trsma
-
టెన్త్ విద్యార్థులను ప్రమోట్ చేయాలి
కవాడిగూడ: రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో టెన్త్ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజిమెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పదవ తరగతి పరీక్షలు రద్దుచేసి ఆన్లైన్లో అందజేసిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించి పై తరగతులకు అనుమతించాలని కోరారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు, మూడుసార్లు పరీక్షలు వాయిదా పడటం వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురై పరీక్షలు రాయాలనే సంసిసద్ధతను కోల్పోయారన్నారు. కరోనా నేపధ్యంలో ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలు రద్దుచేసి పైతరగతులకు ప్రమోట్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకొని పదవ తరగతి విద్యార్థులను పై తరగతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జలజం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎన్. రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్, నాయకులు రాంచంద్రారెడ్డి, రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
విలువలతో కూడిన విద్య అవసరం
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు నాణ్యమైన విద్యనందించడం ఎంత అవసరమో, విలువలతో కూడిన విద్యను అందించడం కూడా అంతే అవసరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యం లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎడ్యుకేషన్ ఎక్స్ పో–2019ను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎంత అవసరమో ట్రస్మా చాటిచెప్పిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, ప్లాస్టిక్ రహిత సమాజం పట్ల అవగాహన, మొక్కల పెంపకం, సమయ పాలన నేర్పాలని వీటిని విద్యాలయాల నుంచే పిల్లలకు దేశ చట్టాలు, విలువలు నేర్పించాలన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పేదల గృహాలకు డెవలపర్లు సహకరించాలి రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో ప్రైవేట్ డెవలపర్లూ భాగస్వాములు కావాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. పేదలకు సొంతింటి కలను తీర్చడాన్ని ప్రైవేట్ బిల్డర్లు సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్మించే పేదల గృహాలను వేగంగా పూర్తి చేయడంలో సహకరించాలని కోరారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన 2వ క్రియేట్ అవార్డ్స్–2019 ప్రదానోత్సవంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. విద్యుత్, నీటి వినియోగం ఎక్కువగా అవసరం లేని గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణాలపై డెవలపర్లు దృష్టి సారించాలన్నారు. -
కడియం క్షమాపణలు చెప్పాలి: టీఆర్ఎస్ఎంఏ
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఎంఏ) అధ్యక్షులు సత్యనారాయణ, పాపిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలు ఎప్పుడో విశ్వాసం కోల్పోయారని పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త కొత్త పేర్లతో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినా అందులో చేరిన విద్యార్థుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అని వ్యాఖ్యానించారు. దానిని అవమానంగా భావించిన కడియం అసహనంతో ప్రజావేదికలపై నుంచి ప్రజలను రెచ్చగొడుతూ ప్రైవేటు పాఠశాలల బస్సులు గ్రామాల్లోకి వస్తే టైర్లలో గాలి తీయాలని చెప్పడం సమాజంలో అశాంతికి దారితీసే ప్రయత్నం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి కూడా ఈ ప్రైవేటు పాఠశాలల బస్సులే కీలకపాత్ర పోషించిన విషయం మంత్రి మరవరాదని గుర్తుచేశారు. -
ఉపాధ్యాయులు దిశనిర్దేశకులు
సప్తగిరికాలనీ: విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. శుక్రవారం చింతకుంటలోని సంప్రదాయ గార్డెన్లో ట్రస్మా జిల్లాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ల అభినందన సభ, గురుపూజోత్సవం–2016 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, అతిథులుగా మేయర్ రవీందర్‌సింగ్, నగర కమిషనర్ కృష్ణభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి, ట్రస్మా వ్యవస్థాపకుడు కందాల పాపిరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎన్ రెడ్డి, కడారి అనంతరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ విద్యాసంస్థలే ఊపిరిగా నిలిచాయని గుర్తుచేశారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ట్రస్మా కూడా కారణమన్నారు. ట్రస్మా రాష్ట్ర నాయకులు కందాల పాపిరెడ్డి, ఎస్ఎన్ రెడ్డి, కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకూ ప్రభుత్వ పథకాలు వర్తింజేయాలని కోరారు. అనంతరం అతిథులందరూ జిల్లా న లుమూలల నుంచి వచ్చిన సుమారు 300 మంది కరస్పాండెంట్లు, 300 మంది ఉపాధ్యాయులను శాలువా, మెమోంటో, ప్రశంసపత్రాలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఉప విద్యాధికారి ఆనందం, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ట్రస్మా రాష్ట్ర జిల్లా శాఖ బాధ్యులు, పలు పాఠశాలల కరస్పాండెంట్లు లింగారెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వి.నరేందర్‌రెడ్డి, ఓదెలు, లింగయ్య, ప్రకాశ్, సర్వోత్తమరెడ్డి, దాసరి శ్రీపాల్‌రెడ్డి, సునీతరెడ్డి, శారదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానేరు పాఠశాల విద్యార్థులు చేసిన బతుకమ్మ నృత్యాలు ఆహుతులను అలరించాయి.