Kovai
-
అదే దూకుడు.. సాయిసుదర్శన్ విధ్వంసం! 8ఫోర్లు, 4 సిక్స్‌లతో
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2023 సీజన్‌ను కోవై కింగ్స్ ఘనంగా ప్రారంభించింది. శ్రీరామకృష్ణ కళాశాల మైదానం వేదికగా ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో కోవై కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోవై కింగ్స్.. 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సాయిసుదర్శన్ మరో బ్యాటర్ ముకిలేష్తో కలిసి కింగ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముకిలేష్ ఔటైనప్పటికీ సాయిసుదర్శన్ మాత్రం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఇక సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తిరుప్పూర్ తమిజన్స్ 109 పరుగులకే కుప్పకూలింది. కోవై కింగ్స్ బౌలర్లలో కెప్టెన్ షారుఖ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ రెండు, ముకిలేష్, జాతవేద్ సుబ్రమణ్యన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన సాయిసుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. సీఎస్కేతో జరిగిన ఫైనల్లో 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే? Fifty for Sai!🤩#TNPL2023🏏#TNPLonstarsports#TNPLonfancode#NammaAatamAarambam💥#NammaOoruNammaGethu💪🏼 pic.twitter.com/Zrh1IrHk1f — TNPL (@TNPremierLeague) June 12, 2023 -
తాగి...ఊగి..రోడ్డుమీదే నిద్రపోయింది
తిరువొత్తియూరు : తమిళనాడులో ఓ మహిళ ఫుల్ గా మద్యం సేవించి ..... రోడ్డుపైనే నిద్రపోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... కోవై నగరంలో పెరియనాయకన్ పాళయం రిజిస్ట్రేషన్ కార్యాలయం రోడ్డు అంటేనే ఎల్లప్పుడు అత్యంత జనసమర్థంగా ఉండే ప్రాంతం... పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం ... ప్రభుత్వాసుపత్రి .. అన్ని అదే రహదారిలో ఉన్నాయి. అవి కూడా కూతవేటు దూరంలోనే ఉన్నాయి. అయితే ఓ మహిళ పీకల దాక మద్యం తాగింది. అనంతరం రహదారిపై తుళ్లుతూ... తూలుతూ నడుస్తు వాహనదారులను భయబ్రాంతులకు గురి చేసింది. ఇంతలో మద్యం కిక్ బాగా తలకెక్కినట్లుంది. రహదారిపై పడి అడ్డంగా నిద్రపోయింది. వాహనాదారులు కానీ పాదచారులు కానీ ఆమెను లేపి పక్కకు కూడా జరపలేదు. ఎవరికి వారు తమదారి తాము చూసుకుని జాగ్రత్తగా ముందుకు సాగారు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. పీకల దాకా మందు కొట్టిన సదరు మహిళకు మైకం దిగే సరికి సాయంత్రమైంది. లేచి చూసుకునే సరికి రహదారిపై ఉన్న ఆమె చటుక్కున లేచి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి పోయింది. ఇంతకీ సదరు మహిళ వయస్సు ఎంతో తెలుసా 45 సంవత్సరాలు ఉంటాయని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తమిళనాడులో మద్య నిషేధం విధించాలని మహిళ సంఘాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
మదురై, కోవైలో మోడీ పర్యటన
సాక్షి, చెన్నై : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించనున్నారు. మదురై, కోయంబత్తూరు వేదికలుగా బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లలో బీజేపీ కమిటీ నిమగ్నమైంది. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, ఐజేకే అభ్యర్థుల జాబితా వెలువడింది. అయితే, రెండు స్థానాలకు మినహా తక్కిన ఆరు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో నేతలు దూసుకెళుతున్నారు. డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, ఎండీఎంకే నేత వైగోలు నిర్విరామంగా తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఆయూ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే పీఎంకే నేత రాందాసు మాత్రం అనారోగ్య కారణాలతో అడపాదడపా ప్రచారానికి వెళుతున్నారు. తమ కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపు పొందడం తథ్యమన్న ధీమా బీజేపీలో నెలకొం ది. అదే సమయంలో తమ అధినాయకులను రాష్ట్రానికి పిలిపించి ప్రచారం చేయించే ఏర్పాట్లలో కమలనాథులు మునిగారు. మోడీ రాక ఉత్తరాదిన ప్రచారంలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ బిజీబిజీగా ఉండడంతో ఈ నెల రెండో వారంలో ఆయన బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పార్టీ నాయకులు మోహన్ రాజులు, శరవణ పెరుమాల్, వానతీ శ్రీనివాసన్‌లతో కమిటీ ఏర్పా టు అయింది. ఈ కమిటీ మోడీతోపాటు సుష్మా స్వరాజ్ తదితర జాతీయ స్థాయి నాయకుల ప్రచార పర్యటనల మీద కసరత్తుల్లో మునిగింది. సోమవారం టీ నగర్‌లోని కమలాలయంలో ఈ కమిటీ సమావేశం అయింది. ప్రధానంగా మోడీ ప్రచార సభల వేదికలపై సమీక్షించారు. నాలుగు చోట్ల వేదికలను ఎంపిక చేసినా, చివరకు మదురై, కోయంబత్తూరులలో మోడీ ప్రచార సభల నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఇందు కు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను జాతీయ కమిటీకి పంపించారు. అక్కడి నుంచి ఆమో దం రాగా, మదురై, కోయంబత్తూరులలో ఏర్పాట్లు వేగవంతం చేయనున్నారు. మోడీ ఈ నెల రెండో వారంలో లేదా, మూడో వారం మొదట్లో ఈ ప్రచార సభల వేదిక నుంచి ప్రసంగించే అవకాశాలు ఉన్నట్టు కమలనాథులు పేర్కొంటున్నారు. రెండు చోట్ల ఒకే రోజు ప్రచారం ఉంటుందని, కూటమి పార్టీల నేతలందరూ ఈ వేదికపై తప్పకుండా ఉంటారని పేర్కొంటున్నారు. సుష్మాస్వరాజ్ తదితర నేతలను ఇక్కడికి పిలిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తమ అధినాయకులు ఇక్కడ ప్రచారం చేపట్టిన పక్షంలో బీజేపీ కూటమికి మరింత బలం చేరడం తథ్యమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ, ఇతర నాయకుల ప్రచార వివరాలను మరి కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని కమలనాథులు పేర్కొంటున్నారు.