uttar pradesh assembly election 2022
-
మాయావతికి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. సీబీఐ, ఈడీ, పెగసస్ల భయంతోనే ఆమె బీజేపీ విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు. సమృద్ధ్ భారత్ ఫౌండేషన్ ప్రచురించిన ‘ది దళిత్ ట్రూత్’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాహుల్ ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఒక ఆయుధమని కాంగ్రెస్ నేత రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హస్తగతం చేసుకుందని ఆరోపించారు. రాజ్యాంగంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.‘కేవలం అధికారం చేజిక్కించుకోవడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించే కొందరు రాజకీయ నేతల వంటి వాడిని కాదు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. అదేవిధంగా, తీవ్రంగా కొట్టి హింసింది. నేనింకా నేర్చుకోవాలని దేశం భావిస్తున్నట్లు దాని ద్వారా తెలుసుకున్నాను’అని అన్నారు. -
సోనియా గాంధీ కీలక నిర్ణయం.. పీసీసీ చీఫ్‌లకు షాక్!
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరిన్ని కఠిన నిర్ణయాలకు సమాయత్తమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆప్ అధికారంలోకి వచ్చింది. కచ్చితంగా పంజాబ్‌లో గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు.. అక్కడ ప్రతికూల ఫలితాలు రావడం హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే పార్టీకి తీవ్ర నష్టం కల్గడంతో చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఆ ఐదు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ను ముంచేసి..రాజీనామానా? -
బీజేపీకే 54% హిందూ ఓట్లు
లక్నో: తాజాగా ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన ఓటింగ్ ధోరణి స్పష్టంగా కన్పించిందని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే పేర్కొంది. హిందూ ఓట్లలో సగానికి పైగా బీజేపీకి పడగా ఏకంగా మూడింట రెండొంతుల మంది ముస్లింలు సమాజ్‌వాదీకి ఓటేసినట్టు వివరించింది. అయితే బీజేపీకి ముస్లిం ఓట్లు, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీకి హిందూ ఓట్లు పెరిగినట్టు తెలిపింది. ‘‘2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ముస్లిం ఓట్లు స్వల్పంగా పెరిగాయి. ఎస్పీకి హిందూ ఓట్లు కూడా 18 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి’’ అని వెల్లడించింది. హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో అఖిలేశ్ యాదవ్ పలు హిందూ దేవాలయాలను సందర్శించడం తెలిసిందే. బీజేపీ తరఫున సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా 80 శాతం మంది ప్రజలు బీజేపీకే మద్దతుగా ఉన్నారంటూ పదేపదే ‘80–20’ ప్రచారం ద్వారా హిందూ–ముస్లిం భావోద్వేగాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. సమగ్రమైన శాంపిల్స్ ఆధారంగా సర్వే జరిగినట్టు సీఎస్డీఎస్ రీసెర్చ్ విభాగమైన లోక్‌నీతి కో డైరెక్టర్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు. ► హిందూ ఓటర్లలో 54 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 2017లో ఇది 47 శాతమే. ► బీఎస్పీకి 14 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం హిందూ ఓట్లు దక్కాయి. ► ముస్లిం ఓటర్లలో ఏకంగా 79 శాతం మంది సమాజ్‌వాదీకే ఓటేశారు. 2017లో ఇది 46 శాతం మాత్రమే! ► బీజేపీకి 8 శాతం ముస్లిం ఓట్లు పడ్డాయి. 2017లో ఇది 5 శాతమే. ► బీజేపీ కూటమి నుంచి గెలిచిన 273 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ముస్లిం కూడా లేరు. ► బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెటివ్వలేదు. మిత్రపక్షం అప్నాదళ్ ఒకరికి అవకాశమిచ్చింది. ► బీఎస్పీకి 6 శాతం ముస్లిం ఓట్లు మాత్రమే పడ్డాయి. 2017లో ఇది 19 శాతం ► 2017 కంటే 10 మంది ఎక్కువగా ఈసారి 34 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ► వీరిలో 31 మంది ఎస్పీ అభ్యర్థులే. మిగతా ముగ్గురు కూడా ఎస్పీ మిత్రపక్షాలు ఆరెల్డీ, ఎస్బీఎస్పీ తరఫున పోటీ చేశారు. -
కాంగ్రెస్ పై నిజమైన మోడీ వ్యాఖ్యలు
-
ఓటమికి కారణం ఇదే: మాయావతి
-
Sakshi Cartoon: యూపీలో మళ్లీ బీజేపీ
యూపీలో మళ్లీ బీజేపీ..షాక్‌లో అఖిలేష్ యాదవ్ -
‘మాయ’మైనట్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఆ పార్టీ కుదేలైంది. తొలినుంచి ఆయువుపట్టుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆదరించకపోగా మాయా సొంత సామాజికవర్గం జాటవ్‌లు కూడా బీజేపీ వైపు మొగ్గారు. ఒక దశలో ప్రధాని అయ్యేంతగా వెలుగు వెలిగిన మాయావతి ప్రభ ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులంటున్నారు. మాయా లేదు..మంత్రం లేదు.. బహుజనుల నేతగా 1995, 1997, 2002, 2007ల్లో నాలుగుసార్లు యూపీ సీఎం పీఠమెక్కిన ఘన చరిత్ర 66 ఏళ్ల మాయావతిది. అలాంటిది బీఎస్పీ ఈసారి ఎన్నడూ లేనంతటి ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి నెగ్గింది ఒక్కటంటే ఒక్క సీటు! ఓట్ల శాతం కూడా 12.6 శాతానికి దిగజారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ కేవలం 19.3 శాతం ఓట్లతో 10 స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాలను మాయా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో పార్టీలో క్రియాశీలంగా ఉండే బ్రాహ్మణవర్గం బీజేపీలోకి, ముస్లింలు సమాజ్‌వాదీలో చేరారు. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ పోటాపోటీ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలకు దిగాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ 209 ర్యాలీలు, సభలు; బీజేపీ నుంచి యోగి 203 సభలు, ర్యాలీలు; ఎస్పీ అధినేత అఖిలేశ్ 139 ర్యాలీలు, సభలు జరిపితే మాయా కేవలం 18 మీటింగులతో ముగించారు. ఎస్సీలూ దూరమయ్యారు యూపీలో 21 శాతమున్న దళిత ఓటర్లు తొలినుంచీ బీఎస్పీకే దన్నుగా నిలిచారు. సుమారు 4.2 కోట్ల దళితుల్లో 2.25 కోట్లు మాయా సామాజికవర్గం జాటవ్కే చెందిన వారు. పాసీలు 70 నుంచి 80 లక్షల దాకా (16 శాతం)ఉంటారు. కోటికి పైగా మిగతా కులాల వారున్నారు. రాష్ట్రంలోని 84 ఎస్సీ స్థానాల్లో 2007లో బీఎస్పీ ఏకంగా 61 గెలుచుకోగా 2012లో 14కు పడిపోయింది. 2017 ఎన్నికల నాటికి ఎస్సీలు దాదాపుగా బీజేపీ వైపు మొగ్గారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాటవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో దళితులు బీఎస్పీకి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అదే ఫార్ములా వాడింది. దాంతో దళితులంతా మరోసారి బీజేపీవైపే నిలిచారు. గడిచిన ఎన్నికల్లో బీఎస్పీ సాధించిన సీట్లు, ఓట్లు ఎన్నికలు గెలిచిన ఓట్ల సీట్లు శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 2022 1 12.66 -
యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు తెలుసా?
లక్నో: యోగి ఆదిత్యనాథ్.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు. బీజేపీని మరోసారి విజయతీరాలకు చేర్చిన నేతగా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం యోగియే అన్న ప్రచారం సైతం ఇప్పటికే ఊపందుకుంది. హిందుత్వ నినాదానికి ‘పోస్టర్ బాయ్’గా, ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు పొందిన యోగి ఆదిత్యనాథ్ తరచుగా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. మఠాధిపతి నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకూ ఆయన ప్రస్థానం నిజంగా ఆసక్తికరం. ► యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్‌సింగ్ బిస్త్. ► ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లో పౌరీ గర్వాల్ జిల్లాలోని పాంచుర్ (ప్రస్తుత ఉత్తరాఖండ్)లో 1972 జూన్ 5న ఠాకూర్ సామాజికవర్గంలో జన్మించారు. తండ్రి ఆనంద్‌సింగ్ బిస్త్ ఫారెస్ట్ రేంజర్‌గా పనిచేశారు. నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లలో యోగి రెండో సంతానం. ► 1990లో ఇల్లు విడిచి వెళ్లిపోయారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో చేరారు. చురుగ్గా కార్యకలాపాలు సాగించారు. ► గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్కు ప్రియ శిష్యుడిగా మారారు. ► అవైద్యనాథ్ మరణం తర్వాత 2014లో గోరఖ్‌నాథ్ ఆలయ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ పీఠాధిపత్యం ఆయనదే. ► పీఠాధిపతిగా ఉంటూ బీజేపీపై విమర్శలు చేసేందుకు కూడా ఆదిత్యనాథ్ వెనకాడలేదు. హిందుత్వ సిద్ధాంతాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందంటూ తూర్పారబట్టేవారు. అయినా యోగిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు అభిమానం ప్రదర్శించేవారు. ► ‘హిందూ యువవాహని’ పేరిట యోగి సొంతంగా ఒక సేనను తయారు చేశారు. అందులో భారీగా కార్యకర్తలను చేర్చుకున్నారు. ► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. హేమావతి నందన్ బహుగుణ గర్వాల్ వర్సిటీ నుంచి మ్యాథ్స్‌లో బ్యాచ్లర్స్ డిగ్రీ అందుకున్నారు. 1998లో సొంత గ్రామంలో స్కూలు నెలకొల్పారు. ► గురువు అవైద్యనాథ్ మార్గదర్శకత్వంలో 1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► 28 ఏళ్ల వయసులోనే గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ లోక్‌సభలో అత్యంత పిన్నవయస్కుడు ఆయనే. ► 1998, 1999, 2004, 2009, 2014ల్లో ఐదుసార్లు గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ► 2017 ఎన్నికల్లో యూపీలో ఘనవిజయం సాధించిన బీజేపీ యోగిని అనూహ్యంగా సీఎంగా ఖరారు చేసింది. 2017 మార్చి 19న యూపీ 21వ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. ► హిందుత్వ ప్రతినిధిగా తన ప్రతిష్టను మరింత పెంచుకొనేలా యోగి పలు నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలో గోవధపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కబేళాలను మూసేయించారు. ► లవ్ జిహాద్‌ను అరికట్టడమే లక్ష్యంగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా తొలుత ఆర్డినెన్స్, ఆ తర్వాత బిల్లు తెచ్చారు. ► అవినీతి, అక్రమాలకు దూరంగా నిజాయితీపరుడైన నాయకునిగా ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ► సీఎం పదవి నుంచి యోగిని తప్పించాలని బీజేపీ భావిస్తున్నట్లు గతేడాది బాగా విన్పించినా నిజం కాదని తేలింది. ► ఈ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. -
ఫలించిన పాజిటివ్ మంత్రం
ఉత్తరప్రదేశ్ ఓటర్లు చరిత్ర సృష్టించారు. యోగి ఆదిత్యనాథ్ పాలనకు జై కొట్టారు. మూడున్నర దశాబ్దాల ఆనవాయితీని తిరగరాస్తూ అధికార పార్టీ బీజేపీకి రెండోసారి అధికారం కట్టబెట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఒంటరి పోరాటం ఫలించలేదు. బీఎస్పీ పూర్తిగా చతికిలపడటం, కాంగ్రెస్ కనుమరుగవడం, బీజేపీ హిందూత్వ ప్రచారం, పాజిటివ్ మంత్రం తదితరాలు అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని దెబ్బతీశాయి. శాంతిభద్రతలు, మోదీ ప్రజాదరణ, ఉచిత రేషన్, అభివృద్ధి వంటి సానుకూలాంశాలు యోగిని గట్టెక్కించాయి. సవ్యమైన శాంతిభద్రతలు యోగి పాలనలో సైతం గత ఐదేళ్లలో యూపీలో దారుణమైన నేరాలు అనేకం జరిగాయి. కానీ వాటికి పాల్పడ్డ వారిని యోగి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేసిన తీరు ప్రజలకు నచ్చింది. నేరాలకు పాల్పడిన మాఫియా నేతలను ఎన్కౌంటర్లలో మట్టుపెట్టిన యోగి ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. ‘యోగి వల్ల మేం రాత్రి 12 గంటలకు కూడా రోడ్డుపై తిరగగలుగుతున్నాం. అంతకంటే మాకేం కావాలి?’ అని లక్నోకు చెందిన సురేఖ రాణి ప్రశ్నించారు. నేరస్తుల పట్ల యోగి అత్యంత కఠినంగా వ్యవహరించారని ప్రజలు విశ్వసించారు. గతంతో పోలిస్తే యూపీలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయని రాయ్‌బరేలీకి చెందిన కిషన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నేను యూపీలో విస్తృతంగా పర్యటించాను. యోగి ప్రభుత్వం పట్ల మహిళల్లో మంచి ఆదరణ కన్పించింది. దానికి మరో అవకాశం ఇవ్వాలన్న పట్టుదల చాలామందిలో గమనించా’ అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలో రావడానికి మహిళల మద్దతు ప్రధాన కారణమని ఆయనన్నారు. అవినీతి నియంత్రణ యోగి తన ఐదేళ్ల పాలనలో అవినీతిని కొంతమేరకు నియంత్రించగలిగారు. ఇది కూడా ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిందని రాజకీయ విళ్లేషకులు అంటున్నారు. ‘మరీ ముఖ్యంగా పై స్థాయిలో అవినీతిని యోగి బాగా నియంత్రించారని ప్రజలు నమ్మారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయడంలో యోగి సఫలమయ్యారు. ఏ నియోజకవర్గంలో నేరాలు జరిగినా సంబంధిత ఎమ్మెల్యేదే బాధ్యత అన్న యోగి హెచ్చరికలు కూడా ప్రజలకు నచ్చాయి’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వర్మ అన్నారు. ‘కిందిస్థాయిలో అవినీతి ఉన్నా ప్రజలను ఇబ్బంది పెట్టేంతగా లేదని ప్రజలు విశ్వసించారు. మరోసారి యోగి గెలిస్తే అవినీతి మరింత తగ్గుతుందని కూడా నమ్మారు’ అని ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రదీప్ గుప్తా విశ్లేషించారు. పన్నులు పెంచినా వృద్ధీ ఉంది యోగి హయాంలో పన్నులు బాగా పెంచారన్న అసంతృప్తి ప్రజల్లో లేకపోలేదు. కానీ అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి కదా అని సర్దుకుపోయే ధోరణిలో మాట్లాడుతున్న వాళ్లే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా ఐదేళ్లలో బాగానే మెరుగుపడిందని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారు. యోగికి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వడానికి ఇవీ కారణాలేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. సమాజ్‌వాదీ ఓటమికి కారణాలెన్నో.. అఖిలేశ్‌ను ఎలాగైనా మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటూ ముస్లింలలో వచ్చిన పెద్ద మార్పు యూపీలో హిందువుల పోలరైజేషన్‌కు ఉపయోగపడింది. బహుశా ఇదే బీజేపీని గెలిపించినట్టు కన్పిస్తోందని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులకు వ్యతిరేకంగా ఓబీసీలు బీజేపీ వైపు ర్యాలీ అయ్యారని ఆయన విశ్లేషించారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయంగా దాదాపుగా కనుమరుగు కావడం కూడా అఖిలేశ్‌కు అతి పెద్ద మైనస్‌గా మారిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆమె పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. మాయావతి అనాసక్తిని కనిపెట్టిన కొందరు దళితులు బీజేపీ పంచన చేరారు. మరికొందరు ఎస్పీకి వ్యతిరేకంగా పని చేశారు. నిజానికి ఈసారి ముస్లింలు, యాదవులు అఖిలేశ్‌కు ఏకమొత్తంగా మద్దతు పలికారు. అలా చూస్తే ఆయన పోరాటం నేరుగా 24 శాతం ఓట్లతో మొదలైంది! 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 4 శాతం అధికం. మరో 16 శాతానికి అటూఇటుగా ఓట్లు తెచ్చుకోగలిగి ఉంటే అధికారం ఆయన సొంతమయ్యేదే. కానీ అది చెప్పినంత తేలిక కాదు. యూపీ రాజకీయాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువే. వారు ఏ పార్టీకి మద్దతిస్తే వారి తరపున జోరుగా ప్రచారం చేస్తారు. పైగా మరో విశేషమేమంటే ఆ వర్గానికి చెందిన వారు కనీసం 90 శాతం దాకా కచ్చితంగా ఓటు వేస్తారు. ఇది ఈసారి అఖిలేశ్‌కు బాగా మైనస్‌గా మారింది. గత ఐదేళ్లలో అఖిలేశ్ పార్టీని పటిష్టపరచుకోగలిగారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పెద్దగా పోరాటాలు చేయలేదన్న అపవాదుంది. ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నంలో కూడా విఫలమయ్యారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. అలాగే యాదవులు, ముస్లింలు మినహా మిగతా వర్గాలను అఖిలేశ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. కానీ, దాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోయారు. అందుకు కావాల్సిన యంత్రాంగం, దాన్ని ముందుండి నడిపే వనరుల లేమి కూడా మైనస్ అయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మోదీ మంత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల యూపీ ప్రజలకున్న విశ్వాసం ఏమాత్రం సడలకపోవడం కూడా యోగికి ఈసారి పెద్ద వరమైంది. ‘యోగి కంటే మోదీకే యూపీలో ఎక్కువ పాపులారిటీ ఉంది. ఆయనపై ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం కూడా అఖిలేశ్‌కు బాగా మైనస్ అయింది’ అని సెఫాలజిస్ట్ యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు. వీటికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం కూడా అఖిలేశ్‌కు మరో పెద్ద మైనస్‌గా మారింది. ఎక్కడా కాంగ్రెస్ కనీసం ఐదు శాతం ఓట్లు కూడా చీల్చే పరిస్థితి కన్పించలేదు. దాంతో అధికార బీజేపీ ఓట్లు చీలలేదు. – (సాక్షి ప్రత్యేక ప్రతినిధి కంచర్ల యాదగిరిరెడ్డి) -
యోగి రికార్డు! యూపీలో 70 ఏళ్ల తర్వాత..
ఎగ్జిట్ పోల్ అంచనాలే దాదాపుగా నిజం అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ 202ను దాటేసి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రాంతీయ పార్టీలతో జత కలిసి కూటమిగా వెళ్లినా.. అఖిలేష్ యాదవ్‌కు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎంలకు భంగపాటు తప్పలేదు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కంటిన్యూ అవుతోంది. మోదీ-షా ప్రచార మాయజాలంతో యోగి సర్కార్కే రెండోసారి పట్టం కట్టేందుకు జనాలు మొగ్గు చూపించారు. ఫలితాల సరళిని గమనిస్తే.. మెజారిటీ స్థానాలు బీజేపీ సునాయాసంగా గెలుచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానాలు కొద్దిగా తగ్గినప్పటికీ.. యోగి నేతృత్వంలో సుస్థిర బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అయ్యింది. ముఖ్యంగా యూపీలో బీజేపీకి సోషల్ ఇంజినీరింగ్ బాగా కలిసొచ్చింది. ముజఫర్‌నగర్ పంచాయితీ ఎన్నికల్లో ఫలితం చూపించడంతో.. అసెంబ్లీ ఎన్నికలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యింది బీజేపీ. Social Engineering కాస్త సూపర్‌సక్సెస్ అయ్యింది. ఓబీసీలు యోగి సర్కార్ వెంటే నడిచారు. అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ కూటమి.. రెండో ప్లేస్‌లో నిలిచింది. అయితే చాలాగ్యాప్ తర్వాత ఎస్పీ వంద సీట్లు దాటడం కాస్త ఊరట ఇచ్చే విషయం. ఎంఐఎం ఓటింగ్ శాతం.. ఎస్పీపై ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా. గతంలో ప్రతిపక్షం ఎప్పుడూ 50 సీట్ల కంటే ఎక్కువ గెలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇక నాలుగుసార్లు యూపీని పాలించిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. కనీస ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ కీలక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం పరిస్థితి ఘోరంగా కనిపిస్తోంది. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ స్థానంలో గెలుపుదిశగా పయనిస్తున్నారు. యూపీలో 70 ఏళ్ల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా కనిపిస్తోంది. స్వాతంత్రం వచ్చాక యూపీకి ఒక సీఎం పూర్తిస్థాయి పదవి కాలం పూర్తి చేసుకున్నాక.. రెండోసారి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కానుంది. అంతేకాదు దాదాపు 37 ఏళ్ల తర్వాత ఒక పెద్ద రాష్ట్రంలో.. బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కూడా జరగనుంది. -
ఎస్పీకి మరీ అన్ని తక్కువ సీట్లా?.. సరికొత్త ఎగ్జిట్ పోల్స్
అన్ని సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సరికొత్త సర్వే ఒకటి ట్రెండింగ్‌లో నిలిచింది. పీపుల్స్ పల్స్, ఏబీపీ-సీ ఓటర్, ఇండియా టుడే, టైమ్స్ నౌ.. వంటి ప్రముఖ సర్వే సంస్థల అంచనాలకు తలకిందులు చేస్తూ సెంటర్ ఫర్ గ్లోబల్ స్టడీస్(ఢిల్లీ యూనివర్సిటీ) భిన్నంగా ఎగ్జిట్ పోల్స్‌ను చేపట్టింది. తమ సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గురువారం ఐదు రాష్ట్రాల(ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఐదు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఎంతో పట్టుదలతో ప్రచారంలో దూసుకెళ్లగా.. ప్రతిపక్ష పార్టీలు సైతం బీజేపీకి చెక్ పెట్టేందుకు ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగాయి. కాగా.. దేశంలోనే అత్యధిక సీట్లు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో కమలం మరోసారి వికసించనున్నట్లు ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో వెల్లడైంది. అన్నిఎగ్జిట్పోల్కు భిన్నంగా సెంటర్ ఫర్ గ్లోబల్ స్టడీస్(ఢిల్లీ యూనివర్సిటీ) చేపట్టిన సర్వే యూపీలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపుతుందని తమ సర్వే ఫలితాల్లో వెల్లడించింది. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు గాను 55.3 శాతం ఓటింగ్‌తో బీజేపీ 334 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని తెలిపింది. అలాగే.. సమాజ్‌వాదీ పార్టీ కూటమి 53 స్థానాల్లో, బీఎస్పీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధింస్తుందని అంచనా వేసింది. కాగా, ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎవరూ చేయని విధంగా దాదాపు 3 లక్షల మందిని తాము సంప్రదించినట్టు ఈ సర్వే నివేదికలో వారు పేర్కొన్నారు. అయితే, చాలా సర్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వందకు పైగా స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, ఈ సర్వేలో మాత్రం ఎస్పీకి కేవలం 53 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పడం విశేషం. -
Exit Poll Results 2022: సెమీస్ బీజేపీదే!
కీలకమైన పొలిటికల్ సెమీఫైనల్స్‌లో విజేత బీజేపీయేనని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో ప్రకటించాయి. దేశమంతా ఆత్రుతగా, ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ హవాయే నడిచిందని తేల్చాయి. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని సర్వేలన్నీ స్పష్టం చేశాయి. ఉత్తరాఖండ్‌లోనూ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరవచ్చని పలు సర్వేలు వెల్లడించాయి. ఒకట్రెండు సర్వేలు కాంగ్రెస్‌కు ఓటేశాయి. మణిపూర్‌లోనూ బీజేపీకే అధిక సీట్లు కట్టబెట్టాయి. అతి పెద్ద పార్టీగా మెజారిటీకి దగ్గరగా వెళ్తుందని అంచనా వేశాయి. పంజాబ్‌ను మాత్రం కేజ్రీవాల్ కరిష్మా కమ్మేసిందని, కాంగ్రెస్‌ను కంగుతినిపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు స్పష్టం చేశాయి. అత్యధిక సర్వేలు ఆప్‌కు మెజారిటీ సీట్లు కట్టబెట్టడం విశేషం. మణిపూర్, గోవాల్లోనూ ఆప్ ఉనికి చాటుకుంటుందని అంచనా వేశాయి. ఇక గోవాలో ఓటరు తీర్పు హంగ్ దిశగా సాగిందని సర్వేలు తేల్చాయి. కొన్ని బీజేపీకి, మరికొన్ని కాంగ్రెస్‌కు అధిక సీట్లు కట్టబెట్టాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల పోరు సోమవారం యూపీలో చివరిదైన ఏడో విడత పోలింగ్‌తో ముగిసింది. సాయంత్రం పోలింగ్ ముగిసీ ముగియగానే ఎగ్జిట్ పోల్స్, సర్వేల ఫలితాలు ఒకటి తర్వాత ఒకటి వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగి అసలు ఫలితాలు వెల్లడి కానున్న గురువారం మీదే నెలకొని ఉంది! ఇక్కడ చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెబుతున్నాయంటే? -
యూపీలో కాషాయ జెండా ఎగురవేస్తాం: ప్రధాని మోదీ
వారణాసి: యూపీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు యోగి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇదే పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వారణాసి నియోజకవర్గంలోని ఖజురి గ్రామంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. తనపై ఉన్న వ్యతిరేకతతోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ వంటి పథకాలను ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నాయని విమర్శించారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు కార్యక్రమాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నో ఏళ్లపాటు ఖాదీని రాజకీయ లాభానికి వాడుకున్న కాంగ్రెస్ పార్టీ...ఇప్పుడు ఆ పేరును కూడా తలుచుకోవడం లేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఖాదీ, యోగాకు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజీని తెచ్చిందన్నారు. అనంతరం ప్రధాని వారణాసిలో మేథావులు, పలువురు ప్రముఖులతో ముఖాముఖి మాట్లాడారు. యూపీ అభివృద్ధి కొనసాగేందుకు బీజేపీకే మళ్లీ అవకాశమివ్వాలని కోరారు. -
ప్రధానికి టెన్షన్.. మోదీ కోటలో అఖిలేష్ పాగా వేస్తారా..?
యూపీ పీఠమెవరిదో తేల్చనున్న ఆఖరిదశ (7వ దశ) పోలింగ్ సోమవారం జరగనుంది. పూర్వాంచల్‌లో తొమ్మిది జిల్లాలోని 54 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి కూడా పూర్వాంచల్‌లో భాగమే. దాంతో ఆయన మూడు రోజులు వారణాసిలోనే ఉండి శనివారం ప్రచారం ముగించారు. ప్రధాన పోటీదారులైన సమాజ్‌వాదీ, బీజేపీలు ఎవరికి వారే.. తామిప్పటికే యూపీ అసెంబ్లీ రేసులో గెలిచేశామని చెప్పుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీ, అఖిలేశ్–మమతా బెనర్జీలు, రాహుల్– ప్రియాంక గాంధీల్లాంటి అగ్రనేతలు సీరియస్‌గా ప్రచారంలో మునిగిపోవడాన్ని బట్టి.. ఎవరికైనా విజయం అంత తేలిక కాదనే సంకేతాలను ఇస్తోంది. యాదవేతర బీసీల ఓట్లలో చీలిక! ప్రతీ ఓటూ ముఖ్యమేనని ముందే లెక్కలేసుకున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కులా ఆధారిత చిన్నపార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. సుహల్దేవ్ రాజ్‌భర్‌కు చెందిన ఎస్‌బీఎస్‌బీ, మహాన్‌దళ్, జేపీ (ఎస్) లాంటి చిన్నాచితక పార్టీలతో మాల అల్లిన అఖిలేశ్.. బీజేపీకి అండగా నిలబడ్డ యాదవేతర కులాల ఐక్యతను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదిపారు. అల్పసంఖ్యాల కులాల్లో 2017లో బీజేపీ 61 శాతం ఓట్లను సాధించింది.అయితే ఈ యాదవేతర ఓబీసీలు బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు కాదు. ఈ ఓబీసీల్లో 76 ఉపకులాలున్నాయి. ప్రతి కూలానికి వేర్వేరు అవసరాలు– ఆంకాక్షలు, డిమాండ్లు ఉన్నాయి. అందువల్ల యాదవేతర బీసీలను ఏకం చేయడం కష్టం.అప్నాదళ్ (ఎస్) ఇంటిపోరు, స్వామి ప్రసాద్ మౌర్య నిష్క్రమణలు పూర్వాంచల్‌లో బీజేపీకి మరిన్ని తలనొప్పులు తెస్తున్నాయి. పైన చెప్పిన ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు బీజేపీ కొత్తగా నిషాద్ పార్టీతో జతకట్టింది. మల్లాల్లో ఈ పార్టీకి మంచి మద్దతుంది. ఏడోదశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎస్సీలతో పాటు కుర్మీలు, పటేళ్లు, బనియాలు, రాజ్భర్లు, నిషాద్‌లు, మౌర్యాల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ జిల్లాల్లో మైనార్టీ జనాభా 12 శాతముండగా, ఎస్సీ జనాభా 24 శాతం, బ్రాహ్మణ మరియు ఠాకూర్ల జనాభా 20 శాతం మేర ఉంది. జాతీయవాదం + హిందుత్వ.. 2017లో పూర్వాంచల్‌లో బీజేపీ ప్రదర్శన మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ఈ ప్రాంతంలోని 50 సీట్లలో బీజేపీ 2017లో 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. తర్వాత స్థానాల్లో ఎస్పీ(11), బీఎస్పీ(6) నిలిచాయి. ఇతరప్రాంతాలతో పోలిస్తే బీఎస్పీ అత్యధిక ఓట్ల శాతం సాధించిన ప్రాంతం ఇదే కావడం గమనార్హం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈదఫా ఒక సమ్మిళిత సూత్రాన్ని అవలంబిస్తోంది. జాతీయవాదం (ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు), హిందుత్వ (కాశీ విశ్వనాధ కారిడార్ పనులు), మోడీ, యోగి కాంబినేషన్ విజయాలు.. అనే మూడు అంశాలను సమ్మిళితం చేసి చూపడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ఓబీసీకి చెందిన మోదీని చూపి వెనుకబడ్డవర్గాలకు తాము ఎంతో ప్రాధాన్యమిస్తామని చెబుతోంది. మరోవైపు బీజేపీ ఓబీసీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ వారిని ఆకట్టుకోవాలని అఖిలేశ్ ప్రయత్నిస్తున్నారు. కులాలవారీ జనగణనను బీజేపీ పక్కనపెట్టిందని, తద్వారా రిజర్వేషన్లకు ముగింపు పలికే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. బీఎస్పీ మాత్రం గతంలో మాదిరే తమకు ఈ ప్రాంతంలో మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తోంది. కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంపై ఎలాంటి ఆశలు కనిపించడంలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానికి కీలకంగా మారిన ఈ ప్రాంతంపై పట్టు తమకే దక్కుతుందని ఎస్పీ, బీజేపీ ఆశిస్తున్నాయి. -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు; విస్తుగొలిపే నిజాలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మంది నేరచరితులు, 41 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో 18 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. నేర చరితులకు పెద్దపీట ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6,874 మంది అఫిడవిట్లను పరిశీలించామని, మిగతా 70 మంది అఫిడవిట్లను విశ్లేషించాల్సి ఉందని ఏడీఆర్ తెలిపింది. ఈ 6,874 మందిలో 1,916 మంది జాతీయ పార్టీలకు, 1,421 మంది ప్రాంతీయ పార్టీలకు, 1,829 మంది గుర్తింపులేని పార్టీలకు చెందిన వారు. 1,708 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 6,874 అభ్యర్థుల్లో 1,694 మంది(25 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా వెల్లడించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు 1,262 మంది (18 శాతం) మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నవారు.. వీరిలో ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి చూస్తే అన్ని పార్టీలకు నేరచరితులకు పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. పోటీలో కోటీశ్వరులు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 41 శాతం మంది(2,836) కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్(1,733), పంజాబ్(521), ఉత్తరాఖండ్(252), గోవా(187), మణిపూర్(143) వరుస స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే గోవా ముందజలో నిలిచింది. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే 93 శాతంతో అకాలీదళ్ అగ్రస్థానంలో ఉంది. బీజేపీ(87 శాతం), ఆర్ఎల్డీ(66), ఎన్పీఎఫ్(80), ఎస్పీ(75), బీఎస్పీ(74), ఏఐటీసీ(65), కాంగ్రెస్(63), ఆప్(44), యూకేడీ(29 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో 347 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ టాప్.. బీజేపీ 534 మంది కుబేరులకు టిక్కెట్లు కట్టబెట్టగా, కాంగ్రెస్ 423 మంది ధనవంతులకు సీట్లు ఇచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ(349), బహుజన సమాజ్‌వాదీ పార్టీ(312), ఆమ్ ఆద్మీ పార్టీ(248) కూడా కోటీశ్వరులకు పెద్దపీటే వేశాయి. అకాలీదళ్(89), ఆర్ఎల్డీ(32), ఎన్పీపీ(27), తృణమూల్ కాంగ్రెస్(17), పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(16), యూకేడీ(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 13, అప్నా దళ్ (సోనీలాల్) 12, మహారాష్ట్రవాది గోమంతక్ 9, ఎన్‌పిఎఫ్ 8, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇద్దరు కోటీశ్వరులను పోటీకి నిలబెట్టాయి. మహిళలకు దక్కని ప్రాధాన్యం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. 6,874 అభ్యర్థుల్లో కేవలం 11 శాతం(755) మాత్రమే మహిళలు ఉన్నారు. 6,116 మంది పురుషులు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు పోటీలో ఉన్నారు. (క్లిక్: తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా) కుర్రాళ్ల నుంచి కురువృద్ధుల వరకు.. వయసు పరంగా చూస్తే 41 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యధికంగా 54 శాతం(3,694) మంది ఎన్నికల బరిలో నిలిచారు. 25 నుంచి 40 ఏళ్లలోపు 32 శాతం(2,195) మంది ఉన్నారు. 61 నుంచి 80 ఏళ్లలోపు వయసున్న వారు 14 శాతం మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన కురువృద్ధులు 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరెవరు విజయం సాధిస్తారనేది మార్చి 10న వెల్లడవుతుంది. (క్లిక్: యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?) -
కుటుంబ, మాఫియా రాజకీయాలను ఓడించండి: ప్రధాని మోదీ
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో చివరి దశ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. మీర్జాపూర్లో ఎన్నికల ప్రచార సభ అనంతరం వారణాసికి చేరుకున్నారు. కాషాయం రంగు టోపీ, కండువా ధరించి ఓపెన్ టాప్ వాహనంలో నిల్చొని ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. నగరంలో మూడు కిలోమీటర్ల మేర రోడ్‌షో కొనసాగింది. మోదీ కాశీ విశ్వనాథ ఆలయంలో షోడశోపార పూజ చేశారు. సమస్య ఎలాంటిదైనా ధీటుగా ఎదుర్కొంటాం ప్రస్తుతం యావత్ ప్రపంచం సంక్షోభం ముంగిట ఉందని ప్రధాని మోదీ అన్నారు. అయితే, సమస్య ఎంతపెద్దదైనా భారత్ అంతకంటే ధీటుగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. మీర్జాపూర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘కోవిడ్ మహమ్మారి, అశాంతి, అస్థిర పరిస్థితులను ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్నాయి. సంక్షోభం ఎంత పెద్దదయినా అంతకంటే బలం, పట్టుదలతో దేశం ఎదుర్కొంటుంది’ అని చెప్పారు. తమ ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం కింద వేలాది మందిని స్వదేశానికి తీసుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ, మాఫియా రాజకీయాలను ఓడించి బీజేపీ ప్రభుత్వానికే ఓటేయాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విభజించి, అధికారాన్ని చేజిక్కించుకుని, ఆ తర్వాత దోచుకోవడమే ప్రతిపక్షాల ఏకైక లక్ష్యమంటూ మోదీ దుయ్యబట్టారు. -
యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?
ఉత్తరప్రదేశ్‌లో ఆరు దశల ఓటింగ్ తర్వాత పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటిదాకా అన్ని దశల పోలింగ్‌లో తగ్గిన ఓటింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్నదే ఆ చర్చ. దీనిపై బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు వాటికి అనుకూలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ‘నిశ్శబ్ద నో షో’, అంటే ఓటేయని వారి వల్ల ఎవరికి నష్టమన్నదే రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుల మధ్య ఇప్పుడు హాట్ టాపిక్. ‘తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాన్ని మారుస్తుందా అంటే, కచ్చితంగా తారుమారు చేస్తుంది. కానీ అది ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తేలాలంటే 10వ తేదీ దాకా ఎదురు చూడాల్సిందే’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాలవీయ రీసెర్చి సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ కవితా షా అన్నారు. తగ్గిన పోలింగ్ శాతాలపై ఆమె అధ్యయనం చేస్తున్నారు. ఓటు వేయకపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తొలి, రెండో విడత పోలింగ్‌లో 2017 కంటే ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. 2017లో తొలి దశలో 64.6 శాతం, రెండో దశలో 65.5 శాతం నమోదైతే ఈసారి 62.5, 64.7 శాతానికి తగ్గింది. మూడు, నాలుగో దశల్లో కూడా గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగలేదు. ‘ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయినప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుందంటారు. కానీ యూపీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నాను’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ (జేఎన్‌యూ) హెచ్ఓడీ ఆర్.నరేంద్రకుమార్ విశ్లేషించారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిన జిల్లాల్లో ఆయన తన రీసెర్చి విద్యార్థులతో పర్యటిస్తున్నారు. రాజధాని లక్నోకు పొరుగున ఉన్న సీతాపూర్ పట్టణంలో 2017లో 61.8 శాతం పోలింగ్ జరిగితే ఈసారి 52.6కు పడిపోయింది. అంటే దాదాపు 35 వేల ఓట్లు పోలవలేదు. 2017లో ఇక్కడ బీజేపీ 24 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచింది. సీతాపూర్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో సగటున 62.7% ఓటింగ్ నమోదైంది. ఇది కూడా గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6 శాతం తక్కువ. ఆ ఎన్నికల్లో బీజేపీ వీటిలో ఏడింటిని గెలుచుకుంది. అయితే, ‘గతంలో ఆగ్రా సౌత్, శ్రీనగర్, ఉన్నావ్ వంటిచోట్ల బీజేపీ పెద్ద పెద్ద మెజారిటీలతో గెలిచింది. కాబట్టి అలాంటి చోట్ల ఓటింగ్ శాతం తగ్గినా బీజేపీ అభ్యర్థులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’ అని ఇండియన్ జర్నల్ అఫ్ పొలిటికల్ సైన్స్ (వారణాసి) డైరెక్టర్ వి.కె.బాజ్‌పేయి విశ్లేషించారు. 139 సీట్లలో తగ్గింది! తొలి నాలుగు దశల్లోని 231 స్థానాల్లో చూసుకుంటే ఏకంగా 139 చోట్ల ఓటింగ్ శాతం బాగా తగ్గింది. సీతాపూర్, సేవాత నియోజకవర్గాల్లో 2017తో పోలిస్తే 9 శాతం తగ్గుదల ఉంది. ఆరు స్థానాల్లో ఎటువంటి మార్పు కనిపించకపోగా 86 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం కాస్త పెరిగింది. తక్కువ నమోదైన 139 సీట్లలో 28 చోట్ల దాదాపు 10 వేల చొప్పున ఓట్లు తగ్గాయి. వీటిలో 24 సీట్లను 2017లో బీజేపీ గెలుచుకుంది. అయితే వాటిలో చాలావరకు తక్కువ ఓట్ల తేడాతో గెలిచినవే. ఉదాహరణకు సీతాపూర్ జిల్లాలోని మహోలీలో కేవలం 3,700 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది. ఇక్కడ 2017లో 68.7 శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 63.5కు తగ్గింది. ఇది ఎవరిపై, ఎలా ప్రభావం చూపుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్న కర్హాల్ నియోజకవర్గంలోనేమో పోలింగ్ ఈసారి 7 శాతం పెరిగింది. తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాలపై ప్రభావం చూపుతుందా? 2017లో 403 సీట్లకు గాను బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 312 నెగ్గి అఖండ విజయం సాధించినప్పుడు కూడా ఓవరాల్ ఓటింగ్ శాతం తక్కువే నమోదైంది. కాబట్టి ఈసారి మరో ఒకట్రెండు శాతం తగ్గినా అది మొత్తం ఫలితాలపై ప్రభావం చూపుతుందా అంటున్న వారూ లేకపోలేదు. ‘ఇక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ తీవ్రంగా లేదు. ఓటింగ్ శాతం తగ్గడానికి అదీ ఓ కారణం కావచ్చు. అంతమాత్రాన తక్కువ ఓటింగ్ శాతం వల్ల ఫలితాలే తారుమారు అవుతాయనుకోవడం పొరపాటు. మా ప్రభుత్వమే కొనసాగాలనుకునే వారు ఓటింగ్‌పై బహుశా ఆసక్తి చూపలేదేమో’ అని వారణాసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఓటేయకపోవడానికి కారణాలెన్నో ‘ఓటరు ఓటేయలేదంటే, లిస్ట్‌లో పేరు కనిపించకపోవడం, పోలింగ్ బూత్ దూరంగా ఉండటం వంటి అనేక కారణాలుండొచ్చు’ అని వారణాసి అదనపు జిల్లా మేజిస్టేట్, రిటర్నింగ్ అధికారి కౌశల్ రాజ్ శర్మ సాక్షి ప్రతినిధులతో చెప్పారు. ఓటేయాలని తాము విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. -వారణాసి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి. -
తుదిశ్వాస దాకా వారణాసి ప్రజలకు సేవలు
వారణాసి: జీవితంలో ఆఖరి రోజుల్లోనే చాలామంది వారణాసి(కాశి)కి వస్తుంటారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. తాను తుదిశ్వాస విడిచేదాకా వారణాసి ప్రజలకు సేవలందిస్తూనే ఉంటానని చెప్పారు. మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు వారి పార్టీలను సొంత ఆస్తులుగా భావిస్తున్నారని, అలాంటివారు కార్యకర్తల పార్టీ అయిన బీజేపీని ఎప్పటికీ చాలెంజ్ చేయలేరని పేర్కొన్నారు. తాను కాశీలోనే చనిపోవాలని ఎవరైనా ప్రార్థిస్తే సంతోషిస్తానని తెలిపారు. వారణాసి గానీ, వారణాసి ప్రజలు గానీ తనను ఎప్పటికీ వదులుకోరనే విషయం తనకు అర్థమైందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలే తనకు ఒక విశ్వవిద్యాలయమని, వారి నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని ప్రధాని మోదీ వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ చరిత్రాత్మక, ఆధ్యాత్మిక నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. చాలా సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం పవిత్ర గంగానది తీరాన్ని తాకిందని హర్షం వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును అందరూ గర్వకారణంగా భావిస్తుంటే, కొందరు మాత్రం మతం కోణంలో చూస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. -
యూపీలో అయిదో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
కులం, మతం పేరుతో ఇంకెన్ని రోజులు రెచ్చగొడతారు.. ప్రియాంక ఫైర్
లక్నో: యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, పీఎం ఇద్దరు ఒకే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం జరగలేదని ఆరోపించారు. యూపీని మూడు దశాబ్దాల పాటు పాలించిన ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధిని మరచిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ.. బలరాంపూర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెసేతర ప్రభుత్వాలు కులం, మతంపై రాజకీయాలు చేయడంతో యూపీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మూడు పార్టీలు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ నేతలు యూపీకి వచ్చి పాకిస్తాన్, ఉగ్రవాదం, మతం గురించి మాట్లాడతారు తప్ప ఇక్కడి ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఏమీ చేయరని ఎద్దేవా చేశారు. మీ పిల్లలకు సరైన విద్య, ఉద్యోగాలు రాకపోయినా ఓటర్లు మాత్రం అనవసరమైన భావోద్వేగాలకు లోనై వారికి ఓట్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. యూపీలో ఐదో దశలో ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరుగనుంది. మార్చి 3న ఆరో దశలో, మార్చి 7న ఏడో దశలో పోలింగ్ కొనసాగనుండగా.. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
పేరుకు పొలిటికల్ లీడర్.. పాపం ఇలా బుక్కయ్యాడు.. వీడియో వైరల్
సాక్షి, ముంబై: పేరుకు ఆయనో పెద్ద లీడర్.. కానీ, మాస్కు పెట్టుకోవడం మాత్రం రాదు. కరోనా సమయంలో మాస్కు ధరించాలని అటు వైద్యులు, ఇటు ప్రభుత్వాలు ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ప్రభుత్వాలు మాస్కులు ధరించని వారికి జరిమానాలు సైతం విధించింది. దీంతో పల్లెటూరు నుంచి పట్నం దాకా.. మాస్కు ఎలా ధరించాలో అందరికీ తెలిసిపోయింది. కాగా, శివసేన పార్టీకి చెందిన ఓ నేత తాజాగా మాస్కు ధరించేందుకు 2 నిమిషాల పాటు తర్జనభర్జన పడ్డారు. అప్పటికీ మాస్కు ఎలా పెట్టుకోవాలో తెలియక మరో వ్యక్తి సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన తీరుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ కూడా బరిలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన 41 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా, శివసేన నేతలు గోరఖ్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో శివసనే నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే మాట్లాడుతుండగా.. ఆయన వెనుక నిలుచున్న ఓ శివసేన నేత.. ఎన్-95 మాస్కును ఎలా ధరించాలో తెలియక దాదాపు రెండు నిమిషాలు తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాస్కు పెట్టుకోవాడం రాకపోవడంతో చివరకు పక్కనున్న మరో నేత సాయం కోరాడు. ఆయన సాయంతో చివరకు మాస్కు ధరించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నేతపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పాటు.. మాస్క్ పెట్టుకోగానే ప్రజలు సంబురాలు చేసుకున్నట్లు ఓ స్పూఫ్ వీడియో కూడా జతపరిచారు. w8 for it...! 😁 pic.twitter.com/uG7gkaNLBg — Andolanjivi faijal khan (@faijalkhantroll) February 24, 2022 -
బీజేపీకి అగ్ని పరీక్ష.. ఆ రెండు దశల్లో ఎస్పీ కూటమికే స్వల్ప ఆధిక్యం
లక్నో (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు కంచర్ల యాదగిరి రెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, తెలంగాణలో అధికారంలోకి రావడానికి కావాల్సిన పాజిటివ్ మూడ్‌ను యూపీ విజయం సెట్ చేస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, 2024 రోడ్‌మ్యాప్’ పేరిట బీజేపీ కేంద్ర కమిటీకి రెండు నెలల క్రితం ఆర్ఎస్ఎస్ సమర్పించిన విధాన పత్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఉత్తర భారతంలో తిరుగులేని శక్తిగా స్థిరపడ్డ బీజేపీ దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయడానికి కావాల్సిన ఊపును యూపీ ఫలితాలు అందిస్తాయని ఆ పత్రంలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో యూపీలో అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ సహా 24 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున అఖిలేశే చెమటోడుస్తున్నారు. నాలుగు విడతలపై జోరుగా అంచనాలు 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో నాలుగు మూడు విడతల్లో ఇప్పటిదాకా 231 చోట్ల పోలింగ్ పూర్తయింది. వీటిలో ఎవరిది పై చేయి అన్నదానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సమాజ్‌వాదీ–ఆర్ఎల్డీ కూటమికి, బీజేపీకి మధ్య హోరాహోరీ నడుస్తోందని పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. మూడు విడతలపై సర్వే సంస్థల అంచనాల సగటును పరిశీలించినా బీజేపీ, ఎస్పీ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డట్టు తేలుతోంది. పోలింగ్ జరిగిన 172 స్థానాలను అవి సగానికి కాస్త అటు ఇటుగా పంచుకునే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రమేనని అంటున్నారు. మొత్తమ్మీద మూడు దశల అనంతరం ఎస్పీ కూటమి స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తోందని, రాబోయే దశల్లో బీజేపీ సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు. బీఎస్పీ ఓటు బ్యాంకు కూడా బీజేపీ, ఎస్పీలకు చెరో సగం చొప్పున బదిలీ అవుతోందన్నది సర్వే సంస్థల అంచనా. అభ్యర్థి, కుల సమీకరణలను బట్టి ఇది కాస్త అటూ ఇటుగా ఉండొచ్చని అమర్ ఉజాలా దినపత్రిక లక్నో అసోసియేట్ ఎడిటర్ సుమంత్ పాండే అన్నారు. ‘‘బీజేపీ, ఎస్పీ–ఆర్ఎల్డీ మధ్య హోరాహోరీ సాగుతోంది. మా అంచనా ప్రకారం బీజేపీకి 2017లో వచ్చిన సీట్లతో పోలిస్తే 30 శాతం దాకా తగ్గే అవకాశముంది’’ అని పాండే వివరించారు. మూడో పార్టీ గానీ, ఇతరులు గానీ సాధించే 10, 15 సీట్లు మెజారిటీకి కీలకమైనా ఆశ్చర్యం లేదన్నారాయన! చదవండి: (ఎన్నికల వేళ విమాన ప్రయాణం పై ప్రత్యర్థుల మాటల యుద్ధం!) పశ్చిమ యూపీలో ఎస్పీ ఆధిక్యం అంతంతే! మొదటి రెండు దశల పోలింగ్‌పై ఎస్పీ కూటమి పెట్టుకున్న అంచనాలు ఫలించనట్టు కన్పిస్తోంది. ఆర్ఎల్డీ ప్రభావం కనిపించే పశ్చిమ యూపీలోని జాట్ సామాజిక వర్గం ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి వైపు మొగ్గుచూపుతుందని, ఈ రెండు దశల్లోనే 40 నుంచి 50 సీట్ల ఆధిక్యత వస్తుందని అంచనాలు వేసుకున్నారు. అది 20–25 స్థానాలకు దాటకుండా చూడటంలో బీజేపీ సఫలమైందని విశ్లేషకుల అభిప్రాయం. మూడో విడత పోలింగ్ హోరాహోరీగా సాగినా బీజేపీకే స్వల్ప ఆధిక్యం కన్పించిందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాలుగో దశలోనూ అదే ట్రెండ్ నడిచిందంటున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రెండు దశల్లో ఎస్పీ కూటమి సాధించే ఆధిక్యం అధికారానికి బాటలు పరిచేంతగా ఉండదని అంచనా. కాయ్ రాజా కాయ్! యూపీ ఎన్నికలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికారం ఎవరిదన్న అంశంపై భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, ముంబయి, నోయిడా, అహ్మదాబాద్ కేంద్రాలుగా రూ.3 వేల కోట్ల మేరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగులు సాగినట్లు యూపీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో అభిప్రాయపడ్డారు. ఈ రాకెట్‌ను ఛేదించేందుకు సహకరించాలంటూ మహారాష్ట్ర పోలీసుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు చెప్పారు. ప్రతి దశలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఓట్లు వస్తాయన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి 50 శాతంలోపు సీట్లు వస్తాయని బెట్టింగులు పెడితే రూపాయికి రెండు రూపాయలు, అంతకు మించి వస్తాయన్న వారికి రూపాయికి రూపాయిన్నర లెక్కన బెట్టింగులు సాగుతున్నాయి. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని కాస్తున్న వారికి రూపాయికి రూపాయి, ఎస్పీ గెలుస్తుందన్న వారికి రూపాయిన్నర బెట్టింగు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. -
ఎన్నికల వేళ విమాన ప్రయాణం పై ప్రత్యర్థుల మాటల యుద్ధం!
న్యూఢిల్లీ: బీజేపీ, సమాజ్‌వాద్ పార్టీల మధ్య విమాన ప్రయాణం పై మాటల యుద్ధం జరిగింది. ఉత్తరప్రదశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత నెలలో మార్చి 11న లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కి విమానం టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. దీంతో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో యోగి మార్చి 11 వెంటనే టికెట్ బుక్ చేసుకుని పారిపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాలు పై బీజేపీ నాయకులు ఎంతలా భయపడుతున్నారో అర్థం అవుతుంది అంటూ విమర్శించారు. బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలియదు మీరు భయపడి పారిపోయేవరకు అని బహ్రైచ్‌లో జరిగిన ర్యాలీలో అఖిలేశ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గత నెలలో సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధిఐపి సింగ్ యోగిని విమర్శిస్తూ..తాను మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో గోరఖ్‌పూర్‌కి బుక్ చేసినట్లు తెలిపిన విమాన టిక్కెట్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల కోసం మార్చి 11న లక్నో నుంచి గోరఖ్‌పూర్‌కి బయలుదేరుతంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లండన్‌కి ఎగరిపోతారంటూ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. దీంతో అఖిలేశ్ యాదవ్ ఈ రోజు ర్యాలిలో ఆ మాటలకు కౌంటరిచ్చారు. యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల ఓటింగ్‌లో నాలుగు రౌండ్లు జరగగా.. మార్చి 10న ఫలితాలు వెల్లడనున్న సంగతి తెలిసిందే. अखिलेश यादव के लंदन के टिकट को लेकर सनसनी, 11 मार्च को लंदन जाने का है टिकट क्या कोई सच्चाई बता सकता है❓ — Arun Yadav (@beingarun28) February 21, 2022 (చదవండి: యూపీ ప్రజలకు సీఎం యోగీ కీలక హామీ.. అఖిలేష్ కౌంటర్) -
UP Elections: యూపీ ప్రజలకు సీఎం యోగీ కీలక హామీ.. అఖిలేష్ కౌంటర్
లక్నోః యూపీలో బుధవారం నాలుగో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఓ వైపు ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగానే యూపీ ప్రజలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. బీజేపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, యూపీలోని అమేథిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగి మాట్లాడుతూ.. సంరక్షణ కరవైన గోవులను పెంచే రైతులకు రూ. 1000 సాయంగా అందజేస్తామన్నారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్‌లో గో హత్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ గోవధ శాలలను శాశ్వతంగా మూసివేస్తామన్నారు. వాటిని తెరవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సంరక్షణ లేని గోవులు రైతుల పంటపొలాలను పాడు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దెబ్బతీయకుండా చూస్తామన్నారు. ఇదిలా ఉండగా యూపీలోని బహ్రెయిచ్‌లో మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ కోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. రైతులకు నష్టం కలిగేలా పంట పొలాలను గోవులు నాశనం చేస్తున్నాయని విమర్శించారు. Uttar Pradesh | We have completely stopped illegal slaughterhouses. I promise that we will not let 'Gaumata' be slaughtered while we'll also protect fields of farmers from stray cattle: UP CM Yogi Adityanath at a rally in Amethi#UttarPradeshElection2022 pic.twitter.com/Vr3vEJqXJ1 — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 23, 2022 -
Live Blog: ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్
-
అనూహ్య సంఘటన.. బీజేపీ నేత పాదాలు మొక్కిన మోదీ.. ఎందుకంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నావో జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, ఉన్నావో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అవదేశ్ కతియార్ ప్రధాని మోదీకి శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. తర్వాత అవదేశ్ ప్రధాని పాదాలను తాకేందుకు కిందికి వంగారు. మోదీ వెంటనే ఆయనను వారించారు. మీరు కాదు, నేనే మీకు మొక్కాలి అంటూ అవదేశ్ పాదాలకు వినమ్రంగా నమస్కరించారు. దీంతో అక్కడున్నవారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
వారి పోరాటం రెండో స్థానం కోసమే
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీతో సహా విపక్షాలన్నీ రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ తిరిగి బంపర్‌మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. తృణమూల్ వంటి పార్టీల మద్దతు, లఖీంపూర్‌ఖేరీ ఉదంతం వంటివి సమాజ్‌వాదీ పార్టీకి ఏ మాత్రమూ లాభించే పరిస్థితి లేదన్నారు. ప్రచార పర్వంలో బిజీగా ఉన్న ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు... ► ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఈసారి ఎన్నికల్లో మాకెవరూ పోటీ లేరు. సమాజ్‌వాదీ పార్టీతో సహా విపక్షాలన్నీ కేవలం రెండో స్థానం కోసం మాత్రమే పోరాడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 80 శాతం ఓటర్ల మద్దతు బీజేపీకే ఉంది. విపక్షాలన్నీ కలిపి మిగతా 20 శాతం ఓట్ల కోసమే పోరాడుతున్నాయి. ► తమదిప్పుడు సరికొత్త (నయా) సమాజ్‌వాదీ అని ఆ పార్టీ అంటోంది? వాళ్లు అణుమాత్రమైనా మారలేదు. మాఫియాలకు, నేర చరితులకు, ఉగ్రవాదులకు సాయపడే వారికి టికెట్లివ్వడం నుంచి మొదలుకుని ఏ ఒక్క విషయంలోనూ సమాజ్‌వాదీ అస్సలు మారలేదు. యూపీలో తాజా గాలి వీస్తోంది తప్పితే ఆ పార్టీ మాత్రం ఎప్పట్లాగే ఉంది. ► చట్ట వ్యతిరేక శక్తులు తనకు ఓటేయాల్సిన అవసరం లేదని అఖిలేశ్ అంటున్నారు? నిజానికి ఆయన ఉద్దేశం అందుకు పూర్తిగా వ్యతిరేకం. చట్ట వ్యతిరేక శక్తులు, విద్రోహులు ఒక్కతాటిపైకి వచ్చి సమాజ్‌వాదీ హయాంలో నడిచిన గూండారాజ్‌ను మళ్లీ తేవాలన్నది అఖిలేశ్ అసలు మాటల అంతరార్థం. ► లఖీంపూర్‌ఖేరీలో రైతుల మరణాన్ని జలియన్‌వాలాబాగ్ దురంతంతో అఖిలేశ్ పోలుస్తుండటం బీజేపీకి చేటు చేస్తుందా? ఈ విషయంలో చట్టం చురుగ్గా పని చేస్తోంది. కేసుపై సిట్ నిష్పాక్షికంగా విచారణ జరుపుతోంది. దాన్ని సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలన్న అఖిలేశ్ ఆశలు నెరవేరవు. రాష్ట్ర రైతులంతా వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న బీజేపీకే మద్దతుగా నిలుస్తారు. ► తృణమూల్ తదితర పార్టీలు సమాజ్‌వాదీకి మద్దతు ప్రకటించడం మీకేమీ నష్టం చేయదా? తృణమూల్, ఎన్సీపీ, ఆర్జేడీ వంటి పార్టీలకు యూపీలో ప్రజల మద్దతే లేదు. వాటి మద్దతుతో సమాజ్‌వాదీకి ఒరిగేదేమీ ఉండదు. ► యోగి ప్రధాని అభ్యర్థి అవుతారేమోనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి? నేనో సామాన్య బీజేపీ కార్యకర్తను. పార్టీ నాకిచ్చిన ఏ పనినైనా నెరవేర్చడమే నా బాధ్యత. అంతే తప్ప పదవుల కోసం, కుర్చీల కోసం నేనెన్నడూ పాకులాడలేదు. ► మీరు పోటీ చేస్తున్న గోరఖ్‌పూర్ అర్బన్ స్థానంలో పరిస్థితి ఎలా ఉంది? అది సంప్రదాయ బీజేపీ స్థానం. పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడి ప్రజలే మరోసారి గెలిపించుకుంటారు. -
వాళ్ల వైఖరి ఆందోళనకరం..ఉగ్రవాదులని 'జీ అని పిలుస్తారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హర్దోయ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారు. "సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ నాయకుల వైఖరి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యక్తులు ఒసామా వంటి ఉగ్రవాదులను 'జీ' అని సంబోధిస్తున్నారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల నిర్మూలనపై ఈ వ్యక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి ప్రస్తావిస్తూ...కొన్ని పార్టీలు ఉగ్రవాదంపై మెతకగా వ్యవహరించడమే కాక సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 14 ఉగ్రవాద దాడుల కేసులలో అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం చాలా మంది ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకులు పాకిస్తాన్ వ్యవస్థాపకుడు అలీ జిన్నాకు మద్దతుదారులని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలపై అలక్ష్య పెట్టి 'కట్టా' (దేశంలో తయారు చేసిన పిస్టల్స్)ని వినియోగించే స్వేచ్ఛనిచ్చిని సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని, వారి కార్యకర్తలని హర్దోయి ప్రజలు తప్పక గుర్తుంచుకుంటారని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు బుజ్జగింపు రాజకీయాలతో పండుగలను ఆపేసే వారికి మార్చి 10న ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి సరైన సమాధానం వస్తుందని నొక్కి చెప్పారు. (చదవండి: కాంగ్రెస్‌కే ఓటు వేయండి అని బీజేపీ ప్రచారం ! తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ) -
చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
-
Assembly Election 2022: ముగిసిన యూపీ మూడో దశ పోలింగ్
-
బీజేపీని గెలిపిస్తే గ్యాస్ సిలిండర్ ఫ్రీ: రాజ్‌నాథ్ సింగ్
ఉత్తరప్రదేశ్‌ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో యూపీపై వరాల జల్లు కురిపిస్తోంది. తాజాగా మూడో ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో .. రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. పండుగలకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా పంచుతామని ప్రకటించారు. శనివారం గోండా కల్నల్‌గంజ్‌లో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్‌లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఓటేసి బీజేపీని గనుక అధికారంలోకి తీసుకొస్తే.. ఏర్పాటు కాబోయే ప్రభుత్వం హోలీ, దీపావళి పండుగలకు ఓటర్లకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తుందని హామీ ప్రకటించారు. ఇదిలా ఉంటే యూపీ మూడో ఫేజ్ ఎన్నికలు రేపు(ఫిబ్రవరి 20, ఆదివారం) జరగనున్నాయి. 16 జిల్లాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక తొలి రెండు ఫేజ్ ఫలితాల అంచనాపై స్పందించిన రాజ్‌నాథ్.. అంతర్గత సర్వేలు, పోల్ అనలిస్టులు కిందటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ కావొచ్చని చెప్తున్నాయని తెలిపారు. సరిహద్దు అంశాలపై రాహుల్ గాంధీ చేసిన ‘చైనా-పాక్’ కామెంట్లు గురించి ప్రస్తావించిన రాజ్‌నాథ్ సింగ్..బహుశా రాహుల ఆధునిక భారత చరిత్ర చదవకుండానే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో అని ఎద్దేవా చేశారు రాజ్‌నాథ్. -
యూపీ సీఎం వార్నింగ్.. వారి కోసం మార్చి 10 తర్వాత బుల్డోజర్లు వస్తాయి..
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ నేతల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. రాష్ట్రంలో బుల్డోజర్ల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఒకరు.. నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్డోజర్లను ఉపయోగించింది. ఎన్నికల సమయంలోనూ బుల్డోజర్లను అలా ఉపయోగించగలదా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మెయిన్‌పురీ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు బుల్డోజర్లకు కూడా విశ్రాంతి అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని బుల్డోజర్లన్నింటిని రిపేర్ కోసం పంపించామన్నారు. బుల్డోజర్ల విషయంలో చింతించాల్సిన పని లేదు. గత నాలుగున్నరేళ్లుగా దాక్కున్న కొందరు వ్యక్తులు ఎన్నికల ప్రకటన వెలువడగానే బయటకు వస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి మార్చి 10 తర్వాత బుల్డోజర్లకు పనిచెబుతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని యోగి హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్ది రోజుల క్రితం బుల్డోజర్ల అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యూపీలో ఉండాలంటే యోగీకి ఓటు వేయాల్సిందేన్నారు. ఓటు వేయని వారు యూపీ నుంచి వెళ్లిపోవాలని వీడియోలో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా బీజేపీకి ఓటు వేయని వారి కోసం జేసీబీలు, బుల్డోజర్లు సిద్దంగా ఉన్నాయని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని సృష్టించింది. #WATCH | I have come here to assure you that I have send the bulldozer for repair. 10 March ke baad jab ye fir se chalna prarambh hoga to jin logo me abhi jyada garmi nikal rahi hai, ye garmi 10 March ke baad apne aap shant ho jayegi: UP CM Yogi Adityanath in Karhal, Mainpuri pic.twitter.com/hvjcQsKbeE — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 18, 2022 -
రెండు దశల్లోనే సెంచరీ కొట్టాం
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల అసెంబ్లీ ఎన్నికల్లో తాము సెంచరీ కొట్టామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యా బలం(పూర్తి మెజారిటీ) నాలుగో దశ ఎన్నికల కల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరోజాబాద్ ప్రాంతంలోని నాసిర్పూర్లో గురువారం ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ మాట్లాడారు. మొదటి రెండు దశల్లో మొత్తం 113 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఇందులో 100కు పైగా సీట్లు కచ్చితంగా గెలుకుంటామని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులాల గణాంకాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బాబాసాహెబ్ అంబేడ్కర్ అందజేసిన రాజ్యాం గాన్ని కాపాడేందుకు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. చట్టాన్ని అతిక్రమించేవారు, చట్టప్రకారం నడుచుకోనివారు తమ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. తొలిసారి ములాయం ఎన్నికల ప్రచారం సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఈ ఎన్నికల్లో తొలిసారిగా గురువారం మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్ యాదవ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అఖిలేశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను తమ పార్టీ కచ్చితంగా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అమెరికా సహా ప్రపంచ దేశాల కళ్లు సమాజ్‌వాదీ పార్టీపైనే ఉన్నాయని చెప్పారు. ప్రచార వేదికపై అఖిలేశ్ యాదవ్ తన తండ్రి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాలు పొందారు. కర్హాల్‌లో మూడో దశలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ఇక్కడ అఖిలేశ్‌పై బీజేపీ అభ్యర్థిగా ఎస్.పి.సింగ్ బఘేల్ పోటీకి దిగుతున్నారు. ములాయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోంది
ఫతేపూర్: కాంగ్రెస్ పనిగట్టుకొని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇలా విభేదాలను రెచ్చగొట్టే పార్టీలకు పరిపాలించే అధికారం ఉండదన్నారు. యూపీ, బిహార్, ఢిల్లీకి చెందినవారంతా ఒక్కటేనని వారిని పంజాబ్‌లోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసం ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంపైకి ఉసిగొల్పుతూ ఉంటుందని నిందించారు. పంజాబ్ అబోహర్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ చన్నీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. చన్నీ అలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ చప్పట్లు కొడుతున్నారని యావత్‌దేశం దీనిని చూసిందన్నారు. యూపీలోని ఫతేపూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎంతో స్వార్థంతో ఆలోచిస్తాయని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేస్తూ చట్టం తెస్తే విపక్షాలన్నీ ఏకమై వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయితే తన నిర్ణయానికి ముస్లిం మహిళలు అంతా అండగా ఉన్నారని, వారి బతుకులు బాగు చేసినందుకు కృతజ్ఞతలు వెల్లడించారని మోదీ పేర్కొన్నారు. -
సొంతపిచ్‌పై...అఖిలేశ్‌కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్‌లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్‌వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్‌పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్‌తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్‌తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్‌పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్‌వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్‌లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్‌ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్‌ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్‌కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్ బఘేల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్‌నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్‌తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
అభివృద్ధి మంత్రాన్ని వదిలి.. మళ్లీ ‘హిందుత్వ’ జపమెందుకో!
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎందుకు తమ వ్యూహాన్ని మార్చేసి... మళ్లీ హిందుత్వ జపం చేస్తోంది. మొదట అభివృద్ధి మంత్రం పఠించి... ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే యూపీలో ప్రాంతాల వారీగా భారీ స్థాయిలో ప్రధాని చేత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించిన కమలదళం తీరా సెమీఫైనల్ (దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. దీన్ని సెమీఫైనల్‌గా అభివర్ణిస్తారు. భారత భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని యూపీ ఫలితాలు ప్రతిబింబిస్తాయనేది రాజకీయ పండితుల అభిప్రాయం) మొదలయ్యే నాటికి ఎందుకు రూటు మార్చేసింది. మళ్లీ హిందుత్వ ఎజెండాను ఎందుకు బలంగా ఎత్తుకుంది. అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదని గట్టి సంకేతాలు అందాయా? అందుకే మళ్లీ పాతపాటే ఎత్తుకుందా? యూపీలో రెండు దశల ఎన్నికలు ముగిశాక తాజా పరిస్థితి ఎలా ఉందనే దానిపై సవివర కథనం... సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా 2013లో పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలో జాట్లు– ముస్లింలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. 60 మంది దాకా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. ముస్లిం వేధింపులు పెరగడంతో 2014–16 దాకా కైరానా నుంచి హిందూ కుటుంబాలు అభద్రతాభావంతో భారీగా వలసవెళ్లాయి. ఈ రెండు అంశాలనూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయవంతంగా వాడుకుంది. మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో మిత్రపక్షాలు కాకుండా ఒక్క బీజేపీయే ఏకంగా 312 సీట్లతో జాక్‌పాట్ కొట్టింది. అయితే 2022 ఎన్నికలు ఆరు నెలల ముందు నుంచే యూపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. హిందుత్వ కార్డు ఈసారి పనికిరాదనుకున్న బీజేపీ.. ముందస్తు వ్యూహంతో అభివృద్ధి మంత్రాన్ని జపించింది. ఏకంగా సుమారు లక్ష కోట్లకు పైగా విలువైన పనులకు కొబ్బరికాయలు కొట్టింది. రహదారులు, ఎయిర్‌పోర్టులు, విశ్వ విద్యాలయాలు, ఎరువుల కార్మాగారాలు దేన్నీ వదలకుండా ఓట్లను రాబట్టే ప్రధాన రంగాల్లో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు రిబ్బన్కటింగ్లు చేసి, పునాదిరాళ్లు వేసింది. రెండు నెలల్లో యూపీలో 16 ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని గత ఏడాది అక్టోబర్ నుంచి జనవరి 8న ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా 16 పెద్ద ర్యాలీల్లో స్వయంగా పాల్గొని ఎన్నికల హీట్‌ను పెంచే ప్రయత్నం చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌లు ప్రతి మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిలో ర్యాలీ లేదా రోడ్–షో నిర్వహించారు. అసెంబ్లీ స్థానాలపరంగా చూస్తే ఈ ముగ్గురూ యూపీలోని 403 సీట్లలో 68 శాతం సీట్లు అనగా 275 నియోజకవర్గాలను చుట్టేశారు.. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలకుగాను 47 జిల్లాల్లో 112 సభలు, ర్యాలీలు జరగగా, అందులో మోదీ 16, అమిత్ షా 20, యోగి ఆదిత్యనాథ్ 76 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏక్ ఔర్ ధక్కా.. కుర్చీ పక్కా! çపశ్చిమ యూపీలో సమాజ్‌వాదీ– రాష్ట్రీయ లోక్‌దళ్ జట్టుకట్టడంతో ఈనెల 10వ తేదీన పశ్చిమ యూపీలో 58 స్థానాలకు జరిగిన తొలిదశ పోలింగ్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. పశ్చిమ యూపీ 26 శాతానికి పైగా ముస్లింలు, 3.5 శాతం జాట్లు ఓట్లు ఉండటం, వీరికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా సగటున 10 శాతం ఉన్న యాదవ ఓట్లలో సింహభాగంగా ఎలాగూ ఎస్పీ కూటమికే పడతాయి. దానికి ఓబీసీల్లోని కొన్నివర్గాలు తోడైతే బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా అవతరించిన ఈ కూటమికి 45 శాతం పైచిలుకు ఓట్లు సునాయాసంగా పడతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే తొలి దశలో 62.4 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడంతో ప్రభుత్యానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు ఓటింగ్‌కు ముందుకు రాలేదని కొందరు వాదించారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా జరిగిన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పశ్చిమ యూపీ రైతులు ఓటింగ్ వచ్చేసరికి ఆ స్థాయి పట్టుదలను చూపలేదని అభిప్రాయపడ్డారు. అయితే సోమవారం బీజేపీకి స్వల్ప మొగ్గున్న రెండోదశలోని 55 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లోనూ 60.44 ఓటింగ్ శాతమే నమోదు కావడం గమనార్హం. అంటే ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలతలు దాదాపు సమంగా ఉన్నట్లు భావించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ లేదా కూటమి కనీసం 2 నుంచి 3 శాతం అధిక ఓట్లు సాధిస్తే.. విజయతీరాలకు చేరే అవకాశాలుంటాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అంటే ఎవరైతే మిగిలిన ఆరు దశల్లో సర్వశక్తులూ ఒడ్డి ‘ఏక్ ఔర్ ధక్కా’ అంటారో.. వారికి అధికార పీఠం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించొచ్చు. మొదటి దశ కాగానే.. హిందుత్వ వాడిని మరింత పెంచిన బీజేపీ మథురలో ఆలయం కడతామంటూ ఎన్నికలకు కొద్దినెలల ముందు కొత్త పల్లవి అందుకున్న బీజేపీ.. ఈ నెల 10çన తొలిదశ తర్వాత హిందుత్వ వాడివేడిని మరింతగా పెంచేసింది. గతంలో ఎస్పీ హయాంలో ‘అబ్బా జాన్ (ముస్లింను ఉద్దేశించి)’ అనే వారికే రేషన్‌తో పాటు ప్రభుత్వ పథకాలన్నీ అందేవని వ్యాఖ్యానించడం ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మతపరమైన ఎజెండాను మరింతగా ముందుకుతెచ్చారు. ఆపై 80–20 (ఉత్తరప్రదేశ్ జనాభాలో హిందువులు– ముస్లింల నిష్పత్తి) మధ్య యుద్ధంగా 2022 అసెంబ్లీ ఎన్నికలను అభివర్ణించారు. ప్రధాని మోదీ కూడా ఉత్తరాఖండ్ ప్రచారంలో శనివారం మాట్లాడుతూ... దేవభూమి అయిన ఈ రాష్ట్రంలో ముస్లిం యూనివర్శిటీని పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ఇలా హిందువుల ఓట్లను సంఘటితం చేయడానికి ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతలంతా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిఘా సమాచారం, కేంద్రంలోని ఇంటలిజెన్స్ బ్యూరో పకడ్బందీగా ఇచ్చే ఫీడ్‌బ్యాక్, వాస్తవ సరిస్థితులను ప్రతిబింబించే ఆర్ఎస్ఎస్ ఇచ్చే నివేదికలు, బీజేపీ పార్టీపరంగా అందే రిపోర్టులు, స్వతంత్ర సంస్థలతో చేయించే సర్వేలు.. ఇలా బీజేపీకి ఇన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో ఏం జరగుతోందనే సమాచారం అందుతుంది. వీటిల్లో అభివృద్ధి మంత్రం పనిచేయడం లేదని పక్కా సమాచారం ఉండటంతోనే మరోదారి లేక బీజేపీ మళ్లీ హిందుత్వ నినాదాన్ని (ఈసారి పనిచేయడం లేదని తెలిసీ) అందుకొని ఉండొచ్చనేది కొందరు రాజకీయ పండితుల అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
భారతదేశం రాజ్యంగం ప్రకారమే నడుస్తుంది! : యోగి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఏడు దశల ఎన్నికల పోలింగ్‌లో భాగంగా నేడు సెకండ్ ఫేస్ ఎన్నికల జరుగుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నవీన భారతదేశం రాజ్యంగం ప్రకారమే నడుస్తుంది తప్ప షరియత్ చట్టల ప్రకారం కాదని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. భారత్‌ని అంతిమంగా జయించాలనే కోరిక ఎప్పటికి సాకారం కాదని నొక్కి చెప్పారు. ఈ మేరకు యోగి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రాష్ట్రంలో " "80 వర్సెస్ 20"లను సూచించేలా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అభివృద్ధిని వెనకేసుకొచ్చే 80 శాతం మందికి.. ప్రతిదీ వ్యతిరేకించే 20 శాతం మంది మధ్య జరుతున్న పోరుగా అభివర్ణించారు. ఈ నవీన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన భారతదేశ నాయకుడు నరేంద్ర మోదీ అని నేను చాలా స్పషంగా చెప్పగలను. ఈ అభివృద్ధి అందర్నీ సంతృప్తి పరచలేకపోతోంది. తాలిబానీ ఆలోచనల మత ఛాందసవాదులు ఇది అర్థం చేసుకోండి. భారతదేశం షరియత్ ప్రకారం కాదు, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది." అని అన్నారు. అంతేకాదు కాలేజీలలో హిజాబ్ ఆంక్షలపై కర్ణాటకలో జరిగిన భారీ గొడవపై కూడా మాట్లాడారు. మన వ్యక్తిగత విశ్వాసాలు, ఇష్టాలు, అయిష్టాలను దేశం లేదా సంస్థలపై విధించలేమన్నారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ ఉండాలని, ఇది పాఠశాల క్రమశిక్షణకు సంబంధించిన విషయం అని చెప్పారు. అంతేకాదు ఒకరి వ్యక్తిగత విశ్వాసం వేరు, కానీ సంస్థల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ నిబంధనలను అంగీకరించాలి అని అన్నారు. హిజాబ్ విషయమై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను యోగి ఖండించారు. భారతదేశపు ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛ, హక్కుల కోసమే ప్రధాని మోదీ ట్రిపుల్ తలాక్ దుర్వినియోగాన్ని ఆపారనే విషయాన్ని ప్రస్తావిస్తూ గట్టి కౌంటరిచ్చారు. బాలిక సాధికారత కోసమే బీజేపీ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుటుందని చెప్పుకొచ్చారు. యూపిలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీకి బలమైన సవాలుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోసం ప్రచారం చేయడానికి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై కూడా ధ్వజమెత్తారు. కొంత మంది వ్యక్తులు బెంగాల్ నుండి వచ్చి ఇక్కడ అరాచకాలను వ్యాప్తి చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలకు అందుతున్న గౌరవం, భద్రత అభివృద్ధిని అడ్డుకునేందుకు వచ్చారని ప్రజలు దీన్ని వ్యతిరేకించేలా వారిని అప్రమత్తం చేయడం తన బాధ్యతని అన్నారు. అంతేకాదు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్‌పై యోగి మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు (2012-2017) రాష్ట్ర నిధులను సక్రమంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టకుండా నిద్రపోతూ కలలు కంటున్నారంటూ విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్ నేతల రాహుల్ గాంధీ, ప్రియాంకా తనను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ని ముంచడానికి ఎవరూ అవసరం లేదు ఈ అక్కాతమ్ముడు చాలు అంటూ యోగి ధ్వజమెత్తారు. (చదవండి: హిజాబ్ ధరించకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు'.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు) -
పంజాబ్‌లో ఆప్... ఉత్తరాఖండ్‌లో బీజేపీ?
ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పంజాబ్(ఫిబ్రవరి 20), ఉత్తరాఖండ్(నేడు)లలో ఒకే విడతలో జరగనున్న ఓటింగ్‌లో పార్టీల అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం సాగిన రైతుల ఉద్యమం ఎటూ కీలకపాత్ర పోషించనుంది. పంజాబ్‌లో ఈసారి కాంగ్రెస్, బీజేపీలను ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కినెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ సొంతంగా మెజారిటీ వస్తుందని చెప్పలేం. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలిచే అవకాశం కనబడుతున్నా, ఆమ్ ఆద్మీ ఇక్కడా కింగ్ మేకర్ పాత్ర పోషించే వీలుంది. ఢిల్లీకి ప్రతిష్ఠాత్మక సీఎస్డీఎస్, ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యేకం. భారతదేశ రాజకీయాల్లో పంజాబ్, ఉత్తరా ఖండ్ కొంత ప్రత్యేకం. సామాజిక వర్గాల ఆధిపత్యం పార్టీల తీరుతెన్నులపైనా ప్రభావం చూపే ప్రాంతాల్లో ఈ రెండు రాష్ట్రాలు ఉంటాయి. చరిత్రను తరచిచూస్తే పంజాబ్ జనాభాలో 58 శాతం ఉన్న సిక్కులు రాజకీయంగానూ బలవంతు లన్న విషయం స్పష్టం. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే... అరవై శాత మున్న అగ్రవర్ణాలదే ఆధిపత్యం. ఈ రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా ఈ వర్గాల వారే. ఉత్తరాఖండ్‌లో నేడు, పంజాబ్‌లో ఫిబ్రవరి 20న జరిగే ఎన్నికల్లోనూ ఇదే పంథా కొనసాగే అవకాశాలు మెండు. భారత రాజకీయాల్లో కుల, మతాధిపత్యాల ఆధారంగా వివక్ష చాలాకాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సమీప భవి ష్యత్తులో అంతమవుతుందని కూడా అశించలేము. పంజాబ్, ఉత్తరా ఖండ్ రెండింటిలోనూ పార్టీలు అంతర్గత కుమ్ములాటలు, నేతృత్వ సమస్యలతో కొట్టుమిట్టాడాయి. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రు లనూ మార్చాల్సి వచ్చింది. కాంగ్రెస్ పంజాబ్‌లో ఒకసారి ముఖ్య మంత్రిని మారిస్తే, ఉత్తరాఖండ్‌లో బీజేపీ రెండుసార్లు ఈ పని చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమం (పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులు ఎక్కువగా పాల్గొ న్నారు) కారణంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు జరిగింది. ఇప్పుడు ఈ అంశం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల అంశంగానూ మారింది. ఈ ఉద్యమం సందర్భంగా రాజధానిలో జరిగిన ఘటనలు కొన్ని పంజాబ్‌లో దళితులందరూ (32 శాతం జనాభా) ఒకవైపునకు కేంద్రీకృతమయ్యేందుకు దోహదపడింది. ముఖాముఖి నుంచి బహుముఖానికి... పంజాబ్‌లో చాలావరకూ ముఖాముఖి పోటీలే జరిగేవి. శిరో మణి అకాలీదళ్–బీజేపీల కూటమి ఒకవైపు, కాంగ్రెస్ ఇంకోవైపు నిలబడగా సాగిన పోటీలకు 2017లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో తెరపడినట్లు అయ్యింది. పోటీ త్రిముఖమైంది. రావి, బియాస్ నదుల మధ్యలో ఉండే మాఝా ప్రాంతంలో గురు ద్వారాలు, డేరాలు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూంటాయి. దోబా విషయానికి వస్తే ఇది ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండే ప్రాంతం. బియాస్, సట్లెజ్ నదుల మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంత జనాభాలో దళితులు (37 శాతం), చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ. సట్లెజ్కు ఆవల ఉండే మాల్వా ప్రాంతం జమీందార్లు, పెద్ద రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. 2017లో కాంగ్రెస్ మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 77 గెలుచుకుని విజయం సాధించగా... వచ్చిన ఓట్లు దాదాపు 39 శాతం. మాల్వా ప్రాంతంలోని 69 స్థానాల్లో కాంగ్రెస్ 40 చేజిక్కించుకుంది. అలాగే మాజాలోని 25 స్థానాల్లో 22, దోబా ప్రాంతంలోని 23 స్థానాల్లో 15 గెలుచుకుని అధికారం చేపట్టింది. ఆ ఎన్నికల్లో 20 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసక్తి కరంగా ఈ పార్టీ మాల్వా ప్రాంతంలో 18, దోబాలో 2 స్థానాలు గెలు చుకోవడమే కాకుండా... మొత్తమ్మీద 23 శాతం ఓట్లు సాధించ గలిగింది. అప్పట్లో అధికార పక్షం శిరోమణి–బీజేపీ కూటమికి 31 శాతం ఓట్లు దక్కినా... సాధించిన సీట్లు మాత్రం 18 మాత్రమే. ఇప్పుడు పోటీ త్రిముఖ స్థాయి నుంచి బహుముఖానికి మార డంతో రాష్ట్రంలో ఓ పెద్ద రాజకీయ మార్పునకు రంగం సిద్ధమవు తోంది. ఈ ఎన్నికల్లో చర్చకు వస్తున్న అంశాలు కొత్త సీసాలో పాత సారా చందంగానే ఉన్నాయి. మాదకద్రవ్యాలు, ఇసుక, మద్యం, కేబుల్ మాఫియా సమస్య, నిరుద్యోగం, రైతు సంక్షోభం, అవినీతి, పెరిగిపోతున్న ప్రభుత్వ రుణాల వంటివి ప్రధానాంశాలుగా మారాయి. ఇటీవలి కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న మరో అంశం గురుద్వారాలో మతగ్రం«థాలకు జరిగిన అవమానం. నాయ కత్వ స్థాయిలో కుమ్ములాటల వంటి సమస్యలతో కాంగ్రెస్ పార్టీ నిన్నమొన్నటివరకూ చెల్లాచెదురుగా ఉన్నా... పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రకటనతో ఈ కుమ్ములాటకు కొంతవరకూ తెరపడింది. కానీ పాలనపరమైన వైఫల్యాలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, చన్నీ, సిద్దూలతో కులాలు, మతాల ఆధారంగా రాజకీయ సమీకరణలు చేయడం వంటి అంశాలు ఆ పార్టీ అవకాశాలకు గండికొట్టే ప్రమాదముంది. రాష్ట్రంలో దళితులు 32 శాతం వరకూ ఉండగా... జాట్లు 20 శాతం వరకూ ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. దళితుడిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా రాజకీయంగా ఒక మెట్టు పైనున్నా ఇది జాట్ల వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం కాంగ్రెస్ వెన్నంటే ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తమ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ ద్వారా కాంగ్రెస్‌ను నేరుగా ఢీకొంటోంది. మాన్, కేజ్రీవాల్‌లు ప్రకటించిన పది అంశాల అభివృద్ధి ప్రణాళిక మాల్వా ప్రాంతంలో తన బలాన్ని పెంచుకునేందుకు, ఇతర ప్రాంతాల్లో లాభాలు తెచ్చి పెట్టేందుకు ఉపయోగపడుతుందని అంచనా. బీజేపీ మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)తో కలసి ఈసారి బరిలోకి దిగు తోంది. శిరోమణి నుంచి వేరుపడ్డ వర్గపు పార్టీ శిరోమణి (సంయుక్త) కూడా కాషాయ పార్టీ కూటమిలో భాగంగా ఉంది. బీజేపీ ఈ సారి 65 స్థానాల్లో పోటీ చేస్తూండగా పీఎల్సీ 38 స్థానాల్లో, శిరోమణి (సంయుక్త) 14 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. హిందూ, సిక్కు ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఈ కూటమి ప్రయత్ని స్తోంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, బోర్డర్ సెక్యూరిటీ అంశాల ఆధారంగా మాజా ప్రాంతంలో పట్టు సాధించే దిశగా అడుగు లేస్తోంది. సుఖ్బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి ఎన్డీయే నుంచి వేరుపడ్డ తరువాత ఈసారి ఎన్నికల కోసం బీఎస్పీతో జట్టు కట్టింది. రైతు ఉద్యమంలో భాగమైన 22 యూనియన్లతో ఏర్పాటైన సంయుక్త సమాజ్ మోర్చా బి.ఎస్.రాజేవాలా నేతృత్వంలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం పంజాబ్‌లో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకా శాలు ఉన్నాయి. అయితే ఈ పార్టీకి సొంతంగా మెజార్టీ వచ్చే అవకా శాలు తక్కువ. కాకపోతే బహుముఖ పోటీ నేపథ్యంలో ఓట్లు ఎలా చీలతాయో చెప్పడం కొంత కష్టమే. 1972 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఎల్లప్పుడూ ఒక పార్టీ లేదా కూటమి వైపే మొగ్గారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. దేవభూమిలో రసవత్తర రాజకీయం... ఉత్తరప్రదేశ్ నుంచి వేరు చేయగా ఏర్పడ్డ పర్వతప్రాంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఈసారి రాజకీయం రసవత్తరంగా ఉండనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నేడు ఓటింగ్ జరగనున్న ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2017లో మోదీ హవా కారణంగా బీజేపీ 47 శాతం ఓట్లతో మొత్తం 57 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 11 స్థానాలకు పరిమితమైంది. అయితే రాష్ట్ర నాయకత్వం విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఆ పార్టీ విశ్వసనీయతను కొంతవరకూ దెబ్బతీశాయి. ఐదు నెలల కాలంలోనే మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చడం, కుంభమేళా సందర్భంగా కోవిడ్ నిర్వ హణలో వైఫల్యాలు కాషాయ పార్టీని వెంటాడుతున్నాయి. నిరు ద్యోగం, ద్రవ్యోల్బణం, పర్వతప్రాంతాల నుంచి ప్రజల వలసలు కూడా బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే యువ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ యువ ఓటర్లను ఆకర్శించగలడనీ, మోదీ–యోగీ వంటి అంశాలు ఓటర్లను ఆకర్షించవచ్చుననీ బీజేపీ ఆశలు పెట్టుకుని ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన కాంగ్రెస్ పార్టీ హరీశ్ రావత్ నేతృత్వంలో కొంతవరకూ కోలుకుందనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకత, ఉత్తరాఖండ్ ఎన్నికల చరిత్ర తమకు అవకాశం కల్పిస్తాయన్న ఆశతో కాంగ్రెస్ ఉంది. ఒక పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టే చరిత్ర ఇక్కడ లేకపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ ఈ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందా అన్నది ఒక ప్రశ్న. పార్టీలో వర్గాలు, అంతర్గత కుమ్ములాటలు ఇందుకు కారణం. ఓట్‌షేర్ విషయంలో బీజేపీతో ఉన్న 13 శాతం అంతరాన్ని అధిగమిం చడం కాంగ్రెస్‌కు ఈసారి కొంత కష్టమే కావచ్చు. గాంధీ కుటుంబ సభ్యుల ప్రచారం, రైతు ఉద్యమం కారణంగా రైతుల్లో నెలకొన్న అసం తృప్తి వంటి అంశాలు రాష్ట్రంలోని టెరాయి ప్రాంతంలోని తొమ్మిది స్థానాల్లో తమకు ఓట్లు, సీట్లు తెచ్చిపెడతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక్కడ రైతులు, సిక్కులు అధిక సంఖ్యలో ఉంటారు. రెండు జాతీయ పార్టీల హోరాహోరీ పోరు మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ తరహాలోనే 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, యువతకు నెలకు ఐదు వేల రూపాయల నిరుద్యోగ భృతి, పద్ధెనిమిదేళ్ళు పైబడ్డ మహిళలకు నెలకు రూ.1000 పంపిణీ వంటి హామీలు ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వస్తాయా అన్నది వేచి చూడాల్సిన అంశం. సీఎం అభ్యర్థిగా ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసిన అజయ్ కొతియాల్ను ఎంపిక చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ప్రత్యామ్నాయంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నిర్వహించిన సర్వేల ప్రకారం... ఈసారి ఉత్తరాఖండ్‌లో పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాత్రమే. కాకపోతే ప్రధాన పార్టీలు రెండూ తగినంత మెజార్టీ సాధిం చలేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ -
యూపీ రెండో దశ అభ్యర్థుల్లో..12 మంది నిరక్షరాస్యులు
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 55 స్థానాలకు సోమవారం జరిగే రెండో దశ పోలింగ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 12 మంది నిరక్షరాస్యులు. 67 మందికి కష్టంగా చదవడం, రాయడం వచ్చు. 114 మంది 8వ తరగతి దాకా చదివారు. 102 మంది పీజీ చేయగా ఆరుగురు పీహెచ్డీ చేశారు. అభ్యర్థుల అఫిడవిట్ల వివరాల ఆధారంగా యూపీ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఈ మేరకు వెల్లడించింది. మహిళా అభ్యర్థులు 11.8 శాతమున్నారని చెప్పింది -
దేవతలు నడయాడే భూమిని అవమానిస్తే మీరు సహిస్తారా?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రెండో దశ ఎన్నికల ప్రచారానికి శనివారం తెరపడింది. ఉత్తరాఖండ్‌లో 70, గోవాలో 40, యూపీలో 55 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ప్రచారానికి చివరి రోజైన శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో సుడిగాలి ప్రచారం చేశారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను తరిమికొట్టే అవకాశం ప్రజలకు వచ్చిందని అన్నారు. దేశంలో మెజార్టీ రాష్ట్రాలు కాంగ్రెస్‌ను తిరస్కరించాయని, ఇక్కడ ప్రజలు కూడా అదే పని చేయాలని పిలుపునిచ్చారు. మైనారిటీలను బుజ్జగింపే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్‌లో ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దేవతలు నడయాడే భూమిని ఇలాంటి పనులతో అవమానిస్తే మీరు సహిస్తారా? అని ప్రశ్నించారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల కాంగ్రెస్ అవగాహన లేదన్నారు. సైనికుల్ని కూడా అవమానించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని మోదీ ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్‌కే గర్వకారణంగా నిలిచిన దేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌ను వీధి రౌడీ అంటూ కాంగ్రెస్ మాట్లాడిందని ఈ ఎన్నికల్లో దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. -
అల్లరిమూకలకు బీజేపీయే విరుగుడు
కనౌజ్: అల్లరిమూకలు, ఆరాచక శక్తులు, నేరగాళ్లకు బీజపీయే విరుగుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇప్పుడీ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రజలూ గుర్తించారన్నారు. గుజరాత్లో గత రెండు దశాబ్దాల్లో ఎలాంటి అల్లర్లూ జరగలేదనే విషయాన్ని ప్రస్తావించారు. యూపీలోని కనౌజ్లో శనివారం మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీలో తొలి దశ పోలింగ్ తర్వాత కుటుంబ పార్టీలకు కంటి మీద కునుకు కూడా కరువైందని అన్నారు. అధికారం కోసం ఇక కలలు కనలేరని అన్నారు. ఆ నాయకులందరూ ప్రభుత్వం అంటే కుటుంబం కోసం, కుటుంబం వలన, కుటుంబం చేత... అనుకుంటారని ఎద్దేవా చేశారు. మాఫియా నాయకుల్ని, అల్లరి మూకల్ని అరికట్టే సత్తా బీజేపీకే ఉందనేది ప్రజలకు అర్థమైందన్నారు. అధికారంలో ఉన్నపుడు విపక్షపార్టీలు శాంతిభద్రతలను కాపాడలేకపోయాయని ధ్వజమెత్తారు. అల్లర్లకు అడ్డుకట్టవేడయం, మాఫియాకు, గుండాలకు ముకుతాడు వేయడం యోగి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి ఈ సర్కారును కొనసాగించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
కుటుంబ పార్టీలకు ఓటేయొద్దు
ఖాస్గంజ్ : సమాజ్‌వాదీ వంటి కుటుంబ పార్టీలకు ఓటేయొద్దని యూపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. వారొస్తే రాష్ట్ర పేదల కోసం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆపేస్తారన్నారు. యూపీలోని ఖాస్గంజ్లో శుక్రవారం ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఓటర్లను కుటం పేరిట విడదీసేందుకు సమాజ్‌వాదీ వంటి పార్టీలు ఎంతగా ప్రయత్నించినా వాటి పాచికలు పారలేదన్నారు. ఈసారీ అలాంటి ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూపీ తొలి దశ ఓటింగ్‌లో బీజేపీ హవాయే సాగిందని ధీమా వెలిబుచ్చారు. ‘‘మహిళలు భారీగా వచ్చి మాకు ఓటేశారు. ఓటమి తప్పదని విపక్షాలకు అర్థమైంది. అందుకే ఇప్పటినుంచే ఈవీఎంలపై, ఈసీపై విమర్శలు మొదలు పెట్టాయి. చివరికి పేదలకు కరోనా వ్యాక్సిన్లు వేయడం లేదంటూ దుష్ప్రచారానికి దిగాయి’’ అని ఎద్దేవా చేశారు. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు. రేషన్ మాఫియాను రూపుమాపారని, కేంద్రం పంపుతున్న ప్రతి గింజా హక్కుదారులకే అందేలా చూస్తున్నారని అన్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే సాహసం చేయలేరన్నారు. అంబేడ్కర్వాదులంతా సమాజ్‌వాదీలో చేరాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పిలుపివ్వడం హాస్యాస్పదమన్నారు. విభజించడమే కాంగ్రెస్ పని కులం, ప్రాంతం, మతం ఆధారంగా ప్రజలను విడదీయడం, దోచుకోవడమే కాంగ్రెస్ పనంటూ మోదీ దుయ్యబట్టారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ బీజేపీకే ఓటేస్తే అభివృద్ధిలో రాష్ట్రాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క కుమాయున్ ప్రాంతంలోనే ఏకంగా రూ.17 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు తాను శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. తాజా బడ్జెట్లో ప్రకటించిన పర్వతమాల, వైబ్రంట్ విలేజీ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్‌లో మౌలిక సదుపాయాలు మరింత విస్తరించి, టూరిజం పెరిగి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. -
మహిళా రక్షణ మాతోనే సాధ్యం
సహరన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఏ ముస్లిం మహిళా అణచివేతకు గురికాకూడదనే ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరుకుంటోందని, కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం చేయడంలో యూపీ సీఎం యోగీ పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యూపీలో మహిళలకు రక్షణ కావాలన్నా, నేరస్థులు జైళ్లలో ఉండాలన్నా... బీజేపీ అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటి సారి యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహరన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ర్యాలీనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు ఒక కళంకం అయితే, 2014లో జరిగిన సహరన్పూర్ మత కల్లోహాలు మరింత భయంగొల్పాయని, వాటికి కారణమైన వాళ్లకు 2017లోనే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని కితాబిచ్చారు. పేద ప్రజలు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా, చిన్న రైతులకు కిసాన్యోజన నిధులు రావాలన్నా, ఉచిత రేషన్ అందాలన్నా, టీకా ఉచితంగా అందాలన్నా, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అది యూపీ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చిందన్నారు. బిపిన్‌రావత్ కటౌట్ వాడుకుంటున్నారు... ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. దివంగత జనరల్ బిపిన్ రావత్ బతికుండగా నిందించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకోసం ఆయన కటౌట్‌ను ఉపయోగించుకుంటోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, ఢిల్లీలో ఉండి రుజువులు కావాలని అడిగిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సాయుధ దళాలపై విద్వేషం వెల్లగక్కిన నేతలు ఇప్పుడు వారి చిత్రాలను ఉపయోగించుకోవడం హాస్యాస్పదమన్నారు. బిపిన్‌రావత్ జ్ఞాపకాలను కొనియాడిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యం పండిట్ జనవహర్‌లాల్ నెహ్రూ పట్టుబడితే... 1947లో కొన్ని గంటల్లోనే గోవా, పోర్చుగీసు నుంచి విముక్తమయ్యేదని, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లే 15ఏళ్ల కాలం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మపుసలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీ గోవాను శత్రువులా చూస్తోందని, భవిష్యత్‌లోనూ అదే తీరు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవా యువత ఏం కోరుకుంటోంది? ఇక్కడి రాజకీయ సంస్కృతి ఏమిటన్నది కాంగ్రెస్‌కు ఎప్పటికీ అర్థం కాదన్నారు. -
యూపీలో కొనసాగుతున్న తొలిదశ ఎన్నికల పోలింగ్
-
బంపర్ ఆఫర్
-
లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే..
లఖింపూర్ ఖేరి ఘటనపై ఎట్టకేలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మొదటి దశ పోలింగ్ జరుగుతుండగా.. నిన్న(బుధవారం) ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటనపై అడిగిన ప్రశ్నకు మోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు తమ వైపే ఉన్నారంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులను కారుతో తొక్కించి చంపిన లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి నోరువిప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసు దర్యాప్తులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తున్నదని తెలిపారు. కేసు దర్యాప్తు ఆగబోదని అన్నారు. సుప్రీంకోర్టు ఎలా కొరితే ఆ విధంగా.. ఆ జడ్జీతోనే దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 2021 అక్టోబర్ 3న, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీ వద్ద నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో రైతులపైకి దూసుకెళ్లిన SUVని అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడు. లఖింపూర్ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు బలైన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయగా.. గత అక్టోబరు నుండి జైలులో ఉన్నాడు. అయితే ఈ ఘటనకు బాధ్యతగా అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతను హోం శాఖ సహాయ మంత్రిగా PM మోడీ ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు. యూపీ పోలీసులు, పరిపాలనా యంత్రాంగం విచారణలో నిదానంగా సాగుతోందని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఇక వ్యవసాయం చట్టాల రద్దు గురించి ప్రధాని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఉపసంహరించుకున్నాం. దీన్ని ఇకపై వివరించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ చర్యలు ఎందుకు అవసరమో భవిష్యత్తే స్పష్టం చేస్తుంది”అని ప్రధాని ఉద్ఘాటించారు. -
వారసత్వ రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికే ముప్పు
న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ప్రజాస్వామ్యానికి ముప్పుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదేనని ధీమా వెలిబుచ్చారు. యూపీలోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం తొలి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీని గెలిపించే ధోరణికి యూపీ ప్రజలు స్వస్తి చెప్పారు. వారు 2014 (లోక్‌సభ) ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించారు. మా పనితీరు నచ్చి 2017 (అసెంబ్లీ) ఎన్నికల్లో మళ్లీ అవకాశమిచ్చారు. తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా మేం చేసిన అభివృద్ధిని మెచ్చి 2019 (లోక్‌సభ) ఎన్నికల్లోనూ మాకే ఓటేశారు. ఇప్పుడూ బీజేపీకే అవకాశమిస్తారు’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. పలు అంశాలపై మోదీ ఏమన్నారంటే... యూపీ మహిళలు రాత్రి పూట తిరగొచ్చు... గతంలో యూపీ అంటే మాఫియారాజ్, గూండారాజ్ మాత్రమే గుర్తొచ్చేవి. వాటిని ప్రభుత్వాలే ప్రోత్సహించేవి. ఇప్పుడక్కడ శాంతిభద్రతలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతంగా చక్కదిద్దింది. ఇప్పుడు యూపీ మహిళలు రాత్రుళ్లు కూడా నిర్భయంగా ఒంటరిగా బయటికి వెళ్లవచ్చు. ఎస్పీ, బీఎస్పీ కల్లబొల్లి మాటలను ఓటర్లు వినే పరిస్థితి లేదు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పు... వారసత్వ రాజకీయాలు నా దృష్టిలో కుహనా సామ్యవాదం. రాం మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌కుమార్ కుటుంబాలు మీకెక్కడైనా కన్పిస్తాయా? సోషలిస్టులంటే వాళ్లు. సమాజ్‌వాదీ పార్టీలో కనీసం 45 పదవుల్లో అగ్ర నేతల కుటుంబీకులేనట! కశ్మీర్, హరియాణా మొదలుకుని యూపీ, జార్ఖండ్, తమిళనాడు దాకా చాలా రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలున్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువు. డైనాస్టీ (వారసత్వం) ఉన్న చోట డైనమిజం ఉండదు. కుల రాజకీయాలు కూడా శాశ్వతంగా పోవాలి. ఎన్నికల్లో లబ్ధి కోసం కుల జపం చేయడం సరికాదు. హెడ్లైన్ల కోసం పాకులాడట్లేదు... నిత్యం పతాక శీర్షికల్లో నిలవాలని నేనెన్నడూ పాకులాడలేదు. అంతర్జాతీయంగా దేశ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలన్నదే నా తపన. కానీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలు మన దేశంలో తప్ప బహుశా ప్రపంచంలో మరెక్కడా ఉండవేమో! దర్యాప్తు సంస్థల దురుపయోగం అబద్ధం... దర్యాప్తు సంస్థలను మేం దురుపయోగం చేస్తున్నామన్నది అబద్ధం. దేశవ్యాప్తంగా అవినీతి భరతం పడుతూ వందలాది, వేలాది కోట్ల జాతి సంపద ఖజానాకు జమ చేస్తున్నందుకు నిజానికి నన్ను మెచ్చుకోవాలి. అవినీతి దేశానికి పట్టిన చీడ. దీనిపై నేనేమీ చేయకపోతే ప్రజలు నన్ను క్షమిస్తారా? ఎన్నికలప్పుడు ప్రత్యర్థులను వేధించేందుకు వీటిని వా డుకుంటున్నామంటున్న పార్టీలకు దమ్ముంటే దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలకు అంగీకరించాలి. నెహ్రూపై విమర్శలు సబబే... నేను ఎవరి తండ్రి గురించో, తాత గురించో పనిగట్టుకుని మాట్లాడలేదు (రాహుల్‌నుద్దేశించి). కేవలం ఒక మాజీ ప్రధాని ఏం చెప్పారో గుర్తు చేశా. అది తెలుసుకోవడం దేశం హక్కు. మేం నెహ్రూ పేరే ఎత్తొద్దన్నది వారి వాదన. వాళ్లకు అంత భయమెందుకో! దేశం కోసమే సాగు చట్టాలు వెనక్కు.. నేను రైతుల మనసు గెలుచుకునేందుకే వచ్చాను. గెలిచాను కూడా. చిన్న రైతుల సమస్యలు నాకు తెలుసు. సాగు చట్టాలను రైతుల ప్రయోజనం కోసమే తెచ్చాం. కానీ అంతిమంగా దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెనక్కు తీసుకున్నాం. ఎన్నికలు మాకు నిత్య పాఠాలు.. ఎన్నికలను మేం కేవలం రాజకీయ దృష్టితో మాత్రమే చూడం. అవి మాకు ఓపెన్ యూనివర్సిటీల వంటివి. మమ్మల్ని మేం మెరుగుపరుచుకునేందుకు గొప్ప అవకాశాలుగా వాటిని చూస్తాం. -
హాట్టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ
నిజమే! సామన్యులు ఇప్పడు గళం విప్పడమే గగనమైపోతోంది. పాలకులను పల్లెత్తు మాటన్నామా నిర్బంధమే. మరి ఇప్పుడెలా? రాజ్యం ప్రజలపై బలవంతంగా మోపే బలవంతపు ఫర్మానాలను ప్రశ్నించేవారే లేరా? ఎందుకు లేరు ఉన్నారు? సదాఫ్ జాఫర్, పూజా శుక్లా లాంటి సామాన్య మహిళలు ప్రభుత్వ నిరంకుశ ధోరణులను నిర్భయంగా నిలదీశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం కారాగార వాసం చేయాల్సి వచ్చినా జంకలేదు, జావగారిపోలేదు! ఆ ధైర్యమే వారికి ఇప్పుడు శాసనకర్తలయ్యే అవకాశాన్ని కల్పించింది. భారతావనిలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్టాఫిక్. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తాయనేది సర్వత్రా ఆసక్తికరం. తలపండిన రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వందిమాగధులకు అవకాశాలే అధికమన్నది కళ్లెదుటే కనబడుతున్న చరిత్ర. ఇంతటి పోటీలోనూ ఇద్దరు (అ)సామాన్య మహిళలు పెద్ద పార్టీల టిక్కెట్లు దక్కించుకోవడం వర్తమాన రాజకీయాల్లో అరుదైన దృశ్యం. ఇంతకీ ఎవరా ఇద్దరు..? సదాఫ్.. శభాష్! ప్రతిష్టాత్మక లక్నో సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశాన్ని నటి, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ దక్కించుకున్నారు. ఆషామాషీగా ఆమెకు ఈ అవకాశం రాలేదు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 2019, డిసెంబర్లో గళమెత్తినందుకు మదమెక్కిన మగ పోలీసు దురహంకారంతో కాలితో ఆమె పొట్టలో తన్నాడు. లక్నోలోని పరివర్తన్ చౌక్ వద్ద ఫేస్బుక్ లైవ్ సెషన్ నిర్వహించిన సదాఫ్ను అవమానవీయ రీతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లు, హత్యాయత్నం కేసు పెట్టి ఆమెను జైల్లో పెట్టారు. అంతేకాదు ఆమె ఫోటోలతో పోస్టర్లు వేసి అవమానానికి గురిచేశారు. సదాఫ్ పోరాటం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆమెను విడుదల చేయాలని యూపీ బీజేపీ సర్కారును డిమాండ్ చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2020, జనవరిలో సదాఫ్‌కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్‌తో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. తలపండిన అధికార పార్టీ నాయకుడిని ఢీ కొట్టడానికి భయం లేదా అని అడిగితే.. ‘ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మొదటిసారి పోటీకి దిగినప్పుడు అనామకుడే కదా’అని బదులిచ్చారు సదాఫ్. ప్రజాస్వామ్య ఎన్నికల్లో అసలు బలం ప్రజలదేనని, తమకు పాలకులుగా ఎవరు ఉండాలో వారే నిర్ణయించుకుంటారని చెప్పారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?) నల్లజెండా తెచ్చిన అవకాశం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు నల్లజెండాలతో నిరసన తెలిపి ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి దూసుకొచ్చారు పూజా శుక్లా. లక్నో నార్త్ నియోజక వర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారామె. 25 ఏళ్ల పూజా శుక్లా.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కులైన అభ్యర్థుల్లో ఒకరు. 2017, జూన్ 7వ తేదీ ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్. హిందీ స్వరాజ్ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్నో యూనివర్సిటీ క్యాంపస్‌కు వెళుతున్న సీఎం యోగికి నల్లజెండాలతో నిరసన తెలపడంతో పూజా శుక్లాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 20 రోజుల తర్వాత బయటికి వచ్చిన ఆమె సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. ఆమె పోరాటానికి ముగ్దుడైన పెద్దాయన పార్టీ విద్యార్థి విభాగం అయిన ‘సమాజ్‌వాదీ చత్ర సభ’లో శుక్లాకు ప్రముఖ స్థానం కల్పించారు. అయితే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపి తనతో పాటు జైలుకెళ్లొచ్చిన వారికి లక్నో యూనివర్శిటీ 2018లో ప్రవేశం నిరాకరించడంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి విశ్వవిద్యాలయ పాలకవర్గాన్ని దిగొచ్చేలా చేశారు. (క్లిక్: ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు) ఈ పరిస్థితి మారాలి నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లక్నోలోని క్లాక్‌టవర్ వద్ద 2020, జనవరిలో మహిళలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలోనూ శుక్లా కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ‘విద్య పేరుతో యువతను, ముఖ్యంగా విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి. రాజకీయంగా అవగాహన ఉన్న విద్యార్థి మాత్రమే మంచి నాయకుడిని ఎన్నుకోగలడు. దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసి, ప్రగతిపథంలో తీసుకెళ్లే సత్తా యువతకు ఉంద’ని శుక్లా అన్నారు. రాజకీయ నాయకురాలిగా కూడా యువత, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టంచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో లక్నో నార్త్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నీరజ్ బోరాతో పూజా శుక్లా హోరాహోరీ తలపడుతున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను యువత, స్థానికుల అండదండలతో విజయం సాధిస్తానని దీమాగా చెబుతున్నారామె. పోరాట నేపథ్యం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సదాఫ్ జాఫర్, పూజా శుక్లాలను యూపీ ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారనేది పక్కన పెడితే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి హక్కుల కోసం నిర్భయంగా నినదించిన వీరిద్దరి పోరు పంథా సామాన్యులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు! (చదవండి: ఇలా పార్టీ ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నారు!) -
యోగితో యూపీలో అభివృద్ధి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే, కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూపీ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఆయన డిజిటల్ ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చకు తెరదించుతూ యోగిని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా రాకపోయి ఉంటే యోగి సారథ్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధిని సాధించి ఉండేదని అన్నారు. కేంద్ర పథకం కింద నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యోగి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇస్తేనే, ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలకు చేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఆగ్రా, మథుర, బులంద్షార్ ఓటర్లనుద్దేశించి ప్రధాని ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. ఈ సారి ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు. యూపీలో బీజేపీ మళ్లీ గెలిస్తే సీఎం అభ్యర్థిని మారుస్తుందా అన్న సందేహాలకు తావు లేకుండా ప్రధాని ప్రసంగం సాగింది. రాష్ట్రంలో మహిళలంతా బీజేపీ మళ్లీ గెలవాలని, యోగి మళ్లీ సీఎం కావాలని నిర్ణయించుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల అవసరాలను గుర్తించలేదని దుమ్మెత్తి పోశారు. యూపీని లూటీ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వారి కుటుంబమే ప్రభుత్వంగా మారితే, బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రమంతా ఒక కుటుంబంలా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా భారత గానకోకిల లతా మంగేష్కర్ కన్నుమూయడంతో యూపీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ హాజరయ్యే ఒక కార్యక్రమంలో ఆదివారం ఉదయం 10:15 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. లత మరణంతో రెండు నిముషాల సేపు నేతలు మౌనం పాటించారు. మేనిఫెస్టో విడుదల కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు. బీజేపీ నేతల ప్రవేశంపై నిషేధం తమ గ్రామంలోకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావొద్దంటూ బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా గున్నౌర్ పరిధిలోని బిచ్పురి సైలాబ్ గ్రామంలో చోటుచేసుకుంది. బీజేపీ శ్రేణుల రాకను గ్రామస్థులు అడ్డుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బోర్డు ఏర్పాటు చేసిన గ్రామపెద్ద నిరంజన్ సింగ్‌ను అరెస్టు చేశారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకు నిరసనగానే ఈ బోర్డు పెట్టినట్లు ప్రజలు చెబుతున్నారు. యూపీలో మామపై కోడలి పోటీ! ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్ జిల్లాలోని తిల్హార్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రోషన్‌లాల్ వర్మపై ఆయన కోడలు సరితా యాదవ్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రీయ సమాజ్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తానని ఆమె చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన వర్మ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ ఆయనకు తిల్హార్ టిక్కెట్ ఇస్తామని ప్రకటించింది. తన మామ రోషన్‌లాల్ వర్మ భూకబ్జాదారుడు అని సరితా యాదవ్ ఆరోపించారు. అసలు సరితా యాదవ్ తన కోడలే కాదని వర్మ చెబుతున్నారు. రాయ్‌బరేలీ స్టార్ ప్రచారకుల్లో లేని సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నాలుగో దశలో ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ స్టార్ ప్రచారకుల జాబితాలో సోనియా పేరు లేకపోవడం గమనార్హం. 30 మంది స్టార్ ప్రచారకుల జాబితాలో రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు ఉన్నారు. పంజాబ్‌లో అన్నదమ్ముల పరస్పర పోటీ పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లాలో ఉన్న మజిథా అసెంబ్లీ స్థానం నుంచి అన్నదమ్ములు వేర్వేరు పార్టీల టిక్కెట్లపై పోటీకి దిగుతున్నారు. తనదే గెలుపు అంటూ ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుఖ్జిందర్రాజ్ సింగ్ అలియాస్ లల్లీ మజీథియా ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై, ఆయన తమ్ముడు జగ్విందర్పాల్ సింగ్ అలియాస్ జగ్గా మజీథియా కాంగ్రెస్ టిక్కెట్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
Up Assembly Election 2022: ఆ 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలు
ఏ దేశానికేగినా, ఎందుకాలిడినా.. మొదట అడిగేది నీవెక్కడి వాడివోయ్ అనే! అలా చెప్పుకోవడానికి అస్తిత్వమే లేకపోతే.. మనకంటూ ఓ ఊరు, ఓ ఉనికే లేకపోతే... ఎంతో దుర్భరంగా ఉంటుంది కదా! తమ పూర్వీకుల తాలుకూ ఇళ్లు,, జ్ఞాపకాలు నదీగర్భంలో కలిసిపోతే... రచ్చబండ, చేదబావి, ఊరిచెరువు... ఈతపళ్లు... ఈ జ్ఞాపకాలన్ని కనుమరుగైపోతే... మెరుగైన జీవనానికంటూ పట్టణాలకు పరుగులు పెడుతున్న నేటి కుర్రకారుకు వాటి విలువ తెలియకపోవచ్చు.. కానీ మట్టిలో ఆడి.. ఎండిన చెరువుల మడుల్లో పాపెర్లు పట్టిన చిట్టి చేతులకు తెలుసు అవెంతటి విలువైన జ్ఞాపకాలో... నా పల్లెకేమైందని... గొంతుకేదో అడ్డం పడుతోంది.. మాట పెగలట్లేదు! మార్పు ఓ నిరంతర ప్రక్రియ. కొత్తనీరు వచ్చి నపుడు పాతనీరు కొట్టుకుపోతుంది. అభివృద్ధి జరగాల్సిందే కానీ... ఉన్న గతాన్నంతా ఊడ్చేసి మాత్రం కాదు. పుట్టిన ఊరితో, పెరిగిన వీధితో, చెడ్డీ దోస్తులతో పెనవేసుకున్న బంధాలు మాత్రం ఎన్నేళ్లయినా... ఎంత ఎత్తుకు ఎదిగినా... గుండెను తడుముతూనే ఉంటాయి. ఒక్కసారైనా ఊరెళ్లి మనోళ్లందరినీ కలిసి రావాలని మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర్ జిల్లా దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలుగా మారాయి. దీంతో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉన్న ఈ 11 గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఏమాత్రం కనిపించట్లేదు. సోన్‌భద్ర్‌లో నిర్మిస్తున్న కన్హర్ డ్యామ్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ అయిన దుద్ధి నియోజకవర్గంలో అప్నాదళ్ (సోనేలాల్)కు చెందిన హర్ ఇరాం బీఎస్పీ అభ్యర్థిపై 1,085 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా 8,522 మంది ప్రజలు నోటాకే మొగ్గు చూపారంటే పరిస్థితి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు రూ.2,700 కోట్లతో నాలుగు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న కన్హర్ డ్యామ్‌ను వచ్చే ఏడాది కల్లా సిద్ధం చేసేందుకు కొన్నేళ్లుగా చర్యలు వేగవంతం అయ్యాయి. సోన్‌భద్ర్ జిల్లాలోని అమ్వార్ గ్రామంలో పాగన్ నది, కన్హర్ నది సంగమం వద్ద జరుగుతున్న డ్యామ్ నిర్మాణంతో సిందూరి, భీసూర్, కోర్చి గ్రామాలతో పాటు కలిపి మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో పరిహారం, పునరావాసం విషయంలో తాము చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరూ సహకరించట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చదవండి: (మీసం మెలేసేది రైతన్నే!) కన్హర్ డ్యామ్ కోసం 1976 నుంచి 1982 వరకు ప్రజల నుంచి భూమిని తీసుకుని ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. అయితే 1984లో ఆనకట్ట పనులు ఆగిపోవడంతో ప్రజలు ఎవరూ గ్రామాలు ఖాళీ చేయలేదు. కాగా ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కన్హర్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 65% భూసేకరణ పూర్తయిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2023 వర్షాకాలానికి ముందే ఈ మెయిన్ డ్యాంలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాంతో ఈసారి ఈ 11 గ్రామాలకు చెందిన ప్రజలు బరువెక్కిన గుండెతో కన్నీటి బొట్టునే చూపుడు వేలిపై సిరా చుక్కగా మలచుకొని... తమదిగా చెప్పుకోగలిగే ప్రాంతంలో ఆఖరిసారిగా ఓటేసి... తట్టాబుట్టా సర్దుకొని తలోవైపు వెళ్లిపోనున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
యూపీలో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ అభ్యర్థులపై దేశద్రోహం కేసులు
బిజ్నోర్, వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి నీరజ్ చౌదరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన బిజ్నోర్ స్థానం నుంచి బరిలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం నీరజ్ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉండగా ఆయన వెంట ఉన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పోలీసులు శనివారం చెప్పారు. శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసినందుకు గాను నీరజ్ చౌదరితోపాటు మరో 20–25 మందిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 295ఏతో పాటు పలు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంటువ్యాధుల చట్టం కింద కూడా కేసు పెట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. సంబంధిత ఆడియో, వీడియో క్లిప్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తామని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిపై దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకీఫ్ భాయ్ జిందాబాద్ అని నినదించినా కొందరికి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్లుగా వినిపిస్తోందని శనివారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. తప్పుడు వీడియోలు సృష్టించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైద్యుడు, పెద్దమనిషి అయిన నీరజ్ చౌదరిని ద్రోహిగా చిత్రీకరిస్తుండడం దారుణమని జయంత్ చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై...: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌పై పోలీసులు శనివారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన జనవరి 31న రాజేతరా గ్రామంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్న పోలీసులు అజయ్ రాయ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 269, 153, 153ఏ, 188 కింద కేసు పెట్టారు. -
మీసం మెలేసేది రైతన్నే!
దుక్కి దున్ని.. నారు పెట్టి.. నాగలి పట్టిన రైతన్నే ఉత్తరప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి మీసం మెలేస్తున్నాడు. పోటీకి సై అంటున్నాడు. చట్టాల రూపకల్పనలో తనకూ భాగస్వామ్యం కావాలని గొంతెత్తున్నాడు. తనను పక్కనపెట్టినా, తక్కువ చేసినా తగ్గేదేలే అని హెచ్చరిస్తున్నాడు. సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం తర్వాత యూపీ రాజకీయాల్లో పెరిగిన రైతుల పాత్ర ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలున్నాయి. అక్కడంతా రైతు ఎజెండా, రైతు నేతల మద్దతు చుట్టూతే రాజకీయం గిర్రున తిరుగుతోంది. యూపీ జనాభాలో 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రతి సీటు గెలుపులోనూ వీరిపాత్రే కీలకంగా ఉండనుంది. ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రైతులను చట్టసభలకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. గ్రామీణ జనాభా ఉన్న ప్రాంతాల్లో సుమారు 250కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉండటంతో రైతు నేపథ్యం గల రాజకీయ నేతలను పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే వివిధ రంగాలకు చెందిన వారిలో రైతులే ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీకి వెళ్తున్నారు. గత 2017 ఎన్నికల్లో చట్టసభలో ఏకంగా 161 మంది రైతులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇందులో వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న ఎమ్మెల్యేలు 90 మందికి పైగా ఉండడం విశేషం. రైతుల తర్వాత అధిక సంఖ్యలో వ్యాపారులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు చట్టసభల్లో ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పార్టీలు ప్రకటించిన జాబితాల్లో 45శాతం మంది రైతులు ఉన్నారని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. రైతు ఎజెండాతోనే రాజకీయం మరోవైపు యూపీ ఎన్నికల్లో రైతు అజెండాతోనే రాజకీయ పార్టీలు బాహాబాహీకి దిగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలు, వాటిపై యూపీ రైతుల నుంచే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం కావడం, పుండుపై కారం చల్లినట్లుగా లఖీమ్‌పూర్ ఖేరీ ఘటన చోటుచేసుకోవడం, ఈ ఘటనకు బాధ్యుడైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌మిశ్రా తేనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం వంటి అంశాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకతను తప్పించుకునేందుకు బీజేపీ తమ ప్రభుత్వం చేసిన రైతు అనుకూల చర్యలను పదేపదే వల్లెవేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం రూ.36 వేల కోట్ల రుణాలు అందించామని, పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.2.21 కోట్ల మంది రైతులను చేర్చి ఇప్పటికే 28 లక్షల మందికి రూ.2,400 కోట్లు పరిహారం అందించామని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక పీఎం కిసాన్ కింద యూపీ రైతులకు రూ.41 వేల కోట్లు జమ అయ్యాయని, ఎరువుల బస్తాల ధరలను రూ.2,400 నుంచి రూ.1200కి తగ్గించిందని తమ ప్రచారాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోపక్క ఇటీవల జాట్ నేతలతో సమావేశం అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతులకు రూ.36 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, చెరకు రైతులకు రూ.1.40 లక్షల కోట్ల చెల్లింపులు చేశామని చెబుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక వెనుకబడ్డ బుందేల్‌ఖండ్ ప్రాంతానికి తాగు, సాగునీటి వసతిని పెంచేలా కెన్–బెత్వా నదుల అనుసంధానానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. మరోపక్క రైతుల్లో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని సమాజ్‌వాదీ పార్టీ–ఆర్ఎల్డీ కూటమి తన అస్త్రంగా మలుచుకుంటోంది. రైతులపై నమోదు చేసిన కేసులు, చనిపోయిన వారికి పరిహారం ఇవ్వకపోవడంపై ప్రశ్నలు సంధిస్తోంది. తాము అధికారంలోకి వస్తే 15 రోజుల్లో కేసులను మాఫీ చేయడంతోపాటు చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీనికితోడు చెరకు రైతులకు బకాయిల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, బీమా సౌకర్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇందులో ఎవరి హామీలు, ఎవరి మాటలను రైతులు నమ్ముతారన్నది బ్యాలెట్ తేల్చనుంది. బీజేపీకి కంట్లో నలుసుగా.. అధికార బీజేపీకి రైతు సంఘాల ప్రతినిధులు కంట్లో నలుసులా తయారయ్యారు. పంటలకు కనీస మద్దతు ధరపై తాజా కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడం, రైతు నేతలపై కేసుల ఉపసంహరణకు సంబంధించి నాన్చుడు ధోరణితో విసుగు చెందిన రైతు సంఘాల నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ధోరణి ఇక చెల్లదని, హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని విభజించి ఓట్లు కొల్లగొట్టే రాజకీయాలు పనిచేయవని రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించే వారికే ప్రజలు పట్టం కడతారని తేల్చిచెప్పారు. ’మిషన్ యూపీ’ ద్వారా రైతు వ్యతిరేక పాలనకు గుణపాఠం చెబుతామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఇటీవల వెల్లడించారు. ఈ ప్రకటనలు ఎంతమేర ప్రభావం చూపుతాయన్న దానిపై రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. – సాక్షి, న్యూఢిల్లీ -
నామినేషన్ దాఖలు చేసేందుకు పరుగులు పెట్టిన యూపీ క్రీడా మంత్రి
యూపీ క్రీడా మంత్రి ఫెఫ్నా నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి పరుగులు పెడుతు వెళ్తున్నట్లు కనపించారు. అయినా ఫిబ్రవరి 11 చివరితేది అయినప్పటికీ యూపీ క్రీడా మంత్రి ఉపేంద్ర తివారి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గడవు కావలని అడిగేందుకు పరుపరుగున బల్లియా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. భారతీయ జనతాపార్టీ(బీజేపీ) తివారీని ఫెఫ్నా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిగా ప్రకటించింది. ఉత్తరప్రేదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు చేయడానికి ఒకరోజు గడువు ముగియడంతో క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ పరుపరుగున బల్లియా కలెక్టరేట్ కార్యాలయానికి దూసుకుపోయారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పైగా ఆ వీడియోలో కాషాయారంగు తలపాగ పార్టీ కండువ, దండ ధరించి పరుగుపరుగున వెళ్తున్నట్లు కనిపించారు. #WATCH | UP Sports Minister Upendra Tiwari sprinted to Collectorate Office in Ballia y'day as he was running late to file his nomination. Y'day nominations were scheduled to be filed by 3 pm & the minister was running late, nomination process still ongoing#UttarPradeshElections pic.twitter.com/99HSIPHwoA — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 5, 2022 (చదవండి: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పై నెలకొన్న ఉత్కంఠ!) -
యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తనకు కోటిన్నర విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తన దగ్గర రివాల్వర్, రైఫిల్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ ఉన్నట్టు వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్లో రూ.1,54,94,054 ఆస్తులను ప్రకటించారు. ఇందులో చేతిలో నగదు, ఆరు బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్, సేవింగ్స్ ఉన్నాయి. తన వద్ద రూ. 12,000 విలువైన సామ్సంగ్ మొబైల్ ఫోన్, రూ. 1,00,000 విలువైన రివాల్వర్, రూ. 80,000 విలువైన రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. తన పేరు మీద వ్యవసాయ, వ్యవసాయేతర భూములు లేవన్నారు. అలాగే సొంత వాహనం కూడా లేదని వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ వద్ద రూ.49,000 విలువైన 20 గ్రాముల బంగారు చెవి రింగు, రూ.20,000 విలువైన 10 గ్రాముల బంగారు గొలుసు, రుద్రాక్ష హారం ఉన్నాయి. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. (చదవండి: పదేళ్లు కావొస్తున్నా.. మానని గాయం!) 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,20,653 ఆదాయం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,68,799 ఆదాయం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,27,639 ఆదాయం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,38,670 ఆదాయాన్ని ఆయన ప్రకటించారు. (క్లిక్: ఆయనే బలం, ఆయనే బలహీనత.. ఉప‘యోగి’కి పరీక్ష!) -
‘జెడ్’ భద్రత వద్దన్న ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పెరిగిపోతున్న రాడికలిజానికి ముగింపు పలకాలన్నారు. తనపై జరిగిన బుల్లెట్ దాడికి యూపీ ఓట్లరు బ్యాలెట్‌తో బదులిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ‘‘నాకు జెడ్ కేటగిరీ రక్షణ వద్దు. మీ అందరితో సమానంగా ఎ కేటగిరీ పౌరునిగా బతికే అవకాశం కల్పిస్తే చాలు. రెండుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ అయిన నాపై కేవలం ఆరడుగుల దూరం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. నేను పుట్టింది ఈ భూమ్మీదే. చచ్చినా ఔరంగాబాద్ గడ్డ మీదే పూడుస్తారు. కాల్పులకు భయపడను. బుల్లెట్ తాకినా ఇబ్బంది లేదు గానీ ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు. స్వతంత్రుడిగా బతకాలనుకుంటున్నా. నేను బతకాలంటే నా మాట బయటకు రావాల్సిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. దేశంలోని మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాలకు భద్రత లభిస్తే నాకు లభించినట్లే’’ అన్నారు. దేశ ప్రధాని భద్రతలో వైఫల్యం తలెత్తినప్పుడు ఇతర విపక్షాల కంటే ముందు తానే దాన్ని తప్పుపట్టానని గుర్తు చేశారు.‘‘నాపై దాడి చేసిన వారికి బుల్లెట్‌పైనే తప్ప ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదు. ఫేస్బుక్లో ఎవరైనా ఒక క్రికెట్ జట్టును అభినందిస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (యూఏపీఏ) ప్రయోగిస్తున్నారు. నాపై దాడి చేసిన వారిపై ఎందుకు ప్రయోగించరు? తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఎందుకు ప్రయోగించరు’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీని ఇప్పటికే అసద్ కోరారు. గురువారం ఉత్తర యూపీలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఒవైసీ కారుపై కాల్పులు జరగడం తెలిసిందే. ‘‘ఈ నేపథ్యంలోనే ఒవైసీకి ఉన్న ముప్పు స్థాయిని పునఃసమీక్షించి, జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించాం. సీఆర్పీఎఫ్ అధికారులు ఒవైసీ నివాసానికి వెళ్లి ఈ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేస్తారు’’ అని కేంద్ర హోం శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇద్దరి అరెస్టు ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గౌతంబుద్ధ నగర్‌కు చెందిన సచిన్‌గా, మరొకరిని సహరన్‌పూర్‌కు చెందిన శుభంగా గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఒవైసీ, ఆయన పార్టీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కోపంతోనే దాడికి పాల్పడ్డట్టు విచారణలో వారు చెప్పారన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వీరిని పట్టుకున్నాం. ఒక మారుతి ఆల్టో కారు, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నాం. పలు పోలీసు బృందాలు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి’’ అని వివరించారు. కాల్పులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ప్రకటన చేస్తారని మరో మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అసద్‌పై కాల్పులను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపందల మతిలేని చర్య. అసద్ భాయ్! మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం’’ అని ట్వీట్ చేశారు. జెడ్ కేటగిరీ అంటే... ► ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీని పక్కన పెడితే జెడ్ ప్లస్ తర్వాత మన దేశంలో రెండో అత్యున్నత స్థాయి భద్రత జెడ్ కేటగిరీ ► అధిక ముప్పున్న నాయకులు, ప్రముఖులకు కేంద్రం ఈ భద్రత కల్పిస్తుంది ► సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటల పాటూ రక్షణగా ఉంటారు ► 16 నుంచి 22 మంది షిఫ్టుల్లో పని చేస్తారు ► రోడ్డు ప్రయాణాల్లో ఒక ఎస్కార్ట్, మరో పైలట్ వాహనం సమకూరుస్తారు ► ఈ భద్రతకు నెలకు రూ.16 లక్షలకు పైగా ఖర్చవుతుంది చదవండి: ఒవైసీపై దాడి.. కేంద్రం కీలక నిర్ణయం చదవండి: (అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు) -
ఆసక్తికర దృశ్యం: సలాం.. రామ్ రామ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పరస్పర అభివాద సన్నివేశం గురువారం ఆవిష్కృతమైంది. బులంద్‌శహర్‌లో జయంత్ చౌదరితో కలిసి అఖిలేశ్ ప్రచారం నిర్వహిస్తుండగా... ప్రియాంక కూడా తన వాహనశ్రేణితో అటువైపు వచ్చారు. దీంతో ముగ్గురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అక్కడే ఉన్న సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో ఈలలు వేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోను అఖిలేశ్.. వీడియోను ప్రియాంక ట్విటర్లో షేర్ చేశారు. एक दुआ-सलाम ~ तहज़ीब के नाम pic.twitter.com/dutvvEkz5W — Akhilesh Yadav (@yadavakhilesh) February 3, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)తో కలిసి సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దిగింది. అధికార బీజేపీకి, ఈ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మొత్తం తన భుజాన వేసుకుని ప్రియాంక గాంధీ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్, ప్రియాంక ప్రధానంగా బీజేపీ లక్ష్యంగా చేసుకున్నారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) हमारी भी आपको राम राम @jayantrld @yadavakhilesh pic.twitter.com/RyUmXS4Z8B — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 3, 2022 అయితే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఏడింటిని మాత్రమే గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లతో సరిపెట్టుకుంది. 2012లో అఖిలేశ్ పార్టీ 224 సీట్లు సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని అఖిలేశ్ యాదవ్ ముందుగానే ప్రకటించారు. (క్లిక్: ఉత్తరప్రదేశ్‌లో తరతరాలుగా వీరిదే అధికారం!) -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా సమక్షంలో సీఎం యోగి నామినేషన్
UP Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కీలక నేతల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే.. గతంలో ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా పని చేసిన యోగి.. ఎమ్మెల్సీ కోటాలో యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే ముందు గోరఖ్‌నాథ్ టెంపుల్లో పూజల్లో పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో మంత్రి అమిత షా ర్యాలీ నిర్వహించారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో ముఠాలను యోగి తుడిచిపెట్టారని గర్వంగా చెప్తున్నా. పాతికేళ్ల తర్వాత యూపీలో న్యాయబద్ధంగా పాలన నడుస్తోంది. యోగి నాయకత్వంలో యూపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ’ అని షా అన్నారు. #WATCH | Accompanied by Union Home Minister Amit Shah, Uttar Pradesh CM Yogi Adityanath files nomination papers as a BJP candidate from Gorakhpur Urban Assembly constituency pic.twitter.com/BYzpDtVmlS — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 4, 2022 -
అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం!
ఘజియాబాద్: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. తనను లక్ష్యంగా చేసుకొని సాగించిన కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ చెప్పారు. కాల్పుల వ్యవహారంపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని హపూర్ పోలీసులు తెలిపారు. మీరట్ జోన్ ఐజీ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. యూపీలో మరో వారం రోజుల్లో మొదటి దశ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఒవైసీపై హత్యాయత్నం చోటుచేసుకోవడం సంచలనాత్మకంగా మారింది. కాల్పుల వెనుక ఎవరున్నారో తెలియాలి ఎన్నికల ప్రచారం కోసం అసదుద్దీన్ ఒవైసీ గురువారం ఉదయమే ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. మీరట్, కిఠోరిలో తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కాన్వాయ్‌లో నాలుగు కార్లు ఉన్నాయి. ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఛిజార్సీ టోల్గేట్ వద్ద తన కారుపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ముగ్గురు నలుగురు పాల్గొన్నారని అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ఆయుధాలు అక్కడే వదిలేసి పారిపోయారని తెలిపారు. తన కారు టైర్ పంక్చర్ కావడంతో మరో వాహనంలో వెళ్లిపోయానని చెప్పారు. తామంతా క్షేమంగా ఉన్నామని, అల్లాకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. టోల్గేట్ వద్ద కారు వేగం తగ్గిందని, అకస్మాత్తుగా మూడు నాలుగు రౌండ్లు తుపాకీ మోతలు వినిపించాయని ఒవైసీ మీడియాతో చెప్పారు. టైర్ పంక్చర్ కావడంతోపాటు కారుపై బల్లెట్ గుర్తులు కనిపించాయన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారో కచ్చితంగా తెలియాలని అన్నారు. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీతోపాటు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. మరో దుండగుడి కోసం గాలింపు కాల్పులపై ఒవైసీ ట్వీట్ చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, విచారణ ప్రారంభించారని అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారని చెప్పారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని సేకరించారని, ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అందులో కనిపిస్తోందని వివరించారు. వారిని ఒకరిని గౌతమ్‌బుద్ధనగర్ జిల్లా బాదల్పూర్ వాసి సచిన్‌గా గుర్తించి, అరెస్టు చేశామని తెలిపారు. అతడి వద్ద చట్టవిరుద్ధంగా ఉన్న పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాల్పుల వెనుక గల అసలు కారణాలను శోధిస్తున్నామని ఉద్ఘాటించారు. కాల్పుల్లో పాల్గొన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కా ల్పుల సమాచారం తెలియగానే ఎంఐఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉలిక్కిపడ్డ హైదరాబాద్ పాతబస్తీ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరగడంతో హైదరాబాద్ పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల గురించి ప్రచార, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం కావడంతో కలకలం రేగింది. ఆందోళనకు గురైన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమాచారం తెలుసుకునేందుకు దారుస్సలాంకు పరుగులు తీశారు. కారుపై బుల్లెట్ల గుర్తులు ‘బీజేపీని శిక్షించండి’ న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి గుణపాఠం చెప్పాల్సిందిగా ఆ రాష్త్ర రైతులకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) గురువారం పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు 57 రైతు సంఘాలు కూడా మద్దతిచ్చాయి. రైతుల డిమాండ్లను పట్టించుకోకపోవడం ద్వారా వారికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ దుయ్యబట్టారు. అయితే ఫలానా పార్టీకి ఓటెయ్యాలని చెప్పడం మోర్చా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మా పాలనలో మతకలహాల్లేవు! లక్నో: తమ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఉత్తరప్రదేశ్‌లో ఒక్కమారు కూడా మత ఘర్షణలు జరగలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. గత ప్రభుత్వాల హయంలో భారీగా మతకలహాలు జరిగేవని సమాజ్‌వాదీపై విమర్శలు గుప్పించారు. బీఎస్పీ హయాంలో 364, ఎస్పీ హయంలో 700 మత ఘర్షణలు జరిగాయని, వీటిలో వందలమంది మరణించారని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోందన్నారు. कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih — Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022 చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..) -
నోటాకే ఓటన్న లఖీంపూర్ రైతులు
లఖీంపూర్‌ఖేరీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు ఓటేస్తామని లఖీంపూర్ ఖేరీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీలు తమను మోసం చేశాయని, ఇతర పార్టీలు నిష్ఫలమైనవని రైతులు వాపోయారు. రైతు చట్టాలు తదుపరి హింసకు బీజేపీ కారణమని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగని తమకు గతంలో రుణమాఫీ చేసిన సమాజ్‌వాదీని కూడా ఆదరించాలనుకోవడం లేదు. తమ ఫిర్యాదుల పరిష్కారానికి ఏ పార్టీ నిజాయితీగా యత్నించలేదని, అందువల్ల నోటాకు ఓటేస్తామని పలువురు రైతులు మీడియాకు తెలిపారు. ఎస్పీ హయాంలో బీజేపీ పాలనలో కన్నా దారుణంగా రైతుల పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎస్పీ కూటమి, బీజేపీ ఇప్పటికీ రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ తమకు రావాల్సిన పంచదార మిల్లుల బకాయిలు అం దలేదని బాధను వ్యక్తం చేశారు. దీంతో కుటుంబాలు గడవడం కూడా కష్టంగా ఉందన్నారు. ఇతర పార్టీలు సానుభూతి మాటలు చెప్పడం మినహా ఏమీ చేయలేదని వాపోయారు. -
Ground Report: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పరిస్థితి ఏమిటి?
కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: గౌతమబుద్ధనగర్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు ఓటు బ్యాంక్‌లో తేడాలు వస్తే లాభపడేదెవరు? నష్టపోయేదెవరు? ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన పశ్చిమ ప్రాంతంపైనే ఈసారి అన్ని పార్టీల గురి... మతకల్లోలాలు, ఉద్రిక్తతలే ఆసరాగా ఆ ప్రాంతంలో ఓటు బ్యాంకు పెంచుకున్న కమలనాథులు హిందువులతో పాటు ఓబీసీలు, దళితులు కూడా బీజేపీ వైపు మళ్లించుకొని 2017లో అధికారపీఠాన్ని అందుకున్నారు. ఈసారి బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం.. క్షేత్రస్థాయిలో బీజేపీ వ్యూహాలు ఫలించడం లేదనే అభిప్రాయం హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య వాతావరణం... దారి చూపిన రైతు పోరుబాట ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి గణనీయంగా ఓట్ల బదిలీ జరుగుతుందంటున్న విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఇక్కడ నామమాత్రమే.. ఈ నేపథ్యంలో యూపీకి దిక్సూచిగా నిలిచే పశ్చిమాన ఎవరికి మెజారిటీ వస్తే... వారికే లక్నో పీఠం దక్కేది! ఉత్తరప్రదేశ్‌లో పార్టీల గెలుపోటములను నిర్ణయించే జాట్లు, ముస్లింలు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గడచిన శాననసభ ఎన్నికల్లో మెజారిటీ జాట్ కులస్తులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు పలికారు. ముస్లింల ఓట్లను సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పంచుకున్నాయి. మొదటి రెండు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో జాట్లు, ముస్లింలదే నిర్ణయాత్మక పాత్ర. గడచిన ఎన్నికల్లో 50 శాతంకు పైగా జాట్లు బీజేపీకి మద్దతు పలికితే, మిగిలిన 50 శాతం ఓట్లు అన్ని పార్టీలు పంచుకున్నాయి. ఇక ముస్లిం ఓటర్లలో 60 శాతం మంది ఎస్పీకి, 30 శాతం మంది బీఎస్పీకి ఓటేయగా మిగిలిన 10 శాతం మంది ఇతర పార్టీలకు మద్దతు పలికారు. జరగబోయే ఎన్నికల్లో ఈ పరిస్థితి తారుమారవుతుందని ప్రముఖ సర్వే సంస్థలతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఓట్లేసిన జాట్లలో 25 శాతం మంది ఈసారి ఓటేయకపోతే బీజేపీకి మొత్తం ఐదు శాతం మేర ఓట్లు తగ్గుతాయి. గతంలో బీఎప్పీకి ఓట్లేసిన ముస్లింలలో 15 శాతం మంది ఈసారి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ మేరకు ఆ ఓట్లు ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమికి బదిలీ అయితే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనపడుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెండు విశ్లేషణలను పరిశీలిస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాంప్రదాయ ఓటుకు ఈ ఎన్నికలలో గండి పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుల మతాలతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులు ఆ పార్టీకి దూరమైన కారణంగా ఈసారి గడ్డు పరిస్థితి ఎదుర్కోనున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ యూపీలో ఎస్పీ, బీఎస్పీల కంటే బీజేపీ సాంప్రదాయ ఓటు ఎక్కువ. 1991 నుంచి గణాంకాలను పరిశీలిస్తే బీజేపీకి సగటున 34, ఎస్పీకి 29, బీఎస్పీకి 21 శాతం ఓట్లు లభిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయే 42.6 శాతం ఓట్లతో ఏకంగా 71 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడానికి పశ్చిమ ఉత్తరప్రదేశ్ దీనికి గణనీయంగా దోహదపడింది. ఆగ్రా, అలీఘర్, మీరట్, ముజఫర్‌నగర్, ఫిరోజాబాద్, ఘజియాబాద్, మీరట్ తదితర ప్రాంతాల్లోని 20 లోక్‌సభ స్థానాలు కమలదళం గెలుచుకుంది. గడచిన శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈ ప్రాంతంలో 83 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి పరిస్థితి ఏమిటి? మొదటి రెండు దశల్లోనే పశ్చిమ యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి ఇక్కడ మొత్తం ఉన్నవి 78 సీట్లే. అయితే తొలి రెండు విడతల్లో కలిపితే... 113 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల విజయంపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న బిజ్నౌర్ ప్రాంతంతో కలుపుకుంటే మొత్తం 113 స్థానాలకు గాను 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 91 చోట్ల బీజేపీ, 17 స్థానాల్లో ఎస్పీ విజయం సాధింంచగా, బీఎస్పీ, కాంగ్రెస్‌లు రెండు స్థానాల చొప్పున, ఆర్ఎల్డీ ఒక చోట గెలుపొందాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి 5, బీఎస్పీ నుంచి 10 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే జరిగితే పశ్చిమ యుపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి 60 నుంచి 70 శాతం సీట్లు సాధించే అవకాశం ఉన్నదని సీఎస్డీఎస్ సర్వే నిపుణుడు ప్రభాత్ కుమార్ అంచనా వేశారు. (క్లిక్: టెన్షన్.. టెన్షన్..! పశ్చిమ యూపీలో ఒక్కో ఓటుకై పార్టీల ఆరాటం) గత ఎన్నికల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన 50 శాతం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. మిగిలిన 50 శాతం మంది జాట్లు అన్ని పార్టీలకు మద్దతిచ్చారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కారణంగా 25 శాతం మంది జాట్లు బీజేపీకి దూరమైనా ఆ పార్టీ ఓటు బ్యాంకులో కనీసం 5 శాతం ఓట్లు ఎస్పీ కూటమికి బదిలీ అవుతాయి. అదే జరిగితే కనీసం 25 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అక్కడ కోల్పోనుంది. అదే సమయంలో ఎస్పీ కూటమికి 29 సీట్లు పెరగనున్నాయి. ఇక, బీఎస్పీ ఓటు బ్యాంకుగా చెప్పుకునే 21 శాతం ఓట్లలో బీజేపీ, ఎస్పీ కూటమికి ఎంత బదిలీ అవుతుందన్నది కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. బీఎస్పీ ఓటు బ్యాంకు 5–10 శాతం ఎస్పీ కూటమికి బదిలీ అవుతుందనే అంచనా మేరకు ఎస్పీ కూటమి భారీగా లాభపడనుందని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. ఇక, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ పేరిట కూడా అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఇవి కూడా యోగి నేతృత్వంలోని బీజేపీ, అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ కూటముల మధ్య పెద్ద అంతరం లేదని, ఈసారి తీవ్ర పోటీ తప్పదని అంచనా వేస్తున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య లాంటి కీలక ఓబీసీ నేతల రాక కూడా సమాజ్‌వాదీ శిబిరానికి అదనపు బలం కానుంది. రైతాంగ పోరాటంతో ఏకతాటిపైకి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు జరిగిన రైతాంగ ఉద్యమం బీజేపీ రాజకీయ వ్యూహాలను కుదిపేస్తోంది. కుల, మతాలలో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకు చెందిన రైతులను ఈ ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ‘హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని కూడా ఈ ఉద్యమం తీసుకు రాగలిగింది’ అని మీరట్ కు చెందిన హిందూ–ముస్లిం సమభావన సమితి కార్యదర్శి మహమ్మద్ అలియా భట్ అన్నారు. దీనికి తోడు పశ్చిమ యూపీలో శాంతియుత వాతావరణం కోసం ఆర్ ఎల్డీ నిర్వహించే ‘భాయ్ చరా’ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ పార్టీ అధినేత దివంగత అజిత్ సింగ్ ఇలాంటి సమావేశాలు ఎన్నో నిర్వహించారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణానంతరం సమాజ్ వాదీ నాయకురాలు తబస్సుమ్ బేగంను ఆర్ఎల్డీ అభ్యర్థిగా కైరానా లోక్ సభ నుంచి బరిలో దింపి విజయ తీరాన్ని చేర్చింది కూడా ఈ సమావేశాలతోనే. అజిత్ సింగ్ మరణానంతరం ఆయన కుమారుడు జయంత్ కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) హిందూ ఓటు బ్యాంక్ తమదేనన్న ధీమా! కానీ, కమలదళం మాత్రం హిందువుల ఓటు బ్యాంకు తమదేనన్న ధీమాతో ఉంది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూనే ఆ చట్టాలు రద్దు చేసినందున వ్యతిరేకత తగ్గిపోయిందని ప్రచారం చేస్తోంది. యుపీలో రైతాంగానికి 50 శాతం విద్యుత్ బిల్లుల తగ్గింపు తమకు మేలు చేస్తుందని, ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంటామని కేంద్ర మంత్రి సంజీవ్ ధీమా వ్యక్తం చేశారు. ముజఫర్ నగర్లో ప్రచారం చేస్తున్న ఆయన సాక్షి ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని నీటి బుడగగా అభివర్ణించారు. అంతే కాదు బీజేపీ ఈసారి కూడా హిందూ ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే వ్యూహానికే పదును పెడుతోంది. అందులో భాగంగానే కైరానా నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా ’పలాయన్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ముజఫర్ నగర్ ఘర్షణల్లో వలస వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబాలను కలిసి పరామర్శించారు. అంతే కాదు యోగి పాలనలో శాంతి భద్రతలు మెరుగు పడినందునే ఈ ప్రాంత ప్రజలు శాంతి యుతంగా జీవించగలుగుతున్నారని కితాబునిచ్చారు కూడా. అయితే, ఈ కితాబులు, కమల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి..? గత రెండు, మూడు ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలుస్తున్న పశ్చిమ యూపీ గ్రామీణ, సెమీ అర్బన్ ఓటరు ఈసారి ఏం చేస్తాడు? కమల వికాసానికి తోడ్పడుతాడా? ఏనుగు దిగి, హ్యాండిచ్చి మరీ సైకిల్ ఎక్కుతాడా? ముజఫర్‌నగర్ నుంచి మీరట్ వరకు ఓటరన్న ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతాడన్నది ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు దేశ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) క్షేత్రస్థాయిలో పని చేయని బీజేపీ వ్యూహాలు ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నట్టు కనిపించడం లేదు. విభజన రాజకీయాలను తాము గ్రహించగలిగామని, మళ్లీ ఆ ఉచ్చులో పడబోమనే నినాదం ఇక్కడి స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఈ అంశంలో తమ పాచికలు పారడం లేదని గ్రహించిన కేంద్ర మంత్రి, కైరానా ఎంపీ సంజీవ్ బలియాన్ ఇప్పుడు ముస్లిం సానుభూతిపరుడిగా మారిపోయారు. ముజఫర్ నగర్ లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క చోట కూడా ఎస్పీ, ఆర్ఎల్డీలు ముస్లిం అభ్యర్థులను ఎందుకు నిలబెట్టడం లేదంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ రాజకీయ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు స్థానిక ముస్లింలు సహన పరీక్ష ఎదుర్కొనవలసి వస్తోందని ఇమామ్‌ల సంఘం నేతలంటున్నారంటే పశ్చిమ యూపీలో మారిన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. రైతు ఉద్యమకారుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఏర్పాటు చేసిన బీకేయూ కూడా మత సామరస్యం కోసం పని చేస్తూ గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చింది. ‘ఈసారి గతంలో మాదిరి తప్పులు చేయం. మా భవిష్యత్ ఏమిటో మాకు తెలిసివచ్చింది’ అని మహేంద్ర సింగ్ కుమారులు రాకేశ్, నరేశ్ తికాయత్‌లు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. (క్లిక్: యోగీకి కలిసొచ్చే, సవాల్ విసిరే అంశాలివే!) -
ఏకంగా పది సార్లు.. 20 ఏళ్లుగా చెరగని మాజీ సీఎం రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిసారి ఎన్నికల్లో ‘తొలి’సారి ఎమ్మెల్యేలు అధికంగా ఉంటారు. గడిచిన నాలుగు ఎన్నికలు పరిశీలిస్తే 2017లో అత్యధికంగా మూడింట రెండొంతులు అంటే 403 మందికి 239 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నాలుగైదు దశాబ్దాల ఎన్నికల్లో తొలి గళం అధికంగా వినిపించింది 2017 నాటి 17వ అసెంబ్లీ ఫలితాల్లోనే. ప్రస్తుత ఎన్నికల్లో అతిపెద్ద మల్లయోధుడు ఆజంఖాన్ రాంపూర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. పదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఆజంఖాన్ యత్నిస్తున్నారు. తొమ్మిదోసారి అడుగుపెట్టే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో సురేశ్‌కుమార్ ఖన్నా(బీజేపీ) షాజహన్‌పూర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. రామ్ గోవింద్ చౌదరి కూడా ఎస్పీ తరఫున బల్లియా పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇక బీజేపీ, టీఎంసీ, బీఎస్పీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్యామ సుందర్ శర్మ ఈసారి బీఎస్పీ నుంచి బరిలో దిగనున్నారు. అఖిలేశ్ సర్కారులో మంత్రిగా పనిచేసిన దుర్గా ప్రసాద్ యాదవ్ కూడా తొమ్మిదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ మహానా, రాంపాల్ వర్మ, రమాపతి శాస్త్రి, జయ ప్రతాప్‌సింగ్ (బీజేపీ) ఎనిమిదో సారి గెలుపుకోసం యత్నిస్తున్నారు. రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఏడోసారి కుండా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఫతే బహదూర్ (బీజేపీ) ఆరుసార్లు గెలిచి కేంపియర్‌గంజ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అజయ్ ప్రతాప్ సింగ్ (బీజేపీ) కర్నల్ గంజ్ నుంచి, నరేంద్రసింగ్ వర్మ (ఎస్పీ) మహమ్మదాబాద్ నుంచి ఇక్బాల్ మహమ్మద్ (ఎస్పీ) సంబల్ నుంచి ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. (క్లిక్: సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?) 20 ఏళ్లుగా చెరగని రికార్డు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్ పదిసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రికార్డు రెండు దశాబ్దాలుగా చెరగని రికార్డుగా ఉంది. తొలిసారి జనసంఘ్ నుంచి 1967లో ఎన్నికైన కల్యాణ్ సింగ్ 2002లో రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున పదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ గెలిస్తే ఈ రికార్డును సమయం చేసే అవకాశం ఉంది. 1967లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. (చదవండి: యూపీలో పోలింగ్‌కు... ఇస్లామాబాద్ సిద్ధం!) -
యూపీలో పోలింగ్‌కు... ఇస్లామాబాద్ సిద్ధం!
ఇదెక్కడి చోద్యం... పాకిస్తాన్ రాజధాని వాసులకు ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికలతోసంబంధమేమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరునుకుంటున్నట్లు ఇది పాక్‌లోని ఇస్లామాబాద్ కాదు. యూపీలోని జిల్లా కేంద్రమైన బిజ్నౌర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేజర్ గ్రామపంచాయతీ. జనాభా వదివేలు. ఓటర్లు దాదాపు 4,700 మంది ఉంటారు. ‘పేరులో నేముంది’.. మాకున్న సమస్యల్లా ఇరుకురోడ్లు మెరుగుపడాలి, అభివృద్ధి జరగాలి... ఇవి చేసే అభ్యర్థికే మా ఓటు అంటున్నారు ఇస్లామాబాద్ గ్రామ పెద్ద విజేంద్ర సింగ్. ఇస్లామాబాద్ పేరుండటం మూలంగా మీలో అభద్రతాభావం లాంటిది తలెత్తదా? అని అడిగినపుడు... అసలు మాకు అది శత్రుదేశపు రాజధాని పేరు అనేదే గుర్తుకురాదు. గ్రామంలో ప్రధానంగా చౌహాన్లు, ప్రజాపతి సామాజికవర్గాల జనాభా అధికమని, 400 మంది దాకా ముస్లింలు కూడా ఉంటారని... అంతా కలిపిమెలిసి ఉంటామని చెప్పుకొచ్చారు విజేంద్ర సింగ్. (చదవండి: ప్రతిష్టాత్మక పోరు: ‘కైరానా’ మే హైరానా!) -
ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం!
లక్నో: ఐదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌ను మాఫియా, అల్లరి మూకలు పాలించేవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో బాఘ్‌పత్, షమ్లీ, గౌతమ్ బుద్ధనగర్, ముజఫర్‌నగర్, శరణ్‌పూర్ జిల్లాల్లోని 21 అసెంబ్లీ స్థానాల ర్యాలీల నుద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు దోపిడీకి గురయ్యారని, ఆడపిల్లలు ఇళ్లు దాటే పరిస్థితి లేకపోయిందన్నారు. ప్రభుత్వ అండదండలతో మాఫియా స్వేచ్ఛగా తిరిగేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై ప్రధాని మాటల దాడి చేశారు. మూఢ నమ్మకాలతో అఖిలేశ్ యువత కలల ప్రపంచమైన నోయిడాకు రాలేదని, అలాంటి మూఢ నమ్మకాలున్న వ్యక్తి యువతకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నించారు. మన దేశం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌పై భరోసా ఉంచని వారు, పుకార్లకు ప్రాధాన్యమిచ్చినవారు ఉత్తరప్రదేశ్యువత ప్రతిభను, ఆవిష్కరణలను ఎలా గౌరవిస్తారని ప్రధాని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ యూపీ మార్పును కోరుకుంటుందని, కానీ ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని, వాళ్లు టికెట్ ఇచ్చిన వారిని చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. ప్రతీకారమే వారి సిద్ధాంతమని, అలాంటి వారి పట్ల యూపీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం తనకు ఆనందం కలిగిస్తోందని మోదీ తెలిపారు. కృష్ణుడు తన కలలోకి వస్తాడన్న అఖిలేశ్ మాటలనుద్దేశించి ప్రస్తావిస్తూ... ఆయన నిద్రపోయి కలలు కంటూనే ఉంటారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం యూపీ అభివృద్ధికోసం నిరంతరం పనిచేస్తారని అన్నారు. బీజేపీలోకి నిదా ఖాన్, గంగారామ్ అంబేడ్కర్ మహిళా హక్కుల ఉద్యమకారిణి నిదా ఖాన్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఓఎస్డీగా పనిచేసిన గంగారామ్ అంబేడ్కర్ భారతీయ జనతాపార్టీలో చేరారు. చేరికల కమిటీ నాయకుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయ్ ఆధ్వర్యంలో సోమవారం వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాజ్‌పేయ్ మాట్లాడుతూ... ఇక అల్లరి మూకల రాజ్యం చెల్లదని, ప్రజలంతా నిర్భయంగా జీవించే యోగి ఆదిత్యనాథ్ పరిపాలన నడుస్తోందని అన్నారు. -
ప్రతిష్టాత్మక పోరు: ‘కైరానా’ మే హైరానా!
యూపీలో హాట్ సీట్లలో ఒకటైన కైరానాలో నాలుగు దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న పోరు ప్రస్తుత ఎన్నికల్లోనూ ప్రతిష్టాత్మకంగా మారింది. సమాజ్‌వాదీ తరపున పోటీ చేస్తున్న నహిద్ హసన్, బీజేపీ తరపున పోటీ చేస్తున్న మృగాంక సింగ్‌ల మధ్యే ఈ ఎన్నికల్లోనూ గట్టి పోరు జరుగనుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నహిద్ హసన్ గెలుపొందగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుకుంసింగ్ కుటుంబాన్ని పక్కనబెట్టిన బీజేపీ, ప్రదీప్ చౌదరిని నిలబెట్టి గెలిపించుకుంది. అయితే ఈసారి తొలిదశలో ఫిబ్రవరి 10న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మృగాంకను బరిలో నిలిపిన కమలదళ పెద్దలు, తమ సత్తా చాటేందుకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే రంగంలోకి దిగారు. – సాక్షి, న్యూఢిల్లీ వలసలు, శాంతిభద్రతల సమస్యలపైనే నజర్ 2017లో వలసల సమస్యతో పాటు శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ఎస్పీ ప్రభుత్వాన్ని కమలదళం చుట్టుముట్టింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా చేసుకొని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, కైరానాలో ప్రజలు మాత్రం ఎస్పీ అభ్యర్థి నహిద్ హసన్ వైపే మొగ్గు చూపారు. అయితే గతంలో మాదిరిగానే వలసలు, శాంతిభద్రతల అంశాలను బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. అందుకే కైరానాలో బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంటింటికీ వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వలస బాధితులను కూడా కలిశారు. గతేడాది నవంబర్లోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వలస బాధితులను కలిశారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కైరానా వలసల అంశాన్ని లేవనెత్తిన బీజేపీకి మాత్రం కైరానాలోనే ఎదురుదెబ్బ తగిలింది. కాగా బీజేపీ లేవనెత్తిన ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు ఎస్పీ కూటమి పరస్పర సోదరభావ అంశంతో పాటు నహిద్ హసన్‌ను గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అరెస్ట్ చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నహిద్ హసన్ ఎస్పీ టికెట్‌పై అభ్యర్థిగా నామినేషన్ వేసిన మరుసటి రోజే గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో పోలీసులు అరెస్టు చేసి, 14 రోజుల రిమాండ్‌కు పంపారు. దీంతో కైరానాలో అతని తరపున ప్రచార బాధ్యతలను చెల్లెలు ఇక్రా హసన్ నిర్వహిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం కైరానా ప్రాంతంలో సుమారు 120 ఏళ్ళ క్రితం మాజీ ఎంపీ బాబు హుకుం సింగ్, మునవ్వర్ హసన్‌ల పూర్వీకులు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ, అందులో ఒకరు ఇస్లాంను స్వీకరించడంతో మొదలైన వైరం ఇప్పుడు తర్వాత తరానికి చేరింది. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఒక్కొక్కసారి ఒక్కో కుటుంబానిది పైచేయిగా సాగుతోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన మునవ్వర్ హసన్ భార్య తబస్సుమ్ హసన్, హుకుంసింగ్‌ను ఓడించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో హుకుంసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో కైరానా నుంచి ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2014లో జరిగిన ఎమ్మెల్యే ఉపఎన్నికలో మునవ్వర్ కుమారుడు నహిద్ హసన్ సమాజ్‌వాదీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2018లో హుకుంసింగ్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ తరపున పోటీ చేసిన తబస్సుమ్ హసన్ చేతిలో దివంగత హుకుం సింగ్ కుమార్తె మృగాంక సింగ్ ఓడిపోయారు. అంతకు ముందు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మృగాంక సింగ్‌పై నహిద్ హసన్ విజయం సాధించారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుకుంసింగ్ కుటుంబాన్ని పక్కనబెట్టిన బీజేపీ... ప్రదీప్ చౌదరిని బరిలో దింపడంతో తబస్సుమ్ హసన్ మరోసారి పరాజయం పాలయ్యారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) -
అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం
కంచర్ల యాదగిరిరెడ్డి: దాద్రి (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి అన్నయ్యతో అవ్వట్లేదు... అయినా అధికార కేంద్రంగా తానే ఉండాలంటాడు అమ్మ సోనియాకు అనారోగ్యం... ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ.. కొడిగట్టిన దీపంలా మారింది.. ఉత్రరప్రదేశ్లో ఉనికి చాటగలిగితే... రేప్పొద్దున జాతీయ రాజకీయాల్లో ముఖం చెల్లుతుంది... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఏడాదిగా యూపీలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు... కాలానికి తగ్గట్టు తన పద్ధతిని మార్చుకోలేకపోవడమే కాంగ్రెసు పార్టీ బలహీనతగా కనిపిస్తోంది. మరింత అప్రతిష్టను మూగగట్టుకునే దిశగా యూపీలో కాంగ్రెస్ సాగుతోందనే భావన కలుగుతోంది. ప్రజలకు... మరీ ముఖ్యంగా రైతులు, మహిళలు, యువతకు మేలు చేసే విధానాలతో ప్రియాంకా గాంధీ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇచ్చేట్టు కనిపించడం లేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం కనుచూపు మేరలో లేదు. కుటుంబ పార్టీగా ముద్ర వేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రంలో ప్రియాంక తప్ప మరో జనాకర్షక నేత లేడు. పార్టీలో ఎదుగుతున్న నేతలను కాంగ్రెస్ చేజేతులా పోగొట్టుకోవడమే ఈ దుస్థితికి కారణమని మీరట్‌కు చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బదరీనాథ్ మిశ్రా అన్నారు. కాంగ్రెస్ అంటే ఇప్పటికీ ప్రజలకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. కానీ, ఆ పార్టీని నడిపించే సమర్థులు లేకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వైపు చూడాల్సి వచ్చిందంటున్నారు బదరీనాథ్. కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకు సోనియాగాంధీ వారసత్వం, ప్రియాంకా గాంధీ భవిష్యత్ మధ్య ఇక్కడ పోరు సాగుతోంది. గడచిన (2017) ఎన్నికల కంటే కాస్తన్ని ఎక్కువ సీట్లు వచ్చి నా, ఓట్లు కనీసం ఒక్క శాతం పెరిగినా ప్రియాంక గాంధీ నాయకత్వంపై ఎంతో కొంత నమ్మకం పెరుగుతుంది. కానీ, విచిత్రంగా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎవరికీ ప్రత్యామ్నాయం కారు. ఈ ఎన్నికల కంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కానీ ఓ పది మంది ఎమ్మెల్యేలనైన గెలిపించుకున్నప్పుడు కదా ఆ పాటి విశ్వాసం వచ్చేదంటున్నారు ముజఫర్ నగర్ కాంగ్రెస్ నేత రాజేశ్వర్ తివారీ. ఏడు పదుల వయసు దాటిన తివారీ జీవితమంతా కాంగ్రెస్‌తోనే సాగింది. కాంగ్రెస్ పరిస్థితి ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదని బాధపడ్డారాయన. కానీ, కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇతర పార్టీల వైపునకు వెడుతుండటాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. (చదవండి: టైమ్ చూసి... హ్యాండిస్తున్నారు..!) ఉదారవాద హిందుత్వపై నమ్మకం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఉత్తరప్రదేశ్! సుమారు 30 ఏళ్లకు పైచిలుకు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసకబారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం ఒక్క సీటుకు పరిమితమైంది. దీంతో పార్టీ కేడర్ కకావికలు అవుతోంది. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తీసుకుంటే 2017 వరకు... మధ్యలో ఒకేఒకసారి కాంగ్రెస్ ఓటు శాతం డబుల్ డిజిట్ (2012లో 11.63 శాతం ఓట్లు, 23 సీట్లు వచ్చాయి. 1996లో వచ్చిన 33 సీట్లే కాంగ్రెస్‌కు ఇప్పటిదాకా యూపీలో వచ్చిన అత్యధిక స్కోరు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక, ఆమె అన్నయ్య రాహుల్ గాంధీ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పట్టాలెక్కించాలని శ్రమిస్తున్నారు. ఉదారవాద హిందుత్వకు వారసులుగా తమను తాము చూపుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వను ఎదుర్కోవాలన్నది ప్రియాంక ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో పాటు రైతు చట్టాలపై నిరసనలు వ్యక్తమైన యూపీలో రైతులను ఒక ప్రత్యేక తరగతిగా భావించి, వారిని మచ్చిక చేసుకోవాలని ప్రియాంక పావులు కదుపుతున్నారు. ఈ కుల, మత, వర్గ సూత్రాలు కాంగ్రెస్‌ను కాపాడతాయా?... అంటే ఉనికి కోసం పోరాడుతున్న పార్టీకి పునర్వైభవం చాలా పెద్ద మాట అవుతుందనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశ ప్రియాంకకు కూడా లేదు. ఇటీవల ఆగ్రాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడిన తీరు ఆమెలో నిరాశకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ పార్టీ పోస్టర్ గర్ల్ ప్రియాంక మౌర్య బీజేపీలో చేరడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయారు. పార్టీ కార్యకర్తల మీటింగుల్లో ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంగ్రెసు పార్టీలో గాంధీ కుటుంబ వారసత్వానికి భవిష్యత్ లేదు. ఇకనైనా నాయకత్వం కళ్లు తెరిచి చూడాలి. లేదంటే తుడిచిపెట్టుకుపోతుంది’ అని గుర్మిత్ సింగ్ పూరి అన్నారు. ఖతులీ శాసనసభ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న గుర్మిత్ గతంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథి పార్లమెంట్ నియోజకవర్గంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. రుద్రాక్ష మాల– సంగమ స్నానం గతేడాది ప్రియాంక డెహ్రాడూన్ వచ్చినప్పుడు చేతిలో రుద్రాక్ష మాలతో కనిపించారు. అనంతరం మాతా శాకంబరీ దేవీ ఆలయంలో పూజలు చేయడం, ప్రయాగ్ రాజ్ వెళ్లి సంగమంలో పుణ్యస్నానం చేయడం జరిగింది. ఇవన్నీ రాష్ట్రంలో ఉదారవాద హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు చేసే యత్నాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అనుసరించే హార్డ్‌కోర్ హిందుత్వను హిందువుల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటివారిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో భాగంగా అటు ప్రియాంక, ఇటు రాహుల్ తమనుతాము ఉదారవాద హిందూవాదులుగా చూపించుకుంటున్నారు. ఉదారవాద హిందుత్వ ప్రియాంక మొదటి సూత్రం. (చదవండి: పీపీఈ కిట్‌లో వచ్చినా ఫలితం దక్కలేదు) -
పీపీఈ కిట్‌లో వచ్చినా ఫలితం దక్కలేదు
షాజహాన్‌పూర్: నగరానికి చెందిన వైద్యరాజ్ కిషన్ సంయుక్త వికాస్ పార్టీ తరఫున షాజహాన్‌పూర్ నియోజకవర్గానికి ఈనెల 25న నామినేషన్ వేశారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? కరోనా వ్యాప్తి నిరోధానికి వాడే పీపీఈ కిట్ తొడుక్కొని, శానిటైజర్ బాటిల్, థర్మల్స్కానర్తో వచ్చి ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. దీంతో కుప్పకూలిన వైద్యరాజ్ ఇది అధికారుల కుట్రని విమర్శించారు. మంత్రి సురేశ్ ఖన్నా సూచనల మేరకే అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని వాపోయారు. అయితే అసంపూర్ణ డాక్యుమెంట్లు సమర్పించినందునే ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ రోజే అడిగిన పత్రాలు ఇస్తానన్నా అధికారులు వినిపించుకోలేదని, మరుసటి రోజు వారు కోరిన పేపర్లను సమర్పించానని వైద్యరాజ్ చెప్పారు. కానీ కావాల్సిన పేపర్లను సమర్పించాలని వైద్యరాజ్కు మూడు నోటీసులు ఇచ్చినా స్పందిచలేదని, అందుకే తిరస్కరించామని అధికారులు వివరించారు. ఇంతవరకు వైద్యరాజ్ 18 ఎన్నికల్లో పోటీచేసి దిగ్విజయంగా డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. వైద్యరాజ్ ఎవరో తనకు తెలియదని, తానెవరి నామినేషన్ తిరస్కరించమని చెప్పలేదని మంత్రి సురేశ్ వివరణ ఇచ్చారు. యోగిపై పోటీకి కూడా నామినేషన్ వేస్తానని వైద్యరాజ్ గతంలో ప్రకటించారు. -
UP Assembly Election 2022: గోవులే గోసపడుతున్నాయ్!
యోగి ఆదిత్యనాథ్ గడచిన ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రశంసించే వారి సంగతి పక్కన పెడితే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆయన విధాన నిర్ణయాలను తప్పు పట్టే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా రైతులు ఆయన ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెరకు రైతులు తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని గగ్గోలు పెడుతుంటే, ప్రభుత్వ గోశాలలకు తరలించిన పశువులు ఎక్కడ పోతున్నాయని రైతులు నిలదీస్తున్నారు. వ్యవసాయానికి పనికిరాని పశువులను కబేళాలకు తరలిస్తున్నారంటూ యోగి ప్రభుత్వం వాటి సంరక్షణకు గోశాలలు ఏర్పాటు చేసింది. తమ వద్ద ఉండి వృద్ధాప్యంలోకి వచ్చిన పశువులను కబేళాలకు తరలించకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గోశాలలు రైతుల నమ్మకాన్ని కోల్పోయాయి. దానికి తోడు తమ పశువులను గోశాలకు అప్పగిస్తే ఒక్కోదానికి రూ.ఐదు వేలు చెల్లించాలి. ఇంతే కాదు అవసరమయ్యే దాణా ఖర్చు భరించాలి. యోగి సర్కార్ ఈ నిబంధన పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మీరట్ సమీపంలోని ఖతూలీ నియోజకవర్గం కేంద్రానికి సమీపంలో ఉన్న భైంసీ గోశాలలో రైతులు అప్పగించిన పశువులు కొద్ది రోజులకే బయటకు వదులుతున్నారు. ‘మా గ్రామం నుంచి గడచిన ఏడాది కాలంలో రమారమి 500 పశువులను అప్పగించాము. మూడు మాసాల తరువాత వెళ్లి చూస్తే 50 కూడా లేవు. మరి మిగిలినవి ఏమయ్యాయని గోశాల నిర్వాహకులను ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా... ప్రభుత్వమే వాటిని కబేళాలకు తరలిస్తోందా?’ అని భైంసీ రైతు బ్రిజ్‌పాల్ సింగ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము దాణాకు డబ్బులు ఇస్తున్నాము. అయినా వాటిని ఎందుకు కాపాడటం లేదు. ఇక గోశాల దేనికి మా దగ్గర డబ్బులు లాగటానికా’ అని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మీరట్, ముజఫర్‌నగర్ డివిజన్లలో పాతిక గోశాలలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో పశువులు రెండు మూడు మాసాలకే మాయమవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోశాల నుంచి బయటకు వచ్చిన పశువులు తమ పంట పొలాలను పాడు చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. గడచిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన ఇక్కడి రైతాంగం ఇప్పుడు సమాజ్‌వాదీ–రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతు ఇస్తామని బహిరంగంగా చెబుతున్నారు. చదవండి: (UP Assembly Election 2022: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) ఫ్యాక్టరీలకు మేలు చేస్తున్న ప్రభుత్వ విధానాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చక్కెర రైతులు ఏకంగా ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో 2.60 లక్షల ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. ముజఫర్ నగర్, మీరట్, భాగ్‌పట్, దాద్రి ప్రాంతాల్లోకి చక్కెర మిల్లులు ఏటా 140 రోజుల పాటు చెరకు క్రషింగ్ చేస్తాయి. సగటున రోజుకు లక్ష టన్నులను ఈ ఫ్యాక్టరీలు క్రష్ చేస్తాయి. ‘ఫ్యాక్టరీల బాగు కోసమే మేము చెరకు పండిస్తున్నామన్నట్టుంది ప్రభుత్వం తీరు. మా బాగోగుల కంటే ఫ్యాక్టరీలకు మేలు చేయడంపైనే పాలకుల దృష్టి ఉంది. క్వింటాల్‌కు రూ. 350 నుంచి రూ.400 పెంచాలన్న మా డిమాండ్‌ను కేంద్రం, రాష్ట్రం రెండూ పట్టించుకోలేదు’ అని భాగ్‌పట్ కు చెందిన రైతు భీరంసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాము ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నామని భీరంసింగ్ చెప్పారు. చెరకు పండించే ప్రాంతాల్లో రైతులు వరుస సమావేశాలు నిర్వహించుకుని బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలన్న తీర్మానాలు చేస్తున్నారు. ఎన్నికలొస్తేనే గుర్తుకొస్తామా! ‘మాకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో బీజేపీకి ఓట్లు వేశాము. ఇప్పుడే మా బాధలను వారు పట్టించుకోవడం లేదు. తీరా ఎన్నికలు వస్తే గానీ అమిత్ షాకు మేము గుర్తుకు రాలేదా? – దాద్రి ప్రాంతానికి చెందిన రైతు నాయకుడు కిషన్ గుజ్జర్ ఉద్యోగావకాశాలు లేక నిస్పృహలో యువత రైతులు మాత్రమే కాదు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది. కొత్తగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కరోనా కారణంగా యూపీలో వందలాదిగా చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాపు 3.25 లక్షల మంది ఉపాధి అవకాశాలకు గండి పడింది. రైల్వే బోర్డు ఉద్యోగాలకు సంబంధించి బిహార్‌లో చెలరేగిన సెగ ఇప్పుడు యూపీకి పాకింది. ఉద్యోగాల కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేసుకున్న యువతకు కాల్ లెటర్లు రావడం లేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఈ ప్రభుత్వంలో ఇలాంటివి తాము ఊహించలేదని మీరట్ నిరుద్యోగ యువజన సమితి నేత దిలీప్ భండారీ అన్నారు. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా వీధుల్లో తిరుగుతున్నారని, ప్రభుత్వానికి తగిన కార్యాచరణ లేకపోవడమే దీనికి కారణమని మండిపడ్డారు. పశ్చిమను ఫాలో అవుతారా? ప్రస్తుతం పశ్చిమలో ఉన్న పరిస్థితులు మొత్తం రాష్ట్రం ఫాలో అవుతుందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ‘కొన్నిసార్లు తీర్పు రాష్ట్రమంతటా ఒకేలా ఉంటుం ది. ఉదాహరణకు 2017 శాసనసభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు సాగడంతో ఓట్ల చీలిక కారణంగా బీజేపీ అన్ని ప్రాంతాల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకుంది. ఈసారి ఓట్ల చీలిక లేకపోతే పోటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉండవచ్చు’ అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ (సీఎస్డీఎస్) ప్రతినిధి ప్రభాత్ కుమార్ అన్నారు. ముస్లింలలో ఓట్లు చీలకూడదనే పట్టుదల గడచిన ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)కి ఓట్లు వేసిన ముస్లింలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ‘మా గమ్యం ఏమిటో మాకు తెలిసి వచ్చింది. మేము ఎవరికీ ఓటు వేయాలన్న విషయంలో స్పష్టత వచ్చింది’ అని ఖతూలీకి చెందిన వ్యవసాయ పరికరాలు విక్రయించే వ్యాపారి న్నౌషద్ మోనీ చెప్పారు. ‘నేను గతంలో బహెన్జీ పార్టీ (బీఎస్పీ)లో ఉన్నాను. మా ఏకైక లక్ష్యం బీజేపీని ఓడించడమే. అందుకే నేను ఇప్పుడు ఎస్పీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నా’ అనిమోనీ అన్నారు. ‘నేను సైకిల్ గుర్తుకు ఓటేస్తా. నేనే కాదు నాకు తెలిసిన అందరూ ఈసారి గంపగుత్తగా సమాజ్‌వాదీ పార్టీకే ఓటు వేస్తారు. మా మీటింగుల్లో కూడా అదే చెపుతున్నారు’ అని.ముజఫర్‌నగర్ మార్కెట్లో రోడ్డు పక్కన పాత వస్త్రాలు విక్రయించే షాహీల్ తెలిపారు. ఇతర పార్టీల్లో ముస్లిం అభ్యర్థులు ఉన్నా సరే ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి ఓటు వేయాలంటూ ముస్లింలు నిర్ణయించుకున్నారని ముజఫర్‌నగర్ కేంద్రంగా పని చేస్తున్న అమర్ ఉజాల పత్రిక బ్యూరో చీఫ్ మదన్‌లాల్ బహియాన్ చెప్పారు. సెస్సు వేసినా... 2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా యూపీ పగ్గాలు చేపట్టగానే గోసంరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఒకటైపోయింది. గోవుల ఆలనాపాలనా చూడటానికని చెప్పి... 2019లో టోల్ట్యాక్స్లపై 0.5 అదనపు సెస్ వేశారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల అమ్ముకునే పంట ఉత్పత్తులపై మండీ ట్యాక్స్‌ను 1 నుంచి 2 శాతానికి పెంచారు. గోశాళల నిర్మాణానికి 2019–20వ బడ్జెట్లో ఏకంగా రూ.447 కోట్లను కేటాయించింది యోగి ప్రభుత్వం. ఆలనాపాలన లేకుండా రహదారులపై తిరిగే ఆవులు, ఎద్దులు, గేదెలను ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంచి పరిరక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి విఫలమైంది. సంరక్షణ కేంద్రాల నుంచి తప్పించుకొని ఈ పశువులు రైతుల పొలాలపై పడి సర్వనాశనం చేయడం ప్రారంభించాయి. దాంతో అన్నదాతల ఆగ్రహం రెట్టిపైంది. దానికి తోడు జాతీయ రహదారులపై వీటి మూలంగా ప్రమాదాలు పెరిగిపోయాయి. మరోవైపు నడుస్తున్న కొన్ని గోశాలల్లోనూ పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. పిడుగుపాటుకు, వర్షాలకు బక్కచిక్కిన మూగజీవాలు చనిపోవడం ప్రజాగ్రహాన్ని పెంచుతోంది. -కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి మీరట్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు -
ఎస్పీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను... బీజేపీ తరిమికొట్టింది: అమిత్ షా
ముజఫర్‌నగర్: యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను బీజేపీ ప్రభుత్వం తరిమికొట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి కలిసి ప్రచారంలో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలది ఎన్నికల బంధమేనని, ఆ తరువాత ఎవరిదారి వారిదేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినా ఆజంఖాన్, అతిఖ్ అహ్మద్ లాంటివాళ్లు వేదికపై ఉంటారే తప్ప... జయంత్ ఎక్కడా కనిపించరని జోస్యం చెప్పారు. బాధితులనే నిందితులుగా చేసిన 2013 ముజఫర్‌నగర్ అల్లర్లను ఎవరైనా మరచిపోగలరా? అని అమిత్ షా ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో నేరాలు తగ్గాయని, ఈ విషయంలో గణాంకాలతో సహా చర్చకు తాము సిద్ధమని, ఎస్పీ ప్రభుత్వంలోని గణాంకాలతో అఖిలేష్ ముుందుకొస్తారా అని సవాల్ విసిరారు. అఖిలేష్ ప్రభుత్వ పాలనకు ముజఫర్ నగర్ అల్లర్లు సజీవ సాక్షమన్నారు. అల్లర్ల సమయంలో పోలీసులు.. తప్పుడు కేసులు బనాయించారని, బాధితులనే నిందితులుగా చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. కోర్టుల్లోనూ, రోడ్ల మీద న్యాయం కోసం పోరాడిన బీజేపీ నేత సంజీవ్ బలియాన్‌ని అమిత్ షా అభినందించారు. మళ్లీ అదే తప్పు చేయొద్దు... ఉత్తరప్రదేశ్‌ను ఎస్పీ చేతిలో పెట్టి ప్రజలు మళ్లీ తప్పు చేయొద్దని, అదే జరిగితే మరో ముజఫర్‌నగర్ ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ గెలుపొందితే ఎలాంటి అల్లర్లు ఉండవని, 300 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఒక పార్టీ గురించే మాట్లాడుతుందని, కాంగ్రెస్ ఒక కుటుంబం గురించే మాట్లాడుతుందని, ఇక ఎస్పీ అధికారంలోకి వస్తే గూండాలు, మాఫియా రాజ్యంగా మారిపోతుందని, ఒక్క బీజేపీ మాత్రమే భద్రత, అభివృద్ధి గురించి మాట్లాడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది, దాన్ని యూపీ ప్రజలు తెలివిగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా యూపీ నిలుస్తుందన్నారు. దేశభద్రత బీజేపీ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అఖిలేష్ యాదవ్ రైతులకు వరాలు కురిపిస్తున్నారని, కానీ ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలోనే 21 చక్కెర కర్మాగారాలు మూసివేశారని ఎద్దేవా చేశారు. ముజఫర్‌నగర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ పోటీ చేస్తుండగా, ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమి నుంచి సౌరభ్ స్వరూప్ బరిలో ఉన్నారు. -
టైమ్ చూసి... హ్యాండిస్తున్నారు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి గడువు దగ్గరకొస్తున్న కొద్దీ, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని మరింత బలహీన పరిచేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ మినహా మిగతా హస్తిన నేతలు ఎవరూ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. పార్టీని వీడుతున్న నేతలను బుజ్జగించే చర్యలు ఏవీలేకపోవడం, పార్టీలో ప్రాధాన్యంపై ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, పార్టీ గెలిచే అవకాశాలపై నమ్మకంలేకపోవడంతో పార్టీ విధేయులే ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యూపీ ఇంఛార్జ్‌గా ప్రియాంకా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, పార్టీ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని భావించినా, ఇప్పటికే 20 మందికి పైగా కీలక నేతలు పార్టీని వీడడం తలనొప్పి వ్యవహారంలా మారింది. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ అధిష్టానానికి సన్నిహితుడైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాదతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీని వీడగా, షెడ్యూల్ విడుదలయ్యాక పశ్చిమ యూపీలో కీలక ముస్లిం నేత, గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఇమ్రాన్ మసూద్ ఎస్పీలో చేరారు. తాజాగా స్టార్ క్యాంపెయినర్ జాబితా ప్రకటించిన మరుసటిరోజే మాజీ కేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల సమయంలో పేరున్న నేతలే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ పార్టీని వదిలివెళ్లేవారిని ఆపలేకపోవడం పార్టీ అవకాశాలను దెబ్బతీస్తోంది. కాంగ్రెస్‌ను వీడిన కొందరు కీలక నేతలు వీరు.. -
మాయ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు!
ఒకప్పుడు రాజసంతో యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దళిత బిడ్డ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నేడెందుకో మౌన ప్రేక్షకురాలి పాత్రకు పరిమితమయ్యారు. ఆ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఎవరి ఊహకి అందని విధంగా యూపీ ప్రజల్ని మాయ చేశారు. అగ్రవర్ణాలు, దళితులు అనే సోషల్ ఇంజనీరింగ్ వ్యూహంతో ఎన్నికల్లో కాకలు తీరిన యోధులకే కొత్త పాఠాలు నేర్పించారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆమె ఆప్త మిత్రులనైనా పక్కన పడేయగలరు. ఆగర్భ శత్రువులతోనైనా చేయి కలపగలరు. సామాజిక కార్డుతోనే యూపీతో సహా దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అభిమానులు బెహన్జీ అని ఆప్యాయంగా పిలుచుకొనే మాయావతి శక్తిసామర్థ్యాలు ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి అన్నచందంగా మారింది. ప్రస్తుతం ఆమె ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉన్నారు. యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ మధ్య సాగుతూ ఎన్నికల కాక రగులుతూ ఉంటే మాయావతి వ్యూహాలేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞురాలు, అత్యంత శక్తిమంతమైన మహిళగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాయకురాలు, ఒకప్పుడు ప్రధాని పదవికి సైతం పోటీదారుగా నిలువాలని ఆశించిన మాయావతి.. ఈసారి మౌనం దాల్చడం వెనుక ఎలాంటి మాయ దాగుందోనన్న చర్చ జరుగుతోంది. ►ఢిల్లీలోని నిరుపేద దళిత కుటుంబంలో 1956 సంవత్సరం జనవరి 15న జన్మించారు. ►ఘజియాబాద్‌లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ చేసిన మాయావతి ఐఏఎస్ కావాలని కలలు కన్నారు. ►1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో టీచర్‌గా చేశారు ►దళిత నాయకుడు కాన్షీరామ్‌తో 1977లో పరిచయం ఏర్పడింది ►కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి తీసుకున్నారు. ►రాజకీయ రంగప్రవేశంతో ఆమె జీవితమే మారిపోయింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ►మాయావతికి మొదట్లో అపజయాలే ఎదురయ్యాయి. 1985లో తొలిసారి లోక్‌సభకు పోటీపడినప్పుడు ఆమె ఓడిపోయారు. 1987లో మళ్లీ ఓటమిపాలయ్యారు. 1989లో యూపీ శాసనమండలికి ఎన్నికయ్యారు ►కాన్షీరామ్ అనారోగ్యం బారినపడడంతో 1995లో బీఎస్పీ పగ్గాలు చేపట్టారు. ►1998, 1999, 2004లో వరుసగా మూడుసార్లు లోక్‌సభకు, మరో మూడు పర్యాయాలు (1994–2012 మధ్య) రాజ్యసభకు ఎన్నికయ్యారు. ►తొలిసారిగా 1995 సంవత్సరం నాలుగు నెలల పాటు యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దళిత మహిళ అత్యున్నత స్థాయి పదవిని అందుకోవడం అదే తొలిసారి. ►ఆ తర్వాత మరో రెండు సార్లు స్వల్పకాలం సీఎంగా కొనసాగారు. 1997లో ఆరు నెలలు, 2002–03లో 17 నెలలు సీఎం పదవిలో ఉన్నారు ►గురువు కాన్షీరామ్ 2006లో కన్నుమూసినప్పుడు మాయావతి స్వయంగా ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ►2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టి పూర్తిగా అయిదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు ►ఈ అయిదేళ్ల కాలంలో ఆమె ప్రభ మసకబారడం ప్రారంభించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు, అధికారాన్ని ఉపయోగించుకొని బల ప్రదర్శన, డజనుకు పైగా విమానాలు, హెలికాప్టర్లను ప్రచారానికి వినియోగించడం, తాజ్ హెరిటేజ్ కారిడార్‌లో అవకతవకలు వంటివెన్నో వివాదాస్పదమయ్యాయి. ►ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన విగ్రహాలు, పార్టీ చిహ్నం ఏనుగు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించడం, పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేసుకోవడం, కార్యకర్తలు వేసే కరెన్సీ దండల్ని స్వీకరించడం, పాలనా వైఫల్యాలు వంటివన్నీ ఆమెపై తీవ్ర వ్యతిరేక భావాన్ని పెంచాయి. నిమ్నకులాలకి చేసిందేమిటన్న ప్రశ్నలు వచ్చాయి. ►2017 శాసనసభ ఎన్నికల్లో కేవలం 19 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ►2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆగర్భ శత్రువైన ఎస్పీతో పొత్తు పెట్టుకొని బీఎస్పీ 10 స్థానాలు దక్కించుకోగలిగింది. ►ఈసారి ఎన్నికల్లో మాయావతి పార్టీ పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలోనూ, మ్యానిఫెస్టో విడుదలలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ ఎందులోనూ స్పీడ్ కనిపించడం లేదు. ►అయినప్పటికీ సంప్రదాయంగా తమకు వచ్చే 20% ఓటు బ్యాంకుపైనే మాయావతి ఆశలు పెట్టుకున్నట్టుగా బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. – నేషనల్ డెస్క్ సాక్షి -
కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!
భాగపట్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: ఐదేళ్ల పదవీ కాలం చివరి దశకు చేరడంతో ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారం కోసం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేస్తున్న ప్రయత్నాలు అంత తేలిగ్గా సఫలమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ విసురుతోంది. దానికితోడు ఇటీవలి రైతు ఉద్యమాలకు కేంద్రమైన పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు, రాజకీయ పార్టీల ఎత్తులు బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల వైభవాన్ని నిలుపుకోవాలన్న ఆ పార్టీ ఆశలను కులాల సమీకరణతో చిత్తు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ ఉర్రూతలూగుతోంది. జాట్లు, ముస్లింలు, రైతులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కులాలు, వర్గాల వారీగా ఓట్లు కొల్లగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్ఎల్డీతో పొత్తు కుదుర్చుకొని జాట్ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడంలో ఎస్పీ సఫలమైంది. జాట్లలో చీలిక తెచ్చి కూటమి వ్యూహాలను బద్ధలు కొట్టే ప్రణాళికలతో బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ముస్లిం–జాట్ల సోదరబంధం ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరీ తాత, మాజీ ప్రధాన మంత్రి చౌదరీ చరణ్‌సింగ్ ‘కిసాన్ నేత’గా కీర్తి గడించారు. ఆయన హయాం నుంచే ముస్లింలు జాట్లతో సత్సంసంబంధాలు కలిగి ఉన్నారు. ఎస్పీ– బీఎస్పీ పుట్టుకకు ముం దు పశ్చిమ యూపీ ముస్లింలు చరణం సింగ్ ఎవరికి మద్దతు ఇస్తే వారినే బలపరిచే వారు. అజిత్ సింగ్ కూడా వారిని కలుపుకుంటూ రాజకీయాలు సాగించారు. అయితే జాట్–ముస్లింల బంధాన్ని 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు దెబ్బ తీశాయి. అల్లర్ల అనంతరం రెండు వర్గాల మధ్య చీలక ఏర్పడి ముస్లింలు ఆర్ఎల్డీకి దూరమయ్యారు. ఈ కారణంగా ఆర్ఎల్డీ 2014, 2019 ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోలేదు. ‘మా రెండు వర్గాల మధ్య సత్సంబంధాలను దెబ్బ తీయడానికి జరిగిన కుట్ర అది. చిన్న ఘటనను ఆధారం చేసుకుని సాగిన హింసాకాండను ఏ రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకు వాడుకున్నదో అందరికీ తెలుసు’ అని భాగపట్లో ఎస్పీ తరపున చురుకుగా ప్రచారం చేస్తున్న రసూల్ అలీ ఖాన్ అన్నారు. ఇప్పటికీ అదే అల్లర్లను బూచీగా చూపి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందన్నది అలీఖాన్ ఆరోపణ. జాట్–ముస్లిం–రైతులు కలిస్తే కనీసంగా 50 స్థానాలు గెలువచ్చన్న అంచనాతో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్డీకి ఎస్పీ 33 సీట్లు కేటాయించింది. ఇందులో ఆర్ఎల్డీ 5 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. మిగతా స్థానాల్లో ఎస్పీ పోటీలో నిలవగా ఇందులో 8 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. అయితే సీట్ల కేటాయింపుపై రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. ముఖ్యంగా సర్ధన, హస్తినాపూర్ సీట్లను ఎస్పీకి అప్పగించడంపై ఆర్ఎల్డీ జాట్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముజఫర్‌నగర్ జిల్లాలోని 6 స్థానాలకు గానూ 4 స్థానాల్లో ముజఫర్‌నగర్ సదర్, మీరాపూర్, ఖటోలీ, పుర్కాజీ స్థానాల్లో ఆర్ఎల్డీ గుర్తుపై ఎస్పీ తమ నేతలను బరిలోకి దింపింది. దీంతో ఆర్ఎల్డీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంతకు జాట్లు ఎటువైపు? పశ్చిమ యూపీలో పార్టీల గెలుపోటముల పాత్ర కీలకమైనది. గడచిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో జాట్లు మద్దతు ఇవ్వడంతో బీజేపీ సునాయసంగా విజయాలు దక్కించుకుంది. అయితే, రైతు ఉద్యమం నేపథ్యంలో జాట్లు బీజేపీకి వ్యతిరేకమయ్యారని,అది తమకు లాభిస్తుందని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి విశ్వాసంతో ఉంది. ఎస్పీకి ఓట్ల బదిలీ అంత సులభం కాదని దాద్రి, భాగ్‌పట్, మీరట్, ముజఫర్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల పరిశీలనలో వెల్లడైంది. ఎస్పీ అధికారంలోకి వస్తే జయంత్ సింగ్ చౌధురి పాత్ర నామమాత్రమే అవుతుందంటూ బీజేపీ కేడర్ జాట్లకు నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. అంతే కాదు ముజఫర్‌నగర్ అల్లర్లను పదేపదే గుర్తు చేస్తోంది.‘జయంత్ చౌధురి పార్టీ పోటీ చేసే స్థానాల్లో మా మద్దతు ఉంటుంది. కానీ,అఖిలేశ్ పై మాకు పూర్తి నమ్మకం లేదు’ అని దాద్రి ప్రాంతానికి చెందిన రైతు కిషన్‌సింగ్ చౌదరి అన్నారు. ఆ ఎత్తుగడ.. రెండువైపులా పదునున్న కత్తి! ముస్లిం ఓట్లు కీలకమైన ముజఫర్‌నగర్ డివిజన్ లో ఎస్పీ ఒక్క ముస్లింను కూడా బరిలోకి దింపలేదు. ముస్లిం ఓట్లు ఎటూ తమకే దక్కుతాయన్న అంచనాతో హిందూ ఓట్ల చీలిక కోసం ఈ వ్యూ హం పన్నింది. ఇది సీట్లు ఆశించిన ముస్లిం నేతల అసంతృప్తికి కారణమైంది. మరోవైపు ఇదే అదునుగా మాయావతి ఏకంగా 17 మంది ముస్లింలను బరిలోకి దించింది. దాంతో బీజేపీని ఎదుర్కొనేందుకు గంపగుత్తగా ఎస్పీకి ఓట్లు వేయాలనుకున్న ముస్లింల మధ్య అయోమయం నెలకొంది. ‘మేము ఈ ఎన్నికలలో ఎస్పీకి మద్దతు ఇ వ్వాలనే భావించాం. కానీ ఎస్పీ మా మనోభావాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో మాకింకా స్పష్టత రాలేదు’ ముజఫర్‌నగర్ వాసి ఫరీద్ అన్నారు. ఇతరులను దువ్వేద్దాం! ఇక పశ్చిమ యూపీలో ముస్లింలు 26 శాతంగా ఉన్నప్పటికీ బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. గత ఎన్నికల్లోనూ ఒక్క సీటు ఇవ్వని బీజేపీ 76 స్థానాల్లో 66 స్థానాలనుగెలిచింది. కేవలం తనకున్న హిందుత్వ బలం, సంక్షేమ కార్యక్రమాలనే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ ప్రస్తుతం జాట్ల చీలికపై దృష్టి పెట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లోనే జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్ జ్ఞాపకార్థం ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రి సంజీవ్ బలియాన్ అటు రైతు నేతలు, ఇటు జాట్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఎస్పీ–ఆర్ఎల్డీ పొత్తుల నేపథ్యంలో జాట్ వర్గం గంపగుత్తగా అఖిలేశ్ అండ్ కో వైపునకు వెళ్లకుండా జాట్ నేతలతో కేంద్ర హోమంత్రి అమిత్ షా జనవరి 26న కీలక సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్‌సింగ్ వర్మ ఇంట్లో 200 మంది పశ్చిమ యూపీకి చెందిన జాట్ నేతలతో నిర్వహించిన భేటీకి హాజరైన అమిత్ షా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆర్ఎల్డీ పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, అవసరమైతే ఎన్నికల తరువాత పొత్తుకు సిద్దమన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ప్లాన్–బి కింద బీజేపీ పశ్చిమ యూపీలో అధికంగా ఉండే షైనీలు, పాల్లు, కశ్యప్‌లు, ప్రజాపతిల ఓట్లను అభివృధ్ధి మంత్రంతో ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ‘జాట్లు మాత్రమే కాదు. ఇంకా మావి చాలా కులాలు ఉన్నాయి. మేను కూడా గెలుపోటములు నిర్ణయించగలము’అని భాగ్‌పట్ మార్కెట్లో టీ దుకాణం నడుపుతున్న శంకర్ లాల్ అన్నారు. -
బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్
లక్నో: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో యూపీలో ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ కూటమి చివరి వరకు రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాగా, తాను, ఆర్ఎల్డీకి చెందిన నేత జయంత్ చౌదరి రైతుల మానస కుమారులుగా అఖిలేష్ అభివర్ణించుకున్నారు. ‘నేను ఎప్పుడూ నా జేబులో ఒక ప్యాకెట్ ఉంచుకుంటాను.. లాల్ టోపి, లాల్ పొట్లీని’ ఉంచుకుంటానని తెలిపారు. బీజేపీని ఓడించడమే నా సంకల్పమని అఖిలేష్ తెలిపారు. 2017 నుంచి ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హమీని కాషాయపార్టీ నెరవేర్చలేదని అఖిలేష్ విమర్శించారు. అదే విధంగా జయంత్ చౌదరి కూడా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. జయంత్ షాను బీజేపీలో చేరాలని అమిత్ షా ఆహ్వనించారు. దీనిపై జయంత్ స్పందించారు. తాను నాణెంలా ఎగిరేవ్యక్తి కాదని తెలిపారు. పశ్చిమ యూపీలో జాట్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు షా.. ఆర్ఎల్డీ చీఫ్‌ను పార్టీలోని ఆహ్వనించినట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదే విధంగా.. జాట్ నాయకులతో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని జయంత్ తెలిపారు. ఈ సమావేశంలో యూపీ ఎంపీ సంజీవ్ బల్యాన్ సహా పార్టీ ప్రముఖ జాట్ నేతలు హజరయ్యారు. పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీ అధికారంలో ఉన్న అన్ని స్థానాల్లో జాట్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాగా, మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి ప్రస్తుతం ఆర్ఎల్డీకి నేతృత్వం వహిస్తున్నారు. ఈ పార్టీ ఎస్పీతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తుంది. చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’ -
యూపీలో ఆట మొదలుపెట్టిన బీజేపీ
మొదటి దశలో ఎన్నికలు జరుగనున్న పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ తనశైలి ఆటను మొదలుపెట్టింది. పార్టీ కింగ్‌పిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన మార్కును చాటేలా పశ్చిమ యూపీలో బలంగా ఉన్న జాట్లను తమవైపు తిప్పుకునే వ్యూహాలకు పదునుపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జాట్లలో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చి, వారిని మచ్చిక చేసుకునేలా బుధవారం 200 మంది జాట్ ప్రతినిధులతో జరిపి భేటీ పార్టీకి కలిసొస్తుందనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ–రాష్ట్రీయ్ లోక్ దళ్ కూటమిని విచ్ఛిన్నం చేసి జాట్ ఓట్లను చీల్చేలా ఇప్పటికే క్షేత్ర స్థాయి కార్యాచరణను షురూ చేసింది. కూటమి ఓట్లు చీల్చే ఎత్తుగడ.. పశ్చిమ యూపీలో ఫిబ్రవరి 10న 58 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా షామ్లీ, ముజఫర్‌నగర్, భాగ్‌పత్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధనగర్, బులంద్ షహర్ వంటి జిల్లాలోని కనీసంగా 30 నియోజకవర్గాల్లో జాట్లే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 3.5 శాతంగా ఉన్న జాట్లకు స్థానిక రైతుల్లో మంచి సాన్నిహిత్యం ఉంది. నిజానికి ముస్లిం–జాట్‌లో పరస్పరం సోదరభావంతో మెలిగినప్పటికీ 2013 ముజఫర్‌గనర్ అల్లర్ల తర్వాత వారి చెలిమి చెడి ఎవరికి వారయ్యారు. ఈ కారణంగా 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. 2017 అసెంబ్లీలోనూ కేవలం ఒక్క సీటుకే పరిమితమయింది. ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రచారంలో పెట్టి గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేలా వ్యూహాలు సిధ్ధం చేసినప్పటికీ వాటిని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చిత్తు చేశారు. ఇటీవలి రైతు ఉద్యమాలను అడ్డుగా పెట్టి ముస్లిం–జాట్ల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచారు. గత ఏడాదిలో పరివర్తన్ సందేశ్ ర్యాలీల ద్వారా సోదరభావాన్ని పునర్నిర్మించే యత్నాలు చేశారు. అనంతరం ముస్లిం–జాట్–యాదవ్ ఫార్మాలాను తెరపైకి తెచ్చి ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ పార్టీకి ఏకంగా 33 స్థానాలను కేటాయించారు. ఈ వ్యూహంతోనే తొలి దశలో కనీసంగా 40–50 స్థానాలు కొల్లగొట్టే యత్నాల్లో ఉన్నారు. ఎస్పీ వ్యూహాలను తిప్పకొట్టేలా బీజేపీ సైతం అనేక ఎత్తుగడలు వేస్తోంది. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం ద్వారా జాట్లు, రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర మంత్రి మండలిలలో ముగ్గురు జాట్ నేతలు భూపేంద్రసింగ్, లక్ష్మీనారాయణ్సింగ్, బుల్దేవ్ సింగ్‌లకు అవకాశం కల్పించింది. దీనికి తోడు ముజఫర్‌నగర్‌లో ఆర్ఎల్డీ మాజీ నేత అజిత్‌సింగ్‌ను ఓడించిన జాట్ నేత సంజీవ్ బలియాన్‌ను కేంద్రమంత్రిని చేసింది. జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్ పేరుతో ఓ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసింది. ఇవన్నీ కేవలం జాట్లను సంతోషపరిచేందుకే అని వేరుగా చెప్పనక్కర్లేదు. షా రంగంలోకి.. జాట్లలో చీలిక! 2017 ఎన్నికల్లో బీజేపీ జాట్లకు 12 స్థానాలను కేటాయించగా... ఈసారి అదే స్థాయి సీట్లను కేటాయించింది. అయితే ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమితో తమకు నష్టం జరుగకుండా ఉండేందుకు జాట్లను చీల్చే ప్రయత్నాలకు దిగింది. దీనిలో భాగంగా అఖిలే‹Ô హయాంలో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను పదేపదే ప్రస్తావిస్తూ కూటమిది అపవిత్ర బంధం అంటూ ప్రచారం చేస్తోంది. ఆర్ఎల్డీ పొత్తుతో జాట్లే తీవ్రంగా నష్టపోయారని, ముస్లిం అభ్యర్థులు లబ్ధిపొందుతున్నారని ఆరోపణలు చేస్తోంది. ఇది కొంతమేర ప్రభావం చూపించి, ఎస్పీ అభ్యర్థులు ఉన్న చోట జాట్ల ఓట్లు గంపగుత్తగా వారికే వెళ్లకుండా చేస్తోంది. దీనికి మరింత పదునుపెట్టి జాట్లను పూర్తిగా తనవైపు తిప్పుకునేలా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో పశ్చిమ యూపీకి చెందిన 200ల మంది జాట్ ప్రతినిధులతో ‘సామాజిక సోదరుల భేటీ’ని నిర్వహించారు. తమ ప్రభుత్వం ముగ్గురు జాట్లను గవర్నర్లుగా నియమిస్తే, మరో 9 మందిని లోక్‌సభకు పంపిందనే విషయాన్ని అమిత్ షా భేటీలో గుర్తుచేశారు. జాట్ల సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా, ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడటానికి నేరుగా తన ఇంటికే రావాలని, తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ‘యూపీ రైతులకు రూ.36వేల కోట్ల రుణాలను రద్దు చేసింది. 1.30లక్షల కోట్లను రైతుల ఖాతాలో జమచేసింది. 1.48లక్షల కోట్లను చెరకు రైతులకు చెల్లించింది. రైతులకు చేయాల్సిందంతా చేస్తోంది’ అని గుర్తుచేశారు. రైతులకు, జాట్లకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న హామీ ద్వారా జాట్లు బీజేపీకి దూరమయ్యారన్న నిందను దూరం చేసే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో పాల్గొన్న జాట్ నేతలు జై శ్రీరామ్, ప్రధాని నరేంద్ర మోదీ జిందాబాద్, అమిత్ షా జిందాబాద్ అని నినాదాలు చేయడం ద్వారా బీజేపీతో నడిచేందుకు వారికెలాంటి అభ్యంతరాలు లేవని చాటిచెప్పారని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. జాట్లతో భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే అమిత్‌షా గురువారం పశ్చిమ యూపీలోని మధుర, గౌతమ్బుద్ధనగర్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇదే రోజున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నా«థ్‌సింగ్ భాగ్‌పట్, çఘజియాబాద్‌లలో పార్టీ ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ చర్యలన్నీ జాట్ల ఓట్లను చీల్చడంతో పాటు 20–30 స్థానాల్లో గెలుపును నిర్ణయిస్తుందని స్థానిక నేతలు విశ్లేషిస్తున్నారు. – న్యూఢిల్లీ, సాక్షి -
కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష!.. ‘ఆడపిల్లను.. పోరాడగలను అంటూ’
‘ఆడపిల్లను..పోరాడగలను’ అనే నినాదాన్ని ముందుపెట్టి ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులను పెద్ద సంఖ్యలో నిలబెడుతుండటం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి అగ్నిపరీక్ష పెట్టనుంది. మూడు దశాబ్దాలుగా యూపీ అధికార పీఠానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు ఈ వ్యూహం ఎంతమేరకు కలిసొస్తుందన్నది అనుమానంగానే ఉంది. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు పెద్ద సంఖ్యలో మహిళా అభ్యర్థులను పోటీలో నిలిపినా 19 శాతానికి మించి మహిళలు గెలుపు తీరాలను చేరకపోవడం, లోక్‌సభ ఫలితాలు ఇందుకు భిన్నంగా లేకపోవడం కాంగ్రెస్ ఎత్తుకున్న ఎజెండాపై ప్రశ్నలు లేవదీస్తున్నాయి. కలిసిరాని కాలం... గడిచిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో మహిళా ప్రాతినిధ్యం అంతంతగానే ఉంది. 6.98కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నప్పటికీ గడిచిన నాలుగు అసెంబ్లీల్లో వీరి సంఖ్య మాత్రం పెద్దగా లేదు. 2002లో అన్ని పార్టీల తరఫున మహిళా అభ్యర్థుల సంఖ్య 184 మంది పోటీలో నిలవగా, కేవలం 31మంది మాత్రమే మహిళా అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2007 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి 154 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా కేవలం 25 మాత్రమే గెలువగా. 2012 నాటికి 224 మంది అభ్యర్థుల్లో 43 మంది గెలిచారు. ఇందులో ఎస్పీ తరఫున 21 మంది, బీజేపీ తరఫున 8మంది గెలిచిన వారిలో ఉన్నారు. ఇక గడిచిన 2017 ఎన్నికల్లో 151మంది మహిళా ఎమ్మెల్యేల్లో 42 మంది గెలిచినట్లు గణాంకాలు చెబుతుండగా, ఇందులో బీజేపీ తరఫున 36 మంది గెలిచారు. చదవండి: (Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..!) నాలుగు ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం సగటున 19శాతానికి పరిమితం అయింది. ఇందులోనూ గడిచిన రెండు దశాబ్ధాలుగా కాంగ్రెస్ తరఫున గెలిచిన మహిళా అభ్యర్థులు పది సంఖ్యను దాటలేదు. ఇక 1999 నుంచి జరిగిన నాలుగు లోక్‌సభ ఎన్నికల్లోనూ యూపీలో అన్ని పార్టీల తరఫున 153 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసినా ఇందులోనూ 45 మంది మాత్రమే గెలువగా, దీని శాతం 29.41శాతానికి దాటలేదు. ఒక్క 2017లో మినహా మహిళా అభ్యర్థులను అధికంగా పోటీలో నిలిపిన ఏ పార్టీకి అధిక స్థానాలు దక్కలేదు. 2017లో మాత్రం అధికార బీజేపీ 42మందిని పోటీలో నిలబెడితే 36మంది గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ 40శాతం మంది మహిళలకు సీట్లు కేటాయించడం పార్టీకి పెద్ద పరీక్షనే పెడుతోంది. చదవండి: (సిద్దూపై సుఖ్బీర్ బావ పోటీ) టిక్కెట్లు కాదు.. హామీల్లోనే కాంగ్రెస్ దూకుడు... కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ చెబుతున్న మాదిరి యూపీలో మహిళలకు 40శాతం టికెట్లు కేటాయించేలా కార్యాచరణ తీసుకుంది. ఇప్పటికే తొలి విడతలో 145 మంది అభ్యర్థులను ప్రకటించగా, అందులో 50 మంది అభ్యర్థులు మహిళలు ఉండగా, రెండో జాబితాలో 41మంది పేర్లలో 16 మంది మహిళల పేర్లున్నాయి. కనీసంగా 140–150 మంది మహిళలకు పార్టీ టిక్కెట్లు కేటాయించేలా ప్రియాంక ప్రణాళికలున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో ప్రముఖ సినీ నీటి అర్చనా గౌతమ్(హస్తినాపూర్), ఉన్నావ్ బాధితురాలి తల్లి ఆశాసింగ్ (ఉన్నావ్), ఆశావర్కర్ పూనమ్ పాండే(షాజహాన్‌పూర్), లఖీమ్‌పూరి ఖేటీ ఘటనలో పోలీసు బాధితురాలు రీతాసింగ్(మొహమ్మదీ), మాజీ మేయర్ సుప్రియా అరోన్ (బరేలీ), జర్నలిస్టు నిదా అహ్మద్ (సంభాల్) వంటి ప్రముఖులను పోటీలో నిలిపింది. టికెట్లతో పాటే హామీల విషయంలోనూ ప్రియాంక తన మార్కును చూపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం రిజర్వేషన్లు, 25 శాతం పోలీసు పోస్టులు, 50 శాతం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) దుకాణాలు, ఫోన్లు, స్కూటర్లు వంటి హామీలను గుప్పించారు. గత పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రియాంకకు నారీశక్తి ఎంతగా మేలు చేస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. – సాక్షి, న్యూఢిల్లీ -
Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..!
Uttar Pradesh Assembly Election 2022: గడిచిన దశాబ్దం కాలంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రధాన ఓటు బలం అగ్రవర్ణాల్లోని వైశ్యులు, బాహ్మణులు, రాజ్‌పుత్‌లు. మొత్తం యూపీ జనాభాపరంగా చూస్తే వైశ్యులు తక్కువే అయినప్పటికీ 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సామాజికవర్గంలో బీజేపీకి మద్దతు తగ్గింది. అలాగే బ్రాహ్మణులు మొత్తం యూపీ జనాభాలో గణనీయంగా 8 నుంచి 9 శాతం ఉంటారు. వీరిలోనూ బీజేపీకి పడే ఓట్లలో 6 శాతం తగ్గాయి. దానికి తోడు బీజేపీలో రాజ్‌పుత్‌లకు పెద్దపీట వేస్తున్నారని, బాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఏడాదికాలంగా ఆ సామాజికవర్గంలో బలమైన భావన ప్రబలుతోంది. నష్టనివారణకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేసింది. బ్రాహ్మణుల్లో ప్రముఖుడు, యువ నాయకుడు, రాహుల్ గాంధీ కోటరీ సభ్యుడైన జితిన్ ప్రసాదనలు లాగేసింది. అలాగే లఖీంపూరి హింసాకాండ ఘటనలో ఆశిష్ మిశ్రా ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలి... అతను జైల్లో ఉన్నందువల్ల దీనికి అసలు కుట్రదారైన అతని తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు ఎంత గట్టిగా డిమాండ్ చేసినా... బ్రాహ్మణ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని, వారికి కోసం తెప్పించకూడదనే ఉద్దేశంతో కమలదళం అజయ్ మిశ్రాను కాచింది. ఇక కుర్మీల విషయానికి వస్తే అనుప్రియా పటేల్‌కు చెందిన అప్నాదళ్ (ఎస్) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీలోకి మారారు. ఇలా ప్రధాన బలమైన సామాజిక వర్గాల లెక్కల్లో తేడా కొడుతుండటం బీజేపీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తోంది.! – నేషనల్ డెస్క్, సాక్షి. -
స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడికి ‘నో ఛాన్స్’
ఇటీవల ఎస్పీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడు ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ అధినేత మొండిచేయి ఇచ్చారు. 2017 ఎన్నికల్లో ఉంచహార్ నుంచి పోటీ చేసి 1,934 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ సీటు కేటాయిస్తారని ఊహాగానాల మధ్య, సిట్టింగ్ ఎమ్మెల్యే మనోజ్ పాండే వైపే అఖిలేష్ మొగ్గు చూపారు. అయితే తొలి జాబితాలో స్వామి ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్న పండ్రౌనా స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ జస్వంత్‌నగర్ నుంచి పోటీకి దిగుతుండగా, రాంపూర్ స్వర్ నుంచి ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం బరిలోకి దిగనున్నారు. -
159 మందితో ఎస్పీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో దిగారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపక్షాల నుంచి వచ్చిన సవాళ్ళ నేపథ్యంలో మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు సోమవారం పార్టీ ప్రకటించిన 159 మంది అభ్యర్థుల తొలి జాబితాలో అఖిలేశ్ పేరు ప్రథమంగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి.. ముఖ్యంగా యాదవులకు కంచుకోటగా ఉన్న కర్హల్... మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్‌లో సమాజ్‌వాదీ జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్‌సింగ్ యాదవ్ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు. 2012లో ఎస్పీ ప్రభుత్వం ఏర్పడి అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పటికీ, శాసనమండలి సభ్యుడిగానే ఉన్నారు. 2000 నుంచి 2012 వరకు కన్నౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన అఖిలేశ్ 2019 ఎన్నికల్లో ఆజంఘఢ్ నుంచి ఎంపీగా గెలిచారు. -
UP Assembly Election 2022: ‘మాణిక్పూర్’కా మాలిక్ కౌన్!
అక్కడ దశాబ్దాలుగా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో రక్తపాతం పారిస్తున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే గ్రామాల ప్రజలను నిత్యం వేధిస్తూ వారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని చంబల్ మాదిరే డెకాయిట్ల అకృత్యాలతో అల్లాడుతున్న నియోజకవర్గం ఉత్తర్‌ప్రదేశ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని చిత్రకూట్ జిల్లాలోని ‘మాణిక్పూర్’. మినీ చంబల్‌గా పిలువబడే ఈ ప్రాంతంలోని డెకాయిట్లను ఏ ప్రభుత్వాలు అణచివేస్తాయో ఆ పార్టీకి ఇక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. డెకాయిట్లతో దోస్తీ ఉందన్న కారణంతో సమాజ్‌వాదీ పార్టీని దూరం పెడుతున్నారు. ఇక్కడ ఇంతవరకూ గెలువని ఏనాడు గెలవని ఎస్పీ ప్రస్తుత ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మినీ చంబల్‌లో ఐదు దశాబ్దాలుగా అరాచకాలు ప్రస్తుత యూపీ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశం అయిన అసెంబ్లీ ఏదైనా ఉందంటే అది మాణిక్పూర్ నియోజకవర్గమే. వింధ్యా పర్వత శ్రేణుల మధ్యలో మధ్యప్రదేశ్–ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దులతో ఉన్న మాణిక్‌పూర్‌లో ఐదు దశాబ్దాలుగా దోపిడీ దొంగల హవా నడుస్తోంది. దోపిడీ దొంగల కారణంగా ఈ ప్రాంతం మినీ చంబల్‌గా అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1965 ప్రాంతంలో ఇక్కడ గజదొంగగా పేరుగడించిన తయా ప్రసాద్ 15 ఏళ్ల పాటు నానా బీభత్సం సృష్టించాడు. గయా ప్రసాద్ పేరు చెబితేనే చిత్రకూట్ మొత్తం వణికిపోయేదని, ఇక్కడ సాయంత్రం కాగానే అతని భయంతో ఇళ్లకు తాళాలు వేసి ఉంచేవారని చెబుతారు. గయా ప్రసాద్ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండేవాడు. అతని తర్వాత ఎక్కువ కాలం పాటు ఆ ప్రాంతంలో పేరు గడించిన దోపిడీ దొంగ దదువా. గయా ప్రసాద్ మరణం తర్వాత ఆయన వారసుడిగా 1980లో దదువా తెరపైకి వచ్చాడు. దదువా ప్రాంతీయ రాజకీయాల్లో తరుచూ జోక్యం చేసుకునేవాడు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ తరఫున ప్రచారం సైతం చేశాడు. దోపిడీ దొంగలకు ఎస్పీ ప్రభుత్వం వంత పాడుతోందన్న సందేశం ప్రజల్లోకి వెళ్లిన కారణంతో 2007 ,2012, 2017, 2019 (ఉప ఎన్నిక) ఎన్నికల్లో ఎస్పీని ఇక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. 2007లో మాయావతి ప్రభుత్వ హయాంలో ఇతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఇతని తర్వాత స్ఫెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై మెరుపుదాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనతో థొకియా అనే మరో దోపిడీదొంగ వెలుగులోకి వచ్చాడు. ఈ ఘటనలో ఆరుగురు కమాండోలు వీరమరణం పొందారు. చదవండి: (UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!) 2008 ఆగస్టులో సిల్ఖోరి గ్రామంలో ఎస్టీఎఫ్ జరిపిన ఎన్కౌంటర్లో ఇతను హతమయ్యాడు. ఆ తర్వాత ఆ స్థానం గౌరీయాదవ్ తీసుకున్నాడు. యూపీ, ఎంపీల్లోని పలు పోలీస్స్టేషన్లలో గౌరీ యాదవ్‌పై హత్య, కిడ్నాప్ వంటి 60కి పైగా కేసులు నమోదయ్యాయి. గౌరీ యాదవ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో బహిల్పూర్వా అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో ఎస్టీఎఫ్ హతమార్చింది. వీరితో పాటే బల్ఖాడియా, బాబ్లీకోల్ వంటి గజదొంగలు ఈ ప్రాంతంలో బీభత్సం సృష్టించి ప్రజలను తీవ్రంగా హింసించారు. డెకాయిట్లను అణిచిన పార్టీలకే ప్రజల మద్దతు... నేర ప్రపంచంలో మకుటం లేని మారాజులుగా వెలిగిన క్రూరమైన నేరగాళ్లను అణిచివేసిన పార్టీలకు ఇక్కడి ప్రజలు తొలినుంచి మద్దతిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దదువా అరాచకాలు సాగిన కాలంలో జన్‌సంఘ్, కాంగ్రెస్ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దొంగల బీభత్సం నుంచి విముక్తి చేయడంలో కాంగ్రెస్, జన్సంఘ్లు ప్రత్యేక కృషి చేయలేకపోయాయని భావించిన ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారు. 1989, 1993లో మాణిక్పూర్ స్థానం నుంచి బీజేపీకి చెందిన మన్నూలాల్ ఎమ్మెల్యే అయ్యారు. మన్నూలాల్ గెలుపును జీర్ణించుకోలేని దదువా 1992లో మదయన్ గ్రామంలో ముగ్గురిని చంపి తర్వాత గ్రామం మొత్తానికి నిప్పంటించాడు. చాలా రక్తపాతం జరిగింది. దీంతో బెంబేలెత్తిన ప్రజలు 1996 ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన దద్దూ ప్రసాద్‌ను తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అతని పాలనలో బెదిరింపులు తగ్గడంతో 2002, 2007లో అతన్నే గెలిపించారు. ఇక్కడ ప్రజల విశ్వాసాన్ని గమనించిన అప్పటి ముఖ్యమంత్రి మాయావతి దదువాను ఎన్కౌంటర్ చేయించింది. దీంతో 2012లో దద్దూ ప్రసాద్ తర్వాత బీఎస్పీ అభ్యర్థి చంద్రభాన్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాణిక్‌పూర్‌లో బీఎస్పీ ఆధిక్యతను చూసి బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ వేసింది. పార్టీ బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే పటేల్‌ను అభ్యర్థిగా చేసి ఆయనను ఈ స్థానం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించింది. బీజేపీ ప్లాన్ ఫలించి పటేల్ భారీ ఆధిక్యంతో గెలిచారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పటేల్ విజయం సాధించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా, బీజేపీ అభ్యర్థి ఆనంద్శుక్లా గెలిచారు. 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇక్కడి ప్రాంతంలో చాలామంది డెకాయిట్లను యోగి ప్రభుత్వం అంతమొందించడంతో బీజేపీ సానుకూలత కనబడుతోంది. ఇక నియోజకవర్గంలో ఇంతవరకూ గెలుపు రుచి చూడని ఎస్పీ ఎలాగైనా గెలవాలన్న గట్టి పట్టుదలతో ఉంది. – సాక్షి, న్యూఢిల్లీ గౌరీయాదవ్, బాబీకోల్ -
బీజేపీది వన్ గేర్ కారు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరంగా ఓట్లను సంఘటితం చేసే రాజకీయాలకు ఇక చోటులేదని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌధురి అన్నారు. హిందుత్వ ఎజెండా రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ముస్లిం వ్యతిరేకతని తమ నైపుణ్యం అంతా ఉపయోగించి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత చేసినా... ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి సవాల్ విసురుతున్న జయంత్ చౌధరి ఒక వార్తా సంస్థతో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ప్ర: బీజేపీని వీడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎందుకు ఎస్పీలో చేరుతున్నారు ? జ: గత అయిదేళ్లుగా ప్రభుత్వంలో ఉండి ప్రజలకి ఏమీ చెయ్యలేకపోయామన్న అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. సరైన ప్రత్యామ్నాయం కనిపించగానే వరసపెట్టి వస్తున్నారు. ప్ర: ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఉందా? జ: విపక్షాల ఓట్లు చీలిపోయే ప్రసక్తే లేదు. గత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు ఎస్పీ కూటమి వైపే చూస్తున్నారు. పాలనా వైఫల్యం, నాయకత్వ లోపాలు, కాగడావేసి చూసినా కనిపించని అభివృద్ధి.. వీటన్నింటితో ఓటర్లు బీజేపీకి దూరమవుతున్నారు. ప్ర: హిందూత్వ రాజకీయాలు ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? జ: గత అయిదేళ్లలో హిందుత్వ ఎజెండాతో ఎన్నో ఘటనలు జరిగాయి. విద్వేషం రాజేయడం, దాడులు జరపడం కళ్లారా చూశాం. వాటితో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రజలు గ్రహిస్తున్నారు. మథురలో మందిరం అంశంపై బీజేపీ పిలుపునిస్తే పట్టుమని పది మంది కూడా రాలేదు. మతం, మందిరం అంటే ప్రజలు వినే రోజులు పోయాయి. బీజేపీ వన్ గేర్ కారులో వెనక్కి వెళుతోంది. ప్ర: ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలేమిటి? జ: రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కీలకం కానున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేసిన నిరసనలతో వారు బీజేపీపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తోంది. ప్ర: ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి విజయావకాశాలు ఎంత? జ: హిందుత్వ ఎజెండా ఓట్లను సంఘటితం చేస్తూ ఉండడం వల్ల ఇన్నాళ్లూ మేమెంతో నష్టపోయాం. ప్రజలెదుర్కొంటున్న అసలు సిసలు సమస్యలపై మేము దృష్టి పెట్టాం. ప్రజలు ఇప్పుడు మార్పుని కోరుకుంటున్నారు. దేశంలో ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా మరెక్కడా లేని విధంగా పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తామని హామీ ఇచ్చాం. 22 తీర్మానాలతో మా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది.అందుకే మా గెలుపు ఖాయం.