తమిళనాడు ప్రీమియర్ లీగ్-2023 సీజన్‌ను కోవై కింగ్స్ ఘనంగా ప్రారంభించింది. శ్రీరామకృష్ణ కళాశాల మైదానం వేదికగా ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో కోవై కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్.. 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సాయిసుదర్శన్ మరో బ్యాటర్ ముకిలేష్‌తో కలిసి కింగ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముకిలేష్ ఔటైనప్పటికీ సాయిసుదర్శన్ మాత్రం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఇక సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తిరుప్పూర్ తమిజన్స్ 109 పరుగులకే కుప్పకూలింది. కోవై కింగ్స్ బౌలర్లలో కెప్టెన్ షారుఖ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ రెండు, ముకిలేష్, జాతవేద్ సుబ్రమణ్యన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన సాయిసుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. సీఎస్‌కేతో జరిగిన ఫైనల్లో 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే?
Fifty for Sai!🤩#TNPL2023🏏#TNPLonstarsports#TNPLonfancode#NammaAatamAarambam💥#NammaOoruNammaGethu💪🏼 pic.twitter.com/Zrh1IrHk1f
— TNPL (@TNPremierLeague) June 12, 2023
Comments
Please login to add a commentAdd a comment