Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలిసారి 'ఇంపాక్ట్ ప్లేయర్' ముద్ర కనబడింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరిగితే ఒక్క మ్యాచ్‌లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ సరైన ప్రభావం చూపించింది లేదు. బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్రభావం కనిపించినా బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. తాజాగా కేకేఆర్ మాత్రం తొలిసారి బ్యాటింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా సరైన సమయంలో వాడింది.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్‌లో వెంకటేశ్‌అయ్యర్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇక వెంకటేశ్ అయ్యర్ మాత్రం తన వింటేజ్ ఆటను చూపించాడు.
గుజరాత్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి కావాల్సిన ఇంపాక్ట్‌ను వెంకటేశ్ సరిగ్గా అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. మధ్యలో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసినప్పటికి రింకూ సింగ్ తన విధ్వంసంతో మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment