కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్‌ 2 నుంచి దరఖాస్తులు | CM Revanth Reddy orders action plan for issuing new ration cards October 2 | Sakshi

కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్‌ 2 నుంచి దరఖాస్తులు

Published Fri, Sep 20 2024 5:31 AM | Last Updated on Fri, Sep 20 2024 5:31 AM

CM Revanth Reddy orders action plan for issuing new ration cards October 2

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొత్త కార్డుల కోసం అక్టోబర్‌ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ పలుసూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్‌ రేషన్‌ కార్డులు ఇవ్వడంపై చర్చించారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ చౌహాన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement