Impact Player
-
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ రూల్‌ను సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా ఈ రూల్‌పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు రవిశాస్త్రి మద్దతుగా నిలిచాడు. ఈ రూల్ కారణంగానే మ్యాచ్‌లు ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయని రవిశాస్త్రి తెలిపాడు. "నా వరకు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చాలా బాగుంది. కాలంతో పాటు ఆటలో కూడా మార్పులు ఉండాలి. ఇతర క్రీడలలో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి. ఈ రూల్ వల్ల మ్యాచ్‌లు చాలా క్లోజ్‌గా జరుగుతున్నాయి. గత సీజన్లో కూడా చాలా మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఇంపాక్ట్ రూల్ ఐపీఎల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చింది.ఎప్పుడైనా కొత్త రూల్స్ వస్తే, ఆ రూల్స్‌ను వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ 200, 190 స్కోర్లను కూడా ఛేజ్ చేస్తున్న వైనం చూసి.. వ్యతిరేకించిన వారే ఇంపాక్ట్ రూల్‌పై పునరాలోచిన పునరాలోచిస్తున్నారని" అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు. -
మరో క్రికెట్ లీగ్‌కు విస్తరించనున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
ఐపీఎల్లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన త్వరలో మరో పాపులర్ క్రికెట్ లీగ్‌కు విస్తరించనుందని తెలుస్తుంది. 2023 ఐపీఎల్ సీజన్లో తొలిసారి పరిచయం చేయబడిన ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2025 ఎడిషన్ నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ రూల్‌కు ఆమోదం లభిస్తే ఐపీఎల్ తరహా మెరుపులు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ చూసే అవకాశం ఉంటుంది.వాస్తవానికి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గతేడాదే అమల్లోకి రావాల్సి ఉండింది. అయితే ఈ రూల్ గురించి చర్చ జరిగే సమయానికి అన్ని ఫ్రాంచైజీలు జట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లో ఉంటే జట్ల ఎంపిక వేరేలా ఉంటుంది కాబట్టి అన్ని ఫ్రాంచైజీలు అప్పట్లో దీనికి నో చెప్పాయి. ఈ రూల్ వల్ల ఐపీఎల్ రక్తి కడుతుండటంతో తాజాగా సౌతాఫ్రికా లీగ్ దీన్ని పునఃపరిశీలనలోకి తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేస్తుంది.ఇదిలా ఉంటే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అదనపు ఆటగాడిని ఆడించొచ్చనే మాట తప్పితే పెద్దగా ప్రయోజనాలేమీ లేకపోగా చాలా మైనస్‌లు ఉన్నాయి. ఈ రూల్ వల్ల సంప్రదాయ క్రికెట్ చచ్చిపోతుందని చాలా మంది దిగ్గజాలు ఆరోపిస్తున్నారు. రూల్ వల్ల ఆల్‌రౌండర్ల భవిష్యత్తు ప్రశ్నార్దకంగా మారుతుందని అంటున్నారు. ఈ రూల్ అమల్లో ఉంటే బ్యాటర్ లేదా బౌలర్‌వైపే మొగ్గు చూపుతారు కాని ఆల్రౌండర్లను పట్టించుకోరని వాదిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్ కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆటను రక్తి కట్టించడం కోసం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఐపీఎల్లో అమలు చేస్తుంటే దీని ప్రభావం జాతీయ జట్టు ఆల్రౌండర్లపై పడుతుందని అన్నాడు. శివమ్ దూబే లాంటి ఆల్‌రౌండర్లు కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతున్నారని వాపోయాడు. జాతీయ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా ప్రమాదమైన నిబంధన అని తెలిపాడు.కాగా, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమల్లో అంటే రెగ్యులర్ క్రికెట్‌కు భిన్నంగా 11 మందితో కాకుండా 12 మంది ఆటగాళ్లను బరిలోకి దించే అవకాశం ఉంటుంది. అవసరాల దృష్ట్యా స్పెషలిస్ట్ బ్యాటర్లో లేదా స్పెషలిస్ట్ బౌలర్లో జట్లు బరిలోకి దించుతాయి. దీని వల్ల ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుంది. వీరికి పెద్దగా అవకాశాలు రావు. -
తెలివిగా వ్యవహరిస్తున్న హార్దిక్.. పాపం శివం దూబే! నిజంగా నష్టమేనా?
‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన నాకెందుకో అంతగా నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా చూస్తే ఇది బాగానే ఉంటుంది. కానీ.. క్రికెటింగ్ కోణంలో చూస్తే.. సరికాదనే అనిపిస్తోంది. ఇక్కడ 12 మందితో కాదు 11 మందితోనే ఆడాలి.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వాషింగ్టన్ సుందర్, శివం దూబే వంటి ఆల్రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీమిండియాకు ఇదైతే శుభసూచకం కాదు’’- రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఓపెనర్. ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు నేను అనుకూలం కాదు. ఈ నిబంధన వల్ల జట్లు నిఖార్సైన బ్యాటర్లు లేదంటే బౌలర్ల సేవలనే ఉపయోగించుకుంటాయి. ఆల్రౌండర్లను ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటి నిబంధనలు రూపొందించే వాళ్లు కేవలం బ్యాటింగ్ ఒక్కటే మ్యాచ్ దిశానిర్దేశాన్ని మారుస్తుందని అనుకుంటారేమో(నవ్వులు).. ఈ రూల్ వల్ల బౌలర్లకు తిప్పలు తప్పవు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్టులో అదనపు సభ్యుడు చేరతాడు. ఒకవేళ ఒక జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉంటే వాళ్లు బ్యాటర్‌ను.. బౌలింగ్ వీక్‌గా ఉంటే బౌలర్‌ను తెచ్చుకుంటారు. అందుకే బ్యాటర్ వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలుపెడతాడు. గత రెండేళ్లుగా గమనిస్తూనే ఉన్నా.. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు ఉంటారు కాబట్టి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తారు’’- అక్షర్ పటేల్, టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్. మొన్న రోహిత్ శర్మ.. ఇప్పుడు అక్షర్ పటేల్ ఇలా చాలా మంది ఐపీఎల్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్రౌండర్లకు నష్టం చేకూరుస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు. ఏమిటీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన? ఐపీఎల్-2023కి ముందు నిర్వాహకులు ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేయడానికి జట్టులోకి వచ్చే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్. ఈ నిబంధన ప్రకారం ఇండియన్ ప్లేయర్‌ను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. టాస్ సమయంలో కెప్టెన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లుగా నలుగురి పేర్లను నామినేట్ చేయాలి. అందులో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవచ్చు? ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే ఓవర్ పూర్తైన తర్వాత.. లేదంటే వికెట్ పడిన అనంతరం.. లేదా బ్యాటర్ రిటైర్ అయినపుడు కెప్టెన్ తమ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించవచ్చు. ఒక బౌలింగ్ చేస్తున్న జట్టు ఓవర్ మధ్యలోనే(వికెట్ పడ్డా/బ్యాటర్ రిటైర్ అయినా) ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకువస్తే ఆ వ్యక్తిని మిగిలిన ఓవర్ పూర్తయ్యేదాకా బౌలింగ్ చేసేందుకు అనుమతించరు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత.. ఎవరి స్థానంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారో.. సదరు ఆటగాడు మిగిలిన మ్యాచ్‌కు దూరమవుతాడు. కనీసం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఉండే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ విదేశీ ప్లేయర్‌ని తీసుకుంటే? నిబంధనల ప్రకారం తుదిజట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. కాబట్టి అప్పటికే జట్టులో నలుగురూ ఉన్నారంటే కచ్చితంగా ఇండియన్ ప్లేయర్‌నే ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెచ్చుకోవాలి. అయితే, టాస్ సమయంలోనే నలుగురు సబ్ట్యూట్లలో ఒకరిగా విదేశీ ప్లేయర్‌ను నామినేట్ చేయాలి. జట్టులో ఎంతమంది? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా జట్టులో 11 మంది కంటే ఎక్కువయ్యే అవకాశం లేదు. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. బౌలర్ స్థానంలో బౌలర్‌నే ఎక్కువగా సబ్ట్యూట్గా ఉపయోగించుకుంటారు. ఒకవేళ బౌలింగ్ టీమ్ గనుక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలర్‌ను తీసుకువస్తే.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయవచ్చు. లేదంటే పవర్ ప్లే లేదా డెత్ ఓవర్ల స్పెషలిస్టు సేవలను వారి ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. శివం దూబేకు నో ఛాన్స్! ముందే సర్దుకున్న హార్దిక్ అయితే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన ఆల్‌రౌండర్లు నష్టపోతున్నారనేది చర్చ. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెప్పినట్లు బ్యాటింగ్ టీమ్ స్పెషలిస్టు బ్యాటర్‌ను.. బౌలింగ్ టీమ్ స్పెషలిస్టు బౌలర్‌ను తెచ్చుకుంటుంది. ఒకవేళ ఆల్రౌండర్లకు ఛాన్స్ ఇచ్చినా వాళ్లు ఏదో ఒక సేవకే పరిమితం అవుతారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకుంటోంది. అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తుండగా.. బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీకి ముందు ఇలా జరగడం ఒక విధంగా అతడికి నష్టం చేకూరుస్తోంది. ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం హార్దిక్ పాండ్యాతో పోటీ పడుతున్న దూబే.. బౌలింగ్ చేయనట్లయితే సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపరు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టాడేమో మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టి తన ఆల్‌రౌండ్ నైపుణ్యాలను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చూసుకుంటే కష్టమే ఆల్రౌండర్లకు జరుగుతున్న నష్టం గురించి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు కాబట్టి తుదిజట్టు కూర్పు కాస్త కష్టంగానే మారుతుంది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఫామ్(బ్యాటింగ్/బౌలింగ్) కోల్పోయిన ఆల్‌రౌండర్‌కు జాతీయ జట్టు తరఫున ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే! -
ఆ రూల్ వల్ల భారత ఆల్రౌండర్లకు చాలా నష్టపోతున్నారు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధన వల్ల భారత ఆల్‌రౌండర్లు చాలా నష్టపోతున్నారని వాపోయాడు. వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే లాంటి వారు తమ బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి వీలు లేకుండా పోయిందని అన్నాడు. ఓవరాల్‌గా ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనకు తాను అభిమానిని కాదని పేర్కొన్నాడు. వినోదం కోసం నిబంధనలను ఇంతలా సడలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన ఓ పోడ్కాస్ట్లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ పోడ్కాస్ట్లో రోహిత్ క్రికెటర్లకు సంబంధించిన చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను 2023 సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల అన్ని జట్లు అవసరానికి అనుగుణంగా ఓ అదనపు ప్లేయర్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తొలుత బ్యాటింగ్ చేసే జట్టు అదనంగా ఓ బ్యాటర్‌ను వినియోగించుకుంటుంది. అలాగే తొలుత బౌలింగ్ చేసే జట్టుకు అదనంగా ఓ బౌలర్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే 11 మంది ఆడాల్సిన క్రికెట్ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల 12 మంది క్రికెట్‌గా మారింది. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు కేవలం బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నారు. దీని వల్ల వారిని ఆల్రౌండర్లుగా పరిగణించలేని పరిస్థితి ఏర్పడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో ఆల్రౌండర్లకు డిమాండ్ ఉంటుంది. అలాంటప్పుడు వీరు ఏదో ఒక విభాగానికే పరిమితమైతే వారి కెరీర్లు ఇరుకున పడే ప్రమాదం ఉంది. -
క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై ఓవర్‌కు..!
దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ కొత్త రూల్‌ను అమల్లోకి తేనుంది. త్వరలో ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఓవర్‌కు రెండు బౌన్సర్లకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు టీ20ల్లో ఓవర్‌కు ఒకే బౌన్సర్ నిబంధన అమల్లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య పోటీని బ్యాలెన్స్ చేసేందుకు ఈ రూల్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ రూల్‌తో పాటు మరో నిబంధనను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమల్లోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన సక్సెస్ కావడంతో ఆ రూల్‌ను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ముస్తాక్ అలీ టోర్నీలో రెండు బౌన్సర్లు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ సక్సెస్ అయితే మిగిలిన దేశవాళీ టోర్నీల్లోనూ ఈ రెండు రూల్స్‌ను అమల్లోకి తెస్తారని సమాచారం. టీ20 ఫార్మాట్లో రెండు బౌన్సర్ల నిబంధన అమల్లోకి తెస్తే బౌలర్ల ప్రభావం పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే, 2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 38 టీమ్‌లు తలపడనున్నాయి. -
ఇంపాక్ట్ ప్లేయర్స్ దునేస్తున్నారు...
-
IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జరిగిందిదే! అందుకే ఇలా!
IPL 2023- Impact Player- ముంబై: గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్–2023 మరింత ఆసక్తికరంగా సాగుతోందని భారత మాజీ క్రికెటర్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా లీగ్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఎమ్మెస్కే ఈ ఐపీఎల్ సీజన్లో స్టార్ స్పోర్ట్స్–తెలుగు చానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘స్టార్’ కార్యక్రమంలో ఆయన తాజా సీజన్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘సగం టోర్నమెంట్ ముగిసేసరికే ఈ ఐపీఎల్ గత సీజన్ల రికార్డులను అధిగమించింది. 200కు పైగా స్కోర్లు పెద్ద సంఖ్యలో నమోదు కాగా, సిక్సర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇది లీగ్ ఎంతగా విజయవంతం అయిందో చూపిస్తోంది’ అని ప్రసాద్ అన్నారు. సానుకూలమే.. అందుకే ఇలా కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అంశం మంచి ప్రభావం చూపిస్తోందని ప్రసామద్ చెప్పారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఈ సీజన్లో ఐపీఎల్ టీమ్ హోమ్ అడ్వాంటేజ్ పోయింది. ప్రత్యర్థి జట్టు వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కలుగుతోంది. అందుకే చాలా మ్యాచ్‌లలో సొంత మైదానాల్లో జట్లు ఓడిపోతున్నాయి’ అని ఎమ్మెస్కే విశ్లేషించారు. యువ ఆటగాళ్లు అదుర్స్ ప్రధానంగా భారత యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనలు ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశమని ఈ భారత మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత క్రికెట్‌కు మేలు చేసే అంశం. తిలక్‌వర్మ, సాయిసుదర్శన్, రింకూ సింగ్, యశస్వి, ధ్రువ్ జురేల్ తమ ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం సానుకూలాంశం.’ అని ప్రసాద్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సద్వినియోగం చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఆయుష్ బదోనిని, బెంగళూరు హర్షల్ పటేల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా దింపాయి. చదవండి: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్ -
ఇంపాక్ట్ ప్లేయర్ల ఇంపాక్ట్ ఎంత.. ఏ జట్టు ఎక్కువ లాభపడింది..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఆప్షన్ ప్రస్తుత ఎడిషన్ (2023) నుంచే మొదలైన విషయం తెలిసిందే. ఈ సరికొత్త నిబంధన ప్రకారం టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల జాబితాను ప్రకటిస్తారు. వీరిలో ఒకరిని సంబంధిత జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వినియోగించుకుంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు, వికెట్ పడిన తర్వాత, బ్యాటర్ రిటైర్ అయిన తర్వాత, ఓవర్ పూర్తయిన సందర్భాల్లో పరిచయం చేయవచ్చు. ప్రస్తుత సీజన్లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో అన్ని జట్లు ఈ అప్షన్‌ను విజయవంతంగా వినియోగించుకున్నాయి. లీగ్‌లో మున్ముందు అన్ని జట్లు ఈ ఆప్షన్‌ను ఇంకా బెటర్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. లీగ్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్‌ను సక్సెసఫుల్గా వాడుకుందని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ సుయాశ్ శర్మ స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించి, సక్సెస్ సాధించింది. ఆ మ్యాచ్‌లో అయ్యర్ 40 బంతుల్లో 83 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వివిధ జట్లు వినియోగించుకున్న ఇంపాక్ట్ ప్లేయర్ల వివరాలు.. గుజరాత్ వర్సెస్ సీఎస్కే: అంబటి రాయుడు స్థానంలో తుషార్ దేశ్‌పాండే, కేన్ విలియమ్సన్ స్థానంలో సాయి సుదర్శన్ పంజాబ్ వర్సెస్ కేకేఆర్: వరుణ్ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్ అయ్యర్, భానుక రాజపక్ష స్థానంలో రిషి ధవన్ లక్నో వర్సెస్ డీసీ: ఆయుష్ బదోని స్థానంలో కృష్ణప్ప గౌతమ్, ఖలీల్ అహ్మద్ స్థానంలో అమాన్ ఖాన్ సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్: ఫజల్హక్ ఫారూఖీ స్థానంలో అబ్దుల్ సమద్, యశస్వి జైస్వాల్ స్థానంలో నవ్‌దీప్ సైనీ ఆర్సీబీ వర్సెస్ ముంబై: సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బెహ్రెన్‌డార్ఫ్ సీఎస్కే వర్సెస్ లక్నో: ఆవేశ్ ఖాన్ స్థానంలో బదోని, రాయుడు స్థానంలో తుషార్ దేశ్‌పాండే ఢిల్లీ వర్సెస్ గుజరాత్: సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో ఖలీల్‌అహ్మద్, జాషువ లిటిల్ ప్లేస్‌లో విజయ్ శంకర్ రాజస్థాన్ వర్సెస్ పంజాబ్: చహల్ ప్లేస్‌లో దృవ్ జురెల్, ప్రభ్‌సిమ్రన్ స్థానంలో రిషి ధవన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: వెంకటేశ్ అయ్యర్ స్థానంలో సుయాశ్ శర్మ, సిరాజ్ప్లేస్లో అనూజ్ రావత్ లక్నో వర్సెస్ సన్‌రైజర్స్: రాహుల్ త్రిపాఠి ప్లేస్‌లో ఫజల్హక్ ఫారూకీ, అమిత్ మిశ్రా స్థానంలో బదోని రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ షా, బట్లర్ ప్లేస్‌లో మురుగన్ అశ్విన్ ముంబై వర్సెస్ సీఎస్కే: టిమ్ డేవిడ్ స్థానంలో కుమార్ కార్తికేయ, దీప్ చాహర్ స్థానంలో రాయుడు గుజరాత్ వర్సెస్ కేకేఆర్: సాయి సుదర్శన్ స్థానంలో జాషువ లిటిల్, సుయాశ్ ప్లేస్‌లో వెంకటేశ్ అయ్యర్ సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ స్థానంలో సికందర్ రజా ఆర్సీబీ వర్సెస్ లక్నో: అమిత్ మిశ్రా స్థానంలో బదోని, అనూజ్‌రావత్ ప్లేస్‌లో కర్ణ్ శర్మ ఢిల్లీ వర్సెస్ ముంబై: పృథ్వీ షా స్థానంలో ముకేశ్ కుమార్ సీఎస్కే వర్సెస్ రాజస్థాన్: బట్లర్ స్థానంలో జంపా, మగాలా ప్లేస్‌లో రాయుడు -
V ఫర్ వెంకటేశ్ అయ్యర్, V ఫర్ విధ్వంసం
-
Venkatesh Iyer: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి విధ్వంసం
ఐపీఎల్ 16వ సీజన్లో తొలిసారి 'ఇంపాక్ట్ ప్లేయర్' ముద్ర కనబడింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరిగితే ఒక్క మ్యాచ్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ సరైన ప్రభావం చూపించింది లేదు. బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్రభావం కనిపించినా బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. తాజాగా కేకేఆర్ మాత్రం తొలిసారి బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా సరైన సమయంలో వాడింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్లో వెంకటేశ్అయ్యర్కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇక వెంకటేశ్ అయ్యర్ మాత్రం తన వింటేజ్ ఆటను చూపించాడు. గుజరాత్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి కావాల్సిన ఇంపాక్ట్‌ను వెంకటేశ్ సరిగ్గా అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. మధ్యలో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసినప్పటికి రింకూ సింగ్ తన విధ్వంసంతో మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నాడు. -
సంజూ స్టన్నింగ్ క్యాచ్.. పృథ్వీ షా చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7 పరుగులు చేసిన పృథ్వీ పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా డకౌట్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్ బంతులను ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. ఫుట్‌వర్క్ మీద ఏమాత్రం దృష్టి పెట్టని పృథ్వీ బౌల్ట్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతిని గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నాడు. కీపర్ సంజూ శాంసన్ ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే మ్యాచ్‌లో పృథ్వీ షా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో పృథ్వీ ఇంపాక్ట్‌గా వచ్చి డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే సీజన్లో పృథ్వీ షా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి డకౌట్ అయిన ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. బట్లర్ 79, యశస్వి జైశ్వాల్ 60, హెట్‌మైర్ 39 నాటౌట్ రాణించారు. How about THAT for a start! 🤯 WHAT. A. CATCH from the #RR skipper ⚡️⚡️#DC lose Impact Player Prithvi Shaw and Manish Pandey in the first over! Follow the match ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/rpOzCFrWdQ — IndianPremierLeague (@IPL) April 8, 2023 -
'ఏం గుర్తుండడం లేదు.. కన్ఫూజన్‌కు గురవుతున్నా'
ఐపీఎల్ 16వ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. టాస్ వేశాకా ఇరుజట్ల కెప్టెన్లు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌తో పాటు ఐదుగురు ప్లేయర్లను సబ్స్టిట్యూట్లుగా ప్రకటించాలి. మ్యాచ్ మధ్యలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లలో ఎవరో ఒకరిని ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో ఉన్న ఆటగాడితో రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది బౌలింగ్ లేదా బ్యాటింగ్ కావొచ్చు. ఇది విరివిగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. Photo: IPL Twitter తాజాగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో శాంసన్ ఇంపాక్ట్ రూల్‌ను ప్రస్తావించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల తాను కొంత కన్ఫూజన్‌కు గురవుతున్నానని.. ఐదుగురు సబ్స్టిట్యూట్లను ప్రకటించాల్సి రావడంతో ప్లేయింగ్ ఎలెవెన్ ఎంపికలో కాస్త గందరగోళానికి గురవతున్నట్లు పేర్కొన్నాడు. ఈ ఇంపాక్ట్ వల్ల అసలు తుది జట్టులో ఆటగాళ్లు ఎవరు ఉన్నారు.. ఎవరికి రెస్ట్ ఇచ్చామనేది చెప్పలేకపోతున్నాం. ఈ ఇంపాక్ట నిబంధన కాస్త ఇబ్బందిగానే అనిపిస్తోందన్నాడు. ఇక ఈ సీజన్లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా సీఎస్కే ఆటగాడు తుషార్ దేశ్‌పాండే నిలిచాడు. సీజన్ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో పోరులో సీఎస్కే తరపున అంబటి రాయుడు స్థానంలో తుషార్ తొలి ఇంపాక్ట ప్లేయర్‌గా వచ్చాడు. ఒక్క ఆర్సీబీ మినహా మిగతా అన్ని జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఉపయోగించాయి. The Capitals have won the toss and they elect to bowl in #RRvDC 🏏 Who can grab the W in today's first game? 🔍 Watch #IPLonJioCinema LIVE & FREE across all telecom operators 🙌#IPL2023 #TATAIPL | @rajasthanroyals @DelhiCapitals pic.twitter.com/GOtbmvwJpV — JioCinema (@JioCinema) April 8, 2023 చదవండి: Impact Player IPL 2023 : 'ఇంపాక్ట్'తో ఒరిగిందేమి లేదు.. అవససరమా?! -
టీమ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సరిగా ఉపయోగించుకోవడం లేదా ?
-
నీరజ్‌చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్'ను భలే వాడింది పో!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. లార్డ్ శార్దూల్ ఠాకూర్ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. అతనికి రింకూ సింగ్ చక్కగా సహకరించాడు. అయితే కేకేఆర్ విజయంతో పాటు మరొక ఆటగాడిని వెలుగులోకి తెచ్చింది. అతనే సుయాష్ శర్మ. ఈ సీజన్ నుంచే కొత్తగా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఏ జట్టు సరిగ్గా వాడుకోలేదన్న అపవాదును కేకేఆర్ తుడిచేసింది. సరైన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దింపింది. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో స్పిన్నర్ సుయాశ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్న సుయాష్ శర్మకు ఇదే తొలి ఐపీఎల్ కాగా.. ఆర్సీబీ మ్యాచ్ అతనికి డెబ్యూ కావడం విశేషం. అప్పటికే కేకేఆర్ టాప్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌లు ప్రభావం చూపిస్తుండడంతో నితీష్ రాణా ఇంపాక్ట్‌గా వచ్చిన మిస్టరీ స్పిన్నర్ సుయాష్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ సుయాష్ దినేశ్ కార్తిక్, అనూజ్ రావత్, కర్ణ్‌శర్మ వికెట్లను పడగొట్టాడు. ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకొని ఆకట్టుకున్నాడు. అయితే సుయాష్ శర్మపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. తలకు హెయిర్బాండ్తో బరిలోకి దిగిన సుయాష్‌ను దూరం నుంచి చూస్తే జావెలిన్ స్టార్.. ఒలింపియన్ నీరజ్ చోప్రాల కనిపిస్తున్నాడంటూ పేర్కొన్నారు. సుయాష్ నీరజ్ చోప్రాకు దగ్గరి పోలికలు ఉన్నాయని.. బహుశా వాళ్లిద్దరు అన్నదమ్ముళ్లేమోనని ఎంక్వైరీ కూడా చేశారు. ఇక కొంతమంది మాత్రం ఈ సుయాష్.. నీరజ్ చోప్రాకు తమ్ముడిలా ఉన్నాడు.. ఏదైనా కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్‌ను కరెక్ట్ టైంలో వాడి ఫలితం సాధించింది. అంటూ కామెంట్లు చేశారు. అతని బౌలింగ్ శైలి కూడా నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విసిరే సమయంలో ఇచ్చే యాక్షన్‌ను గుర్తుచేయడం మరో కారణం. ఏదైనా ఒక్క మ్యాచ్‌తోనే సుయాష్ శర్మ అందరి దృష్టిలో పడ్డాడు. ఇక 19 ఏళ్ల సుయాష్ శర్మ ఢిల్లీలో జన్మించాడు. ఇప్పటివరకు అతడు ఏ దేశవాళీ జట్టుకు ఎంపిక కాలేదు. అతడు ఇప్పటివరకు ఢిల్లీ అండర్-25 పురుషుల స్టేట్-ఎ ట్రోఫీలో మాత్రమే ఆడాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సుయాష్ కేవలం 2వికెట్లు పడగొట్టాడు. కాగా కేకేఆర్‌తో ఆడిన మ్యాచే అతడికి తొలి ప్రొఫెషనల్ గేమ్ కావడం విశేషం. ఇక గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్-2023 మినీవేలంతో సుయాష్ శర్మను రూ.20లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. Anuj Rawat ☑️ Dinesh Karthik ☑️ Watch Suyash Sharma pick two quick wickets in his debut game. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4 — IndianPremierLeague (@IPL) April 6, 2023 KKR brings Neeraj chopra as Impact Player 😂#KKRvRCB pic.twitter.com/xuhsfaw9rr — Cricpedia (@_Cricpedia) April 6, 2023 No one has seen Neeraj Chopra and Suyash Sharma in the same room. pic.twitter.com/L5PLSmtvwV — KnightRidersXtra (@KRxtra) April 6, 2023 Suyash looks like a Zip version of Neeraj Chopra !! — Arnab Bhattacharyya (@TheBongGunner) April 6, 2023 చదవండి: KKR Vs RCB: ఆ షాట్ సెలక్షన్ ఏంటి? రాణా సంగా అవుదామనుకుని.. #Lord Shardul: ఆర్సీబీకి చుక్కలు.. తొలి ఫిఫ్టీతోనే రికార్డులు -
ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
-
IPL 2023: 'ఇంపాక్ట్'తో ఒరిగిందేమి లేదు.. అవససరమా?!
ఐపీఎల్ 16వ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది బీసీసీఐ. అయితే ఈ ఇంపాక్ట్ వల్ల ఇప్పటికైతే పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఇది సీజన్ ఆరంభమే కాబట్టి ఇప్పుడే ఇంపాక్ట్ గురించి మాట్లాడడం తప్పే కానీ పెద్దగా ఉపయోగం లేని ఇంపాక్ట్ అవసరమా అని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నించడం ఆసక్తి కలిగించింది. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటి? రూల్ ప్రకారం రెండు టీమ్స్ తమ తుది జట్టులోని ఓ ప్లేయర్‌ను మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ మరో ప్లేయర్‌తో భర్తీ చేయవచ్చు. ఇది కచ్చితం ఏమీ కాదు. ఒకవేళ వాళ్లకు అది ఉపయోగపడుతుందనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ పేరుతో ఈ నిబంధన అమల్లో ఉంది. ఈ ప్లేయర్‌ను ముందుగానే 12 లేదా 13వ ప్లేయర్‌గా ప్రకటించాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తర్వాత ఈ ప్లేయర్‌ను ఆయా టీమ్స్ తీసుకునే వీలుంటుంది. Photo: IPL Twitter అయితే ఐపీఎల్లో పరిచయం చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కాస్త భిన్నంగా ఉంటుంది. రెండు ఇన్నింగ్స్‌లోనూ 14వ ఓవర్ ముగిసేలోపే ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించాల్సి ఉంటుంది. కెప్టెన్, హెడ్‌కోచ్, మేనేజర్ ఈ విషయాన్ని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు, లేదా నాలుగో అంపైర్‌కు చెప్పాలి. ఒకవేళ గాయపడిన ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకుంటే.. ఆ గాయపడిన ప్లేయర్ మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఓ ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఓవర్ ముగిసిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. గాయపడిన సందర్భాల్లో అయితే ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆయా టీమ్స్ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్ టీమ్ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించాలని అనుకుంటే.. వికెట్ పడిన తర్వాత లేదంటే ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాత్రమే చేయాలి. ముందుగానే ఈ విషయాన్ని నాలుగో అంపైర్‌కు చెప్పాలి. పెద్దగా ఉపయోగపడని 'ఇంపాక్ట్' అయితే ఐపీఎల్ 16వ సీజన్లో తొలి నాలుగు రోజుల్లో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో జట్లు విఫలమవుతున్నాయా లేక పరిస్థితులు అనుకూలించడం లేదా అనేది చెప్పలేం. కానీ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శన మాతరం ఏ ఇంపాక్ట్ ప్లేయర్ ఇప్పటిదాకా చేయలేదు. మరి రానున్న మ్యాచ్‌ల్లో అయినా ప్రభావం ఉంటుందేమో చూడాలి. ►ఐపీఎల్లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆటగాడు తుషార్ దేశ్‌పాండే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో అంబటి రాయుడు స్థానంలో తుషార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. కానీ మూడు ఓవర్లలోనే 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ► ఇక ఇదే మ్యాచ్‌లో విలియమ్సన్ గాయపడడంతో రెండో ఇన్నింగ్స్‌లో 'ఇంపాక్ట్' ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. అయితే గుజరాత్ ఈ మ్యాచ్ గెలిచింది. ► ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో కేకేఆర్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ ఆటగాడిగా దింపింది. 28 బంతుల్లో 34 పరుగులు చేసినప్పటికి అతను నెమ్మదిగా ఆడడంతో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక పంజాబ్ బానుక రాజపక్స స్థానంలో రిషి ధావన్‌ను ఆడించగా అతను ఒక్క ఓవర్లోనే 15 పరుగులు ఇచ్చుకున్నాడు. ► ఢిల్లీతో మ్యాచ్‌లో లక్నో ఆయుష్ బదోని ఔటవ్వగానే కృష్ణప్ప గౌతమ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చింది. అతను చివరి బంతికి సిక్సర్ బాదాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం 4 ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ► రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తమ బ్యాటింగ్ సమయంలో పేసర్ ఫారుకీ స్థానంలో అబ్దుల్ సమద్‌ను తీసుకొచ్చింది. అతను సిక్సర్లతో విరుచుకుపడుతూ 32 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ అప్పటికే ఎస్ఆర్హెచ్ ఓటమి ఖరారైంది.ఇక ఇదే మ్యాచ్‌లో రాజస్తాన్.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్థానంలో నవదీప్ సైనీనీ ఆడించింది. కానీ సైనీ 2 ఓవర్లలో ఏకంగా 34 పరుగులిచ్చుకున్నాడు. ► ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో ముంబై సూర్య స్థానంలో పేసర్ జాసన్ బెండార్ఫ్ను తీసుకొచ్చింది. ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా మూడు ఓవర్లలో 37 పరుగులిచ్చుకున్నాడు. ఇక సీజన్లో ఇప్పటివరకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించని జట్టు ఆర్సీబీ మాత్రమే.