
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెక్నీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి అనిల్ సోబమ్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈనెల 20 నుంచి జూలై 2 వరకు బార్సిలోనా వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది.
ఈ సందర్భంగా అనిల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన చాంబర్‌లో సత్కరించారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి పేరు తెచ్చేలా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ విలేజ్ సీఈవో మొహమ్మద్ శంషుద్దీన్ పాల్గొన్నారు. మణిపూర్‌కు చెందిన సోబమ్ హైదరాబాద్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడా ప్రతిభాన్వేషణలో భాగంగా స్మార్ట్ ఫుట్‌బాల్ డైరెక్టర్, కోచ్ అల్బర్ట్ వియాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సోబమ్ తన సత్తాను చాటుకున్నాడు. ట్రయల్స్‌లో రాణించి కాటలోనియా ఫుట్‌బాల్ సమాఖ్య నిర్వహించే ఫుట్‌బాల్ క్యాంప్‌నకు ఎంపికయ్యాడు.