main road
-
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడప: కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో వల్లూరు మండల పరిధిలోని తోల్లగంగనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్లకు చెందిన రాజుల మధుసూదన్‌రెడ్డి (28) కడపలోని రైల్వే విద్యుత్ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తుండే వాడు. ఆయన విధులు ముగించుకుని సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. మార్గంమధ్యలో తోల్లగంగనపల్లె బస్టాపు వద్ద గంగాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు లక్ష్మీనరసింహ, మధు పాఠశాలకు వెళ్లడానికి లిఫ్ట్ అడిగారు. దీంతో వారిని ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని బయలుదేరాడు. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఏ ఓబాయపల్లెకు చెందిన నిరంజన్‌రెడ్డి వస్తున్న ద్విచక్ర వాహనం, మధుసూధన్‌రెడ్డి ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. వారి వెనుకే కడప వైపు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న లారీ ద్విచక్ర వాహనాలను ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్‌రెడ్డిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కాగా ఆయనకు ఈ నెల 25వ తేదీన వివాహం జరగాల్సి వుందని సమాచారం. -
Viral Video: వర్షంలో ఆదమరచి డాన్స్ చేసిన ప్రేమజంట
భోపాల్: రద్దీ రహదారిపై ఎవరి పనులు వారు చేసుకుంటుంటే ఒక లవ్ కపుల్ మాత్రం హాయిగా జోరువానలో తడుస్తూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో దినవారి పనులు చేసుకునేవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకి, విద్యార్ధులకి ఇలా కొన్ని వర్గాల వారికి వర్షాలు పెద్ద అడ్డంకనే చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తుంది ప్రేమికులకు మాత్రమే వర్షాకాలం అనుకూలమని కవులు ఎందుకు చెప్పారోనని. భోపాల్‌లో హోరున వర్షం పడుతుండగా ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు మీద దూసుకుపోతుంటే ఓ ప్రేమ జంట మాత్రం పరిసరాలను అసలేమాత్రం పట్టించుకోకుండా తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా డాన్స్ చేస్తూ కనిపించారు. పరిసరాలు కూడా వీరి రొమాన్స్ ని పట్టించుకోకపోవడం విశేషం. వీరు డాన్స్ చేస్తుంటే వెనుక విక్కీ కౌశల్, సారా ఆలీ ఖాన్ కలిసి నటించిన "జరా హట్కే జరా బచ్కే" చిత్రంలోని తూ హై తో ముఝే పాట వినిపిస్తోంది. ఈ సన్నివేశాన్నివీడియో తీసి సొషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై కామెంట్ల రూపంలో విశేష స్పందన లభిస్తోంది. A beautiful couple enjoying this #mansoon in #Bhopal.#IamPureVegetarian #Karba #BusAccident #Beast #ModiAgainin2024 pic.twitter.com/GveBVp815C — Aisha Bhat (@aishabhat02) July 29, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో
-
బాబోయ్.. భల్లూకం
సాక్షి, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి – కంచ నపల్లి రోడ్డుపై ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్ర వారం దొడ్డిగుట్ట వద్ద రహదారిపైకి ఒక్కసారిగా ఎలుగుబంటి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని కోరుతున్నారు. -
అయ్యయ్యో...!
అప్పుడే తెల్లారుతోంది.. తుప్పల్లోంచి పిల్లాడి ఏడుపు అటువైపుగా వెళ్లిన మహిళల చెవిన పడింది. కంగారుగా వెళ్లి చూశారు. తుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డను చూసి కలవరపడ్డారు. అయ్యయ్యో.. అంటూనే చేతుల్లోకి తీసుకుని రక్తపుచారలు తుడిచారు. సపర్యలు చేశారు. ఏ తల్లి కన్న బిడ్డో అంటూ నిట్టూర్చారు. చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించి శిశువును అప్పగించారు. శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు విశాఖ–అరకు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న గౌరీపురం మహిళలు జామి గణేశమ్మ, మంగాయమ్మ, ఆడారి హారిక, మంగమ్మలు వేకువజామున 5 గంటల సమయంలో రోడ్డువైపుగా వెళ్లారు. సమీపంలోని తుప్పల్లోంచి పిల్లాడికి సపర్యలు చేస్తున్న గౌరీపురం మహిళలు పిల్లాడి ఏడుపును గమనించారు. వెంటనే వెళ్లి చూసేసరికి రక్తపు చారలతో కొద్ది గంటలకు ముందు జన్మించిన మగపిల్లాడిని గుర్తించి అక్కున చేర్చుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి బొడ్డు కోసి..స్నానాదులు చేయిం చారు. బట్టలు వేసి, బొట్టు పెట్టి.. పాలుపెట్టి సపర్యలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ బిడ్డను చూసేందుకు తరలివచ్చారు. ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త కాండ్రేగుల చంద్రకళ, ఇన్చార్జి ఏఎస్ఓ కె.వెంకటరాములు అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలక్ష్మి, సీడీపీఓ శాంతకుమారికి ఫోన్లో తెలియజేశారు. అనంతరం పీడీ రాబర్ట్స్ ఆదేశాల మేరకు 1098కు సమాచారం చేరవేశారు. దీంతో చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ కోన బంగారుబాబు, సభ్యులు వి.మధుసూదనరావు, సీహెచ్ చంద్రశేఖర్, జీవీఎల్ లక్ష్మిలు గౌరీపురం చేరుకున్నారు. పిల్లాడు దొరికిన తీరును తెలుసుకున్నారు. వైద్య సేవల కోసం శిశువును విజయనగరం ఘోషాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం బిడ్డను జిల్లాలోని శుశుగృహకు అప్పగిస్తామని చైల్‌లైన్ కో ఆర్డినేటర్ తెలిపారు. శిశువు ఆరోగ్యంపై ఆరా శిశువు ఆరోగ్యంపై బీజేపీ జిల్లా నేత ఐ.రఘురాజు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఐ.రామరాజు (బుల్లిబాబు), కిల్తంపాలెం మాజీ సర్పంచ్ సుంకరి ఈశ్వరరావు తదితరులు చైల్డ్‌లైన్ సభ్యులతో మాట్లాడారు. అయితే, తుప్పల్లో దొరికిన మగ పిల్లాడిని పెంచుకుంటామంటూ పలు వురు పిల్లలు లేని దంపతులు ముందుకు వచ్చినా చట్టప్రకారం అప్పగిస్తామని చైల్డ్‌లైన్ సభ్యులు స్పష్టం చేశారు. ఏ తల్లికన్న బిడ్డో ఇలా తుప్పలపాలయ్యాడంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. -
నేరాలకు అడ్డా
రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్డులో పెరుగుతున్న క్రైం చెలరేగిపోతున్న జేబుదొంగలు, దోపిడీ ముఠాలు వరుస నేరాలతో బెంబేలెత్తుతున్న వ్యాపారులు సాక్షి, రాజమహేంద్రవరం : ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులోని ఓ ప్రాంతం దొంగల ముఠాల కు, జేబుదొంగలకు అడ్డాగా మారింది. ఇక్కడి నల్లమం దు సందు ఎంట్రన్, రోజ్మిల్క్ సెంటర్లలో మాటు వేసిన దొంగలు.. అదును చిక్కినప్పుడు ప్రజలను, వ్యా పారులను దోచుకుంటున్నారు. వ్యాపారులు, కొనుగోలుదార్లు, పోలీసులు తేరుకొనేలోపే దొంగలు పని పూర్తి చేసుకొని పరారవుతున్నారు. మెయిన్ రోడ్డులోని నల్లమందు సందు పరిసరాల్లో అధిక సంఖ్యలో బంగా రు దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని గంటాల మ్మ గుడి వీధిలోని ఓ బంగారు నగలకార్ఖానాలో గత గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ దోపిడీ ముఠా రెచ్చిపోయింది. బంగారు నగలు తయారు చేసే ముసుగులోనే బెంగాల్‌కు చెందిన ఆ ముఠా దోపిడీకి పాల్పడడం, అందుకోసం తుపాకులు, కత్తులు, ఇతర మారణాయుధాలు ఉపయోగించడం కలకలం రేపింది. దొంగలను పట్టుకునేందుకు ఆయా దుకాణాల్లో పని చేసే యువకులు యత్నించడంతో దోపిడీ ముఠాకు చెందిన ఓ వ్యక్తికి కత్తి గాయం కూడా అయ్యింది. లేదంటే పట్టుకునేందుకు యత్నించిన యువకుల ప్రాణాలకే ప్రమాదమొచ్చేది. ఈ ఘనటతో మరోసారి మెయిన్ రోడ్డులోని బంగారు, ఇతర వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. వందలాదిగా దుకాణాలు, కార్ఖానాలు మెయిన్ రోడ్డులోని ఇసుకవీధి, నల్లమందు సందు, గుండువారి వీధి, చందా సత్రం వీధి, గంటాలమ్మ గుడి వీధి ప్రాంతాల్లో దాదాపు 200 బంగారు దుకాణాలున్నాయి. ఇవి కాకుండా బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలు దాదాపు 500 ఉన్నాయి. వీటిలో బంగారు నగలు తయారు చేసేవారు (గోల్డ్‌స్మిత్‌లు) దాదాపు 10 వేల మంది ఉన్నారు. ఇందులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోల్డ్ స్మిత్‌లు దాదాపు 3 వేల మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గోల్డ్‌స్మిత్‌ల మాటున ఆ రాష్ట్రానికి చెందిన కొందరు నేరగాళ్లు ఇక్కడ కొద్ది రోజులు నమ్మకంగా పని చేస్తున్నారు. వారిని నమ్మి స్థానిక బంగారు దుకాణ యజమానులు ముడి బంగారం ఇచ్చి నగలు చేయించుకుంటున్నారు. తరుగు, కూలి చెల్లిస్తున్నారు. పెద్ద మొత్తంలో బంగారం వచ్చినప్పుడు కార్ఖానాలో పని చేస్తున్న పశ్చిమ బెంగాల్ నేరగాళ్లు ఆ బంగారంతో పరారవుతున్నారు. ఫలితంగా ఉపాధి కోసం వచ్చి ఇక్కడ నిజాయితీగా పని చేసుకుంటున్న ఆ రాష్ట్ర గోల్డ్‌స్మిత్‌లు ఇబ్బందిపడుతున్నారు. దోపిడీ దొంగలకు ఇక్కడ పెద్ద వ్యాపారాలు చేస్తున్న కొందరు పశ్చిమ బెంగాల్ వ్యాపారులు, స్థానిక వ్యాపారులు కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలోనూ.. ఆరు నెలల కిందట దేవ్ అనే పశ్చిమ బెంగాల్ గోల్డ్ స్మిత్ ఏడు కేజీల బంగారంతో పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కానీ స్థానికంగా పెద్ద వ్యాపారిగా పేరున్న ఓ పశ్చిమ బెంగాల్ వ్యాపారి సోదరుడు తాము రాజీ చేస్తామని చెప్పి అతడిని విడిపించుకుపోయాడు. వ్యాపారులు కూడా తమ సొమ్ము వస్తే చాలనుకుని రాజీకి సిద్ధమయ్యారు. ఏడు కేజీల బంగారంలో 5 శాతం మాత్రమే రికవరీ అయ్యింది. ఆ కేసు ఇప్పటివరకూ తేలలేదు. గతంలో కూడా ఇలాగే అనేక ఘటనలు జరిగాయి. కొంతమంది స్థానిక గోల్డ్‌స్మిత్‌లు కూడా ఇలాగే కొద్దిపాటి బంగారంతో పరారైన ఘటనలున్నాయని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. అయితే వారిలో కొంతమంది తిరిగి వచ్చి ఎవరి బంగారం వారికి ఇచ్చి యథావిధిగా పని చేసుకుంటున్నారు. మరికొంత మంది పరారీలోనే ఉన్నారు. అర్ధాంతరంగా ఆగిన సీసీ కెమెరాల ఏర్పాటు నల్లమందు సందు ప్రారంభం, రోజ్మిల్క్ సెంటర్, బంగారు నగల దుకాణాల కూడలిలో ఇతర నేరాలు కూడా అధికంగా ఉన్నాయి. మెయిన్ రోడ్డు ఒకటి, రెండు, మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తోంది. ఈ మూడు స్టేషన్లలో నెలకు దాదాపు 15 జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతున్నాయి. నేరాలను అదుపు చేసేందుకు, నేరగాళ్లను గుర్తించేందుకు ఈ కూడలిలో పోలీస్ కంట్రోల్ రూమ్, నాలుగువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2015లో అప్పటి సెంట్రల్ డీఎస్పీ నామాల బాబ్జీ భావించారు. ఈ మేరకు బంగారం వ్యాపారులతో చర్చించారు. వారు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ భవనం శ్లాబ్ దశలో ఆగిపోయింది. ఈలోగా బాబ్జీ బదిలీపై వెళ్లిపోయారు. ఆ చిన్నపాటి భవనం ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని భావించిన నగరపాలక సంస్థ దానిని తొలగించింది. దీంతో ఆ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. -
అంతా.. మా ఇష్టం !
అనంతపురం సెంట్రల్ : నిబంధనలు సామాన్యులకే.. మాకు కాదంటున్నారు.. ట్రాఫిక్ పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారిపై కొరడా ఝుళిపించే ట్రాఫిక్ పోలీసులే నిబంధనలు తుంగలో తొక్కారు. నగర నడిబొడ్డున ఉన్న టవర్‌క్లాక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.40 సమయంలో దాదాపు అరగంట పాటు నడిరోడ్డుపై పోలీసుల వాహనాన్ని వదిలివెళ్లారు. సిబ్బంది ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే అక్కడి కేఫ్‌లో టీ తాగుతున్నారని స్థానికులు తెలిపారు. పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ పోలీసుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. వాహనం మరమ్మతుకు వచ్చిందా అని ట్రాఫిక్ డీఎస్పీ నర్సింగప్పను వివరణ కోరగా అలాంటిదేం లేదని, దీనిపై విచారణ జరుపుతామన్నారు. -
అభివృద్ధా.. కనపడదే?
మార్క్సనగర్, సాయిమాణిక్నగర్ సిద్ధార్థనగర్, సంజీవ్‌నగర్ తదితర కాలనీలలో ఎటుచూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. దారిగుండా ముక్కుమూసుకొని దాటడమే కానీ ఎవరూ ఈ మురికిని పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల సమయంలో అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, వార్డు కౌన్సిలర్లు సైతం హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక కాలనీ వైపే చూడడం మానేశారు. - కాలనీలలో అన్నీ సమస్యలే.. - కనీస వసతులు ఉండవు - అధికారులకు అసలే పట్టదు.. - పాలకులు పట్టించుకోరు.. సంగారెడ్డి మున్సిపాలిటీ: సాయిమాణిక్ నగర్.. ఈ కాలనీ ఎక్కడో మూలన లేదు. ప్రధాన రహదారికి కేవలం 500 మీటర్ల దూరంలోనే కాలనీ ఉంది. ఈ కాలనీలో బ్యాంక్, పరిశ్రమలకు చెందిన ఉన్నతోద్యోగులు నివసిస్తున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ అభివృద్ధి జాడే లేదు. కౌన్సిలర్‌గా గెలుపొంది ఏడాది పూర్తయినా.. ఏ ఒక్కరోజూ కాలనీ పరిస్థితిని కౌన్సిలర్ పరిశీలించిన పాపానపోలేదు. సమస్యల పట్ల పలు మార్లు అధికారులకు.. కౌన్సిలర్లకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. మార్స్స్నగర్, సిద్దార్థనగర్, సంజీవ్నగర్లలో సైతం సమస్యలు తిష్టవేసినా.. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర బలహీనవర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. ఈ కాలనీలో కనీసం మురికికాల్వలు లేకపోయాయి. ఇక్కడున్నవారంతా ఓపెన్డ్రైనేజ్ పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో వర్షకాలం వచ్చే వరదనీటితో పాటు డైనేజీలో నుంచి ముక్కుపుటాలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. కానీ ఇంతవరకు మురికికాల్వలు నిర్మించలేకపోయారు. సాయిమాణిక్ నగర్లో సైతం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేనందున గోకుల్ వెంకటేశ్వర ఆస్పత్రి నుంచి వచ్చే మురికి నీరు కాలనీల మధ్య వచ్చి నిల్వ ఉంటుంది. దీంతో పందులు సంచరిస్తున్నాయి. దీనికి తోడు కచ్చాకాల్వలు కూడా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే మురికి గుంటలు దర్శనమిస్తున్నాయి. పట్టణంలో గతేడాది డెంగీవ్యాధి వచ్చిన వారిలో అధికంగా ఈ కాలనీ వారే ఉండటం గమనార్హం.. అధికారులు అన్ని కాలనీలను అభివృద్ధి చేశాం అని చెబుతున్నా.. ఈ కాలనీలో మాత్రం ఒక్క అడుగు మురికి కాల్వలు కూడా నిర్మించలేకపోయారు. ఈ కాలనీలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. నెల రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో ఈ కాలనీ చెత్తకాలనీగా తయారైంది. కాలనీలో మురికికాల్వలు, వీధిదీపాలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోయాయి. ప్రతిపాదనలు పంపాం.. మార్క్సనగర్, సాయిమాణిక్నగర్ లో.. ఇటీవల 13 ఆర్థిక సంఘం నిధులతో పాటు జనరల్ ఫండ్ నుంచి మురికికాల్వల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగింది. రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే త్వరలోనే పనులు చేపడతామన్నారు.. - గయాసొద్దీన్, మున్సిపల్ కమిషనర్ -
తాగి...ఊగి..రోడ్డుమీదే నిద్రపోయింది
తిరువొత్తియూరు : తమిళనాడులో ఓ మహిళ ఫుల్ గా మద్యం సేవించి ..... రోడ్డుపైనే నిద్రపోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... కోవై నగరంలో పెరియనాయకన్ పాళయం రిజిస్ట్రేషన్ కార్యాలయం రోడ్డు అంటేనే ఎల్లప్పుడు అత్యంత జనసమర్థంగా ఉండే ప్రాంతం... పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం ... ప్రభుత్వాసుపత్రి .. అన్ని అదే రహదారిలో ఉన్నాయి. అవి కూడా కూతవేటు దూరంలోనే ఉన్నాయి. అయితే ఓ మహిళ పీకల దాక మద్యం తాగింది. అనంతరం రహదారిపై తుళ్లుతూ... తూలుతూ నడుస్తు వాహనదారులను భయబ్రాంతులకు గురి చేసింది. ఇంతలో మద్యం కిక్ బాగా తలకెక్కినట్లుంది. రహదారిపై పడి అడ్డంగా నిద్రపోయింది. వాహనాదారులు కానీ పాదచారులు కానీ ఆమెను లేపి పక్కకు కూడా జరపలేదు. ఎవరికి వారు తమదారి తాము చూసుకుని జాగ్రత్తగా ముందుకు సాగారు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. పీకల దాకా మందు కొట్టిన సదరు మహిళకు మైకం దిగే సరికి సాయంత్రమైంది. లేచి చూసుకునే సరికి రహదారిపై ఉన్న ఆమె చటుక్కున లేచి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి పోయింది. ఇంతకీ సదరు మహిళ వయస్సు ఎంతో తెలుసా 45 సంవత్సరాలు ఉంటాయని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తమిళనాడులో మద్య నిషేధం విధించాలని మహిళ సంఘాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
నెత్తురోడిన రహదారి
కొయ్యలగూడెం : పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం సమీపంలో స్టేట్ హైవేపై ఆదివారం వేకువజామున చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బయ్యనగూడెం గ్రామానికి సమీపంలో ఇటుకల బట్టీ వద్ద కలప లోడుతో ఆగివున్న లారీని జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరువూరు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన మట్టా నాగరత్నం (75), చిట్యాల గ్రామానికి చెందిన బజ్జూరి లక్ష్మీదేవి (65), ఖమ్మం జిల్లా కళ్లూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వనిగళ్ల కొండయ్య (50) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మట్టా నాగరత్నం కుమార్తె వెంకట నర్సమ్మ (50) ప్రాణాలు విడిచింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరువూరు మండలం అంజనాపురానికి చెందిన మట్టా రాము, అతని భార్య కల్యాణి తమ కుమార్తెకు నామకరణం, అన్నప్రాసన చేయించేందుకు ఈనెల 13న బాడుగకు కుదుర్చుకున్న వ్యాన్‌లో అన్నవరం బయలుదేరారు. తమవెంట పరిసర గ్రామాలకు చెందిన 16 మంది బంధుగణ ంతో తరలివెళ్లారు. తమ కుమార్తెకు అన్నవరంలో క్షితాక్షి అను నామకరణం, అన్నప్రాసన చేయించారు. అక్కడి నుంచి సింహాచలం, మధ్యలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని శనివారం అర్ధరాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఆదివారం వేకువజామున కొయ్యలగూడెం చేరుకోగా, అక్కడ అందరూ టీ తాగారు. అనంతరం ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. 10 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు వివరాలివీ... ఈ ప్రమాదంలో గాయపడినవారిలో మట్టా కల్యాణి, ఆమె భర్త రాంబాబు (రాము), కల్యాణి తల్లి వెలిగల సావిత్రి, తండ్రి కొండయ్య, అవనిగడ్డ సావిత్రి, బొజ్జారి ధనలక్ష్మి, బొజ్జారి వేణు, మరీదు వీరరాఘవులు, మట్టా లక్ష్మణ్, బొజ్జారి దిలీప్‌సాయి, మట్టా స్రవంతి, బొజ్జారి వేణుగోపాల్, మట్టా స్వాతి, మట్టా తపస్వి, బొజ్జారి పూజిత, పరిగెల వీరభద్రరావు ఉన్నారు. వీరంతా అంజనాపురం, చిట్యాల గ్రామాలకు చెందినవారు. క్షతగాత్రుల రోదనలతో ప్రమాద ప్రాంతం దద్దరిల్లింది. వారి ఆర్తనాదాలతో నిద్ర లేచిన స్థానికులు భయకంపితులయ్యారు. కొందరు ఘటనా స్థలానికి వెళ్లి వ్యాన్‌లోని వారిని బయటకు లాగారు. సీఐ కె.బాలరాజు, ఎస్సై ఎస్ఆర్ఆర్ గంగాధర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఎంత ప్రయత్నించినప్పటికీ లారీ, వ్యాన్ వేరుకాకపోవడంతో చేసేది లేక లారీని సుమారు అర కిలోమీటరు మేర వ్యాన్ సహా నడుపుకొంటూ వెళ్లారు. అనంతరం ట్రాక్టర్ సాయంతో వ్యాన్‌ను లాగారు. అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు లాగి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ పరామర్శించారు. అత్యవసర వైద్యసేవలు అందించేవిధంగా వైద్యాధికారులతో చర్చించారు. క్షతగాత్రులలో కొందరిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు, ఖమ్మం ఆసుపత్రులకు తరలించారు. అలుముకున్న విషాదం తిరువూరు : అన్నప్రాశన కార్యక్రమం కోసం పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తూ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని చిట్టేల, ఆంజనేయపురం గ్రామాల్లో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా కల్లూరు, తల్లాడ, తాళ్లూరు, తిరువూరు మండలం చిట్టేల, ఆంజనేయపురం గ్రామాల నుంచి వచ్చిన బంధువుల సమక్షంలో అన్నవరం వెళ్లిన వీరంతా తిరిగి వస్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక స్తోమత అంతంతే... కవలలైన మట్టా రాంబాబు, లక్ష్మణరావులు మైలవరంలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తూ తిరువూరులో కూడా దుకాణం ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. రాంబాబు కుమార్తె అన్నప్రాశన కార్యక్రమం అయిన తర్వాత తిరువూరులో వస్త్ర వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించి బంధువులను, కుటుంబసభ్యులను తమతోపాటు అన్నవరం తీసుకెళ్లారు. మృతులలో బజ్జూరి లక్ష్మీదేవి వృద్ధాప్యంలో కూడా చిట్టేలలో కూలి పనులు చేసి జీవిస్తున్నారు. రోడ్డుప్రమాదానికి గురైన కుటుంబాల ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే. మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు రోడ్డుప్రమాదంలో చనిపోయిన బజ్జూరి లక్ష్మీదేవి, మట్టా నాగరత్నం, కొండలు, వెంకట నర్సమ్మ మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. తిరువూరు శాసనసభ్యుడు కే రక్షణనిధి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. -
ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
లారీ, ఆటో ఢీకొని ఆరుగురి మృతి కడెం: ఆదిలాబాద్ జిల్లా కడెం మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని లంబాడితండా వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ఆటోను లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన బర్ల లచ్చవ్వ, ఆమె అక్క కూతుళ్లు గంటి శైలజ (22), ఏనుగుల గంగామణి (17)తో పాటు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం జిల్లెడుకుంటకు చెందిన ఆత్రం బాపూరావు(52), టేకం సందూర్బాయి(41), టేకం గిరిజాబాయి(46), టేకం కమలాబాయి(63)లు ఆటోలో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కడెం దాటి లంబాడితండా క్రాసింగ్ వద్దకు రాగా, ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. దీంతో శైలజ, గంగామణి, ఆత్రం బాపూరావు, టేకం సందూర్బాయిలు అక్కడికక్కడే చనిపోయారు. టేకం గిరిజాబాయి, టేకం కమలాబాయి, బర్ల లచ్చవ్వకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో గిరిజాబాయి, కమలాబాయి చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరు ప్రయాణికులు మడావి బాలు, పెద్ది రాజు, డ్రైవర్ శారూఖ్ చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయ్యింది. -
విమానమొచ్చింది.. గేటేయండి..!
మన వద్ద రైలు రాగానే రెండు వైపులా వాహనాలు రాకుండా గేట్లు వేసేస్తారు. ఈ రైల్వే గేట్లు మనకు కామనే. ఇదే సీన్ విమానానికి ఎదురైతే.. విమానమొస్తుందంటూ వాహనాలు రాకుండా రెండు వైపులా గేట్లు వేస్తే ఎలాగుంటుంది. ఇలాంటి చిత్రమైన సన్నివేశం చూడాలంటే జిబ్రాల్టర్కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎయిర్‌పోర్టు రన్‌వే.. నాలుగు లేన్ల ప్రధాన రహదారికి మధ్యలో ఉంటుంది. దీంతో విమానం వచ్చినప్పుడు లేదా వెళ్లినప్పుడల్లా రెండు వైపులా గేట్లు వేసేసి.. వాహనాలను నిలిపేస్తారు. విమానం వెళ్లగానే.. మళ్లీ వాహనాలు యధావిధిగా వెళ్లిపోతాయి. ఈ ఎయిర్‌పోర్టుకు స్థలం తక్కువగా ఉండటం.. సమతలంగా ఉన్న భూమి లేకపోవడంతో చివరికి ఇలా రోడ్డు మధ్యలో రన్‌వేను నిర్మించాల్సి వచ్చింది. -
సైకో వీరంగం...!
పార్వతీపురం : పార్వతీపురం పట్టణంలో ఓ సైకో బుధవారం వీరంగం సృష్టించాడు. ముఖమంతా గాయాలతో, కన్నులొట్టపోయి, తలపై తీవ్రగాయాలతో నెత్తురోడుతూ పట్టణంలోని బెలగాం మొదలుకుని మెయిన్ రోడ్డులోని పాత బస్టాండు, రాయగడ రోడ్డులో కలియదిరుగుతూ ప్రజల్ని భయకంపితుల్ని చేశాడు. దీంతో పాటు చినదేవర వీధి, దండంగి వీధి, భారత భవనం వీధి, తూర్పు వీధి తదితర వీధుల్లో సుడిగాలిలా తిరుగు తూ కనిపించిన మహిళలపై దాడికి తెగబడ్డాడు. దీంతో నెత్తురోడుతున్న సైకోను చూసిన మగవాళ్లు సైతం భయభ్రాంతులకు గురై పరుగులంకించారు. దీంతో చొక్కా విప్పి, ఆచొక్కాను చేత చుట్టూ తిప్పుతూ...వీధుల్లోని ఇళ్ల గేట్లు తీసుకుంటూ దూరేందుకు యత్నించగా, అంతా భయంతో తలుపులు వేసుకున్నారు. దీంతోపాటు మెయిన్ రోడ్డులోని షాపుల్లోకి దూరేందుకు యత్నించగా షాపులొది లేసి బయటకు పరుగులంకించారు. సైకో వీరంగాన్ని అడ్డుకునేందుకు పలువురు యువకులు ప్రయత్నించినా వారిపై దాడికి తెగబడడంతో వారు పట్టణ ఎస్సై వి.అశోక్ కుమార్‌కు సమాచారమందించారు. అప్పటికే బాగా అలిసిపోయిన సైకో మెయిన్ రోడ్డులో ఓ షాపు ముందు సేద తీరుతుండగా ఎస్సై తన సిబ్బంది సునీల్, లక్ష్మీనారాయణతో వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసిన సైకో ఒడియాతోపాటు అర్థం కాని గిరిజన భాషలో మాట్లాడడంతో, పోలీసులు తాగు నీరు, తిండి పెట్టి చిరునామా తెలుసుకుని సాయంత్రం టౌన్ రైల్వే స్టేషన్లో బొకారో రెలైక్కించారు. దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
హోంగార్డు వీరంగం
పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : ఓ హోంగార్డు క్రమ శిక్షణ తప్పాడు. వీరంగం సృష్టించాడు. చివరకు భక్తులు తిరగబడటంతో తోక ముడిచాడు. ఈ సంఘటన పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నందిమండలం గ్రామ సమీపంలోని కొండ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బండలాగుడు పోటీలు కూడా నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చిన ఉలవలపల్లెకు చెందిన విశ్వనాథ్‌రెడ్డి అనే భక్తుడు అల్లరి చేస్తుండగా అతన్ని మందలించాల్సిన హోంగార్డు శేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దురుసుగా మాట్లాడాడు. అంతటితో ఆగక ‘ఖాకీ అంటే ఏమనుకుంటున్నావ్.. నా తడాఖా చూపిస్తా.. అనే లెవల్లో రెచ్చిపోయాడు.దీంతో భయపడిన విశ్వనాథ్‌రెడ్డి తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. హోంగార్డు కూడా వెంబడించాడు. అయితే అతను దొరకలేదన్న అక్కసుతో లాఠీని విసిరాడు. అది కాళ్లకు తగులుకొని విశ్వనాథరెడ్డి కిందపడిపోయాడు. సంఘటనలో అతని కాలుకు గాయమైంది. ఇదంతా గమనించిన భక్తుల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. హోంగార్డుపై తిరగబడ్డారు. రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బందోబస్తులో ఉన్న పోలీసులు హోంగార్డును వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి, విశ్వనాథరెడ్డిని కడప రిమ్స్‌కు తరలించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో హోంగార్డు చర్యలను నిరసిస్తూ బాధితుడు విశ్వనాథరెడ్డి బంధువులు కడప-పులివెందుల ప్రధాన ర హదారిపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. కొందరు గ్రామస్తులు, పోలీసులు కల్పించుకుని వారికి సర్దిచెప్పారు. దీంతో వారు రాస్తారోకోను విరమించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని అదుపులోకి తెచ్చారు.