రెండు నాలుకల కాంగ్రెస్‌.. ఇది ముమ్మాటికీ మోసమే: కేటీఆర్‌ | KTR and BRS Serious On Congress Govt Over Rythu Bharosa | Sakshi
Sakshi News home page

రెండు నాలుకల కాంగ్రెస్‌.. ఇది ముమ్మాటికీ మోసమే: కేటీఆర్‌

Sep 20 2024 9:25 AM | Updated on Sep 20 2024 10:34 AM

KTR and BRS Serious On Congress Govt Over Rythu Bharosa

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు. ఇప్పుడు నేల చూపులు చూస్తు‍న్నారంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. 
ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలన
అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడు
తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయి
కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండా బద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం
మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు.
నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ?
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..?
420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు ?
చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..?
అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..?
ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన..
తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ…నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు.
గద్దెనెక్కాక  గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు.
ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు
జై కిసాన్
జై తెలంగాణ అంటూ కామెం‍ట్స్‌ చేశారు. 

 

 

ఇదే సమయంలో రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ స్పందించింది. బీఆర్‌ఎస్‌ ట్విట్టర్‌ వేదికగా..కౌలు రైతులకు కుచ్చు టోపీ పెట్టిన రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు - కౌలు రైతులకు నేరుగా రైతు భరోసా అని హామీ. ఎన్నికల తర్వాత-అసలు రైతుతో కౌలు రైతు మాట్లాడుకోవాలి అని చేతులు దులుపుకున్న దగాకోరు కాంగ్రెస్ సర్కార్ అంటూ సీఎం రేవంత్‌, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడిన వీడియోను షేర్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్‌ 2 నుంచి దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement