సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (టీఆర్‌ఎస్‌ఎంఏ) అధ్యక్షులు సత్యనారాయణ, పాపిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు ఎప్పుడో విశ్వాసం కోల్పోయారని పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త కొత్త పేర్లతో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినా అందులో చేరిన విద్యార్థుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అని వ్యాఖ్యానించారు.
దానిని అవమానంగా భావించిన కడియం అసహనంతో ప్రజావేదికలపై నుంచి ప్రజలను రెచ్చగొడుతూ ప్రైవేటు పాఠశాలల బస్సులు గ్రామాల్లోకి వస్తే టైర్లలో గాలి తీయాలని చెప్పడం సమాజంలో అశాంతికి దారితీసే ప్రయత్నం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి కూడా ఈ ప్రైవేటు పాఠశాలల బస్సులే కీలకపాత్ర పోషించిన విషయం మంత్రి మరవరాదని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment