Breadcrumb
UP Assembly Election 2022: తొలిదశ పోలింగ్ పూర్తి
Published Thu, Feb 10 2022 6:54 AM | Last Updated on Thu, Feb 10 2022 6:53 PM
Live Updates
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ పూర్తి
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ పూర్తైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. కాగా బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ అవినీతిని తీసుకొచ్చిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు.
సాయంత్రం 5 గంటల వరకు 57.79 పోలింగ్
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 57.79% పోలింగ్‌నమోదైంది. ఘజియాబాద్‌లో 55.31% పోలింగ్ నమోదవ్వగా.. మీరట్‌లో 55.70% ఓటింగ్ నమోదైంది. మరోవైపు ఈవీఎంలు పనిచేయడం లేదని ఎక్కడ ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల కమిషనర్‌ను కోరారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు 48.24 శాతం పోలింగ్ నమోదు
►ఉత్తరప్రదేశ్ మెదటి దశ పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.24 శాతం ఓటింగ్ నమోదైంది.
►లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలోని నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా..బెయిల్ పొందడంతో ఆర్ఎల్డీ నాయకుడు జయంత్ చౌదరి బీజేపీపై విరుచుకుపడ్డారు. నలుగురు రైతులను హతమార్చిన నిందితుడికి నాలుగు నెలల్లో బెయిల్ లభించిందని చౌదరి ట్విట్టర్లో పేర్కొన్నారు.
क्या व्यवस्था है!!
— Jayant Singh (@jayantrld) February 10, 2022
चार किसानों को रौंदा, चार महीनों में ज़मानत…
మధ్యాహ్నం 1 గంట వరకు 35శాతం పోలింగ్
ఉత్తర ప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో జరుగుతున్న మొదటి దశ పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 35.03 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా అత్యధికంగా శామ్లి జిల్లాలో 41.6 శాతం పోలింగ్ నమోదయింది. అ ముజఫర్ నగర్లో 35.73 శాతం, మీరట్ 34.51, బాఘ్‌పత్ 38.02, ఘజియాబాద్ 33.40, హాపూర్ 39.97, గౌతంబుద్ధ్‌నగర్ 30.53, బులంద్ షహర్ 37.03, అలీగఢ్ 32.07, మధుర 36.26, ఆగ్రాలో 36.93 శాతం పోలింగ్ నమోదయింది.
35.03% voter turnout recorded till 1pm in the first phase of #UttarPradeshElections2022 pic.twitter.com/vrkvVC05LM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022
ఓటు వేసిన కేంద్ర మంత్రి
తొలిదశ పోలింగ్‌లో భాగంగా ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ సంజీవ్ బల్యాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ముజఫర్‌నగర్ ప్రాంతాన్ని క్రైమ్ క్యాపిటల్‌గా పిలిచేవారని అన్నారు. నేడు శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని, అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం మాఫియా రాజ్యం అంతమైందని పేర్కొన్నారు. పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.
ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఓటుకు దూరంగా ఆర్ఎల్డీ చీఫ్ జయంత్
మధురలో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ర్యాలీ కారణంగా ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి తొలిదశ పోలింగ్‌లో ఓటు వేయలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు మధుర ప్రాంతంలో ఓటు హక్కు ఉంది.
యూపీలో కొనసాగుతున్న తొలిదశ ఎన్నికల పోలింగ్
ఓటర్లకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ
భారీ ఎత్తున తరలివచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
देश को हर डर से आज़ाद करो-
— Rahul Gandhi (@RahulGandhi) February 10, 2022
बाहर आओ, वोट करो!
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది: షామ్లీ జిల్లా కలెక్టర్
పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు. షామ్లీ జిల్లా కలెక్టర్ జస్జిత్ కౌర్ మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు సంబంధించి ఫిర్యాదులు అందాయని, ఈవీఎంల సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదని తెలిపారు.
ఓటు వేసిన బేబీ రాణి మౌర్య
ఆగ్రా రూరల్ బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుపరిపాలన కోసం ఓటర్లు బీజేపీ అనుకూలంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
తొలి దశలో 2.27 కోట్ల మంది ఓటర్లు
తొలిదశ పోలింగ్‌లో ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆర్ఎల్డీ-ఎస్పీ దోస్తీతో ఈ దఫా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారింది.
బహుముఖ పోరు
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బహుముఖ పోరు నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ బరిలో.. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ- ఆర్ఎల్డీ, ఆప్, ఎంఐఎం పార్టీలు పోటీలో ఉన్నాయి.
2017 తొలి దశలో బీజేపీ హవా
2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 58 సీట్లకు పోలింగ్ జరగ్గా బీజేపీ 53 చోట్ల గెలుపొందింది.. చెరో 2 స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ, ఒక స్థానంలో ఆర్ఎల్డీ గెలుపొందాయి.
తొలిదశ పోరులో 9 మంది మంత్రులు
తొలిదశ పొలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానకి ఓటర్ల తరలివస్తున్నారు. తొలిదశ బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని 9 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేబినెట్ మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులు తొలిదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Related News By Category
Related News By Tags
-
ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్కో పార్టీ ప్రత్యర్థులను ఎద్దేవా చేసే నినాదాలతో తమ ప్రచారాల్లో, సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నాయి. యూపీ, యోగీ కలి...
-
సీఎం యోగి వార్నింగ్.. ‘ వివాదాస్పద వ్యాఖ్యలకు శిక్ష తప్పదు’
లక్నో: ఇతర మతానికి, విశ్వాసానికి సంబంధించిన సాధువులు, పూజారులపై కించపరిచే వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారిని శిక్షించ...
-
యూపీ పల్లెల్లో ‘భేడియా’ టెర్రర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా పల్లెలకు కంటి మీద కునుకు కరువైంది. భయం గుప్పిట గడుపుతున్నారు అక్కడి ప్రజలు. తల్లిదండ్రులు.. తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గత 45 రోజుల్లో తోడేళ్ల గుం...
-
యూపీలో బీజేపీకి తగ్గిన సీట్లు.. ఆరు కారణాలు ఇవే!
లక్నో: లోక్ సభ ఎన్నికల్లో తమకు కుంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. గత లోక్ సభ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా సీట్లు తగ్గాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యాన...
-
ఎవరిని చంపుతున్నారు అనేది ప్రశ్న కాదు.. కాల్పులపై అఖిలేష్ ఫైర్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. సిటీ సివిల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో.. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుం...
Comments
Please login to add a commentAdd a comment