mahakutami
-
ఈసారి ఎవరిది పీఠం? ‘మహా’కూటముల్లో బీఎంసీ ఎన్ని‘కలవరం’
దాదర్: త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబిటీ)– శివసేనకు, కాంగ్రెస్‌కు పెద్ద సవాలుగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) ఘోర పరాజయం చెందడంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 288 స్ధానాలకు ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 23వ తేదీన ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ), ఏక్నాథ్ శిందే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మహా వికాస్ ఆఘాడి కూటమి అతి తక్కువ స్ధానాలతో ఘోర పరాజయం పాలైంది. దీంతో ఎంవీఏలో కలవరం మొదలైంది. 2022లోనే ముగిసిన గడువు... బీఎంసీ కార్యనిర్వాహక వర్గం గడువు 2022, మార్చితో ముగిసింది. ఈమేరకు 2022, ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాలి. కానీ ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో రెండున్నరేళ్ల కిందట ఉద్ధవ్ ఠాక్రే నేతత్వంలోని ఏవీఏ ప్రభుత్వం కుప్పకూలడం, ఆ తరువాత మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ ఏడాది మేలో లోక్‌సభ ఎన్నికలు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు.. ఇలా వరుసగా ఏదో ఒక అడ్డంకులు ఎదురు కావడంతో బీఎంసీ ఎన్నికలు తరుచూ వాయిదా పడుతూ వస్తున్నాయి. రెండున్నరేళ్ల నుంచి ఎన్నికలు జరగకపోవడంతో బీఎంసీలో కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయ ర్ ఇలా ప్రజాప్రతినిధులెవరు లేరు. దీంతో గత్యంతరం లేక అడ్మిన్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పర్వం పూర్తికావడంతో జనవరి లేదా ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్ని ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘార పరాజయాన్ని చవిచూసిన ఎంవీఏ కూటమిలో శివసేన(యూబీటీ)కి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు శివసేన(శిందే) వర్గంలో చేరేందుకు సిద్ధమైతున్నట్లు తెలిసింది. అదేవిధంగా మైనార్టీ వర్గాలు మినహా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు కొందరు బీజేపీ లేదా శిందే వర్గంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎంవీయే, కాంగ్రెస్, శివసేన(యూబీటీ), మరోవైపు గత 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న ఉద్ధవ్ సేనను గద్దె దించేందుకు బీజేపీ, శివసేన(శిందే)లు ఈసారి తీవ్రంగా శ్రమించాల్సిఉంటుంది. మళ్లీ ఫిరాయింపులు? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎంవీఏను ముఖ్యంగా ఉద్ధవ్ సేనను గట్టి దెబ్బ తీశాయి. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది మాజీ కార్పొరేటర్లు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత మరికొంత మంది శిందే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ లోక్‌సభ ఎనికల్లో మహాయుతికి ఆశించినంత మేర ఫలితాలు రాకపోవడం, ఏంవీఏకు ఊహించిన దానికంటే ఎక్కువ లోక్‌సభ స్ధానాలు సాధించడంతో జంపింగులు పూర్తిగా నిలిచిపోయా యి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏంవీఏ ఘోరంగా చతికిలపడటం, మహాయుతి విజయ ఢంకా మోగించడంతో మళ్లీ ఫిరాయింపులు మొదలేయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెన్నెస్.. అవకాశమే లేదు! 2017లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో శివసేన–84, బీజేపీ–82, కాంగ్రెస్–31, ఎన్సీపీ–9, ఎమ్మెన్నెస్–7, సమాజ్‌వాది పార్టీ–1, ఇండిపెండెంట్లు–14 మంది కార్పొరేటర్లు గెలిచారు. వీరందరి సహకారంతో బీఎంసీ ఐదేళ్లపాటు సజావుగా కార్యకలాపాలు సాగించింది. కానీ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. రెండున్నరేళ్ల కిందట ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న విభేదాల వల్ల బీఎంసీలో కూటమిగా ఉన్న శివసేన, బీజేపీ రెండుగా చీలిపోయాయి. దీంతో బీఎంసీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బీజేపీ స్పష్టంచేసింది. ఆ తరువాత ఎమ్మెన్నెస్‌కు చెందిన ఏడుగురు కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాక్కొవడంలో శివసేన సఫలీకృతమైంది. దీంతో ఎమ్మెన్నెస్‌కు ఒక్క కార్పొరేటర్ కూడా లేకుండా పోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెన్నెస్ ఒక్క సీటును కూడా సాధించలేదు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో జరి గే బీఎంసీ ఎన్నికల్లోనూ ఎమ్మెన్నెస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని, మహాయుతి, శివసేన(యూబీటీ)ల మధ్యే ప్రధానపోటీ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అంతంతమాత్రమే... కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్రంలో రెండున్నరేళ్లకే అధికారాన్ని కోల్పోవల్సి వచ్చింది. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైంది. దీంతో అనేక మంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు బీజేపీ, శివసేన(శిందే)ల్లో చేరే ప్రమాదం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి బీఎంసీ ఎన్నికలకు సీట్ల పంపకంలో కాంగ్రెస్‌కు చాలా తక్కువ స్ధానాలు లభించే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగానే మారనున్నాయి. -
మహాకూటమి అభ్యర్థుల నామినేషన్లు
సోలాపూర్: మహాకూటమి అభ్యర్థులు రామ్ సాత్ పూతే, రంజిత్ సింహ నింబాల్కర్ మంగళవారం సోలాపూర్, మాడా లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ముందుగా ధర్మవీర్ చత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్‌కు ఇరువురు అభ్యర్ధులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్ చౌక్ నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలిరాగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో సోలాపూర్ అభ్యర్థిగా రామ్ సాత్ పూతే మాడా అభ్యరి్థగా రంజిత్ సింహ నింబాల్కర్ సోలాపూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి కుమార్ ఆశీర్వాద్‌కు నామినేషన్లను సమర్పించారు. ఈ ర్యాలీలో ఎంపీ జై సిద్దేశ్వర స్వామి, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, సచిన్ కళ్యాణ్ శెట్టి, సుభాష్ దేశముఖ్, యశ్వంత్ మానే, సమాధాన్ అవతాడే, భవన్ రావు షిండే, సంజయ్ షిండే, జై కుమార్ గోరే, షాహాజీ పాటిల్, మాజీ మంత్రి లక్ష్మణరావు డోబలే, మాజీ ఎమ్మెల్యే రాజన్ పాటిల్, ప్రశాంత్ పరిచారక్, దీపక్ బాబా సాలోంకే, కిషోర్ దేశ్ పాండే, విక్రం దేశముఖ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర కాలే, జిల్లా అధ్యక్షుడు చేతన సింహ కేదార్, షాజీపవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ, శివసేనలతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల ఆఫీస్ బేరర్లు, ప్రతినిధులు, కార్యకర్తలు తమ పార్టీల జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. నాయకులందరూ ప్రత్యేక ప్రచార రథంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలగా వేలాది మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ వారిని అనుసరించారు. ర్యాలీ చత్రపతి శ్రీ శంభాజీ మహరాజ్ చౌక్ నుంచి ప్రారంభమై చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చౌక్, సరస్వతి చౌక్, చారు హుతాత్మ పూతల చౌక్‌కు చేరుకున్న అనంతరం శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అలాగే అక్కడ ఉన్న నలుగురు అమర వీరుల విగ్రహాలకు, అహల్యా దేవి హోల్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నాయకులంతా అంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగిస్తూ ...ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా మార్గదర్శనం చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి వల్ల బీజేపీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ధైర్య శీల మోహితే పాటిల్ కూడా... మరోవైపు మాడా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ పవార్ పార్టీ తరపున ధైర్య శీల మోహితే పాటిల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మాడా నియోజకవర్గం ఎన్నికల అధికారి మోనికా సింహ ఠాకూర్‌కు నామినేషన్‌ను సమర్పించారు. పాటిల్ రెండు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి ఎన్సీపీ పవార్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సింహ మోహితే పాటిల్ డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధైర్యశీల్ మోహితే పాటిల్ సతీమణి శీతల్ దేవి, సోదరుడు జయసింహ మోహితే పాటిల్ , మాజీ ఎమ్మెల్యే నారాయణ పాటిల్, పవార్ ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు బలిరాం కాకాసాటే, సురేష్ అసాపురే, శివసేనకు చెందిన అనిల్ కోకిల్ తదితరులు పాల్గొన్నారు. -
బిహార్ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఢోలక్ మోగించడంతో పాటు రంగులు చల్లుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇక బిహార్‌లో ఎన్డీయే కూటమి 18 స్ధానాల్లో గెలుపొంది 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి 9 స్ధానాల్లో గెలుపొంది 97 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2 స్ధానాల్లో, ఇతరులు 10 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 స్ధానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే అవసరమైన మేజిక్ ఫిగర్ 122 స్ధానాలను దక్కించుకునే దిశగా ఎన్డీయే కూటమి సాగుతోంది. మరోవైపు బిహార్‌లో అర్ధరాత్రి దాటేవరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తి ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. -
‘నా ఐదేళ్ల అనుభవం 50 ఏళ్లతో సమానం’
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో పాలక, విపక్ష కూటముల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తాను అనుభవం లేని నేతనే అయితే తనకు వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తోందని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ నైరాశ్యంలో ఉందని దాని తీరుతెన్నులే తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. నితీష్ కుమార్ ప్రతిష్ట మసకబారిందా అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి సీఎం అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు. చదవండి : నితీష్‌కు డబుల్ ట్రబుల్..! తనకు అనుభవం లేదని బీజేపీ చెబుతోందని, తాను ఎమ్మెల్యేగా విపక్ష నేతగా వ్యవహరించడంతో పాటు ఉపముఖ్యమంత్రిగానూ పనిచేశానని చెప్పారు. తన అయిదేళ్ల అనుభవం 50 సంవత్సరాల అనుభవంతో సమానమని ఆయన చెప్పుకొచ్చారు. బిహార్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రచారం తనకు ఎలాంటి సవాల్ విసరబోదని స్పష్టం చేశారు. బిహార్‌లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని జేడీయూ, బీజేపీకి అర్థమవడంతో వారు నిరాశలో కూరుకుపోయారని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. -
శరద్ యాదవ్ కుమార్తె కాంగ్రెస్‌లో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో నూతనోత్తేజం నెలకొంది. లోక్తాంత్రిక్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్‌రావు బుధవారం ఢిల్లీలో సీనియర్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఎల్జేపీ నేత, మాజీ ఎంపీ కాళీ పాండే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. తన తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా బిహార్‌లో మహాకూటమి తరపున పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను చేపడతానని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న సుభాషిణి పేర్కొన్నారు. చదవండి : బిహార్ ఎన్నికలు.. మరక మంచిదే తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా లేరని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా మహాకూటమిని బలోపేతం చేసి బిహార్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా సుభాషిణి చెప్పుకొచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్‌చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
మహాకూటమి : సీట్ల పంపకాలు ఖరారు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీల మధ్య సీట్ల సర్ధుబాట్లు కొలిక్కివస్తున్నాయి. మహాకూటమిలో పార్టీల సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. కాంగ్రెస్ 70 స్ధానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు 30 స్ధానాల్లో తలపడనున్నాయని మహాకూటమి వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌కు 70 స్ధానాలు ఇచ్చేందుకు అంగీకరించిన ఆర్జేడీ ఆయా స్ధానాల ఎంపికను మాత్రం ఆ పార్టీకి విడిచిపెట్టేందుకు అంగీకరించలేదని తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని పాలక ఎన్డీయే సైతం సీట్ల ఖరారుపై భాగస్వామ్య పక్షాలతో పట్నాలో కీలక భేటీ నిర్వహించింది. ఎన్డీయే తరపున సీట్ల పంపకాలను ఈనెల 4లోగా ఢిల్లీలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇక అధికారాన్ని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ తనదైన వ్యూహాలకు పదునుపెట్టారు. 2015లో తన విజయానికి బాటలుపరిచిన ఏడు సూత్రాల కార్యక్రమం 2.0ను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగారు. ఓట్ల వేటలో ఈ పథకం తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. కాషాయ కూటమితో జతకట్టిన నితీష్‌ను ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ముందుకొచ్చాయి. ఇక బిహార్‌లోని 71 స్ధానాలకు తొలి విడత పోలింగ్‌కు అప్పుడే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బిహార్‌లో 243 అసెంబ్లీ స్ధానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం -
బిహార్ ఎన్నికలు : నితీష్ వ్యూహాత్మక ఎత్తుగత
పట్నా : రాజకీయాల్లో ఏ సమయంలో ఏం చేయాలనేదే కీలకం. ఆ ఒడుపులన్నింటినీ ఒడిసిపట్టడంలో దిట్టగా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల సమయంలో భారీ పథకంతో వేడిని రాజేశారు. సెప్టెంబర్ 25న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ మూడు విడతల పోల్ షెడ్యూల్‌ను ప్రకటించిన మరుక్షణమే నితీష్ ఏడు సూత్రాల కార్యక్రమం -2ను ప్రకటించారు. 2015లో తన విజయానికి దోహదపడిన సాథ్ నిశ్చయ్ (ఏడు అంశాలు)కు కొనసాగింపుగా ఆయన ఈ ప్రకటన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలను సమకూర్చే నైపుణ్య శిక్షణా కార్యక్రమాల నుంచి మహిళలోల వ్యాపార దక్షతను పెంచడం, వ్యవసాయ భూములకు సాగునీరు లభ్యత, ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగపరచడం వంటి పలు అంశాలను ఈ ప్రణాళికలో పొందుపరించారు. వ్యాపారాలను ప్రారంభించే ఆసక్తి కలిగిన మహిళలకు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దళిత యువతీ, యువకులకూ ఈ తరహా పథకాన్ని నితీష్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. సాథ్ నిశ్చయ్ పథకం ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ను విజయతీరాలకు చేర్చింది. అప్పట్లో బీజేపీతో జట్టు కట్టిన రాం విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వహ, జితిన్ రాం మాంఝీ వంటి హేమాహేమీలను ఎదుర్కొని నితీష్ జయకేతనం ఎగురవేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీల సాయంతో నితీష్ ఆ ఎన్నికల్లో ఎదురీదుతారన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన సారథ్యంలోని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమి విజయం సాధించింది. చదవండి : బిహార్‌లో మహాకూటమికి షాక్ ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు కల్పించడంతో పాటు మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్రతి గ్రామలో రహదారుల నిర్మాణం చేపడతామని ఆ ఎన్నికల్లో నితీష్ వాగ్ధానం చేశారు. ఇప్పుడు ఆ పనులన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. ఆ ఊపుతోనే నితీష్ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాథ్ నిశ్చయ్-2ను తెరపైకి తీసుకువచ్చారు. మహాకూటమిని వీడి ఈసారి ఎన్డీయే పక్షాన అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతున్న నితీష్ మరోసారి విజయం సాధిస్తే ఆయన రికార్డుస్ధాయిలో ఏడోసారి బిహార్ పాలనా పగ్గాలను చేపడతారు. ఇక ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. -
బిహార్‌లో మహాకూటమికి షాక్
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలక ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విపక్ష ఆర్జేడీ కూటమి నుంచి వైదొలగుతున్నామని రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) స్పష్టం చేసింది. ఆర్జేడీ కూటమిలో తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని తాము ఆమోదించబోమని ఆర్ఎల్ఎస్పీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వహ ఇప్పటికే తేల్చిచెప్పారు. కాగా బీఎస్పీతో కలిసి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కుష్వహ ప్రకటించారు. మరోవైపు బిహార్ మాజీ సీఎం నితిన్ రామ్ మాంఝీ ఇప్పటికే ఎన్డీయే గూటికి చేరారు.మహాకూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ బయటకు రావడంతో బీఎస్పీ, ఎంఐఎంలతో ఆ పార్టీ జట్టుకట్టి మూడో ఫ్రంట్‌గా ప్రజల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఇక పట్నాలో బీఎస్పీ నేతలను కుష్వహ కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. చిన్న పార్టీలతో చర్చలు కీలక దశలో ఉన్నాయని ఆర్ఎల్ఎస్పీ వర్గాలు పేర్కొన్నారు. మరోవైపు ఎన్డీయే నుంచి తమకు ఆహ్వానం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ-జేడీ(యూ) కూటమితో రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తెగతెంపులు చేసుకుంటుందనే వార్తల నేపథ్యంలో మహా కూటమి నుంచి ఆర్ఎల్ఎస్పీ వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు! -
‘అందుకే బలహీన అభ్యర్ధులను దింపాం’
లక్నో : యూపీలో బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండికొట్టి ఎస్పీ-బీఎస్పీ కూటమికి మేలు చేసేందుకు పలు స్ధానాల్లో బలహీన అభ్యర్ధులను బరిలో దింపామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అంగీకరించారు. బీజేపీని ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతో ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి కాంగ్రెస్ లోపాయికారీగా సహకరిస్తుందనే వార్తలను ప్రియాంక నిర్ధారించడం గమనార్హం. యూపీలో ప్రచారం సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ యూపీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పుకొచ్చారు. తాము బలంగా ఉన్న స్ధానాల్లో గట్టిపోటీని ఇస్తూ బీజేపీని ఓడిస్తామని, తాము బలహీనంగా ఉన్న స్ధానాల్లో బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే అభ్యర్ధులను ఎంపిక చేశామని చెప్పారు. కాగా బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మహాకూటమిలో కలిసేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు రాహుల్, సోనియా పోటీచేస్తున్న అమేథి, రాయ్‌బరేలి స్ధానాల్లో ఎస్పీ-బీఎస్పీ తమ అభ్యర్ధులను బరిలో దింపలేదు. లోక్‌సభ ఎన్నికలు చరమాంకానికి చేరుకోవడంతో ఇక ఎన్నికల అనంతర పొత్తులపైనే ఆయా పార్టీలు దృష్టిసారించనున్నాయి. -
‘మహాకూటమి కాదు.. మహాకల్తీ గ్యాంగ్’
భాగల్పూర్/సిల్చార్: కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వస్తే తమ అవినీతి దుకాణాలు, వారసత్వ రాజకీయాలు మూతపడతాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. తనను అడ్డుకునేందుకు దేశంలోని విపక్షాలు ‘మహాకల్తీ గ్యాంగ్’గా మారాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్, అస్సాం రాష్ట్రాల్లో గురువారం జరిగిన బహిరంగ సభల్లో మోదీ విపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై దుష్ప్రచారం.. ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఏర్పడ్డ మహాకూటమిని మోదీ మహాకల్తీ గ్యాంగ్‌గా అభివర్ణించారు. ‘‘మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవనీ, రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ప్రమాదంలో పడతాయనీ, రిజర్వేషన్లు ఎత్తివేస్తాడని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ డా.బీ.ఆర్.అంబేడ్కర్ తీసుకొచ్చిన కోటా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ చౌకీదార్ (కాపలాదారు) అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇతరులకు నష్టం జరగకుండా ఆర్థికంగా బలహీనవర్గాల(ఈడబ్ల్యూసీ)కు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం. మోదీ మళ్లీ అధికారంలోకొస్తే తాము ఫినిష్ అయిపోతామని ఈ వేర్పాటువాద గ్యాంగ్ (ప్రతిపక్షాలు) భయపడుతోంది’ అని అన్నారు. నేటికీ పాక్‌లో వేధింపులు.. పౌరసత్వ చట్టాన్ని తెచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అస్సాంలోని సిల్చార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఎన్డీయే అధికారంలోకిరాగానే సమాజంలోని అన్నివర్గాలతో చర్చించి పౌరసత్వ చట్టాన్ని తెస్తాం. అస్సాం ప్రజల భాష, సంస్కృతి, గుర్తింపు, హక్కులకు రక్షణ కల్పిస్తాం. కాంగ్రెస్ దేశవిభజన సమయంలో పాక్‌లోని మైనారిటీల గురించి ఆలోచించలేదు. పాక్‌లోని మతోన్మాదులు మన సోదరుల్ని, సోదరీమణుల్ని చిత్రహింసలు పెట్టారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ దోషి కాదా? మన కుమార్తెలు నేటికీ పాక్‌లో వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఈసారి అధికారంలోకి వచ్చినవెంటనే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తాం. మన ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం’ అని హామీ ఇచ్చారు. -
మాయావతి వ్యాఖ్యలపై ఈసీ ఆరా
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి వివాదంలో చిక్కుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని కోరుతూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిశీలిస్తోంది. యూపీలోని దియోబంద్‌లో ఆదివారం జరిగిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ర్యాలీలో మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాయావతి ప్రసంగంపై నివేదిక పంపాలని సంబంధిత అధికారులను యూపీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. మహాకూటమిని ఓడించేందుకు ముస్లిం ఓట్లలో చీలికకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాయావతి ఆరోపిస్తూ ఆ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని కోరారు. బీజేపీని ఓడించాలని భావించే ముస్లింలు యూపీలో మహాకూటమివైపే నిలవాలని సూచించారు. మాయావతి ఇంకా ఏమన్నారంటే..‘ బీజేపీని ఓడించే సామర్ధ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు..మహాకూటమితోనే కాషాయ పార్టీని నిలువరించడం సాధ్యం..కాంగ్రెస్‌కు మాత్రం ఓటేయకండి..ఆ పార్టీ మహాకూటమి ఓటమిని కోరుకుంటోంద’ని మాయావతి అన్నారు. మాయావతి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఆమె వ్యాఖ్యలపై పూర్తి నివేదిక పంపాలని స్ధానిక అధికారులను కోరింది. -
బీజేపీకి ఓటమి భయం
దియోబంద్(సహరాన్పూర్): బీజేపీకి భయంతో వణికిపోతోందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయం తప్పదని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. తమ కూటమి గెలవడం ఇష్టంలేని కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్వేష పూరిత విధానాలు, ముఖ్యంగా చౌకీదార్(మోదీ) ప్రచారం తీరుతో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ పార్టీల మహాకూటమి తొలి ఎన్నికల సభలో మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ ప్రసంగించారు. న్యాయ్ సరైన పరిష్కారం కాదు ఈ సందర్భంగా మాయావతి.. ‘రోడ్డు షోలు, గంగ, యమున నదుల్లో పవిత్ర స్నానాలు, సినీ తారలకు టికెట్లు.. వంటివి కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కు లేదు. మహాకూటమి మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు. గతంలో ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన కోసమంటూ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఫలితం చూపిందా? పేదరికాన్ని రూపుమాపడానికి న్యాయ్ సరైన పరిష్కారం కాదు’ అని తెలిపారు. చౌకీదార్లను తొలగిస్తాం: ‘కోట్ల ఉద్యోగాలు ఇస్తామన చాయ్‌వాలా(టీ కొట్టు వ్యాపారి)ను 2014లో నమ్మాం. ఇప్పుడు చౌకీదార్‌ను నమ్మమంటున్నారు. ఈ చౌకీదార్ల(వాచ్మెన్)ను వాళ్ల చౌకీ(కాపలా పోస్ట్)ల నుంచి తొలగిస్తాం’ అని ర్యాలీలో అఖిలేశ్ ప్రకటించారు. తమ గఠ్ బంధన్(కూటమి) అవినీతిపరుల కూటమి కాదు, మహాపరివర్తన్(పూర్తిమార్పు) అని తెలిపారు. తనను తాను ఫకీర్(సన్యాసి)అని మోదీ చెప్పుకుంటుంటారు. హామీల అమల్లో విఫలమైతే నేను ఫకీర్‌ను వెళ్లిపోతున్నా అంటారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఉంచుదామా? వెళ్లగొడదామా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. అచ్చేదిన్ (మంచి రోజు) అంటే మోదీ ఉద్దేశం తన గురించే తప్ప, ప్రజలకు వచ్చే మంచి రోజుల గురించి కాదని అజిత్ సింగ్ ఎద్దేవా చేశారు. -
నేడు మహాకూటమి తొలి ర్యాలీ
లక్నో : లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ప్రచారం కొద్దిరోజుల్లో ముగుస్తుండటంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు యూపీలో జట్టుకట్టిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి ఆదివారం దియోబంద్‌లో తొలి ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ ర్యాలీతో కేంద్రంలో మోదీ సర్కార్‌కు దీటుగా తమ కూటమి ఎదురొడ్డి నిలుస్తుందనే సంకేతాలను ఓటర్లకు పంపేందుకు ఈ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. 2014లో యూపీలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకున్న బీజేపీని దెబ్బతీసేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిగా ఏర్పడటంతో పట్టు నిలుపుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తోంది. మరోవైపు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంకను తీసుకురావడంతో యూపీలో గౌరవప్రదమైన స్ధానాల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదునుపెడుతోంది -
బిహార్‌లో మహాకూటమి సీట్ల ఖరారు
పట్నా: బిహార్‌లో మహాకూటమిలోని పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పంపిణీ పూర్తయింది. ఈ రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా ఆర్జేడీకి 20 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. ఉపేంద్ర కూష్వాహకు చెందిన ఆర్ఎల్ఎస్పీ ఐదు స్థానాల్లో, జతిన్ రాం మాంఝీ పార్టీ హెచ్ఏఎం మూడు చోట్ల, ముకేశ్ సాహ్నీకి చెందిన వీఐపీ మూడు సీట్లలో పోటీ చేయనుంది. అయితే ఆర్జేడీ తమకు దక్కిన 20 సీట్ల నుంచి అరా నియోజకవర్గాన్ని సీపీఐ(ఎంఎల్)కు వదిలిపెట్టింది. సీట్ల కేటాయింపు వివరాలను బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వెల్లడించారు. దర్భంగా నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కీర్తి ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దర్భంగా టికెట్‌ను కీర్తికే ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.∙ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆర్జేడీ అబ్దుల్ బరీ సిద్దిఖీని బరిలోకి దింపుతోంది. ప్రధానంగా ఈ కారణంగానే సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పాటలీపుత్ర నుంచి మిసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి పోటీ చేయనున్నారు. దర్భంగా నుంచి అబ్దుల్ బరీ సిద్దిఖీని ఆర్జీడీ పోటీకి దింపుతుండటం అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు ఆర్జేడీ సీనియర్ నేత అష్రఫ్ ఫాత్మికి కూడా ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అష్రఫ్ ఫాత్మి ఆ స్థానం నుంచి గతంలో చాలా సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. బెగుసరాయ్ నియోజకవర్గంలో 2014లో పోటీచేసి ఓడిపోయిన తన్వీర్ హస్సన్‌నే ఆర్జేడీ మళ్లీ బరిలోకి దింపింది. పట్నాలో మీడియాతో మాట్లాడుతున్న తేజస్వీ -
మహాకూటమికి మహిళా నేత షాక్..
రాంచీ : లోక్‌సభ ఎన్నికలకు జార్ఖండ్‌లో మహాకూటమి పార్టీలు సీట్ల సర్ధుబాటును ప్రకటించిన మరుసటి రోజే కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నపూర్ణదేవి పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సంసిద్ధమయ్యారు. జార్ఖండ్‌లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటును ఆదివారం పార్టీ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్, జేఎంఎం, జేవీఎంలు వరసగా ఏడు, నాలుగు, రెండు స్ధానాల్లో పోటీ చేయనుండగా, ఆర్జేడీకి ఒక స్ధానం కేటాయించారు. సీట్ల సర్ధుబాటును ప్రకటించిన మరుసటి రోజే సోమవారం ఆర్జేడీ జార్ఖండ్ చీఫ్ అన్నపూర్ణదేవి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం కలకలం రేపింది. దేశ రాజధానిలో ఆమె బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. కాగా ఆదివారం రాత్రి జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్, ఇతర బీజేపీ నేతలతో అన్నపూర్ణదేవి భేటీ కావడంతో ఆమెను పార్టీ నుంచి ఆర్జేడీ సస్పెండ్ చేసింది. మరోవైపు చత్ర లేదా కొడెర్మా స్ధానాల్లో ఏదో ఒక చోట నుంచి ఆమెను బీజేపీ బరిలో దింపుతుందని భావిస్తున్నారు. -
కన్హయ్య కుమార్‌కు షాకిచ్చిన లూలూ ప్రసాద్..!
బిహార్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బిహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాలన్ని కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి వెళ్లనున్నట్లు ఇటీవల ఆయా పార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల సీట్ల పంపకాలు శుక్రవారం పూర్తయ్యాయి. ఆర్జేడీ 20, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా ప్రకటించారు. కేంద్ర మాజీమంత్రి రాం విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్‌జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. అంతేకాకుండా లోక్‌తంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) పార్టీ నేత శరద్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ గుర్తుతో పోటీ చేస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎల్జేడీ కూటమితో కలిసి పని చేస్తుందని మనోజ్ ఝా వివరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ నాలుగు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు కూటమి షాకిచ్చింది. సీట్ల కేటాయింపులో కన్హయ్య పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆర్జేడీ పోటీ చేసే స్థానాల్లో ఒక సీటును మాత్రమే సీపీఐ(ఎంఎల్)కి కేటాయిస్తామని మనోజ్ ఝా వెల్లడించారు. కాగా ఆయన బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కన్హయ్య అభ్యర్థిత్వానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బెగుసరాయ్ నుంచి ఆర్డేడీ తరఫున పోటీచేసి ఓటమి చెందిన తన్వీర్ హసన్‌ను అక్కడి నుంచి పోటీచేయించాలని లాలూ ప్రయత్నిస్తున్నారు. బెగూసరయ్‌లో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుందని, గ్రౌండ్‌లెవన్‌లో వామపక్షాలు అంత బలంగా లేరని ఆర్జేడీ భావిస్తోంది. ఇదిలావుండగా కన్హయ్య కుమార్‌ను సీపీఐ అభ్యర్థిగా ఇదివరకే ప్రకటించిన విషయ తెలిసిందే. -
మహాకూటమిలో ఏ పార్టీ ఎన్ని స్ధానాల్లో..
పట్నా : రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. ఆర్జేడీ 20 స్ధానాల్లో, కాంగ్రెస్ 9 స్ధానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ నాలుగు స్దానాల్లో, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవాం మోర్చా మూడు స్ధానాల్లో, లోక్తాంత్రిక్ జనతాదళ్ రెండు స్ధానాల్లో, వికాషీల్ ఇన్సాన్ పార్టీ ఒక స్ధానంలో పోటీ చేస్తాయని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మహాకూటమి సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్, ఆర్జేడీలు బుధవారం అధికారికంగా ప్రకటించనున్నాయి. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ, జేడీ(యూ)లు చెరి 17 సీట్లలో పోటీ చేయనుండగా, రాం విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి ఆరు సీట్లు కేటాయించారు. -
విపక్షాల రాజకీయం ఆగమాగం
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో విపక్షాలు ఇంకా గందరగోళంలోనే ఉన్నాయి. అధికార టీఆర్ఎస్ దూకుడుతో ఎన్నికల బరిలో దూసుకెళుతుంటే ప్రతిపక్షాలు ఇంకా వ్యూహాలను ఖరారు చేసుకునే పనిలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు ఈ ఎన్ని కల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవ హరిస్తుండటం, కలిసేందుకు ప్రయత్నించినా.. కామ్రేడ్ల మధ్య సఖ్యత కుదరకపోవడంతో విపక్షాల రాజకీయం ఆగమాగంగా మారింది. కాంగ్రెస్ మినహా మహాకూటమిలోని భాగస్వామ్యపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి కూడా రాలేదు. తాము పోటీచేయని స్థానాల్లో ఎవరికి మద్దతివ్వాలన్నది తేల్చుకోలేకపోతున్నాయి. అధికార పక్షం ఎదురేలేకుండా దూసుకుపోతుంటే.. విపక్షాలు మాత్రం కనీస పోటీ ఇచ్చేందుకే విలవిల్లాడుతున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగానే! అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో ఇతర ప్రతిపక్షాలతో జట్టుకట్టి పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే వెళ్తోంది. ఇప్పటికే ఖమ్మం లోక్‌సభ మినహా 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పనిచేసిన పార్టీలను ఈసారి కలుపుకునిపోయేందుకు కనీస ఆసక్తి చూపడం లేదు. టీజేఎస్, సీపీఐ లాంటి పార్టీలతో కూడా సంప్రదింపులు జరపలేదు. జాతీయ పార్టీగా ఈ ఎన్నికల్లో లభించే మద్దతుతో పాటు.. ఇతర పక్షాల సహకారం కూడా తోడైతే కొంత ఫలితం ఉండే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించకుండానే.. టీపీసీసీ నేతలు ఎన్నికల కసరత్తు పూర్తి చేసుకోవడం గమనార్హం. కామ్రేడ్ల ఐక్యత హుష్‌కాకి! రాష్ట్రంలో ఉనికి కోసం అష్టకష్టాలు పడుతున్న కామ్రేడ్లు కూడా లోక్‌సభ ఎన్నికలపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన సీపీఐ, సీపీఎంలు ‘వామపక్షాల ఐక్యత’పేరుతో మళ్లీ కలవాలనుకున్నా సైద్ధాంతిక అంశాలు వారిని కలవనీయడం లేదు. ముఖ్యంగా బహుజన లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీలు వారి ఐక్యతకు అవరోధాలుగా కనిపిస్తున్నాయి. సీపీఎంతో పాటు తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతిఇస్తామని సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు సీపీఎం సుముఖంగా లేదు. కాంగ్రెస్ వ్యతిరేక వైఖరికి కట్టుబడాలని మార్క్సిస్టులు కోరుతున్నా.. దీన్ని సీసీఐ అంగీకరించడం లేదు. ఇక, బీఎల్ఎఫ్ను కొనసాగిస్తామన్న సీపీఎం ప్రతిపాదన సీపీఐకి రుచించడం లేదు. దీంతో ఇరు పార్టీలు సమావేశాల మీద సమావేశాలు పెట్టుకుంటున్నాయి కానీ ఏమీ తేల్చడం లేదు. అయితే.. సీపీఐ మాత్రం భువనగిరిలో అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ రూటే సెపరేటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా వ్యూహాలను రచించడంలో.. అభ్యర్థులను ఖరారుచేయడంలోనే మునిగి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేయబోతోంది. అయితే.. అభ్యర్థుల ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. పోటీ ఉన్న చోట ఎక్కువ మంది ఆశావాహులుండడం, కొన్ని చోట్ల కనీస పోటీనిచ్చే నేతలు టికెట్ అడక్కపోవడంతో కమలంపార్టీ పరిస్థితి కూడా ఊగిసలాట దశలోనే ఉంది. మొత్తం మీద లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలోని ప్రతిపక్షాల కంగాళీ పరిస్థితులు అధికార పక్షానికి ఊతమిస్తాయనే చర్చ జరుగుతోంది. తేల్చుకోలేని టీజేఎస్, టీడీపీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన టీజేఎస్, టీడీపీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. అసలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలా? ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? పోటీ చేయని చోట్ల ఎవరికి మద్దతివ్వాలనే అంశాల్లో ఇంకా డోలాయమానంలోనే ఉన్నాయి. పోటీ చేయ డం ఖాయమని ఆయా పార్టీల నేతలు పైకి చెపుతున్నా.. ఏం చేస్తారన్నది అనుమానమే. మొదట్లో టీజేఎస్ కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి స్థానాల్లో పోటీ చేయా లని నిర్ణయించినా కరీంనగర్, నిజామాబాద్ లకే పరిమితం కావాలనుకుంటున్నట్లు తెలి సింది. అయితే.. తాము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని టీజేఎస్ నిర్ణయించింది. ఇక, తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవలే ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. అయితే.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? పోటీలో లేని చోట్ల ఎవరికి మద్దతివ్వాలన్నదానిపై మరోసారి సమావేశమై వెల్లడిస్తామని తెలిపింది. నామినేషన్ల ఘట్టం మొదలైనా.. ఇంకా భేటీ కాలేదు. -
మహాకూటమి ఓ నినాదం మాత్రమే..
సాక్షి, నిజామాబాద్: మహాకూటమి అనేది పేరు, నినా దం మాత్రమేనని, దేశంలో ఎక్కడ వ్యవహా రికంగా ఆ కూటమి లేదని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. శుక్రవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ప్రారంభమైందని, బీజేపీ, ఎన్డీఏ మోదీ నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలో వేగం గా దూసుకెళ్తుందన్నారు. ఎన్డీఏలో మిత్రపక్షాలు తగ్గుముఖం పట్టాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, 2014 కంటే ఎన్డీఏ 2019 ఎన్నికల్లో బలంగా ముందుకెళ్తుందని తెలిపారు. పార్టీ బలం, పార్టీల సంఖ్య కూడా ఎన్డీఏలో పెరిగిం దన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన కూటమి మద్దతు ఉందన్నారు. దేశంలో ఎక్కడా ప్రతిపక్ష కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూపీఏకు సిద్ధాంతకర్తగా మా రారని ఆరోపించారు. కానీ రాహుల్ ప్రధాని కా వాలని కోరుకునే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మాత్రం సాహ సించడం లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లకు ఒక్కటి కూడా తక్కువ రాదని ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి నుంచి బీ జేపీ అభ్యర్థుల ప్రకటన అంచెల వారీగా ఉంటుందని, రాష్ట్ర శాఖ నేడు ఢిల్లీకి వెళ్లి అభ్యర్థుల ప్రతిపాదనను కమిటీ ముందు ఉంచనుందన్నారు. మూడు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి వెళ్లనుందని మురళీధర్‌రావు ప్రకటించారు. ఐదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధి, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పథకాల అమలు, శత్రుదేశాలు, ఉగ్రవాదులు, సవాళ్లు, ఎదుర్కొనే సత్తా వంటి అంశాలను ప్రచారంలో ఉంచనున్నామన్నారు. దేశానికి స్థిర ప్రభుత్వం రావాలంటే మోదీకి ఓటేయ్యాలని ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, నాయకులు వెంకటేష్, గజం ఎల్లప్ప, యెండల సుధాకర్, శ్రీనివాస్ శర్మ, మల్లేష్ యాదవ్, భరత్ భూషణ్, తదితరులు పాల్గొన్నారు. -
బెగుసరాయ్ నుంచి కన్హయ్య కుమార్ పోటీ
పాట్నా : జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. బీహార్‌లోని బెగుసరాయ్ నియోజకవర్గం నుంచి కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నట్లు మహా కూటమి ప్రకటించింది. అయితే దీనిపై ఆర్జేడీ ఇంకా స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. కన్హయ్య పోటీపై బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యూలర్), వికాస్‌షీల్ ఇసాన్ పార్టీ, వామపక్షాలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్ కన్హయ్య కుమార్.. సీపీఐ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి మహాకూటమి అభ్యర్థిగా కన్హయ్య పోటీ చేస్తున్నట్లు సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ పాండే మంగళవారం ప్రకటించారు. బిహార్‌లో సీట్లు పంపకాలపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ భేటీ కానుంది. వీరి సమావేశంలో కన్హయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2016లో కన్హయ్య కుమార్‌పై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. చిక్కుల్లో కన్హయ్యకుమార్.. కేసు నమోదు! దీనికి సంబంధించి ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఛార్జీషీట్ రూపొందించి ఇటీవలే పాటియాలా హౌజ్ కోర్టులో సమర్పించారు. 2016లో జేఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతోపాటు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడారని అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆయన తొలిసారి బరిలో నిలువనున్నారు. ఏప్రిల్ 29న బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. -
ఢిల్లీలోనూ మహాకూటమి కథ కంచీకే!
-
మహాకూటమితో దేశ ప్రజలకు ఒరిగేదేమీలేదు
-
‘కూటమి సర్కార్‌ను కోరుకోవడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : మహాకూటమితో దేశ ప్రజలకు ఒరిగేదేమీలేదని, కూటమి నేతలు కనీసం ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోల్‌కతా వేదికగా కలిసిన మహకూటమి సర్కార్‌ను దేశ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని తాము 55 నెలల్లో చేసి చూపామన్నారు. గత యూపీఏ హయాంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎన్నడూ అమలు చేయలేదని ఆరోపించారు. మోదీ, బీజేపీ ఆలోచనలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దేశానికి కీడు చేస్తోందని అన్నారు. లోక్‌సభలో గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడుతూ విపక్షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలతో విరుచుకుపడ్డారు. నిజాలను వినే అలవాటు కాంగ్రెస్ లేదని, ఆ పార్టీ హయాంలో ఎన్నడూ అభివృద్ధి జరగలేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, తాము న్యాయవ్యవస్ధ సహా వ్యవస్ధల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్నామని, తొలిసారి ఓటు వేసే యువతను ప్రోత్సహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత సైన్యాన్ని అవమానించిందని, ఈసీ, సుప్రీం కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించిందని విమర్శించారు. -
అవినీతి.. అస్థిరత.. వ్యతిరేకభావం
ముంబై/ మర్గోవా: కోల్‌కతా వేదికగా సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష నేతలది అవినీతి, వ్యతిరేకభావం, అస్థిరతలతో కూడిన మహాకూటమి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. పేద వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము తీసుకున్న వచ్చిన చట్టంతో ప్రతిపక్షాలకు నిద్ర కరువైందన్నారు. గతంలో బలహీనంగా ఉన్న భారత్ బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని చెప్పారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్, హట్కనంగ్లే, మాధా, సతారా, దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహాకూటమి నేతలది ధనబలం కాగా తమది ప్రజాబలం అన్నారు. తమ కూటమి 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆశలు, కలలతో ముడిపడి ఉందన్నారు. ‘కోల్‌కతా సభా వేదికపై ఉన్న వారంతా బడా నేతల కుమారుడు/కుమార్తె లేదా తమ కుమారుడు/కుమార్తెను రాజకీయాల్లోకి తేవాలని ఆశపడే వారే. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వారు ఇప్పుడు ప్రజాస్వామ్యంపై బహిరంగంగా ఉపన్యాసాలిస్తున్నారు’ అని దెప్పి పొడిచారు. ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడటమే వారి లక్ష్యమన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్షాలు ఈవీఎంలను సాకుగా చూపాలనుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, కుంభకోణాలు, అవినీతి, అపనమ్మకం, అస్థిరతల కలయికే మహాకూటమి’ అని ఎద్దేవా చేశారు. బలహీనం నుంచి అభివృద్ధివైపు పయనం గత ప్రభుత్వాల పాలనతో బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనను పోలుస్తూ ప్రధాని.. ‘బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. విద్యుత్ కొరత, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కుంభకోణాల గురించిన వార్తలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు వినబడేది. ఇప్పుడు కుంభకోణాల(స్కాంల) ప్రస్తావనే లేదు. కేవలం కొత్త పథకాల(స్కీంల) గురించే చర్చ జరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను నమ్మకం, విశ్వాసంతో చూస్తోంది. అప్పట్లో దేశంలోని 98 శాతం మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు. పేదలకు రిజర్వేషన్లతో విపక్షాలకు నిద్ర కరువు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పంతో ప్రతిపక్ష నేతలకు నిద్ర కరువైందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘మా నిర్ణయానికి తగు కారణం లేనట్లయితే, వాళ్లకు అశాంతి కరువయ్యేది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు, పుకార్లను వ్యాప్తి చేసేందుకు రంగంలోకి దిగేవాళ్లు. వాళ్లు అలా చేయడం లేదంటే దానర్ధం.. దేశ ప్రజల కోసం ప్రభుత్వం మంచి పని చేసిందనే కదా’ అని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా సీట్ల కొరత తలెత్తకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పది శాతం పెంచుతున్నట్లు వివరించారు. ‘ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలు పొందాలన్నదే తమ అభిమతం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రిజర్వేషన్లపై చట్టం చేసిందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ఎప్పుడు ప్రకటించినా వాళ్లు ఇలాంటి ఆరోపణలే చేసే వారని వ్యాఖ్యానించారు. -
వారసత్వ పార్టీలు.. అవకాశ కూటములు
చెన్నై / న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి పేరుతో జతకట్టేందుకు యత్నిస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విరుచుకుపడ్డారు. దేశానికి అన్నివిధాలుగా సేవ చేసేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామనీ, ఓటు బ్యాంకు, విభజన రాజకీయాలు చేసేందుకు కాదని వ్యాఖ్యానించారు. ‘మేరా బూత్–సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా తమిళనాడులోని మైలదుతురై, శివగంగ, పెరంబలూర్, తేని, విరుధునగర్ పార్లమెంటరీ నియోజవర్గాల్లోని బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ముచ్చటించారు. సరికొత్త శిఖరాలకు అభివృద్ధి.. ‘ఓవైపు అభివృద్ధి ఎజెండాతో మేం ఉంటే, మరోవైపు వారసత్వ పార్టీలు, అవకాశవాద పొత్తులు ఉన్నాయి. అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు 2019 లోక్‌సభ ఎన్నికలు మనకు గొప్ప అవకాశం. ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ స్ఫూర్తితో మనం ప్రజలకు సాధికారత కల్పించేందుకు పనిచేస్తుంటే, వారసత్వ పార్టీలు మాత్రం అవకాశవాద పొత్తులతో సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాయి. బీజేపీలో ఎదుగుదలకు ఓ కుటుంబానికి విధేయత చూపడం, గొప్ప వంశంలో పుట్టడం, ధనవంతులుగా ఉండాల్సిన పనిలేదు. కేవలం పార్టీ కోసం కష్టపడగలిగితే చాలు’ అని మోదీ తెలిపారు. విపక్షాలవి తాత్కాలిక పొత్తులే.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘బీజేపీ విజయం ప్రతీకూల రాజకీయాలు చేసే కొందరికి ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే వాళ్లు నన్ను, పార్టీని దూషిస్తున్నారు. మన విపక్ష మిత్రులు కూడా అయోమయంలో ఉన్నారు. అందుకే ‘మోదీ చెడ్డవాడు’ ‘ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదు’ ‘ప్రజలు బీజేపీని ఇష్టపడటం లేదు’ అని చెబుతున్నారు. కానీ మోదీ నిజంగానే చెడ్డవాడు అయితే, బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయకుంటే విపక్షాలు ఎందుకు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి?’ అని ప్రశ్నించారు. కర్తార్‌పూర్ విషయంలో కాంగ్రెస్ విఫలం దేశవిభజన సమయంలో సిక్కులకు పవిత్రమైన కర్తార్‌పూర్ సాహిబ్‌ను భారత్‌లో చేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన కర్తార్‌పూర్ కారిడార్ వల్ల వీసా అవసరం లేకుండానే భక్తులు పాకిస్తాన్‌లోని గురునానక్ అంతిమ విడిదిని సందర్శించుకోవచ్చని తెలిపారు. సిక్కుల 10వ గురువు గోబింద్ సింగ్ 350వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రూ.350 విలువైన వెండి స్మారక నాణేన్ని మోదీ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గురునానక్ 550వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్‌తో పాటు పలువురు సిక్కు నేతలు హాజరయ్యారు. -
మజ్బూత్? మజ్బూర్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘నిజాయితీపరుడు, కష్టించి పనిచేసే వ్యక్తా? లేక దేశంలో ఉండాల్సిన సమయంలో విదేశాలకు వెళ్లే అవినీతిపరుడా? ప్రధానిగా ఎవరు కావాలో ప్రజలు ఎన్నుకోవాలి’ అని బీజేపీ జాతీయ మండలి సమావేశాల వేదికగా ప్రధాని మోదీ రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. విపక్షాలు ఏర్పాటుచేయాలనుకుంటున్న మహాకూటమి విఫల ప్రయోగమవుతుందని ఎద్దేవా చేశారు. బంధుప్రీతి, అవినీతి కోసం నిస్సహాయ, బలహీన(మజ్బూర్) ప్రభుత్వం ఏర్పడాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆరోపించారు. కానీ దేశ సమగ్రాభివృద్ధి కోసం బలమైన(మజ్బూత్) ప్రభుత్వం ఉండాలని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం ముగిసిన బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించిన మోదీ..సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం కాకుండా కాంగ్రెస్ తన లాయర్ల ద్వారా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా కల్పించడం వల్ల ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతినవని చెప్పారు. అవినీతి లేని ఏకైక ప్రభుత్వమిదే.. దేశ చరిత్రలో అవినీతి ఆరోపణలు రాని ఏకైక ప్రభుత్వం తమదేనని మోదీ చాటిచెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయడమే ప్రాథమిక లక్ష్యంగా ఏర్పడిన పార్టీలు ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపాయని పరోక్షంగా విపక్షాల సిద్ధాంతాల్ని తప్పుపట్టారు. ‘ కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఉంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడొచ్చని, తమ బంధువులు, మిత్రులకు దోచిపెట్టొచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. నల్లధనం, అవినీతిపై చౌకీదార్ సాగించిన పోరాటంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. ‘ ఇంట్లో పని ఉన్న సమయంలో విహారయాత్రలకు వెళ్లే పనివాడిని ఎవరైనా కావాలనుకుంటారా? ఆయన (పరోక్షంగా రాహుల్ గాంధీ) అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. మరి ఈ దేశానికి ఎలాంటి పనివాడు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. రైతులే నవభారత చోదక శక్తులు.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం పగలూ రాత్రి కష్టపడుతోందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలకు రైతులంటే కేవలం ఓటర్లేనని, కానీ తమ ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతోందని అన్నారు. ‘స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేసింది బీజేపీ ప్రభుత్వమే. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగానే రైతులు ఈరోజు దుర్భర స్థితిలో ఉన్నారు. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్ల కనీస మద్దతు ధర అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మోదీ అన్నారు. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నవభారతం విశ్వాసం పెంపొందుతుందని మోదీ అన్నారు. కొత్త కోటా వల్ల ఇతరుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లదని హామీ ఇచ్చారు. ఆ ఓటమితో ఢీలా పడొద్దు: షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తూ..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం పట్ల ఢీలా పడొద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు. మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినా కూడా తమ పార్టీ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. కులతత్వం, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెసే కారణమని, ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడి, అభివృద్ధి మందగించిందని మండిపడ్డారు. ప్రచార సమయంలో దేశంలోని ప్రతి ఓటరుకు చేరువకావాలని సూచించారు. పోలింగ్ రోజున తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఉదయం 10.30 గంటల లోపే ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని ఆదేశించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలు నియంతృత్వం, ప్రజాస్వామ్యం మధ్యే జరుగుతాయని కాంగ్రెస్ పేర్కొంది. స్థిరత్వమా? అస్థిరతా? రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు..స్థిరత్వం, అస్థిరతలలో ఒకదాన్ని ఎన్నుకోవాలని, నిజాయితీ, ధైర్యశాలి నాయకుడైన మోదీకి..నాయకుడు తెలియని అవకాశవాద కూటమికి మధ్య పోటీ అని శనివారం ఆమోదించిన తీర్మానంలో బీజేపీ పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పార్టీ కార్యకర్తలు పాఠాలు నేర్చుకుని, లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేయాలని సూచించింది. ఈ తీర్మానం వివరాల్ని కేంద్ర మంత్రి రవిశంకర్ వెల్లడిస్తూ..మోదీపై విద్వేషమే విపక్షాలను ఒకటి చేస్తోందన్నారు. ఎన్డీయే హయాంలో భారత్ వర్ధమాన ప్రపంచ శక్తిగా, మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదిగారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రతిపాదిత విపక్ష కూటమి అధికారంలోకి వస్తే 1990ల నాటి అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని హెచ్చరించింది. -
బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం: నవీన్
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ప్రతిపాదిస్తున్న మహాకూటమిలో చేరబోమని బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటిస్తామని బుధవారం తేల్చిచెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏకం కావాలని బీజేపీయేతర పక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమిలో చేరికపై నిర్ణయానికి కొంత సమయం కావాలని ఆయన ఢిల్లీలో చెప్పిన మరుసటి రోజే ఈ విధంగా స్పందించడం గమనార్హం. బీజేడీకి కాంగ్రెస్‌తో రహస్య అవగాహన ఉందని బీజేపీ ఆరోపించగా, బీజేడీ ఎప్పటికీ బీజేపీ పక్షమేనని కాంగ్రెస్ పేర్కొంది. -
మహాకూటమిలో చేరికపై ఒడిషా సీఎం వ్యాఖ్యలివే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలతో కూడిన మహాకూటమిలో చేరికపై తనకు మరికొంత సమయం కావాలని బీజేడీ నేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహాకూటమిలో చేరికకు సంబంధించి తాము ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధరను రూ 2930కు పెంచాలనే డిమాండ్‌తో బీజేడీ ఆధ్వర్యంలో మంగళవారం దేశ రాజధానిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మద్దతు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, దీని నుంచి కేంద్రం తప్పించుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తాము పలుసార్లు మద్దతు ధరపై విన్నవించినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇప్పటివరకూ సమదూరం పాటిస్తున్న బీజేడీ మోదీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడటం గమనార్హం. గత నాలుగున్నరేళ్లుగా ఒడిషా ప్రభుత్వం వ్యవసాయంపై రూ 30,000 కోట్లు వెచ్చించిందన్నారు. -
పొత్తులే కొంప ముంచాయి : కోమటిరెడ్డి
-
పొత్తులే కొంప ముంచాయి : కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి పొత్తులే కారణమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 40 నుంచి 45 స్థానాలైనా గెలిచేవాళ్లమని చెప్పారు. మహా కూటమి వద్దని ఎన్నికల ముందే అధిష్టానానికి చెప్పానని, అయినప్పటికీ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. పొత్తుల కారణంగా టికెట ఎవరి వస్తుందోనని ప్రజలు అయోమయానికి గురైయ్యారన్నారు. దీనికి తోడు సీట్లే పంచుకోలేని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ కేసీఆర్ చేసిన ప్రసంగాలు ప్రభావితం చూపాయన్నారు. ప్రజా కూటమి గెలిస్తే చంద్రబాబు పాలన సాగిస్తారని టీఆర్ఎస్ ప్రచారం చేసిందన్నారు. తనలాంటి నాయకులు ఓడిపోవడానికి పొత్తులే కారణమని చెప్పారు. కేసీఆర్ తన నియోజకవర్గంలో రెండు సార్లు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మారని, అందుకే తాను ఓడిపోయానని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు వద్దని పార్టీ సమీక్ష సమావేశంలో చెప్పానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు లేకపోతే 7 లేదా 8 స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అధిష్టానం టికెట్ ఇస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు : మోదీ
న్యూఢిల్లీ : జాతీయ స్ధాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ల ఏర్పాటు ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు మోదీ ఓటమే అజెండాగా ఏకమవడాన్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం విఫలమైందని అన్నారు. తెలంగాణలో కూటమికి చొరవ చూపిన ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని, అక్కడే కూటమికి తొలిదెబ్బ తగిలిందన్నారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరారని మండిపడ్డారు. మోదీ ఆశీస్సులతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకున్నారన్న విషయం తనకు తెలియదని మోదీ వ్యాఖ్యానించారు. -
హసీనా నాలుగోసారి
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా(71) నేతృత్వంలోని మహాకూటమి ఘనవిజయం సాధించింది. ఆదివారం ముగిసిన ఎన్నికల్లో మొత్తం 300 స్థానాలకు గానూ హసీనాకు చెందిన అవామీలీగ్, దాని మిత్రపక్షాలు 288 చోట్ల విజయదుందుభి మోగించాయి. తాజా ఫలితాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టేందుకు హసీనాకు మార్గం సుగమమైంది. కాగా, ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్‌యూఎఫ్) కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో అధికార కూటమి 82 శాతం దక్కించుకోగా, విపక్షాలకు 15 శాతం ఓట్లు లభించాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో 263 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన హసీనా ఈసారి ఏకంగా 288 స్థానాలు కొల్లగొట్టి ఆ రికార్డును తిరగరాశారు. ఫలితాలను అంగీకరించబోం: విపక్షాలు బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్‌యూఎఫ్) ఆరోపించింది. ఈ ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఎన్నికలను రద్దుచేసి పారదర్శకంగా, తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) డిమాండ్ చేసింది. మళ్లీ ఎన్నికల ప్రసక్తే లేదు: ఈసీ బంగ్లాదేశ్‌లో పోలింగ్ సందర్భంగా భారీగా అవకతవకలు, రిగ్గింగ్ చోటుచేసుకున్నాయన్న విపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం చీఫ్(సీఈసీ) కె.ఎం.నూరల్ హుడా ఖండించారు. పోలింగ్‌కు ముందురోజు రాత్రే చాలాచోట్ల బ్యాలెట్ బాక్సులు నిండిపోయాయన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నైరుతి గోపాల్‌గంజ్ నుంచి పోటీచేసిన ప్రధాని హసీనాకు 2,29,539 ఓట్లు రాగా, ఆమెపై పోటీచేసిన ఎన్‌యూఎఫ్ అభ్యర్థికి కేవలం 123 ఓట్లు వచ్చాయని తెలిపారు. హసీనాకు మోదీ ఫోన్.. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన షేక్ హసీనాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హసీనాకు సోమవారం ఫోన్‌చేసిన మోదీ.. బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ మద్దతు కొనసాగుతుందని వెల్లడించారు. హసీనా నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ అభివృద్ధి విషయంలో భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఏక పార్టీ దిశగా అడుగులు సైనిక కుట్రలో చనిపోకముందు హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబుర్ దేశంలో ప్రతిపక్షాలను దెబ్బతీసి ఏకపార్టీ వ్యవస్థను నెలకొల్పేందుకు యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ముజీబుర్ తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జియావుర్ రెహమాన్, ఎర్షాద్లు సైన్యానికి చెందిన వ్యక్తులు. వీరూ తమ హయాంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకోకుండా ప్రయత్నించారు. సైనిక పాలన ముగిశాక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీఎన్పీ చీఫ్ ఖలీదా వైఖరీ ఇదే. మూడుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసిన ఖలీదా ప్రతీసారి అవామీ లీగ్‌ను అణిచేందుకు యత్నించారు. హసీనా సైతం ప్రజాస్వామ్యం ఉనికిని చెరిపేసేలా వ్యవహరించడం గమనార్హం. ఖలీదాను అవినీతి ఆరోపణలపై జైలు శిక్షపడేలా హసీనా చేశారు. మొదటి నుంచి పెత్తందారీ ధోరణులే! 1996లో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ ప్రతిపక్షాలను, పోటీదారులను హసీనా సహించిన దాఖలాలు లేవు. తన ప్రత్యర్థి ఖలీదా బాటలోనే పయనిస్తూ బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం కావడానికి ఆమె కారకులయ్యారు. బీఎన్పీ మిత్రపక్షమైన ముస్లిం ఛాందసవాద సంస్థ జమాతే ఇస్లామీని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించారు. 1971 యుద్ధ నేరాలపై ఈ సంస్థ నేతలపై విచారణ జరిపించి శిక్షలు అమలు చేశారు. కొందరిని ఉరితీసి, మరి కొందరిని జైళ్లకు పంపారు. జమాతే సంస్థను ఖలీదా వాడుకున్నట్టే మరో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హిఫాజుతుల్ ఇస్లాంను హసీనా తనకు అనుగుణం గా వినియోగించుకుంటున్నారు. అవామీలీగ్‌కు ప్రతిపక్షమే లేకుండా చేయడమే లక్ష్యంగా ఆమె అధికారం ప్రయోగిస్తున్నారు. ఇంటర్నెట్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే రచయితలను చంపిన వారిని పట్టుకునే విషయంలో హసీనా ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నిరుపేద దేశంగా, బలహీన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన బంగ్లాదేశ్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించడం హసీనా విజయంగా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, ఆతర్వాత రాజకీయా పరిస్థితుల నేపథ్యంలో హసీనా భారత్‌తో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. హసీనా చేపట్టిన అభివృద్ధి పనులకు బంగ్లా ప్రజలు పట్టం కట్టారని మోదీ ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే... బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రధాని హసీనా తీసుకున్న చర్యలే కారణమని ఆమె సన్నిహితులు చెబుతుంటే, ప్రతిపక్షాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. హసీనా.. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్ కుమార్తె. తూర్పుపాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లోని తుంగిపరాలో 1947, సెప్టెంబర్ 28న జన్మించారు. ఢాకాలోని ఈడెన్ కాలేజీలో విద్యార్థి రాజకీయాల్లో హసీనా చురుగ్గా పాల్గొనేవారు. 1975, ఆగస్టు 15న ఆమె తండ్రి రెహమాన్, మిగిలిన కుటుంబ సభ్యులను ఆర్మీలోని ఓ వర్గం దాడిచేసి చంపేసింది. విదేశాల్లో ఉండటంతో హసీనా ప్రాణాలతో బతికిపోయారు. తర్వాత ఐదేళ్ల పాటు భారత్‌లోనే ప్రవాస జీవితం గడిపారు. 1981లో ఆమె అవామీలీగ్ పార్టీ అధ్యక్షురాలయ్యారు. బంగ్లాదేశ్‌లో సైనిక పాలనను పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించడంతో హసీనాకు మద్దతుదారులు క్రమంగా పెరిగారు. ఇదే సమయంలో ఆమెను సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ జియా ఖలీదాతో కలిసి హసీనా ప్రజాస్వామ్య పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో చివరికి 1990, డిసెంబర్లో అధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్‌లో సైనిక పాలనకు తెరపడింది. అయితే కాలక్రమంలో హసీనా, ఖలీదా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అణు శాస్త్రవేత్త అయిన ఎం.ఎ.వాజెద్‌ను హసీనా 1968లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జోయ్, కుమార్తె సైమా ఉన్నారు. 2009లో హసీనా భర్త కన్నుమూశారు. హసీనా హయాంలోనే బంగ్లాదేశ్ పౌరుల తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 2017లో దేశ జీడీపీ 250 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
మహాకూటమి ఆశలకు బీఎస్పీ చెక్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసి మహాకూటమిగా బరిలోకి దిగాలన్న కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండికొట్టింది. యూపీలో ఇప్పటికే కాంగ్రెస్‌ను దూరం చేస్తూ ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు సీట్ల సర్ధుబాటును పూర్తిచేశాయన్న వార్తలు ఆ పార్టీని నిరుత్సాహానికి లోనుచేశాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్ధానాల్లో పోటీ చేస్తుందని బీఎస్పీ ప్రకటించి కూటమి ఆశలను ఆవిరి చేసింది. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ స్ధానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని బీఎస్పీ ఉపాధ్యక్షుడు రాంజీ గౌతమ్ ప్రకటించారు. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేసిన క్రమంలో బీఎస్పీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాగా కాంగ్రెస్‌తో ప్రీ పోల్ అలయన్స్‌కు తాము సుముఖంగా లేమని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వంటి నేతల తీరుతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ-కాంగ్రెస్ పొత్తుపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు నిజాయితీగా ఉన్నా స్ధానిక నేతల తీరుపై మాయావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె సహకరించారు. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని బీఎస్పీ నిర్ణయించిందని ప్రకటించారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో మహాకూటమిలో భాగంగా అధిక సీట్లు కేటాయించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ యాదవ్ తెలిపారు. ఇక మహాకూటమి తరపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటించడం సైతం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరమే విపక్ష కూటమి ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తామని పలు పార్టీలు వెల్లడించాయి. కూటమి కష్టాలు ఇలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేస్తూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో ఇప్పటికే భేటీలు జరిపి ఫెడరల్ ఫ్రంట్‌కు ఓ రూపు, ఊపు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంమీద రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు మహాకూటమి ఆశలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. -
కాంగ్రెస్‌కు దాసోహమంటారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ కౌన్సిల్ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చేరడం తప్ప గత్యంతరం లేదన్న విధంగా నాయకత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగిందని కొందరు నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పొత్తులో మూడుసీట్లకే పరిమితం కాకుండా పార్టీకి బలమున్న 20–25 సీట్లలో సొంతంగా పోటీచేసి ఉంటే పార్టీ విస్తరణకు అవకాశముండేదని అన్నట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే కార్యదర్శి ఎన్నికల బరిలో దిగడం, తాను పోటీచేస్తున్న సీటుకే పరిమితం కావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌తో పొత్తు పార్టీకి నష్టం కలిగించినందున భవిష్యత్‌లో సొంత బలం పెంచుకుని, తదనుగుణంగా సొంతంగా పోటీకి సిద్ధం కావాలనే సూచనలొచ్చాయి. స్థానిక ఎన్నికలతోసహా లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆదివారం మొదట రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో, ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, కేవలం మూడుసీట్లలోనే పోటీ, కాంగ్రెస్‌కు దాసోహమన్నట్టుగా నాయకత్వం వ్యవహరించిన తీరుపై కొందరు నాయకులు తీవ్ర విమర్శలు సంధించారు. దీంతో మనస్తాపం చెందిన చాడ వెంకటరెడ్డి తనపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో చాడతోపాటు కూనంనేని, తదితరులు కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆ తర్వాత మొత్తం కార్యవర్గం రాజీనామాలు వద్దంటూ సర్దిచెప్పింది. ఈ రాజీనామాల అంశాన్ని కార్యవర్గ భేటీకే పరిమితం చేసి, రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూడాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా ఓటమికి కుంగిపోవద్దని, పార్టీ నిర్మాణం, సొంతబలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తీర్మానాలు... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల వివరాలు అందించకపోవడంవల్ల, కుంటిసాకులతో 34 శాతమున్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం బీసీలకు అన్యాయం చేయడమేనని పేర్కొంది. బీసీల హక్కులు అణగదొక్కే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: చాడ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సహకార ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల గెలుపోటములకు కారణాలను అన్వేషిస్తూ సమీక్షలు నిర్వహించాలన్నారు. -
చంద్రబాబును ఏపీ క్షమించదు: నరేంద్ర మోదీ
తిరువళ్లూరు(తమిళనాడు): కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌తోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబును ఎన్నటికీ క్షమించరని ఆయన విమర్శించారు. ‘నా పోలింగ్ బూత్ బలమైన పోలింగ్ బూత్’ పేరిట ప్రధాని మోదీ ఇటీవల పార్టీ బూత్ కమిటీల సభ్యులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వివరిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులోని తిరుచ్చి, మదురై, చెన్నై సెంట్రల్, నార్త్ చెన్నై, తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు చెందిన బీజేపీ బూత్ కమిటీ సభ్యులతో ఆదివారం ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా మోదీ వారికి వివరించారు. అనంతరం కార్యకర్తల ప్రశ్నలకు సమాధానం చెబుతూనే, భవిషత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ నేత ఒకరు వచ్చే ఎన్నికల్లో పొత్తు ఎవరితో ఉంటుందని ప్రశ్నించగా మోదీ సమాధానమిస్తూ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడే వారితోనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడా అపోహలకు గురి కావద్దన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి విజయం సాధించారన్నారు. అయితే, ఎన్టీఆర్ ఆశయాలకు నీళ్లొదిలి కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకున్న ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆ«ంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించబోరన్నారు. అలాంటి అనైతిక పొత్తులకు బీజేపీ పాకులాడబోదని కార్యకర్తలకు హమీ ఇచ్చారు. ఇటీవల మహా కూటమి అంటూ మాట్లాడుతున్న నేతలకు స్వలాభం, పదవుల యావ తప్ప మరేమీ లేదని విమర్శించారు. ఈ కూటమి కులీన కుటుంబాల అపవిత్ర కూటమి అని నిప్పులు చెరిగారు. అందులో ఉన్న పార్టీల నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ పోకడలతో భంగపడిన వారేనని అన్నారు. ‘సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియానే తమకు ఆదర్శమని చెప్పుకుంటున్న ఈ నేతలు.. పార్టీ సిద్ధాంతాలు, జాతిహితంపై రాజీపడే పార్టీగా కాంగ్రెస్‌ను ఆయన తిట్టిపోసేవారని గుర్తుంచుకోవాలి. కూటమి నేతలు ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన వారే. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ను అక్రమ కేసులతో కాంగ్రెస్ వేధించింది. గతంలో కాంగ్రెస్, డీఎంకేల నడుమ బద్ధవైరం ఉన్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తమిళనాడులో డీఎంకే అయినా ఉండాలి లేదా తామైనా ఉండాలని అప్పట్లో విర్రవీగిన కాంగ్రెస్.. నేడు ఆ పార్టీతో అంటకాగడం అవకాశవాదం తప్ప మరేమీ లేదన్నారు. -
ఎన్టీఆర్ ఆశయాలకు టీడీపీ చెల్లుచీటీ : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ధాపించిన టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు అర్రులు చాస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులుచెరిగారు. విపక్షాలు తమ వ్యక్తిగత, రాజకీయ మనుగడ కోసమే రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మహాకూటమిగా ఏర్పడుతున్నాయని ధ్వజమెత్తారు. మహాకూటమిని రాజవంశీకుల కూటమిగా ప్రధాని అభివర్ణించారు.ఈ పార్టీలు అధికారం కోసం అపవిత్ర కలయికకు పూనుకున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం తమిళనాడుకు చెందిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో కొన్ని పార్టీలు తమకు సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియా ఆదర్శమని చెప్పుకుంటున్నాయని, అయితే తాను కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని స్వయంగా రామ్ మనోహర్ లోహియా వెల్లడించారన్నారు. మహాకూటమి ప్రతిపాదన కేవలం వ్యక్తుల మనుగడ కోసమేనని, సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పాటయ్యేది కాదని మోదీ ఆరోపించారు. ఈ కూటమి ప్రజల కోసం కాదని అధికారం కోసమని, ప్రజా ఆకాంక్షల కోసం కాకుండా వ్యక్తిగత ఆకాంక్షల కోసమే వీరంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు. మహాకూటమిలో పలు పార్టీల నేతలు గతంలో ఎమర్జెన్సీ సమయంలో నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు మహాకూటమితో ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
యూపీలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎస్పీ, బీఎస్పీ
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో కీలక రాష్ట్రమైన యూపీలో విపక్షాల పొత్తులు ఉత్కంఠ రేపుతున్నాయి. విపక్ష కూటమికి పెద్దన్నగా వ్యవహరించే కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు మహాకూటమిగా ఏర్పడి సీట్ల పంపకం కసరత్తును కొలిక్కితెచ్చాయని చెబుతున్నారు. సీట్ల సర్ధుబాటుపై కసరత్తును పూర్తిచేసిన ఎస్పీ, బీఎస్పీలు ఇక దీనిపై ప్రకటన చేయడం లాంఛనప్రాయమేనని భావిస్తున్నారు. తక్కువ స్ధానాలతో సరిపెట్టుకుంటామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొనడంతో సీట్ల సర్దుబాటు సులభంగా పూర్తయిందని ఇరు పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్పీ కంటే ఒకటి రెండు స్ధానాల్లో అధికంగా బీఎస్పీ బరిలో ఉండేలా సీట్ల పంపకం జరిగిందని చెబుతున్నారు. కాగా, 39 స్ధానాల్లో బీఎస్పీ, 37 స్ధానాల్లో ఎస్పీ, రెండు స్ధానాల్లో ఆర్ఎల్డీ పోటీ చేసేలా సీట్ల సర్దుబాటు ఖరారైనట్టు సమాచారం. కాంగ్రెస్ కూటమిలో ఉన్నా, లేకున్నా అమేథి, రాయ్‌బరేలి స్ధానాలను కాంగ్రెస్‌కు వదిలివేసి మిగిలిన సీట్లలో సర్ధుబాటు పూర్తయిందని తెలిసింది. కూటమి ఏర్పాటు పూర్తయిందని, సీట్ల సర్ధుబాటును వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య ప్రకటిస్తామని ఎస్పీ ప్రతినిధి సునీల్ సజన్ వెల్లడించారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తేనే మహాకూటమికి అనుకూలమని ఎస్పీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. మరోవైపు యూపీలో ఈ తరహా పొత్తులపై కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది. మహాకూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. -
టీడీపీతో పొత్తు వల్లే ఘోరంగా ఓడాం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదన్న వాదన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఓటమి నుంచి తేరుకుంటున్న కాంగ్రెస్ నేతలు... టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు అంశం కాంగ్రెస్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీతో మైత్రి అంటే... తెలంగాణలో మనుగడ సాగించలేమని, పోటీ చేసేందుకు కూడా నాయకులు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడతాయని సీనియర్లు అంటు న్నారు. శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలుసునని, తరువాత ఎన్నికలకు వ్యూహం ఎలా ఉండాలన్నది కూడా వారికి తెలియదని అనుకోవడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ పొత్తే మమ్మల్ని ముంచింది... అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని సమీక్షించుకుం టున్న టీపీసీసీ ముఖ్యులు టీడీపీతో పొత్తు తమ పుట్టి ముంచిందనే నిర్ధారణకు వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకంటే టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఈ ఎన్నికలను హైజాక్ చేయడం వల్లే ప్రజల్లో తమ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు తమపై ఉన్న సానుభూతి కూడా బాబుతో పొత్తు తర్వాత ఆగ్రహంగా మారిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీపీఐ, తెలంగాణ జనసమితితోనే పొత్తుకు పరిమితమై ఎన్నికలకు వెళ్లుంటే సీట్ల సర్దుబాటులో కూడా సమస్యలుండేవి కావనీ, కనీసం మరో 20 సీట్లలో మెరుగైన ప్రతిభ సాధించగలిగేవారమని వారంటున్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానని ఓసారి, తాను చేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించిందని మరోసారి చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు... తన రాకను వ్యతిరేకిస్తున్న తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వడం మాత్రం మర్చిపోయారని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతోపాటు కూటమిలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకు ఇచ్చినట్లు బహిర్గతం కావడమే తమ కొంప ముంచిందని వాపోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు ప్రమేయాన్ని అంగీకరించే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో లేదని ఈ ఎన్నికల ఫలితాలతో అర్థమైందని, అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించి తెలంగాణ వరకైనా టీడీపీతో పొత్తు నుంచి మినహాయింపునివ్వాలని వారు కోరుతున్నారు. ‘మంచో చెడో ఓసారి పొత్తు పెట్టుకున్నాం. దాని పర్యవసానాలు అనుభవించాం. ఇకనైనా తెలంగాణ ప్రజల మనసెరిగి వ్యవహరిస్తే బాగుంటుంది’అని టీపీసీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. పట్టణ ఓట్లూ గల్లంతు... టీఆర్ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి సానుకూలత మొదటి నుంచి కనిపించినా, పట్టణ ప్రాంత ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని కాంగ్రెస్ నేతలు అంచనా వేశారు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత, ఉద్యోగ వర్గాలు తమవైపే ఉన్నారని ఎన్నికల ముందు వరకు ధీమాగా ఉన్నారు. ఈ ఓట్లు తమ విజయాన్ని సులభతరం చేస్తాయని ఆశించారు. కానీ చంద్రబాబు ప్రవేశంతోనే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి, యువత, ఉద్యోగ వర్గాలకు ఆ సమయంలో చంద్రబాబు నిర్వహించిన పాత్ర గుర్తుకు వచ్చిందని... దీంతో ఉన్నట్లుండి తమవైపు నుంచి ప్రత్యామ్నాయం వైపు వారి ఆలోచన మళ్లిందని టీపీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకుగా భావించిన వర్గాలన్నీ అనివార్య పరిస్థితుల్లో టీఆర్ఎస్ను ఎంచుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఇక పల్లె ప్రాంతాల్లో అక్కడో, ఇక్కడో ఓట్లు లభిస్తాయని ఆశించినా చంద్రబాబు మళ్లీ వస్తున్నాడన్న టీఆర్ఎస్ ప్రచారం ఆ ఓట్లను కూడా గల్లంతు చేసిందని విశ్లేషిస్తున్నారు. బాబు రాక పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా, గ్రామీణ ప్రాంతాల్లో పాక్షికంగా తమ ఓటు బ్యాంకుకు నష్టం చేసిందనే అంచనాకు కాంగ్రెస్ వర్గాలు వచ్చాయి. ‘టీడీపీతో పొత్తు కారణంగా అర్బన్‌లో మేము బాగా దెబ్బతిన్నాం. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాలపైనా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు వద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం’అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. పొత్తు కొనసాగితే పోటీ చేయలేం... ఎన్నికల ఫలితాలు కొట్టిన దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీ భవిష్యత్తుపై అంచనాకు వస్తున్నారు. అందులో భాగంగానే అవసరమైతే లోక్‌సభ బరిలో దిగి పార్టీతోపాటు తమ సత్తా చాటాలనే నిర్ణయానికి వస్తున్నారు. అయితే అది కూడా టీడీపీతో పొత్తు వదిలితేనే తాము పోటీకి సిద్ధమవుతామనే మెలిక పెడుతున్నారు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం మారకపోతే తాము ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని, టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా పార్టీపరంగా, వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్టను నష్టపోవడంకన్నా పోటీలో ఉండకుండా ఉండటమే మేలని, అనివార్యంగా పోటీలో ఉండాల్సిన పరిస్థితులు వస్తే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడమే మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొందరు నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నా మరికొందరు అంతర్గత సమీక్షల్లో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ‘శాసనసభ ఎన్నికల ఫలితాలు సమీక్షించుకొని తదుపరి కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది’అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ‘పచ్చ’పార్టీని వదిలించుకోవడమే మంచిదనే అభిప్రాయంపైనే చర్చ జరుగుతోంది. ‘టీడీపీతో పొత్తు కొనసాగితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అనేక మంది పార్టీని వీడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అధిష్షానం సముచితమైన రీతిలో ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది’అని మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు పేర్కొన్నారు. -
గుట్టు తేల్చబోతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తాపత్రయపడ్డ అభ్యర్థులకు ఫలితాల తర్వాత షాకులు తగులబోతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఐటీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రూ.125 కోట్లు స్వాధీనం చేసుకోగా, ప్రధానంగా వరంగల్ జిల్లా పెంబర్తిలో పట్టుబడ్డ రూ.5.8 కోట్ల వ్యవహారం సంచలనంగా మారనుంది. కారు సీట్ల వెనుక సీక్రెట్ బాక్స్‌లో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర, పరకాల అభ్యర్థి కొండా సురేఖ, ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు మెడకు ఈ కేసు చుట్టుకోబోతున్నట్లు సమాచారం. ఎక్కడి నుంచి.. హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన హవాలా వ్యాపారి కీర్తికుమార్ జైన్ రూ.5.8 కోట్లను వరంగల్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ఈ డబ్బును నామా నాగేశ్వర్రావు, కొండా మురళి, రవిచంద్రలకు చేర్చేందుకు వెళ్తున్నట్లు కీర్తికుమార్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకొన్నాడు. ఈ డబ్బు హవాలా మార్గంలో ఎక్కడి నుంచి వచ్చింది.. పంపించిన వ్యక్తి ఎవరు.. అతడి వివరాలపై వరంగల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సింగపూర్‌లోని ఓ వ్యక్తి హవాలా ద్వారా ఈ డబ్బును చెన్నైకి పంపించినట్లు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి కీర్తికుమార్‌కు ఈ డబ్బు చేరినట్లు తెలిసింది. సింగపూర్‌లో ఉన్న వ్యక్తి ఎవరు.. మహాకూటిమి అభ్యర్థులకు డబ్బు పంపాలని ఆ సింగపూర్ వ్యక్తిని ఆదేశించిందెవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నేతలకు తాఖీదులు..: పలానా వ్యక్తి నుంచి డబ్బు వస్తుందని నామానాగేశ్వర్రావుతో పాటు కొండా మురళి, రవిచంద్రలకు సమాచారం ఉన్నట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసు శాఖ వీరికి త్వరలో నోటిసులు జారీచేసి విచారణకు రావాలని ఆదేశించనుంది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గతంలో కూడా హవాలా ద్వారా డబ్బు రవాణా జరిగిందా.. డబ్బు పంపింన అసలు వ్యక్తి ఎవరన్న దాన్ని తేల్చాలని వరంగల్ పోలీసులు భావిస్తున్నారు. బాబు కోటరీయేనా? మహాకూటమికి అన్నీ తానై నడిపించిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ఈ హవాలా డబ్బు వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నామా నాగేశ్వర్రావు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రవిచంద్రకు వరంగల్ ఈస్ట్ టికెట్‌ను కాంగ్రెస్ నుంచి ఇప్పించేందుకు చంద్రబాబు మంత్రాంగం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు కొండా సురేఖ ఎన్నికల ఖర్చు కోసం కూడా చంద్రబాబు కోటరీయే హవాలా ద్వారా డబ్బును వరంగల్ చేర్చేందుకు ప్రయత్నించినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్‌లో ఉన్న కీర్తికుమార్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు వరంగల్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కస్టడీలో అసలు కథ ఏంటన్న అంశాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
బాబు జోక్యంతోనే ప్రతికూల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకోవడం ఇక్కడి ప్రజలకు రుచించలేదని, టీఆర్ఎస్ అనుకూల సెంటిమెంట్ ఏర్పడేందుకు కేసీఆర్ నిర్వహించిన ప్రచారం ఉపయోగపడిందని అభిప్రాయపడింది. గురువారం ఎంబీ భవన్లో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రభావం, సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, తదితర అంశాలను సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమీక్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కూటమికి తానే సంధానకర్తగా వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందని విశ్లేషించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలున్నా అవి అధికార పార్టీకి సానుకూల ఓటింగ్‌కు పనికొచ్చాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఓట్ల సాధనలో బీఎల్ఎఫ్ విఫలం... ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం–బీఎల్ఎఫ్ ఆశించిన మేర ఓట్ల సాధనలో విఫలం కావడాన్ని సీపీఎం అంగీకరించింది. బీఎల్ఎఫ్ ప్రయోగం, ఎజెండా తెలంగాణకు అవసరమని, రాబోయే రోజుల్లోనూ ఇదే వైఖరితో ముందుకు సాగాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీఎల్ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలకు మద్దతు తెలిపిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలవడంతో నష్టం జరిగిందని అభిప్రాయపడింది. -
బాబుకు తెలంగాణ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు
కిర్లంపూడి(జగ్గంపేట): ‘‘సీఎం చంద్రబాబు ఒక గజదొంగ. రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకున్నాడు. అది చాలక తెలంగాణలో ఉన్న వనరులను, ఆస్తులను కబళించి కబ్జా చేయాలని మహాకూటమి పేరుతో ఆ రాష్ట్రంలో వేలు పెట్టాడు. చంద్రబాబును కోలుకోలేని దెబ్బకొట్టి వెనక్కు పంపించిన తెలంగాణ ప్రజల చైతన్యానికిదే నా నమస్కారాలు’’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో జేఏసీ నాయకులతో కలసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. లగడపాటితో గరుడ పురాణం చెప్పించి ప్రజల ఆస్తులను పందేల రూపంలో తగలేయించిన ఘనుడు చంద్రబాబేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని ఆ దేవుడే కాపాడారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఆ దేవుడే కాపాడాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పినందుకు చాలా ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అప్పుడే రాష్ట్రానికి దరిద్రం వదిలిపోతుందని అన్నారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రానిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడన్నారు. తమ జాతికిచ్చిన హామీపై ప్రతిసారీ రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదంటూ వంకలు చెప్పడం మంచిది కాదన్నారు. ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు చట్టాలు, రూల్స్ వంటివి గుర్తుకొస్తాయి కానీ.. మీ కుమారుడి విషయంలో అవి ఎందుకు వర్తించవని నిలదీశారు. ఇలాంటి గజదొంగ ఈ రాష్ట్రంలో ఉండకూడదన్నారు. ఈనెల 23న 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులతో సమావేశమై వారి సలహాలు, సూచనల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, తుమ్మలపల్లి రమేష్, జీవీ రమణ, గౌతుస్వామి, శ్రీరామ్ పాల్గొన్నారు. -
కూటమికి చంద్ర'గ్రహణమే'!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి తేరుకోలేకపోతోంది. ‘అంతా బాగుందన్న పరి స్థితుల్లో.. ఎక్కడ దెబ్బతిన్నాం?’ అన్న ప్రశ్నే వారికి తొలిచివేస్తోంది. ‘ఎవరైనా ఓడించారా? ఒక తప్పుడు నిర్ణయంతో మనల్ని మనమే ఓడించుకున్నామా?’ అనే అంతర్మథనం సాగుతోంది. గట్టి పోటీ ఇవ్వడం నుంచి.. ఒక దశలో గెలుస్తామని భావించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతినడమే వారి షాక్‌కి ప్రధాన కారణం. అయిదో వంతు కూడా రాని సీట్లతో.. సంఖ్యా పరంగానే కాకుండా ఎలా చూసినా ఇది మింగుడు పడని ఓటమే! ప్రాంతాలుగా గమ నించినా, జిల్లాలుగా విశ్లేషించుకున్నా, సామాజిక వర్గాలుగా లెక్కేసుకున్నా... ప్రజా కూటమిది మహాఓటమి. పాలకపక్షం టీఆర్ఎస్ జోరుకు విపక్ష కూటమి కకావికలైంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణాల అన్వేషణ మొదలైంది. కూటమిని బలోపేతం చేస్తుందనుకున్న తెలుగుదేశంతో పొత్తు, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర తమను నిలువునా ముంచిందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఫలితాల సరళి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. టీడీపీకి తెలంగాణలో ఇంకా బలముందని, ఆంధ్ర ఓటర్లు ఆదరిస్తారను కున్నా.. వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కూటమికి పెద్ద దెబ్బే తగిలింది. శివారు రంగారెడ్డి నియోజకవర్గాల్ని కలుపుకొని ఉండే హైదరాబాద్ మహానగర్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఖమ్మం టు శేరిలింగంపల్లి ఆయన కట్టానని చెప్పుకున్న ‘సైబరాబాద్’ లోని సైబర్టవర్స్ ఉన్న శేరిలింగంపల్లితో సహా.. బాబు రోడ్‌షోలు, సభలు పెట్టిన చోటల్లా కూటమికి ఓటమి తప్పలేదు. ఖమ్మం పట్టణం నుంచి కుత్బుల్లాపూర్ వరకు ఆయన సాగించిన ప్రచార ప్రస్థానంలో అంతటా ఓటమే. ఇలాం టిదేదో జరుగుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌లోనూ కొందరికి ముందు నుంచే ఉంది. కానీ, బహిరంగంగా చెప్పలేక పోయారు. ఆర్థికవనరులు సమకూర్చే కారణం చూపి, రాహుల్‌గాంధీనే చంద్రబాబు బుట్టలో పడేయ డంతో.. కింది స్థాయిలో వ్యతిరే కత ఉన్నా బయ టకు చెప్పలేకపోయారు. టీడీపీతో మనం జట్టు కట్టడం వల్ల లాభపడకపోగా నష్టపోతా మనే బల మైన అభిప్రాయముండి కూడా తామేమీ చేయలేక పోయామని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితం అనుభవిస్తున్నామనే బాధ ఎక్కువ మంది కాంగ్రెస్ వాదుల్లో వ్యక్తమౌతోంది. ముఖ్య నేతలు ఓడిపోవడం పార్టీ శ్రేణులనూ నిరాశలోకి నెట్టింది. బాబొక చెల్లని రూపాయి సమకాలీన రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయిన నాయకుడిగా చంద్రబాబుకున్న పేరు.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వచ్చిన సానుకూలతను, కూటమి విజయావకాశాల్ని దెబ్బతీసింది. ‘ఇంకా బాబు పెత్తనమా? ఇక రాష్ట్రం ముందుకెళ్లనట్లే’ అనే నిర్లిప్తత తెలంగాణ సగటు పౌరుల్లో ఈ పొత్తుతోనే మొదలైంది. బలమైన కారణాలు లేకుండా అసెంబ్లీని రద్దుచేసి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం, ఒకే విడతలో 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖరారు చేయడం తమకు అనుకూలిస్తోందని కాంగ్రెస్ ఉత్సా హంతో ఉన్న సమయంలో.. టీడీపీ వారితో జట్టు కట్టింది. ఈ అంశాన్ని తెలంగాణ సమాజం జీర్ణించు కోలేకపోయింది. ప్రసార మాధ్యమాల్లో ప్రచారం, బద్ధ వ్యతిరేకులతో కలవడం ద్వారా కూటమికి ప్రచారం వచ్చినా.. ప్రతి కూలించిన అంశాలే ఎక్కువ. నిర్దిష్టంగా కాంగ్రెస్‌ను తిట్ట డానికి ఏమీ లేని స్థితిలో కేసీఆర్‌కు చంద్రబాబు ఒక గొప్ప అవకాశంలా దొరి కారు. తన ప్రసంగాల్లోనూ సంక్షేమ, అభివృద్ది అంశాలతోపాటు.. చంద్రబాబుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ‘బాబు ఎక్కడ కాలు పెట్టినా అంతే సంగతులు’, ‘కాళేశ్వరం కావాలా? శనేశ్వరం కావాలా? మీరే తేల్చుకొండ’ంటూ కేసిఆర్ వేసిన ప్రశ్న జనంలో ఆలోచనల్ని రేకెత్తించింది. పరాకాష్టకు చేరింది.. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడుగా విమర్శల నెదుర్కొంటున్న బాబుతో చేతులు కలపడం వల్లే కాంగ్రెస్ అవకాశాలు మరింత సన్నగిల్లాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక, హైదరాబాద్‌ను తానే ప్రపంచ పటంలోకి తెచ్చానని, సైబర్‌సిటీ కట్టానని, చివరకు దివంగత సీఎం వైఎస్సార్ ఆలోచన అయిన ఔటర్ రింగు రోడ్డు అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌హైవే వంటివీ తానే తెచ్చానని చంద్రబాబు రాహుల్ గాంధీ సమక్షంలోనే చెప్పుకోవడం పరాకాష్ట. ఏపీలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల్ని పార్టీ మార్పించి, అందులో కొందరికి మంత్రిపదవులిచ్చి ఎన్ని విమర్శలొచ్చినా కిమ్మనని బాబు, ఇక్కడ అలా పార్టీ మారినవారందరినీ ఓడించమని పిలుపునివ్వడం చూసి ప్రజలు కేసీఆర్ ఆరోపణల్ని గట్టిగా నమ్మి కూటమిని తిరస్కరించారు. ఒకటొకటిగా బయటపడ్డ కుట్రలు.. ‘ఏపీలో వ్యవస్థల్ని కుప్పకూల్చి, ప్రజల్ని వంచించి దోచుకొచ్చిన రూ. వందల కోట్ల ధనాన్ని ఇక్కడ కుమ్మరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ ఇక్కడి అధికార పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అది నిజమే అనిపించేలా, ప్రచారంతో సహా ఎన్నికల ఖర్చంతా తామే భరిస్తున్నట్టు, ప్రచారానికి హెలికాప్టర్లనూ తమ నేతే సమకూరుస్తున్నట్టు, కాంగ్రెస్‌లో కొందరు అభ్యర్థుల్నీ.. బాబే ఖరారు చేస్తు న్నట్టు ఆయన వర్గీయులు, అనుకూల మీడియా సంకేతాలు ఇచ్చింది. తెలంగాణలో ప్రభుత్వపు ఒంటెత్తుపోకడ నచ్చక, కాంగ్రెస్ వైపు ఏకీకృతం కావాలని భావించిన ఒకట్రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా బాబు ‘ఆధిపత్యం’ కారణంగా.. కూటమికి దూరమయ్యారు. సర్వేల పేరుతో కొందరు చేసిన నానా యాగీ, బాబుకు అనుకూలంగా పనిచేసే కొన్ని ప్రసారమాధ్యమాలు ఉన్నవీ లేనివీ కల్పించి ప్రజాక్షేత్రంలో సృష్టించిన ‘అయోమయం’ కాంగ్రెస్ వర్గీయుల్లో లేని భ్రమల్ని కల్పించింది. నందమూరి వంశీయుల్ని తన ఎదుగుదలకు వాడుకునే తత్వంతో చంద్రబాబు వేసిన ఓ చౌకబారు ఎత్తుగడ కూడా ఫలించలేదు. -
కూటమిని ఒక్కటిగా చూడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న (హంగ్) అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కూడిన ప్రజాకూటమి నేతలంతా సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. ఎన్నికలకు ముందే తాము ప్రజాకూటమి (పీపుల్స్ ఫ్రంట్)గా ఏర్పడినందున కూటమిపక్షాలను ఒకే జట్టుగా చూడాలని విన్నవించారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి వస్తే తమ నాలుగు పార్టీలకు కలిపి వచ్చే సీట్లను ఒకే పక్షానికి వచ్చినట్లుగా పరిగణించి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, అజహరుద్దీన్, సంపత్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టీడీపీ సీనియర్లు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మండవ వెంకటేశ్వర్‌రావులతోపాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు గవర్నర్‌ను కలిశారు. ఎన్నికలకు ముందే ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన లేఖను అందజేశారు. ‘ఎన్నికలకు ముందే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడ్డాయన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో నాలుగు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. దీంతోపాటే కామన్ ఎజెండాను ఈసీకి సమర్పించిన కాపీని మీ దృష్టికి తెస్తున్నాం. ఎన్నికల్లో గెలిస్తే కూటమి సంయుక్తంగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది.. కలసి పనిచేస్తుంది. ఈ అంశాన్ని మీ పరిశీలన, సమాచారం నిమిత్తం తెలియజేస్తున్నాం’ అని లేఖలో నేతలు పేర్కొన్నారు. లేఖతోపాటు ప్రజాకూటమి ఏర్పాటు, కామన్ మినిమం ప్రోగ్రాం, కొత్త ప్రభుత్వంలో ఫ్రంట్‌లోని పక్షాలకు న్యాయమైన భాగస్వామ్యం వంటి అంశాలపై గతంలో పార్టీలు చేసిన తీర్మాన కాపీలను గవర్నర్‌కు అందజేశారు. 80 సీట్లు మావే: ఉత్తమ్ గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కూటమికి 80 స్థానాలు దక్కే అవకాశం ఉందని, అయినా ముందు జాగ్ర త్త చర్యల్లో భాగంగానే నరసింహన్‌ను కలిశామని స్పష్టం చేశారు. ‘ఎన్నికల ఫలితాలు మ్యాజిక్ ఫిగర్‌కి దగ్గరగా ఉన్నప్పుడు ఏ పార్టీని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డ కూటమిని ఒక్కటిగా చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఎన్నికలకు ముందే జట్టుగా కలసి పోటీ చేశాయి. ఆ డాక్యుమెంట్, కామన్ ఎజెం డాను గవర్నర్‌కు అందజేశాం. పెద్ద పార్టీని ప్రభు త్వ ఏర్పాటుకు పిలవాల్సి వస్తే కూటమికి వచ్చే సీట్లను ఒకే పక్షానికి వచ్చినట్లుగా పరిగణించాలని చెప్పాం’ అని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని పార్టీలు ఇతర పార్టీలతో కలిసే అవకాశం ఉందని, అయితే ఎన్నికలకు ముందు కలిసిన పార్టీలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కోరామన్నారు. -
ఆ ఓటు ఎవరిది?
-
మరో 24 గంటలు తప్పని ఉత్కంఠ
-
కూటమి ఓట్ల బదిలీ జరిగిందా?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇంతకాలం వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగిన నేతలకు ఇపుడు కొత్త భయం వచ్చిపడింది. అధికార పార్టీని ఓడించడానికి ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి.. కూటమికి చెక్ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య అవగాహనతో ఎన్నికలకు వెళ్లాయి. అయితే.. ఈ అవగాహన క్షేత్రస్థాయిలో ఇరు పక్షాల్లో ఓట్లను బదిలీ చేసేందుకు ప్రభావితం చేసిందా అనేదే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను కలవరపెడుతోంది. ఓటరునాడి అర్థం అసలేమాత్రం అందకపోవడంతో.. ఫలితాలు వెల్లడయ్యే దాకా ఈ ఉత్కంఠ తప్పేట్లు లేదు. కూటమిలో టీజేఎస్‌కే అధిక భయం కాంగ్రెస్‌తో జతకలిసిన కోదండరాం పార్టీ టీజేఎస్‌కు కూటమి పార్టీల ఓట్ల బదిలీయే ప్రశ్నార్థకంగా మారింది. ఈ పార్టీ పోటీ చేసిన చోట్ల కాంగ్రెస్, టీడీపీ ఓట్లు బదిలీ అవుతాయా అన్న విషయంపై.. టీజేఎస్కూ అనుమానాలున్నాయి. మరోవైపు 14 స్థానాలకు పోటీ చేస్తానన్న టీడీపీ పటాన్చెరును కాంగ్రెస్‌కే వదిలేసింది. ఇబ్రహీంపట్నం టికెట్‌ను టీడీపీ తీసుకున్నా.. ఇక్కడ కాంగ్రెస్ రెబెల్ మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు. దీంతో ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు రంగారెడ్డికి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్న సామ రంగారెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా ఓట్లు చీలిపోతాయన్న భయంతో కూటమి తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఖమ్మం, రంగారెడ్డికి మాత్రమే పరిమితం చేశారు. అధికార పక్షానికీ హడలే! పైకి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అధికార టీఆర్ఎస్ కూడా ఓటు బదిలీపై ఆందోళనగానే ఉంది. టీఆర్ఎస్కే ఓటేయాలని అసదుద్దీన్ ముస్లింలకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ జిల్లా కేంద్రాల్లో ఓటు బదిలీపై టీఆర్ఎస్ గంపెడాశలు పెట్టుకుంది. అయితే.. ఈ ఓట్లు నిజంగానే తమకు బదిలీ అయ్యాయా అన్న కంగారు అధికార పార్టీలో కనబడుతోంది. రాజేంద్రనగర్‌లో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నాయి. పాతబస్తీలో నామినేషన్లు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు నామమాత్రంగా ప్రచారం చేసినా.. వీరి ఓట్లు కూడా మజ్లిస్‌ను కలవరపెడుతున్నాయి. చీలికపైనే బీజేపీ ఆశలు! ఈసారి నగరంలో ఉన్న 5 స్థానాలకు తోడుగా జిల్లాల నుంచి మరో 7 స్థానాలపై బీజేపీ కన్నేసింది. తాము లేకుండా రాబోయే ప్రభుత్వం ఏర్పడదంటూ చెప్పుకుంటున్న పార్టీ.. ఓట్ల చీలికపై గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ (అర్బన్), కల్వకుర్తి, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, చొప్పదండి, రాజేంద్రనగర్‌లలో ముక్కోణపు పోటీ నెలకొంది. ప్రజాకూటమి, అధికార పక్షాల ఓట్లు చీలిపోగా.. ఈ స్థానాల్లో తమకున్న ప్రాబల్యంతో ఈసారి డబుల్ డిజిట్ చేరుకుంటామని కమలం పార్టీ లెక్కలు వేస్తోంది. ఈసారి 12 స్థానాల్లో గెలుస్తామని, ఎవరికీ స్పష్టమైన మెజారిటీరాని పక్షంలో తామే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతామని ధీమాగా చెబుతోంది. -
పెరిగిన ఓటు ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఊహించని రీతిలో పెరిగిన పోలింగ్ శాతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 103 నియోజకవర్గాల్లో గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఆ ఓట్లు ఏ పార్టీకి మొగ్గుచూపుతాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ శాతం పెరుగుదల తమకంటే తమకే అనుకూలమని అధికార, ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకే ఓటర్లు ఉత్సాహంగా ఓట్లేశారని అధికార టీఆర్ఎస్ చెబుతోంది. అయితే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి అంటోంది. మరోవైపు బీజేపీ ఇతర చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్ల కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉన్నందున టీఆర్ఎస్కే లబ్ధి కలగొచ్చని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అయితే దీనిపై ఏ పార్టీకి స్పష్టత రావడం లేదు. అయితే ఎగ్జిట్‌పోల్స్ అంచనాల నేపథ్యంలో కొన్ని లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. సర్వే సంస్థలు, వివిధ జాతీయ చానళ్లు జరిపిన సర్వేల ఆధారంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సగటు తీసిన సీఎన్ఎన్ న్యూస్ 18 సంస్థ.. కేసీఆర్‌కు 66 సీట్లు రావొచ్చని పేర్కొంది. విచిత్రంగా కేసీఆర్ లక్కీ నంబరు 6. దీంతో కేసీఆర్‌కు డబుల్ లక్కీ ఫిగర్ వస్తుందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇవీ టీఆర్ఎస్ లెక్కలు పెరిగిన పోలింగ్ శాతంపై టీఆర్ఎస్ విశ్లేషణను పరిశీలిస్తే.. రైతులు, రైతు కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వంపై సానుకూలత ఉందని ఆ పార్టీ భావిస్తోంది. రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాల లబ్ధిదారులంతా మూకుమ్మడిగా ప్రభుత్వానికి బాసటగా నిలిచారంటోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులకు తగినంత సమయం దొరికింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పాటు వారి బంధువులను సైతం ఆకట్టుకునే రీతిలో వీరి ప్రచారం సాగింది. గ్రామ గ్రామాన సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను తెప్పించుకుని వారిని ప్రత్యక్షంగా కలిసి ఓట్లడిగేందుకు మూడు నెలల సమయం దొరకడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు సఫలీకృతయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పోలింగ్ పూర్తిగా తమకు అనుకూలంగానే జరిగిందనే ధీమాలో గులాబీదళం ఉంది. ఇక.. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే భావన ఎన్నికల ముందు కనిపించినప్పటికీ పోలింగ్ సమయానికి వివిధ కారణాలతో కొంత అనుకూలంగా మారిందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంమీద పోలింగ్ తమ పక్షానే జరిగిందని, మంగళవారం ఇదే నిర్ధారణ అవుతుందని కేసీఆర్‌తో సహా ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అది వ్యతిరేక ఓటే: కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతే పెరిగిన ఓటింగ్ రూపంలో బయటపడిందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి అంటోంది. తెలంగాణ ఉద్యమ నినాదమైన నియామకాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. దీంతో నిరుద్యోగ యువత పూర్తిగా తమకే ఓటేసిందని అంచనా వేస్తోంది. ఎన్నికలకు ముందు ఉద్యోగులు కూడా బహిరంగంగానే టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడారని, విద్యావంతులకు కూడా ప్రభుత్వంపై సదాభిప్రాయం లేదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఐక్యత కారణంగా కూడా పోలింగ్ ఎక్కువగా జరిగిందని, అన్ని పార్టీలు తమ కార్యకర్తల చేత ఓట్లు వేయించడంలో విజయవంతమైనందునే పోలింగ్ శాతం పెరిగిందని కూటమి అభిప్రాయపడుతోంది. టీఆర్ఎస్ వైఫల్యాలు, తమ మేనిఫెస్టో, కూటమి స్ఫూర్తి వెరసి.. ఓటింగ్ పెరుగుదలకు కారణమైందని ధీమా వ్యక్తం చేస్తోంది. త్రిముఖ పోటీ ఉన్నచోట.. టీఆర్ఎస్, కూటమితో పాటు బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రుల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న స్థానాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగింది. బోథ్, నిజామాబాద్ (అర్బన్), రామగుండం, చొప్పదండి, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, మేడ్చల్, నారాయణ్‌పేట, మహబూబ్‌నగర్, దేవరకొండ, మిర్యాలగూడ, భువనగిరి, ఆలేరు, వరంగల్ (ఈస్ట్), భద్రాచలం స్థానాల్లో కూడా పోలింగ్ శాతం పెరగడంతో ఇక్కడ ప్రజాతీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బలమైన నేతలే పోటీదారులు ఉండడంతో ఎవరికి వారే తమకు అనుకూలంగా పోలింగ్ చేయించుకునేందుకు చేసిన ప్రయత్నాల కారణంగానే పోలింగ్ పెరిగిందనే భావన వ్యక్తమవుతోంది. అయితే, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు.. మిగిలిన ఇద్దరు అభ్యర్థుల మధ్య చీలిపోయి అది టీఆర్ఎస్కు మేలు జరుగుతుందని విశ్లేషకులంటున్నారు. ఇక, బీజేపీ ప్రధాన పోటీలో ఉన్న నియోజకవర్గాలతో పాటు నగర, పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ గణనీయంగా ఓట్లు చీల్చగలిగితే ఆ ప్రభావం కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. 10% కన్నా ఎక్కువే! పోలింగ్ శాతం ఏ నియోజకవర్గంలో ఏమేరకు పెరిగిందనే లెక్కల ఆధారంగా చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో 2014తో పోలిస్తే 10% కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఇందులో పట్టణ నేపథ్యం ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, జహీరాబాద్, నల్లగొండ వంటి నియోజకవర్గాలతో పాటు పూర్తిగా గ్రామీణ ఓటర్లుండే కొడంగల్, నారాయణ్‌పేట, మక్తల్, దేవరకద్ర, వనపర్తి, అచ్చంపేట వంటి స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌లో ఏకంగా 17.8% పోలింగ్ పెరగడంతో ప్రజాపల్స్ను ఊహించడం రాజకీయ పార్టీల తరం కావడం లేదు. గత ఎన్నికల కన్నా సుమారు 35వేల ఓట్లు ఇక్కడ అధికంగా పోల్కావడంతో ఈ ఓట్లన్నీ ఎవరికి పడ్డాయనేదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆ 41 నియోజకవర్గాల్లో.. 7% కన్నా ఎక్కువ పోలింగ్ 41 నియోజకవర్గాల్లో నమోదైంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), కోరుట్ల, జగిత్యాల, రామగుండం, కరీంనగర్, మెదక్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కొడంగల్, నారాయణ్‌పేట, మహబూబ్‌నగర్, మక్తల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, షాద్‌నగర్, కొల్లాపూర్, దేవరకొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, స్టేషన్ ఘన్పూర్, కొత్తగూడెం స్థానాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఇందులో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 2014తో పోలిస్తే కనీసం 15వేలు ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. దీంతో ఈ 41 స్థానాల్లో ఫలితాలే ప్రభుత్వంలో ఎవరుండాలని నిర్ణయిస్తాయని విశ్లేషకులంటున్నారు. -
రేపే ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: నరాలుతెగే ఉత్కంఠకు రేపు తెరపడనుంది. మరో 24 గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటరు తన మనోభీష్టాన్ని దాచిన ఈవీఎంలు మంగళవారం తెరుచుకోనున్నాయి. విజయంపై అన్ని పార్టీలు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో టెన్షన్ నెలకొంది. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్య ర్థులతో పాటు కార్యకర్తలకు ఈ 24 గంటలు క్షణమొక యుగంలా మారాయి. గత శాసనసభ ఎన్నికల్లో 69.5% మాత్రమే పోలింగ్ జరగగా, ఈసారి రికార్డు స్థాయిలో 73.2 శాతానికి పోలింగ్ పెరగడంపై సరైన అంచనాలు అంద డం లేదు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు 44 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జరగనున్న ఒక రౌండ్లో ఒకేసారి 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కలు తేలనున్నాయి. ప్రతి టేబుల్ వద్ద ఓ పర్యవేక్షకుడు, ఓ సహాయ పర్యవేక్షకుడు, ఓ సూక్ష్మ పరిశీలకుడిని నియమిం చనున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇవ్వగా.. సోమవారం రెండో విడత శిక్షణ ఇస్తారు. అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక కౌటింగ్ ఏజెంట్‌ను లెక్కింపు కేంద్రంలోపలకు అనుమతించనున్నారు. ఉదయం 8.30 నుంచి ఫలితాలు షురూ! ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలను ఎప్పటి కప్పుడు రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వీసు, పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి తొలి రౌండ్ ఫలితాలను ప్రకటించనున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. బ్యాలెట్ యూనిట్లను కంట్రోల్ యూనిట్లకు అనుసంధానం చేసి రిజల్ట్ మీటను నొక్కగానే సంబంధిత పోలింగ్ కేంద్రంలో మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది స్క్రీన్ మీద కనిపించనుంది. లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు, అభ్యర్థుల ఏజెంట్లు తమకు అప్పగించిన దరఖాస్తుల్లో ఓట్లకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించిన తర్వాత సంబంధిత రౌండ్‌కు సంబంధించిన ఫలితాలను ప్రకటించనున్నారు. నాలుగైదు రౌండ్ల ఫలితాల సరళి ఆధారంగా ఉదయం 9.30 గంటల సమయానికే చాలాచోట్ల గెలుపోటములపై కొంత మేర స్పష్టత వచ్చే అవకాశముంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వరుసగా ఒక్కో నియోజకవర్గం ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల కల్లా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు బహిర్గతం కానున్నాయి. శాసనసభ ఎన్నికల బరిలో నిలబడిన 1,821 అభ్యర్థుల్లో 119 మంది విజేతలెవరో తేలిపోనుంది. సీసీ టీవీ కెమెరాల నిఘాలో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందన్న కూటమి నేతల అనుమానాల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సంబంధిత నాయకులు కాపలా కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకులలోని స్ట్రాంగ్‌రూమ్‌లో 8 నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపర్చారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో వాహనాలు తనిఖీ చేసి పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. రెండో అంచెలో 500 మీటర్ల వరకు కేంద్రం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా బలగాలు గస్తీ కాస్తున్నాయి. మూడో అంచెలో సీసీ కెమెరాలు, కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. రెండు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. సుమారు వెయ్యి మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బలగాల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ అనుమతితో ప్రజాకూటమి బృందాలు ఇక్కడ శనివారం సాయంత్రం నుంచి కాపలాగా ఉంటున్నాయి. ఆయా నియోజకవర్గాలతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు రాత్రి, పగలు ఇక్కడే ఉండి స్ట్రాంగ్ రూంలు ఉన్న కేంద్రంపై నిఘా పెట్టారు. కౌంటింగ్ ఏజెంట్లు మంగళవారం ఉదయం 7 గంటల లోపే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన పాసులతో రావాల్సి ఉంటుంది. సెల్ఫోన్లను కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతించరని.. కేవలం పాసులు ఉన్న వారినే లోనికి పంపిస్తారని అధికారులు వెల్లడించారు. -
టెన్షన్.. టెన్షన్.. కూటమిలో తీసి‘వెత’లు
సాక్షి, హైదరాబాద్: గెలిచేదెవరు... ఓడేదెవరు. అధికారం ఎవరికి, ప్రతిపక్షంలో ఎవరుంటారు? వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్ధుల్లోనే కాదు. సాధారణ ప్రజానీకంలోనూ ఇదే చర్చ. ఒకవైపు ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో మరో రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై నగరంలో ఏ ఇద్దరు కలిసినా ఎన్నికలే చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు అభ్యర్థులు సైతం తమ తప్పొప్పులను, బలాబలాలను సమీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్‌లో నమోదైన ఓట్లను అంచనా వేస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందనే అంశంపైన బూత్‌స్థాయి కార్యకర్తలతో జరుపుతున్న సంప్రదింపులు తారాస్థాయికి చేరాయి. ఫలితాలు వెలువడేందుకు మరో రెండు రోజుల గడువు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల పాటు ఒక్కో అభ్యర్ధి తన నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లలో కాలనీలు, బస్తీల వారీగా తమకు పట్టున్న ప్రాంతాలను, నమోదయ్యేందుకు అవకాశం ఉన్న ఓట్లను అంచనా వేస్తున్నారు. మరోవైపు చాలా చోట్ల పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడం, ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో కొంతమంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు బాగా ఆదరణ, పట్టున్న ప్రాంతాల్లోనే ఓట్లు గల్లంతైపోవడంతో గెలుపుపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలు, ప్రచార కార్యక్రమాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. యథావిధిగా పోలింగ్ శాతం చాలా తక్కువగానే నమోదైంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ పోలింగ్ ఏ పార్టీలకు పట్టం కట్టగలదనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు తమ గెలుపుపైన స్పష్టమైన ధీమా వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు అంతర్మథనంలో పడిపోయారు. కూటమిలో తీసి‘వెత’లు... ఉప్పల్ స్వరూప్‌నగర్‌కు చెందిన ఒక పోలింగ్ బూత్ వద్ద ఓ మహిళ తనకు నచ్చిన హస్తం గుర్తు కనిపించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి అక్కడ ప్రజాకూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్థి బరిలో ఉన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలనుకున్నవాళ్లు సైకిల్‌పై వేయాలి. కానీ ఆ మహిళ చేతి గుర్తుకు తప్ప మరో గుర్తుకు ఓటు వేసేందుకు నిరాకరించి వెళ్లిపోయారు. ఒక్క ఉప్పల్లోనే కాదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపోటములపైన ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలనుకున్న వాళ్లకు చేయి గుర్తు మాత్రమే కనిపించడం, కొన్ని చోట్ల టీజేఎస్ గుర్తు కనిపించడంతో ఓటర్లలో విముఖత వ్యక్తమైంది. ఇక ప్రచారంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు వెనుకడుగు వేశారు. (చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...) అలాగే తెలుగుదేశం వాళ్లు కూడా కాంగ్రెస్‌కు మనస్ఫూర్తిగా ప్రచారం చేయలేకపోయారు. పై స్థాయిలో కూటమి పటిష్టంగానే ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌ల స్థాయిలో ఈ లోపం ప్రస్ఫుటమైంది. టీజేఎస్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఏ ఓటు ఏ అభ్యర్ధికి పడిందనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితులన్నింటిపైనా అభ్యర్థులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్లోనే ఇదే తరహా అంతర్మథనం కొనసాగుతోంది. ప్రత్యర్ధులతో తాము పోటీపడగలిగామా లేదా అనే అంశంతో పాటు, ఆశించిన ఓట్లు తమ ఖాతాలోనే పడతాయా లేక, ప్రత్యర్థుల ఖాతాలో చేరతాయా అనే దిశగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ ఉత్కంఠ ఇలాగే ఉండనుంది. ఓటు జారి గల్లంతయిందే.... గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతైపోవడం రాజకీయ పార్టీలకు ఆశనిపాతంగా మారింది. మల్కాజిగిరి నియోజకవర్గంలోనే సుమారు 40 వేల ఓట్లు గల్లంతైనట్లు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, పాతబస్తీలోని చార్మినార్, యాఖుత్పురా, తదితర నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వరకు తరలివచ్చిన ఓటర్లు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు లక్షలాది మంది నగరవాసులు తమ సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వెళ్లారు. దీంతో అనేక చోట్ల అభ్యర్ధుల అంచనాలు తలకిందులయ్యాయి. కలిసొస్తాయనుకునున్న కాలనీలు, బస్తీల్లో ఓట్లు గల్లంతైపోవడం, కాదనుకున్న చోట్ల పెద్ద ఎత్తున ఓట్లు నమోదుకావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులను ఆందోళనకు గురి చేసింది. దీంతో తాజాగా ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. వాటిలో తమకు దక్కేవెన్ని అనే కోణంలో విస్తృతంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు తమ ప్రచార తీరుతెన్నులను సైతం సమీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థులతో ధీటుగా తమ ప్రచారం కొనసాగిందీ లేనిదీ కార్యకర్తలతో కలిసి చర్చిస్తున్నారు.లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దిశగా అన్ని పార్టీల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. -
ఎన్ని'కల' పందెం కాస్కో..!
సాక్షి, కొత్తకోట: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈనెల 11న వెలువడే ఫలితాలపై రూ.లక్షల బెట్టింగ్ నడుస్తోంది. జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌పోల్ సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా, ఒక్క లగడపాటి ఎగ్జిట్‌పోల్ సర్వే మాత్రం మహాకూటమికి సానుకూలంగా ఉందని చెప్పడం అందరిలోనూ ఉత్కంఠ రేపింది. గతంలో జరిపిన లగడపాటి సర్వేలు చాలా మేరకు విజయవంతమవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత అలజడి నెలకొంది. దీంతో నేషనల్ ఎగ్జిట్‌పోల్స్‌పై నమ్మకం ఉంచుతూ కొందరు బెట్టింగులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలో బెట్టింగు రాయుళ్లు సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులకు మించిన స్థాయిలో ఓటింగ్ జరిగిన తీరునూ అంచనా వేస్తూ పందేలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొత్తకోట పట్టణంతో పాటు దేవరకద్ర, భూత్పూర్, అడ్డాకుల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతో పాటు మదనాపురం, మూసాపేట వంటి మారుమూల ప్రాంతాలకు ఈ జాఢ్యం అంటుకుంది. ఈ క్రమంలో కొందరు లాభపడటం.. మరికొందరు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితాలపై బెట్టింగ్‌ల తీరు ఎన్నికలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి. ఆయా రాజకీయ పార్టీలు రూ.కోట్లు ఖర్చుచేశాయి. డబ్బు, మద్యం ఏరులై పారింది. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ప్రచారం మొదలుకుని పోలింగ్ వరకు పందెం కాస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. మహాకూటమి వస్తుందా.. లేక హంగ్ ఏర్పడనుందా.. అంటూ పందెం కాస్తున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడా.. లేక మహాకూటమి అభ్యర్థి గెలుస్తాడా.. బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయనే కోణంలో బెట్టింగులు కాస్తున్నారు. ఇవీ కాకుండా బెట్టింగ్ రాయళ్లు ఇంకొంచెం ముందుకెళ్లి ఆయా పట్టణాల్లో తమ నాయకుడికే అత్యధిక ఓట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఏ మండలం ఎవరికి ఎంత లీడ్ ఇస్తుందో చెబుతున్నారు. పల్లెల్లో బెట్టింగ్ భూతం ఎన్నికలకు ముందు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా కొత్తకోట, దేవరకద్ర మండలాల్లో బెట్టింగ్ కాసినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వేలు, లగడపాటి సర్వేలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఉండటంతో బెట్టింగ్‌ల స్థాయి పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. దీంతో ఆయా మండలాల్లో కీలక నేతలు ఉండే గ్రామాల్లో కార్యకర్తల బెట్టింగ్‌ల జోరు ఊపందుకుంది. బెటింగ్ రాయుళ్ల ఆశలు నెరవేరాలంటే ఈనెల 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. స్వేహపూర్వకంగా గెలుపోటములు ఏ పోటీలోనైనా గెలుపోటములు స్వేహపూర్వకంగా ఉండాలి. అంతేగాని కొట్లాటలు, పోట్లాట వరకు వెళ్లకూడదు. ఫలితాలపై ఉత్కంఠ ఉండటం సహజమే. కానీ ఈ నెపంతో పందెం కాసి డబ్బు పోగొట్టుకోవడం మంచిది కాదు. ఆయా పార్టీల వారిలో ఎవరి ధీమా వారికే ఉంటుంది. ప్రస్తుతం ఓటర్లు పూర్తి అవగాహనతో ఓటు వేస్తున్నారు. వారి నాడి ఎవరికి అంతుచిక్కడం లేదు. – రవికాంత్‌రావు, ఎస్ఐ, కొత్తకోట -
మేమే.. కాదు మేము ! గెలుపుపై ఎవరి ధీమా వారిదే...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రజలను అత్యంత ఆసక్తి, ఉత్కంఠతకు గురి చేస్తోంది. ముందస్తు రూపంలో వచ్చిన శాసనసభ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో...పోలింగ్ జరిగే వరకు కూడా హోరాహోరీగా ప్రచారం సాగింది. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా పోలింగ్ జరగడం అన్ని రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. జిల్లాలో సరాసరిగా 79.7 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఎవరికి వారు ఈ భారీ పోలింగ్ తమకే అనుకూలమంటూ పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే, పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ ఛానెళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్ నివేదికలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇలా మొత్తం మీద తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తున్న పోలింగ్, 11వ తేదీన వెలువడనున్న ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు మొదలయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీల మధ్య... ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల మీద హోరాహోరీ బెట్టింగ్ కొనసాగుతోంది. చర్చంతా భారీ పోలింగ్‌పైనే.. పాలమూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎక్కడా కూడా 70శాతానికి తగ్గకుండా పోలింగ్ జరిగింది. అంతేకాదు ఉమ్మడి జిల్లాలోనే దేవరకద్ర అత్యధికంగా 84.6 శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువ పోలింగ్ కూడా 73.5 శాతం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో నమోదు కావడం విశేసం. భారీ పోలింగ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల నడుమ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ప్రజలు భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చని కారణంగా ప్రభుత్వంపై కోపంతో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని ప్రజాఫ్రంట్, ఇతర పార్టీల నేతలు పేర్కొంటున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ నుంచి మాత్రం ఇందుకు భిన్నమైన సమాధానం వస్తోంది. ఓటింగ్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరగడం.. ప్రజలందరూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలపై సంతృప్తిగా ఉండడంతోనే ఇలా జరిగిందని ఉన్నారని పేర్కొంటుంది. ముఖ్యంగా వృద్దాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఆయా వర్గాల ఓట్లు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ వైపే ఉన్నాయని చెబుతున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్ఎస్, ప్రజాఫ్రంట్ పార్టీలకు చెందిన నేతలు పోలింగ్ సరళిని ఎవరికి వారు అనుకూలంగా భావిస్తున్నారు. పాలమూరుపై ప్రత్యేక దృష్టి ఎన్నికల ఫలితాల విషయంలో ఈసారి రాష్ట్రం మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వైపు అత్యంత ఆసక్తిగా చూస్తోంది. ఈ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం కావడంతో.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడంతో దృష్టి మొత్తం పాలమూరు మీదే ఉంది. టీఆర్ఎస్ కూడా ఈసారి పాలమూరు అత్యధిక స్థానాలు గెలవబోతున్నా మని ఘంటా పథకంగా చెబుతోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ జిల్లాలో జరిగిన ప్రతీ సభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జిల్లాకు టీఆర్ఎస్ హయాంలోనే లబ్ధి జరిగిందని పదేపదే ప్రస్తావించారు. అంతేకాదు టీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీశ్‌రావు, కేటీఆర్ కూడా పలుమార్లు జిల్లా పర్యటనలు చేసి పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలు డీకే.అరుణ, రేవంత్ రెడ్డిని కూడా ఈసారి ఓడిస్తామని శపథాలు చేశారు. మరోవైపు పాలమూరులో టీఆర్ఎస్ను మట్టి కరిపిస్తామని ప్ర జాఫ్రంట్ ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ ఊహిస్తున్న ఫలితాలకు పూర్తి భిన్నమైన తీర్పు రాబోతుందని పేర్కొంటుంది. ఇలా మొత్తం మీద ఎవరికి వారు చేస్తున్న ప్రకటనలు మరింత తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తున్నాయి. బెట్టింగ్‌లు షురూ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై ఈసారి భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు స్థానాలపై భారీగా బెట్టింగ్‌లు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న రేవంత్‌రెడ్డి గెలుపోటములతో పాటు మెజార్టీపై కూడా పలువురు బెట్టింగ్‌కు దిగినట్లు చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన డీకే.అరుణ విషయంలో కూడా జోరుగా బెట్టింగక్ష జరుగుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితిలో డీకే అరుణను ఓడించాలని టీఆర్ఎస్ అధిష్టానం గట్టి పట్టుదలతో పనిచేసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ వనపర్తిలో సభలోనూ ప్రస్తావించారు. దీంతో గద్వాల నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన అరుణ గెలుపోటములు, మె జార్టీపై బెట్టింగ్‌కు దిగినట్లు తెలుస్తోంది. అలాగే, మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. -
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు
కోవెలకుంట్ల: పక్క రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఆయా పార్టీల గెలుపోటములపై బెట్టింగ్‌ల జోరు సాగుతోంది. కోవెలకుంట్ల కేంద్రంగా పోలింగ్ ముగిసినప్పటి నుంచి పందేలా జోరు ఊపందుకుంది. శుక్రవారం ఎన్నికల పోలింగ్ ముగియగా ఈ నెల 11న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్‌కు మరో రెండు రోజులు గడువు ఉండటంతో ప్రధాన పార్టీల గెలుపుపై బెట్టింగ్ రాయుళ్లు రూ. లక్షల్లో పందెం కాస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ తరఫున పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు రూ.5 లక్షల వరకు బెట్ కట్టగా, మరికొంత మంది మహాకూటమి విజయం సాధిస్తుందని వారికి ధీటుగా బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో పలుచోట్ల తెలంగాణా ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతుండగా మరోవైపు బెట్టింగ్ వ్యవహారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల గెలుపుతోపాటు ఆయా పార్టీల్లో బలమైన అభ్యర్థుల గెలుపు, మెజార్టీపై పందేలు కాశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేటీఆర్, హరీష్‌రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి వంటి ప్రధాన నాయకులకు ఎన్నికల్లో వచ్చే మెజార్టీపై బెట్టింగ్‌లు కడుతున్నట్లు సమాచారం. రూ.5వేల నుంచి రూ.లక్షల్లో పార్టీల గెలుపు, ఓటములపై పందేలు సాగుతున్నాయి. హైదరాబాదులో ఉన్న స్నేహితులు, తెలిసిన వ్యక్తుల నుంచి ఫోన్ల ద్వారా ఎన్నికల సమాచారం రాబట్టుకోవడంతోపాటు పలు చానళ్లు, పత్రికల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఆయా పార్టీల గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు నిర్వహిస్తుండటం గమనార్హం. పట్టణంతోపాటు డివిజన్లోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు. -
చచ్చినా సరే వదిలేది లేదు : వంటేరు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలబోతున్నానని ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 24 గంటలు గడుస్తున్నా పోలింగ్ ఎంత శాతం అయిందో ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని విమర్శించారు. గజ్వెల్ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనే అనుమానాల నేపథ్యంలో సీఈఓను కలిశామని తెలిపారు. ‘వీవీ ప్యాట్‌లో వచ్చిన స్లిప్పులను లెక్కించాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. అవసరమైతే ఈ విషయంపై హైకోర్టులో కేసు వేసే ఆలోచనలో కూడా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. వీవీ ప్యాట్‌లో వచ్చిన స్లిప్పులను లెక్కించకపోతే ఆమరణ దీక్ష చేస్తాననీ, చచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ తన ఫోన్లన్నీ ట్యాప్ చేయిస్తున్నారనీ, ఫోన్లో మాట్లాడాలంటే కూడా భయంగా ఉందని వాపోయారు. ‘మా గురించి చెప్పే దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక ఏదీ లేదు. గజ్వెల్లో లిక్కర్, డబ్బు విచ్చలవిడిగా పంచారు. పోలీసులు కూడా అధికార పార్టీ తో కుమ్మక్కయ్యారు. వారందరినీ సస్సెండ్ చేయాలి’ అని వంటేరు అన్నారు. నాలుగేళ్ల పాలనా కాలంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని వంటేరు నిప్పులు చెరిగారు. సీఎంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. -
ఉద్వేగం.. ఉత్కంఠ..
సాక్షి, హైదరాబాద్: మొన్నటిదాకా స్థానికులంతా కేంద్రం నిర్ణయంతో స్థానికేతరులయ్యారు.. అయినా సరే విడిపోయామన్న ఉద్వేగం తో వచ్చి ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లు భారీగా తగ్గడంతో నేతలంతా గుబులు చెందుతున్నారు. పోలింగ్ రోజు నుంచి ఫలితాలు వెల్లడయ్యేదాకా వీరి ఉత్కంఠ రెట్టింపు కానుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చేవరకు ఇక్కడే ఉన్న వారంతా అనివార్య కారణాల వల్ల తెలంగాణలోని ఏడు మండలాల ప్రజలు ఏపీలో విలీనమయ్యారు. ఈ ప్రాంతాల్లో దాదాపు లక్షన్నర ఓట్లున్నాయి. ఓటర్ల సంఖ్య భారీగా తగ్గడంతో మూడు నియోజకవర్గాల్లో ప్రతీ ఓటు కీలకంగా మారింది. అభ్యర్థులు ప్రతీ ఓటరును వ్యక్తిగతం గా కలిసి మరీ ఓటేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో ఓట్లు 1.3 లక్షలే కావడంతో ఇక్కడ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రయత్నిస్తున్నారు. ఇదీ నేపథ్యం.. ఏపీ అభ్యర్థన మేరకు అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం మూడు నియోజకవర్గాల్లోని 7 మండలాలను కేంద్రం ఏపీలో కలిపింది. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. పినపాక పరిధిలోని బూర్గంపాడు, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కు నూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిల్లో 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలున్నాయి. మొత్తం 1.8 లక్షల ఓట్లు ఏపీకి బదిలీ అయ్యాయి. భద్రాచలంలో ప్రత్యేక ప్రచారం.. ఈ నియోజకవర్గాల్లో అన్నింటి కంటే ఎక్కువగా ఓటర్లను కోల్పోయింది భద్రాచలం. దాదాపు 1,35,000 ఓట్లు ఏపీకి బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ప్రతి పార్టీ ఇక్కడ పోటీని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. టీఆర్ఎస్, మహాకూటమితో పాటు, బీఎల్ఎఫ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్న 1.37 లక్షల ఓట్లను ముగ్గురు అభ్యర్థులు పంచుకోగా విజేతకు ఎన్ని ఓట్లు వస్తాయన్న దానిపై బెట్టింగులు కూడా మొదలయ్యాయి. సంఖ్య పరంగా చూస్తే ఇదే అతిచిన్న నియోజకవర్గం కావడం గమనార్హం. మరోవైపు అశ్వరావుపేటలో 1.6 లక్షల ఓట్లలో 42 వేల ఓట్లు ఏపీకి బదిలీ కాగా, ఈసారి కొత్త ఓటర్లతో కలిపి 1.4 లక్షలకు రావడం గమనార్హం. పినపాక దాదాపు 4 వేల ఓట్లు కోల్పోయింది. గట్టుదాటి ప్రచారం! గత ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి, ఓట్లు వేసిన ముంపు ప్రాంతాల ప్రజలు అనూహ్యంగా ఏపీలో కలిశారు. ఇందులో ప్రజలకు ఓటు వేసే వీలు లేకుం డా పోయింది. కానీ దాదాపు అన్ని పార్టీల నేతలూ అక్కడ ఉన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో వీరంతా ప్రచారం చేసేందుకు గట్టు దాటి వచ్చారు. దాదాపు అన్ని పార్టీల నేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేశారు. తమ తమ పార్టీల విజయాల కోసం కష్టపడ్డారు. ఈ నెల 5న ప్రచార గడువు ముగియడంతో ఇక సెలవంటూ ఉద్వేగంతో తిరుగు పయనమయ్యారు. -
కేసీఆర్ అసహనం ఓటమికి సంకేతం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పార్టీ కేడర్‌పై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేయడం టీఆర్ఎస్ ఓట మికి సంకేతం అని సీపీఎం అభివర్ణించింది. టీఆర్ఎస్ పాలనలో చెప్పిం ది ఎక్కువ చేసింది తక్కువ, అప్పులు ఎక్కువ అభివృద్ధి తక్కువ అని ఆ పార్టీ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలకే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. బుధవారం ఎంబీభవన్‌లో పార్టీ నాయకులు టి.జ్యోతి, డి.జి.నర్సింహారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం– సమగ్రాభివృద్ధి సాధన దిశగా ప్రత్యామ్నాయ విధానాలతో పోటీచేస్తున్న సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులను బలపరచాలని ప్రజలను కోరారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉండటంతో, తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి లోక్‌సభ ఎన్నికలకు ముందు పట్టు సాధించేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారన్నారు. పాలకపార్టీకి ఈసీ వత్తాసు అధికార టీఆర్ఎస్కు ఈసీ వత్తాసు పలికేలా వ్యవహరిస్తోందని జ్యోతి ఆరోపించారు. కోట్లాది రూపాయలు పంపిణీ కోసం గ్రామాలకు చేరుతున్నా ఈసీ ఉదాసీనంగా ఉందన్నారు. ఇప్పటికై నా డబ్బు, మద్యం పంపిణీ అరికట్టేలా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమపథకాల చుట్టే ప్రధానపార్టీల మేనిఫెస్టోలు తిరిగినా, మౌలికంగా మార్పు ఎలా తెస్తారు, పథకాల అమలుకు అవసరమైన డబ్బును ఎలా సమకూరుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
మోదీ, కేసీఆర్ దొందూ దొందే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/అశ్వారావుపేట: టీఆర్ఎస్ అవినీతికి ఆలవాలంగా మారిందని, కేసీఆర్‌తోసహా ఆ పార్టీలో ఎవరివద్దా మచ్చుకైనా నీతి నిజాయితీ కనపడదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో బుధవారం జరిగిన ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ రెండో మోదీగా వ్యవహరిస్తున్నారని, ఈ రెండు ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నావని తనను అడిగే హక్కు కేసీఆర్‌కు ఎంతమాత్రం లేదని, ఇక్కడి ప్రజలను దోపిడీ నుంచి రక్షించడానికే తాను వచ్చానని ఆయన పేర్కొన్నారు. మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సీబీఐ, ఈడీ, ఐబీ లను దుర్వినియోగం చేయడంలో ఆయనది అందెవేసిన చేయి అని అన్నారు. పేదలు దాచుకున్న డబ్బు లు సైతం బ్యాంకుల నుంచి తీసుకోలేని దురదృష్ట పరిస్థితులు నరేంద్రమోదీ కాలంలోనే ప్రారంభమయ్యాయని విమర్శించారు. అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయని, ధరలు పెరిగి, రూపాయి విలువ పడిపోయిందన్నారు. సీబీఐ కూడా అవినీతిమయం అయిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్‌తో 37 ఏళ్లపాటు ఉన్న విభేదాలను పక్కన పెట్టామన్నారు. కేసీఆర్ అహంకార ధోరణితో ముందుకు పోతున్నారని, అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనే విధంగా వ్యవహరించడం ఆయనకే చెల్లు అని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలను తానెప్పుడూ తప్పుపట్టనని, అయితే కేసీఆర్ బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. కేసీఆర్‌కు ఇవే చివరి ఎన్నికలు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లగడపాటి సర్వేలో 90 సీట్లు వస్తాయంటే ఆనందపడ్డ కేసీఆర్, ఇప్పుడు రావంటే వారిపై దాడికి పూనుకున్నారని, ఇది హుందాతనం కాదన్నారు. సభల్లో సత్తుపల్లి టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట టీడీ పీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మం త్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి గులాంలా.. తెలంగాణ గులాబీలా?
సాక్షి, సిరిసిల్ల : కారు పెట్టే కూతతో కూటమి గూబ గుయ్యిమనాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ గులాములు కావాలా? తెలంగాణ గులాబీలు కావాలో తేల్చుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడలో ప్రచా రానికి చివరిరోజైన బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణలో ఎన్నికల ఫలితం బట్టే రేపు ఢిల్లీ గద్దె మీద కూర్చునే వ్యక్తి కూడా ఇక్కడి నుంచే నిర్ణయమవుతుంది. ఈ ఫలితానికి రాహుల్, చంద్రబాబు, మోదీలు గజగజ వణకాలి’అని పేర్కొన్నారు. ‘ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి నలుగురైదురు ఒక్కటై వస్తున్నరు. ప్రధాని మోదీ పచ్చి ఝూటా మనిషి. రాహుల్ వచ్చి అడ్డం పొడుగు మాట్లాడుతుండు. ఎమర్జెన్సీ పెట్టినోళ్లు మనకు ప్రజాస్వామ్యం మీద పాఠాలు చెబుతుండ్రు. డిసెంబర్ 11 తర్వాత రాహుల్ వీణ, బాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందే’అన్నారు. కేసీఆర్ నన్ను మం త్రిని చేసి చేనేత, జౌళి శాఖ తనకే అప్పగించార ని తెలిపారు. బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగాయన్నారు. టీఆర్ఎస్ పాలనలో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నా రు. సర్వేలతో ఆగం జేస్తుండ్రు కాంగ్రేసోళ్ల డైలాగుల్లో కొత్తదనం ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ‘పేపరు చూడంగనే పాసిపోయిన ముఖాలే కనబడుతున్నయి. రాహుల్ సీట్లు, బాబు నోట్లిచ్చినా ఓట్లు మాత్రం టీఆర్ఎస్కే’అని చెప్పారు. ‘జానారెడ్డి, ఉత్తమ్, రేవంత్, అరుణ వారి నియోజవర్గాల గడప కూడా దాటుతలేరు. కాంగ్రెస్‌లో పోటుగాళ్లనుకునేటోళ్లకే దిక్కులేదు. ఈ మధ్యకాలం లో సర్వేలని అందర్నీ ఆగం జేస్తున్నరు. నేను కూడా 70 నియోజకవర్గాలు తిరిగిన, సెంచరీ కొట్టుడు ఖాయం. అందరూ తట్ట, బుట్టా కట్టుకుని పోవుడు పక్కా’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ వైపే
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మహాకూటమి నేతలు చిల్లర వ్యూహాలకు తెరలేపుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నారని తెలిసి చివరగా సర్వేల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ‘లగడపాటి రాజగోపాల్, నేను వాట్సాప్‌లో ఎన్నికలపై మెసెజ్‌లు పంపుకున్నాం. నవంబర్ 20న టీఆర్ఎస్కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పుడు నాకు మెసేజ్ పెట్టారు. అదే విషయాన్ని చంద్రబాబుకు పంపానని తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని, టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పాను. నవంబర్ 20 తర్వాత రాజగోపాల్ ఎలాంటి సర్వేలు చేయలేదు. రెండు పత్రికలతో కలసి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. గత ఎన్నికల్లో ఏపీలో ఇలాంటివే చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. గోబెల్స్‌కు చంద్రబాబు తమ్ముడిలాంటి వారు. ఓటమి భయంతో సర్వేల పేరుతో ఏదో చేయాలని చూస్తున్నారు. రాజగోపాల్ చిలకజోస్యాలు చెల్లవు. ఆయన జోస్యం చెప్పాలనుకుంటే రెండు చిలుకలు పంపిస్తాం. ఇప్పటికైనా ఆయన చిల్లర పనులు ఆపాలి. ప్రచారాన్ని అడ్డుకుంటారా..? కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన దాన్ని ఎవరూ సమర్థించొద్దు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రకటించారు. రాహుల్‌గాంధీ విషయంలో మేం అలాగే ప్రకటిస్తే ఎలా ఉంటుంది. ఆ అంశంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మాది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆ అంశంతో సంబంధం లేదు. హైకోర్టు వ్యాఖ్యలు న్యాయస్థానం అభిప్రాయం. రాహుల్‌గాంధీకి ఏ విషయంపైనా అవగాహన లేదు. కుంజలాన్ ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అంటున్నారు. నేను కేసీఆర్ కొడుకుగానే రాజకీయాల్లోకి వచ్చినా.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి దాకా చేరుకున్నా. రాహుల్ పేరులో గాంధీ అనే తోక తీసేస్తే ఆయన ఏంటి? ప్రజలు, దేశం కోసం ఆయన ఏ ఉద్యమాలు చేశారు. ఎన్నికల్లో మహాకూటమి, రాహుల్ ఇచ్చిన హామీలు విచిత్రంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఓసారి ఉచి త సాయం అంటారు.. మళ్లీ రుణం అంటారు. రూ.2 లక్షల రుణమాఫీ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్‌లో ఎందుకు చేయట్లేదు. బీజేపీకి ఒక్క సీటు రాదు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీని మేం సమర్థించాం. నోట్ల రద్దుతో ప్రజలకు మేలు జరుగుతుందని భావించాం. అదేమీ జరగలేదు. రాజ్యసభ చైర్మన్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అభ్యర్థి కాబట్టే బీజేడీకి మద్దతిచ్చాం. తెలుగు వ్యక్తి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలిపాం. అంతేతప్ప బీజేపీతో మాకు ఎలాంటి సంబంధంలేదు. రాష్ట్రంలో బీజేపీ లేదు. మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. అందుకే ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని మా రాజకీయ వ్యూహం ఉంటోంది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు రాదు. డిసెంబర్ 11 తర్వాత ఏదైనా జరగొచ్చు. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఉంది. మా వ్యూహం మాకు ఉంది. దేశ రాజకీయాల్లో ఏన్నో మార్పులు వస్తాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక లోక్‌సభ ఎన్నికలకు 3 నెలల సమయం ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంటుందనేది చూడొచ్చు. కేసీఆర్ వెంటే పేదలు.. స్వీయ అస్థిత్వం కోసం ఏర్పడ్డ తెలంగాణ.. అభివృద్ధి దిశగా సాగుతోంది. సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. సాగునీరు, కరెంటు, సంక్షేమంలో అత్యుత్తమ విజయాలను నమోదు చేశాం. పేదలు కేసీఆర్ వెంటే ఉన్నారు. మహాకూటమి, ఇతర ప్రత్యర్థి పార్టీలకు ఇవి కన్పించట్లేదు. కేసీఆర్ శరీరంపై, భాషపై, శరీరభాషపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కేసీఆర్ ఏంటో ప్రజలకు తెలుసు. డిసెంబర్ 11న ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. చంద్రబాబు అవకాశవాది.. చంద్రబాబు ఒక్క వైఎస్సార్సీపీతో తప్ప అన్ని పార్టీలతో కలిశారు. అవసరం కోసం ఏ పార్టీతో అయినా కలుస్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విలన్‌గా చూపి బీజేపీతో జతకట్టారు. నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు బీజేపీని విలన్‌గా చూపిస్తూ కాంగ్రెస్‌తో కలిశారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నుంచి గెలిచిన రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య చంద్రబాబు కాంగ్రెస్‌లో చేరారు. ఏపీలో 24 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. చంద్రబాబు అవకాశవాది. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌ను కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఏపీని లోకేశ్‌కు వదిలి ఇక్కడికి వస్తారేమో. టీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. మొదటి వరుసలో ఉండే 10 మంది ఓడిపోతున్నారు. కొడంగల్‌లోనూ టీఆర్ఎస్ గెలుస్తుంది. -
ఒక్కకేసీఆర్... వందతుపాకులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల సమరంలో ప్రచార ఘట్టం ముగిసింది. హోరెత్తించిన మైకులన్నీ మూగబోయాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఫుల్స్టాప్ పడింది. రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం సాగింది. టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ ప్రచార బాధ్యతలు తనపైనే వేసుకుని రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. 87 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయనకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తోడ్పాటునందించారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో ఏర్పాటైన ప్రజాకూటమి, బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అతిరథులంతా తరలి వచ్చారు. 80 మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఎన్నడూ లేని స్థాయిలో నగదు ఏరులై పారింది. కూటమి తరఫున ఏపీ సీఎం చంద్రబాబు రంగప్రవేశం చేయడంతో అది తారాస్థాయికి చేరింది. బుధవారం సాయంత్రానికి రాష్ట్రంలో రూ.129.46 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటేనే ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ.10.87 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు. శుక్రవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రూ.వందల కోట్లు ఖర్చు చేయడానికి అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి నుంచే డబ్బు పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. జోరుగా కాంగ్రెస్ ప్రచారం... గెలిచి తీరాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించింది. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు పలువురు జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల గెలు పునకు తీవ్రంగా శ్రమించారు. రాహుల్ అక్టోబర్ 20న రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించారు. ఆరోజున బైంసా, కామారెడ్డి సభల్లో పాల్గొన్నారు. అనంతరం సోనియా, రాహుల్ ఇద్దరూ కలిసి 23న మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. 28న రాహుల్‌గాంధీ ఖమ్మంలో తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి రోడ్‌షోల్లో ప్రచారం చేశారు. 29న పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 3న రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. పరిగి, గద్వాల, తాండూరు సభల్లో మాట్లాడారు. ప్రచారానికి చివరిరోజైన బుధవారం కోదాడ బహిరంగ సభకు చంద్రబాబుతో కలిసి హాజరయ్యారు. మొత్తంమీద 6 సార్లు రాష్ట్రానికి వచ్చిన రాహుల్.. 26 నియోజకవర్గాలకు సంబంధించి 17 సభల్లో పాల్గొన్నారు. సోనియా, రాహుల్‌తోపాటు ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మొత్తం ప్రచారంలో పాలుపంచుకుంది. అహ్మద్ పటేల్, జైరాంరమేశ్, జైపాల్‌రెడ్డి, మల్లిఖార్జున ఖర్గే, ఆజాద్, చిదంబరం, కపిల్ సిబల్, వీరప్పమొయిలీ, డి.కె.శివకుమార్, ఆనంద్‌శర్మ, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఉమెన్ చాందీ, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు, అజహారుద్దీన్, ఖుష్బూ, నగ్మా, సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ తదితరులు ప్రచారం చేశారు. స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌లతోపాటు మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించారు. ఉత్తమ్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, డీకే అరుణ తదితరులు మినహా మిగిలిన రాష్ట్ర నేతలు తమ తమ నియోజకవర్గాలకే పరిమితయ్యారు. టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబు, నటుడు బాలకృష్ణ ప్రచారం చేయగా.. టీజేఎస్ పక్షాన కోదండరాం, సీపీఐ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం, జాతీయ కార్యదర్శి నారాయణ ప్రచారం నిర్వహించారు. కీలక భూమిక పోషించే లక్ష్యంతో బీజేపీ... కొత్త ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలన్న యోచనతో బీజేపీ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం లు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఫడ్నవిస్, రమణ్‌సింగ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోశ్ గంగ్వార్, జగత్ ప్రకాశ్ నడ్డా, పురుషోత్తం రూపాల, జువాల్ ఓరమ్, మాజీ మంత్రి పురంధేశ్వరి సహా మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు 180కి పైగా సభల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ గతనెల 27న నిజామాబాద్, మహబూబ్‌నగర్ సభల్లో.. ఈ నెల 3న హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక అమిత్‌షా 3 రోజులు పాటు ప్రచారం చేశారు. స్వామి పరిపూర్ణానంద 80కి పైగా సభల్లో పాల్గొన్నారు. ఇక బీఎల్ఎఫ్ తరఫున సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆ పార్టీ నేతలు బృందా కారత్, బి.వి.రాఘవులు తదితరులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఒకేఒక్కడు.. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రం మొత్తం సింగిల్‌గా చుట్టేశారు. గత ఎన్నికల్లో 110 సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈసారి ఏకంగా 116 అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరుతో సెప్టెంబర్ 7న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కేసీఆర్.. ఇదే జిల్లాలోని సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నవంబర్ 5న ముగించారు. తొలుత సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ప్రగతి నివేదిన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. తర్వాత నాలుగు రోజులకు సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసి, 7న ప్రచారం ప్రారంభించారు. అక్టోబరు 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్(వనపర్తి), నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థాయి సభలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అక్టోబర్ 19 నుంచి పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. అక్టోబర్ 24, నవంబర్ 1న రెండు రోజులు మినహా ప్రతిరోజు సగటున నాలుగు నుంచి తొమ్మిది సభల్లో పాల్గొన్నారు. చివరిరోజు గజ్వేల్‌లో ఒకే సభతో ప్రచారం పూర్తిచేశారు. కొంగరకలాన్ సభ మినహాయిస్తే.. మొత్తం 87 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. వైరా, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో మినహా 116 అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆయన కవర్ చేశారు. నల్లగొండ, వనపర్తిలో రెండుసార్లు ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొంటూనే ఎప్పటికప్పుడు వ్యూహాలను సిద్ధంచేశారు. వాటిని అమలుచేసే బాధ్యతను కేటీఆర్, హరీశ్‌లకు అప్పగించారు. సభల నిర్వ హణ ఏర్పాట్లపై ఆయా జిల్లాల ముఖ్యనేతల కు, అభ్యర్థులకు ప్రయాణంలోనే ఆదేశాలు ఇచ్చారు. -
ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి : రాహుల్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్దిని నిర్ణయిస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యువత ఆశల్ని నీరుగార్చిందని, ప్రజలు కేసీఆర్‌పై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల కలలు సాకారమవుతాయని అనుకున్నామని, కానీ కేసీఆర్ పాలన అందుకు విరుద్ధంగా సాగిందని ఆరోపించారు. రైతులకు అందుబాటులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుండగా బుధవారం సాయంత్రం ప్రజాకూటమి నేతలతో కలిసి మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కూటమికి పట్టం కట్టాలని కోరారు. దేశ రాజకీయాల్లో మలుపు.. దేశ రాజకీయాల్లో మార్పునకు ఇదే ఆరంభమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ధనికరాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్‌గా వెలుగొందాలన్నారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి : కోదండరాం తెలంగాణలో నియంత పోకడలను అనుసరిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ స్ధానంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపుఇచ్చారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అనుకున్న ఫలితాలు రాలేదని, ప్రజల మద్దతుతో కుటుంబ పాలనను గద్దెదించుతామన్నారు. కూటమిలో సామాజిక న్యాయం : గద్దర్ ప్రజాకూటమిలో సామాజిక న్యాయం ఉందని గద్దర్ అన్నారు. తెలంగాణలో నియంతృత్వ సర్కార్‌ను కూల్చి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని కోరారు. తెలంగాణలో అహంకారపూరిత ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. -
కూటమి వస్తే సీఎం రేవంత్ రెడ్డేనా?
సాక్షి, హైదరాబాద్ : సీఎం కుర్చీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. ‘ఈరోజు సీఎం కుర్చీలో కేసీఆర్ ఉన్నారు. రేపు అదే కుర్చీలో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు’ అంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ సీనియర్ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు? రేవంత్ రెడ్డెనా? ఎన్నికల కీలక దశలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే చర్చకు దారితీశాయి. ఆయన వ్యూహత్మకంగా అన్నారా లేక, ఆయాచితంగా అన్నారా? అనే ప్రశ్న సీనియర్ నేతలను వెంటాడుతోంది. కాగా సీఎం రేసులో ఇదివరకే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు కూడా పోటీపడుతున్న విషయం తెలిసిందే. పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సపోర్టుతో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రేవంత్.. ఆయన పరిచయాలతోనే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన పలువురు నేతలకు టికెట్లు దక్కించుకోగలిగారు. కొడంగల్‌లోని రేవంత్ నివాసంలో ఆయనను పరామర్శించిడానికి వెళ్లిన ఆజాద్ సీఎం పీఠంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఇంట గెలవలేకే.. బాబు రచ్చరచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఇంట గెలిచి రచ్చ గెలవాల న్నది ఓ నానుడి. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇలాంటివి వర్తించవు. సొంత రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న ఆయన.. పొరుగు రాష్ట్రంలో మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా ఎవరితోనైనా జతకట్టడం.. అవసరం తీరాక వారికి చేయివ్వడంలో ఆయన్ను మించినవారు లేరంటే అతిశయోక్తి లేదు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో అవినీతి, అక్రమాలు ఎక్కువ కావడంతో అక్కడ అన్ని వర్గాల్లోనూ చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుని ఉంది. ఈ సంగతిని ముందుగానే పసిగట్టిన ఆయన తన వైఫల్యాలను, తప్పిదాలను తెలివిగా ఎన్డీఏపై నెట్టేసి బయటకు వచ్చేశారు. (నేరుగా రాలేను.. ‘కూటమి’తో వచ్చా) గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన చంద్రబాబు.. నాలుగేళ్ల తర్వాత వారికి చెయ్యిచ్చి, ప్రస్తుతం కాంగ్రెస్ చేయి అందుకున్నారు. ఏ కూటమిలో ఉన్నా తన సొంత ప్రయోజనాల కోసమే పనిచేసే టీడీపీ అధినేత.. ఇప్పుడు అదే కోవలో తెలంగాణ ఎన్నికలను తన సొంత ఎజెండా కోసం ఉపయోగించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారన్న దానిపై బయట కు ఏం చెబుతున్నా.. తన సన్నిహితుల వద్ద సీఎంను నిర్ణయించేది తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. డబ్బులిస్తున్నామన్న ధీమాయే కారణమా? టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్‌కు ముందే తన అసలు రూపాన్ని బయటపెట్టారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావిస్తుండగా, కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్నది తన అభీష్టం మేరకు జరుగుతుందని బాబు ప్రచారం చేసుకుంటుండడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కష్టపడి పార్టీని గెలిపిస్తే సీఎంగా అవకాశం దక్కుతుందని ఆశిస్తున్న టీపీసీసీ ముఖ్య నేతలు ఈ వ్యాఖ్యలతో కలవరపడుతున్నారు. కూటమి అభ్యర్థుల కోసం భారీగా డబ్బులిస్తున్నామన్న ధీమాతో తాను చెప్పినట్టే జరుగుతుందన్న భావన మేరకే చంద్రబాబు ఆ ప్రచారం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ ముఖ్య నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. 13 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ నాయకుడు సీఎంగా నిర్ణయించాల్సిన పరిస్థితులు వస్తే అది నిజంగా మా స్వయంకృతాపరాధమే అవుతుంది. చంద్రబాబుతో డేంజర్ అని తెలిసినా అధిష్టానం ఆదేశాల మేరకు కలిసి వెళుతున్నాం. ఏం జరుగుతుందో.. ఈ బాబు ఏం చేస్తాడో అనే అనుమానం మాకు లేకపోలేదు. మా జాగ్రత్తలో మేముంటున్నాం. అయినా బాబు ఏదైనా చేయగలడు’అని వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో ఉన్నప్పుడూ తప్పుడు ప్రచారమే... రాజకీయాల్లో అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు పెట్టింది పేరుగా గుర్తింపు పొందిన చంద్రబాబు గత ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలిసి పనిచేశారు. ఏడాది క్రితం వరకు బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తన అవసరాలను తీర్చుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలను çపణంగా పెట్టిన బాబు.. ఎన్డీఏలో ఉన్నప్పుడే బీజేపీపై అబద్ధపు ప్రచారానికి తెరతీశారు. ఈ అబద్ధాలకు తెరలేపుతూనే కాంగ్రెస్‌తో స్నేహానికి బాటలు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం విషయంలో బీజేపీని నాలుగేళ్లపాటు వెనుకేసుకొచ్చిన బాబు అక్కడి ప్రజల ఆగ్రహావేశాలను గమనించి ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించారు. హోదా ఏమైనా సంజీవనా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. హోదా ఇవ్వకుండా బీజేపీ తమను మోసం చేసిందని బిల్డప్ ఇచ్చి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎన్డీయేకు గుడ్‌బై చెప్పడానికి ముందే కాంగ్రెస్‌తో బేరం కుదుర్చుకున్న బాబు.. ఎన్నికల ఖర్చును భరిస్తానని చెప్పి ఆ పార్టీతో కలిసిపోయారనే చర్చ హస్తిన వర్గాల్లో అప్పట్లోనే జరిగింది. వాస్తవానికి, ఈ ఏడాది జనవరిలోనే కాంగ్రెస్, టీడీపీల స్నేహబంధం కుదిరిందని సమాచారం. ఇందుకు సంబంధించి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎన్డీయేలో భాగంగా ఉన్నప్పుడే ‘సాక్షి’బయటపెట్టింది. ఆ రెండింటి కోసమే... దేశం కోసమే కాంగ్రెస్‌తో కలిశామని చెప్పుకుంటున్న చంద్రబాబు.. నిజంగా దేశం కోసం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమేమీ ఈ నిర్ణయం తీసుకోలేదని జాతీయ, రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో ఉండి ఇంకా బీజేపీకి మద్దతిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురై శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుందనే అంచనా మేరకే ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చినా.. కాంగ్రెస్‌తో కలిసేందుకు మాత్రం రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో పాలన అవినీతిలో కూరుకుపోయింది. జాతీయ స్థాయిలో ఏదో ఒక ప్రధాన పార్టీ మద్దతు లేకపోతే బాబు వ్యవహారాలపై విచారణ ఖాయం. అందుకే బీజేపీ వ్యతిరేక గూటికి చేరారు. ఇప్పుడు విచారణ జరిపినా తాను ఎన్డీఏను వీడి కాంగ్రెస్‌తో చేతులు కలిపినందుకే వేధిస్తున్నారని ప్రజలకు చెప్పుకోవాలనేది ఆయన ఆలోచన. ఏది జరిగినా తనకు అనుకూలంగా మార్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య’అని ఓ రాజకీయ విశ్లేషకుడు వివరించారు. ఇది కాకుండా కాంగ్రెస్‌తో తెలంగాణలో కలిసి కూటమికి బాటలు వేసుకునేందుకు మరో ప్రధాన కారణం కూడా కనిపిస్తోంది. అదే ఓటుకు కోట్లు కేసు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఈ కేసుపై టీఆర్ఎస్ ఎక్కడ విచారణ జరుపుతుందోననే భయంతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీఆర్ఎస్ ఓటమికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఓడిపోతే కాంగ్రెస్‌ను మేనేజ్ చేసుకుని ఓటుకు కోట్లు కేసు నుంచి ఎలాగైనా బయటపడొచ్చనే ఆలోచన, వ్యూహం ఇందులో దాగి ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు కారణాలతోనే ఆయన బీజేపీని వదిలి కాంగ్రెస్ పంచన చేరారని, రేపు మళ్లీ ఇదే కాంగ్రెస్‌ను విమర్శించి.. లేదంటే నట్టేట ముంచి బీజేపీతోనో, ఇంకో పార్టీతోనే జతకట్టేందుకు బాబుకు రెండు సెకన్ల సమయం కూడా పట్టదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. టీఆర్ఎస్ ఓటమే «ధ్యేయంగా బాబు తెలంగాణ ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని టీఆర్ఎస్ వర్గాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. -
తారస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారం
-
నేరుగా రాలేను.. ‘కూటమి’తో వచ్చా
సాక్షి నెట్వర్క్: ‘‘హైదరాబాద్ నా మానస పుత్రిక. ఇక్కడి అభివృద్ధిలో అడుగడుగునా నా కృషి ఉంది. ఈ నగరం ముందుకు పోతే చూసి ఆనందిద్దామనుకున్నా. కానీ ప్రగతి కుంటుపడింది. నేను చేసిన అభివృద్ధి ఫలాలు తెలుగుజాతికి అందకుండా పోవడం తో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టా. నేను డైరెక్టుగా ఇక్కడికి వచ్చి పాలన చేయలేను.. కాబట్టి ప్రజా కూటమి ద్వారా అభివృద్ధి ఫలితాలను మీకందించాలని వచ్చా’’అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం, కేసీఆర్ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కేసీఆర్ అంటే.. ఖావో కమీషన్ రావు అని, టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ ఆరెస్సెస్ అని ఎద్దేవా చేశారు. సోమవారం ముషీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాకూటమి అభ్యర్థులతో కలసి రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు, జూబ్లీహిల్స్, కూకట్పల్లి రోడ్‌షోల్లో రాహుల్‌తో కలసి పాల్గొన్నారు. అంతా నేనే... ముషీరాబాద్, ఖైరతాబాద్ రోడ్‌షోల్లో చంద్రబాబు ప్రసంగించారు. మోదీ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేస్తూ ప్రజాప్రతినిధులపై, పత్రికలపై దాడు లు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ని ప్రపంచ పటం లో పెట్టింది టీడీపీయేనని, నగరంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, ఎయిర్ పోర్టు వంటి అనేక ప్రాజెక్టులను ప్రారంభించానన్నారు. ముషీరాబాద్‌లో ఎన్టీఆర్ స్టేడియం, అధునాతన గాంధీ ఆసుపత్రిని నిర్మించానన్నారు. హైదరాబాద్‌తోనే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిందన్నారు. తాను చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లిందని, కానీ ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్పితే అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. 37 ఏళ్లపాటు తాను కాంగ్రెస్‌తో పోరాడనని ప్రజాస్వామ్య వ్యవస్థ ను కాపాడటం కోసం అదే పార్టీతో కలసి పనిచేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌తో కలిసింది తన స్వార్థం కోసం కాదని, జాతి ప్రయోజనాల కోసమన్నారు. మాయమాటలు చెప్పి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, పెత్తనం చేయడానికి ఇక్కడికి రాలేదని తెలిపా రు. తాను ఇక్కడ సీఎంగా ఉండటానికి అవకాశం లేదని తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ కూటమి మేనిఫెస్టోను కాపీ కొట్టిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం రహస్య స్నేహం రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐ ఎం రహస్య స్నేహం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ అవివేకంగా చేసిన నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, రైతులు, పేదలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. సీబీఐ సహా అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్ కంట్రోల్‌గా మారిపోయరన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి, సంక్షేమానికి, అవినీతి రహిత పాలన కోసం మహా కూటమికి పట్టం కట్టాలని కోరారు. కేసీఆర్... జూనియర్ మోదీ.. టీఆర్ఎస్, బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని బాబు అన్నారు. కేసీఆర్‌ను జూనియర్ మోదీగా అభివర్ణించారు. కేంద్రంలో, రాష్ట్రంలో దారితప్పిన పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం తనకు ఉందన్నారు. ప్రత్యామ్నా య రాజకీయ వ్యవస్థ రావాలని అందుకే ప్రజా కూటమి ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజాకూటమి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ట్యాంక్‌బండ్‌పై బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుకు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాను ఆలోచిస్తుంటే కేసీఆర్ మాత్రం తెలుగువారి మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శిం చారు. తనకు ఇక్కడేం పని అని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని. తాను లేకుంటే కేసీఆర్ ఎక్కడని ప్రశ్నిం చారు. రాజకీయాల్లో కేసీఆర్‌ను పెంచి పోషిం చింది తానేనన్నారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుంటే పనులు కావని జనంలోకి వస్తేనే పనులవుతాయన్నారు. హైదరాబాద్‌లో అన్ని సీట్లు ప్రజాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నేతలు తనను ఎన్ని తిట్లుతిడితే ప్రజల నుంచి తనకు అంతగా ఆదరణ లభిస్తుందన్నారు. -
టీఆర్ఎస్కే మా మద్దతు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని రాయలసీమ వాసులు డిసెంబర్ 7న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే తమ ఓటేసి గెలిపించుకోవాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (గ్రాట్) ఆధ్వర్యంలో ‘ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. తెలంగాణలో స్థిరపడిన రాయలసీమ వాసుల నేటి కర్తవ్యం’పేరుతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన హైదరాబాద్‌లో నివసిస్తున్న రాయలసీమ ప్రజల అవసరాలు, అభీష్టాలకు పెద్దపీట వేసేలా సాగిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ వాసుల పట్ల ఎలాంటి వివక్షా చూపలేదన్నారు. టీఎస్ఎస్ సింగిల్ పార్టీ అని, నిర్ణయాలు కూడా కేసీఆర్ వెంటనే తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. టీఆర్ఎస్కు ఒక ఎజెండా ఉంటుందని తెలిపారు. అదే మహాకూటమిలో ఎవరు సీఎం అవుతారో తెలియదన్నారు. కాంగ్రెస్‌ది అంతా సీల్డ్ కవర్ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వారు ఓటుకు కోట్లు కేసులో దొరికిన వారిని సీఎంగా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్కే తమ మద్దతు అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిపై దృష్టిసారించారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అధికార వికేంద్రీకరణ అంటూ ప్రకటించి ఆచరణలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని విమర్శించారు. చివరికి హైకోర్టు కూడా అమరావతికి తరలిస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇవ్వాలని జీవోలో ఎక్కడా లేదన్నారు. ప్రాజెక్టులను దివంగత సీఎం వైఎస్సార్ పరుగులు పెట్టించారన్నారు. వైఎస్ఆర్ మరణంతో ఆగిన గుండెలను పరామర్శించేందుకు వెళ్తానన్న వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. గాలేరు – నగరి ప్రాజెక్టులను చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు కుట్రలో భాగమే మహాకూటమి అని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన టీడీపీకి ఓటు అనే ఆయుధంతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మహాకూటమి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. మన తీర్పు చంద్రబాబుకు ఒక హెచ్చరికగా ఉండాలని చెప్పారు. గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ.హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్షనేతకే రక్షణ కల్పించలేని చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటున్న రాయలసీమ వాసులకు అండగా ఉంటానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఏదిఏమైనా అందరం ఏకమై మహాకూటమి అభ్యర్థులను ఓడిద్దామన్నారు. కార్యక్రమంలో గ్రాట్ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు శ్యామలారెడ్డి, గ్రాట్ అధ్యక్షుడు ఎం ఓబుళరెడ్డి, సభ్యులు బి రాఘవేంద్రరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోదండరాం.. సిగ్గు లేదా?
లింగాలఘణపురం: ‘తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ద్రోహుల పార్టీ అని.. నేడు అదే పార్టీతో దోస్తీ ఎలా చేస్తున్నావ్..! కోదండరాం నీకు సిగ్గు లేదా? అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యతో కలసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీడీపీకి వేసినట్లేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అమరావతిలో ఉన్న చంద్రబాబును హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. టీడీపీతో మహా కూటమిని ఏర్పాటు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. ఒకవేళ పొరపాటున మహాకూటమి గెలిస్తే చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకుంటారని అన్నారు. -
‘కూటమి వెనుక కుట్రలు, కుతంత్రాలు’
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి వెనుక అత్యంత దురదృష్టకరమైన సమీకరణలు చోటుచేసుకుంటున్నాయని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో కేవలం ఎన్నికలు మాత్రమే జరగడం లేదని అంతకుమించి కుట్రలు, కుతంత్రాలు నడుస్తున్నాయని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనే అంశంపై ఎన్నికలు జరగాలికానీ.. తెలంగాణలో అలా జరగడంలేదన్నారు. స్వరాష్ట్రాం కోసం పోరాటం చేసిన వారు ఓవైపు, తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డవారు, వ్యతిరేకంగా మాట్లాడినవారు మరోవైపు పోటీలో ఉన్నారన్నారు. ఎవరిచేతిలో రాష్ట్రం పదిలంగా ఉంటదో ప్రజలంతా ఆలోచన చేయాలని హరీష్ కోరారు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండకపోతే మన మనుగడకే ముప్పువాటిల్లే అవకాశం ఉందని, అసలుకే మోసం వస్తుందని అనువానం వ్యక్తం చేశారు. మహాకూటమి ఏర్పాటు బయటకు కనిపించినట్లు కేవలం అధికారం హస్తగతం చేసుకోవడానికి కాదని, దాని లక్ష్యం వేరేలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉనికిని కబలించే కూటమని మండిపడ్డారు. తానే కేవలం రాజకీయాల కోసం మాట్లాడటంలేదని, గత అనుభవాలు, పక్కా ఆధారాలతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరు పోటీచేయాలి? ఎవరి మధ్య పోటీ ఉండాలి? ఎవరు ప్రచారం చేయ్యాలి? అని ప్రశ్నించారు. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటో ప్రజలంతా గమనించాలని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ పుట్టిన బిడ్డలే పోటీచేయాలని హరీష్ పేర్కొన్నారు. -
‘చేతి’ చాటు చంద్రుడు చేటేనా?
తెలంగాణ శాసనసభ ఎన్నికల పర్వం పతాక స్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్ ఒక వైపు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలతో కూడిన ప్రజాఫ్రంట్ మరో వైపు హోరా హోరీ యుద్ధం మాదిరి ప్రచారం సాగిస్తున్నాయి. ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కన్నా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి భారీ ఎత్తున ఖర్చు చేయగలుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలవడం వల్ల ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకుండా పోయిందో మరేమో తెలియదు కాని..ఏ పత్రిక చూసినా, ఏ టీవీ చూసినా అత్యధికంగా కాంగ్రెస్ ప్రచారమే హోరెత్తుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కాంగ్రెస్ వెనుకాడడం లేదు. ఆ స్థాయిలో టీఆర్ఎస్ ఇంతవరకు ప్రచార ప్రకటనలు ఇచ్చినట్లు కనిపించలేదు. బహుశా చివరి మూడు రోజులు ఏమైనా ఇస్తుందేమో తెలియదు. కాంగ్రెస్‌కు అయినా, టీఆర్ఎస్ కు అయినా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలే. బీజేపీ కూడా ప్రచారంలో దూకి రకరకాల టీవీ యాడ్స్, పత్రికా ప్రకటనలు ఇవ్వడం ఆరంభించింది. ఆకాశమే హద్దుగా కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ప్రచారం విషయంలో కాంగ్రెస్ దూకుడు ముందు ఆగడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్ గత ఐదేళ్లుగా తెలంగాణలోను, ఆంధ్రలోను అధికారంలో లేదు. కాంగ్రెస్‌కు లాభమా..నష్టమా! తెలంగాణ ఇచ్చినా ఇక్కడ అధికారం రాకపోవడంతో ఆ సెంటిమెంటును ప్రయోగించి ఏమైనా లాభం పొందే అవకాశం ఉందా అన్నదానిపై కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. దానికి టీడీపీని కలుపుకోవడం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు నష్టమా? లాభమా అన్నది ఆ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతోంది. మొదట ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను వాడుకున్న కాంగ్రెస్ , తన సొంత ముఖ్యమంత్రులను మాత్రం పట్టించుకోలేదు. అలాగే కాంగ్రెస్ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కూడా అవసరం లేదని భావించిందో ఏమో తెలియదు కాని చంద్రబాబుకే ప్రాధాన్యం ఇచ్చారు. రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగాలలో వారి ప్రస్తావన తేలేదు. ఇక చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలలో ఎక్కడా కాంగ్రెస్ పదేళ్ల పాలన గురించి చెప్పడం లేదు. పదిహేనేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ అభివృద్ధి అంతా తనదే అంటూ తన ఖాతాలో క్రెడిట్ వేసుకుంటుంటే, కాంగ్రెస్ నేతలు తెల్లబోవడం తప్ప ఏమీ మాట్లాడడం లేదు. ఒకరకంగా చేష్టలుడిగినట్లుగా వారి పరిస్థితి మారింది. కేసీఆర్ ఆత్మగౌరవ సమస్యను ప్రస్తావిస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు తప్ప జవాబు ఇవ్వలేకపోతున్నారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నారని చెబుతున్న చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇల్లు పడగొట్టి పెద్ద ప్యాలెస్‌ను నిర్మించుకున్నారు కాని విజయవాడ అనండి..అమరావతి అనండి ఆ ప్రాంతంలో ఎక్కడా సొంత ఇల్లు కట్టుకోలేదు. ఇక చంద్రబాబు ప్రభావం లాభం చేస్తుందా? నష్టం చేస్తుందా అన్నదానిపై కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు ఇది ఆత్మగౌరవ సమస్యగా మారకుండా ఉండాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ కాని, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమ ప్రసంగాలలో ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజంగానే ఆత్మగౌరవ సమస్యను ప్రజలందరు తీసుకుంటారా అంటే చెప్పలేం. కొంత మేర ఉండవచ్చు. జిల్లా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై కొంత చర్చ జరుగుతోంది. పథకాలపై టీఆర్ఎస్ ఆశలు... స్థూలంగా చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్న మాట నిజం. అది వోకల్ సెక్షన్లో ఎక్కువగా కనిపిస్తుంది. కింది స్థాయి వర్గాలలో అది అంతగాఉన్నట్లు అనిపించదు. దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా వర్గాల వారికి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అని చెప్పాలి. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు భీమా, గొర్రెలు, చేపపిల్లల పంపణీ తదితర స్కీములపై టీఆర్ఎస్ ఎక్కువ ఆశ పెట్టుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ స్కీముల గురించి ఎక్కువగా చెప్పకుండా కేసీఆర్ దొరల పాలన అని, నియంతృత్వం అని, సెక్రటేరియట్‌కు వెళ్లడం లేదని, ఇలాంటి విమర్శలను ఎక్కువగా చేస్తోంది. అదే సమయంలో రెండు లక్షల రూపాయల రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. కేసీఆర్ చేపట్టిన వివిధ స్కీములను పెద్దగా విమర్శించకుండా, తాము మరింతగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వపరంగా పెద్దగా విఫలం అయినట్లు కనిపించదు. కాకపోతే యాటిట్యూడ్ లో కొంత అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. టీడీపీ లేకుండా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ కు మరింంత పోటీ ఎదురై ఉండేది. కాని చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ వారు కేసీఆర్‌కు ఒక ఆయుధం ఇచ్చినట్లు అయింది. తేడా వస్తే... ఎంఐఎం అండ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతానికి అయితే చంద్రబాబో, ఎవరో ఒకరు తమకు గెలిచే విధంగా ఆర్థిక వనరులు సాయం చేస్తే చాలన్నట్లుగా సర్దుకుంటున్నారు. కొన్ని చోట్ల తిరుగుబాట్లు కాంగ్రెస్‌కు నష్టం చేయవచ్చు. అందువల్లే లగడపాటి రాజగోపాల్ పది మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే కొందరు టీఆర్ఎస్కు ఇబ్బంది అని ప్రచారం చేస్తున్నా, కాంగ్రెస్ కు ఇబ్బందే ఎదురు అవుతుందనిపిస్తుంది..ఎందుకంటే టీఆర్ఎస్కు ఒకవేళ 50 సీట్లు వచ్చినా, ఎంఐఎం అండ ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్లను ఆకట్టుకున్నా సరిపోతుంది. టీఆర్ఎస్ మాత్రం తమకు పూర్తి మెజార్టీ వస్తుందన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ తన విజయానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. బీజేపీ కూడా ఐదు నుంచి పది సీట్లపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కూటమికి పూర్తి మెజార్టీ వస్తేనే అధికారంలోకి రాగలుగుతుంది. కాని టీఆర్ఎస్కు 50 సీట్లు వచ్చినా అధికారం పొందే అవకాశం ఉండవచ్చు. ఇక డబ్బు ప్రభావం రెండు వైపులా ఉంటుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, దానికి తోడు చంద్రబాబు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టడం వల్ల ఎదురవుతున్న ఆత్మగౌరవ సమస్య పనిచేస్తే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అవుతుంది. ఆయన ప్రభుత్వ విధానాలు కాకుండా, కేసీఆర్ వైఖరి , సెక్రటేరియట్‌కు వెళ్లకపోవడం వంటి విమర్శలు అధికంగా పనిచేస్తే కాంగ్రెస్ కూటమికి ప్రయోజనం జరగవచ్చు. ఇప్పటికైతే కేసీఆర్‌ది పై చేయిగానే కనిపిస్తోంది. అలా అని చెప్పి ప్రజా కూటమి పూర్తిగా వెనుకబడిందని చెప్పలేం. - కొమ్మినేని శ్రీనివాసరావు -
తెలంగాణలో ప్రలోభాలకు తెరతీసిన టీడీపీ
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనుండగా టీడీపీ ధన ప్రలోభాలకు తెరతీసింది. ఖమ్మం మహాకూటమి అభ్యర్థి తరఫున ఓటుకు నోటు స్కీంతో టీడీపీ శ్రేణులు రంగంలో దిగాయి. వారు ఇందుకోసం సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా జనాలకు ఓటరు స్లిప్‌తో పాటు 10 రూపాయల నోటు జతచేసి అందజేస్తున్నారు. ఆ నోట్ తిరిగి ఇస్తే రెండువేల రూపాయలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఓటర్ స్లిప్‌తో పాటు అందజేసే 10 రూపాయల నోట్‌పై ప్రత్యేక నంబర్ సిరీస్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రలోభాలకు పాల్పడుతున్న మహాకూటమి శ్రేణులను టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై సాక్ష్యాధారాలతో టీఆర్ఎస్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మహాకూటమి అభ్యర్థుల ప్రలోభాలను అడ్డుకుని తీరుతామని తెలిపారు. ప్రజా బలంతో గెలవడానికి ప్రయత్నించాలని మహాకూటమి అభ్యర్థులకు సూచించారు. నంద్యాలలో మాదిరి ఇక్కడ రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. -
అయ్యా.. చంద్రబాబు నీకో నమస్కారం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ‘అయ్యా చంద్రబాబు నాయుడు నీకో నమస్కారం! తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అనవసరంగా మీరు.. మీ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నారు’ అని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఇంకా ఎమన్నారంటే.. ‘ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదు.. ప్రజలు గెలవాలి. అలా అయితేనే ప్రజల అజెండా అమలై వారికి మేలు జరుగుతోంది. గత పాలకులు నగరాన్ని నాశనం చేశారు. వర్షం నీళ్లను తీసుకుపోయే కాలువలను కూడా ధ్వంసం చేశారు. కనీసం టాయిలెట్లు నిర్మించలేదు. చాలా అధ్వానమైన పరిస్థితి ఉండేది. అధికారంలోకి రాగానే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోని పని మొదలుపెట్టాం. పేదల అభ్యున్నతికి కృషి చేశాం. గుడిసేలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చాం. రూపాయికి నీటి కనెక్షన్ ఇచ్చాం. కరెంట్ బకాయిలను మాఫీ చేశాం. ఎల్ఈడీ వెలుగుల కింద నగరం ఇప్పుడు మెరుస్తుంది. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. నాలుగున్నరేళ్లలో ఒక్క మతకల్లోలం లేదు. కర్ఫ్యూలు లేవు. గుడుంబా అమ్మకాలు.. గుండాలు.. పేకాట క్లబ్బులు లేవు. 12 మున్సిపాలిటీల్లో నీటికి చాలా కటకట ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భవిష్యత్తులో 500 పైచిలుకు బస్తీ దవాఖానాలు పెట్టే యోచనలో ఉన్నాం. నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ విశ్వనగరం. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. సర్వమతాలకు నిలయం. ప్రతి రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో అనేక అపోహలు సృష్టించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు అనవసరంగా స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారికి జీహెచ్ఎంసీలో టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కడికెళ్లినా గర్వంగా హైదరాబాదీలమని చెప్పండి. మేం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డాం. చంద్రబాబుకు చిల్లర రాజకీయాలెందుకు. ప్రేమ ఉంటే చిచ్చు పెడ్తరా? రేపు మాపో డూప్లికేట్ సర్వే వెల్లడిస్తారు. ఇదంతా ఓ మీడియా సంస్థ, కాంగ్రెసోళ్లు కలిసి కుట్ర చేస్తున్నారు. 100 సభలనంతరం తిరుగొచ్చిన నేను కచ్చితంగా 100 సీట్లపై గెలుస్తామని చెబుతున్నా. జీహెచ్ఎంసీ తీర్పే రిపీట్ కాబోతుంది. ఈ ఎన్నికలనంతరం ఫెడరల్ ఫ్రంట్‌కు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మతసామరస్యంతో అభివృద్దిలో దూసుకుపోతున్న తెలంగాణకు బాసటగా నిలుస్తూ.. తమ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలి’ అని కేసీఆర్ ప్రజలను కోరారు. -
కాంగ్రెస్‌ను ఓడించండి : చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : గత 35 ఏళ్లుగా చెప్పిచెప్పి అలవాటైన మాట.. ‘కాంగ్రెస్‌ను ఓడించండి.. తరమికొట్టండి’ అని.. కొన్ని వేల సభలో చెప్పి ఉంటారు. ఇప్పుడు ఉన్న పలానా ఆ మాట మార్చాలంటే.. ఆ నాలుక సహకరించాలి కదా!.. ఎంత జాగ్రత్తపడినా ఫ్లోలో అలా అనుకోకుండా వచ్చేస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం ఎంత దూరమైన వెళ్లడానికి సిద్దపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పైగా ఎన్నికల్లో ఏనాడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జతకట్టి.. కాంగ్రెస్ పార్టీని తిట్టని తిట్టు తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. వారి పక్కనే నిల్చొని టీఆర్ఎస్, బీజేపీలను పొట్టు పొట్టు తిడుతున్నారు. అనూహ్యంగా నందమూరి కుటుంబాన్ని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు.. కూకట్పల్లి టికెట్‌ను దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కేటాయించారు. ఆమెను గెలిపించడానికి.. బావా, బామ్మర్ధులు (చంద్రబాబు.. బాలయ్య) తెగ కష్టపడుతున్నారు. నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటూ.. సుహాసిని గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే శనివారం కూకట్‌పల్లిలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు.. కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు, మహాకూటమి నేతలంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే నాలుక కర్చుకున్న చంద్రబాబు బీజేపీ అని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదివారం చేవేళ్ల ప్రజాశీర్వాద సభలో చంద్రబాబును ఎద్దేవా చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించడం విశేషం. -
మహాకూటమి కాదు.. పెద్ద దొంగల కూటమి
సాక్షి, విజయనగరం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతిపరులంతా కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మహాకూటమి కాదు అది పెద్ద దొంగల కూటమి అని అభివర్ణించారు. పార్వతీపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నరేంద్ర మోదీ పాలననే స్వాగతిస్తున్నారని చెప్పారు. నారా లోకేష్, చంద్రబాబుల అవినీతి బయట పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వారి అవినీతిని నిరూపించలేకపోతే జైలుకి వెళ్ళడానికి సిద్ధమని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు అంత నీతిమంతులైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తే ఆయన స్వయంగా సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడ్డారని గుర్తుచేశారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తు చేయించుకొని.. నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో సోనియాగాంధీపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆమెతో చేతులు కలిపి.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. -
మహా కూటమి.. ఇంత మోసమా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం ఉంటే డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, మిగతా వర్గాల పేదలకు రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. సరిగ్గా పోలింగ్‌కు ముందు ఇప్పుడు మాట మార్చిందన్నారు. మొన్నటి వరకు డబ్బులిస్తామని చెప్పి.. ఇప్పుడు అది రుణమని ప్రకటనలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ఆదివారం దినపత్రికల్లో వచ్చిన మహాకూటమి వాణిజ్య ప్రకటనల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ.. కూటమి మోసాన్ని ట్విటర్ వేదికగా ఎండగట్టారు. లగడపాటి సర్వే ఓ జోక్.. తెలంగాణ ఎన్నికల్లో తన సర్వే ప్రకారం 10 మంది స్వతంత్ర్య అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ అదో పెద్ద జోక్ అని, అవన్నీ నకిలీ సర్వేలని, వాటిని విశ్వసించవద్దని సూచించారు. ఆదివారం నెటిజన్లతో ట్విటర్ వేదికగా చిట్‌చాట్ చేసిన కేటీఆర్.. వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. శంకర్ 2.0, రాజమౌళి బాహుబలి చిత్రాల గ్రాఫిక్స్‌లకన్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సూపర్ అని ఓ నెటిజన్ ప్రస్తావించగా.. దీనికి కేటీఆర్ సైతం అంగీకరించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబు విద్యుత్త్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని, ఇక్కడ 24 గంటల కరెంట్ ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు అంశాన్ని టీఆర్ఎస్ సరిగ్గా ప్రచారానికి వాడుకోవడం లేదని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సమాధానమిచ్చారు. మరో నెటిజన్ కేసీఆర్ మిమ్మల్ని ఏమని పిలుస్తారని ప్రశ్నించగా.. రాము అని పిలుస్తారని, అది తన నిక్‌నేమ్ అని సమాధానమిచ్చారు. చంద్రబాబు మొబైల్ కనిపెట్టానని చెప్పారని, దీనిపై అభిప్రాయం ఏమనగా.. ఆయన చందమామను కూడా కనిపెట్టారని సెటైర్ వేశారు. వీళ్లు చేసే వాగ్ధానాలు ఎంత మోసపూరితమో, ఇదే మంచి ఉదాహరణ. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మొదలుచెప్పి, ఇప్పుడు రుణం ఇస్తామని మాటమార్చిన కాంగ్రెస్. pic.twitter.com/vNSWPUqRae — KTR (@KTRTRS) December 2, 2018 Be careful Babu Garu. Telangana is ‘powerful’ https://t.co/8AU9x5d1Ds — KTR (@KTRTRS) December 2, 2018 -
చంద్రబాబు ఇంట్లో కూటమి నేతల కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లో మహాకూటమి నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. మరో మూడు రోజుల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో చంద్రబాబు నివాసం వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టివిక్రమార్క, కర్టాటక మంత్రి డీకే శివకుమార్, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌లు హాజరయ్యారు. ప్రచార అనంతరం ఉన్న రెండు రోజుల్లో అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పోల్‌మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండగా.. కూటమిలో భాగస్వామి అయిన టీజేఎస్ కీలక నేత రచనా రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేయడంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇక కర్ణాటక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహాకూటమి ఒప్పందం ప్రకారం చంద్రబాబు ఇస్తానన్న.. డబ్బులపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తమతో జతకట్టినందుకు చంద్రబాబు రూ. 500 కోట్లు ఇస్తానని ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. -
కూటమిపై ప్రజలకు విశ్వాసం లేదు..
సాక్షి, హైదరాబాద్ : అవకాశవాద పార్టీలతో ఏర్పడిన ప్రజాకూటమిపై ప్రజలకు విశ్వాసం లేదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసమే కూటమిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టాడని విమర్శించారు. ఉప్పల్ రింగ్‌రోడ్డులో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో కలిసి ఆదివారం రోడ్డుషోలో పాల్గొన్న గడ్కరీ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలని ధ్వజమెత్తారు.నిన్నటి వరకూ తమతో ఉన్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రత్యేక ప్రణాళికలతో బీజేపీ ముందుకొస్తుందని హామీ ఇచ్చారు. ఛాయ్‌వాలా ప్రధాని అయ్యాడంటే అది బీజేపీ గొప్పతనమని చెప్పుకొచ్చారు. -
ఫైనల్ టచ్..! అతిరథులు సుడిగాలి పర్యటనలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్నికల ప్రచారం ముగిసే సమయం సమీపిస్తుండ డంతో అన్ని పార్టీల అతిరథ నేతలందరూ మరోసారి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 5తో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అగ్రనేతల షె డ్యూళ్లు ఖరారయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ముఖ్యనేతలపైనే ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వారు మిగిలిన నియోజకవర్గాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను అ త్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అ తిథుల రాకకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా ఇప్పటికే రెండుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. నాగర్‌కర్నూల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. అలాగే డిసెంబర్ 4న ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల ప్రచారసభలు నిర్వహించనున్నారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం మరోసారి ఉమ్మ డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే కొడం గల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన సభలో పాల్గొనగా... ఈసారి గద్వాలలో నిర్వహిం చే సభలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. ఆశలన్నీ కేసీఆర్‌పైనే.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి ఎట్టి పరిస్థితిలో అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుపొందాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బరిలో నిలిచిన నేతలందరూ ఆశలన్నీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీదే పెట్టుకున్నారు. దీంతో ఆయన కూడా ప్రతీ నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేశాక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత జడ్చర్లలో జరిగిన సభకు హాజరైన కేసీఆర్.. మరోమారు దేవరకద్ర, నారాయణపేట సభల్లో పాల్గొని మాట్లాడారు. తాజాగా ఒకేరోజు మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట సభకు హాజరయ్యారు. ఇప్పుడు ఆదివారం నాగర్‌కర్నూల్‌లో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత 4న ఒకే రోజు ఉమ్మడి జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్, కొండగల్‌లో జరిగే ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే మంత్రి కేటీఆర్ కూడా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితుల చోట్ల సభలు నిర్వహించి.. కేడర్‌ను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కల్వకుర్తి, మక్తల్, అచ్చంపేటలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. అదే విధంగా ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న చోట్ల.. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టేందుకు టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావును నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిగా నియమించారు. అలంపూర్, గద్వాల్, మక్తల్, కొడంగల్‌లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు నడిపించేందుకు హరీశ్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పలుమార్లు పర్యటించిన హరీశ్.. కొందరిని నియోజకవర్గంలో నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్ఎస్ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. వ్యూహాత్మకంగా ప్రజాఫ్రంట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి సైతం సర్వశక్తులు ఒడ్డుతోంది. టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలందరూ కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అన్నిచోట్ల కూడా కూటమి నాయకులుకలిసి బరిలో నిలిచిన అభ్యర్థి ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలు, టీ పీసీసీ ముఖ్యనేతలందరూ విస్తృతంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. గత నవంబర్ 28న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. ప్రత్యర్థి పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలపై రాహుల్ ధీటైన విమర్శలు చేస్తున్నారు. రాహుల్ సభల ద్వారా కాంగ్రెస్ కేడర్‌లో జోష్ నెలకొనడంతో.. ఈనెల 3న గద్వాలలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కమలం ‘గురి’ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సైతం తన పట్టును నిలుపుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. ఉమ్మడి జిల్లా కొన్ని స్థానాలైనా గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తోంది. పలు సర్వేల్లో కల్వకుర్తి, నారాయణపేటల్లో పార్టీ అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కనీసం ఈ రెండు స్థా నాలను గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పాలమూరు సభ ద్వారా కేడర్‌లో జోష్ నింపారు. మరోవైపు మంచి వాగ్దాటి ఉన్న స్వామి పరిపూర్ణానంద స్వామి కూడా ఆయా నియోజకవర్గాల్లో ప ర్యటించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పా టు జె.పి.నడ్డా తదితరులు సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో వ్యూహకర్తగా పేరున్న జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యూ హాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పాలమూరు నుంచే ప్రా రంభించిన నేపథ్యంలో... తాజాగా ఆయన మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని నారా యణపేట, కల్వకుర్తి(ఆమనగల్)ల్లో ఆదివారం జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు. -
మోసాలకు అంబాసిడర్‌గా కేసీఆర్
మధిర/ఏటూరునాగారం: గత ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. శనివారం ఆమె ఖమ్మం జిల్లా మధిర మం డలం సిరిపురంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. దొర ఒక వైపు, కాంగ్రెస్ మరోవైపు అని.. దొర కావాలో, ప్రజా సమస్యలు పరిష్కరించే కాంగ్రెస్ పార్టీ కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యమాలతో దోచుకోవడం, దాచుకోవడం చేశారన్నారు. ఈ విషయంలో కేసీఆర్ మోసాలకు అంబాసిడర్‌గా మారారని ఆరోపించారు. నాడు మహాత్మాగాంధీ సింపుల్‌గా ఉండేవారని, కేసీఆర్ మాత్రం పబ్లిసిటీ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గాంధీ నాడు తన కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వలేదని, కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చారని విమర్శించారు. డిసెంబర్ 11 తర్వాత రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక మోసాలతో వ్యవస్థకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఖమ్మం జిల్లా చారిత్రాత్మకమైందని, ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పాటలతో ఆయన అలరించారు. కీలక స్థానంలో ఉంటా: భట్టి త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో తాను కీలక స్థానంలో ఉంటానని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 70 నుంచి 80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము ఇస్తున్న హామీలు సంక్షేమ పథకాల ను వెంటనే అమలు చేస్తామన్నారు. నిధులను నలుగురి కోసం కాకుండా 4 కోట్ల మంది ప్రజలకు పంచుతామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైం దన్నారు. దొరల పాలన కావాలో, ప్రజాపాలన కావా లో తేల్చుకోవాల్సింది ప్రజలేనన్నారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. కేసీఆర్ అబద్ధాలను ప్రజలు నమ్మరు: రాజగోపాల్‌రెడ్డి మునుగోడు: లేచింది మొద లు కొని పడుకునే వరకు అబద్ధాలు ఆడే సీఎం కేసీఆర్ ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని కాంగ్రెస్ పార్టీ మునుగోడు అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివెల, కిష్టాపురం గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం లాంటి అమలుకు వీలుకాని హామీలిచ్చి గద్దెనెక్కాడన్నారు. అయితే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ఈ ఎన్నికల్లో అబద్ధాలు ఆడే అవకాశం లేకుండా పోయిందన్నారు. 7న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని కేసీఆర్ గ్రహించారని, అందుకే తాను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పుకొస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందన్నారు. -
తెలంగాణపై బాబు, లగడపాటి కుట్రలు
సాక్షి, జనగామ/మహబూబాబాద్/కామారెడ్డి/ యాదాద్రి: నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ మరోసారి కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కామారెడ్డి జిల్లా గాంధారి,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, ఇందుకుగాను ఆంధ్రా శక్తులన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రా నుంచి చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లగడపాటి రహస్య ఎజెండాతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామని, వారి కుట్రలను తిప్పికొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే నీటిపారుదల, హోం, పరిశ్రమలు శాఖలు తమకే అని టీడీపీ వారు అంటున్నారని, తెలంగాణ నీళ్లు ఆంధ్రా కు తరలించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగినట్లే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరానికి నీళ్లు తగ్గు తాయంటూ ఇప్పటికే చంద్రబాబు అడ్డు తగులుతున్నాడని హరీశ్ ఆరోపించారు. కూటమికి ఓటేస్తే బాబు కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటాడని, దీంతో మనకు నీళ్లు రావన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. మరో ఏడాదిన్నర రెండేళ్ల లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందన్నారు. చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తి అని, అలాంటి కూటమికి ఓటు వేయొద్దని హరీశ్ కోరారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడని ధ్వజమెత్తారు. కాం గ్రెస్, బాబు తోడుదొంగలు, మాట తప్పిన వాళ్లన్నా రు. బాబు ఇచ్చిన పైసలతో రోజూ పేపర్లు, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మం చోడని తెలంగాణకు మేలు చేస్తాడని కోదండ రాం అనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. తెలంగాణ మేధావి లోకం కోదండరాంను చూసి జాలిపడుతుందన్నారు. డిసెంబర్ 11 తర్వాత వచ్చే ఫలితాలతో కేసీఆర్ ఇరగదీసే పర్సన్ అని రుజువు అవుతుందన్నారు. కూటమి నేతల కల్లబొల్లి మాటలు వినకుండా టీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ్‌కే నమ్మకం లేదు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. దేనికోసం కూటమికి ఓటు వేయాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కూటమిలోని నలుగురికి తోకలే సక్రమంగా లేవని విమర్శించారు. కోదండరాంను కోదండం ఎక్కించారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కుడితిలో పడిన ఎలుక లెక్క కోదండరాం పరిస్థితి అయిందని విమర్శించారు. పౌరసంఘం హక్కుల నేత అని చెప్పుకునే కోదండరాం, నరహంతకుడు, ఎన్కౌంటర్లు చేయించిన బాబు కడుపులో తలపెట్టి గౌరవం తగ్గించుకున్నారని మండిపడ్డారు. కోదండరాంను చూసి మేధావిలోకం సిగ్గు పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెవ్వులో పూలు పెట్టుకున్నారు కావచ్చు.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
80 స్థానాల్లో విజయం మాదే
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 80కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ, ధర్మగంట మోగే తెలంగాణ, వెలుగుల తెలంగాణ కావాలంటే టీఆర్ఎస్ గద్దె దిగాల్సిందేనని, ఓటర్లందరూ ప్రజాఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రం కీలకదశకు చేరుకున్న సమయంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్య విశేషాలు.. సాక్షి: ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మీ ప్రచారం ఎలా సాగుతోంది? ఉత్తమ్: అద్భుతంగా సాగుతోంది. ఇంటింటి ప్రచారంతో పాటు బహిరంగసభలు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా మా పార్టీ, పీపుల్స్ ఫ్రంట్ సందేశం ప్రతి ఓటరుకు చేరేలా సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా మా కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక చాలా ఆలస్యంగా జరిగింది కదా..? ఇది తప్పు. అభ్యర్థుల ఎంపిక సరైన సమయంలోనే జరిగింది. మరీ ముందుగా అభ్యర్థులను ఎంపిక చేసినా అనేక రకాల ఇబ్బందులుంటాయి. అభ్యర్థులతో పాటు పార్టీ ప్రచారం పకడ్బందీగా సాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలోకి వస్తే మేం చేయబోతున్న పనుల గురించి పోలింగ్ రోజు కంటే ముందే ప్రతి ఓటరుకు మూడు నాలుగు సార్లు చేరవేసేలా ముందుకెళుతున్నాం. ఈ ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు జరుగుతుందంటున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? అవినీతితో దోచుకున్న సొమ్ము, మద్యం ఉపయోగించి తిరిగి అధికారంలోకి వచ్చే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉంది. కానీ, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ విషయాన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విధంగా డబ్బు, మద్యం, గోబెల్స్ ప్రచారం ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకోవడం వారి దుర్బుద్ధికి నిదర్శనం. దీన్ని ఓటింగ్‌లో తెలంగాణ సమాజం సహించదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మాటల మాంత్రికుడిగా పేరున్న ఆయన ఎన్నికల ప్రచారంపై మీ అభిప్రాయం? కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. 2014 ఎన్నికల సమయంలో ఆయన మాటలు విని మోసపోయామనే భావన తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల్లో ఉంది. మళ్లీ మోసపోం అని కూడా తెలంగాణ ప్రజల అనుకుంటున్నారు. అందుకోసమే కేసీఆర్ సభలు కానీ, టీఆర్ఎస్ ఇతర ప్రచార కార్యక్రమాలు కానీ అట్టర్‌ఫ్లాప్ అవుతున్నాయి. అదే సమయంలో మా ప్రచార సభలకు పెద్ద ఎత్తున జనస్పందన కనిపిస్తోంది. కేసీఆర్ సభలకు సరైన సంఖ్యలో జనం రావడంలేదు. వచ్చినవాళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొనడంలేదు. టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తును తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, టీడీపీ పొత్తును సంపూర్ణంగా స్వీకరించారు. ఇందుకు నిదర్శనంగానే మా పార్టీలు కలిసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ అంశంలో మేం సర్వే కూడా చేశాం. ఇందులో పాల్గొన్న 90–95 శాతం మంది మా పొత్తును ఆమోదించారు. ఇది ఒక చారిత్రక అవసరం. దేశ, రాష్ట్ర స్థాయిలో ప్రస్తుత పాలకుల నిరంకుశ, నియంతృత్వ ధోరణి, ఫాసిస్టు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న రాజకీయ, రాజకీయేతర శక్తులు కలిసి ఈ ప్రజావ్యతిరేక దుర్మార్గపు పాలకులను గద్దె దింపాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ, సీబీఐ, న్యాయ, పార్లమెంటరీ, మీడియా వ్యవస్థలను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు సర్వనాశనం చేస్తున్నాయి. అదే పోకడతో తెలంగాణలో కూడా కేసీఆర్ శాసన, కార్యనిర్వాహక, మీడియా వ్యవస్థలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో జరిగిన రాజకీయ పునరేకీకరణలో రాజకీయ, రాజకీయేతర శక్తులు చేతులు కలపడం అవసరం. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఓట్ల బదిలీ జరిగే పరిస్థితులు లేవంటున్నారు? ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీనిపై మేం క్షేత్రస్థాయిలో ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. నూటికి నూరుశాతం ఓట్ల బదిలీ జరగబోతున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం ఉంది. అన్నీ బయటకు చెప్పలేం కానీ.. ఇందుకోసం మేం అనేక చర్యలు తీసుకుంటున్నాం. సూట్‌కేసులు రాలేదనే సోనియా కడుపు తరుక్కుపోతుందా అన్న కేసీఆర్ కామెంట్స్‌పై మీరేమంటారు? కేసీఆర్ అత్యంత దిగజారుడు వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. తన జీవితం మొత్తం సూట్‌కేసులు తీసుకునే అలవాటున్న కేసీఆర్‌కు త్యాగస్ఫూర్తితో, నిబద్ధతతో పనిచేసే వారి వ్యక్తిత్వం అర్థం కాదు. ఒకనాడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్, సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఆన్‌రికార్డ్ చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఓడిపోతున్నాననే ఆందోళనతోనే సోనియాను విమర్శిస్తున్నారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై అవినీతికి నిలువెత్తు నిదర్శనమైన అవకాశవాది, అబద్ధాలకోరు, మోసగాడు మాట్లాడడమా..? దీన్ని గమనించిన తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు మీ విజయావకాశాలను దెబ్బతీసేట్టు ఉన్నారు? బీజేపీ, ఎంఐఎంలకు గత ఎన్నికలలో వచ్చినన్ని సీట్లు కూడా రావు. అదో విచిత్ర కలయిక. బీజేపీతో రహస్య ఒప్పందం, ఎంఐఎంతో బహిరంగ ఒప్పందం చేసుకుని టీఆర్ఎస్ ఎన్నికలకు వెళుతోంది. గత నాలుగేళ్లుగా అనేక సందర్భాల్లో కేసీఆర్ బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు. జీఎస్టీ, నోట్లరద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయాల్లో కేసీఆర్ ఏం చేశాడనేది తెలంగాణలోని మైనార్టీలు గమనిస్తున్నారు. ఇంత పచ్చిగా బీజేపీకి మద్దతిస్తున్న టీఆర్ఎస్కు ఎంఐఎం ఎందుకు మద్దతిస్తోందో ఓవైసీ ఇంతవరకు రాష్ట్రంలోని మైనార్టీలకు చెప్పలేదు. తక్కువ ధరకు భూముల కేటాయింపు, పోలీసు కేసులు, ఇతర విషయాల్లో వ్యక్తిగత లబ్ధి కోసం ఓవైసీ టీఆర్ఎస్కు మద్దతు పలకడం ముస్లిం సమాజంలో ఎవరికీ రుచించడం లేదు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కానీ, వక్ఫ్‌బోర్డు ఆస్తులు, భూముల రక్షణలో కానీ, ఉర్దూ అకాడమీని బలపర్చడంలో కానీ ముస్లింలకు కేసీఆర్ సాయపడలేదు. ఆలేరు ఎన్కౌంటర్, మక్కామసీదు పేలుళ్ల నిందితులను కిందికోర్టు దోషులుగా ప్రకటించినప్పుడు పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లకపోవడం కానీ, ముస్లిం పర్సనల్ లాలో బీజేపీ తలదూర్చినప్పుడు కేసీఆర్ మద్దతు పలకడంపై ముస్లిం సమాజం ఆగ్రహంతో ఉంది. ఈ ఎన్నికలలో మీరు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు? కచ్చితంగా 80 స్థానాల కంటే ఎక్కువగానే గెలవబోతున్నాం. ఎవరికైనా సందేహాలున్నా డిసెంబర్ 11న నివృత్తి అయిపోతుంది. అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? మా మేనిఫెస్టో ఇప్పటికే విడుదల చేశాం. ఒకే దఫాలో రూ.2లక్షల రైతు రుణమాఫీ, 2009 తర్వాత తెలంగాణ ఉద్యమంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, 17 పంటలకు గిట్టుబాటు ధరలు, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతుబంధు పథకం విస్తరణ, రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులకు లబ్ధి కలిగేలా పెట్టుబడి సాయం, ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంపు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల భృతి, 20వేల పోస్టులతో మెగా డీఎస్సీ, పాతపద్ధతిలోనే డీఎస్సీ నిర్వహణ, మైనార్టీలకు సబ్‌ప్లాన్, ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు రూ.5లక్షల వర్తింపు, ప్రతి మండలానికి 20–30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, సొంత స్థలం ఉంటే కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షలు, ఇందిరమ్మ ఇళ్ల పాతబకాయిల చెల్లింపు, పాత ఇందిరమ్మ ఇళ్లకు అదనపు గది కోసం రూ.2లక్షలు, వివాహాలకు ఆర్థిక సాయంగా రూ.1,50,116, తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా ఆరు ఎల్పీజీ సిలెండర్లు, మహిళా సంఘాల రుణపరిమితి రూ.10లక్షలకు పెంపు, రూ.50వేల వరకు రుణాల మాఫీ, రూ.లక్షకు తగ్గకుండా నగదు రూపంలో గ్రాంటు, సీసీఎస్ విధానం రద్దు, కొత్త పీఆర్సీ ద్వారా 01–07–2018 నుంచి ఆర్థిక ప్రయోజనాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు తిరిగి రాష్ట్రానికి, కోటి ఎకరాలకు సాగునీరు, అన్ని ప్రాజెక్టులకు తగిన నిధుల కేటాయింపు వంటి హామీలిస్తున్నాం. మీరు సీఎం అవుతాననుకుంటున్నారా? నేను సీఎం అవుతానా కాదా అన్నది ప్రధానాంశం కాదు. మూడున్నరేళ్ల క్రితం నేను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోతున్న పరిస్థితులున్నాయి. ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కోల్పోవాల్సిన పరిస్థితి. సీఎంగా కేసీఆర్ 20 ఏళ్ల పాటు ఉంటాడని, పోటీనే లేదనే భావన చాలా మందిలో ఉండేది. ఆ పరిస్థితి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తున్న ఓ అద్భుత స్థితికి పార్టీ వచ్చింది. ఇందులో నాది కూడా కొంత భాగస్వామ్యం ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఎన్నికలతో పార్టీ అధ్యక్షుడిగా నా పాత్ర పూర్తవుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కలిసి ఎవరిని సీఎంగా ఎన్నుకున్నా నాకు ఆమోదయోగ్యమే. మీరు, మీ భార్య పద్మావతి ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు? మీ భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోంది? ఇద్దరం సునాయాసంగా భారీ మెజార్టీతో మళ్లీ ఎమ్మెల్యేలు కాబోతున్నాం. మాకు పిల్లల్లేరు. తెలంగాణ ప్రజల కోసమే మా జీవితాలు అంకితం చేశాం. ఇదే విధంగా నిరంతరం నిస్వార్థంగా, నిజాయితీతో ప్రజా జీవితంలో కొనసాగుతాం. తెలంగాణ ప్రజలకు మీరిచ్చే ఎన్నికల సందేశం ఏంటి? తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో తిరిగి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఏ త్యాగానికైనా, పోరాటానికైనా సిద్ధమై పూర్తి స్వేచ్ఛతో దేనికీ ప్రలోభపడకుండా, ప్రభావితం కాకుండా ఓటేయాలని విజ్ఞప్తి. తెలంగాణ అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లకు నా సవినయ విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఉద్దేశం నెరవేరలేదు. తెలంగాణ సమాజంలో అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, నిరుపేద వర్గాలకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరగలేదు. అవినీతి మితిమీరిపోయింది. మార్పు కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ కోసం, ధర్మగంట మోగే తెలంగాణ కోసం మనం ఓటేద్దాం. ప్రజాఫ్రంట్ అభ్యర్థులను గెలిపించండి. టీఆర్ఎస్ను గద్దె దింపండి. -
గెలుపుపై టీపీసీసీ చీఫ్‌కే నమ్మకం లేదు: హరీష్ రావు
సాక్షి, వర్థన్నపేట : మహాకూటమి గెలుపుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే నమ్మకం లేదని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వర్ధన్నపేటలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అంటేనే అభివృద్ధని, కాంగ్రెస్, టీడీపీలవి మోసపూరిత వాగ్ధానాలని, వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణను తెచ్చుకున్నామని, రాష్ట్రంలో పరాయిపాలన అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజా కూటమి వస్తే రైతులకు కష్టాలేనన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్కు ఓటేయ్యాలని, వర్థన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. -
‘ఆ కుటుంబం అక్రమాస్తుల్ని బయటపెడతాం’
సాక్షి, నిజామాబాద్ : ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం అక్రమాస్తులను బయటపెడతామని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ అన్నారు. బినామీ కంపెనీలతో కేసీఆర్ కుటంబ సభ్యులు కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మధుయాష్కి శనివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఉరఫ్ దుబాయ్ శేఖర్‌కు నకిలీ పాస్‌పోర్టు, దొంగనోట్ల స్కామ్‌ల చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు. 2009లో కేటీఆర్‌కు కోటిన్నర ఆస్తి ఉండగా.. ఆ మొత్తం 2014లో ఏడుకోట్ల తొంభై లక్షలకు, 2018లో 41 కోట్ల రూపాయలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కొడుకు హర్షవర్ధన్ నాయుడు, సత్యం రామలింగరాజు కొడుకు తేజారాజులు కేటీఆర్ వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. రూ.1500 కోట్ల కాంట్రాక్టును కేటీఆర్ తేజారాజు కంపెనీకి దోచిపెట్టారని ఆరోపించారు. ‘కాల్ హెల్త్’ కేటీఆర్ బినామీ కంపెనీ అనీ, ఆ కంపెనీకి తేజారాజు భర్య చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎంపీ కల్వకుంట్ల కవిత బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో నిర్మించిన బంగ్లా వివరాలు రేపు బయటపెడతామని మధుయాష్కి పేర్కొన్నారు. వ్యాట్ ఎత్తేయాలి కదా..!! రాష్ట్ర ప్రజల్ని ఉద్ధరిస్తానని చెప్పుకుంటున్న కేసీఆర్ తెలంగాణలో డీజిల్, పెట్రోల్‌పై వ్యాట్‌ను ఎందుకు ఎత్తేయడం లేదని కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ ప్రశ్నించారు. పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం వ్యాట్ తగ్గించిందని గుర్తు చేశారు. నరేంద్ర మోదీతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని అన్నారు. -
‘కూటమి సీఎం వారే నిర్ణయిస్తారు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోను హంగ్ ఏర్పడదని.. మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని కాంగ్రెస్ సీనియర్‌నేత, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ప్రత్యేక వ్యూహంతో అన్ని పక్షాలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి గెలుపుదిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కానీ వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, ఇతర పార్టీల పాత్ర ఎలా ఉంటుందనేది రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని వెల్లడించారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరన్నది హైకమండ్ ప్రకటిస్తుందని తెలిపారు. కాగా రాజకీయ వ్యూహలు రచించడంలో దిట్టగా పేరొందిన శివకుమార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఇక్కడే ఉంటూ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. -
ఉజ్వల తెలంగాణ దిశగా ప్రజాఫ్రంట్ పాలన
సంగారెడ్డి టౌన్: తెలంగాణలో కేవలం కేసీఆర్‌కు లాభం చేకూరిందని, బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానని చెప్పి నాలుగున్నరేళ్లలో దివాళా తెలంగాణగా మార్చివేశారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపనున్నారని, ఉజ్వల తెలంగాణ దిశగా ప్రజాఫ్రంట్ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డికి విచ్చేసిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బాగు పడతారని సోనియా, మన్మోహన్‌సింగ్‌లు రాష్ట్రం ఏర్పాటు చేస్తే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కుటుంబ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తే అందరికి లాభం చేకూరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లయినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీల్లాగా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇవ్వదని, మ్యానిఫెస్టోలో ఉన్నవి అన్నీ నెరవేర్చుతామన్నారు. ఈ ఎన్నికల్లో జగ్గారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, నియోజకవర్గంలో బలమైన నాయకుడు అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలని కేసీఆర్ ఏన్నాడూ అడగలేదన్నారు. మార్పు వస్తుంది.. వచ్చే నెల 7వ తేదీన ఎన్నికల్లో ప్రజల తీర్పుతో మార్పు వస్తుందని ప్రజాఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఢిల్లీకా రాస్తా హైదరాబాద్‌సే .. హైదరాబాద్‌కా రాస్తా సంగారెడ్డిసే షురూ హోగా అని కూటమి విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో అమలు కోసం ప్రత్యేకంగా జిల్లాకో నాగరిక్ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హమ్ సంవేదన్ శీల్ ... సర్కార్ దేంగే అని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ పనితీరు ఉంటుందన్నారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్, మోదీలు దొందూ దొందేనన్నారు. బీజేపీ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుందని, వారిద్దరికి ఎంఐఎం ఆక్సిజన్ అందిస్తుందని అన్నారు. ఈ పార్టీలతో కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తూ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ, మన్మోహన్సింగ్ల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నారు. అత్యవసరంగా తెలంగాణలో అవినీతిని, లంచగొడితనాన్ని అంతం చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీ సైతం ఫాంహౌస్‌కు వెళ్తారని, బహుషా కేసీఆర్, మోదీ ఒకే ఫాంహౌస్‌కు పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక కేటగిరి.. తెలంగాణ విభజన సమయంలో ఆంధ్రకు ప్రత్యేక కేటగిరీ ఇస్తామని చెప్పామని ఆయన తెలిపారు. విభజన జరిగిన సమయంలో అందరి కళ్లు హైదరాబాద్‌పైనే ఉన్నాయని, హైదరాబాద్ తెలంగాణకే చెందాలని సోనియా, మన్మోహన్లు నిర్ణయించినట్లు తెలిపారు. విభజన సమయంలో హైదరాబాద్ ఆదాయం రూ.16వేల కోట్లు ఉండగా నేడు అది సుమారు రూ.25 వేల కోట్లు ఉందన్నారు. ఈ నిధులన్నీ తెలంగాణ ఖాతాల్లోకి వెళ్లినందున ఆంధ్రకు ఐదు సంవత్సరాల ప్రత్యేక కేటగిరి ఇస్తామని మన్మోహన్సింగ్ ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ సర్కార్ ఏర్పడితే 10 సంవత్సరాల ప్రత్యేక కేటగిరి ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామని వెంకయ్యనాయుడు పార్లమెంట్లో ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. తిరుపతి పర్యటనలో సైతం మోదీ అబద్ధాలు చెప్పారని, కేటగిరి ఇస్తామని మోసం చేశారన్నారు. వండివార్చిన బిర్యానీ.. తెలంగాణ ఏర్పడిన సమయంలో హైదరాబాద్ వండివార్చిన బిర్యానీగా ఉందని జైరాం తెలిపారు. హైదరాబాద్‌ను ఎన్టీఆర్, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారన్నారు. తయారుగా ఉన్న బిర్యానీ కేసీఆర్‌కు దొరికినప్పటికీ ఇప్పుడు స్పెషల్ కేటగిరిని ప్రశ్నించడం సరికాదన్నారు. దేశంలో ప్రత్యేక కేటగిరిలు ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో ప్రభుత్వం ఇవ్వగలుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు మోదీని పొగిడిన కేసీఆర్ ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో మోదీని విమర్శిస్తున్నారన్నారు. కేసీఆర్‌ది తెలంగాణ కాదని, ఆయన విజయనగరం నుంచి వచ్చిన సెటిలర్ అని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో సంగారెడ్డి శాసనసభ అభ్యర్థి జగ్గారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంతకిషన్ తదితరులు ఉన్నారు. -
కారు బేజారైంది.. సినీ నటి ఖుష్భూ
సాక్షి, స్టేషన్ మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి ఖుష్భూ ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల జరిగిన రోడ్డు షోల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, గద్వాల, దేవరకద్రలో మహాకూటమి అభ్యర్థులు ఎర్ర శేఖర్, డీకే.అరుణ, డోకూరు పవన్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్డు షోతో పాటు ప్రచారంలో పాల్గొని ఈసారి టీఆర్ఎస్ను ఓడిగించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్భూ విమర్శించారు. మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు ఆమె మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కారు బేజారైందని, కారులో కేవలం ఐదుగురికి స్థానం ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్, సంతోష్‌రావు, కవిత, హరీశ్‌రావుకే సరిపోయిందన్నారు. డిక్కీలో ఎక్కుదామన్నా అందులో డబ్బులు నింపుకున్నారు.. సామాన్య ప్రజలు, పేదలకు కారులో స్థానం లేదని, కేవలం సోనియా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టంచేశారు. మహిళా సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్ మహిళా మంత్రిలేని కేబినెట్ టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, మహిళా కమిషన్‌ను సైతం ఏర్పాటు చేయలేదని ఖుస్భూ విమర్శించారు. కవితకు ఎక్కడ ప్రాధాన్యం తగ్గుతుందోమోనని మహిళా మంత్రిని కేబినెట్లోకి తీసుకోలేదా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటనల్లో దక్షిణ భారతంలో తెలంగాణ రెండోస్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమం కేవలం మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారని, వారి సంక్షేమానికి ఎలాంటి పథకాలు అమలుచేయలేదని ఆరోపించారు. ఆస్పత్రుల్లో మహిళల వైద్యసౌకర్యాలు సరిగ్గా లేవని, మెటిర్నిటీ వైద్యం అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. ఇక సెక్రటేరియట్‌కు వెళ్లని ఏకైక సీఎం దేశంలో కేసీఆర్ అని ఖుష్బు మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. అప్పటి పథకాలకు పేర్లు మార్చి కొనసాగించారని అన్నారు. అప్పుల తెలంగాణగా మార్చారు.. గత ప్రభుత్వ హయాంలో రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఖుష్బూ ఆరోపించారు. దాదాపు రూ.2.20 లక్షల కోట్ల అప్పు ఉందని, ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. రేషన్ దుకాణాల్లో 9 నిత్యావసర వస్తువులను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి దానిని మరిచారన్నారు. మహిళా సంఘాలు కూడా నిర్వీర్యం అయ్యాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నివర్గాల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఖుష్బూ సమక్షంలో పలువురు ఇతర పార్టీలవారు కాంగ్రెస్‌లో చేరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేశ్, టీజేఎస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనిత, నేతలు రవికిషన్‌రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, చంద్రకుమార్‌గౌడ్, రంగారావు, ఎండి.షౌకత్‌అలీ, మహ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు మాటల్లో నీటి గలగలలు
వలసల జిల్లా పాలమూరులో ఎన్నికల పోరు రక్తి కడుతోంది. టీఆర్ఎస్, కూటమి అభ్యర్థులు నువ్వా–నేనా అన్నట్టు తలపడుతున్నారు. హోరాహోరీ ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నారు. ప్రధానంగా సాగునీటి అంశం చుట్టూనే పాలమూరు రాజకీయం సుడులు తిరుగుతోంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి ఈ జిల్లా ఆధిక్యం అందిస్తోంది. మొత్తం 14 స్థానాలకు.. 2014లో టీఆర్ఎస్ 7, టీడీపీ 2, కాంగ్రెస్ 5చోట్లా గెలిచాయి. నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేల చేరికతో టీఆర్ఎస్ బలం 9కి పెరిగింది. ఈ ఎన్నికల్లో.. పోల్ మేనేజ్మెంట్లో ముందున్న పార్టీలే గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఎత్తిపోతలతోనే ఉపయోగం నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల చేపడితే కృష్ణా నది నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరం నుంచే సాగునీరు లభిస్తుంది. అదే పాలమూరు రంగారెడ్డి ద్వారా చేపడితే 300 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. ఈ విషయం ఆలోచించాలి. – అనంత్‌రెడ్డి, జలసాధన సమితి అధ్యక్షుడు చేనేతకు చేయూత కావాలి గద్వాలలో హ్యాండ్లూమ్ పార్క్ పనులు ఊపందుకోవాలి. పార్క్‌లో ఇంటి స్థలం ఇచ్చి, మగ్గంతో చీర నేశాక ప్రభుత్వమే వాటినే కొనాలి. ప్రతి కార్మికునికి సిల్క్‌పై ఇచ్చే రూ.600 రాయితీని పునరుద్ధరించాలి. సిరిసిల్ల మాదిరే గద్వాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. – మ్యాడం రామకృష్ణ, గద్వాల, చేనేత కార్మికుడు విద్య, వైద్యం, సాగునీరు.. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు డిపో బస్సులు రావడం లేదు. నష్టాల్లో ఉందని గద్వాల డిపో బస్సులు వేయదు. ఆర్డీఎస్ కాల్వల పనులు తొందరగా పూర్తి కావాలి. అలంపూర్‌లో రవాణా, విద్య, వైద్యం, సాగునీటి వసతిని పెంచాల్సి ఉంది. – నందు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు, అలంపూర్ జీవో 98 కింద ఉద్యోగాలివ్వాలి శ్రీశైలం ముంపు నిర్వాసితులకు జీవో 98ను అమలు చేయాలి. 11,192 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో చొరవ చూపాలి. పరిహారం విషయంలోనూ శ్రద్ధ చూపాలి. నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం వెంటనే ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి. – ఖాజా మొహినొద్దీన్, శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుడు, కొల్లాపూర్ నారాయణ‘పేట’లోని మొనగాళ్లు ఇక్కడ ప్రధాన పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, బీఎల్ఎఫ్ అభ్యర్థి శివకుమార్‌రెడ్డి మధ్యే ఉంది. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో.. శివకుమార్‌రెడ్డి రైతు నాగలి గుర్తుపై పోటీలో ఉన్నారు. ఇక, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో టిక్కెట్ దక్కించుకున్న సరాఫ్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నా రు. అయితే జైపాల్ వర్గం నేత కావడంతో డీకే అరుణ వర్గం కృష్ణకు మద్దతివ్వడం లేదు. ఆమె వర్గమంతా శివకుమార్రెడ్డికే మద్దతిస్తోంది. గత ఎన్నికల్లో శివకుమార్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీచేసి 2,200 ఓట్ల తేడాతో ఓడారు. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయన బలంగా ప్ర జల్లోకి వెళుతున్నా, ఎన్నికల గుర్తు ఎంతవరకు ప్రజలకు చేరుతుందన్నది ముఖ్యం. కొడంగల్–నారా యణపేట ఎత్తిపోతల పథకం విష యం టీఆర్ఎస్ను కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇటీవల తన పర్యటనలో నారాయణపేటను జిల్లా చేస్తామన్న కేసీఆర్ ప్రకటన రాజేందర్‌కు కొత్త బలాన్నిస్తోంది. ఇక్కడ మూడో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. గద్వాల్: అత్తా అల్లుడి సవాల్ కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ ఏళ్లుగా డీకే కుటుంబానిదే ఆధిపత్యం. మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 15 సార్లు డీకే కుటుంబానిదే పైచేయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన డీకే భరతసింహారెడ్డి మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డిని మరోమారు టీఆర్ఎస్ బరిలో దింపింది. గద్వాలలో బోయ వాల్మీకీలు 40 వేలు, కురుమలు 35 వేల మంది వరకు ఉన్నారు. ఈ రెండు కులాల మొగ్గుని బట్టే గెలుపోటములు ఉండనున్నాయి. బోయ వాల్మీకీలను ఎస్టీల్లో చేరుస్తామని చేర్చకపోవడాన్ని ప్రధానంగా డీకే అరుణ ప్రస్తావిస్తూ వారిని మచ్చిక చేసుకున్నారు. ఇక గొర్ల పథకాన్ని తెరపైకి తెచ్చి కురుమలను టీఆర్ఎస్ దగ్గర చేసుకుంది. గద్వాల పట్టణంలో 55 వేల ఓట్లున్నాయి. గత ఎన్నికల్లోనూ పట్టణ పరిధిలో వచ్చిన ఆధిక్యమే అరుణ విజయానికి దోహదపడింది. ఈసా రీ ఆమెకే అనుకూలంగా కనిపిస్తోంది. అమలు కాని హామీలను ప్రధాన ప్రచారా స్త్రాలుగా చేసుకుని అరుణ ముందున్నారు. ఇక గ్రామీణ ప్రాంత ఓటర్లే లక్ష్యంగా కృష్ణమోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. అసంతృప్తివాదులను సర్దుబాటు చేసుకుని వెళుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ నియోజకవర్గ పర్యటనలో వరాల జల్లు కురిపించడం తనకు అనుకూలిస్తుందని ఈయన భరోసాతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కొంతకాలంగా హరీశ్‌రావు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. జడ్చర్ల: ‘నాడి’ పట్టేదెవరు? జడ్చర్లలో తాజా మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి హ్యాట్రిక్ కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ ముది రాజ్, యాదవ, ఎస్సీ కమ్యూనిటీ ఓటర్లున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక జడ్చర్లలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలతోపాటు 100 పడకల ఆస్పత్రి, ఇతర అభివృద్ధి పనులు తన విజయానికి దోహదం చేస్తాయని లక్ష్మారెడ్డి భావిస్తున్నారు. దళితులకు మూడెకరాలు, మైనార్టీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు అంశాన్ని మల్లు రవి ఎత్తిచూపుతున్నారు. ఈయన కాంగ్రెస్ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఇప్పటికే ఆయన సినీ నటి ఖుష్బూతో ప్రచారం నిర్వహించగా, మరో భారీ సభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ వైపు ఉన్న బీసీలు.. టీఆర్ఎస్ వైపు చూస్తుండటం కాంగ్రెస్‌కు ప్రతిబంధకంగా మారింది. కర్వెన, ఉద్ధండాపూర్ రిజర్వాయర్లతో 1.50లక్షల ఎకరాలకు సాగునీరిస్తామన్న కేసీఆర్ హామీ లక్ష్మారెడ్డికి బలంగా పనిచేసే అవకాశాలున్నాయి. రసకందాయంలో ‘కందనూలు’ ‘కందనూలు’గా పిలిచే నాగర్కర్నూల్లోరాజకీయమంతా సాగునీరు, అభివృద్ధి చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ ప్రధాన పోటీ మర్రి జనార్ధన్‌రెడ్డి (టీఆర్ఎస్), నాగం జనార్ధన్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్యే ఉంది. ఇక్కడి నుంచి ఆరుసార్లు గెలిచిన నాగం, ప్రస్తుతం మర్రి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కు తానే జీవం పోశానని నాగం జనార్ధన్‌రెడ్డి చెబుతోంటే, దాని ద్వారా లక్ష ఎకరాల కు సాగునీరు, 100 చెరువులు నింపిన ఘన త తనదేనని మర్రి హోరెత్తిస్తున్నారు. ఇంకా అభివృద్ధి పనులను ప్రచారంలో ప్ర స్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కె.దామోదర్‌రెడ్డికి 43 వేలు, టీఆర్ఎస్కు 65 వేల ఓట్లు వచ్చా యి. ప్రస్తుతం దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం మర్రికి కలిసొచ్చే అవకాశం. అయితే, దిలీపాచారి (బీజేపీ)..టీఆర్ఎస్ ఓట్లను కొంత చీల్చే అవకాశం ఉంది. షాద్‌నగర్: ‘కీ’లకం.. రెబల్ ఇక్కడ టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి తలపడుతున్నారు. టీఆర్ఎస్ రెబల్‌గా వీర్లపల్లి శంకర్ (బీఎస్పీ) బరిలో నిలిచారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉన్నా.. గెలుపోటములను మాత్రం బీఎస్పీ అభ్యర్థే నిర్ణయించనున్నారు. ఇక్కడ ఎక్కువగా ముదిరాజ్, యాదవ కులాల ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఉద్యమ ప్రభావంతో ప్రతాప్‌రెడ్డిపై అంజయ్య యాదవ్ 18 వేల మెజార్టీతో గెలిచారు. అయితే ఈసారి పలు విషయాల్లో ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. షాద్‌నగర్ పట్టణంలో వైశ్య కులాలు ప్రతాప్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్పీ అభ్యర్థి శంకర్ కొందుర్గు, నందిగామ, కొత్తూరు మండలాల్లో టీఆర్ఎస్ ఓట్లను చీల్చనున్నారు. శంకర్ కులానికి చెందిన రజక ఓటర్లు 8 వేల మంది వరకు ఉన్నారు. లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ ద్వారా సాగు, తాగునీటి వసతి కల్పిస్తామనే టీఆర్ఎస్ హామీ ఎంత వరకు పని చేస్తుందనేది గెలుపోటములను నిర్ణయిస్తుంది. మహబూబ్‌నగర్: పోటీ గరం గరం ఇక్కడ రసవత్తర పోటీ నడుస్తోంది. ప్రముఖులంతా పోటీలో నిలవడం, కులాల వారీగా ఓట్లు చీలడం వంటివి ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ (టీఆర్ఎస్) ప్రచారంలో ముందున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఉద్యోగ సంఘాల మద్దతు ఉండడం అనుకూలాంశం. టీడీపీ నుంచి ముదిరాజ్ వర్గానికి చెందిన ఎర్ర శేఖర్ పోటీలో నిలవడంతో ఆయనకే వారంతా (45 వేల మంది) అనుకూలంగా ఉన్నారు. 35 వేల వరకు ఉన్న ముస్లింలు బీఎస్పీ నుంచి పోటీలో ఉన్న ఇబ్రహీంకు మద్దతిస్తున్నారు. దీంతో ఓట్లు చీలిపోవచ్చు. టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఇంటి పార్టీ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీజేఎస్ నేత రాజేందర్‌రెడ్డి ఎర్ర శేఖర్‌కు మద్దతిస్తున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేకులూ శేఖర్ వెనుకే చేరారు. ఇది ఆయనకు కలిసి రావచ్చు. అయితే ఎన్సీపీ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ రెబల్ నేత ఎం.సురేందర్‌రెడ్డి.. శేఖర్ అవకాశాలను దెబ్బతీస్తారని అంచనా. బీజేపీ నుంచి బరిలో ఉన్న పద్మజారెడ్డి సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఏకకాలం లో నిర్వహించిన మోదీ, కేసీఆర్ బహిరంగసభలు రెండూ విజయవంతమయ్యాయి. ఏ పార్టీకి ఎవరు మద్దతిస్తున్నారో తెలియని పరిస్థితి. కొడంగల్: టగ్ ఆఫ్ వార్ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కొండగల్ ఒకటి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఆ దిశగా రెండేళ్ల ముందు నుంచే ఇక్కడ వ్యూహ రచన మొదలుపెట్టింది. సంపన్నుడు, కొడంగల్ అల్లుడు అయిన మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డిని బరిలోకి దించింది. ఇక్కడ అభ్యర్థుల విజయావకాశాలు బలహీన, గిరిజన, 15 వేలకు పైగా ఉన్న మైనారిటీ ఓట్లపైనే ఆధారపడి ఉంటాయి. రెండుసార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు, మాటలతో ఆకట్టుకునే తీరు రేవంత్‌కు ప్రధాన ఆకర్షణలు. ఆయా అభివృద్ధి పనులే అస్త్రాలుగా నరేంద్‌రెడ్డి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో 80శాతానికి పైగా ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ తన వైపు లాక్కుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల ఓటర్లు ఉండటం, గ్రామీణ కుటుంబాల్లో కచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ పథకం నుంచి లబ్ధి పొందిన వారుండటంతో వారందరినీ ఓట్లుగా మలుచుకునే యత్నాల్లో టీఆర్ఎస్ తలమునకలైంది. ఇక, రేవంత్‌రెడ్డి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తుండగా, ఆయన తరపున సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్‌రెడ్డి తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో గెలిచిన రేవంత్.. ఈసారి బీజేపీ సైతం పోటీలో ఉండటంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బీజేపీ అభ్యర్థి నాగురావ్ నామాజీ కనీసం 10 వేల ఓట్లను పొందవచ్చని అంచనా. అదే జరిగితే రేవంత్‌కు వచ్చే ఓట్లలో చీలిక ఏర్పడే అవకాశం ఉంది. మక్తల్‌లో కొత్త మలుపు వెనుకబడిన ప్రాంతమైనా.. రాజకీయ చైతన్యం ఎక్కువుండే మక్తల్‌లో త్రిముఖ పోటీ నడుస్తోంది. 2014లో కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అదే పార్టీ నుంచి బరిలో ఉండగా, ‘కూటమి’ తరఫున మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్ అసమ్మతి నేతలు కలిపి నిలబెట్టిన జలంధర్‌రెడ్డి ఈ ఇద్దరికీ తీవ్ర పోటీనిస్తుండటం మక్తల్ రాజకీయాల్లో కొత్త మలుపు. చిట్టెంకు ఇక్కడ అసమ్మతి ఎక్కువగా ఉంది. టీఆర్ఎస్లోని అసమ్మతి నేతలంతా జలంధర్ పక్కన చేరారు. ఇక దయాకర్‌రెడ్డికి కాంగ్రెస్ వర్గం పనిచేయట్లేదు. వారు సైతం జలంధర్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు లోపాయికారిగా జలంధర్నే బలపరుస్తున్నారు. దీంతో పోటీ ప్రస్తుతం చిట్టెం వర్సెస్ జలంధర్‌గా మారింది. నర్వ, ఆత్మకూర్‌లో చిట్టెం వర్గాన్ని జలంధర్ అనుకూలంగా మలుచుకున్నారు. దీనికి తోడు కారు గుర్తుకు దగ్గరి పోలికగా ఉండే ట్రాక్టర్ గుర్తు జలంధర్‌కు దక్కడం వల్ల కొన్ని ఓట్లు తనకు లాభిస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో చిట్టెం గెలుపు బాధ్యతను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. ఇక్కడి అసమ్మతిని చల్లార్చే యత్నం చేశారు. అలంపూర్ (ఎస్సీ): ‘నడిగడ్డ’.. ఎవరికి అడ్డా? కృష్ణా, తుంగభద్ర నడిగడ్డ అలంపూర్‌లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ కార్యదర్శి, తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్.. టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే అబ్రహాం బరిలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువున్న ఈ నియోజకవర్గంలో వారి ఆశీస్సులు ఎవరికుంటే వారే విజేత. అలంపూర్, ఉండవల్లి, మానోపాడ్ మండలాల్లో కాంగ్రెస్ బలంగా ఉండగా, ఇటిక్యాల, రాజోలి, అయిజ మండలాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 7 వేల మంది సెటిలర్ ఓటర్లున్న వడ్డేపల్లి మండలం ఎటు మొగ్గితే అటే విజయం ఖాయం కానుంది. ఇక్కడ కీలక నేతగా ఉన్న చల్లా వెంకట్రాంరెడ్డి సంపత్‌కు మద్దతునిస్తుండగా, డీకే భరతసింహారెడ్డి వర్గం తటస్థంగా ఉంది. అబ్రహాం తన హయాంలో అలంపూర్ ఎత్తిపోతల చేపట్టడం, గ్రామాలకు రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, అలంపూర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసిన పేరుంది. సంపత్ హయాంలో బస్‌డిపో, ఫైర్ స్టేషన్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కనీసం స్థలాల సేకరణ సైతం చేయలేదన్న అసంతృప్తి ఉంది. ఇటీవలే తుమ్మిళ్ల ఎత్తిపోతల ట్రయల్‌రన్ సక్సెస్ కావడం, 15 వేల ఎకరాలకు నీరందించేలా కాల్వలు పారించడం టీఆర్ఎస్కు అనుకూలించే అవకాశం ఉంది. వనపర్తి: అంతటా ఆసక్తి వనపర్తిలో పాతకాపుల మధ్యే మళ్లీ పోటీ. తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జి.చిన్నారెడ్డి – రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి (టీఆర్ఎస్) మధ్య పోటాపోటీ నడుస్తోంది. ఈసారి టీడీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేస్తుండటం, రెండు పార్టీల ఓట్లు కలిస్తే గెలుపు నల్లేరుపై నడకేనని కాంగ్రెస్ అంటోంది. చిన్నారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రావుల హాజరు కాగా, తర్వాత పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన వర్గం మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది. చివరి ఆరు రోజులు రావుల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక, నిరంజన్‌రెడ్డి కుల సంఘాలను ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుస్తూ ముందుకు సాగుతున్నారు. వనపర్తిలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ నిర్వహించడం తెరాస వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. కేఎల్ఐ ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడం, ఇతర అభివృద్ధి పనులు సానుకూలాంశాలు. నిరంజన్‌రెడ్డి పెద్దమందడి, ఘణపూర్, గోపాల్‌పేటలో పట్టు సాధించారు. పెబ్బేరులో డిగ్రీ, మోడల్, పాలిటెక్నిక్ విద్యాసంస్థల ఏర్పాటుతో ఈ మండలంలో చిన్నారెడ్డి ముందున్నారు. వనపర్తి పట్టణంలో టీడీపీ వర్గం కాంగ్రెస్‌కు పనిచేస్తోంది. హోరాహోరీ పోటీలో ఎవరు గట్టెక్కినా 5వేలలోపు మెజార్టీయే ఉండనుంది. కొల్లా‘పోరు’లో గెలిచేదెవరు? మంత్రి జూపల్లి కృష్ణారావు ‘డబుల్ హ్యా ట్రిక్’కు యత్నిస్తున్నారు. కాంగ్రెస్.. బీరం హర్షవర్దన రెడ్డిని బరిలో నిలిపింది. ఆయన శ్రీశైలం ముంపు నిర్వాసితులు ఎక్కువున్న వీపనగండ్ల, చిన్నంబావిలో ముందంజలో ఉన్నారు. వారికి న్యాయం చేస్తామని చెబుతూనే, సోమశిల బ్రిడ్జి చేపడతామని కొల్లాపూర్, కోడేరు మండల ప్రజలను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ టిక్కె ట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం సహకరిస్తుండటం కలిసొస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ఓకే చెప్పా రు. పోల్ మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడైన జూపల్లి..చివర్లో ఏం చేస్తారనేదే కీలకం. కల్వకుర్తి: ముగ్గురి కుస్తీ కల్వకుర్తిలో ముక్కోణ పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ తలపడుతున్నా యి. 2014లో ఈ స్థానం ఫలితాలు ఉత్కంఠ రేపా యి. జూపల్లి పోలింగ్‌బూత్‌లో సాంకేతిక కారణాల వల్ల అక్కడ రీపోలింగ్ జరిపారు. నాడు.. తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తన ప్రత్యర్థి ఆచారిపై 78 ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజా పోరులో వీరిద్దరికీ టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గట్టి పోటీనిస్తుండటంతో కల్వకుర్తి రాజకీయం రసకందాయంలో పడింది. తాజా మాజీ ఎమ్మెల్యే కావడం, అధికార పార్టీపై వ్యతిరేకత, జైపాల్‌రెడ్డి వర్గం మద్దతు వంశీకి కలిసొచ్చే అంశాలు. కేవలం 78 ఓట్లతో గెలిచాడన్న ప్రచారం, ప్రధాన కేడర్ దూరం కావడం, బీఎస్పీ పోటీలో ఉండటంతో ఓట్లు చీలనుండటం ప్రతికూలం. జైపాల్‌యాదవ్‌కు స్థానికత, బీసీ, సంక్షేమ పథకాలు, బలమైన కేడర్, రెండు సార్లు ఎమ్మెల్యేగా చేయడం బలాలు కాగా, కేడర్‌లో గ్రూపులు మైనస్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ఆచారికి 78 ఓట్లతో ఓడిపోయిన సానుభూతి కలిసొస్తోంది. దేవరకద్ర: గెలుపు.. అబ్రకదబ్ర తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్), పవన్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్య పోటీ ఉంది. మరోసారి సత్తా చాటుకునేందుకు సిద్ధమైన ‘ఆల’.. ముదిరాజ్, యాదవ, వాల్మీకి వర్గ నేతలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా సాగునీటిని అందించేందుకు చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఆరోపణలే అస్త్రాలుగా కాంగ్రెస్ అభ్యర్థి పవన్ ప్రజల్లోకి వెళుతున్నారు. భూత్పూర్, కొత్తకోట మండలాల్లో కాంగ్రెస్..సీసీకుంట, అడ్డాకుల, దేవరకద్ర మండలాల్లో టీఆర్ఎస్ ముందున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి సైతం పవన్ గెలుపునకు ప్రచారం చేస్తున్నారు. అచ్చంపేట: రెండు పార్టీల ‘సై’ఆట అచ్చంపేట బరిలో టీఆర్ఎస్– కాంగ్రెస్ తలపడుతున్నాయి. బీసీ ఓటుబ్యాంకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. బలమైన కేడర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఆశ పెట్టుకున్నారు. 30వేలకు పైగా మాదిగలు ఉండటం, అచ్చంపేట మునిసిపల్ ఎన్నికల్లో విజయం, ప్రభుత్వ పథకాలు, పార్టీ పెద్దల అండ బాలరాజుకు కలిసొచ్చే అంశం. స్థానికుడు కాకపోవడం, కీలక వ్యక్తులు పార్టీ విడిచిపోవడం కొంత ఇబ్బందే.. వంశీకృష్ణకు 1999, 2009, 20014లో ఓడిపోయిన సానుభూతి అనుకూలించే అవకాశం. సొంత సా మాజికవర్గం మాల ఓట్లు 30 వేలకుపైగానే ఉండటం, కూట మి పక్ష నేతలను ఒక్కటి చేయడం కూడా అనుకూలాంశం. రంగంలోకి ట్రబుల్ షూటర్ గద్వాల, కొడంగల్, మక్తల్, అలంపూర్ స్థానాల్లోని కాంగ్రెస్ నేతలకు ముకుతాడు వేసేందుకు టీఆర్ఎస్.. ఆ పార్టీ ట్రబుల్ షూటర్, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపింది. ఏదైనా నియోజకవర్గం బాధ్యతలను అప్పగిస్తే వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు అక్కడి అభ్యర్థులను గెలిపిస్తారనే పేరున్న హరీశ్ అప్పుడే తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా గద్వాలలో ప్రచారం చేసిన హరీశ్, అక్కడ అసంతృప్త నేతలను మచ్చిక చేసుకున్నారు. వారందరినీ పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డికి సహకరించేలా చూశారు. తుమ్మిళ్ల, నెట్టెంపాడు పనులు, గట్టు ఎత్తిపోతల పథకాలపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు నూరిపోశారు. కొడంగల్ నియోజకవర్గ రాజకీయాలనూ ఆయన ప్రభావితం చేస్తున్నారు. అలంపూర్‌లో అబ్రహాం గెలుపునకు అవలంబించే వ్యూహంపై ఆయన శ్రేణలుకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఈ స్థానాన్ని తెరాస తన ఖాతాలోకి వేసుకోవాలని భావిస్తోంది. మక్తల్‌లోనూ అసంతృప్తులను దారిలోకి తెచ్చారు. ఇక కాంగ్రెస్‌లోని ఓ వర్గంతోనూ ఆయన టచ్‌లో ఉన్నారు. ప్రభావితం చేసే అంశాలు ఇవే.. - పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సత్వర పూర్తి - కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయాలు చూపడం - శ్రీశైలం ప్రాజెక్టు కింది ముంపునకు గురైన నిర్వాసితులకు - జీవో 98 అమలు చేయడంలో శ్రద్ధ - కౌలు రైతులకు రైతుబంధు అమలు.. - సాగునీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి వలసల నివారణ - ఏపీకి సరిహద్దుగా ఉన్న అలంపూర్‌లో లోకల్, నాన్ లోకల్ సమస్య ఉంది. వైద్యం, విద్య అవకాశాల్లో స్థానికత సమస్య - ఆర్డీఎస్ కాల్వల ఆధునికీకరణ సత్వర పూర్తి - గద్వాల చేనేత కార్మికుల రక్షణకు వీలుగా హ్యాండ్లూమ్ పార్క్ నిర్మాణం వేగం చేయడం - నారాయణపేట, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో రోడ్లు అభివృద్ధి - 32వ జిల్లాగా నారాయణపేట, కొత్త రెవెన్యూ డివిజన్‌గా కొల్లాపూర్ హామీలు గ్రౌండ్ రిపోర్ట్ సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి -
‘కూటమికి బుద్ధి చెప్పండి’
సాక్షి, సిద్దిపేట : ‘గత పాలకులు నలభై సంవత్సరాల్లో చెయ్యని పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో చేసింది. అందుకే కాంగ్రెస్ నాయకులు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక తెలంగాణ నుంచి తరిమేసిన చంద్రబాబు నాయుడుతో పొత్తు కలసి కుటిల కూటమిని ఏర్పాటు చేసుకున్నారు’అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా 5వ తేదీన గజ్వేల్‌లో నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్, దుబ్బాకల్లో జరిగిన రోడ్‌షోల్లో పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా ప్రజలకు ఏది అవసరమో తెలుసుకొని అందించిన ప్రజల మనిషి సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు పథకం రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అందరి మన్ననలను పొందడంతోపాటు ఐక్యరాజ్య సమితి గుర్తించడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. కంటి వెలుగు, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, నిరుపేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు చేరువలోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. అందుకోసమే టీఆర్ఎస్ పార్టీని ప్రజలు దీవిస్తున్నారని చెప్పారు. బీజేపీకి ఓటేస్తే బురద గుంటలో వేసినట్లే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఒరిగేదేమీ లేదని, వారికి ఓటేస్తే బురద గుంటలో వేసినట్లే అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలోని ఏడు మండలాలను రాత్రికి రాత్రే ఏపీలో కలిపిన ఘనత బీజేపీ సర్కారుదే అన్నారు. ప్రపంచంలోనే కారు చౌకగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే దిగువ సీలేరు విద్యుత్ ప్లాంట్‌ను కూడా ఏపీకి అప్పగించారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన బీజేపీకి, మోదీ ప్రభుత్వానికి తెలంగాణలోని ప్రాజెక్టులు కనిపించలేదని అన్నారు. తెలంగాణలో బీడీ కార్మికులు అధికంగా ఉన్నా వారికి పెన్షన్ ఇచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకు రాలేదని, బీజేపీ పాలిత 17 రాష్ట్రాలలో కూడా బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వడంలేదని చెప్పారు. ఇలాంటి బీజేపీకి ప్రజలు ఓట్లు ఏలా వేస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ మనుగడ పరాయి పాలనలో ఛిద్రమైన తెలంగాణ ముఖ చిత్రాన్ని మారుస్తూ సంక్షేమం, అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ సమపాళ్లలో నడుపుతున్నారని హరీశ్ ప్రశంసించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. వీటి ఫలితాలు వస్తే తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారుతుందని పేర్కొన్నారు. నీటి వనరుల్లో మన వాటా మనకు దక్కాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు వివక్షకు గురయ్యారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు పడుతున్నా మౌనంగా చూసిన బాబు, ఇతర ప్రాంతాల నుంచి కరెంట్ సరఫరాకు కూడా అడ్డుపుల్ల వేశారని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ చతురతతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ తెప్పించుకొని ప్రజలకు కరెంట్ కష్టాల నుండి విముక్తి కలిగించారని అన్నారు. అలాగే సాగునీటికి పరితపించిన తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే అడుగడుగునా చంద్రబాబు అడ్డుకట్ట వేశారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్ర జలవనరుల మండలి వద్ద బాబు ఫిర్యాదులు చేశారన్నారు. అలాంటి చంద్రబాబు భాగస్వామిగా ఉన్నకూటమికి ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై చంద్రబాబు నాయుడుకు ఇంకా మోజు తీరలేదని, ఇక్కడి సంపదను దోచుకో మరిగిన ఆయన తెలంగాణలో మళ్లీ పెత్తనానికి తహతహలాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా హైకోర్టు విభజన కాలేదని, దీనిని బాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వీటితోపాటు విద్యుత్, ఇతర శాఖల్లో ఉద్యోగుల విభజనకు అడ్డుపడుతున్న చంద్రబాబుకు తెలంగాణ ఉద్యోగులు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. -
పాలన చేతగాకే ముందస్తుకు: నారాయణ
హైదరాబాద్: రాష్ట్రంలో ఐదేళ్లు పాలన సాగించాలని ప్రజలు ఓట్లువేస్తే పాలన చేతగాక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేపీహెచ్‌బీకాలనీలోని టీడీపీ కార్యాలయంలో సీపీఐ నాయకులతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహాకూటమిలోని పార్టీలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డిసెంబర్ 11 తరువాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పారిపోక తప్పదన్నారు. కేసీఆర్ అటు బీజేపీతోను, ఇటు ఎంఐఎంతోనూ పరోక్ష సంబంధాలను పెట్టుకున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఎవరు ముఖ్య మంత్రి అయినా తమ కాళ్లవద్దకు రావాల్సిందేనంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రకటించడం సిగ్గుచేటని, ఇందుకు బాధ్యతగా కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీపై, ప్రధాని నరేంద్రమోదీపై కేసీఆర్ ఒక్క విమర్శ కూడా చేయలేదని, ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజల్ని మోసగిస్తున్నారని విమర్శిం చారు. కేసీఆర్ దయవల్లే తామంతా మహాకూటమిగా జతకలిశామని, కూటమి పార్టీలతో కేసీఆర్ బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. కూకట్‌పల్లిలో సుహాసిని గెలుపునకు సీపీఐ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి పార్టీలు కృషిచేస్తాయని తెలిపారు. అనంతరం కూకట్పల్లి అభ్యర్థి సుహాసిని మాట్లాడుతూ తాను స్థానికురాలినేనని, హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగానని, స్థానిక సమస్యలను పరిష్కరించే సత్తా తనకుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు విశ్రాంతి అవసరం.. ఫాంహౌజ్‌కు పంపుదాం..
సాక్షి, మద్దూరు (కొడంగల్): రాష్ట్రంలో వచ్చేది ప్రజాకుటమి ప్రభుత్వమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దూరు మండలంలోని కొత్తపల్లి, నిడ్జింత, భూనీడ్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన రోడ్డు షోలో అయన మాట్లాడారు. కోస్గిలో బుధవారం నిర్వహించిన రాహుల్‌గాంధీ సభకు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ భయం పుట్టుకొచ్చిందని తెలిపారు. దీంతోనే కొడంగల్‌లో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో ప్రజాకుటమి అధికారంలోకి రావడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి 20 రోజుల్లో బ్యాంకుల్లో ఉన్న పట్టాపుస్తకాలు తిరిగి ఇప్పిస్తామని వెల్లడించారు. అలాగే, ఇళ్లులేని వారందరికీ రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరైన వారికి అదనంగా మరో గది కట్టుకోవడానికి రూ. 2లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇక 58 ఏళ్లు నిండిన వారు ఇంట్లో ఇద్దరు ఉన్నా రూ.2వేల చొప్పున పింఛన్ అందజేస్తామని వివరించారు. కాగా, గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా బెదిరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తనతోనే సాధ్యమైందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి, శివరాజ్, చంద్రశేఖర్, నర్సింహా, రమేష్‌రెడ్డి, మధుసుధన్‌రెడ్డి, చెన్నప్ప, ఆశోక్, మహేందర్‌రెడ్డి, చందు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కష్టమే!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే, ఢిల్లీ గద్దెనెక్కే పార్టీల భవితవ్యం తేల్చే ప్రధాన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 80 ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. 2014లో ఈ ఒక్క రాష్ట్రం నుంచే బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీయేతర పక్షాలు మహా కూటమిగా ఏర్పడితే బీజేపీకి కష్టమేనని, గెలుచుకునే స్థానాల సంఖ్య భారీగా తగ్గుతుందని ‘టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్’ల తాజా సర్వే తేల్చింది. విపక్షంలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)లు వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీ 55 సీట్లు గెలుచుకోగలదు కానీ, ఆ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే మాత్రం బీజేపీ 31 స్థానాలకే పరిమితమవుతుందని, విపక్ష కూటమి 49 సీట్లలో గెలుస్తుందని ఆ సర్వే తేల్చింది. అంటే, వేర్వేరుగా పోటీ చేసినా బీజేపీ గెలిచే స్థానాల సంఖ్య 2014 కన్నా 16 సీట్లు తక్కువే కావడం గమనార్హం. కాంగ్రెస్‌ను కాదని ఎస్పీ, బీఎస్పీలు మాత్రమే జట్టుకడితే ఆ కూటమి 33 స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకుంటాయని, 45 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. -
రైతులను దగా చేసిన కేసీఆర్: ఉత్తమ్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : చెరుకు, పసుపు రైతులను కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆర్మూర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు, నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామనే హామీలను కేసీఆర్, కవిత నెరవేర్చలేదని అన్నారు. తన మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా కేసీఆర్ చోటివ్వలేదని దుయ్యబట్టారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఉత్తమ్ వివరించారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసి, క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. ఎర్రజొన్నకు రూ.3 వేల మద్దతు ధర ఇస్తామన్నారు. నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామన్నారు. జీఎస్టీని సమీక్షించి బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వీఏఓలకు రూ.10 వేల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అరాచకాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మళ్లీ టీఆర్ఎస్ వస్తే.. పోలీస్ రాజ్యమే: కోదండరాం రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పడిపోకుండా ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదని తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసురాజ్యం వస్తుందని ఎద్దేవా చేశారు. నీళ్లడిగిన పాపానికి బాల్కొండలో 144 సెక్షన్ విధించారని అన్నారు. నిజాం ప్రభువులు దాశరథిని జైలులో పెడితే కేసీఆర్ రైతులపై కేసులు పెట్టించారన్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని అన్ని గ్రామాల రైతులు ఆదర్శవంతులని అన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో కూడా ఆదర్శవంతమైన సేద్యం చేస్తున్నారని చెప్పారు. ఉపాధి కోసం దుబాయ్ వంటి దేశాలకు వలస వెళుతున్నారని అన్నారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఈ వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ప్రజా కూటమి అధికారంలోకి వచ్చాక బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని వివరించారు. దేశానికి రాహుల్ నాయకత్వం అవసరం: గద్దర్ దేశానికి రాహుల్‌గాంధీ నాయకత్వం అవసరమని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. భారతదేశం భాగ్యసీమరా.. అనే పాటను పాడి వినిపించారు. దేశానికి కొత్త నాయకత్వం అవసరమని ఆకాంక్షించారు. తెలంగాణ దొరల పాలైందని, యాగంలో కాలిపోయిందని తన పాట రూపంలో విమర్శించారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ నాయకులు వి హనుమంత్‌రావు, మధుయాష్కి గౌడ్, మండలి విపక్ష నేత, కామారెడ్డి అభ్యర్థి షబ్బీర్ అలీ, మాజీ మంత్రి, బోధన్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, నిజామాబాద్‌రూరల్ అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘మీ ఆకాంక్షలు నెరవేరుస్తాం’
సాక్షి, శంషాబాద్ : ‘ప్రజాఫ్రంట్ గెలుపుతో మీ ఆకాంక్షలు నెరవేరుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా చేతకాని హామీలు ఇచ్చి మోసం చేయడం నాకు అలవాటులేదు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో కీలకపాత్రధారులైన మీ కో ర్కెలు సమంజసమైనవే’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రైవేటు విద్యా సంస్థలకు భరోసా ఇచ్చారు. కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా విద్యాసంస్థల పరిరక్షణ సదస్సుకు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యావేత్తలు, నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైంది కాద న్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాయడం మో దీకి, కేసీఆర్‌కు అలవాటేనన్నారు. ప్రజాఫ్రంట్ రాగా నే బకాయిలున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఆరోగ్య కార్డులు, బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యా సంస్థలకు విద్యుత్, ఆస్తిపన్ను బిల్లులు కూడా తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తానెప్పుడు కూడా అడ్డగోలుగా హామీలు ఇవ్వలేదని, ఇ చ్చిన హామీలకు మాత్రం కట్టుబడి ఉంటానని రాహు ల్ చెప్పారు. కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పక్కాగా అమలవుతున్నాయన్నారు. మీ మద్దతుతో కేసీఆర్‌లో వణుకు: ఉత్తమ్ తెలంగాణ సమాజానికి విద్యాసంస్థల సేవలు ఎనలేనివని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో భాగస్వాములుగా మిమ్మల్ని చూస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు ప్రజాఫ్రంట్‌కు మద్దతు పలకడంతో కేసీఆర్‌లో వణుకు మొదలైందన్నారు. నాలుగున్నరేళ్లుగా మిమ్మల్ని పట్టించుకోకుండా అవమానించిన కేసీఆర్ ప్రభుత్వానికి గోరీ కట్టాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు మద్దతు పలికే కేసీఆర్‌ను ఓటుతో శిక్షించాలన్నారు. ప్రజాఫ్రంట్ అధికారంలోకి రాగానే రెండు విడతల్లో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామన్నారు. నిరంకుశంగా వ్యవహరించింది: కోదండరాం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విద్యాసంస్థల పట్ల నిరంకుశంగా వ్యవహరించిందని టీజేఏస్ అధినేత కోదండరాం అన్నారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ విద్యాసంస్థల్లో పనిచేసే వారు అవమాన భారాన్ని మోసారన్నారు. ప్రభుత్వం తీరుతో 900 డిగ్రీ కళాశాలలు, 1,900 జూనియర్ కళాశాలలు, 2,500 పాఠశాలలు మూతపడి వేలాది మంది ఉపాధి కోల్పోయారన్నారు. ప్రజాఫ్రంట్ రాకతో విద్యా సంస్థల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. విద్యాసంస్థలు కోరుతున్న ఆమోదయోగ్య డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమని కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విద్యాప్రమాణాలు పడిపోవడంతో పాటు నిరుపేదలకు విద్య దూరమవుతుందన్నారు. సర్కారు స్కూళ్లను నడపడం చేతకాక ఈ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలపై పడిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మా మద్దతు ప్రజాఫ్రంట్‌కే.. అంతకుముందు కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ చైర్మన్ రమణారెడ్డి, కన్వీనర్ గౌరీసతీశ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాపిరెడ్డి, టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాఫ్రంట్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగున్నరేళ్లుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తమపైనే కేసీఆర్ కక్షగట్టి ఉద్యమ ద్రోహులైన కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారన్నారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, సభ్యులు వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్ అంటే.. ఖావో కమీషన్ రావు’
ఆర్మూర్‌లో.. నీళ్లు, నిధులు, నియామకాలు.. అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రాణహిత అంచనాలను రూ.50 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్లకు పెంచారు. కేవలం పేరు మార్చి రూ.40 వేల కోట్లు లూటీ చేశారు. ఈ రీ డిజైన్‌తో కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో పాత చెరువులకు రంగులద్ది నిధులు లూటీ చేశారు. కేసీఆర్.. ఖావో కమీషన్రావుగా మారారు. భూపాలపల్లిలో.. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ అభివృద్ధి నిరోధకులుగా మారారు. హిందుస్తాన్ ఏరోనాటికల్ను కాదని మోదీ అనిల్ అంబానీతో కలసి రూ.30,000 కోట్ల కుంభకోణానికి కారణమయ్యాడు. కేంద్రం కనిపించిన ప్రతి ప్రభుత్వ పరిశ్రమను ప్రైవేటీకరించాలని అనుకుంటోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసీఆర్ అవినీతే కనబడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తాం. ఒకే విడతలో రూ.2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తాం. పరిగిలో.. కేసీఆర్‌జీ.. మీరు విశ్రాంతి తీసుకోండి. అభివృద్ధి ఎలా చేయాలో మేం చేసి చూపిస్తాం. ఈ ఎన్నికల్లో ఓడితే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటా అని కేసీఆర్ అంటున్నారు. ఇది మంచిదే. కేసీఆర్ రెస్టు తీసుకుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. రూ.300 కోట్ల భవంతిలో ఆయన రెస్ట్ తీసుకుంటే 22 లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం. స్థలమున్న ప్రతి పేదోడి ఇంటి కోసం రూ.5 లక్షల సాయం అందిస్తాం. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి : నీళ్లు, నిధులు, నియామకాలు.. అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కె. చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రాణహిత అంచనాలను పెంచి రూ.40 వేల కోట్లు లూటీ చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. కేసీఆర్ అంటే.. ఖావో కమీషన్ రావ్ అని, ఆయన ప్రతిదాంట్లో కమీషన్ ముట్టనిదే పనులు చేయరని ఆరోపించారు. ప్రాజె క్టుల రీ డిజైన్‌తో కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో రూ.17 వే ల కోట్ల మిగులు వార్షిక బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈ నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో రూ.2.50 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రాహుల్ విమ ర్శించారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లా పరిగిలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగించారు. కేసీఆర్ లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్.. విశ్రాంతి తీసుకో.. ‘‘ఇటీవల కేసీఆర్ ఒక నిజమైన మాట చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటానన్నారు. మీరు విశ్రాంతి తీసుకుంటున్నది రూ.300 కోట్లతో నిర్మించుకున్న భవనంలో.. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం హామీని నెరవేర్చలేదు. రాష్ట్రంలో 22 లక్షల మందికి డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా, ఐదు వేల మందికి కూడా అందలేదు. దళితులు, ఆదివాసీలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న హామీని నెరవేర్చలేదు. నిజాం షుగర్స్‌ను తెరిపించేందుకు రూ.వంద కోట్లు ఇవ్వలేదు. నీవు విశ్రాంతి తీసుకుంటే అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ప్రజలు కలలుగన్న తెలంగాణ నిర్మిస్తానని, బంగారు భవిష్యత్ ఉంటుందని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను వంచించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు నిలిపివేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుంది. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి చెల్లిస్తుంది. ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కట్టిస్తాం’’అని రాహుల్ అన్నారు. తెలంగాణ ఆర్ఎస్ఎస్ పార్టీ.. ‘లోక్ సభలో, రాజ్యసభ సహా రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రధాని మోదీకి మద్దతిచ్చారు. దేశ ప్రజలను ఎన్నో కష్టాల పాల్జేసిన నోట్ల రద్దుకూ మద్దతు పలికారు. బీడీ కార్మికుల, యాజమాన్యాలకు నష్టం కలిగించిన జీఎస్టీని కేసీఆర్ కొనియాడారు. కేసీఆర్‌కు ఒకే లక్ష్యం ఉంది. తెలంగాణలో తన కుటుంబం, కేంద్రంలో మోదీ పరిపాలించాలని.. టీఆర్ఎస్ పేరుకు మరో ఎస్ జోడించాలి. టీఆర్ఎస్ఎస్ పార్టీ.. తెలంగాణ ఆర్ఎస్ఎస్ అని తేలింది. దేశం కోసం, తెలంగాణ కోసం మోదీ, కేసీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం విడిపోవాలి’అని కాంగ్రెస్ అధినేత పేర్కొన్నారు. భూసేకరణ చట్టాన్ని నీరుగార్చారు.. ‘కేసీఆర్ కనీసం రైతులనూ పట్టించుకోలేదు. భూసేకరణ చట్టాన్ని నీరుగార్చిన కేసీఆర్ రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. రైతుల అను మతి లేకుండా భూసేకరణ చేస్తే ఆ రైతుకు 4 రెట్ల పరిహారం చెల్లించాలనే చట్టంలోని నిబంధనలను తుంగలో తొక్కారు. రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మద్దతు ధర ఇవ్వాలని అడిగిన రైతులపై కేసులు నమోదు చేశారు. కేంద్రం లో అధికారంలోకి వచ్చాక పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం. క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున పసుపును కొనుగోలు చేస్తాం. ఉపాధి కోసం వలస వెళ్లే వారి కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తాం. జీఎస్టీని సమీక్షిస్తాం. జీఎస్టీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీడీ కార్మికులు, బీడీ కంపెనీల యాజమాన్యాల సమస్యలను పరిష్కరిస్తాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ దోకేబాజీ మాటలు చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద ప్రజల మాటలు వింటుంది. తెలంగాణలో టీఆర్ఎస్ను, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీని, కేంద్రంలోనూ మోదీ సర్కారును గద్దె దించాలి’అని పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో.. ఐదేళ్ల క్రితం ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ఏర్పడిందో అవి నేరవేరలేదని, ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తామని రాహుల్ అన్నారు. ‘రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ అభివృద్ధి నిరోధకులుగా మారారు. మోదీ హిందుస్తాన్ ఏరోనాటికల్ను కాదని అనిల్ అంబానీతో కలసి రూ.30 వేల కోట్ల కుంభకోణానికి కారణమయ్యాడు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకోవడం తప్పితే ఏంచేయలేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులను కేసీఆర్ సర్కార్ మోసం చేసింది. వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మహాకూటమి అ«ధికారంలోకి వచ్చిన తర్వాత డిస్మిస్ కార్మికులు, కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు వారి పిల్లలకు విద్య, ఆరోగ్యం తదితర అవసరాలను తీరుస్తాం. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాం’అని రాహుల్ హామీ ఇచ్చారు. గురువారం భూపాలపల్లిలో జరిగిన సభకు హాజరైన ప్రజలు, కార్యకర్తలు వచ్చేది మా ప్రభుత్వమే: ఉత్తమ్, టీపీసీసీ అధ్యక్షుడు డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. కార్మికుల పేర్ల సవరణ ఒక్క జీవోతో అయ్యే పనిని కూడా చేయలేదు. చెక్కులు లేవు.. బుక్కులు లేవు: కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన భూరికార్డుల పక్షాళనతో లేని సమస్యలు పట్టాదారులకు వచ్చాయి. అర్హులైన వేలాది మంది రై తులకు చెక్కులు, పాస్‌బుక్కులు రాలే దు. నాలుగేళ్ల కాలంలో ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అటవీశాఖ అధికారులు పోడు భూములను లాక్కున్నారు. తెలంగాణ సర్కారు చర్య తో రైతులకు ఉన్న హక్కులు పోయాయి. పరిగిలో కేసీఆర్‌జీ.. మీరు విశ్రాంతి తీసుకోండి.. అభివృద్ధి పనులు ఎలా చేయాలో మేం చేసి చూపిస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘వేలాది మంది ఆత్మబలిదానాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అడుగడుగునా వంచిచారు. చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం గొంతు నొక్కారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేవెళ్ల–ప్రాణహితను యథావి«ధిగా కొనసాగించి, సాగునీటిని అందిస్తాం. కేసీఆర్ అంటే.. ఖావో కమీషన్ రావుగా మారారు. ప్రతిదాంట్లో కమీషన్ ముట్టనిదే పనులు చేయరు. గురువారం పరిగిలో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభకు హాజరైన జనం అధికారంలోకి వచ్చాక గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం. టీఆర్ఎస్ నేతలు భూ మాఫియాగా తయారయ్యారు. మేము అధికారంలోకి వస్తే జల్, జంగల్, జమీన్ పేరిట గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తాం. ప్రధాని మోదీ దేశాన్ని తాకట్టు పెట్టాడు. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విభజిస్తూ పాలిస్తున్నాడు. కేసీఆర్ మోదీకి చెంచా, ఏజెంట్. టీఆర్ఎస్, ఎంఐఎంలు బీజేపీకి బీ, సీ టీంలు. అస్సాం, మహారాష్ట్రలో ఉనికి లేని మజ్లిస్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చేలా పోటీచేసి బీజేపీకి పరోక్షంగా సాయం చేస్తోంది. ఈ చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మేం అబద్ధపు వాగ్దానాలు చేయం. అలాంటి మాటలు వినాలంటే మోదీ, కేసీఆర్‌ల సభలకు వెళ్లవచ్చు. రాష్ట్రంలో ప్రజాకూటమి గెలవబోతుంది. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి చూపిస్తాం. ఈ సభలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, టీజేఎస్ అధినేత కోదండరాం, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, జిల్లాలో కూటమి నుంచి పోటీ చేస్తున్న టి.రామ్మోహన్‌రెడ్డి, జి. ప్రసాద్‌కుమార్, కె.ఎస్.రత్నం, పైలట్ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్‌పై చర్చకు సిద్ధం
సాక్షి, మహబూబాబాద్/ వరంగల్ రూరల్: విద్యుత్ కొనుగోలుపై చర్చకు తాము సిద్ధమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై తన వాదన తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ సగం ముక్కు కోస్తానని చెప్పారు. ‘‘మానుకోట సాక్షిగా సవాలు విసురుతున్నా.. దమ్ముంటే కేసీఆర్, ఆయన అనుచరులెవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి అదనంగా విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, వాస్తవాలు బయటపెట్టడానికి తాను చర్చకు సిద్ధమన్నారు. 2004లోనే ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అప్పటి ప్ర«ధాని మన్మోహన్సింగ్ అనుమతులు ఇచ్చారని.. దాని వల్లే ఉత్పత్తి ఎక్కువైందని, వినియోగం తగ్గిందన్నారు. 24 గంటల విద్యుత్ అవసరం లేకున్నా.. కేవలం కమీషన్ల కోసమే సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి లగడపాటి రాజగోపాల్‌తో, ఆంధ్రా కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కమీషన్లు దండుకుంటున్న దరిద్రుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఓడిపోతే విద్యుత్ సక్రమంగా రాదని.. చంద్రబాబు పెత్తనం ఉంటుందని.. ప్రతి విషయానికీ ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించి భయపెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ నల్ల త్రాచుపాములాంటోడని విమర్శించారు. పుట్టలో నుంచి వచ్చిన పాము మళ్లీ పుట్టలోకే పోతుందని (ఫాంహౌజ్) ఆ విషపు నాగును ప్రజలు పడగపై కొట్టి చంపాలన్నారు. మూడో కన్ను తెరుస్తావా? ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణలో అడుగుపెడితో మూడో కన్ను తెరుస్తానని కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఫాంహౌజ్‌లో కూర్చొని 14 పెగ్గులు తాగితే ఉన్న కళ్లు కూడా మూసుకుపోతాయని.. అలాంటి వ్యక్తి మూడో కన్ను గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. -
పిట్టల దొర డైలాగ్స్‌కు రాహుల్ జేజేలు!
సాక్షి, హైదరాబాద్ : చెప్పేవాడికి వినేవాడు లోకువ. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు ఈ సామెత సరిపోతుంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటుంటే.. ఖండించాల్సిన నేతలు మౌనముద్ర వహిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి్దకి మూలస్తంభాలైన ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తానే కట్టానని ఎన్నికల సభల్లో బాబు దబాయించి చెబుతున్నా.. కాంగ్రెస్ నేతలు కిమ్మనకుండా కళ్లప్పగించి చూస్తున్నారు. పైగా అవన్నీ నిజమే అన్నట్టుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తమ కొత్త మిత్రుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని నేనే చేశానంటూ బాబు హైజాక్ చేస్తున్నా.. వాస్తవాలు వివరించాల్సిన పార్టీ నేతలు చోద్యం చూస్తుండటంతో తట్టుకోలేకపోతున్నాయి. పైగా హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు ఇతోధిక కృషి చేశారంటూ రాహుల్ ప్రశంసలు కురిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికల సభల్లో వైఎస్సార్ పేరు ప్రస్తావించని రాహుల్.. ఆయన హయాంలో జరిగిన ప్రధానమైన అభివృద్ధి పనులను బాబు తన ఖాతాలో వేసుకుంటే అవునన్నట్లు ప్రశంసించడాన్ని చూసి తీవ్రంగా ఆవేదన చెందుతున్నాయి. వైఎస్సార్ హయాంలో మం త్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సైతం చంద్రబాబు అబద్ధ్దపు ప్రకటనలు చూసి విస్తుపోతున్నారు. రాహుల్ సమక్షంలో బాబు అబద్ధపు ప్రకటనలను అడ్డుకునే సాహసం చేయలేకపోతున్నామని ఓ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ప్రారంభమైందే 2005లో అయితే, దానికి చంద్రబాబుకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాహుల్, బాబు సంయుక్త ఎన్నికల సభలో పాల్గొన్న సదరు మాజీ మంత్రి.. బాబు అబద్ధాలను ప్రజలు హర్షించడం లేదని, ఆయన మాట్లాడుతున్న తీరు పరమ అసహ్యంగా ఉందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ పేరు కూడా ఉచ్చరించడానికే ఇష్టపడని చంద్రబాబు.. ఇప్పుడు ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనంటూ చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కచ్చితంగా నష్టం కలిగించే చర్యేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సైబరాబాద్‌లో ఒక్క సైబర్ టవర్ నిర్మాణం మాత్రమే చంద్రబాబు హయాంలో ప్రారంభమైనప్పటికీ.. వైఎస్ హయాంలో మొదలై పూర్తి చేసిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఐసీఐసీఐ నాలెడ్జ్ హబ్‌తో పాటు ఫైనాన్సియల్ డిస్ట్రిక్స్ నిర్మాణాన్ని తన ఖాతాలో వేసుకుంటూ అబద్దపు ప్రచారంతో ఓటర్లను చంద్రబాబు ఉదరగొడుతున్న తీరు కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. ఔటర్ రింగ్‌రోడ్డు భూసేకరణకు ఎన్నో అడ్డంకులు... దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఊపిరి పోసుకున్న ఔటర్ రింగ్ రోడ్డుకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీంతో వైఎస్ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించారని, ఈ సంగతిని చంద్రబాబు మర్చిపోయినట్లు నటిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రైవేట్ సంభాషణల్లో మండిపడుతున్నారు. నగరానికి నలువైపులా సుమారు రూ.6వేల కోట్లతో ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డుకు వైఎస్సార్ రూపకల్పన చేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో జనవరి 3, 2006న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అంతేకాదు.. మొదటి దశ 24.32 కిలోమీటర్ల నిర్మాణాన్ని కేవలం రెండేళ్లలోనే పూర్తిచేసిన ఘనత వైఎస్‌ది. గచ్చిబాలి–నార్సింగి–శంషాబాద్ ఎనిమిది లేన్ల రహదారిని నవంబర్ 14, 2008న జాతికి అంకితం చేశారు. అనంతరం దశలవారీగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తవుతూ వచ్చాయి. రెండేళ్ల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తన తాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు ఈ రోడ్డుకు పెట్టిన సంగతిని రాహుల్ విస్మరించారా లేదా బాబును బాధపెట్టడమెందుకని మౌనంగా ఉన్నారా అన్నది అర్థం కావడంలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మార్చి 16, 2005న అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన హైదరాబాద్‌కు మకుటాయమానంగా నిలిచిన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం శరవేగంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే వైఎస్సార్ కసరత్తు మొదలుపెట్టారు. అందుకు అనుగుణంగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మార్చి 16, 2005న యుపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అంతటితో వదిలేయకుండా అనుకున్న సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు స్వయంగా పలుమార్లు నిర్మాణంతీరును పర్యవేక్షించారు. రికార్డు సమయంలో విమానాశ్రయాన్ని పూర్తి చేయించి, మార్చి 14, 2008న అప్పటి యుపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. అదే రోజున శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేయించారు. అప్పటికి ఐదేళ్ల ముందే గద్దె దిగి, అంతకంటే ఆరేడు నెలలపాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఈ ఎయిర్‌పోర్ట్‌తో ఏ రకంగా సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తన తల్లి సోనియాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన విమానాశ్రయానికి తండ్రి రాజీవ్‌గాంధీ పేరు పెట్టిన విషయం రాహుల్‌కు గుర్తు లేదా లేక కావాలనే ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇస్తున్నారా అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అలాగే విమానాశ్రయం కనెక్టివిటీ కోసం మాసబ్‌ట్యాంక్ నుంచి ఆరాంఘర్ వరకు 11.633 కిలోమీటర్ల మేర దేశంలోనే అత్యంత పొడవైప ఫ్లై ఓవర్ వంతెనను నిర్మించిన ఘనమైన కీర్తి వైఎస్ ఖాతాలో ఉన్నప్పటికీ.. రాహుల్‌గాంధీ విస్మరించడం ఆశ్యర్యం కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేవలం ఏడాదిన్నరలోనూ ఈ ఫ్లై ఓవర్ పూర్తిచేసి, అక్టోబర్ 19, 2009న జాతికి అంకితం చేశారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఐఐటీ, బిట్స్.. వైఎస్ చలువే ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు కావడానికి వైఎస్ ఎంతో చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే ఆయన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను ఒప్పించి హైదరాబాద్‌కు ఐఐటీ తీసుకొచ్చారు. చంద్రబాబు తన హయాంలో బాసరకు ఐఐటీ అంటూ ఊరిస్తూ వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకభాగస్వామిగా ఉన్నప్పటికీ, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు సాధించలేకపోయారు. ఇప్పుడేమో హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని అబద్దాలు చెపుతుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఐటీ అభివృద్దికి చర్యలెన్నో... సైబరాబాద్ నిర్మించింది తానేనని చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నప్పటికీ, వాస్తంగా జరిగింది వేరు. చంద్రబాబు హయాంలో ఒక్కసైబర్ టవర్స్ మినహా మరేమీ నిర్మాణం కాలేదు. అక్కడ హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు తన అనుయాయుల చేత కారుచౌకగా స్థలాలు కొనిపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ఎగుమతుల మొత్తం విలువ 28.75 మిలియన్ డాలర్లు మాత్రమే. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యే నాటికి 2008–09లో ఏపీ నుంచి ఎగుమతి అయిన ఐటీ ఉత్పత్తుల విలువ ఏకంగా 5.1 బిలియన్ డాలర్లు. బాబు దిగిపోయేనాటికి హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు 19 ఉండగా.. ఉద్యోగుల సంఖ్య 56 వేలు మాత్రమే. అదే వైఎస్ మొదటి టర్మ్ పూర్తయిన 2008–09 నాటికి 69 కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఏకంగా 2.52 లక్షల మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించారు. 2008–09లో ఏపీలో ఐటీ ఎగుమతుల వృద్ది రేటు 24.5 శాతం ఉండగా జాతీయ వృద్దిరేటు 20.7 శాతం మాత్రమే. ఐటీని ఒక్క ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌కు పరిమితం చేయకుండా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని పోచారంలో ఇన్ఫోసిస్‌కు 450 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు ఆ క్యాంపస్‌లో 11 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైఎస్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విస్మరించడమే కాకుండా.. ఆ అభివృద్ధి పనులను తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబును ప్రశంసించడం శోచనీయమని అభిప్రాయపడుతున్నారు. ‘చంద్రబాబు ప్రచారానికి వస్తే నెగెటివ్ అవుతుందని చెప్పాం. అయినా పార్టీ నాయకత్వం వినలేదు. తీరా ప్రచారానికి వచ్చి మాకు మరింత నష్టం చేసి వెళ్లాడు’అని ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్‌ను గుర్తుచేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని అభిప్రాయపడ్డారు. -
పల్లె, పట్నం కలగలుపు ఎవరిదో తుది గెలుపు?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా.. రాష్ట్రంలో ఏ కొత్త పార్టీ ఏర్పాటైనా అంకురార్పణ జరిగేదిక్కడే. మారుతున్న రాజకీయ పరిస్థితులను, అనివార్యతలను అర్థం చేసుకొని ముందుకెళ్లే ఈ జిల్లా ప్రజానీకమే ప్రభుత్వ ఏర్పాటుకు దిక్సూచి. రియల్ ఎస్టేట్, పారిశ్రామికాభివృద్ధితో రాష్ట్రంలోని సగానికిపైగా ఆర్థిక సంపద ఉండేదీ.. ప్రయాణ సౌకర్యం సైతం లేని వెనుకబడిన పల్లెలు ఉండేదీ ఇక్కడే. నగర, గ్రామీణ ఓటర్ల కలబోతతో మిశ్రమ రాజకీయ వ్యూహాలను ప్రస్ఫుటించే ఈ జిల్లాకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఇక్కడి ప్రజల తీర్పే కీలకం. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ పితామహుడిగా పేరుగాంచి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి వంటి ప్రముఖులు ఈ జిల్లావాసులే. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో రంగారెడ్డి జిల్లాది ప్రత్యేక స్థానం. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీచినా రంగారెడ్డిలో నామమాత్రమే. ఉమ్మడి రంగారెడ్డిలో 14 నియోజకవర్గాలు ఉంటే అందులో 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈసారి పరిస్థితి మారింది. గతంలో టీడీపీ నుంచి గెలిచిన వారు ఇపుడు టీఆర్ఎస్ తరపున బరిలో దిగితే, గతంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రమే ఇప్పుడు పోటీలో ఉన్నారు. జిల్లాలోని 7 గ్రామీణ నియోజకవర్గాలపై గ్రౌండ్ రిపోర్ట్.. తాండూరు: సై అంటే సై టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్యే ప్రధాన పోటీ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం. నారాయణ్రావుపై 16,074 ఓట్ల మెజారిటీతో మహేందర్‌రెడ్డి గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్లో చేరి మహేం దర్‌రెడ్డి పోటీలో దిగారు. దీంతో అప్పటి వరకు టీఆర్ఎస్లో ఉన్న రోహిత్‌రెడ్డికి అవకాశం రాలేదు. ఆ ఎన్నికల తర్వాత యంగ్ లీడర్స్ సంస్థ తరపున స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టిన పైలెట్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరి, కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే మహేందర్‌రెడ్డి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, పైలెట్ రోహిత్‌రెడ్డి మొదటిసారి బరిలో దిగారు. ఇక బీజేపీ తరపున పటేల్ రవిశంకర్ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ టీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మహేందర్‌రెడ్డి ముందుకు సాగుతుంటే.. నియోజవకర్గంలో తాను చేసిన సేవా కార్యక్రమాలు, గ్రామ గ్రామాన వివేకానంద విగ్రహాల ఏర్పాటు, యువత రాజకీయాల్లో రావాలంటూ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న భరోసాతో రోహిత్‌రెడ్డి ఉన్నారు. చేవెళ్ల: కాంగ్రెస్ – టీఆర్ఎస్ పోటాపోటీ మాజీ హోం మంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి గతంలో ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలు పొందారు. ఆయన మరణానంతరం భార్య సబిత ఇక్కడి నుంచి ఎన్నికై వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో హోం మం త్రిగా పని చేశారు. 2009లో ఈ స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో కేఎస్ రత్నం (టీడీపీ).. యాదయ్య (కాంగ్రెస్)పై గెలు పొందారు. 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కాలే యాదయ్య.. కేఎస్ రత్నం (టీఆర్ఎస్)పై 781 ఓట్ల మెజారిటీతో గెలు పొందారు. ఈసారి యాదయ్య టీఆర్ఎస్ నుంచి.. రత్నం కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని యాదయ్య.. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన కేడర్, కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తి తనను కలిసొస్తాయని రత్నం నమ్మకంతో ఉన్నారు. కంజర్ల ప్రకాష్ (బీజేపీ), సునీల్‌కుమార్ (బీఎస్పీ) కూడా పోటీలో ఉన్నారు. పరిగి: ఇద్దరి మధ్యే పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి బరిలో నిలవగా, టీఆర్ఎస్ నుంచి రాజకీయ కురువృద్ధుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కుమారుడు మహేశ్‌రెడ్డి తొలిసారి పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, తన తండ్రి రాజకీయ అనుభవం, తన సతీమణి ప్రచార సరళి, పార్టీ కేడర్ బలంగా ఉండటంతో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిలో గెలుపు ధీమా కనిపిస్తోంది. వివాదరహితునిగా ఉన్న పేరుకు తోడు సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేకత తనను గెలిపిస్తాయన్న ధీమాతో తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. సాగునీటి సమస్య పరిష్కారంలో ప్రభుత్వ తాత్సారం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న 300 వరకు తండాల్లోని ఓట్లు కీలకం కానున్నాయి. గుడుంబా అమ్మకాల కేసుల నమోదుపై వీరిలో వ్యతిరేకత ఉంది. వేల మందిపై కేసులు ఉంటే 160 మందికి మాత్రమే పునరావాసం కల్పించడంపై ఎస్టీల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. బహుజన్ ముక్తి పార్టీ నుంచి పోటీలో ఉన్న గట్లానాయక్ ఎస్టీల ఓట్లను కొంత మేర చీల్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌రావు యువతను తమవైపు తిప్పుకోవడంతో ఈసారి ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరగచ్చు. మహేశ్వరం : సబిత వర్సెస్ తీగల తాజా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (టీఆర్ఎస్), ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) ఇక్కడ పోటీలో ఉన్నారు. తీగలకు వివాదరహితునిగా పేరున్నా ఆయన హయాంలో నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రచారం పూర్తి చేసిన కృష్ణారెడ్డి మూడోసారి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్న భరోసాతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటుబ్యాంకు, గతంలో ఎమ్మెల్యేగా తను చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయన్న ధీమాతో సబిత ఉన్నారు. వ్యక్తిగత ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తాయని ఆమె భావిస్తున్నారు. ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ కూడా అలుపు లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. వికారాబాద్: ముగ్గురి మధ్య ఉత్కంఠ పోరు వికారాబాద్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పార్టీ.. టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్ ఇవ్వకుండా డాక్టర్ మెతుకు ఆనంద్‌కు అవకాశమిచ్చింది. మరోవైపు ఎ.చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులు గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఇవ్వడంతో చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ క్రమంలో సంజీవరావు కూడా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి చంద్రశేఖర్ తరపున ప్రచారం చేస్తుండటంతో రాజకీయం రసకందాయంలో పడింది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కంటే కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులే ప్రచారంలో ముందున్నారు. ప్రధాన పోటీ వారిద్దరి మధ్యే ఉంది. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా, విద్యావేత్తగా చంద్రశేఖర్‌కు పేరుంది. ఆయన విద్యా సంస్థల్లో పిల్లలను చదివించిన ప్రతి గ్రామంలో అనేకమంది తల్లిదండ్రులతో పరిచయాలు ఉండటం తనకు మేలు చేస్తుందని ఆయన భావిస్తున్నారు. అలాగే, తన విద్యాసంస్థల్లో చదివే పిల్లల ఫీజుల విషయంలో ఆయన సానుకూలంగా ఉండేవారనే పేరుంది. ఇక నియోజకవర్గంలో ప్రజలందరికీ పాస్ బుక్కులు, రైతుబంధు చెక్కులు అందకపోవడం, అసంతృప్తి తనను గెలిపిస్తాయని కూటమి తరఫున పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్‌కుమార్ భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు తనను బయట పడేస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం: చీలే ఓటు.. ఎవరికో లాభం? ఇబ్రహీంపట్నంలో తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (టీఆర్ఎస్), టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి (ప్రజా కూటమి) పోటీ పడుతున్నారు. ఈ స్థానాన్ని ఆశించిన కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున పోటీలో దిగారు. సామ రంగారెడ్డి ప్రచారంలో కొంత వెనుకబడ్డారు. ప్రధాన పోటీ మల్రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మధ్యే ఉంది. గతంలో ఓడిపోయారన్న సానుభూతి మల్‌రెడ్డికి కొంత ఉంది. ఆ సానుభూతితోపాటు తన హయాంలో చేసిన అభివృద్ధి తనకు మేలు చేస్తుందని, మరోవైపు బలమైన కాంగ్రెస్ పార్టీ కేడర్ తన గెలుపునకు దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ హవా కలిసివస్తాయని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన క్యామ మల్లేష్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు కొంత వరకు మారాయి. కాంగ్రెస్ పార్టీలోని మల్లేశ్ వర్గం ఓట్లు మల్‌రెడ్డికి పడతాయా? కిషన్‌రెడ్డికి పడతాయా? అన్నది ఆసక్తికరం. రంగారెడ్డి మాత్రం 2.5 లక్షల ఓట్లలో సగం ఓట్లు కలిగిన హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలపై దృష్టిపెట్టి ప్రచారం చేస్తున్నారు. పగడాల యాదయ్య (బీఎల్ఎఫ్) మంచాల మండలంలో కొన్ని ఓట్లు చీలుస్తారని అంచనా. చివరకు చీలిక ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. మేడ్చల్: ముగ్గురి హల్చల్ మేడ్చల్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఓటర్లను ప్రభావితం చేసే అభ్యర్థులు నలుగురు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే ఉంది. టీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ తరఫున కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నక్క ప్రభాకర్‌గౌడ్ బీఎస్పీ నుంచి పోటీకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఇక్కడ టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన వర్గీయులు సహకరించే పరిస్థితిని బట్టి టీఆర్ఎస్ గెలుపోటములు ఉండనున్నాయి. ప్రభాకర్‌గౌడ్ కారణంగా టీఆర్ఎస్ ఓట్లు కొంత చీలే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లారెడ్డి కొన్ని మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆయనకు ప్రధాన ప్రచారాస్త్రాలు కాగా ఉద్యోగుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత తనకు మేలు చేస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి భావిస్తున్నారు. ‘రంగారెడ్డి’.. మదిలో ఏముంది? ► పరిగి, చేవెళ్లకు సాగునీటి సదుపాయం.. 2.70 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం ► వికారాబాద్–పరిగి–కొడంగల్–మక్తల్ రైల్వే లైన్ ఏర్పాటు ► తాండూరు నాపరాయి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వైద్య సదుపాయం ►వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్లో కలపడం.. ► జిల్లా కేంద్రం వికారాబాద్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడం.. రోడ్ల విస్తరణ.. రూ.3 వేల కోట్లతో శాటిలైట్ టౌన్ ఏర్పాటు.. ► హైదరాబాద్ చుట్టూ విస్తరించిన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో గల ఉద్యోగుల ఐఆర్ విషయం ప్రస్తావన.. ►మూడో దశలో కృష్ణా జలాలను ఇబ్రహీంపట్నం చెరువుకు తరలించి వ్యవసాయానికి సాగునీటిని అందించడం ► మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం. రైతులు, వలస కార్మికులు, ఉద్యోగులే కీలకం జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గాలైన తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చెల్‌లో రైతులు, వలస కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగుల ఓట్లే కీలకం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాధారిత వ్యవసాయం ప్రధానా«ధారమైతే.. సెమీ అర్బన్‌లో వలస కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులే అత్యధికం. వారే ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తుంటారు. తాండూరు కంది పంట, నాపరాయి, సిమెంటు పరిశ్రమకు కీలకమైతే పరిగి, వికారాబాద్, చేవెళ్ల పూర్తిగా వ్యవసాయాధారిత నియోజకవర్గాలే. ఇక మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ నియోజకవర్గాలు సెమీ అర్బన్. ఇక్కడ రియల్ ఎస్టేట్, వలస కార్మికులు, ఉద్యో గుల ఓట్లే గెలుపోటములను నిర్ధారించనున్నాయి. ఈసారి ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో సాగునీటి వసతి కల్పన, విద్య, వైద్య సదుపాయం వంటి హామీలే కీలకం కానున్నాయి. వికారాబాద్, పరిగి వరకు వచ్చేలా డిజైన్ చేసిన ప్రాణహిత–చేవెళ్లను రీడిజైన్‌లో పరిమితం చేసి, పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని ఇస్తామన్న ప్రభుత్వం కేటాయింపులే జరపలేదని రైతులు అంటున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ఎక్కువ మంది తమకు ఐఆర్ ఇవ్వకపోగా, ఎక్కువ వేతనాలు ఉన్నాయంటూ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆదుకుంటారని ఎదురుచూపు ఇతని పేరు వెంకటయ్య. చేవెళ్ల నియోజకవర్గం ద్యామెరగిద్దె గ్రామం. గొర్రెలను పెంచుతూ జీవనం గడుపుతున్నాడు. అయితే తను యాదవుడిని కాకపోవడంతో గొర్రెలు ఇవ్వలేదని, ఒకవేళ ఇచ్చి ఉంటే తన జీవనం మరోలా ఉండేదని అంటున్నాడు. అలాగే, తనకు పెన్షన్ మంజూరు చేస్తే.. ఈ వయసులో ఆసరాగా ఉంటుందని అన్నాడు. కౌలు రైతులకు సహాయం చేయాలి రైతుబంధు డబ్బు వచ్చింది. అయితే మాకు కొద్దిగానే భూమి ఉంది. కాబట్టి తక్కువ మొత్తం వచ్చింది. ప్రభుత్వం కౌలు చేసుకునే రైతులకు కూడా రుణమాఫీ లేదా మరో రూపంలో ఆర్థిక సహాయం అందిస్తే బాగుంటుంది. ఈ విషయం సర్కార్ ఆలోచించాలి. – అజ్మీర్, పరిగి పెంచిన పెన్షన్ ఆదుకుంటోంది ప్రభుత్వం పెన్షన్‌ను పెంచడం వల్ల ఇబ్బందులు తగ్గాయి. అంతకుముందు రూ. 200 ఉన్నపుడు ఖర్చులకు సరిపోయేవి కావు. ఈ ప్రభుత్వం పెన్షన్‌ను పెంచి ఇవ్వడం వల్ల ఎవరినీ డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండాపోయింది. ఎకరానికి రూ. 4 వేలు ఇవ్వడం కూడా ఎంతో ఉపయోగపడుతోంది. – కుమ్మరి పాపయ్య, కేసారం ఇల్లు కావాలె.. నేను ఒంటరిని. పిల్లలు ఎవరూ లేరు. ఒక్క దానినే కిరాయి ఇంట్లో ఉంటున్నా.. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం ఇల్లు ఇస్తదని చూస్తున్నా. ఇప్పుడైనా ఇస్తరా?. గతంలో పెన్షన్ వచ్చినా డబ్బులు సరిపోయేటివి కావు. ఇప్పుడా ఇబ్బంది లేదు. – బుగ్గమ్మ, ఆగపల్లి, మంచాల మండలం రైతుబంధుతో ఎంతో ఉపయోగం రైతుబంధు పథకం కింద మొదటి విడత డబ్బు వచ్చింది. పెట్టుబడి సమయంలో ఉపయోగపడ్డాయి. అయితే మండలంలో అందరికి పాస్ పుస్తకాలు రాలేదు. వాటిని వెంటనే ఇచ్చి, అందరికి పథకం ద్వారా మేలు చేయాలి. ఎన్నికల్లో మమ్మల్ని పట్టించుకునే అభ్యర్థులకే ఓట్లు వేస్తాం. 2014లో గెలిచిన ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలేదు. – పుణ్యానాయక్, వికారాబాద్ ఇల్లు కట్టిస్తే మేలు పేదలకు త్వరగా ఇళ్లు మంజూరు చేయాలి. గతంలో నాకు ఇల్లు మంజూరైనా మధ్యలోనే ఆగిపోయింది. ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె చెల్లించేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇందిరమ్మ ఇల్లు కాకపోయినా మరో పథకం పేరుతో అయినా ఇళ్లను మంజూరు చేయాలి. – దస్తప్ప, కరన్‌కోట్ -
మోదీ రాకతో విపక్షాలకు భయం
సాక్షి, నారాయణపేట రూరల్ : తెలంగాణ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ ప్రచారానికి రావడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల్లో ఓటమి భయం పట్టుకుందని కర్ణాటక రాష్ట్రం సేడెం బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ అన్నారు. నారాయణపేటలో బుధవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. దేశ రాజకీయాల్లోకి మోదీ వచ్చిన తర్వా త కాంగ్రెస్‌కు ఎక్కడాడ స్థానం లేకుండా పోతోందన్నారు. ఈక్రమంలో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడంతో ఇక్కడ తమ ఉనికి కోల్పో తామని వారికి భయం చుట్టుకుందని అన్నారు. ఉద్యమ సానుభూతితో అధికారం చేపట్టిన కేసీఆర్ సైతం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయకుండా కనీసం మేనిఫెస్టోను అమలు చేయకుండా ముందస్తుకు పోవడం గర్హనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉజ్వల యోజన, జనప్రియ యోజన, జాతీయ రహదారుల ఏర్పాటు, ఇండ్లు, ముద్రా బ్యాంక్‌తో పాటు ఆయుష్మాన్ భారత్‌తో దేశ వ్యాప్తంగా 50కోట్ల మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కాగా, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కానుందని.. తమ పార్టీ అభ్యర్థులు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీట్లలో నారాయణపేట ఒకటని, రతంగపాండురెడ్డికి తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని రాజ్‌కుమార్ పాటిల్ తెలిపారు. ప్రచారానికి ప్రముఖులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న దామరగిద్దకు పరిపూర్ణానందస్వామి రానున్నారని రాజ్‌కుమార్ తెలిపారు. డిసెంబర్ 2న నారాయణపేటకు అమిత్‌షా వస్తున్నారన్నారు. యాద్గీర్ జెడ్పీ మాజీ చైర్మన్ శరణ్‌భూపాల్‌రెడ్డి, రతంగపాండు రెడ్డి, ప్రభాకరవర్ధన్, బోయలక్ష్మణ్, రఘువీర్‌యాదవ్, రఘురామయ్యగౌడ్, వినోద్ పాల్గొన్నారు. -
చంద్రబాబు మెడలో కాంగ్రెస్ కండువా!
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో అయితే రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో.. ఆ పార్టీ కండువాను దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కప్పుకున్నారు. మహాకూటమి పుణ్యమా.. కాంగ్రెస్‌తో జతకట్టిన చంద్రబాబు.. బుధవారం సనత్‌నగర్‌లో జరిగిన ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాభవానీ అనే మహిళా నేత చంద్రబాబుకు కాంగ్రెస్ కండువా కప్పారు. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. నేడు ఆ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్-టీడీపీలు కలిసాయని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్తు కోసం మహాకూటమిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి.. కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చిన చంద్రబాబే.. ఇప్పుడు ఆపార్టీని గెలిపించమని, బీజేపీని ఓడగొట్టాలని చెబుతుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. చదవండి: బాబు మనస్సులోని మాట.. మహాకూటమిలో జనసేన -
కేసీఆర్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదు!
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదని, తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్ని రకాలుగా సహకరిస్తానని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. తాను ఎక్కడున్నా తెలంగాణ ప్రియమైన ప్రాంతమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఎందుకు దూషిస్తున్నాడో అర్థం కావడం లేదని చెప్పారు. హైదరాబాద్ కట్టలేదు.. కానీ సైబరాబాద్ నిర్మించినట్టు చెప్పుకున్నారు. కాంగ్రెస్-టీడీపీ కలయిక చారిత్రక అవసరమని చెప్పారు. ఖమ్మం పట్టణంలో బుధవారం మహాకూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రజా గాయకుడు గద్దర్, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ, టీ కాంగ్రెస్ నేతలతో చంద్రబాబు ఈ సభలో వేదిక పంచుకున్నారు. గద్దర్ పాట పాడి సభలో ఊపు తెచ్చారు. ఈ సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గత నాలుగున్నరేళ్లుగా దోపిడీ జరిగిందనివిమర్శించారు. నిరంకుశ కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకే టీడీపీ పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకుందని చెప్పారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని, ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని, రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. -
కేసీఆర్‌ను ఊడగొడితే లక్ష ఉద్యోగాలు
సాక్షి, భూపాలపల్లి/గంగాధర (చొప్పదండి): కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో, కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్కు ఒకసారి అవకాశం ఇచ్చి మోసపోయాం. మరోసారి అవకాశం ఇస్తే ఐదేళ్లపాటు గోస తప్పదు..’అని హెచ్చరించారు. మందేసి మోటార్ సైకిల్ నడిపితే కేసులు అవుతున్నాయని, అలాంటిది కేసీఆర్ మందేసి రాష్ట్రాన్ని నడుపుతున్నాడని తీవ్రంగా విమర్శించారు. ప్రజాకూటమి గెలిస్తే ప్రజలు గెలిచినట్టని, కేసీఆర్ గెలిస్తే తెలంగాణ ఓడినట్లు అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. దేశంలో అధిక ఆదాయం కలిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్లలో అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ఇంటికి నల్లా నీరు, ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ ఊరికో కోడిని, ఇంటికో ఈక ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. దళిత, గిరిజనులకు మూడెకరాలు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. గిరిజనులను లాఠీలతో కొట్టించిన చరిత్ర టీఆర్ఎస్దేనని రేవంత్ విమర్శించారు.పాజెక్టులన్నీ ప్రారంభించింది కాంగ్రెసే అన్నారు. 106 సీట్లు వస్తాయని చిలుక జోస్యం చెబుతున్న కేసీఆర్.. ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని, అధికారంలో కొచ్చాక వారికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వందరోజుల్లో రుణమాఫీ : మహాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. పేదలైన ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామని, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష ఉచితంగా ఇవ్వడంతో పాటు పది లక్షల వరకు రుణాలు అందిస్తామని చెప్పారు. రాబోయే ప్రభుత్వంలో సీతక్క కీలకపాత్ర రాబోయే మçహాకూటమి ప్రభుత్వంలో సీతక్క కీలకపాత్ర పోషిస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. ములుగులో సాటి గిరిజనుల ఇళ్లు కూల్చి వారు రోడ్డుపాలైతే రాక్షసానందాన్ని పొందిన వ్యక్తి మంత్రి చందూలాల్ అని ధ్వజమెత్తారు. అలాగే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మహాకూటమి అభ్యర్థి మేడిపల్లి సత్యంను గెలిపించాలని ఆయన కోరారు. -
కాంగ్రెస్‌ని నిండా ముంచిన ‘కూటమి’
మహాకూటమి పేరుతో తెలంగాణలో చంద్రబాబు టీడీపీతో పొత్తుకు సిద్ధమైన క్షణమే కాంగ్రెస్ సరికొత్త స్థాయిలో పరాభవం కొని తెచ్చుకున్నదనిపిస్తోంది. కేసీఆర్ చేతికి అనుకోని విధంగా ఆయుధాన్ని అందించి వ్యూహాత్మకంగా తప్పు చేసిన కాంగ్రెస్‌ను తెలంగాణలో మరెవ్వరూ బొంద పెట్టవలసిన అవసరం ఉన్నట్లు లేదు. రెండో దఫా కూడా అధికారాన్ని ఆశిస్తున్న కేసీఆర్‌కు టీడీపీ, కాంగ్రెస్ కలయిక రూపంలో యజ్ఞఫలం సిద్ధించినట్లేనని స్పష్టమవుతోంది. ఇక ఇంటగెలవకున్నా రచ్చ గెలవాలనుకుంటున్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో బలం లేని బీజేపీతో, మోదీతో ఢీ అంటూ లేని శత్రువుతో గాల్లో యుద్ధం చేస్తూ అభాసుపాలవుతున్నారు. ఇంతమాత్రం ఇంగితజ్ఞానం లేకుండా కాంగ్రెస్ వ్యవహరించగలదా? ఇటీవలి మేడ్చల్‌లో జరిగిన బహిరంగసభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రసంగాలను చూసిన తర్వాత నాలో మెదిలిన సందేహం ఇదే! నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే తెలంగాణ సాధనలో తెరాసది మాత్రమే కాదు తమదీ ముఖ్యమైన పాత్రేనని, కాంగ్రెస్ ఇలాంటి సభలు ఆత్మవిశ్వాసంతో నిర్వహించినట్లయితే, మరింతగా ఆ పార్టీ తెలంగాణ జనజీవన స్రవంతిలో ఉండి ఉండేదనిపించింది. కానీ ఈ మేడ్చెల్ సభ చూసిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నట్లు రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు 100 సీట్ల వరకు సాధించి, తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడం అనివార్యం అనిపిస్తోంది. కేసీఆర్‌కి ప్రజల్లో మమేకమై, వారిని ఆలోచింపజేసి, తమ వెంట నడిపించగల ప్రజల మనిషిగా కొత్తగా నిరూపించుకోవలసిన అవసరం లేదు. అయినా ఆయన చేతికి అనుకోనివిధంగా ఆయుధాన్ని అందించి, ఆత్మహత్యా సదృశమైన కూటమిని అది కూడా చంద్రబాబు తెలుగుదేశంతో కలిసి ఏర్పాటు చేసి, కాంగ్రెస్ పార్టీ సరికొత్త స్థాయిలో పరాభవం కొని తెచ్చుకున్నదని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. చంద్రబాబుతో కూటమి కట్టకుండా ఉండివున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇంత అవమానాన్ని మూటగట్టుకుని ఉండేది కాదేమో! రేవంత్ రెడ్డి వంటి చంద్రబాబు నమ్మినబంటు తమలో చేరినప్పుడే కాంగ్రెస్ పార్టీ తనలోకి ఒక ట్రోజన్ హార్స్ (పంచమాంగదళం) వచ్చి చేరినట్లు గ్రహించలేకపోయింది. ఈ స్థితిలో కాంగ్రెస్‌ను తెలంగాణలో వేరెవ్వరూ బొంద పెట్టవలసిన అవసరం ఉన్నట్లు లేదు. కేసీఆర్ ‘యజ్ఞయాగాదుల’ ద్వారా ఆశించిన విజయానికి చంద్రబాబు తెలుగుదేశం, కాంగ్రెస్‌ల కలయిక రూపంలో ఫలం సిద్ధించినట్లే! అయినా చంద్రబాబుకు మాత్రం వేరే మార్గం ఏముంది? తన తెలుగుదేశాన్ని జాతీయపార్టీగా ప్రకటించుకున్న దుర్ముహూర్తం ఏమిటో గానీ చివరకు ప్రాంతీయపార్టీ పేరు కూడా నిలవడం కష్టంగా మారుతోంది. తెలంగాణలో పాపం.. అన్నెం పున్నెం ఎరుగని సుహాసినిని (నందమూరి హరికృష్ణ కుమార్తె) తన కుట్ర నీతిలో భాగంగా ఎన్నికల బరిలోకి దింపడమే చంద్రబాబు అతితెలివి రాజకీయాలు అని అందరూ గ్రహించే ఉంటారు. పైగా తన జాతీయ తెలుగుదేశం పార్టీ అధికారం చివరి ఘడియలోకి వచ్చిందన్న గ్రహింపు ఆయనకు ఎప్పుడో వచ్చింది. 2014లో మాదిరి మోదీ భజనకు ప్రస్తుతానికి వీలులేదు. ఇక ఇంట్లో ఈగల మోతను భరించలేక, ఇతర రాష్ట్రాలలో తానేదో చక్రం తిప్పుతున్నట్లు ఫోజు కొడుతూ మోదీ దుష్పరిపాలనకు వ్యతిరేంగా తానేదో కొత్తగా దీక్ష పూని ఆ కృషిలో నిమగ్నమైనట్లుగా రాష్ట్రం బయట తిరుగుతున్న చంద్రబాబును చూస్తే స్వయంకృతంగా తెచ్చుకున్న ఈ దయనీయ స్థితి జాలిగొల్పే స్థాయిలో ఉంది. ఆత్మస్తుతి ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే అయినా, ఇటీవలికాలంలో బాబుకు అదే ఊపిరి అయిపోయింది. హైదరాబాద్‌ను నేనే కట్టాను, ప్రపంచపటంలో దాన్ని నేనే నిలిపాను అంటూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన తరుణంలోనూ కేసీఆర్‌పై ప్రతిసవాళ్లకు దిగి అవికూడా పనిచేయని స్థితిలో తాను ప్రపంచ పటంలో నిల్పిన ఆ హైదరాబాద్‌నే వదిలి అమరావతికి వెళ్లిపోయాడు. ప్రజలకు దగ్గర్లో ఉండాలని నూతన రాజధాని నిర్మించుకుందామని వచ్చానని చెప్పుకున్నా, అసలు కారణం వేరే ఉంది. ఏదో సినిమాలో రేలంగిని ‘ఇంత పెద్ద బిల్డింగ్ కట్టావు ఎట్లా?’ అని అడిగితే ‘ఆ, ఏముంది ఇద్దరికి రెండు మేడలు కట్టించాను. నాకు ఒక బిల్డింగ్ మిగిలింది’ అంటాడు. అయినా రాజధాని నిర్మాణం అని, పోలవరం అనీ ఏదో ఒక పని చేయకపోతే తనకూ, తన అనుయాయులకూ పైసలెలా వస్తాయి? ఇప్పటికే పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకంలోనే వందల కోట్లు మిగుల్చుకున్నారు. ఇక పోలవరం పేరుతో వేలకోట్ల రూపాయలు మిగుల్చుకునేందుకే సినిమా సెట్టింగ్ మాదిరిగా పోలవరం నిర్మాణం సాగుతోంది. ఇప్పడు చావుకబురు చల్లగా చెప్పినట్లు గతంలో చేసిన వాగ్దానం మేరకు వచ్చే ఏడాది జూన్‌నాటికి పోలవరం సాధ్యం కాదని తాజాగా చెబుతున్నారు. రాజ ధాని భూసేకరణ, సమీకరణ, విశాఖ భూకుంభకోణం ఇలా ఎక్కడ భూమి కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్న బాబునూ, ఆయన అనుచరగణాన్నీ చూస్తే పురాణాల్లో భూమిని చాపగా చుట్టి చంకన పెట్టుకుని పోదామనుకున్న హిరణ్యకశిపుని సోదరుడూ హిరణ్యాక్షుడు గుర్తుకు రావడం లేదు. దీనికి తోడు అక్రమసంపాదన యావతో చంద్రబాబు తన చుట్టూతా సుజనా చౌదరి వంటి (లేటెస్టు ఆంధ్రా మాల్యా) వారిని బినామీలుగా చేసుకుని తెలుగు నేల కనీవినీ ఎరుగని అవినీతి, అక్రమార్జన బాగోతం దేశవ్యాప్తంగా తెలిసిందే కదా! ఇక ఈయన చక్రం తిప్పి మోదీని ఎదిరిస్తాను అంటూ కూట ములూ, బూటకపు సంఘటనలూ కడుతున్నారు. వాస్తవంగా ఏం జరుగుతోంది? వచ్చి కలుస్తాను అని పదిసార్లు కబురెడుతుంటే రమ్మనక ఏంచేస్తాం అంటూ డీఎంకే నేత స్టాలిన్ దెప్పుతున్నారు. ఇక మమతా బెనర్జీ వంటి నేతలు చంద్రబాబును నమ్మే పరిస్థితి ఎలా ఉంటుంది? గత నాలుగున్నరేళ్లుగా మోదీని, ఎన్డీఏని వదలకుంటా పట్టుకుని, ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ అంటూ పాడిన యుగళగీతాలు వారెరుగనివా? అయినా ఇప్పుడా చక్రమే లేదు. కుమ్మరిసారె మీద ఈగ నిలబడి తన ప్రభావం వల్లే సారె తిరుగుతోందని అనుకుంటుందట. చక్రాలు తిప్పే రోజులు నేడు లేవు బాబుగారూ! ఎందుకంటే మాయావతి, మమతా బెనర్జీలు ఆ ప్రయత్నంలో మీకంటే రెండాకులు ఎక్కువే చదివారు. పెళ్లికిపోతూ పిల్లిని చంకన బెట్టుకుని పోయినట్లు టీడీపీతో కూటమి గట్టిన కాంగ్రెస్ పార్టీ వారికి కూడా ప్రజల చేతిలో శిక్ష తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూసి ప్రధాని మోదీ నవ్వుకుంటూ ఉండివుండాలి. ఇక్కడ ఉనికే లేని ప్రత్యర్థితో గాల్లో కత్తులు దూస్తూ, తొడగొడుతూ చేసే హాస్యగాడి పాత్రను టీడీపీ పోషిస్తోంది. పోతే బాబు కూటమిలో చేరి అనవసరంగా అప్రతిష్టపాలయ్యారు కోదండరాం సార్. బాబు చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ కూటమి ఆయనకు ప్రత్యామ్నాయంగా కనిపించడమేమిటి? అంత హడావుడిగా కేసీఆర్‌ని గద్దె దించాలన్న యత్నంలో ఎందుకు భాగస్వామి అయినట్లో ఆయనే పరిశీలించుకోవాలి. ఈ ఎన్నికల వరకైనా స్వయంగా పార్టీ పెట్టి పోటీ చేసి ఉంటే తెలంగాణ హక్కుల కోసం కలిసివచ్చే వారందరినీ ఐక్యం చేయడానికి ఆస్కారం ఉండేది. కాంగ్రెస్, టీడీపీ చక్రవ్యూహంలో బందీ అయి రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు. ఇక సీపీఐని చూస్తే చాలా ఆలస్యంగా అయినా అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చిందన్న తృప్తి ఉండేది. కానీ ఈ కూటమిలో భాగస్వామి కావడంతో తనతో పాటు తనవెంట ఇంకా మిగిలి ఉన్న తెలంగాణ ప్రజానీకాన్ని పావులను చేసింది. 40 సీట్లలో పోటీ చేసే సత్తా ఉందని చెప్పి చివరికి 3 స్థానాలతో సంతృప్తి పడిపోయారు. ఇక గద్దర్ లాంటివారు మరీ నిరాశపర్చారు. ఈ సందర్భంలో సీపీఎం ఇతర సామాజిక న్యాయ పోరాట శక్తులతో, వామపక్ష శక్తులతో బహుజన వామపక్ష సంఘటనగా ఏర్పడి మొత్తం 119 స్థానాలకు పోటీ చేయడం హర్షణీయం. నిజానికి ఈ బీఎల్ఎఫ్ను బలోపేతం చేసుకోవడానికి ఈ ఎన్నికల రంగాన్ని కూడా ఎలా వినియోగించుకోవచ్చో నిరూపించే ఒక సృజనాత్మక బృహత్తర కర్తవ్యాన్ని సీపీఎం తన భుజాన వేసుకుంది. ఎన్నికల్లోనైనా లేక పార్లమెంట రీయేతర పోరాటమైనా ప్రజానీకాన్ని తమవైపునకు తిప్పుకుని బలమైన శక్తిగా ఎదగడం అవసరం. కేసీఆర్‌తో కుమ్మక్కై సీపీఎం అలాచేసింది అని భావించడం సరికాదు. అలా చేయదల్చుకుంటే తమ సంఘటనకూ కొన్ని స్థానాలివ్వమని కేసీఆర్‌నే బతిమాలి ఉండేవారు. అయితే కేసీఆర్ పాలన విశాలాంధ్రలో ప్రజారాజ్యం రచనలో సుందరయ్య ప్రతిపాదించిన నూతన ప్రజాస్వామ్య పాలన కాదు. అందులో సందేహం లేదు. కానీ అది ఇప్పటికే ప్రజల తీవ్ర వ్యతిరేకతకు గురైందని భావిస్తే అంతకంటే స్వీయమానసిక దృక్పథం మరొకటి ఉండదు. పైగా, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, టీడీపీ కూటమిని బలపర్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకోవడం కూడా భ్రమే. చివరగా 1951లో సాయుధ తెలంగాణ పోరాటం నిర్వహిస్తున్న నాటి ఉమ్మడి సీపీఐ అప్పటి ప్రపంచ విప్లవ కేంద్రంగా భావించబడుతున్న సోవియట్ పార్టీ సలహా కోసం వెళ్లింది. ఆ సందర్భంలో స్టాలిన్ వారికో విషయం చెప్పాడు. ‘‘మీరు నెహ్రూ గురించి పొరపాటు అంచనా వేశారు. భారత ప్రజానీకం నుంచి నెహ్రూ, ఆయన కాంగ్రెస్ పార్టీ వేరుపడిపోయి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్న స్వీయమానసిక దృక్పథంలో ఉన్నారు. నేటికీ జాతీ యంగా, అంతర్జాతీయంగా ప్రజల దృష్టిలో కాంగ్రెస్, ప్రత్యేకించి నెహ్రూ శాంతికాముకుడు, పురోగామి దృక్పథం కలవాడు అనే భావన బలంగా ఉంది. ఈ స్థితిలో, నెహ్రూ ప్రభుత్వానికి కూడా ఎదురొడ్డి నిలిచే ‘విముక్తి’ పోరాటానికి, ప్రజల మద్దతు గురించి పునరాలోచించండి’’ అని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత ఎన్నికల్లో బీఎల్ఎఫ్ వైఖరి సరైనది. అస్తిత్వం కోసం పోరాడుతున్న శక్తులతోపాటు కమ్యూనిస్టులు కలిసి ముందుగా విస్తృత ప్రజానీకంలో తగిన గుర్తింపును పొందాలి. నిజానికి గోషా మహల్ అసెంబ్లీ స్థానంలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను నిలిపి బీఎల్ఎఫ్ తన లక్ష్యాన్ని చక్కగా స్పష్టం చేసింది. అందుకే ఈ ఒక్కస్థానమే కాదు, తెలంగాణ ప్రజానీకం మొత్తంగా బీఎల్ఎఫ్ వైపు నిలబడాలి. వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
‘కేసీఆర్ పిచ్చి కుక్కలా తయారయ్యాడు’
సాక్షి, హైదరాబాద్ : ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనలతో పాలన సాగుతుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మంగళవారం ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ... కూటమి అధికారంలోకి వచ్చేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకుంటే వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎటువంటి పట్టింపులు లేకుండా టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా కూటమిలో అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులను ప్రజలు సన్నాసులుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కేసీఆర్ పిచ్చి కుక్కలా తయారయ్యాడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాచ్‌డాగ్‌లా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు పిచ్చి కుక్కలా తయారయ్యాడని రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ బొంబాయి, బొగ్గు బావి, దుబాయ్ అని ప్రగల్బాలు పలికి ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. రైతులను నిండా ముంచారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే తన మనవడిని కూడా రాజకీయాల్లోకి దింపుతాడు. స్వార్థ రాజకీయాల్లో ఆయనను మించిన వారు లేరు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా ఒక్కసారి కూడా విమర్శించలేదు. తన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. చంద్రబాబు వాస్తవాలకు దగ్గరగా ఉంటారు తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటారని రమణ అన్నారు. టీడీపీని హైదరాబాద్‌లోనే ప్రారంభించారని, ఇక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా స్పందించే గుణం తమ నాయకులకు ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కేసీఆర్ చేసిన కుట్రలన్నీ బెడిసి కొట్టాయని అన్నారు. లక్షల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి తీరతామని రమణ ధీమా వ్యక్తం చేశారు. కూకట్పల్లి విజయంతో కేసీఆర్ పతనానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం అంటే.... ప్రత్యేక రాజ్యాంగం కాదు లక్షల మంది పోరాటంతో తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ మాత్రం తానొక్కడినే తెలంగాణ తెచ్చినట్టు మాట్లాడుతారని రమణ ఎద్దేవా చేశారు. అయినా ప్రత్యేక రాష్ట్రం అంటే ప్రత్యేక రాజ్యాంగం ఉండదని వ్యాఖ్యానించారు. కూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలకు విలువ ఇస్తూనే ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నామని తెలిపారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇచ్చామని, వచ్చే నెల 4న సాయంత్రం పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
‘రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం’
సాక్షి, కోస్గి: కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సోమవారం పట్టణంలో మాజీ వార్డు సభ్యుడు తుడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీసీ కాలనీతోపాటు బిజ్జారం బావుల కాలనీలో ప్రచారం చేశారు. రేవంత్‌రెడ్డిని మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ మండల మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పట్టణంలోని మోమిన్‌పేట కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ముస్లిం, మైనార్టీలు రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇద్రీస్, కోఆప్షన్ మెంబర్ ఆసీఫ్, రహీంపాష, నాయకులు మక్సూద్, సలీం, ఇలియాస్, ఫేరోజ్, ఖలీం తదితరులు ఉన్నారు. మద్దూర్‌లో.. మద్దూరు: మండల కేంద్రంలో, కొత్తపల్లిలో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారాన్ని చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ, రూ.5లక్షలతో ఇంటి నిర్మాణం, రూ.2లక్షలతో కల్యాణలక్ష్మి పథకం, 7 కిలోల సోనా బియ్యం ఇవ్వనున్నారని తెలిపారు. అభివృద్ధి చూసి హస్తం గుర్తుకు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో మురళిధర్‌రెడ్డి, వెంకట్రాములుగౌడ్, బాల్‌రాజ్, మహిపాల్, గణప చందు, సుభాష్, సంజీవ్, రామకృష్ణ, భీములు, సలాం, శేఖర్, నర్సిరెడ్డి, బారి, కన్కప్ప, సురేందర్ పాల్గొన్నారు.అదేవిధంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు రమేష్‌రెడ్డి, సుభాష్‌నాయక్, శివరాజ్, చంద్రశేఖర్, వెంకట్రాములుగౌడ్ ఆధ్వర్యంలో చింతల్దిన్నెకు చెందిన వీరప్ప, నీలప్ప, మొగులప్ప, గండెప్ప, మల్లప్ప, గోవిందు, ఆంజనేయులు, వెంకటయ్య, హన్మయ్య, రాములు, అంజప్ప, మొగులప్ప తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు రాంచందర్, వెంకట్‌రెడ్డి, వెంకటేష్ తెలిపారు. -
అవకాశం ఇవ్వండి నిరూపించుకుంటా..!
సాక్షి, చిననంబావి: తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజాకూటమి తరపున బరిలో నిలిచిన కాంగ్రెస్ కొల్లాపూర్ అభ్యర్థి భీరం హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. శ్రీశైలం నిర్వాసితులకు అండగా ఉంటానని చెప్పారు. సోమవారం ఆయన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామారెడ్డి, టీడీపీ నాయకుడు డాక్టర్ పగిడాల శ్రీనివాసులుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గత 20ఏళ్లుగా కొల్లాపూర్‌కు చేసిందేమీలేదని విమర్శించారు. టీఆర్ఎస్ అమలు చేసిన పథకాలన్నీ నాయకులకు, కాంట్రాక్టర్లకు ఉపయోగపడ్డాయని ఆరోపించారు. న్యాయవాద వృత్తిని వదిలి నాలుగున్నరేళ్లుగా ప్రజాసేవలకు అంకితమయ్యాయని చెప్పారు. కొప్పునూరులో ర్యాలీ నిర్వహించారు. శ్రీశైలం నిర్వాసితులకు అండగా ఉంటానని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్‌సాక్షిగా చెబుతున్నాని ఉద్వేగంగా మాట్లాడారు. నిర్వాసితుల గోస గత పాలకులకు పట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో చేరిక కొప్పునూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకులు చిన్నారెడ్డి, రామకృష్ణ, నరసింహ్మ, తగరం రాజు, బ్రహ్మం, మాజీ సర్పంచ్‌లు తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఉమ్మడి కాంగ్రెస్, టీడీపీ మండల అధ్యక్షుడు గోవిందు శ్రీధర్ రెడ్డి, బస్వాపురం సుధాకర్ నాయుడు, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఎత్తం కృష్ణయ్య, బాల్‌చందర్, చిన్నారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, కిరణ్‌కుమార్, నంది శేఖర్‌రెడ్డి ఉన్నారు. -
‘భగీరథ’లో సీఎంకు 6% వాటా
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కమిషన్ భగీరథలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాటా ఆరు శాతం. ప్రాజెక్టు మొత్తం ఖర్చులో ఆరు శాతం కమిషన్ తీసుకుని ఆయన కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. రాష్ట్రంలో సగటున కోటి ఇళ్లు ఉంటే నాలుగున్నరేళ్లలో కనీసం లక్ష ఇళ్లకు కూడా భగీరథ నీళ్లు ఇవ్వలేదు. కమిషన్ డబ్బుతోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ చలవే. ఆమె లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని కేసీఆర్ బహిరంగం గానే చెప్పారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిం ది 33 శాతం ఓట్లే. కేసీఆర్‌ను 65 శాతం మంది ఓటర్లు తిరస్కరించారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. దళితుడిని సీఎం చేస్తామన్న మొదటి హామీతోనే ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టారు. ప్రజా స్వామ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించే జర్నలిస్టులు సహా అన్ని వర్గాలను మోసగించి రాజకీయ విలువలకు పాతరేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను కాపీ కొట్టి చవకబారుతనాన్ని చాటుకున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడిగా కేసీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నారు’ అని ఉత్తమ్ దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ఓటేస్తే ప్రజల ఉనికికే ప్రమాదమని, ఆ పార్టీకి మళ్లీ ఓటేస్తే రాష్ట్రంలో బతకడమే కష్టమవుతుందన్నారు. మళ్లీ అధికారం తమదేనని చెప్పుకున్న కేసీఆర్‌కు మహాకూటమి అంటే వణుకు పుడుతోందన్నారు. కేసీఆర్ తాగి సోయి లేకుండా సోని యాపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు అమ్ముకునే సమయంలో తాను సైన్యం లో దేశ సరిహద్దులో భద్రతా దళంలో ఉన్నానని, ఆయన బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకున్నాఎంఐఎం మద్దతివ్వడమా? తమిళనాడు తరహాలో రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తాన ని చెప్పిన కేసీఆర్... వాటిని అమలు చేయకుండా ఆయా వర్గాలను మోసం చేశారని ఉత్తమ్ ఆరోపిం చారు. ఎంఐఎం అహంకారంతో మాట్లాడుతోందని, టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిస్తోందో ఆ పార్టీ స్పష్టం చేయాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వనందుకు టీఆర్ఎస్కు ఆ పార్టీ మద్దతు పలుకుతోందా? అని ప్రశ్నించారు. సూట్‌కేసులు తప్ప ఏమీ గుర్తుకు రావు తెలంగాణ రాష్ట్రం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడుతాయని సోనియా భావించారని, కానీ వారిని కేసీఆర్ పాతాళంలోకి నెట్టేసినందుకే ఆమె కడుపు తరుక్కుపోయిందని, ఆమెను విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు. ప్రతి దాంట్లో కమిషన్ తీసుకునే కేసీఆర్‌కు సూట్‌కేసులు తప్ప మరే విషయాలు గుర్తుకు రావన్నారు. ఓటమి భయంతో సోయి తప్పి ఆయన మాట్లాడుతున్నారన్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌లాగా తాను బ్రోకర్లా బతకలేదని, దేశ భద్రతా దళంలో ప్రాణాలకు తెగించి యుద్ధ విమానాలు నడిపానన్నారు. విభజన హామీలపై గళమెత్తరేం? టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఒక్క యూనిట్ విద్యుదుత్పత్తి చేయలేదని, గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితంగానే రాష్ట్రంలో కరెంటు వస్తోందన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే చోట ముందుగా పనులు చేపట్టి భారీగా నిధులు ధుర్వినియోగం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్‌లా మార్చారని, సాగునీళ్లు ఇవ్వకుండా వచ్చిన వాళ్లందరినీ అక్కడికి తీసుకెళ్లి ఆహా, ఓహో అనిపిస్తున్నారన్నారు. విభజన హామీలపై గళమెత్తే సాహసం కేసీఆర్ చేయరని, మోదీ పేరు చెబితేనే కేసీఆర్ లాగు తడుస్తుందన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ అమలును కేసీఆర్ అటకెక్కించారన్నారు. గెలిచినా ఓడినా నాదే బాధ్యత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్‌ను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించారు. డిసెంబర్ 11 తర్వాత అన్ని వ్యవహారాలు సచివాలయం నుంచే నిర్వహిస్తారా అని అడిగారు. ఉత్తమ్ స్పందిస్తూ... ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా నాదే బాధ్యత. డిసెంబర్ 11 తర్వాత గాంధీభవన్‌కు రాను’అని అన్నారు. ఉత్తమ్‌కుమార్ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉత్తమ్ సచివాలయానికే వెళ్తారు కదా! అని వారు అనుకున్నారు. జర్నలిస్టుల ఇళ్లపై కోర్టు కేసుల్లేవు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని, డబుల్, ట్రిబుల్ బెడ్రూంల ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి కేసుల్లేవని, ఒక సొసైటీకి సంబంధించిన కేసు మాత్రమే సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. అందులో అన్ని వర్గాలు ఉన్నాయని, అది జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించిన కేసు కాదన్నారు. డిసెంబర్ 12న ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జర్నలిస్టులకు 18 వేల ఇళ్లు, స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కుటుంబాలకు విద్య, వైద్య పథకా లు అమలు చేస్తామన్నారు. తన భార్య పద్మావతి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతోనే అధిష్టానం టికెట్ ఇచ్చిందన్నారు. తమకు పిల్లలు లేరని, రాష్ట్ర ప్రజలే తన కుటుంబమన్నారు. తమ జీవితం ప్రజాసేవకే అంకితం చేశామన్నారు. -
కుదురుకోని కూటమి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ జరిగేం దుకు మరో పదిరోజులే ఉన్న నేపథ్యంలో.. ప్రజా ఫ్రంట్ ఇంకా ప్రచారం ఊపందుకోకపోవటంతో కూటమికున్న పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. సీట్ల సర్దుబాటు, ఉపసంహరణల కోసం బుజ్జగింపులతో కూటమి ఇప్పటికే సగం కాలాన్ని చేజేతులా నాశనం చేసుకుంటే మరోవైపు అదే సమయాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ చాకచక్యంగా వినియోగించుకుంటోంది. టీఆర్ఎస్కు కేసీఆర్ అన్నీ తానై ప్రచారా న్ని ముందుండి ఉరకలెత్తిస్తుంటే, కూటమి మాత్రం ఇంకా కిందిస్థాయిలోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతోంది. జిల్లాస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు టీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే కూటమి ఇంకా ఆ స్థాయిలో క్యాంపెయిన్‌ను చేపట్టలేకపోతోం ది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కనీసం విడివిడిగా కూడా క్షేత్రస్థాయికి పూర్తిస్థాయిలో చేరుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టి మూడురోజులైనా, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మిత్రపక్షాలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. రెబెల్స్ కరుణించినా.. మరోవైపు పలుచోట్ల మిత్రపక్షాల స్థానాల్లో రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ నాయకులను అధిష్టానం దూతలు ఉపసంహరింపజేసినా వారింకా కూట మి భాగస్వామ్యపక్షాలకు సహకరిస్తున్న దాఖలాల్లే వు. సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు కనీసం 5 స్థానాలైనా కేటాయించాలని పట్టుబట్టిన సీపీఐకు మూడేసీట్లను కేటాయించారు. సీపీఐ పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిపై హుస్నాబాద్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా ప్రవీణ్‌రెడ్డి నామినేషన్ వెనక్కు తీసుకున్నా ఒక్కసారి కూడా సీపీఐ పక్షాన కలిసి ఆయన ప్రచారం చేయలేదు. ప్రవీణ్‌ను చాడతో సహా సీపీఐ నేతలు పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటికీ ఆయన కూటమి పక్షాన బహిరంగప్రచారం నిర్వహించలేదు. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో చాడ ప్రస్తావించగా, కలిసి ప్రచారం చేసేలా ప్రవీ ణ్ ను ఒప్పిస్తామని ఆయన హామీనిచ్చారు. టీడీపీ, టీజేఎస్ పోటీచేస్తున్న కొన్ని స్థానాల్లో కూడా టికెట్ ఆశిం చి భంగపడ్డ వారితో పాటు, కాంగ్రెస్ నేతలు పూర్తిస్థాయిలో సహకరించట్లేదనే తెలుస్తోంది. -
ప్రజాకూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ప్రజాకూటమికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎమ్మార్పీఎస్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందిం చింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే పార్లమెం ట్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణమాదిగతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో ఎమ్మార్పీఎస్ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రజాకూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో వర్గీకరణబిల్లు ప్రవేశపెట్టి ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో ఒత్తిడి తేవాలనే ప్రతిపాదనకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినందుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఉత్తమ్, కుంతియాతో కలిసి మందకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై మాట తప్పారని, అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగదీక్షను ప్రశ్నించినందుకు కక్షగట్టి తనను జైల్లో పెట్టారని విమర్శించారు. తెలంగాణకు స్వేచ్ఛ ను ప్రసాదించిన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీపై కేసీఆర్ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోనియా ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పకుండా హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. సూట్‌కేసులు కావాలనుకుంటే సోనియా తెలంగాణను ఇచ్చేదికాదని, కేసీఆర్‌కు సంచులు కావాలి కాబట్టే, సూట్కేసులని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘కేసీఆర్‌కు ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎక్కువ సంచులు ఇస్తారు, కాబట్టి వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టారు’ అని విమర్శించారు. కేసీఆర్ అమరావతికి వెళ్లినప్పుడు చంద్రబాబు ఆంధ్రావాడని గుర్తుకు రాలేదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడిం చడానికి ఎమ్మార్పీఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్ ఓడిపోవాలని స్పష్టం చేశారు కేసీఆర్ దళిత ద్రోహి: ఉత్తమ్ కేసీఆర్ దళితద్రోహి అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎస్సీలను సులువుగా మోసం చేయడం కేసీఆర్‌కు తెలుసని అన్నారు. దళితులను నాలుగున్నరేళ్లు మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉందని, ఆ వర్గానికి చెందిన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి హోదా నుండి ఎందుకు తొలగించారో ఇప్పటికీ తెలియదన్నారు. సిరిసిల్లలో దళితులను హింసించిన కేసీఆర్‌ను దళితులు విస్మరించారని పేర్కొన్నారు. మందకృష్ణ పోరాటం తెలంగాణ సమాజానికి తెలుసని, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ప్రజాకూటమి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అనేది ప్రాధాన్యత అంశంగా మారిందన్నారు. భవిష్యత్తులో మాదిగలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామిటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవిస్తామని హామీనిచ్చారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే రాష్ట్రంలో ప్రజా స్వామ్యం బతుకుతుందన్నారు. అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్లమెం ట్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని కుంతియా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ ప్రతిపాదనలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజాకూటమిలోకి మందకృష్ణను సాదరంగా ఆహ్వానించారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆయనను కేసీఆర్ జైల్లో పెట్టడం దారుణమన్నారు. -
గిరి వని..బొగ్గు గని మెచ్చేదెవరిని?
ఎటూ చూసినా పచ్చదనం.. స్వచ్ఛమైన ’గిరి’జనం. మలుపులు తిరుగుతూ గోదారమ్మ ప్రవాహం. చెంతనే చదువుల తల్లి సరస్వతి క్షేత్రం. మరోవైపు నల్లబంగారం. ఆదివాసీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా.. బొగ్గుగని కార్మికుల శ్రమక్షేత్రంగా పేరొందిన ఆదిలాబాద్‌లో చలి గిలిగింతలు పెడుతున్నా.. రాజకీయం మాత్రం వాడివేడిగా సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో ఏడింటిని టీఆర్ఎస్ గెలుచుకోగా.. రెండుచోట్ల బీఎస్పీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితమైంది. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి గెలుపొందిన ముగ్గురు సభ్యులూ గూలాబీ గూటికి చేరడంతో ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఈసారి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆసిఫాబాద్: ‘ఆదివాసీ’ ఫైట్ గిరిజనుల పోరాట యోధుడు కొమురం భీమ్ జన్మించిన గడ్డ ఇది. నైజాం సర్కారులో జిల్లా కేంద్రంగా ఉండి గ్రామ పంచాయతీ స్థాయికి పడిపోయిన ఆసిఫాబాద్‌కు తెలంగాణ సర్కా ర్ పూర్వవైభవం తెచ్చింది. ఆదివా సీలు, నిరక్ష్యరాసులు ఎక్కు వున్న ఈ నియోజకవర్గంలో గిరిజనగూడెం పటేల్, రాయి సెంటర్ల మాటే వేదవాక్కు. ఇటీవలి ఆదివాసీ ఉద్యమంతో.. ఈ ప్రాంతంలో లంబాడా, ఆదివాసీల నడుమ దూరం పెరిగింది. ఈ ప్రభావం ప్రస్తుత ఎన్నికలపై పడనుంది. టీఆర్ఎస్ నుంచి కోవా లక్ష్మి, కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు పోటీపడుతున్నారు. వీరిద్దరూ ఆదివాసీలే. లంబాడా ఓట్లు ఎవరికి దక్కితే వారినే విజయం వరించనుంది. వివాదరహిత తీరుతో కోవా లక్ష్మికి ఓటర్లలో ఆదరణ కనిపిస్తోంది. ఆదివాసీ ఉద్యమంలో తటస్థ వైఖరి అవలంబించడం ఆమెకు సానుకూలాంశం. సక్కుకు వ్యక్తిగతంగా మంచి పేరున్నా.. ఆదివాసీలకు అనుకూలంగా ఉద్యమాన్ని నడిపారనే అపవాదు ఉంది. గొండ్రు తెగకు చెందిన టీజేఎస్ అభ్యర్థి కోట్నాక విజయ్‌కుమార్ ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించనున్నారు. బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల ప్రభావం లేదు.భూ పట్టాలు పంపిణీ చేస్తామనే హామీ ఇచ్చేవారికే మద్దతు ఇవ్వాలని గిరిజనేతరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముథోల్: నలుగురి సవాల్ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ముథోల్ నియోజకవర్గం తొలిసారి చతుర్ముఖ పోటీకి వేదికైంది. గడ్డిగారి విఠల్‌రెడ్డి (టీఆర్ఎస్), పవార్ రామారావుపటేల్(కాంగ్రెస్), డాక్టర్ పడకంటి రమాదేవి (బీజేపీ)తో పాటు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భోంస్లే నారాయణరావు పటేల్ (ఎన్సీపీ) బరిలో ఉన్నారు. టీఆర్ఎస్పై సహజ అసంతృప్తి ఉన్నా.. తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిపై కొంత సానుభూతి కూడా ఉంది. సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. ఇక, రామారావుపటేల్ సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి వేణుగోపాలచారి వర్గీయులు ఈయనకు మద్దతు పలుకుతున్నారు. చివరి క్షణం వరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన భోంస్లే నారాయణరావుపటేల్.. ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన రామారావు పటేల్‌కు వరసకు సోదరుడు. రెబల్‌గా భోంస్లే పటేల్ బరిలో దిగడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. ఇది తనకు కలిసొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో (2014) రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రమాదేవి నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే అగ్రనేతల ప్రచారంతో హల్చల్ చేస్తున్న బీజేపీ.. ఈసారి గెలుపు తనదేనన్న భావనతో ఉంది. భైంసా పట్టణంలోని మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. - నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించకపోవడం - గోదావరి చెంతనే ఉన్నా ఇక్కడింకా చాలా గ్రామాలకు సాగు, తాగునీరు అందకపోవడం.. వంటివి ప్రభావం చూపే అంశాలు. న్యాయం చేయరూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా సన్నకారు రైతులకు అంతగా మేలు చేకూరలేదు. సమగ్ర సర్వేతో చాలామంది రైతులు తమ వ్యవసాయ భూమిని కోల్పోయారు. అటువంటి వారందరికీ న్యాయం చేయాలి.’ – దుర్గం తిరుపతి, రైతు, వాంకిడి ఆర్థికంగా నిలబడ్డా.. గత ప్రభుత్వాలతో పోలిస్తే టీఆర్ఎస్ పాలన బాగుంది. నాకు స్వయం ఉపాధి కోసం రూ.50 వేలు బీసీ కార్పొరేషన్ ద్వారా అందించారు. దీంతో సొంతంగా ఆర్థికాభివృద్ధి సాధించాను. – తిరుపతి గోలేటి, రెబ్బన విద్య, వైద్యం కావాలి నిర్మల్ నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే రాజకీయ కేంద్రం. అయితే, ఉన్నత విద్యావకాశాలు, కార్పొరేట్ స్థాయి వైద్యసేవల కోసం ఇప్పటికీ పక్క జిల్లాలకు వెళ్లాల్సిందే. యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఎంతకీ నెరవేర్చడం లేదు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నా.. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలి. ఇప్పటికీ గ్రామాల్లో యువత గల్ఫ్‌బాట పడుతూనే ఉంది. – నంగె శ్రీనివాస్, నిర్మల్ అందరిదీ అదే ‘హామీ’ ఆదిలాబాద్‌లోని 15 వార్డులకు, నియోజకవర్గంలోని మూడు మండలాలకు వెళ్లే మార్గంలో గల రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నాం. కానీ.. సమస్య తీరడం లేదు. రోజూ రైలు వచ్చే సమయంలో అరగంట పాటు వేచి చూడాల్సి వస్తోంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడుతున్నాం. ఈసారి ఎన్నికల్లోనూ పార్టీలు ఓవర్ బ్రిడ్జి కట్టిస్తామని హామీనిస్తున్నాయి. ఎవరూ చేస్తారన్న నమ్మకం లేదు. – గంగన్న, ఆదిలాబాద్ మంచిర్యాల: ముగ్గురు మొనగాళ్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పట్టణం. గోదావరి సమీపాన.. బొగ్గు గని నిక్షేపాలతో అలరారే మంచిర్యాల బరిలో ముగ్గురు హేమాహేమీలు తలపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు (టీఆర్ఎస్), ప్రేమ్‌సాగర్‌రావు (కాంగ్రెస్), రఘునాథరావు (బీజేపీ).. ముగ్గురిదీ ఒకే సామాజిక వర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో దివాకర్‌రావుకు కొంత ఇబ్బందికరం.. ద్వితీయశ్రేణి నేతల వైఖరీ ఆ పార్టీని కొంత వరకు ఇబ్బంది పెట్టే అంశం. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ అరవింద్‌రెడ్డి చేరికతో టీఆర్ఎస్ బలం పెరిగింది. సంపన్నుడైన ప్రేమ్‌సాగర్‌రావు కొన్నాళ్లుగా నియోజకవర్గంలోనే తిష్టవేయడంతో స్థానికంగా ఉండరనే ముద్రను చెరిపేసుకున్నారు. ఉద్యోగ, నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తనకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఆ పార్టీ ఎవరి ఓట్లకు దెబ్బకొడుతుందో తెలియని పరిస్థితి ఉంది. - నియోజకవర్గంలో మూడో వంతు ఉన్న మం చిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలే అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశించనున్నాయి - సింగరేణి కార్మికుల ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాల హామీ ప్రధాన ప్రచారాస్త్రం. ‘స్థానిక’ అంశాలే నిర్ణయాత్మకం - ఏడాదిన్నరగా ఏజెన్సీ ప్రాంతంలో ‘మా రాజ్యం మా పాలన’ నినాదంతో ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్, బోథ్, సిర్పూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాల్లో వీరి ఓట్లే కీలకం. ఆదిలాబాద్, సిర్పూరు మినహా మూడూ ఎస్టీ రిజర్వుడు సీట్లే. ఆదివాసీ ఉద్యమ నేతలైన సోయం బాపూరావు, ఆత్రం సక్కు (కాంగ్రెస్).. బోథ్, ఆసిఫాబాద్ నుంచి బరిలో ఉన్నారు. ఆదివాసీలు వీరిపై సానుకూలంగా ఉన్నారనే చెప్పవచ్చు. మిగతా మూడుచోట్లా ఆదివాసీల ప్రభావం తీవ్రంగానే ఉంది - మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలో సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు రిటైర్డ్ కార్మికులదే గెలుపోటముల్లో కీలకపాత్ర - పల్లెల్లో సాగునీటి సమస్య, మంచిర్యాలలో గూడెం ఎత్తిపోతలకు నీరివ్వకపోవడం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం రైతుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది - స్థానిక ప్రజాప్రతినిధుల నాలుగేళ్ల వ్యవహారశైలి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. నిర్మల్: నువ్వా?నేనా? నిర్మల్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (టీఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. మధ్యలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సువర్ణారెడ్డి పుంజుకుంటున్నారు. ఉద్యోగ, నిరుద్యోగ వర్గాల నుంచి వ్యక్తమవుతోన్న ప్రభావం టీఆర్ఎస్కు ఇబ్బందిగా మారింది. రైతుబంధు, రైతుబీమా, షాదీ ముబారక్‌లాంటి సంక్షేమ పథకాలు, తాను చేసిన పనులు, దేవాలయాల జీర్ణోద్ధరణ, జిల్లా ఏర్పాటు గట్టెక్కిస్తాయని ఇంద్రకరణ్ నమ్మకంతో ఉన్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్‌తో పాటు 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడం కొంత ఇబ్బందికరం. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి.. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని, పథకాల అమల్లో లోపాలను ఎత్తిచూపుతూ ప్రచారం చేస్తున్నారు. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపే ఉన్నాయన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడంపైనే ఆ పార్టీ అభ్యర్థి సువర్ణ ఆశలు పెట్టుకున్నారు. రాహుల్‌గాంధీ, కేసీఆర్ సభలకు దీటుగా ఆదివారం అమిత్ షా సభ సక్సెస్ కావడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఎన్నికల్లో కింది అంశాలు ప్రభావం చూపనున్నాయి.. - నిజామాబాద్–ఆర్మూరు రైల్వే లైన్ పనులు మొదలు కాకపోవడం ∙పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన.. ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరులో జాప్యం.. ఇవి ప్రచారాస్త్రాలు. ఖానాపూర్ (ఎస్టీ): ఇద్దరూ బరాబర్ ఖానాపూర్‌లో రేఖానాయక్ (టీఆర్ఎస్), రాథోడ్ రమేష్ (కాంగ్రెస్) మధ్య పోటీ కొనసాగుతోంది. కొన్ని స్థానిక సమస్యలు పరిష్కారం కాకపోవడం గులాబీ అభ్యర్థికి ఇబ్బందిగా మారాయి. ముందస్తుగా అభ్య ర్థిని ప్రకటిం చడం ప్రచారంలో టీఆర్ఎస్కు కలిసొచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ పేరు చివరి వరకు తేలకపోవడంతో ఆయన ప్రచా రంలో వెనుకబడ్డారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ హరినాయక్ బీఎస్పీ నుంచి బరిలో నిలవడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలిక రానుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం టీఆర్ఎస్కు కలిసి రానుంది. రాథోడ్ రమేష్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కావడంతో స్థానికంగా ఆయనకు పట్టుంది. ఈ రెండు పార్టీలూ లంబాడా అభ్యర్థులకు అవకాశమిస్తే బీజేపీ ఆదివాసీల నుంచి సట్ల అశోక్‌ను బరిలో ఉంచింది. ఆదివాసీలతో పాటు సంప్రదాయ ఓటుబ్యాంక్ కలిసి వస్తుందని ఆశ పెట్టుకుంది. మహాకూటమిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీజేఎస్.. తట్రా భీంరావును పోటీలో నిలిపింది. - అటవీ భూములకు యాజమాన్య హక్కులు ప్రధాన డిమాండ్ - గూడెం, తండాలకు రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించడం.. ఖానాపూర్‌లో డిగ్రీ కాలేజీ లేకపోవడం వంటివి ఇక్కడి ప్రచారాస్త్రాలు. ఆదిలాబాద్: ముగ్గురి ముచ్చట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో త్రిముఖ పోరు నెలకొంది. ముగ్గు రూ ముగ్గురే అన్నట్లు ప్రచారం సాగుతుండడంతో గెలుపెవరిని వరిస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన రామన్నకు గ్రామ గ్రామాన మంచి సంబంధాలున్నాయి. ప్రభుత్వ పథకాలు, పింఛన్లు కలిసి వచ్చే అంశాలు. ద్వితీయ శ్రేణి నేతలపై అవినీతి ఆరోపణలు కొంత ఇబ్బం ది పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాత ఆయన సామాజిక వర్గమే కావడంతో ఆ ఓటుబ్యాంకుకు గండిపడనుందని అంచనా. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి సహకరిస్తున్నా.. భార్గవ దేశ్‌పాండే వర్గం తటస్థంగా ఉండడం సుజాతకు సానుకూలాంశం. గత ఎన్నికల్లో ఇక్కడ ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ ఈసారీ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ఆయనపై సానుభూతి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో పెద్దసంఖ్యలో ఉన్న మైనార్టీలే ఆదిలా’బాద్షా’ ఎవరో తేల్చనున్నారు. - 15 వార్డులు, మూడు మండలాలను కలిపే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రాధాన్యం వహిస్తోంది. - సీసీఐ కంపెనీని పునరుద్ధరించాలనే డిమాండ్ - విమానాశ్రయం నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం కావడంపై అసంతృప్తి బోథ్ (ఎస్టీ): బిగ్ ఫైట్ ఉమ్మడి ఆదిలాబాద్‌లో గిరిజన తెగల మధ్య నెలకొన్న వివాదం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన బోథ్పై ప్రభావం చూపనుంది. రాథోడ్ బాపూరావు (టీఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరా వు (కాంగ్రెస్), మాడావి రాజు (బీ జేపీ)తో పాటు కాంగ్రెస్ రెబల్‌గా అనిల్ జాదవ్ పోటీలో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండే సహజ అసంతృప్తికి తోడు స్థానికేతరుడనే ముద్ర రాథోడ్ బాపూరావుపై ప్రభావం చూపుతోంది. ఆదివాసీ ఉద్యమం, టీఆర్ఎస్పై అసంతృప్తి కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపూరావుకు కలిసొచ్చే అంశాలు. కాంగ్రెస్ రెబల్‌గా బరిలో ఉన్న అనిల్‌జాదవ్ లంబాడీ కావడటం అదే సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థికి ఇబ్బందిగా మారింది. ఈయన కాంగ్రెస్ ఓట్లనూ చీల్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి మాడావి రాజు స్థానికుడు కాకున్నా.. నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థులంతా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక ఎవరికి కలిసొస్తుందో అంతుబట్టడం లేదు. - సాగునీరు, వైద్య సౌకర్యాల కల్పన - కుంప్టి వాగుపై మినీ ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడం.. ఇవి ప్రాధాన్యం వహించే అంశాలు. సిర్పూర్: ‘పేపర్’ పవర్ ఇదో మినీ భారత్. సిర్పూరు పేపర్ మిల్లు ప్రభావంతో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వలస వచ్చారు. మహారాష్ట్ర సంస్కృతి, వేషభాషలు ఎక్కువగా కనిపించే ఈ సెగ్మెంట్లో వలస ఓటర్లే కీలకం. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇక్కడి నుంచి గెలిచారు. ఆపై టీఆర్ఎస్లో చేరిన ఆయన తాజా ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్‌లో వైద్య వృత్తి వదిలి ఏడాదిగా ప్రజలతో మమేకమైన మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు డాక్టర్ హరీశ్‌బాబు.. కోనప్పకు గట్టిపోటీ ఇస్తున్నారు. తన తండ్రి పాల్వాయిపై ఉన్న అభిమానం ఆయనకు కలిసొచ్చే అంశం. హరీశ్ వైపు మొగ్గు కనిపిస్తున్నా.. కోనప్ప రాజకీయ వ్యూహాలను మార్చడంలో దిట్ట. అభ్యర్థుల స్థానికత కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్టీ–టీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీల పోటీ నామమాత్రమే. - వైఎస్ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ పేరిట కాళేశ్వరం తరలించడం ఎన్నికల అస్త్రంగా మారింది. - కాగజ్‌నగర్‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కల్పించే సిర్పూర్ పేపర్ మిల్లు రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే మూత పడింది. ఈ మిల్లు కార్మికులు గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. - రైతుబంధు పథకంపై సానుకూలత ఉన్నా.. అటవీ, రెవెన్యూ వివాదాలతో 20 వేల మంది రైతులకు పాస్ పుస్తకాలు అందలేదు. చెన్నూరు (ఎస్సీ): రసవత్తర పోరు సింగరేణి థర్మల్ ప్లాంటుతో రాష్ట్రానికి కాంతులందిస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధి దీపం కింద చీకటిలానే ఉంది. కార్మి కోద్యమంలో కీలకపాత్ర పోషిం చే చెన్నూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. ముందస్తు నగారా మోగిన కొన్నాళ్లకే పతాక శీర్షికలకెక్కిన ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ – మహాకూటమి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుంది. బాల్క సుమన్ (టీఆర్ఎస్) కు.. వెంకటేష్ నేత (కాంగ్రెస్) తీవ్ర పోటీనిస్తున్నారు. మహా కూటమి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి బోడ జనార్ధన్ బరిలో దిగడంతో కాంగ్రెస్‌కు.. మాదిగ వర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు టికెట్ నిరాకరించడం టీఆర్ఎస్కు ఇబ్బందిగా మారింది. అదే వర్గానికి చెందిన కార్యకర్త గట్టయ్య ఆత్మాహుతి చేసుకోవడంతో ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. నల్లాల ఓదెలు కూడా ప్రచారానికి దూరంగా ఉండడం, మాదిగ సామాజికవర్గం నుంచి పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆ వర్గం ఓట్లే గెలుపోటముల్ని నిర్దేశించనున్నాయి. నేతకాని వర్గం ఓటర్లు గణనీయంగా ఉండడం కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలించే అంశం. సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి, చెన్నూరు, కోటపల్లిలో ప్రభావం చూపే జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. - మందమర్రిలో సింగరేణి భూముల్లో నివసిస్తున్న వారి ఇళ్ల క్రమబద్ధీకరణ.. - 3 వేల మందికి ఉపాధి కల్పించే తోళ్ల పరిశ్రమ ఇంకా ప్రారంభం కాకపోవడం - నేతకాని, మాల, మాదిగ.. ఈ వర్గాల మొగ్గును బట్టే ఫలితం ఉండే అవకాశం. బెల్లంపల్లి (ఎస్సీ): ఎవరి నోరు ‘తీపి’! నేల నల్ల బంగారం. రాజకీయ చైతన్యం ఘనం.. విప్లవ భావజాలమూ ఎక్కువే. 2014లో టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఇక్క డి ఓటర్లు ఈసారెలాంటి తీర్పునిస్తారనేది ఉత్కంఠ కలిగిస్తోం ది. ప్రజాకూటమి పురుడుపోసుకోవడం తరువాయి సీట్ల సర్దుబాటులో అనేక మలుపులు తిరిగిన బెల్లంపల్లి రాజకీయం బీఎస్పీ అభ్యర్థిగా మాజీ మం త్రి గడ్డం వినోద్ రాకతో సమీకరణలు మారిపోయాయి. తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (టీఆర్ఎస్)పై కొంత అసంతృప్తి ఉన్నా.. ప్రజాకూటమి పొత్తులో సీపీఐ (గుండా మల్లేశ్)కి ఈ సీటు ఇవ్వడం చిన్నయ్యకు ఊరట కలిగించే అం శం. అయితే, వినోద్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో చిన్నయ్యకు గట్టిపోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా వినోద్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. పోటీ టీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉండే పరిస్థితి.. - సింగరేణి భూముల లీజులు రద్దు, స్థలాల క్రమబద్ధీకరణ హామీ ఈ ఎన్నికల్లో కీలకం - ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైన్‌పై అసంతృప్తి - మంజూరైన ’టెస్లా’ మెడికల్ కాలేజీని పునరుద్ధరించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఓటెయ్యాలని ‘చెప్పు’కుంటూ.. ఓట్లడగడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. తాను మాత్రం ఇలాగే ఓటెయ్యాలని అభ్యర్థిస్తానంటూ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ ప్రజల పార్టీ అభ్యర్థి ఆకుల వివేక్ సోమవారం ఇలా కొంతసేపు చెప్పులు కుట్టారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి కాళ్లు పట్టుడు..హార్మోనియం కొట్టుడు ‘కనిపిస్తే పాపం.. కాళ్లు పట్టుడే’ అన్నట్టుంది జనగామ స్వతంత్ర అభ్యర్థి మెరుగు శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం తీరు. వృద్ధుల కాళ్లు మొక్కుతూ తన హార్మోనియం గుర్తుకు ఓటెయ్యాలంటూ ఈయన అభ్యర్థిస్తున్న తీరు చూసి అందరూ ఔరా అనుకుంటున్నారు. – కొమురవెల్లి (సిద్దిపేట) సన్ని‘వేషా’నికి తగినట్టు.. ప్రచారంలో పదనిసలు తారస్థాయికి చేరుతున్నాయి. ఆయా సన్నివేశాలకు తగ్గట్టు అభ్యర్థులు వేషమేస్తున్నారు. సోమవారం బచ్చన్నపేట మండలంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య బోనమెత్తి ప్రచారం నిర్వహించారు. – బచ్చన్నపేట -
ఎన్నికలొస్తే ఉసిళ్లలా ఉర్కొస్తరు
సాక్షి, యాదాద్రి/ సిద్దిపేట/మహబూబాబాద్: ‘వర్షాకాలం వస్తే ఉసిళ్లు ఎలా వస్తయో ఓట్ల కాలం వచ్చిందంటే కాంగ్రెసోళ్లు కూడా అలాగే వస్తరు.. వర్షం అనంతరం ఉసిళ్లు ఎలా కనిపించవో ఓట్ల అనంతరం కాంగ్రెసోళ్లు మళ్లీ కనిపించకుండా పోతరు’ అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో జరిగిన రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. వలి గొండలో జన ప్రభంజనం చూస్తుంటే పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే వలిగొండ మండలంలో 30 వేల ఎకరాలకు సాగునీరు వస్తుందని, చెరువులు, కుంట లు నిండుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. గోదావరి నీటితో ప్రజల కాళ్లు కడుగుతామని హరీశ్ అన్నారు. ఢిల్లీకి ఉత్తరాలు రాసిండు.. కాళేశ్వరం వద్దని, కాళేశ్వరం నిర్మిస్తే పోలవరానికి నీరు రాక ఏపీలో మూడో పంటకు నీరు అందదని చంద్రబాబు ఢిల్లీకి ఉత్తరాలు రాశారని మంత్రి ఆరోపించారు. నోటికాడి బుక్కను లాక్కుంటూ, నీరు రాకుండా చేస్తున్న చంద్రబాబును కాంగ్రెస్ నెత్తిలో పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ను జైలులో వేస్తామంటున్నారని, తెలంగాణ తెచ్చినందుకా లేక అభివృద్ధి చేసినందుకా.. అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ అధికారంలోకి రాదన్న సంగతి వారికి అర్థమైందన్నారు. మహాకూటమిని గెలిపిస్తే పరాయోడి చేతికి పాలనను అప్పజెప్పినట్లేనన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సొంత డబ్బులతో ఇళ్లకు స్థలాలు ఇచ్చిండు.. సొంత డబ్బులతో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్థలాలు కొనుగోలు చేసిన వ్యక్తి రాష్ట్రంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక్కరేనని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. నీళ్లు కావాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు. కూటమిలో ఇప్పటికీ కొట్లాటలే కూటమిలో కుమ్ములాటలు, సీట్ల కోసం సిగపట్లు ఇంకా పోలేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమి కేవలం హైదరాబాద్‌లోనే ఉందని, కూటమి నేతలు ఆఫీసులకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ఆయా పార్టీ ల కార్యకర్తలు కలసి లేరన్నారు. కూటమిలోని వారు ఒకరిపై ఒకరికి నమ్మ కం లేక ఎవరికివారే బీ ఫామ్‌లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. మహాకూటమిగా కలవడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వస్తున్నారన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ నుంచి వస్తున్న వలసలే అందుకు నిదర్శనమన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ సర్వేల పేరిట కాంగ్రెస్ మైండ్‌గేమ్ ఆడుతోందన్నారు. -
‘కాంగ్రెస్ మోసం చేసింది’
ఖిలా వరంగల్: కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీగా అభ్యర్థులను నిలిపి మోసం చేసిందని, పొత్తు నిబంధనలు పాటించడం లేదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం వరంగల్ విద్యానగర్ కాలనీలోని టీజేఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నాలుగేళ్లు రాచరిక పాలన చేసిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మహాకూటమి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గాదె ఇన్నయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని, నిరుపేద, అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కోదండరాం చెప్పారు. -
సేవకులుగా పనిచేస్తున్నాం..
సాక్షి, సిద్దిపేట, వర్గల్ (గజ్వేల్): ‘ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వాంఛ యావత్ తెలంగాణ ప్రజలది. వారి ఆలోచన మేరకే రాష్ట్రం సాధించుకున్నాం. రాష్ట్ర సాధనలో సబ్బండ వర్ణాలు కలిసికట్టుగా వచ్చాయి. మీరిచ్చిన స్ఫూర్తితోనే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముందు నడిచి తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభి వృద్ధి చేసుకునేందుకు అధికారం కోసం పాకులాడే నాయకులుగా కాకుండా.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గం, గజ్వేల్ నియోజ కవర్గంలోని వర్గల్లో ఎన్నికల ప్రచారసభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యను తీర్చారన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ, కోతలు లేని విద్యుత్‌ను సరఫరా చేస్తున్న రాష్ట్రాన్ని చూసి దేశంలో ఇతరరాష్ట్రాలు నివ్వెరపోతున్నాయని పేర్కొన్నారు. ఇల్లులేని ఉండకూడదనే కేసీఆర్ ఆలోచనతోనే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నామని, సొంతస్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ప్రభుత్వసా యమందించి ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక... ఇంతకాలం మన ప్రాంతాన్ని దోచుకోవడం మరిగిన ఏపీ నేతలకు ఇంకా దాహం తీరలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటే చూసి ఓర్వలేని చంద్రబాబునాయుడు తిరిగి మనపై పెత్తనం చేసేందుకు తహతహలాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టడాన్ని చూసి భయపడ్డ కాంగ్రెస్ ఒంటరిగా పోటీకి భయపడి తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుందన్నారు. పొత్తు సాకుతో రాష్ట్రంలో బాబు తిష్ట వేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు మహాకూటమి వెనక బాబు కుట్రను పసిగట్టారని, అప్పుడు ఉద్యమంతో బాబును ఏపీకి పంపినట్లే ఇప్పుడు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోనియాది తెలంగాణలో ఆంధ్రపాటని విమర్శించారు. ‘రైతుబంధు’ రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ను రద్దు చేయాలి గతంలో తెలంగాణలో రైతులు సాగునీటి కోసం ఆకాశం వైపు.. పెట్టుబడి కోసం షావుకార్ల వద్దకు తిరిగే పరిస్థితి ఉందని హరీశ్‌రావు అన్నారు. దీనిని స్వయంగా అనుభవించిన రైతు బిడ్డగా కేసీఆర్ ఆలోచన చేసి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. రైతుల బతుకులతో అనుబంధం ఉన్న రైతుబంధు పథకం రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుబంధును రద్దు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీనే రద్దు చేయాలని, అందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీరే రోజులు దగ్గర పడుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుందని తెలిపారు. పాలమూరు ప్రాంతంలో కృష్ణా, తుంగభద్ర నదుల నీరు వ్యవసాయానికి అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు. నోట్ల కట్టలకు అమ్ముడుపోతమా.. ‘కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబునాయుడు పంపిన నోట్ల కట్టలు తెచ్చి మనల్ని కొంటరట. నోట్ల కట్టలకు మనం అమ్ముడుపోతమా. మనకు ఆత్మగౌరవం లేదా. చంద్రబాబు నోట్ల కట్టలు గెలవాల్నా. తెలంగాణ ఆత్మగౌరవం గెలవాల్నా ఆలోచించుకోవాలి’అని హరీశ్‌రావు అన్నారు. నోట్ల కట్టలుంటే ఇంట్లో పెట్టుకోవాలని, మాకు కేసీఆర్ కావాలె, ఆత్మగౌరవం కావాలన్నారు. ఓటర్లు కారుకు, టీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చి మొసలికన్నీరు కార్చారని విమర్శించారు. కాంగ్రెస్ గెలుస్తలేదని, కొడుకు రాహుల్‌గాంధీ ప్రధాని కాకపోయే అని కన్నీళ్లు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మనకు కావల్సింది మొసలి కన్నీళ్లా, తాగు నీళ్లా, ఇంటింటికీ మంచి నీళ్లా ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. -
భ్రష్టు పట్టించడానికే కూటమి
వీర్నపల్లి (సిరిసిల్ల): తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి మహాకూటమి ఏర్పాటైందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణపై పెత్తనం చలాయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు ఇవ్వాలని అడిగిన పాపానికి చంద్రబాబు బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపాడన్నారు. అదే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇస్తోందని పేర్కొన్నారు. దేశంలోనే రైతుబంధు, రైతుబీమా పథకాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. గుంట భూమి ఉన్న రైతులకు కూడా రూ.5 లక్షల బీమా కల్పిస్తున్న ఘనత కేసీఆర్‌దే అని పేర్కొన్నారు. మహాకూటమికి ఓట్ల ద్వారానే తగిన బుద్ధి చెప్పి కేసీఆర్‌ను మరోసారి సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని కోరారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేసిన అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసి చూపించిందని చెప్పారు. మారుమూల అటవీప్రాంతమైన వీర్నపల్లిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడ మే కాకుండా తండాలకు లింకురోడ్లు, ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి వరకు డబుల్‌రోడ్డు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మండలాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేయడానికి సీఎం రూ.168 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. ఎంతోకాలంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు కేంద్రంతో కొట్లాడి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ల ద్వారా వృద్ధులకు బతుకుపై భరోసా కల్పించామన్నారు. అధికారంలోకి రాగానే పింఛన్లను రెట్టింపు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గం లోనే వీర్నపల్లి మండలం మెజార్టీలో రికార్డు సాధించాలన్నారు. తన సేవలను గుర్తించి ఓటువేసి మీ బిడ్డలాగా ఆశీర్వదించాలని కోరారు. -
మాటల దాడి.. మరింతగా!
సాక్షి, హైదరాబాద్: విమర్శకు ప్రతివిమర్శ.. మాటకు మాట.. ఆరోపణకు ప్రత్యారోపణ.. వేడివేడిగా సాగుతోంది ఎన్నికల ప్రచారపర్వం. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పోలింగ్(డిసెంబర్ 7న) గడువు సమీపిస్తున్న కొద్దీ మాటలదాడి ఎక్కువవుతోంది. టీఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తోంది. రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నేతలు జిల్లా, నియోజకవర్గ పర్యటనల్లో ప్రభుత్వతీరును తూర్పారబడుతుండగా, ఢిల్లీ నుంచి వస్తున్న ఏఐసీసీ ముఖ్యనేతలు కేసీఆర్, ఆయన కుటుంబంపై మాటలదాడిని పెంచారు. తెలంగాణ ఎన్నికల సమయం మొదలైన నాటి నుంచే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు కాంగ్రెస్ తీరును ఎండగడుతూ వస్తున్నారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌నేతలు ఎప్పటికప్పుడూ స్పందిస్తూ వస్తున్నారు. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ జతకట్టడంతో టీఆర్ఎస్ విమర్శలను తీవ్రతరం చేసింది. నదీజలాల అంశం లో చంద్రబాబుతీరును అన్ని బహిరంగసభల్లో ప్రశ్నిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, సీతా రామ ఎత్తిపోతల పథకాలపై చంద్రబాబు కేంద్రానికి చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నాకే ఇక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు, భూకుంభకోణాల గురించి కేసీఆర్ బహిరంగసభల్లో ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరిస్తున్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తాలేక, చంద్రబాబును భుజాల మీద మోస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ విమర్శల పరంపరను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌పెద్దలు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా రోజుకొక ఏఐసీసీ అధికార ప్రతినిధి, సీనియర్‌నేత రంగంలోకి దిగి పదునైన మాటలతో ప్రతి విమర్శలు చేస్తున్నారు. నేటి నుంచి మరికొందరు... మరో ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవగౌడ సోమవారం హైదరాబాద్ వస్తున్నారు. ఈయనతోపాటు కేంద్ర మాజీమంత్రి, తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జైరాంరమేశ్ సోమవారం నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మరో మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబమే లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు గుప్పించేందుకే వీరందరినీ రంగంలోకి దించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు డిసెంబర్ 5 వ తేదీ వరకు మరికొందరు ముఖ్య నాయకులు కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగనున్నారని వ్యాఖ్యానిస్తున్నాయి. గట్టిగా బదులిస్తున్న ఢిల్లీ నేతలు.. కొద్దిరోజుల కిందట ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ వరుసగా మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించి కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని, కేసీఆర్ ప్రధాని మోదీ ముసుగు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం సైతం కేసీఆర్, ఆయన పాలనను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. రెండ్రోజుల కింద మరో ముఖ్య అధికారప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా టీఆర్ఎస్ ప్రజాకంటక పాలనపై చార్జిషీట్ విడుదల చేశారు. 24 అంశాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపే యత్నం చేశారు. ప్రాజెక్టులు, అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల టెండర్లలో అక్రమాలు జరిగాయని, తాము అధికారంలోకి రాగానే దోషులను కటకటాల వెనక్కి పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఆదివారం మరో అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మరో అడుగు ముందు కేసి ‘కేసీఆర్ అధికారం కోల్పోయాక ఫాంహౌస్‌లో పడుకుంటానని అనుకుంటున్నారేమో. కానీ, మేం అతన్ని సుఖంగా నిద్రపోనివ్వం. ఆరోపణలున్న అన్ని అంశాలపై విచారణ చేసి అవినీతి సొమ్మునంతా కక్కిస్తాం’అంటూ హెచ్చరించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపైనా పలు ప్రశ్నలు సంధించారు. -
అందరికీ 'అన్నీ'.. మనకే 'ఓట్లన్నీ'...
సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని పెంచుతాం, సంక్షేమాన్ని పంచుతాం... ఇప్పుడు టీఆర్ఎస్ నినాదం ఇదే. సంక్షేమ పథకాలనే ఎన్నికల ఎజెండాగా టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం రచించింది. నాలుగేళ్ల మూడు నెలల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ ఓటు బ్యాంకును సుస్థిరం చేస్తోందని టీఆర్ఎస్ భావిస్తోంది. నాలుగు పార్టీలతో ఏర్పడిన ప్రజాకూటమిని సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటు బ్యాంకుతోనే ఢీ కొడతామనే ధీమాతో ఉంది. ఇలా వంద సీట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని టీఆర్ఎస్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రహదారుల అభివృద్ధితోపాటు 119 కీలక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ‘ఆసరా’ పేరుతో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, నేతన్నలు, కల్లుగీత కార్మికులకు పింఛన్లు... కార్మికులకు భృతి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, వ్యవసాయ రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం, కేసీఆర్ కిట్, భూరికార్డుల ప్రక్షాళన, బతుకమ్మ చీరలు వంటి కీలక పథకాలను అమలు చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2018 వరకు ఏటా సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని గణనీయంగా పెంచిందని, అదే ఇప్పుడు ఎన్నికలలో కలిసి వస్తుందనే ధీమాతో ఉంది. అసెంబ్లీ రద్దుకు ముందే కసరత్తు.. అసెంబ్లీ రద్దుకు ముందే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను పథకాల వారీగా ప్రభుత్వం సేకరించింది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను పొందినవారు ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు ఉన్నారని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. వ్యవసాయ కుటుంబాల్లో అయితే నాలుగు పథకాలు వర్తించిన వారు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు ఉంది. ప్రస్తుతం దాదాపు నాలుగు కోట్లు ఉన్నట్లు అంచనా. తెల్లకార్డు ఉన్న కుటుంబాలు కోటి వరకు ఉన్నాయి. వీటన్నింటికీ రేషన్ సరుకులే కాకుండా ప్రభుత్వంలో ఏదో ఒక పథకం చేరింది. రుణ మాఫీ, రైతు బంధు పథకాలకు పేద కుటుంబాలు అనే అర్హత లేదు. కేసీఆర్ కిట్, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ వంటివి కలిపితే లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య కోటి కంటే ఎక్కువే ఉందని టీఆర్ఎస్ లెక్కలు వేసింది. ఈ వంతున ప్రభుత్వంతో లబ్ధి పొందిన కోటి కుటుంబాల మద్దతుపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది. ప్రభుత్వం ముందుగా సిద్ధం చేసిన జాబితాను అభ్యర్థులకు పంపించింది. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంలో ప్రతీ గ్రామంలోనూ సంక్షేమ పథకాల జాబితాను చదివి వినిపిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యను చెబుతూ మద్దతు కోరుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 వేల మంది... టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల లబ్ధిదారులు ప్రతి నియోజకవర్గంలో సగటున 40 వేల నుంచి 80 వేల వరకు ఉన్నట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. వారి కుటుంబీకులు కచ్చితంగా పోలింగ్‌లో పాల్గొనేలా టీఆర్ఎస్ వ్యూహం రచించింది. తమ పాలనలో అమలు చేసిన వివిధ పథకాలతో ప్రతి పేద కుటుంబం సగటున రూ.50 వేల నుంచి రూ. రెండు లక్షల వరకు లబ్ధిపొందిందని టీఆర్ఎస్ నివేదికలు చెబుతున్నాయి. రైతు కుటుంబాలకు సైతం ఇదే తరహాలో మేలు జరిగిందన్నాయి. ఆసరా పింఛను లబ్ధిదారులు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. రైతు రుణ మాఫీతో 35 లక్షల మంది రైతులు, రైతు బంధుతో 58 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. వీరితోపాటు కుటుంబ సభ్యుల మద్దతు కచ్చితంగా తమకే ఉంటుందని టీఆర్ఎస్ లెక్కలేస్తోంది. ప్రచారంలో తమ పథకాలను వారికి గుర్తు చేస్తే గెలుపు కచ్చితమన్న టీఆర్ఎస్ అధిష్టానం ఆ పార్టీ అభ్యర్థులకు సూచిస్తోంది. ప్రతి లబ్ధిదారుడు పోలింగ్‌కు వచ్చేలా బూత్ స్థాయిలో పార్టీ పరంగా ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. పాక్షిక మేనిఫెస్టోతో... ఇప్పటికే అమలు చేస్తున్న, చేసిన పథకాలతోపాటు పాక్షిక మేనిఫెస్టోతో మరింత మద్దతు వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. కేసీఆర్ అక్టోబర్ 16న పాక్షిక మేనిఫెస్టో ప్రకటించారు. అధికారంలోకి రాగానే మరోసారి రూ.లక్ష పంట రుణాలు మాఫీ చేస్తామని, రైతు బంధు సాయాన్ని ఇప్పుడున్న రూ.8 వేల నుంచి 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామని, నిరుద్యోగులకు ప్రతీ నెల రూ.3,016 భృతి ఇస్తామని ప్రకటించారు. ఇవన్నీ కలసి వచ్చి... వంద సీట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని టీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్‌కు మేనిఫెస్టో ముసాయిదా... టీఆర్ఎస్ ఎన్నిల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను కేసీఆర్‌కు అందజేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను మేనిఫెస్టో కమిటీ పరిశీలించి ఆ ప్రతిపాదనలతో నివేదికను రూపొందిం చింది. ఈ నివేదిక ఆధారంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు తెలిసింది. -
‘అగ్గిపెట్టె’ అందరిదీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ జనసమితి(టీజేఎస్)కి ఎన్నికల సంఘం కేటాయించిన అగ్గిపెట్టె గుర్తును పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకూ కేటాయించింది. ఈ ఎన్నికల్లో టీజేఎస్ కేవలం 8 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుండటంతో మిగిలిన నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థుల కోసం ఈ గుర్తును ఈసీ అందుబాటులో ఉంచింది. 111 స్థానాల్లో అగ్గిపెట్టె గుర్తును కేటాయించాలని అడిగిన స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ గుర్తును కేటాయించింది. తొలుత రాష్ట్రం లోని 119 స్థానాల్లోనూ పోటీ చేస్తామని అన్ని స్థానాలకు ఉమ్మడి గుర్తును కేటాయించాలని టీజేఎస్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీకి అగ్గిపెట్టె గుర్తును కేటాయించింది. అయితే మహాకూటమిలో భాగస్వామ్య పార్టీగా చేరిన టీజేఎస్ కూటమి తరఫున మల్కాజ్గిరి, సిద్దిపేట, అంబర్‌పేట, వర్ధన్నపేట స్థానాల్లో పోటీ చేస్తుండగా ఆసిఫాబాద్, ఖానాపూర్, వరంగల్ ఈస్ట్, దుబ్బాక స్థానాల్లో స్నేహపూర్వక పోటీ నిమిత్తం అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈనెల 22న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల బ్యాలెట్లను ముద్రించడంలో భాగంగా అదేరోజు గుర్తింపు రాజకీయ పార్టీల అభ్యర్థులకు శాశ్వత ఎన్నికల గుర్తులతో పాటు గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు ముందే రిజర్వు చేసిన గుర్తులను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కేటాయించారు. అడిగిన వారికి మాత్రమే.. ఆ తర్వాత జాబితాలో మిగిలిపోయిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ఎనిమిది స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులకు అగ్గిపెట్టె గుర్తును కేటాయించారు. మిగిలిన స్థానాల్లో ఆ పార్టీ కోసం రిజర్వు చేసిన అగ్గిపెట్టె గుర్తు మిగిలిపోయింది. దీంతో ఈ గుర్తు 111 నియోజకవర్గాల్లో ఆ గుర్తు కావాలని అడిగిన స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ ఈ గుర్తును కేటాయించింది. అభ్యర్థుల వినతి మేరకే.. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు అగ్గిపెట్టె గుర్తును కేటాయిం చాలని కోరడంతో స్థానిక రిటర్నింగ్ అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయానికి నివేదించారు. కొత్తగా ఏర్పడిన టీజేఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా గుర్తింపు లభించలేదని, గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల కోసం రిజర్వు చేసిన ఎన్నికల గుర్తును ఆ పార్టీలు పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవచ్చని సీఈఓ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఎన్నికల బ్యాలెట్లో పార్టీ పేరు స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పటికీ, ఓటర్లు గందరగోళానికి గురై టీజేఎస్ అభ్యర్థిగా భావించి ఓటేసే అవకాశాలు ఉండటం గమనార్హం. -
టీఆర్ఎస్కు ఓటమి భయం
హుజూర్నగర్: తెలంగాణలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీల పర్యటనతో రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన దేవతగా సోనియా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా పాలన సాగించిన విధానాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు. దేశం కోసం అనేక త్యాగాలు చేసిన వారిగా గాంధీ కుటుంబం నిలిచిపోయిందని, అలాంటి చరిత్ర ఉన్న కుటుంబాన్ని విమర్శించే నైతిక అర్హత టీఆర్ఎస్కు లేదన్నారు. రోజు రోజుకూ ప్రజల్లో ఆ పార్టీకి బలం తగ్గి పోతుండటంతో టీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో మహాకూటమి మెజార్టీ స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే మేనిఫె స్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్ని తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అట్లూరి హరిబాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్ చావా కిరణ్మయి, ఐఎన్టీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు, చిట్యాల అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. -
ఎన్నికల ఖర్చు చట్టాలేం చెబుతున్నాయంటే...
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్‌కు ఖర్చు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోగా అభ్యర్థి ఖర్చు వివరాలు పూర్తి లెక్కలతో సమర్పించాలి. లేకుంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 10 ఏ నిబంధన కింద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తుంది. - ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాల విషయంలోనూ అభ్యర్థి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి వాహనానికి సంబంధిత ఎన్నికల అధికారి నుంచి పర్మిట్ ఉండాలి. పర్మిట్ పొందిన వాహనాల నిర్వహణ వ్యయం ఖర్చును రోజు వారీ లెక్కల్లో తప్పనిసరిగా వివరించాలి. ఇక పర్మిట్ లేని వాహనాలు ఉపయోగిస్తే అభ్యర్థి అనధికారికంగా ప్రచారం నిర్వహస్తున్నాడని పరిగణించి, భారత శిక్షాస్మృతిలోని అధ్యాయం 9ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. వెంటనే ప్రచారం నుంచి అభ్యర్థిని ఉపసంహరిస్తారు. - ఇక లెక్క పక్కాగా ఉండాలి. చేసిన ప్రతి పైసకు సరైన ఆధారం చూపాలి. ప్రతి వ్యయానికి సంబంధించిన రశీదులు, ఓచర్లు తప్పకుండా సేకరించి పెట్టుకోవాలి. అభ్యర్థి చివరగా సమర్పించే ఖర్చుల వివరాలతోపాటు వీటిని జతపర్చాలి. ఎన్నికల నిబంధన 1961 ప్రకారం ఓచర్లు, బిల్లులు చూపకుంటే చర్యలకు అవకాశం ఉంది. .:: మహమ్మద్ ఫసియొద్దీన్ అభ్యర్థులూ జర భద్రం. ప్రచారంలో మీరు పెట్టిన ఖర్చు లెక్కలు బరాబర్ చూపాల్సిందే ! లేకుంటే భవిష్యత్తులో కష్టాలే మరి. అలాగే మీ తరపున ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్ల ఖర్చులు కూడా మీ ఖాతాలోకే వస్తాయి. ఇక ఫలితాల ప్రకటన అనంతరం 30 రోజుల్లోగా నిర్దిష్ట పద్ధతిలో సమర్పించకపోయినా లేదా అసలు ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వడంలో విఫలమయినా, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 10ఏ నిబంధన కింద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయనుంది. గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలను సమర్పించడంలో విఫలమైన 46 మంది స్వతంత్ర అభ్యర్థులు ప్రస్తుతం ఈ అనర్హతను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల వ్యయంపై కేంద్ర ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. మన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓ అభ్యర్థి గరిష్టంగా రూ.28 లక్షలు ఖర్చు పెట్టవచ్చు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ వరకు పెట్టిన ఎన్నికల ఖర్చు వివరాలను అభ్యర్థులు రాసుకుని ఉంచాలి. ఎన్నికల ప్రచారంలో వినియోగించే ప్రచార సామగ్రికి ముందే ఖర్చుపెట్టి ఉంటే దానిని కూడా ఎన్నికల వ్యయంలో చేర్చాలి. అభ్యర్థులు కార్యకర్తలకు పెట్టించే బిర్యానీలు, టీ, సమోసాల రేట్లు కూడా లెక్కగడతారు! ప్రతి వాహన వ్యయమూ పరిగణనలోకి .. ఎన్నికల ప్రచారానికి ఒక అభ్యర్థి ఎన్ని వాహనాలైన వాడవచ్చు. ఎన్ని వాహనాలు వాడాలనుకుంటున్నదీ, ఏయే ప్రాంతాల్లో ప్రచారానికి తిరగబోతున్నది ఆ వివరాలను పర్మిట్ల కోసం అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి లేదా అధీకృత ఉద్యోగికి సమర్పించాలి. పర్మిట్ పొందిన వాహనాల నిర్వహణ ఖర్చును రోజువారీ ఎన్నికల ఖర్చు నమోదు చేసే రిజిస్టరులో చేర్చాలి. ప్రచార కాలంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయించిన తేదీల్లో, నోటీసు అందుకున్న మూడు రోజుల్లోకూడా తనిఖీ నిమిత్తం ఎన్నికల వ్యయ నమోదు రిజిస్టరును సమర్పించడంలో అభ్యర్థి విఫలమయితే –వాహన వినియోగానికి ఇచ్చిన పర్మి ట్ను రిటర్నింగ్ అధికారి ఉపసంహరించుకుంటారు. ఇక పర్మిట్‌లేని వాహనాన్ని ఉపయోగిస్తే అభ్యర్థి అనధికారికంగా ప్రచారం చేస్తున్న ట్లు పరిగణించి భారత శిక్షాస్మృతిలోని అధ్యాయం 9ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. - సోషల్ మీడియాలో ప్రకటనల ప్రచురణ కోసం ఇంటర్నెట్ కంపెనీలకు, వెబ్సైట్లకు చెల్లించే మొత్తాలను అభ్యర్థి ఖర్చులో చేర్చాలి. ఇదిగాక ఎన్నికల ప్రచారంకోసం వారి సొంత సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణకు ఏర్పాటు చేసుకున్న సిబ్బందికిచ్చే జీతాలు, నిర్వహణ వ్యయం, వాటిలో ప్రదర్శించే సమాచార నిర్వహణ వ్యయం కూడా చేర్చాలి. రూ.10 వేలకు కుదింపు అభ్యర్థులు ఎవరి నుంచి కూడా నగదు రూపంలో రూ.2 వేలకు మించి విరాళాలు తీసుకోవడానికి వీల్లేదు. అంతకు మించిన విరాళాలను చెక్కు రూపంలో స్వీకరించాల్సిందే. ఇప్పటి వరకు రోజుకు గరిష్టంగా రూ.20 వేల వరకు ఖర్చులను నగదు రూపంలో చేసుకోవడానికి అనుమతి ఉండగా, తాజాగా రూ.10 వేలకు తగ్గిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. రోజువారీ ఖర్చు రూ.10 వేలకు మించితే చెక్కులు/డీడీలను వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బరాబర్ లెక్కుండాలే! - పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికల ఖర్చు రాయడానికి రిటర్నింగ్ అధికారి ఒక రిజిస్టరును అందచేస్తారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఫలితాలు ప్రకటించే తేదీ వరకు (రెండు రోజులూ కలిపి) అయిన వాస్తవ ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు అందులో నమోదు చేయాలి. ఫలితాలు ప్రకటించిన తర్వాత 30 రోజులలోగా అభ్యర్థులందరూ వాస్తవ ఎన్నికల వ్యయ రిజస్టరును జిల్లా ఎన్నికలఅధికారికి సమర్పించాలి. - ఎన్నికల వ్యయ నిర్వహణ కోసం ఒక ‘కరెంట్ అకౌంట్’ బ్యాంకు ఖాతాను ప్రారంభించాలి. అభ్యర్థి పేరుతో విడిగా కానీ, ఎన్నికల ఏజెంట్‌తో కలిసి జాయింట్‌గా ప్రారంభించవచ్చు. నామినేషన్ దాఖలుచేసేటప్పుడే రిటర్నింగ్ అధికారి(ఆర్.ఓ)కి ఈ బ్యాంకు ఖాతా వివరాలు తెలియచేయాలి. ఎన్నికల ఖర్చుకోసం కేటాయించిన మొత్తాన్ని అభ్యర్థి ఈ ఖాతాలో జమచేయాలి. - ఎవరికైన ప్రభుత్వానికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని జడ్ ప్లస్ భద్రతలో భాగంగా అనధికార పనులకు వినియోగించినప్పుడు దాని ఖర్చులు సదరు వ్యక్తే భరించాలి. స్టార్ కాంపైనర్ అభ్యర్థి అయితే ఆ నియోజక వర్గంలో ఆ వాహనం నిర్వహణ ఖర్చంతా అతని ఎన్నికల ఖర్చుకింద జమ అవుతుంది. ఒకవేళ స్టార్ క్యాంపెయినర్ కాకుండా పార్టీ నాయకుడై ఉండి భద్రత సౌకర్యం ఉన్నట్లయితే – అతను ఒక అభ్యర్థికి ప్రచారం చేసిన పక్షంలో ఆ భద్రతా వాహనం నిర్వహణ ఖర్చు లెక్క అక్కడి అభ్యర్థిదే. - అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యరులను ప్రతీ క్షణం నీడలా వెంటాడే...ఎన్నికల వ్యయం లెక్కలేసే అధికారులు ఉంటారు. చేసే ప్రతీ నయాపైస ఖర్చును సైతం లెక్కగట్టి ఎన్నికల వ్యయంలో జమ కడతారు. ఇక అభ్యర్థి చూపే ఖర్చు..పరిశీలకులు గమనించిన లెక్కలకు తేడా వచ్చినా ఇబ్బందే. రాష్ట్రంలో అభ్యర్థులను గమనించేందుకు 53 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులున్నారు. ‘స్టార్’ల వ్యయమూ అభ్యర్థి ఖాతాలోనే స్టార్ క్యాంపెయినర్ల బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించినప్పుడు అభ్యర్థిగానీ, ఎన్నికల ఏజెంట్ గానీ వేదికను పంచుకుంటే దాని నిర్వహణ వ్యయమంతా అభ్యర్థి ఖాతాలో కలపనున్నారు. ఒకవేళ వేదికపై అభ్యర్థి లేకపోయినా సభలు నిర్వహించిన ప్రదేశంలో బ్యానర్లపై, పోస్టర్లపై అభ్యర్థి ఫొటో కనిపించినా, సభ, ర్యాలీలో స్టార్ క్యాంపెయినర్ తన ప్రసంగంలో అభ్యర్థి పేరు ప్రస్తావించినా, అప్పుడు కూడా మొత్తం ఆ ర్యాలీ, సభ వ్యయం అంతా అభ్యర్థి ఖాతాలోకే జమ అవుతుంది. వేదిక మీద కానీ, బ్యానర్లు , పోస్టర్ల మీద కానీ, ఒకరికి మించి ఎక్కువ అభ్యర్థుల పేర్లతో ఉంటే, అప్పుడు ఆ ర్యాలీ, సభ ఖర్చు ఆ అభ్యర్థుల మధ్య సమానంగా వారివారి ఖాతాల్లో జమ అవుతుంది. హామీల ‘బాండ్’ ‘నన్ను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తా. లేకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. ఇందుకు హామీగా మీకు బాండ్ పేపర్ రాసిస్తున్నా’ అంటూ నిజామాబాద్ రూరల్ నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి ప్రదీప్‌రెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతున్న ఆయన శనివారం ఇందల్వాయి గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. గ్రామాలకు వచ్చే ఇతర పార్టీల నాయకులను కూడా బాండ్ పేపర్ రాసివ్వాలని కోరాలంటూ హితవు చెబుతున్నారు. ఆయన ప్రచార శైలిపై గ్రామస్తులు ‘ఔరా’ అనుకున్నారు. – ఇందల్వాయి బరిలో ఇద్దరు ‘గండ్ర’లు జయశంకర్‌జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఒకే ఇంటిపేరు కలిగిన ఇద్దరు అభ్యర్థులు వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచారు. వీరు గత ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. అయితే వీరిలో ఒకరు రావు, మరొకరు రెడ్డి కావడం గమనార్హం. గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మరో వ్యక్తి గండ్ర సత్యనారాయణరావు 2014లో టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించగా రాకపోవడంతో బీజేపీలో చేరి ఆ పార్టీ గుర్తుతో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి టికెట్ ఆశించడగా దక్కపోవడంతో ఈ ఎన్నికల్లో ఆలిఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరి ఇంటి పేర్లు గండ్ర కావడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. – భూపాలపల్లి అర్బన్ ఓటు ‘చక్కని’ పెండ్లి కార్డు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు సీహెచ్. శ్రీశైలంయాదవ్ కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆచారిపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. వచ్చే నెల 12న శ్రీశైలం యాదవ్ కుమార్తె వివాహం తలపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలపై బీజేపీ అభ్యర్థి ఆచారిని గెలిపించాలని కోరుతూ.. ‘అందరికి ఇచ్చారు అవకాశం... ఆచారి అన్నకు ఇవ్వండి ఓ అవకాశం’ అంటూ కార్డుపై ముద్రించి బంధువులందరికీ పంచుతున్నారు. – ఆమనగల్లు(కల్వకుర్తి) ఓట్ల ‘బస్కీ’లు కరీంనగర్ నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో ఆరు రోజుల పాదయాత్రను శనివారం ప్రారంభించారు. కట్టరాంపూర్లోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘స్వామీ నీవే గెలిపించాలి’ అంటూ ఇలా గుంజీలు తీశారు. – కరీంనగర్ -
'పంచ'తంత్రం
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఐదుగురు సీనియర్ నేతలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గురి పెట్టింది. ఈ ఎన్నికల్లో వారిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యులైన వారి అనుచరులను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ఈ ఐదుగురిని ముప్పుతిప్పలు పెట్టడం ద్వారా వారిని సొంత నియోజవకర్గాలు వదిలి బయటకు రాకుండా ఉండే మార్గాలను సిద్ధం చేసింది. హూజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి, గద్వాలలో డీకే అరుణ, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించడం అంత సులభం కాదన్న సంగతి తెలిసినా టీఆర్ఎస్ ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ఈ ఐదుగురు కాంగ్రెస్ ప్రముఖులను ఓడించేందుకు టీఆర్ఎస్ మంత్రులు, ఇతర సీనియర్ నేతలను రంగంలోకి దించింది. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ తన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసింది. ఉత్తమ్ చుట్టూ ఉచ్చు..: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లో ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని టీఆర్ఎస్ నాయకత్వానికి తెలుసు. అయినా, ఆయనకు గట్టిపోటీనివ్వడానికి ఎన్నారై సైదిరెడ్డిని పోటీకి దించింది. ఇక్కడ సైదిరెడ్డికి బంధుగణం ఎక్కువ ఉండటం, రాజకీయాలకు కొత్త కావడంతో ఓటర్లను ఆకర్షించవచ్చని భావించింది. అలాగే, ఉత్తమ్ చుట్టూ ఉన్న నేతలను తమవైపునకు తిప్పుకోవడం ద్వారా ఉత్తమ్‌ను నియోజకవర్గం దాటి ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లకుండా నిరోధించాలనేది టీఆర్ఎస్ వ్యూహం. ఉత్తమ్ సతీమణి పద్మావతి కోదాడ దాటి హుజూర్నగర్ వెళ్లకుండా.. అక్కడ బలహీనవర్గాలకు చెందిన మల్లయ్య యాదవ్‌ను పోటీకి పెట్టింది. మాజీ ఎమ్మెల్యే చందర్రావుతో పాటు శశిధర్‌రెడ్డిని ప్రచారంలోకి దించింది. దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై ఉత్తమ్ దృష్టిసారించక తప్పని పరిస్థితి తేవాలని లక్ష్యం. కొడంగల్ బరిలో మంత్రి సోదరుడు : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డిని బరిలోకి దించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎనుముల రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఓసారి పర్యటించా రు. మరో మంత్రి హరీశ్‌రావును నియోజకవర్గం ఇన్చార్జ్గా పెట్టింది. తెలంగాణలోని కనీసం 60 నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ద్వారా పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. రేవంత్‌కు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించి..ఇతర నియోజకవర్గాల కంటే ఇక్కడే ఎక్కువగా ప్రచారం చేసే పరిస్థితులు కల్పించాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. రేవంత్‌ను ఓడించేందుకు ఇక్కడ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ సంగతి తెలిసే రేవంత్ ఈ నెల 28న కొడంగల్‌కు రాహుల్‌గాంధీని రప్పిస్తున్నారు. కోమటిరెడ్డికి గట్టిపోటీ : నల్లగొండ నుంచి నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో ఇదొకటి. గడచిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడోసారి పోటీ చేస్తున్న భూపాల్‌రెడ్డి ఈసారి తనకు సానుభూతి కలిసివస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. దానికి తోడు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం భూపాల్‌రెడ్డి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి ఐదోసారి విజయం సాధించడానికి కొంత శ్రమపడాల్సి వస్తోంది. ‘సాగర్’ దాటని ‘జానా’ : వరుసగా తొమ్మిదోసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత కుందురు జానారెడ్డి (నాగార్జునసాగర్) ఈసారి విజయం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మధ్యలో 1994 మినహా జానారెడ్డి ఏడు సార్లు విజయం సాధిస్తూ వచ్చారు. ఇక్కడి నుంచి గడిచిన ఎన్నికల్లో ఆయనతో పోటీపడ్డ నోముల నరసింహయ్య యాదవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ వేల సంఖ్యలో ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన ఓట్లను రాబట్టుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ఎస్టీల్లోనూ చీలిక తేవడానికి టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు కొంత ఫలించాయి. మిర్యాలగూడ టిక్కెట్ తన కుమారుడు లేదా తన వర్గీయుడికి ఇప్పించుకునే ప్రయత్నంలో జానారెడ్డి ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో ఆయన నాగార్జునసాగర్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి.. మేనల్లుడితోనే పోటీ : గద్వాల నుంచి బరిలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత డీకే అరుణను ఓడించాలని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్ఎస్ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు తన ట్రబుల్ షూటర్ హరీశ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది. సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజవకర్గాల్లో తిరుగుతూనే అడపాదడపా గద్వాల, ఆలంపూర్‌ను చుట్టి వస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణకు ప్రత్యర్థిగా ఆమె మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డిని టీఆర్ఎస్ రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలోని బీసీల్లో మంచి పట్టున్న తిమ్మప్ప సోదరులు టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు గద్వాల నుంచి విజయం సాధిస్తూ వస్తున్న అరుణ ఈసారి తన గెలుపును ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. వరుసగా 20 ఏళ్ల నుంచి అరుణ శాసనసభ్యురాలిగా ఉన్నా నియోజకవర్గం పెద్దగా అభివృద్ది చెందలేదంటూ టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. దీంతో అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి గద్వాలలోనే మకాం వేసి అధికార పార్టీ వ్యూహాలను అడ్డుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. -
తెలంగాణ గడ్డపై నుంచి ఏపీకి వరాలా?
సాక్షి, వనపర్తి/గద్వాల: తెలంగాణ గడ్డపై జరిగిన బహిరంగ సభకు హాజరైన సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్‌పై వరాలు కురిపించారని.. మేడ్చల్‌లో సభ జరిగిన తీరును చూస్తే తెలంగాణలో ఉన్నామా.. లేక అమరావతిలోనా? అనే అనుమానం కలిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జిల్లా మక్తల్ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరులో రోడ్డు షో, అమరచింతలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. అలాగే గద్వాల నియోజకవర్గం ధరూరులో జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటును చివరి నిమిషం వరకు చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని హరీశ్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అడ్డుపెట్టుకుని సీలేరు పవర్ ప్లాంట్ లాక్కున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కరెంటు బిల్లులు తగ్గించాలని అడిగిన రైతులను కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు. అలాంటి బాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం గర్హనీయమన్నారు. ప్రజలు మాయాకూటమి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. గెలిచే పార్టీ అయిన టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ పోటీ ద్రోహులతోనే.. తెలంగాణ వాదులు, తెలంగాణ ద్రోహుల మధ్య ఈ ఎన్నికల్లో పోటీ జరుగుతోందని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణవాదులపై అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న, ప్రస్తుత మక్తల్ మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డి దాడి చేశారని గుర్తు చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర సాధన కోసం మూకుమ్మడిగా రాజీనామాలు చేసినా దయాకర్‌రెడ్డి మాత్రం జిరాక్స్ పేపర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు పథకాన్ని ఆపాలంటూ బాబు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా తెలంగాణలో జరిగే అభివృద్ధి ఇష్టంలేని బాబు కాంగ్రెస్ ముసుగు వేసుకుని వస్తున్నందున ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఉర్దూలో మాట్లాడిన మంత్రి ఆత్మకూరు, అమరచింతలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు హరీశ్ ఉర్దూలో మాట్లాడారు. షాదీ ముబారక్ పేరుతో ఆడపిల్ల పెళ్లికి రూ.లక్ష అందిస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుదని, మైనార్టీల్లో పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్రంలోనూ టీఆర్ఎస్ పార్టీ కీలకం కానుందన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపుతోపాటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సభల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, మక్తల్ టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట తప్పం.. మడమ తిప్పం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మాట తప్పని, మడమ తిప్పని పార్టీ టీఆర్ఎస్ అని హరీశ్‌రావు అన్నారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో ధరూర్, గట్టు, కేటిదొడ్డి మం డలాల మహిళలు శనివారం మహిళా ఆశీర్వాద సభ నిర్వహించారు. హరీశ్ మాట్లాడుతూ, గద్వాల జిల్లా ఏర్పాటు తన ఘనతనే అని డీకే అరుణ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్పుడు ఎందుకు జిల్లా ఇవ్వలేదని ప్రశ్నిం చారు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, కృష్ణమోహన్‌రెడ్డి లేకపోతే జిల్లా ఏర్పాటు అయ్యేదా అని అన్నారు. ఆడబిడ్డలకు అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. ఓటర్లు మద్యం, డబ్బుకు లొంగకుండా కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించి గద్వాలను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని పిలుపునిచ్చారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే అరిఘోసే...
సాక్షి, కోడేరు: మండల కేంద్రంలో శుక్రవారం బీరం హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు షిర్డిసాయిబాబ ఆలయంలో ఆయన గెలుపు కోసం 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆదికొమ్ము దానయ్య మహారాజ్, చామంతిరాజు మాట్లాడారు. రామకృష్ణ, శ్రీశైలం, జానకిరాములు, రాజవర్ధన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రాము, సంతోష్, పర్వత్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కొల్లాపూర్ రూరల్: తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోనిఅంకిరావుపల్లిలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రత్నప్రభాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జంబులయ్య, లాలయ్య, రాజు ఉన్నారు. పెద్దకొత్తపల్లి: మండలలోని గంట్రావుపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ మండలాధ్యక్షుడు గణేష్‌రావు శుక్రవారం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హన్మంతురెడ్డి, కాశన్న, రమేష్‌రెడ్డి, సీతారాంనాయక్, లింగారెడ్డి, కాంగ్రెస్ యువనేత పరమేష్ తదితరులు పాల్గొన్నారు. పెంట్లవెల్లి: మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక మొత్తంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కండువాలు కప్పుకుని కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ కోసం తాము పనిచేస్తామని, హర్షవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో ఆయన గెలుపు కోసం కృషిచేస్తామని పలువురు కార్యకర్తలు అన్నారు. హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని తెలిసి ఎంతోమంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని, రాబోయే కాలంలో కొల్లాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. మండలాధ్యక్షుడు మతీన్, సురేందర్, రఫియోద్దీన్, ఎంపీటీసీ సభ్యుడు నాగరాజు, నర్సింహ, ఎల్లయ్య, కురుమూర్తి పాల్గొన్నారు. -
కూటమికి లేదు ఓటమి..!
సాక్షి, మహబూబ్‌నగర్ రూరల్: మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండలంలోని కోడూర్, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి, ఓబ్లాయిపల్లి తండాల్లో మాజీ మంత్రి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేష్, డీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి మహబూబ్‌నగర్ అసెంబ్లీ మహాకూటమి అభ్యర్థి ఎర్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జె.చంద్రశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు గోవింద్‌యాదవ్, సీపీఐ నాయకుడు రామకృష్ణ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరాములు, ఆంజనేయులు, చెన్నయ్య, వెంకట్రాములు, ఊషన్న, రమేష్‌శెట్టి, నర్సిములు, కుర్మయ్య, ఆనంద్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. హన్వాడలో.. హన్వాడ: మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతుగా కాంగ్రెస్ మండల నాయకులు తిరుమలగిరి, పుల్పొనిపల్లి, ఇబ్రహీంబాద్‌లో ప్రచారం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అదేవిధంగా కొనగట్టుపల్లి, బుద్దారంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఎర్రశేఖర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు సత్యం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు శబ్బీర్, నాయకులు కృష్ణయ్య, రామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకన్న, శ్రీను, ఖాసీం, ఎంపీటీసీ శ్రీనునాయక్, బాలగోపి, కలీం పాల్గొన్నారు. టీడీపీలో చేరిన కార్యకర్తలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: టీడీపీలో శుక్రవారం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. మహాకూటమి అభ్యర్థి ఎర్రశేఖర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్న తిరుపతయ్య దాదాపు 100మంది కార్యకర్తలతో టీడీపీలో చేరారు. వీరితో పాటు మహబూబ్‌నగర్ మండలంలో దాదాపు 150మంది ఆర్ఎంపీలు ఎర్రశేఖర్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎర్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ మూలాలు గట్టిగా ఉన్నాయని, ప్రభుత్వాలు మారిన కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం తగ్గలేదన్నారు. మహాకూటమి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కురుమ యాదవుల మద్దతు పాలమూరు: రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతు తెలపాలని కురుమయాదవ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సత్యంయాదవ్ తీర్మానం చేశారు. మండలంలోని పత్తేపూర్‌లో శుక్రవా రం నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యద ర్శి వెంకటేష్, చెన్నయ్య, లక్ష్మయ్య, సాయిబాబా, కేశవులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జడ్చర్లలో రికార్డు సత్యం..!
జడ్చర్ల టౌన్: జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14సారు ఎన్నికలు జర్గగా ఎర్ర సత్యం అలియాస్ మరాఠి సత్యనారాయణ అత్యధిక మెజారిటీ సాదించి రికార్డు నెలకొల్పారు. 1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడింది. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నర్సప్పపై 53,779ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఏ అభ్యర్థి కూడా ఈ రికార్డును చేరుకోలేకపోయారు. ఇక 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి 1,056 ఓట్ల తేడాతో విజయం సాదించారు. ఆయన సమీప టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఇక మెజారిటీ విషయానికి వస్తే ఎర్ర శేఖర్ అలియాస్ ఎం.చంద్రశేఖర్ పేరిట రెండో రికార్డు నమోదైంది. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో 47,735 ఓట్ల మెజారిటీతో ఆయన సమీప అభ్యర్థి సుధాకర్‌రెడ్డిపై గెలుపొందారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలైన రికార్డు కూడా ఎర్ర శేఖర్ పేరిటే ఉంది. 1996లో ఆయనకు ఏకంగా 72వేల ఓట్లు పోలయ్యాయి. ఒక అభ్యర్థికి ఇన్ని ఓట్లు రావడం జడ్చర్లలో ఇప్పటి వరకు ఇదే రికార్డు. రికార్డులపై లక్ష్మారెడ్డి దృష్టి జడ్చర్ల నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఎర్ర శేఖర్‌కు దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డి పలు రికార్డులపై దృష్టిసారించారు. మూడో పర్యాయం గెలవడం ద్వారా శేఖర్ రికార్డును సమం చేయటంతో పాటు ఎర్ర సత్యంకు దక్కిన మెజారిటీ దాటేందుకు కృషి చేస్తున్నారు. అలాగే, అత్యధికంగా ఓట్లు సాధించే రికార్డుపై ఆయన దృష్టి సారించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
హరీష్ ఆపరేషన్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లాల్లో ఉమ్మడి పాలమూరు ఒకటి. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజార్టీ సాధించొచ్చన్నది అన్ని పార్టీల భావన. అందుకే మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని పార్టీల మాదిరిగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రచార శైలిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే, కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్కు పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని కేసీఆర్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు ఉన్న మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు. ఆయా నియోజకవర్గాల్లో నిరంతరం ప్రత్యేక సమీక్షలు జరుపుతున్న హరీశ్.. శనివారం గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్కు కాస్త క్లిష్టంగా ఉన్నట్లు భావిస్తున్న నియోజకవర్గాలపై ఆ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని కొడంగల్, గద్వాల్, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు సర్వే నివేదికల వెల్లడైందని చెబుతూ... గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును రంగంలోకి దింపారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం హరీశ్‌రావు వ్యూహ, ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇదివరకే ఈనెల 17న ఒకసారి గద్వాల్, అలంపూర్‌లో పర్యటించిన ఆయన శనివారం మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇలా మొత్తం మీద జిల్లాలో మంత్రి హరీశ్ పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యేక దృష్టి ఉమ్మడి పాలమూరు జిల్లా విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో అత్యధిక స్థానాలు గెలుపొందాలని భావిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని కొన్ని స్థానాల్లో పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కొడంగల్, గద్వాల్ వంటి చోట్ల కాంగ్రెస్ తరఫున బలమైన నేతలు ఉండటంతో... వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు ఈ రెండు నియోజకవర్గాలకు రెండు, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే అరుణ, ఎనుముల రేవంత్‌రెడ్డిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకుండా చూడాలని గట్టి పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు చోట్ల టీఆర్ఎస్లో లుకలుకలు ఉన్నట్లు తెలుస్తుండగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ట్రుబల్ షూటర్‌ను రంగంలోకి దింపారు. అదే విధంగా మక్తల్, అలంపూర్‌ల్లో కూడా గ్రూపు తగాదాల నేపథ్యంలో పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మక్తల్‌లో ఏకంగా పార్టీకే చెందిన ఎం.జలందర్‌రెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో పార్టీ అభ్యర్థి విజయం సాధించాలనే యోచనతో హరీశ్‌రావు ప్రయత్నం చేస్తున్నారు. అలంపూర్‌లో సైతం పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి నేరుగా టికెట్ ప్రకటించడం.. పాత కేడర్‌తో కాస్త గ్యాప్ ఉన్న నేపథ్యంలో వాటన్నింటినీ హరీశ్ సరిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో ఆయన ఈనెల 17న అలంపూర్, గద్వాల్ల్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అభ్యర్థి విజయాలకు పాటుపడాలని సూచించారు. ప్రత్యేక నివేదికలు గులాబీ బాస్ కేసీఆర్‌కు రాష్ట్ర స్థాయిలో డీ.కే.అరుణ, ఎనుముల రేవంత్‌రెడ్డి తరచూ సవాళ్లు విసురుతున్నారు. దీంతో వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల్, కొండగల్ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితిలో గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రంగంలోకి దిగిన హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గంలో ఎవరు బలమైన నేతలు... ఎక్కడెక్కడ ఎవరెవరిని పార్టీలోకి తీసుకొస్తే లాభం జరుగుతుందనే అంశంపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలు, ప్రతీ గ్రామం చొప్పున నివేదిక రూపొందించినట్లు సమాచారం. వీటన్నింటినీ క్రోడీకరించి.. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిచేస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి హరీశ్‌రావు విస్తృతంగా పాలమూరు జిల్లా పర్యటనలు చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లో డబ్బు మూటలే ముఖ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/నర్సాపూర్: ‘రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, బ్లాక్ మనీ ఉన్నోళ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంది. టికెట్ల కేటాయింపులో డబ్బు మూటలే అర్హతగా మారాయి. ఎవరు డబ్బులిస్తే వారికే టికెట్. ఉస్మానియా యూనివర్సిటీని అడ్డాగా చేసుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులను తీసుకెళ్లి రాహుల్ గాంధీని కలిపించే ప్రయత్నం చేశారు. అయితే ఒక్క విద్యార్థి, ఉద్యమకారుడికైనా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చిందా’అని మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాకూటమిలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు కూడా చివరకు టికెట్ దక్కలేదని, పొద్దున ఇచ్చిన కుర్చీని సాయంత్రానికి లాక్కున్నారని ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. పేదలు, ఉద్యమ నాయకులకు ఎలా న్యాయం చేస్తుందని నిలదీశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, పిడమర్తి రవి వంటి విద్యార్థి ఉద్యమ నాయకులకు సముచిత స్థానం కల్పించడంతోపాటు ప్రొఫెసర్ సీతారాం నాయక్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ వంటి జేఏసీ నేతలను పార్లమెంట్‌కు పంపిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. తమ పార్టీ విద్యార్థి నాయకులు, ఉద్యమకారులను గౌరవిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం వారిని అవమానించి, రాజకీయాలకు వాడుకుని మొండిచేయి చూపిందన్నారు. కేసీఆర్‌తోనే ఉజ్వల తెలంగాణ.. ఉజ్వల తెలంగాణ కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమవుతుందని హరీశ్‌రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు ముంబై, బెంగళూరు, పుణే వంటి నగరాలవైపు కాకుండా హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు వృద్ధి చెందాయని, తెలంగాణ హక్కులు కాపాడుకునేందుకు మరోమారు టీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పటాన్చెరు టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పని చేసేవారిని కోరుకుంటున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేసే పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 28న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ రానున్నందున సభ ఏర్పాటుకోసం స్థలాన్ని పరిశీలించేందుకు శుక్రవారం మంత్రి నర్సాపూర్ వచ్చారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. దామోదర రాజనర్సింహ, సునీతారెడ్డి తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పలు కేసుల్లో హైకోర్టు కాంగ్రెస్ నేతలకు మొట్టికాయలు వేసినా వారికి బుద్ధి రావడం లేదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులు నిండి సాగునీరు కావాలనుకుంటే కారు గుర్తుకు ఓటేయాలని, సాగు నీరు వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని మంత్రి ప్రజలకు సూచించారు. కూటమి వస్తే అధోగతే.. కాంగ్రెస్ పార్టీ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుచే తల్లో ఉందని, అలాంటి పార్టీ చేతిలో తెలంగాణ ఉంటే మళ్లీ ఆగం అవుతుందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి దిక్కు, దిశ లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఎవరికి వారే లీడర్ అని, ఎవరికి ఇష్టం వచ్చింది వారు మాట్లాడతారని అన్నారు. ఆ పార్టీ నేతలకు అధికార యావ, కుర్చీల కొట్లాట తప్ప ప్రజా సేవ పట్టదని విమర్శించారు. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, స్నేహపూర్వక పోటీ పేరిట బీ ఫారాలు జారీ చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. పరస్పర విశ్వాసం లేని కూటమిని ప్రజలు ఎందుకు విశ్వసించాలని ప్రశ్నించారు. టికెట్లు, డబ్బుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబుపై ఆధారపడ్డారని విమర్శించిన హరీశ్.. తెలంగాణ తెచ్చుకుంది పరాయి పాలన కోసమా, పక్క రాష్ట్ర సీఎం కనుసన్నల్లో నడవడం కోసమా.. అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలవాలంటే చంద్రబాబునాయుడు చెప్పుచేతల్లో నడుస్తున్న కాంగ్రెస్ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. -
ఆ ఒక్క కుటుంబమే బాగుపడింది : రాహుల్ గాంధీ
సాక్షి, మేడ్చల్ : నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాకూటమి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల పోరాటం, సోనియా గాంధీ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఒకే ఒక వ్యక్తి తన ఇష్టానుసారం పాలన చేసి ప్రజల కలల్ని కాలరాశారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. నాలుగున్నరేళ్లలో కేవలం ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. అటువంటి రాక్షస పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీ టీజేఎస్, సీపీఎం, టీడీపీలతో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడిందని పేర్కొన్నారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘తెలంగాణ ఆకాంక్షల్ని అర్థం చేసుకుని సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. కానీ మీ ఓట్లతో గద్దెనెక్కిన ఆ వ్యక్తి కేవలం తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించాడు. మీ కలల్ని నెరవేర్చలేకపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత ప్రజాకూటమి తీసుకోబోతోంది. మీ ఆకాంక్షలకు అనుగుణంగా, మీ ఆలోచనలను, అభిప్రాయాలను స్వీకరించి తెలంగాణ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, యువత పరిస్థితి కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాగానే రైతులు, మహిళల సమస్యలు తీరుస్తుంది. యువతకు ఉపాధి కల్పిస్తుంది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నాలుగున్నరేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
-
‘అది ప్రజా వ్యతిరేక కూటమి’
సాక్షి, సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): కాంగ్రెస్, తెలంగాణ ద్రోహుల పార్టీ అయిన టీడీ పీ పొత్తుతో ఏర్పడిన మహాకూటమి తెలంగాణ ప్రజల వ్యతిరేక కూటమి అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం నిజామాబాద్ అర్బన్ శివసేన అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నామినేషన్ ఉపసంహరించుకున్న అనంతరం విలేకరులతో మా ట్లాడారు. పార్టీ ఆదేశాల మేరకు జాతీ య కార్యదర్శి కృష్ణదాస్, తాను జిల్లాకు వచ్చి ధన్‌పాల్‌తో సంప్రదింపులు జరిపామని, అవి ఫలించాయ న్నారు. ధన్‌పాల్‌కు పార్టీలో సముచితమైన స్థానాన్ని ఇస్తామని, ఆయన త్యాగాన్ని పార్టీ మర్చిపోదని, రాజీనామాలను తిరస్కరించామన్నారు. పొత్తులు శోచనీయం.. రాష్ట్రంలో టీఆర్ఎస్–మజ్లీస్, కాంగ్రెస్– టీడీపీలు పొ త్తులు శోచనీయమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం లో బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని, అర్బన్‌లో మజ్లిస్ పోటీలో లేదంటే టీఆర్ఎస్ మాయేనన్నారు. పార్టీ గౌరవాన్ని చూసే...: ధన్పాల్ బీజేపీ తనకిచ్చిన గౌరవాన్ని గుర్తించి నామినేషన్ ఉపసంహరించుకున్నానని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. భవిష్యత్ బీజేపీదేనని, హిందువుల ఓట్లు చీలిపోవద్దనే ఉద్ధేశంతో పోటీ నుంచి తప్పుకున్నానన్నారు. పార్టీ జిల్లాఅధ్యక్షులు పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, లోక భూపతిరెడ్డి, నాయకులు గజం ఎల్లప్ప, బాల్‌రాజ్, యెండల సుధాకర్, జాలిగం గోపాల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రనేతల బుజ్జగింపులు ఫలించాయి. నామినేషన్లకు చివరిరోజైన మంగళవారం పార్టీ ఆదేశాల మేరకు జాతీయ నాయకులు కృష్ణ దాస్, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షు లు కిషన్‌రెడ్డి ధన్‌పాల్‌తో రహస్య ప్రదేశంలో నాలుగ్గంటలకు పైగా భేటీ అయి చివరకు ఆయనను ఒప్పించారు. -
ఆశీర్వదించండి.. సేవకుడిలా పనిచేస్తా..
సాక్షి, పాన్‌గల్: కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థిని ఒక్కసారి ఆశీర్వదించండి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకుడిగా పనిచేస్తానని కొల్లాపూర్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోప్లాపూర్, కిష్టాపూర్‌తండా, మాధరావుపల్లి, కదిరెపాడు, శాగాపూర్‌తండా, చిక్కేపల్లి, కేతేపల్లి గ్రామాల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా నాయకులు కళావతమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోను రూ పొందించిందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్ఎస్కు ఓటు ద్వారా తగిన గుణపా ఠం చెప్పాలన్నారు. గోప్లాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సిద్ధయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు రామ్మూర్తినాయుడు, రవికుమార్, వెంకటయ్యనాయుడు, శ్రీరాం, అశోక్‌రెడ్డి, రఘుపతినాయుడు, సాయికుమార్‌రెడ్డి, నర్సింహ, రాజారెడ్డి, హన్మంతురెడ్డి, రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. వీపనగండ్ల: గ్రామాల్లో మహిళలు, యువకులు, విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న దృఢసంకల్పంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మహాకూటమి తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి గెలుపు కోసం గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, రుణమాఫీ పేరుతో రైతులను, డబుల్ బెడ్రూం పేరుతో నిరుపేదలను మోసం చేసిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావును ఓడించేందుకు అన్ని గ్రామాల్లో ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీరయ్య, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, బాలచందర్, కృష్ణయ్య, వెంకట్‌రెడ్డి, బాలస్వామి, రాఘవేందర్‌రెడ్డి, సాయిబాబ పాల్గొన్నారు. -
సగం మీసం, సగం గుండుతో ప్రచారం..
సాక్షి, అడ్డగూడూరు : టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన బండి మధు మండల పరిధిలోని డి.రేపాక గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్‌తో కలిసి వినూత్న ప్రచారం నిర్వహించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా సగం మీసం, సగం గుండు తీయించుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్‌కు ఓటువేయాలని ప్రచారం నిర్వహించాడు. -
9నెలల ముందే కాడి వదిలేశారు...
సాక్షి, వనపర్తి : నాలుగున్నరేళ్లలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి మండలం మెంటెపల్లి, కడుకుంట్ల, పెద్దగూడెం, కిష్టగిరి గ్రామాల్లో మహాకూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. పాలన చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌కు భంగపాటు తప్పదన్నారు. ఈ ఎన్నికల్లో అధిక మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రైతులందరికీ పంట రుణమాఫీ, బీమా సౌకర్యం, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జెడ్పీటీసీ వెంకటయ్య యాదవ్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ సర్పంచ్ జానకి కొండన్న, సహదేవ్ యాదవ్, మాసిరెడ్డి, తిరుపతయ్య, జనార్దన్ పాల్గొన్నారు. ఖిల్లాఘనపురం: వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా 20 ఏళ్లపాటు పనిచేసి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన తన తండ్రి ఏనాడూ అవినీతి, అక్రమాలకు అవకాశం ఇవ్వలేదని, ఆయనంటే ప్రజలకు ఓ నమ్మకమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మామిడిమాడ, ముందలితండా, వెనికితండాల్లో ఆయన మండల సింగల్‌విండో అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి తదితరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి చేతిగుర్తుకు ఓటువేసి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పోల్‌శెట్టి శ్రీను, బండారి శ్రీను, బండారి యాదయ్య, డాక్టర్ నరేందర్‌గౌడ్, నాగేశ్వర్, కృష్ణయ్య యాదవ్, జయాకర్, బాల్‌రాజు, దేవిజానాయక్, గోవింద్‌నాయక్, రాజు, మాసయ్య పాల్గొన్నారు. -
అంతర్మథనంలో పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడి నుంచి అన్ని హోదాల్లో పనిచేసిన నాయకుడిగా, ఆలిండియా యూత్‌కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎనిమిదిన్నరేళ్లు ఏఐసీసీ సెక్రటరీగా పనిచేసిన తనకే అసెంబ్లీ టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందనే అవమానంతో ఆయన సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. 35 ఏళ్ల నుంచి పార్టీకి చేస్తున్న సేవను గుర్తించకుండా పొత్తు పేరుతో పొంగులేటి ఆశించిన ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని దక్కకుండా కొందరు టీపీసీసీ పెద్దలు కుట్ర చేశారనే భావనలో ఆయన అనుచరులు, సన్నిహితులు ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో సీపీఐతో, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని పొంగులేటికి టికెట్ రాకుండా చేశారని చెబుతున్నారు. పార్టీలో పదవులు రాకుండా అడ్డుకున్న నేతలే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారమే టీపీసీసీ ముఖ్యులు ఇదంతా చేశారని భావిస్తున్న పొంగులేటి వర్గీయులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పొంగులేటిని బుజ్జగించేందుకు గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. నేరుగా రాహుల్‌గాంధీతో సంబంధాలున్న ఆయనకు పార్టీలో అన్యాయం జరగకుండా చూస్తామని, భవిష్యత్తులో ఆయన సేవలను కీలకంగా ఉపయోగించుకుంటామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ టికెట్ ఆశించి రాకపోవడంతో రెబెల్స్‌గా బరిలో ఉన్న తండు శ్రీనివాసయాదవ్ (సూర్యాపేట), దళ్‌సింగ్ (ఇల్లెందు), ఎండీ ఫజల్ (ఖమ్మం), కె.శ్రీరాములు (అశ్వారావుపేట) తదితరుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయాలని కూడా ఆయనపై ఏఐసీసీ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. పొంగులేటి మాత్రం తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వడంలో టీపీసీసీ పెద్దలు అన్యాయం చేశారనే అవమానభారంతోనే ఉన్నారని తెలుస్తోంది. మరి అధిష్టానం బుజ్జగింపులతో పొంగులేటి సర్దుకుంటారా..? పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై రాహుల్‌కు ఫిర్యాదు చేస్తారా..? తొలి నుంచీ టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆయన ఖమ్మంలో ఆ పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. -
కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతా
సాక్షి, వికారాబాద్: కొడంగల్‌లో టీఆర్ఎస్ను గెలి పిస్తే ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి రైతు ల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబందుల ప్రభుత్వం కావాలో.. ‘రైతు బంధు’ప్రభుత్వం కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. నాణ్యమైన కరెంటు పగటి పూట ఇవ్వాలని అడిగిన రైతులను కాల్చి చంపిన కాంగ్రెస్‌ను గెలిపించి మోసపోవద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమమని, మహాకూటమి గెలిస్తే సంక్షోభమని అన్నారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారని, వారంతా కలిసి 60 నెలలు పాలిస్తారని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అని, కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగల రా అంటూ ప్రశ్నించారు. జిల్లాకు నలుగురు సీఎం అభ్యర్థులున్నారని, వీరిలో రేవంత్‌రెడ్డి, డీకే.అరుణ, చిన్నారెడ్డిలున్నారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే టికెట్ల కోసం, బీ ఫాంలకోసం, చివరకు బాత్రూంకు వెళ్లాలన్నా అనుమతికి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుం దని తెలిపారు. టీఆర్ఎస్ గెలిస్తే సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, పింఛన్ల పెంపు, పింఛన్‌కు అర్హత వయసు 57 ఏళ్లు, నిరుద్యోగ భృతి, రూ.లక్షలోపు రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పన వేగవంతం, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. దేశంలోని సీఎంలు నేర్చుకునేలా కేసీఆర్ పాలన ఉందని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి ‘మహా కూటమి’ ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి రేవంత్ సిద్ధమేనా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆయన చేతలమనిషైతే సవాల్‌ను స్వీకరించాలన్నారు. టీవీల ముందు కూర్చుని మాటలు చెప్పి, పోజులు కొడితే పనులు కావని, అభివృద్ధి కావాలంటే చిత్తశుద్ధి ఉండాలన్నారు. మహాకూటమి గెలిస్తే మన జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంటుందన్నారు. ఈ ప్రాంతానికి పాలమూరు నీరు రాకుండా 30 ఉత్తరాలు రాసిన బాబును మనం గెలిపిద్దామా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తిడితే పెద్దవాళ్లు అయిపోతారా అని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే నరేందర్రెడ్డిపై గెలిచి చూపించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, హైదరాబాద్ మేయర్ దొంతు రామ్మోహన్, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ పాల్గొన్నారు. బుధవారం కొడంగల్ రోడ్‌షోకు భారీగా హాజరైన జనం -
సెంటిమెంటే అస్త్రం.. అతిరథ మహారథుల ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే కారణమనే సెంటిమెంటును అస్త్రంగా ప్రయోగించి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. దీని అమలు కోసం అతిరథ మహారథులు రాష్ట్రానికి వస్తున్నారు.కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, ఏఐసీసీ ట్రెజరర్ అహ్మద్ పటేల్ రంగప్రవేశం చేశారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడిన బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్‌పటేల్ బుధవారం వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రబుల్ షూటర్‌గా వెళ్లే కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జైరాంరమేశ్ వరకు అందరూ క్యూ కట్టి హైదరాబాద్ వస్తున్నారు.వీరప్పమొయిలీ, జైపాల్లాంటి నేతలు దౌత్యం చేస్తుండగా, కుష్బూ, చిదంబరం, పృథ్వీరాజ్‌చౌహాన్, నారాయణస్వామిలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎన్నికల రంగంలో వేడి పెంచుతున్నారు. సర్దుకు పోండి.. మేం అండగా ఉంటాం ‘మహాకూటమి’కారణంగా కుదుర్చుకున్న పొత్తుల వల్ల నష్టపోతున్న స్థానాలు, పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఏఐసీసీ పెద్ద కసరత్తే చేసింది.అభ్యర్థుల ఖరారుకు ముందే రాష్ట్రానికి చెందిన 15 మంది వరకు నేతలను ఢిల్లీకి పిలిపించి వార్‌రూంలో చర్చించిన పార్టీ అధిష్టానం... అభ్యర్థిత్వాల ఖరారు కోసం మరోమారు బృందాలను పంపింది. మొదటి దఫాలో కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావులు హైదరాబాద్‌కు వచ్చి అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. దాదాపు 25 మంది నేతలతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమై వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత బెట్టుగా ఉన్న మరికొందరిని దారిలోకి తెచ్చుకునేందుకు ఇద్దరు సీనియర్లకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పజెప్పింది. కేంద్ర మాజీ మంత్రులు వీరప్పమొయిలీ, ఎస్.జైపాల్‌రెడ్డిలు గత రెండురోజులుగా ఇదే పనిలో ఉన్నారు. ఇక బుధవారమే హైదరాబాద్ నగరానికి చేరుకున్న జైరాంరమేశ్ కూడా ఇదే పనిలో ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గ టికెట్ ఆశించిన తోటకూర జంగయ్యయాదవ్ వద్దకు కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, జెట్టి కుసుమకుమార్‌లతో కలపి బోడుప్పల్‌కు వెళ్లి మరీ జంగయ్యకు సర్దిచెప్పారు. ఈ చర్యలతో రెబెల్స్ బెడద అంతగా లేకుండా నివారించుకోగలిగారు. మరోవైపు శివకుమార్ గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు.ప్రచారం, వ్యూహాలు, అంతర్గత సమస్యలపై ఆయన టీపీసీసీ ముఖ్యులతో సమన్వయం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఈనెల 23న జరగనున్న సోనియా, రాహుల్‌ల సభను జయప్రదం చేసేందుకు జైరాంరమేశ్ కూడా ఆయనకు తోడయ్యారు. ఇచ్చామన్న సెంటిమెంటుతో... పోయిన చోటే వెతుక్కోవాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్‌ను మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తుకు తేవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీతో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈ సభలోనే తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సోనియాకు సన్మానం చేసేందుకు టీపీసీసీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరాన్నీ రంగంలోకి దింపారు. బుధవారమే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణ రాష్ట్రానికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేశారు. చిదంబరంతో పాటుగా తెలంగాణ బిల్లును రూపొందించిన కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్ కూడా హైదరాబాద్ వచ్చారు. వీరిద్దరితో ఎన్నికల ప్రచారం చేయించడం ద్వారా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసే ప్రయత్నానికి వ్యూహాత్మకంగా శ్రీకారం చుట్టడం గమనార్హం. బిక్షపతి యాదవ్ ఇంటికి అహ్మద్ పటేల్ శేరిలింగం పల్లి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్‌ను ఆయన ఇంటికి వెళ్లి ఏఐసీసీ కోశాధికారి అహ్మద్ పటేల్ అనునయించారు. ఆయనకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఏమిస్తామన్నది ఇప్పుడు చెప్పడం ధర్మం కాదని అయితే బిక్షపతి యాదవ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేందుకు అంగీకరించారని అహ్మద్ పటేల్ విలేకరులకు తెలిపారు.పటేల్ వెంట పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్ రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కి తదితరులు ఉన్నారు. మహిళా నేతలతో.. ప్రచారం కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నేతలనూ రంగంలోకి దింపింది. రాష్ట్రానికి చెందిన స్టార్‌క్యాంపెయినర్ విజయశాంతికి తోడు తమిళనాడుకు చెందిన ఖుష్బూ సుందర్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జడ్చర్లలో రోడ్‌షో చేసిన ఖుష్బూ వచ్చే వారంలో మరిన్ని చోట్ల ప్రచారం చేయనున్నారు. ఈమెతో పాటు ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. -
సీపీఐ ‘సర్వేజనా సుఖినో భవంతు’
సాక్షి, హైదరాబాద్: భూ చట్టాల్లో సమగ్ర మార్పులు, విద్యుత్ చార్జీలకు టెలిస్కోపిక్ విధానం రద్దు, మద్యం అమ్మకాల సమయం కుదింపు తదితర అంశాలతో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఈబీసీ, మైనార్టీ, అనాథల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతోపాటు కేరళ తరహాలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో మార్పులు తెచ్చి మినీ సూపర్ మార్కెట్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టనున్నట్టు ప్రతిపాదించింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మహాకూటమిగా ఏర్పడిన నేపథ్యంలో అన్ని పక్షాలు కలసి ‘కామన్ ఎజెండా’రూపొందిస్తూనే భాగస్వామ్య పక్షాలు మాత్రం సొంతంగా ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. సీపీఐ రూపొందించిన మేనిఫెస్టోలో ధార్మికరంగంపైనా ప్రత్యేక దృష్టిని సారించింది. దీనిలో భాగంగా అన్ని మతాల ప్రార్థనాలయాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు, ఆలయాలు, ప్రార్థనా సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత, పెన్షన్ల చెల్లింపు వంటి వాటిని చేర్చింది. సీపీఐ సూచిస్తున్న ఆయా అంశాలను మహాకూటమి ‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’లేదా కామన్ ఎజెండాలో చేర్చాలని ఆ పార్టీ కోరనుంది. సీపీఐ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, డా.సుధాకర్‌లతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. ఈ మేనిఫెస్టోను సీపీఐ గురువారం విడుదల చేయనుంది. మేనిఫెస్టో ముఖ్యాంశాలు.. - ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి కట్టడికి చర్యలు - పాతకాలపు రెవెన్యూ చట్టాల్లో సమూల మార్పులు - వ్యవసాయరంగ పరిరక్షణ, రైతులు, కౌలు రైతుల సంక్షేమానికి చర్యలు - అన్ని వర్గాలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు - మద్యం విక్రయ సమయాలు మరింత కుదింపు ∙పర్యావరణ పరిరక్షణ - పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ - విద్యుత్ చార్జీల గణనకు ప్రస్తుతమున్న టెలిస్కోపిక్ విధానం రద్దు - ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత - ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, క్రీడాకారులు, న్యాయవాదుల సంక్షేమానికి చర్యలు - కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ - ప్రవాస తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణకు చర్యలు - మెట్రో రైలు చార్జీల తగ్గింపు ట్రాన్స్జెండర్లు, బాలకార్మికుల హక్కుల పరిరక్షణ. -
మహాకూటమి ముసుగులో కుట్ర: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమి ముసుగులో చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ జీవోలు విజయవాడ నుంచి విడుదల అవుతాయన్నారు. బుధవారం అంబర్‌పేటలో నిర్వహించిన తెలంగాణ న్యాయవాదుల సభకు కేటీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. న్యాయవాదుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించిదని గుర్తు చేశారు. హైకోర్టు విభజనను చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారుని ఆరోపించారు. హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబు కేసులు బయట పడతాయని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జడ్జీల నియామకంలో తెలంగాణ వాళ్లకు అన్యాయం జరుగుతుందని, కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. జూనియర్ న్యాయవాదుల డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. కులాల, మతాలు, ప్రాంతాలుగా ప్రజలను విడగొట్టి మహాకూటమి రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. సీమాంద్ర ప్రజల సమష్టిని మహాకూటమి తక్కువ అంచనా వేస్తుందని.. వాళ్లే కూటమికి బుద్ది చెబుతారన్నారు. నాలుగున్నరేండ్లలో నాలుగు సెకన్లు కూడా కర్ప్యూ లేకుండా పాలించిన దమ్మున్ననేత కేసీఆర్ అని తెలిపారు. నాలుగు పార్టీలు కలిసి 40 సీట్లు పంచుకోలేనోళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ సీఎం అవుతారు.. మరి కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం పదవి చిన్న పిల్లపిల్లల కుర్చిలాటలాగే అవుతుందన్నారు. టీఆర్ఎస్ సింహింలా సింగిల్ వస్తుందని.. మరో సారి అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. -
చెరుకు సుధాకర్‌ను పరామర్శించిన కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను టీజేఎస్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ కోదండరాం బుధవారం పరామర్శించారు. లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సుధాకర్ ఆరోగ్య వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం కలిసి పని చేశామన్నారు. మహాకూటమిలో ఒక సీటు వెనక్కి తీసుకున్నప్పటికీ, సుధాకర్ కూటమి విజయాన్ని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. మహాకూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని సుధాకర్ తనకు మాట ఇచ్చారని.. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకుని మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానన్నారు. కాగా తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు కేటాయిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పెద్దలు మాట తప్పారని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు కూడా. ఇందులో భాగంగానే 21మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ చెరుకు సుధాకర్ గత బుధవారం విడుదల చేశారు. అంతేకాకుండా తమ పార్టీ తరపున మొత్తం 52 మందిని బరిలోకి దింపుతామని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తాను మహాకూటమికి వ్యతిరేకం కాదని, త్వరలోనే మహాకూటమి తరఫున ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. -
పద్మ వికాసం!
మెతుకుసీమగా పేరొందిన మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరోసారి ఇక్కడ గెలుపుపై గురిపెట్టారు. కూటమిలో లుకలుకలు, టీజేఎస్, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ తొలి శాసనసభ సభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన ఆమెకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి ప్రత్యేక గుర్తింపు పొందారు. మహిళా ఎమ్మెల్యేగా ఆమెకు కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనం. ఇక తాను చేపట్టిన పనులు, టీఆర్ఎస్కున్న బలమైన కేడర్, ప్రత్యర్థుల బలహీనతలే తన బలంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా నియోకజవర్గం పరిధిలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. మరోసారి తనను గెలిపిస్తే మెదక్ రూపురేఖలు మారుస్తానని ఆమె ప్రజలకు హామీ ఇస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సీటు ముందే ఖరారు కావడంతో ఆమె రెండు నెలల ముందునుంచే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రత్యర్థి ఎవరనే విషయంలో కొంత స్పష్టత లోపించింది. మొదట ఈ స్థానాన్ని మహా కూటమి తరపున టీజేఎస్‌కు కేటాయించారు. టీజేఎస్ తరపున చిన్నశంకరం పేటకు చెందిన జనార్దన్‌రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పాపన్నపేటకు చెందిన ఉపేందర్‌రెడ్డికి కూడా బీ ఫాం ఇచ్చింది. దీంతో ఆయన కూడా నామినేషవేశారు. సిట్టింగ్ ప్రొఫైల్ రామాయంపేట మండలం కోనాపూర్‌కు చెందిన మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. బీఏ ఎల్ఎల్బీ చదివిన ఆమె 2001లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2001 నుంచి 2004 వరకు రామాయంపేట జెడ్పీటీసీగా పనిచేశారు. 2004లో మొదటి సారిగా రామాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడారు. 2009లో మెదక్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి తిరిగి ఓటమి చవిచూశారు. 2014లో విజయశాంతిపై పోటీచేసి 39,600 మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ తొలి శాసన సభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. Segment Graph ప్రత్యేకతలు - పంచాయతీరాజ్ ద్వారా రూ.156 కోట్లతో రహదారుల నిర్మాణం - మెదక్ పట్టణానికి రూ.880 కోట్లతో రింగ్‌రోడ్డు - రూ.38 కోట్లతో సమీకృత కలెక్టరేట్, రూ.18 కోట్లతో పోలీసు కార్యాలయం భవనాలు నిర్మాణం - రైతుల కోసం మండలానికి ఒక గోదాము నిర్మించారు. - మెదక్ పట్టణంలో 300 పడకల ఆసుపత్రి - వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. - మెదక్ పట్టణంలో మినీట్యాంక్‌బండ్, బ్యూటిఫికేషన్ - రైతు బంధు ద్వారా 59,835 మందికి లబ్ది చేకూరింది. - సీఎంఆర్ఎఫ్ ద్వారా 2329 మంది సహాయం. ప్రధాన సమస్యలు - వ్యవసాయ ప్రధానమైన మెదక్‌లో సాగునీరు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. - చెరుకు రైతులకు ఉపయోగపడే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని తెరిపించాల్సి ఉంది. - ఘనపురం ప్రాజెక్టు పనులు పెండింగ్. - పీజీ, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యా సంస్థలు లేవు. యువత ఉపాధి సమస్య ఎదుర్కొంటోంది. .:: ఇన్పుట్స్: నాగరాజు కాకోళ్ల, మెదక్ -
పోటీ అభ్యర్థులు తక్షణమే ఉపసంహరించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి స్ఫూర్తిని దెబ్బతీయకుండా పోటీ అభ్యర్థులను తక్షణమే భాగస్వామ్యపక్షాలు అన్ని చోట్ల ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కోరారు. ఇప్పటికే నడుస్తున్న కాలయాపనపై కూటమి పార్టీల శ్రేణులు ఆందోళన లో ఉన్నాయని, కాంగ్రెస్, టీజేఎస్‌లు వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు మంగళవారం ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. -
కూటమికి టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తాలేదు: గట్టు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా మహాకూటమికి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2 నెలల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఓటేయాలని అడిగే స్థాయి కూడా లేని కూటమి నేతలు ప్రజల్లో అభాసుపాలవుతారన్నా రు. తెలంగాణను విచ్ఛిన్నం కాకుండా చూసి అభివృద్ధి ఫలాలను అన్నివర్గాలకు పంచిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆరేనని అన్నారు. -
‘అన్ని సర్వేల్లోనూ ప్రజా కూటమిదే విజయం’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో ప్రజాకూమిదే గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెపుతున్నాయి.. ఈ 15 రోజులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే కూటమిదే విజయమని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఇక కేసీఆర్ ఫాంహౌజ్‌కు, కేటీఆర్ అమెరికాకు పోవాల్సి వస్తదని ఎద్దేవా చేశారు. దోచుకున్న డబ్బుతో ఎన్నికను ప్రభావితం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాజీ అయిపోయాడని, ఇక మాజీగానే ఆయన ఉంటారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మేడ్చల్ సభతో తెలంగాణలో కీలక మార్పులు ఈ నెల 23న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు వారు బేగంపేటకు చేరుకొని కారు ప్రయాణం ద్వారా మేడ్చల్ చేరుకుంటారని చెప్పారు. సాయంత్రం 5 నుంచి 6గంటలకు బహిరంగ సభలో ప్రసంగం ఉంటుందన్నారు. కార్యకర్తలు అందరూ సోనియా, రాహుల్‌కు స్వాగతం పలుకాలని కోరారు. ప్రతి ఒక్కరిని సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కీలకమార్పులు జరుగనున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. -
మహాకూటమి కాదు.. మాయాకూటమి
-
సీట్ల సర్థుబాటు సరిగా జరగలేదు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి 8 సీట్లు ఇస్తామన్నారని, కానీ 6 సీట్లు మాత్రమే ఇచ్చారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, మహబూబ్ నగర్ కావాలని తాము అడిగామని తెలిపారు. తమ అభ్యర్థులు ఉన్న చోట.. కాంగ్రెస్ అభ్యర్థులను ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నామన్నారు. సరైన పద్దతుల్లో సీట్ల సర్థుబాటు జరగలేదని తెలిపారు. ముస్లింలకు ఒక్క సీటు అయినా ఇవ్వాలనుకున్నామని, కానీ గందరగోళం మధ్య ముస్లింలకు సీటు కేటాయించలేకపోయామని కోదండరాం చెప్పారు. తమకిచ్చే సీట్లకు అదనంగా ఒక్క సీటును ఓల్డ్ సిటీలో అదనంగా కోరామన్నారు. అందర్నీ ఒప్పించే పరిస్థితి ఉంటేనే.. జనగామ సీటు ఇవ్వమన్నానని కోదండరాం తెలిపారు. మహాకూటమికి నష్టం లేకపోతేనే తాను జనగామ నుంచి పోటీ చేయాలనుకున్నానని పేర్కొన్నారు. బీసీల కోసం తాము జనగామ స్థానాన్ని వదులుకున్నామన్నారు. కానీ.. తాము కోరుకున్న మిర్యాలగూడలో బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యను పెట్టారని తెలిపారు. ఆర్. కృష్ణయ్యను పోటీలో పెడ్తారని తమకు తెలియదన్నారు. మహాకూటమీ 'కామన్ మినిమమ్ ప్రోగ్రామ్'ను త్వరలో ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. కూటమి వల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం ఉందని అర్థమైందని, పెద్దన్న పాత్రను కాంగ్రెస్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మేడ్చచ్లో జరగనున్న సోనియా గాంధీ సభలో పాల్గొంటామన్నారు. స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడు మాట్లాడలేనన్నారు. తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తి సహజంగానే ఉంటుందన్నారు. -
పాలమూరులో బహుముఖ పోటీ
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అందరూ ఊహించినట్లుగానే పోటీ రసవత్తరంగా మారనుంది. పెద్దసంఖ్యలో నామినేషన్లు, దాఖలుకావడం చూస్తుంటే బహుముఖ పోటీ అనివార్యం కానుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్రంగా కొందరు టికెట్లు రాని ఆశావాహులు ఆయా పార్టీల నుంచి రెబల్‌గా బరిలో దిగితుండటంతో మహబూబ్‌నగర్ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. జిల్లాలోని 5 నియోజకవర్గాల కంటే అత్యధికంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 29మంది అభ్యర్థులు, 51సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పొత్తుల్లో టికెట్లు ఆశించిన వారు ఇతర పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని నామినేషన్లు దాఖలు చేయగా మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. మొదట టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ దాదాపు 60రోజుల నుంచే తన ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజాకూటమిలో భాగంగా ఈ సీటును కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటిపార్టీలు పోటాపోటీగా సీటును ఆశించడంతో సమస్య జఠిలంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు ఒబేదుల్లా కొత్వాల్, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సయ్యద్ ఇబ్రహీం, టీడీపీ నుంచి వచ్చి చేరిన ఎన్పీ వెంకటేశ్, వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చి చేరిన ఎం.సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించారు. టీడీపీ నుంచి ఎట్టిపరిస్థితుల్లో తనకే కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్(ఎర్ర శేఖర్) పట్టుబట్టారు. ఆ దిశగా ఆయన మొదటి నుంచే జనాల మధ్యకు దూసుకెళ్లారు. తెలంగాణ జనసమితి నుంచి ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పట్టుబట్టారు. దీంతో ఎవరంతట వారు తమకంటే తమకే ఈ సీటు కావాలంటూ కూటమిలో తీవ్ర ఒత్తిడి చేశారు. అదేవిధంగా తెలంగాణ ఇంటిపార్టీ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చివరిదాకా ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ప్రజాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం.చంద్రశేఖర్(ఎర్ర శేఖర్)కు కేటాయించారు. ఆశావాహుల్లో అసంతృప్తి దీంతో ఆశావాహుల్లో అసంతృప్తి వెల్లువెత్తింది. కాంగ్రెస్ పార్టీలో సీటు ఆశించిన సురేందర్‌రెడ్డి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరపున, సయ్యద్ ఇబ్ర హీం బహుజన సమాజ్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితుండగా, ఫ్రెండ్లీ కాంటెస్టింగ్లో భాగం గా తెలంగాణ జనసమితి కూడా రాజేందర్‌రెడ్డికి బీ–ఫాం ఇచ్చింది. దీంతో ఆయన కూడా టీజేఎస్ తరపున సోమవారం నామినేషన్ వేశారు. మొత్తం గా నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయానికి ఆమ్ఆద్మీ పార్టీ తరపున బాబుల్‌రెడ్డి, టీడీపీ నుంచి భవాని, ప్రజాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా యం. చంద్రశేఖర్(ఎర్ర శేఖర్), టీఆర్ఎస్ వి.శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ జి.పద్మజారెడ్డి, బీజేపీ రెబల్ అభ్యర్థిగా పడాకుల బాల్‌రాజ్, కాంగ్రెస్ టికెట్ ఆశించి పొత్తులో టీడీపీకి కేటాయించడంతో ఎన్సీపీ టికెట్‌తో ఎం.సురేందర్‌రెడ్డి, ఫ్రెండ్లీ కాం టెస్టింగ్ టీజేఎస్ అభ్యర్థిగా రాజేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా సయ్యద్ ఇబ్రహీం, కృష్ణయ్య, బీఎల్పీ నుంచి గులాంగౌస్తోపాటు స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా మొదటి నుంచి సీట్ల కేటాయింపులో జరిగిన ఉత్కంఠతకు నామినేషన్ల చివరిరోజు వరకు అదే ఉత్కంఠ కొనసాగింది. బహుముఖ పోటీలో పాలమూరు ప్రజలు ఎవరిని ఆదరిస్తారనే విషయం తేలాల్సి ఉంది. పరిశీలన, బుజ్జగింపుల తర్వాత ఎవరెవరు పోరులో ఉంటారనేది తేలాల్సి ఉంది. ఈ నెల 22న ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉండేదెవరు, ఉపసంహరించుకునేదెవరో తేలాల్సి ఉంది. టికెట్లు ఆశించి భంగపడిన వారు ఇతర పార్టీలను ఆశ్రయించి టికెట్లు తెచ్చుకొని నామినేషన్లు వేయడంతో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. -
తెలంగాణకు సోనియా,రాహుల్,మన్మోహన్
-
తెలంగాణ ప్రజలు నిరంకుశ పాలనలో విసిగిపోయారు
-
కూటమి తరఫున ప్రచారం: చెరుకు సుధాకర్
సాక్షి, హైదరాబాద్: తాము మహాకూటమికి వ్యతిరేకం కాదని, త్వరలోనే మహాకూటమి తరఫున ప్రచారం చేస్తామని తెలంగాణ ఇంటి పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ అమలు జరగటం లేదన్నదే తమ ఆవేదన అని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కూటమి ప్రతిపాదన పెట్టామని పేర్కొన్నారు. చాలామంది పోటీపడ్డా.. ఆర్.కృష్ణయ్యకు మిర్యాలగూడ టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. అదే చొరవ తమ విషయంలోనూ చూపించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహాకూటమిలో జరిగిన పరిణా మాలపై తాము తెలిపిన నిరసన ఉత్తమ్ మీదనో మరెవరి మీదనో కాదని వివరణ ఇచ్చారు. కృష్ణయ్య, కాసాని జ్ఞానేశ్వర్‌ని కూటమిలో చేర్చుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నానని, ఆరోగ్యం మెరుగయ్యాక కూటమి తరుఫున ప్రచారం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
రాహుల్.. సోనియా.. మన్మోహన్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ : రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్సహా మాజీ కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు, పలువురు సినీనటులను రంగంలోకి దించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం ముమ్మరం చేయనుంది. ఇందుకు సంబంధించి సోమవారం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనన్న క్యాంపెయినర్ల జాబితాను సోమవారం పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే... రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, వి.నారాయణస్వామి, అశోక్ చవాన్, జి. పరమేశ్వర, మీరా కుమార్, డీకే శివకుమార్, మహ్మద్ అజారుద్దీన్, విజయ శాంతి, సల్మాన్ ఖుర్షీద్, జ్యోతిరాదిత్య సింధియా, జైపాల్ రెడ్డి, ఆర్సీ కుంతియా, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్, బీఎస్ బోసురాజు, మర్రి శశిధర్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాములు నాయక్, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పి.సుధాకర్‌రెడ్డి, రేణుకా చౌదరి, డీకే అరుణ, వి.హన్మంతరావు, రాజ్‌బబ్బర్, నదీం జావేద్, నగ్మా, ఖుష్బూ, నేరెళ్ల శారద, జైరాంరమేశ్, అనిల్ థామస్, నితిన్ రౌత్. టీడీపీ స్టార్ క్యాంపెయినర్లు 19మంది ఇక 19మందితో టీడీపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టి.దేవేందర్‌గౌడ్, రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు సండ్ర వెంకట వీరయ్య, పెద్దిరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, మండల వెంకటేశ్వర్రావు, లక్ష్మణ్ నాయక్, ఎండీ యూసుఫ్, గుల్లపల్లి బుచ్చిలింగం, ఈగ మల్లేశం, నన్నూరి నర్సిరెడ్డి, నల్లూరి దుర్గా ప్రసాద్, పి.సాయిబాబా, టి.వీరేందర్ గౌడ్, బొట్ల శ్రీనివాస్, ఎండీ తాజొద్దీన్, వల్లభనేని అనిల్ పేర్లున్నాయి. అయితే ఈ జాబితాలో ఎక్కడా టీడీపీ అధినేత చంద్రబాబు, సినీ హీరో బాలకృష్ణల పేర్లు లేవు. రాష్ట్రంలో టీడీపీ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో బాబు సైతం ప్రచారం చేస్తారని చెబుతున్నా ఆయన పేరును ఎక్కడా పేర్కొనలేదు. ఇక దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రచారం చేస్తానని బాలకృష్ణ ఇదివరకే ప్రకటించినా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు కూడా లేదు. -
విచ్చలవిడిగా మహాకూటమి పార్టీల నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి పొత్తు ధర్మాన్ని కాలరాసింది. పోటీచేసే స్థానాల సంఖ్య తమకు ప్రధానం కాదని, గెలుపే ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పిన కూటమి భాగస్వామ్య పక్షాలు నామినేషన్ల చివరిరోజున తమ రాజకీయ ప్రతాపాన్ని చూపించాయి. పొత్తు, అవగాహనకు సంబంధించిన కనీస ధర్మాన్ని పాటించకుండా విచ్చలవిడిగా నామినేషన్లు దాఖలు చేసి గందరగోళంలో పడేశాయి. కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులపై టీజేఎస్, టీజేఎస్‌కు ఇస్తామని చెప్పిన చోట్ల కాంగ్రెస్, టీడీపీ కేటాయించిన స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులు పార్టీ బీ–ఫారాలతో నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తుల్లో భాగంగా 94 స్థానాల్లో కాంగ్రెస్, 14 చోట్ల టీడీపీ, 8 స్థానాల్లో టీజేఎస్, 3 చోట్ల సీపీఐ పోటీచేస్తాయని ప్రకటించాయి. అయితే నామినేషన్ల దాఖలు చివరిరోజున పరిశీలిస్తే కాంగ్రెస్ 100, టీజేఎస్ 14, టీడీపీ 13, సీపీఐ 3 చోట్ల పోటీచేయడం గమనార్హం. 119 స్థానాలకు 130 నామినేషన్లు... వాస్తవానికి, కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు కుదిరితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 119 మంది అభ్యర్థులు కూటమి పక్షాన పోటీలో ఉండాలి. కానీ, నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధికారికంగా కూటమి పార్టీల బీ–ఫారాలతో 130 మంది బరిలో నిలవడం గమనార్హం. అంటే 11 స్థానాల్లో ఇంకా సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉందన్నమాట. కాంగ్రెస్ ఉల్లంఘనలిలా... కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ గందరగోళానికి శ్రీకారం చుట్టింది. 94 మందికి మాత్రమే బీ–ఫారాలు ఇవ్వాల్సి ఉన్నా.. చివరిరోజున మరో ఆరుగురికి ఇచ్చింది. ఇందులో హుజూరాబాద్, పటాన్చెరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే కూటమి పక్షాన అభ్యర్థులుగా నిలిచారు. అయితే, టీజేఎస్ ఆశిస్తున్న మిర్యాలగూడ స్థానాన్ని ఆదివారమే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 94 స్థానాల పరిధిలోనే అక్కడ అభ్యర్థిని ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ ప్రకటించడానికి ముందే అక్కడ టీజేఎస్ పక్షాన విద్యాధర్‌రెడ్డికి ఆ పార్టీ బీ–ఫారం ఇచ్చింది. ఇక, 3 రోజుల క్రితమే దుబ్బాకలో టీజేఎస్ అభ్యర్థిని ప్రకటించింది. అయినా సోమవారం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దుల నాగేశ్వర్‌రెడ్డి నామినేషన్ వేశారు. వరంగల్ (తూర్పు) స్థానానికి టీజేఎస్ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్ తమకు వదిలివేస్తుందని ఆశించింది. కానీ, అక్కడ గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్రకు కాంగ్రెస్ బీ–ఫారం ఇచ్చింది. మెదక్‌లో జనార్దనరెడ్డికి టీజేఎస్ బీ–ఫారం ఇవ్వగా, కాంగ్రెస్ నుంచి ఉపేందర్‌రెడ్డి బరిలో దిగారు. అంబర్‌పేటలో లక్ష్మణ్ యాదవ్ (కాంగ్రెస్), రమేశ్ (టీజేఎస్) నామినేషన్లు వేశారు. మాట్లాడి పరిష్కరించుకుంటాం కొన్ని కారణాలతో కాంగ్రెస్ నామినేషన్లు వేయాల్సి వచ్చింది. కూటమి పార్టీలతో చర్చించి.. అందరితో మాట్లాడి ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటాం. కూటమిలో ఎలాంటి సమస్య ఉన్నా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం. – ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమయం ఉంది..మాట్లాడతాం సీట్ల సర్దుబాటులో అన్ని పార్టీలు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పొత్తు ధర్మాన్ని అందరూ కాపాడాల్సిందే. కూటమిలో ఉండే సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం. మాది సీట్ల కోసం ఏర్పడ్డ కూటమి కాదు. గెలుపే ప్రధానం. – ఎల్. రమణ టీజేఎస్.. తామేమీ తక్కువ కాదన్నట్లు... టీజేఎస్ కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు చివరి రోజున ఇష్టారాజ్యంగా బీ–ఫారాలు ఇచ్చేసింది. తాము అధికారికంగా ప్రకటించిన మల్కాజ్గిరి, సిద్దిపేట, దుబ్బాక, మెదక్ స్థానాలతో పాటు ఖానాపూర్, ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, చెన్నూరు, అశ్వారావుపేట, వర్ధన్నపేట, మిర్యాలగూడ, వరంగల్ (తూర్పు), మహబూబ్‌నగర్, అంబర్‌పేటల్లో పార్టీ బీ–ఫారాల మీదనే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో అంబర్‌పేట, వరంగల్(తూర్పు), మిర్యాలగూడ, వర్ధన్నపేట స్థానాలను టీజేఎస్‌కు కేటాయించాల్సి ఉన్నా వర్ధన్నపేట మినహా మూడు స్థానాల్లో కాంగ్రెస్ బీ–ఫారాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన ఖానాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, చెన్నూరు, ఆసిఫాబాద్ స్థానాల్లో టీజేఎస్ బీ–ఫారాలిచ్చింది. ఇక, కూటమిలోని మరో పక్షమైన తెలుగుదేశం పార్టీని కూడా టీజేఎస్ వదిలిపెట్టలేదు. ఆ పార్టీ పోటీ చేస్తున్న రెండు చోట్ల తమ అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయించింది. ఇందులో మహబూబ్‌నగర్, అశ్వారావుపేట స్థానాలున్నాయి. టీజేఎస్ 14 చోట్ల పోటీచేస్తున్నప్పటికీ ఆ పార్టీకి 3 స్థానాల్లోనే స్పష్టత కనిపిస్తోంది. అందులో మల్కాజ్గిరి, సిద్దిపేట, వర్ధన్నపేట ఉన్నాయి. విత్‌డ్రా నాటికి నిర్ణయం కూటమిలో అనుకున్న ప్రకారం సీట్ల పంపిణీ ఉండాల్సిందే. టీజేఎస్‌కు ఇస్తామన్న 8 స్థానాల్లో కాంగ్రెస్ 6 స్థానాలకే స్పష్టత ఇచ్చింది. మరో 2 స్థానాల్లో చర్చలు జరిపాం. సీట్ల కేటాయింపు ఆలస్యంతో స్నేహపూర్వక పోటీ తప్పడం లేదు. దీంతో నష్టమే ఎక్కువ జరుగుతుంది. ముందుగా పోటీకి సిద్ధమైనా విత్‌డ్రా నాటికి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అదేమీ పెద్ద సమస్య కాదు. మాకు ఎజెండానే ముఖ్యం. – కోదండరాం 14 స్థానాలిచ్చినా.. 13 చోట్లనే టీడీపీ... పొత్తుల్లో భాగంగా టీడీపీకి 14 స్థానాలిస్తామని చెప్పినా 13 చోట్లనే పార్టీ బీ–ఫారాలతో నామినేషన్లు వేసింది. పటాన్చెరు స్థానాన్ని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ నందీశ్వర్‌గౌడ్, గడీల శ్రీకాంత్ మధ్య పోటీతో దాన్ని కాంగ్రెస్‌కు వదిలేసింది. దీంతో అక్కడ కాంగ్రెస్ తరఫున కాట శ్రీనివాస్‌గౌడ్ అభ్యర్థిగా నిలిచారు. కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఒకరిపై మరొకరు పోటీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. కాంగ్రెస్‌కు వస్తుందని ఆశించిన ఇబ్రహీంపట్నంలో తొలుత ప్రకటించిన సామ రంగారెడ్డికే టీడీపీ బీ–ఫారం ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ బీ–ఫారం వస్తుందని ఆశించిన మల్రెడ్డి రంగారెడ్డి మధ్యాహ్నం వరకు వేచిచూసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పొత్తు ధర్మానికి కట్టుబడి... కూటమిలో పొత్తు ధర్మానికి కట్టుబడింది సీపీఐ మాత్రమేనని నామినేషన్ల లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ తమకు కేటాయించిన వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి స్థానాల్లో నామినేషన్లు వేసింది. అయితే, పొత్తు కోసం సీట్లు తగ్గించుకున్నా ఆ పార్టీకి రెబెల్స్ బెడద తప్పేటట్లు లేదు. వైరాలో సీపీఐ అభ్యర్థి విజయ నామినేషన్ వేయగా, అక్కడి నుంచి కాంగ్రెస్ రెబెల్‌గా రాములు నాయక్, హుస్నాబాద్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీద కాంగ్రెస్ రెబెల్‌గా అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్లు వేశారు. ఈ పోటీలు మంచిది కాదు కూటమి తరఫున పరస్పర, స్నేహపూర్వక పోటీ ఉండకూడదు. పరస్పర పోటీలకు సీపీఐ వ్యతిరేకం. మాకు కేటాయించిన మూడు సీట్లలోనే నామినేషన్లు వేశాం. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ ‘అదనం’గా నామినేషన్లు వేసిన చోట్ల ఉపసంహరించుకోవాలి. మరోపార్టీకి కేటాయించిన స్థానాల్లో పోటీ సరికాదు. – చాడ వెంకటరెడ్డి -
కూటమిలో కోదండరాంకి సరైన గౌరవం లేదా?
-
కూటమిని ప్రజలు నమ్మే స్థితిలో లేరు