
సాక్షి,హైదరాబాద్: రానున్న ఉప ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం(సెప్టెంబర్2) కేటీఆర్‌తో హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నియోజకవర్గం పార్టీలో మరింత ఉత్సాహం నింపేలా సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
కాగా, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల కేసులో ఇటీవలే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెల రోజుల్లో ఈ విషయంలో చర్యలు మొదలు పెట్టాలని విచారణ స్టేటస్ రిపోర్టును తమకు నివేదించాలని స్పీకర్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటట్రావు, దానం నాగేందర్‌లపై బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది.
ఇదీ చదవండి.. రెండు నాలుకల కాంగ్రెస్.. ఇది ముమ్మాటికి మోసమే: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment