వరంగల్‌ అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయం | Kadiyam Srihari Distributes Ex Gratia To Fire Accident Families In Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌ అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయం

Published Thu, Jul 12 2018 6:51 PM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

Kadiyam Srihari Distributes Ex Gratia To Fire Accident Families In Warangal - Sakshi

బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

సాక్షి, వరంగల్‌ : శ్రీభద్రకాళి ఫైర్‌ వర్క్స్‌ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పట్టాలను గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మృతుల పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

గాయపడిన వారికి ప్రభుత్వం తరుపున చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ సురేష్‌ అనే వ్యక్తికి నిమ్స్‌లో చికిత్స అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యే అరూరి రమేష్‌, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, సీపీ కె.రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4న వరంగల్‌ నగర శివారు కోటిలింగాల దేవాలయం సమీపంలోని శ్రీభద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement