Sai Sudharsan
-
Aus A vs Ind A: శతక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆసీస్ టార్గెట్?
Australia A vs India A, 1st unofficial Test Day 3: ఆస్ట్రేలియా ‘ఎ’తో మొదటి అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. మెక్కే వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన రుతురాజ్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పట్టుదలగా నిలబడింది. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా 312 పరుగులు చేయగలిగింది.సాయి సుదర్శన్ 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం సాధించగా.. దేవ్‌దత్ పడిక్కల్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 199 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 88 పరుగులు రాబట్టాడు. వీరితో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32) రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.💯 for Sai Sudharsan Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSvIND pic.twitter.com/xIWxfavDFh— cricket.com.au (@cricketcomau) November 2, 2024ఆసీస్ టార్గెట్?ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసిన భారత్-ఎ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యం సాధించింది. తద్వారా ఆసీస్‌కు 225 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో టీ సమయానికి ఆసీస్ జట్టు 21 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. తన బ్యాటింగ్ తీరుతో జూనియర్ రికీ పాంటింగ్‌గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్(16) మరోసారి విఫలమయ్యాడు. మార్కస్ హ్యారిస్ 29, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.First runs for Australia A from Sam Konstas 👀Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSAvINDA pic.twitter.com/an2oO9LPH9— cricket.com.au (@cricketcomau) November 2, 2024తొలి ఇన్నింగ్స్‌లో మూకుమ్మడిగా విఫలంకాగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 64 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. గురువారం మొదటి రోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 47.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (36; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, ఆసీస్ ‘ఎ’ బౌలర్ బ్రెండన్ డగెట్ 6 వికెట్లు తీశాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 62.4 ఓవర్లలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. ముకేశ్ కుమార్ (6/46), ప్రసిధ్ కృష్ణ (3/59) ఆసీస్‌ను 136/7 స్కోరు వద్ద కట్టడి చేసినప్పటికీ మర్ఫీ (33), ఓనీల్ (13) ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం రెండో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), అభిమన్యు ఈశ్వరన్ (12) వికెట్లను కోల్పోయింది. ఆ దశలో సుదర్శన్, పడిక్కల్ జట్టును ఒడ్డున పడేసే ఆట ఆడారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. తుదిజట్లుభారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.ఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హ్యారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IND A vs AUS A: సెంచరీకి చేరువగా సాయి సుదర్శన్
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 208/2గా ఉంది. సాయి సుదర్శన్ (96), దేవ్‌దత్ పడిక్కల్ (80) క్రీజ్‌లో ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్ (12), రుతురాజ్ గైక్వాడ్ (5) ఔటయ్యారు. రుతురాజ్ వికెట్ ఫెర్గస్ ఓ నీల్‌కు దక్కగా.. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ 120 ఆధిక్యంలో కొనసాగుతుంది.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కూపర్ కన్నోలీ 37, వెబ్‌స్టర్ 33, టాడ్ మర్ఫీ 33, మార్కస్ హ్యారిస్ 17, ఫెర్గస్ ఓనీల్ 13, సామ్ కోన్స్టాస్ 0, బాన్‌క్రాఫ్ట్ 0, ఫిలిప్ 4, బ్రెండన్ డాగ్గెట్ 8 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ డాగ్గెట్ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. జోర్డాన్ బకింగ్హమ్ రెండు, ఫెర్గస్ ఓనీల్, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (36), నవ్‌దీప్ సైనీ (23), సాయి సుదర్శన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 0, బాబా ఇంద్రజిత్ 9, ఇషాన్ కిషన్ 4, నితీశ్ రెడ్డి 0, మానవ్ సుతార్ 1, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
డబుల్ సెంచరీ బాదిన సాయి సుదర్శన్.. సెంచరీకి చేరువలో సుందర్
రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూప్-డి పోటీల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఓపెనర్ సాయి సుదర్శన్ అజేయ డబుల్ సెంచరీతో (202) విరుచుకుపడగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్ సెంచరీకి (96 నాటౌట్) చేరువయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 379 పరుగులు చేసింది. ఎన్ జగదీశన్ 65 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నవ్‌దీప్ సైనీకి జగదశన్ వికెట్ దక్కింది.కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా భీకర ఫామ్‌లో ఉన్నాడు. సాయి 2023 నుంచి పాకిస్తాన్-ఏపై, ఇంగ్లండ్-ఏపై, ఐపీఎల్లో, తమిళనాడు ప్రీమియర్ లీగ్ నాకౌట్స్‌లో, కౌంటీ క్రికెట్లో, దులీప్ ట్రోఫీలో, రంజీ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల సాయి సుదర్శన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలు చేశాడు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్లో 28 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలు బాదాడు. -
సాయి సుదర్శన్ పోరాటం వృధా.. దులీప్ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ
2024 దులీప్ ట్రోఫీని ఇండియా-ఏ జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-ఏ.. ఇండియా-సిపై 132 పరుగుల తేడాతో గెలుపొంది, టైటిల్ చేజిక్కించుకుంది.350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. ప్రసిద్ద్ కృష్ణ (3/50), తనుశ్ కోటియన్ (3/47), ఆకిబ్ ఖాన్ (2/26), షమ్స్ ములానీ (1/46) ధాటికి 217 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్ సెంచరీతో (111) వీరోచితంగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతనికి జట్టులో ఎవ్వరి నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్ రుతురాజ్ ఒక్కడు (44) కాస్త పర్వాలేదనించాడు. గుర్తింపు ఉన్న ఆటగాళ్లు రజత్ పాటిదార్ (7), ఇషాన్ కిషన్ (17), అభిషేక్ పోరెల్ (0) నిరాశపరిచారు.శాశ్వత్ సెంచరీఈ మ్యాచ్‌లో తొలుత తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ.. 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కగా.. ఆవేశ్ ఖాన్ అజేయ అర్ద సెంచరీతో (51) రాణించాడు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు తీశారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి.. 234 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరచగా.. అభిషేక్ పోరెల్ ఒక్కడే అర్ద సెంచరీతో (82) రాణించాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, ఆకిబ్ ఖాన్ తలో 3, షమ్స్ ములానీ 2, తనుశ్ కోటియన్ ఓ వికెట్ పడగొట్టారు.రాణించిన రియాన్63 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ..రియాన్ పరాగ్ (73), శాశ్వత్ రావత్ (53) అర్ద సెంచరీలతో రాణంచడంతో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కుషాగ్రా (42), మయాంక్ అగర్వాల్ (34), తనుశ్ కోటియన్ (26 నాటౌట్) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.That Winning Feeling! 🤗 India A captain Mayank Agarwal receives the coveted #DuleepTrophy 🏆 The celebrations begin 🎉@IDFCFIRSTBank Scorecard ▶️: https://t.co/QkxvrUmPs1 pic.twitter.com/BH9H6lJa8w— BCCI Domestic (@BCCIdomestic) September 22, 2024సాయి సుదర్శన్ పోరాటం వృధా350 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా-సి 217 పరుగులకే ఆలౌటై, 132 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సాయి సుదర్శన్ (111) ఒంటరి పోరాటం చేసి ఇండియా-సిని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.రన్నరప్‌గా నిలిచిన ఇండియా-సిమూడు రౌండ్ల మ్యాచ్‌లు ముగిశాక 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా-ఏ టైటిల్ గెలుచుకోగా.. 9 పాయింట్లు సాధించిన ఇండియా-సి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చదవండి: Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం -
సాయి సుదర్శన్ సంచలనం.. సిక్స్‌తో సెంచరీ! వీడియో
టీమిండియా యువ సంచలనం సాయిసుదర్శన్ ఇంగ్లండ్ కౌంటీల్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. కౌంటీ ఛాంపియన్ షిప్-2024లో సర్రే క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాటింగ్‌హామ్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సాయిసుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.సిక్స్‌తో తన తొలి కౌంటీ సెంచరీ మార్క్‌ను ఈ తమిళనాడు బ్యాటర్ అందుకున్నాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుదర్శన్.. తొలి ఇన్నింగ్స్‌లో సర్రే 525 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా 178 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ రోరీ బర్న్స్(161) కూడా సెంచరీతో రాణించాడు. కాగా కౌంటీల్లో సుదర్శన్ ఆడటం ఇదే రెండో సారి. గతేడాది కౌంటీ ఛాంపియన్ షిప్లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో సర్రే తరపున ఆడాడు.అయితే ఈ ఏడాది సీజన్ మొత్తానికి అతడు అందుబాటులో ఉండడం లేదు. సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అతడు తిరిగి స్వదేశానికి రానున్నాడు.భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించే సి టీమ్‌లో సాయికి చోటు దక్కింది. అయితే ఇప్పటికే వన్డేల్లో అరంగేట్రం చేసిన సుదర్శన్.. దులీప్ ట్రోఫీలో రాణిస్తే టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సఫారీ క్రికెటర్ -
సాయి సుదర్శన్ సుడిగాలి శతకం.. సిక్సర్ల వర్షం
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2024లో లైకా కోవై కింగ్స్ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (జులై 30) జరిగిన క్వాలిఫయర్-1లో ఆ జట్టు ఐ డ్రీమ్ తిరుప్పూర్ తమిఝాన్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ సుడిగాలి శతకంతో (56 బంతుల్లో 123 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) కోవై కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. సాయి సుదర్శన కేవలం 48 బంతుల్లో శతక్కొట్టాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఇది రెండో వేగవంతమైన శతకం.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తిరుప్పూర్.. అమిత్ సాత్విక్ (67), తుషార్ రహేజా (55), మొహమ్మద్ అలీ (45 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఛేదనలో కోవై కింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ సాయి సుదర్శన్ చెలరేగడంతో 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సాయి సుదర్శన్‌తో పాటు ముకిలేశ్ (48 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. కాగా, ఇవాళ (జులై 31) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెపాక్ సూపర్ గిల్లీస్, దిండిగుల్ డ్రాగన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తిరుప్పూర్ క్వాలిఫయర్-2లో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఆగస్ట్ 4న జరిగే ఫైనల్లో కోవై కింగ్స్‌ను ఢీకొంటుంది. -
జింబాబ్వే రెండో టీ20.. భారత జట్టులోకి యువ సంచలనం! తుది జట్లు ఇవే
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. హరారే వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఎక్స్ట్రా బ్యాటర్‌తో ఆడుతోంది. పేసర్ ఖాలీల్ అహ్మద్ స్ధానంలో యువ బ్యాటర్ సాయిసుదర్శన్ తుది జట్టులోకి వచ్చాడు. సాయిసుదర్శన్కు భారత్ తరపున ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. సాయిసుదర్శన్ ఐపీఎల్లో అద్బుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. కాగా సుదర్శన్ ఇప్పటికే భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లుజింబాబ్వే: వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారాభారత్భారత్శుబ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ -
CSK Vs GT: సీఎస్కేపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ అద్భుత విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గుజరాత్ విజయ భేరి మ్రోగించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మొయిన్ అలీ(56) పరుగులతో రాణించినప్పటికి మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో సీఎస్కే ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ మూడు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు, సందీప్ వారియర్, ఉమేశ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.సాయి, గిల్ విధ్వంసం..అంతకముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్‌పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. -
CSK Vs GT: సాయి సుదర్శన్, గిల్ సెంచరీల మోత.. ఆల్ టైమ్ రికార్డు సమం
ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ సెంచరీల మోత మోగించారు. ఈ మ్యాచ్‌లో సుదర్శన్ ,గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సీఎస్కే బౌలర్లను ఉతికారేశారు. 51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. కాగా తొలి వికెట్‌కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఐపీఎల్లో లక్నో ఆటగాళ్లు డికాక్, కేఎల్ రాహుల్ పేరిట ఉన్న 210 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును గిల్, సుదర్శన్ జోడీ సమం చేసింది.ఐపీఎల్-2022 సీజన్లో కేకేఆర్‌పై డికాక్, కేఎల్ రాహుల్ తొలి వికెట్ సరిగ్గా 210 పరుగుల పార్టనర్ షిష్ నమోదు చేశారు. అదే విధంగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ చరిత్రలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో జోడీ వీరిద్దరూ నిలిచారు.ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి జోడి ఉంది. వీరిద్దరూ 2016 ఐపీఎల్ సీజన్లో విరాట్, ఏబీడీ జోడీ రెండో వికెట్‌కు 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. -
CSK Vs GT: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
గుజరాత్ టైటన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సాయిసుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సుదర్శన్ సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్‌ను బోర్డును పరుగులు పెట్టించాడు. గిల్, సుదర్శన్ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్(104) కూడా సెంచరీ చేశాడు.సచిన్ రికార్డు బద్దలు..ఇక మ్యాచ్‌లో సుదర్శన్ సెంచరీతో పాటు.. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు.సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉండేది.సచిన్, గైక్వాడ్ ఇద్దరూ 1000 పరుగుల మైలు రాయిని 31 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌తో వీరిద్దరి ఆల్‌టైమ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైల్‌స్టోన్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ (21) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత విండీస్ ఆటగాడు లెండిల్ సిమన్స్(23) సిమ్మన్స్ ఉన్నాడు. -
CSK Vs GT: సెంచరీలతో చెలరేగిన గిల్, సాయి.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ విధ్వంసం సృష్టించారు. కీలక మ్యాచ్‌లో గిల్, సాయి సుదర్శన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. సీఎస్కే బౌలర్లను వీరిద్దరూ ఓ ఆట ఆడుకున్నారు.51 బంతుల్లో సాయి సుదర్శన్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేయగా.. గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఎస్కే బౌలర్లలో ఒక్క తుషార్ దేశ్‌పాండే మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దేశ్ పాండే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సాయిసుదర్శన్కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. Shubman Gill is one of the most aesthetic batsman in the world right now, what a hundred by Gujarat Titans captain ⭐❤️pic.twitter.com/iJZRy0VPDC— Shubman Gang (@ShubmanGang) May 10, 2024 -
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్, షారుక్ ఖాన్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. -
కేఎల్ రాహుల్ మంచి మనసు.. మెడల్‌ను త్యాగం చేసి!
టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికాతో మూడో వన్డే అనంతరం తనకు వచ్చిన 'ఇంపాక్ట్ ఫీల్డర్' అవార్డును యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు త్యాగం చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి మ్యాచ్‌లో అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు కోచ్ దిలీప్ అవార్డులను అందజేస్తున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా కేఎల్ రాహుల్‌ను దిలీప్ ఎంపిక చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లతో పాటు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో సైతం రాహుల్ అద్భుతమైన మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. దీంతో రాహుల్‌కు ఇంపాక్ట్ ఫీల్డర్ అవార్డు వరించింది. అయితే రాహుల్ ఇక్కడే తన మంచిమనుసును చాటుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో సంచలన క్యాచ్‌ను అందుకున్న సాయిసుదర్శన్కు తన వచ్చిన మెడల్‌ను రాహుల్ ఇచ్చేశాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాప్ చప్పట్లు కొడుతూ రాహుల్‌ను అభినందించారు. సాయి సుదర్శన్ సంచలన క్యాచ్.. కాగా ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ మెరుపు క్యాచ్‌ను అందుకున్నాడు. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి కాస్త గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్.. డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు. సుదర్శన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది. India go on top with this great take by Sai Sudarshan 👌 Tune in to the 3rd #SAvIND ODI LIVE NOW | @StarSportsIndia #Cricket pic.twitter.com/115D7P6TS6 — ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023 -
IND VS SA 3rd ODI: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాయి సుదర్శన్
సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో (32.2వ ఓవర్) మిడాఫ్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సాయి.. పక్షిలా ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బ్యాటర్ క్లాసెన్ (21) సహా ఈ క్యాచ్‌ను చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కామెంటేటర్లు ఈ క్యాచ్‌ను క్యాచ్ ఆఫ్ ద సిరీస్‌గా అభివర్ణించారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Catch of the series - Sai Sudharsan 🫡🔥pic.twitter.com/tKr2Vrj3tq — Johns. (@CricCrazyJohns) December 21, 2023 కాగా, భారత్ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓటమి దిశగా సాగుతుంది. 38 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 192/7గా ఉంది. సౌతాఫ్రికా గెలవాలంటే 72 బంతుల్లో 105 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రీజా హెండ్రిక్స్ (19), జార్జీ (81), డస్సెన్ (2), మార్క్రమ్ (36), క్లాసెన్ (21), మిల్లర్ (10), ముల్దర్ (1) ఔట్ కాగా.. కేశవ్ మహారాజ్ (9), హెండ్రిక్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (108) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. -
KL Rahul: చాలా సంతోషంగా ఉంది.. నేను ఇది అస్సలు ఊహించలేదు! క్రెడిట్ వారికే
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. వాండరర్స్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. భారత పేసర్ల దాటికి 27.3 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగగా.. అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఫెహ్లుక్వాయో(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర ఆటగాడు సాయిసుదర్శన్(55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక విజయంపై భారత స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పేసర్లపై రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. జూనియర్ టీమ్‌తో దక్షిణాఫ్రికా వంటి జట్టుపై గెలవడం అంత ఈజీ కాదు. కానీ మా బాయ్స్ అందరి అంచనాలను తారుమారు చేశారు. ఈ మ్యాచ్‌లో అన్నీ మా ప్రణాళికలకు భిన్నంగా జరిగాయి. ఈ వికెట్‌పై తొందరగా స్పిన్నర్లను ఉపయోగించి ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాము. కానీ పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలించింది. దీంతో మా పేసర్లు అదరగొట్టారు. బంతి కూడా టర్న్ అయింది. ఇటీవల కాలంలో ప్రతీఒక్కరూ చాలా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఫార్మాట్‌కు ప్రాధ్యన్యత ఇస్తున్నారు. ప్రస్తుతానికి టెస్టులు, టీ20లకే ఆదరణ ఎక్కువగా ఉంది. అయితే ప్రతీ ఒక్కరూ దేశమే కోసం అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం పొందేందుకు మంచి అవకాశమని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రాహుల్ పేర్కొన్నాడు. -
IND VS SA 1st ODI: అరంగేట్రంలోనే అదరగొట్టిన సాయి సుదర్శన్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సుదర్శన్.. 43 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీతో రాణించిన సాయి.. రాబిన్ ఉతప్ప (2006లో ఇంగ్లండ్‌పై 86 పరుగులు), కేఎల్ రాహుల్ (2016లో జింబాబ్వేపై 100 నాటౌట్), ఫయాజ్ ఫజల్ (2016లో జింబాబ్వేపై 55 నాటౌట్) తర్వాత అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో భారత ఓపెనర్‌గా.. వన్డే డెబ్యూలో 50 ప్లస్ స్కోర్ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 22 ఏళ్ల సాయి సుదర్శన్ 2022 సీజన్‌తో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి అద్భుతంగా రాణించాడు. రెండు సీజన్లలో 13 మ్యాచ్‌లు ఆడిన సాయి.. 4 అర్దసెంచరీల సాయంతో 46.09 సగటున 507 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అర్ష్‌దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరుగనుంది. -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, ఆతిథ్య జట్టును చిత్తు చేశారు. తొలుత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4).. ఆతర్వాత బ్యాటింగ్‌లో ఆటగాడు సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) సత్తా చాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత పేసర్ల ధాటికి 116 పరుగులకు కుప్పకూలగా.. టీమిండియా 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. టార్గెట్ 117.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 23 పరుగుల వద్ద (3.4వ ఓవర్) టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వియాన్ ముల్దర్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. నిప్పులు చెరిగిన అర్ష్‌దీప్.. 116 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 116 పరుగుల వద్ద (27.3 ఓవర్లలో) కుప్పకూలింది. అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగగా.. ఆవేశ్ ఖాన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్‌కు ఆఖరి వికెట్ దక్కింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జి (28), ఫెహ్లుక్వాయో (33), మార్క్రమ్ (12), తబ్రేజ్ షంషి (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా అతి కష్టం మీద 100 పరుగుల మార్కును చేరిన సౌతాఫ్రికా 101 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫెహ్లుక్వాయో (33) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అర్షదీప్‌కు ఈ ఇన్నింగ్స్‌లో ఇది ఐదో వికెట్. మిగిలిన 4 వికెట్లను ఆవేశ్ ఖాన్ దక్కించుకున్నాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 73 పరుగుల వద్ద (16.1 ఓవర్లో) సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి కేశవ్ మహారాజ్ (4) ఔటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. 58 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (2) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 58/7గా ఉంది. ఫెహ్లుక్వాయో (3), కేశవ్ మహారాజ్ క్రీజ్‌లో ఉన్నారు. అర్ష్‌దీప్ సింగ్ 4, ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. ► దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పది ఒవర్లు ముగిసే సమయానికి 52 పరుగులు చేసింది ► దక్షిణాఫ్రికా మూడో వికెట్‌ను కోల్పోయింది. డిజోర్జీ 28 పరుగుల వ్యక్తిగత స్కొర్ వద్ద అవుట్ అయ్యాడు. అనుదీప్ సింగ్ బౌలింగ్‌లో డిజోర్జీ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్‌కు దిగారు. ►6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో డిజోర్జీ(17),మార్క్రమ్(4) పరుగులతో ఉన్నారు. సింగ్ ఈజ్ కింగ్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ వరుసగా రీజా హెండ్రిక్స్, వాన్‌డెర్ డుసెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. 2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 3/2 జోహన్నెస్‌బర్గ్ వేదికగా తొలి వన్డేలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో యువ సంచలనం సాయిసుదర్శన్ టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతులు మీదగా సాయిసుదర్శన్ క్యాప్ అందుకున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా పేసర్ బర్గర్ కూడా డెబ్యూ చేశాడు. తుది జట్లు భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, లోకేష్ రాహుల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ -
టెస్టు మ్యాచ్‌లోనూ భారత జట్టును వదలని వర్షం! ఎట్టకేలకు..
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్‌లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్ఫౌంటేన్ వేదికగా మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది. మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే భారత్: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప. సౌతాఫ్రికా: కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే. -
తొలిసారి భారత జట్టులోకి.. యువ సంచలనంపై అశ్విన్ ప్రశంసలు
దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లకు మూడు వేర్వేరు భారత జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లకు జట్ల ఎంపికలో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రోటీస్‌తో వన్డే,టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా టీ20ల్లో అదరగొడుతున్న రింకూ సింగ్, దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న తమిళనాడు యవ సంచలనం సాయిసుదర్శన్కు సెలక్లర్లు తొలిసారి భారత వన్డే జట్టుకు ఎంపిక చేశారు. వీరిద్దరితో పాటు రజిత్ పాటిదార్‌కు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. అదేవిధంగా పేసర్ దీపక్ చాహర్ కూడా ఛాన్నాళ్ల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. కాగా టెస్టుల్లో మరోసారి వెటరన్ ఆటగాళ్లు అజింక్యా రహానే, పుజారాకు సెలక్టర్లు మొండి చేయిచూపించారు. ఇక టీ20ల్లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనుండగా.. వన్డేల్లో కేఎల్ రాహుల్, టెస్టుల్లో రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నారు. సుదర్శన్‌పై ప్రశంసల వర్షం.. కాగా తొలిసారి భారత జట్టుకు ఎంపికైన సాయిసుదర్శన్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. "వావ్ సాయి సుదర్శన్! అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ తొలిసారి భారత జట్టులో చోటుదక్కించకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటూ" ట్విటర్లో అశ్విన్ రాసుకొచ్చాడు. అశ్విన్, సుదర్శన్ ఇద్దరూ దేశీవాళీ క్రికెట్లో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. గత రెండు సీజన్ల ఐపీఎల్లో కూడా సాయి అదరగొట్టాడు. ఇప్పటివరకు తన లిస్ట్-ఏ కెరీర్లో 22 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 65.05 సగటుతో 1236 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్ చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే! యువ సంచలనం ఎంట్రీ Wow Sai sudarshan wow! Genuinely happy for a kid who has been chasing excellence and not left any stone unturned. 👏👏👏 Totally thrilled . Well done #TeamIndia — Ashwin 🇮🇳 (@ashwinravi99) November 30, 2023 -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే! యువ సంచలనం ఎంట్రీ
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లకు భారత జట్లను అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ దూరమయ్యారు. వీరి నలుగురు తిరిగి టెస్టు జట్టులోకి వచ్చారు. ఇక సౌతాఫ్రికాతో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు సారథిగా ఎంపిక కాగా.. వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు భారత జట్టు పగ్గాలు అప్పగించారు. సాయిసుదర్శన్ ఎంట్రీ.. దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్న తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. సుదర్శన్‌కు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో కూడా సాయి దుమ్మురేపాడు. ఐపీఎల్-2023 సీజన్లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కూడా సుదర్శన్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన లిస్ట్-ఏ కెరీర్లో 22 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 65.05 సగటుతో 1236 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఇక అతడితో పాటు సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రజిత్ పాటిదర్‌కు కూడా భారత వన్డే జట్టులోకి చోటు దక్కింది. ఇప్పటివరకు 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 42.71 సగటుతో 598 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ లియర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్) (వారం), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్ -
కెప్టెన్‌గా వాషింగ్టన్ సుందర్.. జట్టులో ఐపీఎల్ స్టార్లు!
Syed Mushtaq Ali Trophy 2023-24: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టీ20 క్రికెట్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 సీజన్‌కు గానూ తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటన చేసింది. వాషీకి సాయి సుదర్శన్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఈ మేరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యే 15 మంది ఆటగాళ్ల పేర్లను బుధవారం వెల్లడించింది. కాగా అక్టోబరు 16 నుంచి ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో ఈవెంట్ చరిత్రలో తమిళనాడుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత తమిళనాడు సొంతం. తాజా సీజన్లో వాషింగ్టన్ సుందర్ సారథ్యంలో సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ సేన్, నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, టి.నటరాజన్ తదితర ఐపీఎల్ స్టార్లు ఆడనున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సుందర్‌కు స్థానం దక్కలేదన్న విషయం తెలిసిందే. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా అతడి స్థానంలో చెన్నై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోటీ పడ్డ వాషీకి మొండిచేయి ఎదురైంది. అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్టర్లు అశూ వైపే మొగ్గుచూపారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 తమిళనాడు జట్టు: వాషింగ్టన్ సుందర్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, విజయ్ శంకర్, సి హరి నిశాంత్, జి.అజితేష్, బాబా అపరాజిత్, ఆర్. సంజయ్ యాదవ్, ఎం. మహ్మద్, ఆర్.సాయి కిషోర్, వరుణ్ చక్రవర్తి, టి. నటరాజన్, కుల్దీప్ సేన్, సందీప్ వారియర్. -
Irani Trophy 2023: రాణించిన సాయి సుదర్శన్.. తొలి రోజు బౌలర్ల హవా
ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రాణించిన సాయి సుదర్శన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే. -
సాయి సుదర్శన్ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌లో ఆడనున్న యువ సంచలనం!
తమిళనాడు సూపర్ స్టార్, గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి సారి ఇంగ్లండ్ కౌంటీల్లో అడనున్నాడు. 21 ఏళ్ల సుదర్శన్ ఇంగ్లీష్ క్రికెట్ క్లబ్ సర్రేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో సర్రే తరపున ఆడనున్నాయి. అయితే టామ్ లాథమ్, విల్ జాక్స్ , సామ్ కర్రాన్ వంటి సర్రే ఆటగాళ్లు తమ జాతీయ జట్టు విధుల కారణంగా ఆఖరి కౌంటీ మ్యాచ్‌లకు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ సర్రే తరపున ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దుమ్మురేపాడు. అదే విధంగా ఎమర్జింగ్ ఆసియాకప్‌లో కూడా సాయి అదరగొట్టాడు. వైట్‌బాల్ క్రికెట్లో అదరగొడుతున్న సుదర్శన్.. రెడ్‌బాల్ క్రికెట్లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సర్రే క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 42.71 సగటుతో 598 పరుగులు చేశాడు. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే -
రెచ్చిపోయిన మయాంక్ అగర్వాల్.. సత్తా చాటిన సాయి సుదర్శన్
దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు సహా 194 పరుగులు (64, 98, 32) చేసిన మయాంక్.. ఇవాళ (జులై 30) ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో మ్యాచ్ విన్నింగ్ హాఫ్‌సెంచరీతో (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, సిక్స్) ఇరగదీశాడు. మయాంక్‌కు ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (53) తోడవ్వడంతో ఈస్ట్ జోన్‌పై సౌత్ జోన్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కౌశిక్ (8-1-37-3), సాయి కిషోర్ (10-0-45-3), విధ్వత్ కావేరప్ప (9-2-40-2), విజయ్‌కుమార్ వైశాఖ్ (1/62), వాషింగ్టన్ సుందర్ (1/41) ధాటికి 46 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ విరాట్ సింగ్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సుభ్రాంషు సేనాపతి (44), 9, 10వ నంబర్ ఆటగాళ్లు ఆకాశదీప్ సింగ్ (44), ముక్తర్ హుస్సేన్ (33) రాణించారు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్ (12), రియాన్ పరాగ్ (13) చేతులెత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ జోన్.. 44.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ అగర్వాల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలతో రాణించగా.. జగదీశన్ (32) పర్వాలేదనిపించాడు. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (18), అరుణ్ కార్తీక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. రోహిత్ రాయుడు (24 నాటౌట్).. వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) సాయంతో సౌత్ జోన్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అవినోవ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌పై సెంట్రల్ జోన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సర్వటే (10-2-19-3), యశ్ కొఠారీ (2-1-4-2), సరాన్ష్ జైన్ (10-0-39-2) ధాటికి 49 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ కాగా.. శివమ్ చౌదరీ (85 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశ్ దూబే (72; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో సెంట్రల్ జోన్ 33 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
టీమిండియా సెలెక్టర్లకు విషమ పరీక్ష.. ఛాలెంజ్ విసురుతున్న మరో ఓపెనర్..!
ఇటీవలికాలంలో అదిరిపోయే ప్రదర్శనలతో భారత క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన కొందరు క్రికెటర్లలో 21 ఏళ్ల చెన్నై కుర్రాడు సాయి సుదర్శన్ ప్రథముడు. గత ఐపీఎల్ సీజన్‌తో వెలుగులోకి వచ్చిన సాయి.. ఆ సీజన్లో వరుసగా 22, 62, 53, 19, 20, 41, 43, 96 స్కోర్లు (8 మ్యాచ్‌ల్లో 141.41 స్ట్రయిక్ రేట్‌తో 51.71 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 362 పరుగులు) చేసి సత్తా చాటాడు. ఐపీఎల్-2023లో సాయి మెరిసినప్పటికీ, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్ల ఆసాధారణ ప్రదర్శన అతనిని డామినేట్ చేసింది. అయితే అంతటితో ఆగని సాయి.. ఆ తర్వాత జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ రెచ్చిపోయాడు. ఈ దేశవాలీ లీగ్‌లో 90, 14, 7, 83, 41 స్కోర్లు చేసిన సాయి.. ఈ లీగ్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్‌రేట్‌తో 64.20 సగటున 2 అర్ధసెంచరీ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ వరుస సక్సెస్‌లతో సాయికి టీమిండియా నుంచి పిలుపు అందుతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్లతో టీమిండియా యంగ్ ఓపెనర్ల బెంచ్ బలంగా ఉండటంతో సాయికి అవకాశం దక్కలేదు. అయితే, ఈ సీజన్లోనే ఎలాగైనా టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలగా ఉండిన సాయి.. ప్రస్తుతం జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 100 స్ట్రయిక్‌రేట్‌తో 170 సగటున సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 170 పరుగులు చేశాడు. నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన సాయి, ఈ సారి మాత్రం భారత సెలెక్టర్లకు గట్టి ఛాలెంజ్ విసిరాడు. టీమిండియాలో చోటు కోసం తనను తప్పక పరిగణలోకి తీసుకోవాలని బ్యాట్‌తో సవాల్ చేశాడు. సాయి ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసి భారత సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉన్నవాళ్లకు అవకాశాలు లేక సతమతమవుతుంటే కొత్తగా సాయి తయారయ్యాడేంట్రా అని అనుకుంటున్నారు. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ అయ్యే లోగా సాయి మరో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడితే ఏం చేయాలో తెలియక వారు లోలోన మధన పడుతున్నారు. మొత్తానికి యువ ఓపెనర్ల విషయం భారత సెలెక్టర్లను విషమ పరీక్షలా మారింది. -
Asia Cup 2023: జులై 23న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్..!
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో నిన్న (జులై 19) భారత్-ఏ, పాక్-ఏ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ సేనను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించి, అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) బంతితో విజృంభించగా.. ఆతర్వాత ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అతనికి నికిన్ జోస్ (53), కెప్టెన్ యశ్ ధుల్ (21 నాటౌట్), అభిషేక్ శర్మ (20) సహకరించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాక్‌లు ఇదివరకే సెమీస్‌కు చేరాయి. కాగా, ఇదే టోర్నీలో భారత్, పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇదివరకే సెమీస్‌కు చేరిన భారత్, పాక్‌లు ఈ గండాన్ని అధిగమిస్తే ఫైనల్లో మరోసారి ఎదురెదురుపడే ఛాన్స్ ఉంది. రేపు (జులై 21) తొలి సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు.. రెండో సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు జులై 23న కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్, పాక్‌లకే ఫైనల్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో.. ఇదే ఆసియా కప్‌లో భారత్-పాక్‌లు మరోసారి తలపడటం ఖాయం. సెమీఫైనల్ (తొలి సెమీస్ ఉదయం 10 గంటలకు), ఫైనల్ మ్యాచ్‌లు ఆయా తేదీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
Ind Vs Pak: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
ACC Mens Emerging Teams Asia Cup 2023- Pakistan A vs India A: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023లో భాగంగా భారత యువ జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ- పాకిస్తాన్- ఏ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్‌కు ఆదిలోనే షాకిచ్చాడు భారత యువ పేసర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్. ఓపెనర్ సయీమ్ ఆయుబ్‌ను డకౌట్ చేశాడు. ఐదు వికెట్లతో చెలరేగిన హంగర్గేకర్ అంతేకాదు.. వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్‌తో కూడా సున్నా చుట్టించాడు. దీంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన పాక్‌ను ఓపెనర్ షాహిజాదా ఫర్హాన్(35), హసీబుల్లా ఖాన్(27) ఆదుకున్నారు. అయితే, భారత స్పిన్నర్ మానవ్ సుతార్, ఫాస్ట్‌బౌలర్ హంగేర్గకర్ వారిని ఎక్కువసేపు నిలవనీయలేదు. వీరిద్దరి విజృంభణతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కాసిం అక్రమ్(48) కాసేపు పోరాడాడు. అతడికి తోడుగా.. ముబాసిర్ ఖాన్(28) రాణించాడు. ఆఖర్లో మెహ్రాన్ మంతాజ్ 25 పరుగులతో అజేయంగా నిలవడంతో 48 ఓవర్లలో పాకిస్తాన్ 205 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హంగేర్గకర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. మానవ్‌కు మూడు, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ సాయి సుదర్శన్ అదిరిపోయే ఆరంభం అందించాడు. సెంచరీ(104)తో చెలరేగి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకుని వారెవ్వా అనిపించాడు. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(20) నిరాశ పరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నికిన్ జోస్ అర్ధ శతకం(53)తో రాణించి సాయితో కలిపి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. మెహ్రాన్ బౌలింగ్‌లో నికిన్ అవుట్ అయ్యాడు. హ్యాట్రిక్ విజయం అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ యశ్ ధుల్ 19 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాయి సుదర్శన్ అజేయ శతకం, నికిన్ జోస్ హాఫ్ సెంచరీ కారణంగా భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కాగా ఈ టోర్నీలో భారత-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు యూఏఈ, నేపాల్‌లపై భారీ విజయాలు నమోదు చేసింది. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు
భారత్-పాకిస్తాన్ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది. టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి. కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చివరిసారి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ తాము కూడా అదే స్థాయి ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ (87) స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్-2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని అన్నాడు. మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో రాణించిన సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్ కోహ్లి కొట్టిన ఓ షాట్ సూపర్ హ్యూమన్ షాట్ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. -
ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డికి చోటు
ACC Men’s Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. ఎనిమిది ఆసియా దేశాల మధ్య ఇండియా- ఏ జట్టుకు యశ్ ధుల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. అభిషేక్ శర్మ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్‌కి సితాంషు కొటక్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకలో.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్‌తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆరోజు ఫైనల్ ఇందులో గ్రూప్-ఏ టాపర్‌తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్‌తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఇదిలా ఉంటే తొలిసారి నిర్వహించిన మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా భారత జట్టు అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్-ఏ జట్టును చిత్తు చేసి భారత మహిళల- ఏ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్‌కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). చదవండి: Ashes: ‘బజ్‌బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి.. -
టీమిండియాకు శుభవార్త! నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తే సరిపోదు: మాజీ క్రికెటర్ కౌంటర్
KL Rahul Replacemnet?: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఈ లక్నో సూపర్ జెయింట్స్ సారథి గాయపడిన విషయం తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్‌కు దూరం కావడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఆడలేకపోయాడు. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ఈ కర్ణాటక బ్యాటర్ వెస్టిండీస్ పర్యటనకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో రాహుల్ త్వరలోనే పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి.. మరోవారం రోజుల్లో ప్రాక్టీసు మొదలుపెడతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియాకు శుభవార్త అంటూ ట్వీట్ ఆగష్టు 31 నుంచి ఆరంభం కానున్న ఆసియాకప్-2023 ఈవెంట్‌కి అతడు అందుబాటులోకి వస్తాడని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రాహుల్ పునరాగమనానికి సంబంధించిన వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ అప్డేట్లు పంచుకునే ఓ ట్విటర్ యూజర్.. ‘‘టీమిండియాకు శుభవార్త. కేఎల్ రాహుల్ మరో రెండు వారాల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నాడు’’ అంటూ కేఎల్ ఫొటో షేర్ చేశాడు. ఇందుకు స్పందించిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్.. జాతీయ జట్టు తరఫున రీఎంట్రీ అంత సులభం కాదంటూ కౌంటర్ వేశాడు. అంత ఈజీ కాదు ‘‘బ్యాటింగ్‌లో తిరిగి ఫామ్‌లోకి రావడానికి, మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. జాతీయ జట్టులో పునరాగమనం మరీ అంత సులువుగా ఉండదు. ఉండకూడదు! నెట్స్‌లో ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయిలో పోటీకి సై అనడం ఎంతవరకు కరెక్ట్. కాబట్టి ముందుగా రాహుల్‌కు ప్రత్యామ్నాయం వెదకాలి. సాయి సుదర్శన్ వంటి లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌ను మిడిలార్డర్లో ఆడించే ప్రయత్నం చేయాలి’’ అని తమిళనాడుకు చెందిన ఈ మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లు పరుగులు తీయాలి.. బౌలర్లు వికెట్లు పడగొట్టాలి ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. ‘‘సాయి బంతితో కూడా జట్టుకు ఉపయోగపడగలడు’’ అని వ్యాఖ్యానించగా.. శివరామకృష్ణన్.. ‘‘బ్యాటర్లు పరుగులు సాధించడానికి, బౌలర్లు వికెట్లు తీయడానికి ఉంటారు. జట్టు కష్టాల్లో కూరుకుపోయినపుడు మాత్రమే పార్ట్‌టైమ్ బౌలింగ్ గురించి ఆలోచించాలి’’ అని సమాధానమిచ్చాడు. కాగా మద్రాస్‌లో జన్మించిన శివరామకృష్ణన్ టీమిండియా తరఫున 9 టెస్టులు, 16 వన్డేలు ఆడి ఆయా ఫార్మాట్లలో.. 26, 15 వికెట్లు పడగొట్టాడు. కొన్నాళ్లపాటు కామెంటేటర్‌గా వ్యవహరించిన అతడు.. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆటగాడు జథావేదఘ్ సుబ్రమణియన్ కోచ్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ సహా జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ తదితర కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం విదితమే. చదవండి: 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ Good news for India. KL Rahul is expected to start the batting practice in a couple of weeks. pic.twitter.com/huZXTN8VLV — Johns. (@CricCrazyJohns) June 28, 2023 People like Sai Sudarshan need to be looked at, Left handed middle order batsman — Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) June 28, 2023 -
భీకర ఫామ్‌లో సాయి సుదర్శన్.. విండీస్ టూర్‌కు ఎంపిక..?
ఐపీఎల్ 2023లో మొదలైన సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) పరుగుల ప్రవాహం, ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కూడా కొనసాగుతోంది. గడిచిన 10 ఇన్నింగ్స్‌ల్లో 53, 19, 20, 47, 43, 96 (ఐపీఎల్ ఫైనల్), 86, 90, 64 నాటౌట్, 7 పరుగులు చేసిన సాయి.. ఇవాళ (జూన్ 25) దిండిగుల్ డ్రాగన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు లైకా కోవై కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో సాయి సుడిగాలి ఇన్నింగ్స్ చూశాక కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్‌లు చేస్తున్నారు. త్వరలో జరుగనున్న విండీస్ సిరీస్‌లో భారత టీ20 జట్టుకు సాయిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత టీ20 జట్టుకు ఎంపిక కావడానికి ఓ ఆటగాడు ఇంతకంటే ఏం నిరూపించుకోవాలని తమిళ తంబిలు ప్రశ్నిస్తున్నారు. టీ20 జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సాయి ఆల్‌రౌండర్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఇతని ప్లేయింగ్ స్టయిల్, కంసిస్టెన్సీ, భారీ షాట్లు ఆడగల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. యశస్వి, రుతురాజ్ లాంటి వారికి అవకాశం ఇచ్చారు, వారికంటే సాయి ఏమాత్రం తీసిపోడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సాయి సుదర్శన్‌కు టీ20లతో పాటు లిస్ట్-ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మెరుగైన రికార్డు ఉంది. 21 ఏళ్ల సాయి సుదర్శన ఇప్పటివరకు 26 టీ20ల్లో 129.75 స్ట్రయిక్ రేట్లో 859 పరుగులు (5 హాఫ్ సెంచరీలు).. 11 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 60.36 సగటున 664 పరుగులు (3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు).. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 47.66 సగటున 572 పరుగులు (2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ) చేశాడు. -
సాయి సుదర్శన్ తుపాన్ ఇన్నింగ్స్..5 మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు
ఐపీఎల్-2023లో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదే దూకుడును కనబరుస్తున్నాడు. ఈ లీగ్‌లో లైకా కోవై కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిసుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా దిండిగల్ డ్రాగన్స్‌తో మ్యాచ్‌లో సుదర్శన్ మరో అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇది ఈ లీగ్‌లో సాయికి నాలుగో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 110 సగటుతో 323 పరుగులు చేశాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో కూడా సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫైనల్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి, గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక అప్డేట్ -
కనీసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు.. యశస్వి, తిలక్ వర్మ..!
ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఎలా ఉండాలనే దానిపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాప్-6లో కనీసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను చూడాలనుకుంటున్నానని అన్నాడు. టీమిండియాలో సీనియర్లను (రైట్ హ్యాండ్) రీప్లేస్ చేసేంత లెఫ్ట్ హ్యాండ్ టాలెంట్ మన వద్ద ఉందని, ఇప్పటి నుంచే వారిలో కొందరిని సాన పెడితే ప్రపంచకప్ సమయానికంతా మెరికల్లా తయారవుతారని తెలిపాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో జట్టు సమతూకంగా మారుతుందని, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఈ ఈక్వేషన్ ఫాలో అవ్వకపోతే టీమిండియాకు చాలా నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్లే కానక్కర్లేదు.. వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు బ్యాటింగ్ టాపార్డర్‌లో కనీసం ఇద్దరు లెఫ్ట్ బ్యాటర్లను చూడాలనుకుంటానన్న రవిశాస్త్రి.. ఆ ఇద్దరూ ఓపెనర్లే కానక్కర్లేదని తెలిపాడు. టాప్-4లో ఒకరు, టాప్-6లో ఇద్దరు అయితే జట్టు సమతూకంగా మారి, ప్రత్యర్ధి బౌలర్లకు ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డాడు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్.. యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లని.. ఐపీఎల్లో వారిదివరకే ప్రూవ్ చేసుకున్నారని, వీరికి సీనియర్ల స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వీరే కాక నేహల్ వధేరా, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లు కూడా లైన్లో ఉన్నారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీరిని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తే టీమిండియా బెంచ్ స్ట్రెంగ్త్ పటిష్టంగా ఉంటుందని అన్నాడు. -
ఐపీఎల్లో దుమ్ము రేపాడు.. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు! ఎవరంటే?
గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు, చెన్నైకు చెందిన యువ క్రికెటర్ సాయి సుదర్శన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో లైకా కోవై కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిసుదర్శన్ దుమ్మురేపుతున్నాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీ సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో భాగంగా సోమవారం చెపాక్ సూపర్ గిల్లీస్‌తో జరిగిన అర్ధ శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. అతడి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా 127 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే కోవై కింగ్స్ ఛేదించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 120 సగటుతో 240 పరుగులు చేశాడు. అదే విధంగా ఐపీఎల్లో కూడా సుదర్శన్ అదరగొట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి, గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది సీజన్లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు. టీమిండియాలోకి ఎంట్రీ.. ఇక భీకర ఫామ్‌లో ఉన్న సాయిసుదర్శన్ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు సాయిసుదర్శన్‌ను ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి హార్దిక్ కూడా సుదర్శన్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఇక సుదర్శన్‌తో పాటు జైశ్వాల్, రింకూ సింగ్‌కు కూడా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం.. ఆంధ్రా టీమ్ లేకపోవడమే నయం' -
లీగ్‌లో తొలి శతకం నమోదు..సెంచరీ చేజార్చుకున్న సాయి సుదర్శన్
ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL2023) అభిమానులను అలరిస్తోంది. లో స్కోరింగ్ మ్యాచ్‌లు నమోదైనప్పటికి విజయం కోసం ఆఖరి బంతి వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా శుక్రవారం లైకా కోవై కింగ్స్, నెల్లయ్ రాయల్ కింగ్స్ మధ్య మ్యాచ్ భారీ స్కోర్లు నమోదయ్యాయి. నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ అజితేశ్ గురుస్వామి ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 8 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ సంచలనం.. లైకా కోవై కింగ్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 52 బంతుల్లో 90 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే 10 పరుగుల తేడాతో మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నెల్లయ్ రాయల్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 90, సురేశ్ కుమార్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అజితేశ్ గురుస్వామి (112 పరుగులు) ఒక్కడే జట్టును గెలిపించడం విశేషం. G Ajitesh cracks 1st hundred of #TNPL2023 👏 P.S. Full innings will be up soon on our Youtube channel.#TNPLonFanCode pic.twitter.com/PAB1BjewTc — FanCode (@FanCode) June 16, 2023 చదవండి: బజ్‌బాల్ దూకుడు; రూట్ సెంచరీ.. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ -
'నా సక్సెస్‌లో సగం క్రెడిట్ కేన్మామదే'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఒక సంచలనం. ముఖ్యంగా సీఎస్కేతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సాయి సుదర్శన్ 47 బంతుల్లోనే 96 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు ముంబై ఇండినయ్స్తో జరిగిన క్వాలిఫయర్-2లోనూ 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో ఆడే అవకాశం తక్కువగా వచ్చినప్పటికి అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు సాయి సుదర్శన్. ఓవరాల్‌గా ఈ సీజన్లో సాయి సుదర్శన్ 8 ఇన్నింగ్స్‌లు ఆడి 362 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్ఎపీల్ 2023)లో బిజీగా ఉన్న సాయి సుదర్శన్ పీటీఐకి ఇంటర్య్వూ ఇచ్చాడు. తన సక్సెస్‌లో సగం క్రెడిట్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌దే అని తెలిపాడు. ఇక కేన్ విలియమ్సన్ ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయపడిన కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ''నా షాట్ల ఎంపికలో కొత్తదనం కనిపిస్తుంటే అది కేన్ విలియమ్స్‌న్ వల్లే. గాయంతో కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయి స్వదేశానికి వెళ్లినప్పటికి కేన్ మామతో నిత్యం టచ్‌లో ఉన్నా. బ్యాటింగ్‌లో టిప్స్‌తో పాటు కొంత ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాడు. అంతేకాదు ఒక గేమ్‌లో ఇన్నింగ్స్ డీప్‌గా ఎలా ఆడాలనేదానిపై.. లిమిటేషన్స్ లేకుండా ఆటపై పట్టు ఎలా సాధించాలనే దానిపై సూచనలు ఇచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సమయంలో అతను ఎంపిక చేసుకున్న షాట్స్‌ను గమనించేవాడిని. అతను మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సమర్థుడు. అలాంటి ప్లేయర్ నుంచి బ్యాటింగ్‌లో బెటర్‌గా ఆడడం ఎలా అని నేర్చుకోవడం నాకు పెద్ద విషయం. ఇక మాథ్యూ వేడ్ పాడిల్, స్కూప్ షాట్స్ ఎలా ఆడాలో నేర్పించాడు.'' అంటూ తెలిపాడు. Sai Sudharsan said, "even when Kane Williamson left Gujarat Titans after injury, he was in regular touch with me, providing valuable feedback. He was telling me how to take the game deeper and how to maximise our abilities with our limitations". (To Indian Express). pic.twitter.com/1TjCD0pGqf — Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2023 చదవండి: కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు 'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే? -
అదే దూకుడు.. సాయిసుదర్శన్ విధ్వంసం! 8ఫోర్లు, 4 సిక్స్‌లతో
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2023 సీజన్‌ను కోవై కింగ్స్ ఘనంగా ప్రారంభించింది. శ్రీరామకృష్ణ కళాశాల మైదానం వేదికగా ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో కోవై కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్.. 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సాయిసుదర్శన్ మరో బ్యాటర్ ముకిలేష్తో కలిసి కింగ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముకిలేష్ ఔటైనప్పటికీ సాయిసుదర్శన్ మాత్రం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఇక సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తిరుప్పూర్ తమిజన్స్ 109 పరుగులకే కుప్పకూలింది. కోవై కింగ్స్ బౌలర్లలో కెప్టెన్ షారుఖ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ రెండు, ముకిలేష్, జాతవేద్ సుబ్రమణ్యన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన సాయిసుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. సీఎస్కేతో జరిగిన ఫైనల్లో 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే? Fifty for Sai!🤩#TNPL2023🏏#TNPLonstarsports#TNPLonfancode#NammaAatamAarambam💥#NammaOoruNammaGethu💪🏼 pic.twitter.com/Zrh1IrHk1f — TNPL (@TNPremierLeague) June 12, 2023 -
CSK వద్దనుకుంది GT కొనుక్కుంది 20 లక్షలు తీసుకుని చెన్నై పై రెచ్చి పోయడుగా ....
-
IPL 2023: చెన్నై కొంటుందనుకున్నాడు.. కానీ అలా జరుగలేదు! ఫైనల్లో అదే జట్టుపై
IPL 2023 Final CSK Vs GT- Who Is Sai Sudharsan- His Best Innings: ‘సాయి సుదర్శన్ ప్రత్యేకమైన ఆటగాడు. టి20 ఫార్మాట్కైతే సరిగ్గా సరిపోతాడు. సాధ్యమైనంత తొందరగా అతడిని తమిళనాడు జట్టులోకి తీసుకు రండి’... భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జూలై, 2021లో చెప్పిన ప్రశంసాపూర్వక మాట ఇది. ఆ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను అద్భుత బ్యాటింగ్‌తో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అశ్విన్ మాట విన్నట్లుగా తమిళనాడు సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేయగా... నవంబర్, 2021లోనే అతను తన తొలి దేశవాళీ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గత రెండేళ్లలో అతని ఆట మరింత మెరుగైంది. 21 ఏళ్ల సుదర్శన్ మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ప్రస్తుతం ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. Photo Credit : AFP చెన్నై తీసుకోలేదు.. తన ప్రదర్శన, గుర్తింపు కారణంగా 2022 ఐపీఎల్ వేలంలో తనను చెన్నై జట్టు తీసుకుంటుందని సుదర్శన్ ఆశించాడు. కానీ అది జరగలేదు. చివరకు అతని కనీస విలువ రూ. 20 లక్షలకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. విజయ్‌శంకర్‌కు గాయం కావడంతో తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాగా, మొత్తం సీజన్లో 5 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. అయితే అతని మెరుపులు ఆకట్టుకున్నాయి. Photo Credit : AFP విలియమ్సన్ తప్పుకోవడంతో ముఖ్యంగా రబడ బౌలింగ్‌లో కొట్టిన హుక్‌షాట్ బౌండరీ అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. సాయి బ్యాటింగ్‌ను నమ్మిన టీమ్ యాజమాన్యం ఈసారి కూడా కొనసాగించింది. ఈ ఏడాది కూడా విలియమ్సన్ గాయంతో తప్పుకోవడంతో తనకు అందివచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. ఢిల్లీపై అర్ధసెంచరీ చేసిన మ్యాచ్‌లో నోర్జే వేసిన 144 కిలోమీటర్ల బంతిని వికెట్ల వెనుకవైపు సిక్సర్‌గా మలచడం హైలైట్‌గా నిలిచింది. Photo Credit : AFP సెంచరీ చేజారినా.. కోల్‌కతాపై కూడా మరో అర్ధ సెంచరీ సాధించిన అతను ఈ సీజన్లో 51.71 సగటు, 141.41 స్ట్రయిక్‌రేట్‌తో 362 పరుగులు సాధించడం విశేషం. ముంబైతో రెండో క్వాలిఫయర్‌లో చివర్లో వేగంగా పరుగులు చేయలేక ‘రిటైర్డ్ అవుట్’గా వెళ్లడంతో అతని దూకుడుపై సందేహాలు తలెత్తాయి. అయితే సోమవారం అతను దానిని పటాపంచలు చేశాడు. సెంచరీ చేజారినా...ఐపీఎల్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. Photo Credit : AFP తల్లిదండ్రులు కూడా సుదర్శన్ ఇంట్లోనే క్రీడలు ఉన్నాయి. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ భారత్ తరఫున దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనగా, తల్లి ఉష జాతీయ వాలీబాల్‌లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేస్తోంది. వివిధ వయో విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో అతను దూసుకొచ్చాడు. Photo Credit : AFP తల్లి పర్యవేక్షణలో 2019–20 అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ, రవి బిష్ణోయ్, ప్రియమ్ గార్గ్ అతని ఇండియా ‘ఎ’ జట్టు సహచరులు. ఆరంభంలోనే ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి పెట్టని సాయి తల్లి పర్యవేక్షణలో పూర్తి ఫిట్‌గా మారడం కూడా అతని కెరీర్‌కు మేలు చేసింది. Photo Credit : AFP చెన్నైపై తన మెరుపు బ్యాటింగ్‌తో 2022లో టైటాన్స్ రూ.20 లక్షలకు తీసుకున్న తర్వాత జరిగిన 2023 తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలంలో సుదర్శన్‌కు రూ. 21.60 లక్షలు దక్కడం విశేషం. సీఎస్కేకే చెందిన జూనియర్ సూపర్ కింగ్స్ టీమ్ సభ్యుడిగా 2018లో సుదర్శన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా, ఆ టీమ్‌కు అంబటి రాయుడు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అదే చెన్నైపై తన మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగడం కొసమెరుపు! ఈ సందర్భంగా రికార్డుల మోత మోగించాడు సాయి సుదర్శన్. –సాక్షి క్రీడా విభాగం చదవండి: రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని చాంపియన్‌గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్‌మనీ పూర్తి వివరాలు ఇవే.. High praise for our young Titan 👏🏻💙 https://t.co/Kep0fr6Pgl — Gujarat Titans (@gujarat_titans) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ సీఎస్కేతో జరిగిన ఫైనల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన మెరుపులతో ఆకట్టుకున్నాడు. Photo: IPL Twitter అయితే సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్‌ను నిధానంగా ఆరంభించినప్పటికి అసలు సమయంలో తనలోని డేంజరస్ బ్యాటర్‌ను వెలికి తీశాడు. సాహా ఔటైన తర్వాత గేర్ మార్చిన సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్ సహా మూడు ఫోర్లు కలిపి 20 పరుగులు పిండుకున్నాడు. 31 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన సాయి సుదర్శన్.. తర్వాతి 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో సాయి సుదర్శన్ ఐపీఎల్లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు మనీష్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తరపున పంజాబ్ కింగ్స్‌పై 94 పరుగులు చేశాడు. 2012 ఫైనల్లో సీఎస్కేపై కేకేఆర్ తరపున మన్విందర్ బిస్లా 89 పరుగులు చేశాడు. అయితే రజత్ పాటిదార్(ఆర్సీబీ తరపున 112 నాటౌట్ వర్సెస్ కేకేఆర్) సెంచరీ చేసినప్పటికి అది ఫైనల్ మ్యాచ్ కాదు.. ఎలిమినేటర్‌లో పాటిదార్ సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్లో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాయి సుదర్శన్ దక్కించుకున్నాడు. Photo: IPL Twitter ► ఇక ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్‌గా సాయి సుదర్శన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకముందు షేన్ వాట్సన్ 117 పరుగులు నాటౌట్(2018లో ఎస్ఆర్హెచ్తో ఫైనల్లో) తొలి స్థానంలో, రెండో స్థానంలో సీఎస్కే తరపున వృద్ధిమాన్ సాహా 115 పరుగులు పంజాబ్ కింగ్స్ తరపున, 2014లో కేకేఆర్‌పై ఫైనల్లో, మురళీ విజయ్ 95 పరుగులు(సీఎస్కే), మనీష్ పాండే(94 పరుగులు, కేకేఆర్) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ ఫైనల్లో 50 ప్లస్ స్కోరు చేసిన రెండో యంగెస్ట్ బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇవాళ సీఎస్కేతో ఫైనల్లో (47 బంతుల్లో 96 పరుగులు) 21 ఏళ్ల 226 రోజుల వయసులో సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు. తొలి స్థానంలో మనన్ వోహ్రా 2014లో 20 ఏళ్ల 318 రోజుల వయసులో; శుబ్‌మన్ గిల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో(2021లో సీఎస్కేతో జరిగిన ఫైనల్లో కేకేఆర్ తరపున) మూడో స్థానంలో, రిషబ్ పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో(2020లో ముంబై ఇండియన్స్‌తో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున) నాలుగో స్థానంలో ఉన్నాడు. Sai Sudharsan masterclass in the IPL 2023 Final. pic.twitter.com/SiRywPhOqz — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 చదవండి: శుబ్‌మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్‌గా -
#SaiSudharsan: రిటైర్డ్ ఔట్.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగడం ఆసక్తి కలిగించింది. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో 31 బంతుల్లో 43 పరుగులు చేసిన సాయి సుదర్శన్ స్కోరును పెంచేందుకు వేరే బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలని తనంతట తానే రిటౌర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన మూడో ఆటగాడిగా.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. Photo: IPL Twitter రిటైర్డ్ ఔట్ అంటే ఏంటి? రిటైర్డ్ ఔట్ అంటే అంపైర్ అనుమతి లేకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోవచ్చు.. అయితే తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం ఉండదు. అదే రిటైర్డ్ హర్ట్(గాయపడిన సమయంలో) అయితే సదరు బ్యాట్స్‌మన్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చివరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అయితే మాత్రం మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. ఈ రెండింటి మధ్య ఇదే ప్రధాన వ్యత్యాసం. Photo: IPL Twitter ఇంతకముందు ఇదే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అథర్వ టైడే 42 బంతుల్లో 55 పరుగులు చేసి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కరన్ లాంటి హిట్టర్లకు బ్యాటింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అథర్వ తనంతట తాను రిటైర్డ్ ఔట్ అయ్యాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ ఔట్ అయిన తొలి ఆటగాడు రాజస్తాన్రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ రిటైర్డ్ఔట్గా వెనుదిరిగాడు. 23 బంతుల్లో 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ అనూహ్యంగా రిటైర్డ్ ఔట్ అయ్యాడు. రియాన్ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం కోసం అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. Photo: IPL Twitter కాగా టి20 క్రికెట్లో రిటైర్డ్ ఔట్ అయిన ఆరో బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇంతకముందు ఐపీఎల్లో అశ్విన్, అథఱ్వ టైడేలతో పాటు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది, బుటాన్కు చెందిన ఎస్ తోగ్బే, కుమిల్లా వారియర్స్‌కు చెందిన సంజాముల్ ఇస్లామ్‌లు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగారు. -
IPL 2023: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జరిగిందిదే! అందుకే ఇలా!
IPL 2023- Impact Player- ముంబై: గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్–2023 మరింత ఆసక్తికరంగా సాగుతోందని భారత మాజీ క్రికెటర్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా లీగ్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఎమ్మెస్కే ఈ ఐపీఎల్ సీజన్లో స్టార్ స్పోర్ట్స్–తెలుగు చానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘స్టార్’ కార్యక్రమంలో ఆయన తాజా సీజన్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘సగం టోర్నమెంట్ ముగిసేసరికే ఈ ఐపీఎల్ గత సీజన్ల రికార్డులను అధిగమించింది. 200కు పైగా స్కోర్లు పెద్ద సంఖ్యలో నమోదు కాగా, సిక్సర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇది లీగ్ ఎంతగా విజయవంతం అయిందో చూపిస్తోంది’ అని ప్రసాద్ అన్నారు. సానుకూలమే.. అందుకే ఇలా కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అంశం మంచి ప్రభావం చూపిస్తోందని ప్రసామద్ చెప్పారు. ‘ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఈ సీజన్లో ఐపీఎల్ టీమ్ హోమ్ అడ్వాంటేజ్ పోయింది. ప్రత్యర్థి జట్టు వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కలుగుతోంది. అందుకే చాలా మ్యాచ్‌లలో సొంత మైదానాల్లో జట్లు ఓడిపోతున్నాయి’ అని ఎమ్మెస్కే విశ్లేషించారు. యువ ఆటగాళ్లు అదుర్స్ ప్రధానంగా భారత యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనలు ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశమని ఈ భారత మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత క్రికెట్‌కు మేలు చేసే అంశం. తిలక్‌వర్మ, సాయిసుదర్శన్, రింకూ సింగ్, యశస్వి, ధ్రువ్ జురేల్ తమ ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం సానుకూలాంశం.’ అని ప్రసాద్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సద్వినియోగం చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఆయుష్ బదోనిని, బెంగళూరు హర్షల్ పటేల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా దింపాయి. చదవండి: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్ -
అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు!
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. టాపార్డర్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37), సర్ఫరాజ్ ఖాన్(30) మినహా మిగతా వాళ్లు విఫలమైన వేళ అక్షర్ బ్యాట్ ఝులిపించాడు. ఈ స్పిన్ ఆల్‌రౌండర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేయగలిగింది. కానీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌ను సాయి సుదర్శన్(62), డేవిడ్ మిల్లర్ (31) ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయతీరాలకు చేర్చారు. దీంతో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్-2023లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో అక్షర్ చేతికి వార్నర్ బంతినివ్వకపోవడం చర్చనీయాంశమైంది. అందుకే అక్షర్ చేతికి బంతినివ్వలేదు.. అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఢిల్లీ కెప్టెన్ వార్నర్ భాయ్.. తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘మ్యాచ్ ఆరంభంలోనే గుజరాత్ సీమర్లను చూసి నేను ఆశ్చర్యపోయాననుకోకండి. నిజానికి ఊహించిన దానికంటే బంతి మరింత ఎక్కువగా స్వింగ్ అయింది. పరిస్థితులకు అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలో వాళ్లు(గుజరాత్) చూపించారు. ఇంకా ఇక్కడ మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆరంభ ఓవర్లలో బంతి ఇలాగే స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఆఖరి వరకు మేము గెలుస్తామనే నమ్మకం ఉండింది. అయితే, సాయి అద్బుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఇక మిల్లర్ గురించి చెప్పేదేముంది. అతడు ఏం చేయగలడో అదే చేశాడు. నిజానికి డ్యూ(తేమ) ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట 180-190 వరకు స్కోర్ చేస్తేనే మ్యాచ్‌ను కాపాడుకోగలం. అంతేగానీ అతడికి(అక్షర్‌ను ఉద్దేశించి) బౌలింగ్ ఇవ్వకపోవడం వల్ల కాదు’’ అని వార్నర్ తెలిపాడు. సీమర్లకు అనుకూలించే వికెట్‌పై స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేతికి బంతినివ్వలేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 18 పరుగులు ఇచ్చాడు. చదవండి: IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు DC Vs GT: రానున్న రెండేళ్లలో ఫ్రాంఛైజ్ క్రికెట్‌తో పాటు టీమిండియాలో కూడా! Double delight for @gujarat_titans 🙌🙌 They win their second consecutive game of #TATAIPL 2023 and move to the top of the Points Table. Scorecard - https://t.co/tcVIlEJ3bC#DCvGT pic.twitter.com/WTZbIZTQmm — IndianPremierLeague (@IPL) April 4, 2023 -
DC Vs GT: రానున్న రెండేళ్లలో ఫ్రాంఛైజ్ క్రికెట్‌తో పాటు టీమిండియాలో కూడా!
IPL 2023- Hardik Pandya- Sai Sudharsan: ‘‘మ్యాచ్ ఆరంభంలో అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. పవర్‌ప్లేలో అదనంగా 15 -20 పరుగులు ఎక్కువే ఇచ్చాం. అయితే, ఆ తర్వాత మా బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతం. నాయకుడిగా మైదానంలో నేను తీసుకునే నిర్ణయాలు సరైనవేనని నా మనసు చెబుతుంది. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉంటేనే ధైర్యంగా ముందడుగు వేయగలం. మా జట్టు సభ్యులకు ఆటను పూర్తిగా ఆస్వాదించమని మాత్రమే చెబుతా. స్వేచ్ఛగా ఆడినప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ఈ రోజు సాయి సుదర్శన్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గత 15 రోజులుగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన అతడి అంకితభావానికి నేటి మ్యాచ్ రూపంలో మంచి ఫలితం దక్కింది. రానున్న రెండేళ్లకాలంలో ఫ్రాంఛైజీ క్రికెట్ ఇంకా టీమిండియాలో కూడా సాయి సుదర్శన్ తన ప్రతిభతో కీలక ప్లేయర్‌గా ఎదుగుతాడనే నమ్మకం ఉంది. నిజానికి ఈ గెలుపులో సాయితో పాటు మా సహాయక సిబ్బందికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. సాయిపై ప్రశంసల జల్లు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సాయి సుదర్శన్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలుపుతో ఐపీఎల్-2023 సీజన్‌ను ఆరంభించిన హార్దిక్ సేన.. ఢిల్లీ వేదికగా రెండో విజయం నమోదు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో వార్నర్ బృందంతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సాయి ఈ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ మొత్తంగా 48 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఛేజింగ్‌లో ఆరంభంలోనే తడబడిన గుజరాత్ టైటాన్స్‌ను మిల్లర్‌తో కలిసి గెలుపు తీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ సాయి సుదర్శన్‌పై ఈ మేరకు ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2023: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు: టాస్- గుజరాత్ టైటాన్స్- బౌలింగ్ ఢిల్లీ- 162/8 (20) గుజరాత్- 163/4 (18.1). చదవండి: ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వరల్డ్‌కప్ టోర్నీకి కూడా Chasing with conviction! 💙⚡️#DCvGT | #AavaDe | #TATAIPL 2023pic.twitter.com/kFgqRVFcu0 — Gujarat Titans (@gujarat_titans) April 4, 2023 -
ఐపీఎల్ కంటే 'ఆ' లీగ్‌లోనే అధిక మొత్తం.. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్‌కు జాక్‌పాట్
TNPL 2023 Auction: ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు ఆల్‌రౌండర్ సాయి సుదర్శన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL 2023) వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. మహాబలిపురంలో జరుగుతున్న లీగ్ తొలి వేలంలో సాయి సుదర్శన్‌ను లైకా కోవై కింగ్స్ 21.6 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. కోవై కింగ్స్ మొత్తం పర్స్ విలువ 70 లక్షలైతే.. ఒక్క సాయి సుదర్శన్పైనే ఆ జట్టు మూడో వంతు వెచ్చించడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరో ఆసక్తికర విశేషమేమింటంటే.. TNPLలో సాయి సుదర్శన్‌కు లభించే మొత్తం, ఐపీఎల్లో అతనికి లభించే మొత్తం కంటే అధికంగా ఉండటం. సాయి సుదర్శన్‌ను 2022 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ బేస్ ప్రైజ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. TNPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సాయి సుదర్శన్.. 2022 ఐపీఎల్లో ఆకట్టుకున్నాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతని కొరకు ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. గత ఐపీఎల్ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన సాయి.. 36.25 సగటున, 127.19 స్ట్రయిక్ రేట్‌తో ఓ హాఫ్ సెంచరీ (పంజాబ్ కింగ్స్‌పై 65*) సాయంతో 145 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ కూడా అయిన సాయి.. దేశవాలీ సీజన్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరిగే TNPL వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు, సంజయ్ యాదవ్‌ను చెపాక్ సూపర్ గిల్లీస్ 17.6 లక్షలకు, ఆల్‌రౌండర్ సోనూ యాదవ్‌ను నెల్లై రాయల్ కింగ్స్ 15.2 లక్షలకు, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి కిషోర్‌ను తిరుపూర్ తమిజాన్స్ 13 లక్షలకు సొంతం చేసుకున్నాయి. -
సెంచరీతో మెరిసిన ‘టైటాన్స్’ బ్యాటర్.. వాషింగ్టన్ సుందర్ మాత్రం!
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో మ్యాచ్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ సెంచరీతో మెరిశాడు. 180 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ బాబా అపరాజిత్ (88; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం నాటి మూడో రోజు ఆట ఫస్ట్ సెషన్ సమయానికి 6 వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 336 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు కంటే 39 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడు- ఆంధ్ర జట్ల మధ్య డిసెంబరు 20న టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర.. 297 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అభిషేక్ రెడ్డి 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రికీ భుయ్ 68, కరణ్ షిండే 55 పరుగులు చేశారు. వాషీ ప్రభావం చూపలేకపోయాడు తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్‌కు రెండు, వారియర్‌కు మూడు, సాయి కిషోర్‌కు మూడు, అజిత్ రామ్, విజయ్ శంకర్‌కు తలా ఒక వికెట్ దక్కాయి. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయని వాషీ.. బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. 13 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా సాయి సుదర్శన్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ప్రదర్శనను కొనియాడుతూ టైటాన్స్ ట్వీట్ చేసింది. చదవండి: Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్ -
జగదీశన్ విధ్వంసం.. చెలరేగిన సిద్దార్థ! ఏకంగా 435 పరుగుల తేడాతో..
Vijay Hazare Trophy 2022- Narayan Jagadeesan: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో తమిళనాడు సంచలన విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో సోమవారం తలపడ్డ తమిళనాడు జట్టు ఏకంగా 435 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా లిస్ట్ ‘ఏ’ క్రికెట్(పరిమిత ఓవర్లు)లో అత్యంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఎలైట్ గ్రూప్- సీలో ఉన్న తమిళనాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న అరుణాచల్ జట్టుకు తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్, నారయణ్ జగదీశన్ చుక్కలు చూపించారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం సాయి 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేశాడు. 277 పరుగులతో రాణించి జట్టు 506 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చెలరేగిన సిద్ధార్థ కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు తమిళనాడు బౌలర్లు. ఓపెనర్లు నీలమ్ ఓబి(4), రోషన్ శర్మ(2)ను సిలంబరసన్ ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపాడు. ఇక తర్వాత సాయి కిషోర్(ఒక వికెట్), సిద్దార్థ్(7.4 ఓవర్లలో 12 మాత్రమే పరుగులు ఇచ్చి 5 వికెట్లు), మహ్మద్(2 వికెట్లు) మిగతా బ్యాటర్ల పనిపట్టారు. 71 పరుగులకే కుప్పకూలిన అరుణాచల్ తమిళనాడు బౌలర్ల విజృంభణతో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దారుణ వైఫల్యం మూటగట్టుకున్నారు. వరుసగా 4, 2, 11, 14, 17, 0, 6, 3(నాటౌట్), 0,0,0 స్కోర్లు నమోదు చేశారు. దీంతో 28. 4 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి అరుణాచల్ జట్టు ఆలౌట్ అయింది. 435 పరుగుల తేడాతో బాబా అపరాజిత్ బృందం జయభేరి మోగించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో.. సమిష్టి కృషితో సంచలన విజయం అందుకుంది. చదవండి: Narayan Jagadeesan: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు క్రీడల చరిత్రలో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎవరో తెలుసా..? #Jagadeesan (277) misses out on triple hundred. Gets a big ovation from teammates after world record List A score. @sportstarweb #VijayHazareTrophy2022 pic.twitter.com/s8CKYgUXsc — Ashwin Achal (@AshwinAchal) November 21, 2022 -
దురదృష్టం అంటే ఇదే మరి.. పాపం సాయి సుదర్శన్..!
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అనూహ్యంగా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో కీరన్ పొలార్డ్ వేసిన అఖరి బంతిని పుల్ షాట్ ఆడటానికి సుదర్శన్ ప్రయత్నించాడు. అయితే పొలార్డ్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన సుదర్శన్ .. బ్యాలన్స్ కోల్పోయి తన బ్యాట్‌తో వికెట్లను కొట్టాడు. దీంతో ఈ సీజన్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా సాయి సుదర్శన్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. అఖరి ఓవర్లో 9 పరుగులు కావల్సిన నేపథ్యంలో డానియల్ సామ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైకు విజయాన్ని అందించాడు. స్కోర్లు ముంబై ఇండియన్స్: 177/6 గుజరాత్ టైటాన్స్: 172/5 చదవండి: IPL 2022: 'వార్నర్‌ను సెంచరీ గురించి అడిగాను.. నన్ను హిట్టింగ్ చేయమన్నాడు' pic.twitter.com/okekrCcskM — Diving Slip (@SlipDiving) May 6, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'నోటితో చెప్పొచ్చుగా'.. సహనం కోల్పోయిన తెవాటియా
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రనౌట్ అయ్యే అవకాశం నుంచి తృటిలో తప్పించుకున్న రాహుల్ తెవాటియా తన సహనాన్ని కోల్పోయాడు. కోపంతో ఊగిపోయిన తెవాటియా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్లో ఒక బంతికి తెవాటియా సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. సగం పిచ్ దాటి వచ్చిన తెవాటియాకు సుదర్శన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో వెనక్కి పరిగెట్టిన తెవాటియా కొద్దిలో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించకున్నాడు. వెంటనే సాయి సుదర్శన్ వైపు తిరిగిన తెవాటియా.. సింగిల్ వద్దని నోటితో చెప్పొచ్చుగా అంటూ సీరియస్ లుక్ ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు సాహా, గిల్లు తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. Tewatia angry! pic.twitter.com/7okGTIC0S8 — Cricketupdates (@Cricupdates2022) May 3, 2022 -
ఎవరీ సాయి సుదర్శన్.. ధర కేవలం 20 లక్షలు.. కానీ!
IPL 2022 - Who Is Sai Sudharshan: ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్ ఒక వేదికగా మారింది. ఐపీఎల్లో అదరగొట్టిన భారత యువ ఆటగాళ్లు ఏకంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్లో దుమ్మురేపిన వారే. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ యువ ఆటగాళ్లు అదరగొడుతుండటం శుభపరిణామం. ఇప్పటికే అయుష్ బదోని, వైభవ్ ఆరోరా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు తమ సత్తా చాటుతుండగా.. తాజాగా మరో యువ సంచలనం సాయి సుదర్శన్ తన ఆటతీరుతో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సాయి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆకట్టుకున్న సాయి సుదర్శన్ ఐపీఎల్-2022లో సాయిసుదర్శన్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి సాయిసుదర్శన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 35 పరుగులు సాధించిన సాయి గుజరాత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అయితే తొలి మ్యాచ్ ఆడుతున్నానన్న భయం సుదర్శన్‌లో అస్సలు కనిపించలేదు. రబడా లాంటి స్టార్ బౌలర్ బౌలింగ్‌లో సాయి అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇక శుభ్‌మన్ గిల్, సాయి ప్రదర్శనకు తోడు ఆఖర్లో రాహుల్ తెవాటియా మెరుపులతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సాయిసుదర్శన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. తమిళనాడుకు చెందిన ఈ యువ ఆటగాడు విజయ్ శంకర్ స్థానంలో గుజరాత్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో సాయిసుదర్శన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ సాయి సుదర్శన్? ►సాయి సుదర్శన్ ఆక్టోబర్ 15, 2001న చెన్నైలో జన్మించాడు. ► సాయి సుదర్శన్ దేశవాళీ టోర్నీల్లో తమిళనాడు తరపున ఆడుతున్నాడు. ► 2021లో ముంబైపై ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ► సుదర్శన్ టీ20ల్లో 2021లో మహారాష్ట్రపై అరంగేట్రం చేశాడు. ► లిస్ట్-ఏ కెరీర్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 54 పరుగులు సాధించాడు. ► 7 టీ20 మ్యాచ్‌ల్లో 182 పరుగులు చేశాడు. ► తమిళనాడు ప్రీమియర్ లీగ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే 87 పరుగులు సాధించి తన విలువ చాటుకున్నాడు. ► ఇక తమిళనాడు ప్రీమియర్ లీగ్-2021లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 358 పరుగులు సాధించాడు. ► ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. 20 లక్షలకు గుజరాత్ సాయి సుదర్శన్‌ను కొనుగోలు చేసింది. A round of applause for Sai Sudharsan & Darshan Nalkande as they make their debut for @gujarat_titans 👍 👍#TATAIPL | #PBKSvGT pic.twitter.com/r695DVWhrm — IndianPremierLeague (@IPL) April 8, 2022