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకుని తిరిగి విజయాల బాట పట్టాలని ఢిల్లీ కృతనిశ్చయంతో ఉంది. ఢిల్లీ ఆశలు గల్లంతు.. నాకౌట్ పోరుకు చేరుతామని ఆశించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆశలు ఆవిరయ్యాయి. సోమవారం ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి ఢిల్లీ వైదొలగాల్సి వచ్చింది. నిజానికి ఈ సీజన్లో ఢిల్లీ ఆటతీరు సాదాసీదాగా సాగింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ నాలుగు విజయాలు, ఏడు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా 146 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు డోలాయమానంలో పడగా.. సోమవారం సన్‌రైజర్స్ విజయంతో నాకౌట్ ఆశలకు ఫుల్స్టాప్ పడినట్లయ్యింది. నిజానికి ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ కనీస పోరాటం చేస్తుందని అభిమానులు ఆశించారు. ఎందుకంటే అంతకుముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని మరో 21 బంతులుండగానే ఛేదించింది. దీంతో అభిమానులు మరోసారి అలాంటి ప్రదర్శనను ఆశించారు. అయితే అత్యంత అవమానకరరీతిలో 66 పరుగులతో ఐపీఎల్ టోర్నీలోనే తమ అత్యల్ప స్కోరును సమోదు చేసింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే జట్టు తరఫున సంజూ శామ్సన్ అత్యధిక పరుగులు చేశాడు. 11 మ్యాచ్‌ల్లో 374 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉండడం విశేషం. రిషబ్ పంత్ (281 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (207 పరుగులు) ఆకట్టుకున్నారు. కరుణ్ నాయర్ , క్రిస్ మోరిస్, కోరీ అండర్సన్ ఫర్వాలేదనిపించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే భారత దిగ్గజ బౌలర్ జహీర్‌ఖాన్ జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. జట్టు తరఫున క్రిస్ మోరిస్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. తను 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్ (11 వికెట్లు), అమిత్ మిశ్రా (9), జహీర్ ఖాన్ (7), రబడ (6) ఫర్వాలేదపించారు. అయితే చివరి మూడు మ్యాచ్‌లకు రబడ, మోరిస్, ఏంజెలో మాథ్యూస్‌లు జట్టు నుంచి దూరం కావడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహంలేదు. వచ్చేనెలలో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల కోసం వీరంతా తమ జాతీయ జట్లతో చేరనున్నారు. మరోవైపు గుజరాత్‌తో గత సీజన్లో రెండు మ్యాచ్‌లాడగా అందులో చెరో మ్యాచ్‌లో ఇరుజట్లు విజయం సాధించాయి. అలాగే ఈ సీజన్లో ఇరుజట్లు పరస్పరం తలపడగా ఏడు వికెట్లతో గుజరాత్‌పై ఢిల్లీ విజయం సాధించింది. మరోసారి అలాంటి ప్రదర్శనే నమోదు చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఈ క్రమంలో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగవచ్చని జట్టు భావనగా తెలుస్తోంది. గుజరాత్ డీలా.. 2016లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ జట్టు ఈ సీజన్లో దుమ్మురేపింది. ఏకంగా మూడోస్థానంలో నిలిచి సత్తా చాటింది. అయితే ఈ సీజన్లో గుజరాత్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రైనాసేన నాలుగు విజయాలు, ఎనిమిది పరాజయాలతో ప్లే ఆఫ్ రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడోస్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టికలో సాధ్యమైనంత మెరుగైన స్థానం కోసం పోరాడనుంది. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో గుజరాత్ అద్భుత విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో 190 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ సురేశ్ రైనా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం 12 మ్యాచ్‌లాడిన రైనా 434 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దినేశ్ కార్తీక్ (321 పరుగులు), బ్రెండన్ మెకల్లమ్ (229 పరుగులు), ఇషన్ కిషన్ (182) ఆకట్టుకున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో డ్వేన్ స్మిత్ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనను కనబర్చాల్సి ఉంది. మరోవైపు గుజరాత్ బౌలింగ్‌లో పదును లోపించింది. ప్రత్యర్థి జట్లు అలవోకగా పరుగులు పిండుకుంటున్నాయి. దీనిపై జట్టు దృష్టి సారించాల్సి ఉంది. బౌలింగ్‌లో అండ్రూ టై 12 వికెట్లతో జట్టు తరపున అగ్రస్థానంలో నిలిచాడు. కేరళ స్పీడ్‌స్టర్ బాసిల్ థంప్సి ఆకట్టుకుంటున్నాడు. జేమ్స్ ఫాల్క్‌నర్, ప్రదవీప్ సాంగ్వాన్ రాణించాల్సి ఉంది. అయితే తొడ కండరాల గాయంతో మెకల్లమ్, పేసర్ టై జట్టు నుంచి దూరమవడం రైనాసేనను అందోళనపరుస్తోంది. మరోవైపు ఈ సీజన్లో ఢిల్లీ చేతులో ఎదురైన ఓటమికి గుజరాత్ బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. పంజాబ్‌పై కనబర్చిన ఆటతీరునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని రైనాసేన కృతనిశ్చయంతో ఉంది. -
ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్ ఔట్
న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ట్రోఫీలో తమ జట్ల తరఫున ఆడేందుకు వీలుగా కగిసో రబడ, క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా), ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి సోమవారం వైదొలిగారు. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగతా 3 మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో నిలిచిన ఢిల్లీకి ఇది ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం పట్టికలో 8 పాయింట్లతో ఉన్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యా చ్ల్లో నెగ్గడంతోపాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తనకు అనుకూలంగా ఉండాలి. ఈక్రమంలో తర్వాతి మ్యాచ్‌ను బుధవారం.. గుజరాత్ లయన్స్‌తో కాన్పూర్‌లో ఢిల్లీ ఆడనుంది. -
మలింగ ఖాతాలో అరుదైన ఫీట్
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిసి 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 10లో భాగంగా నిన్న (శనివారం) ఢిల్లీ సొంతగడ్డ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మలింగ.. ఆ ఓవర్లో ఐదో బంతికి ఢిల్లీ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్(3)ను ఔట చేయడంతో ఈ ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు మలింగ. మలింగ బంతిని అయ్యర్ షాట్ కొట్టగా ముంబై ప్లేయర్ హర్బజన్ క్యాచ్ పట్టడంతో ముంబై క్రికెటర్ కళ్లల్లో చెప్పలేనంత సంబరం మొదలైంది. ఆ తర్వాత కోరే అండర్సన్ ను ఔట్ చేసి మరో వికెట్ తీశాడు. ఐపీఎల్ లో ఓవరాల్ గా 105 మ్యాచ్ లాడిన మలింగ ఉత్తమ ప్రదర్శన 5/13గా ఉంది. వంద వికెట్లకు పైగా తీసిన బౌలర్లలో 18.47 సగటుతో అందరికంటే ముందున్నాడు. ఢిల్లీతో మ్యాచ్ లో కరణ్ శర్మ, హర్భజన్లు మూడేసి వికెట్లు తీయగా, మలింగ రెండు వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 66 పరుగులకే చాపచుట్టేసి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. -
ముంబై ఇండియన్స్ ఘనవిజయం
-
ఢిల్లీ గజగజ...
-
ఢిల్లీ గజగజ...
►66 పరుగులకే ఆలౌట్ ►ముంబై ఇండియన్స్ ఘనవిజయం ►చెలరేగిన బౌలర్లు ►సిమన్స్, పొలార్డ్ మెరుపులు తమ చివరి మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఈసారి మాత్రం తుస్సుమంది. ముంబై ఇండియన్స్ విధించిన 213 పరుగుల భారీ టార్గెట్‌లో తొలి బంతి నుంచే తడబడిన ఈ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. గుజరాత్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన సామ్సన్, రిషభ్ అసలు పరుగులేమీ చేయకుండానే వెనుదిరగడంతో అత్యంత చెత్త ఆటతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ అవకాశాలకు దాదాపుగా తెర దించుకున్నట్టయ్యింది. అటు ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ చిగురుటాకులా వణికింది. 213 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఈ జట్టు ఆటగాళ్లు కనీసం పోరాటం చేయకుండానే అవమానకరంగా తోక ముడిచారు. ఫలితంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 146 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం కావడం విశేషం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 212 పరుగులు చేసింది. సిమన్స్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్ (35 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా... ఆఖర్లో హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరిశాడు. అనంతరం ఢిల్లీ జట్టు 13.4 ఓవర్లలో 66 పరుగులకు కుప్పకూలింది. కరణ్ శర్మ, హర్భజన్‌లకు మూడేసి వికెట్లు దక్కగా... మలింగ రెండు వికెట్లు తీశాడు. సిమన్స్, పొలార్డ్ దూకుడు ముంబై జట్టులో బట్లర్ స్థానంలో బరిలోకి దిగిన ఓపెనర్ సిమన్స్ మెరుపు ఆరంభాన్ని అందిస్తే చివరి పది ఓవర్లలో పొలార్డ్ మెరుపులు జట్టుకు భారీ స్కోరును అందించింది. నాలుగో ఓవర్లో సిమన్స్ ఓ సిక్స్, ఫోర్‌తో తన జోరును ఆరంభించగా అటు పార్థివ్ (25; 3 ఫోర్లు) కూడా వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 60 పరుగులకు చేరింది. మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పార్థివ్ స్టంప్ కావడంతో తొలి వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 36 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన సిమన్స్ అండర్సన్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదిన అనంతరం క్యాచ్ అవుటయ్యాడు. అయితే మూడో స్థానంలో బరిలోకి దిగిన పొలార్డ్ ఏమాత్రం తగ్గకుండా ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా మిశ్రా బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. కమిన్స్ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా ... రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టగా... పొలార్డ్ మరో ఫోర్ బాదాడు. దీంతో 23 పరుగులు రావడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. వికెట్లు టపటపా... భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ జట్టును ముంబై బౌలర్లు కోలుకోనీయకుండా దెబ్బతీశారు. తొలి బంతి నుంచే ప్రారంభమైన ఢిల్లీ పతనం ఏ దశలోనూ ఆగలేదు. మొదటి ఆరు ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సంజూ సామ్సన్ను మెక్లీనగన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత శ్రేయస్ (3)ను మలింగ.. రిషభ్ పంత్‌ను బుమ్రా.. కరుణ్ నాయర్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్)ను హర్భజన్ తాము వేసిన తొలి ఓవర్లలోనే పెవిలియన్‌కు చేర్చారు. అనంతరం వచ్చిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.