‘పార్టీ బలోపేతం కేటీఆర్‌తోనే సాధ్యం’ | KTR Appointment is a great Decision, Kadiyam Srihari | Sakshi
Sakshi News home page

‘పార్టీ బలోపేతం కేటీఆర్‌తోనే సాధ్యం’

Published Fri, Dec 14 2018 5:38 PM | Last Updated on Fri, Dec 14 2018 7:40 PM

KTR Appointment is a great Decision, Kadiyam Srihari - Sakshi

వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించబడ్డ కేటీఆర్‌కు మాజీ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేకు కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించిన తెలంగాణ సీఎంకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండలోని తన నివాసంలో  ప్రెస్‌మీట్‌లో శ్రీహరి మాట్లాడుతూ.. ‘కేటీఆర్‌కు శుభాకాంక్షలు. 2009 నుంచి నేటి వరకూ కేటీఆర్‌ తన సమర్ధతో పార్టీలో క్రియాశీల పాత్రను పోషించారు. సిరిసిల్ల ప్రజల మనుసు గెలిచిన వ్యక్తి కేటీఆర్‌. రాష్టంలో పరిశ్రమల, ఐటీ శాఖలలో సమూల మార్పులతో నూతన శకానికి నాంది పలికారు. వారసత్వ రాజకీలయాలకు భిన్నంగా స్వశక్తితో ఎదిగిన నేత కేటీఆర్‌. కేటీఆర్‌ నియామకంతో పాటు, పార్టీ ఎదుగుదలకు కావాల్సిన ప్రణాళికను కేసీఆర్‌ అప్పజెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం కేటీఆర్‌తోనే సాధ్యమవుతుంది. ఉమ్మడి వరంగల్‌లో 12లో 10 స్థానాలను ప్రజలు టీఆర్‌ఎస్‌కు అందించారు. జిల్లాలో నీటి ప్రాజెక్టులు, కాకతీయ టెక్స్ట్‌టైల్‌ పార్క్‌, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం చేపడతాం. భూకబ్జాల బాధితులు వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement