UP Assembly Election 2022
-
యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరస్పరం నవ్వుకుంటూ పలకరించుకున్నారు. యూపీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు కలిశారు. యోగి అసెంబ్లీలోకి రాగానే.. సభ్యులందరూ లేచి నిలబడ్డారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముందు వరుసలో కూర్చున్న అఖిలేష్ కూడా తన సీటులోంచి లేచి యోగికి విష్ చేశారు. ఒకరినొకరు షేక్ హ్యండ్ ఇచ్చుకొని అత్మీయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎన్నికల వరకు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న అఖిలేష్, యోగి.. ఇలా నవ్వుకుంటూ పలకరించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాన ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రమాణం చేశారు. చదవండి: బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు, వీడియో వైరల్ #WATCH Uttar Pradesh CM Yogi Adityanath meets Leader of Opposition Akhilesh Yadav in the Legislative Assembly during oath-taking of newly-elected legislators #Lucknow pic.twitter.com/7r6fX7ErjX — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 28, 2022 ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు కైవసం చేసుకొని రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను గెలిచి ప్రతిపక్ష హోదా అందుకుంది. యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ అర్భన్ స్థానం నుంచి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన అఖిలేష్ యాదవ్ అజంగఢ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతేగాక యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ఏకగగ్రీవంగా ఎన్నికయ్యారు. -
రెండోసారి యోగి ఆదిత్యనాథ్ పట్టాభిషేకం
-
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి పట్టాభిషేకం
-
భారీ జనసందోహం మధ్య సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నోలో శుక్రవారం యూపీ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే 52 మంది మంత్రులతో యోగి జంబో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో 18 మందికి కేబినెట్ హోదా, 14 మందికి స్వతంత్ర హోదాను కల్పించారు. తన మంత్రి వర్గంలో మరో 20 మంది సహాయ మంత్రులకు సీఎం చోటు కల్పించారు. కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్‌లకు డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేశవ్ ప్రసాద్ ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ సీఎం యోగి ఆయనకు కీలక బాధ్యతను అప్పగించడం విశేషం. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. భార జనసందోహం మధ్య సీఎంగా ఆయన ప్రమాణం చేశారు. Lucknow | BJP's Yogi Adityanath takes oath as the Chief Minister of Uttar Pradesh for the second consecutive term. pic.twitter.com/ubAZ5nHTB4 — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2022 Prime Minister Narendra Modi arrives at Atal Bihari Vajpayee Ekana Cricket Stadium in Lucknow where UP CM-designate Yogi Adityanath will take oath for the second consecutive term. pic.twitter.com/tD9sk4g0KH — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2022 -
యూపీలో బీజేపీ విజయ రహస్యం
దేశ ప్రజల్లో ఉత్కంఠ రేపిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఇక పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ 117 సీట్లకు 92 సీట్లు సాధించి, దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించాలనుకున్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు చతికిల పడ్డాయి. బీజేపీ కూటమి 403 సీట్లకుగానూ 273 సీట్లు సాధించడం ఆషామాషీ విషయం కాదు. అఖిలేష్ యాదవ్ పన్నిన యాదవులు ప్లస్ ముస్లింలు ప్లస్ జాట్లు వ్యూహం వికటించింది. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో జాట్ తెగ హిందువులు నరేంద్ర మోదీపై గుర్రుగా ఉన్నా, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల రక్షణ విషయంలో బీజేపీ వైపు నిలబడాలని దృఢ నిశ్చయానికి వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక జాట్లు, కొంతమంది ముస్లింలు బీజేపీ వైపు నిలబడడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలేనని చెప్పాలి. పైగా సంఘ వ్యతిరేక శక్తులను అణచివేయడంలో యోగి దృఢనిశ్చయంతో ఉంటాడని 54 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. సమాజ్‌వాదీ ముస్లింల పార్టీ కాదు. అయినప్పటికీ దాదాపు 80 శాతం ముస్లిం ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేశారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ పార్టీ చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం అభ్యర్థులను నిలిపి, హిందూ సమాజంలోని యాదవులను చీల్చి ముస్లిం అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేసింది. ఈ ప్రయోగం బాగా వర్కౌట్ అయింది. అందుకే ఆ పార్టీ తరఫున 31 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ముస్లిం ఓటు బీఎస్పీకి, కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీలకు చీలి పోకుండా ముస్లిం మత పెద్దలు చేసిన ప్రయత్నాలు కొంత సఫలమైనట్లే. మొత్తం మీద యూపీలో ప్రజలు యోగీ చేసిన సుపరిపాలనకు, ఆయన అందించిన శాంతి భద్రతలకు ఓటేశారని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. (క్లిక్: ఈ విజయం ప్రతిపక్షాలకు గుణపాఠం) – ఉల్లి బాల రంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
మోదీ పవర్ఫుల్ లీడర్ అంటూ ప్రశంసించిన శశిథరూర్.. టెన్షన్లో కాంగ్రెస్..!
జైపూర్: ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. ఓటర్లు మరోసారి కాషాయ జెండాను ఎగురువేశారు. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ శక్తివంతమైనా నాయకుడు అంటూ ప్రశంసించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. శశిథరూర్ సోమవారం జైపూర్‌లో లిచరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై శశిథరూర్ స్పందిస్తూ.. ప్రధాని మోదీని ప్రశంసించారు. ఈ క్రమంలోనే మోదీ శక్తివంతమైన నాయకుడు, క్రియాశీల నేత అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపరంగా ఆయన చేసిన పనులు అభివర్ణించదగ్గవని అన్నారు. బీజేపీ విజయాన్ని మేము ఊహించలేదన్నారు. అంతలోనే తనదైన స్టైల్లో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ శక్తివంతమైన నాయకుడే కానీ.. మోదీ సమాజంలోకి వదిలిన కొన్ని శక్తులు దేశ ప్రజలను మతం, వర్గం పరంగా జాతిని విడదీస్తున్నాయని సంచలన ఆరోపణలు గుప్పించారు. అది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయం సాధించింది కానీ.. రానున్న రోజుల్లో మళ్లీ యూపీ ప్రజలే బీజేపీకి షాకిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ యూపీలో బలమైన ప్రత్యర్థిగా ఎదిగిందని కితాబిచ్చారు. అలాగే, యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రియాంక గాంధీ తన శాయశక్తుల కృషి చేశారని కొనియాడారు. కానీ, చివరకు ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. -
ప్రధాని మోదీతో సీఎం యోగి భేటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సీఎం యోగి మొదటిసారిగా దేశ రాజధానికి చేరుకున్నారు. దాదాపు గంటన్నరపాటు వారి భేటీ కొనసాగింది. ముఖ్యంగా యూపీలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. రానున్న సంవత్సరాల్లో యోగి హయాంలో యూపీలో అభివృద్ధి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు సీఎం యోగి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్‌లతో భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లతోనూ సమావేశమయ్యారు. -
బీజేపీకే 54% హిందూ ఓట్లు
లక్నో: తాజాగా ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన ఓటింగ్ ధోరణి స్పష్టంగా కన్పించిందని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే పేర్కొంది. హిందూ ఓట్లలో సగానికి పైగా బీజేపీకి పడగా ఏకంగా మూడింట రెండొంతుల మంది ముస్లింలు సమాజ్‌వాదీకి ఓటేసినట్టు వివరించింది. అయితే బీజేపీకి ముస్లిం ఓట్లు, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీకి హిందూ ఓట్లు పెరిగినట్టు తెలిపింది. ‘‘2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ముస్లిం ఓట్లు స్వల్పంగా పెరిగాయి. ఎస్పీకి హిందూ ఓట్లు కూడా 18 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి’’ అని వెల్లడించింది. హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో అఖిలేశ్ యాదవ్ పలు హిందూ దేవాలయాలను సందర్శించడం తెలిసిందే. బీజేపీ తరఫున సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా 80 శాతం మంది ప్రజలు బీజేపీకే మద్దతుగా ఉన్నారంటూ పదేపదే ‘80–20’ ప్రచారం ద్వారా హిందూ–ముస్లిం భావోద్వేగాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. సమగ్రమైన శాంపిల్స్ ఆధారంగా సర్వే జరిగినట్టు సీఎస్డీఎస్ రీసెర్చ్ విభాగమైన లోక్‌నీతి కో డైరెక్టర్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు. ► హిందూ ఓటర్లలో 54 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 2017లో ఇది 47 శాతమే. ► బీఎస్పీకి 14 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం హిందూ ఓట్లు దక్కాయి. ► ముస్లిం ఓటర్లలో ఏకంగా 79 శాతం మంది సమాజ్‌వాదీకే ఓటేశారు. 2017లో ఇది 46 శాతం మాత్రమే! ► బీజేపీకి 8 శాతం ముస్లిం ఓట్లు పడ్డాయి. 2017లో ఇది 5 శాతమే. ► బీజేపీ కూటమి నుంచి గెలిచిన 273 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ముస్లిం కూడా లేరు. ► బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెటివ్వలేదు. మిత్రపక్షం అప్నాదళ్ ఒకరికి అవకాశమిచ్చింది. ► బీఎస్పీకి 6 శాతం ముస్లిం ఓట్లు మాత్రమే పడ్డాయి. 2017లో ఇది 19 శాతం ► 2017 కంటే 10 మంది ఎక్కువగా ఈసారి 34 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ► వీరిలో 31 మంది ఎస్పీ అభ్యర్థులే. మిగతా ముగ్గురు కూడా ఎస్పీ మిత్రపక్షాలు ఆరెల్డీ, ఎస్బీఎస్పీ తరఫున పోటీ చేశారు. -
కాంగ్రెస్ కు శత్రువు కాంగ్రెసే: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
-
బీజేపీ సొంతంగా సాధించిన సీట్లు ఎన్నో తెలుసా?
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సవ్యంగా ముగిశాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించగా, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన బీజేపీ 2017 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని స్వల్పంగా మెరుగు పరుచుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 273 సీట్లలో విజయం సాధించింది. బీజేపీకి మైనస్.. ఎస్పీకి ప్లస్ తాజా ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగినా 57 సీట్లు తగ్గాయి. కమలం పార్టీ సొంతంగా 255 స్థానాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ మిత్రపక్షాలు అప్నా దల్ (సోనీలాల్) 12, నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్ 6 సీట్లు దక్కించుకున్నాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే అదనంగా 64 సీట్లను సాధించింది. గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన అఖిలేశ్ పార్టీ ఇప్పుడు 111 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాదీ మిత్రపక్షాలు రాష్ట్రీయ లోక్ దళ్ 8, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 6 స్థానాలు గెలిచాయి. బీఎస్పీ, కాంగ్రెస్ ఫట్! బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన బీఎస్పీ ఏకంగా 18 సీట్లు కోల్పోయి సింగిల్ సీట్‌కే పరిమితమైంది. 2017 ఎన్నికల్లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ 5 సీట్లు కోల్పోయి రెండు స్థానాలను మాత్రమే గెలుకోగలిగింది. 10 శాతం పెరిగిన ఎస్పీ ఓట్లు తాజా ఎన్నికల్లో బీజేపీ 41.3 శాతం ఓట్లు సాధించింది. 2017 ఎన్నికలతో(39.67) పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. సమాజ్‌వాదీ పార్టీ గతంతో పోలిస్తే ఏకంగా 10.3 శాతం ఓటింగ్ షేర్ అదనంగా సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో 32.1 శాతం ఓట్లు సాధించగా.. 2017లో 21.82 శాతం ఓట్లు దక్కించుకుంది. బీఎస్పీ 9.38, కాంగ్రెస్ 3.92 శాతం ఓట్ షేర్ కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి 12.88, కాంగ్రెస్‌కు 2.33 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 6.74 శాతం, రాష్ట్రీయ లోక్ దళ్ 2.85 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. (క్లిక్: తెలంగాణలో జోరందుకున్న పాదయాత్రలు) బీజేపీకి 3, ఎస్పీకి 2, బీఎస్పీకి 1 అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి మొత్తంగా 3 కోట్ల 80 లక్షల 51 వేల 721 ఓట్లు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ 2 కోట్ల 95 లక్షల 43 వేల 934 ఓట్లు దక్కించుకుంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కోటి 18 లక్షల 73 వేల 137 ఓట్లు దక్కాయి. ఇతరులు 62 లక్షల 13 వేల 262 ఓట్లు తెచ్చుకున్నారు. (క్లిక్: యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) ‘నోటా’నే బెటర్! యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పార్టీల కంటే ‘నోటా’కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నోటాకు 0.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎఐఎం 0.49, ఆప్ 0.38, జేడీ(యూ) 0.11, సీపీఐ 0.07, ఎన్సీపీ 0.05, ఎస్హెచ్ఎస్ 0.02, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఎల్జేపీఆర్వీ 0.01 శాతం చొప్పున ఓట్లు దక్కించుకున్నాయి. (క్లిక్: మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు) -
‘మాయావతి, ఒవైసీలకు.. పద్మవిభూషణ్, భారతరత్న’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీలకు పద్మవిభూషణ్ లేదా భారతరత్న పురస్కారాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ యూపీ వారి రాష్ట్రం. అఖిలేశ్ యాదవ్ సీట్లు 3 రెట్లు పెరిగాయి. 42 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయి. మాయావతి, ఒవైసీలు.. బీజేపీ విజయానికి దోహదపడ్డారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాల’ని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయారు? నాలుగు రాష్ట్రాలలో బీజేపీ గెలిచినప్పటికీ.. పంజాబ్ ఓటర్లు కమలం పార్టీని పూర్తిగా తిరస్కరించారని చెప్పారు. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి సహా సీనియర్ నేతలంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పంజాబ్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. యూపీ, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే.. పంజాబ్‌లో బీజేపీ దారుణంగా ఓడిపోయిందని వెల్లడించారు. బీజేపీ వంటి జాతీయ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం చెందడం ఆలోచించదగ్గ విషయని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, గోవాలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. బీజేపీకి బీ టీమ్.. యూపీ ఎన్నికల్లో బీజేపీకి బీఎస్పీ, ఎంఐఎం బీ టీమ్ పనిచేశాయని ప్రత్యర్థి పార్టీలు బలంగా ఆరోపించాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఈ రెండు పార్టీలు పనిచేశాయని పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు తోసిపుచ్చాయి. తాము బీజేపీకి బీ టీమ్ అని తప్పుడు ప్రచారం చేయడం వల్లే దారుణంగా ఓడిపోయామని బీఎస్పీ అధినేత్రి మాయావతి వాపోయారు. బీజేపీని ఓడించే సత్తా తమ పార్టీకే ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె అన్నారు. ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని, ఉత్తరప్రదేశ్‌లోని మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. (చదవండి: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్) -
యూపీలో బీజేపీ వ్యూహాలన్నీ సక్సెస్
-
మోదీ చేతికి వజ్రాయుధం.. తెరపైకి రాష్ట్రపతి ఎన్నికలు
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టుని పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయఢంకా మోగించడంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో ముగిసిపోతుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యులు ఉంటారు. ఒకవేళ యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించి ఉంటే బీజేపీకి ఒడిశాలోని బీజేడీ, తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మద్దతు అవసరమయ్యేది. కానీ యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ విజయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి అడ్వాంటేజ్‌గా మారిందని లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 233 మందితో పాటుగా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4,120 మంది మొత్తంగా 4,896 మంది సభ్యులుగా ఉంటారు. ఎంపీల ఓటు విలువ 708గా ఉంటే, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాలను బట్టి మారిపోతుంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువని నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా 208గా ఉంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 83,824, పంజాబ్‌లో 13,527, ఉత్తరాఖండ్‌లో 4,480, గోవాలో 800, మణిపూర్‌లో 1080గా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో చీలికలు తేవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరుని కూడా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాలని కొందరు డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ 10,98,903లో 50శాతానికి పైగా ఓట్లు వస్తేనే ఎన్నికల్లో విజయం సాధించగలరు. జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రతిపాదించిన అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
యూపీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. టెన్షన్లో రాజకీయ పార్టీలు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల పర్వంలో కొత్త అంశం కనిపించింది. పోటాపోటీగా ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జేడీ(యూ) పార్టీల కంటే ‘నన్ ఆఫ్ ది ఎబో(నోటా)’ మీటకు పడిన ఓట్లే ఎక్కువ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్‌సైట్‌లోని గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం పోలైన ఓట్లలో ఆప్‌నకు 0.35 శాతం, జేడీయూకు 0.11 శాతం ఓట్లు పడ్డాయి. అయితే, వీటికంటే ఎక్కువగా నోటాకు 0.69 శాతం ఓట్లు పడటం విశేషం. ఎంఐఎం పార్టీకి 0.47 శాతం ఓట్లు పడ్డాయి. సీపీఐ పార్టీకి 0.07 శాతం, ఎన్సీపీ పార్టీకి 0.05 శాతం, శివసేనకు 0.03 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎన్జేపీ(ఆర్వీ) పార్టీలు 0.01 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. ఏఐఎఫ్బీ, ఐయూఎంఎల్, ఎల్జేపీలకు ఒక్క ఓటు కూడా పడలేదని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి 41.6 శాతం ఓట్లు పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీకి 32 శాతం ఓట్లు, బీఎస్పీకి 12.8 శాతం, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు 3.02 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 2.38 శాతం ఓట్లు సాధించింది. మరోవైపు.. దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే చవిచూస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు. -
యూపీలో మరోసారి ‘కమల’ వికాసం (ఫోటోలు)
-
యూపీలో బీజేపీ భారీ విక్టరీ.. సీఎం యోగి కామెంట్స్ ఇవే..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. సీఎం యోగి ఆదిత్యానాథ్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోషించబోతున్నారు. యూపీ ప్రజలు యోగి సర్కార్‌పై నమ్మకంతో మరోసారి కాషాయ పార్టీకి అనూహ్య మెజార్టీని అందించారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా బీజేపీకి విజయం అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. యూపీలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిందని కితాబిచ్చారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి తమకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. యూపీలో ఎన్నికలు తొలిసారి ప్రశాంతంగా జరిగాయని ప్రశంసించారు. పార్టీలోని ప్రతీ ఒక్కరి కృషితోనే ఈ విజయం దక్కిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయని ఆరోపించారు. కానీ, ప్రజలు అవేవీ పట్టించుకోకుండా బీజేపీకి విజయం అందించారని కొనియాడారు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయని విమర్శలు గుప్పించారు. ప్రజల తీర్పుతో యూపీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. దేశంలోనే యూపీని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామన్నారు. -
ఎస్పీని బోల్తా కొట్టించిందీ.. కమలాన్ని వికసింపజేసిందీ ఆ 10 అంశాలే!
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రేంజ్లో వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల జాతీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఊహించని షాకిచ్చారు. గెలుపు మాదంటే మాదే అని ధీమాగా ఉన్న కొన్ని పార్టీలకు ఓటర్లు భారీ ట్విస్ట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ పార్టీ మరోసారి కాషాయ జెండా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ బీజేపీకే యూపీ ఓటర్లు మరోసారి పట్టం కట్టారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 2012 తరహాలో ఎలక్షన్ రిజల్ట్‌ను పునరావృతం చేయాలని భావించిన సమాజ్‌వాదీ పార్టీకి మరోసారి ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. కానీ, 1996 తర్వాత 100 సీట్లు దాటిన ప్రతిపక్షంగా ఎస్పీ రికార్డు సాధించింది. యూపీలో గతంలో ప్రతిపక్షానికి 50 సీట్లు దాటిన దాఖలాలు లేవు. బీజేపీ గెలుపునకు కారణాలు ఇవే.. 1. రామ మందిర నిర్మాణం.. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన రోజు నుంచే అధికార బీజేపీ రామమందిర నిర్మాణం అంశాన్ని హైలెట్ చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేసింది. పక్కా ప్లాన్‌తో ముందుకు సాగింది. 2. ఎన్నికల ప్రచారంలోకి కీలక నేతలు.. యూపీలో కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ కీలక నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారింది. 3. యోగి కాంట్రవర్సీ కామెంట్స్.. ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్.. బూల్డోజర్ల ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రంలో నేరాలు చేస్తే సహించేది లేదంటూ.. నేరస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వారి కోసం బూల్డోజర్లు రెడీగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారమే చెలరేగింది. కానీ, అదే చివరకు అధికార పార్టీకి ప్లస్ పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు లవ్ జిహాద్ కేసుల్లో పట్టుబడిన దోషులకు పదేళ్ల జైలు శిక్ష వంటి అంశాలు కూడా కలిసొచ్చాయి. 4. అట్రాక్ట్ చేసిన ఉచిత పథకాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ.. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్-2022 పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఫ్రీ రేషన్, ఉచిత కరెంట్, మద్దతు ధర హామీలకు ఓటర్లలు ప్రభావితం అయ్యారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, యువతకు భారీగా ఉద్యోగాల కాన్సెప్ట్ కూడా ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించింది. 5. ఫలించిన గో సంరక్షణ మంత్రం.. యూపీలో గోవధపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గోవులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాము అధికారంలోకి వస్తే గోవుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్టు చేస్తున్నట్టు యోగి తెలిపారు. ఎక్కువ సంఖ్యలో గోశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఓటమికి కారణాలు.. 1. స్టార్ క్యాంపెయినర్లు కరువు.. ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు కరువయ్యారు. ప్రచారంలో అఖిలేష్ యాదవ్‌తో పాటు కేవలం ఎస్పీకి చెందిన కొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఎస్పీకి చెందిన జయా బచ్చన్, డింపుల్ చౌదరి స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నప్పటికీ వారు ప్రచారంలోకి రాలేకపోయారు. ఇది పార్టీకి పెద్ద నెగిటివ్‌గా మారింది. 2. ప్రభావం చూపని ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు బూస్ట్ ఇస్తాయని భావించారు. ఈ ఘటనలపై ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. 3. యాదవ-ముస్లిం పార్టీగా ఎస్పీపై ముద్ర.. యాదవ-ముస్లిం పార్టీగా సమాజ్‌వాదీ పార్టీపై ముద్రవేయడంలో అధికార బీజేపీ పూర్తిగా విజయవంతమైంది. బీజేపీ లాజిక్‌తో మిగతా వర్గాలు ఎస్పీకి దూరమయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు కూడా వైఫల్యం చెందడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయాయి. 4. బీజేపీ వైపే జాట్, బ్రహ్మణ వర్గాలు.. యూపీలో గెలుపు, ఓటమిని డిసైడ్ చేసేది జాట్, బ్రహ్మణ వర్గాలే. అయితే, రైతు చట్టాల రద్దు సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జాట్లు పోరాటం చేశారు. ఈ క్రమంలో జాట్లు రెండుగా చీలిపోయారు. ఓ వర్గం బీజేపీకి అనుకూలంగా మారడంతో ఓట్లు చీలిపోయాయి. చెరుకు పండించే జాట్ రైతులు, బ్రహ్మణులు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గారు. దీంతో ఎస్పీకి ఓటు బ్యాంకు చీలిపోయింది. 5. ఫలించని మేనిఫెస్టో.. ఎన్నికల సందర్భంగా ఎస్పీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు వరాలు ప్రకటించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఉచిత 2 గ్యాస్ సిలిండర్లు, బాలికలకు కేజీ టూ పీజ్ఉచిత విద్య, ప్రతి జిల్లాలో మోడల్ స్కూల్స్ నిర్మాణం, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించిన ఓటర్లు ప్రభావితం కాలేదు. -
యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. యూపీ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు చుక్కానిగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని అంటున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీ సత్తా చాటేందుకు ఈ ఫలితాలు దోహదపడతాయని భావిస్తున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ నాయకత్వానికి మరింత దన్నుగా ఈ ఫలితాలు నిలుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి వరుసగా రెండోసారి విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా మరింత పెరిగింది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న పార్టీలు తాజా ఫలితాలను జీర్ణించుకోవడం కష్టమే. కేంద్రంలో మోదీ సర్కారును గద్దె దించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఇప్పుడున్న బలం సరిపోదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. తాజా ఫలితాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, టీఆర్ఎస్, వామపక్ష పార్టీల భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాయో చూడాలి. బీజేపీకి దీటుగా ఆప్ అయితే బీజేపీకి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుండటం ఆసక్తికర పరిణామం. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఊడ్చేసిన ఆప్.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం పన్నుతుందో చూడాలి. భవిష్యత్తులో బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి అవుతారని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కో-ఇంచార్జి రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకుని సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!) -
యూపీలో ఈసారి సీఎం ఆయనే!
-
యూపీలో బీజేపీ జైత్రయాత్రకు ఈ రెండు అంశాలు కీలకం
-
భారీ ఆధిక్యంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్
-
‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని బుధవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపణలకు దిగింది. ‘ ట్యాంపరింగ్‌ను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయా? ఈ విషయంలో ఈసీ వివరణ ఇవ్వాల్సిందే’ అని ఎస్పీ ట్వీట్‌చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఈవీఎంలను తరలించిన ఘటనలో వారణాసి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నళినికాంత్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. అయితే.. యూపీ పోలింగ్‌లో వాడిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి తరలిస్తున్నారంటూ ఒక వీడియోను ఎస్పీ బహిర్గతం చేయడం తెల్సిందే. ఈ వివాదంపై ఎన్నికల అధికారులు గురువారం స్పష్టతనిచ్చారు. ‘ అవి పోలింగ్‌లో వాడినవి కాదు. బుధవారం శిక్షణ కోసం వాడటం కోసం తీసుకెళ్తున్నారు. బుధవారం ఉదయం తరలించాల్సి ఉండగా ముందస్తు అనుమతిలేకుండా మంగళవారం రాత్రే తరలించారు. తరలింపులో నిర్లక్ష్యం వహించిన నళినికాంత్ సింగ్‌ను సస్పెండ్‌చేశాం’ అని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ గురువారం చెప్పారు. ఈ అంశంలో ఈసీకి ఫిర్యాదుచేస్తామని, కోర్టుకెళ్తామని ఎస్పీ ప్రకటించింది. కాగా, ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిని మీరట్‌లో ప్రత్యేకాధికారిగా, బిహార్ ముఖ్య ఎన్నికల అధికారిని వారణాసిలో ప్రత్యేకాధికారిగా ఈసీ నియమించింది. సొంత వాహనంలోని ఓ పెట్టెలో బ్యాలెట్ పేపర్లు లభించడంతో సోన్‌భద్ర జిల్లా రిటర్నింగ్ అధికారి రమేశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. మున్సిపాలిటీ చెత్తకుప్పలో బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రి లభించడంతో బరేలీ జిల్లా అదనపు ఎలక్షన్ ఆఫీసర్ వీకే సింగ్‌ను సస్పెండ్ చేశారు. చదవండి: పంచ తంత్రం.. గెలుపు ఎవరిదో? -
యూపీలో బీజేపీ భారీ విజయం: తాజా ఎగ్జిట్‌పోల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయం సాధించడం ఖాయమని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు కొత్త పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని.. గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని వెల్లడించింది. Lokniti- CSDS Post Poll Survey UP AC 70 Locations 280 Sample size nearly 7000 (exact number awaited as some data yet to be added) Vote Share Estimate BJP+ 43% SP+ 35% BSP 15% Cong 3% Oth 4% Big win for BJP Margin of error 3%@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 43 శాతం ఓట్లను కైవసం చేసుకుంటాయని లోక్‌నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ 35 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. బీఎస్పీ 15 శాతం, కాంగ్రెస్ 3 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సంపాదిస్తారని తెలిపింది. తాము అంచనా వేసిన దానికి 3 శాతం అటుఇటుగా ఫలితాలు రావొచ్చని వెల్లడించింది. Lokniti- CSDS Post Poll Survey findings PUNJAB No of AC 45 Locations 180 all sampled randomly, Sample size 4668, voters sampled randomly from voters list Vote share Estimate AAP 40% Cong 26% SAD+20% BJP+ 7% Oth 7% Big victory for AAP Margin of error 4%@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతం, కాంగ్రెస్ పార్టీకి 29 శాతం, శిరోమణి అకాలీదళ్‌కు 20 శాతం, బీజేపీ, ఇతరులకు 7 శాతం చొప్పున ఓట్లు వస్తాయని లోక్‌నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ అంచనా కట్టింది. తుది ఫలితాలు, ఎగ్జిట్‌పోల్‌కు మధ్య 4 శాతం వ్యత్యాసం ఉండొచ్చని తెలిపింది. (క్లిక్: ఎస్పీకి మరీ అన్ని తక్కువ సీట్లా?.. సరికొత్త ఎగ్జిట్ పోల్స్) Finding from Lokniti-CSDS Post Poll survey UTTARAKHAND No of AC 26 Locations 104, Sample size 2738, All sampled randomly Estimated Vote Share BJP 43% Cong 38% AAP 3% BSP 4% Oth 12% Should give a comfortable majority to BJP Margin of error 3%.@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉండే అవకాశముందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానం దక్కనుందని లోక్‌నీతి-సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్‌లో తేలిందని రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనేది గురువారం(మార్చి 10న) తేలనుంది. (క్లిక్: వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం) Lokniti-CSDS Post Poll survey GOA AC 20 location 80 sample size 2066 sampled from voters list Vote share estimate BJP 32% Cong 29% AITC+ 14% AAP 7% RG 8% Oth 10% Hung Assembly possible Margin of error 6% due to smaller sample & multi corner contest@LoknitiCSDS @csdsdelhi — Sanjay Kumar (@sanjaycsds) March 9, 2022 -
సర్వేశ్వరుడికే తెలుసా ?
-
యూపీ ఎన్నికల ఫలితాలు; వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం
మీరట్: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు యోగేశ్ వర్మ మాత్రం బైనాక్యులర్‌తో చూస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఎదుట యోగేశ్ వర్మ, ఆయన మద్దతుదారులు గస్తీ కాస్తున్నారు. బైనాక్యులర్‌తో కనిపెట్టి మరీ చూస్తున్నారు. 8 గంటల చొప్పున షిప్టులవారీగా 24 గంటలూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సొంతంగా భద్రత ఏర్పాటు చేయడంపై యోగేశ్ వర్మను ప్రశ్నించగా.. ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల తీర్పును జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని మా పార్టీ అధ్యక్షుడు (అఖిలేష్ యాదవ్) ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ’ని యోగేశ్ వర్మ అన్నారు. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) తాజా ఎన్నికల్లో మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. కాగా, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద యోగేశ్ వర్మ ఓవరాక్షన్‌పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (క్లిక్: మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!) -
UP Exit Polls 2022: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్ఎల్డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితం కానుంది. బీజేపీకి భారీగా తగ్గనున్న సీట్లు గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ 90 సీట్లు కోల్పోయే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీని మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశముంది. అయితే గతంతో పోలిస్తే దాని బలం 300 శాతం వరకు పెరుగుతుందని అంచనా. యూపీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు హోరాహోరీ తలపడినట్టు కనబడుతున్నా.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే బీఎస్పీ కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. సీఎంగా మళ్లీ ఆయనే కావాలి.. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య్నాధ్పై ఎక్కువ మంది యూపీ ప్రజలు మొగ్గు చూపారు. 38 శాతం మంది యోగి అనుకూలంగా ఉండగా, అఖిలేశ్ యాదవ్ కావాలని 33 శాతం మంది కోరుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని సీఎంగా చూడాలని 16 శాతం మంది కోరుకోగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి అనుకూలంగా 6 శాతం మంది ఉన్నారు. (క్లిక్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు) ఎన్నికల ప్రధానాంశాలు ఇవే ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, లఖింపూర్ ఖేరీ ఘటన, కోవిడ్ వంటివి ఎన్నికల ప్రధానాంశాలుగా నిలిచాయి. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాల బకాయిల అంశం కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని సర్వే వెల్లడించింది. పశువుల నుంచి పంటలను కాపాడే విషయాన్ని కూడా ఓటర్లు సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. యోగి పాలనపై సంతృప్తి తాజా ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్‌ను గద్దె దించే మానసిక స్థితికి ఓటరుకు చేరుకోలేదని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందినవారు సానుకూలత వ్యక్తం కావడం, శాంతిభద్రత పరిరక్షణ, అవినీతి రహిత పాలన పట్ల యూపీ వాసులు సంతృప్తిగా ఉన్నట్టు కనబడుతోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారని మరో అంచనా. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న వాదనలు సీఎం యోగికి కంటగింపుగా మారాయి. ఎవరెవరికి ఎన్ని ఓట్లు బీజేపీ, మిత్రపక్షాలకు కలిపి 38 శాతం ఓట్లు.. సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 35 శాతం, బీఎస్పీకి 16 శాతం, కాంగ్రెస్ 7 శాతం, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. అంచనా వేసిన కంటే 5 శాతం అటుఇటు ఉండొచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం.. బీజేపీ 138 నుంచి 140, సమాజ్‌వాదీ పార్టీ 235 నుంచి 240, బీఎస్పీ 19 నుంచి 23, కాంగ్రెస్ 12 నుంచి 16, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వస్తాయి. -
ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ ఎన్నికల పోలింగ్
-
పెట్రోల్ ట్యాంక్‌లు నింపుకోండి.. ‘ఎన్నికల ఆఫర్ ముగుస్తోంది’
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో అన్ని దశల్లో పోలింగ్ ముగియనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ కూడా యూపీ చివర విడుత పోలింగ్‌తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చివరి దశ పోలింగ్‌కు రెండు రోజు ముందే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మరో రెండు రోజుల్లో యూపీ చివరి దశ పోలింగ్ ముగిస్తుందని ఈ క్రమంలో ముందస్తుగా పెట్రోల్ ట్యాంక్‌ను నింపుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. పోలింగ్ ముగిసిన అనంతరం మళ్లీ పెట్రోలు రేట్లు అమాంతం పెరుగుతాయని సెటైర్లు వేశారు. ‘త్వరగా పెట్రోల్ ఫుల్ట్యాంక్ చేసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఎన్నికల ఆఫర్’ అయిపోతుంది’ అని రాహుల్ గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిందని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లాక్ చేశాయని తెలిపారు. వచ్చే వారం ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని అన్నారు. फटाफट Petrol टैंक फुल करवा लीजिए। मोदी सरकार का ‘चुनावी’ offer ख़त्म होने जा रहा है। pic.twitter.com/Y8oiFvCJTU — Rahul Gandhi (@RahulGandhi) March 5, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఏడవ దశ(చివరి) పోలింగ్ సోమవారం ముగిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న విడుదల కానున్నాయి. దేశీయ ఇంధన ధరల పెరుగుదల అంతర్జాతీయ చమురు ధరల మీద ఆధాపడి ఉంటుంది. ఎందుకంటే సుమారు 85 శాతం చమురు అవసరాలను భారత్.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే గత 118 రోజులు నుంచి భారత్‌లో ఇందన ధరలు పెరగకుండా స్థిరంగా ఉండటం గమనార్హం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం వల్లనే చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. -
అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యారు.. బీజేపీకి బిగ్ షాక్
బలియా: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. మరొకొన్ని రోజుల్లో యూపీలో చివరి దశలో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అధికార పార్టీ(బీజేపీ)పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో కుటుంబపాలన సాగుతోందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. గురువారం ఆయన ఎన్డీ టీవీతో మాట్లాడుతూ.. సొంతపార్టీలో కుటుంబ పక్షపాతాన్ని వదిలేసి, బీజేపీ నేతలు తమను తప్పుబడుతున్నారన్నారు. ‘ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా కొడుకు అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? దగ్గరి బంధువు ఉండటం వల్లనే కదా సీఎం యోగి గతంలో గోరఖ్‌పూర్ మఠాధిపతిగా ఎదిగారు?’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరు అత్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఎవరి కొడుకు? ప్రస్తుతం కర్ణాటక సీఎం ఎవరు?’ అని వ్యాఖ్యానించారు. ఎస్పీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం అయిన ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్ అన్న విషయం తెలిసిందే. -
యూపీలో ఆరో విడత పోలింగ్
-
యోగి కోటలో హోరాహోరీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. దేశమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆరు, ఏడు దశల ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. ఇప్పటికే 292 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సజావుగా సాగింది. గురువారం మరో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7వ తేదీన ఏడో దశతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. దేశ రాజకీయాలకు దిక్సూచి గా భావించే ఉత్తర ప్రదేశ్‌లో పార్టీల జయాపజయాలను అంచనా వేసేందుకు జాతీయ, ప్రాంతీయ చానళ్లు సహా దాదాపు 87 మీడియా, రీసెర్చ్ సంస్థలు ఎగ్జిట్ పోల్, ప్రీ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ‘ఒకవైపు మాకు ఎన్నికల హడావుడి. ఇంకో వైపు సర్వే సంస్థల దరఖాస్తుల పరిశీలన. నా సర్వీసులో ఇంత పెద్ద సంఖ్యలో సర్వేలు చేయడం ముందెన్నడూ చూడలేదు’ అని సుల్తాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీశ్ గుప్తా అన్నారు. బెట్టింగు సంస్థలు సైతం సర్వే సంస్థల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాయి. దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాల్లో యూపీ ఎన్నికలపై వందల కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయంటున్నారు. నేడు యోగి కోటలో పోలింగ్ నేడు ఎన్నికలు జరగనున్న 57 నియోజకవర్గాలు అంబేడ్కర్ నగర్ (5), బలరాంపూర్ (4), సిద్ధార్థ్ నగర్ (5), బస్తీ (5), సంత్ కబీర్ నగర్ (3), మహరాజ్‌గంజ్ (5), గోరఖ్‌పూర్ (9), ఖుషీనగర్ (7), దియోరియా (7), బలియా (7) జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో అంబేడ్కర్ నగర్, బలియా మినహా మిగతా జిల్లాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బలమైన కోటలని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ‘గతంలో గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన తరువాత యోగి వైఖరిలో చాలా మార్పు కన్పించింది. గోరఖ్‌పూర్, దాని సమీప జిల్లాల్లో అభివృద్ధిపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ప్రధాని మోదీ సహకారం కూడా తోడవడంతో ఇప్పుడు ఈ ప్రాంతం యోగి బాబాకు మద్దతు పలుకుతోంది. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ప్రాంతంలో ఎస్పీ కూడా గణనీయంగా ఓట్లు పెంచుకుంటుందని మా అంచనాలో వెల్లడైంది’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.కె.శర్మ చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల మనోభావాలు తెలుసుకోవడం తనకు హాబీ అని సుల్తాన్‌పూర్‌లో సాక్షి ప్రతినిధులకు తారసపడిన సందర్భంగా శర్మ తన అనుభవాలను నెమరేసుకున్నారు. ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో నిన్నటిదాకా సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్, యోగి విస్తృతంగా పర్యటించారు. ‘మా సభలకు విస్తృతంగా జనాలు వస్తున్నారు. అనూహ్య స్పందన కూడా ఉంది. కచ్చితంగా మా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. రాష్ట్ర నలు దిక్కులా మా తడాఖా ఏమిటో చూపించబోతున్నాం’ అని ఎస్పీ సీనియర్ నేత డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అఖిలేశ్ సభలకే కాదు, మోదీ, యోగి సభలకు కూడా భారీగా జనం వస్తున్నారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ అనూహ్య విజయాలు నమోదు చేసుకోబోతున్నదన్నదే రాజకీయ పండితులంతా చెపుతున్న మాట. ‘ఏమాత్రం అనుమానం లేదు. ఎస్పీ బాగా పుంజుకుంది. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం పొరపాటు. మరోసారి ప్రజలు యోగికే పట్టం కట్టబోతున్నారు’ అని సుల్తాన్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆర్ ఈ వర్మ చెప్పారు. కుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అసెంబ్లీ స్థానాలవారీగా ఓటర్ల సామాజిక గణనను పరిగణనలోకి తీసుకున్నాయి. నిర్దిష్ట కులం/మతానికి చెందిన అభ్యర్థి తన సొంత నియోజకవర్గంలోనే కాకుండా, పొరుగు నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కూడా కుల, సామాజిక వర్గ ఓట్లు రాబట్టగలడని భావించి ఆ ప్రాతిపదికన అభ్యర్ధులను నిలబెట్టాయి. కుల ప్రాతిపదికన సరైన అభ్యర్థులను నామినేట్ చేయడానికి యూపీలో పార్టీలు ప్రతి నియోజకవర్గంలో కుల గణన ఆధారంగా ఓటర్ల పర్యవేక్షణకు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకున్నాయి. ప్రత్యేకించి బీజేపీ ఈ విషయంలో ముందుంది. ఎస్పీ కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉన్న కులాల ఆధారంగా టికెట్లు కేటాయించింది. ‘యూపీలో కులాల ప్రభావం ఎక్కువ. అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి ఏజంట్ల నియామకం ఆ ప్రాతిపదికనే జరిగింది. ఎన్నికల సంఘం ఓటర్ల కుల, మత నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఓటర్ల జాబితాను ప్రచురించదు గనుక పార్టీలు దీని కోసం ప్రత్యేక కసరత్తు చేశాయి’ అని ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. సుల్తాన్ పూర్ (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: -
ఉత్తర ప్రదేశ్‌లో ముగిసిన ఆరో దశ పోలింగ్
-
అయోధ్య.. అంత వీజీ కాదు
రామమందిరం–బాబ్రీ మసీదు సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అయోధ్యలో ఎవరికి పట్టాభిషేకం జరగనుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రామమందిర క్షేత్రమైన అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని స్థానిక పరిస్థితులు చెపుతున్నాయి. రామాలయ అంశంలో తప్ప చాలా విషయాల్లో బీజేపీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ గుప్తాను బీజేపీ మళ్లీ బరిలో నిలపగా, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని బరిలో దించింది. 2012లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ను ఓడించిన తేజ్‌నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేకు టికెటిచ్చి పోటీని ఆసక్తికరంగా మార్చేసింది. అయోధ్య అంశాన్ని బీజేపీ ఎప్పుడూ వదిలి పెట్టలేదనే సానుకూలత ఈసారి కూడా కాషాయదళానికి కలిసి రానుంది. బీజేపీ, ప్రధాని మోదీ తప్ప మరెవరూ రామమందిర సమస్యను తమ పక్షాన పరిష్కరించలేకపోయేవారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి గుప్తాపై మాత్రం ఇక్కడి వాళ్లలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో ఆయన మరోసారి మోది, సీఎం యోగి ఇమేజీనే నమ్ముకుని ప్రచారం చేశారు. ఫ్రీ రేషన్, గృహ నిర్మాణం లాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, మోదీ, యోగీ పాలనపైనే ఓట్లడిగారు. కానీ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధేమీ లేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది. బీఎస్పీ మ్రాతం అయోధ్యలో కులసమీకరణలపై గట్టిగా దృష్టి పెట్టింది. సమాజ్‌వాదీకి అండగా నిలిచే యాదవులు, ముస్లింలు కలిపి అయోధ్యలో 92 వేల మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈ ఎత్తుగడతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి ఉంటాయని, ఇది ఎస్పీకి ఎంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నారు. ఐదో దశలో భాగంగా గత ఆదివారం ఇక్కడ పోలింగ్ జరిగింది. ఎస్పీ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందన్నది ఈ నెల 10న కౌంటింగ్‌లో తేలనుంది. కాంగ్రెస్, ఆప్ పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రంగానే కన్పిస్తోంది. కూల్చివేతలపై గుర్రు అయోధ్య పట్టణానికి చుట్టుపక్కల వేల దుకాణాలను రోడ్ల వెడల్పు పేరుతో కూలగొట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్తున్నా తరతరాలుగా ఈ దుకాణాలను నడుపుకుంటున్న దుకాణదారులు మాత్రం అధికార బీజేపీపై కోపంగానే ఉన్నారు. 2017లో బీజేపీ అభ్యర్థి గుప్తా 50 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ 1991 నుంచీ బీజేపీనే గెలుస్తోంది. 2012లో మాత్రం ఎస్పీ నుంచి పాండే కేవలం 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. రామమందిరంతో పాటు బ్రాహ్మణ, యాదవ, ముస్లిం కులాల సమీకరణలు, జాతీయ స్థాయిలో మోదీ పాలన, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చిన యోగి హయాంలో నెలకొన్న సుస్థిరత తదితరాలు అయోధ్యలో ఈసారి కీలక పాత్ర పోషించాయి. ఐదు దశలపై అంతటా ఆసక్తి దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఐదు దశల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. 6, 7 దశల్లో మిగతా 111 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఏడో తేదీతో పోలింగ్ ప్రకియ ముగుస్తుంది. మూడింట రెండొంతులకు పైగా స్థానాల్లో పోలింగ్ ముగియడంతో వీటిలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కనున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ పూర్తయిన 292 స్థానాల్లో బీజేపీ, సమాజ్ వాది–ఆర్ఎల్డీ కూటమి దాదాపు సమానంగా పంచుకోవచ్చని సర్వే పండితులు చెపుతున్నారు. మెజారిటీ ఎవరికి దక్కేదీ ఆరు, ఏడు దశల్లోనే తేలవచ్చని జోస్యం చెప్తున్నారు. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన 292 సీట్లలో బీజేపీ కాస్త ముందున్నట్టు కన్పిస్తున్నా ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అనూహ్య విజయాలు సాధిస్తుందని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా లక్నో అసోసియేట్ ఎడిటర్ సంపత్ పాండే అంచనా వేశారు. మొత్తంమీద ఏడో దశ పోలింగే విజేతను నిర్ణయించినా ఆశ్చర్యం లేదని ఆయన విశ్లేషించారు. తొలి రెండు దశల పోలింగ్‌లో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి సానుకూలత బాగా వ్యక్తమైందని ఓ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తర్వాతి మూడు దశల్లో కూటమికి, బీజేపీకి పోటీ రసవత్తరంగా సాగిందని విశ్లేషించింది. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఆశించిన స్థాయిలో కాకున్నా గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలవనుందని యూపీ పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం అంచనా వేసింది. ‘‘తొలి మూడు దశల పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మేం ఒకటికి రెండుసార్లు పోస్టు పోల్ సర్వే చేయించాం. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి స్వల్పంగా స్థానాలు పెరుగుతున్నాయి. మా అంచనా మేరకు చివరి నాలుగు దశల పోలింగే మెజారిటీ ఎవరికన్నది తేల్చనుంది’’ అని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: అయోధ్య (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు -
బీజేపీని ఆపే సత్తా లేదు: ఒవైసీ
బలియా: బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపే సత్తా సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు లేదని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌తో జతకట్టారని, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నారని గుర్తు చేశారు. అయినా రెండు మార్లు బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. మైనార్టీలు తమ కూటమి (బీఎస్ఎం)కి మద్దతు ఇవ్వాలని, ఎస్పీ, బీఎస్పీ మధ్య ఫుట్బాల్లాగా మారవద్దని కోరారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించడం తమ కూటమి వల్ల మాత్రమే సాధ్యమన్నారు. -
చిల్లూపార్పైనే అందరి దృష్టి.. 37 ఏళ్లుగా వారిదే ఆధిపత్యం!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన చిల్లూపార్ విధానసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 37 ఏళ్లుగా బ్రాహ్మణ వర్గం చేతి నుంచి బయటికి వెళ్లని ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కమలదళం విజయం సాధించలేదు. దీంతో చిల్లూపార్లో కాషాయ జెండా ఎగరవేయాలని సీఎం యోగి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోరఖ్‌పూర్ జిల్లాలోని కీలకమైన ఈ నియోజకర్గంలో సీనియర్ నేత హరిశంకర్ తివారీ హవా కొనసాగుతుండడం, బ్రాహ్మణుల ఓట్లు చీలడంతో ఫలితం ఆసక్తికరంగా మారనుంది. ఆధిపత్యం కొనసాగేనా..? చిల్లూపార్ అసెంబ్లీ స్థానానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1985 నుంచి 2007 వరకు వరసగా 22 ఏళ్లు హరిశంకర్ తివారీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రాజేష్ త్రిపాఠి చేతిలో హరిశంకర్ ఓడిపోయారు. ఆ తర్వాత హరిశంకర్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వినయ్ శంకర్ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై బరిలో దిగారు. 2017లో తొలిసారిగా చిల్లూపార్ నుంచి బీఎస్పీ టికెట్‌పై వినయ్ శంకర్ తివారీ పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఎస్పీ తరఫున వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎమ్మెల్యే రాజేశ్ త్రిపాఠి బీజేపీ తరపున, బీఎస్పీ నుంచి రాజేంద్ర సింగ్ పెహల్వాన్, కాంగ్రెస్ అభ్యర్థినిగా సోనియా శుక్లా బరిలో దిగారు. చిల్లూపార్ అసెంబ్లీ స్థానంలోని 4.31 లక్షల మంది ఓటర్లలో బ్రాహ్మణులు 1.05 లక్షలు. దళిత, నిషాద్ ఓటర్లు కూడా నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. దీంతో బ్రాహ్మణ, దళిత, యాదవ ప్రాబల్యం ఉన్న ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా ఉంది. -
గాంధీల అడ్డాలో కాంగ్రెస్‌కు కష్టమే!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల మహా సంగ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, గాంధీ కుటుంబం దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాయ్‌బరేలీలో నాలుగో విడతలో భాగంగా ఫిబ్రవరి 23న పోలింగ్ పూర్తవగా వారణాసిలో ఆరు, ఏడు విడతల్లో మార్చి 3, 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండుచోట్లా భిన్న రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోదీ ప్రాతినిధ్యంలో గత ఎనిమిదేళ్లలో వారణాసి అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తే అంతకుముందు పదేళ్ల యూపీఏ హయాంలో రాయబరేలిలో సాధించిన అభివృద్ధి శూన్యమనే అభిప్రా యం స్థానికుల్లో బాగా ఉంది. అభివృద్ధి నినాదం తోనే వారణాసిలో మళ్లీ పట్టు నిలుపుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మరో రెండు విడతలు ఇక్కడ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్‌కు కష్టకాలం గత బుధవారం పోలింగ్ ముగిసిన రాయ్‌బరేలీలో ప్రస్తుతమున్న రెండు అసెంబ్లీ సీట్లను కూడా కాంగ్రెస్ కోల్పోవచ్చంటున్నారు. ‘‘గాంధీ కుటుంబంపై మాకిప్పటికీ ప్రేమాభిమానాలున్నాయి. కానీ ఆ కుటుంబం రాయ్‌బరేలీ ప్రజలకు చేసిందేమీ లేదు. 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉండి కూడా మాకు కనీస సదుపాయాలు కల్పించలేకపోయారు’ అని కిషన్ సింగ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడి ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఈసారి ఒక్కటైనా గెలిచే పరిస్థితి లేదని రాయబరేలీ బస్టాండ్ సమీపంలో 50 ఏళ్లుగా టీ దుకాణం నడుపుస్తున్న మొహియుద్దీన్ అన్నాడు. ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతమేనని అభిప్రాయపడ్డాడు. ‘ఇందిరాగాంధీ పోటీ చేసిన నాటి నుంచి మొన్నటి 2017 అసెంబ్లీ ఎన్నికల దాకా కాంగ్రెస్‌కే ఓటేస్తూ వచ్చా. ఈసారి మాత్రం విధిలేక వేరే పార్టీకి వేశా’’ అని చెప్పాడు. 70 ఏళ్లుగా పార్టీనే గెలిపిస్తూ వచ్చిన ఇక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఈసారి కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. యువ గాంధీలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం స్థానికంగా కనిపిస్తోంది. ‘కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఆ కుటుంబం మమ్మల్ని చూసింది. ఇక మేము మా పంథా మార్చుకోక తప్పలేదు’ అని కిరాణ వ్యాపారి రాంగోపాల్ గుప్తా చెప్పారు. పోటీ నామమాత్రమే రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని రాయ్‌బరేలీ సదర్, బచ్రావన్, హర్చంద్పూర్, సరేనీ, ఉంచహర్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామమాత్రంగానే పోటీలో ఉన్నారు. యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను పూర్తిగా నెత్తికెత్తుకున్న ప్రియాంక గాంధీ గత వారం పోలింగ్‌కు ముందు ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా పెద్దగా లాభించలేదని పోలింగ్ అనంతర పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇకపై తాను ఇక్కడి నుంచి పోటీ చేసేదీ లేనిదీ భవిష్యత్తు నిర్ణయిస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ప్రతికూలంగా మార్చాయి. రాయ్‌బరేలీ ప్రజలతో తమ అనుబంధం కొనసాగుతుందన్న భరోసా కల్పించలేకపోయారన్న భావన వ్యక్తమైంది. ఇక్కడ బీజేపీ నుంచి అమిత్‌షా, ఎస్పీ నుంచి అఖిలేశ్ యాదవ్ తదితరులు ప్రచారానికి రాగా రాహుల్‌గాంధీ మాత్రం కన్నెత్తి కూడా చూడలేదు. ‘ఇందిర హయాంలో రాయ్‌బరేలీ వాసులు ఢిల్లీ వెళ్లినా బాగా చూసుకునేవారు. సోనియా వచ్చాక పరిస్థితులు మారాయి. రాహుల్, ప్రియాంకల తరం వచ్చేసరికి మమ్మల్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు’ అని రఘునాథ్ మిశ్రా అనే స్థానిక వ్యాపారి అన్నాడు. రాయ్‌బరేలీ సదర్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదితీసింగ్పై స్థానిక కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాశీ.. మోదీ సహవాసి ఈశాన్య యూపీ పరిధిలోని వారణాసి లోక్‌సభ స్థానంలో 8 అసెంబ్లీ సీట్లున్నాయి. ఆరింట బీజేపీ, రెండింట్లో మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. వీటిల్లో మళ్లీ బీజేపీ గెలుపు ఖాయమంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2 నుంచి 5 దాకా ఇక్కడ ప్రచారం చేయనున్నారు. వారణాసి పరిధిలో ఆయన ప్రచారం ఈశాన్య యూపీలోని 111 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుందని అంచనా. రాయ్‌బరేలి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి -
యూపీలో అయిదో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
‘యుద్ధాన్ని ఆపేందుకు ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీ సాయాన్ని కోరారు’
Everyone Wants PM Modi's Help: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బుల్లియా ప్రచార ర్యాలీలో బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ హేమా మాలిని ఉక్రెయిన్ యుద్ధంలో ప్రతి ఒక్కరూ మోదీ జీ మీరు జోక్యం చేసుకోండి అని కోరారు అని చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఆయన్ని అభ్యర్థించారంటేనే నిజంగా ప్రపంచం ఆయనకు ఎంతగా గౌరవం ఇస్తుందో తెలుస్తోందన్నారు. పైగా ఇది మనకు చాలా గర్వకారణం అని ప్రశంసించారు. ఆయన తనకంటూ ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దేశాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. అంతేకాదు ఆ ప్రచారా ర్యాలీ మొత్తం డబుల్ ఇంజన్‌కి సర్కార్ నినాదం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి నాయకత్వాన్ని సైతం ప్రశంసించారు. గత కొన్ని నెలలుగా బీజేపీ చేసిన సోషల్ మీడియా ప్రచారాల్లో ప్రపంచ నాయకుడిగా పీఎం మోదీ ఔన్యత్యాన్ని గురించి చాటి చెప్పిందన్నారు. ఈ మేరకు మోదీ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి డయల్ చేసి, "తక్షణ హింసను నిలిపివేయాలని" విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి తమ పౌరులు సురక్షితంగా వచ్చేందుకే భారత్ అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుందని కూడా నొక్కి చెప్పారని అన్నారు. రష్యా, నాటో సమూహం మధ్య విభేదాలు నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయన్న తన దీర్ఘకాల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్‌లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్ సరిహద్దులకి పయనం) -
UP Election: ఫస్ట్ టైమ్ ఎన్నికల్లో తన తల్లి గురించి మాట్లాడిన మోదీ.. ఏమన్నారంటే..?
లక్నో: ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శల వార్ కొనసాగుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా, యూపీలో కాంగ్రెస్, ఎస్పీ పార్టీలపై పరోక్షంగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తాను, ఆయన తల్లి (హీరాబెన్ మోదీ) వ్యాక్సిన్ తీసుకున్నామన్నారు. ఆమెకు 100 ఏండ్లు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కోసం ఏనాడూ ఎగబడలేదని చెప్పారు. ఆమె వంతు వచ్చినప్పుడే వాక్సిన్ తీసుకున్నట్టు మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే తన తల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ఆమె బూస్టర్ డోసును కూడా తీసుకోలేదని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. వారిని పరోక్షంగా రాజవంశీకులతో పోల్చి.. వారైతే నిబంధనలు పాటించుకుండా వ్యాక్సిన్ తీసుకోవడం కోసం ముందు వరుసలో ఉండే వారని విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే వ్యాక్సిన్లను అమ్ముకునేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూపీలో ఫిబ్రవరి 27న ఐదో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. -
బీజేపీకి అగ్ని పరీక్ష.. ఆ రెండు దశల్లో ఎస్పీ కూటమికే స్వల్ప ఆధిక్యం
లక్నో (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు కంచర్ల యాదగిరి రెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాల్సిన పాజిటివ్ మూడ్‌ను యూపీ విజయం సెట్ చేస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, 2024 రోడ్‌మ్యాప్’ పేరిట బీజేపీ కేంద్ర కమిటీకి రెండు నెలల క్రితం ఆర్ఎస్ఎస్ సమర్పించిన విధాన పత్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఉత్తర భారతంలో తిరుగులేని శక్తిగా స్థిరపడ్డ బీజేపీ దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయడానికి కావాల్సిన ఊపును యూపీ ఫలితాలు అందిస్తాయని ఆ పత్రంలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో యూపీలో అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ సహా 24 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున అఖిలేశే చెమటోడుస్తున్నారు. నాలుగు విడతలపై జోరుగా అంచనాలు 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో నాలుగు మూడు విడతల్లో ఇప్పటిదాకా 231 చోట్ల పోలింగ్ పూర్తయింది. వీటిలో ఎవరిది పై చేయి అన్నదానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సమాజ్‌వాదీ–ఆర్ఎల్డీ కూటమికి, బీజేపీకి మధ్య హోరాహోరీ నడుస్తోందని పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. మూడు విడతలపై సర్వే సంస్థల అంచనాల సగటును పరిశీలించినా బీజేపీ, ఎస్పీ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డట్టు తేలుతోంది. పోలింగ్ జరిగిన 172 స్థానాలను అవి సగానికి కాస్త అటు ఇటుగా పంచుకునే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రమేనని అంటున్నారు. మొత్తమ్మీద మూడు దశల అనంతరం ఎస్పీ కూటమి స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తోందని, రాబోయే దశల్లో బీజేపీ సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు. బీఎస్పీ ఓటు బ్యాంకు కూడా బీజేపీ, ఎస్పీలకు చెరో సగం చొప్పున బదిలీ అవుతోందన్నది సర్వే సంస్థల అంచనా. అభ్యర్థి, కుల సమీకరణలను బట్టి ఇది కాస్త అటూ ఇటుగా ఉండొచ్చని అమర్ ఉజాలా దినపత్రిక లక్నో అసోసియేట్ ఎడిటర్ సుమంత్ పాండే అన్నారు. ‘‘బీజేపీ, ఎస్పీ–ఆర్ఎల్డీ మధ్య హోరాహోరీ సాగుతోంది. మా అంచనా ప్రకారం బీజేపీకి 2017లో వచ్చిన సీట్లతో పోలిస్తే 30 శాతం దాకా తగ్గే అవకాశముంది’’ అని పాండే వివరించారు. మూడో పార్టీ గానీ, ఇతరులు గానీ సాధించే 10, 15 సీట్లు మెజారిటీకి కీలకమైనా ఆశ్చర్యం లేదన్నారాయన! చదవండి: (ఎన్నికల వేళ విమాన ప్రయాణం పై ప్రత్యర్థుల మాటల యుద్ధం!) పశ్చిమ యూపీలో ఎస్పీ ఆధిక్యం అంతంతే! మొదటి రెండు దశల పోలింగ్‌పై ఎస్పీ కూటమి పెట్టుకున్న అంచనాలు ఫలించనట్టు కన్పిస్తోంది. ఆర్ఎల్డీ ప్రభావం కనిపించే పశ్చిమ యూపీలోని జాట్ సామాజిక వర్గం ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి వైపు మొగ్గుచూపుతుందని, ఈ రెండు దశల్లోనే 40 నుంచి 50 సీట్ల ఆధిక్యత వస్తుందని అంచనాలు వేసుకున్నారు. అది 20–25 స్థానాలకు దాటకుండా చూడటంలో బీజేపీ సఫలమైందని విశ్లేషకుల అభిప్రాయం. మూడో విడత పోలింగ్ హోరాహోరీగా సాగినా బీజేపీకే స్వల్ప ఆధిక్యం కన్పించిందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాలుగో దశలోనూ అదే ట్రెండ్ నడిచిందంటున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రెండు దశల్లో ఎస్పీ కూటమి సాధించే ఆధిక్యం అధికారానికి బాటలు పరిచేంతగా ఉండదని అంచనా. కాయ్ రాజా కాయ్! యూపీ ఎన్నికలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికారం ఎవరిదన్న అంశంపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, ముంబయి, నోయిడా, అహ్మదాబాద్ కేంద్రాలుగా రూ.3 వేల కోట్ల మేరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగులు సాగినట్లు యూపీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో అభిప్రాయపడ్డారు. ఈ రాకెట్‌ను ఛేదించేందుకు సహకరించాలంటూ మహారాష్ట్ర పోలీసుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు చెప్పారు. ప్రతి దశలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి 50 శాతంలోపు సీట్లు వస్తాయని బెట్టింగులు పెడితే రూపాయికి రెండు రూపాయలు, అంతకు మించి వస్తాయన్న వారికి రూపాయికి రూపాయిన్నర లెక్కన బెట్టింగులు సాగుతున్నాయి. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని కాస్తున్న వారికి రూపాయికి రూపాయి, ఎస్పీ గెలుస్తుందన్న వారికి రూపాయిన్నర బెట్టింగు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. -
Sakshi Cartoon: ముందు నాకు సీఎం ఉద్యోగం రానీయండి! వెంటనే మీకు ఉద్యోగాలు...
ముందు నాకు సీఎం ఉద్యోగం రానీయండి! వెంటనే మీకు ఉద్యోగాలు... -
మళ్లీ తళుక్కున మెరిసిన ‘పోలింగ్’ బ్యూటీ.. ఆమె ఫాలోయింగ్ మామూలుగా లేదు!
లక్నో: 2019 సార్వత్రిక ఎన్నికల్లో పసుపు రంగు చీరలో పోలింగ్ బూత్‌కు వచ్చి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన రీనా ద్వివేది గుర్తుందా? తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ ఆఫీసర్‌గా ఉన్న రీనా ఈ సారి టాప్‌లో విధులకు హాజరయ్యారు. ప్రస్తుతం రీనా ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడత జరుగుతున్న సందర్భంగా పోలింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ బూత్‌కు విధుల నిమిత్తం వచ్చారు. ఈ క్రమంలో కొందరు ఆమెతో సెల్ఫీలు కూడా దిగారు. తన తోటి ఉద్యోగులు ఆమె ఫోలోయింగ్ చూసి ఆశ్చర్యపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు రంగు చీర ధరించి విధులకు హాజరైన రీనా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరిని ఆకట్టుకున్నారు.ఆ సమయంలో ఆమె ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే సోషల్‌మీడియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం రీనా ద్వివేదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. లఖ్‌నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా రీనా పని చేస్తోంది. -
Live Blog: ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్
-
అనూహ్య సంఘటన.. బీజేపీ నేత పాదాలు మొక్కిన మోదీ.. ఎందుకంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నావో జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, ఉన్నావో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అవదేశ్ కతియార్ ప్రధాని మోదీకి శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. తర్వాత అవదేశ్ ప్రధాని పాదాలను తాకేందుకు కిందికి వంగారు. మోదీ వెంటనే ఆయనను వారించారు. మీరు కాదు, నేనే మీకు మొక్కాలి అంటూ అవదేశ్ పాదాలకు వినమ్రంగా నమస్కరించారు. దీంతో అక్కడున్నవారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగిన ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శనివారం ఆదేశాలు జారీచేసింది. మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్‌పై 72 గంటలపాటు నిషేధం విధించింది. ప్రజాప్రతినిధిగా ఉండి భాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరించడం ద్వారా చట్టాలను, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన రాజాసింగ్‌పై ఎందుకు చర్యలు చేపట్టకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. చదవండి: (రాజాసింగ్ వార్నింగ్: ఓటేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సిందే) అయితే గడువులోగా రాజాసింగ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రాజాసింగ్‌పై హైదరాబాద్ వెస్ట్ జోన్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు సీఐ రవికుమార్ తెలిపారు. -
Assembly Election 2022: ముగిసిన యూపీ మూడో దశ పోలింగ్
-
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ షాక్
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంతే కాదు 72 గంటల పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని రాజాసింగ్‌పై నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులుపై జవాబు చెప్పేందుకు సమయం కావాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి ఓటు వేయకుంటే జేసీబీలు, బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే రాజా సింగ్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. -
పశ్చిమ యూపీ... కాషాయానికి కీలకం!
ఉత్తరప్రదేశ్‌లో అప్పుడే తమ విజయావకాశాల మీద పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ అసలైన పరీక్ష అవి ఇంకా దాటాల్సే ఉంది. ఏడు దశలుగా జరుగుతున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరి 10, 14 తేదీల్లో రెండు దశలు ముగిశాయి. మూడో దశ పోలింగ్ 20న జరగనుంది. ఈ దశ బరిలో సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. 70 ఏళ్ల ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన ముఖ్యమంత్రులు లేరు. మరి ఆ రికార్డును యోగి ఆదిత్యనాథ్ బద్దలుకొడతారా? ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ఢిల్లీ ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యకం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలిప్పుడు దేశా ద్యంతం హాట్ టాపిక్! సాధారణ ఎన్నికల సెమీఫైనల్స్‌గా పరిగణిస్తారు వీటిని. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తు రాజకీయాల తీరు తెన్నులను నిర్దేశిస్తాయంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఏకంగా పది హేను కోట్ల ఓటర్లు, 1.70 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 403 మంది ఎమ్మె ల్యేలను ఎన్నుకునేందుకు ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు ముగిశాయి. మూడో దశ ఓటింగ్‌కూ సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యమైనవి అనడంలో సందేహం ఏమీ లేదు కానీ... యూపీలో గెలుపు ఢిల్లీ పీఠాన్ని సులువు చేస్తుందన్న మీడియా కథనాల్లో కొంత అతిశయోక్తి ఉందేమో! యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌కు ఇక్కడ చెప్పుకోదగ్గ స్థానాలేవీ లేని విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 2022 యూపీ ఎన్నికల నగారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మాటల యుద్ధంతోనే మొదలైందనవచ్చు. ఫిరాయింపులు, మతోన్మాదంతో కూడిన ప్రకట నలు, రాజకీయ ఆధిపత్యం కోసం పోటాపోటీ ఈ తాజా ఎన్నికల తీరు. కుల, కూటమి రాజకీయాలకు ప్రాధాన్యం దక్కే ఉత్తరప్రదేశ్‌లో ప్రతి పార్టీ తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, అధికా రాన్ని అందుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కాషాయ సునామీలో భారతీయ జనతా పార్టీ మొత్తం 403 స్థానాల్లో 312 గెలుచుకుంది. బీజేపీ కూటమి సభ్యులైన అప్నా దళ్ (సోనోలాల్) తొమ్మిది స్థానాలు, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నాలుగు స్థానాలు దక్కించు కున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 22 స్థానాలు, కూటమి భాగస్వామి కాంగ్రెస్ ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ 22 శాతం ఓట్లతో 19 సీట్లు దక్కించుకుంది. అలాగే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ మనవడు రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఒకే ఒక్క సీటుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా సాగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి చరిత్ర సృష్టిం చాయనడంలో సందేహం లేదు. ఓపీనియన్ పోల్స్ చెబుతున్నదేమిటి? ఉత్తరప్రదేశ్‌లో ఈసారి ఎన్నికలు భిన్న పరిస్థితుల్లో జరుగుతున్నా యని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం బరిలోకి దిగు తూండటం ఒక ప్రత్యేకత కాగా... కూటమి సమీకరణల్లోనూ మార్పులు వచ్చాయి. పోటీ బహుముఖంగానే కనిపిస్తోంది కానీ... తరచి చూస్తే ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీల కూటమి మధ్యే అన్నది అర్థమవుతుంది. నిర్బన్ ఇండియన్ సోషిత్ హమారా ఆమ్ దళ్ (నిషాద్), అప్నాదళ్ (సోనేలాల్)లతో బీజేపీ పొత్తు పెట్టుకోగా... ఆర్ఎల్డీ, ఎస్బీఎస్సీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)లతో కలిసి ఎస్పీ బరిలోకి దిగింది. బీఎస్పీ కూడా చిన్న, చితక పార్టీలతో కలిసి పోటీ చేస్తూండగా, కాంగ్రెస్ మాత్రం ఒంటరి పోటీకి సిద్ధమైంది. ఓటింగ్ మొదలు కాకముందు నిర్వహిం చిన అనేక ఓపీనియన్ పోల్స్ బీజేపీ 225–267 సీట్లతో విజయం సాధిస్తుందని అంచనా కట్టాయి. ఎస్పీ 111–160 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమవుతుందనీ, బీఎస్పీ, కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తాయనీ లెక్కకట్టాయి. అయితే చరిత్రను ఒకసారి పరి శీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు ఫలించిన సందర్భాలు తక్కువే. 2007, 2012లలో ఒపీనియన్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేయగా బీఎస్పీ, ఎస్పీలు స్పష్టమైన విజయం సాధించాయి. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయాన్ని ఒపీనియన్ పోల్స్ కరెక్టుగానే అంచనా వేశాయి. కానీ మోదీ వేవ్‌ను మాత్రం స్పష్టంగా చూడలేకపోయాయి. మూడు వందలకు పైగా సీట్లు సాధి స్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కుల, మత, కూటమి రాజకీయాలు... ఉత్తరప్రదేశ్‌లో ప్రతి రాజకీయ పార్టీ కూడా రాష్ట్రంలోని కుల, మత సమీకరణలు, భావసారూప్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసు కునే కూటమి మిత్రులను ఎంచుకుంటాయి. యూపీ ఓటర్లలో 41% మంది ఓబీసీలు, 21% మంది దళితులు ఉండగా... ముస్లింలు, అగ్ర వర్ణాల వారు 19% చొప్పున ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు బలో పేతం కాకమునుపు వరకూ ఉత్తరప్రదేశ్‌లో అగ్రవర్ణాలు, దళిత, ముస్లిం వర్గాల సాయంతో కాంగ్రెస్ పెత్తనమే చలాయించింది. బీఎస్సీ, ఎస్పీల రాకతో ఈ కుల సమీకరణకు గండి పడింది. సరికొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. దళితుల్లో అధికులు బీఎస్పీ వైపు వెళ్లిపోగా, జనాభాలో తొమ్మిది శాతమున్న యాదవులు ఎస్పీకి ప్రధాన ఓట్‌బ్యాంక్‌గా మారారు. ముస్లింలలో అధికశాతం మంది ఎన్నికల వాతావరణానికి అనుగుణంగా బీఎస్పీ, ఎస్పీలకు మద్ద తిచ్చారు. గెలుపునకు కావాల్సిన సరైన కుల సమీకరణలు చేపట్టిన ప్రాంతీయ పార్టీలకు 2014 సాధారణ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. అగ్రవర్ణాలు, ఓబీసీల్లోని కొన్ని వర్గాలు, ఎస్సీలను కలుపుకొని బీజేపీ అత్యధిక శాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి సంస్థా గతమైన బలం చేకూరడం, కులాల ఆధారంగా కూటములు ఏర్పాటు చేసుకోవడం, హిందుత్వ రాజకీయాలన్నీ కలిపి ఆ పార్టీకి 2017లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ సీట్లు దక్కించాయి. రెండేళ్ల తరువాత జరి గిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిపత్యం కొనసాగింది. ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ అగ్రవర్ణాలు, యాదవులు, జాటేతర దళితులను మినహాయించి ఓబీసీల్లోని కొన్ని ఉపకులాలను తనవైపు తిప్పుకుంది. హిందుత్వ వాదనతో ఈ ఎన్నికలను గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఎస్పీ కూడా యాదవుల పార్టీ అన్న ముద్రను తొలగించుకునేందుకు ఓబీసీల్లోని కొన్ని వర్గాలకు చెందిన పార్టీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. కాషాయ పార్టీ పాలనలో బ్రాహ్మణ వర్గం ఒంటరి అయ్యిందన్న వాదనను తన విజయావకాశాలను మెరుగుపరచు కునేందుకు ఉపయోగిస్తోంది. ఆర్ఎల్డీతో పొత్తుతో పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఆధిపత్యం చలాయించే జాట్ల ఓట్లు తమకు దక్కుతాయని ఎస్పీ భావిస్తోంది. 2013 మతఘర్షణల తరువాత జాట్లు బీజేపీ వైపు మొగ్గిన విషయం తెలిసిందే. అయితే రైతు ఆందోళనల నేపథ్యంలో బీజేపీ–జాట్ల బంధం బలహీనమైందన్న వాదనలు ఉన్నాయి. రాజ ధాని ఢిల్లీకి సమీపంలోని 113 యూపీ అసెంబ్లీ స్థానాల్లో జాట్లు, ముస్లింలు తమ విజయానికి దోహద పడతారని ఎస్పీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వం వహిస్తున్నారు. నలభై శాతం సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 70 ఏళ్ల రికార్డు బద్దలవుతుందా? ఈసారి ఉత్తరప్రదేశ్ ఓటర్లను ప్రభా వితం చేయగల అంశాల్లో పాలనకు సంబంధించినది ప్రధానమైంది కాగా... నేతృత్వం, ఎన్నికల మ్యాని ఫెస్టోలు తమ వంతు ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగైందనీ, నేరాలు తగ్గాయనీ, మహిళలకు భద్రత లభిస్తోందనీ బీజేపీ ప్రచారం చేస్తోంది. మౌలిక సదుపాయాల వృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తక్షణ అమలు, పెట్టుబడులు పెరగడం, కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పూర్తి కావడం తమకు విజయం తెచ్చి పెడతాయని బీజేపీ అంచనా. అయితే ఈ అంశాలతో ఏకీభవించని పార్టీలు దళితులు, మహిళలు, మైనారిటీలపై పెరుగుతున్న అత్యాచారాలను ఓటర్ల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. రెండో దశ కోవిడ్ నిర్వహణలో వైఫల్యం, నిరుద్యోగిత, ధరల పెరుగుదల, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత వంటివి ప్రతిపక్షాల ఆయుధాలుగా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు గెలి చిన ముఖ్యమంత్రులు ఇప్పటివరకూ ఎవరూ లేరు. బీజేపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ ఈ రికార్డును బద్దలు కొట్టగలరా? చెప్ప లేము. ఎందుకంటే తమిళనాడు, కేరళల్లోనూ దశాబ్దాల పోకడలకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీ అధి కారంలో ఉండటం ఆ పార్టీకి కొంతవరకూ కలిసి రావచ్చు. బీజేపీ యేతల పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకురావడంలో ఎస్పీ తది తర పార్టీలు విఫలం కావడమూ కాషాయ పార్టీకి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎస్పీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అనేందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది బీజేపీ కుల సమీకరణలు, హిందుత్వ అజెండాకు సెంట్రల్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో ఆదరణ తగ్గకపోవడం. పశ్చిమ యూపీలోనూ జాట్ల కోపాన్ని తగ్గించేందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను ఇంటింటి ప్రచారం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసింది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా మోదీ ప్రభావం కొంత ఉండవచ్చు. పశ్చిమ యూపీలో ఎస్సీ తదితర పార్టీలు ఆశిస్తున్నట్లుగా జాట్– ముస్లిం ఓట్ల ఏకీకరణ ఎంతవరకూ జరుగుతుందన్నది ఇంకో ప్రశ్న. జాట్ల ప్రతినిధిగా నిలవాలని అను కుంటున్న ఆర్ఎల్డీ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాల్సి ఉంది. మొత్తమ్మీద చూస్తే... ఈ సారి ఎన్నికల్లోనూ ఓటర్ల మద్దతు కాషాయ పార్టీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ గూండారాజ్‌ను అంతమొందించగలిగామన్న బీజేపీ వాదనకు ఓటర్లు జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీ ఎన్నికలు బీజేపీ పాలనకు ఒక రిఫరెండమ్ అనుకుంటే రెండు రకాల ఫలితాలు వచ్చే సంభావ్యత ఉంది. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి పశ్చిమ యూపీలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే నిజమైతే, బీజేపీ కూటమికి దక్కే సీట్ల సంఖ్య 250 కంటే దిగువకు చేరుతుంది. బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రగతి‘ని ఓటర్లు చూడగలిగి, ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమి ఓటర్లను తమవైపు మళ్లించుకోవడంలో విఫలమైతే బీజేపీకి 250 కంటే ఎక్కువ సీట్లు కచ్చితంగా దక్కే అవకాశం ఉంది. అయితే యూపీ రాజకీయాలను కచ్చితంగా అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినా రావచ్చు! వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
సొంతపిచ్‌పై...అఖిలేశ్‌కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్‌లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్‌వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్‌పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్‌తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్‌తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్‌పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్‌వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్‌లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్‌ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్‌ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్‌కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్ బఘేల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్‌నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్‌తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
సీఎం కావాలా.. రెండవ కిమ్ కావాలా?
లఖింపూర్: ముఖ్యమంత్రి కావాలో, రెండవ కిమ్ జాంగ్ ఉన్ కావాలో తేల్చుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ సూచించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ వ్యతిరేకంగా ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేస్తున్నారు. ‘యూపీ ప్రజలు తమ ఓట్లను తెలివిగా వినియోగించుకోవాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి ప్రజాప్రతినిధులు కావాలో.. రెండవ కిమ్ జాంగ్ ఉన్(ఉత్తర కొరియా అధినేత) కావాలో తేల్చుకోవాలని కోరుతున్నాం. ఏ రాష్ట్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వం మనకు వద్ద’ని టికాయిత్ అన్నారు. తన స్వస్థలమైన ముజఫర్‌నగర్‌లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని గత వారం ఆయన మండిపడ్డారు. అయితే విద్వేష రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ‘అభివృద్ధి గురించి మాట్లాడాలని పశ్చిమ యూపీ ప్రజలు కోరుకుంటున్నారు. హిందూ, ముస్లిం, జిన్నా, మతం పేరుతో రెచ్చగొట్టేవారికి ఓట్లు పడవు. ముజఫర్‌నగర్ హిందూ-ముస్లిం మ్యాచ్‌లకు స్టేడియం కాద’ని టికాయిత్ ట్వీట్ చేశారు. రైతులకు మేలు చేసే వారికే యూపీ ప్రజలు పట్టం కడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, జిన్నా గురించి మాత్రమే కాకుండా తమ సమస్యల గురించి మాట్లాడేవారికి ప్రజలు అనుకూలంగా ఉంటారని ‘పీటీఐ’తో అన్నారు. మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ వివాదాస్పద చట్టాలను వెనక్కు తీసుకునేలా ఉద్యమించడంలో టికాయిత్ ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే. (క్లిక్: పంజాబ్ లో చేదు అనుభవం.. మరోసారి గుర్తు చేసుకున్న మోదీ) -
రాజాసింగ్ వార్నింగ్: ఓటేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఉండాలంటే యోగికి జై కొట్టాల్సిందేనని హెచ్చరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓటేయనివారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందేని యూపీ ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ‘యూపీలో రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తరువాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం. యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందే లేకపోతే యూపీ వదిలి వెళ్లాల్సిందే’ అంటూ యూపీ ప్రజల్ని హెచ్చరించారు. చదవండి: (అభివృద్ధి మంత్రాన్ని వదిలి.. మళ్లీ ‘హిందుత్వ’ జపమెందుకో!) -
యూపీ రెండో దశ ఎన్నికల పోలింగ్
-
ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్
-
పంజాబ్‌లో ఆప్... ఉత్తరాఖండ్‌లో బీజేపీ?
ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పంజాబ్(ఫిబ్రవరి 20), ఉత్తరాఖండ్(నేడు)లలో ఒకే విడతలో జరగనున్న ఓటింగ్‌లో పార్టీల అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం సాగిన రైతుల ఉద్యమం ఎటూ కీలకపాత్ర పోషించనుంది. పంజాబ్‌లో ఈసారి కాంగ్రెస్, బీజేపీలను ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కినెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ సొంతంగా మెజారిటీ వస్తుందని చెప్పలేం. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచే అవకాశం కనబడుతున్నా, ఆమ్ ఆద్మీ ఇక్కడా కింగ్ మేకర్ పాత్ర పోషించే వీలుంది. ఢిల్లీకి ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యేకం. భారతదేశ రాజకీయాల్లో పంజాబ్, ఉత్తరా ఖండ్ కొంత ప్రత్యేకం. సామాజిక వర్గాల ఆధిపత్యం పార్టీల తీరుతెన్నులపైనా ప్రభావం చూపే ప్రాంతాల్లో ఈ రెండు రాష్ట్రాలు ఉంటాయి. చరిత్రను తరచిచూస్తే పంజాబ్ జనాభాలో 58 శాతం ఉన్న సిక్కులు రాజకీయంగానూ బలవంతు లన్న విషయం స్పష్టం. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే... అరవై శాత మున్న అగ్రవర్ణాలదే ఆధిపత్యం. ఈ రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఈ వర్గాల వారే. ఉత్తరాఖండ్‌లో నేడు, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న జరిగే ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగే అవకాశాలు మెండు. భారత రాజకీయాల్లో కుల, మతాధిపత్యాల ఆధారంగా వివక్ష చాలాకాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సమీప భవి ష్యత్తులో అంతమవుతుందని కూడా అశించలేము. పంజాబ్, ఉత్తరా ఖండ్ రెండింటిలోనూ పార్టీలు అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలతో కొట్టుమిట్టాడాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రు లనూ మార్చాల్సి వచ్చింది. కాంగ్రెస్ పంజాబ్‌లో ఒకసారి ముఖ్య మంత్రిని మారిస్తే, ఉత్తరాఖండ్‌లో బీజేపీ రెండుసార్లు ఈ పని చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమం (పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు ఎక్కువగా పాల్గొ న్నారు) కారణంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు జరిగింది. ఇప్పుడు ఈ అంశం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల అంశంగానూ మారింది. ఈ ఉద్యమం సందర్భంగా రాజధానిలో జరిగిన ఘటనలు కొన్ని పంజాబ్‌లో దళితులందరూ (32 శాతం జనాభా) ఒకవైపునకు కేంద్రీకృతమయ్యేందుకు దోహదపడింది. ముఖాముఖి నుంచి బహుముఖానికి... పంజాబ్‌లో చాలావరకూ ముఖాముఖి పోటీలే జరిగేవి. శిరో మణి అకాలీదళ్–బీజేపీల కూటమి ఒకవైపు, కాంగ్రెస్ ఇంకోవైపు నిలబడగా సాగిన పోటీలకు 2017లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో తెరపడినట్లు అయ్యింది. పోటీ త్రిముఖమైంది. రావి, బియాస్ నదుల మధ్యలో ఉండే మాఝా ప్రాంతంలో గురు ద్వారాలు, డేరాలు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూంటాయి. దోబా విషయానికి వస్తే ఇది ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండే ప్రాంతం. బియాస్, సట్లెజ్ నదుల మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంత జనాభాలో దళితులు (37 శాతం), చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ. సట్లెజ్కు ఆవల ఉండే మాల్వా ప్రాంతం జమీందార్లు, పెద్ద రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. 2017లో కాంగ్రెస్ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 77 గెలుచుకుని విజయం సాధించగా... వచ్చిన ఓట్లు దాదాపు 39 శాతం. మాల్వా ప్రాంతంలోని 69 స్థానాల్లో కాంగ్రెస్ 40 చేజిక్కించుకుంది. అలాగే మాజాలోని 25 స్థానాల్లో 22, దోబా ప్రాంతంలోని 23 స్థానాల్లో 15 గెలుచుకుని అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో 20 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసక్తి కరంగా ఈ పార్టీ మాల్వా ప్రాంతంలో 18, దోబాలో 2 స్థానాలు గెలు చుకోవడమే కాకుండా... మొత్తమ్మీద 23 శాతం ఓట్లు సాధించ గలిగింది. అప్పట్లో అధికార పక్షం శిరోమణి–బీజేపీ కూటమికి 31 శాతం ఓట్లు దక్కినా... సాధించిన సీట్లు మాత్రం 18 మాత్రమే. ఇప్పుడు పోటీ త్రిముఖ స్థాయి నుంచి బహుముఖానికి మార డంతో రాష్ట్రంలో ఓ పెద్ద రాజకీయ మార్పునకు రంగం సిద్ధమవు తోంది. ఈ ఎన్నికల్లో చర్చకు వస్తున్న అంశాలు కొత్త సీసాలో పాత సారా చందంగానే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, ఇసుక, మద్యం, కేబుల్ మాఫియా సమస్య, నిరుద్యోగం, రైతు సంక్షోభం, అవినీతి, పెరిగిపోతున్న ప్రభుత్వ రుణాల వంటివి ప్రధానాంశాలుగా మారాయి. ఇటీవలి కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న మరో అంశం గురుద్వారాలో మతగ్రం«థాలకు జరిగిన అవమానం. నాయ కత్వ స్థాయిలో కుమ్ములాటల వంటి సమస్యలతో కాంగ్రెస్ పార్టీ నిన్నమొన్నటివరకూ చెల్లాచెదురుగా ఉన్నా... పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రకటనతో ఈ కుమ్ములాటకు కొంతవరకూ తెరపడింది. కానీ పాలనపరమైన వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, చన్నీ, సిద్దూలతో కులాలు, మతాల ఆధారంగా రాజకీయ సమీకరణలు చేయడం వంటి అంశాలు ఆ పార్టీ అవకాశాలకు గండికొట్టే ప్రమాదముంది. రాష్ట్రంలో దళితులు 32 శాతం వరకూ ఉండగా... జాట్లు 20 శాతం వరకూ ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. దళితుడిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా రాజకీయంగా ఒక మెట్టు పైనున్నా ఇది జాట్ల వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం కాంగ్రెస్ వెన్నంటే ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తమ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ ద్వారా కాంగ్రెస్‌ను నేరుగా ఢీకొంటోంది. మాన్, కేజ్రీవాల్‌లు ప్రకటించిన పది అంశాల అభివృద్ధి ప్రణాళిక మాల్వా ప్రాంతంలో తన బలాన్ని పెంచుకునేందుకు, ఇతర ప్రాంతాల్లో లాభాలు తెచ్చి పెట్టేందుకు ఉపయోగపడుతుందని అంచనా. బీజేపీ మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)తో కలసి ఈసారి బరిలోకి దిగు తోంది. శిరోమణి నుంచి వేరుపడ్డ వర్గపు పార్టీ శిరోమణి (సంయుక్త) కూడా కాషాయ పార్టీ కూటమిలో భాగంగా ఉంది. బీజేపీ ఈ సారి 65 స్థానాల్లో పోటీ చేస్తూండగా పీఎల్సీ 38 స్థానాల్లో, శిరోమణి (సంయుక్త) 14 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. హిందూ, సిక్కు ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఈ కూటమి ప్రయత్ని స్తోంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, బోర్డర్ సెక్యూరిటీ అంశాల ఆధారంగా మాజా ప్రాంతంలో పట్టు సాధించే దిశగా అడుగు లేస్తోంది. సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి ఎన్డీయే నుంచి వేరుపడ్డ తరువాత ఈసారి ఎన్నికల కోసం బీఎస్పీతో జట్టు కట్టింది. రైతు ఉద్యమంలో భాగమైన 22 యూనియన్లతో ఏర్పాటైన సంయుక్త సమాజ్ మోర్చా బి.ఎస్.రాజేవాలా నేతృత్వంలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం పంజాబ్‌లో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకా శాలు ఉన్నాయి. అయితే ఈ పార్టీకి సొంతంగా మెజార్టీ వచ్చే అవకా శాలు తక్కువ. కాకపోతే బహుముఖ పోటీ నేపథ్యంలో ఓట్లు ఎలా చీలతాయో చెప్పడం కొంత కష్టమే. 1972 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎల్లప్పుడూ ఒక పార్టీ లేదా కూటమి వైపే మొగ్గారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. దేవభూమిలో రసవత్తర రాజకీయం... ఉత్తరప్రదేశ్ నుంచి వేరు చేయగా ఏర్పడ్డ పర్వతప్రాంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఈసారి రాజకీయం రసవత్తరంగా ఉండనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నేడు ఓటింగ్ జరగనున్న ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2017లో మోదీ హవా కారణంగా బీజేపీ 47 శాతం ఓట్లతో మొత్తం 57 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 11 స్థానాలకు పరిమితమైంది. అయితే రాష్ట్ర నాయకత్వం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఆ పార్టీ విశ్వసనీయతను కొంతవరకూ దెబ్బతీశాయి. ఐదు నెలల కాలంలోనే మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చడం, కుంభమేళా సందర్భంగా కోవిడ్ నిర్వ హణలో వైఫల్యాలు కాషాయ పార్టీని వెంటాడుతున్నాయి. నిరు ద్యోగం, ద్రవ్యోల్బణం, పర్వతప్రాంతాల నుంచి ప్రజల వలసలు కూడా బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే యువ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ యువ ఓటర్లను ఆకర్శించగలడనీ, మోదీ–యోగీ వంటి అంశాలు ఓటర్లను ఆకర్షించవచ్చుననీ బీజేపీ ఆశలు పెట్టుకుని ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన కాంగ్రెస్ పార్టీ హరీశ్ రావత్ నేతృత్వంలో కొంతవరకూ కోలుకుందనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకత, ఉత్తరాఖండ్ ఎన్నికల చరిత్ర తమకు అవకాశం కల్పిస్తాయన్న ఆశతో కాంగ్రెస్ ఉంది. ఒక పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టే చరిత్ర ఇక్కడ లేకపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ ఈ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందా అన్నది ఒక ప్రశ్న. పార్టీలో వర్గాలు, అంతర్గత కుమ్ములాటలు ఇందుకు కారణం. ఓట్‌షేర్ విషయంలో బీజేపీతో ఉన్న 13 శాతం అంతరాన్ని అధిగమిం చడం కాంగ్రెస్‌కు ఈసారి కొంత కష్టమే కావచ్చు. గాంధీ కుటుంబ సభ్యుల ప్రచారం, రైతు ఉద్యమం కారణంగా రైతుల్లో నెలకొన్న అసం తృప్తి వంటి అంశాలు రాష్ట్రంలోని టెరాయి ప్రాంతంలోని తొమ్మిది స్థానాల్లో తమకు ఓట్లు, సీట్లు తెచ్చిపెడతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక్కడ రైతులు, సిక్కులు అధిక సంఖ్యలో ఉంటారు. రెండు జాతీయ పార్టీల హోరాహోరీ పోరు మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ తరహాలోనే 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, యువతకు నెలకు ఐదు వేల రూపాయల నిరుద్యోగ భృతి, పద్ధెనిమిదేళ్ళు పైబడ్డ మహిళలకు నెలకు రూ.1000 పంపిణీ వంటి హామీలు ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వస్తాయా అన్నది వేచి చూడాల్సిన అంశం. సీఎం అభ్యర్థిగా ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన అజయ్ కొతియాల్ను ఎంపిక చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ప్రత్యామ్నాయంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నిర్వహించిన సర్వేల ప్రకారం... ఈసారి ఉత్తరాఖండ్‌లో పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాత్రమే. కాకపోతే ప్రధాన పార్టీలు రెండూ తగినంత మెజార్టీ సాధిం చలేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
ప్రచార సమయం పెంపు.. పాదయాత్రలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 సంబంధిత ఆంక్షలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం మరింతగా సడలించింది. పరిమిత సంఖ్యలో జనంతో పాదయాత్రలు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే ప్రచార సమయాన్ని రోజుకు నాలుగు గంటలు పెంచింది. ఇప్పటిదాకా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ఈ ప్రచార వేళలను ఈసీ ఉదయం 6 నుంచి రాత్రి పది గంటలకు వరకు పొడిగించింది. ఫలితంగా అభ్యర్థులు, పార్టీలకు రోజుకు నాలుగు గంటలపాటు అదనంగా ప్రచార సమయం లభించనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు జనవరి 8న షెడ్యూల్‌ను ప్రకటిస్తూ కోవిడ్–19 కారణంగా ఈసీ పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ర్యాలీలు, రోడ్‌షోలు, పాదయాత్రలపై నిషేధం విధించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ఈసీ క్రమేపీ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. యాభై శాతం సామర్థ్యానికి పరిమితమై బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని ఈసీ శనివారం తెలిపింది. మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆంక్షలనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, బహిరంగ వేదికల్లో సమావేశస్థలి సామర్థ్యంలో ఎంత శాతం మందిని అనుమతించాలనే విషయంలో ఈసీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు పెట్టిన పరిమితుల్లో ఏది తక్కువగా ఉంటే.. అదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
ఇక్కడ గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమట..!
కస్గంజ్: ఉత్తరప్రదేశ్‌లో ఆలయాల నగరంగా పేరు పొందిన కస్గంజ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో నెగ్గితే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ నమ్మకాన్ని బలపస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ఏ పార్టీకి కూడా కంచుకోటగా లేదు. అక్కడ ప్రజల నాడిని పట్టుకోవడం కాస్త కష్టమే. 2007లో కస్గంజ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి హస్రత్ ఉల్లా షేర్వాణి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి చెందిన మన్‌పాల్ సింగ్ కస్గంజ్లో విజయం సాధించారు. ఇక 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఏకం గా 49 వేల ఓట్ల మెజారిటీతో విజయం సా ధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ నుంచి ప్రముఖ రైతు నాయకుడు కుల్దీప్ పాండే ఎన్నికల బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్‌పాల్ సింగ్ పోటీ పడుతూ ఉంటే, బీఎస్పీ ప్రభుదయాళ్ వర్మకు టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి 20న మూడోదశలో పోలింగ్ జరగనుంది. -
వాళ్లకు బెయిలు.. మాకు జైలు
ఓటమి భయంతో సాకులు.. ఉత్తరప్రదేశ్‌లో కాషాయ జెండా ఎగురుతుందని గురువారం నాటి తొలి దశ పోలింగ్ తర్వాత అందరికీ అర్థమైంది. అందుకే కుటుంబ పార్టీలకు వెన్నులో వణుకు మొదలైంది. తమ పని అయిపోయిందన్న భయంతోనే ఎన్నికల కమిషన్‌ను, ఓటింగ్ మిషన్లను తప్పు పడుతున్నారు. – ప్రధాని నరేంద్ర మోదీ (కస్గంజ్, ఉత్తరప్రదేశ్) మోదీకి చరిత్ర తెలియదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చరిత్రపై అవగాహన లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలీదు. అందుకే పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తికి 15 ఏళ్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్‌ను ఆడిపోసుకున్నారు.స్వాతంత్య్ర సమరయోధులు, విద్యావేత్తల కంటే ప్రధానికి ఎక్కువ తెలుసా? పర్యావరణం, నిరుద్యోగం వంటి అంశాల నుంచి గోవా ప్రజల దృష్టి మళ్లించడానికే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. – కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (మార్గోవా, గోవా ) మేం గన్నా అంటే.. వారు జిన్నా అంటారు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ తమ కుటుంబాల కోసమే జీవిస్తున్నాయి. మేము జాతీయవాదం మాట్లాడితే వాళ్లు కులాల ప్రస్తావన తెస్తారు. మేము అభివృద్ధి అంటే మతం ఊసెత్తుతారు. నేను గన్నా (చెరుకు)పై మాట్లాడితే జిన్నా గురించి మాట్లాడతారు. – యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(షాజహన్‌పూర్, ఉత్తరప్రదేశ్) వాళ్లకు బెయిలు.. మాకు జైలు ఈ రాష్ట్రంలో రైతుల మీదకి కారు పోనిచ్చి నిండు ప్రాణాలు తీసిన వారికి బెయిల్ వస్తుంది. కానీ మా పార్టీలో చిన్న చిన్న నేరాలు చేసిన వారు కూడా జైల్లోనే ఉంటారు. మా పార్టీ ఎంపీ ఆజమ్ ఖాన్‌ను గేదెలు, మేకలు, పుస్తకాల చోరి ఆరోపణలపై జైల్లో పెట్టి ఇంకా బెయిలివ్వలేదు. – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (రామ్‌పూర్, ఉత్తరప్రదేశ్) -
సాక్షి కార్టూన్ 12-02-2022
-
కుటుంబ పార్టీలకు ఓటేయొద్దు
ఖాస్గంజ్ : సమాజ్‌వాదీ వంటి కుటుంబ పార్టీలకు ఓటేయొద్దని యూపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. వారొస్తే రాష్ట్ర పేదల కోసం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆపేస్తారన్నారు. యూపీలోని ఖాస్గంజ్లో శుక్రవారం ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఓటర్లను కుటం పేరిట విడదీసేందుకు సమాజ్‌వాదీ వంటి పార్టీలు ఎంతగా ప్రయత్నించినా వాటి పాచికలు పారలేదన్నారు. ఈసారీ అలాంటి ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూపీ తొలి దశ ఓటింగ్‌లో బీజేపీ హవాయే సాగిందని ధీమా వెలిబుచ్చారు. ‘‘మహిళలు భారీగా వచ్చి మాకు ఓటేశారు. ఓటమి తప్పదని విపక్షాలకు అర్థమైంది. అందుకే ఇప్పటినుంచే ఈవీఎంలపై, ఈసీపై విమర్శలు మొదలు పెట్టాయి. చివరికి పేదలకు కరోనా వ్యాక్సిన్లు వేయడం లేదంటూ దుష్ప్రచారానికి దిగాయి’’ అని ఎద్దేవా చేశారు. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు. రేషన్ మాఫియాను రూపుమాపారని, కేంద్రం పంపుతున్న ప్రతి గింజా హక్కుదారులకే అందేలా చూస్తున్నారని అన్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే సాహసం చేయలేరన్నారు. అంబేడ్కర్వాదులంతా సమాజ్‌వాదీలో చేరాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పిలుపివ్వడం హాస్యాస్పదమన్నారు. విభజించడమే కాంగ్రెస్ పని కులం, ప్రాంతం, మతం ఆధారంగా ప్రజలను విడదీయడం, దోచుకోవడమే కాంగ్రెస్ పనంటూ మోదీ దుయ్యబట్టారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ బీజేపీకే ఓటేస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క కుమాయున్ ప్రాంతంలోనే ఏకంగా రూ.17 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు తాను శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. తాజా బడ్జెట్లో ప్రకటించిన పర్వతమాల, వైబ్రంట్ విలేజీ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్‌లో మౌలిక సదుపాయాలు మరింత విస్తరించి, టూరిజం పెరిగి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. -
మేజిస్ట్రేట్ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఈవీఎం!
లక్నో : యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం మొదటి దశలో 58 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. అయితే, ఓటింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం నంబర్ ప్లేట్ లేని ఓ కారులో ఈవీఎం యంత్రం కనిపించడం వివాదాస్పదంగా మారింది. యూపీలోని కైరానా వద్ద షామ్లీ-పానిపట్ హైవేపై నంబర్ ప్లేట్ లేని కారులో ఈవీఎం యంత్రాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేతలు గుర్తించారు. సదరు కారు కైరానా జోనల్ మేజిస్ట్రేట్ స్టిక్కర్‌తో ఉండటంతో ఎస్పీ నేతలు ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ కారులోని ఈవీఎంను తెరిచి పరిశీలించారు. ఈ క్రమంలో ఎన్నికల భద్రతా నియమావళిని ఉల్లంఘించారని మేజిస్ట్రేట్ అంగీకరించారు. దీంతో ఎస్పీ నేతలు ఈ పోలింగ్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై షామిలీ జిల్లా మేజిస్ట్రేట్ జస్మీత్ కౌర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. జోనల్ మేజిస్ట్రేట్ కారులో ఈవీఎం యంత్రం ఉండటం నిజమేనన్నారు. అయితే కారు డ్రైవర్ భోజనం చేయడానికి వెళ్లిన సమయంలోనే ఈవీఎంను కారులో పెడుతున్న విషయాన్ని తాము గమనించామని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. UP के कैराना में सपा-रालोद प्रत्याशी नाहिद हसन की बहन इकरा ने आधी रात को बिना नम्बर की गाड़ी में जा रहीं कुछ EVM पकड़ीं, प्रशासन ने कहा- ये रिजर्व EVM थीं. पहले चरण में कैराना में सबसे ज्यादा 75% वोट पड़े हैं. Video: @sachingupta787pic.twitter.com/ElEFUFsOJ9 — Swati Mishra (@swati_mishr) February 11, 2022 -
యూపీలో సంచలనం.. ఆయన ఫామ్ హౌస్ వద్ద యువతి మృతదేహం..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో గురువారం నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. యూపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఓ సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బును అధికారులు సీజ్ చేసిన ఘటన మరువక ముందే మరో వార్త దుమారం రేపుతోంది. యూపీ మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం దగ్గరలో గురువారం కుళ్లిపోయిన స్థితిలో మెడ కోసి ఉన్న ఓ యువతి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఉన్నావ్ ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నావ్‌లో యువతి(22) కనిపించడంలేదంటూ డిసెంబర్ 8వ తేదీన ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో డిసెంబర్ 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా ఓ వ్యక్తి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన దివంగత మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌ను జనవరి 24న అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు అయితే తాజాగా యువతి మృతదేహాన్ని రాజోల్ సింగ్ ఆశ్రమం సమీపంలో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం యువతి మెడ భాగంగా కట్ చేసి ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బాధితురాలి తల్లి విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమార్తెను రాజోల్ సింగ్ అతని ఆశ్రమంలో చంపి పాతిపెట్టాడని ఆరోపించారు. వారిపై అనుమానంతోనే తాను ఆశ్రమానికి వెళ్లి అక్కడ కొంత స్థలం తనిఖీ చేసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో తనకు పోలీసులు సహకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే తన కుమార్తె బతికుండేదని కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు -
భర్త ఉండగా ఇల్లు దాటలేదు.. ఇప్పుడేమో ఏకంగా సీఎంతో ఢీ.. ఎవరీ సుభావతి?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్ ప్రాంతం.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి కంచుకోట. గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి తొలిసారిగా ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతూ ఉంటే, సమాజ్‌వాదీ పార్టీ ఆయనపై ఒక మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఒకప్పుడు బీజేపీ సహా వివిధ పార్టీలు మారిన దివంగత నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లాను వ్యూహాత్మకంగా సీఎంపైనే పోటీకి నిలిపింది. ఉపేంద్ర 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. గోరఖ్‌పూర్‌లో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. బీజేపీలో ఉన్నప్పుడు ఆయనకి యోగి ఆదిత్యనాథ్‌కి తరచూ తగాదాలు జరిగేవి. పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నా ఎన్నికలు ఆయనకి కలిసి రాలేదు. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఉపేంద్ర గుండెపోటుతో 2020లో మరణించారు. ఆయన భార్య సుభావతి తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్‌పూర్‌లోనే మరో నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తే బీజేపీ నిరాకరించింది. దీంతో సుభావతి కుమారుడితో కలిసి ఎస్పీలో చేరారు. (చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు) ఉపేంద్ర జీవించి ఉండగా సుభావతి ఎప్పుడూ ఇల్లు కదిలి బయటకు రాలేదు. ప్రచారంలో కూడా ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని సుభావతిని యోగి ఆదిత్యనాథ్ వంటి బలమైన అభ్యర్థిపై దింపడానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కి కూడా కొన్ని లెక్కలున్నాయి. ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన యోగిపై యూపీలో బ్రాహ్మణులు గుర్రుగా ఉన్నారు. గోరఖ్‌పూర్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడు ఉపేంద్ర. ఆయన మరణించినప్పుడు కూడా యోగి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై అప్పట్లో ఆయనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. సానుభూతి ఓట్లు, ఓబీసీల అండతో పాటుగా బ్రాహ్మణ ఓట్లను కూడా దక్కించుకోవాలన్న వ్యూహంతో అఖిలేశ్ ఆమెను రంగంలోకి దింపారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. (చదవండి: లతా మంగేష్కర్ మెమోరియల్ రగడ: సేన సెంటిమెంట్‌ను కెలుకుతున్న బీజేపీ.. లతాజీ సోదరుడి ఫైర్) -
మహిళా రక్షణ మాతోనే సాధ్యం
సహరన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఏ ముస్లిం మహిళా అణచివేతకు గురికాకూడదనే ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరుకుంటోందని, కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం చేయడంలో యూపీ సీఎం యోగీ పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యూపీలో మహిళలకు రక్షణ కావాలన్నా, నేరస్థులు జైళ్లలో ఉండాలన్నా... బీజేపీ అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటి సారి యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహరన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ర్యాలీనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు ఒక కళంకం అయితే, 2014లో జరిగిన సహరన్పూర్ మత కల్లోహాలు మరింత భయంగొల్పాయని, వాటికి కారణమైన వాళ్లకు 2017లోనే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని కితాబిచ్చారు. పేద ప్రజలు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా, చిన్న రైతులకు కిసాన్యోజన నిధులు రావాలన్నా, ఉచిత రేషన్ అందాలన్నా, టీకా ఉచితంగా అందాలన్నా, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అది యూపీ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చిందన్నారు. బిపిన్‌రావత్ కటౌట్ వాడుకుంటున్నారు... ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. దివంగత జనరల్ బిపిన్ రావత్ బతికుండగా నిందించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకోసం ఆయన కటౌట్‌ను ఉపయోగించుకుంటోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, ఢిల్లీలో ఉండి రుజువులు కావాలని అడిగిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సాయుధ దళాలపై విద్వేషం వెల్లగక్కిన నేతలు ఇప్పుడు వారి చిత్రాలను ఉపయోగించుకోవడం హాస్యాస్పదమన్నారు. బిపిన్‌రావత్ జ్ఞాపకాలను కొనియాడిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యం పండిట్ జనవహర్‌లాల్ నెహ్రూ పట్టుబడితే... 1947లో కొన్ని గంటల్లోనే గోవా, పోర్చుగీసు నుంచి విముక్తమయ్యేదని, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లే 15ఏళ్ల కాలం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మపుసలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీ గోవాను శత్రువులా చూస్తోందని, భవిష్యత్‌లోనూ అదే తీరు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవా యువత ఏం కోరుకుంటోంది? ఇక్కడి రాజకీయ సంస్కృతి ఏమిటన్నది కాంగ్రెస్‌కు ఎప్పటికీ అర్థం కాదన్నారు. -
పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రానికి.. పెళ్లి కొడుకు ఏమన్నాడంటే..
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 11 జిల్లాలోని 58 నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో శామ్లీ, మీరట్, హాపూర్, ముజఫర్ నగర్, ఘజియాబాద్, అలీగడ్, ఆగ్రా, బాఘ్‌పత్, గౌతమ్ బుద్ధానగర్, మథుర, బులంద్ షహర్ జిల్లాలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యూపీలోని ముజ్ఫర్ నగర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఈ సంఘటన జరిగింది. అంకుర్ బాల్యన్ అనే వ్యక్తి పెళ్లి నేడు. కొద్ది గంటల్లో తన పెళ్లి ఉన్నప్పటికీ.. ఓటు వేయడం బాధ్యతగా భావించి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందు ఓటు వేయడం ముఖ్యమని తెలిపారు. ఓటు తరువాతే పెళ్లి, భార్య, ఇంకే పనైనా అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి రోజు పోలింగ్ బూతుకు వచ్చి విధిగా ఓటు హక్కు వినియోగించుకున్న అంకుర్ బల్యాన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వైరల్ వీడియో: రెస్టారెంట్లో ఉడుము ప్రత్యక్షం.. బోరున ఏడ్చిన మహిళ.. చివరికి! #WATCH | "Pehle matdaan, uske baad bahu, uske baad sab kaam," says Ankur Balyan, a bridegroom who had come to cast his vote at a polling booth in Muzaffarnagar ahead of his wedding today.#UttarPradeshElections2022 pic.twitter.com/KaYsv5s2Bb — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022 -
యూపీ..కేరళలా మారితే?.. యోగీ వ్యాఖ్యలపై పినరయి విజయన్ గట్టి కౌంటర్
తిరువనంతపురం: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వేళ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. యూపీ కేరళలాగా మారిపోతుందని యోగి భయపడుతున్నాడని యూపీ సీఎంకు పినరయి విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా ఉత్తరరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 58 స్థానాలకు జరిగిన ఎన్నికల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనాలని, ఓటు వేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. లేకుంటే ఉత్తరప్రదేశ్ కూడా మరో కశ్మీర్, బెంగాల్, కేరళల మారుతుందని హెచ్చరించారు. చదవండి: యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్ నిందితుడికి బెయిల్ తాజాగా యోగి వ్యాఖ్యలపై కేరళ సీఎం తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ‘ఒక వేళ యూపీ కేరళలాగా మారితే మంచి విద్య యూపీ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందని, కులాలు, మతాల పేరుతో హత్యలు జరగవని అన్నారు. ఈ మేరకు ట్విటర్ల్ ‘యూపీ ఒకవేళ కేరళగా మారుతుందని యోగి భయపడుతున్నారు. మంచి విద్య ప్రజలకు దక్కుతుంది. మంచి వైద్యం, సాంఘిక సంక్షేమం అందుబాటులోకి వస్తుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరగవుతాయి. మత సామరస్యం పెరుగుతుంది. ఒకరినొకరు మతాల పేరుతో చంపుకోరు. ఇదే యూపీ ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ సీఎం పినరయ్ విజయన్ ట్వీట్ చేశారు. చదవండి: ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ -
యోగి ఆదిత్యనాథ్‌పై మహిళ పోటీ.. ఆమే ఎందుకు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటిసారిగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటుగా మహిళా నేత శుభావతి శుక్లాను సమాజ్‌వాదీ పార్టీ రంగంలోకి దించింది. కాంగ్రెస్ నుంచి చేతనా పాండే, బీఎస్పీ అభ్యర్థిగా ఖ్వాజా శంషుద్దీన్ బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ తరపున యువ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. ఎవరీ శుభావతి? దివంగత బీజేపీ నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా సతీమణి శుభావతి. ఉపేంద్ర దత్ గుండెపోటుతో 2020లో మరణించారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు పనిచేశారు. నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు. రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఒక లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి గోరఖ్‌పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన 2018 లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఉపేంద్ర దత్ పోటీ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌తో విభేదాల కారణంగానే ఆయన ఓడిపోయారన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. తన భర్త జీవించి ఉన్న సమయంలో శుభావతి రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజా ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్‌పూర్‌లోని మరో స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కుమారుడితో కలిసి గత నెలలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. బీజేపీ తమ పట్ల వ్యవహరించిన తీరుపై శుక్లా కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఉపేంద్ర శుక్లా మరణం తర్వాత యోగి ఆదిత్యనాథ్ కనీసం తమ కుటుంబాన్ని పరామర్శించలేదని వారు వెల్లడించారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన ఉపేంద్ర కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా అవమానించిందని బాధ పడుతున్నారు. (హాట్టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ) సానుభూతి పనిచేస్తుందా? సీఎం యోగిపై శుభావతిని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీకి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ బలమైన అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఆమెను ఎంపిక చేయడం విశేషం. ఠాకూర్-బ్రాహ్మణుల ఓటు బ్యాంకును చీల్చి బీజేపీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే శుభావతిని పోటీకి పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె భర్త ఉపేంద్ర శుక్లా గోరఖ్‌పూర్‌లోనే కాకుండా పూర్వాంచల్లోనూ పేరున్న బ్రాహ్మణ నాయకుడు. శుక్లా కుటుంబంపై ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. బీజేపీ తమ కుటుంబానికి చేసిన అన్యాయం గురించే ఎన్నికల ప్రచారంలో శుభావతి, ఆమె కుమారుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆసక్తికర పోటీ చాలా కాలంగా యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యర్థిగా ఉన్న బీఎస్పీ మాజీ నేత హరిశంకర్ తివారీ కుమారుడు గతేడాది డిసెంబర్లో సమాజ్‌వాదీ పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే మరో అంశం. అయితే గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ ఓడిపోని యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం అత్యంత సురక్షితమైందిగా పరిగణించబడుతోంది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మార్చి 3న ఇక్కడ పోలింగ్ జరగనుంది. (క్లిక్: ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు) -
యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్ నిందితుడికి బెయిల్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ సింసాత్మక ఘటనలోని నిందితుడికి బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత అక్టోెబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి.. రిమాండ్‌కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. కాగా ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో 2021 అక్టోబర్ 3న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకుపోవడంతో రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే ఉద్ధేశ్య పూర్వకంగానే రైతులపైకి ఆశిశ్ మిశ్రా తన కారును పొనిచ్చాడని ఇటీవలే కమిటీ పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ ఇప్పటికీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఓటర్లు జాగ్రత్తా! ఐదేళ్ల శ్రమకు మీ ఓటే దీవెన!
న్యూఢిల్లీ: 11 నెలల రైతుల నిరసన కేంద్రమైన పశ్చిమ ప్రాంతంలోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఓటర్లను ఉద్దేశించి ఒక వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆదిత్యానాథ్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ....ఓటర్లను ఓటు వేసేముందు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీకు నేను ఒక విషయం చెప్పాలి. ఈ ఐదేళ్లో చాలా అద్భుతాలు జరిగాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ ఐదేళ్ల శ్రమ వృద్ధా అయిపోతుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ కాశ్మీర్, కేరళ లేదా బెంగాల్‌గా మారిపోతుందన్నారు. అంతేకాదు ఈ ఐదేళ్ల శ్రమకు మీ ఓటు తనకు దీవెన మాత్రమే కాక మీ నిర్భయ జీవితానికి భరోసాగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు మీరు అతిపెద్ద నిర్ణయం తీసుకునే సయం ఆసన్నమైందన్నారు. బీజేపీ ప్రభుత్వం అంకితభావం, నిబద్ధతో పనిచేసిన విధానాన్ని మీరు కళ్లరా చూశారని అన్నారు. ఈ మేరకు యోగిఆదిత్యానాథ్ యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చే నిమిత్తం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు యూపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్న సంగతి తెలిసిందే. मतदान करें, अवश्य करें ! आपका एक वोट उत्तर प्रदेश का भविष्य तय करेगा। नहीं तो उत्तर प्रदेश को कश्मीर, केरल और बंगाल बनते देर नहीं लगेगी: मुख्यमंत्री श्री @myogiadityanath pic.twitter.com/03VUlXOY35 — BJP Uttar Pradesh (@BJP4UP) February 9, 2022 (చదవండి: మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి!) -
యూపీ: 25 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండో దశలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 584 మంది పోటీపడుతుండగా... వీరిలో 25 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నా యని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్సు తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 52 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా.. వీరిలో 35 మందిపై (67 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. కాంగ్రెస్ తరఫున రంగంలో నిలిచిన 54 మందిలో 23 మందిపై కేసులున్నాయని, బీఎస్పీ నిలబెట్టిన 55 మంది అభ్యర్థుల్లో 20 మంది కేసులను ఎదుర్కొంటున్నారని వివరించింది. -
కమలానికి కఠిన పరీక్ష.. దేశంలో తగ్గుతున్న బీజేపీ పట్టు!
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా మాత్రమే కాదు, బీజేపీకి అత్యంత కీలక పరీక్షగా కూడా నిలుస్తున్న ఎన్నికలివి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతున్న వేళ తిరిగి జాతీయ రాజకీయాలపై పట్టు సాధించాలంటే కమలదళానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. రానున్న రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వీటి ప్రభావం ఉంటుంది. అందుకే కమలనాథులకి అయిదు రాష్ట్రాల ఎన్నికలు కఠిన సవాలే విసురుతున్నాయ్.. అందరిలోనూ ఉత్కంఠని పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఆయా రాష్ట్రాల్లో తన పట్టు నిలుపుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్‌పై అంతగా ఆశలు పెట్టుకోని కమలనాథులు ఈసారి ఎక్కువగా యూపీపైనే దృష్టి సారించారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించకపోతే జాతీయ రాజకీయాలపై బీజేపీ పట్టు తగ్గిపోయిందనే సంకేతం వెళుతుంది. పట్టు కోల్పోతోందనే భావన ప్రబలితే... ప్రమాద ఘంటికలు మోగినట్లే లెక్క. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో వరుసగా రెండోసారి కేంద్రంలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలపడిపోతోంది. అందుకే ప్రస్తుతం జరగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ వ్యాప్తంగా వివిధ అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. 19 రాజ్యసభ స్థానాలపై.. ఈ ఏడాది 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్, జూన్లలో సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉండటంతో జూలైలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న యూపీ నుంచి 11, పంజాబ్‌లో 7, ఉత్తరాఖండ్‌లో 1 స్థానం, అంటే మొత్తంగా 19 మంది ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలన్నీ ఎన్డీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఖాళీ అవుతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటముల ప్రభావం ఈ రాజ్యసభ ఎన్నికలపై పడుతుంది. పంజాబ్‌లో అధికారంపై పెద్దగా ఆశల్లేని బీజేపీ 11 మందిని రాజ్యసభకు ఎన్నుకునే యూపీపైనే తన దృష్టి అంతా కేంద్రీకరించింది. రాష్ట్రపతి ఎన్నికలపై .. ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిపోతోంది. కొత్త రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ఎన్నికవ్వాలంటే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి మెజార్టీ వచ్చి తీరాలి. పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో జనాభా ఎక్కువగా ఉండడంతో ఎలక్టోరల్ కాలేజీలో యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక జాతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో అందరూ కలసికట్టుగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎన్నికలయ్యే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కూడా ఈ సారి 19 మంది సభ్యులు ఎన్నికవుతారు. వారు కూడా రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొంటారు. అందుకే ఈసారి ఎన్నికలు బీజేపీకి గట్టి సవాల్‌గానే మారాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై .. ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించడంపైనే బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటగలదన్నది ఆధారపడి ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 301 లోక్‌సభ స్థానాలు సాధించగా.. ఇందులో 62 ఒక్క యూపీ నుంచే వచ్చాయి. అందుకే యూపీలో తన పట్టు నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యావశ్యకం. కానీఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ –ఆర్ఎల్డీ కూటమి గట్టిగా సవాల్ విసురుతూ ఉండడంతో కమలనాథులు కలవరానికి గురవుతున్నారు. తదుపరి నాయకత్వం పైనా... బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరే నాయకుడికి లేదు. సమర్థుడైన నాయకుడిగా ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఎందరో అభిమానులు ఉన్నారు. అంతటి ఛరిష్మా కలిగిన మోదీకి వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు బీజేపీ అభిమానులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరే చెబుతారు. భావిభారత ప్రధాని యోగియే అంటూ బీజేపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. మోదీకి సరైన వారసుడిగా యోగి నిలవాలన్నా, జాతీయ రాజకీయాల్లో బీజేపీ పట్టును కొనసాగించాలన్నా ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. 2017 డిసెంబర్ నాటికి దేశంలో బీజేపీ, దాని మిత్రపక్ష పాలిత రాష్ట్రాలు, 2019 డిసెంబర్ నాటికి బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గాయిలా.. రాష్ట్రాలపై పట్టు ... 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కాక ఆయనకున్న క్రేజ్‌తో క్రమంగా రాష్ట్రాలపై కూడా బీజేపీ పట్టు బిగించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ, అమిత్ షా కాంబినేషన్‌కు ఎదురే లేకుండా ఉండేది. 2018 సంవత్సరం మొదట్లో ఏకంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ, లేదంటే ఆ పార్టీ మిత్రపక్షాల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దేశ జనాభాలోని 70 శాతం మంది బీజేపీ పరిపాలన కిందకి వచ్చారు. కానీ అదే ఏడాది చివర్లో తాను అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికార వ్యతిరేకతను ఎదుర్కొని బీజేపీ ఓడిపోయింది. ఆ ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. మోదీ తన ప్రభ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే, హరియాణాలో సీట్ల సంఖ్య తగ్గిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక శివసేనకు అప్పగించింది. 2021లో జరిగిన అసోంలో కూడా మెజార్టీ స్థానాల్లో కోత పడింది. మొత్తంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ రాష్ట్రాల్లో కూడా తన హవా కొనసాగాలంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గెలుపు తప్పనిసరిగా మారింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆ ఆరుగురు మంత్రుల్లో టెన్షన్ టెన్షన్
UP Assembly Elections 2022: 2013 ముజఫర్‌నగర్ హింసాత్మక ఘటనలతో జాట్లు, మైనార్టీల మధ్య చీలిక ఏర్పడి.. 2017 ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. మెజార్టీ సీట్లతో బంపర్ విక్టరీ సాధించింది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి దశలో పశ్చిమ యూపీలో ప్రధానంగా వార్తల్లో ఉన్న నియోజకవర్గాలైన కైరానా, థాన్‌భవన్, సర్దానా, ఆగ్రా రూరల్, మథుర, నొయిడా, హస్తినాపూర్ పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో యోగి క్యాబినెట్‌లోని మంత్రులు బరిలో ఉన్నారు. మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌లు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్లలో ఇప్పుడు టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఓటమి ఆందోళనకు కారణాలు.. ►పశ్చిమ యూపీ రీజియన్.. చెరుకు పంటకు ఫేమస్. అయితే ఈ ప్రాంతంలోని రైతులకు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ, ఈ విషయంలో రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ►జాట్ ఓటర్లు.. తొలి దశ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ముందుండి నడిపించింది. ►జాట్లలో పట్టున్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం మరో కీలక పరిణామం. ►గత ఎన్నికల్లో 58 సీట్లకుగానూ బీజేపీ 53 సీట్లను గెలుచుకుంది. 2017 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆర్ఎల్డీ.. ఈసారి ఎస్పీ వెంటనడుస్తోంది. ►కరోనా సమయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరుపైనా నిరసనలు వెల్లువెత్తాయి. ►సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో పశ్చిమ యూపీ కీలక పాత్ర పోషించింది. దీంతో బీజేపీపై ఇది కొంత ప్రతికూలాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖద్వారమైన ఢిల్లీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్పత్, మేరఠ్, గాజియాబాద్, హాపుఢ్, గౌతమబుద్ధనగర్, బులంద్‌షెహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాలు ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్-19 నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 623 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సంబంధిత వార్త: నామినేషన్లో రెండో భార్య పేరు.. మొదటి భార్య అలక, ఆపై.. -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. తొలిదశ పోలింగ్ పూర్తి
-
వారసత్వ రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికే ముప్పు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ప్రజాస్వామ్యానికి ముప్పుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదేనని ధీమా వెలిబుచ్చారు. యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం తొలి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీని గెలిపించే ధోరణికి యూపీ ప్రజలు స్వస్తి చెప్పారు. వారు 2014 (లోక్‌సభ) ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించారు. మా పనితీరు నచ్చి 2017 (అసెంబ్లీ) ఎన్నికల్లో మళ్లీ అవకాశమిచ్చారు. తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా మేం చేసిన అభివృద్ధిని మెచ్చి 2019 (లోక్‌సభ) ఎన్నికల్లోనూ మాకే ఓటేశారు. ఇప్పుడూ బీజేపీకే అవకాశమిస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. పలు అంశాలపై మోదీ ఏమన్నారంటే... యూపీ మహిళలు రాత్రి పూట తిరగొచ్చు... గతంలో యూపీ అంటే మాఫియారాజ్, గూండారాజ్ మాత్రమే గుర్తొచ్చేవి. వాటిని ప్రభుత్వాలే ప్రోత్సహించేవి. ఇప్పుడక్కడ శాంతిభద్రతలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతంగా చక్కదిద్దింది. ఇప్పుడు యూపీ మహిళలు రాత్రుళ్లు కూడా నిర్భయంగా ఒంటరిగా బయటికి వెళ్లవచ్చు. ఎస్పీ, బీఎస్పీ కల్లబొల్లి మాటలను ఓటర్లు వినే పరిస్థితి లేదు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పు... వారసత్వ రాజకీయాలు నా దృష్టిలో కుహనా సామ్యవాదం. రాం మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌కుమార్ కుటుంబాలు మీకెక్కడైనా కన్పిస్తాయా? సోషలిస్టులంటే వాళ్లు. సమాజ్‌వాదీ పార్టీలో కనీసం 45 పదవుల్లో అగ్ర నేతల కుటుంబీకులేనట! కశ్మీర్, హరియాణా మొదలుకుని యూపీ, జార్ఖండ్, తమిళనాడు దాకా చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువు. డైనాస్టీ (వారసత్వం) ఉన్న చోట డైనమిజం ఉండదు. కుల రాజకీయాలు కూడా శాశ్వతంగా పోవాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం కుల జపం చేయడం సరికాదు. హెడ్లైన్ల కోసం పాకులాడట్లేదు... నిత్యం పతాక శీర్షికల్లో నిలవాలని నేనెన్నడూ పాకులాడలేదు. అంతర్జాతీయంగా దేశ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా తపన. కానీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలు మన దేశంలో తప్ప బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో! దర్యాప్తు సంస్థల దురుపయోగం అబద్ధం... దర్యాప్తు సంస్థలను మేం దురుపయోగం చేస్తున్నామన్నది అబద్ధం. దేశవ్యాప్తంగా అవినీతి భరతం పడుతూ వందలాది, వేలాది కోట్ల జాతి సంపద ఖజానాకు జమ చేస్తున్నందుకు నిజానికి నన్ను మెచ్చుకోవాలి. అవినీతి దేశానికి పట్టిన చీడ. దీనిపై నేనేమీ చేయకపోతే ప్రజలు నన్ను క్షమిస్తారా? ఎన్నికలప్పుడు ప్రత్యర్థులను వేధించేందుకు వీటిని వా డుకుంటున్నామంటున్న పార్టీలకు దమ్ముంటే దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలకు అంగీకరించాలి. నెహ్రూపై విమర్శలు సబబే... నేను ఎవరి తండ్రి గురించో, తాత గురించో పనిగట్టుకుని మాట్లాడలేదు (రాహుల్‌నుద్దేశించి). కేవలం ఒక మాజీ ప్రధాని ఏం చెప్పారో గుర్తు చేశా. అది తెలుసుకోవడం దేశం హక్కు. మేం నెహ్రూ పేరే ఎత్తొద్దన్నది వారి వాదన. వాళ్లకు అంత భయమెందుకో! దేశం కోసమే సాగు చట్టాలు వెనక్కు.. నేను రైతుల మనసు గెలుచుకునేందుకే వచ్చాను. గెలిచాను కూడా. చిన్న రైతుల సమస్యలు నాకు తెలుసు. సాగు చట్టాలను రైతుల ప్రయోజనం కోసమే తెచ్చాం. కానీ అంతిమంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెనక్కు తీసుకున్నాం. ఎన్నికలు మాకు నిత్య పాఠాలు.. ఎన్నికలను మేం కేవలం రాజకీయ దృష్టితో మాత్రమే చూడం. అవి మాకు ఓపెన్ యూనివర్సిటీల వంటివి. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు గొప్ప అవకాశాలుగా వాటిని చూస్తాం. -
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు, దాంతో
అమేథీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అమేథీ బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్‌పై ఆయన మొదటి భార్య, ఆ పార్టికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గరిమా సింగ్ బుధవారం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు! ఏమనో తెలుసా? ఎన్నికల అఫిడవిట్లో భార్యగా తన పేరు రాయలేదని! రెండో భార్య అమితా సింగ్ పేరు రాశారని! దీనిపై ఆర్వోకు రాతపూర్వకంగా అభ్యంతరం వెలిబుచ్చినట్టు చెప్పారామె. తన హక్కు కోసం పోరాడేందుకే భర్తపై ఫిర్యాదు చేశానన్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తారా అని అడగ్గా, ‘‘ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటా’’ అని చెప్పారు. సంజయ్‌సింగ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. అమేథీ టికెట్ కోసం ఆయన భార్యలిద్దరూ పోటీ పడగా వారిని కాదని సంజయ్‌కి పార్టీ అవకాశమిచ్చింది. -
మొదట రైతులం! తర్వాతే హిందువులం!!
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నేడు జరగనుంది. ఏడు విడతల ఎన్నికల్లో మొదట 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రభావం కీలకం కానుంది. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం పశ్చిమ యూపీలోని అన్ని కులాల, మతాల రైతులను దగ్గర చేసింది. మొదట రైతులం, తర్వాతే ఇంకేదైనా అనేట్టుగా చేయగలిగింది. ఆర్థికంగా మెరుగవ్వడం అన్న ఒక్క ఆలోచన మీదే వారి ఐక్యత సాగుతోంది. మూడు సాగు చట్టాల రద్దు తర్వాత కూడా సంయుక్త కిసాన్ మోర్చా తన ఆందోళనను కొనసాగిస్తోంది. 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నది వీరి డిమాండ్లలో ప్రధానమైనది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా, ఎస్.పి–ఆర్.ఎల్.డి. పొత్తుకు అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉం ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో రైతులు తమకు ఏ విధంగా ఓటు వేస్తారు? భారతీయ జనతాపార్టీని ప్రస్తుతం అమితంగా వ్యాకులతకు గురిచేస్తున్న అంతర్లోచన ఇది. సంకేతాలేమీ బాగోలేవు. తాజా బడ్జెట్ కూడా ఆ సంకేతాలను మెరుగుపరిచేదేమీ కాదు. రైతుల ఆగ్రహ జ్వాలలూ ఇప్పట్లో చల్లారేలా లేవు. దీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్లను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందనే విషయాన్ని ఎత్తిచూపేందుకు గానూ ఇటీవల వారు ‘విశ్వాస ఘాతుక దినం’ కూడా పాటించారు. బహుశా బీజేపీ ఇప్పుడు ఈ రెండు రాష్టాల్లో మరీ ఎక్కువ సీట్లు కోల్పోకూడదన్నంత వరకే తన ఆశను పరిమితం చేసుకుని ఉండాలి. రైతులు తీవ్ర నిరసనతో తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రద్దు చేశాం కాబట్టి తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆ పార్టీ నమ్మవచ్చు. కానీ ఆ లెక్క తప్పేలా ఉంది. సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని మోదీ కానుకగా ముద్రవేయడానికి బీజేపీ ప్రయత్నిం చింది. అయితే ఇందులో మోదీ తమకు చేసిందేమీ లేదని రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి దీర్ఘకాల పోరాటంతో, ప్రాణత్యాగాలతో సాధించుకున్న ‘ట్రోఫీ’గా మాత్రమే ఈ రద్దును రైతులు పరిగణిస్తున్నారు. నలభైకి పైగా రైతు సంఘాల సమష్టి నాయకత్వంతో రైతుల ఉద్యమాన్ని నడిపించిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేయం) సాగు చట్టాల రద్దు తర్వాత కూడా నేటికింకా ఆందోళనను కొనసా గిస్తూనే ఉంది. 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నది ఎస్కేయం డిమాండ్లలో ప్రధానమైనది. ‘ఏ పార్టీకైనా ఓటు వెయ్యండి కానీ, బీజేపీకి మాత్రం వేయకం’డని అది ప్రజలను కోరుతోంది. ఈ ఎన్నికల్లో మోదీ విజయం సాధిస్తే కనుక రద్దు చేసిన సాగు చట్టాలను వేరే రూపంలో తిరిగి పునరుద్ధరిస్తారన్న భయం రైతులలో స్పష్టంగా కనిపిస్తోంది. మోదీని వారు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన వ్యక్తిగా మాత్రమే చూడగలుగుతున్నారు. ఈ పరిస్థితి మోదీ, బీజేపీల స్వయంకృతమే. ఎండనక, వాననక, చలికి వణుకుతూ, కరోనా బారిన పడుతూ ఏడాది పాటు నిర్విరా మంగా రైతులు ఢిల్లీ శివారు వీధులలో సాగు చట్టాలకు నిరసనగా ఏకబిగిన ప్రదర్శనలు జరిపారు. వీధుల్లోనే వండుకున్నారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు వీధుల్లోనే పడకేశారు. ఈ మహోద్యమ కాలంలో 700 మంది వరకు అనారోగ్యంతో, వాతావరణ అననుకూలతతో కన్ను మూశారు. వాళ్లను ఆందోళన జీవులనీ, అలవాటుగా ఆందోళన చేస్తు న్నవారనీ, వాళ్లది ధిక్కార ప్రదర్శన కనుక ఏ విధంగానూ పట్టించు కోనవసరం లేదనీ మోదీ విమర్శించారు. ఆ చేదు అలా రైతుల గుండెల్లో ఉండిపోయింది. జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటనలో భద్రత లోపాలను చూపి ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగి వెళ్లిపోవడం కూడా పాలకులకు, రైతులకు మధ్య సంబంధాలను మరింతగా క్షీణింపజేసింది. గత అక్టోబరులో లఖింపూర్ ఖేరీ ప్రాంతంలోని టికూనియా వద్ద నిరసనకారులపైకి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన వాహనాన్ని నడిపి నలుగురు రైతుల దుర్మరణానికి కారణం అవడం కూడా రైతుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తోంది. యూపీలో తనకు మాత్రమే ప్రత్యేకమనుకున్న హిందుత్వను అస్త్రంగా చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం జాట్లకూ, ముస్లింలకూ మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్ని తవ్వి బయటికి తీస్తోంది. నాటి మత కలహాలలో 60 మందికి పైగా మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది 29న హోంశాఖ మంత్రి అమిత్‌షా ముజఫర్‌నగర్‌లో జాట్లు ఉండే ప్రాంతాలలో ఇల్లిల్లూ తిరిగి... ‘ఆనాటి అల్లర్లను మీరు మర్చిపోయారా?’ అని జాట్ ఓటర్లను ప్రశ్నించి పాత గాయాలను గుర్తు చేశారు. దీనిని బట్టి ఓటర్లకు బీజేపీ ఏం చెప్పదలచుకుందో స్పష్టంగానే అర్థమౌతోంది. ‘మొదట మీరు హిందువులు. ఆ తర్వాతే రైతులు’ అని చెప్పడం ఆ పార్టీ ఉద్దేశం. ఆ మాటతో కొంతమంది జాట్ల పట్టును సాధించగలిగింది కానీ... ఉద్యమంలో ఉన్న జాట్ రైతులు మాత్రం... ‘మొదట మేము రైతులం. ఆ తర్వాతే జాట్లం’ అంటున్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్.ఎల్.డి.) అధ్యక్షుడు జయంత్ చౌధురి మాటల్లో కూడా ఇదే అర్థం ధ్వనించింది. ఆర్.ఎల్.డి. రైతు ఉద్యమా నికి సంఘీభావం ప్రకటించడంతో పశ్చిమ యూపీలోని జాట్లు జయంత్ చౌధురితో ఉన్నారు. ఆయన పార్టీకి సమాజ్‌వాది పార్టీతో పొత్తు ఉంది. ఆ పొత్తును రద్దు చేసుకుని తమతో చేయి కలపమని బీజేపీ కోరినప్పుడు జాట్లను తను జాట్లుగా కాక రైతులుగా మాత్రమే చూస్తున్నానని జయంత్ చౌధురి అన్నారు. ఢిల్లీలో జనవరి 26న అమిత్ షా కొంతమంది జాట్ నాయకులతో సమావేశ మైనప్పుడు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జయంత్ చౌధురిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం. కానీ ఆయన తగని ఇంటిని ఎంచుకున్నారు. అయితే ఆయన కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి’’ అని అన్నారు. చౌధురి అందుకు స్పందిస్తూ.. ‘‘నన్ను మీ ఇంటికి రమ్మని అడగటం కాదు... మీరు కూల్చేసిన 700 మందికి పైగా రైతుల కుటుంబాల వాళ్లను రమ్మని ఆహ్వానించండి’’ అని ట్వీట్ చేశారు. పశ్చిమ యూపీలో బీజేపీపై అసంతృప్తి, ఆగ్రహం ఉన్న జాట్ కులస్థులు, ఇతర కులాల్లోని రైతులు చౌధురికి మద్దతుగా ఉన్నారు. ‘మొదట రైతులం, తర్వాతే హిందువులం’ అని ఇప్పుడు చెబుతున్న వీళ్లంతా 2014, 2017, 2019 ఎన్నికల్లో ‘మొదట హిందువులం, తర్వాతే రైతులం’ అని బీజేపీకి ఓటు వేసినవారే. కానీ 2022లో మత విశ్వాసాలకన్నా, ఆర్థిక అవసరాలే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కారణంతోనే ముస్లిం రైతులు కూడా రాష్ట్రీయ లోక్ దళ్‌కు మద్దతు ఇస్తున్నారు. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం పశ్చిమ యూపీలోని హిందూ, ముస్లిం రైతులను దగ్గర చేసింది. ముజఫర్‌నగర్‌లో ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన మహాపంచాయత్‌కు రెండు మతాల రైతులూ హాజరయ్యారు. ‘హర హర మహాదేవ్’, ‘అల్లాహో అక్బర్’ అనే నినాదాలతో మతసామరస్యం మిన్నంటింది. రైతు ఉద్యమంలో హిందూ, ముస్లింలు కలిసికట్టుగా పాల్గొనడం 2013 నాటి గాయాల్ని మాన్పగలిగింది. ఇప్పుడు వాళ్ల ఆలోచన ఒక్కటే. ఆర్థికంగా మెరుగవ్వాలి. ఈ ఆలోచనే తాజా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా, ఎస్.పి–ఆర్.ఎల్.డి. పొత్తుకు అనుకూలంగా ఫలితా లను ఇవ్వబోతోంది. రైతుల ఆర్థిక ఇబ్బందులు హిందువుల మత విశ్వాసాలను కూడా రెండోస్థానంలోకి తీసుకెళ్లాయి. హిందువులు గోవును మాతగా పూజిస్తారని అంటూ యోగి ప్రభుత్వం గోవిక్రయా లను, గోవధను నిషేధించింది. అయితే రాష్ట్రంలోని రైతులు, వాళ్లలో హిందువులు అయినవాళ్లు కూడా పోషణ లేక ఆకలితో అలమటిస్తున్న ఆవులు, ఎద్దులు తమ పంటలను తినేస్తుండటంలో ప్రభుత్వ నిషేధ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతు ఉద్యమంలో భాగస్వాములైన రైతు సంఘాలలో కొన్ని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో తలపడుతుండటం వెనుక ఉన్నవి కేవలం రైతు ప్రయోజనాలే తప్ప వేరొకటి కాదు. పంజాబ్‌లో బీజేపీ ఎప్పటిలాగే ఎన్నికల్లో హిందూవాదాన్ని కాకుండా, జాతీయ వాదాన్ని ప్రయోగిస్తోంది. అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. ఈసారి పంజాబ్ ఎన్నికలు రైతుల చుట్టూనే తిరుగుతాయి తప్ప జాతీయ భద్రత అనేది ఒక విషయమే కాదు. అందుకే బీజేపీతో తన రెండు దశాబ్దాల పొత్తును కూడా శిరోమణి అకాలీ దళ్ తెంపేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న మద్దతు తగ్గిపోవడమే అందుకు కారణం. – అరుణ్ సిన్హా జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు -
యూపీ ప్రజలు ఎప్పుడో వాటిని దూరంగా విసిరేశారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 5 రాష్ట్రాల్లోనూ బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకునేలా పథకాలు రూపొందించామని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఘన విజయం సాధిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌పైనే దృష్టి పెట్టాయని, బీజేపీ డబుల్ ఇంజిన్ గ్రోత్తో ముందుకెళ్తోందన్నారు. ఇక లఖీంపూర్ ఘటనపై స్పందించిన మోదీ.. యూపీ ప్రభుత్వం విచారణకు సహకరిస్తోందన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు చదవండి: Hijab Row: ముస్లిం విద్యార్థులకు ప్రియాంక మద్దతు.. బికినీ, జీన్స్, హిజాబ్ ఏదైనా అంటూ.. ‘బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తాం. పాత సిద్ధాంతాలను యూపీ ప్రజలు ఎప్పుడో దూరంగా విసిరేశారు. ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే మా నినాదం.’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చదవండి: మేఘాలయలో కాంగ్రెస్ కల్లాస్.. 21 మంది ఎమ్మెల్యేల నుంచి జీరోకు.. -
హాట్టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ
నిజమే! సామన్యులు ఇప్పడు గళం విప్పడమే గగనమైపోతోంది. పాలకులను పల్లెత్తు మాటన్నామా నిర్బంధమే. మరి ఇప్పుడెలా? రాజ్యం ప్రజలపై బలవంతంగా మోపే బలవంతపు ఫర్మానాలను ప్రశ్నించేవారే లేరా? ఎందుకు లేరు ఉన్నారు? సదాఫ్ జాఫర్, పూజా శుక్లా లాంటి సామాన్య మహిళలు ప్రభుత్వ నిరంకుశ ధోరణులను నిర్భయంగా నిలదీశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం కారాగార వాసం చేయాల్సి వచ్చినా జంకలేదు, జావగారిపోలేదు! ఆ ధైర్యమే వారికి ఇప్పుడు శాసనకర్తలయ్యే అవకాశాన్ని కల్పించింది. భారతావనిలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్టాఫిక్. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తాయనేది సర్వత్రా ఆసక్తికరం. తలపండిన రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వందిమాగధులకు అవకాశాలే అధికమన్నది కళ్లెదుటే కనబడుతున్న చరిత్ర. ఇంతటి పోటీలోనూ ఇద్దరు (అ)సామాన్య మహిళలు పెద్ద పార్టీల టిక్కెట్లు దక్కించుకోవడం వర్తమాన రాజకీయాల్లో అరుదైన దృశ్యం. ఇంతకీ ఎవరా ఇద్దరు..? సదాఫ్.. శభాష్! ప్రతిష్టాత్మక లక్నో సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశాన్ని నటి, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ దక్కించుకున్నారు. ఆషామాషీగా ఆమెకు ఈ అవకాశం రాలేదు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 2019, డిసెంబర్లో గళమెత్తినందుకు మదమెక్కిన మగ పోలీసు దురహంకారంతో కాలితో ఆమె పొట్టలో తన్నాడు. లక్నోలోని పరివర్తన్ చౌక్ వద్ద ఫేస్బుక్ లైవ్ సెషన్ నిర్వహించిన సదాఫ్ను అవమానవీయ రీతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లు, హత్యాయత్నం కేసు పెట్టి ఆమెను జైల్లో పెట్టారు. అంతేకాదు ఆమె ఫోటోలతో పోస్టర్లు వేసి అవమానానికి గురిచేశారు. సదాఫ్ పోరాటం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆమెను విడుదల చేయాలని యూపీ బీజేపీ సర్కారును డిమాండ్ చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2020, జనవరిలో సదాఫ్‌కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్‌తో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. తలపండిన అధికార పార్టీ నాయకుడిని ఢీ కొట్టడానికి భయం లేదా అని అడిగితే.. ‘ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మొదటిసారి పోటీకి దిగినప్పుడు అనామకుడే కదా’అని బదులిచ్చారు సదాఫ్. ప్రజాస్వామ్య ఎన్నికల్లో అసలు బలం ప్రజలదేనని, తమకు పాలకులుగా ఎవరు ఉండాలో వారే నిర్ణయించుకుంటారని చెప్పారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?) నల్లజెండా తెచ్చిన అవకాశం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు నల్లజెండాలతో నిరసన తెలిపి ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి దూసుకొచ్చారు పూజా శుక్లా. లక్నో నార్త్ నియోజక వర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారామె. 25 ఏళ్ల పూజా శుక్లా.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కులైన అభ్యర్థుల్లో ఒకరు. 2017, జూన్ 7వ తేదీ ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్. హిందీ స్వరాజ్ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్నో యూనివర్సిటీ క్యాంపస్‌కు వెళుతున్న సీఎం యోగికి నల్లజెండాలతో నిరసన తెలపడంతో పూజా శుక్లాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 20 రోజుల తర్వాత బయటికి వచ్చిన ఆమె సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. ఆమె పోరాటానికి ముగ్దుడైన పెద్దాయన పార్టీ విద్యార్థి విభాగం అయిన ‘సమాజ్‌వాదీ చత్ర సభ’లో శుక్లాకు ప్రముఖ స్థానం కల్పించారు. అయితే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపి తనతో పాటు జైలుకెళ్లొచ్చిన వారికి లక్నో యూనివర్శిటీ 2018లో ప్రవేశం నిరాకరించడంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి విశ్వవిద్యాలయ పాలకవర్గాన్ని దిగొచ్చేలా చేశారు. (క్లిక్: ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు) ఈ పరిస్థితి మారాలి నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లక్నోలోని క్లాక్‌టవర్ వద్ద 2020, జనవరిలో మహిళలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలోనూ శుక్లా కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ‘విద్య పేరుతో యువతను, ముఖ్యంగా విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి. రాజకీయంగా అవగాహన ఉన్న విద్యార్థి మాత్రమే మంచి నాయకుడిని ఎన్నుకోగలడు. దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసి, ప్రగతిపథంలో తీసుకెళ్లే సత్తా యువతకు ఉంద’ని శుక్లా అన్నారు. రాజకీయ నాయకురాలిగా కూడా యువత, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టంచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో లక్నో నార్త్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నీరజ్ బోరాతో పూజా శుక్లా హోరాహోరీ తలపడుతున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను యువత, స్థానికుల అండదండలతో విజయం సాధిస్తానని దీమాగా చెబుతున్నారామె. పోరాట నేపథ్యం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సదాఫ్ జాఫర్, పూజా శుక్లాలను యూపీ ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారనేది పక్కన పెడితే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి హక్కుల కోసం నిర్భయంగా నినదించిన వీరిద్దరి పోరు పంథా సామాన్యులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు! (చదవండి: ఇలా పార్టీ ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నారు!) -
బీజేపీ యూపీ ఎన్నికల మేనిఫెస్టో.. వాళ్లకు ఉచిత బస్ పాస్.. విద్యార్థినులకు స్కూటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్ పేరుతో ఉన్న ఈ మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ మంగళవారం విడుదల చేశారు. రైతులు, యువత, బాలికల సంక్షేమమే ప్రధానాంశంగా మేనిఫెస్టో రూపొందించింది. ఐదేళ్లపాటు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని.. వరి, గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చింది. 15 రోజుల్లో చెరకు బకాయిలు చెల్లించేలా చర్యలు చేపడతామని, లేకుంటే మిల్లుల నుంచి వడ్డీ వసూలు చేస్తామని తెలిపింది. (చదవండి: హిజాబ్ వివాదం విషపూరిత కుట్ర: శివకుమార్) రూ.1500 పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడంతోపాటు వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. రాణి లక్ష్మీబాయి యోజన కింద కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, యువ శశక్తీకరణ్ యోజన కింద యువతకు 2కోట్ల ట్యాబ్‌లు ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులకు రూ.1500 పెన్షన్, మా అన్నపూర్ణ కేంటీన్ల ద్వారా రాయితీ భోజనం, హోలీ, దిపావళికి పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. లవ్ జిహాద్ చట్టంలో నిబంధనలు కఠినతరం చేస్తామని చెప్పింది. 10 ఏళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకూ జరిమానా విధించేలా చట్టంలో మార్పులు తథ్యమని స్పష్టం చేసింది. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పేరిట ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుచేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కాగా, ఫిబ్రవరి 6నే మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉండగా.. లతా మంగేష్కర్ మృతి చెందడంతో వాయిదా పడింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. (చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు) -
వాళ్లు వృద్ధి నిరోధకులు
బిజ్నూర్: అధికారంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధికి అడ్డంకులుగా నిలిచారని ప్రత్యర్ధులపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అలాంటివారంతా రైతు నేత చౌదరీ చరణ్‌సింగ్‌కు వారసులమని తప్పుగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆన్లైన్ సభల్లో పాల్గొన్నారు. అధికారంలో ఉండగా తమ గ్రామాలకు ఎంత మేర విద్యుత్‌ను అందించారో సమాజ్‌వాదీ నేతలను ప్రశ్నించాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. వీరంతా నకిలీ సమాజ్వాదీలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. యూపీ ఎన్నికల్లో ఆర్ఎల్డీ, ఎస్పీ కూటమి చరణ్ సింగ్ నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ, రైతుల ప్రధాని చరణ్‌సింగ్‌కు తామే వారసులమని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇలాంటి వారి మాటలు నమ్మవద్దని, రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టేందుకే తమ ప్రభుత్వాలు కట్టుబడిఉన్నాయని మోదీ చెప్పారు. ఐదేళ్లలో పంచదార రైతులకు సుమారు 1.5 లక్షలకోట్ల బకాయిలు చెల్లించామని, గత రెండు ప్రభుత్వాలు ఈ పని చేయలేదని గుర్తు చేశారు. ప్రతిపక్షాల హయంలో యూరియా బ్లాక్మార్కెట్లో దొరికేదని, తాము అధికారంలోకి వచ్చాక గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వాల కన్నా రెట్టింపు మోతాదులో యోగి ప్రభుత్వం గోధుమలు కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో రైతుల జనాభా, అందునా చెరుకు రైతుల హవా అధికం. అందుకే వారిని ఆకట్టుకునేందుకు ప్రధాని తమ ప్రభుత్వాలు చేసిన రైతు ఉపయోగ పనులను గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు సమస్యలను సృష్టించి సానుభూతి రాజకీయాలు చేసేవని, వారి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మోదీ విమర్శించారు. ఈ ర్యాలీలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. -
ఇలా పార్టీ ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నారు!
అమేథీ: యూపీలో ఒకప్పటి తమ కంచుకోట అయిన అమేథీ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ ఫిరాయింపుదారు ఆశిష్ శుక్లాకు ఇచ్చింది కాంగ్రెస్! శుక్లా సోమవారం ఉదయం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ వెంటనే ఆయనకు టికెట్ ఖరారైంది. ఇక్కడ బీజేపీ తన అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఆదివారం ప్రకటించింది! నిజానికి ఆయన భార్యలు అమితా సింగ్, గరిమా సింగ్ ఇద్దరూ బీజేపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. ఇద్దరినీ కాదని భర్తకు చాన్స్ దక్కింది. గరిమా సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా అమితా కాంగ్రెస్ తరఫున ఆమెపై పోటీ చేసి ఓడిపోయారు. సంజయ్ 2019లో రాజ్యసభ సీటు వదులుకుని కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరగా అమితా కూడా ఆయనను అనుసరించారు. ఇక సమాజ్‌వాదీ తరఫున గ్యాంగ్ రేప్ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి, బీఎస్పీ నుంచి రాగిణీ తివారీ బరిలో ఉన్నారు. అమేథీలో ఫిబ్రవరిలో 27న పోలింగ్ జరగనుంది. -
అవసరమైతే ఆర్మీ రిక్రూట్మెంట్ని ప్రవేశ పెడతాం!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు చాల రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆర్మీలో రిక్రూట్మెంట్ ప్రవేశపెట్టి ఖాళీ స్థానాలను భర్తీ చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తానని ఆగ్రా ప్రచార ర్యాలీలో అన్నారు. అంతేకాదు గతనెల 30న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషలో మీడియాలో... "సమాజ్‌వాద్ పార్టీ(తుపాకీ పార్టీ) నాయకులు కైరానా, ముజఫర్‌నగర్‌లలో తమ వేడి తగ్గలేదంటూ బెదిరిస్తున్నారు. మార్చి పది తర్వాత ఆ వేడి తగ్గిపోతుందిలే అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు." దీంతో అఖీలేశ్ యాదవ్ ఆయన వ్యాఖ్యల పై గత వారంరోజులుగా నిప్పులు చెరుగుతున్నారు. అయినా సీఎం తమ పార్టీ వేడిని తగ్గించినా తాము అధికారంలోకి వస్తే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లోని ఖాళీ స్థానాలను తొలగిస్తామంటూ గట్టి కౌంటరిచ్చారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌సీఎం యోగికి హింసతోనే సాన్నిహిత్యం ఉంది తప్ప శాంతితో కాదు అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈసారి గోరఖ్‌పూర్ ఓటర్లు అతన్ని ఉత్తరాఖండ్‌కు తిరిగి పంపుతారని అన్నారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి మాట్లాడుతూ.."యోగి ఆదిత్యనాథ్ అసౌకర్య ప్రశ్నలను నివారించడానికి అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తాడు. అయినా యోగి నిరుద్యోగ యువత వేడిని ఎలా తగ్గిస్తారో పేర్కొనాలి" అని అన్నారు. (చదవండి: యోగితో యూపీలో అభివృద్ధి!) -
ఎన్నికల ప్రచార ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షల్ని సడలించింది. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లో కరోనా పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా సభలను ఏర్పాటు చేసుకోవడానికి ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సభలను నిర్వహించుకునే అవకాశం వచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత ఫిబ్రవరి 10న మొదలు అవుతుండగా ఫిబ్రవరి 8 సాయంత్రంతో ప్రచారం గడువు ముగిసిపోతుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని ఇప్పటికే ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ జనవరి 22న అత్యధికంగా 32 వేల కేసులు నమోదైతే ఫిబ్రవరి 5 నాటికి అయిదు రాష్ట్రాల్లో మొత్తం కేసుల సంఖ్య 7 వేలకు తగ్గిపోయింది. దీంతో ఎన్నికల సభలపై ఆంక్షల్ని సడలించిన ఈసీ రోడ్డు షోలు, పాదయాత్రలపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తోంది. ‘‘బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షల్ని సడలిస్తున్నాం. హాలుల్లో జరిగే సమావేశాల్లో 50% సామర్థ్యంతోనూ, బహిరంగ సమావేశాల్లో ఆ గ్రౌండ్స్‌లో 30% సామర్థ్యంతో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జిల్లా అధికారులు విధించే ఆంక్షలకు అనుగుణంగా ఇవి మారుతాయి. ఏ నిబంధనల ప్రకారం తక్కువ సంఖ్యలో హాజరవుతారో దానినే పాటించాలి’’ అని ఈసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లకి పకడ్బందీ భద్రత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి తిరిగి వస్తుండగా హపూర్‌లో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన నేపథ్యంలో స్టార్ ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల భద్రతపై ఈసీ దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాలంటే ఆయా పార్టీల ముఖ్య ప్రచారకర్తల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి నోటీసులు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్ ఫొటోని ముస్లిం మత ప్రబోధకుడిగా మార్ఫింగ్ చేసి, ట్విట్టర్లో షేర్ చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర బీజేపీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. ఒక మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ స్పష్టం చేసింది. -
ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్కో పార్టీ ప్రత్యర్థులను ఎద్దేవా చేసే నినాదాలతో తమ ప్రచారాల్లో, సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నాయి. యూపీ, యోగీ కలిస్తే ‘ఉప్‌యోగీ’ అంటూ బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని తీవ్రతరం చేయగా, ‘బదలావ్ కీ యే ఆంధీ హై.. నామ్ ప్రియాంక గాంధీ హై’ (ఇది మార్పు తుఫాను.. పేరు ప్రియాంక గాంధీ) అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ‘ఆడపిల్లను.. పోరాడగలను’ అంటూ నవయువతను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్న సమాజ్‌వాదీ సైతం ‘కృష్ణ, కృష్ణ హరే హరే.. అఖిలేశ్ భయ్యా ఘరే ఘరే’ అని నినాదాన్ని ఎత్తుకొని విస్తృత ప్రచారం చేస్తోంది. బీజేపీ కొత్తగా మథురలో కృష్ణమందిర నిర్మాణ అంశాన్ని తెరపైకి తేవడంతో దానికి చెక్ పెట్టేలా యాదవ కులపతి ‘కృష్ణుడే’ కలలోకి వచ్చి తనతో స్వయంగా మాట్లాడుతున్నాడని అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు. ఎస్పీకి గట్టి మద్దతుదారులైన యాదవ సామాజికవర్గంపై సహజంగానే ఇది ప్రభావం చూపుతోంది. సమాజ్‌వాదీ పాలనలో ముస్లింల ఆగడాలు అంతుండేది కాదని పరోక్షంగా చెబుతూ ‘గతంలో రేషన్‌కార్డులైనా, ఇతర ప్రభుత్వ పథకాలైనా అబ్బాజాన్ అని పిలిచే వారికే దక్కేవి’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంధించిన విమర్శనాస్త్రం జనంలోకి బాగా వెళ్లింది. 2017కు ముందు యూపీలో అరాచకం రాజ్యమేలేదని, అభివృద్ధి శూన్యమని... యోగి హయాంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటూ బీజేపీ టీవీల్లో ‘ఫరక్ సాఫ్ హై (మార్పు సుస్పష్టం) అంటూ ప్రకటనలను హోరెత్తిస్తోంది. గతంలోనూ ఆయా పార్టీలు ఎత్తుకున్న నినాదాలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషించాయి. దళిత హక్కులపై మాయావతి లేవనెత్తిన నినాదం, రామ్ మందిరంపై బీజేపీ లేవనెత్తిన నినాదాలు ప్రజల మెదళ్లలోకి చొచ్చుకువెళ్లి ఆయా పార్టీలకు అధికార పీఠం కట్టబెట్టాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు పార్టీలు చేసిన ప్రధాన నినాదాలను పరిశీలించినపుడు జనబాహుళ్యంలోకి ఇవి ఎంతగా బలంగా వెళ్లాయో, ఓటర్లను ఆలోచనా సరళిని ఎంతగా ప్రభావితం చేశాయో తెలుస్తుంది. ‘తిలక్ తరాజు ఔర్ తల్వార్, ఇన్కో మారో జూతే చార్’ (అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, వైశ్యులు, రాజ్‌పుత్‌లకు నాలుగు తలిగించండి...) ► ఈ నినాదాన్ని అణగారిన వర్గాల కోసం బహుజన నేత కాన్షీరాం తెరపైకి తెచ్చారు. బహుజనుల కోసం పదేళ్లుగా పోరాటం చేసినా సాధించిందేమీ లేకపోవడంతో 1984 ఆయన బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగానేకాన్షీరాం చేసిన ఈ నినాదం రాష్ట్రవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. ‘జిస్కీ జిత్నీ సంఖ్యా భారీ..ఉస్కీ ఉత్నీ హిస్సేదారి’ (ఏ వర్గం సంఖ్య ఎక్కువుందో వారికే అధికారంలోనూ అంత ఎక్కువ వాటా దక్కాలి), ఓట్ హమారా, రాజ్ తుమ్హారా.. నహీ చలేగీ, నహీ చలేగీ’ (ఓట్లు మావి, రాజ్యం మీదా? ఇకపై చెల్లదు మీ పెత్తనం) అంటూ ఇచ్చిన నినాదాలు బాగా పనిచేశాయి. వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో 1991లో కేవలం 12 సీట్లు గెలుచుకున్న బీఎస్పీ 1993లో 67 సీట్లకు చేరుకుంది. ఆ తర్వాత నాలుగుసార్లు మాయావతి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ నినాదాలూ దోహదపడ్డాయి. రాంలల్లా హమ్ లాయింగే.. మందిర్ వహీ బనాయేంగే (రామున్ని తీసుకొస్తాం..ఆలయం అక్కడే నిర్మిస్తాం) ► 1991 ఎన్నికలకు ముందు బీజేపీ ఈ నినాదాన్ని ఎత్తుకుంది. 1990లో రామమందిర నిర్మాణాన్ని బలంగా డిమాండ్ చేసిన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. అధికారంలో ఉన్న ములాయంసింగ్ యాదవ్ ‘నా హయంలో బాబ్రీ మసీదుపై ఉన్న ఒక్క పక్షిని కూడా మరో పక్షి చంపలేదు’ అని ప్రకటించారు. అయినా కరసేవకులు చొచ్చుకొచ్చారు. వారిపైకి కాల్పులు జరపడంతో ఐదుగురు చనిపోయారు. ఈ సందర్భంగా బీజేపీకి నేతృత్వం వహించిన కల్యాణ్‌సింగ్ ఎత్తుకున్న ఈ నినాదం బలంగా పనిచేసి 1991 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 221 సీట్లు సాధించింది. కల్యాణ్‌సింగ్ సీఎం అయ్యారు. మిలే ములాయం, కాన్షీరాం.. హవా మే ఉడ్ గయే జై శ్రీరామ్ (కాన్షీరాం, ములాయం ఒక్కటయ్యారు. జై శ్రీరామ్ నినాదం గాల్లో కొట్టుకుపోయింది) ► బాబ్రీ మసీదు కూల్చవేత తర్వాత 1992 డిసెంబర్ నుంచి 1993 డిసెంబర్ దాకా యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. దాన్ని ఎత్తివేసేందుకు ముందు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ సందర్భంగానే ములాయం, మాయావతి ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. దళితులు–యాదవ్–ముస్లిం ఫార్ములా పనిచేసి ఈ ఎన్నికల్లో ఎస్పీ కూటమి అధికారంలోకి రాగా ములాయం ముఖ్యమంత్రి అయ్యారు. ‘చఢ్ గుండన్ కీ ఛాతీపర్ మొహర్ లగేగీ హాథీ కే’ (గూండాల గుండెలపై ఏనుగు బొమ్మను ముద్రిస్తాం’) ► ఈ నినాదాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెరపైకి తెచ్చారు. 1995లో మాయావతిపై ఎస్పీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత ఎస్పీతో దూరంగా ఉన్న మాయావతి తర్వాతి ఎన్నికల్లో ఈ నినాదంతో ముందుకు పోయారు. ముఖ్యంగా 2007 ఎన్నికల ముందు ఎస్పీ మద్దతుదారులను గూండాలంటూ మాయ పిలవడం ప్రారంభించారు. ఎస్పీకి వ్యతిరేకంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఫలితంగా బీఎస్పీ ఏకంగా 206 సీట్లు సాధించి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ‘జిస్ కా జల్వా కాయం హై..ఉస్ కా నామ్ ములాయం హై’ (ఎవరి పనితీరైతే చెక్కుచెదరలేదో అతనే ములాయం) ► 2012 ఎన్నికల సందర్భంగా ములాయంసింగ్ యాదవ్ ఈ నినాదంతో ప్రచారం చేశారు. తన హయాంలో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు మరిచిపోలేదని, ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. ఈ నినాదం యాదవ్‌లను బాగా ఆకర్షించడంతో ఏకంగా 224 సీట్లు సాధించింది. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ‘న గూండారాజ్.. న భ్రష్టాచార్.. అబ్ కీ బార్ భాజపా సర్కార్’ (గూండారాజ్యం వద్దు..అవినీతిపరులొద్దు.. ఈసారి బీజేపీ ప్రభుత్వం కావాలి) ► అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు, గూండాల ఆధిపత్యం, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ 2017లో బీజేపీ ఈ నినాదాన్ని ఎత్తుకుంది. దీనికి కౌంటర్‌గా ‘యూపీ కీ కంపల్షన్ హై.. అఖిలేశ్ జరూరీ హై’ (యూపీకి ఎస్పీ తప్పనిసరి.అఖిలేశ్ అవసరం చాలా ఉంది) అని ఎస్పీ నినాదం చేసినా అదంతగా పని చేయలేదు. ఫలితంగా బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. ► ఇదివరకు రేషన్‌కార్డులు, పథకాలు ‘అబ్బా జాన్’ అనే వాళ్లకు మాత్రమే అందేవి – యూపీ సీఎం యోగి ► సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ -
యోగితో యూపీలో అభివృద్ధి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే, కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూపీ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఆయన డిజిటల్ ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చకు తెరదించుతూ యోగిని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా రాకపోయి ఉంటే యోగి సారథ్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధిని సాధించి ఉండేదని అన్నారు. కేంద్ర పథకం కింద నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యోగి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇస్తేనే, ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలకు చేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఆగ్రా, మథుర, బులంద్షార్ ఓటర్లనుద్దేశించి ప్రధాని ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. ఈ సారి ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు. యూపీలో బీజేపీ మళ్లీ గెలిస్తే సీఎం అభ్యర్థిని మారుస్తుందా అన్న సందేహాలకు తావు లేకుండా ప్రధాని ప్రసంగం సాగింది. రాష్ట్రంలో మహిళలంతా బీజేపీ మళ్లీ గెలవాలని, యోగి మళ్లీ సీఎం కావాలని నిర్ణయించుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల అవసరాలను గుర్తించలేదని దుమ్మెత్తి పోశారు. యూపీని లూటీ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వారి కుటుంబమే ప్రభుత్వంగా మారితే, బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రమంతా ఒక కుటుంబంలా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా భారత గానకోకిల లతా మంగేష్కర్ కన్నుమూయడంతో యూపీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ హాజరయ్యే ఒక కార్యక్రమంలో ఆదివారం ఉదయం 10:15 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. లత మరణంతో రెండు నిముషాల సేపు నేతలు మౌనం పాటించారు. మేనిఫెస్టో విడుదల కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు. బీజేపీ నేతల ప్రవేశంపై నిషేధం తమ గ్రామంలోకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావొద్దంటూ బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా గున్నౌర్ పరిధిలోని బిచ్పురి సైలాబ్ గ్రామంలో చోటుచేసుకుంది. బీజేపీ శ్రేణుల రాకను గ్రామస్థులు అడ్డుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బోర్డు ఏర్పాటు చేసిన గ్రామపెద్ద నిరంజన్ సింగ్‌ను అరెస్టు చేశారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకు నిరసనగానే ఈ బోర్డు పెట్టినట్లు ప్రజలు చెబుతున్నారు. యూపీలో మామపై కోడలి పోటీ! ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్ జిల్లాలోని తిల్హార్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రోషన్‌లాల్ వర్మపై ఆయన కోడలు సరితా యాదవ్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రీయ సమాజ్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తానని ఆమె చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన వర్మ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ ఆయనకు తిల్హార్ టిక్కెట్ ఇస్తామని ప్రకటించింది. తన మామ రోషన్‌లాల్ వర్మ భూకబ్జాదారుడు అని సరితా యాదవ్ ఆరోపించారు. అసలు సరితా యాదవ్ తన కోడలే కాదని వర్మ చెబుతున్నారు. రాయ్‌బరేలీ స్టార్ ప్రచారకుల్లో లేని సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నాలుగో దశలో ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ స్టార్ ప్రచారకుల జాబితాలో సోనియా పేరు లేకపోవడం గమనార్హం. 30 మంది స్టార్ ప్రచారకుల జాబితాలో రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు ఉన్నారు. పంజాబ్‌లో అన్నదమ్ముల పరస్పర పోటీ పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లాలో ఉన్న మజిథా అసెంబ్లీ స్థానం నుంచి అన్నదమ్ములు వేర్వేరు పార్టీల టిక్కెట్లపై పోటీకి దిగుతున్నారు. తనదే గెలుపు అంటూ ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుఖ్జిందర్రాజ్ సింగ్ అలియాస్ లల్లీ మజీథియా ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై, ఆయన తమ్ముడు జగ్విందర్పాల్ సింగ్ అలియాస్ జగ్గా మజీథియా కాంగ్రెస్ టిక్కెట్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఈసీ కీలక నిర్ణయం.. పార్టీలకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఊరట కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. బహిరంగ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం కొనసాగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇండోర్ లేక బహిరంగ మైదానాల్లో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అందుకు జిల్లా ఎన్నికల పరిశీలకుల అనుమతి తీసుకోవాలని, కోవిడ్ మార్గదర్శకాలు పాటించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండోర్ మైదానాల్లో 50 శాతం, బహిరంగ మైదానాల్లో 30 శాతం సీటింగ్ మేరకు ప్రజలకు అనుమతి ఉంటుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అటు.. ఇంటింటి ప్రచారానికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే చేయాలని సూచించింది. కాగా, ఏడు దశల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల (ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10న మొదలు కానున్నాయి. ఈ దశలో యూపీలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. (చదవండి: సమతామూర్తి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో కాకపెంచిన కేటీఆర్ ట్వీట్) -
Up Assembly Election 2022: ఆ 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలు
ఏ దేశానికేగినా, ఎందుకాలిడినా.. మొదట అడిగేది నీవెక్కడి వాడివోయ్ అనే! అలా చెప్పుకోవడానికి అస్తిత్వమే లేకపోతే.. మనకంటూ ఓ ఊరు, ఓ ఉనికే లేకపోతే... ఎంతో దుర్భరంగా ఉంటుంది కదా! తమ పూర్వీకుల తాలుకూ ఇళ్లు,, జ్ఞాపకాలు నదీగర్భంలో కలిసిపోతే... రచ్చబండ, చేదబావి, ఊరిచెరువు... ఈతపళ్లు... ఈ జ్ఞాపకాలన్ని కనుమరుగైపోతే... మెరుగైన జీవనానికంటూ పట్టణాలకు పరుగులు పెడుతున్న నేటి కుర్రకారుకు వాటి విలువ తెలియకపోవచ్చు.. కానీ మట్టిలో ఆడి.. ఎండిన చెరువుల మడుల్లో పాపెర్లు పట్టిన చిట్టి చేతులకు తెలుసు అవెంతటి విలువైన జ్ఞాపకాలో... నా పల్లెకేమైందని... గొంతుకేదో అడ్డం పడుతోంది.. మాట పెగలట్లేదు! మార్పు ఓ నిరంతర ప్రక్రియ. కొత్తనీరు వచ్చి నపుడు పాతనీరు కొట్టుకుపోతుంది. అభివృద్ధి జరగాల్సిందే కానీ... ఉన్న గతాన్నంతా ఊడ్చేసి మాత్రం కాదు. పుట్టిన ఊరితో, పెరిగిన వీధితో, చెడ్డీ దోస్తులతో పెనవేసుకున్న బంధాలు మాత్రం ఎన్నేళ్లయినా... ఎంత ఎత్తుకు ఎదిగినా... గుండెను తడుముతూనే ఉంటాయి. ఒక్కసారైనా ఊరెళ్లి మనోళ్లందరినీ కలిసి రావాలని మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర్ జిల్లా దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలుగా మారాయి. దీంతో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉన్న ఈ 11 గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఏమాత్రం కనిపించట్లేదు. సోన్‌భద్ర్‌లో నిర్మిస్తున్న కన్హర్ డ్యామ్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ అయిన దుద్ధి నియోజకవర్గంలో అప్నాదళ్ (సోనేలాల్)కు చెందిన హర్ ఇరాం బీఎస్పీ అభ్యర్థిపై 1,085 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా 8,522 మంది ప్రజలు నోటాకే మొగ్గు చూపారంటే పరిస్థితి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు రూ.2,700 కోట్లతో నాలుగు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న కన్హర్ డ్యామ్‌ను వచ్చే ఏడాది కల్లా సిద్ధం చేసేందుకు కొన్నేళ్లుగా చర్యలు వేగవంతం అయ్యాయి. సోన్‌భద్ర్ జిల్లాలోని అమ్వార్ గ్రామంలో పాగన్ నది, కన్హర్ నది సంగమం వద్ద జరుగుతున్న డ్యామ్ నిర్మాణంతో సిందూరి, భీసూర్, కోర్చి గ్రామాలతో పాటు కలిపి మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో పరిహారం, పునరావాసం విషయంలో తాము చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరూ సహకరించట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చదవండి: (మీసం మెలేసేది రైతన్నే!) కన్హర్ డ్యామ్ కోసం 1976 నుంచి 1982 వరకు ప్రజల నుంచి భూమిని తీసుకుని ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. అయితే 1984లో ఆనకట్ట పనులు ఆగిపోవడంతో ప్రజలు ఎవరూ గ్రామాలు ఖాళీ చేయలేదు. కాగా ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కన్హర్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 65% భూసేకరణ పూర్తయిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2023 వర్షాకాలానికి ముందే ఈ మెయిన్ డ్యాంలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాంతో ఈసారి ఈ 11 గ్రామాలకు చెందిన ప్రజలు బరువెక్కిన గుండెతో కన్నీటి బొట్టునే చూపుడు వేలిపై సిరా చుక్కగా మలచుకొని... తమదిగా చెప్పుకోగలిగే ప్రాంతంలో ఆఖరిసారిగా ఓటేసి... తట్టాబుట్టా సర్దుకొని తలోవైపు వెళ్లిపోనున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
యూపీలో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ అభ్యర్థులపై దేశద్రోహం కేసులు
బిజ్నోర్, వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి నీరజ్ చౌదరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన బిజ్నోర్ స్థానం నుంచి బరిలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం నీరజ్ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉండగా ఆయన వెంట ఉన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పోలీసులు శనివారం చెప్పారు. శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసినందుకు గాను నీరజ్ చౌదరితోపాటు మరో 20–25 మందిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 295ఏతో పాటు పలు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంటువ్యాధుల చట్టం కింద కూడా కేసు పెట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. సంబంధిత ఆడియో, వీడియో క్లిప్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తామని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిపై దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకీఫ్ భాయ్ జిందాబాద్ అని నినదించినా కొందరికి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్లుగా వినిపిస్తోందని శనివారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. తప్పుడు వీడియోలు సృష్టించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైద్యుడు, పెద్దమనిషి అయిన నీరజ్ చౌదరిని ద్రోహిగా చిత్రీకరిస్తుండడం దారుణమని జయంత్ చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై...: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌పై పోలీసులు శనివారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన జనవరి 31న రాజేతరా గ్రామంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్న పోలీసులు అజయ్ రాయ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 269, 153, 153ఏ, 188 కింద కేసు పెట్టారు. -
మీసం మెలేసేది రైతన్నే!
దుక్కి దున్ని.. నారు పెట్టి.. నాగలి పట్టిన రైతన్నే ఉత్తరప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి మీసం మెలేస్తున్నాడు. పోటీకి సై అంటున్నాడు. చట్టాల రూపకల్పనలో తనకూ భాగస్వామ్యం కావాలని గొంతెత్తున్నాడు. తనను పక్కనపెట్టినా, తక్కువ చేసినా తగ్గేదేలే అని హెచ్చరిస్తున్నాడు. సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం తర్వాత యూపీ రాజకీయాల్లో పెరిగిన రైతుల పాత్ర ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలున్నాయి. అక్కడంతా రైతు ఎజెండా, రైతు నేతల మద్దతు చుట్టూతే రాజకీయం గిర్రున తిరుగుతోంది. యూపీ జనాభాలో 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రతి సీటు గెలుపులోనూ వీరిపాత్రే కీలకంగా ఉండనుంది. ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రైతులను చట్టసభలకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. గ్రామీణ జనాభా ఉన్న ప్రాంతాల్లో సుమారు 250కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉండటంతో రైతు నేపథ్యం గల రాజకీయ నేతలను పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే వివిధ రంగాలకు చెందిన వారిలో రైతులే ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీకి వెళ్తున్నారు. గత 2017 ఎన్నికల్లో చట్టసభలో ఏకంగా 161 మంది రైతులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇందులో వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న ఎమ్మెల్యేలు 90 మందికి పైగా ఉండడం విశేషం. రైతుల తర్వాత అధిక సంఖ్యలో వ్యాపారులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు చట్టసభల్లో ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పార్టీలు ప్రకటించిన జాబితాల్లో 45శాతం మంది రైతులు ఉన్నారని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. రైతు ఎజెండాతోనే రాజకీయం మరోవైపు యూపీ ఎన్నికల్లో రైతు అజెండాతోనే రాజకీయ పార్టీలు బాహాబాహీకి దిగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలు, వాటిపై యూపీ రైతుల నుంచే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం కావడం, పుండుపై కారం చల్లినట్లుగా లఖీమ్‌పూర్ ఖేరీ ఘటన చోటుచేసుకోవడం, ఈ ఘటనకు బాధ్యుడైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌మిశ్రా తేనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం వంటి అంశాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకతను తప్పించుకునేందుకు బీజేపీ తమ ప్రభుత్వం చేసిన రైతు అనుకూల చర్యలను పదేపదే వల్లెవేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం రూ.36 వేల కోట్ల రుణాలు అందించామని, పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.2.21 కోట్ల మంది రైతులను చేర్చి ఇప్పటికే 28 లక్షల మందికి రూ.2,400 కోట్లు పరిహారం అందించామని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక పీఎం కిసాన్ కింద యూపీ రైతులకు రూ.41 వేల కోట్లు జమ అయ్యాయని, ఎరువుల బస్తాల ధరలను రూ.2,400 నుంచి రూ.1200కి తగ్గించిందని తమ ప్రచారాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోపక్క ఇటీవల జాట్ నేతలతో సమావేశం అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతులకు రూ.36 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, చెరకు రైతులకు రూ.1.40 లక్షల కోట్ల చెల్లింపులు చేశామని చెబుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక వెనుకబడ్డ బుందేల్‌ఖండ్ ప్రాంతానికి తాగు, సాగునీటి వసతిని పెంచేలా కెన్–బెత్వా నదుల అనుసంధానానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. మరోపక్క రైతుల్లో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని సమాజ్‌వాదీ పార్టీ–ఆర్ఎల్డీ కూటమి తన అస్త్రంగా మలుచుకుంటోంది. రైతులపై నమోదు చేసిన కేసులు, చనిపోయిన వారికి పరిహారం ఇవ్వకపోవడంపై ప్రశ్నలు సంధిస్తోంది. తాము అధికారంలోకి వస్తే 15 రోజుల్లో కేసులను మాఫీ చేయడంతోపాటు చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీనికితోడు చెరకు రైతులకు బకాయిల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, బీమా సౌకర్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇందులో ఎవరి హామీలు, ఎవరి మాటలను రైతులు నమ్ముతారన్నది బ్యాలెట్ తేల్చనుంది. బీజేపీకి కంట్లో నలుసుగా.. అధికార బీజేపీకి రైతు సంఘాల ప్రతినిధులు కంట్లో నలుసులా తయారయ్యారు. పంటలకు కనీస మద్దతు ధరపై తాజా కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడం, రైతు నేతలపై కేసుల ఉపసంహరణకు సంబంధించి నాన్చుడు ధోరణితో విసుగు చెందిన రైతు సంఘాల నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ధోరణి ఇక చెల్లదని, హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని విభజించి ఓట్లు కొల్లగొట్టే రాజకీయాలు పనిచేయవని రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించే వారికే ప్రజలు పట్టం కడతారని తేల్చిచెప్పారు. ’మిషన్ యూపీ’ ద్వారా రైతు వ్యతిరేక పాలనకు గుణపాఠం చెబుతామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఇటీవల వెల్లడించారు. ఈ ప్రకటనలు ఎంతమేర ప్రభావం చూపుతాయన్న దానిపై రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. – సాక్షి, న్యూఢిల్లీ -
‘జెడ్’ భద్రత వద్దన్న ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పెరిగిపోతున్న రాడికలిజానికి ముగింపు పలకాలన్నారు. తనపై జరిగిన బుల్లెట్ దాడికి యూపీ ఓట్లరు బ్యాలెట్‌తో బదులిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ‘‘నాకు జెడ్ కేటగిరీ రక్షణ వద్దు. మీ అందరితో సమానంగా ఎ కేటగిరీ పౌరునిగా బతికే అవకాశం కల్పిస్తే చాలు. రెండుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ అయిన నాపై కేవలం ఆరడుగుల దూరం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. నేను పుట్టింది ఈ భూమ్మీదే. చచ్చినా ఔరంగాబాద్ గడ్డ మీదే పూడుస్తారు. కాల్పులకు భయపడను. బుల్లెట్ తాకినా ఇబ్బంది లేదు గానీ ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు. స్వతంత్రుడిగా బతకాలనుకుంటున్నా. నేను బతకాలంటే నా మాట బయటకు రావాల్సిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. దేశంలోని మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాలకు భద్రత లభిస్తే నాకు లభించినట్లే’’ అన్నారు. దేశ ప్రధాని భద్రతలో వైఫల్యం తలెత్తినప్పుడు ఇతర విపక్షాల కంటే ముందు తానే దాన్ని తప్పుపట్టానని గుర్తు చేశారు.‘‘నాపై దాడి చేసిన వారికి బుల్లెట్‌పైనే తప్ప ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదు. ఫేస్బుక్లో ఎవరైనా ఒక క్రికెట్ జట్టును అభినందిస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (యూఏపీఏ) ప్రయోగిస్తున్నారు. నాపై దాడి చేసిన వారిపై ఎందుకు ప్రయోగించరు? తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఎందుకు ప్రయోగించరు’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీని ఇప్పటికే అసద్ కోరారు. గురువారం ఉత్తర యూపీలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఒవైసీ కారుపై కాల్పులు జరగడం తెలిసిందే. ‘‘ఈ నేపథ్యంలోనే ఒవైసీకి ఉన్న ముప్పు స్థాయిని పునఃసమీక్షించి, జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించాం. సీఆర్పీఎఫ్ అధికారులు ఒవైసీ నివాసానికి వెళ్లి ఈ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేస్తారు’’ అని కేంద్ర హోం శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇద్దరి అరెస్టు ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గౌతంబుద్ధ నగర్‌కు చెందిన సచిన్‌గా, మరొకరిని సహరన్‌పూర్‌కు చెందిన శుభంగా గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఒవైసీ, ఆయన పార్టీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కోపంతోనే దాడికి పాల్పడ్డట్టు విచారణలో వారు చెప్పారన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వీరిని పట్టుకున్నాం. ఒక మారుతి ఆల్టో కారు, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నాం. పలు పోలీసు బృందాలు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి’’ అని వివరించారు. కాల్పులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ప్రకటన చేస్తారని మరో మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అసద్‌పై కాల్పులను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపందల మతిలేని చర్య. అసద్ భాయ్! మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం’’ అని ట్వీట్ చేశారు. జెడ్ కేటగిరీ అంటే... ► ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీని పక్కన పెడితే జెడ్ ప్లస్ తర్వాత మన దేశంలో రెండో అత్యున్నత స్థాయి భద్రత జెడ్ కేటగిరీ ► అధిక ముప్పున్న నాయకులు, ప్రముఖులకు కేంద్రం ఈ భద్రత కల్పిస్తుంది ► సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటల పాటూ రక్షణగా ఉంటారు ► 16 నుంచి 22 మంది షిఫ్టుల్లో పని చేస్తారు ► రోడ్డు ప్రయాణాల్లో ఒక ఎస్కార్ట్, మరో పైలట్ వాహనం సమకూరుస్తారు ► ఈ భద్రతకు నెలకు రూ.16 లక్షలకు పైగా ఖర్చవుతుంది చదవండి: ఒవైసీపై దాడి.. కేంద్రం కీలక నిర్ణయం చదవండి: (అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు) -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా సమక్షంలో సీఎం యోగి నామినేషన్
UP Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కీలక నేతల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే.. గతంలో ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా పని చేసిన యోగి.. ఎమ్మెల్సీ కోటాలో యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే ముందు గోరఖ్‌నాథ్ టెంపుల్లో పూజల్లో పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో మంత్రి అమిత షా ర్యాలీ నిర్వహించారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో ముఠాలను యోగి తుడిచిపెట్టారని గర్వంగా చెప్తున్నా. పాతికేళ్ల తర్వాత యూపీలో న్యాయబద్ధంగా పాలన నడుస్తోంది. యోగి నాయకత్వంలో యూపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ’ అని షా అన్నారు. #WATCH | Accompanied by Union Home Minister Amit Shah, Uttar Pradesh CM Yogi Adityanath files nomination papers as a BJP candidate from Gorakhpur Urban Assembly constituency pic.twitter.com/BYzpDtVmlS — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 4, 2022 -
‘తక్కువ’ మెజార్టీ.. సగానికి తగ్గింది!
యూపీలో కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోరు నడుస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్, పలు చిన్న పార్టీలు ఎటూ రంగంలో ఉంటాయి. దాంతో చాలా సెగ్మెంట్లలో అతి తక్కువ మెజారిటీ నమోదవడం ఆనవాయితీగా వస్తోంది. 1985 నుంచి 2012 దాకా చూస్తే సగటున ఏకంగా 150 సీట్లలో 5 శాతం కంటే తక్కువ మెజారిటీ నమోదైంది. 2012లో ఈ సంఖ్య 170కి చేరింది. అలాంటిది, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఈ సంఖ్యను సగానికి, అంటే 80కి తగ్గించగలిగింది. మోదీ మ్యాజిక్, యోగి కరిష్మా కలిసొచ్చి అగ్రవర్ణాలతో పాటు ఓబీసీ ఓట్లనూ కొల్లగొట్టి ఏకంగా 40 శాతం ఓట్లు, రికార్డు స్థాయిలో 312 సీట్లు సాధించడమే ఇందుకు కారణం. 159 బీజేపీ అభ్యర్థుల మెజారిటీ 15 శాతం దాటింది. కేవలం 38 మంది మాత్రం గట్టి పోటీ ఎదుర్కొని 5 శాతం కంటే తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘నేనెవరికీ భయపడి సీటు మారలేదు’
లక్నో: భారతీయ జనతా పార్టీ కిందటిసారి.. 2017 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి 312 (మొత్తం 403) చోట్ల నెగ్గి ఉండొచ్చుగాని.. కానీ ప్రస్తుతం యూపీలో యోగి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఇటీవలే బీజేపీని వీడి... సమాజ్‌వాదీ పార్టీలో చేరిన మాజీ మంత్రి, ప్రముఖ ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) నేత స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఉన్న బలం 47 సీట్లు మాత్రమేనని... మార్చి 10 (ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ) తర్వాత జరగబోయేది అదేనని స్వామి ప్రసాద్ మౌర్య జోస్యం చెప్పారు. మరో ఇద్దరు ఓబీసీ మంత్రులు దారాసింగ్ చౌహాన్, ధరమ్‌సింగ్ సైనీ, ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి గుడ్‌బై చెప్పడం యూపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో ఎస్పీకి అనుకూలంగా ఓబీసీ సామాజికవర్గాల పునరేకీకరణ విజయవంతంగా జరుగుతోందనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన 68 ఏళ్ల ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఇంటర్వ్యూ క్లుప్తంగా... ప్రశ్న:ఓబీసీలు పూర్తిగా ఎస్పీవైపు మళ్లినట్లేనా? జవాబు: మార్చి 10న ఎన్నికల ఫలితాలు వచ్చాక ఓబీసీలు ఎటువైపు ఉన్నారనేది బీజేపీకి బాగా తెలిసొస్తుంది. ప్రశ్న: సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. దీనిపై మీరేమంటారు? జవాబు: నేను సిద్ధాంతాలను నమ్ముకున్న వాడిన. పేదల బాగోగుల గురించి ఆలోచించే వాడిని. దళితులు, వెనుకబడినవర్గాల ప్రయోజనాలే నాకు ముఖ్యం. వీటికే నా ప్రాధాన్యం తప్పితే... నా రాజకీయ ఆకాంక్షలు, కెరీర్‌ను అంతగా పట్టించుకోను.అయినా డిప్యూటీ సీఎం ఎవరు, మంత్రులెవరు అనేది ప్రస్తుతం చర్చించాల్సిన అంశం కాదు. బీజేపీ విభజన రాజకీయాలను తిప్పికొట్టి... కమలదళాన్ని అధికారానికి దూరంగా ఉంచడమనేదే అన్నింటికంటే ముఖ్యం. ప్రశ్న: కాంగ్రెస్‌లో నుంచి ఇటీవలే బీజేపీలోకి చేరిన ఆర్పీఎన్ సింగ్‌కు బయపడే మీరు సొంత నియోజకవర్గమైన ‘పద్రౌనా’ను వదిలి కుషీనగర్ జిల్లాలోని ఫాజిల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మారారా? జవాబు: నేను ఎక్కడి నుంచి పోటీచేయాలనేది ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. అంతేతప్ప ఆర్పీఎన్ సింగ్ బయపడి సీటు మారలేదు. (స్వామి ప్రసాద్ మౌర్య, ఆర్పీఎన్ సింగ్‌ల మధ్య దశాబ్దాల రాజకీయ వైరముంది) ఫాజిల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరో విడతలో భాగంగా మార్చి 3 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రశ్న: బీజేపీ ‘సబ్కా సాథ్... సబ్కా వికాస్’ అంటూ సమాజంలోని అన్ని వర్గాల వారినీ కలుపుకొని వెళతామని నమ్మబలుకుతోంది? జవాబు: అందరినీ కలుపుకొనే వెళతారు... కాకపోతే ముందుకెళ్లిన కొద్దీ పథకం ప్రకారం ఒక్కొక్కరినీ దెబ్బకొట్టేస్తారు. అందరి ప్రయోజనాలనూ కాపాడతామంటారు... ఆచరణకు వచ్చేసరికి వారికి కావాల్సిన కొందరి ప్రయోజనాలనే బహు జాగ్రత్తగా కాపాడతారు. ప్రశ్న: మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణను ఎలా చూస్తారు? జవాబు: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే అసలది సాధ్యమయ్యేదే కాదు. వారికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే.. ఉపసంహరణకు ముందే అన్నదాతలతో ఎందుకు చర్చించలేదు? -
పదేళ్లు కావొస్తున్నా.. మానని గాయం!
తొలి దశ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ యూపీలో (ఈ నెల 10న 58 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది)ని ముజఫర్నగర్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2013 అల్లర్ల తర్వాత నుంచి ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ ప్రాంతం రాజకీయ విమర్శలకు, కులాల సమీకరణకు అడ్డాగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో తమ సత్తా చాటేందుకు ఓ వైపు బీజేపీ, మరోవైపు ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఒకరిపై ఒకరు వేస్తున్న నిందలు, అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఇక్కడి రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ముస్లింలు అధికంగా ఉండే ఈ నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీలు ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని బరిలో నిలపకపోవడం, రెండు పార్టీలు జాట్లు, రైతులను ఆకర్షించే ప్రణాళికలతోనే ముందుకెళుతుండటంతో ఎన్నికలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఆగస్టు 17..చరిత్ర మరవని రోజు.. ఉత్తర్‌ప్రదేశ్ చరిత్రలోనే 2013 ఆగస్టు 27 అత్యంత దుర్దినంగా గుర్తిండుపోతుంది. ఆ రోజున జిల్లాలోని కవాల్ గ్రామంలో జరిగిన వేధింపుల అంశం మతపరమైన మలుపు తిరిగి అనేక ఉద్రిక్తతలకు కారణమైంది. అప్పటి అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఓ వర్గానికి చెందిన కొందరు యువకులను విడుదల చేయడంపై మరోవర్గం ఆగ్రహాల కారణంగా అల్లర్లు రేగాయి. క్రమంగా వ్యాపించిన ఈ అల్లర్ల కారణంగా 60 మందికి పైగా మరణించారని మీడియా కథనాలు చెబుతున్నాయి. చాలామంది మహిళలపై కొన్ని చోట్ల అకృత్యాలు చోటుచేసుకున్నాయి. ఈ భయానక అల్లర్లను నిలువరించేందుకు జిల్లాలో ఏకంగా సైన్యాన్నే మోహరించాల్సి వచ్చింది. అల్లర్లలో 100 మందికి పైగా అరెస్టయ్యారు. 50 వేల మందికిగాపైగా నిరాశ్రయులయ్యారు. ఇలాంటి ముజఫర్‌నగర్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు ముజఫర్‌నగర్ సదర్, పుర్కాజీ, చార్తావాల్, బుధానా, ఖతౌలీ, మీరాపూర్లలో ఈ నెల 10న పోలింగ్ జరుగనుంది. అత్యంత సున్నిత ప్రాంతంగా పరిగణించే ఈ జిల్లాకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ 50 ఫ్లాటూన్ల కేంద్ర బలగాలను పంపింది. ఎస్పీ ఎర్రటోపీని హిందువుల రక్తంతో అద్దారు.. ఇక హిందూత్వ ఎజెండాతో 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 312 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లోనూ ప్రధానంగా ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రస్తావిస్తోంది. అఖిలేశ్ హయాంలో జరిగిన అల్లర్లనే పదేపదే గుర్తు చేస్తున్న బీజేపీ ఎస్పీ నేతలు ధరించే ‘ఎర్రటోపీ’ని టార్గెట్ చేసింది. ‘ఎస్పీ పార్టీ నేతల టోపీలు రామభక్తుల రక్తంతో అద్దబడ్డాయి. అలాంటి వారికి ఓటెయ్యాలా’ అని ఓ వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనా«థ్లు విరుచుకుపడుతున్నారు. అల్లరిమూకల ఆటకట్టించాలంటే బీజేపీకే ఓటెయ్యాలని అర్థిస్తున్నారు. ఇక మరోపక్క గత ఎన్నికల మాదిరే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనే హిందూ అభ్యర్థులనే బరిలో దింపిన బీజేపీ, జాట్, రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. 2013 అల్లర్ల అనంతరం ముస్లిం–జాట్ల మధ్య సాన్నిహిత్యం పూర్తిగా దెబ్బతింది. దీన్ని ఆసరా చేసుకొనే 2014 పార్లమెంట్, 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఆర్ఎల్డీ–ఎస్పీ కూటమి నేపథ్యంలో జాట్లు ఎస్పీ వైపు మళ్లకుండా గత ఉదంతాలను జాట్లకు గుర్తుచేస్తోంది. స్నేహబంధాన్ని పునర్నిర్మించే పనిలో ఎస్పీ మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ముస్లిం–జాట్ల మధ్య స్నేహబంధాన్ని పునర్నిర్మించే పనిలో పడింది. జన్ పరివర్తన్ ర్యాలీల ద్వారా రెండు వర్గాలను కలిపేందుకు అఖిలేశ్ చేసిన కృషి ఫలించి ఆర్ఎల్డీతో దోస్తీ కుదిరింది. ఇక జిల్లాలో 41 శాతం ముస్లింలు ఉన్నప్పటికీ హిందువుల ఓట్లు ఏకపక్షంగా బీజేపీవైపు సంఘటితంగా కాకుండా... అన్ని స్థానాల్లోనూ కూటమి తరఫున హిందూ అభ్యర్థులనే రంగంలోకి దింపింది. అయితే సీట్ల సర్దుబాటు, టికెట్ల అంశం ఎస్పీకి కొత్త తలనొప్పులు తెచ్చింది. ముజఫర్‌నగర్ సదర్, మీరాపూర్, పుర్కాజీ,ఖతౌలీ స్థానాల్లో ఆర్ఎల్డీ గుర్తుపై ఎస్పీ తమ నేతలనే బరిలోకి దింపింది. దీనిపై ఆర్ఎల్డీ జాట్ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీనికి తోడు పార్టీలో కీలక ముస్లిం నేతలైన ఖాదీర్ రాణా, ముర్సలిన్ రాణా, లియాఖత్ అలీలకు ఎస్పీ టికెట్లు ఇవ్వలేదు. దీంతో ముస్లింలలోనూ అసంతృప్త జ్వాలలు రేగాయి. వీటిని చల్లార్చుతూనే జాట్ల ఓట్లలో చీలిక రాకుండా అఖిలేశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి తోడు రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ సైతం ఈ జిల్లాకు చెందినవాడే. ముజఫర్‌నగర్‌లో ఆయన ఇళ్లు ఉంది. బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న ఆయన తొలినుంచీ ఆర్ఎల్డీ, ఎస్పీ పోరాటాలకు మద్దతిస్తున్నారు. దివంగత ప్రధాని, కిసాన్ నేత చౌదరీ చరణ్‌సింగ్ జయంతి కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో చెరకు రైతుల్లో ఓ వర్గం ఎస్పీ కూటమికి మద్దతుగా ఉంది. ఎస్పీ ప్రకటించిన చెరకు రైతు బకాయిలు రూ.2,500 కోట్లను ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లో చెల్లిస్తామన్న ప్రకటన బలంగా పనిచేస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం!
ఘజియాబాద్: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. తనను లక్ష్యంగా చేసుకొని సాగించిన కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ చెప్పారు. కాల్పుల వ్యవహారంపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని హపూర్ పోలీసులు తెలిపారు. మీరట్ జోన్ ఐజీ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. యూపీలో మరో వారం రోజుల్లో మొదటి దశ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఒవైసీపై హత్యాయత్నం చోటుచేసుకోవడం సంచలనాత్మకంగా మారింది. కాల్పుల వెనుక ఎవరున్నారో తెలియాలి ఎన్నికల ప్రచారం కోసం అసదుద్దీన్ ఒవైసీ గురువారం ఉదయమే ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. మీరట్, కిఠోరిలో తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కాన్వాయ్‌లో నాలుగు కార్లు ఉన్నాయి. ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఛిజార్సీ టోల్గేట్ వద్ద తన కారుపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ముగ్గురు నలుగురు పాల్గొన్నారని అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ఆయుధాలు అక్కడే వదిలేసి పారిపోయారని తెలిపారు. తన కారు టైర్ పంక్చర్ కావడంతో మరో వాహనంలో వెళ్లిపోయానని చెప్పారు. తామంతా క్షేమంగా ఉన్నామని, అల్లాకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. టోల్గేట్ వద్ద కారు వేగం తగ్గిందని, అకస్మాత్తుగా మూడు నాలుగు రౌండ్లు తుపాకీ మోతలు వినిపించాయని ఒవైసీ మీడియాతో చెప్పారు. టైర్ పంక్చర్ కావడంతోపాటు కారుపై బల్లెట్ గుర్తులు కనిపించాయన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారో కచ్చితంగా తెలియాలని అన్నారు. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీతోపాటు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. మరో దుండగుడి కోసం గాలింపు కాల్పులపై ఒవైసీ ట్వీట్ చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, విచారణ ప్రారంభించారని అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారని చెప్పారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని సేకరించారని, ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అందులో కనిపిస్తోందని వివరించారు. వారిని ఒకరిని గౌతమ్‌బుద్ధనగర్ జిల్లా బాదల్పూర్ వాసి సచిన్‌గా గుర్తించి, అరెస్టు చేశామని తెలిపారు. అతడి వద్ద చట్టవిరుద్ధంగా ఉన్న పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాల్పుల వెనుక గల అసలు కారణాలను శోధిస్తున్నామని ఉద్ఘాటించారు. కాల్పుల్లో పాల్గొన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కా ల్పుల సమాచారం తెలియగానే ఎంఐఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉలిక్కిపడ్డ హైదరాబాద్ పాతబస్తీ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరగడంతో హైదరాబాద్ పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల గురించి ప్రచార, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం కావడంతో కలకలం రేగింది. ఆందోళనకు గురైన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమాచారం తెలుసుకునేందుకు దారుస్సలాంకు పరుగులు తీశారు. కారుపై బుల్లెట్ల గుర్తులు ‘బీజేపీని శిక్షించండి’ న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి గుణపాఠం చెప్పాల్సిందిగా ఆ రాష్త్ర రైతులకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) గురువారం పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు 57 రైతు సంఘాలు కూడా మద్దతిచ్చాయి. రైతుల డిమాండ్లను పట్టించుకోకపోవడం ద్వారా వారికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ దుయ్యబట్టారు. అయితే ఫలానా పార్టీకి ఓటెయ్యాలని చెప్పడం మోర్చా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మా పాలనలో మతకలహాల్లేవు! లక్నో: తమ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఉత్తరప్రదేశ్‌లో ఒక్కమారు కూడా మత ఘర్షణలు జరగలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. గత ప్రభుత్వాల హయంలో భారీగా మతకలహాలు జరిగేవని సమాజ్‌వాదీపై విమర్శలు గుప్పించారు. బీఎస్పీ హయాంలో 364, ఎస్పీ హయంలో 700 మత ఘర్షణలు జరిగాయని, వీటిలో వందలమంది మరణించారని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోందన్నారు. कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih — Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022 చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..) -
కీలక నేత మౌర్య.. ఈయన కూడా చాయ్‌వాలానే!
ఆరెస్సెస్ మూలాలు, రామమందిరం, గో సంరక్షణ కోసం పోరాటం, ఓబీసీ కులం కార్డు ఇవన్నీ కలిపి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను రాష్ట్ర బీజేపీలో శక్తిమంతుడిగా మార్చాయి. గత ఎన్నికల్లో సీఎం కావల్సిన వ్యక్తికి ఆఖరి నిమిషంలో పదవి చేజారిపోయింది. ఇప్పుడు ఇతర కీలక ఓబీసీ నేతలు పార్టీని వీడడంతో అంతా తానై వ్యవహరిస్తున్నారు. బీజేపీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ ఎంత ముఖ్యమో, ఓబీసీ వర్గాల్లో, పార్టీలో మంచి పట్టున్న మౌర్య కూడా అంతే ముఖ్యం. అందుకే ఇద్దరి మనసు నొప్పించకుండా, కలుపుకొని ముందుకు వెళుతోంది కమలదళం. గత ఎన్నికల్లో ఏకంగా 200 ర్యాలీలు నిర్వహించి పార్టీ గెలుపులో కీలకంగా మారిన మౌర్య ఈసారి కూడా ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై నడిపిస్తున్నారు. యాదవేతర ఓబీసీ ఓట్లను సంఘటితం చేసే ప్రధాన బాధ్యతను తీసుకొని అందులో విజయం సాధించారు. రాష్ట్రంలో 45% మంది ఓబీసీలు ఉంటే యాదవులు మొదట్నుంచీ ఎస్పీ వైపే ఉన్నారు. మిగిలిన ఓబీసీలందరూ బీజేపీ వైపు ఆకర్షితులు కావడంతో ఆ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లతో ఘన విజయం సాధించింది. అప్పట్లో యూపీ సీఎం పదవి మౌర్యకే దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రావడంతో మౌర్యకి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్నారు. 2019లో యోగి ఆదిత్యనాథ్‌కు అత్యంత సన్నిహితుడు, ఓబీసీ నాయకుడు స్వతంత్రదేవ్ సింగ్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించడాన్ని మౌర్య జీర్ణించుకోలేకపోయారు. అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్నప్పటికీ ఆరెస్సెస్ జోక్యంతో యోగి, మౌర్య మళ్లీ ఒక్కటయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఓబీసీ నాయకులు స్వామి ప్రసాద్ మౌర్య సహా పలువురు ఎస్పీ బాట పట్టడంతో బీజేపీలో ఓబీసీలకు పెద్ద దిక్కుగా మారారు. టికెట్ల పంపిణీలో బీజేపీ నాయకత్వం మౌర్య చెప్పిన మాటకు అధిక ప్రాధాన్యాన్నే ఇచ్చింది. ఎస్పీ బాట పట్టిన ఓబీసీ నాయకులు కూడా కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యక్తిత్వాన్ని గొప్పగా చెబుతారు. బీజేపీలో ఆయనకి అన్యాయం జరుగుతోందని, నిస్సహాయంగా ఉండిపోయారని కామెంట్లు చేస్తూ ఉంటారు. చాయ్‌వాలా కేశవ్‌ప్రసాద్ మౌర్య మృదుభాషి. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నవారు. వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలాగే చిన్నప్పుడు తన తండ్రి శ్యామ్‌లాల్ మౌర్యతో కలిసి టీ అమ్మేవారు. పేపర్ బాయ్‌గా పని చేశారు. ఇంటర్మీడియట్ చదివారు. అది కూడా గుర్తింపు లేని కళాశాలలో చదవడంతో ఆయన విద్యార్హతలపై వివాదాలున్నాయి. సహచర ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతారు. మొదట్నుంచీ యూపీలో పార్టీని పటిష్టపరచడానికి పని చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్లో ఎవరికి విలువ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు యోగి, ఇటు మౌర్య ఎవరినీ వదలుకోలేని స్థితిలో పార్టీ కొట్టుమిట్టాడింది. అప్పుడు స్వయంగా ఆరెస్సెస్ రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక మెట్టు దిగి స్వయంగా మౌర్య ఇంటికి వెళ్లి మాట కలిపారు. సంఘ్ అగ్రనాయకుల సమక్షంలో ఇద్దరూ రాజీకి రావడంతో బీజేపీ కేడర్ ఊపిరిపీల్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలోని సిరాథు గ్రామంలో 1969 మే 7న జన్మించారు. యుక్త వయసులోనే ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో సభ్యునిగా ఉన్నారు. గో సంరక్షణ, రామజన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజకుమార్ మౌర్యను పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2002లో తొలిసారిగా బాందా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తే కేవలం 204 ఓట్లు వచ్చాయి. 2007లో రెండోసారి అలహాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు 2012లో ముచ్చటగా మూడోసారి సిరాథు నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి ఆనంద్ మోహన్‌పై 9 వేల ఓట్లతో విజయం సాధించారు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పోలయిన ఓట్లలో 52 శాతం ఓట్లు సాధించి రికార్డ్ సృష్టించారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రముఖ ఓబీసీ నాయకుడిగా ముందుండి నడిపించారు. మరే నాయకుడు చేయలేని విధంగా 200 ర్యాలీలు చేపట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
26 ఏళ్లుగా గెలవని కాంగ్రెస్!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో పెద్ద జిల్లాల్లో ఒకటైన ఆగ్రాలో ఆధిపత్యం సాధించేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. జాటవ్, బ్రాహ్మణ, ఠాకూర్, జాట్, ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలోని 9 నియోజకవర్గాలను మరోమారు క్లీన్‌స్వీప్ చేసేందుకు అధికార బీజేపీ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుండగా, 30 ఏళ్ల తమ పార్టీ చరిత్రలో ఒకేఒక్కసారి ఒకేఒక్క సీటును గెలుచుకున్న ఎస్పీ ఈ మారు చరిత్ర తిరిగిరాసే యత్నాల్లో మునిగింది. యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న ఆగ్రాలో ఆగ్రా కాంట్, ఆగ్రా నార్త్, ఆగ్రా రూరల్, ఆగ్రా సౌత్, బాహ్,ఎత్మాద్పూర్,ఫతేహాబాద్, ఫతేపూర్‌సిక్రీ, ఖేరాఘర్ నియోజకవర్గాలున్నాయి. బాహ్ పరిధిలో బ్రాహ్మణ ఓటర్లు అధికంగా ఉండగా, రెండో స్థానంలో ఠాకూర్లు ఉన్నారు. ఫతేపూర్‌సిక్రీ, ఖేరాఘర్, ఎత్మాద్పూర్లో బ్రాహ్మణ, ఠాకూర్ల ఆధిపత్యం ఉన్నప్పటికీ మల్లాలు,కుష్వాహా, జాటవ్, వాల్మీకిలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. తొలినుంచీ బీఎస్పీదే ఆధిపత్యం... జిల్లాలో ఏకంగా 21శాతం మంది ఎస్సీ కులాలకు చెందిన వారే కావడం, ఇక్కడి పాదరక్షల పరిశ్రమల్లో పని చేసే వారంతా బీఎస్పీ అధినేత్రి మాయావతి కులానికి చెందిన జాటవ్లే కావడం, దళిత–బ్రాహ్మణ ఫార్ములా విజయవంతం కావడంతో ఇక్కడ బీఎస్పీ హవా తొలినుంచీ ఉంది. 2007లో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో ఆగ్రాల్లో 6 స్థానాలను గెలుచుకోగా, 2012లో ఓటమి పాలైనప్పటికీ జిల్లాలో సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 6 స్థానాలతో బీఎస్పీ తొలి స్థానంలో కొనసాగింది. ప్రస్తుత ఎన్నికల్లో ఇంతవరకు బహిరంగ సభలు, ర్యాలీలకు దూరంగా ఉన్న మాయావతి ఫిబ్రవరి 2న ఆగ్రా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధ మయ్యారు. తన ఆధిపత్యాన్ని నిలుపుకునేలా ఇప్పటికే టికెట్ల కేటాయింపు చేసిన మాయావతి ఆగ్రా నుంచి తాడోపేడో తేల్చుకోనున్నారు. పట్టు నిలుపుకునేలా బీజేపీ వ్యూహాలు.. 2012లో కేవలం రెండు స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2017 నాటికి బలంగా పుంజుకుంది. ఏకంగా జిల్లాలో 55 శాతం ఓట్లను దండుకున్న బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. జాటవ్‌ల ఓట్లలో చీలిక, హిందూత్వ నినాదం బలంగా పనిచేయడం, వాల్మీకి వర్గం అంతా బీజేపీకి అండగా నిలవడంతో బీజేపీ సునాయాసంగా గట్టెక్కింది. ఈ సారి అదేస్థాయి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ జాటవ్ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీరాణి మౌర్యని రంగంలోకి దింపారు. ఆయనకు ఆగ్రా రూరల్ సీటు కేటాయించారు. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. 30ఏళ్లలో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న ఎస్పీ ఇక ఆగ్రా జిల్లాలో సమాజ్‌వాదీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 1992లో పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో కేవలం ఒకే ఒక్క సారి, ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే విజయం సాధించడం ఇక్కడ ఎస్పీ పరిస్థితికి అద్దం పడుతోంది. 2012లో ఒక్కసారి మాత్రమే బాహ్ నియోజకవర్గం నుంచి రాజా అరిదమన్సింగ్ గెలిచారు. 2017 ఎన్నికల్లో ఒక్కసీటు గెలువని ఎస్పీ కొన్ని చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచింది. ఇక 1996లో చివరిసారిగా ఒక ఎమ్మెల్యే స్థానంలో గెలిచిన కాంగ్రెస్ ఆ తర్వాత నుంచి జిల్లాల్లో పత్తా లేకుండా పోయింది. 1996లో ఖేరాఘర్లో కాంగ్రెస్ తరఫున మండలేశ్వర్సింగ్ గెలిచాక ఆ పార్టీ జిల్లాలో ఖాతా తెరవలేదు. గడిచిన 2012, 2017 ఎన్నికల్లో పార్టీ కేవలం జిల్లాలో 6 నుంచి 7 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. -
యోగికే నల్లజెండా చూపించాక..
లక్నో: పూజా శుక్లా. ఒకప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌నే అడ్డుకొని నల్ల జెండా చూపించిన ధీశాలి. ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ లక్నో (నార్త్) నియోజకవర్గం నుంచి ఆమెను ఎన్నికల బరిలోకి దింపింది. 25 ఏళ్ల పూజ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. యోగి ఆదిత్యనాథ్ గద్దెనెక్కిన దగ్గర్నుంచి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ పోరాటాలే ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చాయి. 2017లో లక్నో యూనివర్సిటీలో హిందీ దివస్ ఉత్సవానికి యోగి వస్తుండగా పూజా శుక్లా మరికొంతమంది విద్యార్థులతో కలిసి కాన్వాయ్కి అడ్డం పడి నల్లజెండా చూపించి మరీ నిరసనలు చేపట్టారు. లక్నో యూనివర్సిటీలో యోగి పాదం మోపకూడదంటూ అడ్డుకున్నారు. ఫలితంగా 20 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చాక పీజీ చదవాలన్నా ఆమె ఆశలకి గండి పడింది. కేసులో బుక్కయినందుకు లక్నో యూనివర్సిటీ ఆమెకు పీజీలో అడ్మిషన్ నిరాకరించింది. పూజతో పాటు నిరసనలో పాల్గొన్న వారికీ ఉన్నతాభ్యాసానికి అవకాశం లేకపోవడంతో అందరూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ అధ్యాపకులపై దాడులకు దిగారు. అప్పట్లో లక్నో యూనివర్సిటీ ఆందోళనలతో భగ్గుమంది. దీంతో మరోసారి పూజ కటకటాల వెనక్కి వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆమె ఏ మాత్రం వెనుకడుగు వెయ్యలేదు. యోగికి ఎదురొడ్డి నిలవడమే లక్ష్యంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. పౌరసత్వ చట్ట సవరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొని మూడోసారి కూడా జైలు పాలయ్యారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలుసుకున్నారు. అప్పట్నుంచి ఎస్పీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చివరికి లక్నో (నార్త్) సీటు దక్కించుకున్నారు. సీటు ఖరారు కాకముందు నుంచే ఆమె లక్నోలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యోగినే ఎదిరించిన పూజా శుక్లా ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేస్తానంటూ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రతినబూనారు. బీజేపీ నేత నీరజ్ బోరాను ఆమె ఎదుర్కోవాల్సి ఉంది. యూపీ అభ్యర్థుల్లో అతి తక్కువ వయసు కూడా ఆమెదే. లక్నోలో పోలింగ్ నాలుగో దశలో ఫిబ్రవరి 23న జరగనుంది. -
ఉత్తరప్రదేశ్‌లో తరతరాలుగా వీరిదే అధికారం!
ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణులు.. ఠాకూర్ (రాజ్‌పుత్)లు, వైశ్యులు... 19 శాతం ఉన్న ముస్లింలు... 9–10 శాతం దాకా ఉన్న యాదవులు... తరతరాలుగా వీరిదే అధికారం... వీరి మాటే వేదం... వీరు చెప్పిందే చట్టం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ 2017లో యూపీలో కొత్త ప్రయోగం చేసింది. మోదీ చరిష్మా, 25 శాతం దాకా ఉన్న అగ్రకులాల ఓట్లలో అత్యధికం సాధించడం, యాదవేతర ఇతర వెనుకబడిన (ఓబీసీల్లో) వర్గాల్లో ... మరోవైపు ముస్లిం ఓట్లలో సాధ్యమైనంత చీలిక తేవడం ద్వారా బీజేపీ 39.67 శాతం ఓట్లతో ఏకంగా 312 సీట్లు సాధించింది. తిరుగులేని మెజారిటీతో యూపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 19.3 శాతం ఉన్న ముస్లిం ఓట్లలో చీలిక రావడం, అవి ఇతర లౌకిక పార్టీల మధ్య పంపిణీ కావడం , 10 శాతం యాదవ ఓట్లలో సింహభాగం తమకే పడ్డా... అధికార పీఠాన్ని అందుకోవాలంటే ఇవి సరిపోవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు తేలిగ్గానే అర్థమైంది. అందుకే ఈసారి ఆయన ఇతర ఓబీసీ నేతలకు గాలం వేస్తూ... ఆయా వర్గాలను మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. యూపీలో మొత్తం 42 నుంచి 45 శాతం దాకా ఓబీసీలు ఉంటే... ఇందులో యాదవులు పోను నికరంగా 32–35 శాతం ఇతర ఓబీసీలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీలు ఇప్పుడిక్కడే తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఆయా కులాలకు ప్రాతినిధ్యంవహించే చిన్నాచితకా పార్టీలకు అర్హతకంటే ఎక్కువ సీట్లే ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నాయి. ఎంత అసంతృప్తి ఉన్నా... తగ్గేది కొంతే! బ్రాహ్మణ/ సామాజికవర్గంలో బీజేపీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని. కాషాయపార్టీ పట్ల వారు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చినా సరే... కనీసం 8 శాతం మంది బ్రాహ్మణులు ఇప్పటికీ బీజేపీతోనే ఉంటారని సీనియర్ జర్నలిస్టు బ్రిజేష్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఠాకూర్లు యూపీ జనాభాలో 7 శాతం ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఠాకూర్ వర్గానికి చెందిన వారు కాబట్టి వీరిలో కనీసం 6 శాతం ఓట్లు బీజేపీకే పడవచ్చు. వ్యాపారం ప్రధాన వృత్తిగా ఉండే వైశ్యులు (యూపీ జనాభాలో ఐదు శాతం) తరాలుగా కమలదళంతోనే ఉంటూ వస్తున్నారు. ఇక ఎస్పీ విషయానికి వస్తే ముస్లింలో అత్యధిక ఓట్లు, యాదవుల ఓట్లు కలిపితే... దాదాపు 28 శాతం సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటోంది. బీజేపీ ఇంచుమించు అలాగే ఉన్నా... కనీసపక్షం ఇరుపక్షాల ఓట్లు 25 శాతానికి తగ్గడం లేదు. అంటే అధికార పీఠాన్ని అందుకోవాలంటే ఎంతలేదన్నా... అదనంగా మరో 10 శాతం ఓట్లు రావాలి. రాజ్భర్లు– 4 శాతం రాజ్భర్లు యూపీ జనాభాలో 4 శాతం ఉంటారు. ప్రధానంగా తూర్పు యూపీలో కేంద్రీకృతమై ఉన్నారు. వీళ్లు 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహైల్దేవ్ను కొలుస్తారు. మహ్మద్ గజనీ మేనల్లుడిని ఓడించిన ఘన చరిత్ర రాజా సుహైల్దేవ్కు ఉంది. 2002లో çసుహైల్‌దేవ్ భారతీయ సమాజ్‌పార్టీని (ఎస్బీఎస్పీ)ని స్థాపించిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తమ సామాజికవర్గానికి ఏకైక నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు. 2017లో బీజేపీతో పొత్తుపెట్టుకొని ఎనిమిది స్థానాల్లో పోటీచేసి నాలుగింటిలో గెలుపొందారు. మంత్రిగా యోగి టీమ్‌లో చేరగా... తర్వాత విభేదాలు వచ్చి బీజేపీకి కటీఫ్ చెప్పారు. ఐదారు చిన్నాచితకా పార్టీలను కూడగట్టి అఖిలేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపెట్టుకున్నారు. వారికి పూలన్‌దేవి ఆరాధ్యం నిషాద్‌లు ప్రధానంగా మత్స్యకారులు. యూపీ జనాభాలో నాలుగు శాతం ఉంటారు. నదీ తీరాల్లోని 26 జిల్లాల్లో ప్రభావవంతంగా ఉంటారు. బందిపోటు రాణి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన పూలన్‌దేవి వీరికి ఐకాన్. 2022 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిషాద్ పార్టీని బుజ్జగించిన బీజేపీ ఆ పార్టీకి 15 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. లోధీలు (3.5 శాతం) లోధీలు యూపీలో నాలుగో అతిపెద్ద ఓబీసీ కమ్యూనిటీ. 16 జిల్లాల్లో ప్రభావం చూపగలిగే స్థితిలో ఉన్నారు. ప్రస్తుత యూపీ అసెంబ్లీలో 20–22 మంది లోధీ ఎమ్మెల్యేలు (అత్యధికులు బీజేపీ నుంచే) ఉన్నారు. లోధీలో శిఖరగ్ర సమానుడైన యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఇటీవల చనిపోవడం బీజేపీకి అతిపెద్ద లోటుగా పరిణమించింది. మౌర్యులు/ కుష్వాహాలు (6 శాతం) మౌర్యులు, కుష్వాహాలు కలిపి ఈసారి ఎస్పీని అధికారంలోకి తేవాలని కంకణం కట్టుకున్నారనేది స్థానిక పార్టీ మహాన్‌దళ్ నినాదం. తూర్పు యూపీలోని గాజీపూర్, వారణాసి, బలియా, కుశీనగర్, జౌన్పూర్ జిల్లాల్లో మౌర్యులు కేంద్రీకృతమై ఉన్నారు. కుష్వాహాలు ఇటావా, మెయిన్‌పురి, జలౌన్, ఝాన్సీల్లో ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి కుల ఆధారిత ఈ చిన్ని రాజకీయ పార్టీలను బుజ్జగించి విజయవంతంగా వారి ఓట్లను మళ్లించుకోగలిగితేనే ప్రధాన రాజకీయ పార్టీలకు విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పొచ్చు. కీలెరిగి వాత! ఇతర వెనుకబడిన వర్గాలు... ప్రధాన పార్టీలకు ఉన్న ఈ అవసరాన్ని బాగా గుర్తించాయి. తమ ఓట్లు దక్కాలంటే అడిగినన్ని సీట్లు, మంత్రి పదువులు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్లు చేస్తూ మరీ ప్రధాన రాజకీయపక్షాల మెడలు వంచుతున్నాయి. యాదవుల తర్వాత కుర్మీలు యూపీలో రెండో అతిపెద్ద ఓబీసీ వర్గం. జనాభాలో ఐదు శాతం ఉంటారు. 16 జిల్లాల్లో దాదాపు 12 శాతం కుర్మీల జనాభా కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఆయా జిల్లాల్లో వీరి మద్దతే కీలకం అవుతోంది. కుర్మీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనుప్రియా పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ (ఎస్)తోనే ఈ సామాజికవర్గం నిలబడుతోంది. అప్నాదళ్ 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ హవా నడిచిన కాలంలో కుర్మీలకు చెందిన బేణి ప్రసాద్ వర్మకు పెద్దపీట వేయడంతో ద్వారా ఈ సామాజికవర్గంలో ఎస్పీకి మంచి పట్టు సంపాదించగలిగారు. అయితే తర్వాతి కాలంలో బేణి ప్రసాద్ వర్మ మరణంతో కుర్మీల్లో ఎస్పీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం!
లక్నో: ఐదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌ను మాఫియా, అల్లరి మూకలు పాలించేవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో బాఘ్‌పత్, షమ్లీ, గౌతమ్ బుద్ధనగర్, ముజఫర్‌నగర్, శరణ్‌పూర్ జిల్లాల్లోని 21 అసెంబ్లీ స్థానాల ర్యాలీల నుద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు దోపిడీకి గురయ్యారని, ఆడపిల్లలు ఇళ్లు దాటే పరిస్థితి లేకపోయిందన్నారు. ప్రభుత్వ అండదండలతో మాఫియా స్వేచ్ఛగా తిరిగేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై ప్రధాని మాటల దాడి చేశారు. మూఢ నమ్మకాలతో అఖిలేశ్ యువత కలల ప్రపంచమైన నోయిడాకు రాలేదని, అలాంటి మూఢ నమ్మకాలున్న వ్యక్తి యువతకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నించారు. మన దేశం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌పై భరోసా ఉంచని వారు, పుకార్లకు ప్రాధాన్యమిచ్చినవారు ఉత్తరప్రదేశ్యువత ప్రతిభను, ఆవిష్కరణలను ఎలా గౌరవిస్తారని ప్రధాని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ యూపీ మార్పును కోరుకుంటుందని, కానీ ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని, వాళ్లు టికెట్ ఇచ్చిన వారిని చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. ప్రతీకారమే వారి సిద్ధాంతమని, అలాంటి వారి పట్ల యూపీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం తనకు ఆనందం కలిగిస్తోందని మోదీ తెలిపారు. కృష్ణుడు తన కలలోకి వస్తాడన్న అఖిలేశ్ మాటలనుద్దేశించి ప్రస్తావిస్తూ... ఆయన నిద్రపోయి కలలు కంటూనే ఉంటారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం యూపీ అభివృద్ధికోసం నిరంతరం పనిచేస్తారని అన్నారు. బీజేపీలోకి నిదా ఖాన్, గంగారామ్ అంబేడ్కర్ మహిళా హక్కుల ఉద్యమకారిణి నిదా ఖాన్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఓఎస్డీగా పనిచేసిన గంగారామ్ అంబేడ్కర్ భారతీయ జనతాపార్టీలో చేరారు. చేరికల కమిటీ నాయకుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయ్ ఆధ్వర్యంలో సోమవారం వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాజ్‌పేయ్ మాట్లాడుతూ... ఇక అల్లరి మూకల రాజ్యం చెల్లదని, ప్రజలంతా నిర్భయంగా జీవించే యోగి ఆదిత్యనాథ్ పరిపాలన నడుస్తోందని అన్నారు. -
అఖిలేష్‌కు పోటీగా బలమైన అభ్యర్థి! బీజేపీ ఎత్తుగడ ఫలించేనా?
BJP Fields Union Minister SP Singh Baghel against Akhilesh Yadav from Karhal Seat: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు పోటీగా బీజేపీ బలమైన అభ్యర్థిని ప్రకటించింది. ఓబీసీ వర్గానికి చెందిన సత్యపాల్ సింగ్ బఘేల్ కర్హల్ నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోంది. పోలీస్ ఎస్ఐగా తన కెరీర్ ప్రారంభించిన ఎస్పీ సింగ్ బఘేల్.. మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఎస్పీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం బీఎస్పీలో చేరిన ఎస్పీ సింగ్ బఘేల్‌కు 2014లో మాయావతి రాజ్యసభ సీటు ఇచ్చారు. అనంతరం కమలం పార్టీలో చేరిన ఎస్పీ సింగ్ బఘేల్.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తుండ్లా స్థానం నుంచి గెలిచి.. యోగి కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆగ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మోదీ కేబినెట్లో న్యాయ శాఖ సహా మంత్రిగా పనిచేస్తున్నారు. మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అఖిలేష్‌కు పోటీగా బఘేల్‌ను రంగంలోకి దింపడంతో కర్హల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చదవండి: (అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నామినేషన్ దాఖలుచేశారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేస్తున్నారు. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న అఖిలేష్.. మెయిన్‌పురి సబ్‌డివిజన్ ఆఫీస్‌లో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. కర్హాల్ స్థానం సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో దాదాపు 3.5లక్షలమంది ఓటర్లు ఉండగా.. ఇందులో దాదాపు లక్షన్నర వరకూ యాదవులే ఉన్నారు. కర్హాల్ స్థానానికి మూడోదశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. చదవండి: (బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా?) -
ఎన్నికల రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట!
న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల తేదీలు సమీపిస్తోన్న తరుణంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్నీ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో విమర్శలు ప్రతి విమర్శల దాడితో దూసుకుపోతున్నాయి. తాజాగా ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాలలో వెయ్యి మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి ఈసీ అనుమతించింది. ఇంటింటి ప్రచారంలో జనాల పరిమితిని పెంచింది. ఇంతకుముందు ఇంటింటి ప్రచారంలో 10 మందికే అనుమతి ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 20కి పెంచింది. ఇండోర్‌లో 500మంది వ్యక్తులతో ఎన్నికల సభ నిర్వహించేందుకు అనుమతించింది. అయితే ర్యాలీలు, రోడ్‌షోలపై ఉన్న నిషేధాన్ని ఫిబ్రవరి 11 పొడిగించింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమై.. 4, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను నిర్వహించనుంది. అదే విధంగా మార్చిన 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. చదవండి: అయిదు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట! -
ప్రతిష్టాత్మక పోరు: ‘కైరానా’ మే హైరానా!
యూపీలో హాట్ సీట్లలో ఒకటైన కైరానాలో నాలుగు దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న పోరు ప్రస్తుత ఎన్నికల్లోనూ ప్రతిష్టాత్మకంగా మారింది. సమాజ్‌వాదీ తరపున పోటీ చేస్తున్న నహిద్ హసన్, బీజేపీ తరపున పోటీ చేస్తున్న మృగాంక సింగ్‌ల మధ్యే ఈ ఎన్నికల్లోనూ గట్టి పోరు జరుగనుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నహిద్ హసన్ గెలుపొందగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుకుంసింగ్ కుటుంబాన్ని పక్కనబెట్టిన బీజేపీ, ప్రదీప్ చౌదరిని నిలబెట్టి గెలిపించుకుంది. అయితే ఈసారి తొలిదశలో ఫిబ్రవరి 10న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మృగాంకను బరిలో నిలిపిన కమలదళ పెద్దలు, తమ సత్తా చాటేందుకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే రంగంలోకి దిగారు. – సాక్షి, న్యూఢిల్లీ వలసలు, శాంతిభద్రతల సమస్యలపైనే నజర్ 2017లో వలసల సమస్యతో పాటు శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ఎస్పీ ప్రభుత్వాన్ని కమలదళం చుట్టుముట్టింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా చేసుకొని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, కైరానాలో ప్రజలు మాత్రం ఎస్పీ అభ్యర్థి నహిద్ హసన్ వైపే మొగ్గు చూపారు. అయితే గతంలో మాదిరిగానే వలసలు, శాంతిభద్రతల అంశాలను బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. అందుకే కైరానాలో బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంటింటికీ వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వలస బాధితులను కూడా కలిశారు. గతేడాది నవంబర్లోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వలస బాధితులను కలిశారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కైరానా వలసల అంశాన్ని లేవనెత్తిన బీజేపీకి మాత్రం కైరానాలోనే ఎదురుదెబ్బ తగిలింది. కాగా బీజేపీ లేవనెత్తిన ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు ఎస్పీ కూటమి పరస్పర సోదరభావ అంశంతో పాటు నహిద్ హసన్‌ను గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అరెస్ట్ చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నహిద్ హసన్ ఎస్పీ టికెట్‌పై అభ్యర్థిగా నామినేషన్ వేసిన మరుసటి రోజే గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో పోలీసులు అరెస్టు చేసి, 14 రోజుల రిమాండ్‌కు పంపారు. దీంతో కైరానాలో అతని తరపున ప్రచార బాధ్యతలను చెల్లెలు ఇక్రా హసన్ నిర్వహిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం కైరానా ప్రాంతంలో సుమారు 120 ఏళ్ళ క్రితం మాజీ ఎంపీ బాబు హుకుం సింగ్, మునవ్వర్ హసన్‌ల పూర్వీకులు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ, అందులో ఒకరు ఇస్లాంను స్వీకరించడంతో మొదలైన వైరం ఇప్పుడు తర్వాత తరానికి చేరింది. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఒక్కొక్కసారి ఒక్కో కుటుంబానిది పైచేయిగా సాగుతోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన మునవ్వర్ హసన్ భార్య తబస్సుమ్ హసన్, హుకుంసింగ్‌ను ఓడించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో హుకుంసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో కైరానా నుంచి ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2014లో జరిగిన ఎమ్మెల్యే ఉపఎన్నికలో మునవ్వర్ కుమారుడు నహిద్ హసన్ సమాజ్‌వాదీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2018లో హుకుంసింగ్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ తరపున పోటీ చేసిన తబస్సుమ్ హసన్ చేతిలో దివంగత హుకుం సింగ్ కుమార్తె మృగాంక సింగ్ ఓడిపోయారు. అంతకు ముందు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మృగాంక సింగ్‌పై నహిద్ హసన్ విజయం సాధించారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుకుంసింగ్ కుటుంబాన్ని పక్కనబెట్టిన బీజేపీ... ప్రదీప్ చౌదరిని బరిలో దింపడంతో తబస్సుమ్ హసన్ మరోసారి పరాజయం పాలయ్యారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) -
అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం
కంచర్ల యాదగిరిరెడ్డి: దాద్రి (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి అన్నయ్యతో అవ్వట్లేదు... అయినా అధికార కేంద్రంగా తానే ఉండాలంటాడు అమ్మ సోనియాకు అనారోగ్యం... ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ.. కొడిగట్టిన దీపంలా మారింది.. ఉత్రరప్రదేశ్లో ఉనికి చాటగలిగితే... రేప్పొద్దున జాతీయ రాజకీయాల్లో ముఖం చెల్లుతుంది... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఏడాదిగా యూపీలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు... కాలానికి తగ్గట్టు తన పద్ధతిని మార్చుకోలేకపోవడమే కాంగ్రెసు పార్టీ బలహీనతగా కనిపిస్తోంది. మరింత అప్రతిష్టను మూగగట్టుకునే దిశగా యూపీలో కాంగ్రెస్ సాగుతోందనే భావన కలుగుతోంది. ప్రజలకు... మరీ ముఖ్యంగా రైతులు, మహిళలు, యువతకు మేలు చేసే విధానాలతో ప్రియాంకా గాంధీ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇచ్చేట్టు కనిపించడం లేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం కనుచూపు మేరలో లేదు. కుటుంబ పార్టీగా ముద్ర వేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రంలో ప్రియాంక తప్ప మరో జనాకర్షక నేత లేడు. పార్టీలో ఎదుగుతున్న నేతలను కాంగ్రెస్ చేజేతులా పోగొట్టుకోవడమే ఈ దుస్థితికి కారణమని మీరట్‌కు చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బదరీనాథ్ మిశ్రా అన్నారు. కాంగ్రెస్ అంటే ఇప్పటికీ ప్రజలకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. కానీ, ఆ పార్టీని నడిపించే సమర్థులు లేకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వైపు చూడాల్సి వచ్చిందంటున్నారు బదరీనాథ్. కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకు సోనియాగాంధీ వారసత్వం, ప్రియాంకా గాంధీ భవిష్యత్ మధ్య ఇక్కడ పోరు సాగుతోంది. గడచిన (2017) ఎన్నికల కంటే కాస్తన్ని ఎక్కువ సీట్లు వచ్చి నా, ఓట్లు కనీసం ఒక్క శాతం పెరిగినా ప్రియాంక గాంధీ నాయకత్వంపై ఎంతో కొంత నమ్మకం పెరుగుతుంది. కానీ, విచిత్రంగా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎవరికీ ప్రత్యామ్నాయం కారు. ఈ ఎన్నికల కంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కానీ ఓ పది మంది ఎమ్మెల్యేలనైన గెలిపించుకున్నప్పుడు కదా ఆ పాటి విశ్వాసం వచ్చేదంటున్నారు ముజఫర్ నగర్ కాంగ్రెస్ నేత రాజేశ్వర్ తివారీ. ఏడు పదుల వయసు దాటిన తివారీ జీవితమంతా కాంగ్రెస్‌తోనే సాగింది. కాంగ్రెస్ పరిస్థితి ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదని బాధపడ్డారాయన. కానీ, కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇతర పార్టీల వైపునకు వెడుతుండటాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. (చదవండి: టైమ్ చూసి... హ్యాండిస్తున్నారు..!) ఉదారవాద హిందుత్వపై నమ్మకం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఉత్తరప్రదేశ్! సుమారు 30 ఏళ్లకు పైచిలుకు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసకబారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం ఒక్క సీటుకు పరిమితమైంది. దీంతో పార్టీ కేడర్ కకావికలు అవుతోంది. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తీసుకుంటే 2017 వరకు... మధ్యలో ఒకేఒకసారి కాంగ్రెస్ ఓటు శాతం డబుల్ డిజిట్ (2012లో 11.63 శాతం ఓట్లు, 23 సీట్లు వచ్చాయి. 1996లో వచ్చిన 33 సీట్లే కాంగ్రెస్‌కు ఇప్పటిదాకా యూపీలో వచ్చిన అత్యధిక స్కోరు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక, ఆమె అన్నయ్య రాహుల్ గాంధీ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పట్టాలెక్కించాలని శ్రమిస్తున్నారు. ఉదారవాద హిందుత్వకు వారసులుగా తమను తాము చూపుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వను ఎదుర్కోవాలన్నది ప్రియాంక ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో పాటు రైతు చట్టాలపై నిరసనలు వ్యక్తమైన యూపీలో రైతులను ఒక ప్రత్యేక తరగతిగా భావించి, వారిని మచ్చిక చేసుకోవాలని ప్రియాంక పావులు కదుపుతున్నారు. ఈ కుల, మత, వర్గ సూత్రాలు కాంగ్రెస్‌ను కాపాడతాయా?... అంటే ఉనికి కోసం పోరాడుతున్న పార్టీకి పునర్వైభవం చాలా పెద్ద మాట అవుతుందనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశ ప్రియాంకకు కూడా లేదు. ఇటీవల ఆగ్రాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడిన తీరు ఆమెలో నిరాశకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ పార్టీ పోస్టర్ గర్ల్ ప్రియాంక మౌర్య బీజేపీలో చేరడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయారు. పార్టీ కార్యకర్తల మీటింగుల్లో ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంగ్రెసు పార్టీలో గాంధీ కుటుంబ వారసత్వానికి భవిష్యత్ లేదు. ఇకనైనా నాయకత్వం కళ్లు తెరిచి చూడాలి. లేదంటే తుడిచిపెట్టుకుపోతుంది’ అని గుర్మిత్ సింగ్ పూరి అన్నారు. ఖతులీ శాసనసభ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న గుర్మిత్ గతంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథి పార్లమెంట్ నియోజకవర్గంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. రుద్రాక్ష మాల– సంగమ స్నానం గతేడాది ప్రియాంక డెహ్రాడూన్ వచ్చినప్పుడు చేతిలో రుద్రాక్ష మాలతో కనిపించారు. అనంతరం మాతా శాకంబరీ దేవీ ఆలయంలో పూజలు చేయడం, ప్రయాగ్ రాజ్ వెళ్లి సంగమంలో పుణ్యస్నానం చేయడం జరిగింది. ఇవన్నీ రాష్ట్రంలో ఉదారవాద హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు చేసే యత్నాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అనుసరించే హార్డ్‌కోర్ హిందుత్వను హిందువుల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటివారిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో భాగంగా అటు ప్రియాంక, ఇటు రాహుల్ తమనుతాము ఉదారవాద హిందూవాదులుగా చూపించుకుంటున్నారు. ఉదారవాద హిందుత్వ ప్రియాంక మొదటి సూత్రం. (చదవండి: పీపీఈ కిట్‌లో వచ్చినా ఫలితం దక్కలేదు) -
పీపీఈ కిట్‌లో వచ్చినా ఫలితం దక్కలేదు
షాజహాన్‌పూర్: నగరానికి చెందిన వైద్యరాజ్ కిషన్ సంయుక్త వికాస్ పార్టీ తరఫున షాజహాన్‌పూర్ నియోజకవర్గానికి ఈనెల 25న నామినేషన్ వేశారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? కరోనా వ్యాప్తి నిరోధానికి వాడే పీపీఈ కిట్ తొడుక్కొని, శానిటైజర్ బాటిల్, థర్మల్స్కానర్తో వచ్చి ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. దీంతో కుప్పకూలిన వైద్యరాజ్ ఇది అధికారుల కుట్రని విమర్శించారు. మంత్రి సురేశ్ ఖన్నా సూచనల మేరకే అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని వాపోయారు. అయితే అసంపూర్ణ డాక్యుమెంట్లు సమర్పించినందునే ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ రోజే అడిగిన పత్రాలు ఇస్తానన్నా అధికారులు వినిపించుకోలేదని, మరుసటి రోజు వారు కోరిన పేపర్లను సమర్పించానని వైద్యరాజ్ చెప్పారు. కానీ కావాల్సిన పేపర్లను సమర్పించాలని వైద్యరాజ్కు మూడు నోటీసులు ఇచ్చినా స్పందిచలేదని, అందుకే తిరస్కరించామని అధికారులు వివరించారు. ఇంతవరకు వైద్యరాజ్ 18 ఎన్నికల్లో పోటీచేసి దిగ్విజయంగా డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. వైద్యరాజ్ ఎవరో తనకు తెలియదని, తానెవరి నామినేషన్ తిరస్కరించమని చెప్పలేదని మంత్రి సురేశ్ వివరణ ఇచ్చారు. యోగిపై పోటీకి కూడా నామినేషన్ వేస్తానని వైద్యరాజ్ గతంలో ప్రకటించారు. -
UP Assembly Election 2022: గోవులే గోసపడుతున్నాయ్!
యోగి ఆదిత్యనాథ్ గడచిన ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రశంసించే వారి సంగతి పక్కన పెడితే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆయన విధాన నిర్ణయాలను తప్పు పట్టే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా రైతులు ఆయన ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెరకు రైతులు తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని గగ్గోలు పెడుతుంటే, ప్రభుత్వ గోశాలలకు తరలించిన పశువులు ఎక్కడ పోతున్నాయని రైతులు నిలదీస్తున్నారు. వ్యవసాయానికి పనికిరాని పశువులను కబేళాలకు తరలిస్తున్నారంటూ యోగి ప్రభుత్వం వాటి సంరక్షణకు గోశాలలు ఏర్పాటు చేసింది. తమ వద్ద ఉండి వృద్ధాప్యంలోకి వచ్చిన పశువులను కబేళాలకు తరలించకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గోశాలలు రైతుల నమ్మకాన్ని కోల్పోయాయి. దానికి తోడు తమ పశువులను గోశాలకు అప్పగిస్తే ఒక్కోదానికి రూ.ఐదు వేలు చెల్లించాలి. ఇంతే కాదు అవసరమయ్యే దాణా ఖర్చు భరించాలి. యోగి సర్కార్ ఈ నిబంధన పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మీరట్ సమీపంలోని ఖతూలీ నియోజకవర్గం కేంద్రానికి సమీపంలో ఉన్న భైంసీ గోశాలలో రైతులు అప్పగించిన పశువులు కొద్ది రోజులకే బయటకు వదులుతున్నారు. ‘మా గ్రామం నుంచి గడచిన ఏడాది కాలంలో రమారమి 500 పశువులను అప్పగించాము. మూడు మాసాల తరువాత వెళ్లి చూస్తే 50 కూడా లేవు. మరి మిగిలినవి ఏమయ్యాయని గోశాల నిర్వాహకులను ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా... ప్రభుత్వమే వాటిని కబేళాలకు తరలిస్తోందా?’ అని భైంసీ రైతు బ్రిజ్‌పాల్ సింగ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము దాణాకు డబ్బులు ఇస్తున్నాము. అయినా వాటిని ఎందుకు కాపాడటం లేదు. ఇక గోశాల దేనికి మా దగ్గర డబ్బులు లాగటానికా’ అని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మీరట్, ముజఫర్‌నగర్ డివిజన్లలో పాతిక గోశాలలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో పశువులు రెండు మూడు మాసాలకే మాయమవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోశాల నుంచి బయటకు వచ్చిన పశువులు తమ పంట పొలాలను పాడు చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. గడచిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన ఇక్కడి రైతాంగం ఇప్పుడు సమాజ్‌వాదీ–రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతు ఇస్తామని బహిరంగంగా చెబుతున్నారు. చదవండి: (UP Assembly Election 2022: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) ఫ్యాక్టరీలకు మేలు చేస్తున్న ప్రభుత్వ విధానాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చక్కెర రైతులు ఏకంగా ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో 2.60 లక్షల ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. ముజఫర్ నగర్, మీరట్, భాగ్‌పట్, దాద్రి ప్రాంతాల్లోకి చక్కెర మిల్లులు ఏటా 140 రోజుల పాటు చెరకు క్రషింగ్ చేస్తాయి. సగటున రోజుకు లక్ష టన్నులను ఈ ఫ్యాక్టరీలు క్రష్ చేస్తాయి. ‘ఫ్యాక్టరీల బాగు కోసమే మేము చెరకు పండిస్తున్నామన్నట్టుంది ప్రభుత్వం తీరు. మా బాగోగుల కంటే ఫ్యాక్టరీలకు మేలు చేయడంపైనే పాలకుల దృష్టి ఉంది. క్వింటాల్‌కు రూ. 350 నుంచి రూ.400 పెంచాలన్న మా డిమాండ్‌ను కేంద్రం, రాష్ట్రం రెండూ పట్టించుకోలేదు’ అని భాగ్‌పట్ కు చెందిన రైతు భీరంసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాము ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నామని భీరంసింగ్ చెప్పారు. చెరకు పండించే ప్రాంతాల్లో రైతులు వరుస సమావేశాలు నిర్వహించుకుని బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలన్న తీర్మానాలు చేస్తున్నారు. ఎన్నికలొస్తేనే గుర్తుకొస్తామా! ‘మాకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో బీజేపీకి ఓట్లు వేశాము. ఇప్పుడే మా బాధలను వారు పట్టించుకోవడం లేదు. తీరా ఎన్నికలు వస్తే గానీ అమిత్ షాకు మేము గుర్తుకు రాలేదా? – దాద్రి ప్రాంతానికి చెందిన రైతు నాయకుడు కిషన్ గుజ్జర్ ఉద్యోగావకాశాలు లేక నిస్పృహలో యువత రైతులు మాత్రమే కాదు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది. కొత్తగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కరోనా కారణంగా యూపీలో వందలాదిగా చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాపు 3.25 లక్షల మంది ఉపాధి అవకాశాలకు గండి పడింది. రైల్వే బోర్డు ఉద్యోగాలకు సంబంధించి బిహార్‌లో చెలరేగిన సెగ ఇప్పుడు యూపీకి పాకింది. ఉద్యోగాల కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేసుకున్న యువతకు కాల్ లెటర్లు రావడం లేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఈ ప్రభుత్వంలో ఇలాంటివి తాము ఊహించలేదని మీరట్ నిరుద్యోగ యువజన సమితి నేత దిలీప్ భండారీ అన్నారు. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా వీధుల్లో తిరుగుతున్నారని, ప్రభుత్వానికి తగిన కార్యాచరణ లేకపోవడమే దీనికి కారణమని మండిపడ్డారు. పశ్చిమను ఫాలో అవుతారా? ప్రస్తుతం పశ్చిమలో ఉన్న పరిస్థితులు మొత్తం రాష్ట్రం ఫాలో అవుతుందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ‘కొన్నిసార్లు తీర్పు రాష్ట్రమంతటా ఒకేలా ఉంటుం ది. ఉదాహరణకు 2017 శాసనసభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు సాగడంతో ఓట్ల చీలిక కారణంగా బీజేపీ అన్ని ప్రాంతాల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకుంది. ఈసారి ఓట్ల చీలిక లేకపోతే పోటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉండవచ్చు’ అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ (సీఎస్డీఎస్) ప్రతినిధి ప్రభాత్ కుమార్ అన్నారు. ముస్లింలలో ఓట్లు చీలకూడదనే పట్టుదల గడచిన ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)కి ఓట్లు వేసిన ముస్లింలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ‘మా గమ్యం ఏమిటో మాకు తెలిసి వచ్చింది. మేము ఎవరికీ ఓటు వేయాలన్న విషయంలో స్పష్టత వచ్చింది’ అని ఖతూలీకి చెందిన వ్యవసాయ పరికరాలు విక్రయించే వ్యాపారి న్నౌషద్ మోనీ చెప్పారు. ‘నేను గతంలో బహెన్జీ పార్టీ (బీఎస్పీ)లో ఉన్నాను. మా ఏకైక లక్ష్యం బీజేపీని ఓడించడమే. అందుకే నేను ఇప్పుడు ఎస్పీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నా’ అనిమోనీ అన్నారు. ‘నేను సైకిల్ గుర్తుకు ఓటేస్తా. నేనే కాదు నాకు తెలిసిన అందరూ ఈసారి గంపగుత్తగా సమాజ్‌వాదీ పార్టీకే ఓటు వేస్తారు. మా మీటింగుల్లో కూడా అదే చెపుతున్నారు’ అని.ముజఫర్‌నగర్ మార్కెట్లో రోడ్డు పక్కన పాత వస్త్రాలు విక్రయించే షాహీల్ తెలిపారు. ఇతర పార్టీల్లో ముస్లిం అభ్యర్థులు ఉన్నా సరే ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి ఓటు వేయాలంటూ ముస్లింలు నిర్ణయించుకున్నారని ముజఫర్‌నగర్ కేంద్రంగా పని చేస్తున్న అమర్ ఉజాల పత్రిక బ్యూరో చీఫ్ మదన్‌లాల్ బహియాన్ చెప్పారు. సెస్సు వేసినా... 2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా యూపీ పగ్గాలు చేపట్టగానే గోసంరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఒకటైపోయింది. గోవుల ఆలనాపాలనా చూడటానికని చెప్పి... 2019లో టోల్ట్యాక్స్లపై 0.5 అదనపు సెస్ వేశారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల అమ్ముకునే పంట ఉత్పత్తులపై మండీ ట్యాక్స్‌ను 1 నుంచి 2 శాతానికి పెంచారు. గోశాళల నిర్మాణానికి 2019–20వ బడ్జెట్లో ఏకంగా రూ.447 కోట్లను కేటాయించింది యోగి ప్రభుత్వం. ఆలనాపాలన లేకుండా రహదారులపై తిరిగే ఆవులు, ఎద్దులు, గేదెలను ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంచి పరిరక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి విఫలమైంది. సంరక్షణ కేంద్రాల నుంచి తప్పించుకొని ఈ పశువులు రైతుల పొలాలపై పడి సర్వనాశనం చేయడం ప్రారంభించాయి. దాంతో అన్నదాతల ఆగ్రహం రెట్టిపైంది. దానికి తోడు జాతీయ రహదారులపై వీటి మూలంగా ప్రమాదాలు పెరిగిపోయాయి. మరోవైపు నడుస్తున్న కొన్ని గోశాలల్లోనూ పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. పిడుగుపాటుకు, వర్షాలకు బక్కచిక్కిన మూగజీవాలు చనిపోవడం ప్రజాగ్రహాన్ని పెంచుతోంది. -కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి మీరట్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు -
UP Assembly Election 2022: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!
UP Assembly Election 2022: ఎన్నికల్లో కీలకం కావడానికి ఏవో పెద్ద పెద్ద అంశాలే ఉండనక్కర్లేదు. ఆకాశాన్నంటే ఉల్లిపాయ ధరలు ప్రభుత్వాన్ని దించేయగలవు. పాతాళాన్ని తాకే బంగాళ దుంప ధరలు అధికార పార్టీలో దడ పుట్టించగలవు. ఉత్తరప్రదేశ్‌లో శ్రీకృష్ణుడు జన్మించిన మథురలో ఎన్నికల కాక ఆలూ చుట్టూ రాజుకుంది. వీటి ధరలు రాత్రికి రాత్రి పడిపోయి రైతుల్ని కష్టాల్లోకి నెట్టేసాయి. యూపీలోని ఆగ్రా–మథుర నుంచి కాన్పూర్–ఇటావా వరకు ఆలూ ఎక్కువగా పండుతుంది. (దేశవ్యాప్తంగా పండే ఆలూలో 30% ఇక్కడే పండిస్తారు). హోల్‌సేల్ మార్కెట్లో కొన్నాళ్ల క్రితం వరకు కేజీకి రూ.8, 9 పలికే ధరలు ఇప్పుడు హఠాత్తుగా రూ.5 , 6కి పడిపోయాయి. డీజిల్, ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోవడం, కోల్డ్‌స్టోరేజీల్లో ఉంచడానికయ్యే ఖర్చులతో రైతులకు పంట వ్యయం తడిసిమోపెడవుతోంది. కేజీ ఆలూ పండించడానికి రూ.10 వరకు ఖర్చు అవుతుంటే, మార్కెట్లో 50 కేజీలున్న బస్తాకి రూ.200–250 ధర మాత్రమే పలుకుతోంది (అంటే కేజీకి రూ.5 కంటే తక్కువ). దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ‘‘ఇక్కడ మాకు మరే పని చెయ్యడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఎలాంటి ఉపాధి సదుపాయాలు కల్పించలేదు.పరిశ్రమలేవీ రాలేదు. బంగాళ దుంపల ధరలు పడిపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈసారి మా ఓటు సమాజ్‌వాదీ పార్టీకే’’ అని మహమ్మద్ అన్వర్ అనే రైతు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మథుర పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా రైతాంగ సమస్యలు పట్టించుకోని కమలనాథులు మథురలో శ్రీకృష్ణుడికి ఆలయం కట్టిస్తామంటూ హిందుత్వ ఎజెండానే అందుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఎస్పీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను... బీజేపీ తరిమికొట్టింది: అమిత్ షా
ముజఫర్‌నగర్: యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను బీజేపీ ప్రభుత్వం తరిమికొట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి కలిసి ప్రచారంలో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలది ఎన్నికల బంధమేనని, ఆ తరువాత ఎవరిదారి వారిదేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినా ఆజంఖాన్, అతిఖ్ అహ్మద్ లాంటివాళ్లు వేదికపై ఉంటారే తప్ప... జయంత్ ఎక్కడా కనిపించరని జోస్యం చెప్పారు. బాధితులనే నిందితులుగా చేసిన 2013 ముజఫర్‌నగర్ అల్లర్లను ఎవరైనా మరచిపోగలరా? అని అమిత్ షా ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో నేరాలు తగ్గాయని, ఈ విషయంలో గణాంకాలతో సహా చర్చకు తాము సిద్ధమని, ఎస్పీ ప్రభుత్వంలోని గణాంకాలతో అఖిలేష్ ముుందుకొస్తారా అని సవాల్ విసిరారు. అఖిలేష్ ప్రభుత్వ పాలనకు ముజఫర్ నగర్ అల్లర్లు సజీవ సాక్షమన్నారు. అల్లర్ల సమయంలో పోలీసులు.. తప్పుడు కేసులు బనాయించారని, బాధితులనే నిందితులుగా చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. కోర్టుల్లోనూ, రోడ్ల మీద న్యాయం కోసం పోరాడిన బీజేపీ నేత సంజీవ్ బలియాన్‌ని అమిత్ షా అభినందించారు. మళ్లీ అదే తప్పు చేయొద్దు... ఉత్తరప్రదేశ్‌ను ఎస్పీ చేతిలో పెట్టి ప్రజలు మళ్లీ తప్పు చేయొద్దని, అదే జరిగితే మరో ముజఫర్‌నగర్ ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ గెలుపొందితే ఎలాంటి అల్లర్లు ఉండవని, 300 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఒక పార్టీ గురించే మాట్లాడుతుందని, కాంగ్రెస్ ఒక కుటుంబం గురించే మాట్లాడుతుందని, ఇక ఎస్పీ అధికారంలోకి వస్తే గూండాలు, మాఫియా రాజ్యంగా మారిపోతుందని, ఒక్క బీజేపీ మాత్రమే భద్రత, అభివృద్ధి గురించి మాట్లాడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది, దాన్ని యూపీ ప్రజలు తెలివిగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా యూపీ నిలుస్తుందన్నారు. దేశభద్రత బీజేపీ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అఖిలేష్ యాదవ్ రైతులకు వరాలు కురిపిస్తున్నారని, కానీ ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలోనే 21 చక్కెర కర్మాగారాలు మూసివేశారని ఎద్దేవా చేశారు. ముజఫర్‌నగర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ పోటీ చేస్తుండగా, ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమి నుంచి సౌరభ్ స్వరూప్ బరిలో ఉన్నారు. -
అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ ఆయనే..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 91 మందితో కూడిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో 13 మంది మంత్రులకు చోటు దక్కింది. అయితే సహాకార శాఖ మంత్రి ముకుత్ బిహారీ వర్మను తప్పించి... కైసర్‌గంజ్ నియోజకవర్గంలో ఆయన కుమారుడు గౌరవ్‌కు టిక్కెట్ ఇచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ మీడియా సలహాదారు శలభ్ మణి త్రిపాఠిని డియోరియా నుంచి అసెంబ్లీ బరిలోకి దింపింది కాషాయదళం. ప్రతిష్టాత్మక అయోధ్య స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ గుప్తాకు తిరిగి అవకాశమిచ్చింది. అయోధ్య జిల్లాలోని మరో నాలుగు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై బీజేపీ విశ్వాసం ఉంచింది. అయోధ్య జిల్లాలోని మిల్కీపూర్ (రిజర్వుడు నియోజకవర్గం) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబా గోరఖ్‌నాథ్, రుదౌలీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్ పేర్లు ఖరారు చేసింది. బికాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ అమిత్ సింగ్ చౌహాన్ బరిలోకి దిగనున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే శోభా సింగ్ చౌహాన్ కుమారుడు. గోసైయ్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీ అలియాస్ ఖబ్బు తివారీ భార్య ఆర్తీ తివారీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. (చదవండి: యోగి కోసం.. రంగంలోకి ఫుల్‌టైమ్ సంఘ్ కార్యకర్తలు) బీజేపీ తాజా జాబితాలో 25 మంది ఓబీసీలు, 21 మంది దళితులు, 20 మంది బ్రాహ్మణులు, 18 మంది ఠాకూర్లు, నలుగురు భూమిహార్లు, ఇద్దరు బనియాలు, కాయస్థ కమ్యూనిటీ నుండి ఒక అభ్యర్థి ఉన్నారు. చాలా డిమాండ్ ఉన్న లక్నో అసెంబ్లీ స్థానాలపై బీజేపీ సస్పెన్స్‌ను కొనసాగించింది. ఈ స్థానాల కోసం అనేక బీజేపీ నాయకులు భారీగా పైరవీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 37 మంది మహిళలు సహా 295 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) కూడా ఇప్పటివరకు నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. (చదవండి: కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!) -
యోగి కోసం.. రంగంలోకి ఫుల్‌టైమ్ సంఘ్ కార్యకర్తలు
కంచర్ల యాదగిరిరెడ్డి (ముజఫర్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): యోగి ఆదిత్యనాథ్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమొక్కటే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఉత్తరప్రదేశ్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సాగిస్తున్న రాజకీయ విన్యాసాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర బహిరంగంగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కాకమునుపు సంఘ్ ఫుల్ టైమర్ అయిన యోగి కోసం దాదాపు 2,500 మంది ఆర్ఎస్ఎస్ ఫుల్‌టైమ్ కార్యకర్తలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం నిర్విరామంగా పని చేస్తున్నారు. ముగ్గరు ప్రచారక్‌లు శివ ప్రకాశ్, కీలకనేత బిఎల్ సంతోష్ (సంఘ్ నుంచి డిప్యుటేషన్‌పై బీజేపీకి వచ్చి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయ్యారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు) విష్ణుదత్ శర్మ బీజేపీ విజయం కోసం వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. (చదవండి: మాయవతి మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు!) వీరిలో శివప్రకాశ్కు పశ్చిమ యూపీపై మంచి పట్టు ఉంది. గడచిన 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనే ఆయన ఈ ప్రాంతంలో బీజేపీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. గతంలో చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోయే ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇప్పుడు గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తూ యోగి ఆదిత్యనాధ్ సర్కారు గడచిన ఐదేళ్లలో సాగించిన అభివృద్ధిని వివరిస్తున్నాయి. కరడుగట్టిన కాషాయనేత మధుర, ఇటావా, మెయిన్‌పురి, ఆగ్రా, ఫిరోజాబాద్, హాత్రస్, మీరట్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్కు తోడు దాని ఉప శాఖ అయిన థర్మ్ జాగరణ్ సమితి వంటివి బీజేపీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తున్నాయి. ‘మేము బీజేపీ విజయాన్ని మాత్రమే కోరుకోవడం లేదు. ఈ దేశహితాన్ని కోరుకుని ముందుకు వెడుతున్నాము’అని ప్రచారక్ మహేంద్ర కుమార్ ఈ ప్రతినిధితో అన్నారు. పశ్చిమ యూపీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి. ఘర్ వాపసీ పేరుతో రాజేశ్వర్ సింగ్ కొన్ని సంవత్సరాల పాటు రీ కన్వర్షన్ (తిరిగి మతంలోకి రావడం) వంటి కార్యకలాపాలు చేపట్టారు. ఘర్ వాపసీ సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనల వల్ల చివరకు ప్రధానమంత్రి మోడి, ముఖ్యమంత్రి యోగి సైతం రాజకీయంగా అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. (చదవండి: కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!) ఒక దశలో ఆర్ఎస్ఎస్ నాయకత్వం రాజేశ్వర్ సింగ్ ను బలవంతంగా అజ్ఞాతంలోకి పంపించాల్సి వచ్చింది. అయినా ఇక్కడి కరుడుగట్టిన హిందూత్వ వాదులు రాజేశ్వర్ సింగ్ ను గట్టిగా సమర్థిస్తున్నారు. ‘ఆయన ఎప్పుడూ తప్పు చేయలేదు. ఆయన చర్యలు ఒకరకంగా బీజేపీకి బాగా తోడ్పడుతున్నాయి’ అని ఘజియాబాద్‌కు చెందిన మోటార్ మెకానిక్ సుందర్ సింగ్ తివారీ అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ చర్యలు ముస్లింలకు మరింత కోపాన్ని తెస్తున్నాయని, వారు గంప గుత్తగా ఎస్పీకి ఓట్లు వేయాలన్న నిర్ణయానికి వచ్చేలా చేస్తున్నాయని మండిపడుతున్న బీజేపీ నేతలూ ఉన్నారు. (చదవండి: యూపీలో ఆట మొదలుపెట్టిన బీజేపీ) -
Yogi Adityanath: ఆయనే బలం, ఆయనే బలహీనత.. ఉప‘యోగి’కి పరీక్ష!
Yogi Adityanath: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛరిష్మాతో ఉత్తరప్రదేశ్‌లో రెండు పర్యాయాలు లోక్‌సభ, ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. యూపీలో ప్రధాని మోదీ తర్వాత అంతటి జనాదరణ కలిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎదిగారు. ఈసారి ఎన్నికలు యోగి కేంద్రంగానే జరగబోతున్నాయి. గత అయిదేళ్లలో బీజేపీకి ఆయనే బలం, ఆయనే బలహీనత అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య హోరాహోరీగా నెలకొన్న యూపీ రణక్షేత్రంలో కమలనాథులకి కలిసొచ్చే అంశాలు, సవాల్ విసిరే అంశాలేమిటో చూద్దాం. – నేషనల్ డెస్క్, సాక్షి కలిసొచ్చే అంశాలు 1. యోగి ఇమేజ్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛరిష్మాతోనే బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగిన నాలుగు నెలల్లోనే యూపీలో బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో 403 స్థానాలకు గాను 312 సీట్లలో విజయం సాధించింది. ఈసారి మోదీ ఛరిష్మాతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కున్న క్రేజ్ పార్టీకి కలిసొస్తోంది. గత ముఖ్యమంత్రులు నిర్లక్ష్యం చేసిన నోయిడా లాంటి ప్రాంతాన్ని ఒక ఆర్థిక హబ్‌గా యోగి తీర్చి దిద్దారు. అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించారు. అవినీతి మచ్చుకైనా లేని సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: చన్నీ, సిద్ధూలు పంజాబ్ ప్రజలను దోచుకున్నారు: అరవింద్ కేజ్రీవాల్ 2.హిందుత్వ ఎజెండా: బీజేపీ రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా హిందుత్వ ఎజెండా చుట్టూ నడుస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం, ఘర్ వాపసీ (ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువుల్ని వెనక్కి తీసుకురావడం) ట్రిపుల్ తలాక్ రద్దు, హిందుత్వ రాజకీయాలను పటిష్టపరచడానికి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వంటివన్నీ యోగి ఆదిత్యనాథ్ హయాంలోనే జరిగాయి. వీటి ప్రభావం ఎంతగా ఉందంటే ఇతర పార్టీల నేతలు కూడా హిందుత్వ వైపు దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆలయాల సందర్శన, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దుర్గాపూజ రోజు వారణాసిలో పూజలు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య సందర్శన వంటివన్నీ ఎంతో కొంత హిందువుల్ని ఆకట్టుకునే వ్యూహంలో భాగమే. చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే 3. శాంతి భద్రతలు: నేరాలు ఘోరాలతో అల్లాడిపోయే ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నేరచరితులు తమ దారి మార్చుకోవాలని లేదంటే యూపీ విడిచి వెళ్లిపోవాలంటూ సీఎం పీఠమెక్కగానే గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద అరెస్ట్‌లు, ఎన్కౌంటర్లు విపరీతంగా జరిగాయి. దీనిపై సీఎం ఏనాడూ ఆత్మరక్షణలో పడకుండా ఎదురుదాడికే దిగేవారు. ఎవరైనా నేరం చేస్తే కాల్చి చంపేస్తామంటూ పోలీసులకు అండగా ఉన్నారు. ఈ కఠిన చర్యలతో నేరాల రేటు యూపీలో బాగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడదే బీజేపీకి ఎన్నికల ప్రచారాంశంగా మారింది. సవాల్ విసిరే అంశాలు 1.రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి: భారతీయ జనతా పార్టీలో ఎవరి స్థాయిలో వారికి నాయకులందరికీ తగినంత ప్రాధాన్యం దక్కుతుంది. ఎందరో ప్రభావం చూపించే నాయకులు ఎదిగేలా పార్టీ నిర్మాణం ఉంటుంది. కానీ యూపీ బీజేపీలో పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీలోని తన గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్న సీఎం యోగి వైఖరిపై చాలా మంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు.. పార్టీలో తగినంత ప్రాధాన్యం తమకు దక్కలేదని వారు వాపోతున్నారు. తమ నియోజకవర్గంలో ఏ చిన్న పని చేపట్టాలన్నా సీఎం కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి రావడంతో రగిలిపోయే పరిస్థితులున్నాయి. అసంతృప్త నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ ఎన్నికల మూడ్ తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. 2.ఓట్లు సంఘటితం: మతం ఆధారంగా ఓట్లను సంఘటితం చేసే వ్యూహాన్ని చాలా కాలంగా బీజేపీ అనుసరిస్తూ వస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో‘‘ ఠాకూర్వాడా’’అనే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఠాకూర్లకు (రాజ్‌పుత్) మద్దతుగా వ్యవహరిస్తూ వారి ఓట్లను సంఘటితం చేసే చర్యలు తీసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మరో బలమైన సామాజిక వర్గం బ్రాహ్మణులు బీజేపీపై అగ్రహంతో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్ర కారం దాదాపుగా 10% ఉన్న బ్రాహ్మణుల్ని దూరం చేసుకొని ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. బ్రాహ్మణుల్ని బుజ్జగిం చడం కో సమే కాంగ్రెస్ నుంచి జితిన్ ప్రసాద వంటి నాయకుల్ని బీజేపీవైపు లా గారు. నలుగురు రైతుల ప్రాణాలు బలిగొన్న లఖీంపూర్ ఖేరి ఘ టనకి బాధ్యతవహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలన్న డిమాండ్లను బీజేపీ అగ్రనాయకత్వం పెడచెవిన పెట్టడానికి మిశ్రా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత కావడమే కారణం. 3.చట్టాలపై నిరసనలు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయం చట్టం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి అతి పెద్ద సవాల్‌గా నిలుస్తున్నాయి. పశ్చిమ యూపీ కేంద్రంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకాయి. రైతుల ఆగ్రహానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత నెలకొంది. కోవిడ్–19 సంక్షోభానికి ముందు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్ని యోగి ఉక్కుపాదంతో అణిచివేసినప్పటికీ వాటి ప్రభావం బీజేపీపై గట్టిగానే పడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
3 నిమిషాల్లో అధ్యక్షుడిని ఒప్పించి టికెట్ సాధించింది.. అసలేం చెప్పిందంటే!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమరం మోగింది. రాజకీయ పార్టీలు గెలుపు కోసం అభ్యర్థుల పేర్లు ఖరారుతో పాటు ఎన్నికల్లో విజయాల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉండగా సమాజ్‌వాదీ అభ్యర్థి రూపాలీ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి అందరినీ ఆకర్షించాయి. తన టికెట్ విషయంలో రూపాలీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను మూడు నిమిషాల్లో ఒప్పించి టికెట్ సాధించినట్లు తెలిపింది. ( చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్ ) ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో జరిగిన భేటీలో రూపాలీ అసలేం చెప్పిందంటే.. ప్రత్యర్థులు జైలులో ఉన్న తన తండ్రిని అవమానించడంతో పాటు ఠాకూర్ కమ్యూనిటీని కించపరిచారని అందుకు వారికి తగిన గుణపాఠం చెప్పదలచుకున్నట్లు తెలిపింది. ఆమె కులతత్వాన్ని విశ్వసించదని, అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వ పథకాలలో పారదర్శకంగా సరైన కేటాయింపులను కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేగాక తాను ఈ సీటు ఖచ్చితంగా గెలిచి తీరుతానని అఖిలేష్‌కి హమి ఇచ్చినట్లు తెలిపింది. రూపాలీ అంత ధీమాగా చెప్పడంతో అఖిలేష్ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పింది. పైగా రూపాలీ కోసం ముందుగా అనుకున్న అభ్యర్థిని కూడా పక్కన పెట్టారు. రూపాలీ న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాల నుంచి రెండు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీలను సంపాదించింది. -
రాష్ట్రపతి పాలనలోనూ యూపీదే రికార్డు
సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైనపుడు, శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధిస్తూ ఉంటుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటిదాకా అధికసార్లు రాష్ట్రపత్రి పాలన విధించారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో వరుసగా రెండోసారి సీఎం సీఠును అధిరోహింకలేకపోయారు. రాష్ట్రం రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లంటే మొత్తం రోజులు ఉత్తరప్రదేశ్ 10 1,689 మణిపూర్ 10 2,337 జమ్మూ కశ్మీర్ 9 3,892 బిహార్ 8 1,001 పంజాబ్ 8 3,477 -
ఒకే పార్టీ టిక్కెట్టు కోసం పోటీపడుతున్న భార్యాభర్తలు
సాక్షి, న్యూఢిల్లీ: అధికారం కోసం కుటుంబ సభ్యులు పోరాడడం సహజం. అయితే, యూపీ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆలుమగలు పోటీపడడం ఆసక్తికరంగా మారింది. సరోజనీనగర్ సీటు కోసం సీఎం యోగి ఆదిత్యనాద్ మంత్రివర్గంలోని స్వాతి సింగ్, ఆమె భర్త పార్టీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 23న నాలుగో దశలో ఈ నియోజకవర్గం ఎన్నిక జరగనుంది. దయాశంకర్ పార్టీ ఎన్నికల కమిటీలో సభ్యుడు కావడంతోపాటు ఇటీవల ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. స్వాతి సింగ్ ప్రస్తుతం పలు శాఖల సహాయ మంత్రిగా, స్వతంత్రహోదా మంత్రిగా ఉన్నారు. 2016లో పార్టీలో చేరిన స్వాతి సింగ్ 2017లో సరోజనీ నగర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏడాదిపాటు దయాశంకర్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. అన్సల్ బిల్డర్స్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసు అధికారిని బెదిరించారంటూ స్వాతి సింగ్‌పైనా ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఓ పక్క భార్యాభర్తలు ఇద్దరూ సరోజనీనగర్‌లో హోర్డింగ్‌లతో హోరెత్తిస్తుంటే పార్టీ అధిష్ఠానం మూడో వ్యక్తిని పరిశీలించే అవకాశం లేకపోలేదని సీనియర్ నేతలు చెబుతున్నారు. మంత్రి మహేంద్ర సింగ్, మాజీ సీఎం కల్యాణ్ సింగ్ సన్నిహితుడు రాజేష్‌సింగ్ చౌహాన్, మాజీ కౌన్సిలర్లు గోవింద్పాండే, రామశంకర్త్రిపాఠిలతోపాటు సౌరభ్‌సింగ్, జిల్లా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్‌కుమార్ సింగ్ చౌహాన్ కూడా ఈ సీటును ఆశిస్తుండంతో అధిష్ఠానం వీరి పేర్లూ పరిశీలిస్తోంది. -
పార్టీ గెలుపోటములలో దళితులే నిర్ణేతలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు నిర్ణయించడంలో దళితులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వీరికి రిజర్వ్ చేసిన స్థానాల్లో అధిక స్థానాలను దక్కించుకున్న పార్టీలే అధికార పీఠం ఎక్కిన నేపథ్యంలో అందరూ వీరిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో మునిగితేలుతున్నారు. గత ఎన్నికల్లో 84 ఎస్సీ రిజర్వ్డ్ (రెండు ఎస్టీలకు రిజర్వు అయి ఉన్నాయి) స్థానాల్లో ఏకంగా 70 స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరోమారు తమ ఓటుబ్యాంకు స్థిరంగా ఉంచుకునేందుకు నానాతంటాలు పడుతుండగా, వాటిని కొల్లగొట్టేందుకు సమాజ్‌వాదీ అనేక ఎత్తులు వేస్తోంది. ఇక తన సామాజిక వర్గానికే చెందిన సీట్లలో గత ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఎస్పీ అధినేత మాయావతి తన బలాన్ని చూపేందుకు తహతహలాడుతున్నారు. 68 శాతం సీట్లు కొడితే అధికారమే... యూపీలో 15 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో కనీసంగా 21 శాతం మంది అంటే సుమారు 3.15 కోట్ల మంది దళితులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా 2.25 కోట్ల మంది జాతవ్ వర్గానికే చెందిన వారు కాగా, 16 శాతం మందితో పాసీలు 70 నుంచి 80 లక్షల మంది వరకు ఉంటారు. మిగతా కులాల వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు. మొత్తంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 84 ఉన్నాయి. ఇందులో 68శాతానికి మించి సీట్లు సాధించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని గత గణాంకాలు చెబుతున్నాయి. 2007లో బీఎస్పీ 61 స్థానాల(69శాతం)ను సాధించి అధికారంలోకి వస్తే, 2012లో ఎస్పీ 58 స్థానాలు (68శాతం) సాధించి అధికార పీఠమెక్కింది. ఇక 2017లో అయితే బీజేపీ ఏకంగా 70 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ కనీసంగా 58 స్థానాలను దక్కించుకునే పార్టీనే అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని పార్టీలు వీరిని ఆకర్షించే పనిలో పడ్డాయి. ఆకర్షణ మంత్రాల్లో పార్టీలు... ముఖ్యంగా ఈ స్థానాల్లో తమ పట్టు ఏమాత్రం సడలకుండా చూసుకునేందుకు అధికార పార్టీ అనేక ఎత్తులు వేస్తోంది. 2012 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు 14 శాతం మాత్రమే బీజేపీ దక్కించుకోగా, అది 2017లో ఏకంగా 40శాతానికి పెరిగింది. 84 రిజర్వ్డ్ స్థానాలకు గానూ 65 మంది జాతవేతర వర్గాల వారికే సీట్లు కేటాయించి ఆ స్థానాల్లో గెలిచి చూపించింది. నిజానికి జాతవ్‌లంతా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో ఉన్నప్పటికీ దోబీ, ఖాటిక్, పాసీ, వాల్మీకి వంటి జాతవేతర వర్గాలను ఆకర్షించి ఏకంగా 70 స్థానాలను దక్కించుకుంది. దక్కిన స్థానాలను దృష్టి పెట్టుకొనే యూపీ కేబినెట్లో ఏకంగా ఎనిమిది మందిని మంత్రులను చేసింది. ప్రస్తుతం ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారు ప్రభుత్వ పథకాల నుండి పొందిన ప్రయోజనాలను నొక్కి చెప్పేలా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎస్పీ వర్గాలు పొందుతున్న గృహాలు, మరుగుదొడ్లు, ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీ సౌకర్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తూ వారి ఓట్లకు గాలమేస్తోంది. దళితులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చామని బీజేపీ చెప్పుకుంటున్నా ఓట్లను తెచ్చిపెట్టే నేతలు లేకపోవడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీలో యోగికి ఉన్న ప్రజాదరణ, పథకాలతోనే ఎస్సీలను ఆకర్షించే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దళితులను ఆకట్టుకునేలా అంబేడ్కర్ జయంతిని ‘దళిత్ దివాళి’గా ప్రకటించాలని చేసిన వినతి పెద్ద చర్చకే దారితీసింది. దీనికి తోడు గడిచిన సెప్టెంబర్‌లో 15 రోజుల పాటు గ్రామీణ దళిత ఓటర్లే లక్ష్యంగా ‘గ్రామగ్రామాన దళితులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించింది. తాను ప్రకటించిన గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి హామీలు ఎక్కువగా దళిత వర్గాలకే లాభం చేస్తాయని ఆయన పదేపదే తన సమావేశాల్లో అఖిలేశ్ ప్రస్తావిస్తున్నారు. మరోపక్క బీఎస్పీ 2007 ఎన్నికల్లో అమలు చేసిన ’బ్రదర్హుడ్’ విధానాన్ని అనుసరించేలా నిర్ణయాలు చేసింది. వివిధ మండలాల్లో సమావేశాల ద్వారా ప్రజలను సమావేశపరిచి సంప్రదాయ దళితుల ఓట్లతో పాటు బ్రాహ్మణ, వెనుకబడిన తరగతులు, ముస్లిం సమాజం మద్దతు కూడగట్టే ప్రణాళికలు అమలుపరుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సితాపూర్లోని సిధౌలీ, అజంగఢ్‌లోని లాల్గంజ్ స్థానాలను మాత్రమే పొందిన బీఎస్పీ ఈమారు తన సత్తా చాటుకునేలా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. -
టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం
Up Assembly elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపించిన కొద్దీ పార్టీలు ఓట్ల లెక్కల్లో తలమునకలైపోతున్నాయి. కిందటిసారి 2017లో యూపీలోని 47 సీట్లలో ఆయా పార్టీల అభ్యర్థులు ఐదు వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయారు. పోటాపోటీగా ఎన్నికల జోరు జరుగుతున్న ప్రస్తుతం తరుణంలో పార్టీలు ఈ 47 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటును కూడా పక్కకు పోనివ్వకూడదనే పట్టుదలతో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నాయి. మెజారిటీలైనా, ఓడిన మార్జిన్లైనా స్వల్పంగా ఉన్నందువల్ల ఈసారి రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తున్నాయి. ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి అయితే మేలు... స్థానికంగా ఎవరికి పరపతి ఉంది, అభ్యర్థుల కలుపుగోలుతనం... తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకొని అలవాంటి వారినే ప్రోత్సహిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు సర్వేలు ద్వారా ధ్రువీకరించుకున్నాకే టికెట్లను కేటాయిస్తున్నారు. చదవండి: సీఎం యోగిపై పోటీకి రెడీ.. టిక్కెట్ ఇవ్వండి ఏక్ ఔర్ దక్కా... స్వల్ప తేడాలతోనే గతంలో తామీ సీట్లను పొగొట్టుకున్నాం కాబట్టి ఈసారి మరింత కష్టపడితే గెలుపు తమదే అవుతుందని రాజకీయపక్షాలు లెక్కలేసుకుంటున్నాయి. హిందుత్వ కార్డు, అభివృద్ధి మంత్రానికి తోడు స్థానికంగా అభ్యర్థి ప్రభావం కలిసి తమను విజయతీరాలకు చేరుస్తుందని బీజేపీ నమ్ముతోంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చిన్నాచితక పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నందువల్ల ఇలాంటి గెలుపొటముల మధ్య అతితక్కువ తేడాలున్న ఈ నియోజకవర్గాల సామాజికవర్గాల సమీకరణ తమకు లాభిస్తుందని ఎస్పీ చీఫ్ నమ్మకంతో ఉన్నారు. చదవండి: Punjab Assembly Election 2022: భగవంత్ మాన్.. ఆప్ బూస్టర్ షాట్ ఓబీసీల్లో కీలకమైన నేతలుగా గుర్తింపు పొందిన స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్లు బీజేపీని వీడి తమ పంచన చేరడం బాగా అనుకూలించే విషయమని అఖిలేశ్ నమ్ముతున్నారు. ఎందుకంటే మొత్తం యూపీ జనాభాలో 50 శాతం ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ తలరాత మార్చాలన్నా అది వీరిచేతుత్లోనే ఉంటుంది. కిందటి ఎన్నికల్లో దుమారియగంజ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్ కేవలం 171 ఓట్లతో బీఎస్పీ అభ్యర్థి సయేదా ఖాతూన్‌పై నెగ్గారు. ఐదు వందల ఓట్లలోపు తేడాతో ఐదు చోట్ల వివిధ పార్టీలు పరాజయం చవిచూశారు. కాగా, మరో ఇద్దరు 1,000 ఓట్లలోపు తేడాతో ఓడిపోయారు. -
సీఎం యోగిపై పోటీకి రెడీ.. టిక్కెట్ ఇవ్వండి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీకి తాను సిద్ధమని డాక్టర్ కఫీల్ ఖాన్ ప్రకటించారు. ‘గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. ఏ పార్టీ అయినా నాకు టిక్కెట్ ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నాను' అని పీటీఐతో డాక్టర్ ఖాన్ చెప్పారు. (చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు; ఆసక్తికర పరిణామాలు) చర్చలు జరుగుతున్నాయి మీరు ఏదైనా పార్టీతో టచ్‌లో ఉన్నారా, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అని అడిగినప్పుడు.. ‘అవును, సంప్రదింపులు జరుగుతున్నాయి, అన్నీ కుదిరితే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాన’ని సమాధానం ఇచ్చారు. గోరఖ్‌పూర్‌లో 2017, ఆగస్టులో జరిగిన దుర్ఘటనలో తనను బలిపశువు చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. ఇప్పటికీ ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోరఖ్‌పూర్ పోలీసులు పదే పదే తమ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రెండు సస్పెన్షన్లు.. రెండుసార్లు జైలు గోరఖ్‌పూర్‌లో 2017, ఆగస్టులో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చోటుచేసుకున్న దుర్ఘటనతో కఫీల్ ఖాన్ జీవితం తలక్రిందులైంది. ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో డాక్టర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు జైలు పాలయ్యారు. రెండు పర్యాయాలు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల ఆధారంగా ‘ది గోరఖ్‌పూర్ హాస్పిటల్ ట్రాజెడీ- ఏ డాక్టర్స్ మెమోయిర్ ఆఫ్ ఎ డెడ్లీ మెడికల్ క్రైసిస్' పేరుతో పుస్తకం రాశారు. 5000 కాపీలకు పైగా అమ్ముడవడంతో ఈ బుక్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిందని డాక్టర్ ఖాన్ తెలిపారు. ఇప్పటికీ పోలీసుల వేధింపులు ఆగలేదన్నారు. (చదవండి: ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్..) రౌడీ షీటర్ అంటున్నారు ‘డిసెంబర్ 17, 2021న నా పుస్తకాన్ని లాంచ్ చేసిన తర్వాత డిసెంబర్ 20న పోలీసులు మా ఇంటికి వచ్చారు. తర్వాత డిసెంబర్ 28న ఒకసారి, మళ్లీ జనవరిలో వచ్చారు. నేను గోరఖ్‌పూర్‌లోని రాజ్‌ఘాట్ పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీటర్ని అని పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హిస్టరీ షీటర్లపై కన్నేసి ఉంచామని అంటున్నార’ని డాక్టర్ ఖాన్ వెల్లడించారు. (చదవండి: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..) నా జీవితం నాశనం చేశారు పాలకులు నిర్లక్ష్యం కారణంగానే గోరఖ్‌పూర్ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఫలితంగా 54 గంటల వ్యవధిలో 80 మంది పసివాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పారు. నిజాలకు పాతర వేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ అయితే ప్రకృతి విపత్తుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆస్పత్రి అథారిటీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు తనను జైలుకు పంపారని, తన సోదరుడిపై దాడికి పాల్పడ్డారని.. కుటుంబ వ్యాపారాన్ని నాశనం చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. తనను జైలు నుంచి విడిపించేందుకు తన తల్లి, భార్య ఎంతో కష్టపడ్డారని తెలిపారు. తాను రాసిన పుస్తకం చదివితే ప్రస్తుతం మనం ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నామన్న విషయం తెలుస్తుందన్నారు. (చదవండి: సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?) -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు; ఆసక్తికర పరిణామాలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. అయా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి. ‘కెప్టెన్’ ఆరోపణలను ఖండించిన అల్కా పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మంత్రి పదవి కోసం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాబీయింగ్ చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఖండించారు. ‘కెప్టెన్’ తన మిత్రపక్షమైన బీజేపీ మాటలు వల్లెవేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 27న పంజాబ్‌కు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. 117 మంది పార్టీ అభ్యర్థులతో కలిసి స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని చెప్పారు. తర్వాత వర్చువల్ ర్యాలీని నిర్వహిస్తారని చెప్పారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనను పార్టీ కండువాతో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ స్వాగతించారు. 32 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనను ఇప్పుడు పక్కన పెట్టారని ఈ సందర్భంగా ఆర్పీఎన్ సింగ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభమైందని, ప్రధాని మోది ఆశయ సాధనకు కార్యకర్తలా పనిచేస్తానని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ హామీ ఉత్తరాఖండ్‌లో తాము అధికారంలోని వస్తే ఎల్పీజీ సిలిండర్ ధర రూ.500 కంటే తక్కువకు పరిమితం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు. తాము పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. 2న ఆగ్రాలో మాయావతి సభ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 2న ఆగ్రాలో జరిగే బహిరంగ సభలో మాయావతి ప్రసంగిస్తారని బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా తెలిపారు. అప్నా దళ్ స్టార్ కాంపెయినర్లు వీరే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి, రెండవ దశ ఎన్నికల స్టార్ ప్రచారకుల జాబితాను అప్నా దళ్ (సోనీలాల్) పార్టీ విడుదల చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్.. ఆమె భర్త, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిష్ పటేల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేడీ(యూ) తొలి జాబితా ఇదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 20 మంది అభ్యర్థుల పేర్లతో జనతాదల్ యునైటెడ్ పార్టీ మొదటి జాబితాను మంగళవారం విడుదల చేసింది. ‘ఆప్’ నాలుగో జాబితా విడుదల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 10 మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విడుదల చేసింది. -
యూపీలో కాంగ్రెస్‌కు భారీ ఎదురు దెబ్బ.. బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కోలది ఆయా పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా, యూపీకి చెందిన కాంగ్రెస్ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఈ సంఘటన యూపీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఆర్పీఎన్ సింగ్ యూపీలో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకుడు.. పడ్రానా నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపోందారు. కాగా, యూపీలో కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఈయన కూడా ఒకరు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించారు. కాగా, ఆయన మంగళవారం సోనియా గాంధీకి రాసిన రాజీనామాను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. నా రాజకీయ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్పీఎన్ సింగ్ మంగళవారం బీజేపీ డిప్యూటి సీఎం కేశవ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ.. అదే విధంగా యూపీ బీజేపీ ఇన్చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో కాషాయ జెండా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్పీఎన్ సింగ్ మాట్లాడుతూ.. 32 సంవత్సరాలు తాను కాంగ్రెస్ పార్టీకోసం పనిచేశానన్నారు. కానీ కాంగ్రెస్ గతంలో మాదిరిగా ప్రస్తుతం లేదన్నారు. అయితే, తాను.. బీజేపీని అధికారంలోకి తేవడానికి ఒక సాధారణ కార్యకర్త మాదిరిగా పనిచేస్తానని తెలిపారు. బీజేపీ అధినాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. కాగా, ఆర్పీఎన్ సింగ్ పద్రౌనా నియోజక వర్గం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఖుషీనగర్ నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఆయనకు స్థానికంగా మంచి నాయకుడిగా పేరు ఉంది. అయితే, ఆర్పీఎన్ సింగ్ పద్రౌనా నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటికి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీని వీడిన మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య స్థానాన్ని.. ఆర్పీఎన్ సింగ్ భర్తీ చేస్తారని పలువురు భావిస్తున్నారు. ప్రసాద్ మౌర్యకు గట్టిపోటిని కూడా ఇస్తారని స్థానిక నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పద్రౌనా నుంచి ప్రసాద్ మౌర్య కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఈ స్థానం నుంచి ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఆర్పీఎన్ సింగ్ తన అనుచరులకు పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో కలత చెందినట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో యూపీలో రెండేళ్లలో పలువురు కీలక నేతలను కోల్పోయింది. పార్టీని వీడిన వారంతా.. రాహుల్‌కు సన్నిహితులు కావడం గమనార్హం. గతంలో జితిన్ ప్రసాద్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ తర్వాత యోగి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కూడా పార్టీ మారిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది నాయకులు సోనియా గాంధీకి లేఖలు సైతం రాశారు. కాగా, ఆర్పీఎన్ సింగ్ రాజీనామాపై జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజేష్ ఠాకూర్ స్పందించారు. సింగ్.. పార్టీని వీడటం బాధగా ఉందని తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: సిద్ధూను మంత్రిని చేయమని పాక్ కోరింది: అమరీందర్ సింగ్ -
ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్.. యోగి లేకుంటే సీఎం అయ్యేవారే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాషాయ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న ఓబీసీ నేతలు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ... సామాజిక సమీకరణాలు మారకుండా చూసుకునేందుకు పార్టీ నమ్ముకున్న ఏకైక వ్యక్తి ‘కేశవ్ ప్రసాద్ మౌర్య’. ఐదేళ్ల కిందట యూపీ పీఠాన్ని అధిరోహించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముందుండి నాయకత్వం వహించిన ఆయనే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీకి పెద్దదిక్కుగా మారారు. ఓబీసీల్లో బలమైన పట్టున్న కేశవ్ప్రసాద్నే ప్రధాన ముఖంగా పెట్టి ఎన్నికలను ఢీకొనే కార్యాచరణను తీసుకోవడంతో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగింది. 2017లోనే ముఖ్యమంత్రి పదవికి ఆయన బలమైన పోటీదారుగా ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రాగా, ఈ మారు మాత్రం మౌర్యను సీఎంగా చూడాలనుకుంటున్న నేతల సంఖ్య గణనీయంగా పెరగడం ఆయన ఛరిష్మాను చెప్పకనే చెబుతోంది. (చదవండి: స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం) సంఘ్ నుంచి డిప్యూటీ దాకా... యూపీలో అధికంగా ఓబీసీ వర్గాలకు చెందిన వారు 42 శాతం వరకు ఉండగా, వర్గాల్లో అధిక పట్టు కలిగిన వర్గంగా మౌర్యాలు ఉన్నారు. మౌర్య వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్‌కు తొలినుంచి జన్‌సంఘ్ బజ్రంగ్దళ్తో అనుబంధం ఉంది, గోసంరక్షణ, రామజన్మభూమి ఉద్యమాల్లో పాల్గొన్న కేశవ్‌ప్రసాద్ అనంతరం బీజేపీలో చేరి వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం 2002, 2007లో సిరతు నియోకవర్గం నుంచి ఓడిన కేశ్ప్రసాద్ తదనంతరం 2012లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014 ఎన్నికల్లో పుల్పూర్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. జవహార్‌లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండగా, దాన్ని బద్ధలు కొట్టడంతో ఈయన పేరు అందరికీ తెలిసింది. అనంతరం 2016లో సంఘ్ జోక్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నాయకత్వ బాధ్యతలను పూర్తిగా తనపై మోసిన కేశవ్‌ప్రసాద్ ఏకంగా 200 ర్యాలీలు చేపట్టి 312 సీట్లు రావడంలో కీలకపాత్ర పోషించారు. ఈ సమయంలోనే కేశవ్‌ప్రసాద్‌ను సీఎంను చేస్తారని అంతా భావించినా అనూహ్యంగా యోగి తెరపైకి రావడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేసి డిప్యూటీ సీఎం చేశారు. పీడబ్ల్యూడీ మంత్రిగా యూపీ అభివృధ్ధిలో తనదైన ముద్ర వేసిన కేశవ్‌ప్రసాద్ తనకిచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఇద్దరు ఓబీసీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్లు పార్టీని వీడటంతో పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. ఈ సమయంలో కేశవ్‌ప్రసాద్ మౌర్య అత్యంత కీలకంగా వ్యవహరించి, మరింతమంది ఓబీసీ నేతలు జారిపోకుండా చర్యలు చేపట్టారు. అదీగాక సమాజ్‌వాదీ పార్టీలో బలంగా ఉన్న యాదవేతర నేతలు బీజేపీలో చేరేలా కృషి చేశారు. దీంతో పాటే పార్టీ మిత్రపక్షాలు, అప్నాదళ్, నిషాద్ పార్టీలతో కేశవ్ మౌర్యకు ఉన్న మంచి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఆయనకు సీట్ల సర్దుబాటుకు ప్రధాన అనుసంధాన కర్తగా పెట్టింది. ఆయన వల్లే సీట్ల సర్దుబాటు అంశం సాఫీగా సాగిందనే భావన ఉంది. ఇక ఆయను ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయించే అంశమై చర్చోపచర్చలు జరగ్గా, తన సొంత నియోకవర్గం సిరాతు నుంచి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపారు. ఈ స్థానంలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే శీతలా ప్రసాద్ సైతం కేశవ్‌ప్రసాద్‌కు సిరాత్ టిక్కెట్ కేటాయించడాన్ని స్వాగతించారు. తన గురువు కోసం సీటును త్యాగం చేయడం తనకేబి ఇబ్బందిగా లేదని ప్రకటించిందంటే కేశవ్‌ప్రసాద్‌పై లాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్..) -
Yogi Adityanath: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్..
ఆరెస్సెస్ తయారు చేసిన నాయకుడు కాదు కానీ ఆ సంస్థకే హిందుత్వ ఎజెండాపై పాఠాలు చెప్పగలరు. జన్‌సంఘ్–బీజేపీ మూలాలు ఉన్నవారు కాదు కానీ కమలం పార్టీకే దేశభక్తిపై ప్రబోధాలు చెయ్యగలరు. గోరఖ్‌నాథ్ మఠం నీడలో, స్వయంశక్తితో ఎదిగారు. హిందూరాజ్య స్థాపనే లక్ష్యమని ఎలుగెత్తి చాటుతున్నారు. కుదిరితే ఆయనని ప్రేమిస్తారు. లేదంటే ద్వేషిస్తారు/ ఆయన విషయంలో మధ్యేమార్గానికి తావే లేదు. అభిమానులు భావి భారత ప్రధానిగా కీర్తిస్తారు/ ఆయనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్/ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి ప్రధాని మోదీ ఛరిష్మాయే బలం. కానీ యూపీలో యోగి జనాకర్షణ అదనపు బలం. మతపరంగా ఓట్లను సంఘటితం చేయడమనే ఏకైక వ్యూహంతోనే మళ్లీ సీఎం పీఠం ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నారు. చదవండి: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే.. ► 1972 సంవత్సరం జూన్ 5న పాంచూర్ జిల్లా పౌరి ఘర్వాల్ (ఇప్పటి ఉత్తరాఖండ్)లో ఆనంద్‌సింగ్ బిస్త్, సావిత్రి దేవి దంపతులకు జన్మించారు ► రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన యోగి అసలు పేరు అజయ్‌సింగ్ బిస్త్. ► రిషికేష్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. గణిత శాస్త్రంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు ► 1990 ప్రాంతంలో అయోధ్యలో రామ మందిరం ఉద్యమంలో చేరారు. యూపీ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారి అవైద్యనాథ్కి ప్రథమ శిష్యుడిగా మారారు. ఆయనే అజయ్‌సింగ్ పేరుని యోగి ఆదిత్యనాథ్‌గా మార్చారు. చదవండి: యూపీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే ►1994లో గోరఖ్‌నాథ్ మఠం పూజారి అయ్యారు. ► రాజకీయాల నుంచి అవైద్యనాథ్ విశ్రాంతి తీసుకున్నాక ఆయన అడుగుజాడల్లో 1998లో తన 26 ఏళ్ల వయసులోనే బీజేపీ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పట్నుంచి వరసగా అయిదుసార్లు గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు ► 2002లో హిందు యువ వాహిని అనే సంస్థను స్థాపించి గో సంరక్షణ, లవ్ జిహాదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన ఇమేజ్ను పెంచుకున్నారు. ►2014లో అవైద్యనాథ్ కన్నుమూశాక గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారిగా యోగి నియమితులయ్యారు. గోరఖ్‌నాథ్ ట్రస్ట్ ఫండ్ నిర్వహించే ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలల బాధ్యతలు కూడా తీసుకున్నారు. ►బీజేపీ అధిష్టానంతో యోగి ఆదిత్యనాథ్ సంబంధాలు ఎప్పుడూ అంత సఖ్యంగా లేవు. హిందుత్వపై బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న ఆరోపించేవారు. విభేదాలు వచ్చిన ప్రతీసారి బీజేపీ అభ్యర్థులపై తన సొంత మనుషుల్ని పోటీకి నిలిపి గెలిపించుకునేవారు. దీంతో పార్టీయే తన మాట వినే పరిస్థితి తీసుకువచ్చేవారు. ► యోగి ఒక క్రౌడ్ పుల్లర్. ఆయన మాటలు తూటాల్లా పేలుతూ ఉంటాయి. యోగి ఉపన్యాసాలు వినడానికి జనం ఎగబడతారు. ఆ లక్షణాలే బీజేపీలో ఆయనని స్టార్ క్యాంపైనర్ని చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచాక సూపర్‌స్టార్‌గా మారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించారు. ►అప్పటికే గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్న ఆయన ఆ పదవికి రాజీనామా చేసి సీఎం అయ్యాక శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇప్పుడు గోరఖ్‌పూర్ నుంచి తొలిసారిగా అసెంబ్లీ బరిలో దిగుతున్నారు ► అవినీతి, భయం, హింస, చీకట్లు లేని ఉత్తరప్రదేశ్ దిశగా తీసుకువెళ్లడంలో విజయవంతమవుతున్నానని యోగి పదే పదే చెప్పుకుంటున్నారు. రాష్ట్ర వార్షిక స్థూల ఉత్పత్తిని రూ.10.9 లక్షల కోట్ల నుంచి రూ.21.73 లక్షల కోట్లకి తీసుకువెళ్లినట్టు యోగి చెప్పుకున్నారు. ►శాంతి భద్రతలు అమలు ఎలా ఉంటుందో చూడాలంటే యూపీకి రండి అంటూ ఆయన సవాల్ చేస్తూ ఉంటారు. కానీ యూపీలో మహిళలపై గత అయిదేళ్లలో నేరాలు 66 శాతం పెరిగాయని స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ►యోగి అధికారంలోకి వచ్చాక యూపీలో జరిగిన ఘర్షణల్లో 43% మైనార్టీలపై దాడులేనని మానవహక్కుల కమిషన్ వెల్లడించింది. ► బలవంతపు మతమార్పిడుల నిషేధ చట్టం, జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చారు. ►అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కట్టడికి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. ► ‘‘నేను హిందువుని అలా చెప్పుకోవడానికి గర్వపడతా’’ అని ప్రకటించుకుంటారు. హిందుత్వ ఎజెండా యోగిని ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు ఆదుకుంటుందో చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో జట్టు కట్టాలన్న ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఐదు నెలలపాటు చర్చలు జరిపానని, కానీ ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌తో చర్చలు, బీజేపీ ఓటమి తదితర అంశాలపై ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు. ఒక సంస్థగా కాంగ్రెస్ పట్ల తనకు గౌరవభావం ఉందన్నారు. కాంగ్రెస్ లేకుండా దేశంలో ప్రభావవంతమైన ప్రతిపక్షం సాధ్యం కాదని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్‌కు అంత శక్తి లేదని, బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌లో పునర్వ్యవస్థీకరణ అవసరమని చెప్పారు. కాంగ్రెస్‌లో తాను చేరాలనుకోవడం కేవలం ఏదో ఒక ఎన్నికల కోసం కాదని, పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని తాను భావించానని చెప్పారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌లో చేరికపై దాదాపు రెండేళ్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆ సమయంలో చాలామంది తాను కాంగ్రెస్‌లో చేరుతున్నాననే భావించారన్నారు. కానీ ఇందుకు ఇరు పక్షాలు పరస్పర విశ్వాసంతో ఒకడుగు ముందుకు వేయాల్సిఉందని, కాంగ్రెస్‌తో అలా జరగలేదని చెప్పారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం తనకు చేదు అనుభవమని, అప్పటినుంచి కాంగ్రెస్‌లో చేరడంపై సందేహంగానే ఉన్నానని చెప్పారు. అలాగే తాను పూర్తిస్థాయిలో విశ్వాసపాత్రుడిగా ఉండనని కాంగ్రెస్ భావించిఉండవచ్చన్నారు. (చదవండి: బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల) ఇలా సాధ్యం.. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సరే, 2024లో ఆ పార్టీని ఓడించడం సాధ్యమేనని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. 2024లో ప్రతిపక్ష కూటమి బీజేపీని ఓడించేందుకు తాను సాయం చేయాలని భావించానని చెప్పారు. అయితే ఇందుకు ప్రస్తుత పార్టీలు, నాయకత్వాలు, కూటములు పనికిరావని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పార్టీలు కొన్ని సర్దుబాట్లు, కొన్ని మార్పులు చేసుకుంటే బీజేపీని ఓడించవచ్చని, ఇందుకోసం కొత్తగా ఒక జాతీయస్థాయి పార్టీ పుట్టుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. దాదాపు 200 సీట్లున్న బీహార్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీకి దక్కినవి కేవలం 50 సీట్లేనని గుర్తు చేశారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లోని 350 సీట్లలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందని, అందుకే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో విపక్షాలు సర్దుబాట్లు, వ్యూహాలతో వ్యవహరించి పైన చెప్పిన 200 సీట్లలో 100 సీట్లను కొల్లగొడితే ఇప్పుడున్న సీట్లతో కలిపి ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 200– 250ని చేరుతుందన్నారు. అప్పుడు బీజేపీని ఓడించేందుకు ఉత్తరాన లేదా పశ్చిమాన మరో 100 సీట్లు గెలిస్తేచాలన్నారు. ఈ వ్యూహంతో 2024లో ప్రతిపక్షాలకు సాయం చేయాలని తాను భావించానని ప్రశాంత్ చెప్పారు. ఆ మూడే బలం.. హిందుత్వ, అతి జాతీయవాదం, సంక్షేమాన్ని జతకలిపి బీజేపీ బలమైన ఆయుధం తయారు చేసుకుందని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. వీటిలో కనీసం రెండిటి విషయంలో ప్రతిపక్షాలు ప్రజలకు నమ్మకం కలిగిం చాల్సిఉందన్నారు. ఇది చేయకుండా మహా కూటమి పేరిట ఎన్ని పార్టీలు కలిసిపొత్తులు పెట్టుకున్నా ఉపయోగం ఉండదన్నారు. దేశంలోని ఎంపీ సీట్లలో దాదాపు 200 సీట్లలో కాంగ్రెస్– బీజేపీ మధ్యనే పోటీ ఉందని, వీటిలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ దాదాపు 95 శాతం సీట్లు గెలుస్తోందని గుర్తు చేశారు. రాబోయే రాష్ట్రాల ఎన్నికలను 2024కు సూచికగా పరిగణించాల్సిన అవస రం లేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవచ్చని చెప్పారు. యూపీలో బీజేపీపై గెలవాలంటే సోషల్ బేస్‌ను విస్తరించుకోవాలని సూచించారు. బీజేపీని ఓడించాలనుకునే పార్టీ లేదా నాయకుడికి కనీసం 5– 10ఏళ్లకు సరిపడా వ్యూహరచన ఉండాలని, ఐదు నెలల్లో అద్భుతాలు జరగవని చెప్పారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలన్నదే తన అభిమతమన్నారు. టీఎంసీకి సాయం చేయడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని, కాంగ్రెస్‌పై కక్షతో టీఎంసీకి సాయం చేశాననడం సరికాదని తెలిపారు. ఒక బడా పార్టీపై కక్ష కట్టే శక్తి తనకు లేదని, తను చాల చిన్న వ్యక్తినని చమత్కరించారు. (చదవండి: స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడికి ‘నో ఛాన్స్’) -
స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడికి ‘నో ఛాన్స్’
ఇటీవల ఎస్పీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడు ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ అధినేత మొండిచేయి ఇచ్చారు. 2017 ఎన్నికల్లో ఉంచహార్ నుంచి పోటీ చేసి 1,934 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ సీటు కేటాయిస్తారని ఊహాగానాల మధ్య, సిట్టింగ్ ఎమ్మెల్యే మనోజ్ పాండే వైపే అఖిలేష్ మొగ్గు చూపారు. అయితే తొలి జాబితాలో స్వామి ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్న పండ్రౌనా స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ జస్వంత్‌నగర్ నుంచి పోటీకి దిగుతుండగా, రాంపూర్ స్వర్ నుంచి ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం బరిలోకి దిగనున్నారు. -
159 మందితో ఎస్పీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో దిగారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపక్షాల నుంచి వచ్చిన సవాళ్ళ నేపథ్యంలో మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు సోమవారం పార్టీ ప్రకటించిన 159 మంది అభ్యర్థుల తొలి జాబితాలో అఖిలేశ్ పేరు ప్రథమంగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి.. ముఖ్యంగా యాదవులకు కంచుకోటగా ఉన్న కర్హల్... మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్‌లో సమాజ్‌వాదీ జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్‌సింగ్ యాదవ్ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు. 2012లో ఎస్పీ ప్రభుత్వం ఏర్పడి అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పటికీ, శాసనమండలి సభ్యుడిగానే ఉన్నారు. 2000 నుంచి 2012 వరకు కన్నౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన అఖిలేశ్ 2019 ఎన్నికల్లో ఆజంఘఢ్ నుంచి ఎంపీగా గెలిచారు. -
సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఫిబ్రవరి 21, 1998న గవర్నర్ రమేశ్ భండారీ డిస్మిస్ చేయడంతో లోక్తాంత్రిక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగదాంబికా పాల్ సీఎం పదవి చేపట్టారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి.. మళ్లీ బలపరీక్షకు ఆదేశించింది. దీంట్లో నెగ్గి కల్యాణ్‌సింగ్ మళ్లీ సీఎం అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక 10 రోజుల్లోపే దిగిపోయిన వారి జాబితా ఇది... చదవండి: 14 మంది ప్రధానుల్లో 9 మంది యూపీ నుంచే.. -
14 మంది ప్రధానుల్లో 9 మంది యూపీ నుంచే..
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా భారత్‌ను 14 మంది ప్రధానమంత్రులు పాలించగా... వారిలో ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ యూపీలో వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. యూపీకి చెందిన వారు, యూపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన వారిలో ఎవరెన్ని రోజులు అధికారంలో ఉన్నారంటే... -
యూపీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నాయి. బీజేపీ తరపున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం సాగిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున అఖిలేశ్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా భుజానికెత్తుకున్నారు. తమ పార్టీ ప్రధాన ప్రచారకర్తల(స్టార్ క్యాంపెయినర్లు) జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్‌లతో పాటు ఇటీవల పార్టీలో చేరిన విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌లతో పాటు 30 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. (చదవండి: సమాజ్‌వాదీ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి) -
సమాజ్‌వాదీ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి
లక్నో/ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీల మధ్య వలసలు అధికంగా ఉన్నాయి. రెండు పార్టీలు పోటా పోటీగా ‘గోడ దూకుళ్ల’ను ప్రోత్సహిస్తున్నాయి. బీజేపీ నేత, జలాలాబాద్ అభ్యర్థి అనిల్ వర్మ తన మద్దతుదారులతో కలసి సోమవారం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ కూడా సమాజ్ వాదీ పార్టీలోకి మారిపోయారు. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ తనకు టిక్కెట్ నిరాకరించడంపై స్పందిస్తూ... ‘బీజేపీ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేశాను, అయినప్పటికీ నాకు టిక్కెట్ నిరాకరించారు. యువతను ప్రోత్సహిస్తామని చెప్పి 75 ఏళ్ల వృద్ధుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామ’ని జితేంద్ర వర్మ అన్నారు. (చదవండి: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి...) జలాల్‌పూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే, సుభాష్ రాయ్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. -
ఉప ముఖ్యమంత్రి మొహం మీదే తలుపులు వేసిన మహిళలు
సాక్షి, న్యూఢిలీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్మౌర్యకు చుక్కెదురైంది. తన సొంత నియోజగవర్గం సిరాతూలో కొందరు మహిళలు.. మౌర్య మొహం మీదే తలుపులు మూసేశారు. ప్రచారంలో భాగంగా మూడురోజుల నుంచి కనిపించకుండా పోయిన జిల్లా పంచాయతీ సభ్యుడు రాజేశ్ మౌర్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం ఆయన వెళ్లారు. ఈ క్రమంలోనే స్థానికులు.. డిప్యూటీ సీఎం రాగానే తలుపులు మూసుకున్నారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని నిశబ్దంగా ఉండాలని మౌర్య చేతితో సంజ్ఞలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే రాజేశ్ మౌర్య కేసులో పోలీసుల వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్లు బీజేపీ తెలిపింది. (చదవండి: బీజేపీకి గుడ్‌బై.. ఏ పార్టీలోకి వెళ్లను.. ‘ఏక్ నిరంజన్’: మాజీ సీఎం) -
రసవత్తరంగా యూపీ రాజకీయం.. సరికొత్త వ్యూహాలకు పదును
రసవత్తరంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అత్యధిక ఓట్లు కొల్లగొట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ రైతులు, యువత, మహిళలను ఆకర్షించేలా సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. వీరి ఓటుబ్యాంకే 50 నుంచి 60 శాతం మధ్యలో ఉండడంతో వీరి చుట్టూనే సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో సిద్ధమౌతోంది. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు పలికి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ఎస్పీ, ఇప్పుడు రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నేతల మద్దతు కూడగట్టే యత్నాలకు దిగింది. మరోవైపు యువతను ఆకర్షించేందుకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకాన్ని ప్రకటించిన అఖిలేశ్, మహిళల భద్రత అంశాన్ని తెరపైకి తెస్తూ వారి ఓట్లను రాబట్టుకొనే చర్యలకు పదునుపెట్టారు. ఈ మూడు వర్గాలనుంచి వీలైనన్ని ఓట్లను రాబట్టుకొని తన విజయావకాశాలు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టారు. రైతు సంక్షేమమే ఎజెండా అందులోభాగంగా రైతులకు సంబంధించి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు చెరుకు రైతులకు 15 రోజుల్లో చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక రైతులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, సాగునీటికి వడ్డీలేని రుణాలతో పాటు బీమా, పింఛన్ సౌకర్యాలు సైతం ప్రకటించారు. బీజేపీని రాష్ట్రం నుంచి తొలగిస్తామని ప్రతిజ్ఞ చేయాలని అఖిలేశ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని, ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని అఖిలేశ్ ప్రకటించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత విడుదల చేసే సమాజ్‌వాదీ మేనిఫెస్టోలో ఇవన్నీ పొందుపరుస్తామని ఎస్పీ అధినేత పేర్కొన్నారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన అఖిలేశ్ రైతు ఉద్యమ నేతలతో సన్నిహితంగా ఉంటూ వారి మద్దతును కూడగట్టుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక రైతు నేత నరేశ్ తికాయత్ ఎస్పీ కూటమికి మద్దతును ప్రకటించడం ఈ చర్యల్లో భాగమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళల భద్రత– యువతకు ఉపాధే లక్ష్యం ఓట్ల శాతాన్ని పెంచేందుకు రాష్ట్రంలో తమ పార్టీ టార్గెట్ చేయాల్సిన ఓటుబ్యాంకుకు సంబంధించి సుదీర్ఘ కసరత్తును అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే పూర్తి చేశారు. ముస్లిం–యాదవ్ ఫార్ములాతో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ఠంగా 30 శాతం ఓటుబ్యాంకు మార్కును టచ్ చేయలేకపోయిన సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో మహిళలు–యువత ఫార్ములాతో కనీసం 40 నుంచి 50 శాతం ఓట్లు రాబట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని అఖిలేశ్ ఇప్పటికే అనేకసార్లు విమర్శించారు. ఉన్నావ్, గోరఖ్‌పూర్, హథ్రాస్ వంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండేలా మహిళల భద్రత విషయంలో చర్యలు తీసుకుంటామని అఖిలేశ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలను ఇవ్వలేక పోయారని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని అఖిలేష్ ఇప్పటికే అనేకసార్లు ఆరోపించారు. అంతేగాక తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువత, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేగాక పార్టీ ప్రత్యేకంగా మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఎస్పీ వర్గాలు తెలిపాయి. మధ్య తరగతి యువతకు ఉపాధి కల్పించడం, వారి విద్య, రైతుల సాగు ఖర్చు తగ్గించడం, మహిళల భద్రతకు సంబంధించిన తదితర అంశాలపై తమ పార్టీ దృష్టి సారించిందని పేర్కొంటున్నారు. ఈ అంశాలే తమ మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తాయని వెల్లడిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువ ఓటుబ్యాంకును తమవైపు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. గతంలో 2012లో అధికారంలోకి వచ్చినప్పుడు సైతం కేవలం 29.15 శాతం ఓట్లను మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ రాబట్టుకోగలిగింది. అయితే ఆ తర్వాత 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రం లోని ఓబీసీ ఓటుబ్యాంకును తమవైపు ఆకర్షించుకోవడం ద్వారా 39.67 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో వివిధ సమీకరణాల ద్వారా ఓటుబ్యాంకును పెంచుకోవడం ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్న ఎస్పీ ఇప్పటికే బీఎస్పీ సంప్రదాయ ఓటుబ్యాంకును ఎస్పీ తమవైపు లాక్కొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మధ్యతరగతి, అట్టడుగు వర్గాల నాయకులు పార్టీలో చేరుతున్న ఈ సమయంలో, పార్టీ తమ సంప్రదాయ ఓటుబ్యాంకు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
మాతో పెట్టుకుంటే మడతడిపోద్దీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సింహాసనాన్ని ఎవరు అధిరోహించాలన్నది నిర్ణయించడంలో యువతే కీలక భూమిక పోషించనుంది. తమ భవిష్యత్తు అవసరాలను తీర్చగలవని నమ్మిన పార్టీలను ఎన్నుకుంటూ వస్తూనే.. తమ కలలను నెరవేర్చని ప్రభుత్వాలను కూలదోస్తూ.. ప్రతి ఎన్నికలో కీలకంగా మారింది. అందుకే యూపీ జనాభాలో పావు శాతానికిపైగా ఉన్న యువతే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఏకంగా యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టోనే విడుదల చేసింది. నిర్ణయాత్మకంగా మారడంతో.. యూపీలో ప్రస్తుత ఎన్నికల్లో 15.02 కోట్ల మంది ఓటు వేయనుండగా.. అందులో ఏకంగా 4 కోట్ల మంది 18–39 ఏళ్ల మధ్య వయసున్న యువతే. అందులోనూ కొత్తగా 19.89 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న యువత ఓట్లను దృష్టిలో పెట్టుకొనే అన్ని రాజకీయ పార్టీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఆకట్టుకునే హామీలతోపాటు, మెజార్టీ సంఖ్యలో సీట్లను కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2007 నుంచి ప్రతి ఎన్నికలో సుమారు 70 మంది యువ ఎమ్మెల్యేలు యూపీ అసెంబ్లీకి వస్తున్నారు. ప్రస్తుతం ముగుస్తున్న అసెంబ్లీలోనూ 71 మంది ఎమ్మెల్యేల వయసు 40 ఏళ్లకన్నా తక్కువే కావడం గమనార్హం. ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఎమ్మెల్యేలు ఏకంగా 128 మంది వరకు ఉన్నారు. హామీ మరిస్తే ఇంటికే.. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకున్నా, నిధుల కేటాయింపులో ప్రాధాన్యం తగ్గినా యువత తమ సత్తా చూపిస్తోంది. 2007లో మాయావతి (బహుజన సమాజ్ పార్టీ–బీఎస్పీ) యువత లక్ష్యంగా.. ఉద్యోగాల కల్పన, విద్యా ఖర్చుల తగ్గింపు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి వంటి హామీలు ఇచ్చారు. దానితో దళిత, ముస్లిం యువత మొత్తం ఆమె వెంట నడిచింది. ఆమె మొత్తం 403 సీట్లకుగాను 206 సీట్లు గెలుపొందారు. కానీ ఆమె అధికారంలోకి వచ్చాక 18–30 ఏళ్ల యువత కోసం ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదు. ఐదేళ్ల పాలనా కాలంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారు. పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు హామీ నీరుగారింది. దీనిపై ఆగ్రహించిన యువత బీఎస్పీకి దూరమైంది. ఫలితంగా 2012లో బీఎస్పీకి 80 సీట్లు మాత్రమే వచ్చాయి, 2017 నాటికి 19 సీట్లకు పడిపోయాయి. ►సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్‌యాదవ్.. 2012 ఎన్నికల్లో 3.8 కోట్ల మంది యువ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని, తమ మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించారు. 10వ తరగతి పిల్లలకు ట్యాబ్లెట్, 12వ తరగతి పాసైన వారికి ల్యాప్‌టాప్, బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి కింద ప్రతి ఏటా రూ.12 వేలు వంటి హామీలు ఇచ్చారు. యువత మద్దతుగా నిలవడంతో ఎస్పీ ఏకంగా 224 సీట్లు గెలుచుకొని అధికారంలో వచ్చింది. అఖిలేష్‌యాదవ్ అధికారంలోకి వచ్చాక.. విద్యార్థులకు ట్యాబ్లెట్లు, ల్యాప్‌ట్యాప్‌ల పంపిణీ నామమాత్రంగానే సాగింది. ఆయన ఐదేళ్ల పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇతర హామీలూ పూర్తిగా అమలుకాలేదు. దానితో 2017 ఎన్నికల్లో యువత దూరమై.. ఎస్పీ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. ►2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్, ఐదుగురు యువకులు అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్లింది. నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. కానీ హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాల కల్పనలో బీజేపీ సఫలం కాలేకపోయింది. పైగా నిరుద్యోగం పెరగడంతో యువత రోడ్లెక్కారు. ప్రయాగ్‌రాజ్, లక్నోలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. మరోవైపు టెట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశం సుమారు 20లక్షల మంది యువతను ఇబ్బందుల్లో నెట్టడంతో బీజేపీ సర్కారు అపఖ్యాతి పాలైంది. ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకు బీజేపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందులో రవికిషన్, గౌతమ్ గంభీర్, బబితా ఫోగట్, తేజస్వి సూర్య వంటి నాయకులకు ప్రాతినిధ్యం కల్పించి.. యువ, ప్రగతిశీల ఓటర్లలో బీజేపీని విస్తరించేలా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రత్యేక మేనిఫెస్టోతో కాంగ్రెస్.. యువత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఏకంగా యూత్ మేనిఫోస్టోనే తెరపైకి తెచ్చింది. రెండు రోజుల కింద కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దీనిని ఆవిష్కరించారు. ‘భారతీ విధాన్’ పేరుతో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఇందులో 8లక్షల ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. గతంలో 25–30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేసి విఫలమైందని.. కాంగ్రెస్ అమలుచేసి చూపించి యువత విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని వారు పేర్కొన్నారు. -
యూపీలో కాంగ్రెస్ కొత్త అవతారం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పాత భారాన్ని వదిలించుకోవడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో 70 శాతం కొత్త ముఖాలను బరిలోకి దించుతోంది. యూపీని మళ్లీ చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో 40 శాతం మహిళలకు అవకాశమన్న తన వాగ్దానానికి కట్టుబడుతూనే... పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. జనవరి 13న 125 మందితో మొదటి జాబితాను, మరో 41 మందితో జనవరి 20 రెండో జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకూ విడుదల చేసిన 166 మంది జాబితాలో 70 శాతం కొత్తవారు ఉండటం గమనార్హం. వారిలో 119 మంది మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. మొదటి జాబితా 125 మందిలో 26 మంది అభ్యర్థులు 35 ఏళ్లలోపువారే కావడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లో న్యాయం కోసం పోరాడుతున్న వారికి పార్టీ ఈ ఎన్నికల్లో అవకాశమిస్తోందని, వారిని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమని మొదటిజాబితా విడుదల సందర్భంగా ప్రియాంక చెప్పారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడం వల్ల కొత్త శక్తి రావడమే కాదు... పార్టీలో ఇప్పటికే ఉన్న అంతర్గత గొడవలను అధిగమించడానికి ఉపయోగపడుతుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. విభిన్నంగా ఎంపిక... అభ్యర్థుల ఎంపికలో ప్రియాంక విభిన్నత పాటించారు. మహిళలు, యువత, రైతులు, వెనుకబడిన కులాలు, దళితుల సమస్యల మీద పోరాడే ఉధ్యమకారులకు ప్రాధాన్యమిచ్చారు. సాహిబాబాద్ నియోజకవర్గంలో దివంగత రాజీవ్ త్యాగీ భార్య సంగీత త్యాగీకి అవకాశమిచ్చారు. ఇక ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి 55ఏళ్ల ఆశాసింగ్తోపాటు, సీఏఏ వ్యతిరేక ఉద్యమకారిణి పార్టీ అధికార ప్రతినిధి సదాఫ్ జాపర్, ఆశ వర్కర్ల కోసం ఉద్యమిస్తున్న పూనమ్ పాండే, ఆదివాసీ హక్కులకోసం పోరాడుతున్న రామ్రాజ్ గోండ్ వంటివాళ్లందరూ కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. వీరితోపాటు హాపూర్ నుంచి సామాజిక ఉద్యమకారిణి భావనా వాల్మీకి, చర్తావాల్ నుంచి యాస్మిన్రాణా, ఠాకూర్ద్వారా నుంచి సల్మా ఆఘా, బిలారీ నుంచి కల్పనా సింగ్, దక్షిణ మీరట్ నుంచి నఫీజ్ సైఫీ, శరణ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న సుఖ్విందర్ కౌర్ అందరూ మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. మొహమ్మదీ నుంచి రీతూ సింగ్ తదితరులు మహిళా అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. -
UP Election: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి..
లక్నో: బరేలీ కంటోన్మెంట్ సీటుకు సుప్రియా అరోన్ కాంగ్రెస్ నాలుగైదు రోజుల కిందటే ప్రకటించింది. నామినేషన్‌కు సిద్ధమవుతుందని భావిస్తుండగా.. ఆమె అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్‌కు షాకిచ్చారు. శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. అదే స్థానం నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీచేయనున్నారు. జర్నలిస్టు నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన సుప్రియా ఆరోన్ బరేలీ మేయర్‌గా పనిచేశారు. ఆమె ఎస్పీలో చేరడంతో బరేలీ నుంచి రాజేశ్ అగర్వాల్ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉపసంహరించారు. -
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..
తొలిసారిగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ బలమైన స్థానం నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్ వచ్చే నెలలో ఎన్నికలలో మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పార్టీ వర్గాల అందించిన ఈ సమాచారాన్ని అతని మామ రాజ్యసభ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఈ రోజు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఆయన మేనల్లుడు మెజార్టీ ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే 1993 నుంచి కర్హాల్ వాసులు ప్రతి ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. కానీ బీజేపి 2002 ఎన్నికలలో ఆ స్థానాన్ని గెలిచినప్పటికీ, 2007లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీ కర్హాల్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ప్రస్తుతం కర్హాల్ సోబరన్ యాదవ్ ఆధ్వర్యంలో ఉంది. అంతేకాదు అఖిలేశ్ తండ్రి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఐదు అసెంబ్లీ స్థానాల్లో మైన్‌పురి లోక్‌సభ సీటు ఒకటి కావడం విశేషం. పైగా యూదవ్ స్వగ్రామమైన సైఫాయ్కి 5 కి.మీ దూరంలోనే కర్హాల్ ఉంది. అధికార పార్టీని గద్దె దింపేందకు ప్రాంతీయ పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్న అఖిలేశ్ యాదవ్ తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల్లో తెరంగేట్రం చేస్తున్నారు. అయితే ఆయన గతేడాది నవంబర్ నెలలో అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనని చెప్పారు. కాగా, బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగనుండటంతో అఖిలేశ్ యాదవ్ సైతం ఒత్తిడిని అధిగమించేందుకు పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అఖిలేశ్ ప్రస్తుతం యూపీలోని అజంగఢ్ నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్నా సంగతి తెలిసిందే. కాగా, అఖిలేశ్ యాదవ్ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2012లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎంఎల్సీ హోదాలోనే ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అలాగే ఆదిత్యనాథ్ కూడా బలమైన స్థానం నుంచే పోటీచేస్తున్నారు. గోరఖ్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి.. ఆ నియోజకవర్గంలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారు. (చదవండి: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!) కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’ -
యూపీలో అధికారంలోకి వస్తే.. ఇద్దరు సీఎంలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొత్తులు, సీట్ల కేటాయింపులపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తి మోర్చా పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామని శనివారం ప్రకటించారు. తమ భాగస్వామ్య కూటమి అధికారంలోకి వస్తే.. ఇద్దరిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేస్తామని తెలిపారు. ఒకరు ఓబీసీ సామాజికవర్గం నుంచి మరోకరిని దళిత సామాజికవర్గం నుంచి ఎంపిక చేస్తామని వెల్లడించారు. ముస్లిం కమ్యూనిటీతో పాటు ముగ్గురిని డిప్యూటీ సీఎంలను ఎంపిక చేస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు. గతంలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఒవైసీ ప్రకటించారు. రాజ్‌భర్ ఆ కూటమిని విడిచిపెట్టి.. సమాజ్‌వాదీ పార్టీలో కలిశారు. రాజ్‌భర్ పార్టీ తమ కూటమి నుంచి విడిపోయిందని, అయినప్పటికీ 100 సీట్లలో తమ కొత్త కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో ఏ రాజకీయపార్టీ ముస్లింల అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ముస్లింకు ఉత్తరప్రదేశ్‌లో అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి పాటుపడటంలేదని తెలిపారు. రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని, మార్పు తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తామని, తమకు ఎవరు మంచి చేస్తారో వారినే ఎన్నుకుంటారని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. -
కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక క్లారిటీ.. ‘అసలేం జరిగిందంటే’
UP Assembly Election 2022: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని తానే అని అర్థం వచ్చేలా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ప్రియాంక రాకతో పోటీ రసవత్తరం కానుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. శుక్రవారం జరిగిన కాంగ్రెస్ యూత్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె యూపీ సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘అంతటా నేనే కనిపిస్తున్నా.. మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా ?. మీరు నన్నే ఎందుకు అనుకోకూడదు’ అని అన్నారు. దీంతో ఆ విషయం హాట్ టాపిక్ అయింది. అయితే, తన వ్యాఖ్యలపట్ల శనివారం ఆమె స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని చెప్పలేదని అన్నారు. విలేకర్లు అదేపనిగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నలు గుప్పించడంతో ‘చిరాకు’తో అలా కామెంట్ చేశానని పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ.. పోటీ గురించి ఇప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. (చదవండి: కాంగ్రెస్ హైకమాండ్‌పై చన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు) కాగా, సమాజ్‌వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోగా తాజాగా ఆమె ‘యూటర్న్’ తీసుకున్నారు. ఇక యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉండనుందనే విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ అంశం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. (చదవండి: సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. ఇవే ధరలు) -
UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!
ఇప్పుడు సరిగ్గా.. ఇదే పంథాలో ఉత్తరప్రదేశ్ రాజకీయ యవనికపై టిట్ ఫర్ టాట్ క్రీడ రక్తికడుతోంది. అబ్బురపరిచే ఎత్తులతో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. హిందుత్వ కార్డుతో ఓటర్లు సంఘటితం కాకుండా చూసుకుంటే సగం యుద్ధం గెలిచినట్లేనని భావించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్... చాణక్యాన్ని ప్రదర్శించారు. కీలకమైన ఓబీసీ నేతలను లాగేశారు. తామేమి చేయకపోతే చేష్టలుడిగి చూస్తుండిపోయిందనేది ప్రజల్లోకి వెళుతుందని... దిక్కుతోచని స్థితిలోకి బీజేపీ వెళ్లిపోయిందని భావిస్తారని కమలదళం భయపడింది. ఎత్తుకు పైఎత్తుకు వేసింది. చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ను లాగేయడం ద్వారా ములాయం సింగ్ ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఈ రాజకీయ సమయంలో వ్యూహాలు పదునెక్కుతున్న వైనంపై ‘సాక్షి’ సవివర కథనం... మౌర్య ఇచ్చిన షాక్‌తో ‘మైండ్ బ్లాంక్’ ఇతర వెనుకబడిన వర్గాల్లో (ఓబీసీల్లో) బలమైన నాయకులైన మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య జనవరి 12న, దారాసింగ్ చౌహాన్ 13న మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కలకలం రేగింది. రోజుకో మంత్రి, ఒక ఎమ్మెల్యే చొప్పున పార్టీని వీడిపోవడంతో బీజేపీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తం ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. కాషాయపార్టీ తేరుకునే లోగానే... ఓబీసీలను బీజేపీ అవమానిస్తోందని... అందుకే వారంతా సమాజ్‌వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారనే సందేశం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ములాయం ఇంట్లోనే ముసలం నష్టనివారణకు దిగిన బీజేపీ దిమ్మతిరిగేలా కొట్టాలని భావించి అసంతృప్తితో ఉన్న అఖిలేశ్ మరదలు అపర్ణా యాదవ్‌కు (సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ భార్య) గాలం వేసింది. సొంత మనిషినే ఆపలేకపోతే అఖిలేశ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. సరిగ్గా బీజేపీ అక్కడే కొట్టి లక్ష్యాన్ని సాధించింది. మైండ్‌గేమ్ కీలక ఓబీసీ మంత్రులు పార్టీని వీడి వెళ్లిపోవడంతో తూర్పు యూపీలో నష్టం తప్పదని భావించిన బీజేపీ దీన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దింపింది. తర్వాత బీజేపీ కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగడానికి భయపడుతున్నారని ప్రతిరోజూ వల్లెవేస్తూ ఎస్పీ చీఫ్‌ను పిరికివాడిగా చూపే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అఖిలేశ్ తాను మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. నిజానికి వీరిద్దరూ పోటీచేసింది... కంచుకోటలైన సొంత నియోజకవర్గాల నుంచే. నిజానికి ఈ విషయంలో ఏటికి ఎదురీదే గుండె ధైర్యాన్ని ప్రదర్శించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒకప్పటి తన కుడిభుజం సువేందు అధికారికి కంచుకోటగా మారిన ‘నందిగ్రామ్’ నుంచి పోటీచేస్తానని ప్రకటించి నివ్వెరపరిచారు. తాను నందిగ్రామ్ బరిలో ఉంటే సువేందు అధికారి సొంత నియోజకవర్గానికి బాగా సమయం కేటాయించాల్సి వస్తుందని, ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తిరగలేరనేది దీదీ ఎత్తు. తాను ఓడిపోయినా... మమత వ్యూహం మాత్రం బ్రహ్మాడంగా వర్క్ అవుట్ అయి దీదీ హ్యాట్రిక్ కొట్టారు. కొట్టారు.. తీసుకున్నాం. మాకూ టైమొస్తుంది.. మేమూ కొడతాం – 2017లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిశాక... చంద్రబాబు సర్కారు కుట్రపూరిత వేధింపులపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంధించిన ఈ వాగ్భాణం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ‘ఇది కదా... సిసలైన పోరాటయోధుడి గుండెధైర్యం’ అనుకున్నారు జనం. ప్రియాంక నినాదం తుస్సుమనేలా.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కొడిగట్టిన కాంగ్రెస్ కనీసం గౌరవప్రద స్థితిలో నిలిపితే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సానుకూలత రావడానికి ఉపయోగపడుతుందని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ప్రియాంకా గాంధీ ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ (ఆడబిడ్డను... పొరాడగలను)’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తద్వారా ‘మేమెందుకు పురుషులతో సమానం కాదు. మాకేం తక్కువ’ని నేటితరం యువతుల్లో బలంగా నాటుకుపోయిన భావజాలాన్ని ప్రేరేపించారు. బాగా జనంలోకి వెళ్లిపోవడంతో ఈ నినాదంతో కాంగ్రెస్ యూపీ నలుమూలగా నిర్వహించిన మారథాన్లకు యువతుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రియాంక ఎత్తుగడ ఫలించింది. దాంతో ఆమె 40 శాతం అసెంబ్లీ టిక్కెట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించి.. చేతల్లో చూపడం ద్వారా మహిళా ఎజెండాను మరిం త ముందుకు తీసుకెళ్లారు. చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!) ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రియాంక పోరాట సన్నద్ధంగా ఉన్న ముగ్గురు యువతుల ఫోటోతో కూడిన హోర్డింగ్‌లు, పోస్టర్ల ను యూపీ వ్యాప్తంగా విస్తృతంగా అతికిం చారు. ఈ ముగ్గురిని లీడ్ చేస్తూ మధ్యలో ఉన్న యువతి పేరు ప్రియాంకా మౌర్య, వృత్తిరీత్యా డాక్టర్. మంచి వక్త. లింగ సమానత్వం కోసం ప్రియాంకా గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిందని ప్రియాం క మౌర్య. ఆమె స్వభావం, ఆహార్యం దీనికి బాగా ఉపకరించాయి. దాంతో ఈ ఉద్యమానికి ప్రియాంక మౌర్య బ్రాండ్ అంబాసిడర్‌గా, పర్యాయపదంగా మారారు. సరిగ్గా బీజేపీ ఇక్కడే గురిచూసి కొట్టింది. 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తే మహిళల్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత వస్తుందని, అసలే ఒకవైపు ఎస్పీ– రాష్ట్రీయ లోక్‌దళ్ పొత్తులో తమ హిందూత్వ కార్డు నిర్వీర్యమైన పోయిన పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఎత్తుగడ తమకు భారీ నష్టం కలుగుజేస్తుందని భయపడ్డ బీజేపీ మాస్టర్ గేమ్ ఆడింది. ‘అడపిల్లను... పోరాడగలను’ అనే నినాదానికి బ్రాండ్ అం బాసిడర్‌గా ఉన్న ప్రియాంక మౌర్యను లాగేస్తే కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టొచ్చని భావించి అమలులో పెట్టేసింది. మహిళలకు 40 టిక్కెట్లు ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని.. చేతల విషయానికి వచ్చే సరికి కష్టజీవి ప్రియాంక మౌర్యకే మొండి చేయి చూపిందనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది. ఇప్పుడిక ప్రియాంకా గాంధీ మహిళలకు ఇచ్చే టికెట్లు 50 శాతానికి పెంచినా, ఈ విషయాన్ని ఎన్నికల ర్యాలీల్లో 500 సార్లు చెప్పినా జనం నమ్మరు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ మేరకు బీజేపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్ ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు దిగుతారు అనే దానిపై సర్వత్రా ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సమయంలో యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా ప్రశ్నించింది. దీనికి ప్రియాంక స్పందిస్తూ.." మీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా ?. మీరు నన్నే ఎందుకు అనుకోకూడదు." అని బదులు ఇచ్చారు. అయితే తాను ఎన్నికల్లో పోటీచేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అంతేకాదు ఇప్పటివరకు ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడూ తాను సిద్దంగా ఉన్నాను అని తొలిసారిగా చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియంక గాంధీ పేరు దాదాపు ఖాయం అనే అనిపిస్తోంది. పైగా ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ ఎప్పుడూ రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేయలేదు. అయినప్పటికి ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడూ వచ్చే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ గోరక్‌పూర్ నుంచి పోటీకి దిగుతుండగా.., అఖిలేష్ యాద్ మెయిన్‌పురిలోని కర్హాల్ స్థానం పోటీ చేస్తున్నారు. ఈ మేరకు యూపీలో ఫిబ్రవరి 10 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరగునున్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రియాంక పర్వం) -
బీజేపీ గెలవాలని కోరుకుంటున్న ములాయం!
లక్నో: ములాయం సింగ్ యాదవ్ చిన్న అపర్ణా యాదవ్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ములాయం ఆశీస్సులు తీసుకున్న ఫొటోను శుక్రవారం ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ‘బీజేపీలో చేరిన తర్వాత లక్నోలో మా నాన్న/నేతాజీ ఆశీస్సులు తీసుకున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. దీనిపై ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘అంటే దీనర్థం నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) కూడా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నార’ని వ్యాఖ్యానించారు. బీజేపీకి ధన్యవాదాలు: అఖిలేశ్ అపర్ణా యాదవ్.. గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ‘వారసత్వ భారాన్ని తగ్గించినందుకు బీజేపీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆమెను బీజేపీకి వెళ్లకుండా వారించేందుకు తన తండ్రి ములాయం సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరడం గమనార్హం. भारतीय जनता पार्टी की सदस्यता लेने के पश्चात लखनऊ आने पर पिताजी/नेताजी से आशीर्वाद लिया। pic.twitter.com/AZrQvKW55U — Aparna Bisht Yadav (@aparnabisht7) January 21, 2022 టిక్కెట్ దక్కదని తెలిసి.. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడి పోటీ చేయాలని భావించిన అపర్ణా యాదవ్.. సమాజ్‌వాదీ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఆమెకు ఈసారి టిక్కెట్ ఇచ్చేందుకు అఖిలేశ్ సుముఖంగా లేకపోవడంతో తన దారి తను చూసుకున్నారు. మరి కంటోన్మెంట్ సీటును బీజేపీ ఆమెకు ఇస్తుందా, లేదా అనేది వేచిచూడాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రీటా బహుగుణ తన కుమారుడికి ఈ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. -
అఖిలేష్ యాదవ్ శ్రీకృష్ణ జపం ఫలిస్తుందా?
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేచింది. అయితే మిగతా నాలుగు రాష్ట్రాల విషయం పక్కనబెట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం విషయంలో దేశంలో ప్రత్యేక చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి, ప్రతిష్ఠకు ఒక అగ్ని పరీక్ష లాంటివనీ, ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించడం సులభవుతుందనీ బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులూ, ఆ పార్టీలకు అనుకూలంగా విశ్లేషణ చేసే మోదీ వ్యతిరేకులూ తల పోస్తు న్నారు. అఖిలేష్ యాదవ్ అనూహ్యంగా తెరమీదకు తెచ్చిన ‘శ్రీకృష్ణ జపం’ (శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి కలలోకి వచ్చి ‘నీవు రామరాజ్య స్థాపన చేస్తావు, ఈ ఎన్నికల్లో విజయం నీదే’ అంటున్నాడని అఖిలేష్ యాదవ్ చెప్పుకోవడం) ఈ ఎన్నికల్లో బాగా పని చేస్తుం దనీ, హిందువుల ఓట్లు చీలిపోతాయనీ, యాదవ కులపు ఓట్లు, ముస్లింల ఓట్లు గుండుగుత్తగా సమాజ్‌వాది పార్టీకి పోలవుతాయనీ మోదీ వ్యతిరేకులు ముందుస్తు అంచనాలు వేస్తున్నారు. (చదవండి: అయోధ్య రాముడా? మధుర కృష్ణుడా?) లౌకిక భావాలకు ప్రాతినిధ్యం వహించే సమాజ్‌వాది పార్టీ అనాలోచితంగా, అసందర్భంగా మథుర శ్రీకృష్ణుణ్ణి నెత్తికి ఎందుకు ఎత్తుకున్నట్లు? ముస్లిం పరిపాలనలో మథురలో శ్రీకృష్ణ ఆలయానికి అపచారం జరిగిందనీ, ఇది హిందూ సమాజానికి అవమానమనీ, ఈ అవమానాన్ని తుడిచి పెడతామనీ హిందూ సంస్థల ప్రతినిధులు, వారి మద్దతుతో రాజకీయాలు నడిపే భారతీయ జనతా పార్టీ చాలా కాలం నుండి చెప్పుకుంటూ వస్తుందనే విషయం హిందువులకు బాగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో అఖిలేష్ యాదవ్ కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్న ఈ కృష్ణ నినాదం ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? (చదవండి: అధికారానికి ‘నిచ్చెన’ప్రదేశ్!) ఈ దేశ చరిత్రలో హిందూ సంస్కృతికి, హిందువులకు జరిగిన కష్టనష్టాలపై అఖిలేష్ యాదవ్‌గానీ, ఆయన తండ్రి ములాయంగానీ ఎప్పుడూ మాట్లాడలేదు. కాగా వారిద్దరూ హిందూ వ్యతిరేకులనీ, జిహాదీ ఉగ్రవాదుల మద్దతుదారులను, సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించారనే వ్యూహాత్మక ప్రచారాన్ని హిందుత్వ శక్తులు... హిందుత్వ అభిమాన ఓటర్ల మెదళ్ళలోకి బాగా ఎక్కించారనే విషయం సత్యదూరమైనదేమీ కాదు. గత నెలలో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ ప్రతినిధుల సమావేశంలో హిందుత్వ ప్రతినిధుల మాటలు... జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపకుండా పోతాయా? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!) ఇక ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ... మోదీ, యోగీ తర్వాత హిందువులను రక్షించేవారెవరని అడిగిన మాటల వల్ల... ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. హిందుత్వ శక్తులు ఏకమవ్వడానికి దోహదం చేస్తాయి. మోదీ, యోగీ వ్యతిరేకుల దుష్ప్రచారాలు హిందు త్వాన్ని బలహీన పరుస్తాయా లేక బలపరుస్తాయా, లేదా సమాజ్‌వాది పార్టీ ఎన్నికల విజయాలను దెబ్బ తీస్తాయా అనే విషయాలను విశ్లేషకులు ఎవరూ చెప్పలేకపోతున్నారు. - ఉల్లి బాల రంగయ్య రాజకీయ సామాజిక విశ్లేషకులు -
పార్టీల అదృష్టాన్ని తారుమారు చేయగలరు.. మరి ముస్లిం ఓట్లు కొల్లగొట్టేదెవరు!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో అన్ని పార్టీల రాజకీయ అదృష్టాన్ని తారుమారు చేయగల సామర్థ్యం ఉన్న ముస్లింలు ప్రస్తుత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా అధికారంలోని బీజేపీని గద్దెదించాలని గట్టి పట్టుదలతో ఉన్న ఈ వర్గం తమ ప్రాబల్యం అధికంగా ఉన్న స్థానాల్లో ఏ ఇతర పార్టీలకు మద్దతిస్తుందన్నది రసకందాయంలో పడింది. ఇక ముస్లిం ఓట్లలో చీలిక, మరోవైపు హిందువుల ఓట్లను సంఘటితం చేయడం ద్వారా గత ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందిన బీజేపీ ప్రస్తుతం అదే వ్యూహాన్ని అనుసరిస్తుండగా, ముస్లిం ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే అనుకూలంగా మలుచుకునేందుకు సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముస్లింలోని మేధావివర్గం ఇదే విషయాన్ని సామాన్యుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం ఓట్ల శాతం అధికంగా ఉన్న 143 నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టి ముందుకు వెళుతున్నారు. 19 శాతం ముస్లింలు..143 సీట్లలో ప్రభావం.. యూపీలో 19.3 శాతంగా ఉన్న ముస్లింలు 18 జిల్లాల్లోని 143కి పైగా నియోజకవర్గాల్లో పార్టీల, అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశిస్తూ వస్తున్నారు. 20–30 శాతం ముస్లిం జనాభా ఉన్న స్థానాలు 70 వరకు ఉండగా, ముఫ్పై శాతానికి పైగా ఉన్న స్థానాలు 43 వరకు ఉన్నాయి. 36 సీట్లలో అయితే ముస్లిం అభ్యర్థులు సొంతంగా గెలిచేంత సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా రాంపూర్, మొరాదాబాద్, ముజ్ఫర్నగర్, షహరాన్‌పూర్, అమ్రోహా, బిజ్నోర్, మరేలీ, సంబల్, బలరాంపూర్, బహ్రయిచ్, , హాపూర్ వంటి జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 40 శాతం పైచిలుకే. వీరంతా ఎక్కువగా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నారు. 1991 ఎన్నికల నుంచి శాసనసభలో వీరి ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది. 1991లో 23 మంది ముస్లిం సభ్యులు శాసనసభలో ఉంటే, 1993లో 25, 1996లో 36, 2002లో 39, 2007లో 51, 2012లో 62కి పెరిగింది. అయితే 2017 ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం, హిందుత్వ నినాదం కారణంగా కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. ముస్లిం ఓట్లు చీలిపోవడం, అధికార బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని పోటీలో పెట్టకపోవడంతో వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ప్రస్తుత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ముస్లింలు తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. 1992లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. బాబ్రీ మసీదు కూల్చివేత జరగడంతో హస్తం పార్టీకి ముస్లింలు పూర్తిగా దూరమయ్యారు. ముస్లింల ప్రాతినిధ్యం తగ్గించేలా బీజేపీ ఎత్తులు యూపీలో గత ఎన్నికల ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే ముస్లింల ప్రాతినిధ్యం పెరిగిన ప్రతిసారి బీజేపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలపై పూర్తి ఆధిక్యాన్ని కనబర్చినపుడల్లా (వివిధ సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో) ముస్లిం ప్రాతినిధ్యం తగ్గింది. 1991 అసెంబ్లీ ఎన్నికలలో, 425 మంది సభ్యుల సభలో 221 సీట్లను గెలుచుకోవడం ద్వారా యూపీలో బీజేపీ తన మొదటి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, కేవలం 23 మంది ముస్లిం అభ్యర్థులు మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. ఇది మొత్తం బలంలో 5.4 శాతం మాత్రమే. అదే బీజేపీ అధికారాన్ని కోల్పోయి బలహీనంగా మారిన సంవత్సరాల్లో ముస్లిం ప్రాతినిధ్యం 17 శాతానికి పెరిగింది. 2012లో సమాజ్‌వాదీ పార్టీ 403 సీట్లలో 224 గెలుచుకుని మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, 68 మంది ముస్లిం ఎమ్మెల్యేలు అత్యధికంగా అసెంబ్లీకి వచ్చారు. ఆ ఏడాది బీజేపీ కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అదే 2017లో బీజేపీ 312 సీట్లు గెలిస్తే ముస్లిం ఎమ్మెలే సంఖ్య కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు. గడిచిన ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొనే ప్రస్తుత ఎన్నికల్లోనూ ముస్లింల ప్రాతినిధ్యం తగ్గించేలా బీజేపీ ఎత్తులు వేస్తోంది. యూపీలో 80శాతం వర్సెస్ 20 శాతం ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల సున్నిత వ్యాఖ్యలు చేశారు. యోగి వ్యాఖ్యలు రాష్ట్రంలోని మెజారిటీ హిందూ, మైనారిటీ ముస్లిం జనాభా మధ్య వైరుధ్యాన్ని సృష్టించేలా ఉన్నాయని ప్రతిపక్షాలన్నీ ఆరోపించాయి. హిందూ ఓట్ల సంఘటితం కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. చీలకుండా ఎస్పీ జాగ్రత్తలు... గతంలో ఎస్పీ యాదవ్–ముస్లిం ఫార్మలాను వాడి అధికారాన్ని హస్తగతం చేసుకోగా, బీఎస్పీ దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములాను వాడి సీఎం పీఠాన్ని అందుకుంది. అయితే 2012లో ఎస్పీ అధికారంలోకి వచ్చిన సమయంలో ముస్లింల ప్రాబల్యం ఉన్న 143 సీట్లలో ఎస్పీ 25.8శాతం ఓట్లతో 28 సీట్లను గెలుచుకుంది. అదే 2017 ఎన్నికలకు వచ్చేసరికి ఈ నియోజకవర్గాల్లో ఎస్పీకి ఓట్ల శాతం 29.6కు పెరిగినప్పటికీ 17 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో బీఎïస్పీకి 19 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 6 శాతం ఓట్లు చీలాయి. దీంతో ఎïస్పీకి కొద్దిగా నష్టం వాటిల్లింది. దీనికి తోడు హిందూ ఓట్ల ఏకీకరణ (పోలరైజేషన్)లో బీజేపీ విజయవంతం కావడంతో ఎస్పీకి దెబ్బపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల్లో నష్టం జరుగకుండా యాదవ–ముస్లిం–జాట్–ఓబీసీ ఫార్ములాను తెరపైకి తెచ్చిన అఖిలేశ్ ముస్లిం ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లోని కీలక నేతలు సలీమ్ ఇక్బాల్ షేర్వాణీ, ఇమ్రాన్ మసూద్, బీఎస్పీ నుంచి సిబ్గతుల్లా అన్సారీ, కైసర్ జహాన్‌లను పార్టీలో చేర్చుకున్నారు. పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకున్నారు. తొలిదశలో 29 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే 9మంది ముస్లింలకు టికెట్లిచ్చారు. అయితే పోటీగా బీఎస్పీ 53 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే 13 మంది ముస్లింలకు టెకెట్లు ఇవ్వడంతో ఓటుబ్యాంకు చీలే అవకాశాలు పెరిగాయి. ఒవైసీ మార్క్ ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ వంటి లౌకిక పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మరచిపోయాయని మజ్లిస్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ యూపీలో ప్రచారం చేస్తున్నారు. 2017లో ఒవైసీ 38 మంది అభ్యర్థులను పోటీలో నిలిపితే ఒక్కరూ గెలువలేకపోయారు. కానీ ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ఎస్పీ, బీఎస్పీలకు దెబ్బకొట్టారు. ఇది పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చింది. ఈ ఎన్నికల్లో 100 మందిని నిలబెడతానని చెప్పిన ఒవైసీ ఇప్పటికే 25 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థులు ఎవరి అవకాశాలను దెబ్బతీస్తారన్నది వేచిచూడాల్సి ఉంది. -
యూపీ ఎన్నికలు.. సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. ఇవే ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి ఉదయం పూట తినే పూరీ నుంచి ప్రచారానికి వినియోగించే లగ్జరీ కార్ల వరకు ఒక్కొక్క వస్తువుకి ఒక్కో ధరను ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ప్రచార ఖర్చు విషయంలో ఒక అభ్యర్థి ప్రచారంలో ఖర్చు వినియోగించుకునే సేవలు, వస్తువుల ధరలకు గరిష్ట పరిమితి ఎంతో తెలిపే చార్ట్‌ను లక్నో జిల్లా ఎన్నికల అధికారి తాజాగా ఖరారు చేసి విడుదల చేశారు. చదవండి: బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్ ఇందులో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చు పరిమితిని రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. దీని ప్రకారం ఒక్కో అభ్యర్థి గరష్టంగా దేనిపై ఎంత ఖర్చు చేయాలనే దానిపై సమీక్ష నిర్వహించి ఈ జాబితాను ప్రకటించారు. చదవండి: ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్: సూరీ.. ప్రమాణానికి సిద్ధమా ? -
ప్రియాంక పర్వం
Uttar Pradesh Assembly Elections Updates: అచ్చంగా నానమ్మ ఇందిరను తలపించే రూపం, చక్కటి గ్రామీణ హిందీ భాషలో అనర్గళంగా ప్రసంగించే నైపుణ్యం, మురికివాడల ప్రజలతో అరమరికలు లేకుండా కలిసిపోయే తత్వం, తల్లి సోనియా గాంధీ అనారోగ్యం, అన్నింటికి మించి ఘనమైన రాజకీయ కుటుంబ నేపథ్యం, ఇవన్నీ కాంగ్రెస్‌లో ప్రియంకానికి తెరలేచింది. కెమెరాల సాక్షిగా అన్న రాహుల్ భుజాల చుట్టూ చేతులు వేసి కలిసి నడిచిన ప్రియాంకా గాంధీ వాద్రా యూపీ కాంగ్రెస్‌ని అంతా తానై, అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. యూపీలో అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఉనికిని చాటేలా నిలబెట్టాలని ఐదారు నెలలుగా దాదాపు అక్కడే ఉండి కష్టపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా ముందు నిలబడలేకపోయినా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ’’నేను అమ్మాయిని, నేను పోరాడగలను’’ అని నినదిస్తూ రాజకీ యాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ► దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ గారాలపట్టి ప్రియాంక 1972, జనవరి 12న ఢిల్లీలో పుట్టారు. ► ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ► ఢిల్లీ యూనివర్సిటీలో జీసస్ మేరీ కళాశాల నుంచి సైకాలజీలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. ► 2010లో బుద్ధిజంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ► 17 ఏళ్ల వయసులో 1989 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా తన తండ్రి రాజీవ్‌గాంధీ తరఫున అమేథి నియోజకవర్గం నుంచి ప్రచారం చేశారు. ► తన క్లాస్మేట్ మిషెల్ అన్న, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో టీనేజ్లోనే ప్రేమలో పడ్డారు. ► 1997లో ఫిబ్రవరి 18న రాబర్ట్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి రెహాన్ అనే కుమారుడు, మిరాయా అనే కుమార్తె ఉన్నారు. ► ప్రియాంకా గాంధీకి బౌద్ధమతంపై అపారమైన నమ్మకం. దానినే ఆచరిస్తారు. ► 1999 నుంచి 2019 వరకు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా కాంగ్రెస్ పార్టీతో మమేకమై ఉన్నారు. ► టికెట్ల పంపిణీ, భాగస్వామ్యపక్షాలతో చర్చలు, సోనియా, రాహుల్‌ల గెలుపు కోసం రాయ్‌బరేలి, అమేథి నియోజవర్గాలలో ఎన్నికల వ్యూహరచన వంటి బాధ్యతలు తీసుకున్నారు ► ప్రియాంక మంచి వక్త. అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్ దగ్గర హిందీ భాషలో శిక్షణ తీసుకున్నారు. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ హిందీలో సుప్రసిద్ధ కవి. హిందీ భాషపై అద్భుత పట్టున్న కుటుబం దగ్గర శిక్షణ తీసుకున్న ప్రియాంక సభల్లో వాడుక భాషలో సామాన్యులు మాట్లాడే పదబంధాలు వాడుతూ ప్రసంగిస్తారు. ప్రసంగాల్లో ప్రజలకి సూటిగా ప్రశ్నలు వేస్తూ, వారి నుంచి సమాధానాలు రాబడుతూ ఇద్దరి మధ్య ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రియాంక ప్రత్యేకత. ► ప్రియాంకలో ఉన్న ఈ లక్షణాలతో ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఆమె రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలు డిమాండ్ చేసేవారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయానికి సోనియా అనారోగ్యం బారినపడడం, రాహుల్ గాంధీ సమర్థతపై నీలినీడలు కమ్ముకోవడంతో కాంగ్రెస్ పార్టీని ప్రియాంకే కాపాడగలరనే భావన ఏర్పడింది. ► ఎట్టకేలకు అందరి డిమాండ్లకు తలొగ్గి 2019 జనవరి 23న క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ యూపీ తూర్పు వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ అంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా ముందు నిలబడలేక చతికిలపడిపోయారు. ► 2020 సెప్టెంబర్ 11న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచి ప్రజా సమస్యలపై పోరాడడంలో తనకంటూ ఓ ముద్రని వేసుకున్నారు. ► భర్త రాబర్ట్ వాద్రాపైనున్న అవినీతి కేసులే రాజకీయంగా ఆమెని ఇబ్బందికి లోను చేస్తున్నాయి. ► ఇప్పుడు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో కొత్త బాటలు వేశారు. యూపీలో న్యాయం దక్కక పోరుబాట పట్టిన వారిని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించే వారిని, సామాజిక కార్యకర్తల్ని, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల్ని ఏరికోరి ఎంపిక చేసి పార్టీ టిక్కెట్లు ఇచ్చారు. ► మరే పార్టీ చేయని విధంగా మహిళలకు 40% టికెట్లు ఇస్తానని ప్రకటించారు. మై లడ్కీ హూ.. లడ్ సక్తి హూ (ఆడపిల్లను.. పోరాడగలను ) అని నినదిస్తూ ఎన్నికల చదరంగంలో పావులు కదుపుతున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
యోగిపై పోటీ చేస్తున్నా.. అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు మారిన నేతలతో పలు నియోజకవర్గాల్లో మరింత హోరాహోరీగా పోటీ జరగనుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన.. ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని తొలిసారి ఇక్కడే నుంచే పరీక్షించుకోనున్నారు. తాజాగా అదే నియోజకవర్గం నుంచి యోగిపై పోటీకి బరిలోకి దిగుతున్నట్లు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గురువారం ప్రకటించారు. చంద్రశేఖర్ ఆజాద్ గతంలో సీఎం యోగిపై పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ తరపున గోరఖ్‌పూర్ సదర్ స్థానంలో పోటీచేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘నేను గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం వల్ల జైల్లో ఉన్న ఏకైక రాజకీయ నేతను. ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వను. ఎందుకంటే ఆయనపై నేను పోటీ చేస్తున్నాను. యోగిపై వ్యతిరేకంగా గోరఖ్‌పూర్‌లో పోటీకి దిగుతున్నా’ అని చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. 1989 నుంచి గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ(అలియన్స్లో ఒక్కసారి) గెలుస్తూ వస్తోంది. అయితే సీట్ల కేటాయింపు సర్దుబాటు కాకపోవడంతో తమ పార్టీ సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టడంలేదని ఇటీవల చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఎస్పీ తమకు 25 సీట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపణలు కూడా చేశారు ఆజాద్. 2017లో దళితులకు, అగ్రకులాల మధ్య చోటుచేసుకున్న అల్లర్ల ఘటనతో భీమ్ ఆర్మీ వెలుగులోకి వచ్చింది. అల్లర్ల కారణంగా చంద్రశేఖర్ ఆజాద్ జైలుకు వెళ్లి.. 2018లో బెయిల్‌పై బయటకు వచ్చారు. 2019లో భీమ్ ఆర్మీ తరపున చంద్రశేఖర్ ఆజాద్ వారణాసి పార్లమెంట్ స్థానంలో నరేంద్ర మోదీపై పోటీ చేసిన విషయం తెలిసిందే. -
ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!
3D-print saree business in Gujarat: యూపీ ఎన్నికలతో గుజరాత్లో త్రీడీ ప్రింట్ చీరల వ్యాపారం ఊపందుకుంది. ఎన్నికలు జరగన్నును రాష్ట్రాలలో కోవిడ్ -19 దృష్ట్య బహిరంగ ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారం కాస్త గుజరాత్‌లోని సూరత్‌లో చీరల వ్యాపారానికి ఊతం ఇచ్చింది. ఈ మేరకు సూరత్‌లోని టెక్స్టైల్ మార్కెట్‌కు చెందిన ఒక బట్టల వ్యాపారి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖాల త్రీడి ప్రింట్లతో చీరను తయారు చేశాడు. దీనికి బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మద్దతు ఉంది. పైగా వారి డిమాండ్ మేరకు సూరత్ వ్యాపారులు ఈ చీరలను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఈ చీరలపై రామమందిరం, వారణాసిలోని వివిధ ఘాట్లు, ఇటీవల ప్రధాని ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ల ప్రింట్లను ముద్రించారు. పైగా ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చీరలను పెద్దమొత్తంలో పంపించాలని సూరత్‌కు చెందిన వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు కూడా బీజేపీ మద్దతుదారులే చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో తమ ఎన్నికల ప్రచారానికి సహకరించే మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చీరల్లో కొన్నింటిపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం చిత్రం కూడా ఉంటుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సుమారు లక్ష చీరలను పంపనున్నట్లు వస్త్ర వ్యాపారి లలిత్ శర్మ తెలిపారు. (చదవండి: ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయిస్తా: ప్రియాంక గాంధీ) -
అఖిలేష్‌కు మరో షాక్: బీజేపీలో చేరిన ములాయం తోడల్లుడు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నవేళ అన్ని పార్టీల్లో నేతల పార్టీ చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సమాజ్‌వాదీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ వ్యవస్థపక అధ్యక్షుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరారు. బుధవారం ములాయంసింగ్ యాదవ్ సవతి కుమారుడు (రెండో భార్య సాధనా సింగ్‌కు మొదటి వివాహం ద్వారా జన్మించారు) ప్రతీక్ యాదవ్ భార్య అయిన అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రమోద్ గుప్తాతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ప్రియాంక మౌర్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘లడ్కీ హూన్, లడ్ సక్తి హూన్’ ప్రచారంలో ప్రియాంక మౌర్య పోస్టర్ గర్ల్‌గా ఉండి కీలకంగా వ్యవహరించారు. బీజేపీలో ఆమె చేరిక కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగనుందని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఓబీసీ వర్గాల్లో ఇబ్బంది పడుతున్న బీజేపీకి ములాయం చిన్న కోడలు బీజేపీలో చేరడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా మారింది. -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు: ఆ పార్టీలతోనే బీజేపీ పొత్తు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలతో పొత్తు ఖరారు చేసుకుంది. అప్నాదళ్, నిషాద్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలకు వెనుబడిన వర్గాల నుంచి మద్దతు ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలసికట్టుగా పోరాటం చేస్తాయని నడ్డా విలేకరుల సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి భద్రతలు, పెట్టుబడులు, సామాజిక అభ్యున్నతిలో మంచి పనితీరుని కనబరుస్తోందని చెప్పారు. త్వరలోనే సీట్లసర్దుబాటు పూర్తవుతుం దని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న అప్నాదళ్ చీఫ్ అనుప్రియ పటేల్, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్‌లు మోదీ ప్రభుత్వం ఒబిసిల ప్ర యోజనాల కోసం పని చేస్తుందని కొనియాడారు. చదవండి: (పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!) -
పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!
భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తర్వాత అంతగా ప్రాధాన్యం, జనాసక్తి ఉండేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే. అక్కడ ఏ పార్టీ పరిస్థితేంటి, ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటున్నారు... విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి? ఏయే కారణాల వల్ల అనేది రాజకీయ పండితుల నుంచి పామరుల దాకా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ యూపీలో ఫిబ్రవరి 10న తొలివిడత ఎన్నికలు జరగనున్న 58 నియోజకవర్గాల పరిస్థితిపై సవివర విశ్లేషణ... తొలిదశ ఎన్నికలు జరగనున్న 58 నియోజకవర్గాల్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 53 స్థానాలను గెలిచింది. దీనికి కారణం 2013 ముజఫర్‌నగర్‌లో జరిగిన మతఘర్షణలు. అందులో 43 మంది చనిపోయారు. తర్వాత 2014–16 మధ్యకాలంలో కైరానా పట్టణం నుంచి ముస్లింల వేధింపులు భరించలేక దాదాపు 350 దాకా హిందువుల కుటుంబాలు వలసపోయాయి. పశ్చిమ యూపీలో ముస్లిం జనాభా ఎక్కువ. మొత్తం ఉత్తరప్రదేశ్ జనాభాలో ముస్లింలు 19.3 శాతం ఉండగా... పశ్చిమ యూపీలో ఏకంగా 26 శాతం కేంద్రీకృతమై ఉన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ నినాదాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన బీజేపీ... ముజఫర్‌నగర్, కైరానా ఘటనలను పదేపదే ఎత్తిచూపుతూ... ముస్లింలకు కొమ్ముకాసే సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ఆగడాలు మరింతగా మితిమీరుతాయని ప్రచారం చేసింది. తద్వారా హిందువుల ఓట్లను విజయవంతంగా సంఘటితం చేసి పశ్చిమ యూపీని ఏకపక్షంగా కైవసం చేసుకుంది. ఈసారి సీన్ మారింది ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే... ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. హిందూత్వ కార్డు ఫలించే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో హిందూత్వ సెంటిమెంటును మరోస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా... అయోధ్య రామాలయ నిర్మాణం, కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి బీజేపీ ఉండబట్టే జరుగుతున్నాయని.. మరోసారి అధికారమిస్తే మథురలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మిస్తామని కాషాయపార్టీ చెబుతోంది. ఈ పాచిక కూడా పారేటట్లు కనిపించడం లేదు. దాంతో బీజేపీ ఇక్కడ ప్రభావవంతంగా ఉండే చెరకు రైతులను దృష్టిలో పెట్టుకొని... యోగి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రూ 1.55 లక్షల కోట్లను చెరకు రైతులకు చెల్లింపులు చేసిందని, ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా చూశామని చెబుతోంది. అలాగే నోయిడాలో నిర్మితం కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చూపుతూ... అభివృద్ధి మంత్రం పఠిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎస్పీకి సానుకూలంగా.. పశ్చిమ యూపీలో ముస్లింలు 26 శాతం పైచిలుకు ఉన్నారు. ఎనిమిది జిల్లాల్లో అయితే ఏకంగా 40.43 శాతం ఉన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో చాంపియన్‌గా పేరుపడ్డ సమాజ్‌వాదీ పార్టీతోనే ముస్లిం యూపీలో ఉంటున్నారు. దీనికి తోడు... ఈసారి బీజేపీని నిలువరించాలంటే తమ ఓట్లు లౌకిక పార్టీల మధ్యన చీలిపోకూడదని, గెలిచే అవకాశాలున్న ఎస్పీకే గంపగుత్తగా ముస్లిం ఓట్లన్నీ పడితేనే కమలదళాన్ని ఓడించడం సాధ్యమనే సందేశాన్ని ముస్లిం మతపెద్దలు, నాయకులు సామాన్యులకు నూరిపోస్తున్నారు. మసీదుల్లో ఈ అంశాన్ని నొక్కి చెబుతున్నారు. మరోవైపు దాదాపు 3.5 శాతం మంది జాట్లు ఉన్నారు. జాట్ల పార్టీగా గుర్తింపు పొందిన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)– సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకుంది. అంటే... దాదాపు 30 శాతం ఓట్ల బలం పశ్చిమ యూపీలో ఎస్పీకి ఏకపక్షంగా అనుకూలంగా మారినట్లే. పైగా ఎస్పీ ప్రధాన బలమైన, యూపీలో శక్తివంతమైన సామాజికవర్గం యాదవుల మద్దతు ఎలాగూ ఉంటుంది. చదవండి: (పొలిటికల్ సిద్ధూయిజం: క్రికెట్లో అజారుద్దీన్‌నీ వదల్లేదు.. రాజకీయాల్లో..) మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్‌ల చేరికతో ఇతర వెనుకబడిన వర్గాల్లోనూ (ఓబీసీ) ఎస్పీకి బాగా సానుకూలత ఏర్పడింది. దానికి తోడు మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా 14 నెలల సుదీర్ఘకాలం పాటు జరిగిన రైతు ఉద్యమంలో పశ్చిమ యూపీకి చెందిన రైతులు ప్రధాన భూమిక పోషించారు. అందులోనూ జాట్ రైతు నాయకులు ముందుండి అన్నదాతలను నడిపించారు. ఇదే ప్రాంతానికి చెందిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమికి బాహటంగా మద్దతు ప్రకటించారు. రైతు ఉద్యమం చివరి దశకు చేరుకున్న దశలో ఘజియాబాద్‌లో నిర్వహించిన మహాపంచాయత్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. ఆ సభలోనే బీకేయూ మరోనేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ రైతులను గోస పెట్టాయని ఆరోపించారు. బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింలు– రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తామిక ప్రతీ వేదికపై అల్లా హో అక్బర్‌తో పాటు హరహర మహదేవ్ అంటూ నినదిస్తామని ప్రకటించారు. ఘజియాబాద్ సభకు అంచనాలకు అందని విధంగా రైతులు తరలిరావడం, నగర రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోవడం చూసి బీజేపీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. అంటే క్షేత్రస్థాయిలో ఎస్పీకి మంచి సానుకూల వాతావరణం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ తొలి దశలో సునాయాసంగా 45 నుంచి 50 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కూడా ఎన్నికలు జరిగే 58 స్థానాల్లో తమ కూటమి 45– 50 స్థానాలు గెలుచుకుంటుందనే ధీమాతో ఉన్నారు. చదవండి: (Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!) ఆరంభమే అదిరితే..! యూపీలో ఫిబ్రవరి 10న మొదలై మార్చి 7వ తేదీదాకా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో పశ్చిమ యూపీలో పోలింగ్ ఉండటం ఎస్పీకి బాగా కలిసొచ్చే అంశం. బోణీ బాగుంటుంది కాబట్టి ఎస్పీ ఉత్సాహంగా మిగతా ఆరు దశల్లో ఎన్నికలను ఎదుర్కొంటుంది. తొలిదశలోనే సైకిల్ (సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం) స్పీడు పెరుగుతుందని... ఇక తమను ఆపడం ఎవరితరం కాదని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి ఇటీవల అన్నారు. ఓపెనర్ సెంచరీ చేస్తే ఆ జట్టు మంచిస్కోరు సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లే... తాము మంచి స్థితిలో ఉన్నామనేది ఎస్పీ వ్యూహకర్తల భావన. పశ్చిమాన మొదలైన ఈ గాలి క్రమేపీ బలపడి తూర్పుకు వెళ్లేసరికి సుడిగుండంలా మారుతుందని, బీజేపీని తుడిచిపెట్టేస్తుందని అఖిలేశ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈటెల్లాంటి మాటలే.. ఎన్నికల షెడ్యూల్ రావడానికి రెండు మూడు నెలల ముందు నుంచే యూపీలో రాజకీయ నాయకుల మాటలు పదునెక్కాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘చాచా జాన్’ అనే వారికి ఎస్పీ హయాంతో రేషన్‌తో సహా అన్ని దక్కేవని పరోక్షంగా ఎస్పీ పూర్తిగా ముస్లింకు కొమ్ముకాసే పార్టీ అని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రధాని మోదీ ఇటీవల యూపీ పర్యటనకు వెళ్లినపుడు up+yogi=upyogi(యూపీ + యోగీ.. కలిపితే ఉపయోగి అవుతుందని, ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌కు ఎంతో చేశారని.. మరో అవకాశమిస్తే బాగా ఉపయోగపడగలరని చెప్పే ప్రయత్నం చేశారు. బెంగాల్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ఇచ్చిన ‘ఖేలా హోబే (ఆట మొదలైంది)’ అనే నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లిపోయిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని... అదే లైన్లో అఖిలేశ్ నాలుగైదు రోజుల కిందట ’మేళా హోబే (ఐక్యత ఉంటుంది... బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఎస్పీ నేతృత్వంలో ఏకమవుతాయన్న అర్థంలో) అంటూ ట్వీట్ చేశారు. కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలపై ఈసీ కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పుడప్పుడే కరోనా ఉధృతి తగ్గేలా లేదు కాబట్టి ఇవే ఆంక్షలూ ఇకపైనా కొనసాగుతాయి. అందువల్ల నేతలు వర్చువల్‌గా ప్రచారం చేయాల్సిందే. సోషల్‌మీడియాలో నాయకుల పోస్టులు తప్పకుండా హీటును పెంచేటట్లుగా ఉంటాయి. ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ... యువతరాన్ని, విద్యావంతులైన ఓటర్లను, తటస్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి రాజకీయపార్టీలు. – నేషనల్ డెస్క్, సాక్షి -
Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!
మాయావతి గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణం కావొచ్చు’’ ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓ వైపు పార్టీల్లో చేరికలు, మరోవైపు నేతల మాటల యుధ్ధాలు, ఇంకోవైపును ప్రజలను ఆకట్టుకునేలా ప్రకటిస్తున్న హామీలతో ఎన్నికల కోలాహలం పెరిగినా.. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఎక్కడా పెద్దగా కనబడకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిధ్దమవుతుండగా, పార్టీ ప్రచారాలకు మాయావతి గైర్హాజరు అవుతుండటం, పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా, ఆమె మౌనం వీడకపోవడం పార్టీ క్రియాశీలక నేతలకు అంతుపట్టకుండా మారుతోంది. మాయావతి మౌనం నేపథ్యంలో ఆమెకు తొలినుంచి అండగా ఉంటూ వస్తున్న దళితవర్గాలు బీజేపీ, ఎస్పీ వైపుకు చూస్తుండటం ఆ పార్టీల గెలుపోటములను నిర్దేశించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ‘మాయ’ పనిచేయట్లేదా! బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి 1995, 1997, 2002, 2007లో నాలుగుమార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో 2007లో 403 సీట్లకు గానూ 206 సీట్లు సాధించి ఆమె సొంతంగానే పూర్తిస్థాయి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో 21 శాతం ఎస్సీలు ఉంటే అందులో అత్యధికంగా 55 శాతం ఉన్న జాతవ్ కులం నుంచి వచ్చిన మాయావతికి ఆ వర్గంలో గట్టిపట్టు ఉంది. 2007లో సోషల్ ఇంజినీరింగ్ పద్ధతిని అమలు చేసి, బ్రాహ్మణులను దళితులతో కలపడం ద్వారా మాయావతి పూర్తి మెజారిటీతో దూసుకుపోయేందుకు సాయపడింది. అనంతరం 2012 ఎన్నికల్లో బీఎస్పీ ఓటినప్పటికీ ఆమె వచ్చిన 80 సీట్లలో 14 మంది దళిత వర్గాల వారు గెలిచారు. 2017 ఎన్నికలకు వచ్చేసరికి ఎస్సీలు ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపినా బీఎస్పీ ఓట్ల శాతం మాత్రం పెద్దగా తగ్గలేదు. గడిచిన నాలుగు ఎన్నికల్లో బీఎస్పీ సగటున 25.42 శాతం ఓట్లను సాధించగా, ఇందులో మెజార్టీ ఓట్లు ఎస్సీ వర్గాల నుంచే ఉన్నాయి. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం19.3 శాతం ఓట్లనే రాబట్టుకుంది. అప్పటినుంచి పార్టీ కార్య్రమాలపై పెద్దగా ఆసక్తి చూపని మాయావతి ట్విట్టర్ ద్వారా మాత్రమే రాజకీయ సమస్యలపై గొంతు విప్పుతూ వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో దళితులు కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే మాయావతి మాత్రం పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ వర్గాలన్నీ పక్క పార్టీలకు మళ్లాయి. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాతవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో బీఎస్పీకి దళితులు దూరమయ్యారు. ఇదీగాక మాయావతి సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ కులాల భద్రత, నివాసం, ఉపాధికి పెద్దగా చేసిందేమీ లేదని, దళితులపై జరిగిన అఘాయిత్యాలను ఆపడంలో విఫలమయ్యారని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఎస్సీ వర్గాల్లో మాయావతి ప్రభ తగ్గిందని, అదీగాక ఆమె గతంలో వాడిన దళితులు–ముస్లిం లేక దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములా ఇప్పుడు పని చేసే అవకాశాలు లేకపోవడం సైతం ఆమె నిరాసక్తతకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: (రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి..) ఎవరికి కలిసొస్తుందో... ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ బలహీనంగా కనబడుతుండటంతో దళిత వర్గానికి చెందిన నేతలతో పాటు పార్టీలో పలుకుబడి గల నేతలను ఆకర్షించేందుకు బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి.ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ విభిన్న సంక్షేమ పథకాలను ముందుపెట్టి దళిత ఓట్లను ఆకర్షించడంతో పాటు వారిని హిందూత్వ గొడుగు కిందకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2017 ఎన్నికల్లో 84 ఎస్సీ నియోజకవర్గాలకు గానూ బీజేపీ ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. తిరిగి అదే స్థాయి సీట్లను రాబట్టుకునేందుకు దళిత కులాలన్నింటినీ కలుపుకుపోయే ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 75 జిల్లాల్లో దళితుల అభ్యున్నతికై నిర్వహించిన ప్రత్యేక సమావేశాలు పార్టీకి అదనపు బలం చేకూర్చిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు తన ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయనని, ఎస్సీ మేధావుల సమావేశాల్లో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఓటర్ల సమీకరణ కోసం దళిత నాయకులను స్వాతగించిన అఖిలేశ్, వారిని రిజర్వ్డ్ స్థానాల్లో నామినేట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ ప్రభుత్వోద్యోగులను సంతోషపెట్టడానికి తిరిగి అధికారంలోకి వస్తే, ఎస్సీ అధికారులే తన ప్రభుత్వాన్ని నడిపిస్తానని అనేకసార్లు ప్రైవేట్ సమావేశాలలో చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది బీఎస్పీ పార్టీ, ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు... ఎస్పీలో చేరిపోయారు. వారిలో ఇంద్రజీత్ సరోజ్ కౌశాంబి, డాక్టర్ కేకే గౌతమ్, మిథాయ్లాల్ భారతి, త్రిభువన్ దత్తా, మహేష్ ఆర్య, సర్వేశ్ అంబేద్కర్, వీర్ సింగ్ జాతవ్, తిలక్ చంద్ర అహిర్వార్, ఫెరాన్ లాల్ అహిర్వార్, అనిల్ అహిర్వార్, విద్యా చౌదరి, రమేష్ గౌతమ్, యోగేష్ వర్మ వంటి వారున్నారు. గడిచిన 4 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి వచ్చిన సీట్లు, ఓట్లు.. ఎన్నికలు గెలిచిన సీట్లు ఓట్ల శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 -
ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయిస్తా: ప్రియాంక గాంధీ
తన పిల్లలకు హోం వర్క్ చేయడం సహయపడతానని కాంగ్రెస్ కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్పారు. తాను ఎన్నికలో ప్రచారంలో ఉన్నప్పుడూ కూడా తన పిల్లలకు హోం వర్క్ చేయడంలో సహాయం చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా జరిగిన లైవ్ చాట్ సెషన్లో ఒక నెటిజన్ మీ పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ సమాధానం ఇచ్చారు. అంతేకాదు ప్రియాంక తన పిల్లలకు హోం వర్క్‌లో సహయం చేయడమే కాక ఆంటీ అంటూ వచ్చే తన పిల్లల స్నేహితులకు కూడా సహాయం చేస్తానని చెప్పారు. పైగా ఈ రోజు కూడా తాను తన కుమార్తె అసైన్‌మెంట్‌లో సహాయం చేశానని తెలిపింది. ఒక్కోసారి ఎన్నిఇకల ప్రచారం నుండి తిరిగి వచ్చినప్పుడూ తమ పిల్లల హోంవర్క్ పూర్తైయిందో లేదో నిర్ధారించడానికి తెల్లవారుజామున 3 లేక 4 గంటలకు కూర్చోవలసి వచ్చేదని చెప్పారు. అంతేగాక తన చిన్నతనంలో సోదరుడు రాహుల్ గాంధీతో తీవ్రంగా గొడవపడేదాన్ని అని అన్నారు. కానీ బయటివాళ్లు ఎవరైన జోక్యం చేసుకుంటే మాత్రం తాము ఒక్కటైపోయే వాళ్లం అని చెప్పుకొచ్చారు. అయితే కోవిడ్ కారణంగా రాజకీయ పార్టీలు ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో చాలా పార్టీలు ఓటర్లను కనక్ట్ అవ్వడానికి వినూత్న రీతిలో ఇలా ఆన్లైన్ ఫ్లాట్ ఫాంలను ఆశ్రయించాయి. View this post on Instagram A post shared by Priyanka Gandhi Vadra (@priyankagandhivadra) (చదవండి: చైనా అక్రమ వంతెన: మోదీ ప్రారంభిస్తారని భయంగా ఉంది!)