రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’ | Political Cold War Between Kadiyam Srihari And Rajaiah | Sakshi
Sakshi News home page

రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’

Published Mon, Nov 18 2024 11:08 AM | Last Updated on Mon, Nov 18 2024 12:53 PM

Political Cold War Between Kadiyam Srihari And Rajaiah

సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్‌ నేత కడియం శ్రీహరి, బీఆర్‌ఎస్‌ నేత రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీహరి వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తూ ప్రతి సవాల్‌ విసిరారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలి అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.

సీనియర్‌ నేతలు కడియం, రాజయ్య మధ్య రాజకీయం మరోసారి పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో రాజయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కడియం సవాలును స్వీకరిస్తున్నాను. కడియం శ్రీహరి స్థానికేతరుడు. దళిత వ్యతిరేకి. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నేను నిద్రపోను. నియోజకవర్గంలో నువ్వో నేనో.. ఎవరో ఒక్కరే మిగలాలి.

కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడ్ని అడ్డం పెట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా?. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు నిజంగా సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీ  చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు?. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. శ్రీహరికి నాకు పోటీనే లేదు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కడియం శ్రీహరి ప్రజానాయకుడు కాదు.. రాజకీయ నాయకుడు మాత్రమే’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement