
లింగాలఘణపురం: ‘తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ద్రోహుల పార్టీ అని.. నేడు అదే పార్టీతో దోస్తీ ఎలా చేస్తున్నావ్..! కోదండరాం నీకు సిగ్గు లేదా? అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజయ్యతో కలసి రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీడీపీకి వేసినట్లేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అమరావతిలో ఉన్న చంద్రబాబును హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. టీడీపీతో మహా కూటమిని ఏర్పాటు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. ఒకవేళ పొరపాటున మహాకూటమి గెలిస్తే చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకుంటారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment