గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోవడం పట్ల ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్వల్ప స్కోరు ఛేదించడంలో తమ బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డాడు. 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్ డెవిల్స్ 4 పరుగుల తేడాతో ఓడింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ... ‘మొదటి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడం కొంప ముంచింది. మేము త్వరగా వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్థికి మ్యాచ్‌పై పట్టు చిక్కింది. పరుగులు బాగానే చేసినప్పటికీ ఎక్కువ వికెట్లు నష్టపోయాం. మా బౌలర్లు ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ పరుగులకే నియంత్రించారు. కానీ మేము త్వరగా వికెట్లను కోల్పోవడవంతో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయాన్ని అందుకోవడం కష్టమేన’ని అన్నాడు.
సానుకూల అంశాల గురించి చెబుతూ.. టాప్ స్కోరర్ శ్రేయస్ అయ్యర్(57)తో పాటు యువ ఆటగాళ్లు పృథ్వీ షా, అవిశ్ ఖాన్ రాణించడం శుభపరిణామమని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ‘అయ్యర్ బాగా ఆడాడు. అవిశ్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. పృథ్వీ షాకు మంచి భవిష్యత్తు ఉంద’ని అన్నాడు. పృథ్వీ షా 10 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. అవిశ్ 4 ఓవర్లలో 36 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment