
సాక్షి, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి – కంచ నపల్లి రోడ్డుపై ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్ర వారం దొడ్డిగుట్ట వద్ద రహదారిపైకి ఒక్కసారిగా ఎలుగుబంటి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని, పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాలని కోరుతున్నారు.