Kadiyam Srihari
-
పాత రోజులు మర్చిపో.. కడియంకు రాజయ్య వార్నింగ్
సాక్షి, జనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంత చూసే వరకు నిద్రపోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం పప్పులు కాంగ్రెస్‌లో ఉడకడం లేదు.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా స్టేషన్ ఘనపూర్‌లో రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ..‘నా నోటికాడి బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి. ఆయన అంత చూసే వరకు నిద్రపోను. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం లేదు. ఉన్నది అవకాశవాదం మాత్రమే ఉంది. పార్టీ మారిన పది మంది కుక్కిన పేనులా ఉంటే.. కడియం మాత్రం కుమ్మరి పురుగుల తిరుగుతున్నాడు. కడియం పప్పులు కాంగ్రెస్ పార్టీలో ఉడకవు.పాత రోజులు మర్చిపో.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి సైతం వసూళ్లు కొనసాగిస్తున్నారు. క్యాబినెట్ మొత్తం తోడుదొంగలే ఉన్నారు. తెలంగాణను దోచుకుంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సీటు విషయంలో వీరి మధ్య గట్టి పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌పై పోటీ చేసిన కడియం విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కడియం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేర్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య.. కడియంను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. -
ఎమ్మెల్యేల అనర్హతపై ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. అనంతరం, స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్ లేదని ధర్మాసనం తెలిపింది. పదో షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. ఇక హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లినట్టు అయ్యింది. పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయం తొందరగా తీసుకోవాలని బీఆర్ఎస్ పిటిషన్లు వేసింది. ఒకవేళ అనర్హత విధిస్తే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ఆశించింది. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రస్తావించారు. కానీ, అనూహ్యంగా హైకోర్టు.. తుది నిర్ణయాన్ని(పరిమిత సమయం లేకుండా) స్పీకర్‌కే వదిలేయడంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉండటంతో సెప్టెంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్నది.ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంధాల రవిశంకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున జె. ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈ నెల 12న వాదనలు ముగియడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖ లు వేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదుకు ప్రయతి్నంచినా.. స్పీకర్ సమ యం ఇవ్వడం లేదంటూ మహేశ్వర్‌రెడ్డి మరో పిటి షన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఉ త్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
కడియం శ్రీహరి VS రాజయ్య సవాళ్ల పర్వం
-
రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’
సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీహరి వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.సీనియర్ నేతలు కడియం, రాజయ్య మధ్య రాజకీయం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో రాజయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కడియం సవాలును స్వీకరిస్తున్నాను. కడియం శ్రీహరి స్థానికేతరుడు. దళిత వ్యతిరేకి. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నేను నిద్రపోను. నియోజకవర్గంలో నువ్వో నేనో.. ఎవరో ఒక్కరే మిగలాలి.కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడ్ని అడ్డం పెట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా?. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు నిజంగా సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీ చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు?. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. శ్రీహరికి నాకు పోటీనే లేదు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కడియం శ్రీహరి ప్రజానాయకుడు కాదు.. రాజకీయ నాయకుడు మాత్రమే’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
‘సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా’
జనగామ జిల్లా: దేవునూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలపై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ధ్వజమెత్తారు కడియం శ్రీహరి.‘ దమ్ముంటే రాజయ్య నా సవాల్‌ను స్వీకరించాలి. దళితబంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తా. సవాల్లో ఓడితే.. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ. మరోసారి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబం. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఫైర్
సాక్షి,వరంగల్ జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. శనివారం(అక్టోబర్ 26) స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ ఫిరాయించిన వారిని కేటీఆర్ రాజకీయ వ్యభిచారి అనడం సిగ్గుచేటు. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిన తర్వాత ఎందరో పార్టీ మారారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటాం.కేటీఆర్ అహంకార, బలుపు వ్యాఖ్యలు సహించేది లేదు. 2014 ముందు నీ ఆస్తులు ఎంత,ఇప్పుడు ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలి. గురివింద గింజ కింద నలుపు ఎరుగది అన్నట్లు కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం. 2014లో పార్టీ మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వలేదా. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదా. పార్టీ ఫిరాయింపులకు తెర లేపిందే బీఆర్ఎస్. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’అని కడియం హెచ్చరించారు.ఇదీ చదవండి: కేసులకు భయపడం ఏం చేస్తారో చేస్కోండి: కేటీఆర్ -
బీఆర్ఎస్ కుట్రలో భాగమే వరంగల్ ఆరు ముక్కలు: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అలాగే, వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. జిల్లాను ముక్కలు చేయవద్దు అన్నందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వమే కాలరాసింది. అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ మారుపేరు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు. అందులో భాగంగానే జిల్లాను ఆరు ముక్కలు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకే రెండో సారి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు.కేసీఆర్ కుటుంబ చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. బీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పట్లో తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు. కోర్టులు, ప్రజాస్వామ్యంపై మాకు గౌరవం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత -
కడియం శ్రీహరికి బుద్ధి చెప్తాం: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రానున్న ఉప ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం(సెప్టెంబర్2) కేటీఆర్‌తో హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గం పార్టీలో మరింత ఉత్సాహం నింపేలా సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవలే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లో ఈ విషయంలో చర్యలు మొదలు పెట్టాలని విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటట్రావు, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఇదీ చదవండి.. రెండు నాలుకల కాంగ్రెస్.. ఇది ముమ్మాటికి మోసమే: కేటీఆర్ -
కడియం.. దమ్ముంటే రాజీనామా చేయ్: రాజయ్య సవాల్
సాక్షి, జనగామ: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొంద రాజయ్య. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే, హింసించే పాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ మారిన నేతలకు దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు.కాగా, స్టేషన్ ఘనపూర్‌లో శనివారం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూండాలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నాడు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంభించింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. దాడి చేసిన గుండాలను అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి అని కూడా చూడకుండా హరీష్ రావును తీసుకెళ్లడం దారుణం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన శాంతియుతంగా జరిగింది.కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు.. ప్రజలను హింసించే పాలన. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకువచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా చేర్చారు. పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో, కోడి గుడ్లతో కొట్టండని రేవంత్ రెడ్డే చెప్పారు. నాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచాను.నైతిక విలువలు, అభివృద్ధి అంటున్న కడియం శ్రీహరి ముందు రాజీనామా చేయాలి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. హైకోర్టు బెంచ్, సుప్రీం కోర్టుకు వెళ్తా అనడం సిగ్గుచేటు. దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. జనరల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తానని అనేక సార్లు చెప్పిన కడియం.. దీనిపై ఇప్పటి వరకు అతీగతీ లేదు. అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం.. స్టేషన్ ఘనపూర్‌కు చేసింది గుండు సున్నా. బీఆర్ఎస్ తెచ్చిన రైతుబంధును రైతుభరోసాగా మార్చారు. రైతుభరోసా లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: డీసీపీ ఫిర్యాదు..కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు -
కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
-
కేటీఆర్.. 2014కు ముందకు మీ ఆస్తులెంత?: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: జనగామ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇదే సమయంలో గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు.కాగా, కడియం శ్రీహరి గురువారం స్టేషన్ ఘనపూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకత్వం మీద నమ్మకం లేకనే రాజీకీయ వలసలు జరుగుతున్నాయి. రాజకీయ వలసలు మీరు చేస్తే ఒకటి.. వేరే వాళ్లు చేస్తే మరొకటా?. గత 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం అవినీతి పెరిగింది. 2014కు ముందు వారి ఆస్తులు ఎంత.. 2024 తర్వాత ఎంతో ప్రజలకు చెప్పాలి.బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే సమావేశాల్లో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయబోతున్నాం. యువతను రెచ్చగొడుతున్న బీజేపీని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏడాదికి లక్ష ఉద్యోగాలు అన్న బీజేపీ ఎక్కడ భర్తీ చేశారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఆలోచించుకోవాలి. కుటుంబానికే పరితమై అవినీతి, అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది.రాజకీయ పార్టీలను విలీనం చేసుకుని, రాజకీయ విలువలు లేకుండా చేసి భ్రష్టు పట్టించిన చరిత్ర బీఆర్ఎస్ది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ కుమార్ ఆస్తులు 2014కు ముందు.. ఇప్పటికీ.. ఎన్నో ప్రజల ముందు చెప్పండి. ముందు బీఆర్ఎస్.. పార్టీ కార్యాచరణపై దృష్టి పెట్టండి. ఇంటిని చక్కపెట్టుకునే ప్రయత్నం చేయండి. నాయకత్వం మీద నమ్మకం లేకనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికైనా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టండి.. లేకపోతే బీఆర్ఎస్ కనుమరుగవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నియోజకవర్గ అభివృద్ధిపైన సీఎం రేవంత్‌కు విన్నవించాను. వివిధ పనులకు సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని రేవంత్ రెడ్డికి అందించాను. నియోజకవర్గ కేంద్రంలో పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరాను. రెవెన్యూ డివిజన్లో డివిజనల్ కార్యాలయాలు పనిచేసే విధంగా సౌకర్యాలు లేవు. అందుకే 15 కార్యాలయాలు గుర్తించడం జరిగింది.అన్నీ ఒకే చోట పనిచేసే విధంగా ఇంటిగ్రేటెడ్ డివిజనల్ కార్యాలయాల ఏర్పాటుకు వినతి పత్రం ఇచ్చాను. సాగునీటి కోసం స్టేషన్ ఘనపూర్ నుండి నవాబుపేట రిజర్వాయర్‌కు కాలువ నిర్మాణం చేపట్టాలి. కనీసం 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేకపోతున్నాం. ఆర్ అండ్ బీలో ఆరు ప్రధాన రోడ్లను రూ.125 కోట్లతో నిర్మించాలని కోమటి రెడ్డికి వినతి పత్రం ఇచ్చాము’ అంటూ కామెంట్స్ చేశారు. -
అతని మృతికి కడియం శ్రీహరే కారణం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
హనమకొండ: జనగామ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, చిల్పూరు జెడ్పీటీసీ పాగాల సంపత్‌రెడ్డి మృతికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరే కారణమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పలు ఆరోపణలు చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ విజయోత్సవ సభలో కడియం ఒక్కొక్కరికి బూత్‌ల వారీగా నాయకులను సభలో నిలబెట్టి మీ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటూ అవమానపర్చారన్నారు. అదే క్రమంలో పాగాల సంపత్‌రెడ్డి గ్రామం రాజవరం గురించి మాట్లాడుతూ ‘నువ్వు చిల్పూరు జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్‌గా ఉన్నావు, నీ గ్రామంలోనే ఓట్లు తక్కువ వచ్చాయి’ అని అవమానకరంగా మాట్లాడాడన్నారు.సంపత్‌రెడ్డి మనోవేదనతో సాయంత్రం మృతిచెందాడని, ఆయన చావుకు ముమ్మాటికీ కడియం కారణమన్నారు. చివరకు జనగామలో నిర్వహించిన సంతాపసభలో సైతం సంపత్‌రెడ్డి గురించి కాకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయాలు మాట్లాడిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు. -
అభివృద్ధి కాంక్షతోనే.. పార్టీ మారా! : కడియం శ్రీహరి
హనమకొండ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతోనే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్‌లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి ఆయన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టించారన్నారు.ఇతర పార్టీల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా బీఆర్ఎస్లోకి చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. ముప్పై ఏళ్లుగా తనకు రాజకీయ జన్మనిచ్చి ఆదరించిన తీరుగానే తన బిడ్డ డాక్టర్ కడియం కావ్యను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.అనంతరం ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు యువతను మోసం చేశాయన్నారు. వర్ధన్నపేటలో భూములను కబ్జా చేసిన అరూరి రమేశ్‌ను నియోజకవర్గ ప్రజలు చెంప చెల్లుమనిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లోను తగిన బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు హన్మంతరావు, రాజు, రవి, రమేష్, రాజేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కడియం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
వరంగల్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని షోడాషపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హల్లో వేలేరు, ధర్మసాగర్ మండలాల విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ను గెలిపించి కడియం శ్రీహరికి కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రిగా పని చేసి ఘన్‌పూర్‌కు చేసిన పని ఒక్కటైనా చూపెట్టాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. కడియం రాజీనామా చేసి వస్తే రాజకీయంగా బొందపెట్టడానికి పార, గడ్డపార రెడీగా ఉన్నాయన్నారు.కడియం శ్రీహరి ఓ నకిలీ దళితుడైతే, ఆయన కూతురు నకిలీ దళితురాలని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కడియం కావ్య తండ్రి చాటు బిడ్డ అని, అరూరి రమేశ్ కబ్జాదారుడని విమర్శించారు.కడియం శ్రీహరి, అరూరి రమేశ్ దొందూ దొందేనని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చాడ సరిత, జెడ్పీ కో–ఆష్షన్ సభ్యురాలు జుబేదా లాల్, కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, మండల అధ్యక్షుడు నర్సింగరావు, కో–ఆష్షన్ జానీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
ఖబర్దార్ కడియం
-
కడియంను వదిలే ప్రసక్తే లేదు.. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య
సాక్షి, వరంగల్: ఓరుగల్లులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అవి పక్కదేశం పాకిస్థాన్ వైపు దూసుకెళ్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి శివమెత్తారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి పై నిప్పులు చెరిగారు. మీసం మెలేసి తొడగొట్టిన రాజయ్య కడియం శ్రీహరిని భూస్థాపితం చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి తనతో పోటీకి దిగాలని సవాల్ విసిరారు.. ఒకవైపు మాటల తూటాలు మరోవైపు తనదైన శైలిలో స్టెప్పులేసి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈల కొట్టి స్టెప్పులేసిన రాజయ్య.. కేసీఆర్ పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి, బిఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. రాజయ్యతో పాటు, అక్కడే ఉన్న నేతలు సైతం స్టెప్పులు వేశారు. బీఆర్ఎస్ పార్టీలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న తాటికొండ రాజయ్య ఇప్పుడు ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్‌గా మారారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కడియం శ్రీహరిపై రాజయ్య రంకెలేస్తున్నారు. ఈ మేరకు తొడగొట్టి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే.. నమ్మకద్రోహం చేసిన కడియం అంతుచూస్తా.. నిన్ను భూ స్థాపితం చేయడమే నా లక్ష్యం అని అన్నారు. కడియంకు నిజాయితీ ఉంటే రాజీనామా చేసి రా చూసు కుందాం అని మీసం మెలేసి సవాల్ విసిరారు. చదవండి: కేసీఆర్ కథలకు కాలం చెల్లింది: రేవంత్ కౌంటర్ ‘తెలుగు రాష్ట్రాల్లో అంతా మన ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు. దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. నాకు నేనుగా.. రాజకీయ ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్మార్గుడు కడియం నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి అభయహస్తం అంటున్నాడు.. కానీ కడియం శ్రీహరి లాంటి భస్మాసురుడు పక్కన చేరాడు జాగ్రత్త. నాకున్న పని కేవలం నున్ని తొక్కుడే. దళిత ద్రోహి.. కల్నాయక్, నమ్మకద్రోహి.. డిక్టేటర్.. గుంటనక్క.. కడియం శ్రీహరి’ అంటూ నిప్పులు చెరిగారు. రాజయ్య మాటల తూటాలు పక్క దేశం పాకిస్థాన్ వరకు వెళ్తున్నాయి. కడియం శ్రీహరిని ఇక్కడ తొక్కితే పాకిస్తాన్లో తేలాలని ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలు మన గురించి చూస్తున్నాయని, ఇద్దరం పోటిచేసి చేసి తేల్చుకుందాం రా అని సవాల్ విసిరారు. -
బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకుంది నిరూపిస్తే దేనికైనా రెడీ: కడియం
సాక్షి, జనగామ: ఎవరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. తమకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇచ్చినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. కాగా, కడియం స్టేషన్ ఘన్‌పూర్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రూ.10కోట్లు తీసుకున్నామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమని ఎలాంటి ఆధారాలు చూపించినా, నిరూపించినా మేము ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటాము. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కావ్య గెలుపు ఖాయమైంది. సీఎం రేవంత్ ఆశీర్వాదంతో నేను వరంగల్‌ను అభివృద్ధి చేస్తాను. బీజేపీ వాళ్ళు రాజ్యాంగం మీద అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. చేసిన పని చెప్పడానికి ఏమీ లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది, ఇక్కడే కడియం ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమలు చేసింది. 2017లో ఐదుగురు జడ్జిల ధర్మసానం భారతదేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదు అని తెలిపింది. పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుంది. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను. నా 30ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. నా నిజాయితే నాకు పెట్టుబడి. నేను ఏ పార్టీకి వెన్ను పోటు పొడవలేదు. కానీ నా ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను ఛాలెంజ్ చేస్తున్న నీదగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నానా చెప్పాలి. 2014, 2018లో నీ గెలుపు కోసం నేను ప్రచారం చేసాను. నువ్వు చేసిన భూకబ్జాల కారణంగా ఓడిపోయావు. ఓటమి భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మందకృష్ణ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఒక్క నాపై మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నావు. నాది మాదిగ ఉప కులం. మాదిగలకు ద్రోహం చేస్తున్నది మందకృష్ణ. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నా పార్టీకి ఓటు వేయమని ఎలా చెపుతున్నావు. దీనికి సమాధానం చెప్పాలి. నీ నాయకత్వం సరిగా లేకపోవడం వల్లనే ఎంఆర్‌పీఎస్‌లో చీలికలు వచ్చాయి అంటూ విమర్శలు చేశారు. -
కేసీఆర్‌పై విమర్శలు చేయను: కడియం శ్రీహరి
సాక్షి, హన్మకొండ: బీఆర్ఎస్ నేతలకు, బీజేపీకి కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని అవి బయటపెడితే తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కాగా, కడియం శ్రీహరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ.. సీబీఐ, ఈడీలను ప్రయోగించి నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీలో చేరితే పునీతులవుతారు.. కాంగ్రెస్‌లో చేరితే విమర్శలు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లలో గెలిస్తే వారు రాజ్యాంగాన్నే మార్చేస్తారు. రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అప్రజాస్వామిక పద్దతులను అడ్డుకోవాల్సి అవసరముంది. బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎన్నికల్లో నన్ను గెలిపించిన విధంగానే, కావ్యను కూడా గెలిపించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ను వీడటం కొంత బాధగానే ఉంది. కేసీఆర్‌పై నాకు గౌరవం ఉంది. ప్రత్యేకంగా కేసీఆర్‌పై నేను ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు. చాలా మంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపై పార్టీ నేతలు స్పందించలేదు. కానీ, నాపై మాత్రం బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, వారు మాట్లాడే పద్దతి బాగోలేదు. జిల్లా స్థాయి నేతలు కూడా నాపై అనవసర కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఎర్రబెల్లి దయాకర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. నిన్ను పాలకుర్తి ప్రజలే చీకొట్టారు. ఇలాంటి అహంకార మాటల వల్లే ఓడిపోయావు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది. బీఆర్ఎస్ ఇలాంటి దుస్థితికి రావడానికి కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలే కారణం. పల్లా వంటి వ్యక్తి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నువ్వు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించని రోజున జనగామలో నిన్ను బట్టలు ఊడదీసి నిలుచోపెడతాను. ఇదే సమయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి కిషన్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు. నిన్ను మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించారు. బుద్ధి లేకుండా అనవసర మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మీలాంటి అందరి చరిత్రలు నాకు తెలుసు. మీరు చేసిన దారుణాలు బయటపెడితే మీరు భరించలేరు, తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. -
కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
-
కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడియం శ్రీహరి, కావ్యకు దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కే. కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఫిరాయింపులు మొదలయ్యాయి. పలువురు నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో వరసగా కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరటం ప్రతిపక్ష బీఆర్ఎస్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో భారి విజయం సొంతం చేసుకున్న కాంగెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అధిక సీట్ల గెలుపే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. -
ఓడిపోయే పార్టీ నుంచి కూతురి పోటీ వద్దనుకొనే..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తున్న తన కూతురు కడియం కావ్య ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయొద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. బీఆర్ఎస్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, పార్టీలో కొనసాగడంపై నాయకులు అయోమయంలో ఉన్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది నాయకులు బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లో చేరడంతో పార్టీ బలహీనపడిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశమయ్యారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించినందునే తన కూతురు కావ్యకు పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నా, పోటీ చేసేందుకు ముందుకొచ్చినా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకుల నుంచి తనకు సహకారం అందలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నందున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని కడియం చెప్పారు. ఎవరినీ అడగకుండానే నిర్ణయం తీసుకున్నా.. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయాన్ని ఎవరినీ సంప్రదించకుండానే తీసుకున్నానని... కాంగ్రెస్ ప్రతినిధులు పార్టీలోకి రావాల్సిందిగా తనను ఆహా్వనించినట్లు కడియం తెలిపారు. బీఆర్ఎస్ ఎవరికీ అన్యాయం చేయలేదని, పార్టీ మారకముందే తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారన్నారు. తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పసునూరు దయాకర్ పార్టీ మారిన సమయంలో లేని విమర్శలు తనపై ఎందుకని ప్రశ్నించారు. అవకాశాలు అందరికీ వస్తాయని... కానీ వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామనేదే ముఖ్యమన్నారు. కాంగ్రెస్‌లో చేరతామని కొందరు నెలల తరబడి ఆ పార్టీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగినా చేర్చుకోలేదని... కానీ కాంగ్రెస్ నేతలే తన ఇంటికి వచ్చి చేరాలని అడుగుతున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాను తప్పు చేయలేదని, అవినీతి, అక్రమ సంపాదనకు పాల్పడలేదని చెప్పారు. తాను ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకోలేదని, భూకబ్జాలు చేయలేదన్నారు. తనను ప్రశ్నించే హక్కు కేవలం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకే ఉందని కడియం అన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడానికే తన తండ్రి పార్టీ మారుతున్నారని కుమార్తె కడియం కావ్య చెప్పారు. -
కడియంకు బీఆర్ఎస్ చెక్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీనియర్ నేత కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియంపై అనర్హతవేటు వేసేందుకు సిద్ధమైన్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకు శనివారం మధ్యాహ్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఒకటి అసెంబ్లీకి చేరుకుంది. అయితే.. కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ అందుబాటులో లేరని సమాచారం. దీంతో అసెంబ్లీ కార్యదర్శిని కలిసే యత్నం చేయగా.. ఆయన కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. దీంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కడియంపైన కాకుండా.. దానం నాగేందర్‌పై అనర్హత వేటు ఫిర్యాదు చేసేందుకు ఈ బృందం వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో ఇద్దరిపైన లేకుంటే ఇద్దరిలో ఒకరిపైనే బీఆర్ఎస్ ఫిర్యాదుకు సిద్ధమైందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎవరి మీద అయినా.. ఆలస్యం చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ కోరనుందని సమాచారం. ఒకవేళ అనర్హత పిటిషన్‌ను స్పీకర్ స్వీకరిస్తే గనుక.. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయా? అనే ఆసక్తి నెలకొంది. మరోపక్క శనివారం ఉదయం అనుచర గణంతో సమావేశమైన కడియం, ఆయన కూతురు కావ్యలు పార్టీ మారబోతున్నట్లు నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని, కారణాలు ఏవైనా బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. అందుకే తాము తప్పనిసరి స్థితిలో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. కావ్య తాను వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నానని.. తనను గెలిపించాలంటూ వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ కీలక నేతలు
-
కాంగ్రెస్‌లోకి కడియం.. వరంగల్ ఎంపీ అభ్యర్థిపై ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో మరో సీనియర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైంది. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతల బృందం శుక్రవారం ఉదయం కడియం ఇంటికి వెళ్లింది. ఆ బృందంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో పాటు మల్లు రవి, సంపత్ కుమార్, రోహీన్ రెడ్డి ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా కడియం నివాసంలో వీళ్లంతా సమావేశం అయ్యారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి, కావ్యలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాం.. వీళ్లు అధికారికంగా మా పార్టీలోకి చేరతారు అని ప్రకటించారు దీపాదాస్ మున్షీ. అలాగే.. ఏఐసీసీ ప్రతినిధిగా దీపాదాస్ తమను కలిశారని కడియం చెప్పారు. ఏఐసీసీ, పీసీసీ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. నేను కాంగ్రెస్ లో ఇంకా చేరలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ వీడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. అనుచరులు, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని ఏఐసీసీ ప్రతినిధికి చెప్పా అని కడియం మీడియాతో అన్నారు. కావ్య పేరు దాదాపు ఖరారు ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలోనే.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కావ్య వద్దని చెబుతూ.. కేసీఆర్‌కు లేఖ రాసింది. మరోవైపు కడియం ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరతుందనే ప్రచారం తెర మీదకు రాగానే.. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ తరఫున కడియం శ్రీహరి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ సీటును కావ్యకే కాంగ్రెస్ పార్టీ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వీళ్లు చేరిన వెంటనే.. అభ్యర్థుల జాబితా ద్వారా కావ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. రేవంత్‌తో కేకే భేటీ ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌లో చేరతానని అధికారికంగా గురువారం ప్రకటించిన సీనియర్ నేత కేకే.. ఈ ఉదయం పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరికపై అరగంట పాటు వీళ్లిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. కుదిరితే రేపు.. లేకుంటే ఏప్రిల్ 6వ తేదీన కేకే కాంగ్రెస్ గూటికి చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కారు దిగనున్న కడియం, కేకే, అల్లోల
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ.. భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు ప్రకటించారు. ఎప్పుడు చేరేది అతిత్వరలో వెల్లడిస్తానని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని కేశవరావు భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వరంగల్ లోక్‌సభ స్థానం అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రకటించాక కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య హఠాత్తుగా బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. కాగా కడియం శ్రీహరి, కావ్య కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతుండటం, చివరకు టికెట్ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళుతుండటం బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తోంది. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడం ఇప్పటికే ఖాయం కాగా.. ఇలా ఇద్దరు నేతలు దాదాపుగా ఒకే సమయంలో తమ కుమార్తెలతో సహా బీఆర్ఎస్ను వీడనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్లో చేరా ‘బీఆర్ఎస్లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరా. కానీ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు. నేను బీఆర్ఎస్లో ఉండి చేసేదేమీ లేదు ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు. నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్ పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే. కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్ విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్ఎస్లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. -
వరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎట్టకేలకు బీఆర్ఎస్ ‘బీ’ఫామ్ దక్కింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌ను ఈసారికి పోటీ నుంచి తప్పించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిట్టింగ్ ఎంపీని మార్చడం తథ్యమన్న నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ మొదలైంది. వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో పార్టీలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీ నామా చేయడంతో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, కడియం కావ్య పేర్లు ప్రధానంగా వినిపించాయి. అరూరి రమేష్ మొదట ఆసక్తి చూపినా.. ఆ తర్వాత ఎందుకో పార్టీ మారాలనే యోచనలో పడటం పార్టీలో గందరగోళానికి తెరతీసింది. ఇదే సమయంలో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రులను కలవడం.. బుధవారం హనుమకొండలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్మీట్లో మాట్లాడేకంటే ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఆయనను తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లి కేసీఆర్‌ను కలిపించారు. ఉమ్మడి వరంగల్ కీలక నేతలు, ప్రజాప్రతినిధులతో సుమారు గంటన్నర పాటు చర్చించిన కేసీఆర్.. కడియం కావ్య పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఉన్నత విద్యాభ్యాసం.. సామాజిక సేవలో సీనియర్ రాజకీయ నాయకులు కడియం శ్రీహరి పెద్ద కూతురైన కావ్య దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాక, ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీ (పాథాలజీ) పూర్తి చేసి వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేశారు. గతంలో వర్ధన్నపేట సామాజిక వైద్యకేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆమె బాలికల విద్యా వ్యాప్తి కి విశేషించి కృషి చేస్తున్నారు. మెనుస్ట్రువల్ హైజీన్‌పై కడియం ఫౌండేషన్ ద్వారా వందలాది చైతన్య కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా హైజీన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డాక్టర్ కావ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. మానుకోట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాంనాయక్.. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ను ప్రకటించారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో అలా చేరారో.. లేదో.. ఇలా టికెట్ తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాంనాయక్ కేయూ ప్రొఫెసర్‌గా కొనసాగుతూనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇలా బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్‌కు దగ్గరైన ఆయన.. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. మానుకోట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై 34,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన స్థానంలో మాలోత్ కవితకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఇవ్వాలని కోరగా.. అదీ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న సీతారాంనాయక్ టికెట్ రాదని తెలిసి, ఈ నెల 10న బీజేపీలో చేరారు. చేరిన మూడు రోజులకే మానుకోట టికెట్ కేటాయించడం గమనార్హం. ఇవి చదవండి: బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
TS: సీఎం రేవంత్‌కు కడియం సవాల్
సాక్షి,వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి వేదిక ఏదైనా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. బుధవారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మాట్లాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నానమని, ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. ‘సీఎంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీ మేనిఫెస్టో.. మా మేనిఫెస్టోపైన మేం చర్చకు రెడీ. ప్రశ్నిస్తే మాపై మాటల దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో అర్దం కావడం లేదు. రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తోంది. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. నువ్వు అంత మగాడివే అయితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగ తనాన్ని నిరూపించుకో. సీఎంగారు మీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న అలోచన మాకు లేదు. మీ ఆంతట మీరు కూలిపోతే మాకు సంబంధం లేదు. మీ వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే అనుకుంటున్నాం. రాజీవ్ గాంధీ కుటుంబం ఇనామ్ కింద ఇచ్చిందే కదా నీ కుర్చీ. ఇందిరాగాంధీ నామజపంతో తుకుతున్న పార్టీ మీది. మీది జాతీయపార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ మీది. ఆప్ కంటే అద్వాన్నంగా మారింది కాంగ్రెస్ పార్టీ. మార్చి1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నాం. త్వరలో కేసీఆర్ కూడా మేడిగడ్డ కు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే. కూలిపోయిన 3 పిల్లర్ల వద్ద రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే దుర్మార్గపు అలోచన చేస్తున్నారు. ఇదీ చదవండి.. తెలంగాణకు మరోసారి మోదీ.. రెండు రోజులు ఇక్కడే -
రాజగోపాల్ రెడ్డి మాటల్లో తప్పేంటి ?..తప్పుగా మాట్లాడితే..
-
Telangana Assembly: కేసీఆర్ ఎందుకు రాలేదంటే..
సాక్షి, హైదరాబాద్: శాసనసభకు మాజీ సీఎం కేసీఆర్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయారని, ఆయన వచ్చి మాట్లాడినా, ఆయన స్థానంలో బీఆర్ఎస్ సభ్యులుగా తాము మాట్లాడినా అది పార్టీ అభిప్రాయమే అవుతుందని బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి పేర్కొన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించలేదన్న అంశంపై సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది. ఈ చర్చకు బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవటాన్ని అధికార పక్ష సభ్యులు పదే పదే పేర్కొన్న సందర్భంలో కడియం స్పందించారు. కేసీఆర్ హాజరు కాలేకపోయినా, పార్టీ అభిప్రాయంగా తాము మాట్లాడుతున్నామని వెల్లడించారు. హరీశ్‌కు కేటీఆర్ అభినందన కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా అభినందించారు. అంశంపై పట్టులేని ముఖ్యమంత్రి రేవంత్, ఆయన సహచర మంత్రివర్గాన్ని హరీశ్‌రావు అద్భుతంగా ఒంటిచేత్తో ఎదుర్కొన్నారన్నారు. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన అసత్య ప్రచారం, అబద్ధాలను తిప్పికొట్టి అపోహలు తొలగించారన్నారు. మంగళవారం జరిగే ‘చలో నల్లగొండ’సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం, అబద్ధాలను తిప్పి కొడతారని కేటీఆర్ పేర్కొన్నారు. -
కడియంను బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కి బడుగులు, దళితులు గుర్తుకు రాలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్.రఘునందన్‌రావు మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా సీనియర్ నాయకుడు, దళితనేత కడియం శ్రీహరిని ఎన్నుకోవాలని ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సూచించారు. ‘కేసీఆర్‌కు ఎలాగూ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్‌గా దళితుడిని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒక బీసీని చేయాలని సూచించారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు ఇప్పుడు జ్యోతిబా పూలే గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. కవిత ఉన్నా లేకపోయినా పూలే గుర్తుంటారని, ఇందుకోసం వారు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కవితకు, ఆమె ఫ్యామిలీకి పబ్లిసిటీ అంటే అంత పిచ్చి ఎందుకని అన్నారు. శాసనసభలో కేటీఆర్, హరీశ్ కనపడాలని, తెలంగాణ భవన్లో కేసీఆర్, మండలి లో కవిత కనపడాలంటే ఎలా అని ప్రశ్నించారు. -
మీరు తిడితే.. మేము పడుతుంటామా?: రేవంత్‌పై కడియం ఫైర్
సాక్షి, జనగామ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్‌రెడ్డిలో లోపిస్తుందని ఎద్దేవా చేశారు. మీరు తిడుతుంటే.. మేము పడుతూ ఉంటామా? అని మండిపడ్డారు. తమకు కూడా చీము, నెత్తురు ఉన్నది.. తాము కూడా ఎదో ఒక భాషలో తిట్టేలాగా? చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్, కేటీఆర్, హరీష్ రావులను బిల్లా-రంగా అని విమర్శించడం విడ్డూరమని అన్నారు. చార్లెస్ శోభరాజ్, బిల్లా- రంగా కంటే పెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ను బోందపెట్టేవాడు.. ముక్కలు చేసేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు. బీఆర్ఎస్ను పాతిపెట్టడం ఎవరితో కాదు.. నీ అయ్యతో కూడా కాదని తీవ్రంగా విమర్శించారు. చదవండి: సీఎం రేవంత్‌తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది? -
ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాలయాపన చేసేందుకే శ్వేతపత్రాలు, జ్యుడీషియ ల్ ఎంక్వైరీ, ప్రాజెక్టుల సందర్శన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి విమర్శించారు. కాలయాపనతో ఎన్నికల హామీ లను ప్రజలు మరిచిపోతారని ప్రభుత్వం భావిస్తోందని, ఆరు నెలల్లోపు హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. అవినీతికి హక్కుదారు కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వంపై వేసే ప్రతి విచారణను బీఆర్ఎస్ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అవినీతి అవాస్తవమని తేలింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత సీఎం రేవంత్, రాహు ల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరో పణలు అవాస్తవమని శుక్రవారం మంత్రుల మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తేలిందని కడియం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 98 వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి నట్లు మంత్రులు తమ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లోనే అంగీకరించారని పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుపై సమగ్ర విచారణ 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడిన తమ ప్రభుత్వం.. నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతల పథకం సాధ్యం కాదని తేలినందునే.. కాళేశ్వరం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ ద్వారా రీ డిజైన్ చేసిందని కడియం శ్రీహరి చెప్పారు. 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.62 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరిగిందని తెలిపారు. సీడబ్ల్యూసీ సహా 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించామన్నారు. డిసెంబర్ 2008లో తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా 2014 వరకు కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎనిమిదేళ్ల పాటు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. ఈపీసీ విధానం తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు తదితరాల పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదని అన్నారు. కేబినెట్ ఆమోదంతోనే ల్యాండ్ క్రూజర్ల కొనుగోలు వాస్తవాలను పక్కన పెట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రులు జ్యుడీషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు పై సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ క్రూజ ర్ల కొనుగోలు కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని, ఇలాంటి అంశాలపై పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు లంకెబిందెల కోసం అధికారంలోకి వ చ్చారా? బడ్జెట్ గణాంకాలు అధ్యయనం చేయ కుండానే హామీలిచ్చారా? అని ప్రశ్నించారు. -
మేడిగడ్డ సందర్శన.. కాంగ్రెస్ మంత్రులకు కడియం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. అంచనాలు పెంచి కట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని.. పవర్ జనరేట్ ప్రాజెక్టులు, సబ్ స్టేషన్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడం వల్లే అంచనా పెరిగిందని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద, 19, 20, 21 పిల్లర్లు కుంగడం దురదృష్టకరమని.. ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కూడా కోరుకుంటోందని తెలిపారు. జ్యూడిషియల్ ఎంక్వైరీ కచ్చితంగా చేయాలన్నారు కడియం. అయితే విచారణ జరగకముందే మంత్రులు తీర్పులు చెబుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా విషయాల్లో అవగాహన ఉందని భావించానని..కానీ ఆయనే పూర్తిగా తెలుసుకోకుండా తీర్పునిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సీఎం హోదాలో కేసీఆర్‌తో కలిసి ప్రధాని వద్దకు వెళ్లి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీకి అడుగడుగునా విషం నింపుకుంది కాబట్టే హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయా హోదా తీసుకురావాలని, ఇందుకు తాము కూడా మద్దతిస్తామని తెలిపారు. కాళేశ్వరం సందర్శన కోసం వెళ్లిన మంత్రులు.. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ఆర్ధిక వనరులు సమకూర్చుకోలేక జనాన్ని మోసం చేయటానికి కొత్త డ్రామాలకు తెర లేపారని విమర్శించారు. శ్వేత పత్రాలు అంటూ కొంత కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి అంటూ కాలం గడుపుతుందని మండిపడ్డారు. రూ. 93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడిహాట్టి దగ్గర కట్టింది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోజెక్ట్ మాత్రమేనని తెలిపారు. చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్ -
‘ప్రభుత్వం గవర్నర్‌తో అసత్యాలు చెప్పించింది’
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏం లేదని, కొత్త ప్రభుత్వం చేసే పనికి స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో చదవటానికి మాత్రమే జాయింట్ సెషన్ పెట్టినట్టు కనిపిస్తోందన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎన్నో అవార్డులు అందుకొని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచిందని తెలిపారు. పంటల విస్తీర్ణం పెరిగింది అనేది వాస్తవమని, 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అన్నారు. తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు తెలంగాణ అభివృద్ధి సాధించిందని తెలిపారు. కానీ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిన విషయాన్ని గవర్నర్ చెప్పలేదని అన్నారు. ఇవన్నీ చూసిన గవర్నర్ ఇప్పుడు.. అప్పుడు ఏం మాట్లాడారో సమీక్ష చేసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ చెప్పటం హాస్యాస్పదమని అన్నారు. గవర్నర్ ఏదో చెప్తారని ఆశ పడ్డామని, ప్రభుత్వ పాలసీలు ఏ ఒక్కటి కూడా స్పష్టంగా చెప్పలేదని తెలిపారు. ప్రభుత్వం గవర్నర్ నుంచి అసత్యాలు చెప్పించిందని, దళిత బంధు ప్రస్తావన లేదన్నారు. పండిన పంట ఇప్పుడే అమ్మకండి అంటూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 500 బోనస్ ఇచ్చి కొంటామని అన్నారని తెలిపారు. ఎందుకు ఇప్పటి వరకు కొనలేదని సూటీగా ప్రశ్నించారు. చదవండి: Tamilisai Soundararajan: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన -
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
బీఆర్ఎస్ను ఆగం చేస్తున్న వర్గపోరు.. ట్రబుల్ షూటర్ మంత్రం పనిచేస్తుందా?
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఓ ఆనవాయితీ కూడా ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్ ఈసారి హాట్ హాట్‌గా మారింది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే అధికార పార్ఠీలో అంతర్గత కలహాలు అక్కడి అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం..ఒకప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో.. ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలా ఈ నియోజకవర్గంకూ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచీ ఈ అనవాయితీ కొనసాగుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని అన్ని పార్టీల నేతలంతా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు..టీడీపీ మూడు సార్లు.. గులాబీ పార్టీ ఉప ఎన్నికలతో సహా నాలుగుసార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో తాడికొండ రాజయ్య గులాబీ పార్టీ తరపున విజయం సాధించి.. కేసీఆర్ తొలి క్యాబినెట్లో తొలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2018లో కూడా డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకే రెండోసారి అధికారం దక్కింది. ఉపఎన్నికతో కలిపి వరుసగా 4 సార్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తి రగలిపోతున్నారు. రాజయ్య తీరుతో పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరికి నష్టమని గ్రహించిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ స్వయంగా రాజయ్యతో మాట్లాడి బుజ్జగించారు. కడియంతో కలిసి పనిచేయమని రాజయ్యకు సూచించారు. పెద్దల ముందు తలాడించినా గాని...ఆ తర్వాత కూడా ఇద్దరు నేతల మధ్య పెద్దగా సఖ్యత లేకుండా పోయింది. పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజయ్య అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మొదట్లో కడియం నిర్వహించిన అత్మీయ సమ్మేళనాలకు రాజయ్య హాజరుకాలేదు. ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం బలమైన నేతగా భావిస్తున్నా.. వర్గపోరు పార్టీని ఆగం చేస్తోందనే భావన అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇప్పటికే ఈ అంశాన్ని విపక్షాలు క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయట.. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరగాల్సిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అనూహ్యంగా వర్థనపేటకు మారింది. సభ నియోజకవర్గం మారడానికి ఘన్పూర్ పార్టీలో అంతర్గత కలహాలే కారణమంటూ ప్రచారం సాగింది. అక్కడి నుంచి వస్తున్న సర్వేలు సైతం గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయట. ఒకవైపు ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఘన్పూర్ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారంచాల్సి వస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీద ఎటువంటి అవినీతి మరకా లేదు. అయితే రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు స్వపక్షం నుంచే కడియంకు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే..బీఆర్ఎస్లో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కడియం అభ్యర్థిత్వాన్ని బలమైన మాదిగ సామాజిక వర్గం సైతం వ్యతిరేకిస్తే పార్టీకి ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారట. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ట్రబుల్ షూటర్‌గా ఉన్న మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతోంది. ఉద్యమ సమయంలో 2012 ఉప ఎన్నికల్లో సైతం హరీష్ రావు పూర్తి బాధ్యతలు తీసుకుని అప్పట్లో రాజయ్యను గెలిపించడానికి కృష్టిచేశారు. అప్పుడు ఎవరి ఓటమి కోసం పనిచేశారో అదే కడియం శ్రీహరి విజయం కోసం ఇప్పుడు మళ్లీ హరీష్ రావు రంగంలోకి దిగాల్సి వచ్చిందట. ఆత్మీయ సమ్మేళనం పేరుతో వచ్చిన హరిష్ రావు రాజయ్య ఇంటికి వెళ్లి నచ్చ చెప్పారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు మంత్రాంగం పనిచేస్తుందా? రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న కడియం శ్రీహరి కోసం రాజయ్య మనస్పూర్తిగా పనిచేస్తారా? అనే చర్చ ఘన్పూర్ నియోజకవర్గంలో సాగుతోంది. మరోవైపు ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ఈ సారి నిజమవుతుందా? లేదా అనే చర్చ కూడా మొదలైంది. -
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఏపార్టీ గెలిస్తే ఆ పార్టీకే అధికారం
-
రేవంత్ గజదొంగ.. నాపై ఒక్క కేసు లేదు: కడియం
సాక్షి, జనగాం: కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్.. కడియంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కడియం కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ఓ గజదొంగ. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఇందిరపై, రేవంత్‌రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి. కానీ, నాపై ఒక్క కేసు కూడా లేదు అని కడియం అన్నారు. నియోజక వర్గంలోని మాదిగలపై నిజంగా ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం రాసివ్వాలని ఇందిరకు సవాల్ విసిరారాయన. ఇందిర తన ఆస్తుల్ని రాసిచ్చిన మరు క్షణమే తాను తన ఆస్తుల్ని రాసి ఇచ్చేస్తానని కడియం తెలిపారు. 2018 ఎన్నికల్లో రాజయ్య చేతిలో ఇందిర చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నియోజకవర్గం పైన అవగాహన లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నా. నియోజకవర్గంలోని ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇందిర సాయం చేయలేదు. ఆపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. సుప్రీం కోర్టులో ఆ కేసు నడుస్తోంది. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండని ఆమెకు.. ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారాయన. -
ద్రోహుల చేతిలోకి కాంగ్రెస్.. ఎమ్మెల్యే టికెట్‌కు రూ.5 కోట్లు: మంత్రి హరీష్
సాక్షి, జనగాం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. అవినీతిపరుల పార్టీగా మారిందని విమర్శించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని కాంగ్రెస్ నేతలు తమపై పోటీ చేస్తారట అని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరితో సయోధ్య కుదిర్చారు. ఇద్దరితో కలిసి సమావేశానికి హాజరైన హరీష్ రావు.. ఓటుకు నోటు కేసులో పట్ట పగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. రూ. 50 కోట్లు పెట్టి టీపీసీసీ పదవిని కొనుక్కున్నాడని ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డే అంటున్నాడని మండిపడ్డారు. ఐదు కోట్లు, పదేకరాల భూమికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌కు సగం సీట్లలో అభ్యర్థులు లేరని అన్నారు హరీష్ రావు. పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి మారుపేరని, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళలను ఏడిపిస్తుందని విమర్శించారు. కడియం శ్రీహరి, రాజయ్య నాయకత్వంలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, బీఆర్ఎస్ సెంచరీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే.. -
రాజయ్య ఆవేదన కడియంకి మైనస్ అవుతుందా?
స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు గరంగరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బ్యాలెట్ పోరులో ప్రజా తీర్పే ఇక మిగిలిఉంది. అధికార పార్టీకి అడ్డాగా ఉన్న ఘనపూర్ లో ఆ పార్టీలోనే గడబిడ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య వర్గం అగ్గిమీద గుగ్గిలమైంది. కడియం టార్గెట్ గా విపక్షాలతో పాటు..స్వపక్షం నేతలు కూడా కొందరు పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ అడ్డా మీద కీ రోల్ పోషిస్తున్నారు. స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్న కడియం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. స్టేషన్ ఘనపూర్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచి ఆ సెంటిమెంట్ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి బిఆర్ఎస్ కు చెందిన డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఉపఎన్నికతో కలిపి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ దక్కక మొదట్లో కాస్త ఆందోళన చెందిన రాజయ్యను చివరకు కేటిఆర్ సముదాయించి రైతుబంధు సమితి చైర్మెన్ పదవి ఇవ్వడంతోపాటు భవిష్యత్తుపై భరోసా ఇచ్చి కడియంతో సయోధ్య కుదిర్చారు. ఇద్దరూ ప్రగతి భవన్ లో కలిసిపోయినా బయట మాత్రం అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలో బలమైన నాయకులు లేకపోవడం అనేది అధికార పార్టీకి కలిసివచ్చే అంశమే అయినా వర్గపోరు పార్టీని ఆగం చేస్తోంది. విపక్షాలు దాన్ని క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు ఘనపూర్ లో అయోమయం సృష్టిస్తున్నాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బిజేపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిర, బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు బరిలో దిగారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో ప్రచారం ముమ్మరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి తొలిదశలో మండలాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సమ్మేళనాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య దూరంగా ఉన్నారు. తన టిక్కెట్ కడియం తన్నుకుపోయారనే ఆవేదనతో ఉన్న రాజయ్య, బయట ఆయనతో కలిసిపోయినట్లు వ్యహరిస్తున్నా అంతర్గతంగా మాత్రం కడియంకు చుక్కలు చూపించేందుకే సిద్ధమయ్యారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరుసార్లు, టిడిపి మూడు సార్లు, బిఆర్ఎస్ నాలుగు సార్లు గెలుపొందాయి. వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన రాజయ్య వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో ఈసారి అభ్యర్థిని మార్చారనే ప్రచారం సాగుతోంది. కడియం ఇదివరకు రెండు సార్లు స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొందడమే కాకుండా టిఆర్ఎస్ హయాంలో రాజయ్య తర్వాత ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనపై సదభిప్రాయం ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపద్యంలో మాదిగ వర్గానికి చెందిన రాజయ్యను కాదని కడియంకు టికెట్ ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గం కడియంకు ప్రతికూలంగా మారే పరిస్తితులు కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఓటములను రాజయ్య ప్రభావితం చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన సింగపురం ఇందిరా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ప్రజలతో మమేకమై ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం సాగిస్తున్నారు. బిజేపి నుంచి మాజీమంత్రి విజయరామారావు పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ ఆవిర్బావం తర్వాత ఆ పార్టీలో పనిచేసిన విజయరామారావు బిజేపిలో చేరి టికెట్ తెచ్చుకున్నప్పటికి ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి కడియం పేరు ఖరారై చాలా కాలమైంది. కాంగ్రెస్, బిజేపి పార్టీలు తమ అభ్యర్థులను ఇటీవలనే ఖరారు చేశాయి. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మద్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల సానుభూతి ఉన్నా ఆయన వ్యవహారశైలి పార్టీకి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. ఇక కడియం శ్రీహరి మీద ఎలాంటి అవినీతి మరకా లేనప్పటికీ..రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు...స్వపక్షంలోనే కొందరి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి సీనియర్ అయినప్పటికీ ఆయన పేరు పెద్దగా వినిపించడంలేదు. -
నేనే సుప్రీం.. మరోసారి ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్ కామెంట్స్
సాక్షి, జనగామ: తెలంగాణలో అసెంబ్లీ వేళ అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచే వారి జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు హైకమాండ్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరికొందరు ఇప్పటికే పార్టీని వీడుతూ హైకమాండ్ తీరుపై విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ను ఓడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. మరోసారి సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య కేశవనగర్‌లో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే నేను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేదు. నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు నడుస్తున్నాయి. ఇదే సమయంలో స్థానిక నేతలపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో డప్పులు కొట్టాలన్నా, ఫ్లెక్సీలు కట్టాలన్నా భయపడుతున్నారు. కోలాటమాడాలన్నా భయంతో వణికిపోతున్నారు. ఇలా ఎందుకు ఇంత అభద్రతాభావంతో ఉన్నారో అర్థం కావట్టేదు. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు నేను ఎమ్మెల్యేగా ఉంటాను. అప్పటి వరకు స్టేషన్ ఘనపూర్‌కు నేను సుప్రీం’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం టికెట్‌ను కడియం శ్రీహరికి హైకమాండ్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో, కడియం, రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో వీరితో మంత్రి కేటీఆర్.. ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని రాజయ్యకు కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో, మెత్తబడట్టే కనిపించిన రాజయ్య.. వెంటనే కడియంకే తన మద్దతు అని ప్రకటించారు. అనంతరం, వీలు చిక్కనప్పుడల్లా ఇలా కడియంను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. -
బీ ఫాం నాదే: రాజయ్య సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జనగామ జిల్లా: కేటీఆర్ చొరవతో.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ విభేదాలు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటున్న సమయంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాంబు పేల్చారు. బీ ఫాం తనదేనని ప్రకటించుకున్న ఆయన.. ఒకవేళ సీటు కేటాయించని పక్షంలో పోటీ చేసే విషయం కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసిపోయారనుకునేలోపే ఎమ్మెల్యే రాజయ్య బాంబు పేల్చడం గమనార్హం. లింగాలగణపురం మండలం వడ్డీచర్లలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాటికొండ రాజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డప్పుకొట్టి దరువేశారు. డప్పు, డోలు కొట్టి కార్యకర్తలను ఉత్సాహాపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు కలిశానని, అప్పుడు టికెట్ నీకే అని చెప్పారని ప్రస్తావించారు. కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కేటీఆర్ లేకపోవడంతో మళ్లీ రెండు రోజుల క్రితం సమావేశమైనట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ గానీ, ఎంపీగా కానీ అవకాశం ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకొమ్మని చెప్పారని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగినట్లు తెలిపారు. ఆ ఫోటోకు ఊహాగానాలతో మీడియాలో వచ్చిన కథనాలతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందన్నారు ఎమ్మెల్యే రాజయ్య. కడియంతో ఎలాంటి చర్చలు.. సంప్రదింపులు జరగలేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీ ఫాం తప్పకుండా తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేల టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. సర్వే రిపోర్ట్లు తెచ్చుకొని చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీఫామ్‌లు ఇవ్వలేదన్న రాజయ్య.. కొన్ని నియోజక వర్గాలలో డిస్టబెన్స్ జరుగున్నాయని తెలిపారు. ‘2014లో ఎంపీ అభ్యర్థిగా కడియం, ఎమ్మెల్యేగా నేను అధిష్టానం నిర్ణయం ప్రకారం కలిసి పని చేశాం. ఇప్పుడు కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తా. జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటా. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కార్యకర్తలు ఆందోళన చెందకుండా పని చేయండి. వరంగల్‌లో దామోదర రాజనర్సింహతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు రాజయ్య కాంగ్రెస్‌లోకి వెల్తున్నారని కథనాలు రాశారు. ఊహాగానాలతో మీడియాలో కథనాలు రాయడాన్ని ఖండిస్తున్నాను’ అని రాజయ్య పేర్కొన్నారు. -
కేటీఆర్ మాస్టర్ ప్లాన్.. కడియంకు మద్దతు ప్రకటించిన రాజయ్య..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు చోట్ల సిట్టింగ్‌లకు ప్లేస్ లేకపోవడంతో ఆయా స్థానాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నేతలే పార్టీ హైకమాండ్‌పై సీరియస్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్రం తిప్పిన కేటీఆర్.. ఇక, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో ఆయన హైకమాండ్‌పై పోరుకు రెడీ అయ్యారు. సమయం దొరికిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య సెటైర్లు వేశారు. పరోక్షంగా శ్రీహరిని ఓడిస్తా అనే రేంజ్ వరకు వెళ్లారు. ఈనేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్లో రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జరిగిన భేటీలో రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపునకు పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. శాంతించిన రాజయ్య.. అయితే, రాజయ్యకు కేటీఆర్ కీలక హామీ ఇచ్చారు. రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాజయ్య భవిష్యత్త్‌కు సీఎం కేసీఆర్, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక, కేటీఆర్ ఇచ్చాన భరోసాతో రాజయ్య మెత్తబడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: అలర్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. -
పొలిటికల్ గేమ్.. కాంగ్రెస్ నేతతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పొలిటికల్ వాతావరణం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించగా.. కొందరు సిట్టింగ్‌లకు సీటు ఖరారు కాలేదు. దీంతో, సదరు నేతలు గుర్రుగా అధిష్టానంపై సీరయస్ అవుతుండగా.. మరికొందరు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. పొలిటికల్ గేమ్ ప్లాన్.. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసంతృప్త నేత టీ.రాజయ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, హన్మకొండ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో దామోదర రాజనర్సింహతో కలిసి రాజయ్య పాల్గొన్నారు. దీంతో, వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్న రాజయ్య.. కాంగ్రెస్‌లో చేరేందుకే దామోదరతో భేటీ అయినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక, ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్స్ కూడా ఇందుకు బలాన్ని చేరుకూరుస్తున్నాయి. కడియం వర్సెస్ రాజయ్య.. ఇక, స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి సీటు ఖరారు చేశారు సీఎం కేసీఆర్. దీంతో, రాజయ్య.. కడియం మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. సమయం దొరికిన ప్రతీ సందర్భంలో కడియంపై రాజయ్య తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ కడియంపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందన్నారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసు. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొంది. ఎక్కడో ఉండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే.. అన్ని తానే చేసినట్టు కలర్ ఇచ్చేది మరొకరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేఖా నాయక్ సవాల్.. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్పై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే తన టార్గెట్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఇది కూడా చదవండి: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. అయితే కాంగ్రెస్ కోటాలోనే.! -
టార్గెట్ కడియం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్
సాక్షి, జనగామ: బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. టికెట్లు దక్కని సిట్టింగ్స్.. టికెట్ దక్కిన వారిపై, పార్టీ అధిష్టానంపై సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య పొలిటికల్ కోల్డ్‌వార్ నడుస్తోంది. రాజయ్య సందర్భం వచ్చిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పంచ్‌లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారింది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసు. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొంది. ఎక్కడో ఉండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే.. అన్ని తానే చేసినట్టు కలర్ ఇచ్చేది మరొకరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి విద్య ద్వారానే ఈ స్థాయికి వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదలైంది. కాగా, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్గా వున్న రాజయ్యను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం కల్పించారు. దీన్ని రాజయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్యల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తనను రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడని.. నవ్య సంచలన ఆరోపణలు చేశారు. వీరి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పీఏ దుర్మరణం -
అసలు కథ ముందుంది.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్ కామెంట్స్
సాక్షి, జనగామ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్రంలో టికెట్ల విషయం కాక రేపుతోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ దక్కని ఆశావహులు అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. మరికొందరు నేతలు ఏకంగా పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ లభించని ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఝలక్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు.. తాజాగా రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ రాకపోయినా నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఎవరూ రారు.. ఏమీ జరగదు. నా పని ఇప్పుడే అయిపోందని భావించకూడదు అంటూ కీలక కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన ఏం చేస్తారనే టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య బుధవారం లింగాలఘనపురం మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. అయితే, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్కు చెందిన స్థానిక నేతలు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో నేతల తీరుపై రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తూ ఊరుకుంటామా.. ఇక, అంతకుముందు కూడా రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనోవేదన చెందుతున్నారు. ఈ సందర్భగా రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు.. రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు. ఇది కూడా చదవండి: సాగర్ బీఆర్ఎస్లో అంతర్గత పోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్ -
ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్
సాక్షి, జనగామ: స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ హాట్ కామెంట్‌తో వార్తల్లోకెక్కారు. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య.. ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనో వేదన చెందుతున్నారు. ధర్మసాగర్ మండలంలో బీసీ బంధు.. లక్ష రూపాయల చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. ఆ సమయంలో పక్కన ఉన్న అనుచరులు సైతం నవ్వులు చిందించారు. దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు... రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు. తాజా కామెంట్లు ఆయన పార్టీ మారరనే సంగతి స్పష్టం చేస్తున్నా.. ఆయన కార్యచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
TS Election 2023: ఆశీర్వదించి అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..! : కడియం శ్రీహరి
వరంగల్: అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి.. అయితే అనుకున్న స్థాయిలో జరగలేదు.. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి తోటలో పార్టీ ఘన్పూర్ గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి పలువురు కడియం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా నియోజవకర్గ ప్రజలతో మమేకమై అభివృద్ధిలో పాలుపంచుకున్నాను.. ఏనాడు తప్పుడు పనులు చేయలేదు.. ప్రజలకు తలవంపులు తేలేదని కడియం అన్నారు. పేదరికం నుంచి వచ్చిన తనకు వారి కష్టాలు తెలుసుని, పార్టీ పదవులు, ప్రభుత్వ పథకాల ఆశచూపి ఎవరి వద్దా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. పక్కనే ఉన్న పాలకుర్తి, వర్ధన్నపేట బాగా అభివృద్ధి చెందాయని, తనను ఆశీర్వదించి అవకాశం ఇస్తే స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు కలిపి మున్సిపాలిటీ చేయించి అభివృద్ధి చేస్తానన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్నగుప్తా, నీల గట్టయ్య, పోగుల సారంగపాణి, పురమాని రజాక్‌యాదవ్, గన్ను నర్సింహులు, తెల్లాకుల రామక్రిష్ణ, సింగపురం జగన్, రాజేష్‌నాయక్, డాక్టర్ జైహింద్‌రాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లో ట్విస్ట్.. గులాబీ నేతలకు కేసీఆర్, కేటీఆర్ వార్నింగ్
గులాబీ తోటలో స్టేషన్ ఘన్పూర్ పంచాయతీకి తెర పడిందా? కొన్నాళ్లుగా మాటల యుద్ధం చేసుకుంటున్న కడియం, రాజయ్యలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా? లేక ఇద్దరి మధ్యా రాజీ కుదిరిందా? సీటు విషయంలో ఎవరిది పై చేయి అయింది? ఇంకొకరికి ఎటువంటి హామీ లభించింది? ఇకముందు ఇద్దరూ సైలెంట్‌గా ఉంటారా? మరోసారి రెచ్చిపోతారా?.. తెలంగాణలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల సీటు వివాదం కొత్తమలుపు తిరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్యా సాగుతున్న డైలాగ్‌వార్‌కు పార్టీ నాయకత్వం చెక్ పెట్టింది. ఇద్దరినీ హైదరాబాద్‌కు పిలిపించి పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సున్నితంగా మందలించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అటు కేసీఆర్‌ను ఇటు కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు. కేటీఆర్‌ను కలిసిన రాజయ్య రాజయ్య మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాత్రమే కలిసారు. తొలి నుంచీ రాజకీయ ప్రత్యర్థులైన కడియం, రాజయ్యలు బీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా అదే పోకడ కొనసాగించారు. డిప్యూటీ సీఎంలుగా ముందు రాజయ్యకు, తర్వాత కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ సీటు విషయంలో ఇద్దరి మధ్యా పోరు తీవ్రంగా సాగుతోంది. ఇంకా ముదిరితే పార్టీకే నష్టమని పార్టీ నాయకత్వం పార్టీ క్రమశిక్షణ అధిగమించవద్దని ఇద్దరినీ సున్నితంగా మందలించి పంపింది. రాజయ్య అవినీతిపై కడియం వివరణ.. హైదరాబాద్ నుంచి పిలుపు రాగానే హడావుడిగా వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అంతకు రెండు రోజుల ముందు కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, కేటీఆర్‌ను కలిసారు. తాను కడియంపై కొత్తగా ఏమీ ఆరోపణలు చేయలేదని, గతం నుంచి ఆయన మీద ఉన్నవేనని రాజయ్య.. కేటీఆర్‌కు వివరణ ఇచ్చుకున్నారు. అదేవిధంగా రాజయ్య అవినీతి గురించి కడియం పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు వార్నింగ్ ఇచ్చి.. ఎవరి భవిష్యత్ అయినా కేసీఆర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే స్టేషన్‌ఘన్‌పూర్ సీటు విషయంలో ఈసారి కడియం శ్రీహరి పోటీ చేయడానికి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నియోజకవర్గంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. స్పీడ్ పెంచిన శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్న కడియం తన నియోజకవర్గంగా స్టేషన్ ఘన్‌ఫూర్ ఎంపిక చేసకుని.. మరింత దూకుడుగా వ్యవహరించడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జరుగుతోంది. నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యకు బదులుగా ఈసారి కడియం శ్రీహరి వైపు గులాబీ దళపతి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సభలు, సమావేశాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న కడియం నియోజకవర్గంలో తన ఫ్లెక్సీల కోసం మండలానికి 10 లక్షలు చొప్పున పంపిణీ చేశారన్న టాక్ నడుస్తోంది. కడియం, రాజయ్య మధ్య వివాదం తీవ్రం కావడంతో జనగామకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని తెరమీదకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నియోజకవర్గానికి చెందిన సీఎం ముఖ్య అనుచరుడు ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్సీ ఎంట్రీ.. ఘన్పూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వివాదం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనుగొనే పనిలో పార్టీ అధిష్టానం నిమగ్నమయిందట. అసలు విషయం తేల్చకుండా ఇంతకాలం కలిసి పనిచేసుకోండని చెప్పినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. ఇద్దరి మధ్య మరో ఎమ్మెల్సీ ఎంట్రీ కారణంగానే ఘన్పూర్ అడ్డా అధికార పార్టీలో రాజకీయ దుమారం చెలరేగిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. టిక్కెట్ విషయంలో వెంటనే స్పష్టత ఇచ్చి..పార్టీ ఐక్యత దెబ్బతినకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఘన్పూర్ గులాబీ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నాయి. ఇది కూడా చదవండి: చంద్రబాబు వారసుడు రేవంత్ -
కడియం శ్రీహరికి గ్రీన్ సిగ్నల్..? ప్రగతిభవన్‌కు రాజయ్య..
సాక్షిప్రతినిధి, వరంగల్ : మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలువనున్నారా? బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనకు అభయం ఇచ్చిందా? ఆ విషయం లీకై నందుకే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నేరుగా శ్రీహరిపై తీవ్ర పదజాలంతో ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారా? అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరి మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులే. ఒకరు టీడీపీలో.. మరొకరు కాంగ్రెస్‌లో.. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా.. వారిద్దరి మధ్యన ఎప్పుడు వైరమే. అధిష్టానం చొరవతో కలిసి పని చేసినట్లు కనిపించినా..ఎవరికి వారుగా ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు రెండు గ్రూపులకు ఆజ్యం పోయగా.. ఇప్పుడవి చినికి చినికి గాలివానగా మారాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు పార్టీని అభాసుపాలు చేస్తున్నాయి. శ్రీహరి దూకుడు వెనుక మర్మం ఏమిటి.. రూ.10 లక్షల వెనుక నిజమెంత? ఎమ్మెల్సీగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్న కడియం శ్రీహరి ఇటీవల మరింత దూకుడు పెంచడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కొంతకాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వివాదాలు ఎదుర్కొంటున్న సమయంలో అధిష్టానం శ్రీహరి వైపు మొగ్గు చూపుతోందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలను ముమ్మరం చేసిన ఆయన ఫ్లెక్సీలు, హంగు ఆర్భాటాల కోసం మండలానికి రూ.10 లక్షలు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవల ఆరోపించారు కూడా. శ్రీహరి మండలానికి రూ.10 లక్షలు పంపిణీ చేశారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అనేది తేలాల్సి ఉంది. సీఎం పేషీకి ‘స్టేషన్’ వివాదం ప్రగతిభవన్‌కు రాజయ్య.. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల పోరు సీఎం కేసీఆర్ పేషీకి చేరింది. ఎమ్మెల్యే తాటికొండ రాజ య్యకు ప్రగతిభవన్ నుంచి మంగళవారం పిలుపు వచ్చింది. ఉదయమే ఖరారు చేసిన కార్యక్రమాలను రద్దు చేసుకుని వెళ్లిన ఆయన కేటీఆర్‌ను కలిశా రు. సుమారు గంట తర్వాత బయటకు వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య మీడియాతో మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో సమస్య సద్దుమణిగిందన్నారు. అన్ని విషయాలు వివరించగా పార్టీ లైన్లో పనిచేయమని కేటీఆర్ ఆదేశించారన్నారు. 2018 ఎన్నికల్లో కూడా కడియం శ్రీహరి ఇలాగే వ్యవహరించారని, తాను కేసీఆర్ గీసిన లక్ష్మణ రేఖను దాటన ని రాజయ్య పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదు, ప్రజనాయకుడనన్న రాజయ్య కొన్ని పరిణామాల దృష్ట్యా కడియం శ్రీహరిపై ఎదురు దాడి చేశానన్నారు. కడియం శ్రీహరిపై చేసినవి అభియోగాలు మాత్రమేనని, తాను కొత్త అభియోగాలు చేయలేదు, పాతవాటినే.. ఉటంకించాననీ సమర్థించుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
కారు.. వీధిపోరు! 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘బహుళ’ తలనొప్పి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భారత్ రాష్ట్ర సమితి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. నేతలు చివరకు వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడుతూ వీధికెక్కుతున్నారు. రోజుకో చోట.. రోజుకో నేత అనే రీతిలో నియోజకవర్గ స్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి వరకు పరస్పర విమర్శలు, దూషణలు తెరమీదకు వస్తున్నాయి. సిట్టింగ్‌లు తమను కలుపు కొని వెళ్లకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలు క్రమంగా స్వరం పెంచుతు న్నారు. పార్టీ అధినేతపై విశ్వాసం, విధేయత ప్రకటిస్తూనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా బహిరంగ ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్లు, పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలు, వివిధ సందర్భాల్లో టికెట్లు ఆశిస్తూ పార్టీలో చేరినవారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తు న్నారు. టికెట్ల పోటీలో పర స్పరం సిగపట్లకు దిగుతు న్నారు. కార్యకర్తలు, అను యాయుల సమక్షంలో సొంత పార్టీకి చెందిన రాజ కీయ ప్రత్యర్థిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీ నేతలు లక్ష్మణరేఖ దాటుతున్నా.. అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రతిస్పందించక పోవడంతో వివాదాలు మరింత ముదురుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక నాయకత్వంతో పొసగని నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. అయినప్పటికీ అధినేత మౌనం వెనుక ఆంతర్యం పార్టీ కేడర్‌కు అంతుపట్టడం లేదు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిల పరస్పర ఆరోపణలకు సంబంధించిన వివాదంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి హెచ్చరికలు జారీ చేయడంతో ఈ తరహా పరిణామాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. రోజుకో చోట.. రోజుకో నేత సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ బహుళ నాయకత్వం సమస్యను ఎదుర్కొంటోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ టికెట్‌ను ఆశిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు లాబీయింగ్‌కు దిగుతున్నారు. టికెట్ దక్కదనే అంచనాకు వచ్చిన కూచాడి శ్రీహరిరావు (నిర్మల్)తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వీడారు. ఇటీవలి కాలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేయగా, వారు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో పాటు ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే పార్టీ టికెట్ ఆశిస్తున్న మెదక్, రాజేంద్రనగర్, కొత్తగూడెం, ఉప్పల్, హుజూరాబాద్, తాండూరు, మహబూబాబాద్ తదితర నియోజకవర్గాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, జనగామ, ఖానాపూర్, వరంగల్ పశ్చిమ, నాగార్జునసాగర్, కల్వకుర్తి, జహీరాబాద్, వేములవాడ తదితర నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఎక్కడికక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. సమావేశాలు, సభలు నిర్వహిస్తూ సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ విధంగా కట్టుతప్పుతున్న నేతలపై చర్యలు లేకుంటే.. పరిస్థితి ఇతర పార్టీలకు అనుకూలంగా మారుతుందనే ఆందోళన పార్టీ కేడర్‌లో నెలకొంది. అయితే టికెట్ ఆశిస్తున్న నేతలంతా పార్టీ అధినేతకు విధేయులుగానే ఉంటున్నారని, ఎన్నికల నాటికి అంతా సద్దుమణుగుతుందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. నేతల పనితీరుపై కేసీఆర్‌కు పూర్తి స్పష్టత ఉన్నందున అందరికీ ఏదో ఒకరకంగా గుర్తింపు లభిస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. -
రాజయ్య... ఇక చాలు.. కేటీఆర్ క్లాస్? ఐదు నిమిషాల్లోనే అంతా సెట్!
సాక్షి, హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ లక్ష్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో తనను కలవాల్సిందిగా ఎమ్మెల్యే రాజయ్యకు కేటీఆర్ సోమవారం సాయంత్రం ఫోన్ చేశారు. ఆ మేరకు రాజయ్య మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటన లపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరస్పర విమర్శలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఇద్దరూ సీనియర్లు.. కలుపుకొని పోవాలి మీడియాలో వస్తున్న వార్తలను కేటీఆర్ ప్రస్తావిస్తూ ‘రాజన్నా చేసింది చాలు.. ఎక్కువేం మాట్లాడకు.. సీఎంకు చెప్తా.. ఆయనే అన్నీ చూసుకుంటారు. మళ్లీ ఎక్కడా మాట్లాడొద్దు.. ఏమీ చెప్పొద్దు.. ఇద్దరూ సీనియర్లు.. కలుపుకునిపోవాలి. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా వేటు తప్పదు’ అని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాను పాల్గొన్న పల్లె నిద్ర, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను పుస్తకరూపంలో కేటీఆర్‌కు రాజయ్య అందజేశారు. కేవలం ఐదు నిమిషాల్లోనే కేటీఆర్‌తో రాజయ్య భేటీ ముగిసినట్లు తెలిసింది. నాకే టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది ‘టికెట్ విషయాన్ని అధిష్టానం చూసు కుంటుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తా. కేటీఆర్ నాతో మాట్లాడిన తీరు చూస్తే టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. కడియంపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయాన్ని అధిష్టానం చూసుకుంటుంది’ అని రాజయ్య పేర్కొ న్నారు. తనపై స్థానికంగా వస్తున్న ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారని, ఆ ఆరోపణలు నిరాధారమనే విషయం పార్టీ నాయకత్వానికీ తెలుసన్నారు. ఇకపై నా నోటి నుంచి కడియం పేరు ఉండదు కేటీఆర్‌తో భేటీ అనంతరం అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లో నెలకొన్న సమస్య సద్దుమణిగింది. కేటీఆర్ పిలుపు మేరకు ప్రగతిభవన్‌కు వచ్చి అన్ని విషయాలు వివరించాను. పార్టీ లైన్లో పనిచేయమని కేటీఆర్ ఆదేశించారు. 2018 ఎన్నికల సమ యంలోనూ కడియం శ్రీహరి ఇలాగే వ్యవహ రించారు. నియోజకవర్గాల్లో విభేదాలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు కేంద్రంగా పనులు జరగాలని కేసీఆర్ ఆదేశించినా కడియం పట్టించుకోలేదు. ఇతర ఎమ్మెల్సీలు నన్ను అడిగి నిధులు కేటాయిస్తే కడియం మాత్రం గ్రూపులు ప్రోత్సహించేలా వ్యవహరించారు. కడియం శ్రీహరిపై నేను కొత్తగా మోపిన అభియోగాలేమీ లేవు. పాత వాటిని ఉటంకించాను. ఇప్పటికి ఈ వివాదం ముగిసిపోయిందని అనుకుంటున్నాను. నా నోటి నుంచి ఇకపై కడియం శ్రీహరి పేరు రాదు. కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తా’’ అని అన్నారు. -
లైన్ ఎవరు దాటినా ఊకునేది లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం మధ్యాహ్నాం ప్రగతి భవన్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కేటీఆర్ సమావేశమై ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలకు సైతం ఇద్దరూ వెనుకాడడం లేదు. ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఇవాళ్టి భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో.. రాజయ్యను మందలించిన ఆయన.. ఇంకోసారి అలాంటి పని చేయొద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ‘‘ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ పరిణామాలు ఉంటాయ’’ని కేటీఆర్ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడియం-రాజయ్య వైరం ఈనాటిది కాదు! మాజీ ఉపముఖ్యమంత్రులైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు.. మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆధిపత్య పోరు సహజంగానే కొనసాగుతూ వస్తోంది. 2019 సెప్టెంబర్‌లో వేర్వేరుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య విభేదాలకు ఆజ్యం పోయగా.. ఆ తర్వాత పరిణామాలు కూడా మరింత దూరం పెంచాయి. ఎవరికీ వారుగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీలు, ప్రొటోకాల్ వివాదం.. అంటూ ఇరువర్గాల మధ్యన తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 20 రోజుల వరకు కూడా పరోక్షంగా ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు.. ఈ మధ్య కాస్త దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వరం మరింత పెంచుకోవడంతో.. అధిష్టానం ఈ విమర్శలను తీవ్రంగా పరిగణించింది. ఇదీ చదవండి: నేను నోరు విప్పితే రాజయ్య కుటుంబం సూసైడ్ చేస్కోవాలి-కడియం -
నేను నోరు విప్పితే అంతే.. ఎమ్మెల్యే ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్యే రాజయ్య నా కుటుంబం గురించి, నా తల్లి, నా బిడ్డ గురించి సభ్యత, సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడారు.. నేను నోరు విప్పితే ఆయన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లి అనేది సత్యం.. తండ్రి అనేది అపోహ అంటూ నా తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉన్న ప్రతి తల్లిని, కుటుంబ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని, ఇందుకు రాజయ్య ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ’’అవును నాతల్లి బీసీ, తండ్రి ఎస్సీ, సుప్రీంకోర్టు తీర్పు, చట్టం ప్రకారం నేను ఎస్సీ, నా బిడ్డ ఎస్సీ. నాబిడ్డ మతాంతర వివాహం చేసుకుంటే ఆమెకు పుట్టే పిల్లలకు తండ్రి మతం, కులం వర్తిస్తుంది’ అని చెప్పారు. 1994కు ముందు ఎన్కౌంటర్లు జరగలేదా... తనను ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ రాజయ్య వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో 1994కు ముందు ఎన్కౌంటర్లు జరగలేదా అని కడియం ప్రశ్నించారు. అధిక ఎన్కౌంటర్లు 2004–14 మధ్యలో జరిగాయని, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నక్సలైట్లను చర్చలకు పిలిచిన విషయాన్ని గుర్తుకు చేశారు. 2004 నుంచి 2012 వరకు రాజయ్య కాంగ్రెస్‌లో ఉన్నాడని, ఆ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. వేల కోట్ల ఆస్తులు నిరూపిస్తే దళితులకు రాసిస్తా.. రాజయ్య ఆరోపిస్తున్న విధంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. వాటిని నియోజకవర్గ దళితులకు రాసిస్తా అని కడియం అన్నారు. నియోజకవర్గంలో పనులు ఇస్తానని, పదవులు ఇస్తానని ఏ ఒక్కరివద్ద డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఘన్పూర్ నియోజకవర్గాన్ని వదిలేసి పోటీనుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలు పుస్తెలు, ఇండ్లు, వ్యవసాయ భూములు కుదువపెట్టి డబ్బులు ఇచ్చారని, సమయం వస్తే బాధితులతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి రాజయ్య బండారం బయటపెడతాని హెచ్చరించారు. నీ చేష్టలు, మాటలు అన్నీ పార్టీ అధిష్టానం చూస్తోందని.. త్వరలోనే శిశుపాలుడి వధ జరుగుతుందని కడియం వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేలా కృషి చేస్తానన్నారు. -
నవ్య ఎపిసోడ్.. ‘ఆడియోలు, వీడియోల’పై రాజయ్య సవాల్
సాక్షి, జనగామ: జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరోక్షంగా స్పందించారు. ఈ వ్యవహారంలో గోబెల్స్ ప్రచారం నమ్మవద్దని రాజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఆడియోలు వీడియోలు ఉన్నాయని అంటున్నారు. వారికి ఛాలెంజ్ చేస్తున్నా.. ఆరోపణలను కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే పరువు నష్టం దావా వేస్తా. సైబర్ నేరం కింద జైలుకు పంపిస్తా. నేను ప్రజాజీవితంలో ఉన్నాను. ఎమ్మెల్యే రాజన్న అంటే ఓ ప్రజా నాయకుడు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపైనా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్కౌంటర్ల సృష్టికర్త. పార్టీ నుంచి బహిష్కరించనవారే కడియం వెంట ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కడియంను సస్పెండ్ చేయాలి. ఆంధ్రాకు చెందిన దూదేకుల వ్యక్తిని పెళ్లి చేసుకున్న కడియం కుమార్తె ఎస్సీ కాదు.. బీసీ కులానికి చెందుతుంది. సకల జనుల సమ్మెలో భాగంగా నేను రాజీనామా చేశాను.. కానీ, శ్రీహరి మాత్రం అలా చేయలేదు. ఇదే క్రమంలో ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటాను అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ‘సర్పంచ్ నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవు’ -
రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
-
ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు
సాక్షి, జఫర్‌గఢ్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య పై ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలపై నిజానిజాల ఆధారంగా ప్రభుత్వం, పార్టీపరంగా చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొ న్నారు. ఆయన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను ఓ విలేకరి ప్రస్తావించగా.. శ్రీహరి సమాధానమిస్తూ.. రాజయ్యపై వచ్చిన ఆరోపణలపై పోలీసు విచారణ జరుగుతోందని చెప్పారు విచారణలో తేలిన అంశాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలుంటాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజయ్య వేధింపులపై ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు జానకిపురం సర్పంచ్ నవ్య. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య, సరైన ఆధారాలతో రేపు మహిళా కమిషన్‌ను కలుస్తానని తెలిపారు. బెదిరింపు కాల్స్, అసభ్యకరంగా మాట్లాడే కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీపీ కవితతో తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజాయితీగా పోరాడతానని స్పష్టం చేశారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి గుణపాఠం కావాలనే తాను పోరాడతానని నవ్య చెప్పారు. ఎమ్మెల్యే వేధించిన ఆధారాలు అవసరమైనప్పుడు బయటపెడతానని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఐదు జిల్లాలపై సర్కార్ ఫోకస్.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు! -
నేను సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా..
నేను సీఎం కేసీఆర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా.. ఆత్మీయ సమావేశాలకు నియోజకవర్గాలకు ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్‌చార్‌్జలుగా నియమించారు.. నల్గొండకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వడం వల్లే పిలవడం లేదు. నియోజకవర్గానికి చెందిన రాష్ట్రస్థాయి, ఇతర పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఒక్కో సమావేశానికి అతిథులుగా పిలుస్తున్నాము. 4వ తేదీ స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగే క్లస్టర్–1 ఆత్మీయ సమావేశానికి కడియం శ్రీహరిని ఆహ్వానిస్తున్నాం. – డాక్టర్ టి.రాజయ్య, ఎమ్మెల్యే స్టేషన్‌ఘన్‌పూర్ సీఎం ఆదేశాలను స్థానిక నాయకత్వం ఖాతరుచేయడంలేదు. ఎన్నికల్లో నాకు సహాయం చేయమని ఎమ్మెల్యే రాజయ్య అనడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి సొంత డబ్బు పెట్టి పని చేశాను. పల్లా్ల రాజేశ్వర్‌రెడ్డి కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా మీరు ఒక్కరే నా ఎన్నికలకు పని చేశారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సభలు, సమావేశాలు ఉన్నప్పుడు సహాయం తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలకు నన్ను ఆహ్వానించడం లేదు. ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలి. – కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్యల మధ్య మాటల మంటలు చల్లారడం లేదు. మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన ఆధిపత్య పోరు రోజురోజుకూ రాజుకుంటోంది. హైకమాండ్ పలుమార్లు కలుగజేసుకుని ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరిపినా తాత్కాలికమే అయ్యింది. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో షోడషపల్లిలో కేటీఆర్ సభ తర్వాత అంతా సద్దుమణిగిందని అందరూ భావించారు. అయితే ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రి ఆదేశాలను స్థానిక నాయకత్వం ఖాతరుచేయడంలేదు.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఆత్మీయ సమావేశాలకు నాకు సమాచారం ఇవ్వడం లేదు’ అంటూ పరోక్షంగా ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించిన వ్యాఖ్యలు మళ్లీ వివాదాలకు తెర లేపాయి. మూడేళ్లుగా ‘స్టేషన్’లో ఆధిపత్యపోరు.. ఒకే పార్టీలో స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండు గ్రూపుల ప్రతినిధులవుతున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు మొదటి నుంచి ప్రత్యర్థులే. కడియం శ్రీహరి టీడీపీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌లో మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయంలో మంత్రిగా సైతం పని చేశారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజయ్య, శ్రీహరి ప్రత్యర్థులుగా పోటీ చేయగా రాజయ్య విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఉన్న శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇద్ద రు ఒకే పార్టీలో కొనసాగుతున్నా.. దాదాపు మూడేళ్లుగా ఆధిపత్యపోరు నడుస్తోంది. 2014 ఎన్నికల తర్వాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం కావడం.. ఆరు నెలల తర్వాత పలు ఆరోపణల నేపథ్యంలో రాజయ్య డిప్యూటీ సీఎం పదవిని పొగొట్టుకోగా, సీఎం కేసీఆర్ కడియం శ్రీహరికి కట్టబెట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అధిష్టానమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ నియామకంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల తర్వాత కేటీఆర్ జోక్యం చేసుకుని రాజయ్య, శ్రీహరిల మధ్య రాజీ కుదిర్చారు. అది కూడా కొద్ది రోజులే కాగా.. మూడేళ్లుగా ఈ ఇద్దరు నేతల గ్రూపుల పోరు యధాతధంగా సాగుతోంది. హైకమాండ్ సీరియస్.. త్వరలోనే నిర్ణయం కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల వివాదంపై బీఆర్ఎస్ అధిష్టానం సైతం సీరియస్‌గానే ఆలోచిస్తున్నదన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదం మొత్తం పార్టీ ఇమేజ్‌పైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో అక్కడక్కడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్యన ఉన్న చిన్న చిన్న విభేదాలను ‘స్టేషన్‌ఘన్‌పూర్’ పాలిటిక్స్ ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదన్న ఇంటిలిజెన్స్ సూచనలను హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధిష్టానానికి తలనొప్పిగా మారిన స్టేషన్‌ఘన్‌పూర్ రాజకీయాలను కట్టడి చేసేందుకు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంటలిజెన్స్ రిపోర్టుతో పాటు ఐదుగురు సీనియర్ ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ వేసి నివేదిక తెప్పించే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లు సమాచారం. -
ఆత్మీయ సమావేశాలకు సమాచారం లేదు: కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాలకు ఆహ్వానం గానీ, అందుకు సంబంధించిన సమాచారం గానీ తనకు అందలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఎన్నికల సమయంలో, పార్టీ బహిరంగ సభల సమయంలో నా సహాయం కోసం వస్తున్నారే తప్ప ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలని అధిష్టానం సూచించిందని...అయితే స్థానిక నాయకత్వం సీఎం కేసీఆర్ ఆదేశాలను ఖాతరుచేయకుండా తనకు సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం సొంత ఖర్చులతో కష్టపడి పనిచేశామని, ఆయన ఎన్నికల్లో సహకరించాలని కోరగా సీఎం ఆదేశాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేశానని గుర్తు చేశారు. అదేవిధంగా 2015, 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశామని తెలిపారు. కడియంను ఆహ్వానిస్తా: ఎమ్మెల్యే రాజయ్య చిల్పూరు: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే 14 ఆత్మీయ సమావేశాల్లో భాగంగా సోమవారం శివునిపల్లిలో జరిగే సమావేశానికి కడియం శ్రీహరిని ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య వెల్లడించారు. పలువురు కడియం శ్రీహరిని ఆహ్వానించలేదని అనుకుంటున్నారని అందులో వాస్తవం లేదన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల పరిధి వెంకటాద్రిపేటలో దుర్గామాత, మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరైన రాజయ్య మాట్లాడుతూ...కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఒక్కో నియోజకవర్గానికి ఎమ్మెల్సీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి కోటిరెడ్డిని, కడియంను నల్లగొండకు నియమించారని, మొదట ధర్మసాగర్లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. -
స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్లో వర్గ పోరు
వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలే. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. ఇద్దరూ దళిత నేతలే. కాని వారిద్దరికి అసలు పడదు. మాటల తూటాలతో గులాబీ కోటలో కలకలం సృష్టిస్తున్నారు. తప్పు చేయలేదు.. తలవంచను అని ఒకరంటే, సీఎం కేసిఆర్‌కు వీరవిధేయుడిని తానేనంటు మరో నాయకుడు అంటున్నారు. ఓరుగల్లు గులాబీ కోటలో రాజకీయ దుమారం రేపుతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఏమిటా కథ? ఓరుగల్లులోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలు..ప్రతి విమర్శలు సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు కామనే. కానీ స్టేషన్ ఘనపూర్ లో అధికార బీఆర్ఎస్ నేతల మధ్యనే కొంతకాలంగా పొలిటికల్ కోల్డ్ వార్ సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి. గతం నుంచీ రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికి ప్రస్తుతం అధికార బిఆర్ఎస్లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు. ఒకరిపై ఒకరు సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు. కడియం శ్రీహరి సంయమనంతో రాజకీయ చక్రం తిప్పుతుండగా రాజయ్య మాత్రం దూకుడుగా వ్యవహరిస్తు అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టిస్తున్నారు. లింగాల ఘనపురంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ తప్పు చేయను, ఎవరికి తలవంచను.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పాదాభివందనం చేయనని స్పష్టం చేశారు. ఇటీవల కేసిఆర్‌కు రాజయ్య పాదాభివందనం చేయడంతో.. తప్పు చేసిన వాళ్ళే తలవంచి పాదాభివందనం చేస్తారంటూ చేసిన కామెంట్స్.. రాజయ్యను ఉద్దేశించి చేసినవే అనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత రాజయ్య సైతం తానేమి తక్కువ కాదని కొత్తకొండలో శ్రీహరిని ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ నాదే... గెలుపు నాదేనని స్పష్టం చేశారు. కేసిఆర్ నిర్ణయాలకి.. ఆయనకు వీరవిధేయుడు ఎవరంటే తానేనని, త్యాగం చేసిన వ్యక్తిని కూడా తానేనని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కేసిఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయన్నారు. ఈ కామెంట్స్ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం, ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. మళ్లీ సిట్టింగ్‌లకే సీట్లు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో రాజయ్య వర్గం సంబురంగా ఉంటే, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, మచ్చలేని నేత కడియం శ్రీహరికే స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాబోతోందని ఆయన వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి చరిష్మా ఉన్న నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మింగుడుపడటం లేదు. టార్గెట్ స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ అన్నట్లుగా కడియం శ్రీహరి పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే రాజయ్య పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం సంతృప్తిగా లేరని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా సార్కే టికెట్ వస్తుందంటూ కడియం వర్గీయులు బహిరంగగానే వ్యాఖ్యానిస్తున్నారు. కడియం రాజకీయ వైఖరి, ధోరణి కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేవిధంగానే ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడమే కాదు.. అన్ని కార్యక్రమాల్లోనూ కడియం హవా కనిపిస్తోంది. రాజయ్య వర్గం నుంచి కొంతమందిని ఇటీవల కడియం వైపు తిప్పుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తన అనుకూలతలను అధిష్ఠానానికి చాటేందుకే కడియం అవుట్ రైట్ స్ట్రాటజీతో స్పీడ్ పెంచినట్లుగా పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇద్దరి రాజకీయ పరిస్థితి తయారైంది. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కోసం ఇద్దరు నేతలు ఆధిపత్య ప్రదర్శనలకు దిగుతుండడంతో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. వీరివల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ తమ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఆ నియోజకవర్గ కేడర్ కోరుతోంది. -
మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పోరు.. గులాబీ బాస్ ఆరా.. అక్కడ ఏం జరుగుతోంది?
అక్కడ సీఎంగా చంద్రబాబు, ఇక్కడ కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో 361మంది నక్సలైట్లను పొట్టనబెట్టుకున్నారు. ఒక్క స్టేషన్ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారు. గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం పిలుపుమేరకు కడియం వేసిన శిలాఫలకాలకు నేనే స్వయంగా పిండాలు పెట్టా. కేవలం పదవుల కోసం ఇక్కడికి వస్తున్నారు.. ఓటమి చెందగానే కనిపించకుండా పోతారు. స్టేషన్ఘనపూర్ నా అడ్డా .. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోను. – చిన్నపెండ్యాలలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒకేపార్టీలో పనిచేస్తున్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. క్రమశిక్షణ కూడిన పార్టీలో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నా.. స్టేషన్ ఘన్పూర్ నా గడ్డ అని చెప్పుకుంటున్న నువ్వు, నేను కలిసి నియోజకవర్గంలో ఓ సర్వే నిర్వహిద్దాం. ప్రజల తీర్పునకు కట్టుబడి ఉంటావా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పని చేస్తున్నా.. భవిష్యత్‌లో కూడా సీఎం ఆదేశాల మేరకు పని పనిచేస్తా.. ఎన్కౌంటర్లను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. – స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సాక్షిప్రతినిధి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల పోరు ముదిరి పాకాన పడింది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడం గులాబీ గూటిలో కలకలం రేపుతోంది. నర్మగర్భంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే ఇద్దరు నేతలు.. ఇప్పుడో అడుగు ముందుకేశారు. సోమవారం చిల్పూరులో ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ శ్రీహరి మంగళవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు వాగ్భానాలు వదలడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండు గ్రూపులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజయ్య, శ్రీహరిలు.. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో సుమారు ఆరు నెలల కిందట మళ్లీ ఎమ్మెల్సీగా నియమితులైన కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఇదే సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ రాబోతుందన్న శ్రీహరి ప్రచారం కూడా చేసుకుంటున్నారని ఎమ్మెల్యే రాజయ్య తప్పుబట్టారు. తాజాగా సోమవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య... చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఎన్కౌంటర్లలో స్టేషన్‌ఘన్‌పూర్ దళిత బిడ్డలు ఎక్కువగా చనిపోయారని వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి తెర తీసింది. స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని .. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోను అని కామెంట్ చేయడంపై మంగళవారం మీడియా సమావేశంలో స్పందించిన కడియం శ్రీహరి.. ‘ప్రజల మద్దతు కోల్పోతున్న నువ్వు నాపై తీవ్ర ఆరోపణలు చేస్తావా’అని ప్రశ్నించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎవరి అడ్డా కాదన్నారు. చదవండి: అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా? రాజయ్యకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానంతో చెప్పుకోవాలని అన్నారు. దీనిపై మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన రాజయ్య తాను ప్రభుత్వాల తీరుపై మాట్లాడే క్రమంలో టీడీపీ, చంద్రబాబు హయాంలో ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. ‘అవును ముమ్మాటికీ స్టేషన్‌ఘన్‌పూర్ అడ్డా.. నా గడ్డా... ఇక్కడే చదువుకున్నా.. ఇక్కడే వైద్యం చేశా.. నేను చస్తే కూడా నా సమాధి ఇక్కడే’ అంటూ వ్యాఖ్యానించారు. తారస్థాయికి చేరిన విభేదాలు ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్యల మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఒకే పా ర్టీలో ఉన్న ఇద్దరి మధ్య కొంతకాలంగా ఆధిప త్య పోరు కొసాగుతోంది. ఎమ్మెల్యేగా తాడికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా... ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంనే ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన యాత్ర అప్పటి నుంచి ఉప్పు.. నిప్పులా ఉన్న వారిద్దరి మధ్య విభేదాలు ఇటీవల పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. ‘స్టేషన్ ఘన్పూర్’ వార్’పై అధిష్టానం ఆరా.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరిల మధ్య జరిగిన వార్‌పై పార్టీ అధిష్టానం మంగళవారం ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన నలుగురు ముఖ్య నేతలు, ఓ మంత్రిని తాజా వివాదంపై హైదరాబాద్‌నుంచి ఓ కీలక నేత వివరాలు అడిగినట్లు తెలిసింది. పార్టీకి తలనొప్పిగా మారిన ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. -
కడియం శ్రీహరి నా మీద చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎమ్మెల్యే రాజయ్య
-
స్టేషన్ ఘన్పూర్ పక్కా నా అడ్డానే: రాజయ్య
సాక్షి, వరంగల్: తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి తనపై చేసిన అభియోగాలపై తీవ్రంగా స్పందించారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మంగళవారం సాయంత్రం వరంగల్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. ఈ వ్యవహారంపై స్పందించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పక్కా నా అడ్డానే. కడియం శ్రీహరి నా మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. 14 ఏళ్లుగా మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏం చేశారు?. కడియం తీరు గురువింద సామెతలా ఉంది. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. కడియం శ్రీహరికి దళిత దొర అనే పేరుంది. అవినీతితో ఆస్తులు సంపాదించింది ఆయనే. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్సార్ నాకు రాజకీయ గురువు. అలాగే.. కేసీఆర్ తనకు దేవుడని, ఆయన ఆశీస్సులతో కాళోజీ హెల్త్ యూనివర్సిదొటీ తేవడంతో పాటు గ్రాస్ రూట్లో ఉన్న వైద్యవిధానాన్ని.. క్షేత్రస్థాయిలో చూశా గనుక ప్రక్షాళన చేయాలని ఆనాడు ప్రయత్నించానని రాజయ్య చెప్పుకొచ్చారు. కాకిలా కలకలం కాకుండా.. కోకిలలా కొంతకాలం ఉండి ప్రజామెప్పు పొందానని అన్నారు. రాజకీయ ఆరోపణలు.. విమర్శలు, మీడియాలో వచ్చిన అసత్య కథనాలతో తెలంగాణ అభాసుపాలు కావొద్దన్న ఉద్దేశంతో.. కేసీఆర్ వీరవిధేయుడిగా ఆయన మాట మీద ఆనాడు పదవి నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు రాజయ్య. ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు చేయగా, కౌంటర్‌గా ఇవాళ కడియం మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నీ జాగిరి కాదు అంటూ రాజయ్యపై మండిపడ్డారు. ఇదీ చదవండి: ‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్ -
కడియం శ్రీహరిపై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య
-
‘ఒళ్లు దగ్గర పెట్టుకో..’ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి ఫైర్
సాక్షి, జనగామ: స్టేషన్ ఘనపూర్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ గడ్డ నీ అడ్డా జాగిరి కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చిల్లర పనులు చిలిపి చేష్టలు పనికిరావన్నారు. ‘తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకునే రాజయ్య, దేశంలో బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం ఘనత ఆయనదే. రాజయ్య తప్పు చేస్తూ తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన అవినీతిపై ఆధారాలు బయటపెడితే గ్రామాల్లో తిరగలేడు. నేను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అన్ని మూసుకొని ఉంటున్నాను. మోసం చేసే అలవాటు, వెన్నుపోటు పొడిచే ఉద్దేశం నాకు లేదు. కేసీఆర్ నాయకత్వంలో వారి ఆదేశం మేరకు స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. రాజయ్యకు సూటిగా సవాల్ చేస్తున్నాను. స్టేషన్ ఘనపూర్ నీ అడ్డ అయితే పార్టీ ప్రస్తావన లేకుండా స్వచ్ఛంద సంస్థతో సర్వే చేపిద్దాం. ప్రజలు రాజయ్యను కోరుకుంటున్నారా.. శ్రీహరిని కోరుకుంటున్నారా? సర్వే రిపోర్ట్ తేల్చుతుంది. సర్వే రిపోర్టుకు కట్టుబడి ఉంటావా? నా సవాల్‌కు స్పందించు. డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకునే పరిస్థితి వద్దు. నా సవాల్‌కు సిద్ధం కాకపోతే ఎక్కడైనా నా ప్రస్తావన తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తున్నా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజయ్య వ్యవహారంపై ఉమ్మడి జిల్లా మంత్రులు, హనుమకొండ జనగామ జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. పార్టీ అధిష్టానం అన్ని గమనిస్తోందని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కు.ని. ఆపరేషన్లు వికటించి మరో ఇద్దరు మృతి.. హైవేపై భారీ బందోబస్తు -
360 మందిని ఎన్కౌంటర్ చేయించాడు.. కడియంపై కస్సుమన్న రాజయ్య
చిల్పూరు: కడియం శ్రీహరి టీడీపీ హయాం నుంచి అతనికి గిట్టని వారిని ఎన్కౌంటర్లు చేయించాడని, ఒక్క నియోజకవర్గంలోనే 360 మంది అమాయకులను చంపించాడని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం ఆయన కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయ గురువు వైఎస్సార్ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్ దేవుడని, నియోజకవర్గానికి తాను పూజారినని, ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఎప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని.. ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం చేశారు. -
‘బండి సంజయ్’ ఓ మూర్ఖుడు
సాక్షి, హన్మకొండ: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ మూర్ఖుడు. సీఎం కేసీఆర్‌పై వాడుతున్న భాష అభ్యంతరకరం’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌తో కలిసి కడియం శ్రీహరి మాట్లాడారు. బండి సంజయ్‌కి చదువురాదు. ఒక సీఎం అయి ఉండి మరో సీఎంపై ఎలా మాట్లాడాలో తెలియదా అని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మను ఆయన ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే కిషన్‌రెడ్డి పారిపోయారని, ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్ దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే అవకాశముందని, ఈ క్రమంలో కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ దాడి చేస్తోందని విమర్శించారు. 317 జీఓ పై వరంగల్‌లో బీజేపీ నిరసన సభ పెడితే ఏ ఒక్క ఉద్యోగ సంఘమైనా, ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. మేడారంకు జాతీయ హోదా తీసుకువచ్చారా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో మేడారం జాతరకు రూ.332 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రత్యేక నిధులు తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బీజేపీ దేశ వ్యాప్తంగా ఉనికిని కోల్పోతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పై బీజేపీ నాయకులు అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు: కడియం
హబ్సిగూడ: ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, దాటవేసే ధోరణి అవలంభిస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో హబ్సిగూడలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గువ్వల బాలరాజు, ఆరూరి రమేశ్ హాజరయ్యారు. కడియం మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌర వం కోసం అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబర్ 13న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
కడియం శ్రీహరి - రాజయ్య మధ్య మాటల యుద్ధం
-
‘దళితబంధు’పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్: టీఆర్ఎస్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే టీఆర్ఎస్కే నష్టమని అన్నారు. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేకపోవచ్చని తెలిపారు. దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయం అంశంగా మారాయి. -
ఆశావహుల్లో ఉత్కంఠ.. గుత్తా, కడియంలకు మళ్లీ చాన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో స్థానం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల మొదటి వారంలో పూర్తయ్యింది. అలాగే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా ఈ నెల 17న పూర్తయ్యింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాలకు గత నెల మూడో వారంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎన్నిక తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నవారు మాత్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. గుత్తా, కడియం ముందు వరుసలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆరుగురిలో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఇదే కోటాలో తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్నారు. వీరిలో గుత్తా సుఖేందర్ రెడ్డికి మళ్లీ అవకాశం కల్పించి మరోసారి మండలి చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని లేదా మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కడియం శ్రీహరికి కూడా ఎమ్మెల్సీగా తిరిగి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం వరంగల్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కడియం ఇంట్లో భోజనం చేశారు. మరోవైపు రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం స్తబ్దుగా ఉన్న కడియం ఇటీవలి కాలంలో తరచూ సీఎంను కలుస్తున్నారు. కడియంకు తిరిగి ప్రాధాన్యత దక్కుతుందనడానికి ఇవి సంకేతాలుగా చెబుతున్నారు. భారీగానే జాబితా మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల జాబితా భారీగానే ఉంది. పద్మశాలి, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజికవర్గ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, తక్కల్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పీఎల్ శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి, శుభప్రద పటేల్ వంటి వారు ఆశావహుల జాబితాలో ఉన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరే పక్షంలో ఆయనకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని సమాచారం. గవర్నర్ కోటాలో సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపైనే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. చదవండి: ప్రజాసేవకు పదవులు అవసరం లేదు: కడియం శ్రీహరి Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్ఎస్, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్ ఎందుకిలా! -
ప్రజాసేవకు పదవులు అవసరం లేదు: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కడియం శ్రీహరి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్, అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని ధ్వజమెత్తారు. తనకి రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా, లేకున్నా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యం అన్నారు. ప్రజలకు మేలుచేసే పనులు ఎవరు చేసిన స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. పార్టీకి కట్టుబడి మాత్రమే ఉంటామని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి నిజాయితీగా పని చేస్తాడని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటాడని ప్రజల్లో తనకు గుర్తింపు ఉందన్నారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేని వారు హడావుడి చేయడం విడ్డురంగా ఉందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. చదవండి: కేసీఆర్ వరంగల్ పర్యటన: ఆ రోజు ఏం జరిగింది? కూకట్పల్లి: ఆట మధ్యలో ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య -
కడియం పై రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఎమ్మెల్యే రాజయ్య పై కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
-
కడియం శ్రీహరి మస్తున్నయ్ మీ కూరలు
హన్మకొండ: సీఎం వరంగల్ పర్యటన సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా మటన్, తలకాయ కూర, చికెన్‌తోపాటు చేపలు, రొయ్యల ఫ్రై, నాటుకోడి పులుసు, చికెన్ దమ్ బిర్యానీ చేయించారు. శాకాహారంగా పెసరపప్పు టమాటా, బీరకాయ కూర, బెండకాయ ఫ్రై, టమాటా– పుదీనా పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి, రైతా, పెరుగు, ఫ్రూట్ సలాడ్, మరో స్వీట్ సిద్ధం చేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భోజనానికి హాజరైన సీఎం కేసీఆర్.. అందులో పలు వంటలు రుచిచూసి చివరగా దానిమ్మ జ్యూస్ తాగారు. అన్ని వంటలు బాగున్నా యని, ఎప్పుడు వరంగల్ వచ్చినా భోజనానికి శ్రీహరి ఇంటికే రావాలని ఉందని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మనవరాలు అన్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా.. చిన్నారిని కేసీఆర్ ఆశీర్వదించారు. -
‘ఈటలకు తొలిరోజే అవమానం’
హన్మకొండ: మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీలో చేరిన రోజే జరిగిన అవమానం చూస్తుంటే జాలి కలుగుతోందని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామూలు నాయకులు చేరితేనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని.. కానీ ఈటల వెళ్తే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పంపారని పేర్కొన్నారు. ఆస్తులు కాపాడుకోవడానికి రాజేందర్ బీజేపీలో చేరారని విమర్శించారు. తాను వామపక్ష భావాలు కలిగిన వాడినని, సోషలిస్టునని చెప్పుకునే ఈటల.. బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో రాచరికపు పాలన, ఫ్యూడల్ మనస్తత్వం కనపడటం లేదా అని ప్రశ్నించారు. రూ.వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, గడీని మించిన ప్యాలెస్, రూ.లక్షల వ్యయంతో వివాహాలు జరిపించావంటేనే ఈటలలో ఫ్యూడల్ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయో అర్థమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం చెల్లదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు ఏకైక బాహుబలి అని, ఇంకో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్కు తిరుగులేదని కడియం చెప్పారు. -
'నా అనుమతి లేనిదే నియోజకవర్గానికి రావద్దు'
సాక్షి, వరంగల్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వ్యాఖ్యలు మరోసారి వివాదస్పదంగా మారాయి. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన చేసిన హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించినవనే చర్చ మొదలైంది. ‘ఎమ్మెల్యేకు తెలియకుండా ఎమ్మెల్సీ, ఎంపీ, జడ్పీ చైర్మన్, మంత్రి.. ఇలా ఎవరూ నియోజకవర్గాలకు రావొద్దు.. వారంతట వారే వస్తే గ్రూపు రాజకీయాలను ప్రోషించినట్లుగా భావించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.. పార్టీ గమనిస్తోంది.. ఎంతటి నాయకులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఈసారి ఆయన తన స్వరాన్ని మరింత పెంచారు. ఇంతకాలం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య నెలకొన్న విబేధాల కారణంగా ఒకరిపై పరోక్ష వ్యాఖ్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నా యి. అయితే సోమవారం రాజయ్య మాట్లాడుతూ తన ఆహ్వానం లేనిదే నియోజకవర్గంలో ఎవరూ తిరగొద్దంటూ వివిధ పదవుల్లోని ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడడంతో ఈసారి ఆయన ఎవరినీ హెచ్చరించినట్లన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతోంది. అధికార పార్టీలో కలకలం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కలకలం రేపాయి. నియోజకవర్గానికి ఎవరు రావాలన్నా ఎమ్మెల్యే అనుమతి తప్పని సరని ఆయన హుకూం జారీ చేయడం గమనార్హం. ‘పార్టీలు, నాయకులకు అభిమానులు ఉండొచ్చు. కానీ, దానిని అడ్డం పెట్టుకుని గ్రూపు రాజకీయాలకు పాల్పడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. (ఆ తేదీనే ఎన్నికలు జరుగుతాయ్: ట్రంప్) సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3 కోట్ల సీడీఎఫ్ నిధులు, రూ. 2.5 లక్షల వేతనం విరాళంగా ఇచ్చానని చెప్పుకొచ్చిన ఆయన.. ఇటీవల హైదరాబాద్‌లో కొందరు చెక్కులు ఇచ్చారని, అక్కడ ఇస్తే సముద్రంలో చెంబుతో నీళ్లు పోసినంత సమానమంటూ చెప్పడంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కొంతకాలంగా గ్రూపు రాజకీయాలు, విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రెండు గ్రూపుల వారిని వేర్వేరు సమయాల్లో తరలించడం అప్పట్లో వివాదస్పదంగా మారింది. అయితే ఈసారి ‘ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మంత్రి.. నిబంధనలు పాటించకుండా వస్తున్న ఎంతటి పెద్ద నేతలైనా వారిపై చర్యలు తప్పవు.. వారంతా ఎమ్మెల్యే కనుసైగల్లో, ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు నియోజవర్గంలోకి రావాలి... అలా కాకుండా ఎవరొచ్చినా గ్రూపు రాజకీయాలకు ప్రోత్సహించినట్లే, గ్రూపు రాజకీయాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించడం గమనార్హం. ‘ఎవరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనేది పార్టీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.. పార్టీల్లో ఉన్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలి.. అందులో అధికార పార్టీకి నిబంధనలు మరింత కఠినంగా ఉంటా యని గ్రహించాలి’ అని సూచించారు. పా ర్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వా జుజరు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని రాజయ్య హెచ్చరించడం టీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. -
టీఆర్ఎస్లో ‘రాజ్యసభ’ లెక్కలు
రాజ్యసభలో 55 స్థానాలకు సంబంధించిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించగా, మార్చి 6వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర కోటాలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి రామ్మోహన్రావు, (బీజేపీ)తో పాటు ఏపీ కోటాలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు రిటైర్ అవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో 55 స్థానాలకు సంబంధించిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించగా, మార్చి 6వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర కోటాలో కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్), గరికపాటి రామ్మోహన్రావు (బీజేపీ)తో పాటు ఏపీ కోటాలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు వచ్చే నెల 26న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదలైంది. అయితే అసెంబ్లీలో సంఖ్యా పరంగా టీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులుండగా, ఐదుగురు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. వీరిలో డి.శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలలో జరిగే ద్వైవార్షిక ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి మరో ఇద్దరు ఎన్నికయ్యే అవకాశం ఉండటంతో రాజ్యసభలో రాష్ట్ర కోటాకు సంబంధించిన ఏడు స్థానాలు టీఆర్ఎస్కు దక్కనున్నాయి. వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థిత్వం ఎవరికి? శాసనసభలో టీఆర్ఎస్కు సంఖ్యా బలం ఉండటంతో పలువురు ఆశావహులు టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్య ర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు మరోమారు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అయితే సంఖ్యా పరంగా పార్టీ తరఫున ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులుండటం కేశవరావు అభ్యర్థిత్వానికి ఆటంకంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో ఒకదానికి మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రెండో స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి ఇస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఎస్సీ సామాజికవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. 2014లో వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై న కడియం ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నా సామాజిక సమీకరణాలతో రాష్ట్ర మంత్రిమండలిలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కడియంను రాజ్యసభకు పంపాలని పార్టీ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇటు ఎస్టీ కోటాలో మాజీ ఎంపీ సీతారాంనాయక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
బోధన.. గుర్తుకొచ్చింది!
సాక్షి, జఫర్‌గఢ్: పూర్వాశ్రమంలో ఆధ్యాపకుడిగా విద్యార్థులకు పాఠాలు భోదించిన కడియం శ్రీహరి తిరిగి ఇంటర్ విద్యార్థులకు పాఠాలు భోదించి ఆధ్యాపకుడి అవతారమెత్తిన ఘటన మండల కేంద్రంలో మోడల్ కళాశాలలో చోటు చేçసుకుంది. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మోడల్ కళాశాలతో పాటు కస్తూర్బా పాఠశాలను కడియం శ్రీహరి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత మోడల్ స్కూల్‌ను సందర్శించిన కడియం శ్రీహరి తరగతి గదిలో ఉన్న విద్యార్థులను చూడగానే నేరుగా క్లాసు రూంలోకి వెళ్లి విద్యార్థులకు పాఠం చెప్పడమే కాకుండా వారిని పలు ప్రశ్నలు అడిగారు. లోక్‌సభ, రాజ్యసభలో సభ్యుల సంఖ్యతో పాటు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరంటూ ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పిన సుస్మిత అనే విద్యార్థినిని అభినందిస్తూ వెయ్యి రూపాయల పారితోషికాన్ని అందించారు. అనంతరం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే మోడల్ స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కడియం శ్రీహరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నింటినీ రెండు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బత్తిని రాజేందర్, డీఈ జెయాకర్, పాఠశాలల ప్రిన్సిపాళ్లు శ్రీకాంత్, సీహెచ్.స్వప్న, సర్పంచ్ నర్సింగరావు, విద్యాకమిటీ చైర్మన్ జయశంకర్, టీఆర్ఎస్ నాయకులు బానోత్ రాజేష్‌నాయక్, అన్నం బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, నాయకులు కుల్లా మోహన్‌రావు, మారపల్లి ప్రభాకర్, కుల్లా నర్సింగంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్య దర్శులతో ఆయన భేటీ అయ్యారు. 60 లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే టీఆర్ఎస్ బలమైన పార్టీల్లో ఒకటిగా నిలిచిందని, సంస్థాగత బలంతో ప్రభుత్వ కార్య క్రమా లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 50 లక్షల సభ్యత్వాల డిజిటలైజేషన్ పూర్తయిందని, మరో 10 లక్షల మంది కార్యకర్తల వివరాల కంప్యూట రీకరణ కొనసాగుతోందని వెల్లడించారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయితో పాటు అన్ని రకాల సంస్థాగత కమిటీల నిర్మాణం ఈ నెల 15లోగా పూర్తి చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణంపై జిల్లాల వారీగా కేటీఆర్ సమీక్ష నిర్వహిం చారు. చాలా జిల్లాల్లో కమిటీల నిర్మాణం పూర్తయిన విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కేటీఆర్ దృష్టికి తెస్తూ.. కమిటీల వివరాలను కేటీఆర్‌కు సమర్పించారు. మున్సిపాలిటీల వారీగా సేకరించిన వివరాల నివేదికను ప్రధాన కార్యదర్శులు కేటీఆర్‌కు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల్లో విజయం సాధించేలా ఎమ్మెల్యేలు స్థానిక పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలన్నారు. త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కేటీఆర్‌తో కడియం, నాయిని భేటీ తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ ముఖ్య నేతలు బుధవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరి,తాటికొండ రాజయ్య, నాయిని నర్సింహారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ముఖ్య నేతలకు సీఎం త్వరలో కీలక పదవులు అప్పగిస్తారనే వార్తలతో పాటు, ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు నేతలు కేటీఆర్‌ను కలిశారు. మంత్రివర్గంలో మాదిగలకు ప్రాతినిథ్యం లేదని తాటికొండ రాజయ్య వ్యాఖ్యనించగా, తనకు మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం మాట తప్పారంటూ నాయిని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరోవైపు కడియంకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ భవన్లో ఘన స్వాగతం రెండోసారి రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడంతో.. టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేతృత్వంలో కార్యకర్తలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్.. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్, అసెంబ్లీలో విప్‌లుగా నియమితులైన బోడకుంటి వెంకటేశ్వర్లు, కర్నె ప్రభాకర్, భాను ప్రసాదరావు, బాల్క సుమన్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
నువ్వానేనా.. కడియం వర్సెస్ రాజయ్య!
సాక్షి, వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య మధ్య నెలకొన్న విబేధాలు మరోమారు బయటపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పార్టీ వర్గాలను తీసుకెళ్లే విషయంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సాగుతున్న ఆధిపత్య పోరు బట్టబయలైంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టి.రాజయ్య కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం పోటీపోటీగా తేదీలను ఖరారు చేసి, పోస్టర్లు, ఫ్లెక్సీలను విడుదల చేయడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులను కాళేశ్వరం బాట పట్టించే క్రమంలో వేర్వేరు తేదీలను ఖరారు చేయడం వివాదస్పదమవుతోంది. ఆది నుంచి ప్రత్యర్థులే.. ఒకే పార్టీలో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి రెండు గ్రూపుల ప్రతినిధులుగా ఉన్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మొదటి నుంచి ప్రత్యర్థులే. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి టీడీపీ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయంలో మంత్రిగా సైతం పని చేశారు. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజయ్య తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో రాజయ్య, కడియం శ్రీహరి ప్రత్యర్ధులుగా పోటీ చేయగా రాజయ్య విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరగా.. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా ఇరువురు నేతలు, వారి అనుచరుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణమే నడిచేది. 2014 ఎన్నిక ల తర్వాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎం గా నియమితులయ్యారు. ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగిన రోజుల్లో కడియం శ్రీహరి అనుచరులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆరు నెలల తర్వాత వివిధ కారణాలతో రాజయ్యను తొలగించగా.. అదే పదవిని సీఎం కేసీ ఆర్ కడియం శ్రీహరికి కట్టబెట్టారు. అధిష్టానమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నా.. ఈ ఇద్ద రి మధ్య విభేదాలకు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిప్యూటీ సీఎంగా కొనసాగినన్నిరోజులు కడియం శ్రీహరి నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికలకు ముందు కడి యం వర్గీయులు టీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన సభతో కార్యక్రమాలను నిర్వహించారు. ఆ ఆవేదన సభలు కూడా ఇరువర్గాల మధ్య విభేదా లను మరింతగా పెంచాయి. దీంతో కేటీఆర్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. రాజయ్యనే రుగా వెళ్లి తనకు సహకరించాలని కడియం శ్రీహరిని కలి సి వేడుకున్నారు కూడా. అయితే, ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పని చేయగా రాజయ్య విజయం సాధించారు. ఎన్నికల సమయం నుంచి రెండు వర్గాల మధ్య అంతా బాగానే ఉన్నట్లుగా అనిపించినా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలతో పొరపొచ్చాలు వెలుగుచూశాయి. టిక్కెట్లు కేటాయించిన విధానం ద్వారా రాజయ్య పూర్తిగా కడియం శ్రీహరి అనుచరులకు చోటు కల్పించలేదన్న వాదన బలపడింది. ఆ తర్వాత నుంచి మళ్లీ గ్రూపుల పోరు యథాతధమైంది. మరోసారి బహిర్గతం ఎమ్మెల్యేగా తాడికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించారు. ఇలా ఇద్దరి నేతల మధ్య ఇప్పటికే ఆధిపత్య పోరు కొనసాగుతుండగా తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య అంతరాన్ని మరోసారి బహిర్గతం చేస్తోంది. ముందుగా కడియం శ్రీహరి ఈనెల 4న నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కాళేశ్వరం సందర్శన యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అంతకుముందే అంటే 1వ తేదీనే కాళేశ్వరం సందర్శన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఒకే నియోజకవర్గం నుంచి రాజయ్య, శ్రీహరి వేర్వేరు తేదీల్లో కాళేశ్వరం యాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. -
బాటలు వేసిన కడియం.. భారీ షాక్ ఇచ్చిన ఎర్రబెల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ(టీటీడీపీ) దుకాణం ఇక మూతపడినట్లే. పలువురు తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాలో టీడీపీ ప్రాబల్యం రోజురోజుకు తగ్గిపోగా.. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరీ చిక్కిశల్యమైంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా భవిష్యత్ ఉన్న పలువురు నేతలు ఆ పార్టీలో ఉంటే మనుగడ సాధించలేమన్న ఉద్దేశంతో మారుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా భూపాలపల్లి, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల టీడీపీ అధ్యక్షులు, పలువురు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఆదివారం కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాత సీనియర్లు ఒక్కరొక్కరుగా టీడీపీని వీడుతుండటంతో ఆ పార్టీలో చివరకు ఎవరు మిగులుతారన్న చర్చ మొదలైంది. బాటలు వేసిన కడియం.. భారీ షాక్ ఇచ్చిన ఎర్రబెల్లి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగా ఉన్న కడియం శ్రీహరి టీడీపీ నుంచి బయటపడ్డారు. 2013 మే 11న ఆ పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు వైఖరిపై విసిగి వేసారిన ఎర్రబెల్లి దయాకర్‌రావు టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 2015 జులై 21న టీఆర్ఎస్లో చేరారు. ఏకంగా ఆయన టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసి ఆ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి టీడీపీ నుంచి ఇతర పార్టీలకు మొదలైన వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఆయన వెంట ఉమ్మడి వరంగల్‌కు చెందిన సీనియర్ నాయకురాలు ధనసరి అనసూయ(సీతక్క), మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి నడిచారు. ఫలితంగా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి వరంగల్ వరుస వలసలతో దయనీయ పరిస్థితికి చేరుకుంటోంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజురోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను ఒక్క వరంగల్ పశ్చిమ నుంచే పోటీ చేసిన ఆ పార్టీ ఓటమి పాలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సరేసరి కాగా.. పంచాయతీరాజ్ ఎన్నికలతో పాటు పార్టీ రహితంగా జరిగిన గ్రా మ పంచాయతీల ఎన్నికలు.. ఇలా ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ కనీసం ఉనికిని చాటలేకపోయింది. పార్టీలో మిగిలిన సీనియర్ ప్రకాశ్‌రెడ్డి నాయకుడు లేని నావలా తయారైన తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నర్సంపేట నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. ఆయన కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగినా.. స్పష్టత లేదు. అయితే, దీనిని ఆయన ప్రచారంగానే కొట్టిపారేస్తుండగా... పార్టీ సీనియర్‌గా ఆయనొక్కరే టీడీపీకి ఇప్పుడు పెద్దదిక్కుగా మిగిలినట్లయింది. ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగే బహిరంగసభలో పలువురు టీడీపీ సీనియర్లు పెద్ద సంఖ్యలో కాషాయ కండువాలు కప్పుకోనున్నట్లు తెలిసింది. కాగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పుల్లూరు అశోక్‌కుమార్, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ రఘునాథరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున వారి అనుచరులతో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు వీరంతా కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేసి లేఖను అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలో ఆదివారం జరగనున్న సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షాన ఆ పార్టీలో చేరనున్నామని కూడా వారు ప్రకటించారు. -
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి జయరామ్, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం కోన రఘుపతి మాట్లాడుతూ... స్పీకర్ స్థానాన్ని కోడెల శివప్రసాదరావు దుర్వినియోగం చేశారని విమర్శించారు. కోడెలపై సొంతపార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చని అన్నారు.మంత్రి జయరాం మాట్లాడుతూ... గ్రామ వాలంటర్లు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాల బిల్లు తెచ్చామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడం శుభపరిణామం అని కడియం శ్రీహరి అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు జేఈవో ధర్మారెడ్డి తెలిపారు. శనివారం 95వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అధిక రద్దీ వద్ద సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు జేఈవో తెలిపారు. కాగా శ్రీవారికి హుండీ ఆదాయం ద్వారా రూ.2.61 కోట్లు లభించాయి. మరోవైపు తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం నుంచి 13వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండోరోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. -
‘పార్టీ బలోపేతం కేటీఆర్‌తోనే సాధ్యం’
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించబడ్డ కేటీఆర్‌కు మాజీ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేకు కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన తెలంగాణ సీఎంకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండలోని తన నివాసంలో ప్రెస్మీట్లో శ్రీహరి మాట్లాడుతూ.. ‘కేటీఆర్‌కు శుభాకాంక్షలు. 2009 నుంచి నేటి వరకూ కేటీఆర్ తన సమర్ధతో పార్టీలో క్రియాశీల పాత్రను పోషించారు. సిరిసిల్ల ప్రజల మనుసు గెలిచిన వ్యక్తి కేటీఆర్. రాష్టంలో పరిశ్రమల, ఐటీ శాఖలలో సమూల మార్పులతో నూతన శకానికి నాంది పలికారు. వారసత్వ రాజకీలయాలకు భిన్నంగా స్వశక్తితో ఎదిగిన నేత కేటీఆర్. కేటీఆర్ నియామకంతో పాటు, పార్టీ ఎదుగుదలకు కావాల్సిన ప్రణాళికను కేసీఆర్ అప్పజెప్పారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కేటీఆర్‌తోనే సాధ్యమవుతుంది. ఉమ్మడి వరంగల్‌లో 12లో 10 స్థానాలను ప్రజలు టీఆర్ఎస్కు అందించారు. జిల్లాలో నీటి ప్రాజెక్టులు, కాకతీయ టెక్స్ట్టైల్ పార్క్, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం చేపడతాం. భూకబ్జాల బాధితులు వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. -
లగడపాటి సర్వేపై కడియం రియాక్షన్
సాక్షి, వరంగల్ : తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడందరూ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి స్పందించారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి రానుందనే లగడపాటి అంచనాల్ని కొట్టిపడేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు టీఆర్ఎస్కు పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ పాలనపట్ల పూర్తి విశ్వాసం వ్యక్తమయిందని తెలిపారు. 75 నుంచి 80 సీట్లు సాధించి టీఆర్ఎస్ మరోమారు అధికారాన్ని చేపట్టనుందని కడియం అభిప్రాయపడ్డారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా టీఆర్ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నాడీని ఏ సర్వేలు పసిగట్టలేవని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11న ప్రజా మద్దతు ఎవరికుందో స్పష్టమవుతుందని అన్నారు. తెలంగాణకు బద్ధవ్యతిరేకి అయిన లగడపాటి తెలంగాణ ప్రజల్ని గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి తప్పుడు సర్వేలు చెప్తున్నారని మండిపడ్డారు. ముందస్తుకు అందుకే వచ్చాం.. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర అంత ప్రభావవంతంగా ఉండదు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు అంత సులువు కాదు. కేంద్రంలో తగిన పాత్ర ఉండాలనే ముందుస్తుకు వచ్చాం’ అని కడియం పేర్కొన్నారు. అయితే, ముందస్తుకు పోయేటప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు ఒకేలా లేవని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకులు తెలంగాణపై దృష్టి పెట్టడం కొంత దెబ్బతీసిందని అన్నారు. ఏదేమైనా రెండొంతుల స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా ముందస్తు ఎన్నికలు జరుపుకొని జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారా అనే ప్రశ్నకు అవేవీ ఇప్పుడు చెప్పలేమన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కై పనిచేస్తూ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతారని కడియం వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే టీఆర్ఎస్ కర్తవ్యమని అన్నారు. ‘మా బలం, నినాదం కేసీఆరే. ఎట్టి పరిస్థితుల్లో ఆయనే ముఖ్యమంత్రి. గజ్వెల్లో కేసీఆర్ మంచి మెజారిటీతో గెలబోతున్నారని జోస్యం చెప్పారు. -
‘లగడపాటి రాజగోపాల్ ఓ రాజకీయ బఫూన్’
సాక్షి, వరంగల్ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ రాజకీయ బఫూన్ అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. మీడియా లగడపాటికి అనవసర ప్రచారం కల్పిస్తోందని మండిపడ్డారు. బుధవారం హన్మకొండ టీఆర్ఎస్ అర్భన్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మహాకూటమి తెలంగాణ వ్యతిరేకుల కూటమని అన్నారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఓడిపోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కునే నాయకుడు కూటమిలో లేరని చెప్పారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో జతకట్టడం కాంగ్రెస్ చారిత్రక తప్పిదంగా పేర్కొన్నారు. కోదండరాం ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నాడన్నారు. ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ గాలి వీస్తోందని, అది డిసెంబర్ 7న తుఫానుగా మారుతుందన్నారు. వరంగల్ జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు నీరు అందించటమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పనకు దోహదపడతామని, చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయటానికి కృషి చేస్తామని తెలిపారు. -
దేవయ్యను బలి పశువును చేశారు..
సాక్షి, ఐనవోలు: కాంగ్రెస్ నాయకులు కోదండరాంను కోదండం ఎక్కిస్తే ఆ కోదండరాం మతి తప్పి నియోజకవర్గంలో పగిడిపాటి దేవయ్యను బలిపశువును చేశారని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అరూరి రమేష్ లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి స్టేట్ రికార్డుగా చరిత్ర సృష్టించబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్‌కు మద్దతుగా మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీసెంటర్ వరకు టీఆర్ఎస్ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీపీ రవీందర్రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కడియం హాజరై మాట్లాడారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ను రాజకీయంగా బొందపెట్టాలని, టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు తెలంగాణ ద్రోహి అన్న కోదండరాం కూటమితో పొత్తును ఏవిధంగా సమర్ధిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. రిటైర్ కాగానే కోదండరాం మైండ్ పని చేయకుండా పోయి కాంగ్రెస్ నాయకులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఐనవోలు మల్లన్న ప్రాముఖ్యత తెలువని దేవయ్యకు నియోజకవర్గ సమస్యలెలా తెలుస్తాయని టికెట్ ఇచ్చారో కోదండరామే చెప్పాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు దేవయ్య చుట్టూ చేరి ఆర్థికంగా ఆయనను పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. దేవతలకు బలి ఇచ్చేముందు గొర్రెలను కూడా సింగారిస్తారన్న విషయాన్ని దేవయ్య ఎంత తొందరగా తెలుసుకుంటే ఆయనకు అంత మంచిది అన్నారు. విదేశాల నుంచి వచ్చిన దేవయ్య మరలా డిసెంబర్ 12న తిరిగి వెళ్లడం ఖాయమన్నారు. అరూరి రమేష్ కారు గుర్తుకు 80–90 శాతం ప్రజలు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తే మండలాన్ని మరో ఐదేళ్లు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. గత నాయకుల పనితీరుతో తన పనితీరు పోల్చుకుని నచ్చితే ఓటేయాలని వర్ధన్నపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్ తెలిపారు. ఈ సారి మరింత అధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజక వర్గాన్ని తన రాజకీయ గురువు, ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ద్వారా అధిక నిధులు సాధించి అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్రావు, మునిగాల సమ్మయ్య, మిద్దెపాక రవీందర్, శ్రీరామోజు అరుణ జయకర్, శ్రీరాములు, రామిండ్ల స్వప్న, బొళ్లపల్లి మధు, పల్లకొండ సురేష్, మజ్జిగ జైపాల్, బుర్ర రాజ్‌కుమార్, ఆడెపు దయాకర్, పెండ్లి కావ్య తిరుపతి, చందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాం.. సిగ్గు లేదా?
లింగాలఘణపురం: ‘తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ద్రోహుల పార్టీ అని.. నేడు అదే పార్టీతో దోస్తీ ఎలా చేస్తున్నావ్..! కోదండరాం నీకు సిగ్గు లేదా? అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యతో కలసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీడీపీకి వేసినట్లేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అమరావతిలో ఉన్న చంద్రబాబును హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. టీడీపీతో మహా కూటమిని ఏర్పాటు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. ఒకవేళ పొరపాటున మహాకూటమి గెలిస్తే చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకుంటారని అన్నారు. -
నా ఇంటి అల్లుణ్ని గెలిపించుకోవాలి : కడియం
సాక్షి, నర్సంపేట : పెద్ది సుదర్శన్ రెడ్డి అభివృద్ధికి మారుపేరని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేల కంటే నర్సంపేట అభివృద్ధే ధ్యేయంగా సుదర్శన్ నిధులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు భూమి పట్టాలు ఇప్పించిన ఘనత సుదర్శన్‌కు దక్కుతుందన్నారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు.ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ రచించిన ఆర్టికల్ అనుగుణంగానే కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రాబోయే రోజుల్లో తయారు చేయబోతున్నాము. నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి ఏరోజు ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. నా ఇంటి బిడ్డను చేసుకున్న నా ఇంటి అల్లుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలి’’ అని అన్నారు. -
సీల్డ్ కవర్ సీఎం కావాలా ?
స్టేషన్‌ఘన్‌పూర్: మహాకూటమిగా చెప్పుకునే నేతలకు సీఎం అభ్యర్థి ఎవరో క్లారిటీ లేదని, ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో వచ్చేవారు కావాలా, తెలం గాణ బిడ్డ అయిన సింహంలాంటి కేసీఆర్ కావా లా ప్రజలు తేల్చుకోవాలని ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. డివిజన్ కేంద్రంలోని విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం పార్టీ, సీపీఐ కలిపి మహాకూటమి అంటున్నారని, వారిది దగా కూటమి అన్నారు. తెలంగాణ గోస తెలిసిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కావాలా, ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్‌తో కుర్చీలెక్కే దగుల్భాజీలు కావాలా అన్నారు. రైతులకు గోదావరి నీరు అందించాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే కుసంస్కారం, దరిద్రపుగొట్టు ప్రతిపక్షమైన కాంగ్రెస్ కోర్టులో 200 కేసులు వేసిందన్నారు. 60 ఏళ్లు పాలించి వారు రైతుల సమస్యలు పట్టించుకోలేదని, కేసీఆర్ రైతుల పాలిట దైవంగా పనిచేస్తుంటే అమ్మ పెట్టదు, అడక్క తిననివ్వదు అన్నట్లు ఉంది కాంగ్రెస్ వ్యవహారమని ఎద్దేవా చేశారు. ఘన్పూర్ నియోజకవర్గంలో ఏడు రిజర్వాయర్లు ఉన్నాయని, రానున్న రోజుల్లో లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణంతో ఘన్పూర్ మరో కోనసీమగా మారుతుందన్నారు. సాధారణంగా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య స్వల్ప బేధాభిప్రాయాలు ఉండొచ్చని, ఒక కుటుంబంలోనే పలు పొరపొచ్చాలుంటాయన్నారు. శత్రువు వచ్చినప్పుడు బేధాభిప్రాయాలను పక్కన పెట్టాలని, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ఏకమై రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహకారంతో డాక్టర్ రాజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఘన్పూర్ టీఆర్ఎస్లో సమ్మతి, అసమ్మతి లేదు : కడియం శ్రీహరి ఘన్పూర్ టీఆర్ఎస్లో సమ్మతి, అసమ్మతి ఏమీ లేవని, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులంతా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నామని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తనను అభిమానించేవారు, తనపై గౌరవం ఉన్నవారంతా చిన్నచిన్న అభిప్రాయబేధాలుంటే పక్కన పెట్టాలని, రాజయ్య గెలుపునకు కంకణబద్ధులై పనిచేయాలన్నారు. రాజయ్య ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించినా, తాను ఎప్పుడు ప్రవర్తించలేదని, రాజయ్య తనకు తమ్ముడు లాంటివాడని ఉద్వేగంగా చెప్పారు. కాగా కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు సభకు వచ్చిన పార్టీ శ్రేణులు చప్పట్లు, ఈలలతో అభినందించడం విశేషం. మా బాస్‌లు ఢిల్లీలో లేరు.. గల్లీలో ఉన్నారు: రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా మన బాస్‌లు ఢిల్లీలో, అమరావతిలో లేరని, గ్రామాల్లో, గల్లీల్లో ఉన్నారని, వారే పార్టీ కార్యకర్తలు, ఓటర్లని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని, కొన్ని దుష్ట శక్తులు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలు పెట్టాలని గగ్గోలు పెడితే ముందస్తు ఎన్నికలు వచ్చాయన్నారు. సిద్ధిపేట తర్వాత దమ్మున్న నియోజకవర్గం ఘన్పూర్ : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సిద్ధిపేట తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఆ స్థాయిలో పట్టున్న, దమ్మున్న నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఘన్పూర్ త్యాగాలకు ప్రతీకని, డాక్టర్ రాజయ్య ఆ రోజుల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా పట్టి ఉద్యమానికి ఊపు తెచ్చారన్నారు. కడియం శ్రీహరి సహకారంతో అభివృద్ధి చేస్తా : డాక్టర్ రాజయ్య ప్రజలు మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే కడియం శ్రీహరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. తనకు తెలిసీతెలియక ఏమైనా తప్పులు జరిగి ఉంటే కడియం శ్రీహరి, పార్టీ శ్రేణులు మన్నించాలన్నారు. నియోజకవర్గమే దేవాలయమని, ప్రజలే దేవుళ్లన్నారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమల్లు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాలోత్ కవిత, సన్నపునేని రాజేందర్, వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, గాంధీనాయక్, కొమురవెళ్లి దేవస్థాన చైర్మన్ సేవెళ్లి సంపత్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి క్రిష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, సీహెచ్.నరేందర్‌రెడ్డి, పోగుల సారంగపాణి, తోట వెంకన్నతో పాటు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేటీఆర్ సమక్షంలోనే రాజయ్యకు పంచ్
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్: తన కుమార్తెకు టిక్కెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎట్టకేలకు మౌనం వీడారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టిక్కెట్ తన కుమార్తె కావ్యకు ఇవ్వకపోవడంతో కొంతకాలంగా అంటిముట్టనట్టు వ్యవహరించిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ పాల్గొన్న ఈ సభలో కడియం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి లేదు, సమ్మతి లేదంటూనే రాజయ్యకు చురకలు అంటించారు. ‘నేను నియోజకవర్గానికి రాకపోవడంతో అలిగానని బహుశా మీరంతా అనుకుంటున్నారేమో. నేను నిజంగా చెబుతున్నా రాజయ్య అప్పుడప్పుడు నా పట్ల తప్పుగా ప్రవర్తించినా నేను ఎన్నడూ అలా ప్రవర్తించలేదు. రాజయ్య నా తమ్ముడు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు. రాజయ్యను తప్పకుండా మనమందరం గెలిపించుకోవాలి. భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాల’ని కడియం శ్రీహరి అన్నారు. -
‘అన్ని సర్వేలు టీఆర్ఎస్కే అనుకూలం’
సాక్షి, హైదరాబాద్ : అన్ని సర్వేలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థులతో టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ భేటి విషయాలను కడియం మీడియాకు తెలిపారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రచార వ్యూహంపై అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచార తీరును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని, ప్రభుత్వ పథకాలు, పాక్షిక మేనిఫెస్టోపై అభ్యర్థులకు అవగాహన కల్పించారని తెలిపారు. ప్రతీ ఓటరును చేరుకునేలా ప్రజల్లోకి వెళ్లాలని అభ్యర్థులకు సూచించనట్లు పేర్కొన్నారు. 100 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. అభ్యర్థులు అబ్ధిదారులందరినీ నేరుగా కలవాలన్నారు. టీఆర్ఎస్లో అసమ్మతి లేదని స్పష్టం చేశారు. మరోసారి కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని కడియం అభిప్రాయపడ్డారు. -
పూర్తి మేనిఫెస్టోను చూస్తే నిలబడరేమో!: కడియం
కాజీపేట అర్బన్: టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలు ఆమోదించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యే పూర్తి స్థాయి మేనిఫెస్టోను చూసి విపక్షాల అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దోపిడీ దొంగలంతా కాంగ్రెస్ పార్టీలోనే చేరారని కడియం ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ హౌసింగ్ కుంభకోణంలో, మాజీ మంర్రులు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక కేసుల్లో ఉన్నారని ఆరోపించారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన, ప్రకటించని పలు సంక్షేమ పథకాలను అందించి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా రని కితాబిచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం స్థాయి వారు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అభియోగం మోపడం దారుణమన్నారు. తాను, తన కూతు రు కాంగ్రెస్‌లో చేరేది లేదని స్పష్టం చేశారు. -
‘మా పాక్షిక మేనిఫెస్టోకే బెంబేలు’
వరంగల్: తమ మేనిఫెస్టోను మక్కి మక్కి కాపీ కొట్టారంటున్న టీపీసీసీ నేతలపై తాజా మాజీ మంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయని శ్రీహరి విమర్శించారు. టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోకే భయపడిపోతున్న కాంగ్రెస్ నేతలు.. తమ పూర్తి మేనిఫెస్టోను చూస్తే పోటీ చేస్తారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. శుక్రవారం ప్రెస్ మీట్లో మాట్లాడిన కడియం శ్రీహరి.. టీఆర్ఎస్ మేనిఫెస్టో కంటే బెటర్ మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించి చూపాలని సవాల్ చేశారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించకుండానే...కాపీ కొట్టారని , మక్కి మక్కి జిరాక్స్ చేశారని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. అధికారం కోసం కాంగ్రెస్ సాధ్యం కానీ హామీలిస్తూ.. ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నేతలంతా కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. దోపిడీ దొంగలంతా కాంగ్రెస్ లోనే ఉన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో టీఆర్ ఎస్ సర్కార్ పని చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ప్రతి కుటుంబానికి లాభం చేకూర్చే ప్రణాళికలు రూపొందించ బోతున్నాం. పెన్షన్ల పెంపు తో 6 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వెదుకొన్నాం. మొత్తంగా 48 నుండి 60 వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. మా పూర్తి మేనిఫెస్టోను చూస్తే..అసలు మీరు పోటీలో ఉంటారా’ అని కడియం ఎద్దేవా చేశారు. -
‘బాహుబలిలాంటి కేసీఆర్‌ను ఓడించడమా?’
సాక్షి, మహబూబాబాద్: బాహుబలిలాంటి కేసీఆర్‌ను ఓడించడం కాంగ్రెస్ పార్టీ తరంకాదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించిందని, గెలవలేమని కోర్టుకు వెళ్లిందని విమర్శించారు. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు తమ పూర్తి సహకారం అందిస్తామని అసమ్మతి నేతలైన మాజీ ఎమ్మెల్యేలు కవిత, సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. కాగా తాను మాత్రం పాలకుర్తి బరిలో ఉన్నానని కడియం సమక్షంలో చెప్పారు. ఈ సమన్వయ సమావేశానికి అసమ్మతి నేతలు మాత్రమే హాజరుకాగా, వారి అనుచరులు కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. కార్యక్రమంలో ఎంపీ సీతారాంనాయక్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, తాజా మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు. -
ఘన్పూర్ నీది కాదు.. మనది!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘రాజయ్య ఇప్పుడు కూడా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నాది అంటున్నారు. ఆ మాట మాట్లాడొద్దు. ఇది నీ నియోజక వర్గం కాదు. ఇది మన నియోజక వర్గం. మీకు 52 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. నేను పోటీ చేసినప్పుడు 90 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను’ అని టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ అసమ్మతి నేతల మధ్య రాజీ కుదిర్చేందుకు గురువారం సమన్వయ కమిటీ సమావేశం అయింది. వరంగల్‌లోని ఓ హోటల్లో కడియం, టి.రాజయ్య, ఉమ్మడి వరం గల్ జిల్లా పరిశీలకులు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు బండా ప్రకాష్, సీతారాంనాయక్, పసునూ రి దయాకర్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశం లో పార్టీ అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడారు. ఎదుటివారిని చులకన చేసి మాట్లాడొద్దని, ఎక్కడ ఎవరి వల్ల పని అవుతుందో, వారితో ఆ పని చేసుకుంటేనే ఫలితం వస్తుందని రాజయ్యను ఉద్దేశించి అన్నారు. రాజయ్య కు కూడా తమ్మునిగా భావించి సలహా ఇస్తున్నానంటూ.. నీ వెంట ఉన్నవాళ్లు, నువ్వు గెలువాలని కోరుకుంటున్న వాళ్లు, పక్కన ఉన్నవాళ్లని అవమాన పర్చే విధంగా వెకిలిగా నవ్వొద్దని సూచించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ ఒక్క నియోజకవర్గంలో ఫలితాలు తారుమారు అయినా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం అని గుర్తు పెట్టుకుని పనిచేయాలని ఆయన కార్యకర్తలను హితబోధ చేశారు. -
రాజయ్య పద్ధతి మార్చుకోవాలి : కడియం
సాక్షి, హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య! పద్ధతి మార్చుకోవాలని, ‘నా నియోజకవర్గం’ అని అనకుండా మనది అనాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హితవు పలికారు. కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా రాజయ్యకు పిలుపునిచ్చారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన దగ్గరనుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని తెలిపారు. రూమర్లను పట్టించుకోకుండా కేసీఆర్ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. టీఆర్ఎస్ బలపడాలన్నా, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నా స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యను గెలిపించాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాజయ్య కూడా అందరిని కలుపుకునిపోవాలని, కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. ఆయన తన ప్రసంగాన్నికొనసాగిస్తూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది.. జరగాల్సింది చూడాలి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు తిరుగులేదు. మనమందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు. రాజయ్యకు నా పూర్తి సహాకారం ఉంటది, నన్ను అభిమానించే వారందరు పూర్తి స్థాయిలో రాజయ్యకు సహాకరించాలి. రాజయ్య వర్గీయులు, నా వర్గీయులు, ఉద్యమకారులు అంతా కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేయాల’ని అన్నారు. -
25 సీట్లలో అసమ్మతి ఉంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతుల చిచ్చు ఆరడంలేదు. మంత్రి కె.తారకరామారావు ప్రతిరోజూ అసమ్మతి, అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ.. పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులపై అసంతృప్తి ఎక్కువగా ఉన్న నేతలు నియోజకవర్గాల వారీగా వచ్చి కేటీఆర్‌తో భేటీ అవుతున్నారు. కాగా, స్టేషన్ ఘన్‌పూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్యకు టీఆర్ఎస్ మళ్లీ అభ్యర్థిత్వం ఖరారు చేయడంపై అక్కడ నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఇక్కడ అవకాశం ఇవ్వాలని పలు మండలాల నేతలు బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితితో మంత్రి కేటీఆర్ సూచన మేరకు కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి టి.రాజయ్యలతోపాటు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు వంద మంది వరకు సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కడియం శ్రీహరి, రాజయ్యలతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం అక్కడికి వచ్చిన నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ నిర్ణయం ప్రకారం అందరూ కలిసి పని చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితులలో అభ్యర్థులను మార్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ‘సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు అని సీఎం కేసీఆర్ ముందుగా ప్రకటించిన ప్రకారం 105 సీట్లలో టిక్కెట్లు ఖరారు చేశాం. స్థానిక పరిస్థితుల కారణంగా 25 నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు దగ్గరపడింది. అన్ని సర్దుకుంటున్నాయి. ఈ దశలో అభ్యర్థులలో మార్పులు జరగవు. ఏది ఏమైనా అభ్యర్థులను మార్చడం జరగదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెల వాల్సిన ఆవశ్యకత ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలి. అసంతృప్త నేతల విజ్ఞప్తులను సావధానంగా వింటాం. కడియం శ్రీహరి, రాజయ్య కలిసి మీ విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. అందరూ కలిసి పని చేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి’అని కేటీఆర్ కోరారు. టీఆర్ఎస్ గెలుపే లక్ష్యం: కడియం ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే తమ లక్ష్యమని కడియం అన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కేటీఆర్, కడియం సూచనల అనంతరం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ నేతలు అసంతృప్తితోనే అక్కడి నుంచి వెళ్లారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అసంతృప్త నేతలతోనూ కేటీఆర్ చర్చలు జరిపారు. పార్టీ కోసం పని చేయాలని సూచించారు. నిర్మల్‌లో కుదిరిన సయోధ్య.. నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీహరిరావుల మధ్య సయోధ్య కుది రింది. వీరిద్దరు సోమవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ వస్తుందని, ప్రతి ఒక్కరికీ భవిష్యత్‌లో అవకాశాలు ఉంటా యని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో అసమ్మతికి తావులేదని, భేదాభిప్రాయాలను పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. నిర్మల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డిని గెలిపించేందుకు అందరం కలిసి పనిచేస్తామని శ్రీహరిరావు అన్నారు. -
‘తూర్పు’లో ఆదరణ లేకనే పరకాలకు..
సాక్షి, ఖిలా వరంగల్: కొండా దంపతుల ఆగడాలతో ‘తూర్పు’ నాయకులు, ప్రజలు విసిగిపోయార ని, ఇక ఇక్కడ ఆదరించే పరిస్థితి లేకనే వారు పరకాలకు పయనమయ్యారని ఆపద్ధర్మ డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. కొండా దంపతులు వెళ్లడంతో టీఆర్ఎస్కు మరింత బలం చేకూరిందన్నారు. గ్రూపు రాజకీయాలతో పార్టీకి, నాయకులకు నష్టం చేశారని, పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ శివనగర్‌లోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్లో తూర్పు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ముఖ్యనేతల సమన్వయ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతి థిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్, మేయర్ నరేందర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గుండు సుధారాణి, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్, పార్టీ తూర్పు ఇన్చార్జి ఎడవెల్లి కృష్ణారెడ్డి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రా వు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి పార్టీ పటిష్టత, నిర్మాణంపై ఆయన చర్చించారు. అనంతరం కార్పొరేటర్లు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలను పాటించి అభ్యర్థి ఎవరైనా ఐక్యత ప్రదర్శించి అఖండ విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం డిప్యూటీ సీఎం విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ తూర్పులో మొత్తం 20 మంది కార్పొరేటర్లు ఉంటే అందరూ పార్టీలోనే ఉన్నారని చెప్పారు. వారు ఉద్యమంలో లేకున్నా 2014లో పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. ఉమ్మడి జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామనడం కాదని, వారి సీటే వారు గెలవలేరని, భారీ మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి గెలుపు ఖాయమన్నారు. వీరంతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 7వ తేదీన ఎన్నికైన బూత్, డివిజన్ కమిటీలతో నియోజకవర్గ కమిటీ నియామకం, విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కమిటీ సమన్వయకర్తలు ఎంపీ బండా ప్రకాశ్, కొంపెల్లి ధర్మరాజు, సయ్యద్ మసూద్, మెట్టు శ్రీనివాస్, ఎడవెల్లి కృష్ణారెడ్డి వ్యవహరించనున్నాట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. -
నేను కాంగ్రెస్‌లో చేరడం లేదు?: కడియం
హన్మకొండ (వరంగల్): ఈ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది లేదని, తాను కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేరేది లేదని అపధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బురదజల్లే పుకార్లు, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను నమ్మొద్దని, తాను వ్యక్తిత్వమున్న, నిజాయితీ కలిగిన వ్యక్తినని అన్నారు. హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆదివారం ఆయన విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో మాత్రం ఒక్కసారి బీజేపీకి ఓటు వేశానన్నారు. అంతకు ముందు టీడీపీకి, టీఆర్ఎస్లో చేరాక టీఆర్ఎస్కు ఓటు వేశానన్నారు. తనకు ఓటు హక్కు లభించిన తొలి నాళ్లలో అప్పటి తెలంగాణ ప్రజాసమితికి ఓటు వేశానని వివరించారు. జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు ఓటు వేయనని చెప్పారు. ఎంపీగా ఉన్న తనను సీఎం కేసీఆర్ తనను ఉప ముఖ్యమంత్రిని చేశారని, కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్లో పని చేస్తానన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో అసమ్మతి సద్దుమణిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే కడయం శ్రీహరి కారణంగానే ఓడిపోయారనే ప్రచారం జరిగే అవకాశముంది కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నిందలు అనేవి సహజమన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌కు అభ్యర్థే దిక్కు లేడన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను అధిష్టానం తనకు అప్పగించిందన్నారు. అసమ్మతి నాయకులతో మాట్లాడి సయోధ్య కుదిరించి, పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. 12 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం చేయడంపై మాట్లాడుతూ రాజేశ్వర్రెడ్డిది స్టేషన్‌ఘన్‌పూర్ సొంత నియోజకవర్గమని, పార్టీ నాయకుడిగా ప్రచారం చేయొచ్చన్నారు. దీనికి గురించి గొప్పగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ వారసులుగా ఎవరు వస్తారని అనే అంశంపై స్పందిస్తూ ప్రజలు ఆశీర్వదిస్తే వస్తారన్నారు. తన కూతురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో నిరుత్సాహంగా ఉన్న అసమ్మతి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు రావాలని పార్టీ ఆదేశించిందని, ఈ మేరకు 1వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ తమను పిలిచారని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకరిద్దరు స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశముందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పార్టీని వీడరన్నారు. ప్రస్తుతం 5 నుంచి 10 నియోజకవర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోందని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అంతా సద్దుమణుగుతుందన్నారు. వరంగల్ తూర్పులో గెలువలేకనే కొండా సురేఖ పరకాలకు పలాయనం చిత్తగించారని కడియం శ్రీహరి విమర్శించారు. వ్యతిరేకత ఉండడంతోనే పరకాలకు వెళ్లారని, దమ్ముంటే సురేఖ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలవాలన్నారు. -
నేను పోటీ చేయను: కడియం శ్రీహరి
హన్మకొండ: ఈ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచీ పోటీ చేయడం లేదని, తాను కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేరబోనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న వదంతులు, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను నమ్మొద్దని ఆయన అన్నారు. ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదన్నారు. జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు ఓటు వేయనని చెప్పారు. ఎంపీగా ఉన్న తనను సీఎం కేసీఆర్ ఉప ముఖ్యమంత్రిని చేశారని, కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్లోనే పని చేస్తానని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో అసమ్మతి సద్దుమణిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన కూతురు పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వరంగల్ తూర్పులో గెలవలేకనే కొండా సురేఖ పరకాలకు పలాయనం చిత్తగించారని కడియం విమర్శించారు. దమ్ముంటే కొండా సురేఖ వరం గల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలవాలన్నారు. -
టీఆర్ఎస్ను ఎదుర్కొనే ధైర్యం లేదు: కడియం
వర్ధన్నపేట (వరంగల్): టీఆర్ఎస్ను ఏ ఒక్క పార్టీ ఎదుర్కొనే గుండె ధైర్యం లేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన శక్తులన్నింటితో కాంగ్రెస్ జత కడుతుందని ప్రజలు గుణపాఠం చెపుతారని అపద్దర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు మార్గం భిక్షపతి అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అరూరి రమేష్ చేసిన అభివృద్ధి, ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారన్నారు. అన్ని నదులు కలిసి గోదావరి పవిత్ర నదిగా ఆవిర్భవించిందో టీఆర్ఎస్ పార్టీ సైతం అలాంటిందని అభివర్ణించారు. కేసీఆర్ రాజకీయల్లో బాహుబలి అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతి తిరిగి పురుడు పోసుకుంటుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం చేపట్టని అభివృద్ధి పనులు చేపట్టి పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్ ప్రధాని నరేంద్రమోదీ కేసీఆర్‌ను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. 70 ఏళ్ల కాంగ్రెస్, ఇతర పార్టీల పాలనలో కరంటు కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. రెండు నెలలు కార్యకర్తలు కష్టపడితే ఐదేళ్లు రమేష్ మీకు సేవకుడిగా పని చేస్తారన్నారు. లక్షకు పైగా మెజారిటీ సాధించాలంటే కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అత్యధిక మెజారిటీ సాధిస్తే రాబోయే ప్రభుత్వంలో మరింత గౌరవ ప్రదమైన స్థానం అరూరి రమేష్‌కు కల్పించబడుతుందన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ తనను వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆదరించి 86 వేలపై చిలుకు ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన వంతు అభివృద్ధి సహాయ సహకారాలు అందించానన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని కార్యకర్తలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు ప్రతి గ్రామం నుంచి సోషల్ మీడియా ఇన్చార్జిలు వాటిని తిప్పి కొట్టి తగిన సమాధానం చెప్పాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, టీఆర్ఎస్ యువజన విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్రావు, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, ఐనవోలు ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఆర్మవైశ్య ప్రముఖుడు, జిల్లా నాయకుడు శ్రీనివాస్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
తెలంగాణ బాహుబలి కేసీఆర్: కడియం శ్రీహరి
రేగొండ: రాష్ట్రంలో పాలన పరంగా సీఎం కేసీఆర్ తెలంగాణ బాహుబలి అని ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కాకతీయ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డా అయిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని, బీజేపీకి గతంలో గెలిచిన సీట్లు సైతం దక్కే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో దళితుడిని సీఎం చేయాలంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, తమ పార్టీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తోందని, రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని, ఈ విషయాన్ని అమిత్‌షా గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో తాజా మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. -
వ్యూహమా.. సహజమా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ప్రజా ప్రతినిధులు అధినేత నిర్ణయాన్ని ఎందుకు ధిక్కరిస్తున్నారు? వేలాది మంది కార్యకర్తలు హన్మకొండలోని సర్క్యూట్ హౌస్‌ను ముట్టడించడం వ్యూహమా? ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మౌనం వెనుక మతలబు ఏమిటి? మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పెల్లుబికిన ఆగ్రహజ్వాలను ఒక్కరోజులో పరిష్కరించిన ‘గులాబీ’ దళపతి స్టేషన్‌ఘన్‌పూర్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. టీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకర్గ అభ్యర్థిని ఖరారు చేసిన నాటి నుంచి ఇక్కడ రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. నిజానికి రాజయ్యకు టికెట్ కేటాయించగానే రాజారపు ప్రతాప్ తిరుగుబాటు చేశారు. అవినీతిపరులకు టికెట్లు ఇవ్వొద్దంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. తనకు పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు పార్టీ నుంచి టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని ఊళ్లలో తిరుగుతూ చెబుతున్నారు. తన వర్గానికి చెందిన కార్యకర్తలతో నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. మూడు, నాలుగు రోజుల తర్వాత.. టీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ప్రకటించిన మూడు, నాలుగు రోజుల తర్వాత కడియం శ్రీహరి అనుచరులు ఒక్కసారిగా వేడి పుట్టించారు. రాజయ్యకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాజయ్యకు టికెట్ ఇస్తే ఓట్లు వేయమని తీర్మానం చేశారు. అనంతరం చిల్పూరు మండలం పల్లగుట్టలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు. రాజయ్య మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఆయనకు టికెట్ రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అదే వేదిక మీద నుంచి కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు గానీ, తిరుగుబాటు నేత రాజారపు ప్రతాప్‌కు గానీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను తెర మీదకు తీసుకొచ్చారు. మరోసారి మండలస్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 10 వేల మందితో హైదరాబాద్‌కు వెళ్లి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించాలని ప్రణాళిక వేసుకుని, ఆగిపోయారు. ఆశీర్వాదం తర్వాతే.. ఈ క్రమంలో రాజయ్య గొంతును పోలిన స్వరంతో ఓ మహిళతో శృంగార పరమైన ముచ్చట్లకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో కంగుతిన్న రాజయ్య మరుసటి రోజే నేరుగా హైదరాబాద్‌లోని కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి తనను ఆశీర్వదించాలంటూ కాళ్లు çమొక్కారు. రాజకీయంగా సహకరించమని కోరారు. ఇక అప్పటి నుంచే నిరసన జ్వాలలు ఊపందుకున్నాయి. తాజాగా శనివారం స్టేషన్ ఘన్పూర్ నుంచి వేలాది మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో హన్మకొండకు చేరుకుని కడియం శ్రీహరి బస చేసిన సర్క్యూట్ అతిథి గృహాన్ని ముట్టడించారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు. అయితే ఈసారి వారి డిమాండ్ మారింది. నిన్న మొన్నటి వరకు కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. ఈ రోజు కడియం శ్రీహరే అభ్యర్థిగా నిలబడాలని, ఆయనకే టికెట్ ఇవ్వాలనే నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శించడంతోపాటు కరపత్రాలను వాహనాలకు అతికించారు. కార్యకర్తల ధర్నాతో అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన కడియం శ్రీహరి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ క్రమశిక్షణ గల నాయకుడిగా, పార్టీ కార్యకర్తగా అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉంది. ఆశించిన అభివృద్ధి జరగలేదనే బాధ ఉందని, కడియం శ్రీహరి మళ్లీ వస్తే నియోజకవర్గం బాగుపడుతుందనే నమ్మకంతో నా దగ్గరకు వచ్చినట్లు నేను భావిస్తున్నాను. వారి బాధను నాకు, పార్టీకి చెప్పుకోవటానికి ఇక్కడకు వచ్చారు. వారి బాధను, ఆవేశాన్ని, ఆవేదనను, అభిప్రాయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా.’ అని హామీ ఇచ్చారు. ఇంటెలిజెన్సీ చూస్తోంది..! టికెట్ల కేటాయింపుల అనంతరం జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగట్టి కేసీఆర్‌కు చేరవేసేందుకు పోలీసు ఇంటెలిజెన్సీ కార్యచరణలోకి దిగినట్లు తెలుస్తోంది. అభ్యర్థులపై పెల్లుబికిన అసమ్మతి, అందుకు గల కారణాలు? టికె ట్లు ఆశించి భంగపడిన అభ్యర్థుల ప్రమేయం, ఇ తరత్రా అంశాలను ఎప్పటికప్పుడు సేకరించి నివేదిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఆడియో క్లిప్పింగ్‌ను, స్టేషన్ ఘన్‌పూర్‌లో తిరుగుబాటు స్వరాల ఉనికిని ఇప్పటికే ఇంటెలిజెన్స్ అపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలకు నిశితంగా గమనిస్తున్న ముఖ్యమంత్రి.. స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిత్వంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
మనస్పర్థలు ఉన్నా కేసీఆర్‌ని నమ్మి..
సాక్షి, హైదరాబాద్ : కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నందున.. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా సీఎం కేసీఆర్‌ని, టీఆర్ఎస్ పార్టీని నమ్మి అభ్యర్థులను గెలిపించాలని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజక వర్గంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఎన్నికల వేళ ఇవన్నీ సాధారణమని, అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటున్నామన్నారు. ఒక్క వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. అందరం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. అభ్యర్థులను మార్చే అవకాశం లేదని కేసీఆర్ చెప్పారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా ఉంటానని, ప్రజల ఆవేశాన్ని, బాధని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఎక్కడికి పిలిచినా ప్రచారానికి వెళతానన్నారు. పార్టీకి నష్టం కలిగించే ఏ పని చేయనని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ తనకు ఎంతో గౌరవం ఇచ్చారని చెప్పారు. తాను ఆశించిన దానికంటే ఎక్కువ బాధ్యత కేసీఆర్ ఇచ్చారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. బీజేపీకి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణలో దళితులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ ముందస్తు ఎన్నికలు మా పార్టీ నిర్ణయం. ప్రతిపక్షాలకు ఎందుకు కడుపునొప్పి. రాజకీయ పార్టీల నాయకత్వం లేనప్పుడు సీఎం పదవి రాదు. అంబేద్కర్ ఇచ్చిన అవకాశం వల్ల మాయావతి లాంటి వారు సీఎం అయ్యారని’’ పేర్కొన్నారు. -
మీది కడియం మాది కడియం
నర్సరీలకు బాగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా కడియంలో కొన్ని ఎకరాల పొలం కొనుక్కుని నివసిస్తుంటారు అవధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. అవధానాలంటే సామాన్య జనంలో కూడా విస్తృత ప్రచారంలో ఉన్న రోజులవి. ఆ ఊళ్లోనే పెద్ద కన్నపు దొంగ ఉంటాడు. అతడు ఎవరినీ గౌరవంగా పిలవడు. అందరినీ ఏకవచనంతో సంబోధిస్తాడు. దొంగతో ఎక్కడ పెట్టుకుంటామని ఎవరూ భయపడి నోరెత్తరు. ఒకరోజు చెళ్లపిళ్ల పొలాన్ని చూసుకుంటూ నడుస్తున్నప్పుడు, ఆ దొంగ వినయంగా వెనక వస్తుంటాడు. ‘ఏరా, సాయంత్రం మా ఇంటికి ఏమైనా విజయం చేస్తావా?’ అని వ్యంగ్యంగా అడుగుతాడు చెళ్లపిళ్ల. మా ఇంటికి ఏమైనా కన్నమేద్దామనుకుంటున్నావా అని అర్థం. ‘లేదు దొరా, మీది కడియం అని అందరికీ తెలుసు కదా, నేను ఆ మధ్య జైల్లో ఉన్నప్పుడు మన ఊరు కడియం అని తెలిసి దొంగలందరూ నన్ను గౌరవంగా చూశారు’ అని చెబుతాడు. దానికి కొనసాగింపుగా, ‘తమరి వెంట తిరిగితే నాలుగు మంచిముక్కలైనా వస్తాయి అని తిరుగుతున్నా’ అంటాడు. దానికి చెళ్లపిళ్ల కచ్చితంగా సంబరపడే ఉంటాడు. -
‘బిల్ట్’కు మంచి రోజులు !
సాక్షి, హైదరాబాద్: ఖాయిలా పడిన బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్)కు మంచి రోజులొచ్చాయి. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ బిల్ట్ (పూర్వం ఏపీ రేయాన్స్) పునరుద్ధరణకు రూ.192 కోట్లు విలువ చేసే ప్రత్యేక రాయితీ, ప్రోత్సాహాకాలను మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు 2014 ఏప్రిల్‌లో బిల్ట్ మూత పడటంతో 750 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. కంపెనీ పునరుద్ధరణ కోసం యాజమాన్యంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కె. తారకరామారావు, చందూలాల్ పలు మార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా కంపెనీ యాజమాన్యం, కార్మికులు, కార్మిక శాఖ అధికారులు, కార్మిక సం ఘాల నేతలతో ఈ సమావేశాలు జరిగాయి. గత నెల జరిగిన చర్చల సందర్భంగా కంపెనీ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకొని వారం రోజుల్లో ప్రణాళికలతో రావాలని ప్రభుత్వం యాజమాన్యానికి సూచించింది. ఈ క్రమంలో కంపెనీ కోరిన పునరుద్ధరణ ప్యాకేజీ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. పెట్టుబడి రాయితీ రూ.12.5 కోట్లు.. ముడి సరుకు (పల్ప్ వుడ్) కొనుగోళ్లపై ఏటా రూ.21 కోట్లు చొప్పున ఏడేళ్ల పాటు, విద్యుత్ కొనుగోళ్లపై ఏటా రూ.9 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు.. మొత్తం రూ.192 కోట్ల రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి అదనంగా మెట్రిక్ టన్ను బొగ్గుపై రూ.1,000 చొప్పున ఏటా 1,50,000 మెట్రిక్ టన్నుల బొగ్గుకు ఏడేళ్ల పాటు రాయితీ అందించనుంది. కంపెనీ ప్లాంట్ ఆధునికీకరణకు యాజమాన్యం అదనంగా రూ.125 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా, అందులో 10 శాతాన్ని పెట్టుబడి రాయితీగా రూ.12.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. కంపెనీ నుంచి రావాల్సిన పన్నులు, విద్యుత్ బకాయిలు, అటవీ శాఖకు రావాల్సిన బకాయిలను విడతల వారీగా రాబట్టుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వానికి రూ.34.5 కోట్ల వాణిజ్య పన్నుల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, తక్షణమే రూ.10 కోట్లు.. మిగిలిన బకాయిలను వడ్డీ లేని వాయిదాలుగా 60 నెలల్లో చెల్లించాలని ప్రభుత్వం కోరింది. రూ.3.34 కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉండగా, తక్షణమే రూ.కోటి.. మిగిలిన బకాయిలను 30 నెల వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే అటవీ శాఖకు రూ.4.75 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, రెండేళ్ల మారటోరియాన్ని ప్రభుత్వం విధించింది. ఆ తర్వాత వడ్డీ లేకుండా 30 నెలల వాయిదాల్లో చెల్లించాలని కోరింది. మరో విజయం: కేటీఆర్ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు కేసీఆర్ మార్గదర్శనంలో ముందుకు సాగుతున్న తమకు దక్కిన మరో విజయం ‘బిల్ట్’అని కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో వందల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని, కార్మికుల బతుకులు బాగు చేయడానికి ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. -
ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లకు 12నెలల వేతనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈనెలాఖరు నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ పథకానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇకపై ఏటా 12 నెలల వేతనాన్ని ఇస్తామన్నారు. ఇప్పటివరకు పది నెలల వేతనమే ఇచ్చేదని, ఇకపై వారంతా 12 నెలల జీతం అందుకోనున్నట్లు వివరించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ లతో కలసి కడియం శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో 3,728 మంది, డిగ్రీ కాలేజీల్లో 898 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 433 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఆమోదానికి విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అదేవిధంగా కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని వచ్చే ఏడాది నుంచి రూ.25 వేలకు పెంచేందుకు కృషి చేస్తామని శ్రీహరి ప్రకటించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయు లుగా ఎంపికైన∙వారిని మంత్రులు సన్మానించారు. అనంతరం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ రూపొందించిన అనుభవాత్మిక అభ్యసనం– గాంధీజీ నయితాలీమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కాటెపల్లి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తర్వులు జారీ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇకపై ఏడాదిలో 12 నెలలు జీతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఏడాది లో 10 నెలల కాలానికే జీతం చెల్లిస్తుండగా, ఇకపై 12 నెలలూ జీతం చెల్లించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఈ సభ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది’
-
‘ఈ సభ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది’
సాక్షి, కొంగర కొలాన్: ప్రగతి నివేదన సభ భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. వ్యవసాయాన్ని పనిగా చేయాలి, రైతును రాజుగా చేయాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చి, రైతు బంధు, రైతు భీమా ద్వారా రైతుకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. నాలుగు సంవత్సరాల మూడు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశామంటే అది కేసీఆర్ పరిపాలన దక్షత వల్లనే అన్నారు. నూతన రాష్ట్రమైనప్పటికీ.. కేసీఆర్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, కంటివెలుగు వంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేయడమే కాకుండా అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వందకు వంద శాతం నెరవేర్చి.. మేనిఫెస్టోలో లేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడానికి వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు లేని పరిపాలన కొనసాగుతోందని , రాబోయే రోజుల్లో మరోక్కసారి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కడియం కోరారు. -
‘మీ లాగులు తడవడం ఖాయం ’
హన్మకొండ : సొంత జిల్లాలో ఇద్దరు నేతలను సమన్వయం చేయలేని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. హన్మకొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తాము కూడా అతి పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నారని.. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ చూశాక వారి లాగులు, పంచెలు తడవడం ఖాయమని చెప్పారు. సొంత జిల్లాలో జానారెడ్డి, కోమటిరెడ్డిలను సమన్వయం చేయనోడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాడా అని ప్రశ్నించారు. ఆ పార్టీలో జిల్లాకో ముఖ్యమంత్రి ఉన్నారని, కొన్ని జిల్లాల్లో ఇద్దరేసి పోటీ పడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ దొంగల్లా దోచుకున్నారని మండిపడ్డారు. దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్ నైజమని విరుచుకుపడ్డారు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రూ.వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని చెబుతున్న ఆయన.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసలు ముందస్తు అంటేనే కాంగ్రెస్ గడగడలాడిపోతోందని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ చెప్పలేదని, అయితే.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మాత్రమే చెప్పామని కడియం స్పష్టం చేశారు. ఉనికి కోసమే విపక్షాల విమర్శలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలు ఉనికి కోసం విమర్శలు చేస్తున్నాయని కడియం మండిపడ్డారు. అధికార పక్షంపై చౌకబారు విమర్శలు చేయకుండా, ముందుగా కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమి చేశారో, చేయనున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించడానికే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. 25 లక్షల మందికి పైగా పాల్గొనే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. -
‘ముందస్తు’ మాట చెప్పలేదు
సాక్షి, భూపాలపల్లి: ముందస్తు ఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ముందస్తు’అయినా.. జమిలి ఎన్నికలౖMðనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు మొన్నటి వరకు ముందస్తుకు సిద్ధమని చెప్పి.. ఇప్పుడు ఎవరి కోసం అంటూ ప్రశ్నిస్తున్నారని, టీఆర్ఎస్ను ఎదుర్కోలేకే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రగతి నివేదన సభ దేశ రాజకీయాల్లో మైలురాయిగా నిలుస్తుందని కడియం పేర్కొన్నారు. అయితే ఈ సభ ముందస్తు ఎన్నికల కోసం కాదని, ప్రజలకు రాష్ట్రం లో జరిగిన అభివృద్ధిని వివరించడానికే ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించకుంటే కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకుంటే మంచిదని హితవు పలికారు. భూపాలపల్లి నియోజకవర్గం టికెట్ వందశాతం మధుసూదనాచారికేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఇక్కడ జరిగిందని పేర్కొన్నారు. -
నవంబర్ 10, 11న ‘బాలోత్సవ్’
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆట బాలోత్సవ్’కార్యక్రమ బ్రోచర్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఆవిష్కరించారు. పిల్లలకు చదువుతో పాటు వివిధ కళల పట్ల అవగాహన కల్పించడానికి బాలోత్సవ్ ఉత్సవాలు ఉపయోగపడుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో దేశంలోని 10 రాష్ట్రాల పిల్లలు, కళాకారులు పాల్గొంటున్నట్లు ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్ 10, 11 తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 24 అంశాలు, 54 విభాగాల్లో వివిధ కార్యక్రమాలను రూపొందించామని వివరించారు. ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం అందజేస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు, పిల్లలకు భోజన వసతి కల్పిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. -
24 నుంచి ‘హైజీన్ కిట్లు’ పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని 5,90,980 మంది బాలికలకు ఈ నెల 24 నుంచి హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనిపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షించారు. అలాగే హరితహారం కార్యక్రమంపైనా సమీక్ష జరిపారు. ఈ నెల 31 వరకు జిల్లా పరిషత్, ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకుల, కేజీబీవీ, పాఠశాల ల్లోని బాలికలందరికీ హైజీన్ కిట్లు అందించాలని నిర్ణయించారు. ఈ కిట్లలో బాలికలకు కావాల్సిన 14 రకాల వస్తువులు ఉండేలా రూపొందించారు. ఏడాదికి సరిపడా వస్తువులను ఒకేసారి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం ఒక్కో విద్యార్థినిపై ఏటా రూ.1,600 ఖర్చు చేస్తున్నామని, మొత్తంగా రూ.100 కోట్ల వరకు వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల బాలికలు 4,18,440 మంది, మోడల్ స్కూళ్ల బాలికలు 55,195 మంది, కేజీబీవీ బాలికలు 80,999 మంది, గురుకులాల విద్యార్థినులు 9,651 మంది, ఎయిడెడ్ పాఠశాలల బాలికలు 26,695 మంది.. మొత్తం 5,90,980 మంది బాలికలకు కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. 25న ‘హరిత పాఠశాల–హరిత తెలంగాణ’ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి ‘హరిత పాఠశాల–హరిత తెలంగాణ’ కార్యక్రమం చేపట్టాలని కడియం అధికారులను ఆదేశించారు. హరితహారం నిర్వహణకు ప్రతి పాఠశాలలో విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్లను నియమించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు గ్రీన్ బ్రిగేడ్ల కోసం దుస్తులు, టోపీలు, రుమాళ్లు సమకూర్చాలన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఉన్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు దాదాపు కోటి పూలు, పండ్ల మొక్కలు ఇవ్వాలని వెల్లడించారు. హరితహారంలో నాటిన మొక్కల్లో బతుకుతున్న మొక్కల శాతం విద్యాసంస్థల్లోనే ఎక్కువగా ఉందన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల గ్రామం లోని రెసిడెన్షియల్ పాఠశాలలో గతంలో నాటిన మొత్తం వెయ్యి మొక్కలనూ పరిరక్షించారని చెప్పారు. సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రిన్సి పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీకే ఝా, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘రైతు మేలు కోరి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం’
సాక్షి, వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నగరం చుట్టూ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 1,446 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 74 కిలోమీటర్ల ఔటర్ రింగురోడ్డును మంజూరు చేశారని అన్నారు. వరంగల్‌ను సాహిత్యం, సంస్కృతి హబ్‌గా తీర్చిదిదుద్దటకు హన్మకొండలో 50 కోట్ల రూపాయలతో కాళోజీ కళాక్షేత్రం నిర్మించనున్నామని వెల్లడించారు. బుధవారం కడియం మీడియాతో మాట్లాడారు. 3227 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 10.78 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంగల లింగంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వరంగల్ నగరానికి తాగునీరు అందించడానికి మార్గం సగమం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులు వచ్చాయని వెల్లడించారు. భూ రికార్డుల్లోని లోపాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎందరో రైతుల మేలుకోరి సీఎం కేసీఆర్ భూ రికార్డుల ప్రక్షాళన చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమం కింద కోటి 40 లక్షల ఎకరాల భూములకు పట్టాదార్ పాసుపుస్తకాలు ఇచ్చామని తెలిపారు. రైతుబీమా పథకంలో భాగంగా జిల్లాలో 43,510 రైతులకు బీమా పథకం పత్రాలను అందజేశామని వెల్లడించారు. -
ప్రజల అంగీకారంతోనే నిర్మిస్తాం..
చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్): లింగంపల్లి గ్రామస్తుల అంగీకారంతోనే రిజర్వాయర్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని లింగంపల్లిలో రూ.3,223 కోట్లతో 10.78 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించేందుకు గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు ఆదివారం గ్రామ సమీపంలోని సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షత వహించారు. ముందు గ్రామస్తులతో అభిప్రాయం కోసం మాట్లాడించగా కన్నీరు పెట్టుకుంటూ ఎట్టిపరిస్థితుల్లో రిజర్వాయర్ నిర్మాణానికి తమ భూములు ఇచ్చేది లేదని తెలిపారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజలు అనుకున్న విధంగా పోలీసు బలగాలు, అధికారుల హెచ్చరికలతో సాఫీగా పనులు చేయవచ్చని, ఆ విధానం సీఎం కేసీఆర్‌కు నచ్చదని, అందుకే అభిప్రాయ సేకరణ సభ నిర్వహించినట్లు తెలిపారు. వాస్తవంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ రిజర్వాయర్లు ఉన్నాయని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేనందున సీఎం కేసీఆర్ ఇక్కడ కూడా సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థలసేకరణ చేయాలంటూ ఆదేశించారని అన్నారు. అందుకు గీసుకొండ, మైలారం, స్టేషన్‌ఘన్‌పూర్, గండిరామారం రిజర్వాయర్లను పరిశీలించగా మల్కాపూర్–లింగంపల్లి మధ్య ఎంపిక చేశామని తెలిపారు. ఇక్కడ 848 ఇళ్లు, 4,400 ఎకరాలు, తక్కువ ముంపుతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. 4,139 మంది ప్రజలు మాత్రమే ఇబ్బంది పడతారని, రానున్న రోజుల్లో వర్షాలు లేకున్నా తోటి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని భావిస్తున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణానికి గ్రామస్తులు సహకరించాలని కోరా రు. దేవాదుల సీఈ బంగారయ్య మాట్లాడుతూ 4,400 ఎకరాల్లో నిర్మించే లింగంపల్లి రిజర్వాయర్ పూర్తయ్యాక, ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద 78 మెగావాట్ల పంప్‌హౌజ్ నిర్మించి మూడు పైప్లైన్ల ద్వారా నీటిని నింపనున్నట్లు తెలిపారు. జనగామ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముంపు భూముల ప్రజలకు న్యాయం జరిగిన తర్వాతే పనులు మొదలవుతాయని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ కోరినవిధంగా ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు కృషిచేస్తానని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు స్వామినాయక్, ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, ఆర్డీఓ రమేశ్, తహసీల్దార్ గంగాభవాని, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, బబ్బుల వంశి, తెల్లాకుల రామకృష్ణ, ఉద్దెమారి రాజ్‌కుమార్, వరప్రసాద్, గొడుగు రవి, జంగిటి ప్రభాకర్, ఇల్లందుల సుదర్శన్, పాగాల సంపత్‌రెడ్డి, జనగాం యాదగిరి పాల్గొన్నారు. -
స్కూళ్లకు ప్రత్యేక స్లాబ్‌లో ఆస్తిపన్ను
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలకు ప్రత్యేక స్లాబ్‌లో ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రైవే ట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పని చేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది లేదన్నా రు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో సమస్యలపై గురువారం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కడియం శ్రీహరి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యాసంస్థల అనుమతులు, గుర్తింపు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాయి. అనంతరం సమావేశ వివరాలను కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల భద్రతలో యాజమాన్యాలు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందేనని, అగ్నిమాపక చర్యలు చేపట్టాలని యాజమాన్యాలకు మంత్రులు స్పష్టం చేశారు. జాతీయ అగ్నిమాపక నిబంధనలు రాకముందు ఏర్పాటైన పాఠశాలల భవనాలకు ఆ నిబంధనలు వర్తింపజేయడంలో ఎలాంటి వెసులుబాటు కల్పించాలనే దానిపై కమిటీ వేస్తామన్నారు. పాఠశాలలకు ఆస్తిపన్నును తగ్గించాలన్న యాజమాన్యాల విజ్ఞప్తిని మంత్రులు అంగీకరించి, ప్రత్యేక స్లాబులో ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు చేపడతామని, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో అది అమల్లో ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై కమిటీ! ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో డిగ్రీ, జూనియర్ కాలేజీలకు సరైన న్యాయం జరగడం లేదని పేర్కొనగా.. దానిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య చైర్ పర్సన్‌గా ఆర్థిక శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్యదర్శులు సభ్యులుగా కమిటీ వేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలు, కాలేజీల అనుమతులకు ఎన్వోసీల జారీని వికేంద్రీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాల్సిందేనని యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలపై కక్షసాధింపు ధోరణి ఏమీ లేదని, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించాలని పేర్కొన్నారు. -
పీహెచ్డీ స్థాయిని దిగజార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) సాధారణ డిగ్రీ కాదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఓ పరిశోధన. అలాంటి పీహెచ్డీ స్థాయిని దిగజార్చవద్దు. కొన్ని యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. అడ్డగోలుగా ప్రవేశాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టండి’’ అని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లను గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. ‘‘ఇప్పటివరకు ఏ యూనివర్సిటీ ఎన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది, ప్రస్తుతం ఏ యూనివర్సిటీలో ఎంతమంది పీహెచ్‌డీలు చేస్తున్నారు, వారు ఎన్నేళ్లుగా చేస్తున్నారు’’అన్న సమగ్ర వివరాలను సేకరించి తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డికి సూచించారు. నాలుగైదేళ్లకు మించి పీహెచ్‌డీకి సమయం ఇవ్వడానికి వీల్లేదని, ఐదేళ్లు దాటిన వారి ప్రవేశాలను రద్దు చేయాలని, అలాంటి వారు ఎందరు ఉన్నారో తేల్చాలని వైస్ చాన్స్లర్లను ఆదేశించారు. పీహెచ్డీ ప్రవేశాలను కూడా నెట్, స్లెట్ ప్రతిభ ఆధారంగా చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీల పనితీరుపై వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లతో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి గవర్నర్ సమీక్షించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దు.. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీలు ఒకే రకమైన నిబంధనలు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని సహించబోనని గవర్నర్ తేల్చిచెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిబంధనల ప్రకారమే ప్రవేశాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో బాలికలపై ఆకృత్యాలు జరక్కుండా పక్కా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా హాస్టళ్ల పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వారికి భద్రత కల్పించాలని సూచించారు. మహిళా ప్రొఫెసర్ నేతృత్వంలో కమిటీ, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. సంతృప్తిగా ఉన్నా సమీక్ష అనంతరం గవర్నర్ నరసింహన్ విలేకరులతో మాట్లాడారు. ‘విశ్వవిద్యాలయాల అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్?’అని విలేకరులు అడగ్గా ‘చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్మెంట్ కావాలి’అని పేర్కొన్నారు. విద్యలో నాణ్యత పెంచేందుకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని, అవి ఉపాధి అవకాశాలు పెంచేలా ఉండాలన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఇతర విద్యార్థులతో కలసి గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేయాలని వీసీలకు సూచించామని తెలిపారు. ఉన్నత విద్య పటిష్టానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కితాబిచ్చారు. సమావేశంలో చర్చించిన పలు అంశాలను కడియం వెల్లడించారు. ప్రస్తుతం పీహెచ్డీ ప్రవేశాల్లో గందరగోళం నెలకొందని, నెట్, స్లెట్, సెట్లలో మెరిట్ సాధించిన వారికే యూజీసీ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గైడ్స్ సమర్థతను పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ సూచించారని చెప్పారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అలాంటి కాలేజీలపై దయాదాక్షిణ్యాలు వద్దు యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులు సమాజానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో సమీక్షించి తగిన మార్పులు చేయాలని గవర్నర్ సూచించారు. అవి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేలా ఉండాలన్నారు. బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగే కాలేజీల్లో పక్కాగా నాణ్యత ప్రమాణాలు ఉండాల్సిందేనని, నాణ్యత ప్రమాణాలు లేని, మెరుగైన విద్యను అందించని కాలేజీలపై దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని, అలాంటి వాటిని మూసేయాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ద్వారా యూనివర్సిటీలు తమ సేవలను అందించి నిధులను సమీకరించుకోవాలన్నారు. వచ్చే ఏడాది విద్య, వైద్యానికి ప్రభు త్వం ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించనుందని పేర్కొన్నారు. న్యాక్ గుర్తింపు, 12 ఎఫ్, 12బీ స్థాయి కోసం అన్ని యూనివర్సిటీలు కృషి చేయాలని ఆదేశించారు. కామన్ అకడమిక్ కేలండర్ అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి యూజీసీ తరహాలో వ్యవహరించాలని సూచించారు. ఆర్జీయూకేటీ, వెటర్నరీ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. -
‘జనరల్ విద్యార్థులకూ గురుకులాలు’
సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్రంలో విద్యావవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సరైన సదుపాయాలు కల్పిస్తే మన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని పేర్కొన్నారు. జిల్లాలోని నెక్కొండ గురుకుల పాఠశాలలో ఆయన మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మంచి మెనూ తయారు చేసిందని అన్నారు. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లల ఆరోగ్యం కోసం.. ఒక్కో విద్యార్థినికి 1600 రూపాయల చొప్పున ఖర్చు చేసి 6 లక్షల మందికి హెల్త్, హైజనిక్ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాల బాలికల విద్యావృద్థికి తెలంగాణలో 53 గురుకులాలను ప్రారంభించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు జనరల్ కేటగిరీ విద్యార్థులకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని అన్నారు. -
‘అంబేద్కర్ లేకుంటే నేను లేను’
సాక్షి, హైదరాబాద్ : ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ఫలితంగానే ఫలించిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఆంద్రా బ్యాంక్ మూడో అఖిల భారత సర్వసభ్య సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కానని అన్నారు. అందరికి విద్యనందించాలన్న అంబేద్కర్ ఆశయంలో భాగమే గురుకులాలు అని పేర్కొన్నారు. దళితులు ఉన్నతంగా ఎదిగిన తరువాత కూడా వారిపై దాడులు జరుగుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ అవసరం లేదన్న సుప్రీంకోర్టు తీర్పుపై దళితులు రోడ్డెక్కారని, పీఓఏ (అట్రాసిటి చట్టం) చట్టాన్ని కాపాడడం కోసం అనేక మంది చనిపోయారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పీఓఏ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని కడియం డిమాండ్ చేశారు. ‘ఆ చట్టాని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతునిస్తుంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు పీఓఏ చట్టాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పేదలకు లబ్ది చేకూరాలని బ్యాంకులను జాతియం చేశారు. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు లక్షల కోట్లు దోచుకున్నారు. పేదవానికి పదివేలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. -
నాలుగేళ్లుగా అడుగుతున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు నాలుగేళ్లుగా అభ్యర్థిస్తున్నా ఫలితం లేదని, విభజన చట్టంలోని హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. విశ్వనగరంగా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎంతో సహా అభ్యర్థిస్తున్నా ఇప్పటివరకు ముందడుగు పడలేదన్నారు. కడియం శ్రీహరి సారథ్యంలో టీఆర్ఎస్ ఎంపీల బృందం గురువారం జవదేకర్‌ను కలసి విభజన చట్టం హామీలపై చర్చించింది. అనంతరం తెలంగాణ భవన్లో జరిగిన మీడియాతో కడియం మాట్లాడుతూ.. ‘ఏపీ విభజన జరిగి నాలుగేళ్లయినా తెలంగాణకు ఇప్పటివరకు గిరిజన వర్సిటీ మంజూరు చేయలేదని జవదేకర్‌కు వివరించాం. దీని ఏర్పాటుకు భూమి, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాం. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతుంటారని.. గణితంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కరీంనగర్లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని విన్నవించాం’అని చెప్పారు. 14 కొత్త జిల్లాల్లో కేవీలు, నవోదయ విద్యాలయాలు లేవని వివరించగా మంత్రి స్పందిస్తూ.. కేంద్రం త్వరలో దేశవ్యాప్తంగా వాటిని మంజూరు చేయనుందని, అప్పుడు తెలంగాణకూ మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో వివిధ విద్యాసంస్థల ఏర్పాటుపై నాలుగేళ్లుగా అన్ని రకాలుగా అభ్యర్థనలు చేస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదని కడియం అన్నారు. మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నందున మేల్కొని విద్యాసంస్థల ఏర్పాటుకు ముం దుకు రావాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. కేజీబీవీలను 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసినందున మధ్యాహ్నం భోజన సదుపాయమూ కల్పించాలని కోరామని చెప్పారు. తెలంగాణకు హోదా ఇవ్వాలి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ తీర్మానించిందని.. తెలంగాణకూ హోదా ఇచ్చేలా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏపీకి హోదా ఇచ్చినట్లయితే అవే రాయితీలు తెలంగాణకు ఇవ్వాలని.. ఏపీకి హోదా ఇచ్చి తెలంగాణకు ఇవ్వకుంటే తాము నష్టపోతామన్నారు. ఏపీతో తెలంగాణ పోటీ పడడం లేదని, అసలు ఏపీ పోటీ కాదన్నారు. ఏపీనే తెలంగాణను పోటీగా భావిస్తోందని కడియం పేర్కొన్నారు. ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, సంతోష్, బడుగు లింగయ్య యాదవ్‌లు పాల్గొన్నారు. -
‘తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కావాలి’
న్యూఢిల్లీ : విభజన చట్టంలో పొందు పరిచిన హామీలు అమలు చేయలేదని, తెలంగాణకు న్యాయం చేయాలని కోరిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీల బృందం గురువారం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో టీఆర్ఎస్ నేతలు చర్చించారు. విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణకు సంబంధించిన అంశాలు పట్టించుకోలేదని, హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్, విద్యాసంస్థలు లాంటి అన్ని అంశాల్లో అన్యాయం జరిగిందని జవదేకర్‌కు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకేం అభ్యంతరం లేదని, తెలంగాణకు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని లేనిపక్షంలో దానికి సమానంగా నిధులిచ్చి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘ప్రత్యేక హోదా ఫలాలు తెలంగాణకు ఇవ్వాలి. పరిశ్రమలు ఏపీకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఏపీ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాజకీయ లబ్దికోసం ఏపీలో పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. విభజన చట్టం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణకు అన్యాయం చేసింది. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని’ టీఆర్ఎస్ ఎంపీలు సూచించారు. సోనియా ఇస్తే కాదు.. తెలంగాణ రాష్ట్రం సోనియా ఇస్తే రాలేదని, ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని కడియం శ్రీహరి అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నా కేంద్రం చిన్నచూపు చూస్తుందన్నారు. త్వరలోనే గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఐఐఎం తెలంగాణకు ఇవ్వాలని నాలుగేళ్ల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అడినట్లు గుర్తుచేశాం. 14 కొత్త జిల్లాలలో కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విధ్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. త్రిపుల్ ఐటీ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం. గణిత శాస్త్రం కోసం విద్యార్థులకు అడ్వాన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్ను హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరాం. మధ్యాహ్న భోజన పథకాన్ని 12వ తరగతి విద్యార్థుల వరకు పొడిగించాలని’ కేంద్ర మంత్రి జవదేకర్‌ను కడియం శ్రీహరి కోరారు. -
నేటి నుంచి తెలంగాణ కవితా సప్తాహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహాకవులు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య, డాక్టర్ సి.నారాయణరెడ్డిల జయంతిని పురస్కరించుకొని ఆదివారం నుంచి కవితా సప్తాహం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి తెలిపారు. ఈ నెల 22న దాశరథి కృష్ణమాచార్య, 29న సి.నా.రె. జయంతి ఉందని, వీరి పేరుతో ఓ మంచి సాహిత్య కార్యక్రమం చేపట్టామని చెప్పారు. శనివారం రవీంద్రభారతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కవితా సప్తాహంలో భాగంగా ప్రముఖుల ప్రసంగాలు, కవి సమ్మేళనాలు ఉంటాయని తెలిపారు. దాశరథి, సినారెల మధ్య సోదర సంబంధాలు ఉండేవని, వారిది అన్నాతమ్ముళ్ల అనుబంధమని పేర్కొన్నారు. 7 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా రోజూ 40 నిమిషాలు ప్రధాన ప్రసంగం, 11 మంది కవుల కవితాపఠనం ఉంటాయన్నారు. 22న మహాకవి దాశరథి కవితాప్రస్థానంపై డాక్టర్ గురిజాల రామశేషయ్య ప్రసంగముంటుందని తెలిపారు. 23న ‘తెలంగాణ వచన కవితావికాసం’పై డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, 24న ‘తెలంగాణ పద్య కవితా ప్రాభవం’పై డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, 25న ‘తెలంగాణ కవిత్వం – పాట ప్రస్థానం’పై డాక్టర్ పసునూరి రవీందర్, 26న ‘తెలంగాణ కవిత్వం–జీవితం’పై డాక్టర్ ఎస్ రఘు, 27న ‘తెలంగాణ కవిత్వం–అలంకారికత’పై డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, 28న ‘తెలంగాణ కవిత్వ విమర్శ’పై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడురోజుల కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా డాక్టర్ కేవీ రమణాచారి, బుర్రా వెంకటేశం, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ వెలిచాల కొండలరావు, దేవులపల్లి ప్రభాకర్‌రావు, డాక్టర్ ఆయాచితం శ్రీధర్, డాక్టర్ ఎన్ గోపిలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాలు రోజూ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కవితా సప్తాహం పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు. రవీంద్రభారతిలో నేడు దాశరథి జయంతి దాశరథి 94వ జయంతి కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరగనుంది. ఈ సందర్భంగా దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖకవి వఝల శివకుమార్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజ్మీరా చందులాల్ పాల్గొంటారని ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. -
యూజీసీ ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను (యూజీసీ) కొనసాగిస్తూనే దాని బలోపేతానికి చర్యలు చేపట్టాలని నిపుణులు, వైస్చాన్స్లర్లు అభిప్రాయపడ్డారు. యూజీసీని రద్దు చేసి ఆ స్థానంలో ప్రతిపాదిత హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) ఏర్పాటును వ్యతిరేకించారు. యూజీసీ స్థానంలో హెకీ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఇందులో భాగంగా సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హెకీపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలు, వీసీలు, రిటైర్డ్ వీసీలతో సమావేశం నిర్వహించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కె.కేశవరావు, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ భేటీ లో హెకీ ముసాయిదా బిల్లులోని పలు అంశాలపై చర్చించారు. ఆయా అంశాలతో నివేదికను రూపొం దించి ఈ నెల 20లోగా కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ప్రస్తుతం హెకీ అవసరమే లేదని, అయి నా కేంద్రం హెకీని అమల్లోకి తేవాలనుకుంటే పలు సవరణలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు సామాన్యులకు విద్య అందించేలా ఉండాలి: కడియం కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు నాణ్యమైన విద్యనందించేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతిపాదిత హెకీ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. వర్సిటీలకు నిధుల పెంపుతోపాటు, నేరుగా వర్సిటీలకు అవి వచ్చేలా, ఇన్సెంటివ్‌లు ఇచ్చేలా సవరణలు చేయాలన్నారు. డ్రాఫ్ట్ బిల్లుపై అభిప్రాయాలు చెప్పేందుకు మూడు వారాలే ఇవ్వడం సరికాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు వల్ల ఫీజులు పెరుగుతాయని, గ్రాంట్స్ తగ్గుతాయన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ కేకే మాట్లాడుతూ ఈ ముసాయిదా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సి వస్తుందేమోనన్నారు. -
వరంగల్ అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయం
సాక్షి, వరంగల్ : శ్రీభద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మృతుల పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం తరుపున చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ సురేష్ అనే వ్యక్తికి నిమ్స్‌లో చికిత్స అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, సీపీ కె.రవిందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4న వరంగల్ నగర శివారు కోటిలింగాల దేవాలయం సమీపంలోని శ్రీభద్రకాళి ఫైర్ వర్క్స్‌లో పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. -
విద్యా వలంటీర్లను నియమించండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల బదిలీలతో ఏర్పడిన ఖాళీల స్థానంలో విద్యా వలంటీర్లను నియమించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖను ఆదేశించారు. దీనికి త్వరితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు ఉపాధ్యాయ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 20లోపు యాజమాన్యాల వారీగా విద్యావలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సాధారణ బదిలీల వల్ల ఖాళీ అయిన చోట కాంట్రాక్టు లెక్చరర్లను తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. -
శరత్ కుటుంబానికి మంత్రులు, నేతల భరోసా
హైదరాబాద్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి శరత్ కొప్పు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రులు, నేతలు భరోసా ఇచ్చారు. ఆదివారం అమీర్‌పేట జాగృతి ఎన్‌క్లేవ్‌లోని శరత్ నివాసానికి వెళ్లిన మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్, బండారు దత్తాత్రేయ.. శోకసంద్రంలో ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు రామ్మోహన్, మాలతిలను ఓదార్చారు. శరత్ మృతికి సంతాపం ప్రకటించి అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. శరత్ మరణం బాధాకరం: కేటీఆర్ దుండగుడి కాల్పుల్లో శరత్ దుర్మరణం చెందడం బాధాకరమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, బాధను వ్యక్తం చేశారని.. కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఘటనపై అమెరికా దౌత్య కార్యాలయ రీజినల్ పాస్‌పోర్టు అధికారితోపాటు షికాగో కాన్సులేట్ అధికారులతో ఫోన్లో మాట్లాడామన్నారు. భారత దౌత్య అధికారుల వివరాల ప్రకారం.. హత్యకు పాల్పడిన నిందితుడు ఎవరన్నది తెలియరాలేదన్నారు. హత్యకు గల కారణాలు తెలియడానికి మరికొంత సమయం పట్టొచ్చని చెప్పారు. అమెరికాలో శని, ఆదివారాలు సెలవు అయినందున భౌతిక కాయాన్ని హైదరాబాద్ తరలించేందుకు 4, 5 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ‘కుటుంబ సభ్యులు, బంధువులు అమెరికా వెళ్లాలనుకుంటే ప్రభుత్వపరంగా అత్యవసర వీసాలు, ప్రయాణ ఖర్చులు, ఏర్పాట్లు చేస్తామని చెప్పాం. వారు ఆలోచించుకుని చెబుతామన్నారు’అని కేటీఆర్ తెలిపారు. కాన్సస్‌లో చాలామంది తెలుగువారున్నారని.. అక్కడి వారితో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారని చెప్పారు. మరోవైపు శరత్ కొప్పు మృతిపై అమెరికా కాన్సులెట్ జనరల్ కథెరిన్ బి హడ్డా తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో శరత్ తల్లిదండ్రులు: కడియం దుండగుడిని పట్టుకోడానికి అమెరికా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి కడియం చెప్పారు. దుండగుడిని గుర్తించిన వారికి నగదు పారితోషికం కూడా ప్రకటించారన్నారు. తీవ్ర దుఃఖంలో ఏం మాట్లాడలేని పరిస్థితిలో శరత్ తల్లిదండ్రులు ఉన్నారని, తల్లి మాలతి మంచినీరు కూడా తీసుకోవడం లేదన్నారు. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని వైద్యులను సీఎం ఆదేశించారని చెప్పారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడి త్వరగా మృతదేహన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ తెలిపారు. శరత్ మృతదేహాన్ని రీజినల్ హబ్ సర్చ్ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిల్లు చెల్లింపులో గొడవ! ఎంఎస్ చేస్తూనే అక్కడి ఓ రెస్టారెంట్లో శరత్ పని చేస్తున్నట్లు తెలిసింది. దుండగుడు కాల్పులు జరిపింది కూడా ఆ రెస్టారెంట్లోనేనని శరత్ సోదరికి అతని స్నేహితులు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. బిల్లు చెల్లించే విషయంలో దుండగుడికి శరత్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని, పారిపోయేందుకు శరత్ ప్రయత్నించినా అప్పటికే 5 బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు తెలిసింది. గొడవకు గల కారణాలు తెలుసుకోడానికి విచారణ చేస్తున్నామని భారత దౌత్య కార్యాలయ అధికారులకు అక్కడి పోలీసులు తెలిపినట్లు సమాచారం. అన్ని విధాలా సాయం చేస్తాం: సుష్మ శరత్ మృతిపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన వివరాలను పోలీసుల ద్వారా> తెలుసుకుంటున్నామని, విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామని ట్వీట్ చేశారు. శరత్ తండ్రితో మట్లాడానని, కుటుంబ సభ్యులు కాన్సస్ వెళ్లాలనుకుంటే వీసా ఏర్పాటు చేస్తామన్నామని పేర్కొన్నారు. భౌతిక కాయాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. -
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 45శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,07,694 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, 1,06,240 మంది పరీక్షలు రాశారు. వీరిలో 48,644 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 45.79గా నమోదైంది. బాలురు 44.05 శాతం, బాలికలు 48.06 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో వరంగల్ గ్రామీణ జిల్లా 89.08 శాతంతో ముందు వరుసలో ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా 23.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. పరీక్ష ఫలితాలను విద్యాశాఖ bse.telangana.gov.inలో అందుబాటులో ఉంచింది. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున సంబంధిత హెడ్మాస్టర్ సూచన మేరకు బ్యాంకు ద్వారా ఈ నెల 8లోగా చెల్లించాలి. జవాబు పత్రాల జిరాక్సు ప్రతుల కోసం ఈ నెల 8 నుంచి 16 వరకు సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చెల్లించాలి. 2017 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 59.93% ఉత్తీర్ణత నమోదైంది. -
విద్యాసంస్థల్లో 2 కోట్ల మొక్కలు నాటాలి: కడియం
సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థల్లో 2కోట్ల మొక్కలు నాటాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా విద్యా, అటవీశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు, పాఠశాల్లో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులున్నారని, ఇందులో 25 లక్షల మంది విద్యార్థులకు 5 పండ్ల మొక్కల చొప్పున ఇచ్చి వారి ఇంటి ఆవరణలో నాటేలా ప్రోత్సహించాలన్నారు. దీంతో దాదాపు 1.25కోట్ల మొక్కలు నాటడం పూర్తవుతుందన్నారు. అదే విధంగా యూనివర్సిటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న ఖాళీ స్థలాల్లో కోటి మొక్కలు నాటాలని చెప్పారు. దీంతో 2 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పూర్తవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, అటవీశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీకే ఝా, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ అదర్ సిన్హా పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజయ్యతో ఎలాంటి విభేదాలు లేవు : కడియం
సాక్షి, జనగామ : తనకు రాజయ్యకు ఎలాంటి విభేదాలు లేవనీ, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మాత్రమే వినియోగిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్‌పుర్ మండలంలోని తాటికొండ గ్రామంలోని నూతన పంచాయితీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని జన్మలెత్తినా స్టేషన్ ఘన్‌పుర్ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. ఎవరికీ తలవంపులు తీసుకురాకుండా.. ఒక్క పైసా లంచం తీసుకోకుండా పనిచేస్తున్నానని అన్నారు. నియోజక వర్గ ప్రజల విశ్వాసాన్ని నిలబెడతానని, నాకు రాజయ్యకు ఎలాంటి విభేదాలు లేవనీ కలిసే పని చేస్తామని స్పష్టం చేశారు. ఆనాడు దేవాదుల ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చానని, ఈనాడు లింగంపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. వారంలోపే లింగంపల్లి రిజర్వాయర్ పనులకు టెండర్లు పిలిచి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాటికొండ, మీదికొండ, కొత్తపల్లి గ్రామాలకు 4వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కాలువలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తాటికొండ నుండి గండిరామరం మీదుగా నర్మెట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అందించారని, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్దికి నా సహాయసహాకారాలు ఉంటాయని చెబుతూనే.. రాజయ్య కోరిన జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై దాట వేశారు. -
సంఘాల అంగీకారం తర్వాతే వెబ్‌కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సమ్మతి తీసుకున్న తర్వాతే చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన టీచర్ల బదిలీల అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికీ అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ చేపట్టిందన్నా రు. ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అంగీకరించిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని కొద్దిరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పదో న్నతులు ఇవ్వడం లేదని చెప్పారు. మేనేజ్‌మెంట్లవారీగా బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేద్దామని చెబితే ఉపాధ్యాయ జేఏసీలు అంగీకరించిన తర్వాతే జూన్ 6న జీవో 16ను తీసుకొచ్చామన్నారు. సీనియార్టీ విషయంలో కొంతమంది తప్పుడు పత్రాలు పెట్టా రని తెలిసిన వెంటనే వాటిని సరిదిద్ది తుది జాబితా వెల్లడించామన్నారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ వద్దని కొన్ని సంఘాలు అంటుండటం సరికాదన్నారు. కొందరు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని, ఇతర కారణాలతోనూ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టులో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 26కి రిజర్వ్ చేశారని, ఈలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేశామని, వెబ్ కౌన్సెలింగ్‌లో బదిలీల నిర్వహణను ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షించిందన్నారు. వెబ్ కౌన్సె లింగ్ వద్దంటూ తన వ్యక్తిగత ఫోన్‌కు వేల మెస్సేజ్ లు, వందల కాల్స్ చేయిస్తున్నారని, ఈ ఎస్సెమ్మెస్ లు ఎక్కడి నుంచి పెట్టిస్తున్నారో విచారణ చేయించి, తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ౖపై కొంతమంది యూనియన్ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పొరపాట్లు సరిదిద్దారు.. టీచర్ల బదిలీ షెడ్యూల్లో మార్పులు చేసిన విద్యాశాఖ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఆప్షన్ తేదీల గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో పొరపాట్లను సరిదిద్దే చర్యలను విద్యాశాఖ వేగిరం చేసింది. ఇందులో భాగంగా కీలక దశలో ఉన్న వెబ్‌కౌన్సెలింగ్ గడువును పొడిగించి ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం ఇచ్చింది. ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం) వెబ్‌కౌన్సెలింగ్ ముగిసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్‌కౌన్సెలింగ్ గడువును ఒకరోజు పెంచింది. ఈ నెల 26 వరకు స్కూల్ అసిస్టెంట్లు వెబ్ఆప్షన్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు) వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ మొరాయిస్తుండటంపై విద్యాశాఖకు ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలను అధిగమించే క్రమంలో ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్సైట్ మొరాయించడమే కీలక సమస్యగా మారింది. దీంతో ఓటీపీ రావడం, ఆప్షన్ల నమోదు ప్రక్రియ గంటల తరబడి జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సర్వర్ల ఏర్పాటుతో టీచర్లకు ఊరట లభించినట్లైంది. -
బాలికా విద్యకు ప్రాధాన్యం: కడియం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మహారాష్ట్ర పర్యటనలో కడియం శ్రీహరి ముంబైలో మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేతో శుక్రవారం సమావేశమై విద్యారంగంలో ఇరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై చర్చించారు. దేశంలో ఎక్కడా లేనన్ని 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో తెలంగాణలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది నుంచే మొదటి ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాధించే విధంగా కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వినోద్ తావ్డే కడియం శ్రీహరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.,, -
విద్యార్థినులకు ప్రత్యేక పౌష్టికాహారం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకులాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల్లో ఎక్కువ మంది రక్తహీనత, పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ లోపాన్ని అధిగమించేందుకు ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్‌తో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ఇందుకు షెడ్యూల్ రూపొందించుకోవాలన్నారు. గురువారం సచివాలయంలో గురుకుల సొసైటీ కార్యదర్శులు, విద్యా శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. బాలికలకు పౌష్టికాహారంలో భాగంగా బెల్లంతో చేసిన పల్లీ పట్టీలు, నువ్వుల పట్టీలను స్నాక్స్ రూపంలో ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నెలకు ఆరుసార్లు మాంసాహారం, వారానికి ఐదు రోజులు గుడ్లు, ఉదయం రాగిమాల్ట్, పాలు, అల్పాహారం ఇవ్వడంతో పిల్లల ఆరోగ్యం కొంత మెరుగుపడిందన్నారు. మధ్యాహ్న భోజనంలో 50 గ్రాముల నెయ్యి, రాత్రి పూట మంచి భోజనం ఇస్తున్నామని తెలిపారు. దీనివల్ల గురుకుల విద్యార్థులలో చురుకుదనం పెరిగిందని, ఆరోగ్యం బాగుండటం వల్ల చదువు కూడా బాగా చదువుతున్నారన్నారు. నీట్, జేఈఈ పరీక్షల్లో తెలంగాణ గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థులే అధికంగా సీట్లు కైవసం చేసుకునే విధంగా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే వారికి కోచింగ్ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ జూలై నుంచి అందిస్తున్నామని, ఇందులో బాలికలకు అవసరమైన 13 రకాల 50 వస్తువులున్నాయన్నారు. ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీల నుంచే కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభు త్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్య, సాం ఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమ గురుకులాల డైరెక్టర్ భట్టు మల్లయ్య, మైనారిటీ గురుకులాల డైరెక్టర్ షఫీ యుల్లా, విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్ల డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు అనిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెక్నీ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి అనిల్ సోబమ్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈనెల 20 నుంచి జూలై 2 వరకు బార్సిలోనా వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఈ సందర్భంగా అనిల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన చాంబర్లో సత్కరించారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి పేరు తెచ్చేలా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ విలేజ్ సీఈవో మొహమ్మద్ శంషుద్దీన్ పాల్గొన్నారు. మణిపూర్‌కు చెందిన సోబమ్ హైదరాబాద్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడా ప్రతిభాన్వేషణలో భాగంగా స్మార్ట్ ఫుట్‌బాల్ డైరెక్టర్, కోచ్ అల్బర్ట్ వియాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సోబమ్ తన సత్తాను చాటుకున్నాడు. ట్రయల్స్‌లో రాణించి కాటలోనియా ఫుట్‌బాల్ సమాఖ్య నిర్వహించే ఫుట్‌బాల్ క్యాంప్‌నకు ఎంపికయ్యాడు. -
ఆర్టీసీ సమ్మె.. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఈ నెల 11 నుంచి సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మెపై సీఎం కేసీఆర్ ఫైర్ అవ్వడంతో టీఎంయూ గౌరవ అధ్యక్షడు హరీష్‌రావుతో ఆ సంఘం నేతలు శనివారం భేటీ అయ్యారు. అనంతరం కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీకి మంత్రి హరీష్‌రావు టీఎంయూ నేతల అభిప్రాయాలను వివరించారు. ఈ భేటీలో కార్మికులు సమ్మెకు వెళితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అవసరమైనపక్షంలో ఎస్మా ప్రయోగిస్తే జరిగే పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. మంత్రుల అంతర్గత భేటీ అనంతరం టీఎంయూ నేతలతో మంత్రులు చర్చలు జరిపారు. కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకున్న మంత్రులు ప్రగతి భవన్‌కు బయలు దేరారు. కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కేటీఆర్, హరీష్ రావ్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అవి ఉత్త మాటలే: కడియం
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకాన్ని రాబందు పథకమంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. ఉత్తమ్‌వి ఉత్తమాటలేనని, రైతుబంధు పథకాన్ని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభినందిస్తున్నారని ఆయన తెలిపారు. సచివాలయంలో గురువారం కడియం విలేకరులతో మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో కాంగ్రెస్ ఊహించని విధంగా రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, ఎకరాకు రూ.4 వేలు, ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం వంటి ఎన్నో కార్యక్రమాల్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఉత్తమ్ అవగాహనతో మాట్లాడాలని కడియం సూచించారు. -
84 కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 475 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) ఉండ గా, అందులో 84 కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్స రం నుంచే ఇంటర్మీడియట్ ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. కేబ్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు కేంద్రం కేజీబీవీల్లో 12వ తరగతి వరకు నిర్వహణకు చర్య లు చేపట్టిందన్నారు. అందులో భాగంగా 84 కేజీబీవీలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. వీటిల్లో ప్రవేశాలకు నోటిఫికే షన్ను జారీ చేశామన్నారు. గురువారం సచివా లయంలో టీచర్ల బదిలీల వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేజీబీవీల్లో ప్రస్తుతం ప్రతి సెక్షన్‌కు 20 మందినే తీసుకోవాలన్న నిబంధన ఉన్నప్పటికీ దానిని 40కి పెంచాలని, ఆర్ట్స్, సైన్స్ గ్రూపులు ఉండేలా చూడాలని చేసిన సిఫార్సుకు కేంద్రం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లోనూ కేజీబీవీ విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కేజీ బీవీలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఇంటర్ సీట్లు లభించవన్న ఆందోళన ఉండదన్నారు. అప్‌గ్రేడ్ చేసిన ప్రతి 3 కేజీబీవీల్లో రెండింటిలో సైన్స్ గ్రూపులు, ఒక దాంట్లో ఆర్ట్స్ గ్రూపులు ప్రవేశపెడుతున్నామన్నారు. అన్ని ఉన్నత పాఠశాలల్లోని 6.25లక్షల మంది బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. ఇందుకు సీఎం రూ.100 కోట్లు కేటాయించారన్నారు. బాలికల కిట్స్‌పై విమర్శలేంటి? కేజీ టు పీజీ ఏమైందని, ఈ కిట్స్ కొత్త పథక మేమీ కాదని కొందరు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర వైద్య శాఖ కిశోర బాలిక స్వాస్థ్య యోజన పథ కం కింద బాలికలకు 6 రూపాయలకు 6 న్యాప్కిన్లు అందిస్తోందని, అదీ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోనే ఇస్తోందన్నారు. ఇందుకు రూ.2.5 కోట్లే కేటాయించిందన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి తనకు ఫోన్ చేసి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పథకం బాగుందని, ప్రధానిని కలిసి దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతానని చెప్పారన్నారు. ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్ ప్రారంభం ఉపాధ్యాయ బదిలీల వెబ్‌సైట్‌ను (http:// transfers.cdse.telangana.gov.in)anfana.gov.in) ఈ సందర్భంగా కడియం శ్రీహరి ప్రారంభించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రభుత్వ డిగ్రీ, జూని యర్, పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల బదిలీల సమాచారం ఇందులో ఉందన్నారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల బదిలీల సమాచారం ఉందన్నారు. కేజీబీవీలు కేంద్ర పథకం అయినందున అందులో బదిలీలు ఉండవన్నారు. మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు ఆగస్టులో చేపడతామన్నారు. 8,792 మంది టీచర్ల రిక్రూట్‌మెంట్‌ను టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టామని, కొంతమంది దీనిపై కోర్టుకు వెళ్లారన్నారు. త్వరలోనే కోర్టులో స్టే ఎత్తివేయించి భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలనే ఆలోచనలోనే ఉందన్నారు. ఫీజుల నియంత్రణ కమిటీ ఇచ్చిన 10% పెంపును అమలు చేయడం లేదన్నారు. -
కేజీబీవీల సంఖ్య పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: బాలికా విద్యపై ఏర్పాటైన సబ్ కమిటీ (కేబ్స్) ఇచ్చిన నివేదిక ఆధారంగా కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల్లో (కేజీబీవీ) ఇంటర్ వరకు విద్యనందించే విషయంలో పాఠశాలల అప్‌గ్రేడేష్‌ను కొన్నింటికే పరిమితం చేయడం సరికాదని, వీటి సంఖ్యను పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉంటే 94 స్కూళ్లలోనే ఇంటర్ విద్యనందించేందకు కేంద్రం అనుమతించిందని, తరగతి గదికి 20 మంది విద్యార్థులనే పరిమితం చేయడం సరికాదని ఆయన వివరించారు. పలు అంశాలపై కడియం మంగళవారం ఢిల్లీలో ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బండ ప్రకాశ్‌లతో కలసి కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు. అందులో ప్రముఖంగా ఇంటర్ వరకు విద్యాబోధనకు కేజీబీవీల సంఖ్యను పెంచడం, గ్రూపుల వారిగా తరగతికి 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాలల అప్‌గ్రేడేషన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని, ఇంటర్ వరకు విద్యాబోధనకు ప్రతి పాఠశాలకు 15 మంది టీచర్ల అవసరం ఉంటుందని, కేంద్రం 9 మందినే నియమిస్తామనడం సరికాదన్నారు. అందులో కూడా క్వాలిఫైడ్ టీచర్ల నియమించి, రూ.40 వేల వేతనాలు చెలించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.7.5 కోట్లు విడుదల చేయాలని, ప్రస్తుతం నిర్ణయించిన వరంగల్ జిల్లా మాము నూరు ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లను ప్రారంభించేందుకు జాతీయ పశువైద్య మండలి అనుమతులిచ్చిన నేపథ్యంలో.. అడ్మిషన్లపై కడియం వెటర్నరీ కౌన్సిల్ డైరెక్టర్ కరుణ్ శ్రీధర్‌తో సమావేశమై చర్చించారు. -
తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్ : బడి తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. జూన్ ఒకటో తేదీన పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని, ఆ రోజుకల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకే యూనిఫాం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, ఈ ఏడాది నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా యూనిఫాం ఇస్తామని స్పష్టం చేశారు. పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం కడియం శ్రీహరి ఎస్ఎస్ఏ భవన్లో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కొత్త విద్యాసంవత్సరాన్ని విజయవంతంగా నడిపించాలని, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఉన్నందున వేసవి సెలవులను ముందుకు జరిపామని పేర్కొన్నారు. దీంతో ఈ ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొనే అవకాశముంటుందని చెప్పారు. 8 లక్షల మంది విద్యార్థినులకు ‘కిట్స్’ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి 85 కోట్ల రూపాయల ఖర్చుతో ఎనిమిది లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. జెడ్పీ స్కూళ్లు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఈ కిట్లు అందిస్తామన్నారు. ఈ కిట్లలో విద్యార్థినులకు అవసరమైన కాస్మొటిక్ వస్తువులు ఉంటాయని, అవన్నీ బ్రాండెడ్ వస్తువులేనని చెప్పారు. ఒక్కో కిట్ ధర రూ.400 వరకు ఉంటుందని, ప్రతి కిట్‌లో మూడు నెలలకు సరిపోయేలా వస్తువులుంటాయన్నారు. ఏటా నాలుగుసార్లు ఈ కిట్లు సరఫరా చేస్తామన్నారు. కిట్ల పంపిణీలో స్థానిక నేతలను కూడా భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. జూలైలో అన్ని పాఠశాలల్లో హరితహారం జూలైలో అన్ని పాఠశాలల్లో పెద్ద ఎత్తున హరితహారం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈసారి విద్యా వాలంటీర్ల అవసరం లేకుండా కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలు నిర్వహిద్దామని అనుకున్నామని.. కానీ కోర్టు కేసుల వల్ల మళ్లీ వాలంటీర్లను నియమించుకోవల్సి వస్తోందని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. విద్యా సంవత్సరం అకడమిక్ కేలండర్పై జూన్ మొదటి వారంలో వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. ఈ వర్క్‌షాప్‌లో సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం)పై కూడా సమీక్ష చేస్తామని, ఇందులో వచ్చిన ప్రతిపాదనలను అమలు చేస్తామన్నారు. -
ప్రస్తుతానికి బదిలీలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గం సుగమమైంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే బదిలీలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో జరిగిన బదిలీల ఉత్తర్వుల్లోని నిబంధనల ఆధారంగా.. స్వల్ప సవరణలతో తాజా బదిలీల ప్రక్రియ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశంపై బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బదిలీల కంటే ముందే పదోన్నతులు ఇవ్వాలని ఈ భేటీలో ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే పదోన్నతుల అంశం సర్వీసు నిబంధనలతో ముడిపడి ఉందని, అది తేలనిదే పదోన్నతులివ్వడం కష్టమని, దీనిపై కోర్టు కేసులు కూడా ఉన్న నేపథ్యంలో పదోన్నతుల కౌన్సెలింగ్ వీలుకాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం బదిలీల అంశంపై చర్చించారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 12, 86లలోని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరగా.. అధికారులు సానుకూలంగా స్పందించారు. టీచర్లకు ఎనిమిదేళ్లు.. : ఉపాధ్యాయుల తప్పనిసరి బదిలీ సమయాన్ని కూడా సమావేశంలో నిర్ధారించారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులను బదిలీ చేయాలని నిర్ణయించారు. అదే స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల)కు మాత్రం ఎనిమిదేళ్ల పరిమితి నిర్ధారించారు. పాత జిల్లాల ప్రకారమే బదిలీలు చేపడుతున్నందున ఒక్కో జిల్లాకు అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని పరిశీలకుడిగా నియమించాలని.. యాజమాన్యాల వారీగా బదిలీలు నిర్వహించాలని.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఇక ఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి ప్రత్యేక న్యాయవాదిని నియమించాలని ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లలో ఏకాభిప్రాయం వచ్చిన వాటికి పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. మిగతా అంశాలపై అంతర్గత సమావేశం నిర్వహించి చర్చిస్తామని స్పష్టం చేసింది. బదిలీలకు సంబంధించి సంఘాలు చేసిన సూచనలతో ప్రతిపాదనలు రూపొందించి.. ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో బదిలీల మార్గదర్శకాలు వెలువడనున్నట్లు సమాచారం. -
దేశంలో శాశ్వత రాజకీయ నాయకులెవరూ లేరు
-
‘హడావుడి చేయడం కాదు’
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే ఉత్పన్నమయ్యే తొలి ప్రశ్న.. ఎవరు చేశారని? అలాగాకుండా.. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ తప్పుకు ఆస్కారం ఎలా ఏర్పడిందని ప్రశ్నించడం సరైన పద్ధతి..’’అని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. అంతేతప్ప కొందరు అధికారులను సస్పెండ్ చేసి తమాషా చేయడం, ఏడెనిమిది గంటల పాటు అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాలు, హడావుడి చేయడం సరికాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోందని సెంటర్ ఫర్ మీడి యా స్టడీస్ సంస్థ విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ.. సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ చందా చేసిన విమర్శలపై కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సోమవారం హైదరాబాద్ లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ‘తెలంగాణ ఎక్సలెన్సీ’ పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అవినీతి అంశంపై సురేశ్ చందా వ్యాఖ్యలు చేయగా కేటీఆర్, కడియం శ్రీహరి ప్రతిస్పందించారు. కొందరు నేతలు, అధికారులు అవినీతిపరులు ఉండవచ్చని.. అందరూ అవినీతి పరులే అన్నట్టుగా విమర్శించడంలో అర్థం లేదన్నారు. అధికారులు అర్థం చేసుకోవాలి..: కేటీఆర్ ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో పనులను త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తేవడం జరుగుతుందని, ఈ విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. చాలా రాజకీయ పార్టీలు మళ్లీ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తాయని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అదే ఐఏఎస్ అధికారుల సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. రాజకీయ నాయకుల పదవీకాలం ఐదేళ్లు మాత్రమే ఉంటుందని, తదుపరి ఎన్నికల్లో తిరిగి గెలవడం కోసం ప్రజల పనులు చేయటానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కోరుకుంటున్న ‘మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ (స్వల్ప ప్రభుత్వం.. అధిక పాలన)’సాధన దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే పౌర సేవలను అందుకునేలా పాలన ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ప్రజాదర్బార్ నిర్వహించి గ్రామ, మండల స్థాయి అధికారులు మంజూరు చేయాల్సిన పింఛన్లను ఇక్కడి నుంచి మంజూరు చేస్తే విఫల ప్రభుత్వానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, మండల స్థాయిలో జరగాల్సిన పనులు అక్కడే జరగాలని స్పష్టం చేశారు. తాను అమెరికాలో ఆరేళ్ల పాటు నివాసమున్నానని.. కేవలం డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం మాత్రమే అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. ‘డీసెంట్రలైజ్ (వికేంద్రీకరణ), డిజిటలైజ్ (కంప్యూటరీకరణ), డెమొక్రటైజ్ (ప్రజాస్వామికరణ)’అనే ‘త్రీడీ’మంత్రంతో పాలన సాగిస్తే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టిందన్నారు. రాష్ట్రం గత రెండేళ్లుగా ఈఓడీబీలో అగ్రస్థానంలో ఉందని.. పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతుల కోసం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అందరినీ ఒకేగాటన కట్టొద్దు: కడియం కొందరు రాజకీయ నేతలు, అధికారులు అవినీతిపరులు కావొచ్చని.. అందరూ అవినీతిపరులేనని విమర్శించడంలో అర్థం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. శాసన వ్యవస్థ, అధికార గణం, న్యాయస్థానాల తీర్పులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని.. ఈ పరిస్థితిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, మరొకరిపై నెపం నెట్టేసి తప్పించుకోవడానికి ప్రయత్నించడం సరికాదని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో అందరూ భాగస్వాములేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. తన తండ్రి వ్యవసాయ కూలీ అని, తనకు ఏ మాత్రం భూమి వారసత్వంగా రాలేదని కడియం పేర్కొన్నారు. 31 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎకరా పొలం కూడా సంపాదించలేకపోయానని.. 24 ఏళ్ల కిందే మంత్రి అయిన తనకు హైదరాబాద్‌లో రూ.కోటి విలువ చేసే ఇల్లు కూడా లేదన్నారు. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పుడు.. పక్షపాతంతోగానీ, ఎవరిపట్లనైనా ముందే ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడంకానీ మంచిది కాదని ఐఏఎస్ అధికారులకు సూచించారు. ఫైళ్లను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుని వెనక్కి పంపాలని.. మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అవినీతి పెచ్చరిల్లుతోంది..: సురేశ్ చందా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఫ్లైఓవర్ కుప్పకూలి అమాయకులు మృతి చెందారని.. పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ఆస్పత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి సురేశ్ చందా పేర్కొన్నారు. అలా దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో లంచాలు తీసుకోవడం సాధారణంగా మారిందని.. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదని వ్యాఖ్యానించారు. భారతదేశం సిఫార్సుల దేశమని.. సిఫార్సులు లేకుంటే ఇక్కడ ఏ పనీ జరగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందజేస్తున్న ‘తెలంగాణ ఎక్సలెన్సీ’పురస్కారాల కోసం సైతం సిఫార్సులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇటీవల సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో గతేడాది 73 శాతం కుటుంబాలు ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చాయని, రాష్ట్రం అవినీతిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. రాజకీయ నాయకత్వం, ప్రభుత్వాధికారులు చొరవ తీసుకుంటేనే ఈ పరిస్థితిలో మార్పు సాధ్యమవుతుందన్నారు. రాజకీయ అవసరాల కోసం జరిగే అధికార దుర్వినియోగానికి అడ్డుకట్టపడాల్సి ఉందన్నారు. సాంకేతికంగా తాను ప్రభుత్వం నుంచి బయట ఉన్నానని, అందుకే ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తనకు బాగా తెలుసుకునే అవకాశముందని పేర్కొన్నారు. లంచాల కోసం వేధిస్తున్నారు.. అధికారులు లంచాల కోసం కొర్రీలపై కొర్రీలు వేస్తూ బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసే విధానంలో సంస్కరణలు అవసరమని సురేశ్ చందా పేర్కొన్నారు. బిల్లు సమర్పించిన రోజే చెల్లింపులు జరిపేలా ఆన్లైన్ విధానం తీసుకురావాలన్నారు. ప్రభుత్వ శాఖలు సంబంధం లేని ఏవేవో పత్రాలను కోరే విధానానికి స్వస్తి పలికి.. పంజాబ్ తరహాలో పౌర సేవలను సరళీకృతం చేయాలని సూచించారు. కొందరు అధికారులు కావాలని నెలల తరబడి ఫైళ్లను తమ వద్దే పెట్టుకుంటున్నారని.. అందువల్ల ఫైళ్ల కదిలికలను ఆన్లైన్ చేసి ఏ ఫైల్ ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో తెలుసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలని సూచించారు. రాష్ట్ర ఐటీ శాఖ చొరవ తీసుకుని బిల్లుల చెల్లింపులు, ఫైళ్ల కదిలికలు తదితర సేవలను ఆన్లైన్ చేయాలని కోరారు. పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ బీపీ ఆచార్య, సీనియర్ ఐఏఎస్‌లు శాలినీ మిశ్రా, అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారీ, అధర్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన కడియం శ్రీహరి
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంటర్నల్స్ స్లైడింగ్ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు. ఫలితాలతో పాటు ఇంటర్ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటించారు. సీబీఎస్ఈ ఫలితాలు రాలేని వారికి, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ర్యాంక్‌లు ఇవ్వలేదని తెలిపారు. కాలేజీల్లో ప్రమాణలు పెరుగుదలతో ఇంజినీరింగ్ ఫలితాలు మెరుగుపడ్డాయన్నారు. కాగా తెలంగాణ ఎంసెట్ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను Sakshi Education వెబ్సైట్ లో చూడవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ ర్యాంక్‌లు 1. వెంకట పాని వంశీనాథ్(మాదాపూర్) 2. గట్టు మైత్రేయ (మాదాపూర్) 3.వినాయక (రంగారెడ్డి) 4. హేమంత్ కుమార్ (విశాఖపట్నం) 5.మదన్ మోహన రెడ్డి (విజయవాడ) 6. భరత్ (శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం) 7. యస్కర్ (హైదరాబాద్ మదీనాగూడ) 8. రిశీయంత్ (హన్మకొండ) 9. షేక్ వాజిద్ (రంగారెడ్డి) 10.వెంకట మల్లిబాబు (రంగారెడ్డి) అగ్రికల్చర్, ఫార్మసీ ర్యాంకులు 1. నమ్రత -కర్నూలు 2. సంజీవ్ కుమార్- హైదరాబాద్ 3. శ్రీఆర్యన్, ఆర్మూర్ 4.సంజన -మల్కాజ్గిరి 5. జయసూర్య-హైదరాబాద్ 6. గంజికుంట శ్రీవత్సావ్-ఆదోని 7. విచిత్- గోదావరి ఖని 8. అనగ లక్ష్మి- దిల్ సుఖ్ నగర్ 9. శ్రీ చైతన్య- కరీంనగర్ 10.సత్యశ్రీ సౌమ్య- ఖమ్మం -
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు సరికావు
రామచంద్రాపురం(పటాన్చెరు) : ప్రైవేటు పాఠశాలలపై ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్సూర్ అహ్మద్, జిల్లా వర్కింగ్ ప్రిసిడెంట్ జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 40లక్షల మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నామన్నారు. సుమారు 4లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాల బస్సులు గ్రామాల్లోకి వస్తే టైర్లలో గాలి తీయాలని ప్రజలను రెచ్చగొట్టడం డిప్యూటీ సీఎం హోదాకు తగదన్నారు. వెంటనే కడియం శ్రీహరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల అధ్యక్షుడు విలియంజేమ్స్, కోశాధికారి శేఖర్, సాయితేజ, రమణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
కడియం క్షమాపణలు చెప్పాలి: టీఆర్ఎస్ఎంఏ
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఎంఏ) అధ్యక్షులు సత్యనారాయణ, పాపిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు ఎప్పుడో విశ్వాసం కోల్పోయారని పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త కొత్త పేర్లతో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినా అందులో చేరిన విద్యార్థుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అని వ్యాఖ్యానించారు. దానిని అవమానంగా భావించిన కడియం అసహనంతో ప్రజావేదికలపై నుంచి ప్రజలను రెచ్చగొడుతూ ప్రైవేటు పాఠశాలల బస్సులు గ్రామాల్లోకి వస్తే టైర్లలో గాలి తీయాలని చెప్పడం సమాజంలో అశాంతికి దారితీసే ప్రయత్నం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి కూడా ఈ ప్రైవేటు పాఠశాలల బస్సులే కీలకపాత్ర పోషించిన విషయం మంత్రి మరవరాదని గుర్తుచేశారు. -
వ్యవసాయం దండగ కాదు..పండగ
నర్సంపేట రూరల్ : వ్యవసాయం దండగ అని నాటి పాలకులు మాట్లాడితే.. దండగ కాదు.. పండగ అని నేడు సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. నర్సంపేట మండలం భాంజీపేట గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడుతూ నాడు కరెంటు, విత్తనాలు, గిట్టుబాటు ధర కోసం అన్నదాతలు రోడ్కెక్కితే.. నేడు వ్యవసాయానికి ఉచితంగా 24గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు పెట్టుబడికి ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి రూ.4వేలు అందిస్తున్నది తెలంగాణ సర్కారు మాత్రమే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలతోపాటు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పనులు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడానికి దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ కాల్వలను ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరందించవచ్చన్నారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ గత పాలకులు సంక్షోభంలోకి నెట్టిన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ హరిత, వ్యవసాయ శాఖ జేడీఏ ఉషాదయాళ్, ఆర్డీఓ రవి, వ్యవసాయ శాఖ ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏసీపీ సునీతామోహన్, ఎంపీపీ బాదావత్ భద్రమ్మ, జెడ్పీటీసీ అజ్మీరా పద్మ, సర్పంచ్‌లు భూక్య లలితా వీరునాయక్, భాషబోయిన సాంబక్క రవి, వైస్ ఎంపీపీ కట్ల సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ భాషబోయిన సునీతారాజు, టీఆర్ఎస్ నాయకులు మచ్చిక నర్సయ్యగౌడ్, గూళ్ల అశోక్ , రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ రాయిడి రవీందర్‌రెడ్డి, మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహన్, మండల వ్యవసాయాధికారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 4 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: పదో తరగతిలో ఫెయిలైన, సరైన మార్కులు రాని విద్యార్థులకు జూన్ 4 నుంచి 19 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టెన్త్ ఫలితాల విడుదల సందర్భంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. నిర్ణీత రోజుల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని.. విద్యార్థులు మే 21వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీవాల్యుయేషన్, వెరిఫికేషన్‌కు దరఖాస్తులు విద్యార్థులు జవాబు పత్రాల రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీలను పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని కడియం సూచించారు. రీకౌంటింగ్‌కు 15 రోజుల్లోగా స్టేట్ బ్యాంక్ బ్రాంచీలో రూ.500 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను పోస్టు ద్వారా కానీ, నేరుగా కానీ పంపించవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీకి దరఖాస్తు ఫారాలను సంబంధిత ప్రధానోపాధ్యాయుడితో ధ్రువీకరణ సంతకం చేయించి, హాల్‌టికెట్ జిరాక్స్ కాపీ జత చేసి సంబంధిత డీఈవో కార్యాలయాల్లోని ప్రత్యేక కౌంటర్లో అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయానికి పోస్ట్/కొరియర్ ద్వారా పంపించే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారం నమూనాను www. bse.telangana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చలానా చెల్లించి.. 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇందులో గ్రేడ్ మారితేనే ఆయా విద్యార్థులకు సవరించిన ఫలితాలను ప్రకటిస్తామని వివరించారు. -
టెన్త్ ఫలితాల్లో జగిత్యాల జయభేరి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే టాప్‌గా నిలిచారు. బాలురు 82.46 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 85.14 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఈసారి 83.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక టెన్త్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్లు అధిక శాతం ఉత్తీర్ణత సాధించాయి. పలు ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మంచి ఫలితాలను సాధించాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను వెల్లడించారు. తగ్గిన ఉత్తీర్ణత.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 5,34,726 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 5,01,732 మందికాగా.. 32,994 మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారు. రెగ్యులర్ విద్యార్థుల్లో మొత్తంగా 83.78 శాతం మంది ఉత్తీర్ణులుకాగా.. బాలురు 82.46 శాతం, బాలికలు 85.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది మొత్తం ఉత్తీర్ణత 84.15 శాతం కావడం గమనార్హం. 21 స్కూళ్లలో జీరో.. రాష్ట్రవ్యాప్తంగా 2,125 పాఠశాలలు ఈసారి 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. అందులో 1,225 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. మరో 900 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి. ఇక 21 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. అందులో 11 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, 3 ఎయిడెడ్, 3 జెడ్పీ, 2 ఆశ్రమ పాఠశాలలు, ఒక ప్రభుత్వ, ఒక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి ఫెయిలైన వారి సంఖ్య 1,07,898 కావడం గమనార్హం. బీసీ గురుకులాల ముందంజ టెన్త్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాలు 96.18 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించాయి. రెండో స్థానంలో విద్యాశాఖ గురుకులాలు, మూడో స్థానంలో మోడల్ స్కూళ్లు నిలిచాయి. గిరిజన సంక్షేమ గురుకులాలు మినహా అన్ని గురుకులాలు రాష్ట్ర సగటు కంటే అధిక ఉత్తీర్ణత సాధించాయి. జగిత్యాల జిల్లా టాప్.. జిల్లాల వారీగా ఫలితాలను చూస్తే జగిత్యాల జిల్లా 97.56 శాతం అత్యధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా 97.35 శాతంతో జగిత్యాల జిల్లాయే తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఈసారి 94.03 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్ రెండో స్థానంలో నిలిచింది. కేవలం 51.94 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. పది రోజుల్లో మార్కుల జాబితాలు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కుల వివరాలను సంబంధిత పాఠశాలకు పదిరోజుల్లో పంపిస్తామని అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లను కూడా పంపిస్తామని.. ఆ సర్టిఫికెట్తో ఇంటర్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. కొందరు విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని, వారికి సంబంధించి నిర్ణయాన్ని త్వరలో పాఠశాలలకు వివరిస్తామని చెప్పారు. 4,768 మందికి 10/10 జీపీఏ టెన్త్ ఫలితాల్లో పదికి పది గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ)ను 4,768 మంది విద్యార్థులు సాధించారు. గతేడాది 2,427 మంది విద్యార్థులకే 10/10 జీపీఏరాగా.. ఈసారి అదనంగా 2 వేల మంది సాధించారు. మరో 7,115 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించగా, 9,042 మంది 9.7 జీపీఏ, 31 మంది 9.6 జీపీఏ, 10,720 మంది 9.5 జీపీఏ సాధించారు. గత రెండేళ్లలో రెగ్యులర్ విద్యార్థుల ఫలితాలు.. వివిధ మేనేజ్మెంట్ల వారీగా టెన్త్ ఫలితాల తీరు.. గణితంలోనే ఎక్కువ మంది ఫెయిల్ టెన్త్ పరీక్షల్లో గతేడాదిలాగే ఈసారి కూడా గణితం సబ్జెక్టులోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. 4,43,256 మంది విద్యార్థులు గణితం పరీక్షలు రాయగా.. 88.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గణితం తర్వాత ఎక్కువ మంది సామాన్య శాస్త్రంలో ఫెయిలయ్యారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలకు హాజరైన వారు, ఉత్తీర్ణత శాతం ఇంగ్లిష్ మీడియంలో అధిక ఉత్తీర్ణత పదో తరగతి ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థుల కంటే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా పదో తరగతి ఉత్తీర్ణత 83.78 శాతంకాగా.. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 88.96 శాతం, తెలుగు మీడియం విద్యార్థులు 75.37 శాతం ఉత్తీర్ణులయ్యారు. అంటే 13 శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. ఇంగ్లిష్ మీడియంలో గతేడాది 88.33 శాతం ఉత్తీర్ణులుకాగా.. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. అటు తెలుగు మీడియంలో గతేడాది 78.66 శాతం పాస్‌కాగా.. ఈసారి ఉత్తీర్ణతా శాతం తగ్గింది. మీడియం వారీగా ఉత్తీర్ణత వివరాలు -
తెలంగాణ పదో తరగతి ఫలితాలు: బాలికలదే పైచేయి