కేసీఆర్‌పై విమర్శలు చేయను: కడియం శ్రీహరి | Congress Kadiyam Srihari Political Counter To BRS Leaders | Sakshi
Sakshi News home page

ఎర్రబెల్లి, పల్లాకు కడియం శ్రీహరి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Tue, Apr 2 2024 11:42 AM | Last Updated on Tue, Apr 2 2024 1:29 PM

Congress Kadiyam Srihari Political Counter To BRS Leaders - Sakshi

సాక్షి, హన్మకొండ: బీఆర్‌ఎస్‌ నేతలకు, బీజేపీకి కాంగ్రెస్‌ నేత కడియం శ్రీహరి కౌంటరిచ్చారు. బీఆర్‌ఎస్‌ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని అవి బయటపెడితే తట్టుకోలేరని వార్నింగ్‌ ఇచ్చారు.  బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు. 

కాగా, కడియం శ్రీహరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ పార్టీ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ.. సీబీఐ, ఈడీలను ప్రయోగించి నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీలో చేరితే పునీతులవుతారు.. కాంగ్రెస్‌లో చేరితే విమర్శలు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లలో గెలిస్తే వారు రాజ్యాంగాన్నే మార్చేస్తారు. రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాదం ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అప్రజాస్వామిక పద్దతులను అడ్డుకోవాల్సి అవసరముంది. బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉంది. ఎన్నికల్లో నన్ను గెలిపించిన విధంగానే, కావ్యను కూడా గెలిపించాలని కోరుతున్నాను. 

బీఆర్‌ఎస్‌ను వీడటం కొంత బాధగానే ఉంది. కేసీఆర్‌పై నాకు గౌరవం ఉంది. ప్రత్యేకంగా కేసీఆర్‌పై నేను ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు. చాలా మంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపై పార్టీ నేతలు స్పందించలేదు. కానీ, నాపై మాత్రం బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, వారు మాట్లాడే పద్దతి బాగోలేదు. జిల్లా స్థాయి నేతలు కూడా నాపై అనవసర కామెంట్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు. 

ఎర్రబెల్లి దయాకర్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. నిన్ను పాలకుర్తి ప్రజలే చీకొట్టారు. ఇలాంటి అహంకార మాటల వల్లే ఓడిపోయావు. ఇప్పటికైనా ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది. బీఆర్‌ఎస్‌ ఇలాంటి దుస్థితికి రావడానికి కారణం పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వంటి నేతలే కారణం. పల్లా వంటి వ్యక్తి నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నువ్వు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించని రోజున జనగామలో నిన్ను బట్టలు ఊడదీసి నిలుచోపెడతాను. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి కిషన్‌కు కూడా వార్నింగ్‌ ఇచ్చారు. నిన్ను మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించారు. బుద్ధి లేకుండా అనవసర మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మీలాంటి అందరి చరిత్రలు నాకు తెలుసు. మీరు చేసిన దారుణాలు బయటపెడితే మీరు భరించలేరు, తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement