
ఇటీవల ఎస్పీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడు ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ అధినేత మొండిచేయి ఇచ్చారు. 2017 ఎన్నికల్లో ఉంచహార్ నుంచి పోటీ చేసి 1,934 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ సీటు కేటాయిస్తారని ఊహాగానాల మధ్య, సిట్టింగ్ ఎమ్మెల్యే మనోజ్ పాండే వైపే అఖిలేష్ మొగ్గు చూపారు. అయితే తొలి జాబితాలో స్వామి ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్న పండ్రౌనా స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ జస్వంత్‌నగర్ నుంచి పోటీకి దిగుతుండగా, రాంపూర్ స్వర్ నుంచి ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం బరిలోకి దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment