లక్నో- ఆర్సీబీ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్- ఫాఫ్ డుప్లెసిస్ (PC: IPL/BCCI)
IPL 2023- Impact Player- ముంబై: గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్–2023 మరింత ఆసక్తికరంగా సాగుతోందని భారత మాజీ క్రికెటర్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా లీగ్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఎమ్మెస్కే ఈ ఐపీఎల్ సీజన్‌లో స్టార్ స్పోర్ట్స్–తెలుగు చానల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
‘స్టార్’ కార్యక్రమంలో ఆయన తాజా సీజన్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘సగం టోర్నమెంట్ ముగిసేసరికే ఈ ఐపీఎల్ గత సీజన్‌ల రికార్డులను అధిగమించింది. 200కు పైగా స్కోర్లు పెద్ద సంఖ్యలో నమోదు కాగా, సిక్సర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇది లీగ్ ఎంతగా విజయవంతం అయిందో చూపిస్తోంది’ అని ప్రసాద్ అన్నారు.
సానుకూలమే.. అందుకే ఇలా
కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అంశం మంచి ప్రభావం చూపిస్తోందని ప్రసామద్ చెప్పారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఈ సీజన్‌లో ఐపీఎల్ టీమ్ హోమ్ అడ్వాంటేజ్ పోయింది. ప్రత్యర్థి జట్టు వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కలుగుతోంది. అందుకే చాలా మ్యాచ్‌లలో సొంత మైదానాల్లో జట్లు ఓడిపోతున్నాయి’ అని ఎమ్మెస్కే విశ్లేషించారు.
యువ ఆటగాళ్లు అదుర్స్
ప్రధానంగా భారత యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనలు ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశమని ఈ భారత మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత క్రికెట్‌కు మేలు చేసే అంశం. తిలక్‌వర్మ, సాయిసుదర్శన్, రింకూ సింగ్, యశస్వి, ధ్రువ్ జురేల్ తమ ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం సానుకూలాంశం.’ అని ప్రసాద్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సద్వినియోగం చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఆయుష్ బదోనిని, బెంగళూరు హర్షల్ పటేల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా దింపాయి.
చదవండి: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment