ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్ వేళ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ విడుదల డిమాండ్ చేస్తూ పార్టీ మద్దతుదారులు నిరసనలకు దిగారు.
ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో, నిరసనలకు నేతృత్వం వహిస్తున్న ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, సన్నిహితుడు.. మద్దతుదారులకు హ్యాండ్ ఇచ్చారు. నిరసనల వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. దీంతో, నిరసనకారులు వెనుదిరిగినట్టు అక్కడి మీడియా పేర్కొంది.
ఇక, ఇమ్రాన్ ను విడుదల చేయాలంటూ బుష్రా బీబీ, ఆయన సన్నిహితుడు ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం అలీ అమీన్ నేతృత్వంలోపీటీఐ మద్దతుదారులు ఆదివారం నుంచి నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిరసనకారులు పాక్ రాజధాని ఇస్లామాబాద్లోని డీ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య ఘర్షణల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది. పదుల సంఖ్యలో మద్దతుదారులు గాయపడ్డారు.
మరోవైపు.. పోలీసుల కాల్పుల హెచ్చరికల నేపథ్యంలో బుష్రా బీబీ, ఖైబర్ నిరసనల నుంచి పారిపోయారు. అక్కడే ఉండి నిరసనలు కొనసాగించాలని పార్టీ మద్దతుదారులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారిద్దరూ దొంగచాటుగా ట్రక్కులో పారిపోవడం గమనార్హం. ఈ క్రమంలో వారిపై పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment