
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండో దశలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 584 మంది పోటీపడుతుండగా... వీరిలో 25 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నా యని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్సు తెలిపింది.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 52 మంది అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించగా.. వీరిలో 35 మందిపై (67 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. కాంగ్రెస్ తరఫున రంగంలో నిలిచిన 54 మందిలో 23 మందిపై కేసులున్నాయని, బీఎస్పీ నిలబెట్టిన 55 మంది అభ్యర్థుల్లో 20 మంది కేసులను ఎదుర్కొంటున్నారని వివరించింది.