తెలంగాణ బాహుబలి కేసీఆర్‌: కడియం శ్రీహరి | Kadiyam srihari about kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ బాహుబలి కేసీఆర్‌: కడియం శ్రీహరి

Published Mon, Sep 17 2018 1:41 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

Kadiyam srihari about kcr - Sakshi

రేగొండ: రాష్ట్రంలో పాలన పరంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ బాహుబలి అని ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కాకతీయ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ విసృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డా అయిన కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని, బీజేపీకి గతంలో గెలిచిన సీట్లు సైతం దక్కే పరిస్థితి లేదన్నారు.

తెలంగాణలో దళితుడిని సీఎం చేయాలంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, తమ పార్టీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తోందని, రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నామని, ఈ విషయాన్ని అమిత్‌షా గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో తాజా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement