‘అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కే అనుకూలం’ | Kadiyam Srihari Says All Surveys are Positive For TRS | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 21 2018 7:15 PM | Last Updated on Sun, Oct 21 2018 7:15 PM

Kadiyam Srihari Says All Surveys are Positive For TRS - Sakshi

కడియం శ్రీహరి

సాక్షి, హైదరాబాద్ ‌: అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ భేటి విషయాలను కడియం మీడియాకు తెలిపారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రచార వ్యూహంపై అభ్యర్థులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచార తీరును కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారని, ప్రభుత్వ పథకాలు, పాక్షిక మేనిఫెస్టోపై అభ్యర్థులకు అవగాహన కల్పించారని తెలిపారు.

ప్రతీ ఓటరును చేరుకునేలా ప్రజల్లోకి వెళ్లాలని అభ్యర్థులకు సూచించనట్లు పేర్కొన్నారు. 100 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. అభ్యర్థులు అబ్ధిదారులందరినీ నేరుగా కలవాలన్నారు. టీఆర్‌ఎస్‌లో అసమ్మతి లేదని స్పష్టం చేశారు. మరోసారి కేసీఆర్‌ సీఎం కావడం చారిత్రక అవసరమని కడియం అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement