తాగి...ఊగి..రోడ్డుమీదే నిద్రపోయింది | drunk woman sleeping in main road in kovai | Sakshi
Sakshi News home page

తాగి...ఊగి..రోడ్డుమీదే నిద్రపోయింది

Published Thu, Aug 6 2015 10:19 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

తాగి...ఊగి..రోడ్డుమీదే నిద్రపోయింది - Sakshi

తాగి...ఊగి..రోడ్డుమీదే నిద్రపోయింది

తిరువొత్తియూరు : తమిళనాడులో ఓ మహిళ ఫుల్ గా మద్యం సేవించి ..... రోడ్డుపైనే నిద్రపోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... కోవై నగరంలో పెరియనాయకన్ పాళయం రిజిస్ట్రేషన్ కార్యాలయం రోడ్డు అంటేనే ఎల్లప్పుడు అత్యంత జనసమర్థంగా ఉండే ప్రాంతం... పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం ... ప్రభుత్వాసుపత్రి .. అన్ని అదే రహదారిలో ఉన్నాయి. అవి కూడా కూతవేటు దూరంలోనే ఉన్నాయి. అయితే ఓ మహిళ పీకల దాక మద్యం తాగింది. అనంతరం రహదారిపై తుళ్లుతూ... తూలుతూ నడుస్తు వాహనదారులను భయబ్రాంతులకు గురి చేసింది. ఇంతలో మద్యం కిక్ బాగా తలకెక్కినట్లుంది.

రహదారిపై పడి అడ్డంగా నిద్రపోయింది.  వాహనాదారులు కానీ పాదచారులు కానీ ఆమెను లేపి పక్కకు కూడా జరపలేదు. ఎవరికి వారు తమదారి తాము చూసుకుని జాగ్రత్తగా ముందుకు సాగారు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. పీకల దాకా మందు కొట్టిన సదరు మహిళకు  మైకం దిగే సరికి సాయంత్రమైంది. లేచి చూసుకునే సరికి రహదారిపై ఉన్న ఆమె చటుక్కున లేచి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి పోయింది.

ఇంతకీ సదరు మహిళ వయస్సు ఎంతో తెలుసా 45 సంవత్సరాలు ఉంటాయని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తమిళనాడులో మద్య నిషేధం విధించాలని మహిళ సంఘాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement