సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ కి బడుగులు, దళితులు గుర్తుకు రాలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్.రఘునందన్‌రావు మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేతగా సీనియర్ నాయకుడు, దళితనేత కడియం శ్రీహరిని ఎన్నుకోవాలని ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సూచించారు. ‘కేసీఆర్‌కు ఎలాగూ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్‌గా దళితుడిని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఒక బీసీని చేయాలని సూచించారు.
అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇచ్చి పాపాలు కడుక్కోవాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు ఇప్పుడు జ్యోతిబా పూలే గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. కవిత ఉన్నా లేకపోయినా పూలే గుర్తుంటారని, ఇందుకోసం వారు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. కవితకు, ఆమె ఫ్యామిలీకి పబ్లిసిటీ అంటే అంత పిచ్చి ఎందుకని అన్నారు. శాసనసభలో కేటీఆర్, హరీశ్ కనపడాలని, తెలంగాణ భవన్‌లో కేసీఆర్, మండలి లో కవిత కనపడాలంటే ఎలా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment