Prithvi Shaw
-
‘ముంబై ప్లేయర్‌గా అతడికి ఇదే ఆఖరి సీజన్’
పృథ్వీ షా పట్ల ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) తీరు సరిగా లేదని టీమిండియా మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపె విమర్శించాడు. అతడిని బలి చేసేందుకే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తూ లీకులు ఇస్తున్నారని ఎంసీఏ వర్గాలపై మండిపడ్డాడు. ముంబై తరఫున ఇక పృథ్వీ షా దేశవాళీ క్రికెట్ ఆడే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డాడు.కాగా చిన్న వయసులోనే క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పృథ్వీ షా.. సచిన్ టెండుల్కర్ స్థాయికి ఎదుగుతాడంటూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే టీమిండియా తరఫున 18 ఏళ్ల వయసులో అరంగేట్రంలోనే టెస్టు శతకం బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. వరుస మ్యాచ్‌లలో ఆకట్టుకున్నాడు.టీమిండియాలో చోటు కరువుఅయితే, అదే లయను కొనసాగించలేక వెనుకబడిన పృథ్వీ షాకు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ రూపంలో గట్టి పోటీ ఎదురైంది. వారిద్దరు ఆయా ఫార్మాట్లలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పృథ్వీ షాకు జట్టులో స్థానం కరువైంది. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లోనూ అతడికి ఆటంకాలే ఎదురయ్యాయి.క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ సమస్యలు, ఫామ్‌లేమి కారణంగా ఎంసీఏ పృథ్వీ షాను కొన్నాళ్లపాటు పక్కనపెట్టింది. ఫలితంగా తాజా రంజీ సీజన్లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ కుడిచేతం వాటం బ్యాటర్‌కు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అవకాశం వచ్చింది. అయితే, ఈ టోర్నమెంట్లోనూ షా స్థాయికి తగ్గట్లు రాణించలేదు.ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌కు ప్రకటించిన ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. దీంతో.. ‘‘ఇంకెన్ని పరుగులు చేయాలో అర్థం కావడం లేదు దేవుడా!’’ అంటూ పృథ్వీ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు తానే శత్రువుఈ క్రమంలో ఎంసీఏకి చెందిన వ్యక్తి ఒకరు వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ఇలాంటి పోస్టుల వల్ల పృథ్వీకి ఎలాంటి ఉపయోగం ఉండదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. ఫిట్గాలేని పృథ్వీ షా వల్ల తాము పది మంది ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చిందంటూ సదరు వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా.. పృథ్వీ షాకు అస్సలు క్రమశిక్షణ లేదని.. అతడి వల్ల తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. అంతేకాదు.. పృథ్వీకి కొత్తగా శత్రువులు అక్కర్లేదని.. తనకు తానే శత్రువు అని పేర్కొన్నారు.ముంబై తరఫున అతడికి ఇదే ఆఖరి సీజన్ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపె ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘ఎంసీఏ వర్గాల నుంచి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. పృథ్వీ షాకు సహాయం చేయాలనే ఆలోచన వాళ్లకు ఎంతమాత్రం లేదని స్పష్టమవుతోంది. నాకు తెలిసి ముంబై తరఫున పృథ్వీ షాకు ఇదే ఆఖరి సీజన్’’ అని జతిన్ పరాంజపె పేర్కొన్నాడు.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024- ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే (ఫొటోలు)
-
విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్ దూబే (43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.THE SIX HITTING MACHINE - SHIVAM DUBE 🥶 pic.twitter.com/Qy2uhlXKBp— Johns. (@CricCrazyJohns) December 11, 2024అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), సూర్యాంశ్ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. MUMBAI INTO SEMIS OF SMAT...!!!Suryansh Shedge with another masterclass. 🙇♂️👌 pic.twitter.com/6FxuxENHc4— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2024ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్ దూబే, సూర్యాంశ్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సూపర్ ఫామ్‌లో రహానేఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. -
తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం.. ఒక్కసారిగా డబ్బు రాగానే..
క్రికెట్ వర్గాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పృథ్వీ షా. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ వారసుడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబైకర్.. ఇప్పుడు కెరీర్లో చాలా వెనుకబడిపోయాడు. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చినా.. ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడిని పట్టించుకోలేదు.ఫలితంగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు పృథ్వీ. ఇందుకు ప్రధాన కారణం ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణా రాహిత్యమనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్లు పృథ్వీ షాకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని.. కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఘాటుగానే విమర్శిస్తున్నారు.తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం..ఈ నేపథ్యంలో పృథ్వీ షా చిన్ననాటి కోచ్ రాజు పాఠక్.. ఈ బ్యాటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు బయటపెట్టాడు. ‘‘వాళ్ల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏం ఉండేది కాదు. అతడి తండ్రి వ్యాపారం మొదలుపెట్టి నష్టాలపాలయ్యారు. అందువల్ల షా చిన్నప్పటి నుంచి ఇతరుల సాయంపై ఆధారపడేవాడు.అలా ప్రతిదానికి ఇతరుల వద్ద చేయి చాచినట్లుగా ఉండటం మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక అతడికి తల్లి కూడా లేదు. అతడు అంతగా పరిణతి చెందక ముందే ఆమె కన్నుమూసింది. ఎవరికైనా తల్లి ఉంటేనే కదా.. తప్పొప్పుల గురించి సరిగ్గా తెలుస్తుంది. ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానేఎన్ని కష్టాలు ఉన్నా.. ఆటపై దృష్టి పెట్టి చిన్న వయసులోనే విజయవంతమైన క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. చిన్నపుడు డబ్బుల్లేక పేదరికంలో మగ్గిన ఓ కుర్రాడు.. ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానే మారిపోవడం సహజం.అతడు కూడా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకున్నాడు. దాదాపుగా అందరూ ఇదే పని చేస్తారు. తమకు నచ్చినట్లుగా జీవించాలని భావిస్తారు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు కారణంగా కొంతమంది విలాసాలకు అలవాటు పడతారు. పృథ్వీ షా 25 ఏళ్ల కుర్రాడుఅయినా పృథ్వీ షా కేవలం 25 ఏళ్ల కుర్రాడు. అతడిని 40 ఏళ్ల, పరిణతి చెందిన మనిషిగా ఉండాలని కోరుకోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి’’ అని రాజు పాఠక్ పృథ్వీ షాను విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో చోటు కరువుకాగా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పృథ్వీ షా తొలి టెస్టులోనే శతకంతో మెరిశాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోతాడని భావించగా.. శుభ్‌మన్ గిల్‌తో పోటీలో వెనుకబడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున పృథ్వీ షా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు.. ఆయా ఫార్మాట్లలో 339, 189 పరుగులు చేశాడు.ఒకే ఒక్క టీ20 ఆడినప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక గత వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీని ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో ఈసారి వేలానికి ముందే రిలీజ్ చేసింది. ఇక ఐపీఎల్ కెరీర్లో పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 రన్స్ సాధించాడు.చదవండి: ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా! కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్.. -
'23 ఏళ్లకే రూ. 40 కోట్లు సంపాదన.. అదే అతడి కెరీర్‌ను దెబ్బతీసింది'
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసేకునేందుకు ఆసక్తి చూపలేదు.వీటికి తోడు ఈ ముంబై ఆటగాడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ క్రమంలోనే 25 ఏళ్ల పృథ్వీషా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన షా.. తొలిసారి ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.రంజీ జట్టులో కూడా అతడి చోటు ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షాను ఉద్దేశించి ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ హెడ్ కోచ్ ప్రవీణ్ అమ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు. చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చని అమ్రే అభిప్రాయపడ్డాడు."పృథ్వీ షా లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడు చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంటుండటం బాధ కలిగిస్తోంది. ఇప్పటికీ అతడికి ఐపీఎల్లో 30 బంతుల్లో ఫిఫ్టీ కొట్టే సత్తా ఉంది. బహుశా చిన్న వయస్సులోనే తనకు వచ్చిన కీర్తీ, డబ్బును సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చు.భారత క్రికెట్లో అతడి జీవితం ఒక కేస్ స్టడీగా ఉపయోగపడవచ్చు. ప్రతిభ ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లదు. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావం ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలము. అతడికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదు. మూడేళ్ల క్రితమే పృథ్వీకి వినోద్ కాంబ్లీ కోసం ఉదాహరణగా చెప్పాను. కాంబ్లీ పతనాన్ని నేను దగ్గరి నుంచి చూశాను. ఈ తరం కుర్రాళ్లకు కొన్ని విషయాలు నేర్పించడం సులువు కాదు. అతడు 23 ఏళ్ల వయస్సులోనే సుమారుగా రూ. 30-40 కోట్లు సంపాదించి ఉండవచ్చు. ఐఐఎమ్ గ్రాడ్యుయేట్ కూడా అంత సంపాదించరేమో!.అందుకు అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ధన్యవాదాలు తెలపాలి. అయితే చిన్నవయస్సులో అంత మొత్తం సంపాందించినప్పుడు, కచ్చితంగా దృష్టి మళ్లే అవకాశముంటుంది. అతడు ఈ ఐపీఎల్ వేలాన్ని సానుకూలంగా తీసుకుంటాడని ఆశిస్తున్నాను.ఇది అతడికి ఒక కనువిప్పు లాంటిది. షాకు ఇంకా చాలా వయస్సు ఉంది. అతడికి ప్రస్తుతం కేవలం 25 ఏళ్ల మాత్రమే అని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా పేర్కొన్నాడు.చదవండి: ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్ -
‘అతడిని లారా, సచిన్ అన్నారు.. ఒక్కరు కన్నెత్తి చూడలేదు.. తగిన శాస్తే’
‘‘అతడొక అద్భుతమైన పిల్లాడు. కానీ తనని అందరూ అపార్థం చేసుకునేందుకు అన్ని విధాలా ఆస్కారం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటి కుదుపు ఒకటి అవసరం. షాక్ తగలాల్సిందే. అతడు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత ప్రతిభావంతమైన బ్యాటర్ అని కితాబులు అందుకుంటూ పెరిగాడు.ప్రపంచంలో సచిన్, కోహ్లి తర్వాత ఎంఆర్ఎఫ్ బ్యాట్‌ను సొంతం చేసుకున్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నాడు. కొంతమంది అతడిని లారా అన్నారు. మరికొందరేమో మరో సచిన్ అని కీర్తించారు. ముంబై క్రికెట్ మొత్తం అతడి గురించే మాట్లాడేది. సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలను ముంబై అందించింది.అతడు కూడా వారి స్థాయికి ఎదుగుతాడని అంతా భావించారు. కానీ.. పృథ్వీకి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఇలా జరగాల్సిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో అతడికి కాంట్రాక్టు ఉండేది. కానీ ఇప్పుడు అసలు తన పేరే ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ అన్నాడు. భారత క్రికెటర్ పృథ్వీ షాను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలిఇప్పటికైనా పృథ్వీ కఠినంగా శ్రమించి.. మునుపటి కంటే గొప్పగా తిరిగి రావాలని పార్థ్ జిందాల్ ఆకాంక్షించాడు. ఫిట్నెస్ సాధించడంతో పాటు క్రమశిక్షణతో మెలుగుతూ పృథ్వీ షా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పాలని అతడిని ఉద్దేశించి ఇండియా టుడేతో స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. అయితే, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా క్రమక్రమంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్ల రాకతో ఓపెనర్‌గా మళ్లీ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు.. ఐపీఎల్‌లోనూ మంచి ఆరంభమే అందుకున్నా.. ఇప్పుడు కనీస ధరకు కూడా అమ్ముడుపోని దుస్థితికి చేరుకున్నాడు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలంలో పృథ్వీ షా రూ. 75 లక్షలకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడి వైపు కన్నెత్తి చూడలేదు. ఆరంభం నుంచి అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ కూడా పృథ్వీని మొత్తానికే వదిలించుకుంది.క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్లేమిముంబై క్రికెట్ జట్టులోనూ పృథ్వీ షాకు సుస్థిర స్థానం లేదు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌లేమి ఇందుకు కారణాలు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శల వర్షం కురుస్తుండగా.. పార్థ్ జిందాల్ పైవిధంగా స్పందించాడు. కాగా 2018లో ఐపీఎల్లో ఢిల్లీ తరఫున అడుగుపెట్టిన పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్-2024లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడి సేవల కోసం ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. కానీ పూర్తిగా నిరాశపరచడంతో వేలానికి ముందు విడిచిపెట్టింది.చదవండి: వేలంలో అమ్ముడుపోలేదు.. ఇక్కడేమో అత్యంత చెత్త రికార్డుతో శార్దూల్!.. రహానే దంచికొట్టినా.. -
'నేను చూసిన టాలెంటెడ్ ప్లేయర్లలో అతడొకడు.. మళ్లీ తిరిగి వస్తాడు'
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. క్రమశిక్షణరాహిత్యం,ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న పృథ్వీ షా.. ఇప్పుడు ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా కోల్పోయాడు.ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.తన కెరీర్ ఆరంభంలో జానియర్ సచిన్ టెండూల్కర్ పేరొందిన పృథ్వీ షాకు ఇప్పుడు కనీసం ఫ్రాంచైజీ క్రికెట్లో కూడా ఆడే ఛాన్స్ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే వేలంలో అమ్ముడుపోకపోవడంతో పృథ్వీ షాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మహ్మద్ కైఫ్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం పృథ్వీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాటింగ్ మాత్రం ఈ ముంబై ఆటగాడికి మద్దతుగా నిలిచాడు."ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ అన్‌సోల్డ్‌గా మిగిలడం నిజంగా చాలా బాధాకరం. నా కోచింగ్ కెరీర్లో ఇప్పటివరకు నేను పనిచేసిన టాలెంటెడ్ క్రికెటర్లలో పృథ్వీ ఒకడు. కనీసం అతడు యాక్సిలరేటర్ రౌండ్‌లోనైనా అమ్ముడుపోతాడని నేను భావించాను. కానీ అది కూడా జరగలేదు.అయితే వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలినప్పటికీ అన్ని ఫ్రాంచైజీల కళ్లు అతడిపైనే ఉన్నాయి. అతడి నుంచి ఆటను ఎవరూ దూరంగా ఉంచలేరు. కచ్చితంగా పృథ్వీ మళ్లీ తిరిగివస్తాడని నేను భావిస్తున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.కాగా రికీ పాటింగ్తో పృథ్వీషాకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఆరేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కలిసి పనిచేశారు. ఐపీఎల్-2018 సీజన్ నుంచి ఈ ఏడాది సీజన్ వరకు ఢిల్లీ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్ పనిచేయగా.. పృథ్వీ షా ఆటగాడిగా కొనసాగాడు.చదవండి: IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్ వైరల్ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్‌అయితే, ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
ఓరీతో చహల్, పృథ్వీ షా.. ఫొటోలు వైరల్
-
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం ఇరగదీశాడు! ఎవరంటే?
ఇంగ్లండ్ దేశీవాళీ వన్డే కప్-2024లో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాడ్లెట్ క్రికెట్ క్లబ్ వేదికగా మిడిలెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పృథ్వీ షా.. మిడిలెక్స్‌తో మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 58 బంతులు ఎదుర్కొన్న షా.. 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 76 పరుగులు చేసి ఔటయ్యాడు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పృథ్వీతో పాటు గాస్ మిల్లర్(73), జైబ్(58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పృథ్వీ షా విషయానికి వస్తే.. దాదాపుగా మూడేళ్ల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యల కారణంగా భారత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశీవాళీ క్రికెట్లో కూడా తన మార్క్‌ను చూపించడంలో షా విఫలమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతడి ప్రదర్శన అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ తరపున షా 8 ఇన్నింగ్స్‌లలో 198 పరుగులు మాత్రమే చేశాడు. 10.5 | That's 50 for Prithvi Shaw! 👏The opener brings up his half-century off 33 balls.Steelbacks 75/2.Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/JlIYPxjAjl— Northamptonshire Steelbacks (@NorthantsCCC) July 29, 2024 -
DC Vs GT: ఇదేమి అంపైరింగ్.. పృథ్వీ షాది ఔటా? నాటౌటా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో మరోసారి థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. ప్రస్తుతం పృథ్వీ షా ఔట్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.అసలేం జరిగిందంటే?ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన సందీప్ వారియర్ ఐదో బంతిని పృథ్వీ షాకు షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు. ఆ బంతిని పృథ్వీ షా పుల్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి నూర్ అహ్మద్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.దీంతో గుజరాత్ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ ఫీల్డ్ అంపైర్లు క్లీన్ క్యాచ్ అవునా కాదా అనే సందేహంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి బంతి కింద చేతి వేళ్లు ఉన్నయాని తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే రిప్లేలో బంతి గ్రౌండ్‌కు టచ్ అయినట్లు కన్పించినప్పటికి అంపైర్ మాత్రం క్లీన్ క్యాచ్‌గా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.కామెంటెటర్లు ఆకాష్ చోప్రా, పార్థివ్ పటేల్ సైతం క్యాచ్‌ను అందుకునే సమయంలో బంతి నేలను తాకిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు చెత్త అంపైరింగ్.. అది క్లియర్‌గా నాటౌట్ అని కామెంట్లు చేస్తున్నారు. Woah 🔥🔥Noor Ahmad holds on to a sharp catch in the deep as #DC lose both their openers!Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvGT pic.twitter.com/8zmIDwCdf2— IndianPremierLeague (@IPL) April 24, 2024 -
ఖరీదైన ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ‘డ్రీమ్ హౌజ్’ చూశారా? (ఫోటోలు)
-
లగ్జరీ ఫ్లాట్ కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్.. కోట్లు పెట్టి మరీ ఇలా!
టీమిండియా బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పృథ్వీ షా ఖరీదైన ఇల్లు కొన్నాడు. దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బాంద్రాలో సముద్ర ముఖంగా ఉన్న ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన లగ్జరీ ఫ్లాట్‌కు సంబంధించిన ఫొటోలను పృథ్వీ షా మంగళవారం షేర్ చేశాడు. ‘‘నాకంటూ ఓ సొంత ప్రదేశం. అందుకోసం ఎంతగానో శ్రమించి ఇప్పుడు ఇలా ఇక్కడ అడుగుపెట్టడం ఎంతో ప్రత్యేకం. ఈ ప్లేస్ గురించి కలలగనడం.. ఇప్పుడు ఇక్కడ వాటిని నిజం చేసుకోవడం.. నాకంటూ సొంత ఇల్లు.. స్వర్గం లాంటిది! ఇక ముందు అంతా మంచే జరగాలి’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ రాశాడు పృథ్వీ షా. ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా టీమిండియా ఓపెనర్‌గా అరంగేట్రంలోనే అదరగొట్టిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. ఆ తర్వాత తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అనంతరం దేశవాళీ క్రికెట్లో అదరగొట్టినా మళ్లీ సెలక్టర్ల పిలుపు అందుకోలేకపోయాడు. ఇక ఇటీవల గాయంతో సతమతమైన పృథ్వీ షా రంజీ బరిలో దిగి.. ముంబై ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్‌తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 119 పరుగులు సాధించాడు. కాగా ఢిల్లీ ఫ్రాంఛైజీ పృథ్వీ షా కోసం రూ. 8 కోట్లు చెల్లించింది. చదవండి: #Klaasen: గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో -
కళ్లు చెదిరే యార్కర్ వేసిన బుమ్రా.. పృథ్వీ షాకు ఫ్యూజులు ఔట్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో కళ్లు చెదిరే యార్కర్ సంధించాడు. ఈ బంతిని ఎదుర్కోలేక బ్యాటర్ పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన ఈ సూపర్ యార్కర్‌కు షా వద్ద సమాధానం లేకుండా పోయింది. అతనితో సహా మ్యాచ్ చూస్తున్న వారందరికీ ఈ యార్కర్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. YORKER OF IPL 2024. 🤯💥 - Jasprit Bumrah, the GOAT. 🐐 pic.twitter.com/PtfUrFbYNH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో షా అద్భుతమైన టచ్‌లో ఉన్నప్పుడు బుమ్రా తన మార్కు మ్యాజిక్ చేశాడు. ఫలితంగా ఢిల్లీ కష్టాల్లో పడింది. బుమ్రా సూపర్ యార్కర్‌కు సంబంధించిన వీడియో నెట్టంట వైరలవుతుంది. షాను ఔట్ చేసిన అనంతరం బుమ్రా మరోసారి విజృంభించాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ పోరెల్‌ను (41) కూడా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఢిల్లీ కష్టాలు తీవ్రమయ్యాయి. 15 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్ 144/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవాలంటే 30 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది. ట్రిస్టన్ స్టబ్స్ (26), రిషబ్ పంత్ క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్లో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. -
అతడు చాలా బాధపడ్డాడు.. అందుకే చెలరేగిపోయాడు: సెహ్వాగ్
ఐపీఎల్-2024 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఘనంగా ఆరంభించాడు. ఈ ఏడాది సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన పృథ్వీ షా.. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌కు ఢిల్లీ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని పృథ్వీ షా సద్వినియోగ పరుచుకున్నాడు. షా అద్బుతమైన ఇన్నింగ్స్‌తో ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు,2 సిక్స్‌లతో అతడు 43 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఢిల్లీ జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ ముంబైకర్. ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా తనలో ఉన్న బాధనంతా తన ఇన్నింగ్స్ రూపంలో చూపించాడని సెహ్వాగ్ అన్నాడు. "ప్రతీ టీమ్ మేనేజ్మెంట్ తమ ఆటగాడు రిథమ్‌లో ఉన్నాడా లేదా నెట్స్‌లో ఎప్పుడూ పరిశీలిస్తుంటుంది. ఈ ఇన్నింగ్స్ పృథ్వీకి చాలా ముఖ్యమైనది. గత సీజన్లో కూడా పెద్దగా జట్టులో షా కన్పించలేదు. ఈ ఏడాది సీజన్లో కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. ఈ విషయంలో అతడు బాధపడి ఉండవచ్చు. అందుకే తన బాధను ఆట రూపంలో చూపించాడని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
'అతడొక విధ్వంసకర ఆటగాడు.. మీరు అలా చేయడం కరెక్ట్ కాదు'
ఐపీఎల్-2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. గురువారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగులతో తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. కాగా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పృథ్వీ షాకు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్‌కు ఢిల్లీ జట్టు మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. ఈ క్రమంలో పృథ్వీ షాను కేవలం బెంచ్‌కే పరిమితం చేయడాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తప్పుబట్టాడు. "పృథ్వీ షా అద్భుతమైన ఆటగాడు. అతడికి అంతర్జాతీయ స్ధాయిలో ఆడిన అనుభవం ఉంది. ఆటువంటి ఆటగాడిని డగౌట్లో ఎందుకు కూర్చునిబెట్టారో నాకు ఆర్ధం కావడం లేదు. గత సీజన్లో అతడు బాగా రాణించకపోవచ్చు. కానీ అతడు చాలా డేంజరస్ క్రికెటర్. కాబట్టి అతడికి అవకాశాలు ఇవ్వాలి. అంతే తప్ప డగౌట్లో కూర్చోనిబెడితే పరుగులు చేయలేడు కదా" అని మూడీ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు. కాగా గతేడాది సీజన్లో షా దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2023లో పృథ్వీ షా ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 13.25 సగటుతో కేవలం 106 పరుగులు మాత్రమే చేసాడు. అయితే అంతకుముందు సీజన్లలో మాత్రం పృథ్వీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాగా తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా పృథ్వీ షాకు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. -
IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు!
టీమిండియాలోకి మెరుపులా వచ్చి మాయమైన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ముంబై బ్యాటర్ పృథ్వీ షా కూడా ఆ కోవకు చెందినవాడేనని చెప్పవచ్చంటారు విశ్లేషకులు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి దిగ్గజాలను మెప్పించిన పృథ్వీ.. ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గా పేరొందాడు. ఈ క్రమంలో 2018లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ(134)తో అలరించాడు. ఆ తర్వాత రెండేళ్లకు పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేక శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌తో పోటీలో వెనుకబడి టీమిండియాకు దూరమయ్యాడు. ఆఖరిగా శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడిన పృథ్వీ షా.. ఐపీఎల్-2023 సీజన్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2023-24 టోర్నీలో మాత్రం ఫర్వాలేదనిపించాడు. మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన అతడు.. ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో 159 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ మూడంకెల స్కోరును అందుకోలేకపోయినా.. ట్రోఫీ గెలిచిన జట్టులో మాత్రం సభ్యుడిగా ఉన్నాడు పృథ్వీ షా. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024కు రెట్టించిన ఉత్సాహంతో సిద్దమయ్యాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పృథ్వీ షా ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తన ఆట తీరులో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. బ్యాట్ ఝులిపించగలిగితేనే మునుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో పరుగులు రాబట్టడం పృథ్వీ షాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా ఎంతో కీలకం. వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా పృథ్వీ రాణిస్తేనే మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతుంది’’ అని ఆస్ట్రేలియా తరఫున రెండుసార్లు వరల్డ్‌కప్ గెలిచిన బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024తో రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్‌గా పునరాగమనం చేయనున్నాడు. తాజా ఎడిషన్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ..
Shreyas Iyer named in Mumbai squad: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆంధ్రతో మ్యాచ్‌లో ఆడిన ఈ ముంబై బ్యాటర్.. తాజాగా సెమీ ఫైనల్ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తప్పక రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుతో సెమీస్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు ఇచ్చినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అజింక్య రహానే సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. కాగా ముంబై- తమిళనాడు మధ్య మార్చి 2 నుంచి రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. వెన్ను నొప్పి అని చెబితే ఎన్సీఏ మాత్రం అలా ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అయ్యర్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆడి మొత్తంగా కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో మూడో టెస్టు నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగాలన్న బీసీసీఐ నిబంధన నుంచి తప్పించుకునేందుకు వెన్నునొప్పిని కారణంగా చూపాడు. అయితే, జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఆడకూడదనే శ్రేయస్ అయ్యర్ ఇలా చేసి ఉంటాడని.. ఈ నేపథ్యంలో అతడిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించే యోచనలో ఉందని వదంతులు వ్యాపించాయి. అయితే, తాజాగా తాను ఫిట్‌గా ఉన్నానంటూ అయ్యర్ రంజీల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. తమిళనాడుతో సెమీస్‌కు ముంబై జట్టు: అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, భూపేన్ లాల్వానీ, అమోగ్ భత్కల్, ముషీర్ ఖాన్, ప్రసాద్ పవార్, హార్దిక్ తామోర్, శార్దూల్ ఠాకూర్, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్, ఆదిత్య ధుమాల్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, రాయ్స్టన్ డయాస్, ధావల్ కులకర్ణి. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? రోహిత్ వ్యాఖ్యలపై టీమిండియా దిగ్గజం స్పందన -
మెరిసిన పృథ్వీ షా.. పోరాటం చేస్తున్న మయాంక్ అగర్వాల్
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెమీస్ బెర్త్‌లు ఖరారు కాగా.. మరో రెండు బెర్త్‌ల భవితవ్యం రేపటి లోగా తేలిపోనుంది. సౌరాష్ట్రపై గెలిచి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్‌పై గెలిచి మధ్యప్రదేశ్ సెమీస్‌కు అర్హత సాధించగా.. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా అమీతుమీ తేల్చుకుంటున్నాయి. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ ఆథిక్యం సాధించి పటిష్ట స్థితిలో ఉండగా.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక పోరాడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల లీడ్‌లో ఉండగా.. 371 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కర్ణాటకకు గెలుపు ఛాలెంజ్‌లా మారింది. మరో రోజు ఆట మిగిలుండగా.. కర్ణాటక లక్ష్యానికి ఇంకా 268 పరుగుల దూరంలో ఉంది. కర్ణాటకను గెలిపించేందుకు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పోరాటం చేస్తున్నాడు. మెరిసిన పృథ్వీ షా.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్) హార్దిక్ తామోర్ (114), పృథ్వీ షా (87) సత్తా చాటడంతో ముంబై పటిష్ట స్థితికి చేరింది. ముంబై తొలి ఇన్నింగ్స్ 384 (ముషీర్ ఖాన్ 203 నాటౌట్, భార్గవ్ భట్ 7/112) బరోడా తొలి ఇన్నింగ్స్ 348 (షశ్వత్ రావత్ (124, సోలంకి 136, షమ్స్ ములానీ 4/121) ముంబై సెకెండ్ ఇన్నింగ్స్ 379/9 (హార్దిక్ తామోర్ 114, పృథ్వీ షా 87, భార్గవ్ భట్ 7/142) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల ఆధిక్యంలో ఉంది పోరాడుతున్న మయాంక్.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగార్వల్ పోరాటం చేస్తున్నాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ 460 (అథర్వ తైడే 109, కావేరప్ప 4/99) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 286 (నికిన్ జోస్ 82, యాశ్ ఠాకూర్ 3/48) విదర్భ రెండో ఇన్నింగ్స్ 196 (దృవ్ షోరే 57, కావేరప్ప 6/61) కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 103/1 (మయాంక్ అగర్వాల్ 61 నాటౌట్, సర్వటే 1/10) ఈ మ్యాచ్‌లో కర్ణాటక విజయం సాధించాలంటే మరో 268 పరుగులు చేయాలి -
టీమిండియా ఓపెనర్ అరుదైన రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
టీమిండియా ఓపెనర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో పృథ్వీ షా చెలరేగాడు. 107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 185 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 159 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పృథ్వీ షా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి రోజు లంచ్‌కు ముందే కెరీర్లో రెండు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో అసోంపై 379 బంతుల్లో 383 పరుగులు చేసిన పృథ్వీ.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అప్పుడు కూడా మొదటి రోజు లంచ్‌కు ముందే సెంచరీని నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 351 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో భూపేన్ లల్వాణీ (102) పరుగులతో రాణించాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో ఆశిష్ చౌహాన్ 6 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రవి కిరణ్ మూడు, మాలిక్ ఒక్క వికెట్ సాధించాడు. -
రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం
Ranji Trophy 2023-24: ముంబై బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమనంలో ధనాధన్ శతకంతో సత్తా చాటాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా దాదాపు ఆరు నెలల విరామం తర్వాత పృథ్వీ షా మళ్లీ మైదానంలో దిగాడు. గతేడాది ఆగష్టులో మోకాలి నొప్పి కారణంగా దేశవాళీ క్రికెట్‌కూ దూరమైన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకున్న పృథ్వీ షా.. నెట్స్‌లో కఠిన శ్రమకోర్చి.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఎన్సీఏలో పునరావాసం పొంది ఈ క్రమంలో రిటర్న్ టు ప్లే సర్టిఫికెట్ సంపాదించి రంజీ ట్రోఫీ-2024 సీజన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. బెంగాల్‌తో మ్యాచ్ సందర్భంగా పునరాగమనం చేసిన పృథ్వీ.. తన మొదటి మ్యాచ్‌లో 35 పరుగులకే పరిమితమయ్యాడు. తాజాగా.. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌తో మొదలైన మ్యాచ్‌లో సెంచరీతో మెరవడం విశేషం. రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ పృథ్వీ షా.. 107 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. పదమూడో సెంచరీ మరో ఓపెనర్ భూపేన్ లల్వాణీ 37 పరుగులతో ఆడుతున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో భాగంగా 32 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేసింది. ఇక పృథ్వీ షాకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది పదమూడో సెంచరీ కావడం విశేషం. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పృథ్వీ షా ఓపెనర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే, శుబ్‌మన్ గిల్‌తో ఎదురైన పోటీలో వెనుకబడ్డ అతడు.. మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా తరఫున ఆఖరి టీ20 ఆడాడు పృథ్వీ షా. ఇక భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ అయిన పృథ్వీ షా సారథ్యంలో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ తదితరులు ఆడటం విశేషం. చదవండి: Ind vs Eng: కేఎస్ భరత్‌కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు! -
ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్ రీఎంట్రీ..
Ranji Trophy 2023-24- Mumbai: టీమిండియా ఓపెనర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు మైదానంలో దిగనున్నాడు. సుమారు ఆరు నెలల విరామం తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించి రంజీ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది ఆగష్టులో పృథ్వీ షా గాయపడ్డాడు. మెకాలి నొప్పి కారణంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అతడు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఇప్పట్లో రాడంటూ వార్తలు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ క్రమక్రమంగా కోలుకున్నాడు. అయితే, పృథ్వీ షాకు ఇప్పట్లో రిటర్న్ టు ప్లే(ఆర్టీపీ) సర్టిఫికెట్ లభించకపోవచ్చనే వార్తలు వినిపించాయి. దీంతో మరికొన్నాళ్లపాటు అతడు ఆటకు దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ పృథ్వీ షా గురించి అప్డేట్ అందించాయి. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేశాయి. ‘‘బీసీసీఐ జాతీయ అకాడమీ పృథ్వీ షాకు ఆర్టీపీ సర్టిఫికెట్ జారీ చేసింది. బుధవారమే దీనిని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు కూడా పంపించింది. ఎన్సీఏ నెట్స్‌లో అతడు బాగా ప్రాక్టీస్ చేశాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. సెలక్ట్ చేశామన్న సెక్రటరీ మరోవైపు.. ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అజింక్య నాయక్ పృథీ షా రీఎంట్రీని ధ్రువీకరించాడు. షాను జట్టులో చేర్చామని.. ముంబై తరఫున తదుపరి మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా అజింక్య రహానే కెప్టెన్సీలో ఫిబ్రవరి 2 నుంచి ముంబై.. బెంగాల్‌తో మ్యాచ్ మొదలుపెట్టనుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ ఇందుకు వేదిక. కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్‌గా పేరొందిన పృథ్వీ షా టీమిండియాలో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా ఛాన్స్‌లు దక్కించుకోలేకపోయాడు. ఇక షా సారథ్యంలో ఆడిన శుబ్‌మన్ గిల్ టీమిండియాలో రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా పాతుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
టీమిండియాలో రీఎంట్రీకి కసరత్తు: కెప్టెన్‌గా అజింక్య రహానే
Ranji Trophy 2023-24: రంజీ ట్రోఫీ-2024 సీజన్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. భారత యువ ఓపెనర్ పృథ్వీ షా గాయం నుంచి కోలుకోని కారణంగా అతడికి ఈ జట్టులో చోటు దక్కలేదు. మోకాలి నొప్పితో బాధపడుతున్న పృథ్వీ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అదే విధంగా.. గత ఎడిషన్‌లో ముంబై తరఫున ఆడిన టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి జట్టుతో లేరు. యశస్వి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉండగా.. సూర్య చీలమండ గాయంతో ఆటకు విరామం ఇచ్చాడు. ఇక సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ముగించుకుని తిరిగి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండేలతో పాటు గత సీజన్లో ఆడిన శివం దూబే సువేద్ పార్కర్, షామ్స్ ములాని, ధవళ్ కులకర్ణి ఈసారి కూడా ముంబై తరఫున మరోసారి బరిలోకి దిగనున్నారు. బిహార్‌తో తొలి మ్యాచ్ రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ముంబై తమ తొలి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడనుంది. జనవరి 5న జరుగనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు పాట్నాలోని మొయిన్ ఉల్ హక్ స్టేడియం ఇందుకు వేదిక. ఇక జనవరి 12 నాటి రెండో మ్యాచ్‌లో ముంబై ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది. 39 టైటిళ్లు సాధించిన ఘనత దేశవాళీ టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు జరిగిన 88 రంజీ ఎడిషన్లలో 39సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబైకి గొప్ప రికార్డు ఉంది. అయితే, 2014 నుంచి ఇప్పటి దాకా ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేదన్న వెలితి అలాగే ఉండిపోయింది. గత సీజన్లో రహానే సారథ్యంలో ఆడిన ముంబై.. ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచింది. నాకౌట్స్‌కు కూడా అర్హత సాధించలేక చతికిలపడింది. అయితే, ఈసారి ఎలాగైనా ఆ అడ్డంకిని అధిగమించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. రంజీల్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని రహానే భావిస్తున్నాడు. రంజీ ట్రోఫీ-2024 తొలి రెండు మ్యాచ్‌లకు ముంబై జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, సువేద్ పార్కర్, షామ్స్ ములాని, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), ప్రసాద్ పవార్(వికెట్ కీపర్), జే బిస్టా, భూపేన్ లల్వానీ, తనూష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, ధవళ్ కులకర్ణి, రాయ్స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్. చదవండి: కోహ్లికి బౌలింగ్ చేయడం చాలా కష్టం.. లిస్టులో సచిన్ కూడా! కానీ.. -
సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు..
ఓ ప్లేయర్ అద్భుతంగా ఆడుతూ ఉంటే.. ఆ క్రీడలో దిగ్గజాలతో పోలిక పెట్టి మాట్లాడుతూ విశ్లేషణలు సహజం. అయితే, కొన్నిసార్లు ఆ పోలిక వాళ్లకు చేకూర్చే మేలు కంటే.. నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది టీమిండియా యువ క్రికెటర్ల విషయంలో ఇలాగే జరిగింది. ప్రస్తుతం.. అంతర్జాతీయ టీ20లలో రింకూ సింగ్ అదరగొడుతున్న తరుణంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో అతడి ఆట తీరును పోలుస్తున్నారు విశ్లేషకులు. ధోని స్టైల్లో మ్యాచ్ ముగిస్తున్న తీరుకు ఫిదా అవుతూ నయా ఫినిషర్ వచ్చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇప్పుడే ధోని వారసుడిగా ట్యాగ్ వేసి రింకూపై ఒత్తిడి పెంచొద్దనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతున్న రింకూపై ఇలాంటి ప్రశంసలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. హార్దిక్ వారసుడంటూ.. గతంలో వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా విషయంలో ఇలాంటి పోలికలు కొంపముంచాయంటూ వారి పేర్లను ఉదాహరిస్తున్నారు. కాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ 2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడంటూ ప్రశంసల వర్షం కురిసింది. గాయాల బెడదతో సతమతమవుతున్న పాండ్యా కెరీర్ సందిగ్దంలో పడిన సమయంలో వెంకటేశ్ అతడి వారసుడిగా భారత జట్టులో చోటు ఖాయం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జట్టులో చోటే కరువు కానీ.. పాండ్యా రీఎంట్రీ ఇచ్చి.. వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగిన తర్వాత వెంకటేశ్ అయ్యర్‌కు జట్టులో స్థానమే కరువైంది. గతేడాది ఫిబ్రవరిలో చివరగా వెంకటేశ్ టీమిండియా తరఫున ఆడాడు. సచిన్ అంతటి వాడవుతాడు ఇక పృథ్వీ షా.. ఈ ముంబై బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సమయంలోనే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్తో పోలిక తెచ్చారు విశ్లేషకులు. భవిష్యత్తులో కచ్చితంగా టీమిండియా ఓపెనర్‌గా అద్భుతాలు చేస్తాడని ఈ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌ను కొనియాడారు. తన కెప్టెన్సీలో ఆడిన వాళ్లు స్టార్లు.. అతడేమో ఇలా కానీ.. సీన్ రివర్స్ అయింది.. పృథ్వీ కెప్టెన్సీలో ఆడిన శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ భారత జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా శుబ్‌మన్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా పాతుకుపోయి.. భావి భారత జట్టు కెప్టెన్‌గా, తదుపరి సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, పృథ్వీ షాకు టీమిండియాలో ఎంట్రీ కాదు.. కనీసం ఐపీఎల్లో అయినా స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు దక్కడం లేదు. వరుస వైఫల్యాలతో చతికిలపడ్డ పృథ్వీని గాయాలు వేధిస్తుండటంతో దెబ్బమీద దెబ్బ పడుతోంది. అతడు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు రింకూ విషయంలో ఇలా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ సింగ్. అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మేనేజ్మెంట్ దృష్టిలో పడటంతో అతడి దశ తిరిగింది. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా స్థాయికి ఇంటింటికీ సిలిండర్లు మోస్తూ తండ్రి సంపాదిస్తే.. తాను స్వీపర్‌గా పనిచేసేందుకు కూడా సిద్ధపడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్న రింకూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆటను మాత్రం వీడలేదు. అంచెలంచెలుగా ఎదిగి తాజా ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలపించిన తీరు నభూతో అనిపించింది. ఈ క్రమంలో.. 2023, ఆగష్టులో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. నయా ఫినిషర్‌గా కితాబులు ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న రింకూ.. మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడి 216.95 స్ట్రైక్‌రేటుతో 128 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనితో పోలిక తెస్తూ రింకూ ఆట తీరును కొనియాడుతూ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే వన్డే క్రికెట్లోనూ అతడు అడుగుపెడతాడని జోస్యం చెబుతున్నారు. పోలికలు వద్దు.. మద్దతు ముఖ్యం అయితే, మరికొంత మంది మాత్రం.. రింకూను ఇప్పుడు ప్రశంసిస్తున్న వాళ్లు కష్టకాలంలో అతడికి అండగా నిలబడితే చాలని.. పోలికలకు బదులు నైతికంగా మద్దతునివ్వడం అతి ముఖ్యమని పేర్కొంటున్నారు. రింకూ ధోని స్థాయికి ఎదిగే సత్తా ఉన్నవాడే అయినా కెరీర్ ఆరంభంలోనే పోలికలు తెచ్చి అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచొద్దని హితవు పలుకుతున్నారు. కాగా పటిష్ట ఆసీస్‌తో ఇప్పటి వరకు ఆడిన రెండు టీ20లలో రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా.. 22(14 బంతుల్లో), 31(9 బంతుల్లో) పరుగులు సాధించాడు. చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్ -
IPL 2024: ఢిల్లీ వదిలించుకున్న ఆటగాళ్లు వీరే.. పృథ్వీ షా కొనసాగింపు
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తంగా 11 మందిని విడుదల చేసి, 16 మందిని కొనసాగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. రోవ్‌మన్ పావెల్ రిలీ రొస్సో మనీష్ పాండే సర్ఫరాజ్ ఖాన్ చేతన్ సకారియా ఫిల్ సాల్ట్ ముస్తాఫిజుర్ రెహమాన్ కమలేష్ నాగర్కోటి రిపల్ పటేల్ అమన్ ఖాన్ ప్రియమ్ గార్గ్ ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ముఖేష్ కుమార్, యశ్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, అభిషేక్ పోరెల్, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి. -
IPL 2024: పృథ్వీ షాకు బిగ్ షాక్ ఇవ్వనున్న ఢిల్లీ..!
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విధ్వంసకర ఓపెనర్ పృథ్వీ షాను విడిచిపెట్టాలని ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయించకున్నట్లు సమాచారం. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కే పృథ్వీ షా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 సీజన్లో ఐపీఎల్లో అడుగుపెట్టిన పృథ్వీ షా.. ఢిల్లీ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్నాడు. తన మొదటి మూడు సీజన్లలో పర్వాలేదన్పించిన ఈ ఢిల్లీ యువ ఓపెననర్.. ఆఖరి సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో 8 మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. చదవండి: World Cup 2023: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి? -
టీమిండియా స్టార్ ఓపెనర్‌కు షాక్.. ఏకంగా 3-4 నెలల పాటు..
Huge Blow For Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అభిమానులకు చేదు వార్త! ఈ ముంబై బ్యాటర్ ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా.. 2018లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ(134)తో అదరగొట్టిన షా.. రెండేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కుదిరేలా లేదని.. అక్కడికెళ్లాడు అయితే, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. రెండేళ్ల నుంచి పృథ్వీ షాకు జట్టులో చోటే కరువైంది. ఒకవేళ టీమిండియాకు సెలక్ట్ అయినా.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్న షా.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్-2023లో అద్భుతాలు చేశాడు. సెంచరీల మోత.. వెక్కిరించిన దురదృష్టం ఆఖరిగా ఆడిన రెండు మ్యాచ్‌లలో డబుల్ సెంచరీ(244)తో పాటు అజేయ శతకం(125- నాటౌట్)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో గాయం రూపంలో షాను దురదృష్టం వెంటాడింది. జాతీయ క్రికెట్ అకాడమీలో దీంతో భారత్‌కు తిరిగి వచ్చిన పృథ్వీ షా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అయితే, మోకాలి గాయం తీవ్రతరమైనందున అతడు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఉబ్బిపోయిన మోకాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘పృథ్వీ షా గాయపడిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఆ తర్వాత అతడు ఎన్సీఏకు వచ్చాడు. మోకాలు పూర్తిగా ఉబ్బిపోయింది. డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో షాకు చికిత్స అవసరమని భావించాం. గరిష్టంగా ఇంకో నాలుగు నెలల పాటు అతడు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే 23 ఏళ్ల పృథ్వీ షా మోకాలికి సర్జరీ చేయాలా లేదా అన్న అంశంపై నిర్నయం తీసుకుంటామని తెలిపారు. దేశవాళీ క్రికెట్‌కు దూరం దీంతో.. వచ్చే నెలలో మొదలుకానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబరులో ఆరంభం కానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ, జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడు. వాళ్ల నుంచి షాకు గట్టిపోటీ కాగా ఇప్పటికే టీమిండియా ఓపెనర్‌గా పృథ్వీ షా ఒకప్పటి డిప్యూటీ శుబ్‌మన్ గిల్ స్థిరపడిపోగా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ రూపంలో ఈ ముంబై బ్యాటర్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌లో అదరగొట్టి.. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకుని.. కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావించిన పృథ్వీ షాను విధి ఇలా వెక్కిరించింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్‌తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్‌తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్‌లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్‌కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్‌లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్‌కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్‌కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్‌గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్‌లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్‌లో. మరోవైపు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్‌ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్‌తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్‌షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
భీకర ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాకు గాయం.. అర్ధాంతరంగా నిష్క్రమణ
టీమిండియా యువ ఓపెనర్, నార్తంప్టన్‌షైర్ స్టార్ ఆటగాడు పృథ్వీ షా రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా నిష్క్రమించాడు. ఈ టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో పాటు సుడిగాలి సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉండిన షా.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ముందుగా అనుకున్న దాని కంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షా జట్టు నుంచి వైదొలిగాడు. నార్తంప్టన్ యాజమాన్యం షాను అయిష్టంగా జట్టును నుంచి రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని ఆ జట్టు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇది నిజంగా బాధాకరం.. రాయల్ లండన్ వన్డే కప్ తదుపరి మ్యాచ్‌లకు పృథ్వీ షా అందుబాటులో ఉండడు. డర్హమ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ షా గాయపడ్డాడు. ఈ టోర్నీలో లిడింగ్ రన్ స్కోరర్ (4 మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ సాయంతో 429 పరుగులు) అయిన షా జట్టులో లేకపోవడం పూరించలేని లోటు. స్కాన్ రిపోర్ట్ల్లో షాకు తగిలిన గాయం చాలా తీవ్రమైందని తెలిసింది. షా త్వరలో లండన్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలుస్తారు. అతి తక్కువ వ్యవధిలో షా నార్తంప్టన్‌షైర్‌పై తీవ్ర ప్రభావం చూపాడు అంటూ ఆ జట్టు కోచ్ జాన్ సాడ్లర్ ట్వీట్లో రాసుకొచ్చాడు. This one hurts. 😢 Prithvi Shaw has been ruled out of the remainder of his Steelbacks stint. 😔 pic.twitter.com/8XWLfrlxAY — Northamptonshire CCC (@NorthantsCCC) August 16, 2023 ఇదిలా ఉంటే, రాయల్ లండన్ వన్డే కప్-2023తో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా.. నార్తంప్టన్‌షైర్ తరఫున అరంగేట్రం చేసి తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడి నుంచి షా సుడి తిరిగింది. ఆగస్ట్ 9న సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఆతర్వాత ఆగస్ట్ 13న డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. భీకర ఫామ్‌లో ఉండిన షా ఈ టోర్నీలో మరిన్న అద్భుతాలు చేస్తాడనుకున్న తరుణంలో అనూహ్యంగా గాయపడటంతో నార్తంప్టన్ యాజమాన్యంతోపాటు షా అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఈ ప్రదర్శనలతో షా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు అనుకుంటున్న తరుణంగా గాయం షా కెరీర్‌ను మరో నాలుగు మెట్లు వెనక్కు వేసేలా చేసింది. ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు షాను ఆసియా కప్‌కు కాని, వన్డే వరల్డ్‌కప్‌కు కాని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. -
ఆసియా కప్, వరల్డ్‌కప్‌లలో రోహిత్‌కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో ఆటగాడు
టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్‌ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్‌ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్ ఫామ్ కోల్పోవడం, కేఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్‌కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్, సిరీస్‌కు కీలక ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్ హీరో శుభ్‌మన్ గిల్ తెరపైకి వచ్చాడు. రోహిత్‌కు జతగా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి రాహుల్‌ను మరిపించాడు. అయితే గిల్ ఫామ్ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో మరో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్ శిఖర్ ధవన్‌కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ స్థానాల కోసం రోహిత్‌తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్) లైన్లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లకు రోహిత్‌కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. డబుల్ సెంచరీ మరువక ముందే సుడిగాలి శతకం
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా మరో సెంచరీ బాదాడు. నాలుగు రోజు కిందట (ఆగస్ట్ 9) సోమర్సెట్పై విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఇవాళ (ఆగస్ట్ 13) డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ కాగా.. నార్తంప్టన్‌షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. Prithvi Shaw is in red-hot form in the One-Day Cup tournament in England. pic.twitter.com/pVIQwbOewJ — CricTracker (@Cricketracker) August 13, 2023 చెలరేగిన లూక్ ప్రాక్టర్.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ లూక్ ప్రాక్టర్ (9-0-34-4) ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. ప్రాక్టర్తో పాటు జేమ్స్ సేల్స్ (8-1-31-2), కియోగ్ (5.2-0-35-2), జాక్ వైట్ (10-0-49-1), కెర్రిగన్ (4-0-22-1) కూడా రాణించడంతో డర్హమ్ జట్టు పేకమేడలా కూలింది. డర్హమ్ ఇన్నింగ్స్‌లో ట్రెవాస్కిస్ (37), అలెక్స్ లీస్ (34), బుష్నెల్ (32), బోర్త్విక్ (20), ప్రిటోరియస్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. PRITHVI SHOW in One-day cup🔥 @PrithviShaw pic.twitter.com/GxY9uyrlUl — CricTracker (@Cricketracker) August 13, 2023 విధ్వంసకర డబుల్ సెంచరీని మరువక ముందే.. 199 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్ను ఓపెనర్ పృథ్వీ షా మెరుపు శతకం బాది ఒంటిచేత్తో గెలిపించాడు. సోమర్సెట్పై చేసిన ద్విశతకాన్ని మరువక ముందే షా మరో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. షాకు రాబ్ కియోగ్ (42) సహకరించగా.. ఎమిలియో గే (17), సామ్ వైట్మన్ (4), లూక్ ప్రాక్టర్ (3) విఫలమయ్యారు. డర్హమ్ బౌలర్లలో జార్జ్ డ్రిస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా.. బుష్నెల్ ఓ వికెట్ తీశాడు. -
వన్డే ఫార్మాట్లో మరో డబుల్ సెంచరీ.. ఈసారి..!
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా చేసిన విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) మరువక ముందే మరో డబుల్ సెంచరీ నమోదైంది. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ కెప్టెన్ జేమ్స్ బ్రేసీ అజేయ డబుల్ సెంచరీతో (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. బ్రేసీతో పాటు మరో ఓపెనర్ క్రిస్ డెంట్ (38 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఓలివర్ ప్రైస్ (83 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో గ్రేమ్ వాన్ బుర్రెన్ (12 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో గ్లోసెస్టర్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 454 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సోమర్సెట్ బౌలర్లలో లాంగ్రిడ్జ్, జార్జ్ థామస్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో డబుల్ సెంచరీలు నమోదైన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి సోమర్సెటే కావడం విశేషం. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా, గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జేమ్స్ బ్రేసీ సోమర్సెట్ బౌలర్లను ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో సోమర్సెట్ బౌలర్లందరూ 9కిపైగా యావరేజ్‌తో పరుగులు సమర్పించుకున్నారు. లాంగ్రిడ్జ్ను (8 ఓవర్లలో 5 పరుగులు) అయితే బ్రేసీ, బుర్రెన్ ఊచకోత కోశారు. లిస్ట్-ఏ క్రికెట్లో ఏడో అత్యధిక స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ, దేశవాలీ వన్డేలు) ఏడో అత్యధిక స్కోర్ నమోదైంది. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ రికార్డు స్థాయిలో 454 పరుగులు స్కోర్ చేసింది. ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ జట్టు 500 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. దీని తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022లో నెదార్లండ్స్తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ 498 పరుగులు స్కోర్ చేసింది. పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదైంది. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఆటగాడు జేమ్స్ బ్రేసీ (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ (277) పేరిట ఉంది. అతని తర్వాత అలిస్టర్ బ్రౌన్ (268), రోహిత్ శర్మ (264), షార్ట్ (257), శిఖర్ ధవన్ (248),పృథ్వీ షా (244), మార్టిన్ గప్తిల్ (237), ట్రవిస్ హెడ్ (230), డంక్ (229), పృథ్వీ షా (227) ఉన్నారు. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ...
Prithvi Shaw Slams Double Century- Fans Reacts- లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ వన్డే కప్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 153 బంతులు ఆడిన పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు సాధించి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అవుటయ్యాడు. పృథ్వీ షా అసాధారణ బ్యాటింగ్‌తో మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు సాధించింది. అనంతరం సోమర్సెట్ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. రికార్డుల పృథ్వీ నార్తంప్టన్‌షైర్ జట్టు తరఫున మూడో మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ చేయగా... డబుల్ సెంచరీని 129 బంతుల్లో దాటాడు. ముంబైకి చెందిన పృథ్వీ షాకిది లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. లిస్ట్ ‘ఎ’లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్టులో మాత్రం.. జాబితాలో పృథ్వీ షాది ఆరో స్థానం. ఈ జాబితాలో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ (277; అరుణాచల్‌ప్రదేశ్‌పై 2022లో) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. అప్పటి నుంచి నో ఛాన్స్! 2021లో భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై పృథ్వీ షా 227 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2021 జూలైలో చివరిసారి శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌లో అతడు బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభను మనం గుర్తించకపోతే ఇదిగో ఇలాగే పక్క దేశాల్లో ఆడుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా పృథ్వీ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 -
పేట్రేగిపోయిన పృథ్వీ షా.. భారీ ద్విశతకం, 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా యంగ్ ఓపెనర్, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ (లిస్ట్-ఏ క్రికెట్), మెట్రో బ్యాంక్ వన్డే కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాది ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. సామ్ వైట్‌మ్యాన్ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) రాణించారు. సోమర్ సెట్ బౌలర్లలో జాక్ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. డానీ లాంబ్ 2, షోయబ్ బషీర్, జార్జ్ థామస్ తలో వికెట్ దక్కించుకున్నారు. షా విధ్వంసం ధాటికి సోమర్సెట్ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు. 🚨 PRITHVI SHAW HAS 200! 🚨#MBODC23 pic.twitter.com/GeVYVD3o6z — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 పృథ్వీ షా డబుల్ సెంచరీ విశేషాలు.. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 60 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్లో తన మూడో అప్పియరెన్స్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇదే టోర్నీతో షా ఇంగ్లండ్ డొమెస్టిక్ సర్క్యూట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 153 బంతులను ఎదుర్కొన్న షా 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 244 పరుగులు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ టోర్నీ డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 129 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చతేశ్వర్ పుజారా (174) పేరిట ఉంది. లిస్ట్-ఏ చరిత్రలో ఆరో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నార్తంప్టన్‌షైర్ తరఫున హైయెస్ట్ లిస్ట్-ఏ స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు లిస్ట్-ఏ క్రికెట్లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు. భారత దేశవాలీ వన్డే టోర్నీలోనూ షా ఓ డబుల్ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ శర్మ (3) తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు (2) 100 on the shirt, 100 on the scoreboard 💯 Prithvi Shaw goes full @nassercricket with his celebration! #MBODC23 pic.twitter.com/5UJLbrF2uQ — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 Highest List A individual score for Prithvi Shaw. He surpassed his previous best 227*pic.twitter.com/fI783vh7JH — Don Cricket 🏏 (@doncricket_) August 9, 2023 Prithvi Shaw in 2023: Scored his maiden triple hundred - 379 in 383 balls in the Ranji Trophy. Scored 244 in 153 balls in the Royal London One Day Cup. pic.twitter.com/QhG2tOyaWk — Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023 -
సెంచరీతో కదం తొక్కిన పుజారా.. తేలిపోయిన పృథ్వీ షా
2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్‌లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్‌తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్‌లో పుజారా ఇన్నింగ్స్ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ ఓటమిపాలవ్వడం కొసమెరుపు. Great to have you back, @cheteshwar1! 🙌 Century 💯 pic.twitter.com/k7SfSu59si — Sussex Cricket (@SussexCCC) August 6, 2023 వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ టామ్ హెయిన్స్ (13), జేమ్స్ కోల్స్ (29), హడ్సన్ (14), ఒలివర్ కార్టర్ (21), జాక్ కార్సన్ (17), హెన్రీ క్రొకోంబ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్‌షైర్ బౌలర్లలో జాక్ వైట్ 3, ప్రాక్టర్, కియోగ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తేలిపోయిన పృధ్వీ షా.. గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. గ్లోసెస్టర్తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్ వికెట్) షా.. తాజాగా ససెక్స్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది. ససెక్స్‌తో మ్యాచ్‌లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్‌షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్‌షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్ వైట్‌మ్యాన్ (30), రాబ్ కియోగ్ (22), లూక్ ప్రాక్టర్ (10), లెవిస్ మెక్మానస్ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్ టేలర్ (42 నాటౌట్), జస్టిన్ బ్రాడ్ (22 నాటౌట్) నార్తంప్టన్షైర్ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్ బౌలర్లలో కర్రీ, కార్సన్ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్, హడ్సన్, జేమ్స్ కోల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఏంటి భయ్యా నీ అదృష్టం.. ఇదేమి ఔట్రా బాబు! పాపం పృథ్వీ
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఇంగ్లండ్ కౌంటీల్లో నార్తాంప్టన్‌షైర్ తరపున అరంగేట్రం చేశాడు. శుక్రవారం రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా గ్లౌసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే విచిత్రమైన రీతిలో పృథ్వీషా ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన పృథ్వీషా హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే? నార్తాంప్టన్‌షైర్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో గ్లౌసెస్టర్షైర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ ఆఖరి బంతిని బౌన్సర్‌గా సంధించాడు. ఆ బంతిని ఫుల్‌షాట్ ఆడిబోయిన పృథ్వీ.. తన నియంత్రణను కోల్పోయి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి షూ స్టంప్స్‌కు తాకింది. దీంతో ఊహించని రీతిలో పృథ్వీ షా హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి ఔట్‌పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "ఏంటి భయ్యా నీ అదృష్టం, ఎక్కడ ఆడినా ఇంతేనా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పృథ్వీ షా.. తన రిథమ్‌ను తిరిగి పొందేందుకు ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించకున్నాడు. ఈ క్రమంలోనే నార్తాంప్టన్‌షైర్‌తో జతకట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా పృథ్వీ షా తీవ్ర నిరాశపరిచాడు. చదవండి: Triple Century Hero: అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ముగిసిన కెరీర్! అలా ప్రపంచంలో నం.1గా.. HIT WICKET!!!! 🚀 Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34. Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy — Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023 -
ఎవరితో.. ఏం మాట్లాడాలన్నా భయమే.. అందుకే ఇలా: పృథ్వీ షా
Scared To Share My Thoughts: ‘‘జట్టు నుంచి నన్నెందుకు తప్పించారో తెలియదు. అందుకు గల కారణం తెలియక సతమతమయ్యా. కొంతమందేమో ఫిట్నెస్ లేదు కాబట్టే నిన్ను తప్పించి ఉంటారు అని చెప్తారు. నిజానికి నేను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి అన్ని పరీక్షల్లోనూ పాస్ అయ్యాను. ఆ తర్వాత మళ్లీ మైదానంలో దిగి పరుగులు సాధించాను. ఈ క్రమంలో నాకు టీ20 జట్టులో స్థానం దక్కింది. కానీ వెస్టిండీస్‌తో సిరీస్‌లకు మాత్రం నన్ను పక్కనపెట్టారు. ఇలాంటి పరిణామాల వల్ల నిరాశ చెందడం సహజం. ఏ ఆటగాడైనా నాలాగే బాధ పడతాడు. నా పరిధిలో నేనుంటా కానీ మనం ఏం చేయలేం కాబట్టి ముందుకు సాగిపోవాలంతే! నన్ను ఎందుకు ఎంపిక చేయలేదని ఎవరినైనా అడిగే పరిస్థితి గానీ, వాళ్లతో పోరాడే శక్తి గానీ నాకు లేవు. ఓ మనిషిగా నాకు సౌకర్యవంతంగా ఉండేలా నా పరిధిలో నేనుంటాను. కానీ కొంతమంది నా గురించి వాళ్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అయితే, నన్ను దగ్గరగా చూసిన వాళ్లకు మాత్రమే నేనేంటో తెలుస్తుంది. నాకు స్నేహితులెవరూ లేదు. ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. ప్రస్తుత తరంలో చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. మన మనసులోని భావాలు పక్కవాళ్లతో పంచుకోవాలంటే నాకైతే భయం వేస్తుంది. మనమొకటి మాట్లాడితే వాళ్లు మాత్రం మనమొకటి మాట్లాడితే కొంతమంది దానిని సోషల్ మీడియాకెక్కిస్తారు. నిజానికి నాకు ఫ్రెండ్స్ అని చెప్పుకొనేందుకు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్లతో కూడా నేను ఎక్కువగా మాట్లాడను. కొన్ని విషయాలు మాత్రమే పంచుకుంటాను’’ అని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అన్నాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని.. మనం చెప్పిన మాటలను వక్రీకరించే వాళ్లే ఎక్కువగా ఉంటారని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన పృథ్వీ షా 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. గిల్ దూసుకుపోతోంటే.. షా మాత్రం ఆరంభంలో అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఈ ముంబై బ్యాటర్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ తన సారథ్యంలో ఆడిన శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి సమకాలీన ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువవడంతో జాతీయ జట్టులో అతడికి చోటు కరువైంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఆఖరిసారి శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడాడు. తర్వాత జట్టుకు ఎంపికైనా ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటనకు కూడా సెలక్టర్లు అతడిని ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ షా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 106 పరుగులు సాధించాడు. ఇక సప్నా గిల్ అనే మోడల్‌తో వివాదం కూడా అతడి కెరీర్‌పై గట్టిగానే ప్రభావం చూపిందని అతడి మాటలను బట్టి అర్థమవుతోంది. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ వచ్చేస్తున్నానని వాళ్లకు చెప్పండి: బుమ్రా భావోద్వేగం.. బీసీసీఐ స్పందన -
Test Match: విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. 8 పరుగులకే అవుట్..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటర్ పృథ్వీ షా అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 101 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులతో రాణించాడు ఈ ఓపెనర్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి పృథ్వీ షాకు సహకారం లభించలేదు. 8 పరుగులకే అవుట్ మరో ఓపెనర్, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్ 21 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో స్థానంలో దిగిన టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా పోరాడుతుండగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన మరో భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొన్న ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సౌత్ జోన్ బౌలర్ విధ్వత్ కవెరప్ప బౌలింగ్‌లో కెప్టెన్ హనుమ విహారికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్‌ను కవెరప్ప వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. తిలక్, విహారి ఇన్నింగ్స్‌తో ఇలా కీలక బ్యాటర్లు విఫలం కావడంతో వెస్ట్ జోన్ 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ రెండో రోజు ఆటను వెలుతురులేమి కారణంగా నిలిపివేసే సమయానికి పుజారా 7, అతిత్ సేత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో సౌత్ జోన్ 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వెస్ట్ జోన్ ప్రస్తుతం 94 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాగైతే.. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో విఫలమైన కారణంగా పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇక వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించిన సూర్యకుమార్ యాదవ్‌కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుజారా, సూర్య దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించడం గమనార్హం. ఇక దులిప్ ట్రోఫీ ముగిసిన తర్వాత సూర్య కరేబియన్ దీవికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్‌వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్ -
''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!'
కెరీర్ ఆరంభంలో ఒక మెరుపులా వచ్చి భవిష్యత్తు స్టార్ క్రికెటర్‌గా తయారవుతాడనుకున్న పృథ్వీ షా పాతాళానికి పడిపోయాడు. అగ్రెసివ్ ఆటతీరుతో ఆకట్టుకున్న పృథ్వీ ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఇటవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ పృథ్వీ షా పెద్దగా రాణించింది లేదు. దీనికి తోడు వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ పుజారాకు ఆఖరిది. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా దులీప్ ట్రోపీలో వెస్ట్‌జోన్ తరపున పాల్గొంటున్న పృథ్వీ షా ఆ తర్వాత దేవదర్ ట్రోపీలోనూ ఆడాలనుకుంటున్నాడు. అటుపై ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్లో తొలిసారి నార్తంప్టన్‌షైర్ తరపున బరిలోకి దిగనున్నాడు. కౌంటీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి రావాలని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. జూలై 12 నుంచి వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ల మధ్య దులీప్ ట్రోపీ ఫైనల్ జరగనుంది. ఇక సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్ ముగిశాకా విజయంపై స్పందించిన పృథ్వీ షా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను నా ఆటను మార్చుకోవాలనుకోవడం లేదు. కాకపోతే నా గేమ్‌కు కాస్త స్మార్ట్‌నెస్‌ను యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. నేను పుజారా సార్లా బ్యాటింగ్ చేయలేను.. ఆయన నాలా బ్యాటింగ్ చేయలేడు. ఈ విషయంలో ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారికి ఉంటుంది. ఇన్నేళ్లుగా నాకున్న అగ్రెసివ్నెస్ బ్యాటింగ్‌ను వదులుకోలేను.. కానీ స్మార్ట్‌గా ఆడడానికి ప్రయత్నిస్తా. ఇక వెస్ట్‌జోన్ దులీప్ ట్రోపీలో ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. నేను ముంబైకి ఆడొచ్చు.. లేదంటే వెస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు.. కానీ ఆట అనేది చాలా ముఖ్యం. ఒక రకంగా నా కెరీర్‌కు ఈ ఫైనల్ ఉపయోగపడుతుందంటే బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ఇక గత ఏడాదిగా రెడ్‌బాల్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా. ఒక మ్యాచ్‌లో త్రిబుల్ సెంచరీ(370 పరుగులు Vs అస్సాం) మరిచిపోలేని ఇన్నింగ్స్. కానీ వైట్‌బాల్‌లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయా. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: #DuleepTrophy: 5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా? -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
భారత సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో పృథ్వీ షా కీలక నిర్ణయం
టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న వారిలో పృథ్వీ షా ఒకరు. 23 ఏళ్ల ఈ ముంబై ఓపెనర్ చాలా రోజులుగా భారత జట్టులో చోటు దక్కక నిరాశగా ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు ఇతన్ని ఎంపిక చేసినా.. తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. తదనంతరం జరిగిన ఐపీఎల్-2023లో ఘోర వైఫల్యం చెందడం, అదే సమయంలో అతని సమకాలీకులు ఓపెనర్లుగా రాణించడంతో షా టీమిండియాకు ఆడే ఆశలను దాదాపుగా వదులుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతనికి తొలిసారి కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం దొరికింది. నాటింగ్హమ్షైర్.. షాతో ఒప్పందం చేసుకున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. దులీప్ ట్రోఫీ 2023 ముగిసాక షా నాలుగు రోజుల కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లు ఆడతాడని, తదనంతరం రాయల్ లండన్ వన్డే కప్ (50 ఓవర్ల టోర్నీ) ఆడతాడని తెలుస్తుంది. దీనికి ముందు షా.. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒకవేళ సెమీస్‌లో సెంట్రల్ జోన్ గెలిస్తే జులై 12-16 మధ్యలో జరిగే ఫైనల్లో కూడా ఆడతాడు. 2021లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన షా.. ఆతర్వాత ఫామ్ లేమి, వివాదాలు, సరైన అవకాశాలు రాక ఖాళీగా ఉన్నాడు. పృథ్వీ షా తన కెరీర్లో 5 టెస్ట్‌లు, 6 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. వన్డేల్లో, టీ20ల్లో పెద్దగా రాణించని షా.. టెస్ట్‌ల్లో పర్వాలేదనిపించాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించే షా.. గడిచిన సీజన్లో 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు చేశాడు. -
వార్తల్లో పృథ్వీ షా.. సీజ్ చేసిన లాంజ్‌లో తెల్లవారుజాముదాకా
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. కొంతకాలంగా మోడల్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్న పృథ్వీ షా ఈ సోమవారం రాత్రి థానేలోని నెహ్రూ నగర్లో ఉన్న మిట్రన్ లాంజ్‌కు వచ్చాడు. ఈ లాంజ్ హాంగ్ఔట్ ప్లేస్‌కు పాపులర్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఎయిర్ సీటింగ్ సౌకర్యం ఉన్న ఈ లాంజ్‌కు ఎంతో మంది సెలబ్రిటీలు వస్తుంటారు. అయితే మంగళవారం మిట్రన్ లాంజ్‌ను వేగల్ ఎస్టేట్ పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఆరు గంటల వరకు లాంజ్ నడుస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లాంజ్‌లో రెక్కీ నిర్వహించి సీజ్ చేశారు. ఆ సమయంలో పృథ్వీ షా అదే లాంజ్‌లో ఉన్నట్లు తేలింది. సీజ్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని పృథ్వీ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ బినూ వర్గీస్ తన ట్విటర్లో మిట్రన్ లాంజ్ గురించి రాయడం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ''ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాత లాంజ్ బయట ఒక ఆరుగురు బౌన్సర్స్ కస్టమర్స్‌తో గొడవ పడుతున్నట్లు తెలిసింది. అయితే అన్ని బార్స్, లాంజ్, రెస్టారెంట్లకు అర్థరాత్రి 1:30 తర్వాత మూసేయాలని నిబంధన ఉంది. కానీ మిట్రన్ లాంజ్‌కు ఆ నిబంధన వర్తించదా. సెలబ్రిటీలు ఎక్కువగా వస్తారన్న కారణంతో స్పెషల్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా.. దీనివల్ల లాంజ్ చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీలు ఇబ్బంది పడుతాయి కదా.. దీనిపై వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాల్సిందే'' అంటూ రాసుకొచ్చాడు. బినూ వర్గీస్ ట్వీట్‌పై స్పందించిన ఎక్సైజ్ శాఖ వెంటనే అప్రమత్తం అయింది. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఇన్స్పెక్టర్ ఆర్సీ బిరాజ్దార్ తన సిబ్బందితో కలిసి లాంజ్‌లో రెక్కి నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఆరు గంటల వరకు లాంజ్నడుస్తున్నందున పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో రెండు చార్జీషీట్లు దాఖలు చేశారు. చార్జీషీట్లో పేర్కొన్నవన్నీ కోర్టులో నిజమని తేలితే మెట్రజ్ లాంజ్ పర్మినెంట్‌గా క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక పృథ్వీ షా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పృథ్వీ 13.25 సగటుతో 106 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్థసెంచరీ ఉంది. Excise Department have lodge the Breech Case against Mitron Lounge, 2 More cases The Lounge will Shutdown Permanently #Nightlife #ThaneCitypolice #earthquake https://t.co/dKlv8f9Pek pic.twitter.com/LeOnlrZ7Xo — SBT News (@TimesSukhi) June 13, 2023 చదవండి: ఒక్క బంతికి 18 పరుగులా.. నువ్వు దేవుడివయ్యా! -
ఐపీఏల్ లో అట్టర్ ఫ్లాప్.. పార్టీలకు మాత్రం ఫుల్ ఫామ్ నువ్వు మాములోడివి కాదు సామీ...
-
'అతడు ఏదో పెద్ద స్టార్ క్రికెటర్లా ఫీలవుతున్నాడు.. గిల్‌ను చూసి నేర్చుకో'
ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.దీంతో భారత టీ20 జట్టులోకి వచ్చే ఛాన్స్‌లను పృథ్వీ షా సంక్లిష్టం చేసుకున్నాడు. ఇక దారుణమైన ప్రదర్శన కనబరిచిన షాపై భారత మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ విమర్శల వర్షం కురిపించాడు. పృథ్వీ షాను తన సహచర ఆటగాడు శుబ్‌మన్ గిల్‌తో పోలుస్తూ ఘావ్రీ చురకలు అంటించాడు. కాగా గిల్, పృథ్వీ షా ఇద్దరూ భారత్ తరపున అండర్-19 ప్రపంచకప్‌లో కలిసి ఆడారు. ఇక గిల్ ఈ ఏడాది ఐపీఎల్లో అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 851 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. ఏదో పెద్ద స్టార్ క్రికెటర్లా.. "2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో పృథ్వీ షా, గిల్ భాగంగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆడారు. అయితే ఈ రోజు శుబ్‌మన్ గిల్ ఏ స్థితిలో ఉన్నాడు, పృథ్వీ షా ఏ పోజేషన్లో ఉన్నాడు మీరే చూడండి. ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. నిరంతరం కష్టపడితేనే ఈ ఫీల్డ్‌లో నిలదొక్కకుంటారు. ఇద్దరు ఒకే వయస్సుకు చెందినవారు. కాబట్టి ఇప్పటికీ అయిపోయింది ఏమీ లేదు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో కూడా చాలా లోపాలు ఉండేవి. కానీ గిల్ కష్టపడి వాటిని సరిదిద్దు కున్నాడు. పృథ్వీ షా మాత్రం అలా చేయలేదు. ఇప్పటికీ అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో చాలా లోపాలు ఉన్నాయి. అతడు తను ఎదో పెద్ద స్టార్ క్రికెటర్ అని, తనని ఎవరూ టచ్ చేయలేరని షా అనుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గాని, రంజీట్రోఫీలో గాని ఏ లీగ్‌లోనైనా మనం ఔట్ కావడానికి ఒక బంతి చాలు అని అతడు గ్రహించాలి. ఈ జెంటిల్మెన్ గేమ్‌లో రాణించాలంటే నిబద్దతతో పాటు క్రమశిక్షణ ఉండాలి అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఘవ్రీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్ నువ్వు కూడా! -
గర్ల్‌ఫ్రెండ్‌తో సందడి చేసిన టీమిండియా యువ ఓపెనర్.. వీడియో వైరల్
టీమిండియా యవ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తొలిసారి వీరిద్దిరూ పబ్లిక్‌గా కనిపించారు. ఐఐఎఫ్ఏ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పృథ్వీ షా, నిధి సందడి చేశారు. గ్రీన్ కార్పెట్‌పై వీరిద్దరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పృథ్వీ షా స్లీవ్‌లెస్ జాకెట్, బ్లాక్ షర్ట్, బ్లాక్ జీన్స్ ధరించగా.. నిధి కూడా బ్లాక్ చీరలో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. ఇక ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఈ పేలవ ప్రదర్శనతో భారత టీ20 జట్టులో కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలను పృథ్వీ షా కోల్పోయాడనే చెప్పుకోవాలి. అయితే ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం పృథ్వీ టాప్ ఫామ్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో అస్సాంపై ఏకంగా 379 రన్స్ చేశాడు. కానీ ఐపీఎల్లో మాత్రం తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గావస్కర్..సెహ్వాగ్ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? వాళ్లిద్దరు అంతే!
IPL 2023: సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి జూనియర్లే ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆటలో మెలకువలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలని.. తన కెరీర్ తొలినాళ్లలో దిగ్గజం సునిల్ గావస్కర్‌తో మాట్లాడేందుకు విశ్వప్రయత్నం చేశానని పేర్కొన్నాడు. దూసుకుపోతున్న గిల్ కానీ.. టీమిండియా యువ ఓపెనర్లు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌కు మాత్రం ఇలాంటి లక్షణాలు లేవని చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గిల్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై సెంచరీ చేసిన ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి 576 పరుగులు చేశాడు. షా ఇప్పుడిలా ఇదిలా ఉంటే.. భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన గిల్ సమకాలీకుడు పృథ్వీ షా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ముంబై బ్యాటర్ ఆరంభంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో తిరిగి తుది జట్టులో స్థానం సంపాదించిన అతడు.. తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. వార్నర్‌కు జోడీగా ఓపెనింగ్ చేసిన అతడు 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగులు రాబట్టాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 101 పరుగులు(7 ఇన్నింగ్స్) చేసిన అతడికి ఇదే అత్యధిక స్కోరు. నాతో యాడ్ షూట్ చేసినపుడు ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్ షోలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘పృథ్వీ షా నాతో కలిసి ఓ యాడ్‌లో నటించాడు. శుబ్‌మన్ గిల్ కూడా అక్కడే ఉన్నాడు. మేమంతా దాదాపు ఆరు గంటల పాటు అక్కడే ఉన్నాం. వారిద్దరిలో ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి క్రికెట్ గురించి మాట్లాడలేదు. నేనైతే టీమిండియాకు ఆడుతున్న కొత్తలో సన్నీ భాయ్(గావస్కర్)తో మాట్లాడటానికి చేయని ప్రయత్నం లేదు. ఓ రోజు జాన్‌రైట్ దగ్గరకు వెళ్లి.. ‘‘నేను కొత్త ప్లేయర్‌ని.. సన్నీ భాయ్ నాతో మాట్లాడతారో లేదో తెలియదు. కానీ నేను మాత్రం ఎలాగైనా ఆయనను కలవాలని అనుకుంటున్నానని చెప్పాను. గావస్కర్ నన్ను కలవాలనుకోడు.. నేనే వెళ్లాలి! కాబట్టి ఎలాగైనా మీటింగ్ ఏర్పాటు చేయమని కోరాను. ఓ రోజు రైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. 2003-04లో నా ఓపెనింగ్ పార్ట్నర్ ఆకాశ్ చోప్రా. తను కూడా నాతో కలిసి సన్నీ భాయ్ దగ్గరకు వచ్చాడు. మేమిద్దరం కలిసి డిన్నర్ చేస్తూ బ్యాటింగ్ ఎలా చేయాలన్న అంశం గురించి ఆయనతో చర్చించాం. మనకు ఏదేని విషయం పట్ల ఆసక్తి ఉండాలి. అందుకోసం మనమే రంగంలోకి దిగాలి. సునిల్ గావస్కర్ వచ్చి సెహ్వాగ్ లేదంటే చోప్రాతో మాట్లాడాలని అనుకోరు. మనమే ఆయన దగ్గరకు వెళ్లాలి’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సీనియర్లు అందుబాటులో ఉన్నపుడు వారితో చర్చిస్తే ఆటలో మెలకువలు తెలుసుకునే వీలుంటుందని.. అలాకాక సీనియర్లే తమకు దగ్గరకు వస్తారని ఆశించడం సరికాదని పరోక్షంగా షా, గిల్‌లకు చురకలు అంటించాడు. వీరూ భాయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ‘‘షా, గిల్ల ప్రవర్తనతో ముల్తాన్ సుల్తాన్‌కు బాగా కోపం వచ్చినట్లుంది. అయినా భాయ్ చెప్పిందే కరెక్టే కదా! సీనియర్లు జూనియర్ల దగ్గరికి రారు. జూనియర్లే వెళ్లాలి. ఇప్పటికైనా అర్థమైందా షా, గిల్?’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఈజీ క్యాచ్ డ్రాప్.. కోపంతో ఊగిపోయిన కుల్దీప్ యాదవ్! వీడియో వైరల్ -
చాన్నాళ్లకు హాఫ్ సెంచరీ.. అంత అయిపోయాక ఆడితే ఏం లాభం!
ఐపీఎల్-203లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 38 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో పృథ్వీ షాకు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమానార్హం. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన అతడు 14.43 సగటుతో కేవలం 101 పరుగులు మాత్రమే చేశాడు. పృథ్వీ షా తన ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో జట్టు మెనెజ్‌మెంట్ అతడిని పక్కన పెట్టింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో అతడు మరి కనిపించడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా పంజాబ్‌తో మ్యాచ్‌కు జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఢిల్లీ ఓపెనర్.. ఛాన్నాళ్ల తర్వాత తన మార్క్‌ను చూపించాడు. అయితే ఇప్పటికే ఈ మెగాటోర్నీ ఫ్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంత అయిపోయాక ఆడితే ఏమి లాభం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. కేవలం ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2023: పంజాబ్ కొంపముంచిన ధావన్ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే? pic.twitter.com/VEj7AXK47J — Raju88 (@Raju88784482906) May 17, 2023 -
రియాన్ పరాగ్ అకాడమీ.. మీకు దణ్ణం సామీ
-
ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్, సన్‌రైజర్స్‌కు మయాంక్.. మరి ఢిల్లీకి..?
ఐపీఎల్-2023లో సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తయినా ఇప్పటికీ కొందరు బ్యాటర్లు గాడిలో పడకపోవడంతో సంబంధిత ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. భారీ మొత్తం వెచ్చించి సొంత చేసుకున్న కొందరు ఆటగాళ్లు పదేపదే అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారారు. తమ చెత్త బ్యాటింగ్‌తో ఫ్రాంచైజీలకు భారంగా మారిన ఆటగాళ్లెవరో ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుత సీజన్లో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రియాన్ పరాగ్ ముందువరుసలో ఉంటాడు. వేలంలో 3.8 కోట్లు దక్కించుకున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 20 అత్యధిక స్కోర్‌తో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పరాగ్ తర్వాత చెత్త పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఆటగాడు ఆర్సీబీ దినేశ్ కార్తీక్. ఫినిషర్‌గా ఇరగదీస్తాడని భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన డీకే (5.5 కోట్లు).. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 28 అత్యధిక స్కోర్‌తో కేవలం 99 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన డీకే.. వికెట్‌కీపింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. క్యాచ్‌లు మిస్ చేయడం, స్టంపింగ్, రనౌట్లు చేయలేకపోవడం, చేతిలోకి వచ్చిన బాల్స్‌ను జారవిడచడం.. ఇలా వికెట్‌కీపింగ్‌లోనూ డీకే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంతటితో ఇతని ఆగడాలు ఆగలేదు. బ్యాటింగ్ సమయంలో ఇతను పరుగులు చేయలేకపోగా.. బాగా ఆడుతున్న వారిని పలు సందర్భాల్లో రనౌటయ్యేలా చేశాడు. కార్తీక్‌తో పాటు మరో ఆటగాడు కూడా ఆర్సీబీకి చాలా భారంగా మారాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ కూడా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విఫలమై జట్టు ఓటములకు కారకుడయ్యాడు. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్‌తో పాటు జట్టు మొత్తం బ్యాటింగ్ విభాగంలో దారుణంగా నిరాశపరుస్తుంది. బ్రూక్ ఒకే ఒక మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఆతర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. మయాంక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. చించేస్తాడనుకున్న కెప్టెన్ మార్క్రమ్ కూడా తేలిపోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు దీపక్ హుడా.. సీఎస్కేకు అంబటి రాయుడు.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షాలు పెద్ద తలనొప్పిగా మారారు. వీరిని సంబంధిత ఫ్రాంచైజీలు తదుపరి జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆడిస్తారో లేక సాహసం చేసి పక్కకు కూర్చోబెడతారో వేచి చూడాలి. చదవండి: ముంబైతో మ్యాచ్.. జూనియర్ మలింగ అద్భుత గణాంకాలు -
ఐపీఎల్-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!
ఐపీఎల్-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్ 30) జరిగిన 42 మ్యాచ్‌ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్‌ల్లో 47 పరుగులు), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్‌సెంచరీ), వన్ డౌన్లో సన్‌రైజర్స్ మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 169 పరుగులు), నాలుగో స్థానంలో లక్నో దీపక్ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 52 పరుగులు), ఐదులో రాజస్థాన్ రియాన్ పరాగ్ (3.80 కోట్లు, 5 మ్యాచ్‌ల్లో 54 పరుగులు), ఆరులో ఆర్సీబీ దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 83), ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు, 7 మ్యాచ్‌ల్లో 60 పరుగులు, 3 వికట్లు), ఎనిమిదో ప్లేస్‌లో ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో 42 పరుగులు, 0 వికెట్లు), 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (8 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు), 10లో కేకేఆర్ ఉమేశ్ యాదవ్ (2 కోట్లు, 8 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్, 19 పరుగులు), 11వ స్థానంలో కేకేఆర్ లోకి ఫెర్గూసన్ (10 కోట్లు, 3 మ్యాచ్‌ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్). వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్ చేయండి. -
అతన్ని పక్కనబెట్టడం మంచిది! లేకపోతే మీకే నష్టం
-
విఫలమవుతున్నా అవకాశాలా? పక్కనబెట్టడం మంచిది!
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా తన ఘోర వైఫల్యాలను కంటిన్యూ చేస్తునే ఉన్నాడు. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్ది పృథ్వీ షా ఆటతీరు మరింత దారుణంగా తయారవుతోంది. ఒకప్పుడు మంచి టెక్నిక్‌తో దూకుడుగా ఆడుతూ అందరి మన్ననలు పొందిన పృథ్వీ షా బ్యాటింగ్ ఇంతలా మసకబారడానికి కారణం ఏంటో అంతుచిక్కడం లేదు. Photo: IPL Twitter తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో పృథ్వీ మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 13 పరుగులు మాత్రమే చేసిన అతను వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ సీజన్లో పృథ్వీ ఆరు మ్యాచ్‌లు కలిపి కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు 15 అంటే ఎంత దారుణంగా ఆడుతున్నాడో ఈ పాటికే అర్థమయి ఉండాలి. మరి ఇంతలా విఫలమవుతున్నా ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షాకు అవకాశాలు ఎందుకిస్తుందనేది అర్థం కాని ప్రశ్నలా తయారైంది. ఇకనైనా పృథ్వీని పక్కనబెట్టి వేరొకరికి అవకాశం ఇస్తే మంచిదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: #Ishant Sharma: 717 రోజుల తర్వాత ఎంట్రీ.. అదరగొట్టాడు -
చెత్తగా ఆడుతున్నావు.. మారవా ఇక? వెంటనే అతడిని తప్పించి! వీడియో వైరల్
IPL 2023- RCB Vs DC- Prithvi Shaw- Anuj Rawat: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా అతడిని ట్రోల్ చేస్తూ మండిపడుతున్నారు. ‘‘అసలు నీ ఆట తీరు ఎలా ఉందో చూసుకుంటున్నావా? మొన్నటిదాకా అలా.. ఈసారేమో మళ్లీ ఇలా డకౌట్’’ అంటూ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో పృథ్వీ షా నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 12, 7, 0, 15. అనూజ్ సంచలన ఫీల్డింగ్ తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు ఈ యువ ఓపెనర్. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి షా పరుగుకు యత్నించాడు. కానీ.. మైదానంలో పాదరసంలా కదిలిన ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ అనూజ్ రావత్ ఏమాత్రం పొరపాటు చేయకుండా బాల్‌ను అందుకుని వికెట్లకు గిరాటేశాడు. సంచలన ఫీల్డింగ్‌తో ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ పృథ్వీ షాను రనౌట్ చేశాడు. క్రీజులో అడుగుపెట్టేందుకు పరిగెత్తురావడంలో జాప్యం చేసిన పృథ్వీ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు. దీంతో ఢిల్లీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఇకనైనా తప్పించండి ఈ నేపథ్యంలో పృథ్వీ షాపై మండిపడుతున్నారు అభిమానులు. ‘‘నీకేమైంది పృథ్వీ షా.. ఇదేం చెత్త ఆట. షాట్ల ఎంపిక విషయంలో పొరపాట్లు. ఇప్పుడేమో రనౌట్‌గా వెనుదిరిగడం. ఇందుకేనా నీకు ఓపెనర్‌గా అవకాశాలు ఇస్తోంది ఢిల్లీ మేనేజ్మెంట్. ఇకనైనా అతడిని తప్పించి వేరే వాళ్లకు అవకాశాలు ఇవ్వండి’’ అని మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. పృథ్వీ షా రనౌట్.. వీడియో వైరల్ ఇక ఇంకొంతమంది నెటిజన్లేమో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చిన అనూజ్‌ను ఆకాశానికెత్తుతున్నారు. ఈ క్రమంలో పృథ్వీ షా రనౌట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. వీరిద్దరి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. కాగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. చదవండి: టీమిండియాకు శుభవార్త.. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు బిగ్‌బూస్ట్! బీసీసీఐ కీలక ప్రకటన Talk about creating an 𝙄𝙈𝙋𝘼𝘾𝙏! Anuj Rawat gets the opposition impact player Prithvi Shaw out with a terrific direct-hit 🎯#TATAIPL | #RCBvDC pic.twitter.com/Nd8pNum9mo — IndianPremierLeague (@IPL) April 15, 2023 Prithvi Shaw😢 pic.twitter.com/WjneYYvJrJ — Pulkit🇮🇳 (@pulkit5Dx) April 15, 2023 Prithvi Shaw every match in IPL2023#RCBvsDC #DCvRCB pic.twitter.com/XgS9nd4gGr — The Dude (@PuntingDude) April 15, 2023 -
టీమిండియా యువ ఓపెనర్‌కు ఎదురుదెబ్బ..! కష్టాలు తప్పకపోవచ్చు..
Prithvi Shaw- Sapna Gill: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ సప్నా గిల్‌తో వివాదం నేపథ్యంలో షాతో పాటు ముంబై పోలీసులకు కూడా గురువారం నోటీసులు ఇచ్చింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని ఓ స్టార్ హోటల్లో పృథ్వీ షా- సప్నా గిల్‌కు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. చేతులు కలిపే ఇలా చేశారు ఈ నేపథ్యంలో తనతో ఉన్న వ్యక్తి సెల్ఫీ ఇవ్వమని అడిగినందుకు దురుసుగా మాట్లాడిన షా.. తనను అసభ్యంగా తాకాడంటూ సప్నా ఆరోపించింది. అతడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించడం లేదంటూ ఏప్రిల్ మొదటి వారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది సప్నా గిల్. పృథ్వీ షాతో పాటు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిసున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కశిఫ్ ఖాన్ తన వాదనలు వినిపిస్తూ.. ముంబై క్రికెటర్‌తో పోలీసులు చేతులు కలిపారని, తన క్లైంట్‌పై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించారని కోర్టుకు విన్నవించారు. సీసీటీవీ ఫుటేజీ చూస్తే నాటి గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని గమనిస్తే అసలు విషయమేమిటో అర్ధమవుతుందని పేర్కొన్నారు. తన క్లైంట్ అభ్యర్థన మేరకు పృథ్వీ షా, అతడికి సహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ధర్మాసనం సప్నా గిల్ అభ్యర్థన మేరకు నోటీసులు జారీ చేసింది. జూన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్బీ షుక్రే, ఎంఎం సతాయేలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కాగా పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటలో విఫలమవుతున్న షాకు సప్నా గిల్ రూపంలో వ్యక్తిగత జీవితంలోనూ కష్టాలు ఎదురవుతున్నాయంటూ అతడి అభిమానులు ఉసూరుమంటున్నారు. చదవండి: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. క్రెడిట్ మొత్తం వాళ్లకే: హార్దిక్ -
ఇక్కడే ప్లేస్‌కు దిక్కు లేదు.. ఇంకా టీమిండియాలో చోటు కావాలంట!
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, భారత యువ ఆటగాడు పృథ్వీ షా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు అతడు నిరాశే మిగులుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 12, 7 పరుగులు చేసి విఫలమైన పృథ్వీ షా.. తాజాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడిపై సర్వాత్ర తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే ఆట తీరును అతడు కొనసాగిస్తే భారత జట్టులో కాదు కదా, ముంబై దేశవాళీ జట్టులో కూడా చోటు దక్కడం కష్టమని పలువరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక నెటిజన్లు అయితే పృథ్వీ షాను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక్కడే సరిగ్గా ఆడలేకపోతున్నాడు, ఇంకా భారత జట్టులో చోటు కావాలంట అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. సాయిబాబా చూస్తే కాదు.. మన ప్రదర్శన, కష్టం కూడా ఉండాలి అని కామెంట్ చేశాడు. కాగా ఇంతకుముందు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా సెలెక్షన్ కమిటీ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. "సాయిబాబా అంతా చూస్తున్నారని ఆశిస్తున్నాను" అని పృథ్వీ షా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. అనంతరం న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైనప్పటకీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశమే దక్కలేదు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ పృథ్వీ షా నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. చదవండి: Ajinkya Rahane: బీసీసీఐ అవసరములేదని పొమ్మంది.. ఆ కసిమొత్తం ఇక్కడ చూపించేశాడు! -
సంజూ స్టన్నింగ్ క్యాచ్.. పృథ్వీ షా చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7 పరుగులు చేసిన పృథ్వీ పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా డకౌట్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్ బంతులను ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. ఫుట్‌వర్క్ మీద ఏమాత్రం దృష్టి పెట్టని పృథ్వీ బౌల్ట్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతిని గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నాడు. కీపర్ సంజూ శాంసన్ ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే మ్యాచ్‌లో పృథ్వీ షా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ ఇంపాక్ట్‌గా వచ్చి డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే సీజన్లో పృథ్వీ షా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి డకౌట్ అయిన ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. బట్లర్ 79, యశస్వి జైశ్వాల్ 60, హెట్‌మైర్ 39 నాటౌట్ రాణించారు. How about THAT for a start! 🤯 WHAT. A. CATCH from the #RR skipper ⚡️⚡️#DC lose Impact Player Prithvi Shaw and Manish Pandey in the first over! Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/rpOzCFrWdQ — IndianPremierLeague (@IPL) April 8, 2023 -
పృధ్విషాపై వీరు దాదా ఫైర్..వాళ్ళు పైపైకి..నువ్వు మాత్రం ఇక్కడే
-
Prithvi Shaw: అసలే దారుణ వైఫల్యం.. పృథ్వీ షాకు మరో భారీ షాక్!
Prithvi Shaw- Sapna Gill- Selfie Row: టీమిండియా యువ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షాకు కాలం అస్సలు కలిసి రావడం లేదు. ఐపీఎల్-2023లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్న షాకు తాజాగా మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటి సప్నా గిల్ అతడిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. కాగా ఫిబ్రవరి 15న ముంబైలోని ఓ స్టార్ హోటల్ ఆవరణలో పృథ్వీ షా- సప్నా గిల్ మధ్య సెల్ఫీ విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. షాపై దాడి కేసులో సప్నా గిల్ సహా ఆమె వెంట ఉన్న వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా పృథ్వీ షాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పృథ్వీ షా అసభ్యంగా తాకాడంటూ ఆరోపణలు తాను, తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ తరచుగా ఆ హోటల్‌కు వెళ్తామని.. క్రికెట్ ఫ్యాన్ అయిన శోభిత్ పృథ్వీ షాను సెల్ఫీ అడుగగా అతడు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించింది. ‘‘ఠాకూర్ టీనేజర్. తాగుబోతుల ప్రవర్తన ఎలా ఉంటుందో తనకి తెలియదు కదా! నిస్సహాయుడైన ఠాకూర్‌పై ఆ గుంపు దాడి చేయాలని చూసింది. అందుకే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గొడవకు దిగి ఠాకూర్‌ను గాయపరుస్తున్న షాను, అతడితో పాటు ఉన్న వాళ్లకు సర్ది చెప్పేందుకు మాత్రమే మధ్యలోకి వెళ్లాను’’ అని సప్నా తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో షా తనను అసభ్యకరంగా తాకి నెట్టివేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో బుధవారం.. ముంబైలోని అంధేరి కోర్టును ఆశ్రయించిన సప్నా గిల్.. పృథ్వీ షా, అతడి స్నేహితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. బేస్‌బాల్ బ్యాట్‌తో తనను గాయపరచడం సహా తనని వేధించినందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా.. పృథ్వీ షాపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేసిన ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసులపై కూడా సప్నా ఫిర్యాదు చేసింది. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సప్నా గిల్ లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ పేర్కొన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. కాగా షా ఐపీఎల్ పదహారో సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలో వరుసగా 12, 7 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. చదవండి: బట్లర్‌ను కాదని అందుకే అశూతో ఓపెనింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం: సంజూ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ శాంసన్ -
IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు
2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సమయంలో.. ‘‘వీరేంద్ర సెహ్వాగ్, బ్రియన్ లారా, సచిన్ టెండుల్కర్’’ వంటి స్టార్ బ్యాటర్ల సరసన చేరే సత్తా కలిగిన వాడు ఈ యంగ్‌స్టర్... జాతీయ జట్టుకు ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ(134) సాధించిన సమయంలో ముంబై బ్యాటర్ పృథ్వీ షాను ఉద్దేశించి టీమిండియా దిగ్గజం రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ ప్రస్తుతం ఈ ‘స్టార్ బ్యాటర్’ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా టీమిండియాలో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అదే సమయంలో పృథ్వీ సారథ్యంలో అండర్-19 వరల్డ్‌కప్ ఆడిన మరో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మాత్రం భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలతో చెలరేగుతూ టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసే పనిలో ఉన్నాడు. అదే విధంగా ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. అరంగేట్ర సీజన్లోనే అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్‌లో గిల్ సభ్యుడు. తమ జట్టును టైటిల్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఈ పంజాబీ బ్యాటర్ ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆరంభ మ్యాచ్‌లోనూ దంచికొట్టాడు. అద్భుతమైన అర్ధ శతకం(63)తో ఐపీఎల్ పదహారో సీజన్ ఆరంభించాడు. ఒక్కసారి వాళ్లను చూడు కానీ పృథ్వీ షా పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో కేవలం 12 పరుగులకే పెవిలియన్ చేరిన ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్.. రెండో మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అది కూడా చెత్త షాట్ సెలక్షన్‌తో! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. పృథ్వీ షా ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. తన తోటి ఆటగాళ్లు గిల్, రుతురాజ్ గైక్వాడ్ పరుగుల వరద పారిస్తూ దూసుకుపోతుంటే షా మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాడని, షాట్ల ఎంపిక విషయంలో తప్పులు చేస్తున్నాడంటూ చురకలు అంటించాడు. గుణపాఠాలు నేర్చుకోవడం లేదు ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చెత్త షాట్లతో ఇప్పటికే చాలా సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. కానీ తప్పుల నుంచి గుణపాఠాలు మాత్రం నేర్చుకోలేకపోతున్నాడు. అదే శుబ్‌మన్ గిల్‌ను చూడండి.. షా కెప్టెన్సీలో అండర్-19 క్రికెట్ ఆడిన వాడే కదా.. తను మాత్రం ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లలో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో 600కు పైగా పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. శుబ్‌మన్ గిల్ కూడా మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కానీ షా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన కనబరచలేకపోతున్నాడు’’ అని సెహ్వాగ్.. పృథ్వీ షా ఆట తీరును విమర్శించాడు. కాగా గుజరాత్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో పృథ్వీ.. మహ్మద్ షమీ ట్రాప్‌లో చిక్కి అల్జారీ జోసెఫ్‌నకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చదవండి: DC Vs GT: రానున్న రెండేళ్లలో ఫ్రాంఛైజ్ క్రికెట్‌తో పాటు టీమిండియాలో కూడా! ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వరల్డ్‌కప్ టోర్నీకి కూడా -
'వార్నర్, మార్ష్ కాదు.. ఈ ఏడాది ఐపీఎల్లో అతడే దుమ్మురేపుతాడు'
ఐపీఎల్-2023 సీజన్‌కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మురంచేశాయి. ఐపీఎల్-16వ సీజన్ మార్చి 31 నుంచి షూరూ కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షాపై ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్లో పృథ్వీ షా అద్బుతంగా రాణిస్తాడని రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. "ఈ ఏడాది ఐపీఎల్ కోసం పృథ్వీ షా చాలా కష్టపడ్డాడు. అతడు ఎన్సీఏలో మెరుగైన శిక్షణ పొందాడు.పృథ్వీ షా ఇంత ఎనర్జీగా ఉండడం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అతడు ఇప్పుడు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. పృథ్వీ షా ఈ ఏడాది సీజన్లో సత్తా చాటేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అతడు అద్భుతమైన ఆటగాడు. మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే అతడు భిన్నమైన టాలెంట్ కలిగి ఉన్నాడు. అతడు కచ్చితంగా ఈ మెగా టోర్నీలో దుమ్మురేపుతాడు" అని విలేకురుల సమావేశంలో పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా గత ఐదు సీజన్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2021 సీజన్లో పృథ్వీ షా అద్బుతంగా రాణించాడు. ఈ సీజన్లో 31.93 సగటుతో 479 పరుగులు సాధించాడు. కాగా ప్రస్తుతం ఢిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పావెల్, రుసో వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఇటువంటి కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ పాంటింగ్.. పృథ్వీ షా వైపు మెగ్గు చూపడం గమానార్హం. చదవండి: Glenn Maxwell: గాయంపై అప్డేట్! బాంబు పేల్చిన మాక్స్వెల్..! అయితే.. -
టీమిండియాలో నాలా బ్యాటింగ్ చేసే ఆటగాడే లేడు.. కానీ వాళ్లిద్దరు మాత్రం!
భారత క్రికెట్ చరిత్రలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత.. అతడి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్‌ను టీమిండియా తాయారు చేసుకోలేకపోయింది. భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన జట్టులో వీరేంద్రుడు సభ్యునిగా ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. కొంత మంది టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను సెహ్వాగ్ తో పోలుస్తుంటారు. పృథ్వీ షా బ్యాటింగ్ సెహ్వాగ్ మాదిరిగానే ఉంటుంది అని అభిప్రాయపడుతుంటారు. ఇక తాజాగా ఇదే విషయంపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బ్యాటర్లలో తనలా ఆడేవాళ్లు ఎవరూ లేరని వీరూ సృష్టం చేశాడు. "ప్రస్తుత భారత జట్టులో నాలా బ్యాటింగ్ చేసే ఆటగాడు లేడు. అయితే కొంచెం నా బ్యాటింగ్ స్టైల్ మాదిరిగానే పృథ్వీ షా, రిషబ్ పంత్ ఆటతీరు కూడా ఉంటుంది. టెస్టు క్రికెట్ లో రిషభ్ పంత్ బ్యాటింగ్, దూకుడు నా ఆటను పోలి ఉంటుంది. కానీ అతడు టెస్టుల్లో 90-100 స్కోర్లతోనే సంతృప్తి చెందుతున్నాడు. నేను మాత్రం 200, 250, 300 పైగా పరుగులు సాధించాను. పంత్ నాలాగే భారీ స్కోర్లు సాధిస్తే అభిమానులను మరింత అలరించగలడు" అని న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా టెస్ట్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత ఆటగాడు కూడా వీరేంద్రడే కావడం గమానార్హం. చదవండి: Major League Cricket: అమెరికా టీ20 లీగ్‌లో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు! -
ఆసక్తికర పోస్ట్.. ఎవరిని టార్గెట్ చేశాడు?
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ విషయమై ఇటీవలే హెడ్‌లైన్స్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదన్న కారణంతో యూట్యూబర్ సప్నా గిల్, ఆమె స్నేహితులు కలిసి పృథ్వీ పై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పృథ్వీ షా ఫిర్యాదు మేరకు సప్నా గిల్, ఆమె స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చిన సప్నా గిల్ పృథ్వీ షా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది. పృథ్వీ షానే ముందు గొడవకు దిగాడని.. అకారణంగా తమపై దాడి చేశాడంటూ పేర్కొంది. ఇప్పటికి వివాదం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా గొడవ తర్వాత బయటకు రాని పృథ్వీ షా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. ఆ పోస్టు చూస్తే అతన్ని ఎవరో వాడుకుని వదిలేసినట్లుగా అనిపిస్తుంది. పృథ్వీ పెట్టిన పోస్ట్ ఎలా ఉందంటే.. ''కొంతమంది మనల్ని ప్రేమిస్తారు.. కానీ ఆ ప్రేమ మన అవసరం ఉండేవరకే. ఒకసారి అది ముగిసిపోయాకా వారికి మనపై ఉన్న విధేయత కూడా ముగుస్తుంది. అవసరాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారంటూ'' ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే పృథ్వీ షా పెట్టిన పోస్టు అభిమానులను కన్ఫూజన్‌కు గురయ్యేలా చేసింది. పృథ్వీ ఆ పోస్టును కెరీర్ పరంగా పెట్టాడా.. లేక ఎవరితోనైనా లవ్‌లో బ్రేకప్ అవ్వడం వల్ల పెట్టాడా అనేది అర్థం కాలేదు. కొంతకాలంగా నిధి తపాడియాతో పృథ్వీ షా రిలేషిన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వారిద్దరు విడిపోయి ఉంటారని అందుకే పృథ్వీ షా ఆ పోస్టు పెట్టాడని కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం.. లేదు పృథ్వీ షా ఇన్‌డైరెక్ట్‌గా బీసీసీఐని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. ఏది ఏమైనా మంచి టాలెంట్ ఉండి కూడా జట్టులోకి రాలేకపోతున్న పృథ్వీ షాను చూస్తుంటే బాధ కలుగుతుందని కొంతమంది బాధపడ్డారు. నిజానికి పృథ్వీ చాలా కాలం క్రితమే టీమిండియాలోకి వచ్చాడు. ఆరంభంలో తన దూకుడైన ఇన్నింగ్స్‌లతో కీలక క్రికెటర్‌గా మారుతాడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం.. నిషేధిత పదార్థాల వినియోగం కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. కానీ ఇటీవలే రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబరిచిన పృథ్వీ తిరిగి టీమిండియాకు ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో 363 పరుగులు, రంజీ ట్రోఫీలో 39 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనప్పటికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. టీమిండియా తుది జట్టులో తనకు స్థానం లభించకపోవడంతోనే ఈ పోస్ట్ చేశాడని.. ఇప్పటికైనా అతన్ని టీమిండియా తరపున ఆడించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న పృథ్వీ షా త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలవనున్నాడు. pic.twitter.com/qh9gKOYoiF — Out Of Context Cricket (@GemsOfCricket) March 9, 2023 చదవండి: మ్యాచ్ మధ్యలో చాక్లెట్ తిన్న కోహ్లి! స్లిప్‌లో అది అవసరమా? -
బెయిల్‌పై బయటికి.. వెంటనే పృథ్వీ షాపై కేసు
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవలే దాడి జరిగిన సంగతి తెలిసిందే. సెల్ఫీ అడిగితే ఇవ్వలేదన్న కారణంతో పృథ్వీ షాపై దాడి చేసిన వారిలో సోషల్ మీడియా స్టార్ సప్నా గిల్ కూడా ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమెతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. తాజాగా సప్నా గిల్ బెయిల్‌పై బయటకు వచ్చింది. కాగా మిగతా ఎనిమిది మందిని మాత్రం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే సప్నా గిల్ వచ్చీ రావడంతో పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్‌పై రివర్స్ కేసు పెట్టడం ఆసక్తి కలిగించింది. పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా గిల్ ఆరోపించింది. తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని.. అందుకే ప్రతిఘటించాల్సి వచ్చిందని సప్నా గిల్ తెలిపింది. దీంతో పృథ్వీ షా, సప్నా గిల్ల మధ్య వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. సప్నాగిల్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15న ఓ క్లబ్‌కు వెళ్లానని, సదరు క్రికెటర్‌ను చూడగానే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందని ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ కోసం పృథ్వీషాను సంప్రదించగా వాగ్వాదానికి దిగాడని, అతడు బలవంతంగా తన స్నేహితురాలి ఫోన్‌ను తీసుకుని నేలపై హింసాత్మకంగా విసిరి పాడుచేశాడని ఆరోపించింది. తను క్రికెట్‌ను అంతగా అభిమానించనని, అసలు పృథ్వీషా ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. కావాలనే అతడు, అతడి స్నేహితులు తమపై దాడి చేశారని, నేను వద్దని వారించినప్పటికీ తన మాటలను వినకుండా అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆ సమయంలో పృథ్వీ తనను అసభ్యంగా తాకాడని, నెట్టాడని తెలిపింది. మరోవైపు పృథ్వీషా.. తనపై కేసు పెట్టడంపై కూడా సప్నా గిల్ స్పందించింది. "నేను 50 వేలు అడిగానని చెబుతున్నారు. ఈ రోజుల్లో 50 వేలు అంటే ఏంత? నేను రెండు రీళ్లు చేసి ఒక్క రోజులో అంత సంపాదించగలను. ఆరోపణ చేయాలంటే కనీసం కొంత స్థాయి అయినా ఉండాలి." అని సప్నా గిల్ తెలిపింది. #PrithviShaw https://t.co/EXqoU6AgJO pic.twitter.com/3UfmJCAYwO — Suraj Ojha (@surajojhaa) February 16, 2023 చదవండి: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి టీమిండియా క్రికెటర్‌పై దాడి.. నటి అరెస్ట్ -
టీమిండియా క్రికెటర్‌పై దాడి.. నటి అరెస్ట్
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్న గిల్‌ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ఫీ అడిగితే ఇవ్వడం లేదని పృథ్వీ షాపై కొంతమంది దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వారిలో సప్న గిల్‌తో పాటు ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో లంచ్‌కి వెళ్లిన పృథ్వీ షా, అతని స్నేహితుడు సురేంద్ర యాదవ్‌ను సప్న గిల్ గ్యాంగ్ సెల్ఫీ అడుగుతూ ఇబ్బందికి గురి చేసింది. గమనించిన హోటల్ సిబ్బంది వారిని బయటకు పంపించేశారు. దీన్ని అవమానంగా భావించిన సప్న .. షా ప్రయాణిస్తున్న కారును వెంబడించి..అతనిపై దాడికి పాల్పడింది. దీంతో షా,సురేంద్ర యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. సప్న గిల్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సప్న గిల్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన డ్యాన్స్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమె 2.20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే పలు ‘కాశీ అమర్నాథ్’, ‘మేరా వానత్’ వంటి భోజ్‌పురి సినిమాల్లో కూడా నటించింది. Hustle video of #Cricketer #Prithvishaw & #influencer #Sapnagill outside Barrel mansion club in vile parle east #Mumbai, it is said that related to click photo with cricketer later whole fight started. @PrithviShaw @MumbaiPolice @DevenBhartiIPS @CPMumbaiPolice @BCCI pic.twitter.com/6LIpiWGkKg — Mohsin shaikh 🇮🇳 (@mohsinofficail) February 16, 2023 -
పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..!
Prithvi Shaw selfie controversy: సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాపై కొంతమంది దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పృథ్వీ షా స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సప్న గిల్‌తో పాటు మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సప్నా గిల్ తరఫున న్యాయవాది కీలక ఆరోపణలు చేశారు. పృథ్వీ షా మధ్యం మత్తులో బ్యాట్‌తో సప్నా గిల్‌పై దాడి చేశాడని ఆరోపించారు. గిల్ తరపున న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫైవ్ స్టార్ హోటల్లో.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ పృథ్వీ షాతో సెల్ఫీ తీసుకోనేందుకు ఓ అభిమానిగా అతని వద్దకు వెళ్లింది. వారు అప్పటికే ఓ పార్టీలో బీజీబీజీగా ఉన్నారు. ఈ క్రమంలో పృథ్వీ షా మద్యం మత్తులో పక్కనే ఉన్న బ్యాట్‌తో ఆమెను కొట్టాడు. అయితే తర్వాత రోజు ఆమెపైనే తిరిగి కేసు పెట్టాడు. ఇప్పుడు మేము కూడా అతడిపై కేసు పెడతాము. అతడు మద్యం మత్తులో కారును నడిపాడు. అదే విధంగా అతడు ఒక బైక్ ను కూడా ఢీకొట్టాడు. మేము అతడిపై 354, 509 ,334 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలాని సూచించాం. గతంలో సప్నా గిల్‌కు, పృథ్వీ షాకు ఎటువంటి పరిచయం లేదు. కేవలం సెల్ఫీ దిగడానికి మాత్రమే ఆమె అతడి దగ్గరకు వెళ్లింది. మేము గిల్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు. చదదవండి: Attack On Prithvi Shaw: టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి Prithvi Shaw's friend & an eyewitness to the selfie incident, Ashish, speaks to @Shivani703. "Prithivi gave two selfies but after they (accused) tried to get too close, so he refused. Outside the hotel they shattered a car. Except that, there wasn't any violence," he says. pic.twitter.com/qFR8zVtN02 — TIMES NOW (@TimesNow) February 16, 2023 Prithvi Shaw Attacked In Mumbai By Some Drunk People. This Video Is Very Scary. Fans Need To Understand They Can't Misbehave With Any Celebrity. Prithvi Somehow Managed To Grab Baseball Bat From That Lady. This Lady Attacked Prithvi Shaw Car With Baseball Bat. pic.twitter.com/thtyECpE1w — Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) February 16, 2023 -
క్రికెటర్ పృథ్వీ షాపై దాడి
-
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి
Prithvi Shaw Attacked: టీమిండియా అప్‌కమింగ్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి జరిగింది. షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌పై ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ ఆవరణలో పలువురు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో షా ప్రయాణిస్తున్న కారును దుండగులు బేస్‌బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై షా స్నేహితుడు సురేంద్ర యాదవ్ సమీప ఓషివరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. 8 మందిపై పలు సెక్షన్ల (143, 148,149, 384, 437, 504, 506) కింద కేసులు నమోదు చేశారు. షా స్నేహితుడు సురేంద్ర యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిబ్రవరి 15న పృథ్వీ షా.. సురేంద్ర యాదవ్‌తో పాటు పలువురు స్నేహితులతో కలిసి ముంబైలోని శాంటా క్రూజ్ హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. షా హోటల్ అవరణలోకి ప్రవేశించగానే నిందితుల్లో ఇద్దరు వచ్చి సెల్ఫీలు ఆడగ్గా షా వారితో కలిసి ఫోటోలు దిగి హోటల్‌లోనికి ప్రవేశించేందుకు ముందుకు కదిలాడు. ఈలోపు మరో ఇద్దరు వచ్చి సెల్ఫీ దిగాలని షాపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు షా ఒప్పుకోకపోవడంతో వారు అతన్ని దిగ్బంధించే ప్రయత్నం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న షా స్నేహితుడు హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి జరుగుతున్న విషయాన్ని వివరించగా.. మేనేజ్మెంట్ నిందితులను హోటల్ బయటకు గెంటేసింది. దీంతో కోపోద్రేక్తులైన నిందితులు హోటల్ బయట కాపు కాచి షా ప్రయాణిస్తున బీఎండబ్ల్యూ కారుపై బేస్‌బాల్ బ్యాట్లతో దాడికి దిగారు. వెంటనే అలర్ట్ అయిన షా స్నేహితుడు.. అతన్ని మరో కారులోకి తరలించాడు. అయినప్పటికీ వదలని నిందితులు షా ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేసి లోటస్ పెట్రోల్ బంకు వద్ద మరోసారి అటకాయించారు. షా కారు వద్దకు ఓ యువతిని పంపిన నిందితులు 50000 నగదు ఇస్తే విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని.. లేకపోతే కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా ఓషివరా పీఎస్‌కు చేరుకున్నాడు. జరిగిన విషయంపై మాట్లాడేందుకు ఇష్టపడని షా స్నేహితుడితో పాటు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయం క్షణాల్లో దావణంలా వ్యాపించింది. ప్రస్తుతం షాపై దాడి జరిగిన విషయం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో దేశవాలీ టోర్నీల్లో పరగుల వరద పారించిన షా.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. వాస్తవానికి షా టీ20ల్లో కాకుండా టెస్ట్‌ల్లో స్థానం దక్కుతుందని అశించాడు. అయితే తలా తోక సెలెక్టర్లు షాను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటిన షా.. ఆ తర్వాత కొన్ని టెస్ట్‌లకే ఫామ్ కోల్పోయి ఉద్వాసన గురయ్యాడు. #PrithviShaw https://t.co/EXqoU6AgJO pic.twitter.com/3UfmJCAYwO — Suraj Ojha (@surajojhaa) February 16, 2023 -
వాలెంటైన్స్ డే సాక్షిగా బయటపడ్డ ఇద్దరు స్టార్ క్రికెటర్ల సీక్రెట్స్
క్రికెట్ ఫాలోవర్స్‌కు 2023 వాలెంటైన్స్ డే ప్రత్యేకంగా గుర్తుండిపోనుంది. ఈ రోజు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోగా.. టీమిండియా నవ యువ సంచలన క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా పర్సనల్ వ్యవహారాలు బయటపడ్డాయి. హార్ధిక్.. తన భార్య నటాశాను ఉదయ్‌పూర్‌లో మళ్లీ మనువాడగా.. శుభ్‌మన్ గిల్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ల ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది. గిల్ వాలెంటైన్స్ డే రోజు సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆధారంగా గిల్-సారాలు డేటింగ్ చేశారు/చేస్తున్నారని అభిమానులు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. పృథ్వీ షా విషయానికొస్తే.. పర్సనల్ లైఫ్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ ముంబై కుర్రోడు.. వాలెంటైన్స్ డే రోజు తన లవ్ లైఫ్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. మోడల్ కమ్ యాక్ట్రెస్ అయిన నిధి తపాడియాతో ప్రేమలో ఉన్నట్లు నిర్ధారించిన షా.. తన పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగురగొట్టాడు. ఈ ఫోటోలో షా-నిధి జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ ఫోటోనే హాట్‌గా ఉందనుకుంటే.. దీనికి షా పెట్టిన క్యాప్షన్ జనాలకు మరింత పిచ్చెకిస్తుంది. హ్యాపీ వాలంటైన్స్ డే వైఫీ అంటూ మోటు భాషలో షా పెట్టిన క్యాప్షన్ క్షణాల్లో దావణంలా వ్యాపించింది. దీంతో వెంటనే వాలెంటైన్స్ డే పోస్ట్‌ను డిలీట్ చేసిన షా.. మరో పోస్ట్ చేస్తూ.. ఆ ఫోటో పెట్టింది నేను కాదు, ఎవరో ఎడిట్ చేశారు, అసలు నిధి ఎవరో తనకు తెలియదన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. షా వాలెంటైన్స్ డే తతంగం నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. షా నిజంగా పెళ్లి చేసుకున్నాడా.. అసలు ఆ పోస్ట్ అతను పెట్టిందేనా.. అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఆట వల్ల పాపులర్ కాలేని షా.. ఎఫైర్‌తో హాట్ టాపిక్ ఆఫ్ ఇండియాగా మారిపోయాడు. కాగా, ఇటీవలికాలంలో దేశవాలీ టోర్నీల్లో పరగుల వరద పారించిన షా.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. వాస్తవానికి షా టీ20ల్లో కాకుండా టెస్ట్‌ల్లో స్థానం దక్కుతుందని అశించాడు. అయితే తలా తోక సెలెక్టర్లు షాను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటిన షా.. ఆ తర్వాత కొన్ని టెస్ట్‌లకే ఫామ్ కోల్పోయి ఉద్వాసన గురయ్యాడు. -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్‌కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్‌గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్‌ను అండర్-19 వరల్డ్‌కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
ఒహో.. చివరికి పృథ్వీని ఇలా కూల్ చేశారా
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మూడో టి20లో టీమిండియా న్యూజిలాండ్‌ను 168 పరుగుల భారీ తేడాతో ఓడించి టి20 చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శుబ్‌మన్ గిల్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు తోడు టీమిండియా బౌలర్లు సమిష్టి ప్రదర్శన కనబరిచడంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విషయం పక్కనబెడితే సిరీస్‌లో అన్యాయం ఎవరికైనా జరిగిందంటే అది పృథ్వీ షాకు. వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్‌ను ఆడించారే తప్ప ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పృథ్వీ షాకు కనీసం చాన్స్ కూడా ఇవ్వలేదు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికి దిష్టిబొమ్మలా అతన్ని బెంచ్‌కే పరిమితం చేశారు. కనీసం మూడో టి20లోనైనా పృథ్వీని ఆడిస్తారనుకుంటే అదీ జరగలేదు. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై బుధవారం ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. పాండ్యా ఆలోచన ఏంటో అర్థం కావడం లేదు.. టాలెంట్ ఉన్న పృథ్వీషాను తొక్కేస్తున్నారని.. ఫామ్‌లో లేకపోయినా ఇషాన్ కిషన్‌ను ఆడించడం ఏంటని.. ఒక్కచాన్స్ ఇస్తే కదా అతను ఆడేది లేనిది తెలిసేది.. చెత్త రాజకీయాల వల్ల ఇలా ఎంతో మంది క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడకుండానే వెళ్లిపోతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పాండ్యాకు తెలిసిందో ఏమో గానీ.. మ్యాచ్ విజయం తర్వాత అతను చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రోఫీ అందుకున్న పాండ్యా దానిని నేరుగా తీసుకెళ్లి పృథ్వీ షా చేతిలో పెట్టాడు. పైకి నవ్వుతున్నట్లు కనిపించినా.. పృథ్వీ షా ఈ చర్యతో లోలోపల షాక్‌కు గురయ్యే ఉంటాడు. రంజీల్లో రాణించి జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికి బెంచ్‌కే పరిమితం చేశారన్న కోపం పృథ్వీ షాలో ఏ మూలనో ఉండే ఉంటుంది. అయితే ఇది పసిగట్టిన పాండ్యా తెలివిగా అతని చేతికి ట్రోఫీని అందించి కూల్ చేయడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పాండ్యా తీరును కొందరు మెచ్చుకుంటే.. కొందరు మాత్రం తప్పుబట్టారు. ''పృథ్వీ షాను ఒక్కమ్యాచ్ ఆడించలేదన్న విమర్శలు రావొద్దన్న భయంతోనే ఈ పని చేసి ఉంటాడు..పాండ్యా నీ తెలివికి జోహార్లు.. ఒహో చివరికి పృథ్వీ షాను ఇలా కూల్ చేశారా'' అంటూ కామెంట్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. Captain @hardikpandya93 collects the @mastercardindia trophy from BCCI president Mr. Roger Binny & BCCI Honorary Secretary Mr. Jay Shah 👏👏 Congratulations to #TeamIndia who clinch the #INDvNZ T20I series 2️⃣-1️⃣ @JayShah pic.twitter.com/WLbCE417QU — BCCI (@BCCI) February 1, 2023 చదవండి: 'ఆ విషయాలు పెద్దగా పట్టించుకోను.. భవిష్యత్తుకు డోకా లేనట్లే' -
Ind Vs NZ: పృథ్వీ షాకు నో ఛాన్స్! ఓపెనర్లుగా గిల్- ఇషాన్ జోడీనే..
India vs New Zealand, 3rd T20I: టీమిండియా తరఫున బరిలోకి దిగేందుకు యువ ఓపెనర్ పృథ్వీ షా ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20 సందర్భంగా ఈ విధ్వంసకర బ్యాటర్ రీఎంట్రీ సాధ్యం కాకపోవచ్చని అంచనా వేశాడు. ఇషాన్- గిల్ జోడీనే మరోసారి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కాగా గత కొన్నాళ్లుగా దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న ముంబై బ్యాటర్ పృథ్వీ షా చాలా కాలం తర్వాత కివీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో భారత జట్టుకు ఎంపికయ్యాడు. రంజీల్లో రికార్డులు సృష్టించిన ఈ సంచలన ఆటగాడిని ఎట్టకేలకు సెలక్టర్లు కరుణించడంతో తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. టీ20లలో వాళ్లు విఫలమైనా అయితే, పృథ్వీ సమకాలీన క్రికెటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో చెలరేగిన శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్.. టీ20లలో సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20లలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. గిల్ వరుసగా 7, 11 పరుగులు చేయగా ఇషాన్ 4, 19 రన్స్ మాత్రమే చేశాడు. వీరిద్దరు విఫలమైన నేపథ్యంలో ఆఖరి టీ20లలోనైనా పృథ్వీకి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం.. ఇందుకు భిన్నంగా పృథ్వీకి ఇప్పుడు అవకాశం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డాడు. పృథ్వీని ఆడించొద్దు.. ఎందుకంటే ఇందుకు గల కారణాలను తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషిస్తూ.. ‘‘నాకు తెలిసి ఇషాన్ కిషన్- శుబ్‌మన్ గిల్ జోడీ కొనసాగుతుంది. పృథ్వీ షా వేచిచూడాల్సిందే! అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పృథ్వీ షాను ఆడించారనుకోండి.. అతడు రన్స్ స్కోరు చేయొచ్చు లేదంటే విఫలం కావొచ్చు. ఒకవేళ అనుకున్నట్లు రాణిస్తే బాగుంటుంది. లేదంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగానే పృథ్వీ రాణించకపోతే.. ఒక్క మ్యాచ్‌ను బట్టి అతడి ఆట తీరును జడ్జ్ చేస్తారా? ఒకే ఒక్క మ్యాచ్‌లో.. అది కూడా సిరీస్‌లో ఆఖరిదైన నిర్ణయాత్మక టీ20లో అవకాశం ఇచ్చి పరీక్ష పెట్టం సరికాదు. వాళ్లకు మరిన్ని ఛాన్స్‌లు అంతేకాదు.. గిల్- కిషన్ జోడీని కూడా ఇప్పుడే విడదీయడం కరెక్ట్ కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. తమను తాము నిరూపించుకుంటే వాళ్లు దీర్ఘకాలం ఆడగలుగుతారు. లేదంటే లేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ విజేతను తేల్చే బుధవారం నాటి మూడో టీ20కి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. చదవండి: Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’ Virushka With Vamika: ప్రకృతి ఒడిలో.. వామికాను ఆటలాడిస్తూ.. విరుష్క ఫొటోలు వైరల్ పృథ్వీ షా చేతికి మైక్ ఇచ్చిన ద్రవిడ్.. నవ్వాపుకొన్న గిల్! వీడియో చూశారా? -
Ind Vs NZ: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి!
India vs New Zealand, 3rd T20I- Predicted Playing XI: టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని హార్దిక్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. 1955 నుంచి ఏ ఫార్మాట్లో కూడా భారత గడ్డపై సిరీస్ గెలవలేకపోయిన కివీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య బుధవారం జరుగనున్న మూడో టీ20 మరింత రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో భారత తుది జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ వద్దు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్లో మరింత రాటుదేలాల్సి ఉందన్న వసీం.. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యజువేంద్ర చహల్‌నే మూడో టీ20లోనూ కొనసాగించాలని సూచించాడు. అదే విధంగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను తప్పించాలని.. అతడి స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘న్యూజిలాండ్ బ్యాటర్లు.. స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. టీమిండియాకు చహల్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ అందుబాటులో ఉన్నపుడు తప్పక అతడి సేవలు వినియోగించుకోవాలి. గతంలో నేను.. చెప్పినట్లుగానే ఉమ్రాన్ మాలిక్ ఇంకా పొట్టి ఫార్మాట్లో పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నాడు. పేస్‌లో వైవిధ్యం చూపిస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలడు. కాబట్టి మూడో టీ20లోనూ చహల్‌ను కొనసాగించాలి. అతడే బెటర్ ఆప్షన్’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. పృథ్వీ షాను తీసుకురండి అదే విధంగా.. ‘‘టీమిండియా ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. శుబ్‌మన్ గిల్ స్థానంలో పృథ్వీ షాను తీసుకురావాలి. టీ20 క్రికెట్లోనూ అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠిల విషయంలో మాత్రం నాకెలాంటి ఆందోళనా లేదు’’ అని జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్‌తో వన్డేలో సిరీస్‌లో డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగిన గిల్.. టీ20లలో మాత్రం జోరు చూపించలేకపోతున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో కేవలం 7, 11 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న పృథ్వీ షా చాలా కాలం తర్వాత టీమిండియాకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టీ20 తుది జట్ల అంచనా భారత్: శుబ్‌మన్ గిల్/పృథ్వీ షా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్ న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఇష్ సోది, జాకోబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లేయిర్ టిక్నర్. చదవండి: Nitish Rana: నెగెటివ్ ట్వీట్‌ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు KL Rahul: పెళ్లి వేడుక ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది -
పృథ్వీ చేతికి మైక్ ఇచ్చిన ద్రవిడ్.. నవ్వాపుకొన్న గిల్! వీడియో చూశారా?
U19 Women T20 WC- Team India: మహిళా క్రికెట్లో అండర్ 19 స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ట్రోఫీని కైవసం చేసుకుని నీరాజనాలు అందుకుంటోంది టీమిండియా. షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా ప్లేయర్లు ఈ ఘనత సాధించి చరిత్రలో తమ పేర్లను పదిలం చేసుకున్నారు. భారత అమ్మాయిలు ఇంతవరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదన్న అపవాదును తుడిచివేస్తూ రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి విజయం తర్వాత షఫాలీ బృందంపై సర్వత్రా ప్రశంసల వర్షం కొనసాగుతోంది. అయితే, వీటిలో బీసీసీఐ షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రెండో మ్యాచ్ సందర్భంగా.. ప్రపంచకప్ గెలిచిన మహిళా జట్టుకు పురుషుల టీమ్ శుభాభినందనలు తెలిపింది. ఇందులో భాగంగా.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ తొలుత విష్ చేసి టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా చేతికి మైక్ అందించాడు. నవ్వాపుకొన్న గిల్ ఈ క్రమంలో పృథ్వీ విష్ చేస్తుండగా.. జట్టు మొత్తం అతడిని తదేకంగా చూస్తూ నిల్చుని ఉన్నారు. ఇక మరో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మరీ నవ్వాపుకొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘పాత రోజుల్లో ఏమేం చిలిపి పనులు చేశారో.. అవన్నీ గుర్తొచ్చినట్లున్నాయి! అందుకేనేమో ముసిముసిగా నవ్వుతున్నాడు. ఇద్దరు కెప్టెన్లు.. కోచ్ ఒక్కడే అప్పుడు తనకు డిప్యూటీగా ఉన్న గిల్‌తో ఓపెనింగ్ స్థానం కోసం ఇప్పుడు పృథ్వీ పోటీపడుతున్నాడు! ఏమిటో!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా పృథ్వీ షా టీమిండియాకు 2018లో అండర్-19 వరల్డ్‌కప్ అందించాడు. అప్పుడు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక ప్రస్తుత జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కూడా అండర్-19 జట్టుకు సారథ్యం వహించినవాడే! అయితే, అతడి నేతృత్వంలోని టీమిండియా 2016 ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ ద్రవిడ్ ఈ జూనియర్ టీమ్‌లకు కోచ్‌గా ఉండటం విశేషం. చదవండి: T20 WC: మరో మిథాలీగా ఎదగాలని ఆ తండ్రి ఆశ.. ‘దంగల్’లో అమీర్‌ఖాన్‌లా రామిరెడ్డి! A special message from Lucknow for India's ICC Under-19 Women's T20 World Cup-winning team 🙌 🙌#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/g804UTh3WB — BCCI (@BCCI) January 29, 2023 -
పృథ్వీ షా లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్ పడిందా!
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్ పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పృథ్వీ షా నిధి తపాడియా అనే అమ్మాయితో లవ్‌లో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు తమ రిలేషన్‌షిప్‌ను బ్రేక్ చేసుకున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఇటీవలే నిధి తపాడియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకుంది. పంజాబీ నేపథ్యంలో ఉన్న బ్రేకప్ పాటను షేర్ చేసుకుంది. ఆ తర్వాత పృథ్వీ షా, నిధి తపాడియాలు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడం బ్రేకప్ వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇక నిధి తపాడియా మోడల్, నటిగా రాణిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 108కె ఫాలోవర్లు ఉన్నారు. నిధి తపాడియా స్వస్థలం మహారాష్ట్రలోని నాసిక్. కాగా ఇటీవలే ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ పార్టీని గ్రాండ్‌గా జరుపుకొన్నారు. పృథ్వీ షా రంజీల్లో 300 పరుగులు చేసిన సమయంలో కూడా నిధి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతని వీడియోను షేర్ చేసింది. ఈ ఇద్దరు ఇలా తమ లవ్‌ను బ్రేక్ చేసుకోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అంతకుముందు పృథ్వీ షా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్ తో కూడా సన్నిహితంగా మెలిగాడు. ఇద్దరు కలిసి చాలా సార్లు పార్టీలకు, పబ్‌లకు వెళ్లారు. పృథ్వీ షా ప్రేమలో ఉన్నాడని తెలిసేలోపే ఇద్దరి మధ్య రిలేషిన్షిప్కు బ్రేక్ పడింది. ఇక పృథ్వీ షా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో ఆడుతున్నాడు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చినప్పటికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కడం లేదు.మూడో టి20కి వరుసగా విఫలం అవుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సహా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsxhmemewala🔵 (@harsxhmemewala) చదవండి: బట్లర్‌కు ఇదేమి కొత్త కాదు.. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాలో మూడు మార్పులు..?
IND VS NZ 3rd T20: ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దాదాపు ఒకే జట్టుతో (చహల్ మినహాయించి) బరిలోకి దిగిన భారత్.. మూడో టీ20 కోసం మూడు మార్పులు చేయనుందని సమాచారం. రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పాటు బౌలింగ్ విభాగంలో మరో కీలక మార్పు చేయాలన్నది జట్టు యాజమాన్యం యోచనగా తెలుస్తోంది. శుభ్‌మన్, ఇషాన్‌ల స్థానాల్లో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మ.. అలాగే చహల్ లేదా కుల్దీప్ స్థానాల్లో ముకేశ్ కుమార్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తొలుత బ్యాటింగ్‌కు, ఆతర్వాత పేసర్లకు సహకరించే అస్కారం ఉండటంతో స్పిన్నర్ స్థానంలో అదనపు పేసర్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ముకేశ్ కుమార్‌కు ఈ సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో మూడో టీ20లో తప్పక ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే గిల్, ఇషాన్‌లు వరుసగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని నేపథ్యంలో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మలకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నది టీమ్ ప్లాన్‌గా తెలుస్తోంది. మరోవైపు, సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో మేనేజ్మెంట్ పెద్దగా ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చన్న టాక్ కూడా నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ తుది జట్టులో ఎవరెవరు ఉంటారో తేలాలంటే మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి (తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో మ్యాచ్‌లో భారత్ గెలిచాయి) సిరీస్‌లో సమవుజ్జీలుగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వన్డేల్లో డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో హిట్ అయిన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఫట్ అయ్యాడు. -
గిల్ టీ20లకు పనికిరాడు.. అతడికి అవకాశం ఇవ్వండి! అద్భుతాలు సృష్టిస్తాడు
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో హార్దిక్ సేన సమం చేసింది. ఇక ఫిబ్రవరి1న సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో ఆహ్మదాబాద్ వేదికగా తాడోపేడో తెల్చుకోవడానికి బారత్-కివీస్ జట్లు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కివీస్‌తో మూడో టీ20కు శుబ్‌మన్ గిల్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను జట్టులో తీసుకురావాలని కనేరియా సూచించాడు. కాగా టెస్టుల్లో, వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న గిల్.. టీ20ల్లో మాత్రం దారుణంగా విఫలమవతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గిల్ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. అతడు అద్భుతాలు సృష్టిస్తాడు.. ఈ క్రమంలో కనేరియా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ఈ సిరీస్ చివరి దశకు చేరింది. కీలకమైన మూడో మ్యాచ్‌కు గిల్‌ను పక్కన పెడితే బాగుంటుంది. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడి ఆట తీరు ఎంటో చూశం. గిల్ టీ20లకు సెట్ కాడు. అలా అని గిల్‌ను నేను తక్కువ చేసి మాట్లాడనట్లు కాదు. గిల్ కూడా అద్భుతమైన ఆటగాడు. కానీ టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. కాబట్టి అతడి స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను ఓపెనర్‌గా పంపండి. అతడు అద్భుతమైన ఆటగాడు. పవర్ ప్లే అటాకింగ్ గేమ్ ఆడగలడు. పృథ్వీకి ఎక్కువగా అవకాశాలు ఇస్తే.. అద్భుతాలు సృష్టిస్తాడు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా.. IND vs NZ: వన్డేల్లో హిట్.. టీ20ల్లో ఫట్! గిల్‌కు ఏమైంది? ఇకనైనా అతడిని.. -
వన్డేల్లో హిట్.. టీ20ల్లో ఫట్! గిల్‌కు ఏమైంది?
Shubman Gill In T20Is: టెస్టు, వన్డేల్లో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ .. టీ20ల్లో మాత్రం తనదైన మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గిల్ 15.2 సగటుతో కేవలం 72 పరుగులు మాత్రమే సాధించాడు. అందులో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 46 పరుగులు. గతేడాది ఆఖర్లో శ్రీలంకపై టీ20ల్లో గిల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మారని తీరు తొలి మ్యాచ్‌లోనే శుబ్‌మన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ నిరాశపరిచాడు. ఇక తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో భాగంగా ఉన్న గిల్ అదే తీరును కొనసాగిస్తున్నాడు. సెట్ అవ్వడు! ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన గిల్ కేవలం 18 పరుగులు చేశాడు. రాంఛీ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 పరుగులు చేసిన శుబ్‌మన్.. లక్నోలో జరిగిన రెండో టీ20లో 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గిల్ కేవలం టెస్టులకు, వన్డేలకు మాత్రమే సెట్ అవుతాడని, టీ20లకు సరిపోడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పృథ్వీ షాను తీసుకురండి మరి కొంత మంది టీ20ల్లో గిల్ స్థానంలో మరో యువ ఓపెనర్ పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మూడో టీ20కు గిల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో పృథ్వీ షా తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా న్యూజిలాండ్ భారత మధ్య కీలకమైన మూడో టీ20 ఫిబ్రవరి1న జరగనుంది. చదవండి: ENG vs SA 2nd ODI: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సొంతం -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు..? అర్షదీప్‌తో పాటు..!
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 29) జరుగనున్న రెండో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. తొలి టీ20లో పర్యాటక జట్టు చేతిలో ఎదురైన పరాభవం నేపథ్యంలో సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలవాలంటే టీమిండియా నేటి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టులో పలు మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాంచీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని జట్టు ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్‌పై వేటు దాదాపుగా ఖరారైంది. అతని స్థానంలో బీహార్ పేసర్ ముకేశ్ కుమార్ అరంగేట్రం చేయడం లంఛనమేనని తెలుస్తోంది. ఇకపోతే, నేటి మ్యాచ్‌లో టీమిండియాలో మరో మార్పు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. రాహుల్ త్రిపాఠి స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే జరిగితే గిల్‌తో పాటు ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారుతుంది. లెఫ్ అండ్ రైట్ కాంబినేషన్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇషాన్ కిషన్.. లేకుంటే పృథ్వీ షా గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. ఈ రెండు మార్పులు మినహా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టే యధాతథంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంచ్‌పై ఆప్షన్స్ లేకపోవడం, అలాగే తొలి మ్యాచ్‌లో అందరూ తమతమ పాత్రలకు కొద్దో గొప్పో న్యాయం చేయడంతో తుది జట్టులో ఇంతకుమించి మార్పులకు ఆస్కారం ఉండకపోవచ్చు. రెండో టీ20కి భారత తుది జట్టు (అంచనా).. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్ -
ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్‌ను తీసుకోండి! పృథ్వీ షా కంటే బెటర్!
India vs New Zealand T20 Series: ‘‘పేస్‌లో వైవిధ్యం చూపనంత వరకు ఉమ్రాన్ మాలిక్ ఈ ఫార్మాట్లో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో కూడా తను కట్టర్లు వేయాలని భావించినట్లు అనిపించింది. కానీ అలా చేయలేకపోయాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. న్యూజిలాండ్‌తో రాంచిలో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఒకే ఒక్క ఓవర్ వేసే అవకాశం వచ్చింది. దానిని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్. 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్‌ను తప్పించండి ఈ నేపథ్యంలో వసీం జాఫర్.. జట్టులో ఉమ్రాన్ మాలిక్ స్థానం గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. పేస్‌లో వైవిధ్యం చూపలేకపోతున్నాడని, రెండో టీ20లో తనను తప్పించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. అతడి స్థానంలో ఎక్స్ట్రా బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్రాన్‌తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. శివం మావికి కూడా 14 ఓవర్ వరకు బాల్ ఇవ్వలేదు. ఇద్దరు బౌలర్లతో కలిపి కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయిస్తున్నపుడు ఎక్స్ట్రా బ్యాటర్‌ను తీసుకోవచ్చు కదా! అతడే బెటర్ ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్ శర్మ లేదంటే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి. ఇక నా అభిప్రాయం ప్రకారం.. వీరిద్దరిలో జితేశ్ బెటర్ ఆప్షన్. లోయర్ ఆర్డర్లో చక్కగా బ్యాటింగ్ చేయగలడు ’’అని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో సంజూ శాంసన్ స్థానంలో విదర్భ బ్యాటర్ జితేశ్ శర్మకు తొలిసారి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కూ ఎంపికైన 29 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఇంత వరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇక రాంచి మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా లక్నోలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. చదవండి: Umpire Marais Erasmus: బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? డబుల్ సెంచరీ ఓకే! టీ20లలో మరీ ఇంత ఘోరమా? అయినా ఇదెక్కడి న్యాయం