ఇదెక్కడి చోద్యం... పాకిస్తాన్ రాజధాని వాసులకు ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీ ఎన్నికలతోసంబంధమేమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరునుకుంటున్నట్లు ఇది పాక్‌లోని ఇస్లామాబాద్ కాదు. యూపీలోని జిల్లా కేంద్రమైన బిజ్నౌర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేజర్ గ్రామపంచాయతీ. జనాభా వదివేలు. ఓటర్లు దాదాపు 4,700 మంది ఉంటారు.
‘పేరులో నేముంది’.. మాకున్న సమస్యల్లా ఇరుకురోడ్లు మెరుగుపడాలి, అభివృద్ధి జరగాలి... ఇవి చేసే అభ్యర్థికే మా ఓటు అంటున్నారు ఇస్లామాబాద్ గ్రామ పెద్ద విజేంద్ర సింగ్. ఇస్లామాబాద్ పేరుండటం మూలంగా మీలో అభద్రతాభావం లాంటిది తలెత్తదా? అని అడిగినపుడు... అసలు మాకు అది శత్రుదేశపు రాజధాని పేరు అనేదే గుర్తుకురాదు. గ్రామంలో ప్రధానంగా చౌహాన్లు, ప్రజాపతి సామాజికవర్గాల జనాభా అధికమని, 400 మంది దాకా ముస్లింలు కూడా ఉంటారని... అంతా కలిపిమెలిసి ఉంటామని చెప్పుకొచ్చారు విజేంద్ర సింగ్. (చదవండి: ప్రతిష్టాత్మక పోరు: ‘కైరానా’ మే హైరానా!)
Comments
Please login to add a commentAdd a comment