పృథ్వీ షా అచ్చం సచినే! | Twitter Compares Prithvi Shaws Batting style with Sachin | Sakshi
Sakshi News home page

Published Thu, May 3 2018 5:15 PM | Last Updated on Thu, May 3 2018 5:50 PM

Twitter Compares Prithvi Shaws Batting style with Sachin - Sakshi

పృథ్వీషా

హైదరాబాద్‌ : అండర్‌ 19 సూపర్‌ హీరో, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఓపెనర్‌ పృథ్వీషాపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బుధవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ కెరటం 47(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చని విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో షా ఆడిన కొన్ని షాట్‌లు సచిన్‌ను తలపిస్తున్నాయని అభిమానులు వాపోతున్నారు. ఇక షా ప్రదర్శన పట్ల సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

షా ప్రదర్శనపై అభిమానుల కామెంట్స్‌
‘స్ట్రేట్‌ డ్రైవ్ ఆడితే సచిన్‌లా‌.. కవర్‌ డ్రైవ్‌ ఆడితే కోహ్లిలా’  ఉందని ఒకరంటే.. ‘షా ఆడే షాట్స్‌ను కోహ్లి ఆడటం కూడా చూడలేదు.. ఇక్కడ కోహ్లిని తక్కువ చేయడం నాఉద్దేశం కాదు. 90వ దశకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి షా బ్యాటింగ్‌ సచిన్‌ను గుర్తుచేస్తోంది’ అని ఇంకొకరు కామెంట్‌ చేశారు. ‘ ఈ మ్యాచ్‌ జరుగుతుంటే మా అమ్మ ఈ చిన్నపిల్లోడు ఎవరని.. షాను చూపిస్తూ అడిగింది. సచిన్‌లానే ఉన్నాడని చెప్పింది.’  అని మరొకరు తన అభిమానాన్ని చాటుకున్నారు. షా.. సచిన్‌, వినోద్‌ కాంబ్లీల కలయికగా మరికొందరు అభివర్ణిస్తున్నారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో షా అచ్చం ధోనిలా హెలికాప్టర్ షాట్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పిన్న వయసులోనే పలువురి ప్రశంసల అందుకుంటున్న ఈ అండర్‌ 19 స్టార్‌.. టీమిండియా భవిష్యత్‌ ఆశాకిరణమని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: అచ్చం ధోనిలా.. షా!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement