ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7 పరుగులు చేసిన పృథ్వీ పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా డకౌట్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్ బంతులను ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు.
ఫుట్‌వర్క్ మీద ఏమాత్రం దృష్టి పెట్టని పృథ్వీ బౌల్ట్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతిని గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నాడు. కీపర్ సంజూ శాంసన్ ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు.
ఇదిలా ఉంటే మ్యాచ్‌లో పృథ్వీ షా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ ఇంపాక్ట్‌గా వచ్చి డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే సీజన్‌లో పృథ్వీ షా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి డకౌట్ అయిన ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. బట్లర్ 79, యశస్వి జైశ్వాల్ 60, హెట్‌మైర్ 39 నాటౌట్ రాణించారు.
How about THAT for a start! 🤯
— IndianPremierLeague (@IPL) April 8, 2023
WHAT. A. CATCH from the #RR skipper ⚡️⚡️#DC lose Impact Player Prithvi Shaw and Manish Pandey in the first over!
Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/rpOzCFrWdQ
Comments
Please login to add a commentAdd a comment