లక్నో : లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ప్రచారం కొద్దిరోజుల్లో ముగుస్తుండటంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు యూపీలో జట్టుకట్టిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి ఆదివారం దియోబంద్‌లో తొలి ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహిస్తోంది.
ఈ ర్యాలీతో కేంద్రంలో మోదీ సర్కార్‌కు దీటుగా తమ కూటమి ఎదురొడ్డి నిలుస్తుందనే సంకేతాలను ఓటర్లకు పంపేందుకు ఈ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. 2014లో యూపీలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకున్న బీజేపీని దెబ్బతీసేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ కూటమిగా ఏర్పడటంతో పట్టు నిలుపుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తోంది. మరోవైపు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంకను తీసుకురావడంతో యూపీలో గౌరవప్రదమైన స్ధానాల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదునుపెడుతోంది
Comments
Please login to add a commentAdd a comment