first phase polling
-
ప్రశాంతంగా జమ్ము తొలిదశ పోలింగ్
శ్రీనగర్//జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి బుధవారం తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఆరి్టకల్ 370 రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాక.. తొలిసారిగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో గత ఏడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కె.పోల్ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల నుంచి నివేదికలు అందాక, పోస్టల్ బ్యాలెట్లను కూడా కలుపుకొంటే పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని తెలిపారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా.. బుధవారం తొలి విడతలో 24 సీట్లలో పోలింగ్ జరిగింది. 23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కశ్మీర్ లోయలో 16 సీట్లకు, జమ్మూలో 8 సీట్లకు బుధవారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల బయట ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైందని పి.కె.పోల్ ప్రకటించారు. సెపె్టంబరు 25న రెండో దశ, అక్టోబరు 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. హరియాణాతో కలిసి అక్టోబరు ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
కశ్మీర్లో నేడే తొలి దశ
శ్రీనగర్/జమ్మూ: జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. జమ్మూ కశ్మీర్లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం. పైగా జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. దాంతో ప్రజల తీర్పు ఎలా ఉండనుందోనని ఆసక్తి నెలకొంది. ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు. సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. పారీ్టలన్నింటికీ ప్రతిష్టాత్మకమే ప్రధాన ప్రాంతీయ పారీ్టలు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పాటు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వేర్పాటువాద జమాతే ఇస్లామీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ, డీపీఏపీ కూడా బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీ పొత్తు పెట్టుకున్నా మూడుచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. మరో చోట ఎన్సీ రెబెల్ బరిలో ఉన్నారు. కశ్మీర్‌పై కాషాయ జెండా ఎగరేయజూస్తున్న బీజేపీనీ రెబెల్స్ బెడద పీడిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుంచి 43కు పెరిగాయి. ముస్లిం ప్రాబల్య కశ్మీర్లో ఒక్క సీటే పెరిగింది.బరిలో ప్రముఖులు: మొహమ్మద్ యూసుఫ్ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత సకీనా (దమ్హాల్ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్ మద్నీ (దేవ్సర్), అబ్దుల్ రెహా్మన్ వీరి (షంగుస్–అనంత్‌నాగ్), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్బెహరా), వహీద్ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రధాన సమస్యలు ఇవే...→ నిరుద్యోగం, అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి జమ్మూ కశ్మీర్ ప్రజలు ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు. → పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభిస్తేనే సమస్యలు తీరి తమ ప్రయోజనాలు నెరవేరతాయని వారు భావిస్తున్నారు. దాంతో దాదాపుగా పారీ్టలన్నీ దీన్నే ప్రధాన హామీగా చేసుకున్నాయి. → ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని కూడా ఎన్సీ వంటి పార్టీలు చెబుతున్నాయి. విద్య, వివాహాలు, పన్నులు, సంపద, అడవుల వంటి పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తామంటున్నాయి. → ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీరీలు భారీ సంఖ్యలో ఓటువేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. -
Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
ఒడిశాలో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలో సోమవారం తొలి దశ పోలింగ్ జరగనుంది. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండటంతో పారీ్టలన్నీ హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నాయి. సోమవారం 4 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు తేలిపోనున్నాయి. వీటిలో మూడు లోక్‌సభ స్థానాలు ఏపీ సరిహద్దు ప్రాంతాలే. అధికార బిజూ జనతాదళ్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి మధ్య ఒడిశాలో త్రిముఖ పోరు జరుగుతోంది. బీజేడీని గద్దె దింపడంతో పాటు మెజారిటీ లోక్‌సభ స్థానాలు కొల్లగొట్టేందుకు బీజేపీ శ్రమిస్తోంది. కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక రెండు దశాబ్దాలకు పైగా సీఎం కురీ్చలో పాతుకుపోయిన బీజేడీ చీఫ్ నవీన్ పటా్నయక్ రెండు జాతీయ పారీ్టలనూ నిలువరించేందుకు పోరాడుతున్నారు. పోలింగ్ జరగనున్న 4 లోక్‌సభ స్థానాల్లో పరిస్థితిపై ఫోకస్... బరంపూర్... జంపింగ్ జపాంగ్! ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ నియోజకవర్గంలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. బరంపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 1996లో ఇక్కడి నుంచి గెలిచారు. 1999లో కాషాయ జెండా కూడా ఎగిరింది. 2009 నుంచీ బీజేడీ హవాయే సాగుతోంది. ఇక్కడ బరిలో ఉన్న, గెలిచిన అభ్యర్థులు పారీ్టలు మారిన వారే కావడం విశేషం. 2004 నుంచి 2019 మధ్య చంద్రశేఖర్ సాహు, ఒరియా సినీ నటుడు సిద్ధాంత మహాపాత్ర చెరో రెండుసార్లు గెలిచారు. సాహు 2004లో కాంగ్రెస్ తరఫున గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ అభ్యర్థి మహాపాత్ర చేతిలో ఓడారు. తర్వాత సాహు కాంగ్రెస్‌ను వీడి బీజేడీలో చేరారు! 2019లో ఆ పార్టీ టికెట్‌పై గెలిచారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి వచి్చన భృగు బాక్సిపాత్రకు బీజేడీ టికెటివ్వడం విశేషం. భృగు 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి సాహు చేతిలో ఓడారు. బీజేపీ ఈసారి సీఎం నవీన్ మాజీ అనుచరుడు ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహికి టికెటిచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రష్మి రంజన్ పటా్నయక్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.కలహండి... కమలానికి ఎదురుగాలి! బీజేపీకి తొలి నుంచీ గట్టి పట్టున్న స్థానం. కానీ 2009లో కాంగ్రెస్, 2014లో బీజేడీ గెలిచాయి. 2019లో మళ్లీ బీజేపీ నెగ్గింది. ఈసారి సిట్టింగ్ ఎంపీ బసంత కుమార్ పండాను పక్కనపెట్టి కలహండి రాజ కుటుంబానికి చెందిన మాళవిక కేసరీ దేవ్‌కు టికెటిచి్చంది. స్థానికులు రాణి మాతగా పిలుచుకునే మాళవిక మాజీ ఎంపీ అర్కా కేసరీ దేవ్ భార్య. అర్కా తండ్రి విక్రమ్ కేసరీ దేవ్ ఇక్కడ మూడుసార్లు బీజేపీ తరఫున గెలవడం విశేషం. ఆయన మరణానంతరం అర్కా ఇక్కడి నుంచే బీజేడీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2019లో బీజేడీ టికెట్ నిరాకరించడంతో పారీ్టకి గుడ్‌బై చెప్పారు. 2023లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి ద్రౌపది మఝి ఎస్టీ నేత. గిరిజనుల్లో బాగా పట్టుంది. నియోజకవర్గంలో 4 లక్షల ఎస్టీ ఓట్లుండటం ఆమెకు కలిసొచ్చే అంశం. గౌడ సామాజిక వర్గానికి చెందిన లంబూధర్ నియాల్‌ను బీజేడీ బరిలోకి దించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 26 వేల ఓట్ల మెజారిటీయే వచి్చంది. ఈసారి కూడా త్రిముఖ పోరులో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందంటున్నారు.కోరాపుట్... బీజేడీ, కాంగ్రెస్ మధ్యలో బీజేపీ! కనువిందు చేసే తూర్పు కనుమలు, అబ్బురపరిచే జలపాతాలతో ఒడిశా కశీ్మర్గా పేర్కొందిన కోరాపుట్ ఒకప్పుడు కాంగ్రెస్ దుర్గం. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ అడ్డా. ఇక్కడినుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు ఆయనది! 1999లో సీఎంగా ఉంటూ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసి గద్దె దించిన అపప్రథను గమాంగ్ మూటగట్టుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ చేతిలో ఓటమి చవిచూశారు. 2023లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన గమాంగ్ అనంతరం బీఆర్ఎస్కు జై కొట్టడం విశేషం! 2019లో కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి శంకర్ ఉలాక కేవలం 3,613 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేడీ నుంచి మాజీ ఎంపీ ఝినా హికాక భార్య కౌసల్య పోటీ చేస్తున్నారు. బీజేపీ కలిరామ్ మఝిని బరిలోకి దించింది. నియోజకవర్గంలో మంచి పట్టున్న జయరాం చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతమైంది. పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. దాంతో బీజేపీ చీల్చే ఓట్లు కీలకంగా మారాయి.నవరంగ్‌పూర్... టఫ్ ఫైట్ ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న మరో ఎస్టీ నియోజకవర్గమిది. ఇదీ గతంలో కాంగ్రెస్ కంచుకోటే. ఖగపాటి ప్రధాని రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదిసార్లు గెలిచారు. తర్వాత నెమ్మదిగా బీజేపీ, ఆపై బీజేడీ ఇక్కడ పాగా వేశాయి. 2014లో బీజేడీ నుంచి బలభద్ర మఝి కేవలం 2,042 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించారు. ఆయన 2019లో పార్టీ మారి బీజేపీ తరఫున పోటీ చేశారు. బీజేడీ అభ్యర్థి రమేశ్ చంద్ర మఝి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ మాత్రం సిట్టింగ్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచి్చన మాజీ ఎంపీ ప్రదీప్ కుమార్ మఝికి టికెటివ్వడం విశేషం. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భుజబల్ మఝిని రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంటున్నా బీజేపీకి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈసారి ఇక్కడ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీతో సహా బీజేపీ అగ్ర నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. దాంతో పోటీ త్రిముఖంగా మారి ఉత్కంఠ రేపుతోంది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
తూర్పు భారతంలో కీలక రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఎన్నికల పర్వానికి రంగం సిద్ధమైంది. సోమవారం తొలి దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం 4 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా, మాజీ సీఎం మధు కోడా భార్య గీత, మాజీ డీజీపీ విష్ణు దయాళ్ రామ్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 10 జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ నాలుగూ రిజర్వ్డ్ స్థానాలే కావడం విశేషం. పలాము ఎస్సీ, మిగతా మూడు ఎస్టీ నియోజకవర్గాలు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తదితరులు ఇక్కడ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా బీజేపీ; కాంగ్రెస్, జేఎంఎంలతో కూడిన విపక్ష ఇండియా కూటమి మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాల్లో మూడు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ నెగ్గాయి... ఖుంటీ కేంద్ర మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్జున్ ముండా మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండాపై కేవలం 1,445 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారాయన. కాంగ్రెస్ నుంచి మళ్లీ కాళీచరణే బరిలో ఉన్నారు. ఖుంటీ బీజేపీ కంచుకోట. ఆ పార్టీ నేత కరియా ముండా ఇక్కడ ఏకంగా ఎనిమిదిసార్లు గెలిచారు. గిరిజనుల ఆరాధ్యుడు బిర్సా ముండా స్వగ్రామం ఉలిహట్ ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. గత నంబర్లో మోదీ ఈ గ్రామాన్ని సందర్శించి బిర్సా ముండాకు నివాళులర్పించారు. పేదరికం, మానవ అక్రమ రవాణా, మావోయిజం, నల్లమందు సాగు ఇక్కడి ప్రధాన సమస్యలు. కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్‌కు గిరిజనుల్లో పలుకుబడి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. కూటమి భాగస్వామి జేఎంఎం మాజీ ఎమ్మెల్యే బసంత్ కుమార్ లోంగా రెబల్‌గా పోటీ చేస్తున్నారు. దాంతో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌కు ఓట్ల బదిలీ ఏ మేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.సింగ్భమ్ కాంగ్రెస్ పారీ్టకి బలమైన స్థానమిది. ఐదుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు బీజేపీ, ఒసారి జేఎంఎం, ఐదుసార్లు జార్ఖండ్ పార్టీ గెలిచాయి. సింగ్భమ్లో మాజీ సీఎం మధు కోడా కుటుంబానికి గట్టి పట్టుంది. 2009లో మధు కోడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత లక్ష్మణ్ గిలువా చేతిలో ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో మధు కోడా భార్య గీత కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం ఇదే. కానీ గీత గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ దీన్ని జేఎంఎంకు కేటాయించింది. దీంతో ఇక్కడ గెలుపును జేఎంఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రిగా చేసిన ఐదుసార్లు ఎమ్మెల్యే జోబా మాంఝిని రంగంలోకి దింపింది.లోహర్దగ ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. అయితే సిట్టింగ్ ఎంపీ సుదర్శన్ భగత్‌ను పక్కన పెట్టి సమీర్ ఒరాన్‌కు టికెటిచి్చంది. గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి సుఖ్‌దేవ్ భగత్ ఈసారీ బరిలో ఉన్నారు. జార్ఖండ్ పార్టీ నుంచి దియోకుమార్ ధాన్ పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్ జేఎంఎం ఎమ్మెల్యే చమ్రా లిండా కూడా ఇండిపెండెంట్‌గా బరిలో ఉండటం విశేషం! ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో 70 శాతానికి పైగా గిరిజన జనాభాయే.పలాము రాష్ట్రంలో ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ లోక్‌సభ స్థానం. మాజీ డీజీపీ విష్ణు దయాళ్ రామ్ బీజేపీ టికెట్‌పై 2019లో 4.77 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ఆర్జేడీ తరఫున మమతా భూయాన్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేఎంఎం గెలవగా 2014లో విష్ణు దయాళ్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి నెగ్గారు. ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ పలాములో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మమతా భూయాన్ రాజకీయాలకు కొత్తయినా ఇక్కడ ఆమె సామాజిక వర్గం ఓటర్లు 4.5 లక్షలకు పైగా ఉంటారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో నాలుగు బీజేపీ చేతిలోనే ఉన్నాయి.అక్కడ తొలిసారి ఓటింగ్ సింగ్భమ్ లోక్‌సభ స్థానం పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. దాంతో మారుమూల గ్రామాల్లోని వారికి ఓటేసే అవకాశం ఉండేది కాదు. అడవులు, కొండల్లోని అలాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా దశాబ్దాల విరామం తర్వాత ఈసారి ఓటేయనున్నారు. అనేక కష్టనష్టాలకోర్చి అక్కడ 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలింగ్ సిబ్బంది కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లారు. దట్టమైన అడవిలో ఉన్న సరండ అనే మారుమూల గ్రామానికైతే హెలికాప్టర్ ద్వారా ఎన్నికల సామగ్రిని తరలించారు. ఏ ఓటరూ ఓటింగ్‌కు దూరంగా ఉండొద్దన్నది తమ సంకల్పమని వెస్ట్ సింగ్భమ్ జిల్లా ఎన్నికల అధికారి కులదీప్ చౌదరి తెలిపారు.మహిళల ఓట్లే కీలకం సింగ్భమ్, ఖుంటి, లోహర్దగ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం మహిళల చేతుల్లో ఉందని చెప్పాలి! ఎందుకంటే అక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. జార్ఖండ్‌లో గిరిజన మహిళలు పురుషులతో సమానంగా సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఓటింగ్‌లోనూ చురుకైన పాత్ర పోషిస్తుంటారు. దాంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలూ చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంకల్పం సరిపోతుందా?
కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు దేశం సిద్ధమవుతున్న వేళ పాలక బీజేపీ తన ‘సంకల్ప పత్రం’తో ముందుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక రాగల అయిదేళ్ళలో తన ప్రణాళికలు ఎలా ఉంటాయో ప్రజల ముందు ఉంచింది. దశాబ్ద కాలంగా ఢిల్లీ గద్దెపై ఉంటూ, రాజకీయాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సైతం అందుకు తగినట్టే సాగింది. విశేష ప్రజాకర్షక పథకాల జోలికి పోలేదు. ప్రస్తుత విధానాల కొనసాగింపునే ప్రధానంగా ఆశ్రయించింది. పార్టీ కన్నా ప్రధాన రథసారథికే అధిక ప్రాధాన్యమిస్తూ, ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ ప్రచారం చేస్తోంది. ఇది మునుపెన్నడూ కాషాయపార్టీలో కనిపించని చిత్రం. ఎన్నికల్లో విజయం కోసం మోదీపై ఆ పార్టీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రచారంలో ప్రతిచోటా ప్రవచిస్తున్న ‘వికసిత భారత్’ స్వప్నానికి అనుసంధాయకంగా అభివృద్ధి, ప్రాథమిక వసతి కల్పన, సంక్షేమం, విద్య, పారిశ్రామిక రంగం, అంకుర వ్యవస్థ, ఉత్పాదక రంగం, రైల్వే వగైరాలకు సంబంధించి ‘మోదీ గ్యారెంటీ’లను ఈ మేనిఫెస్టోలో జొప్పించడం విశేషం. వరుసగా మూడోసారి సైతం తమ పార్టీకి అధికార పగ్గాలు దక్కడం ఖాయమన్న ఆత్మవిశ్వాసంతోనో ఏమో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను కొనసాగిస్తే చాలనే భావన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించింది. గడచిన కేంద్ర బడ్జెట్లో ఎన్నికల ముందస్తు వరాలు కురిపించకుండా ఆర్థికంగా పొదుపు మంత్రాన్ని పఠిస్తూ, పాత విధానాల కొనసాగింపునే కమలనాథులు ఆశ్రయించారు. ఇప్పుడీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే ధోరణిని అనుసరించారు. ప్రజల నుంచి వచ్చిన దాదాపు 15 లక్షల దాకా సూచనలను పరిగణనలోకి తీసుకొని, ‘వికసిత భారత్’ స్వప్నానికి అనుగుణంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని బీజేపీ చెబుతోంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి దిశానిర్దేశంగా ఈ ‘సంకల్ప పత్రం’ పనిచేస్తుందని కమలనాథుల ఉవాచ. వచ్చే 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా, విశ్వశక్తిగా మారుస్తామనేది వారు చూపిస్తున్న సుందర స్వప్నం. మోదీ ఆదివారం విడుదల చేసిన ఈ ‘సంకల్ప పత్రం’ ఇప్పటికే సర్కారు అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకం, సురక్షిత మంచినీటి సరఫరా, గృహనిర్మాణం లాంటి దారిద్య్ర నిర్మూలన పథకాలను ఏకరవు పెట్టింది. గత పదేళ్ళలో 25 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడేశామనీ, సామాజిక న్యాయానికి కట్టుబడి ఇతర వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, దళితులకు ప్రభుత్వంలో భాగం కల్పించామని చెప్పుకుంది. అదే సమయంలో ఈ ‘సంకల్పం’లో కొన్ని వివాదాలూ ఉన్నాయి. ఈసారి ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ ప్రారంభం చేసి చూపిన బీజేపీ మూడోసారి గద్దెనె క్కితే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తేవాలని చూస్తోంది. అయితే, తెలివిగా యూసీసీ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’, సార్వత్రిక ఎన్నికల జాబితా తదితర విస్తృత చర్చనీయాంశాలను తన సైద్ధాంతిక ఎంపికలుగా కాక, సుపరిపాలనకు తప్పనిసరి అన్నట్టు చిత్రిస్తూ మేనిఫెస్టోలో పెట్టింది. అదే సమయంలో 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న వివాదాస్పద ‘పౌరుల జాతీయ చిట్టా’ అంశాన్ని ఈసారి ప్రస్తావించలేదు. వ్యవసాయ చట్టాలపై ఎదురుదెబ్బ తగిలేసరికి, ఈ తడవ వాటి ఊసెత్తకుండా జాగ్రత్తపడింది. రైతులకు గట్టి హామీలివ్వకుండా దాటేసింది. ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌ల ఎన్నికల వాగ్దానపత్రాలను విశ్లేషకులు సహజంగానే పోల్చి చూస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టో విధానాల కొనసాగింపు ధోరణిలో సాగితే, కాంగ్రెస్ మేని ఫెస్టో ప్రజాకర్షక బాటన నడిచింది. ముందుగా ప్రకటించిన కాంగ్రెస్‌ది ‘న్యాయ్ (గ్యారెంటీల) పత్రం’ అయితే, ఆనక వచ్చిన బీజేపీది ‘సంకల్ప పత్రం’. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్‌లు అయిదు ప్రధానాంశాలుగా, 25 గ్యారెంటీలతో కాంగ్రెస్ ముందుకొచ్చింది. మహిళలు, యువతరం, అణగారిన వర్గాలు, రైతులు... ఈ నాలుగు వర్గాలూ దేశాభివృద్ధికి నాలుగు స్తంభాలని బీజేపీ సంకల్పం చెప్పుకుంది. కనీస మద్దతు ధరకు ‘చట్టపరమైన గ్యారెంటీ’ ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంటే, బీజేపీ మాత్రం పంటలకు కనీస మద్దతు ధరల్ని ‘ఎప్పటికప్పుడు’ పెంచుతామన్నదే తప్ప, చట్టంగా భరోసా ఇవ్వలేదు. కులగణనకు కాంగ్రెస్ కట్టుబడితే, అలాంటి డిమాండ్లపై బీజేపీ తన అభిప్రాయం పంచుకోనే లేదు. రెండు మేనిఫెస్టోల్లో కొన్ని మంచి విషయాలూ లేకపోలేదు. రాగల అయిదేళ్ళలో వ్యవసాయ పరిశోధనలకు రెట్టింపు నిధులిస్తామన్నది కాంగ్రెస్ వాగ్దానం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద త్వరితగతిన చెల్లింపులు జరుపుతామనీ, పంట నష్టాన్ని మరింత కచ్చితంగా అంచనా వేసేలా సాంకేతికతను వినియోగిస్తామనీ బీజేపీ హామీ ఇస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ రెండు పార్టీలూ వ్యవసాయ రంగానికి సరైన దిశానిర్దేశంలో విఫలమయ్యాయి. నీరు, ఎరువులు, ఇంధనాలను తక్కువగా వినియోగిస్తూనే ఎక్కువ దిగుబడి లాంటి వాటిపై అవి దృష్టిపెట్టలేదు. ఇక, సాంస్కృతిక జాతీయవాదంతో తమిళుల్ని ఆకర్షించేలా ‘తిరువళ్ళువర్ సాంస్కృతిక కేంద్రాల’ ఏర్పాటు, సామా న్యుల సాధారణ రైలు ప్రయాణ కష్టాల్ని పక్కనబెట్టి ఖరీదైన ‘వందేభారత్ రైళ్ళ’ విస్తరణ లాంటివి బీజేపీ అనవసర ప్రాధాన్యాలే. దేశంలో ప్రస్తుత ప్రధాన సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల అని సర్వేలన్నీ తేల్చినందున ఏ పార్టీ అయినా వాటిపై దృష్టి పెట్టడం ప్రయోజనం. ఆ మాటకొస్తే ఓటర్లను ఆకర్షించడమే కీలకమైన ఎన్నికల్లో, మేనిఫెస్టోలను తప్పనిసరిగా అమలు చేసి తీరాలన్న చట్టం లేని భారత్‌లో... ‘సంకల్పం’ శుష్కవచనమైతే నిష్ప్రయోజనం. -
మూడు ముక్కలాట.. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సౌరాష్ట్ర,, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎవరి వ్యూహాలు వారివే 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నారు. మోదీ ఇమేజ్, అభివృద్ధి, గుజరాత్ ఆత్మగౌరవం అంశాలనే బీజేపీ నమ్ముకుంది. ఎన్నికలకు ముందు మోదీ రూ.29 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. మొత్తం 43 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించడంతో పాటు ఎన్నికలకు ముందు సీఎం సహా మొత్తం కేబినెట్‌ను మార్చేసి కొత్త రూపుతో అధికార వ్యతిరేకతను ఎదుర్కోవడానికి బీజేపీ వ్యూహాలు పన్నింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్లో ప్రచారాన్ని నడిపించారు. గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్‌లలో పట్టు సాధించిన స్థానాలపై దృష్టి పెట్టారు. క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టడానికి రూపొందించిన ఖామ్ వ్యూహంపైనే ఆశలు పెట్టుకుంది. ఇక చాప కింద నీరులా విస్తరిస్తున్న ఆప్ పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి గురిపెట్టింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికే వ్యూహాలు పన్నుతూ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారాన్ని అంతా తానై నడిపించారు. ఉచిత కరెంట్, ఢిల్లీ మోడల్ పాలన ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా ఉంది. ఏ ప్రాంతంలో ఎవరి హవా ! 2017 ఎన్నికల్లో 89 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ 40 సీట్లలో గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్‌లలో బీజేపీ వెనుకబడి పోయింది. పటీదార్ల ఉద్యమంతో ఈ ప్రాంతంలోని ప్రాబల్యమున్న లెవా పటేళ్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. ఈ ఐదేళ్లలో మళ్లీ బీజేపీ వైపు మళ్లిపోయారు. ఈ ప్రాంతానికి చెందిన మల్దారీలు అందరూ ఈ సారి ఆప్‌కి అండగా ఉన్నారు.అధికార బీజేపీ ప్రతిపాదించిన పశువుల నియంత్రణ బిల్లును మల్దారీలు తీవ్రగా వ్యతిరేకించారు. ఆప్ పశు సంరక్షణ కోసం రోజుకి రూ.40 ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ వర్గం ఆప్ వైపే చూస్తోంది. సౌరాష్ట్రలో బీజేపీకి పట్టున్న రాజ్‌కోట్, భావ్‌నగర్ పట్టణ కేంద్రాలపై ఆప్ దృష్టి సారించింది. దక్షిణ గుజరాత్లో పటీదార్లతో పాటు మరాఠీలు, ఆదివాసీల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఆరెస్సెస్, క్రిస్టియన్ మిషనరీ సంస్థలు క్రియాశీలకంగా ఉండడం బీజేపీకి, కాంగ్రెస్ కలిసొచ్చే అంశం. బరిలో 788 మంది తొలి దశ ఎన్నికల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ ఉంటే, ఆప్ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్ నియోజకవర్గం అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆప్ 88 స్థానాలకే పరిమితమవాల్సి వచ్చింది. ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ద్వారక జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా సూరత్‌లోని కటాగ్రామ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా జామ్‌నగర్ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు 89 పోటీ పడుతున్న అభ్యర్థులు 788 మహిళా అభ్యర్థులు 70 స్వతంత్ర అభ్యర్థులు 339 ఓటర్ల సంఖ్య 2 కోట్లు పోలింగ్ కేంద్రాలు 14,32 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Polls: ముగిసిన ప్రచారం.. తొలిదశకు అంతా సిద్ధం
గాంధీనగర్: గుజరాత్ శాసనసభ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా ముమ్మర ప్రచారంతో దూసుకెళ్లిన రాజకీయ పార్టీలు.. తొలిదశ ప్రచారానికి ముగింపు చెప్పాయి. మొదటి విడతలో భాగంగా 89 స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. మరో 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా.. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 27 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతున్న తమ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే, 2017లో ఒక్కసీటు కూడా సాధించని ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ గెలుపు ఉత్సాహంతో గుజరాత్‌లోనూ పాగా వేయాలని భావిస్తోంది. 90 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి పి భారతి.. ఓటింగ్‌పై పలు వివరాలను వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ‘డిసెంబర్ 1న ఓటింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 50 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ ఉంటుంది. తొలి దశలో 2,39,76,760 మంది ఓటర్లు తమ ఓట హక్కును వినియోగించుకోనున్నారు. ’ అని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. బీజేపీ తరఫున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు భావ్‌నగర్, కచ్ జిల్లాలోని గాంధీధామ్‌లలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. తొలిదశలో ఆమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ బరిలో ఉన్నారు. ద్వారకా జిల్లాలోని ఖాంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గుజరాత్ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన కున్వార్జీ బవాలియా, మోర్బీ హీరో కాంతీలాల్ అమృతీయ, క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా, ఆమ్ఆద్మీ పార్టీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా వంటి ముఖ్య వ్యక్తులు తొలిదశ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
ముగిసిన మణిపూర్ తొలిదశ పోలింగ్
-
యూపీలో తొలిదశ పోలింగ్ ప్రారంభం
-
యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. తొలిదశ పోలింగ్ పూర్తి
-
తొలి దశ ఓటింగ్ 54.26%!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ముగిసింది. మొత్తం 243 స్థానాలకు గానూ.. 16 జిల్లాల్లో విస్తరించిన 71 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 54.26% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. అన్ని కేంద్రాల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తరువాతే కచ్చితమైన ఓటింగ్ శాతం వెల్లడిస్తామని తెలిపింది. కాగా, ఈ జిల్లాల్లో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54.75% పోలింగ్ జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన స్థానాల్లో మొత్తంగా ఓటర్ల సంఖ్య సుమారు 2.15 కోట్లు కాగా, అభ్యర్థులు 1000కి పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ.. సమయం గడుస్తున్న కొద్దీ పెరిగింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బిహార్ మాజీ సీఎం, హెచ్ఏఎం అధ్యక్షుడు జితన్ రామ్‌లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలి దశ ఎన్నికలు జరిగిన 71 స్థానాల్లో 35 స్థానాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు. ఈ స్థానాల్లో పోలింగ్‌ను మధ్యాహ్నం 3 గంటలకే ముగించారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు సంతృప్తికరంగా ఉందని, అత్యంత స్వల్ప స్థాయిలో ఇబ్బందులు తలెత్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. 2015లో ఐదు దశల్లో.. ప్రాథమిక సమాచారం మేరకు.. తొలిదశలో అత్యధిక ఓట్లు బంకా జిల్లాలో పోలయ్యాయి. అక్కడ 59.57% పోలింగ్ నమోదైంది. 2015లో ఈ జిల్లాలో నమోదైన ఓటింగ్ శాతం 56.43. అలాగే, ముంగర్ జిల్లాలో అత్యల్పంగా 47.36% మాత్రమే ఓటింగ్ జరిగింది. 2015లో ఇక్కడ 52.24% ఓటింగ్ నమోదైంది. 2015లో మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరగగా, ఈ సారి 3 దశల్లోనే ఎన్నికలు ముగుస్తున్నాయి. 2015లో తొలి దశలో 10 జిల్లాల్లో విస్తరించిన 49 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 2015 నాటి తొలి దశ ఎన్నికల్లో 54.94% పోలింగ్ జరిగినట్లు ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. కాల్పులపై తీవ్ర నిరసన ముంగర్ కాల్పుల ఘటనపై విపక్షాలు బిహార్‌లో నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. నితీశ్ పాలను బ్రిటిష్ రాజ్ తరహాలో ఉందని విమర్శిస్తూ, ముంగర్ కాల్పుల ఘటనను జలియన్‌వాలా బాగ్ కాల్పులతో పోల్చాయి. ముంగర్‌లో సోమవారం రాత్రి దుర్గామాత నిమజ్జన ఊరేగింపు సందర్బంగా ఘర్షణలు జరగడంతో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఒక యువకుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. జిల్లా ఎస్పీ లిపి సింగ్ ముఖ్యమంత్రి నితీశ్‌కు సన్నిహితుడైన ఆర్సీపీ సింగ్ కూతురు కావడంతో విపక్షాలు తమ విమర్శలకు మరింత పదును పెంచాయి. -
కరోనా కాలంలో తొలి అసెంబ్లీ ఎన్నికలు
పట్నా: కరోనా కాలంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు బిహారీలు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. చిన్నచిన్న అపశ్రతులు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 33.10 శాతం పోలింగ్ నమోదయినట్టు సమాచారం. కరోనా సంక్షోభం నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేశారు. కోవిడ్ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది గూమిగూడకుండా ఒక్కో పోలింగ్‌బూత్‌కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించారు. ఈవీఎంలను తరచుగా శానిటైజ్ చేస్తున్నారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. 71 అసెంబ్లీ స్థానాల్లో 33 స్థానాలను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, పోటీలో నిలిచిన అభ్యర్థులతో పాటు ప్రముఖ నాయకులు అందరూ ఆలయాలను, ప్రార్థనాలయాలను దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. లఖిసరాయ్‌లోని బారాహియాలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామంలో ఎన్నికలు అనేవి పండుగ లాంటివనిపేర్కొన్నారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాంకేతిక లోపాల కారణంగా షికాపురాలో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ గయాలో ఓటు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్ జరుగుతున్న 71 స్థానాల్లో ఎన్డీఏ 50 చోట్ల గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కోవిడ్ నిబంధనలు మరవొద్దు: ప్రధాని ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బిహారీలకు ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఓటర్లు పరస్పరం రెండు గజాల భౌతిక దూరం పాటించాలని, ముఖానికి తప్పనిసరిగా మాస్క్‌ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. -
పోలింగ్ ప్రశాంతం
ఆత్మకూరు(పరకాల): జిల్లాలో సోమవారం మొదటి విడత పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. తొలి దశలో ఐదు జెడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా 58 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో 80.67శాతం పోలింగ్ నమోదు కాగా 1,35,046మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బరిలో 201 మంది అభ్యర్థులు.. తొలి విడత ఎన్నికల బరిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 201 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదు జెడ్పీటీసీలకు 32 మంది, 58 ఎంపీటీసీలకు 169 మంది బరిలో ఉన్నారు. వర్దన్నపేట జెడ్పీటీసీకి 10 మంది, పర్వతగిరి, సంగెం, దుగ్గొండి మండలాల్లో ఆరుగురి చొప్పున, నర్సంపేటలో నలుగురు బరిలో ఉన్నారు. 354 పోలింగ్ స్టేషన్లు జిల్లాలో తొలి దశలో 354 పోలింగ్ స్టేషన్లలో 2,451 మంది సిబ్బందిని నియమించారు. పీఓలు 425, ఏపీఓలు 425, ఓపీఓలు 1,601 మందిని నియమించారు. వీరంతా విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ సంగెం: సంగెం మండలంలోని కాపులకనిపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ముండ్రాతి హరిత సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళితో పాటుగా పోలింగ్ కేంద్రంలోని వసతి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుండడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ మట్టపల్లి సంపత్‌రావు, ఏపీడీ పరమేశ్వర్, ఆర్డీఓ మహెందర్‌జీ, తహసీల్దార్ కొండాయి లక్ష్మిపతి తదితరులున్నారు. అలాగే మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్ కాపులకనిపర్తి, కాట్రపల్లి, కుంటపల్లి, గవిచర్ల, తీగరాజుపల్లి, తిమ్మాపురం, ఎల్గూర్‌రంగంపేట, మొండ్రాయి, పల్లారుగూడ, చింతలపల్లిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పర్వతగిరి: మండలంలోని కొంకపాక, గోపనపల్లి, అనంతారం పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత సోమవారం సందర్శించారు. పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన వీల్ చైర్‌ను పరిశీలించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ చూడాలని పోలింగ్ అధికారులను ఆదేశించారు. పర్వతగిరిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముగిసిన మూడో విడత ఉపసంహరణ జిల్లాలో 53 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను గురువారం వరకు స్వీకరించారు. నెక్కొండ మండలం వెంకటాపురం ఎంపీటీసీ ఏకగ్రీవమైంది. 52 ఎంపీటీసీలకు 157మంది, 5 జెడ్పీటీసీ స్థానాలకు 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతరం అభ్యర్థులను గుర్తులను కేటాయించారు. మూడో విడతలో చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. చెన్నారావుపేటలో 11 ఎంపీటీసీ స్థానాలకు 33 మంది, జెడ్పీటీసీకి 4, నెక్కొండలో 16 ఎంపీటీసీలకు 50 మంది బరిలో ఉన్నారు. నెక్కొండ మండలంలోని వెంకటాపురం ఎంపీటీసీ అభ్యర్థి గుండారపు అపర్ణ రవీందర్రావు(కాంగ్రెస్) ఏకగ్రీవమైంది. ఆత్మకూరు 9 ఎంపీటీసీ స్థానాలకు 28 మంది అభ్యర్థులు జెడ్పీటీసీకి 4గురు, దామెర మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలకు 20 మంది అభ్యర్థులు జెడ్పీటీసీకి 4, గీసుకొండ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు 26 మంది, జెడ్పీటీసీకి 7 గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
ఎన్నికల పోలింగ్‌కు వడదెబ్బ ఎఫెక్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్‌పై వడదెబ్బ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎండ ప్రభావంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. 44డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 7 నుంచి 9 వరకు ఓటర్లు బారులు తీరినా, 10 తర్వాత పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. ఎండ దెబ్బకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : పరిషత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో అత్యంత కీలకంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ విడతలో భాగంగా 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది, 2,096 ఎంపీటీసీ స్థానాల్లో 7,072 మంది (2 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ ఏకగ్రీవాలు మినహాయించి)అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 వరకు (5 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే) సాగనుంది. నాగరకర్నూల్ జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానంలో ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయడంతో పాటు, ఆ స్థానానికి విడిగా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి. -
నేడే పరిషత్ తొలి పోరు
సాక్షి, హైదరాబాద్: పరిషత్ తొలిదశ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో అత్యంత కీలకంగా మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ విడతలో భాగంగా 195 జెడ్పీటీసీ స్థానాలకు 882 మంది, 2,096 ఎంపీటీసీ స్థానాల్లో 7,072 మంది (2 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ ఏకగ్రీవాలు మినహాయిం చి)అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం ఉద యం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 వరకు (5 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే) సాగనుంది. నాగరకర్నూల్ జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ స్థానంలో ఏకగ్రీవ ఎన్నికను రద్దుచేయడంతో పాటు, ఆ స్థానానికి విడిగా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎన్నిక నిర్వహించనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 539 జెడ్పీటీసీ స్థానాలుండగా.. ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు జరగడం లేదు. దీంతో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుంటాయి. ఆదివారం ఉదయం నుంచే ఎస్ఈసీ పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని చేరవేసింది. పోలింగ్ సిబ్బంది, ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఇంక్, బ్యాలెట్ పత్రాలు, కవర్లు, బ్యాలెట్ బాక్స్‌లన్నీ సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి, కార్యదర్శి ఆశోక్ కుమార్‌లు ఆయా జిల్లాల్లో ఏర్పాట్లను వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని పోలింగ్‌బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటుచేశారు. ఎస్ఈసీ ప్రధాన కార్యాలయంలో వెబ్‌కాస్టింగ్‌ను ప్రత్యక్షంగా పరిశీలిం చేందుకు ఏర్పాట్లుచేశారు. ఇవన్నీ నిషిద్ధం బ్యాలెట్ పెట్టెలు, పత్రాలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నందున పార్టీల ఏజెంట్లతో సహా ఎవరూ కూడా పోలింగ్ బూత్‌లలోకి వాటర్‌బాటిళ్లు, అగ్గిపెట్టెలు, ఇంక్ బాటిళ్లు తదితరాలను తీసుకెళ్లరాదని ఎస్ఈసీ స్పష్టంచేసింది. పోలింగ్ స్టేషన్లలో ఏజెంట్లకు నీళ్లు, చాయ్ కూడా సరఫరా చేయరాదని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా సిబ్బంది కూడా టీ తదితరాలు తీసుకోకుండా ఉంటే మంచిదని సూచించింది. మారణాయుధాలను తీసుకువెళ్లకూడదని, పోలింగ్ బూత్ పరిసరాల్లో గుమిగూడి ఉండరాదని, వాహనాలను పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో నిలపాలని, చుట్ట, బీడీ, సిగరెట్ వంటి పొగాకు వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్ వంటి వాటిని కూడా పోలింగ్ బూత్‌ల్లోకి తీసుకవెళ్లరాదని స్పష్టం చేసింది. ఓటేసిన తర్వాత బ్యాలెట్ పేపర్లను సరైన రీతిలో మడిచి బాక్స్‌ల్లో వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు పలు సూచనలు జారీ చేశారు. ఒకరి ఓటును మరోకరు వేశారని పోలింగ్ అధికారులు చెబితే.. మీ దగ్గరున్న ఆధారాలతో ఎన్నికల అధికారులను అడిగి టెండరు ఓటును అడిగి వేయవచ్చు. వికలాంగులు తమ వెంట ఒకరిని సహాయకుడిగా తీసుకెళ్లవచ్చు. అంధ ఓటర్లు పోలింగ్ అధికారుల సాయం తీసుకోవచ్చు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. ఈ ఎన్నికల సందర్భంగా ఓటేసిన వారికి ఎడమచేతి చూపుడు వేలికి ఇంక్ ముద్ర వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎడమచేతి మధ్య వేలికి సిరా గుర్తు వేస్తారు. ఎంపీటీసీలకు పింక్ కలర్ బ్యాలెట్ రాష్ట్రంలో బ్యాలెట్ పద్ధతిన పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఎంపీటీసీ సభ్యులకు గులాబీ రంగు బ్యాలెట్, జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు కలర్ బ్యాలెట్‌ను ఖరారు చేశారు. పార్టీలకు కేటాయించే గుర్తులతో పాటు.. స్వతంత్రులకు 100 రకాల గుర్తులను ఖరారు చేశారు. పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా నామినేషన్లు ఫైనల్ కావడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థుల గుర్తులతో బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. ఎంపీటీసీ అభ్యర్థికి గులాబీ రంగు, జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం తెలుపు రంగు బ్యాలెట్ పేపరు ఇస్తారు. గుర్తుపై ముద్ర వేసిన తర్వాత పేపర్‌ను ఎడమ నుంచి కుడికి 3మడతలుగా చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన పెట్టెల్లో వేయాలి. పేపర్‌ను పైనుంచి కిందకు మడచవద్దు. పైనుంచి కిందకు మడిస్తే ఒక గుర్తుకు వేసిన ముద్ర మరో గుర్తుపై పడే అవకాశం ఉంటుంది. అలా రెండు గుర్తులపై ముద్ర పడితే చెల్లని ఓటుగా పరిగణిస్తారు. -
మొదటి విడత ప్రచారం సమాప్తం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈనెల 11వ తేదీన మొదటి దశలో జరగనున్న 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. పార్లమెంట్‌లోని 543 లోక్‌సభ స్థానాలకు గాను ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు..ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), యూపీ(8), ఉత్తరాఖండ్ (5), ఒడిశా (4), మహారాష్ట్ర (7), బిహార్ (4), అస్సాం (5), పశ్చిమబెంగాల్ (2), జమ్మూకశ్మీర్ (2), మేఘాలయ (2), అరుణాచల్ ప్రదేశ్ (2), మిజోరం, త్రిపుర, మణిపూర్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానానికి 11న ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ (175), సిక్కిం (32), ఒడిశాలోని 147 స్థానాలకు గాను 28 సీట్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. -
నేడు మహాకూటమి తొలి ర్యాలీ
లక్నో : లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ప్రచారం కొద్దిరోజుల్లో ముగుస్తుండటంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు యూపీలో జట్టుకట్టిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి ఆదివారం దియోబంద్‌లో తొలి ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ ర్యాలీతో కేంద్రంలో మోదీ సర్కార్‌కు దీటుగా తమ కూటమి ఎదురొడ్డి నిలుస్తుందనే సంకేతాలను ఓటర్లకు పంపేందుకు ఈ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. 2014లో యూపీలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకున్న బీజేపీని దెబ్బతీసేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమిగా ఏర్పడటంతో పట్టు నిలుపుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తోంది. మరోవైపు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంకను తీసుకురావడంతో యూపీలో గౌరవప్రదమైన స్ధానాల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదునుపెడుతోంది -
తొలి విడత నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొదటి విడత జరిగే లోక్‌సభ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో కూడిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న 535 లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు విడతలుగా జరిపేందుకు ఎన్నికల సంఘం గత వారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విడతలో ఏప్రిల్ 11వ తేదీన 20 రాష్ట్రాల్లోని 91 పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అత్యంత ఉత్కంఠగా జరగబోయే ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, కాషాయ దళాన్ని నిలువరించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు జరిగేదిక్కడే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం (25), తెలంగాణ(17), ఉత్తరాఖండ్(5)ల్లోని మొత్తం స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు సీట్ల చొప్పున, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షదీవుల్లోని ఒక్కో సీటుకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గాను 9 చోట్ల, బిహార్‌లోని 40 సీట్లకు గాను 4, పశ్చిమబెంగాల్లోని 42 స్థానాల్లో 2, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఒడిశాలో 4, జమ్మూకశ్మీర్ 6 సీట్లలో 2 చోట్ల కూడా మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు 25వ తేదీ ఆఖరు నోటిఫికేషన్ జారీ అయిన 18వ తేదీ నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగుతుంది. నామినేషన్ పత్రాల పరిశీలన 26వ తేదీతో, నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీతో గడువు ముగియనుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 నియోజకవర్గాల్లో బరిలో మిగిలే అభ్యర్థులు ఎవరనే విషయంలో మార్చి 28వ తేదీన స్పష్టతరానుంది. అన్ని చోట్లా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అంటే, సాయంత్రం 4, 5, 6 గంటలకు ముగియనుంది. -
తొలిపోరు నేడే
ఆర్మూర్/నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. ఆర్మూర్ డివిజన్లోని 141 పంచాయతీలు, 1,004 వార్డులలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. సర్పంచ్, వార్డు ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి.. ఆర్మూర్ డివిజన్లో 11 మండలాల్లో గల 177 గ్రామ పంచాయతీలు, 1,546 వార్డులకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. అయితే, 36 పంచాయతీలు, 736 వార్డు లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 141 గ్రామాల కు, 1,004 వార్డులలో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. 545 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,517 మంది వార్డు స్థానాల్లో పోటీలో ఉన్నారు. మొత్తం 3,11,148 మంది ఓటర్లు నేడు తమ ఓటు వేయనున్నారు. 1,452 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,957 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు పూర్తి స్థా యి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయా మండల కేం ద్రాల నుంచి బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సు లు, ఇతర సామగ్రిని శనివారం పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల ను కలెక్టర్ రామ్మోహన్రావు, జిల్లా పరిశీలకు రాలు క్రిస్టినా జెడ్ చొంగ్తూ పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్, సిబ్బంది ఏర్పాట్లపై అధికారు లకు వివరించారు. మరోవైపు ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1,405 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. భారీగా ప్రలోభాలు.. పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపు కోసం చివరి వరకూ సర్వశక్తులు ఒడ్డారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థుల ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ఓటర్ల ను ప్రలోభపరుచుకునేందుకు ఆదివారం తెర లేపారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం, మాంసం పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో ఆదివారం ఒక్క రోజే లెక్కకు మించి ఖర్చు అయింది. చికెన్, మద్యంతో పాటు డబ్బులు పంపిణీ చేశా రు. దీంతో చాలా చోట్ల చికెన్‌తో పాటు కూల్‌డ్రింక్స్‌కు కొరత ఏర్పడింది. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పంపి ణీ చేసినట్లు సమాచారం. మేజర్ పంచాయతీల్లో ఒక్కో అభ్యర్థి సుమారుగా రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్‌గల్ తదితర మండలాల్లో ఓటర్లకు భారీగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇక, ఓటర్లను పోలింగ్ కేంద్రాలను తరలించడానికి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. వాహనాల్లో ఓటర్లను తరలించి ఎక్కువ ఓట్లు పొందాలనే ఉద్దేశ్యంతో ఆటోలు, జీపులు, కార్లు సిద్ధం చేసి ఉంచారు. -
ప్రారంభమైన తొలి పంచాయతీ ఎన్నికల పోలింగ్
-
తొలిపోరుకు సర్వంసిద్ధం
తొలివిడత పంచాయతీ సమరానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ, అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. మొదటి విడతగా ఐదు మండలాలు కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని 93 గ్రామాలు, 728వార్డులకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2556 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ : చొప్పదండి మండలంలోని 15 గ్రామపంచాయతీలు, గంగాధర మండలంలో 33, కరీంనగర్‌రూరల్ మండలంలో 17, కొత్తపల్లి మండలంలోని 8, రామడుగు మండలంలోని 21 గ్రామపంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. మొదటి విడత ఎన్నికల నిర్వహణకు 928 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడంతోపాటు అవసరమయ్యే సామగ్రిని బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్‌పేపర్లను సిబ్బందికి అందించారు. జిల్లావ్యాప్తంగా 146 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 113 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కెమెరాలతో ఎన్నికల ప్రక్రియను పరిశీలించనున్నారు. ఎన్నికల విధుల్లో 922 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1236 మంది ఇతర సిబ్బందిని నియమించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఎన్నికల నిర్వహణకు 13 జోన్లు, 40 రూట్లను ఏర్పాటు చేసి ఒక్కో అధికారిని నియమించారు. అదనంగా చెక్‌పోస్టులు, ఫ్లైయింగ్ స్క్యాడ్‌లను నియమించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల్లో కలెక్టర్‌తోపాటు పంచాయతీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు భారతిలక్పతినాయక్ ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ తొలివిడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే కరీంనగర్, కొత్తపల్లి మండలాల ఎన్నికల సామగ్రిని సిబ్బందికి ఆదివారం మధ్యాహ్నం నుంచే అందజేశారు. రేకుర్తి లయోలా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు భారతి లక్పతినాయక్ సందర్శించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ పేపర్, వెబ్‌క్యాస్టింగ్ సామగ్రిని పరిశీలించారు. ఆమెవెంట జిల్లా పంచాయతీ అధికారి సిహెచ్ మనోజ్‌కుమార్, కరీంనగర్ మండల ప్రజాఅభివృద్ధి అధికారి పవన్, విస్తరణ అధికారి జగన్మోహన్రెడ్డి, తదితరులు ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అందజేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించాం. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. – డీపీవో మనోజ్‌కుమార్ -
ఓటేద్దాం రండి
ఆదిలాబాద్‌అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునే సమయం ఆసన్నమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాల్లోని ఆరు మండలాల్లో తొలి విడత ఎన్నికల జరగనున్నాయి. సుమారు 80 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. తర్వాత అక్కడే చేతులెత్తే పద్ధతిలో ఉప సర్పంచ్ ఎన్నిక చేపడుతారు. కాగా పోలింగ్ జరగనున్న 103 పంచాయతీల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేసేందుకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. దీంతో పాటు సర్వీసు ఓటర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది కూడా ఆన్లైన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఆదివారం ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో ఉదయం నుంచి పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకున్న సిబ్బంది సాయంత్రం వారికి కేటాయించిన వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లోనే (గ్రామంలో) రాత్రికి బస చేసి ఉదయం నుంచి ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. అయితే సిబ్బందికి అందజేసిన కిట్‌లో ఆరోగ్య దృష్ట్యా కోల్గేట్, సబ్బులు, మందులు, టార్చ్‌లైట్, తదితర వస్తువులు ఉండేట్లు అధికారులు చర్యలు తీసుకున్నారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ తొలి విడత ఎన్నికలు జరుగుతున్న 103 పంచాయతీల్లో ఐదు జీపీలు సమస్యాత్మకంగా ఉండగా, 17 జీపీలు అత్యంత సమస్యాత్మకంగా, 10 జీపీలు క్రిటికల్‌గా ఉన్నాయి. మిగతా 71 జీపీలు సాధారణంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమస్యాత్మక జీపీలతో కలిపి ఎనిమిది చోట్ల వెబ్‌కాస్టింగ్ చేపట్టి జిల్లా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సీన్‌ను లైవ్‌లో వీక్షించనున్నారు. మిగతా పంచాయతీల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మండలానికో ఫ్లైయిండ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక్కో బృందంలో డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్‌తో కలిపి మొత్తం నలుగురు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఆయా జీపీల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా 80 మంది స్టేజ్–1, 153 మంది స్టేజ్–2 అధికారులను నియమించారు. ఎన్నికల్లో మొత్తం 1546 బ్యాలెట్ బాక్సులను వినియోగించగా, 1240 సిరా బాటిళ్లను అందుబాటులో ఉంచారు. కాగా, సర్పంచ్ ఎన్నికకు మొత్తం 1,11,200, వార్డు సభ్యులకు 85,550 బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. కాగా ఎన్నికల నిర్వహణకు 23 జోనల్ అధికారులు, 28 మంది రూట్ అధికారులను నియమించారు. 103 సర్పంచ్, 638 వార్డులకు ఎన్నికలు జిల్లాలోని ఆరు మండలాల్లో 153 పంచాయతీలు ఉండగా, 50 జీపీలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. అయితే 103 పంచాయతీలకు సోమవారం పోలింగ్ జరగనుంది. తొలి విడతలోని 103 సర్పంచ్ స్థానాలకు 318 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 638 వార్డులకు 1465 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మండలాల వారీగా గమనిస్తే... ఆదిలాబాద్ మండలంలోని 22 జీపీలకు ఎన్నికలు జరగనుండగా, 67 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉన్నారు. ఇదే మండలంలో 159 వార్డులకు 349 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మావలలో 3 జీపీలు ఉండగా, 16 అభ్యర్థులు, 21 వార్డులకు 52 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. బేలలోని 26 జీపీలకు 71 మంది, 127 వార్డులకు 280 మంది, జైనథ్‌లో 36 సర్పంచ్ స్థానాలకు 96 మంది, 219 వార్డులకు 479 మంది అభ్యర్థులు తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక తాంసిలోని 5 జీపీలకు 24 మంది, 45 వార్డులకు 110 మంది, భీంపూర్‌లోని 11 జీపీలకు 44 మంది, 67 వార్డులకు 195 మంది బరిలో నిల్చున్నారు. వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లాలోని 103 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఒక్కో పంచాయతీల్లో 4 నుంచి 6 వార్డుల వరకు ఉన్నాయి. ఒక్కో పంచాయతీలో 12 వార్డులు కూడా ఉన్నాయి. అయితే ఆయా పదవులకు పోలింగ్ నిర్వహించేందుకు వార్డుకోకటి చొప్పున పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. కాగా, రెండు రోజుల క్రితం నుంచి కొనసాగుతున్న పోల్ చిటీల పంపిణీ ఆదివారం కూడా కొనసాగుతోంది. కాగా, పంచాయతీల వారీగా ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకుని సిబ్బంది సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. -
తీర్పు నేడే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మొదటి విడత పంచాయతీ సమరానికి సమయం రానే వచ్చింది. జిల్లాలో మొత్తం 719 గ్రామ పంచాయతీలు, 6,366 వార్డులు ఉండగా మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నేడు మొదటి విడతగా 203 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 1వ తేదీన నోటిఫికేషన్ జారీ అవ్వగా 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 203 పంచాయతీల్లో ఎన్నికలు జిల్లాలో మొదటి విడుత ఎన్నికలు సోమవారం జరుగుతాయి. 10 మండలాల్లో మొత్తం 249 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 46 పంచాయతీలు ఎప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 203 పంచాయతీలకు సోమవారం ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండలోని 203 పంచాయతీలు, 2,274 వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. 46 గ్రామాలు ఏకగ్రీవం తొలి విడుతలో 46 పంచాయతీలు ఏకగ్రీవం అ య్యాయి. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. 13వ తేదీవరకు ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో 46 పంచాయతీలకు కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవ్వడంతో ఈ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా కోయిల్‌కొండలో 12 పంచాయతీలు, మరికల్లో ఎనిమిది, నారాయణపేటలో ఆరు, దామరగిద్దలో ఐదు, కృష్ణా, నర్వలో 4, మాగనూర్‌లో 3, మక్తల్‌లో 2, ఊట్కూర్, ధన్వాడలో ఒకటి చొప్పున మొత్తం 46 పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్‌కు 5,518 మంది సిబ్బంది తొలి విడుతకు మొత్తం 5518 మంది అధికారులను గుర్తించారు. ఇందులో 2,274 పీఓలు, అదనంగా 228 మంది పీఓలను గుర్తించారు. 2,742 ఏపీలు అదనంగా 274 మందిని ఏపీఓలను గుర్తించారు. వీరు నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. ఇక పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక వరకు ఈ అధికారులు విధులు నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మొదలు.. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. మూడు విడుతల్లో ఈ మాదిరిగానే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన గంట తరువాత (మధ్యాహ్నం 2గంటలకు) నుంచి ఆయా గ్రామ, వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి వార్డు మెంబర్‌కు, మరొకటి సర్పంచ్‌కి ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్ జరిగే రోజునే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుపాలని మొదలు అనుకున్నప్పటికీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దానికి అనుగునంగానే ఈ సారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఇందులో గులాబీ రంగ బ్యాలెట్ సర్పంచ్‌కు, తెలుపు రంగు బ్యాలెట్ వార్డు సభ్యులకు కేటాయించారు. ఇందులో సర్పంచ్‌కు 30, వార్డు çసభ్యులకు 20 గుర్తులను కేటాయించారు. నేడే ఫలితాలు నేటి పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యా«హ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ముందుగా వార్డు సభ్యులకు చెందిన ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. ఓట్లను లెక్కించేందుకు అధికారులు పంచాయతీల వారిగా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు ఉపయోగించే సామాగ్రి అందుబాటులో ఉంచారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా అందుకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేశారు. గుండు సూది, క్యాండిల్, రబ్బర్‌బ్యాండ్ లాంటి వస్తువులను సైతం అందుబాటులో ఉంచారు. ఉప సర్పంచ్‌లు సైతం ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తారు. దీంతో ఎవరెవరు గెలిచారో.. ఓడారో తెలిసి పోతుంది. ఎవరి ప్యానెల్‌కు ఎక్కువ సభ్యులు గెలిచారో తేలనుంది. ఆ వెంటనే అసలు రాజకీయం మొదలవుతుంది. ఉప సర్పంచ్ పదవికి పోటీ పెరిగి పోతుంది. ముందుగా అనుకున్న ప్యానెల్ గెలిస్తే అప్పటికే అనుకున్న అభ్యర్థికి ఉప సర్పంచ్‌గా అవకాశం వస్తుంది. అనుకున్న అభ్యర్థి ఓడిపోతే గెలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలో పార్టీలు రాజకీయ వ్యుహాలను íసిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. సర్పంచ్ జనరల్ అయితే ఉప సర్పంచ్ నాన్ జనరల్‌కు ఇవ్వాలని, సర్పంచ్ రిజర్వు అయితే ఉప సర్పంచ్ జనరల్‌కు ఇవ్వాలనే పోటీ నెలకుంటుంది. పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బంది ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. ఉప సర్పంచి ఎన్నిక పూర్తి అయితేనే సంపూర్ణంగా అధికారులు పని పూర్తి అయినట్లు. ఇంకులో స్వల్ప మార్పు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థి వేలికి వేసే ఇంకును ఎడమ చేతి చూపుడు వేలుకు కాకుండా ఎడమ చేతి మధ్య వేలుకు ఇంకు పెడుతారు. ఎందుకంటే డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు పెట్టారు. దీంతో అ ఇంకు ఇప్పటి దాక ఉండవచ్చనే కారణంతో ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.